హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 10వ అధ్యాయం: లియాన్ (శాప ప్రమాణం). ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 936 – 944) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
8.10 లియాన్ (శాప ప్రమాణం)
باب اللعان
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 936
عَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { سَأَلَ فُلَانٌ فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ! أَرَأَيْتَ أَنْ لَوْ وَجَدَ أَحَدُنَا اِمْرَأَتَهُ عَلَى فَاحِشَةٍ, كَيْفَ يَصْنَعُ? إِنْ تَكَلَّمَ تَكَلَّمَ بِأَمْرٍ عَظِيمٍ, وَإِنْ سَكَتَ سَكَتَ عَلَى مِثْلِ ذَلِكَ! فَلَمْ يُجِبْهُ, فَلَمَّا كَانَ بَعْدَ ذَلِكَ أَتَاهُ, فَقَالَ: إِنَّ اَلَّذِي سَأَلْتُكَ عَنْهُ قَدِ ابْتُلِيتُ بِهِ, فَأَنْزَلَ اَللَّهُ اَلْآيَاتِ فِي سُورَةِ اَلنُّورِ, فَتَلَاهُنَّ عَلَيْهِ وَوَعَظَهُ وَذَكَّرَهُ، وَأَخْبَرَهُ أَنَّ عَذَابَ اَلدُّنْيَا أَهْوَنُ مِنْ عَذَابِ اَلْآخِرَةِ. قَالَ: لَا, وَاَلَّذِي بَعَثَكَ بِالْحَقِّ مَا كَذَبْتُ عَلَيْهَا, ثُمَّ دَعَاهَا فَوَعَظَهَا كَذَلِكَ, قَالَتْ: لَا, وَاَلَّذِي بَعَثَكَ بِالْحَقِّ إِنَّهُ لَكَاذِبٌ, فَبَدَأَ بِالرَّجُلِ, فَشَهِدَ أَرْبَعَ شَهَادَاتٍ بِاللَّهِ, ثُمَّ ثَنَّى بِالْمَرْأَةِ, ثُمَّ فَرَّقَ بَيْنَهُمَا. } رَوَاهُ مُسْلِم ٌ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఫలానా వ్యక్తి ఒకసారి వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! మాలో ఎవరయినా సరే తన భార్య ఎవరితోనయినా అక్రమ సంబంధం ఏర్పరచుకుని ఉండగా చూస్తే ఏం చేయాలి? అతనే గనక ఇతరులతో చెప్పుకుంటూ తిరిగితే అది అత్యంత సిగ్గుచేటుగా ఉంటుంది. మరి అతను మౌనంగా ఉండాలా అంటే అదీ చాలా క్లిష్టమయిన విషయమే” అని సందేహం వెలిబుచ్చాడు. దీనికి ఆయన ﷺ సమాధానం ఇవ్వలేదు. ఆ వ్యక్తి మరోసారి కూడా వచ్చి, “ఇంతకు ముందు నేను తమరి యెదుట చెప్పుకున్న సమస్యను ఎదుర్కొంటున్నది నేనే” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ నూర్ సూరాలోని సూక్తులను అవతరింపజేశాడు. ఆయన ﷺ ఆ సూక్తులను అతనికి వినిపించి, అతనికి హితబోధ చేశారు. దేవుడు విధించే శిక్షను కూడా గుర్తు చేస్తూ, “ఇహలోక శిక్ష పరలోక శిక్ష కన్నా చాలా తేలికపాటిది” అని చెప్పారు. అప్పుడతను, “లేదు. మిమ్మల్ని సత్యమిచ్చి పంపిన శక్తిమంతుని సాక్షిగా చెబుతున్నాను. నేను ఆమెపై నీలాపనిందను మోపటం లేదు” అని అన్నాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ నిందితురాలైన స్త్రీని పిలిపించి, ఆమెకు కూడా అదేవిధంగా హితబోధ చేశారు. దానికామె, “కాదు, తమరిని సత్యసమేతంగా ప్రభవింపజేసిన దేవుని సాక్షిగా చెబుతున్నాను – ముమ్మాటికీ ఆ మగవాడు అబద్ధాలకోరు” అని అన్నది. ఆ మాటలు విని ఆయన ﷺ, ఆ పురుషునితోనే ప్రమాణ ప్రక్రియను ప్రారంభించారు. అతను నాలుగుసార్లు ప్రమాణం చేశాడు. తరువాత ఆయన ﷺ ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఇద్దరి మధ్యా వేర్పాటు చేశారు. (ముస్లిం)
