హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 7వ అధ్యాయం: ఖులా. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 914) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
8.6 ఖులా
باب الخلع
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 914
عَنْ اِبْنِ عَبَّاسٍ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- { أَنَّ اِمْرَأَةَ ثَابِتِ بْنِ قَيْسٍ أَتَتْ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -فَقَالَتْ : يَا رَسُولَ اَللَّهِ ! ثَابِتُ بْنُ قَيْسٍ مَا أَعِيبُ عَلَيْهِ فِي خُلُقٍ وَلَا دِينٍ , وَلَكِنِّي أَكْرَهُ اَلْكُفْرَ فِي اَلْإِسْلَامِ , فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" أَتَرُدِّينَ عَلَيْهِ حَدِيقَتَهُ ? " , فَقَالَتْ : نَعَمْ. فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" اِقْبَلِ اَلْحَدِيقَةَ , وَطَلِّقْهَا تَطْلِيقَةً } رَوَاهُ اَلْبُخَارِيُّ. وَفِي رِوَايَةٍ لَهُ : { وَأَمَرَهُ بِطَلَاقِهَا }. وَلِأَبِي دَاوُدَ , وَاَلتِّرْمِذِيِّ وَحَسَّنَهُ : { أَنَّ اِمْرَأَةَ ثَابِتِ بْنِ قَيْسٍ اِخْتَلَعَتْ مِنْهُ , فَجَعَلَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -عِدَّتَهَا حَيْضَةً }. وَفِي رِوَايَةِ عَمْرِوِ بْنِ شُعَيْبٍ , عَنْ أَبِيهِ , عَنْ جَدِّهِ عِنْدَ اِبْنِ مَاجَهْ : { أَنَّ ثَابِتَ بْنَ قَيْسٍ كَانَ دَمِيمً ا وَأَنَّ اِمْرَأَتَهُ قَالَتْ : لَوْلَا مَخَافَةُ اَللَّهِ إِذَا دَخَلَ عَلَيَّ لَبَصَقْتُ فِي وَجْهِهِ }. وَلِأَحْمَدَ : مِنْ حَدِيثِ سَهْلِ بْنِ أَبِي حَثْمَةَ : { وَكَانَ ذَلِكَ أَوَّلَ خُلْعٍ فِي اَلْإِسْلَامِ }.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) సతీమణి దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! నేను సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) గుణగణాల గురించి, ధర్మావలంబన గురించి ఎలాంటి ఫిర్యాదూ చేయలేను. అయితే ఇస్లాంలో తిరస్కార వైఖరి (కుఫ్ర్) కి ఒడిగట్టడం నాకేమాత్రం ఇష్టంలేదు” అని విన్నవించుకుంది. “నీవు అతని తోటను అతనికి తిరిగి ఇవ్వగలవా?” అని ఆయన ﷺ ప్రశ్నించారు. “ఇవ్వగలను” అని ఆమె సమాధానమిచ్చింది. అప్పుడు దైవప్రవక్త ﷺ, “(ఓ సాబిత్!) నీ తోటను నువ్వు తీసేసుకుని ఆమెకు విడాకులిచ్చెయి” అని సూచించారు. (బుఖారీ)
అబూదావూద్, తిర్మిజీలలో ఉంది – సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) భార్య మహర్‌గా పొందిన ఆస్తిని వాపసు చేసింది (ఖులా కోరింది). దైవప్రవక్త ﷺ ఆమె కోసం ఒక రుతువును ‘ఇద్దత్’ (గడువు కాలం)గా ఖరారు చేశారు. (ఈ హదీసును తిర్మిజీ హసన్‌గా ఖరారు చేశారు)
ఇబ్నెమాజాలో అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి ఆధారంగా తన తాత గారి కథనాన్ని ఇలా వివరించారు – సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అందవికారుడు, నల్లనివాడు. ఆయన భార్య ఆయన అందవికారాన్ని గురించి, “నాకేగనక దైవభయం లేనట్లయితే, ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆయన మొహంపై ఉమ్మేసేదాన్ని” అని చెప్పింది.
ముస్నద్ అహ్మద్‌లో సహ్ల్ బిన్ అబూ హస్మా ఉల్లేఖనం ప్రకారం, ఇస్లాంలో ఇది భార్యాభర్తల వేర్పాటుకు సంబంధించిన మొట్టమొదటి సంఘటన (ఖులా).
English
Narrated Ibn 'Abbas (RA): The wife of Thabit bin Qais came to the Prophet (ﷺ) and said, "O Allah's Messenger, I do not find fault with Thabit bin Qais (RA) in respect of character or religion, but I dislike (and fear) that I might commit an act of Kufr fil-Islam (that which is contradictory to Islamic behavior)." Allah's Messenger (ﷺ) asked her, "Will you give him back his garden?" And she replied, "Yes," so Allah's Messenger (ﷺ) said to him, "Accept the garden and divorce her, with one pronouncement (of divorce)." [Reported by al-Bukhari].
Another narration by him has: "He commanded him to divorce her."
Abu Dawud and at-Tirmidhi reported this Hadith and the later graded it Hasan (good): "The wife of Thabit bin Qais got a divorce from him in return for a compensation (paid by her), and the Prophet (ﷺ) made her 'Iddah (period of waiting before re-marrying) one menstruation course."
