హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 9వ అధ్యాయం: ఈలా, జిహార్, కఫ్ఫారా. ఈ అధ్యాయంలో 6 హదీసులు (హదీసు 930 – 935) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా

↑ విషయ సూచిక

باب الإيلاء والظهار والكفارة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

930

హదీసు 930

عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { آلَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-مِنْ نِسَائِهِ وَحَرَّمَ, فَجَعَلَ اَلْحَلَالَ حَرَامًا , وَجَعَلَ لِلْيَمِينِ كَفَّارَةً.‏ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَرُوَاتُهُ ثِقَاتٌ..

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ఒక నిర్ణీత కాలం వరకు తన భార్యల వద్దకు పోనని ప్రతిన బూనారు. వారి వద్దకు పోవడాన్ని అధర్మం (హరామ్)గా చేసుకున్నారు. మరి ఆయన ﷺ ధర్మసమ్మతమయిన ఒక విషయాన్ని తనంతట తానుగా అధర్మంగా చేసుకున్నందుకు గాను పరిహారాన్ని నిర్ధారించారు. (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు. దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు)

పూర్వాపరాలు

ఏ భర్త అయినా తన భార్యలతో నాలుగు నెలలు లేక అంతకన్నా ఎక్కువ రోజులు సంబంధం పెట్టుకోనని ప్రతిన బూనటాన్ని షరీయత్ పరిభాషలో ‘ఈలా’ అంటారు. కాగా; దైవప్రవక్త ﷺ ఒక నెల రోజుల పాటు తన సతీమణుల వద్దకు పోనని ప్రతినబూనారు. దైవప్రవక్త ﷺ ఈ విధంగా నిశ్చయించుకోవడానికి అనేక కారణాలున్నాయి. దైవప్రవక్త ﷺ తన భార్యలలో ఒకామెకు ఒక విషయం చెప్పి దాన్ని రహస్యంగా ఉంచమన్నారు. కాని ఆమె ఆ రహస్యాన్ని బహిర్గతం చేసింది. ఇంటి ఖర్చుల విషయంలో భార్యలంతా కలసి దైవప్రవక్త ﷺకు డిమాండు చేశారు. అదే రోజుల్లో తేనె సంఘటన కూడా సంభవించింది. ఆ రోజుల్లోనే దైవప్రవక్త ﷺ గుఱ్ఱంపై నుంచి క్రిందపడటం, ఆయన ﷺ కుడి ప్రక్క భాగం ఒడుసుకుపోవటం జరిగింది. ఈ పరిస్థితులన్నీ దైవప్రవక్త ﷺను చీకాకు పరచాయి. ముఖ్యంగా తేనె సేవింపు సంఘటన ఆయన్ని ﷺ మానసికంగా ఎంతో వ్యాకులతకు గురి చేసింది. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అంటున్నారు : దైవప్రవక్త ﷺ తన సతీమణుల్లో ఒకరైన హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రదియల్లాహు అన్హా) ఇంట్లో ఆగి తేనె సేవించేవారు. ఓ రోజు నేను, హజ్రత్ హఫ్స (రదియల్లాహు అన్హా) కలసి వ్యూహ రచన చేశాము – దైవప్రవక్త ﷺ మనిద్దరిలో ఎవరి కుటీరానికి వచ్చినా “మీ దగ్గర మగాఫీర్ (అదొక జిగురు పదార్థం. దాని వాసన రోత పుట్టిస్తుంది) వాసన వస్తోంది. మీరు గాని మగాఫీర్ తిన్నారా?” అని అడుగుదాం అని చెప్పుకున్నాం. దాని ప్రకారం దైవప్రవక్త ﷺ మా ఇద్దరిలో ఒకరి దగ్గరకు వచ్చినపుడు ఆమె ఈ మాటే అన్నది. దైవప్రవక్త ﷺ అది విని “నేను మగాఫీర్ తినలేదు. జైనబ్ దగ్గర తేనె మాత్రమే సేవించాను. సరే ఇకనుండి నేను ఎన్నటికీ తేనె సేవించను” అని ప్రతినబూనారు. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని కూడా అన్నారు. అయితే తన ప్రవక్త ఈ విధంగా ఒక హలాల్ వస్తువును హరామ్‌గా ఖరారు చేసుకోవటాన్ని ఎత్తి చూపుతూ అల్లాహ్ ఈ ఆదేశాన్ని అవతరింపజేశాడు : “ఓ ప్రవక్తా! దేవుడు నీ కోసం ధర్మసమ్మతం గావించిన దాన్ని నీవు ఎందుకు నిషేధించుకుంటావు? (ఇలా చేసి) నీవు నీ భార్యలను సంతోషపెట్టదలిచావా? (సరే. జరిగిందేదో జరిగిపోయింది). దేవుడు క్షమాశీలి, దయామయుడు. ఆయన నీ కోసం ప్రమాణాల పాటింపు నుండి బయటపడే పద్ధతిని నిర్ణయించాడు. దేవుడు మీ రక్షకుడు, ఆయన సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు.” (తహ్రీమ్ – 1,2)