English
Narrated Ibn 'Umar (RA): So-and-so asked and said, "O Allah's Messenger, what do you think if one of us finds his wife committing adultery, how should he act? If he talks he would talk about a grievous affair, and if he keeps silent he would keep silent about something similar (a grievous affair)." He gave no answer. Afterwards he came to him (ﷺ) and said, "I have been afflicted with the very problem which I had asked you about." Then Allah revealed the verses of Surat an-Nur (the Light). He then recited them to him and exhorted, admonished and informed him that the punishment of this world is easier than that of the Hereafter. He said, "No, by Him Who sent you with the Truth, I have not lied against her." He then summoned the woman and exhorted her in the same way. She said, "No, by Him Who sent you with the Truth, he is a liar." He began with the man; and he (the man) bore witness four times with an oath by Allah; he then did the same with the woman, then he separated them. [Reported by Muslim].
సారాంశం
షరీయత్ పరిభాషలో దీన్ని ‘లియాన్’ అంటారు. లియాన్ అంటే అసలు పరస్పరం శపించుకోవటం అని అర్థం. భర్త తన భార్యపై అక్రమ సంబంధపు నిందను మోపి, సాక్షులను తీసుకురాలేని పక్షంలో ఆ భార్యాభర్తలు న్యాయాధికారి సమక్షంలో ప్రమాణం చేయడాన్ని ‘లియాన్’ అంటారు. ఈ సందర్భంగా ఆరోపించే వ్యక్తి నాలుగుసార్లు దేవునిపై ప్రమాణం చేసి, ఐదోసారి తాను గనక అబద్ధమాడి ఉంటే నాపై దేవుని శాపం పడుగాక! అని అంటాడు. స్త్రీ చేత కూడా అదేవిధంగా ప్రమాణం చేయించటం జరుగుతుంది. ఆమె నాలుగుసార్లు దేవునిపై ప్రమాణం చేసి, ఈ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని సాక్ష్యమివ్వాలి. అయిదోసారి, ఒకవేళ అతగాడు తన నిందారోపణలో సత్యవంతుడే అయితే దైవాగ్రహం నాపై విరుచుకుపడుగాక! అని అనాలి. ఈ విధంగా వారిరువురికీ ఇహలోకంలో విధించబడే శిక్ష తప్పుతుంది. అయితే వారిరువురిలో అపరాధానికి ఒడిగట్టిన వారెవరో దైవానికి తెలుసు. పరలోకంలో వ్యధాభరితమయిన శిక్ష వారి కోసం సిద్ధంగా ఉంటుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 936
హదీసు 937
