హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 11వ అధ్యాయం: ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం. ఈ అధ్యాయంలో 19 హదీసులు (హదీసు 945 – 963) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం
باب العدة والإحداد والاستبراء وغير ذلك
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 945
عَنْ اَلْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ - رضى الله عنه - { أَنَّ سُبَيْعَةَ الْأَسْلَمِيَّةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- نُفِسَتْ بَعْدَ وَفَاةِ زَوْجِهَا بِلَيَالٍ, فَجَاءَتْ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -فَاسْتَأْذَنَتْهُ أَنْ تَنْكِحَ, فَأَذِنَ لَهَا, فَنَكَحَتْ. } رَوَاهُ اَلْبُخَارِيُّ وَأَصْلُهُ فِي " اَلصَّحِيحَيْنِ ". وَفِي لَفْظٍ: { أَنَّهَا وَضَعَتْ بَعْدَ وَفَاةِ زَوْجِهَا بِأَرْبَعِينَ لَيْلَةً }. وَفِي لَفْظٍ لِمُسْلِمٍ, قَالَ اَلزُّهْرِيُّ: { وَلَا أَرَى بَأْسًا أَنْ تَزَوَّجَ وَهِيَ فِي دَمِهَا, غَيْرَ أَنَّهُ لَا يَقْرَبُهَا زَوْجُهَا حتَّى تَطْهُرَ }.
హజ్రత్ మిస్వర్ బిన్ మఖ్రమ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం సుబైయ అస్లమియా (రదియల్లాహు అన్హా) గారు తన భర్త మరణించిన కొన్ని రోజులకు ప్రసవించారు. తరువాత ఆమెగారు దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, పునర్వివాహం కొరకు అనుమతి కోరారు. దైవప్రవక్త ﷺ అందుకు అనుమతి ఇవ్వగా ఆమె వివాహం చేసుకున్నారు. (దీనిని బుఖారీ ఉల్లేఖించారు. దీని మూలం బుఖారీ, ముస్లింలలో కూడా ఉంది). వేరొక ఉల్లేఖనంలో, ఆమె తన భర్త మరణించిన నలభై రోజులకు ప్రసవించిందని ఉంది.
‘ముస్లిం’ ఉల్లేఖనంలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి : “పురిటి రక్తస్రావ స్థితిలో నికాహ్ చేసుకున్నా తప్పులేదని నేను భావిస్తున్నాను” అని జుహ్‌రీ అన్నారు. అయితే ఆమె ఆ స్థితి నుంచి బయటపడి స్నానంచేసి పరిశుద్ధురాలైన తర్వాత మాత్రమే ఆమె భర్త ఆమె వద్దకు పోగలడు.”
English
Narrated al-Miswar bin Makhramah (RA): Some nights after her husband's death, Subai'ah al-Aslamiyah (RA) gave birth to a child. Then she went to the Prophet (ﷺ) and asked permission to marry. He gave her permission and she married. [Reported by al-Bukhari].
Its basic meaning is found in the two Sahih books of al-Bukhari and Muslim.
A wording has: "She gave birth to a child after forty nights of her husband's death."
A wording by Muslim has: az-Zuhri said, "I think there is no harm if she marries when she is still bleeding (due to child-birth), but her husband should not go near her till she is purified."
సారాంశం
భర్త చనిపోయిన స్త్రీ గర్భవతి అయివుంటే ఆమె ఇద్దత్ (గడువు) ఆమె ప్రసవంతోనే ముగుస్తుందని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ఈ హదీసులో ప్రస్తావనకు వచ్చిన హజ్రత్ సుబైయ (రదియల్లాహు అన్హా) సుప్రసిద్ధ సహాబియా ఈమె మొదటి భర్త సాద్ ఇబ్నె ఖౌలా (రదియల్లాహు అన్హు) అంతిమ హజ్ యాత్ర జరిగిన కొన్నాళ్ళకు మక్కాలో మరణించారు. భర్త చనిపోయిన నలభై లేక యాభై రోజులకు సుబైయ (రదియల్లాహు అన్హా) బిడ్డను ప్రసవించారు. గర్భవతిగా ఉన్న స్త్రీ భర్త గనక చనిపోతే, ఆమె ప్రసవించగానే ఇద్దత్ (గడువు) సమాప్తమవుతుందని, ఆ నాటికి నాలుగు మాసాల పది రోజుల వ్యవధి పూర్తయినా కాకపోయినా దీనితో సంబంధం లేదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది.
హదీసు ఉల్లేఖకులు
1. సుబైయ (రదియల్లాహు అన్హా) : సుబైయ బిన్తె హారిస్ అస్లమియా. అస్లం తెగతో సంబంధం ఉన్న కారణంగా అస్లమియా అనబడ్డారు. సుప్రసిద్ధ మహిళా సహచరులలో ఒకరు. ఇబ్నె సాద్ ప్రకారం ఈమె హిజ్రత్ చేసి ఉన్నారు. తొలుత ఈమె సాద్ బిన్ ఖౌలా సతీమణిగా ఉన్నారు. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ఆయన చనిపోగా ఈమె తన జాతికి చెందిన ఒక నవ యువకుణ్ణి వివాహమాడింది. అతని పేరు అబూ సనాబీల్.