Ibn Majah reported the narration of 'Amr bin Shu'aib, on this father's authority, from his grandfather: "Thabit bin Qais was very unattractive and his wife said, 'Were it not for the fear of Allah, when he entered my presence I would spit in his face.'"
Ahmad reported from Sahl bin Abu Hathma's Hadith that it was the first ever husband and wife separation for compensation in Islam.
సారాంశం
“ఇస్లాంలో తిరస్కార వైఖరి (కుఫ్ర్)కి ఒడిగట్టడం నాకేమాత్రం ఇష్టంలేదు” అని ఆమె చెప్పడంలోని అంతర్యం ఏమిటంటే భర్తపట్ల గల అయిష్టత మూలంగా నేను ఆయన యెడల ఎడమొహం పెడ మొహంగా ఉంటున్నాను. ఇది అవిధేయతకు తార్కాణం. భర్త పట్ల అవిధేయురాలై ఉండటం అంటే దేవుని ఆగ్రహానికి గురవటమే. నేను గనక ఆయనతో ఈ రకంగా కాపురం చేస్తూ ఉంటే అనుదినం ఇస్లాంకు వ్యతిరేకమయిన విధానానికి పాల్పడినదాన్నవుతాను. కాబట్టి నన్ను ఈ వివాహ బంధం నుంచి విముక్తి నొసగండి అని ఆమె చెప్పదలచింది. దైవప్రవక్త ﷺ ఆమె మాటల్లోని అంతర్యాన్ని తక్షణం పసిగట్టి, ‘నీ భర్త నీకు మహర్‌గా ఇచ్చిన తోటను మరి ఆయనకు తిరిగి ఇచ్చేస్తావా?’ అని ప్రశ్నించారు. దానికామె మనస్ఫూర్తిగా అంగీకరించింది.
వివిధ ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమంటే సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) సతీమణి ధర్మపరాయణురాలు. ధర్మావలంబనలో ఆమె ఖచ్చితంగా వ్యవహరిస్తూ, దైవాగ్రహానికి భయపడుతూ ఉండేది. ఈ సుగుణాలన్నింటితోపాటు ఆమె చాలా అందగత్తె. కాగా; సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) పొట్టిగా, నల్లగా ఉండేవారు. పైగా కఠిన స్వభావులు. అప్పుడప్పుడూ భార్యను కొట్టేవారు కూడా. ఇలా అనేక కారణాలన్నీ కలసి కాపురంలో కలతలు రేగాయి. ఆలుమగల మధ్య దూరాలు పెరగసాగాయి. ఈ వైముఖ్య ధోరణి తన ధార్మిక జీవితానికి, తన పరలోక సాఫల్యానికి ఎక్కడ హానికరంగా పరిణమిస్తుందోనన్న భయం సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) సతీమణిని పీడించసాగింది. అందుకే ఆమె దైవప్రవక్త ﷺ సలహా కోరింది. అంతటి ఉద్రిక్త పరిస్థితిలోనూ ఆమె తన భర్తపై ఎలాంటి ఆరోపణలు చేయకపోగా, ఆయనగారి గుణగణాలను, ధర్మావలంబనను కొనియాడటం ఆమెలోని నిజాయితీ తత్పరతకు ప్రబల నిదర్శనం.
తగు కారణమున్నప్పుడు భర్త తనకు మహర్‌గా ఇచ్చిన సొమ్మును వాపసుచేసి భార్య విడాకులు (ఖులా) పొందగలదని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ఇమాములలో ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్)ల దృష్టిలో ఖులా కూడా విడాకుల వంటిదే. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) దృష్టిలో ఇది నికాహ్ను రద్దుపరచటంగా పరిగణించబడుతుంది. ‘ఖులా’ కోరిన భార్య మహర్ సొమ్మును తిరిగి ఇచ్చివేసే విషయమై ఇమాముల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. స్త్రీ తన భర్తపట్ల అయిష్టతను వ్యక్తపరచిన పక్షంలో ఆమె నుండి భర్త మహర్కన్నా ఎక్కువ పరిహారాన్ని డిమాండు చేయవచ్చునని ఇమామ్ షాఫయి, ఇమామ్ మాలిక్‌లు అంటున్నారు. మెజారిటీ విద్వాంసులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. అయితే ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్హాఖ్ (రహిమహుల్లాహ్) తదితరులు ఎక్కువ పరిహారం తీసుకోవటం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.
హదీసు ఉల్లేఖకులు
సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) : అన్సారీ. ఖజ్రజ్ తెగకు చెందినవారు. అగ్రశ్రేణి ప్రవక్త సహచరులలో ఒకరుగా భావించబడతారు. పలు వ్యవహారాలలో అన్సార్ల తరఫున, ప్రవక్త ﷺ తరఫున అధికార ప్రతినిధిగా ఉండేవారు. ఉహుద్ యుద్ధంలోనూ, ఆ తరువాత జరిగిన యుద్ధాలన్నింటిలోనూ పాల్గొన్నారు. దైవప్రవక్త ﷺ ఈయనకు స్వర్గలోక శుభవార్త ఇచ్చారు. హిజ్రీ 12లో యమామ పోరాటంలో అమరగతి నొందారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.6 ఖులా|హదీసు 914
You must be logged in to post a comment.