హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 9. అపరాధాల పుస్తకం, మొదటి అధ్యాయం: రక్తశుల్కం (దియత్). ఈ అధ్యాయంలో 11 హదీసులు (హదీసు 1009 – 1019) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
9.1 రక్తశుల్కం (దియత్)
باب الديات
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1009
عَنْ أَبِي بَكْرٍ بْنِ مُحَمَّدٍ بْنِ عَمْرِوِ بْنِ حَزْمٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ - رضى الله عنه - أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَتَبَ إِلَى أَهْلِ اَلْيَمَنِ... فَذَكَرَ اَلْحَدِيثَ, وَفِيهِ: { أَنَّ مَنْ اِعْتَبَطَ مُؤْمِنًا قَتْلاً عَنْ بَيِّنَةٍ, فَإِنَّهُ قَوَدٌ, إِلَّا أَنْ يَرْضَى أَوْلِيَاءُ اَلْمَقْتُولِ, وَإِنَّ فِي اَلنَّفْسِ اَلدِّيَةَ مِائَةً مِنْ اَلْإِبِلِ, وَفِي اَلْأَنْفِ إِذَا أُوعِبَ جَدْعُهُ اَلدِّيَةُ, وَفِي اَلْعَيْنَيْنِ اَلدِّيَةُ, وَفِي اَللِّسَانِ اَلدِّيَةُ, وَفِي اَلشَّفَتَيْنِ اَلدِّيَةُ, وَفِي اَلذِّكْرِ اَلدِّيَةُ, وَفِي اَلْبَيْضَتَيْنِ اَلدِّيَةُ, وَفِي اَلصُّلْبِ اَلدِّيَةُ, وَفِي اَلرِّجْلِ اَلْوَاحِدَةِ نِصْفُ اَلدِّيَةِ, وَفِي الْمَأْمُومَةِ ثُلُثُ اَلدِّيَةِ, وَفِي اَلْجَائِفَةِ ثُلُثُ اَلدِّيَةِ, وَفِي اَلْمُنَقِّلَةِ خَمْسَ عَشْرَةَ مِنْ اَلْإِبِلِ, وَفِي كُلِّ إِصْبَعٍ مِنْ أَصَابِعِ اَلْيَدِ وَالرِّجْلِ عَشْرٌ مِنْ اَلْإِبِلِ, وَفِي اَلسِّنِّ خَمْسٌ مِنْ اَلْإِبِلِ وَفِي اَلْمُوضِحَةِ خَمْسٌ مِنْ اَلْإِبِلِ, وَإِنَّ اَلرَّجُلَ يُقْتَلُ بِالْمَرْأَةِ, وَعَلَى أَهْلِ اَلذَّهَبِ أَلْفُ دِينَارٍ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ فِي "اَلْمَرَاسِيلِ" وَالنَّسَائِيُّ, وَابْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُودِ, وَابْنُ حِبَّانَ, وَأَحْمَدُ, وَاخْتَلَفُوا فِي صِحَّتِهِ
హజ్రత్ అబూబక్ర్ బిన్ ముహమ్మద్ బిన్ అమ్ర్ బిన్ హజ్మ్ తన తండ్రి ఆధారంగా తన తాతగారి ఉల్లేఖనాన్ని వివరించారు : దైవప్రవక్త ﷺ యమన్ వాసులకు వ్రాశారు – మరి హదీసునంతటినీ వివరించారు- అందులో ఇలా లిఖించబడింది: “ఎవరయినా ఒక నిర్దోషి అయిన ముస్లింను చంపితే, ఈ హత్యకు సాక్షులుంటే అతనిపై ప్రతీకారం (ఖిసాస్) తీర్చుకోవటం తప్పనిసరి. ఒకవేళ హతుని వారసులు రాజీకివస్తే ఒక ప్రాణాన్ని తీసినందుకు పరిహారంగా నూరు ఒంటెలు ఇవ్వవలసి ఉంటుంది. ముక్కును గనక సమూలంగా కోసినట్లయితే దీనికి కూడా పూర్తి పరిహారం చెల్లించవలసి ఉంటుంది. రెండు కళ్ళు, నాలుక, రెండు పెదాలకు బదులుగా కూడా పూర్తి పరిహారం ఇచ్చుకోవలసి ఉంటుంది. అలాగే మర్మావయవానికి, వృషణాలకు, వెన్నుకు బదులుగా పూర్తి పరిహారం ఉంది. ఒక కాలిని పోగొట్టినందుకు సగం పరిహారం (50 ఒంటెలు), మెదడును, ఉదరాన్ని గాయపరిస్తే మూడో వంతు పరిహారం ఉంటుంది. ఎముక విరిగేంతగా గాయపరిస్తే పదిహేను ఒంటెలు, కాళ్ళు చేతులకు సంబంధించిన ఒక్కో వ్రేలికి బదులుగా పదేసి ఒంటెలు, ఒక పన్నును విరగ్గొట్టినందుకు ఐదు ఒంటెలు, ఎముక కనిపించేటంతగా గాయపరిస్తే ఐదు ఒంటెలు పరిహారంగా ఇవ్వవలసి ఉంటుంది. పురుషుణ్ణి, స్త్రీకి బదులుగా- పరిహారంగా – చంపటం జరుగుతుంది. ఒంటెలు లేని వారివద్ద బంగారం ఉంటే వెయ్యి దీనార్లు వసూలు చేయబడతాయి.” (అబూదావూద్ దీనిని తన ‘మరాసీల్’లో లిఖించారు. నసాయి, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్, ఇబ్నె హిబ్బాన్ మరియు అహ్మద్‌లు ఉల్లేఖించారు. దీని ప్రమాణబద్ధతపై వారు విభేదించారు)
English