2. జుహ్‌రీ : ముహమ్మద్ బిన్ ముస్లిం బిన్ ఉబైదుల్లాహ్ బిన్ షిహాబుద్దీన్ ఖురషీ జుహ్‌రీ. గొప్ప విద్వాంసులు. హిజాజ్ – సిరియా ప్రాంతాలు రెండింటికీ మార్గదర్శక పండితులుగా వర్ధిల్లారు. నాల్గో తరానికి చెందిన అగ్రశ్రేణి ఉలమాలలో ఒకరుగా పరిగణించబడేవారు. ఆయన పాండితీ ప్రకర్షపై, నిర్ద్వంద్వ స్వభావంపై ఎవరికీ కించిత్ సందేహం కూడా లేదు. తాను ఇబ్నె షిహాబ్ వంటి సమగ్ర వ్యక్తిత్వం గల విద్వాంసుని చూడలేదని లైస్ వ్యాఖ్యానించారు. ఇబ్నె షిహాబ్ గొప్ప దాతృగుణం గలవారనీ, మనుషుల్లో ఆయన లాంటివారు బహు అరుదుగా ఉంటారనీ ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. హిజ్రీ 124లో ఈయన మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 945
హదీసు 946
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { أُمِرَتْ بَرِيرَةُ أَنْ تَعْتَدَّ بِثَلَاثِ حِيَضٍ }. رَوَاهُ اِبْنُ مَاجَهْ, وَرُوَاتُهُ ثِقَاتٌ, لَكِنَّهُ مَعْلُولٌ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “మూడు రుతువులు (బహిష్టులు) అయ్యేవరకూ ఇద్దత్ (గడువు)లో ఉండాలని బరీరా (రదియల్లాహు అన్హా) కు ఆజ్ఞాపించబడింది.” (దీనిని ఇబ్నెమాజా ఉల్లేఖించారు. దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు. కాని ఉల్లేఖనంలో లోపం ఉంది)
English
Narrated 'Aishah (RA): Barirah was ordered to wait till three menstrual periods of hers have passed (before she could remarry). [Reported by Ibn Majah. Its narrators are reliable, but it is Ma'lul (having a hidden defect)].
సారాంశం
ఈ హదీసులో హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హా) ప్రస్తావన వచ్చింది. ఈమె భర్తపేరు ముగీస్. హజ్రత్ బరీరాకు బానిసత్వం నుండి స్వేచ్ఛ లభించిందిగానీ భర్త మాత్రం ఇంకా బానిస బంధనాలలోనే చిక్కుకుని ఉన్నాడు. స్వేచ్ఛ నొసగబడిన బరీరా తన నిర్ణయాధికారాన్ని వినియోగించుకుంటూ తన బానిస భర్తతో గల నికాహ్ (వైవాహిక) బంధాన్ని రద్దుపరచింది. ఆ తర్వాత ఆమె మూడు బహిష్టు కాలాలు గడిచే దాకా ‘ఇద్దత్’లో ఉండవలసి వచ్చింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 946
హదీసు 947
وَعَنْ اَلشَّعْبِيِّ, عَنْ فَاطِمَةَ بِنْتِ قَيْسٍ, { عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم --فِي اَلْمُطَلَّقَةِ ثَلَاثًا-: "لَيْسَ لَهَا سُكْنَى وَلَا نَفَقَةٌ" } رَوَاهُ مُسْلِمٌ.
ఫాతిమా బిన్తె ఖైస్ (రదియల్లాహు అన్హా) ఆధారంగా షాబీ చేసిన కథనం ప్రకారం మూడు విడాకులు పొందిన మహిళ గురించి దైవప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: “ఆమె కొరకు వసతి సౌలభ్యంగానీ, మనోవర్తిగానీ లేదు.” (ముస్లిం)
English
Narrated ash-Sha'bi from Fatimah (RA) daughter of Qais on the authority of the Prophet (ﷺ) regarding a woman who was divorced by three pronouncements: "She has no right to accommodation or maintenance." [Reported by Muslim].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 947
హదీసు 948
وَعَنْ أُمِّ عَطِيَّةَ; أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { لَا تَحِدَّ اِمْرَأَةٌ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلَاثٍ إِلَّا عَلَى زَوْجٍ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا, وَلَا تَلْبَسْ ثَوْبًا مَصْبُوغًا, إِلَّا ثَوْبَ عَصْبٍ, وَلَا تَكْتَحِلْ, وَلَا تَمَسَّ طِيبًا, إِلَّا إِذَا طَهُرَتْ نُبْذَةً مِنْ قُسْطٍ أَوْ أَظْفَارٍ. } مُتَّفَقٌ عَلَيْهِ, وَهَذَا لَفْظُ مُسْلِمٍ وَلِأَبِي دَاوُدَ, وَالنَّسَائِيِّ مِنْ اَلزِّيَادَةِ: { وَلَا تَخْتَضِبْ } وَلِلنَّسَائِيِّ: "وَلَا تَمْتَشِطْ"
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఉమ్మె అతియ (రదియల్లాహు అన్హా) తెలిపారు – భర్త మరణించిన స్త్రీ తప్ప మరే స్త్రీ కూడా ఒకరి మరణంపై మూడు రోజులకన్నా ఎక్కువ శోకాన్ని పాటించకూడదు. భర్త చనిపోయిన స్త్రీ మాత్రం నాలుగు మాసాల పదిరోజులు సంతాపం పాటించవలసి ఉంటుంది. ఈ సంతాపకాలం (ఇద్దత్)లో ఆమె అద్దకపు వస్త్రాలు మినహా రంగు రంగుల బట్టలు తొడుక్కోవటంగానీ, కాటుక పెట్టుకోవటంగానీ, సువాసన పూసుకోవటంగానీ చేయకూడదు. అయితే బహిష్టు కాలం ముగిసి స్నానం చేసినప్పుడు మాత్రం కొంత సాంబ్రాణినీ, ‘అజ్వార్’ లాంటి సుగంధాన్ని ఉపయోగించవచ్చు.” (బుఖారీ, ముస్లిం – ఈ వాక్యాలు ముస్లింలోనివి). గోరింటాకు, శిరోజాలకు పూసుకునే రంగు ఉపయోగించరాదని అబూదావూద్, నసాయిలలో ఉంది. నసాయిలో, దువ్వెన కూడా ఉపయోగించరాదని ఉంది.