وَعَنِ اِبْنِ عُمَرَ أَيْضًا { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ لِلْمُتَلَاعِنَيْنِ: "حِسَابُكُمَا عَلَى اَللَّهِ تَعَالَى, أَحَدُكُمَا كَاذِبٌ, لَا سَبِيلَ لَكَ عَلَيْهَا" قَالَ: يَا رَسُولَ اَللَّهِ! مَالِي? قَالَ: "إِنْ كُنْتَ صَدَقْتَ عَلَيْهَا, فَهُوَ بِمَا اِسْتَحْلَلْتَ مِنْ فَرْجِهَا, وَإِنْ كُنْتَ كَذَبْتَ عَلَيْهَا, فَذَاكَ أَبْعَدُ لَكَ مِنْهَا" } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ‘లియాన్’ (పరస్పర నిందారోపణలు) చేసుకున్న దంపతులనుద్దేశ్యించి, “మీరిరువురి లెక్క దేవుని చేతిలో ఉంది. మీరిద్దరిలో ఒకరు మాత్రం అబద్ధం చెబుతున్నారు” అని అన్నారు. (ఆ తరువాత పురుషుడ్ని ఉద్దేశించి) “ఇక ఇప్పుడు ఈమెపై నీకు ఎలాంటి హక్కులేదు” అని చెప్పారు. “దైవప్రవక్తా ﷺ! మరి నా సొమ్ము నాకు ఇప్పించండి” అని ప్రాధేయపడ్డాడు. దానికాయన ﷺ, “నువ్వే గనక ఆమెపై మోపిన ఆరోపణ ఒకవేళ నిజమై ఉంటే, ఆమెను ధర్మసమ్మతం చేసుకోవడానికి నీవు చెల్లించిన (మహర్) సొమ్ము ఆమె దగ్గర నువ్వు పొందిన దాంపత్య సుఖానికి సరిపోయింది. ఒకవేళ నువ్వామెపై అపనింద మోపి ఉంటే ఆ సొమ్ము నీకు మరింత దూరమైపోయింది” అని తీర్పు ఇచ్చారు. (బుఖారీ, ముస్లిం)
English
Narrated [Ibn 'Umar (RA)]: Allah's Messenger (ﷺ) said to the two who were invoking curses regarding one another, "Your reckoning is in Allah's Hands for one of you is lying. You cannot remarry her." He (the man) said: "O Allah's Messenger, what about my property (dowry)?" He replied, "If you have spoken the truth, it is the price of your having had the right of intercourse with her, and if you have lied against her, it is even more remote for you (to get it back) from her." [Agreed upon].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 937
హదీసు 938
وَعَنِ أَنَسٍ, أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { أَبْصِرُوهَا, فَإِنْ جَاءَتْ بِهِ أَبْيَضَ سَبِطًا فَهُوَ لِزَوْجِهَا, وَإِنْ جَاءَتْ بِهِ أَكْحَلَ جَعْدًا, فَهُوَ اَلَّذِي رَمَاهَا بِهِ } مُتَّفَقٌ عَلَيْه ِ
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా సెలవిచ్చారు : “(ఆ) స్త్రీని బాగా గమనిస్తూ ఉండండి. ఆమె తెల్లగా ఉండే, తిన్నని జుట్టుగల శిశువును కంటే అది ఆమె భర్త ద్వారా జన్మించినదే. ఒకవేళ నల్లని కన్నులు, వంకీలు తిరిగిన జుత్తుగల శిశువును గనక ఆమె ప్రసవిస్తే, ఎవరితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త నిందారోపణ చేస్తున్నాడో అది అతని సంతానంగానే పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Anas (RA): The Prophet (ﷺ) said: "Observe her, and if she gives birth to a child which is white complexioned with dark hair, her husband would be its father. But if she gives birth to a child with eyes looking as if they have antimony (Kuhl) in them and curled hair, the man whom her husband charged her with committing adultery is its father." [Agreed upon].