Abu Bakr bin Muhammad bin 'Amro bin Hazm narrated on the authority of his father on the authority of his grandfather (RAA) that ‘The Messenger of Allah (ﷺ) wrote to the people of Yemen (mentioning the hadith which included), ‘Whoever kills a believer deliberately for no reason or a crime that he committed, he should be killed (in retaliation), unless the family of the murdered person agrees to take Diyah (blood money). The Diyah for a life is a hundred camels. Full blood money (i.e. total Diyah of 100 camels) is paid for the total cut off of each of the following: the nose, the eyes, the tongue, the lips, the penis, the testicles and the backbone. For the cutting off of one leg; half a Diyah is paid (i.e. 50 camels). For a head injury a third of the Diyah is paid, for a stab which penetrates the body, one third of the Diyah, for a blow which breaks a bones or dislocates it, 15 camels. For each finger or toe, 10 camels are paid. For each tooth five camels are paid. For a wound which exposes a bone five camels are paid. A man is killed in Qisas for killing a woman. For those who possess gold, they should pay the equivalent of the 100 camels which is fixed as one thousand Dinars.’ Related by Abu Dawud in his book “al-Marasil”, an-Nasa'i, Ibn Khuzaimah, Ibn al-Garud, Ibn Hibban and Ahmad, but they disagreed regarding its authenticity.
హదీసు ఉల్లేఖకులు
అబూబక్ర్ బిన్ ముహమ్మద్ బిన్ అమ్ర్ బిన్ హజ్మ్ అన్సారీ. నజారీ. మదీనావాసులు. ఖాజీ. ఈయన అసలు పేరు మారుపేరు – రెండూ ఒక్కటేనని కొందరు, అబూ ముహమ్మద్ అనేది మారుపేరని మరికొందరు వాదించారు. దైవభక్తి పరాయణులు. ఆరు హదీసు గ్రంథాలలోనూ ఈయన ఉల్లేఖనాలున్నాయి. తాబయీలలో ఐదవ తరానికి చెందినవారు. నలభై ఏళ్ళుగా ఆయన రాత్రిపూట పడకపై నడుం వాల్చలేదని ఆయన సతీమణి చెప్పింది.
ఇబ్నె మొయీన్ ఈయన్ని విశ్వసనీయులుగా ఖరారు చేశారు. ఇబ్నె సాద్ కథనం ప్రకారం ఈయన హిజ్రీ 120లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1009
హదీసు 1010
وَعَنْ اِبْنِ مَسْعُودٍ - رضى الله عنه - عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { دِيَةُ اَلْخَطَأَ أَخْمَاسًا: عِشْرُونَ حِقَّةً, وَعِشْرُونَ جَذَعَةً, وَعِشْرُونَ بَنَاتِ مَخَاضٍ, وَعِشْرُونَ بَنَاتِ لَبُونٍ, وَعِشْرُونَ بَنِي لَبُونٍ } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ. وَأَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, بِلَفْظٍ: { وَعِشْرُونَ بِنِي مَخَاضٍ } , بَدَلَ: { بُنِيَ لَبُونٍ }. وَإِسْنَادُ اَلْأَوَّلِ أَقْوَى. وَأَخْرَجَهُ اِبْنُ أَبِي شَيْبَةَ مِنْ وَجْهٍ آخَرَ مَوْقُوفًا, وَهُوَ أَصَحُّ مِنْ اَلْمَرْفُوعِ. وَأَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ: مِنْ طَرِيقِ عَمْرِوِ بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ رَفَعَهُ: { اَلدِّيَةُ ثَلَاثُونَ حِقَّةً, وَثَلَاثُونَ جَذَعَةً, وَأَرْبَعُونَ خَلِفَةً. فِي بُطُونِهَا أَوْلَادُهَا }.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : పొరపాటున చేసిన హత్యకు పరిహారంగా ఐదు రకాల ఒంటెలు వసూలు చేయబడతాయి. మూడు సంవత్సరాలు నిండిన 20 ఒంటెలు, నాలుగు సంవత్సరాలు నిండిన 20 ఒంటెలు, రెండు సంవత్సరాలు నిండిన 20 ఆడ ఒంటెలు, ఒక ఏడాది వయస్సు గల 20 ఆడ ఒంటెలు, ఒక ఏడాది వయస్సుగల 20 మగ ఒంటెలు” (సుననె దారె ఖుత్నీ). కాగా; ‘నలుగురు’ చేసిన ఉల్లేఖనంలో “ఒక ఏడాది వయస్సుకు బదులు రెండేండ్లు నిండిన 20 మగ ఒంటెలు” అన్న వాక్యం ఉంది. హదీసు పరంపర రీత్యా మొదటి ఉల్లేఖనమే దృఢమైనది. ఇబ్నె అబూ షైబ వేరొక వర్గం నుండి ‘మౌఖూఫ్’గా చేసిన కథనం ఈ ‘మర్ఫూ’ కథనం కన్నా దృఢంగా ఉంది.
అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుంచి, ఆయన తన తాత గారి నుండి ఉటంకించిన హదీసును అబూదావూద్, తిర్మిజీలు పొందుపరచారు. అందులో ఇలా వుంది : “పరిహారంగా మూడేళ్ళు నిండిన 30 ఒంటెలు, నాలుగేళ్ళు నిండిన 30 ఒంటెలు, 40 సూడి ఒంటెలు వసూలు చేయబడతాయి.”
English
Ibn Mas’ud (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “The Diyah for accidental killing is paid in five types of camel indemnity: 20 she-camels ‘hiqqah’ (in their fourth year), 20 she-camels ‘Jaz'ah’ (in their fifth year), 20 she-camels ‘bint makhad’ (in their second year), 20 she-camels ‘bint labun’ (in their third year) and 20 he-camels 'ibn labun' (in their third year).”Related by Ad-Daraqutni with a strong chain of narrators. The four Imams reported it with this version, “twenty ‘ibn makhad’ (twenty male camels which had entered their second year),” instead of “ibn labun.”
Abu Dawud and At-Tirmidhi transmitted on the authority of 'Amro bin Shu'aib on his father’s authority, who reported from his grandfather (RAA), who reported that the Messenger of Allah (ﷺ) said: “The Diyah (of intentional homicide) is paid in three different types of camels: 30 she-camels ‘hiqqah’ (in their fourth year), 30 she-camels ‘Jaz'ah’ (in their fifth year), and 40 pregnant she-camels.”
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1010
హదీసు 1011
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { إِنَّ أَعْتَى اَلنَّاسِ عَلَى اَللَّهِ ثَلَاثَةٌ: مَنْ قَتَلَ فِي حَرَمَ اَللَّهِ, أَوْ قَتَلَ غَيْرَ قَاتِلِهِ, أَوْ قَتَلَ لِذَحْلِ اَلْجَاهِلِيَّةِ } أَخْرَجَهُ اِبْنُ حِبَّانَ فِي حَدِيثٍ صَحَّحَهُ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు : మూడు రకాల వ్యక్తులు అల్లాహ్ యెడల తీవ్రమయిన ధిక్కారానికి పాల్పడినవారుగా పరిగణించబడతారు – 1. అల్లాహ్ నిషిద్ధపరచిన క్షేత్రంలో హత్య చేసినవాడు. 2. తన వాళ్ళను హత్యచేయని వ్యక్తిని హతమార్చేవాడు. 3. అజ్ఞానకాలపు పాత కక్షల, శత్రుత్వాల ప్రాతిపదికపై హత్యకు పాల్పడేవాడు. (ఇబ్నె హిబ్బాన్ ఒక హదీసును వివరిస్తూ దీన్ని ఉదాహరించారు. దీనిని ఆయన ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Ibn 'Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Three types of people are most hated by Allah, the Almighty: whoever kills another in the Sacred area of Haram (Sanctuary), whoever kills anyone other than the one who killed him or whoever kills anyone in revenge as in times of Jahiliyah (pre-Islamic times).” Related by Ibn Hibban.