English
Narrated Umm 'Atiyah (RA): Allah's Messenger (ﷺ) said: "A woman must not observe her mourning for more than three nights for the one who has died, except for the four months and ten days in the case of her husband; and she must not wear a dyed garment except one of the type made of 'Ash (dyed yarn) or apply Kuhl (antimony), or apply perfume, except for a little Qust or Azfar, when she has been purified after her menstruation." [Agreed upon. The wording being of Muslim].
Abu Dawud and an-Nasa'i have an addition: "nor be dyed (with Henna and the like)."
an-Nasa'i added: "nor comb (her hair)."
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 948
హదీసు 949
وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { جَعَلْتُ عَلَى عَيْنِي صَبْرًا, بَعْدَ أَنْ تُوُفِّيَ أَبُو سَلَمَةَ, فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -"إِنَّهُ يَشِبُ اَلْوَجْهَ, فَلَا تَجْعَلِيهِ إِلَّا بِاللَّيْلِ, وَانْزِعِيهِ بِالنَّهَارِ, وَلَا تَمْتَشِطِي بِالطِّيبِ, وَلَا بِالْحِنَّاءِ, فَإِنَّهُ خِضَابٌ". قُلْتُ: بِأَيِّ شَيْءٍ أَمْتَشِطُ? قَالَ: "بِالسِّدْرِ". } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَإِسْنَادُهُ حَسَنٌ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : అబూ సలమా చనిపోయిన తర్వాత నేను నా కళ్ళ క్రింది భాగాన ‘సబిరా’ అనే మూలికల లేపనాన్ని పూసుకున్నాను. అది చూచి దైవప్రవక్త ﷺ, ‘సబిరా’ మొహం పైని మొటిమలను మాయంచేసి, ముఖ వర్చస్సును పెంచుతుంది. కనుక ఈ లేపాన్ని నువ్వు రాత్రిపూట మాత్రం పట్టించు. పగటిపూట వద్దు. సువాసనతో కూడిన తైలంతో, గోరింటాకు తైలంతో తైల సంస్కారం చేసుకోకు. గోరింటాకు కూడా ఒకలాంటి రంగే” అని అన్నారు. “మరి నేను తల దువ్వుకునేదెలా?” అని నేను విన్నవించుకోగా, “రేగు ఆకులను నీళ్ళలో నానబెట్టి వాటిని ఉపయోగించవచ్చు” అని ఆయన సూచించారు. (అబూదావూద్, నసాయి దీనిని ఉల్లేఖించారు. ఈ హదీసు పరంపర స్పష్టంగా ఉంది)
English
Narrated Umm Salamah (RA): I put Sabir (a type of medicine) on my eyes after Abu Salamah (RA) had died. So Allah's Messenger (ﷺ) said: "It gives the face a glow, so apply it only at night and remove it in the day time, and do not comb (your hair) with scent or henna, for it is a dye." I asked, "What should I use when combing (my hair)?" He replied, "You should use lote-tree leaves." [Reported by Abu Dawud and an-Nasa'i: its chain of narrators is Hasan (good)].
సారాంశం
భర్త చనిపోయిన స్త్రీలు ఇద్దత్ (శోకకాలం, సంతాప కాలం)లో సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా ఉండాలనీ, అలంకరణలకు, ఆడంబరాలకూ దూరంగా ఉండాలనీ ఈ హదీసు సారాంశం. ఇద్దత్ (నాలుగు నెలల పదిరోజులు) ముగిసిన తర్వాత అలంకరణకు సంబంధించిన ఆంక్షలు వారిపై ఉండవు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 949
హదీసు 950
وَعَنْهَا; { أَنَّ اِمْرَأَةً قَالَتْ: يَا رَسُولَ اَللَّهِ! إِنَّ اِبْنَتِي مَاتَ عَنْهَا زَوْجُهَا, وَقَدْ اِشْتَكَتْ عَيْنَهَا, أَفَنَكْحُلُهَا? قَالَ: "لَا". } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : ఒక స్త్రీ దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! నా కూతురి భర్త చనిపోయాడు. ఎక్కువగా విలపించడం వల్ల ఆమె కళ్లు కళా విహీనంగా మారాయి. ఆమె కళ్ళకు సుర్మా పూయమంటారా?” అని విన్నవించుకున్నది. “వద్దు” అని ఆయన ﷺ చెప్పారు.
