హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 8వ అధ్యాయం: తలాఖ్. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 915 – 927) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
8.7 తలాఖ్
باب الطلاق
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 915
عَنِ اِبْنِ عُمَرَ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَبْغَضُ اَلْحَلَالِ إِلَى اَللَّهِ اَلطَّلَاقُ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَابْنُ مَاجَهْ , وَصَحَّحَهُ اَلْحَاكِمُ , وَرَجَّحَ أَبُو حَاتِمٍ إِرْسَالَهُ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : ధర్మసమ్మతమైన విషయాలలో కెల్లా అల్లాహ్కు అత్యంత అయిష్టకరమైనది తలాఖ్ (విడాకులు).” (ఈ హదీసును అబూ దావూద్, ఇబ్నె మాజా ఉల్లేఖించారు – హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. అబూ హాతిమ్ మాత్రం దీన్ని ‘ముర్సల్’ అని నొక్కి చెప్పారు)
English
Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "The lawful thing which Allah hates most is divorce." [Reported by Abu Dawud and Ibn Majah, al-Hakim graded it Sahih (authentic), while Abu Hatim held the stronger view is that it is Mursal (missing link after the Tabi'i)].
సారాంశం
ధర్మ సమ్మతమైన విషయాలలోనూ అన్నింటినీ అల్లాహ్ ఇష్టపడడనీ, కొన్ని విషయాలను అసహ్యించుకుంటాడనీ ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. ఈ విధంగా అల్లాహ్కు ఇష్టంలేని హలాల్ విషయాలలో ‘తలాఖ్’ కూడా ఒకటి. తలాఖ్ అధర్మమయిన విషయం కానప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే దాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే దాని మూలంగా కాపురాలు కూలిపోతాయి, కుటుంబ వ్యవస్థ కుంటుపడుతుంది. పిల్లల పెంపకంపై తీవ్ర ప్రభావం పడుతుంది. షైతాన్ ఇష్టపడేది కూడా ఇలాంటి వాటినే. అందుకే వీలైనంతవరకు వ్యవహారం విడాకుల దాకా రాకుండా జాగ్రత్తపడాలి. పరిస్థితుల స్వరూపాన్ని బట్టి దీనికి సంబంధించిన అనేక పద్ధతులున్నాయి. వాటి వివరాలను వివిధ హదీసు, ఫికహ్ గ్రంథాలలో చూడవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 915
హదీసు 916
وَعَنِ اِبْنِ عُمَرَ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا { أَنَّهُ طَلَّقَ اِمْرَأَتَهُ - وَهِيَ حَائِضٌ - فِي عَهْدِ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -فَسَأَلَ عُمَرُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -عَنْ ذَلِكَ ? فَقَالَ : " مُرْهُ فَلْيُرَاجِعْهَا , ثُمَّ لْيُمْسِكْهَا حَتَّى تَطْهُرَ , ثُمَّ تَحِيضَ , ثُمَّ تَطْهُرَ , ثُمَّ إِنْ شَاءَ أَمْسَكَ بَعْدُ , وَإِنْ شَاءَ طَلَّقَ قَبْلَ أَنْ يَمَسَّ , فَتِلْكَ اَلْعِدَّةُ اَلَّتِي أَمَرَ اَللَّهُ أَنْ تُطَلَّقَ لَهَا اَلنِّسَاءُ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ : { مُرْهُ فَلْيُرَاجِعْهَا, ثُمَّ لْيُطَلِّقْهَا طَاهِرًا أَوْ حَامِلًا }. وَفِي رِوَايَةٍ أُخْرَى لِلْبُخَارِيِّ : { وَحُسِبَتْ عَلَيْهِ تَطْلِيقَةً }. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ : قَالَ اِبْنُ عُمَرَ : { أَمَّا أَنْتَ طَلَّقْتَهَا وَاحِدَةً أَوْ اِثْنَتَيْنِ ; فَإِنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -أَمَرَنِي أَنْ أُرَاجِعَهَا , ثُمَّ أُمْسِكَهَا حَتَّى تَحِيضَ حَيْضَةً أُخْرَى , ثُمَّ أُمْهِلَهَا حَتَّى تَطْهُرَ , ثُمَّ أُطَلِّقَهَا قَبْلَ أَنْ أَمَسَّهَا , وَأَمَّا أَنْتَ طَلَّقْتَهَا ثَلَاثًا , فَقَدْ عَصَيْتَ رَبَّكَ فِيمَا أَمَرَكَ بِهِ مِنْ طَلَاقِ اِمْرَأَتِكَ }. وَفِي رِوَايَةٍ أُخْرَى : قَالَ عَبْدُ اَللَّهِ بْنُ عُمَرَ : { فَرَدَّهَا عَلَيَّ , وَلَمْ يَرَهَا شَيْئًا , وَقَالَ : " إِذَا طَهُرَتْ فَلْيُطَلِّقْ أَوْ لِيُمْسِكْ }.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ కాలంలో ఈయన (ఇబ్నె ఉమర్) తన భార్యకు బహిష్టు స్థితిలో విడాకులిచ్చారు. ఆయన తండ్రి అయిన ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విషయాన్ని దైవప్రవక్త ﷺ దృష్టికి తీసుకురాగా ఆయన ﷺ ఇలా అన్నారు : “విడాకుల్ని ఉపసంహరించుకోమని అతనికి చెప్పండి. ఇంకా, ఆమె పరిశుద్ధం అయ్యే వరకు ఆమెను తన దగ్గరే ఆపి ఉంచాలి. మళ్ళీ ఆమె బహిష్టు అయి, తిరిగి పరిశుద్ధమయిన తరువాత అతను కావాలనుకుంటే ఆమెను ఆపి ఉంచుకోవచ్చు. లేదా విడాకులివ్వవచ్చు. అయితే అప్పటి వరకూ అతనామెతో సమాగమం జరపకూడదు. ఇదే విడాకుల గడువు. దీని ప్రకారమే స్త్రీలకు విడాకులివ్వాలని దేవుడు ఆజ్ఞాపించాడు.” (బుఖారీ, ముస్లిం)
‘ముస్లిం’లోని ఉల్లేఖనంలో ఉంది – “తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని అతనికి చెప్పండి. ఆ తరువాత ఆమె పరిశుద్ధస్థితిలో ఉన్నప్పుడు లేదా గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే అతను ఆమెకు విడాకులు ఇవ్వాలి.”