సారాంశం
ఈ హదీసులో దేవుని పట్ల ధిక్కార వైఖరికి, తలబిరుసుతనానికి ఒడిగట్టే మూడు రకాల మనుషులు ప్రస్తావించబడ్డారు. వారిలో ఒకడు శాంతికి నిలయమైన పవిత్ర మక్కా నగరంలో హత్యాకాండకు ఒడిగట్టే దౌర్భాగ్యుడు. అసలు హత్య చేయటమే మహాపరాధం. అందునా దేవుని పుణ్యక్షేత్ర పరిధిలో (మక్కా మరియు మదీనాలలో) హత్య చేయటమంటే అది మరింత దారుణ మారణంగా భావించబడుతుంది. స్థలాన్నిబట్టి కూడా అపరాధం యొక్క తీవ్రత లెక్కించబడుతుందని దీన్నిబట్టి విదితమవుతున్నది. బహుశా ఈ కారణంగానేనేమో, మక్కా మదీనావంటి పుణ్యస్థలాలలో పొరపాటున హత్యచేసిన వ్యక్తి నుండి కూడా భారీ స్థాయిలో పరిహారం తీసుకోబడుతుందని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అన్నారు.
అసలు హంతకుణ్ణే గాకుండా, మరొక వ్యక్తిని కూడా చంపటం మహాపరాధం. హంతకుణ్ణి శిక్షించే బాధ్యత ప్రభుత్వానిది. అయితే ప్రతీకార భావంతో రగిలిపోతూ హంతకునితోపాటు హంతకుని బంధువులనో, హంతకుని అన్నదమ్ములనో చంపటం చాలా తీవ్రమయిన విషయం. ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడినవాడు దైవాజ్ఞలను ఉల్లంఘించినవాడుగా భావించబడతాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1011
హదీసు 1012
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { أَلَا إِنَّ دِيَةَ الْخَطَإِ وَشِبْهِ اَلْعَمْدِ -مَا كَانَ بِالسَّوْطِ وَالْعَصَا- مَائَةٌ مِنَ اَلْإِبِلِ, مِنْهَا أَرْبَعُونَ فِي بُطُونِهَا أَوْلَادُهَا } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవ ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: పొరబాటున చేసిన హత్యకు చెల్లించే పరిహారమూ, కొరడా దెబ్బలవల్ల లారీ దెబ్బలవల్ల చనిపోయినందుకు చెల్లించే పరిహారం ఒకేవిధంగా ఉంటాయి. పరిహారంగా ఇచ్చే (నూరు) ఒంటెలలో నలభై సూడి ఒంటెలై ఉండాలి. (దీనిని అబూదావూద్, నసాయి, ఇబ్నె మాజా సేకరించగా, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు)
English
‘Abdullah Ibn 'Amro ibn al-'As (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “The Diyah for accidental and quasi-deliberate homicide -such as that inflicted with a whip or a stick- is a hundred camels, forty of which are pregnant she-camels.” Related by Abu-Dawud, An-Nasa’i and Ibn Majah. Ibn Hibban graded it as Sahih.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1012
హదీసు 1013
وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { هَذِهِ وَهَذِهِ سَوَاءٌ -يَعْنِي: اَلْخُنْصَرَ وَالْإِبْهَامَ } رَوَاهُ اَلْبُخَارِيُّ وَلِأَبِي دَاوُدَ وَاَلتِّرْمِذِيَّ: { الْأَصَابِعُ سَوَاءٌ, وَالْأَسْنَانُ سَوَاءٌ: اَلثَّنِيَّةُ وَالضِّرْسُ سَوَاءٌ }. وَلِابْنِ حِبَّانَ: { دِيَةُ أَصَابِعِ اَلْيَدَيْنِ وَالرِّجْلَيْنِ سَوَاءٌ, عَشْرٌ مِنَ الْإِبِلِ لِكُلِّ إصْبَعٍ }.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఇది మరియు ఇది – అంటే చిటికెన వ్రేలునూ, బొటన వ్రేలు సమానమే.” (బుఖారీ)
అబూదావూద్, తిర్మిజీల ఉల్లేఖనంలో ఉంది – వ్రేళ్ళన్నీ సమానమే. పళ్ళన్నీ సమానమే. ముందున్న పళ్ళు, లోపలి దంతాలు కూడా సమానమే. (కాబట్టి వీటన్నింటికీ చెల్లించబడే పరిహారం కూడా ఒక్కటే)
ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది: కాళ్ళు మరియు చేతుల వ్రేళ్ళన్నింటికీ పరిహారం సమానమే. ఒక్కో వ్రేలికి పది ఒంటెల చొప్పున ఇవ్వవలసి ఉంటుంది.”
English
Ibn 'Abbas (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: ‘This and that are equal -meaning the little finger and the thumb.’’ Related by Al-Bukhari Abu Dawud and At-Tirmidhi transmitted, “The Diyah for the fingers and toes is the same, and that for the teeth is the same; the incisor and the molar tooth are the same.” Ibn Hibban narrated, “The Diyah for the fingers and toes is the same; 10 camels for each.”