ఈ విధంగా దేవుడు ప్రమాణ భంగం చేసిన వారికి దాన్నుంచి బయటపడే మార్గం చూపాడు. ప్రమాణ భంగానికి పాల్పడిన వారు పరిహారం చెల్లించటం విధి.

English

Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) swore that he would stay away from his wives for a period. He made something unlawful (for himself) (i.e. something not in itself unlawful). So, he made the lawful unlawful, and he made atonement for breaking an oath. [Reported by at-Tirmidhi, and its narrators are reliable (thiqah)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా|హదీసు 930

931

హదీసు 931

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { إِذَا مَضَتْ أَرْبَعَةُ أَشْهُرٍ وَقَفَ اَلْمُؤْلِ ي حَتَّى يُطَلِّقَ, وَلَا يَقَعُ عَلَيْهِ اَلطَّلَاقُ حَتَّى يُطَلِّقَ }. أَخْرَجَهُ اَلْبُخَارِيّ ُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “తన భార్య వద్దకు పోనని ప్రతినబూనిన వ్యక్తిని నాలుగు నెలల అనంతరం పరిపాలకుని సమక్షంలో హాజరుపరచాలి. న్యాయస్థానం సాక్షిగా అతను విడాకులు ఇవ్వనంతవరకూ అతన్ని వదలిపెట్టకూడదు. అతను నోటితో విడాకులు ఇచ్చేవరకూ అది విడాకులుగా పరిగణించబడదు.” (బుఖారీ)

English

Narrated Ibn 'Umar (RA): When a period of four months elapses, the one who swears to stay away from his wife must be made to return to her or divorce her, and the divorce is not valid till the husband himself pronounces it. [al-Bukhari reported it].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా|హదీసు 931

932

హదీసు 932

وَعَنْ سُلَيْمَانَ بْنِ يَسَارٍ قَالَ: { أَدْرَكْتُ بِضْعَةَ عَشَرَ رَجُلًا مِنْ أَصْحَابِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-كُلُّهُمْ يَقِفُونَ اَلْمُؤْلِي }. رَوَاهُ اَلشَّافِعِيّ ُ.

హజ్రత్ సులైమాన్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త ﷺ వారి పదిమందికి మించిన సహచరులను చూశాను – వారు ‘ఈలా’ చేసేవారిని (4 మాసాల వరకు భార్య వద్దకు పోనని ప్రతిన బూనిన వానిని) నిలదీసి అడిగేవారు. (దీనిని షాఫయి ఉల్లేఖించారు)

English

Narrated Sulaiman bin Yasar (RA): I met thirteen or more of the Companions of Allah's Messenger (ﷺ), all of them made the one who swears to stay away from his wife, return to her or divorce her (at the end of the period). [Reported by ash-Shafi'i].