“ఇది ఒక విడియాకుగా మాత్రమే లెక్కించబడుతుంది” అని బుఖారీలోని వేరొక కథనంలో ఉంది.
ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు : ఒకవేళ నీవు నీ భార్యకు ఒకటి లేదా రెండు విడాకులిచ్చి ఉంటే; ఈ వ్యవహారంలో దైవప్రవక్త ﷺ నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే- ఈ విడాకుల నిర్ణయాన్ని నేను ఉపసంహరించుకోవాలి. మలిసారి బహిష్టు అయ్యేవరకూ ఆమెను నా దగ్గరే ఆపి ఉంచాలి. ఆ తరువాత ఆమె పరిశుద్ధురాలయ్యే వరకూ అవకాశం ఇవ్వాలి. అప్పుడామెను తాకకముందే విడాకులివ్వాలి. ఒకవేళ నువ్వు ఆమెకు మూడుసార్లు విడాకులిచ్చేస్తే, నువ్వు నీ భార్యకు విడాకులిచ్చే విషయంలో దేవుని అవిధేయతకు ఒడిగట్టావు.”
వేరొక ఉల్లేఖనంలో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: దైవప్రవక్త ﷺ ఆమెను నా వద్దకు తిప్పి పంపారు. (నేనిచ్చిన) ఆ విడాకును గురించి ఏమీ అనలేదు. స్త్రీ పరిశుద్ధురాలైన పిదప నీవు (ఇబ్నె ఉమర్ – రదియల్లాహు అన్హుమా) ఆమెకు విడాకులైనా ఇవ్వవచ్చు లేదా ఆపుకున్నా ఆపుకోవచ్చు అని సెలవిచ్చారు.
English
Narrated Ibn 'Umar (RA): In the time of Allah's Messenger (ﷺ), he divorced his wife while she was menstruating, so 'Umar asked Allah's Messenger (ﷺ) about that and he replied, "Command him to take her back and keep her till she is purified (from menses), has another period, and is then purified. If he then wishes he may keep her and if he wishes he may divorce her before having intercourse with her. That is the 'Iddah (period of waiting) which Allah commanded for the divorce of women." [Agreed upon].
A narration by Muslim has: "Command him to take her back, then divorce her when she is pure from the menstrual discharge, or pregnant."
Another narration by al-Bukhari has: "It was regarded as one divorce."
A narration of Muslim has: "Ibn 'Umar (RA) said: 'If you had only made one or two pronouncements of divorce [it would have been better]. Indeed Allah's Messenger (ﷺ) commanded me to take her back, then keep her till she has another period, then give her a reprieve till she is purified, then divorce her before having intercourse with her. As for you, you have divorced her with three pronouncements (at once), and have therefore disobeyed your Rabb (your Lord, the Creator) concerning what He commanded you regarding divorcing your wife.'"
Another narration [of Muslim] has: "Abdullah bin 'Umar (RA) said: 'So he returned her to me and did not regarded it as anything, and said: When she is purified, either divorce her or keep her.'"
