హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 8వ అధ్యాయం: విడాకుల ఉపసంహరణ గురించి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 928 – 929) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
8.8 విడాకుల ఉపసంహరణ గురించి
باب الرجعة
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 928
عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّهُ سُئِلَ عَنْ اَلرَّجُلِ يُطَلِّقُ, ثُمَّ يُرَاجِعُ, وَلَا يُشْهِدُ? فَقَالَ: أَشْهِدْ عَلَى طَلَاقِهَا, وَعَلَى رَجْعَتِهَا }. رَوَاهُ أَبُو دَاوُدَ هَكَذَا مَوْقُوفًا, وَسَنَدُهُ صَحِيحٌ, وَأَخْرَجَهُ الْبَيْهَقِيُّ بِلَفْظٍ: (أَنَّ عِمْرَانَ بْنَ حُصَيْنٍ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُمَا, سُئِلَ عَمَّنْ رَاجَعَ امْرَأَتَهُ وَلَمْ يُشْهِدْ, فَقَالَ فِي غَيْرِ سُنَّةٍ؟ فَلْيُشْهِدِ الْآنَ) وَزَادَ الطَّبَرَانِيُّ فِي رِوَايَةٍ (وَيَسْتَغْفِرِ اللهَ).
హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్(రదియల్లాహు అన్హుమా) కథనం : పదే పదే విడాకులిస్తూ, దాన్ని ఉపసంహరించుకుంటూ, ఈ సంఘటనలపై కనీసం సాక్షులను కూడా పెట్టని వ్యక్తి గురించి ప్రశ్నించగా “స్త్రీకి విడాకులిచ్చే సమయంలోనూ, ఉపసంహరించుకుని ఆమెను మరల్చుకునే సమయంలోనూ సాక్షులను పెట్టుకో” అని ఆయన సమాధానమిచ్చాడు. (దీనిని అబూదావూద్ ఇదే విధంగా – మౌఖూఫ్‌గా – ఉల్లేఖించారు. ఇది అందిన పరంపర మాత్రం ప్రామాణికమైనది. ఇమామ్ బైహఖీ ఈ ఉల్లేఖనాన్ని ఇలా ప్రస్తావించారు : తన భార్యను తిరిగి పిలుచుకుని, దానిపై సాక్ష్యం పెట్టని వ్యక్తి గురించి ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు)ను ప్రశ్నించగా, “ఇది సంప్రదాయం (మస్నూన్) కాదు. ఇప్పుడైనా అతను సాక్ష్యం ఉంచుకోవాలి” అని ఆయన సమాధానమిచ్చారు. “అతడు దైవాన్ని క్షమాపణకై వేడుకోవాలి” అన్న అదనపు వాక్యాన్ని తబ్రానీ ఒక ఉల్లేఖనంలో పేర్కొన్నారు)
English
Narrated 'Imran bin Husain (RA): He was asked about a man who divorces his wife, then takes her back without taking witnesses (on either). So he replied, "Get witnesses on her divorce, and on her return." [Abu Dawud reported it Mawquf (saying of a Companion), and its chain of narrators is Sahih (authentic)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.8 విడాకుల ఉపసంహరణ గురించి|హదీసు 928
హదీసు 929
وَعَنِ اِبْنِ عُمَرَ, { أَنَّهُ لَمَّا طَلَّقَ اِمْرَأَتَهُ، قَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -لِعُمَرَ: "مُرْهُ فَلْيُرَاجِعْهَا. } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : తాను తన భార్యకు విడాకులు ఇవ్వగా, దైవప్రవక్త ﷺ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)తో ఇలా అన్నారు: “అతని భార్యను మరల్చుకోమని అతనికి చెప్పండి.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Ibn 'Umar (RA): When he divorced his wife the Prophet (ﷺ) said to 'Umar, "Command him to take her back." [Agreed upon].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.8 విడాకుల ఉపసంహరణ గురించి|హదీసు 929
You must be logged in to post a comment.