సారాంశం

భార్య దగ్గరకు పోనని ఒట్టేసుకుని, నాలుగు నెలలు గడచిన తరువాత కూడా ఎవరయినా భార్యను కలవకపోయినంత మాత్రాన విడాకులుగా లెక్కకట్ట నవసరం లేదని, విడాకులిస్తున్నట్లు అతను బహిరంగంగా చెప్పటం అవసరమని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) తదితరులు దీనికి అనుకూలంగా ఉన్నారు. అయితే నిర్ణీత గడువు ముగియగానే విడాకులు ఇచ్చినట్లు అయిపోతుందని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) మరియు ఆయన అనుయాయులు భావిస్తున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా|హదీసు 932

933

హదీసు 933

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { كَانَ إِيلَاءُ اَلْجَاهِلِيَّةِ اَلسَّنَةَ وَالسَّنَتَيْنِ, فَوَقَّتَ اَللَّهُ أَرْبَعَةَ أَشْهُرٍ, فَإِنْ كَانَ أَقَلَّ مِنْ أَرْبَعَةِ أَشْهُرٍ, فَلَيْسَ بِإِيلَاءٍ } أَخْرَجَهُ اَلْبَيْهَقِيُّ..

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : అజ్ఞాన కాలపు ‘ఈలా’ గడువు ఏడాది నుంచి రెండేళ్ళ దాకా ఉండేది. అయితే అల్లాహ్ దీని గడువును నాలుగు మాసాలుగా నిర్ధారించాడు. కనుక ఇప్పుడా గడువు నాలుగు మాసాల కన్నా తక్కువగా ఉంటే అది ‘ఈలా’ గా పరిగణించబడదు. (బైహఖీ)

English

Narrated Ibn 'Abbas (RA): The swearing to stay away from one's wife in al-Jahiliyyah era was for one or two years. Then, Allah appointed a period of four months for it. So, if it is less than four months, it is not swearing to stay away from one's wife. [al-Baihaqi reported it]

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా|హదీసు 933

934

హదీసు 934

وَعَنْهُ رَضِيَ اَللَّهُ تَعَالَى عَنْهُمَا; { أَنَّ رَجُلًا ظَاهَرَ مِنِ اِمْرَأَتِهِ, ثُمَّ وَقَعَ عَلَيْهَا, فَأَتَى اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: إِنِّي وَقَعْتُ عَلَيْهَا قَبْلَ أَنْ أُكَفِّرَ, قَالَ: "فَلَا تَقْرَبْهَا حَتَّى تَفْعَلَ مَا أَمَرَكَ اَللَّهُ".‏ } رَوَاهُ اَلْأَرْبَعَةُ وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَرَجَّحَ النَّسَائِيُّ إِرْسَالَه ُ. وَرَوَاهُ اَلْبَزَّارُ: مِنْ وَجْهٍ آخَرَ, عَنِ اِبْنِ عَبَّاسٍ وَزَادَ فِيهِ: { كَفِّرْ وَلَا تَعُدْ }.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక వ్యక్తి తన భార్య విషయంలో ‘జిహార్’కు ఒడిగట్టాడు (అంటే; నువ్వు నా తల్లితో సమానం, భార్యగా నువ్వు నా కోసం నిషిద్ధం అని ప్రకటించాడు). తరువాత అతను తన భార్యతో సమాగమం కూడా చేశాడు. ఆ తర్వాత దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి, “నేను పరిహారం చెల్లించక ముందే నా భార్యతో సంభోగించాను” అని విన్నవించుకున్నాడు. అది విని దైవప్రవక్త ﷺ, “దైవాదేశాన్ని నెరవేర్చేదాకా ఇక ఆమె వద్దకు పోకు” అని ఉపదేశించారు. (దీనిని ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రమాణబద్ధమైనదిగా పేర్కొన్నారు. నసాయి మాత్రం దీన్ని ‘ముర్సల్’ అని నొక్కి చెప్పారు) బజ్జార్ వేరొక ఆధారంతో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనాన్ని ఉటంకించారు. అందులో ఈ వాక్యం అదనంగా ఉంది – “పరిహారం చెల్లించు. అప్పటి వరకూ దాన్ని పునరావృతం కానివ్వకు.”