సారాంశం
భర్త భార్యను అనుమానించి తగు సాక్ష్యం సమర్పించలేనపుడు, భార్య కనబోయే బిడ్డ రూపురేఖలను బట్టి కూడా నిజానిజాలను నిర్ధారించవచ్చని ఈ హదీసు చెబుతోంది. (ఆధునిక కాలంలోనయితే రక్త పరీక్ష ద్వారా సులువుగా నిజ నిర్ధారణ జరిగిపోతోంది). మహాప్రవక్త ఆ స్త్రీ కేసు విషయంలో ఏ ఏ ఆనవాళ్ళను పరిగణనలోకి తీసుకున్నారో సరిగ్గా అలాంటి ఆనవాళ్ళు కలిగిన శిశువునే కన్నది. అంటే ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తి కళ్ళు చాలా నల్లగా ఉండేవి. జుత్తు వంకీలు తిరిగి ఉండేది. ఇలాంటి పోలికలుగల శిశువునే కన్న తరువాత ఆమె నీతిబాహ్యమైన చేష్టకు పాల్పడిన స్త్రీ అని తేలిపోయింది. (ముస్లిం)
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 938
హదీసు 939
وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -أَمَرَ رَجُلاً أَنْ يَضَعَ يَدَهُ عِنْدَ اَلْخَامِسَةِ عَلَى فِيهِ, وَقَالَ: "إِنَّهَا مُوجِبَةٌ" } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَرِجَالُهُ ثِقَات ٌ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఒక వ్యక్తికి ఈ విధంగా ఆజ్ఞాపించారు -“అతడు ఐదవసారి ప్రమాణం చేయబోతుండగా అతని నోటిపై చేయి అడ్డుపెట్టు.” ఆయన ﷺ ఇంకా ఇలా అన్నారు : “ఈ ఐదవ ప్రమాణం అతని వినాశానికి ప్రతీక.” (అబూదావూద్, నసాయి – దీని ఉల్లేఖకులు ఎన్నదగినవారు)
English
Narrated Ibn Abbas (RA): Allah's Messenger (ﷺ) ordered a man to put his hand on his mouth when he came to the fifth pronouncement and said, "It would be the deciding one." [Reported by Abu Dawud and an-Nasa'i. It's narrators are reliable].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 939
హదీసు 940
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ -فِي قِصَّةِ اَلْمُتَلَاعِنَيْنِ- قَالَ: { فَلَمَّا فَرَغَا مِنْ تَلَاعُنِهِمَا قَالَ: كَذَبْتُ عَلَيْهَا يَا رَسُولَ اَللَّهِ! إِنْ أَمْسَكْتُهَا, فَطَلَّقَهَا ثَلَاثًا قَبْلَ أَنْ يَأْمُرَهُ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -} مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ‘లియాన్’ (శాప ప్రమాణం) చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి: – వారిద్దరూ లియాన్ తతంగం ముగించిన తరువాత భర్త దైవప్రవక్త ﷺ నుద్దేశ్యించి, “ఓ దైవప్రవక్తా ﷺ! ఇంత జరిగిన తరువాత కూడా ఇప్పుడు నేనామెను కాపురానికి పిలుచుకుంటే, ఆమెపై అబద్ధపు నిందను మోపినట్లే లెక్క” అని అన్నాడు. ఆ తరువాత అతను దైవప్రవక్త ﷺ గారి ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండానే తన భార్యకు మూడు విడాకులు ఇచ్చేశాడు. (బుఖారీ, ముస్లిం)
English
Narrated Sahl bin Sa'd (RA) concerning the story of the two (husband and wife) who invoked curses regarding one another: When they finished invoking curses regarding one another the man said, "I shall have lied against her, O Allah's Messenger, if I keep her (as a wife)." He, then, pronounced her divorce three times, even before Allah's Messenger (ﷺ) commanded him to do so. [Agreed upon].
సారాంశం