(బుఖారీ, ముస్లిం)
English
Narrated [Umm Salamah (RA)]: A woman said: "O Allah's Messenger, my daughter's husband died and her eye is troubling her, so may we apply Kuhl (antimony) to it?" He replied, "No." [Agreed upon].
సారాంశం
శోకం పాటించే వితంతువులు శోక కాలంలో కళ్లకు సుర్మా పూసుకోవటం, కాటుక పెట్టుకోవటం నిషిద్ధమని ఈ హదీసు చెబుతోంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా కళ్లకు సుర్మా పూసుకోవటం మరీ అంతగా అవసరమైనపుడు రాత్రిపూట పూసుకోవచ్చు. పగటిపూట పూసుకోకూడదు. ఈ విషయమై ఒక స్త్రీ హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) ను సంప్రతించగా, రాత్రివేళ సుర్మా పూసుకుని పగటివేళ కడిగివేయి అని సలహా ఇచ్చారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 950
హదీసు 951
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ: { طُلِّقَتْ خَالَتِي, فَأَرَادَتْ أَنْ تَجُدَّ نَخْلَهَا فَزَجَرَهَا رَجُلٌ أَنْ تَخْرُجَ, فَأَتَتْ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -فَقَالَ: بَلْ جُدِّي نَخْلَكِ, فَإِنَّكَ عَسَى أَنْ تَصَدَّقِي, أَوْ تَفْعَلِي مَعْرُوفًا } رَوَاهُ مُسْلِمٌ
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : నా పిన్నికి విడాకులివ్వబడ్డాయి. ఆమె ఇద్దత్ (గడువు) కాలంలోనే ఖర్జూరపండ్లు కోత కోయడానికి ఇంటి గడప దాటి తోటకు వెళ్ళవలసి వచ్చింది. ఒకాయన ఆమెను మందలించగా, ఆమె ఈ విషయాన్ని దైవప్రవక్త ﷺ దృష్టికి తీసుకువచ్చింది. దీనికి దైవప్రవక్త ﷺ, “నీవు నీ తోటలకు వెళ్ళి ఖర్జూరపండ్లు కోసుకోవచ్చు. ఈ సందర్భంగా నువ్వు దానమైనా చేయవచ్చు లేదా మరేదైనా సత్కార్యం నీ చేతుల మీదుగా జరగవచ్చు” అని చెప్పారు. (ముస్లిం)
English
Narrated Jabir (RA): My maternal aunt was divorced and wanted to cut down fruit from her paml-trees. A man forbade her to go out, so she went to the Prophet (ﷺ) and he said, "Certainly, cut down fruit from your palm-trees, for perhaps you have give Sadaqah (charity) or do an act of kindness." [Reported by Muslim].
సారాంశం
ఇద్దత్ (గడువు)లో ఉన్న మహిళలు ఇంటిపట్టున ఉండటం వాంఛనీయమైనప్పటికీ, అనివార్య పరిస్థితుల దృష్ట్యా ఇంటి బయటకు పోవటంలో తప్పులేదనీ ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. అయితే వెళ్ళిన పని పూర్తి కాగానే ఇంటి ముఖం పట్టాలి. అనవసర కాలక్షేపాల్లో నిమగ్నం కారాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 951
హదీసు 952
وَعَنْ فُرَيْعَةَ بِنْتِ مَالِكٍ; { أَنَّ زَوْجَهَا خَرَجَ فِي طَلَبِ أَعْبُدٍ لَهُ فَقَتَلُوهُ. قَالَتْ: فَسَأَلْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -أَنْ أَرْجِعَ إِلَى أَهْلِي; فَإِنَّ زَوْجِي لَمْ يَتْرُكْ لِي مَسْكَنًا يَمْلِكُهُ وَلَا نَفَقَةً, فَقَالَ: "نَعَمْ". فَلَمَّا كُنْتُ فِي اَلْحُجْرَةِ نَادَانِي, فَقَالَ: " اُمْكُثِي فِي بَيْتِكَ حَتَّى يَبْلُغَ اَلْكِتَابُ أَجَلَهُ". قَالَتْ: فَاعْتَدَدْتُ فِيهِ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا, قَالَتْ: فَقَضَى بِهِ بَعْدَ ذَلِكَ عُثْمَانُ } أَخْرَجَهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, والذُّهْلِيُّ, وَابْنُ حِبَّانَ, وَالْحَاكِمُ وَغَيْرُهُمْ.