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1013
హదీసు 1014
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ رَفَعَهُ قَالَ: { مَنْ تَطَبَّبَ -وَلَمْ يَكُنْ بِالطِّبِّ مَعْرُوفًا- فَأَصَابَ نَفْسًا فَمَا دُونَهَا, فَهُوَ ضَامِنٌ } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَهُوَ عِنْدَ أَبِي دَاوُدَ, وَالنَّسَائِيِّ وَغَيْرِهِمَا; إِلَّا أَنَّ مَنْ أَرْسَلَهُ أَقْوَى مِمَّنْ وَصَلَهُ.
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుంచి, ఆయన తన తాతగారి నుంచి ఉటంకించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు : “వైద్య సేవలో తనకు ప్రావీణ్యం లేకపోయినప్పటికీ తన్ను తాను వైద్యునిగా ప్రకటించుకుని మందులు ఇచ్చే వ్యక్తి (లోపభూయిష్ట చికిత్స) వల్ల మనిషి చచ్చిపోయినా, లేదా ఎవరికయినా ఏదైనా నష్టం వాటిల్లినా దానంతటికీ ఆ వ్యక్తే బాధ్యుడు.” (దీనిని దారె ఖుత్నీ ఉల్లేఖించారు – హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. అబూదావూద్, నసాయి తదితర గ్రంథాలలో కూడా ఈ ఉల్లేఖనం ఉంది. అయితే దీనిని ‘మౌసూల్’గా చేసిన కథనం కన్నా ‘ముర్సల్’గా చేసిన కథనమే దృఢమైనదిగా ఉంది)
English
’Amro bin Shu’aib narrated on the authority of his father, on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) said: “Anyone who practices medicine but is not known as a practitioner, and kills a human being or inflicts harm on him, will be held responsible.” Related by Ad-Daraqutni. Al-Hakim graded it as Sahih. Abu Dawud, an-Nasa'i and others also narrated it, but its Mursal form is stronger than the connected one.
సారాంశం
అంటే ఎవరయినా వైద్య వృత్తిలో తగిన ప్రావీణ్యం, అనుభవం లేకపోయినప్పటికీ తనను గొప్ప వైద్యునిగా ఊహించుకుని బాధ్యతారహితంగా ట్రీట్మెంట్ చేస్తే, తత్కారణంగా వ్యాధిగ్రస్తులకు ఏదైనా పెద్ద నష్టం (ప్రాణనష్టం) వాటిల్లితే లేదా ఏదైనా శరీరావయవం చెడిపోతే ఈ నష్టానికంతటికీ ఆ వైద్యుడే బాధ్యుడు. తనవల్ల జరిగిన ఈ కీడుకుగాను అతడు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ అతడు ఆ పరిహారం చెల్లించలేకపోతే, ఆ భారం అతని వారసులపై కూడా వేయబడుతుంది. అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ‘జాదుల్ మఆద్’లో వైద్యుడు తీసుకోవలసిన 20 జాగ్రత్తలను విశదీకరించారు. మిడిమిడి జ్ఞానంతో చేసిన చికిత్స వల్ల కలిగిన కీడుకుగాను అతన్నుండి పరిహారం వసూలు చేసే విషయంలో ధర్మవేత్తలందరి మధ్య ఏకాభిప్రాయముంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1014
హదీసు 1015
وَعَنْهُ; أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { فِي الْمَوَاضِحِ خَمْسٌ, خَمْسٌ مِنْ اَلْإِبِلِ } رَوَاهُ أَحْمَدُ. وَالْأَرْبَعَةُ. وَزَادَ أَحْمَدُ: { وَالْأَصَابِعُ سَوَاءٌ, كُلُّهُنَّ عَشْرٌ, عَشْرٌ مِنَ اَلْإِبِلِ } وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُودِ..
అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుంచి, ఆయన తన తాతగారి నుంచి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ గాయం వల్ల ఎముక స్పష్టంగా కనిపిస్తుందో దానికి ఐదు ఒంటెలు పరిహారంగా ఇవ్వవలసి ఉంటుంది.” (దీనిని అహ్మద్ మరియు నలుగురు ఉల్లేఖించారు) అహ్మద్ అదనంగా ఈ వాక్యం చేర్చారు : “వ్రేళ్ళన్నింటికీ పరిహారం సమానమే. అంటే ఒక్కో వ్రేలికి పదేసి ఒంటెలు.” (ఈ ఉల్లేఖనాన్ని ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్లు ప్రామాణికంగా ఖరారు చేశారు)
English
'Amro bin Shu’aib narrated on the authority of his father, on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) said: “For a wound which exposes a bone five camels are paid (in compensation).’’ Related by Ahmad and the four Imams. Ahmad added the following statement, “And the fingers and toes are all equal- in Diyah· ten camels.” Ibn Khuzaimah and Ibn al-Garud graded it as Sahih.