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 916
హదీసు 917
وَعَنِ اِبْنِ عَبَّاسٍ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : { كَانَ اَلطَّلَاقُ عَلَى عَهْدِ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -وَأَبِي بَكْرٍ , وَسَنَتَيْنِ مِنْ خِلَافَةِ عُمَرَ , طَلَاقُ اَلثَّلَاثِ وَاحِدَةٌ , فَقَالَ عُمَرُ : إِنَّ اَلنَّاسَ قَدْ اِسْتَعْجَلُوا فِي أَمْرٍ كَانَتْ لَهُمْ فِيهِ أَنَاةٌ , فَلَوْ أَمْضَيْنَاهُ عَلَيْهِمْ ? فَأَمْضَاهُ عَلَيْهِمْ }. رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ కాలంలోనూ, అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలోనూ, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలోని తొలి రెండేళ్ళ కాలంలోనూ – ఏక కాలంలో ఇవ్వబడిన మూడు విడాకులు ఒక్క విడాకుగా మాత్రమే పరిగణించబడేది. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా ప్రకటించారు – “ప్రజలు తమకు ఇవ్వబడిన సౌలభ్యాన్ని వినియోగించుకోవటంలో వేగిరపడ్డారు. కాబట్టి మనం ఇప్పుడు దీనినే (మూడు విడాకులనే) వీళ్ళపై విధించాలి.” అంతే. ఆయన (ఉమర్ – రదియల్లాహు అన్హు) తన నిర్ణయాన్ని వారిపై విధించారు. (ముస్లిం)
English
Narrated Ibn 'Abbas (RA): In the time of Allah's Messenger (ﷺ), Abu Bakr (RA) and the first two years of the caliphate of 'Umar (RA), the three pronouncements of divorce were regarded as one divorce. So 'Umar said, "People have made haste in an affair which they are required to take slowly. What if we execute it on them." So, he executed it on them. [Reported by Muslim].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 917
హదీసు 918
وَعَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ قَالَ : { أُخْبِرَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -عَنْ رَجُلٍ طَلَّقَ اِمْرَأَتَهُ ثَلَاثَ تَطْلِيقَاتٍ جَمِيعًا , فَقَامَ غَضْبَانَ ثُمَّ قَالَ : " أَيُلْعَبُ بِكِتَابِ اَللَّهِ تَعَالَى , وَأَنَا بَيْنَ أَظْهُرِكُمْ". حَتَّى قَامَ رَجُلٌ , فَقَالَ : يَا رَسُولَ اَللَّهِ ! أَلَا أَقْتُلُهُ ? } رَوَاهُ النَّسَائِيُّ وَرُوَاتُهُ مُوَثَّقُونَ.
హజ్రత్ మహ్మూద్ బిన్ లబీద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి తన భార్యకు ఏకకాలంలో మూడుసార్లు విడాకులిచ్చాడని దైవప్రవక్త ﷺకు తెలియజేయగా, ఆయన ﷺ ఆగ్రహోదగ్రులై లేచి నిలబడ్డారు. ఆయన ﷺ ఆ సందర్భంగా ఇలా అన్నారు – “ఏమిటీ? నేను మీ మధ్య ఉండగానే దైవ గ్రంథంతో చెలగాటమాడుతున్నారా?!” అప్పుడు వెంటనే ఒక వ్యక్తి లేచి నిలబడి, “దైవప్రవక్తా ﷺ! నేనా వ్యక్తిని హతమార్చనా?!” అని విన్నవించుకున్నాడు. (నసాయి – దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు)
English
Narrated Mahmud bin Labid (RA): WHen Allah's Messenger (ﷺ) was informed about a man who had divorced his wife with all three pronouncements (without any interval between them), he stood up in anger and said, 'Is Allah's Book being played with while I am among you?" As a result a man got up and said, "O Allah's Messenger, shall I kill him?" [Reported by an-Nasa'i; its narrators are reliable (thiqah)].
సారాంశం
ఏక కాలంలో మూడుసార్లు విడాకులివ్వటం అధర్మమని ఈ హదీసును బట్టి విదితమవుతున్నది. ఇటువంటి విడాకులను ఉపసంహరించుకోవచ్చా? లేదా అన్న విషయం ఇందులో లేదు. దైవప్రవక్త ﷺ ఈ మేరకు అనుమతి ఇచ్చిన ప్రస్తావన కూడా లేదు. అందుచేత విడాకులకు సంబంధించి వివిధ అభిమతాలకు అనుకూలంగా ఈ హదీసు ద్వారా సమర్థన లభించదు.