హజ్రత్ ఫురైయా బిన్తె మాలిక్ (రదియల్లాహు అన్హా) కథనం : నా భర్త పలాయనం చిత్తగించిన తన బానిసల అన్వేషణలో బయలుదేరాడు. వాళ్లు ఆయన్ని హతమార్చారు. నేను ఈ స్థితిలో నా పుట్టింటికి వెళ్ళిపోదామనే ఉద్దేశ్యాన్ని దైవప్రవక్త ﷺ సమక్షంలో వెల్లడించాను. ఎందుకంటే నా భర్త తన ఆస్తిగా ఇల్లును మిగిల్చి ఉంచటంగానీ, మనోవర్తిగా ఆస్తిని వదలి వెళ్ళడంగానీ చేయలేదు. దైవప్రవక్త ﷺ నా గోడునంతా విని “సరే (నీవు నీ పుట్టింటికి వెళ్ళవచ్చు)” అన్నారు. నేను నా కుటీరంలోకి ప్రవేశించగానే ఆయన ﷺ పిలుపు వినవచ్చింది. “నీవు నీ ఇద్దత్ (గడువు) సమాప్తమయ్యే వరకూ ప్రస్తుతముంటున్న ఇంట్లోనే ఉండు” అని ఆయన ﷺ ఉపదేశించారు. “నేను నా ఇద్దత్ (గడువు)కు సంబంధించిన నాలుగు నెలల పదిరోజుల కాలాన్ని ఆ ఇంట్లోనే గడిపాను” అని ఆమె (రదియల్లాహు అన్హా) వివరించారు. ఆమె ఇంకా ఇలా తెలిపారు – “హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కూడా ఈ తీర్పు ననుసరించే ఈ విషయమై నిర్ణయం గైకొనేవారు.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ, జుహ్లీ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ తదితరులు దీన్ని ప్రామాణికంగా ఖరారు చేశారు)
English
Narrated Furai'ah, daughter of Malik: Her husband had gone out in search of some slaves of his and they killed him. She said, "I asked Allah's Messenger (ﷺ) to be allowed to return to my family, for my husband had not left for me a house which belonged to him, nor had he left me maintenance." He then said, "Yes, (I agree)," but when I was in the courtyard, he called me and said, "Stay in your house till the prescribed period expires." She said, "I observed the period in it for four months and ten days." She said, "Afterwards 'Uthman gave judgements in accordance with that." [Ahmad an al-Arba'a reported it. at-Tirmidhi, adh-Dhuhli, Ibn Hibban, al-Hakim and others graded it Sahih (authentic)].
సారాంశం
భర్త చనిపోయిన స్త్రీ తన భర్తతో సంసారం చేసిన ఇంట్లోనే ‘ఇద్దత్’ గడువును పూర్తి చేయాలన్న దానికి ఈ హదీసు నిదర్శనం. పరిశోధనాత్మక ఉలమాల అభిప్రాయం కూడా ఇదే. వేరొక స్థలాన్ని ఇద్దత్ కొరకు నిర్ధారించుకుని అక్కడికి తరలటం ధర్మసమ్మతమేనని కూడా అనబడుతోంది.
హదీసు ఉల్లేఖకులు
ఫురైయ బిన్తె మాలిక్ బిన్ సినాన్ ఖుదరియ (రదియల్లాహు అన్హా). ప్రఖ్యాత సహాబీ అయిన హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) గారి తోబుట్టువు ఈమె. ‘బైతె రిజ్వాన్’ ఘట్టంలో ఈమె కూడా ఉన్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 952
హదీసు 953
وَعَنْ فَاطِمَةَ بِنْتِ قَيْسٍ قَالَتْ: { يَا رَسُولَ اَللَّهِ! إِنَّ زَوْجِي طَلَّقَنِي ثَلَاثًا, وَأَخَافُ أَنْ يُقْتَحَمَ عَلَيَّ, قَالَ: فَأَمَرَهَا, فَتَحَوَّلَتْ. } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ ఫాతిమా బిన్తె ఖైస్ (రదియల్లాహు అన్హా) కథనం : “ఓ దైవప్రవక్తా ﷺ! నా భర్త నాకు మూడు విడాకులు ఇచ్చేశాడు. అయితే నా వద్దకు ఎవరయినా అనుచిత రీతిలో జొరబడి నాపై ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడతారేమోనని నాకు భయంగా ఉంది” అని నేను విన్నవించుకున్నాను. అప్పుడు దైవప్రవక్త ﷺ, నేనా ఇంటి నుంచి వేరొక చోటికి వెళ్ళటానికి నాకు అనుమతిని ఇచ్చారు. ఆమె అక్కడి నుంచి ప్రస్థానం చేశారు. (ముస్లిం)
English
Narrated Fatimah (RA) daughter of Qais: I said, "O Allah's Messenger, my husband has divorced me by three pronouncements (of divorce) and I am afraid that I may get broken into. Hence, he commanded her, and she moved (to another house)." [Reported by Muslim].
సారాంశం
తన ప్రాణానికి, మానమర్యాదలకు ముప్పు వాటిల్లే భయం ఉన్నప్పుడు స్త్రీ తన సమీప బంధువుల వద్దకు వెళ్ళి అక్కడే ఇద్దత్ (గడువు)ను పూర్తి చేయవచ్చు. ఉదాహరణకు : ఇల్లు సురక్షితంగా లేనపుడు, ఇరుగు పొరుగువారు వేధించే అవకాశం ఉన్నప్పుడు, ఒంటరితనాన్ని భరించలేననుకున్నప్పుడు ఆమె మకాం మార్చవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 953
హదీసు 954
وَعَنْ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: { لَا تُلْبِسُوا عَلَيْنَا سُنَّةَ نَبِيِّنَا, عِدَّةُ أُمِّ اَلْوَلَدِ إِذَا تُوُفِّيَ عَنْهَا سَيِّدُهَا أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا }. رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَأَعَلَّهُ اَلدَّارَقُطْنِيُّ بِالِانْقِطَاعِ.
హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం : “మన ప్రవక్త ﷺ సంప్రదాయాన్ని మన కొరకు కలగాపులగం చేయకండి – ‘ఉమ్మె వలద్’ యజమాని చనిపోయినపుడు ఆమె ఇద్దత్ (గడువు) నాలుగు మాసాల పదిరోజులుగా నిర్ధారించబడింది.” (దీనిని అహ్మద్, అబూ దావూద్, ఇబ్నెమాజా ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. దారె ఖుత్నీ దృష్టిలో – దీని పరంపరలో లోపం ఉంది)
English
Narrated 'Amr bin al-'Aas (RA): "Do not confuse us about our Prophet's Sunnah: The period that a slave-woman, whose master dies, and she has begotten a child from him must wait for, is four months and ten days." [Reported by Ahmad, Abu Dawud and Ibn Majah. al-Hakim graded it Sahih (authentic), but ad-Daraqutni considered it defective due to Inqita' (broken link)].
సారాంశం
ఈ హదీసులో ఉమ్మె వలద్ ఇద్దత్ గురించి చెప్పబడింది. అయితే ఈ ఉల్లేఖనంలో లోపం ఉంది. ఎందుకంటే ఉల్లేఖకులలో ఒకరైన ఖుబైస బిన్ జువైబ్, అమ్ర్ బిన్ ఆస్ నుండి గ్రహించినట్లు ఉంది. కాని అమ్ర్ నుండి ఆయన విన్నట్లు ఆధారం ఏదీ లేదు. ఇమామ్ ఔజాయి గారు ఉమ్మె వలద్ గడువును నాలుగు మాసాల పది రోజులని భావిస్తున్నారు. కాని ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్, ఇమామ్ మాలిక్‌ల దృష్టిలో ఈ ఇద్దత్ ఒక రుతువు మాత్రమే. కాగా; ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో ఈ ఇద్దత్ మూడు రుతువులు. ఇమామ్ షాఫయి తదితరులేమంటారంటే; ఆమె ఇద్దత్ కేవలం ఒక్క రుతువు మాత్రమే. ఎందుకంటే ఆమె ఇల్లాలుగానీ, విడాకులు పొందిన స్త్రీగానీ కాదు (ఆమె కేవలం ఒక బానిసరాలు మాత్రమే). పురుషుని తాలూకు వీర్య కణాల ప్రభావం ఆమె గర్భం నుంచి తొలగిపోయిందనడానికి ఒక రుతుస్రావం సరిపోతుంది.
అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) గారి నాలుగు నెలల పదిరోజుల కథనం విని ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) ఆశ్చర్యచకితులయ్యారు. ఇది దైవప్రవక్త ﷺ వారి ఏ సంప్రదాయం? అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: దైవప్రవక్త ﷺ సంప్రదాయం ప్రకారం ‘నాలుగు మాసాల పదిరోజుల ఇద్దత్’ ఆంక్ష స్వేచ్ఛాయుత స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది. కాగా; ఉమ్మె వలద్ ఒక బానిసరాలు.
ఇదిలా వుండగా పరిశోధకులైన పండితులు ఈ హదీసును బలహీనమైన హదీసుగా ఖరారు చేశారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 954
హదీసు 955
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { إِنَّمَا اَلْأَقْرَاءُ; اَلْأَطْهَارُ }. أَخْرَجَهُ مَالِكٌ وَأَحْمَدُ وَالنَّسَائِيُّ، فِي قِصَّةٍ بِسَنَدٍ صَحِيحٍ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ‘అఖ్రా’ అంటే అర్ధం పరిశుద్ధతే (తుహర్). (దీనిని మాలిక్, అహ్మద్, నసాయి ఒకానొక వృత్తాంతంలో ప్రామాణిక ఆధారాల సహితంగా నకలు చేశారు)
English
Narrated 'Aishah (RA): al-Aqra' is the period of a woman's purity (which occurs between two menses). [Malik, Ahmad and an-Nasa'i reported it in the course of a story with a Sahih (authentic) chain of narrators].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 955
హదీసు 956
وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { طَلَاقُ اَلْأَمَةِ تَطْلِيقَتَانِ, وَعِدَّتُهَا حَيْضَتَانِ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ. وَأَخْرَجَهُ مَرْفُوعًا وَضَعَّفَهُ. وَأَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ, وَابْنُ مَاجَهْ: مِنْ حَدِيثِ عَائِشَةَ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَخَالَفُوهُ, فَاتَّفَقُوا عَلَى ضَعْفِهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: బానిసరాలి విడాకు రెండు విడాకులు మాత్రమే. ఆమె ఇద్దత్ (గడువు) కూడా రెండు రుతువులే. (దీనిని దారెఖుత్నీ ఉల్లేఖించారు. దీన్ని ఆయన ‘మర్ఫూ’గా కూడా ఉల్లేఖించారు. అయితే ‘జయీఫ్’గా ఖరారు చేశారు. అంతేగాక ఈ ఉల్లేఖనాన్ని అబూదావూద్, తిర్మిజీ, ఇబ్నె మాజా హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ఆధారంగా సేకరించారు. హాకిమ్ దీన్ని ప్రమాణబద్ధంగా ఖరారు చేశారు. అయితే ఇతర హదీసువేత్తలు దీన్ని వ్యతిరేకించారు. ఇది ‘జయీఫ్’ అన్న అభిప్రాయంపైనే వారంతా ఏకీభవించారు)
English
Narrated Ibn 'Umar (RA): The divorce of a slave-woman occurs by saying it (the divorce word) twice, and her 'Iddah (waiting period) is two menses. [Reported by ad-Daraqutni].