సారాంశం
కొట్లాట సందర్భంగా దెబ్బతగిలి, గాయమై ఎముక మాత్రం విరగకుండా ఎముక నుంచి మాంసం వేరైపోతే అట్టి పరిస్థితిలో ఐదు ఒంటెలను బాధితునికి పరిహారంగా ఇవ్వటం అనివార్యం. షాఫయీల, హనఫీల, ప్రవక్త సహచరుల్లోని ఒక పెద్ద వర్గం యొక్క అభిమతం కూడా ఇదే. అయితే వ్రేళ్ళు తెగిపోతే మాత్రం ఒక్కో వ్రేలికిగాను పదేసి ఒంటెల చొప్పున ఇవ్వవలసి ఉంటుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1015
హదీసు 1016
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ عَقْلُ أَهْلِ اَلذِّمَّةِ نِصْفُ عَقْلِ اَلْمُسْلِمِينَ } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ. وَلَفْظُ أَبِي دَاوُدَ: { دِيَةُ اَلْمُعَاهِدِ نِصْفُ دِيَةِ اَلْحُرِّ } وَلِلنِّسَائِيِّ: { عَقْلُ اَلْمَرْأَةِ مِثْلُ عَقْلِ اَلرَّجُلِ, حَتَّى يَبْلُغَ اَلثُّلُثَ مِنْ دِيَتِهَا } وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ.
ఈ ఉల్లేఖనం కూడా ఆయన చేతనే ఉల్లేఖించబడింది. దీని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “జిమ్మీలకు చెల్లించే పరిహారం ముస్లింలకు చెల్లించే పరిహారంలో సగభాగమై ఉంటుంది.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. అబూదావూద్‌లోని వాక్యం ఈ విధంగా ఉంది: “జిమ్మీకి ఇవ్వబడే పరిహారం స్వతంత్రునికి ఇచ్చే పరిహారంలో సగ భాగమై ఉంటుంది.” నసాయిలోని ఉల్లేఖనంలో ఇలా ఉంది – “స్త్రీకి ఇవ్వబడే పరిహారం కూడా పురుషునికి ఇవ్వబడే పరిహారం లాంటిదే. అయితే ఈ సమానత మూడో వంతు పరిహారం వరకే వర్తిస్తుంది.” (దీనిని ఇబ్నె ఖుజైమ ప్రామాణికమైనదిగా ధృవీకరించారు)
English
'Amro bin Shu'aib narrated on the authority of his father, on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) said: “The Diyah of the Dhimmi is half that of a Muslim.” Related by Ahmad and the four Imams. The narration of Abu Dawud, “The Diyah of the Mu'ahid (non Muslim with a covenant of protection) is half the Diyah of an free Muslim.” In the narration of An-Nasa’i, “The Diyah of a woman is the same as the Diyah of a man up to the third of the value (if the due value exceeds the third then her Diyah is half that of the man).” Ibn Khuzaimah graded it as Sahih.
సారాంశం
1. ‘జిమ్మీ’కి చెల్లించే శుల్కం (దియత్) ఒక ముస్లింకు చెల్లించే శుల్కంలో సగభాగమై ఉంటుందని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. ఇస్లామీయ రాజ్యంలో తాను కూడా పౌరులందరివలెనే ప్రశాంతంగా జీవించటానికి, రాజ్య శాసనాలు తనకు అన్నివిధాల రక్షణ కల్పించేలా ఒప్పందం కుదుర్చుకునే ‘అవిశ్వాసి’ని ‘జిమ్మీ’గా వ్యవహరిస్తారు. అతని ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన పూర్తి బాధ్యత ఇస్లామీయ వ్యవస్థపై ఉంటుంది.