హదీసు ఉల్లేఖకులు
మహ్మూద్ బిన్ లబీద్ (రదియల్లాహు అన్హు) : మహ్మూద్ బిన్ లబీద్ బిన్ అబూ రాఫె అన్సారీ అష్హలీ. దైవప్రవక్త ﷺ కాలంలో జన్మించారు. ఈయన కూడా సహాబీయేనని ఇమామ్ బుఖారీ అంటున్నారు. ఈయన సహాబీ అవునా కాదా అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమని అబూ హాతిమ్ అభిప్రాయపడ్డారు. ఇమామ్ ముస్లిం మాత్రం ఈయన్ని తాబయీల జాబితాలో చేర్చారు. మొత్తానికి ఈయన గొప్ప విద్వాంసులలో ఒకరు. హిజ్రీ 96లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 918
హదీసు 919
وَعَنِ اِبْنِ عَبَّاسٍ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : { طَلَّقَ أَبُو رُكَانَةَ أُمَّ رُكَانَةَ. فَقَالَ لَهُ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" رَاجِعِ امْرَأَتَكَ " , فَقَالَ : إِنِّي طَلَّقْتُهَا ثَلَاثًا. قَالَ : " قَدْ عَلِمْتُ , رَاجِعْهَا } رَوَاهُ أَبُو دَاوُدَ. وَفِي لَفْظٍ لِأَحْمَدَ : { طَلَّقَ أَبُو رُكَانَةَ اِمْرَأَتَهُ فِي مَجْلِسٍ وَاحِدٍ ثَلَاثًا , فَحَزِنَ عَلَيْهَا , فَقَالَ لَهُ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" فَإِنَّهَا وَاحِدَةٌ } وَفِي سَنَدِهَا اِبْنُ إِسْحَاقَ , وَفِيهِ مَقَالٌ. وَقَدْ رَوَى أَبُو دَاوُدَ مِنْ وَجْهٍ آخَرَ أَحْسَنَ مِنْهُ : { أَنَّ أَبَا رُكَانَةَ طَلَّقَ اِمْرَأَتَهُ سُهَيْمَةَ اَلْبَتَّةَ , فَقَالَ : "وَاَللَّهِ مَا أَرَدْتُ بِهَا إِلَّا وَاحِدَةً, فَرَدَّهَا إِلَيْهِ اَلنَّبِيُّ -صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ } -.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: అబూ రుకానా తన భార్యకు విడాకులిచ్చారు. “ఉమ్మె రుకానా (రదియల్లాహు అన్హా)ను ఇచ్చిన విడాకును ఉపసంహరించుకో” అని దైవప్రవక్త ﷺ ఆయనకు ఆజ్ఞాపించారు. “నేనామెకు మూడు విడాకులు ఇచ్చేశాను కదా!” అని అబూ రుకానా సందేహపడగా “ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు ఉపసంహరించుకో” అని దైవప్రవక్త ﷺ చెప్పారు. (అబూదావూద్)
ముస్నద్ అహ్మద్లోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది – అబూరుకానా (రదియల్లాహు అన్హు) ఒకేసారి మూడు విడాకులిచ్చేశారు. ఆ తరువాత తన చర్యపై ఆందోళన చెందారు. అప్పుడు దైవప్రవక్త ﷺ అబూరుకానా నుద్దేశించి, “ఆ మూడు విడాకులు ఒక విడాకుగానే పరిగణించబడుతుంది” అని అన్నారు. (ఈ రెండు ఉల్లేఖనాలలోనూ ఇబ్నె ఇస్హాఖ్ ఉన్నారు. ఆయన గురించి చర్చకు తావు ఏర్పడింది)
అబూ దావూద్ వేరొక సౌజన్యంతో చేసిన ఉల్లేఖనం ఇంతకన్నా మెరుగ్గా ఉంది. దీని ప్రకారం : అబూ రుకానా (రదియల్లాహు అన్హు) తన భార్య సుహైమాకు తిరుగులేని విధంగా విడాకులిచ్చేశారు. ఆ తర్వాత ఆయన, ‘దైవసాక్షి! నేను ఒకే తలాఖ్ సంకల్పంతో ఇలా చేశాను’ అని అభిప్రాయపడగా, దైవప్రవక్త ﷺ ఉమ్మె రుకానా (రదియల్లాహు అన్హా)ను ఆయన వద్దకు వాపసు పంపించారు.
English
Narrated Ibn 'Abbas (RA): Abu Rukana divorced Umm Rukana. So Allah's Messenger (ﷺ) told him, "Take your wife back." And he replied, "I have divorced her with three pronouncements." He said, "I have understood, take her back." [Reported by Abu Dawud].
A wording by Ahmad has: Abu Rukana divorced his wife with three pronouncements, in one sitting. Then, he was grieved about her and Allah's Messenger (ﷺ) told him, "They (the three pronouncements) are reckoned as a single (utterance of divorce)." [The two Ahadith have Ibn Ishaq, in their chains of narrators, and his reliability has been questioned].
Abu Dawud has reported (a Hadith) better than the aforesaid one through another chain, it has: "Abu Rukana divorced his wife Suhaimah irrevocably and said, 'I swear by Allah that I meant it to be only a single utterance of divorce,' so the Prophet (ﷺ) returned her to him."
హదీసు ఉల్లేఖకులు
1. అబూ రుకానా (రదియల్లాహు అన్హు) : అబూ రుకానా బిన్ అబ్దె యజీద్ బిన్ హాషిమ్ బిన్ ముత్తలిబ్ బిన్ అబ్దె మునాఫ్. మక్కా విజయయాత్రలో పాల్గొన్నారు. ఈయన దైవప్రవక్త ﷺ తో కుస్తీ పట్టారనీ, ఈ కుస్తీ పోటీయే ఈయన ఇస్లాం స్వీకారానికి కారణమయిందని చెబుతారు. అనంతరం మదీనాకు ప్రస్థానం చేశారు. అమీర్ ముఆవియా (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ ఆరంభ కాలంలో మరణించారు. హిజ్రీ 41లో చనిపోయారని ఇంకొక వాదన. ఈయన సతీమణి పేరు సుహైమ.