He reported it as Marfu' (a saying of the Prophet) and graded it Da'if (weak).
Abu Dawud, at-Tirmidhi and Ibn Majah reported the aforesaid Hadith from the narration of 'Aishah (RA), which al-Hakim graded as Sahih (authentic), but the Hadith scholars disagreed with him, and they agreed that it is Da'if (weak).
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 956
హదీసు 957
وَعَنْ رُوَيْفِعِ بْنِ ثَابِتٍ - رضى الله عنه - عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { لَا يَحِلُّ لِامْرِئٍ يُؤْمِنُ بِاَللَّهِ وَالْيَوْمِ اَلْآخِرِ أَنْ يَسْقِيَ مَاءَهُ زَرْعَ غَيْرِهِ. } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَحَسَّنَهُ اَلْبَزَّارُ.
హజ్రత్ రువైఫీ బిన్ సాబిత్ కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరయితే అల్లాహ్ మరియు అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉన్నాడో అతనికి అన్యుల చేనును తన నీటితో తడపటం ధర్మసమ్మతం (హలాల్) కాదు.
English
Narrated Ruwaifi' bin Thabit (RA): The Prophet (ﷺ) said: "It is not lawful for a man who believes in Allah and the Last Day to water what another person has sown." [Abu Dawud and at-Tirmidhi reported it. Ibn Hibban graded it Sahih (authentic), and al-Bazzar graded it Hasan (good)].
సారాంశం
అన్యుల పొలాన్ని తమ నీటితో తడపటం అంటే అర్ధం, తన వైవాహిక బంధంలో, తన రక్షణలో లేని స్త్రీపై కన్నువేయటం, వారిని లోబరచుకుని అక్రమంగా వారి గర్భాలలోకి తన వీర్య బిందువులను ప్రవేశపెట్టడం అన్నమాట! ధర్మసమ్మతమైన రీతిలో తన పొలాలకు పోయే బదులు, దొడ్డి దోవన ఇతరుల పొలాలపై పడేవారికి ఈ హదీసులో తీవ్రమయిన హెచ్చరిక ఉంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 957
హదీసు 958
وَعَنْ عُمَرَ - رضى الله عنه - - { فِي اِمْرَأَةِ اَلْمَفْقُودِ- تَرَبَّصُ أَرْبَعَ سِنِينَ, ثُمَّ تَعْتَدُّ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا }. أَخْرَجَهُ مَالِكٌ, وَالشَّافِعِيُّ.
తప్పిపోయిన, ఎవరికీ చెప్పకుండా మాయమైపోయిన వాని భార్య గురించి చెబుతూ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ‘ఆమె నాలుగు సంవత్సరాల పాటు ఎదురు చూడాలి. ఆ తరువాత నాలుగు మాసాల పదిరోజులు ఇద్దత్ (గడువు)ను పూర్తి చేయాలి’ అని అన్నారు. (మాలిక్, షాఫయీలు దీనిని సేకరించారు)
English
Narrated 'Umar (RA) regarding a wife of a lost husband: She should wait for four years and then observe the 'Iddah for four months and ten days (before she may remarry). [Malik and ash-Shafi'i reported it].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 958
హదీసు 959
وَعَنْ اَلْمُغِيرَةِ بْنِ شُعْبَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اِمْرَأَةُ اَلْمَفْقُودِ اِمْرَأَتُهُ حَتَّى يَأْتِيَهَا اَلْبَيَانُ. } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : కనిపించకుండా పోయిన మగవాని భార్య, అతని గురించి స్పష్టమయిన సమాచారం అందనంతవరకూ అతని భార్యగానే ఉంటుంది. (దారెఖుత్నీ దీనిని బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు)
English
Narrated al-Mughirah bin Shu'bah (RA): Allah's Messenger (ﷺ) said: "The spouse of a lost husband remains his wife till she gets a certain news about his death." [ad-Daraqutni reported it with a Da'if (weak) chain of narrators].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 959
హదీసు 960
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يَبِيتَنَّ رَجُلٌ عِنْدَ اِمْرَأَةٍ, إِلَّا أَنْ يَكُونَ نَاكِحًا, أَوْ ذَا مَحْرَمٍ. } أَخْرَجَهُ مُسْلِمٌ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ వ్యక్తీ మరో స్త్రీ దగ్గర ఒంటరిగా – అతడు ఆమె భర్త లేక మహ్రమ్ బంధువు (సోదరుడు, తండ్రి) అయివుంటే తప్ప – ఒక రాత్రి కూడా ఉండరాదు.” (ముస్లిం)
English
Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said: "A man must not spend the night in the house of woman unless he is her husband or a Mahram." [Reported by Muslim].