English

Narrated [Ibn 'Abbas (RA)]: A man had vowed to make his wife like his mother (i.e. forbidden for him). Then he had intercourse with her, so he went to the Prophet (ﷺ) and said, "I had intercourse with her before making the atonement." He replied, "Do not go near her till you do what Allah has commanded you to do." Reported by al-Arba'a. at-Tirmidhi graded it Sahih (authentic) but an-Nasa'i held that the stronger view is that it is Mursal (missing link after the Tabi'i)].

al-Bazzar reported it through another chain, from Ibn 'Abbas (RA) and he added: "Make atonement and do not repeat it."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా|హదీసు 934

935

హదీసు 935

وَعَنْ سَلَمَةَ بْنِ صَخْرٍ قَالَ: { دَخَلَ رَمَضَانُ, فَخِفْتُ أَنْ أُصِيبَ اِمْرَأَتِي, فَظَاهَرْتُ مِنْهَا, فَانْكَشَفَ لِي مِنْهَا شَيْءٌ لَيْلَةً, فَوَقَعْتُ عَلَيْهَا, فَقَالَ لِي رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-"حَرِّرْ رَقَبَةً" قُلْتُ: مَا أَمْلِكُ إِلَّا رَقَبَتِي.‏ قَالَ: "فَصُمْ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ", قُلْتُ: وَهَلْ أَصَبْتُ اَلَّذِي أَصَبْتُ إِلَّا مِنْ اَلصِّيَامِ? قَالَ: "أَطْعِمْ عِرْقًا مِنْ تَمْرٍ سِتِّينَ مِسْكِينًا".‏ } أَخْرَجَهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيَّ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُود ِ.

హజ్రత్ సలమా బిన్ సఖ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం : రమజాన్ నెల (ఉపవాసాల నెల) ఆరంభమయింది. నేను ఉపవాసాల నెలలో నా భార్యతో ఎక్కడ సంభోగిస్తానోనని భయపడ్డాను. ఈ భయం కొద్దీ నేను నా భార్యను ‘జిహార్’ చేశాను (ఆమెను నా తల్లిగా భావించటం మొదలెట్టాను). అయితే ఒక వెన్నెల రేయి ఆమె శరీరాచ్ఛాదన తొలగిపోవటంతో నేను ఆగలేక ఆమెతో రమించాను. (తరువాత ఈ విషయాన్ని దైవప్రవక్త – సఅసం – దృష్టికి తీసుకురాగా) “ఒక బానిసకు విముక్తి నొసగు” అని దైవప్రవక్త ﷺ సూచించారు. “నేనే బానిసలాంటి వాణ్ణి. ఇంక నేను బానిసకు ఎలా విముక్తి నొసగేది?” అని నేను అన్నాను. “పోనీ, రెండు నెలల పాటు నాగాలేకుండా ఉపవాసాలుండు” అని ఆయన ﷺ సూచించారు. “ఈ బాధలన్నీ ఉపవాసాల మూలంగానే కదా వచ్చిపడ్డాయి?” అని నేనన్నాను. “సరే, అయితే ఒక తట్ట ఖర్జూర పండ్లను అరవైమంది నిరుపేదలకు తినిపించు” అని ఆయన ﷺ సలహా ఇచ్చారు. (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురి’లో నసాయి మినహా మిగిలిన వారు ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్‌లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Salamah bin Sakhr (RA): When the month of Ramadan came, I feared lest I would have intercourse with my wife. So, I vowed az-Zihar (the she was like my mother). Then, one night something of her was uncovered to me and I had intercourse with her. Allah's Messenger (ﷺ) afterwards said to me, "Set a slave free," and I replied, "I do not possess one (that I can free)." He said, "Then fast two consecutive months." I replied, "Have I fallen into that which I have fallen into except due to fasting!?" He said, "Feed sixty poor people with an 'Araq (basket) of dates." [Reported by Ahmad and al-Arba'a except an-Nasa'i. Ibn Khuzaimah and Ibn al-Jarud graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.9 ఈలా, జిహార్, కఫ్ఫారా|హదీసు 935