2. ముహమ్మద్ బిన్ ఇస్హాఖ్ : మారుపేరు అబూ ఉబైదుల్లా. పూర్తిపేరు ముహమ్మద్ బిన్ ఇస్హాఖ్ బిన్ యసార్ ముత్తలబీ. ఖైస్ బిన్ మఖ్జుమ మదనీగారి బానిస. జిహాద్, సైరు (షికారు) విషయంలో అందరికన్నా ముందుండేవారు. హిజ్రీ 51లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 919
హదీసు 920
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ ثَلَاثٌ جِدُّهنَّ جِدٌّ , وَهَزْلُهُنَّ جِدٌّ : اَلنِّكَاحُ , وَالطَّلَاقُ , وَالرَّجْعَةُ } رَوَاهُ اَلْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيَّ , وَصَحَّحَهُ اَلْحَاكِمُ. وَفِي رِوَايَةٍ لِابْنِ عَدِيٍّ مِنْ وَجْهٍ آخَرَ ضَعِيفٍ : { اَلطَّلَاقُ , وَالْعِتَاقُ , وَالنِّكَاحُ }. وَلِلْحَارِثِ اِبْنِ أَبِي أُسَامَةَ : مِنْ حَدِيثِ عُبَادَةَ بْنِ اَلصَّامِتِ رَفَعَهُ : { لَا يَجُوزُ اَللَّعِبُ فِي ثَلَاثٍ : اَلطَّلَاقُ , وَالنِّكَاحُ , وَالْعِتَاقُ , فَمَنْ قَالَهُنَّ فَقَدَ وَجَبْنَ } وَسَنَدُهُ ضَعِيفٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మూడు విషయాలున్నాయి – వాటిని సంకల్పించుకుంటే చాలు సంకల్పం ఖరారైనట్లే. వేళాకోళానికి చెప్పినా అది సంకల్పంగానే పరిగణించబడుతుంది. అవేమంటే – “వివాహం, విడాకులు, ఉపసంహారం.” (దీనిని ‘నలుగురి’లో నసాయి మినహా అందరూ ఉల్లేఖించారు – హాకిమ్ దీనిని ప్రామాణికమైందిగా ఖరారు చేశారు)
ఇబ్నె అదీ గారి వేరొక ‘జయీఫ్’ ఉల్లేఖనంలో ఉంది – “విడాకులు, స్వేచ్ఛ, వివాహం.”
ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు)చే ‘మర్ఫూ’గా చెప్పబడిన హారిస్ బిన్ అబూ ఉసామా ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది : “మూడు విషయాలలో ఎగతాళి ధర్మసమ్మతం కాదు – అవి: విడాకులు, వివాహం మరియు స్వేచ్ఛ. ఎవరయినా ఈ విషయంలో ఆషామాషీగా నోటితో చెప్పినా అది అనివార్యమైపోతుంది.” (దీని ఆధారం బలహీనమైనది)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "There are three things which, whether undertaken seriously or in jest, are treated as serious: marriage, divorce and taking back a wife after a divorce which is not final." [Reported by al-Arba'a except an-Nasa'i. al-Hakim graded it Sahih (authentic)].
In a narration of Ibn 'Adi, through another chain of narrators, which is Da'if (weak); it has: "Divorce, emancipation and marriage."
al-Harith bin Abu Usamah reported from the Hadith of 'Ubadah bin as-Samit [RA) – tracing it to the Prophet (ﷺ): "It is not permissible to play in three things: divorce, marriage and emancipation. Therefore, whoever pronounce (either of) them, they certainly become binding." [Its chain of narrators is Da'if (weak)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 920
హదీసు 921
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ : { إِنَّ اَللَّهَ تَجَاوَزَ عَنْ أُمَّتِي مَا حَدَّثَتْ بِهِ أَنْفُسَهَا , مَا لَمْ تَعْمَلْ أَوْ تَكَلَّمْ } مُتَّفَقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారు : “నా అనుచర సమాజ సభ్యుల ఆంతర్యంలో జనించే దుష్ప్రేరణల విషయంలో అల్లాహ్ సడలింపుల వైఖరిని అవలంబించాడు.- (అంతర్యంలో జనించిన విషయాన్ని) చేయనంతవరకూ, నోటితో చెప్పనంత వరకూ (అది చేసినట్లుగా పరిగణించబడదు).” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "Allah, the Most High, has forgiven my followers what they contemplate on within themselves (i.e. evil thoughts) as long as they do not act upon or speak about them." [Agreed upon].