‘లియాన్’ (శాప ప్రమాణం) అనేది శాశ్వత వేర్పాటుకు సంకేతం అన్న సంగతి తెలీకపోవటం చేత ఆ వ్యక్తి తన భార్యకు మూడు విడాకులు ఇచ్చి ఉంటాడు. కనుక అతడు ఇచ్చిన విడాకులు నిరర్థకం. ఎందుకంటే న్యాయాధికారి సమక్షంలో నిలబడి ఆ దంపతులు పరస్పరం శాపప్రమాణం చేసిన మీదట ఇక వారి మధ్య గల వివాహబంధం మిగిలి ఉండదు. ఆ దంపతులు ఆ క్షణం నుంచే ఒండొకరి కోసం హరామ్ (నిషిద్ధం) అయిపోతారు. కాకపోతే ఆ వ్యక్తి ఈ సందర్భంగా చేసిన విడాకుల ప్రకటన అతని ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని అభివ్యక్తం చేస్తోంది. ఈ అభివ్యక్తి ఒక రకంగా ప్రశంసనీయం కూడాను. దైవప్రవక్త ﷺ తన ఈ సహచరుని ధోరణిపై ఆగ్రహం చెందలేదన్న సంగతి కూడా గమనార్హమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 940
హదీసు 941
وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا { أَنَّ رَجُلاً جَاءَ إِلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَقَالَ: إِنَّ اِمْرَأَتِي لَا تَرُدُّ يَدَ لَامِسٍ. قَالَ: "غَرِّبْهَا". قَالَ: أَخَافُ أَنْ تَتْبَعَهَا نَفْسِي. قَالَ: "فَاسْتَمْتِعْ بِهَا". } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالْبَزَّارُ, وَرِجَالُهُ ثِقَاتٌ. وَأَخْرَجَهُ النَّسَائِيُّ مِنْ وَجْهٍ آخَرَ: عَنِ اِبْنِ عَبَّاسٍ بِلَفْظٍ { قَالَ: طَلِّقْهَا. قَالَ: لَا أَصْبِرُ عَنْهَا. قَالَ: "فَأَمْسِكْهَا }
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, “దైవప్రవక్తా ﷺ! నా భార్య ఎవరి చేతినీ విదిలించదు” అని చెప్పాడు. ఇది విని ఆయన ﷺ, “అయితే ఆమెను దూరం చేసుకో” అని సలహా ఇచ్చారు. దానికతను “కాని నా మనసు ఆమెను వెంటాడుతూనే ఉంటుందేమోనని నాకు భయంగా ఉంది” అని విన్నవించుకున్నాడు. “మరయితే ఆమె ద్వారా ప్రయోజనం పొందుతూ ఉండు” అని ఆయన ﷺ సూచించారు. (ఈ హదీసును అబూదావూద్, బజ్జార్ ఉల్లేఖించారు – దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు). ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఆధారంగా నసాయి దీనిని మరోవిధంగా సేకరించారు. దీని వాక్యాలు ఇలా ఉన్నాయి – “ఆమెకు విడాకులిచ్చెయి.” “నేనామెను విడిచి ఉండలేను” అని అతనన్నాడు. “అలా అయితే ఆమెతోనే కాపురం చెయ్యి” అని ఆయన ﷺ చెప్పారు.
English
Narrated Ibn 'Abbas (ﷺ): A man came to the Prophet (ﷺ) and said, "My wife rejects no hand of a man who wished to touch her." He said, "Banish her." He replied, "I am afraid my soul may desire her." He said, "Then enjoy her." [Reported by Abu Dawud and al-Bazzar, and its narrators are reliable].
an-Nasa'i reported it with through another chain, from Ibn 'Abbas (RA) with this wording: He said, "Divorce her." He replied "I can not endure the desire for her." He said, "Then keep her."
సారాంశం
“ఆమె ఎవరి చేతినీ విదిలించదు” అంటే ఇక్కడ భావం ఆమె చెడు నడత గల స్త్రీ అని కాదుగానీ, తనతో పరాచికాలాడే వారిని ఆమె నిర్ద్వంద్వంగా ఖండించదు అని భావం. తత్ఫలితంగా ఆమె పట్ల పరాయి వ్యక్తులలో దురుద్దేశ్యం జనించేందుకు ఆస్కారముంటుందని ఆమె భర్త తలపోశాడు. అందుకే ఆమె ధోరణి గురించి దైవప్రవక్త ﷺకు ఫిర్యాదు చేశాడు. ఆలుమగల అనురాగ జీవితంలో అనుమానాల బీజాలు నాటుకోవటం మంచిది కాదు. రాను రాను అవి ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయి. భార్యాభర్తలు ఒండొకరిని ఎంతగానో కోరుకుంటున్నప్పుడు షరీయత్ సూచించిన హద్దులను గౌరవిస్తూ ఎవరి పరిమితుల్లో