సారాంశం
ఈ హదీసు వెలుగులో అపరిచిత స్త్రీ ఇంట – ఒంటరిగా – ఒక మగవాడు ఉండటం హరాం (నిషిద్ధం). ‘మహ్రమ్’ వ్యక్తి అయితే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ స్త్రీతో వివాహం ధర్మసమ్మతం కాజాలని వ్యక్తిని ‘మహ్రమ్’ అని అంటారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 960
హదీసు 961
وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { لَا يَخْلُوَنَّ رَجُلٌ بِاِمْرَأَةٍ, إِلَّا مَعَ ذِي مَحْرَمٍ. } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : ఏ వ్యక్తి అయినాసరే ఒక స్త్రీతో కలసి – ఆమె ‘మహ్రమ్’ బంధువు అక్కడ లేనిదే – ఏకాంతంలో ఉండరాదు. (బుఖారీ)
English
Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) said: "A man must not be alone with a woman except in the presence of a Mahram." [al-Bukhari reported it].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 961
హదీసు 962
وَعَنْ أَبِي سَعِيدٍ - رضى الله عنه - أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ فِي سَبَايَا أَوْطَاسٍ: { لَا تُوطَأُ حَامِلٌ حَتَّى تَضَعَ, وَلَا غَيْرُ ذَاتِ حَمْلٍ حَتَّى تَحِيضَ حَيْضَةً } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ. وَلَهُ شَاهِدٌ: عَنْ اِبْنِ عَبَّاسٍ فِي اَلدَّارَقُطْنِيِّ.
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ‘అవ్‌తాస్’ యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన మహిళల గురించి చెబుతూ, “గర్భవతి అయిన స్త్రీ ప్రసవించే వరకూ ఆమెతో లైంగిక సంబంధం ఏర్పరచుకోకండి. అలాగే గర్భవతి కాని స్త్రీతో కూడా – ఆమెకు బహిష్టు అయి పరిశుద్ధురాలయ్యే వరకూ – సంభోగం జరపకండి” అని చెప్పారు. (అబూదావూద్ ఈ హదీసును సేకరించారు. హాకీమ్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు. దారె ఖుత్నీలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ద్వారా కూడా దీనికి సాక్ష్యం ఉంది).
English
Narrated Abu Sa'id (RA)" The Prophet (ﷺ) said in regard to the captives taken at Autas, "There must be no intercourse with a pregnant woman till she gives birth, or with one who is not pregnant till she has had one menstrual period." [Abu Dawud reported it, and al-Hakim graded it Sahih (authentic)].
The aforesaid Hadith has a supporting narration from Ibn 'Abbas (RA) reported by ad-Daraqutni.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 962
హదీసు 963
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { اَلْوَلَدُ لِلْفِرَاشِ, وَلِلْعَاهِرِ اَلْحَجَرُ. } مُتَّفَقٌ عَلَيْهِ مِنْ حَدِيثِهِ. وَمِنْ حَدِيثِ عَائِشَةَ فِي قِصَّةٍ. وَعَنْ اِبْنِ مَسْعُودٍ, عِنْدَ النَّسَائِيِّ. وَعَنْ عُثْمَانَ. عِنْدَ أَبِي دَاوُدَ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “శిశువు ఎవరి పడకపై జన్మించిందో వారిదే అవుతుంది. వ్యభిచారి కోసం రాయి మాత్రమే.” (బుఖారీ, ముస్లిం)
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) వివరించిన వృత్తాంతంలో కూడా ఇలాగే ఉంది. ఈ హదీసుపై కూడా బుఖారీ ముస్లింలు ఏకాభిప్రాయాన్ని కల్గియున్నారు. ఇంకా నసాయీలో ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) గారిచేత మరియు అబూదావూద్‌లో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) చేత ఈ హదీసు ఉల్లేఖించబడింది.
English
Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "The child (born out of wedlock) belongs to the one on whose bed it is born, and stoning to death is for the fornicator." [Agreed upon, regarding Abu Hurairah's Hadith].
The aforesaid Hadith is also a part of 'Aishah's Hadith in the course of a story.
And from Ibn Mas'ud by an-Nasa'i.
And from 'Uthman by Abu Dawud.
సారాంశం
ఈ హదీసు ప్రకారం బిడ్డను కన్న స్త్రీ ఒక మగవానికి భార్య లేక అతని బానిసరాలు అయి ఉంటుంది. ఆ పిల్లవాడు కూడా ఆ తండ్రి సంతానంగానే పరిగణించబడతాడు. వారసత్వ హక్కులు ఆ పిల్లవాడికి సంక్రమిస్తాయి. తల్లిదండ్రుల యెడల అతని బాధ్యతలు కూడా అతనిపై ఉంటాయి. ఒకవేళ ఆ సంతానం అక్రమ సంబంధం వల్ల కలిగిన సంతానమైనప్పటికీ, రూపురేఖల్లో తండ్రిని పోలినవాడు కాకపోయినప్పటికీ చట్టం మాత్రం ఆ పిల్లవాణ్ణి ఫలానా వ్యక్తి సంతానంగానే పరిగణిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు ఆ వ్యక్తి భార్య ప్రేగు త్రెంచుకుని పుట్టాడు.
అయితే శిశువు తండ్రి గనక ఆ పిల్లవాడు తన పిల్లవాడు కాదని చెబితే, అప్పుడు ఆ పిల్లవాని వంశపరంపరను తల్లితో ముడిపెట్టడం జరుగుతుంది. అంతేగాని, ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న వ్యభిచారి వైపునకు ఆ పిల్లవాడు మరలించబడడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.11 ఇద్దత్ (గడువు), శోకం, ప్రసవం|హదీసు 963
You must be logged in to post a comment.