సారాంశం
మనసులో జనించే భావాలు, ఆలోచనలు, ప్రేరణల గురించి నిలదీయడం జరగదని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఉదాహరణకు : ఒక వ్యక్తి అంతర్యంలో తన భార్యకు విడాకులివ్వాలన్న ఆలోచన పుట్టింది. లేదా ఫలానా స్త్రీని వివాహమాడాలన్న కోరిక కలిగింది. అంతమాత్రానికే అతను ఆ పని చేసేసినట్టు అర్థం కాదు. అలాగే ఎవరినయినా తలాక్ కొరకు వేధించి, కొట్టి బలవంతంగా అతని నోటితో ‘తలాక్’ అని చెప్పిస్తే అది తలాక్ అనిపించుకోదు. అయితే అది ‘తలాకె ముక్రూహ్’ (బలవంతపు విడాకులు) అనీ, అటువంటి తలాక్ అయిపోయినట్లేనని హనఫీలు భావిస్తున్నారు. కాగా; హనఫీల భావన ఈ హదీసుకు వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా ఎవరయినా ఒక స్త్రీని బలవంతంగా నికాహ్ కొరకు ఒప్పిస్తే అటువంటి నికాహ్ నికాహ్యే కాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 921
హదీసు 922
وَعَنِ اِبْنِ عَبَّاسٍ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- , عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ : { إِنَّ اَللَّهَ تَعَالَى وَضَعَ عَنْ أُمَّتِي اَلْخَطَأَ , وَالنِّسْيَانَ , وَمَا اسْتُكْرِهُوا عَلَيْهِ } رَوَاهُ اِبْنُ مَاجَهْ , وَالْحَاكِمُ , وَقَالَ أَبُو حَاتِمٍ : لَا يَثْبُتُ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “అల్లాహ్ నా అనుచర వర్గీయుల పొరబాట్లను, మరపును, బలాత్కారానికి గురవటం వల్ల జరిగిపోయిన తప్పును మన్నిస్తాడు.” (ఇబ్నెమాజా దీనిని ఉల్లేఖించారు. ఈ హదీసు సుస్పష్టమైనది కాదని అబూ హాతిమ్ వ్యాఖ్యానించారు)
English
Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ)) said: "Allah, the Most High, has overlooked my follower's mistakes and forgetfulness, and what they are forced to do against their will." [Reported by Ibn Majah and al-Hakim. Abu Hatim said that it is not an established (authentic) Hadith].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 922
హదీసు 923
وَعَنِ اِبْنِ عَبَّاسٍ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : { إِذَا حَرَّمَ اِمْرَأَتَهُ لَيْسَ بِشَيْءٍ }. وَقَالَ : ﴿ لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اَللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ ﴾ رَوَاهُ اَلْبُخَارِيُّ. وَلِمُسْلِمٍ : { إِذَا حَرَّمَ اَلرَّجُلُ عَلَيْهِ اِمْرَأَتَهُ , فَهُوَ يَمِينٌ يُكَفِّرُهَا }.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఎవరయినా తన భార్య తన కొరకు ధర్మసమ్మతం కాదు అని అంటే అసలది లెక్కలోనికి తీసుకోదగ్గ విషయమే కాదు. ఆయన (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు – “నిశ్చయంగా మీ కొరకు దైవప్రవక్త ﷺ జీవితం అత్యుత్తమమైన ఉదాహరణ.”
‘ముస్లిం’లో ఇలా వుంది : ఏ పురుషుడు అయినాసరే తన భార్య తన కొరకు ఇక మీదట హరామ్ (నిషిద్ధం) అని ఖరారు చేసుకుంటే అదొక ‘ప్రమాణం’ గా పరిగణించబడుతుంది. దానికి అతను పరిహారం చెల్లించవలసి ఉంటుంది.”
English
Narrated Ibn 'Abbas (RA): "If anyone makes his wife unlawful for himself – it is nothing." He said, "Indeed you have a good example in Allah's Messenger." [Reported by al-Bukhari].
Muslim has: "When a man makes his wife unlawful for himself, it is (treated like) an oath for which atonement must be made (if broken)."
సారాంశం
ఎవరయినా కోపావేశంలో తన భార్యనుద్దేశ్యించి, ‘ఇక మీదట నువ్వు నా కోసం నిషిద్ధం (హరామ్) అయిపోయావు పో’ అని చెప్పినంతమాత్రాన అది ‘తలాఖె రజయీ’ గానీ, ‘బాయిన్’గానీ, ‘జహర్’గానీ అయిపోయినట్టు లెక్కకాదు. అదొక ఆవేశపూరితమయిన ‘ఒట్టు’. దానికి పరిహారం ఇవ్వవలసి ఉంటుంది. ముస్లింలోని హదీసు సారాంశం ఇదే. బుఖారీలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) చే ఉల్లేఖించబడిన హదీసు కూడా పరిహారం (కఫ్ఫార) చెల్లించాలనే అంటోంది. ఈ అంశంపై పలువురు విద్వాంసుల మొత్తం 13 వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే ‘పరిహారం చెల్లించాలి’ అన్న పలుకే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) గారు మాత్రం దీనికి పరిహారం అక్కరలేదనీ, ఇదొక ‘వ్యర్థమయిన మాట’గా పరిగణించబడుతుందని అభిప్రాయపడ్డారు. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దీనిని ప్రమాణం (ప్రతిజ్ఞ)గా ఖరారు చేస్తున్నారు. ప్రమాణానికి విరుగుడు పరిహారాన్ని చెల్లించడమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 923
హదీసు 924
وَعَنْ عَائِشَةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- { أَنَّ اِبْنَةَ اَلْجَوْنِ لَمَّا أُدْخِلَتْ عَلَى رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -وَدَنَا مِنْهَا. قَالَتْ : أَعُوذُ بِاَللَّهِ مِنْكَ , فَقَالَ : " لَقَدْ عُذْتِ بِعَظِيمٍ , اِلْحَقِي بِأَهْلِكِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : జౌన్ కుమార్తెను నికాహ్ అనంతరం దైవప్రవక్త ﷺ గదిలోకి పంపినపుడు ఆయన ﷺ ఆమెను సమీపించబోయారు. అప్పుడామె “నేను మీ బారి నుండి అల్లాహ్ శరణు వేడుతున్నాను” అని చెప్పింది. అంతే. “నీవు సర్వోన్నతుడైన దేవుని శరణు కోరావు. ఇక నీవు నీ పుట్టింటికి వెళ్ళొచ్చు” అని ఆయన ﷺ అన్నారు. (బుఖారీ)
English
Narrated 'Aishah (RA): When the daughter of al-Jaun was admitted into the presence of Allah's Messenger (ﷺ) and he went near her, she said, "I seek refuge in Allah from you." He replied, "You have sought refuge in the Supreme [One Who is worthy of refuge being taken in], return to your family." [Reported by al-Bukhari].