వారుండటం మంచిది. ఒకవైపు భార్యను విడిచి ఉండలేనని అంటూనే, మరో వైపు ఆమె గురించి ఫిర్యాదులు చేస్తూ తిరగటం అర్థం లేని విషయం. అందుకే “ఆమెకు విడాకులిచ్చెయ్” అని దైవప్రవక్త ﷺ స్పష్టంగా చెప్పేశారు. భార్యను అంతగా కోరుకుంటున్నప్పుడు ఆమెలోని చిన్న చిన్న లోటుపాట్లను పెద్ద మనసుతో మన్నించాలి. ఆమె ‘ఉదార వైఖరి’వల్ల జనించే అనర్థాలేమిటో ఆమెకు విడమరచి చెప్పాలి. తద్వారా సంస్కరణ సాధ్యమవుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 941
హదీసు 942
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - { أَنَّهُ سَمِعَ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ -حِينَ نَزَلَتْ آيَةُ اَلْمُتَلَاعِنَيْنِ-: "أَيُّمَا اِمْرَأَةٍ أَدْخَلَتْ عَلَى قَوْمٍ مَنْ لَيْسَ مِنْهُمْ, فَلَيْسَتْ مِنْ اَللَّهِ فِي شَيْءٍ, وَلَنْ يُدْخِلَهَا اَللَّهُ جَنَّتَهُ, وَأَيُّمَا رَجُلٍ جَحَدَ وَلَدَهُ -وَهُوَ يَنْظُرُ إِلَيْهِ- اِحْتَجَبَ اَللَّهُ عَنْهُ, وَفَضَحَهُ عَلَى رُءُوسِ اَلْأَوَّلِينَ وَالْآخِرِينَ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ‘లియాన్’ (భార్యాభర్తలు పరస్పరం నిందారోపణ) చేసుకోవటం గురించి దైవసూక్తి అవతరించినపుడు వారందరూ దైవప్రవక్త ﷺ నోట విన్నారు. ఆయన ﷺ ఇలా అన్నారు : “ఏ స్త్రీ అయితే ఒక జాతిలో (వంశంలో) లేనటువంటి పిల్లవాణ్ణి తెచ్చిపెడుతుందో అటువంటి స్త్రీతో అల్లాహ్కు ఎట్టి సంబంధం లేదు. అటువంటి స్త్రీకి అల్లాహ్ సుతరామూ తన స్వర్గంలో స్థానం కల్పించడు. మరే పురుషుడైతే తనకు పుట్టిన బిడ్డను తన బిడ్డ కాదంటూ తిరస్కరిస్తాడో, అటువంటి వ్యక్తిని ప్రళయదినాన అల్లాహ్ దర్శనమివ్వడు. ఇంకా అతన్ని తన పూర్వపు, తరువాయి సృష్టితాలందరి సమక్షంలో పరాభవం పాల్జేస్తాడు.” (దీనిని అబూదావూద్, నసాయి, ఇబ్నె మాజా ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రమాణబద్ధమైనదిగా పేర్కొన్నారు)
English
Narrated Abu Hurairah (RA): He heard Allah's Messenger (ﷺ) say, when the Verse (24:6) about invoking curses came down, "Any woman who brings into a family one who does belong to it, is not an observer of Allah's (religion), and Allah will not admit her into His Paradise. Likewise, Allah will veil Himself from any man who disowns his child while he knows that is his child, and will humiliate him in the presence of the first and last (creatures)." [Abu Dawud, an-Nasa'i and Ibn Majah reported it; and Ibn Hibban graded it Sahih (authentic)].
సారాంశం
ఒక వంశంలో లేని పిల్లవాణ్ణి తెచ్చి పెట్టడమంటే భర్తను మోసగించటం అని అర్థం. భార్య చేసిన పాపం భర్తకు తెలియదు. ఆ పిల్లవాణ్ణి చూచి, అది ‘తన రక్తం’అని ఆమె భర్త విశ్వసిస్తూ ఉంటాడు. కాని అతని భార్య మాత్రం విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఒక వ్యక్తికి భార్యగా ఉంటూనే మరో మగాడితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. తన కడుపులో పెరుగుతున్న ఆ నలుసు ఎవరి పాప ఫలమో స్వయంగా ఆమెకూ తెలుసు. కాని తనను నికాహ్ చేసుకున్న వ్యక్తికి మాత్రం తెలీదు. ఇలాంటి వంచనా శిల్ప నిష్ణాతుల బండారం ఇహలోకంలో ఒకవేళ బయల్పడకపోయినా ప్రళయదినాన తప్పక బట్టబయలు కానుంది. అటువంటి స్త్రీలు స్వర్గలోక సువాసనను ఆస్వాదించలేరని ఈ హదీసు చెబుతోంది.