2. స్త్రీలకు ఇవ్వబడే పరిహారం కూడా పురుషులకు ఇచ్చే పరిహారంలో సగమే అయి ఉంటుంది. అయితే నష్టం మూడో వంతుకు మాత్రమే పరిమితమై వున్న పక్షంలో స్త్రీ పురుషులందరికీ పరిహారం సమానంగా వర్తిస్తుంది. ఉదాహరణకు : ఒక స్త్రీకి, ఒక పురుషునికి- ఇద్దరిలో ఒక్కొక్కరికి మూడేసి వ్రేళ్ళు తెగిపోయాయి. ఇట్టి పరిస్థితిలో ఒక్కో వ్రేలికి పదేసి ఒంటెల చొప్పున స్త్రీకి 30 ఒంటెలు, పురుషునికి కూడా 30 ఒంటెలు – పరిహారంగా – లభించాయి. ఇక్కడి వరకూ ఇద్దరూ సమానులే. అయితే స్త్రీకి నాలుగు వ్రేళ్ళు తెగాయి, పురుషునికి కూడా నాలుగు వ్రేళ్ళే తెగాయనుకోండి. ఈ స్థితిలో పురుషునికి 40 ఒంటెలు పరిహారంగా లభించగా, స్త్రీకి 20 ఒంటెలు మాత్రమే లభిస్తాయి. ఎందుకంటే ‘నలభై’ సంఖ్య నూరులో మూడో వంతుకు మించిపోయింది. అందుకే ఇట్టిస్థితిలో స్త్రీకి లభించే పరిహారం పురుషునికి లభించే పరిహారంలో సగం అయిపోయింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1016
హదీసు 1017
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ عَقْلُ شِبْهِ اَلْعَمْدِ مُغَلَّظٌ مِثْلُ عَقْلِ اَلْعَمْدِ, وَلَا يَقْتَلُ صَاحِبُهُ, وَذَلِكَ أَنْ يَنْزُوَ اَلشَّيْطَانُ, فَيَكُونَ دَمًا بَيْنَ اَلنَّاسِ فِي غَيْرِ ضَغِينَةٍ, وَلَا حَمْلِ سِلَاحٍ } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ وَضَعَّفَهُ
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ (రహిమహుల్లాహ్) గారి చేతనే ఉటంకించబడిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఖత్లె షిబెహ్ అమద్”కు గాను ఇవ్వబడే పరిహారం ఉద్దేశ్యపూర్వకంగా చేసిన హత్య మాదిరిగా కఠినమైన పరిహారమే. అందుచేత హంతకుణ్ణి హతమార్చటం జరగదు. షైతాన్ వారి మధ్య ఎక్కడైనా జొరబడి ఎలాంటి శత్రుత్వం లేకుండానే, ఆయుధాలు కూడా లేకుండానే మరేదైనా వంకతో హత్యాకాండ మొదలయ్యేందుకు ఇందులో ఆస్కారముంది.” (దీనిని దారెఖుత్నీ వెలికి తీశారు. దీనిని బలహీన హదీసుగా ఖరారు చేశారు)
English
'Amro bin Shu'aib narrated on the authority of his father, on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) said: “The Diyah of the quasi-deliberate homicide is as severe as deliberate murder (in its being given in three types of camels), and the offender is not to be killed. This happens when the devil excites enmity between people causing them to shed blood but not due to hatred or carrying weapons in fighting.” Related by Ad-Daraqutni and graded it as weak Hadith.
సారాంశం
హదీసులో ‘ఖత్లె షిబెహ్ అమద్’ అనే పదం వచ్చింది. అంటే కోపావస్థలో తేలికపాటి వస్తువులతో – సాధారణంగా మనిషి మరణానికి దారితీయని వస్తువులతో – కొట్టడం వల్ల మనిషి చనిపోతే దీనిని ‘ఖత్లె షిబెహ్ అమద్’ గా వ్యవహరిస్తారు. ఇది కూడా ఒకవిధంగా ఉద్దేశ్యపూర్వకహత్యే గాని దీనికి ‘ఖిసాస్’ ఉండదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1017
హదీసు 1018
عَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { قَتَلَ رَجُلٌ رَجُلًا عَلَى عَهْدِ رَسُولِ اللَّهِ - صلى الله عليه وسلم - فَجَعَلَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -دِيَتَهُ اِثْنَيْ عَشَرَ أَلْفًا } رَوَاهُ اَلْأَرْبَعَةُ, وَرَجَّحَ النَّسَائِيُّ وَأَبُو حَاتِمٍ إِرْسَالَهُ..
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవప్రవక్త ﷺ కాలంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని హతమార్చగా, దైవప్రవక్త ﷺ అతనిపై పన్నెండువేల పరిహారం విధించారు.” (దీనిని నలుగురు ఉల్లేఖించారు. నసాయి, అబూ హాతిం లిరువురూ ఈ ఉల్లేఖనం ‘ముర్సల్’ అయి ఉంటుందనడానికే ప్రాధాన్యమిచ్చారు)
English
Ibn ’Abbas (RAA) narrated that, 'A man killed another man during the lifetime of the Prophet (ﷺ), so the Prophet (ﷺ) decided that his Diyah would be 12 thousand (Dirhams).' Related by the four Imams.