సారాంశం
సంకేతప్రాయమైన తలాఖ్ (లేక పరోక్ష తలాఖ్) కూడా ఒకటుంటుందని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. ఒక తలాఖ్ మాత్రం స్పష్టమయింది. విడాకులిచ్చే వ్యక్తి నోటితో స్పష్టంగా నీకు విడాకులిస్తున్నానంటాడు. విడాకులిచ్చేవాని సంకల్పం ఇక్కడ ఎలా ఉన్నా అతడు నోటితో స్పష్టంగా చెప్పినందువల్ల ఆ తలాఖ్ అయిపోతుంది.
ఇక సంకేతప్రాయమైన తలాఖ్ (తలాఖె కినాయా) అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి చెప్పిన మాటలను విడాకులుగా భావించడానికి ఆస్కారముంటుంది, విడాకులు కాదని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకు : ‘ఇక నీవు స్వతంత్రురాలివి పో’ ‘నీ పుట్టింటికి పో’ ‘ఇక నీ దారి నీది, నా దారి నాది’ లాంటి మాటల్ని భర్త చెబితే అట్టి పరిస్థితిలో అతని సంకల్పం మీద ఆ విషయం ఆధారపడి ఉంటుంది. విడాకులిచ్చే ఉద్దేశ్యంతోనే చూచాయగా అతను ఆ మాటలు అని ఉంటే విడాకులు ఇచ్చేసినట్లే. కేవలం హెచ్చరించే ఉద్దేశ్యంతో అలా అని ఉంటే అప్పుడది విడాకులుగా పరిగణించబడదు. ఈ విషయంలో అందరి మధ్యా ఏకాభిప్రాయముంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 924
హదీసు 925
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا طَلَاقَ إِلَّا بَعْدَ نِكَاحٍ , وَلَا عِتْقَ إِلَّا بَعْدَ مِلْكٍ } رَوَاهُ أَبُو يَعْلَى , وَصَحَّحَهُ اَلْحَاكِمُ , وَهُوَ مَعْلُولٌ. وَأَخْرَجَ اِبْنُ مَاجَهْ : عَنِ اَلْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ مِثْلَهُ , وَإِسْنَادُهُ حَسَنٌ , لَكِنَّهُ مَعْلُولٌ أَيْضًا.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “నికాహ్ చేసుకుంటేనే గానీ ఎవరయినా తలాఖ్ ఇవ్వలేరు. అలాగే ఒకరిపై యాజమాన్యం పొందనంతవరకూ వారికి (బానిసత్వం నుండి) స్వేచ్ఛ నొసగలేరు.” (దీనిని అబూ యాలా ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ‘ప్రమాణబద్ధం’గా పేర్కొన్నారు. నిజానికి ఇందులో ప్రామాణికత లోపించింది. ఇబ్నెమాజా గారు హజ్రత్ మిస్వర్ బిన్ మఖ్రమ ఆధారంగా సంగ్రహించిన ఇలాంటిదే మరొక హదీసు కూడా పరంపర రీత్యా బాగానే ఉంది గాని అందులోనూ లోపం ఉంది)
English
Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said: "There is no divorce except after marriage, and no freeing (of a slave) till one has possession (of one)." [Reported by Abu Ya'la and al-Hakim graded it Sahih (authentic), but it is Ma'lul (containing a hidden defective).
Ibn Majah reported a similar narration, on the authority of al-Miswar bin Makhramah, and its chain of narrators is (or appears to be) Hasan (good), but it is also Ma'lul (hidden defect)].
సారాంశం
ఈ హదీసు ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒక స్త్రీని వివాహమాడనిదే విడాకులు ఇవ్వలేడు. అలాగే ఎవరినయినా బానిసగా పొందిన మీదటే అతనికి బానిస బంధనాల నుండి విముక్తిని ఇవ్వగలడు. అంటే ఒక వస్తువును వదులుకోవటం అనేది ముందుగా అతడు దాన్ని పొందిన మీదటే సాధ్యం అవుతుంది. వేరొకరి సొత్తుపై అతనికి ఇలాంటి నిర్ణయాధికారం ఉండదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 925
హదీసు 926
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ , عَنْ أَبِيهِ , عَنْ جَدِّهِ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا نَذْرَ لِابْنِ آدَمَ فِيمَا لَا يَمْلِكُ , وَلَا عِتْقِ لَهُ فِيمَا لَا يَمْلِكُ , وَلَا طَلَاقَ لَهُ فِيمَا لَا يَمْلِكُ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ, وَنُقِلَ عَنْ اَلْبُخَارِيِّ أَنَّهُ أَصَحُّ مَا وَرَدَ فِيهِ.