అలాగే తన వీర్యాన్ని స్త్రీ గర్భ సంచిలోకి ప్రవేశపెట్టి, కనబోయే బిడ్డ కోసం ఎదురు చూచి, తీరా ఆమె బిడ్డను కన్న తర్వాత, ఆ బిడ్డ తనది కాదని బొంకే మగ మారాజులకు కూడా ఈ హదీసులో తీవ్రమయిన హెచ్చరిక ఉంది. దేవుడు ఇలాంటి కపటాగ్రేసరుల లోగుట్టును రట్టు చేసి మానవులందరి సమక్షంలో నవ్వుల పాల్జేస్తాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 942
హదీసు 943
وَعَنْ عُمَرَ - رضى الله عنه - قَالَ: { مَنْ أَقَرَّ بِوَلَدِهِ طَرْفَةَ عَيْنٍ, فَلَيْسَ لَهُ أَنْ يَنْفِيَهُ }. أَخْرَجَهُ اَلْبَيْهَقِيُّ, وَهُوَ حَسَنٌ مَوْقُوف ٌ.
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: “ఎవరయినా సరే, ఒక్క క్షణం కోసం ఆ శిశువు తనదేనని ప్రకటించిన మీదట ఇక ఎన్నటికీ దాన్ని తృణీకరించలేడు.” (బైహఖీ దీనిని ఉల్లేఖించారు. ఈ ఉల్లేఖనం ప్రామాణికమైనది మరియు మౌఖూఫ్ కోవకు చెందినది.)
English
Narrated 'Umar (RA): If anyone acknowledges that he is the father of his child just for the blinking of an eye, he has no right to disown it." [al-Baihaqi reported it. The Hadith is Hasan (good) and Mawquf (saying of a Companion)].
సారాంశం
జీవితాలతో చెలగాటమాడే అధికారం ఎవరికీ లేదనీ, ఒక శిశువును అది తన శిశువు అని అంగీకరించిన మీదట జీవితాంతం ఆ మాటకు కట్టుబడి ఉండవలసి వుంటుందనీ ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం సిహ్ఫమ్ బిన్ ఖతాదా అనే సహచరుడు కొన్ని ఆనవాళ్ళ ఆధారంగా ఒక శిశువును తిరస్కరించే ప్రయత్నం చేయగా, దైవప్రవక్త ﷺ అతని ప్రతిపాదనను అంగీకరించలేదు. వచ్చే హదీసులో దీని వివరాలున్నాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 943
హదీసు 944
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - { أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُولَ اَللَّهِ! إِنَّ اِمْرَأَتِي وَلَدَتْ غُلَامًا أَسْوَدَ? قَالَ: "هَلْ لَكَ مِنْ إِبِلٍ?" قَالَ: نَعَمْ. قَالَ: "فَمَا أَلْوَانُهَا?" قَالَ: حُمْرٌ. قَالَ: "هَلْ فِيهَا مَنْ أَوْرَقَ?", قَالَ: نَعَمْ. قَالَ: "فَأَنَّى ذَلِكَ?", قَالَ: لَعَلَّهُ نَزَعَهُ عِرْقٌ. قَالَ: "فَلَعَلَّ اِبْنَكَ هَذَا نَزَعَهُ عِرْقٌ". } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: { وَهُوَ يُعَرِّضُ أَنْ يَنْفِيَهُ } , وَقَالَ فِي آخِرِهِ: { وَلَمْ يُرَخِّصْ لَهُ فِي اَلِانْتِفَاءِ مِنْهُ }.