సారాంశం
ఈ హదీసు ద్వారా విదితమయ్యేదేమిటంటే, ఒకవేళ పరిహారం చెల్లించవలసిన వారి వద్ద ఒంటెలు లేకపోయినట్లయితే నగదు రూపంలోనే పరిహారం వసూలు చేయవచ్చు. ఆ నగదు దీనారు రూపంలో వున్నా, దిర్హమ్ రూపంలోవున్నా, రూపాయి నోటుగా వున్నా ఫరవాలేదు. అయితే మార్కెట్టులో ఒంటె ధరను బట్టి మొత్తం నగదును నిర్ధారించవలసి ఉంటుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1018
హదీసు 1019
وَعَنْ أَبِي رِمْثَةَ قَالَ: { أَتَيْتُ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -وَمَعِي اِبْنِي. فَقَالَ: "مَنْ هَذَا?" فَقُلْتُ: اِبْنِي, وَأَشْهَدُ بِهِ, فَقَالَ: "أَمَّا إِنَّهُ لَا يَجْنِي عَلَيْكَ, وَلَا تَجْنِي عَلَيْهِ } رَوَاهُ النَّسَائِيُّ, وَأَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُودِ.
హజ్రత్ అబూరిమ్సా (రదియల్లాహు అన్హు) కథనం: “నేను దైవప్రవక్త ﷺ సన్నిధిలో హాజరయ్యాను. నాతోపాటు నా కుమారుడు కూడా నా వెంట ఉన్నాడు. “ఇతనెవరు?” అని ఆయన ﷺ అడగ్గా “ఇతను నా కుమారుడు. ఈ విషయానికి తమరు సాక్షిగా ఉండాలి” అని నేను విన్నవించుకున్నాను. దానికి ఆయన ﷺ, “నీ పాపాల, అపరాధాల బాధ్యత ఇతనిపై లేదు. అలాగే ఇతని అపరాధాల బాధ్యత నీపై లేదు”అని చెప్పారు. (దీనిని నసాయి, అబూదావూద్ ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్లు దీనిని ప్రామాణికమైన హదీసుగా నిర్ధారించారు)
English
Abu Rimthah narrated, ‘I came to the Prophet (ﷺ) with my son and he asked me, “Who is this?” I answered, ‘This is my son, and I swear on it.’ The Messenger of Allah (ﷺ) said: “He will not carry your burdens (sins) and you will not carry his burdens.” Related by An-Nasa’i and Abu Dawud. Ibn Khuzaimah and Ibn al-Garud graded it as Sahih.
సారాంశం
ఈ హదీసు ద్వారా బోధపడే ముఖ్య విషయమేమిటంటే, రక్తపరిహారం విషయంలో అపరాధిని తప్ప అతనికి బదులుగా మరోవ్యక్తిని పట్టుకోవటం జరగదు. ఆఖరికి తండ్రికి బదులుగా కొడుకునుగానీ, కొడుకుకు బదులుగా తండ్రినిగానీ పట్టుకోవటం జరగదు. మరి ‘పొరబాటున చేసిన హత్య’కు గాను చెల్లించవలసిన పరిహారపు భారాన్ని వ్యాఖ్యాతలు వారసులపై మోపారుగదా! అన్న ప్రశ్న ఈ సందర్భంగా జనించవచ్చు. దీనికి జవాబు ఏమిటంటే; ఇది ‘భారం’కాదు, సహకారభావం, ఆర్థిక సహాయం క్రిందికి వస్తుంది. సౌభ్రాతృత్వ భావం కోరే దయాదాక్షిణ్యాల వ్యవహారాన్ని దృష్టియందుంచుకుని, ఒక కుటుంబాన్ని నిలబెట్టే దృక్పథంతో ఈ చేయూత నివ్వబడుతుందన్నమాట! ఇలాంటి సద్వ్యవహారానికి సంబంధిత వ్యక్తులు సంతోషంతో ముందుకు వస్తుంటారు. తమలోని ఒక సోదరునిపై వచ్చిన ఆపదను తొలగించడానికి తలా ఓ చేయి వేస్తారు. ఎందుకంటే రేపటి రోజున అలాంటి ఆపదకు ఎవరయినా గురికావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒండొకరికి చేదోడు వాదోడుగా ఉండాలి. మానవనైజం వాంఛించేది, మానవ సమాజం కాంక్షించేది కూడా ఇదే.
హదీసు ఉల్లేఖకులు
అబూరిమ్సా (రదియల్లాహు అన్హు) : ఒక కథనం ప్రకారం ఈయన పేరు హబీబ్ బిన్ హైయాన్. వేరొక కథనం ప్రకారం రిఫాఅ బిన్ యస్రిబీ. తైమ్ తెగకు చెందినవారు. సుప్రసిద్ధ సహాబీ. కూఫాకు చెందిన సహాబీగా పరిగణించబడతారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.1 రక్తశుల్కం (దియత్)|హదీసు 1019
You must be logged in to post a comment.