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి ఆధారంగా, ఆయన తన తాత గారి ఆధారంగా చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – తన స్వాధీనంలో లేని వస్తువుపై ఆదం పుత్రుడు చేసుకున్న మొక్కుకు ఎలాంటి విలువా లేదు. అలాగే తన యాజమాన్యంలో లేని బానిసకు స్వేచ్ఛ నొసగటంగానీ, తన అధీనంలో లేని స్త్రీకి విడాకులివ్వటంగానీ చెల్లనేరదు. (దీనిని అబూదావూద్, తిర్మిజీ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రామాణికంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేర్కొనబడినదంతా అత్యంత ప్రామాణికమైనదన్న బుఖారీ వ్యాఖ్యానాన్ని కూడా ఆయన నకలు చేశారు)
English
Narrated 'Amr bin Shu'aib on his father's authority from his grandfather: Allah's Messenger (ﷺ) said: "No descendant of Adam may make a vow concerning something he does not possess, or set free (a slave) that he does not possess, or divorce (a woman) whom he does not possess (in marriage)." [Abu Dawud and at-Tirmidhi reported it; the latter graded it Sahih (authentic), and transmitted from al-Bukhari his statement that it is the most authentic Hadith on this subject].
సారాంశం
తనకు చెందని వస్తువుపై యాజమాన్య హక్కును చాటడంలో, నిర్ణయాధికారాన్ని చెలాయించడంలో అర్థం పర్థం లేదని ఈ హదీసు చెబుతోంది. ఎవరయినా ఇలాంటి నిర్ణయాధికారాన్ని ప్రకటిస్తే అది చెల్లనేరదని కూడా స్పష్టంగా చెప్పబడింది. అపరిచిత స్త్రీని ఉద్దేశ్యించి ఎవరయినా విడాకులిస్తే అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఉదాహరణకు: ఎవరైనా ఒక వివాహిత లేక అవివాహిత స్త్రీని ఉద్దేశ్యించి “నీవు విడాకులు పొందిన దానివి (లేక విడాకులు ఇవ్వబడినదానివి)” అని చెప్పి, కొంత కాలానికి అతనామెను వివాహమాడదలిస్తే, ‘ఆ స్త్రీ విడాకులు పొందిన స్త్రీ కాజాలదు’ అని పండితులు తేల్చి చెప్పారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 926
హదీసు 927
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا, عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { رُفِعَ اَلْقَلَمُ عَنْ ثَلَاثَةٍ: عَنِ اَلنَّائِمِ حَتَّى يَسْتَيْقِظَ, وَعَنِ اَلصَّغِيرِ حَتَّى يَكْبُرَ, وَعَنِ اَلْمَجْنُونِ حَتَّى يَعْقِلَ, أَوْ يَفِيقَ } رَوَاهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةُ إِلَّا اَلتِّرْمِذِيَّ وَصَحَّحَهُ اَلْحَاكِمُ..
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలియజేశారు : ముగ్గురు వ్యక్తుల చర్యలు రికార్డుల్లోకి ఎక్కకుండా కలాన్ని ఆపి ఉంచటం జరుగుతుంది – నిద్రించిన వ్యక్తి మేల్కొనంత వరకూ, పసివాడు ప్రాజ్ఞతకు చేరుకోనంతవరకూ, మతి స్థిమితం లేనివాడు మానసిక స్థిమితాన్ని పొందనంతవరకూ. (అహ్మద్ మరియు ‘నలుగురి’లో తిర్మిజీ తప్ప మిగిలిన అందరూ – అంటే అబూదావూద్, ఇబ్నెమాజా, నసాయి – ఉల్లేఖించారు. ఈ హదీసును హాకిమ్ ప్రమాణబద్ధమైనదిగా పేర్కొన్నారు)
English
Narrated 'Aishah (RA): The Prophet (ﷺ) said: "There are three people whose actions are not recorded, a sleeping person till he awakes, a child till he is a grown up, and an insane person till he is restored to reason or recovers his sense." [Reported by Ahmad and al-Arba'a, except at-Tirmidhi. al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
ఈ హదీసు ఇక్కడ పొందుపరచబడటంలోని ప్రధాన ఉద్దేశ్యం నిద్రావస్థలో ఉన్న వ్యక్తిగానీ, ప్రాజ్ఞ వయస్సుకు చేరని వ్యక్తిగానీ, మతి స్థిమితం లేని వ్యక్తిగానీ ఇచ్చిన విడాకులు లెక్కలోకి రావు అని చెప్పటమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.7 తలాఖ్|హదీసు 927
You must be logged in to post a comment.