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! మా ఆవిడకు నల్లని పిల్లవాడు పుట్టాడు (మరి నేనేమో ఎర్రగా వున్నాను. ఇది ఎలా సంభవం?)” అని సందేహం వెలిబుచ్చాడు. దైవప్రవక్త ﷺ అతని సందేహానికి సమాధానమిస్తూ “నీ దగ్గర ఒంటెలున్నాయా?” అని అడిగారు. “ఉన్నాయి” అన్నాడతను. “అవి ఏ ఏ రంగుల్లో ఉన్నాయి?” అని దైవప్రవక్త ﷺతిరిగి ప్రశ్నించారు. “ఎరుపు రంగులో ఉన్నాయి?” అని అతడు సమాధానమిచ్చాడు. “వాటిలో ఏదైనా బూడిద రంగు ఒంటె కూడా ఉందా?” అని ఆయన ﷺ మళ్ళీ ప్రశ్నించగా, “అవును ఉంది” అని అతను బదులిచ్చాడు. “ఆ రంగు మరి ఎక్కణ్ణించి వచ్చింది?” అని దైవప్రవక్త ﷺ అడగ్గా, “బహుశా వాటి తాత ముత్తాతలలో ఎవరి పోలికయినా వచ్చి ఉంటుంది” అని ఆ వ్యక్తి అన్నాడు. “అదేవిధంగా నీ కొడుక్కి కూడా నీ వంశస్థుల్లోని ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది” అని ఆయన ﷺ అతనికి సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం) ముస్లింలోని ఒక ఉల్లేఖనం ప్రకారం – అతడు ఈ పిల్లవాడు తన పిల్లవాడు కాదని చెప్పదలిచాడు. అయితే ఈ ఉల్లేఖనం చివర్లో ఆయన ﷺ అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ, అందుకు ఆమోదం తెలుపలేదు.
English
Narrated Abu Hurairah (RA): A man said, "O Allah's Messenger, my wife has given birth to a black son." He asked, "Have you any camels?" He replied, "Yes." He asked, "What is their color?" He replied, "They are red." He asked, "Is there a dusky (dark) one among them?" He replied, "Yes." He asked, "How has that come about?" He replied, "It is perhaps a strain to which it has reverted (i.e. heredity)." He said, "It is perhaps a strain to which this son of yours has reverted." [Agreed upon].
Muslim concluded the Hadith as follows: "He did not permit him to disown him"
సారాంశం
ఈ హదీసులో – తన సహచరునిలో రేకెత్తిన ఒక తీవ్రమైన సందేహానికి దైవప్రవక్త ﷺ బహు చక్కగా సమాధానమిచ్చి, అతని అనుమానాన్ని దూరం చేశారు. తానుగానీ, తన భార్యగానీ నల్లవారు కానపుడు, మరి ఈ పిల్లవాడు నల్లగా ఎందుకున్నాడు? అన్నది ఆ సహచరునిలో కలిగిన సందేహం. ఈ సందేహాన్ని వెలిబుచ్చిన సహచరుణ్ణి దైవప్రవక్త ﷺ గట్టిగా మందలించడంగానీ, అతని భార్యను పిలిపించి సంజాయిషీ అడగటం గానీ చేయలేదు. దీనికి బదులు ఆయన ﷺ అరబ్బుల ఆలోచనా స్థాయికి దిగివచ్చి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో సమాధానపర్చాలని భావించారు. ఈ ప్రయత్నంలో ఆయన ﷺ సఫలీకృతులయ్యారు కూడా. ప్రశ్నించేవాని ఆలోచనా స్థాయినీ, అతని వృత్తినీ దృష్టిలో పెట్టుకుని అతనికి తొందరగా అర్థమయ్యే దృష్టాంతాల ఆధారంగా సమాధానం ఇవ్వాలనీ, అనవసరంగా తాత్విక చర్చల్లోకి పోరాదనీ కూడా ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఏదేని ఒక విషయంలో మనిషి తీవ్రమయిన సందిగ్ధానికి లోనైనపుడు విజ్ఞులను, వివేచనాపరులను సంప్రతించాలనీ, తద్వారా వారు సతమతమయ్యే సంక్లిష్ట పరిస్థితులనుంచి తేలిగ్గా బయటపడవచ్చునని బోధపడుతున్నది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.10 లియాన్ (శాప ప్రమాణం)|హదీసు 944
You must be logged in to post a comment.