హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 8వ అధ్యాయం: రుణ మార్పిడి, భరోసా. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 738 – 741) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
7.8 రుణ మార్పిడి, భరోసా
باب الحوالة والضمان
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 738
عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَطْلُ اَلْغَنِيِّ ظُلْمٌ, وَإِذَا أُتْبِعُ أَحَدُكُمْ عَلَى مَلِيٍّ فَلْيَتْبَعْ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةِ أَحْمَدَ: { فَلْيَحْتَلْ }.
దైవప్రవక్త ﷺ ప్రబోధించినట్లు హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : “శ్రీమంతుడు రుణం చెల్లించటంలో తాత్సారం చేయటం అన్యాయం. రుణగ్రస్తుడు తన రుణం తీర్చే విషయమై శ్రీమంతుని హవాలా (రెఫరెన్సు) ఇస్తే (రుణదాత) దాన్ని అంగీకరించాలి” (బుఖారీ, ముస్లిం). అహ్మద్ లోని ఒక ఉల్లేఖనంలో ‘హవాలాను ఒప్పుకోవాలి’ అని వుంది.
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Delay in payment by a rich man is injustice. So, if one of you is referred for payment to a wealthy man he should accept the reference." [Agreed upon].
A narration by Ahmad has: "And if anyone is referred to another, let him accept that."
సారాంశం
ఈ హదీసులో ‘హవాలా’ గురించి చెప్పబడింది. ఈ ‘హవాలా’కు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి: ఒక వ్యక్తి రుణం విషయంలో పూచీగా ఉంటాడు. అంటే ఫలానా వ్యక్తికి ఇంత పైకం అప్పుగా ఇవ్వు. దీనికి బాధ్యత నాది అని అంటాడు. రెండు : తాను చెల్లించవలసిన బకాయిని ఫలానా వ్యక్తి నుండి వసూలు చేసుకో అని అంటాడు. ఉదాహరణకు – ‘అఫ్సర్ – ఆరిఫ్ – ఇర్ఫాన్’ అనే ముగ్గురు వ్యక్తులున్నారు. అఫ్సర్ అనేవాడికి ఆరిఫ్ నుండి వెయ్యి రూపాయలు రావలసి ఉన్నాయి. ఆరిఫ్ కు ఇర్ఫాన్ నుండి వెయ్యి రూపాయలు రావాలి. ఆరిఫ్, అఫ్సర్ ను ఉద్దేశ్యించి నేను నీకు ఇవ్వవలసిన వెయ్యి రూపాయల బకాయిని ఇర్ఫాన్ నుండి తీసేసుకో అని అంటాడు. ఈ రకమయిన సర్దుబాటును షరీయత్ ఆమోదిస్తోంది. అయితే ఇర్ఫాన్ తాను ఆరిఫ్ కు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నానన్న సంగతి నిజమేననీ, ఆ మొత్తం నీకు ఇస్తానని అఫ్సర్ తో చెప్పాలి.
అరబ్బు దేశాల బ్యాంకులలో ‘డ్రాఫ్టు’ను ‘హవాలా’గా వ్యవహరిస్తారు. డ్రాఫ్టు తయారుచేసి ఇచ్చే బ్యాంకు పైకం జమచేసిన వ్యక్తికి ఒక రసీదు ఇచ్చి, ఈ రసీదు ఆధారంగా ఫలానా బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకోవచ్చని అంటుంది. ఇదీ అక్కడ హవాలా యొక్క అధునాతన పద్ధతి ఇది షరీయత్ కు అనువైనదే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.8 రుణ మార్పిడి, భరోసా|హదీసు 738
హదీసు 739
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ: { تُوُفِّيَ رَجُلٌ مِنَّا, فَغَسَّلْنَاهُ, وَحَنَّطْنَاهُ, وَكَفَّنَّاهُ, ثُمَّ أَتَيْنَا بِهِ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -فَقُلْنَا: تُصَلِّي عَلَيْهِ? فَخَطَا خُطًى, ثُمَّ قَالَ: " أَعَلَيْهِ دَيْنٌ? " قُلْنَا: دِينَارَانِ، فَانْصَرَفَ, فَتَحَمَّلَهُمَا أَبُو قَتَادَةَ، فَأَتَيْنَاهُ, فَقَالَ أَبُو قَتَادَةَ: اَلدِّينَارَانِ عَلَيَّ، فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" حَقَّ اَلْغَرِيمُ وَبَرِئَ مِنْهُمَا اَلْمَيِّتُ? " قَالَ: نَعَمْ, فَصَلَّى عَلَيْهِ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِمُ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : మాలోని ఒక వ్యక్తి చనిపోయాడు. మేము అతనికి (భౌతిక కాయానికి) స్నానం చేయించాము. సువాసన పూశాము. కఫన్ వస్త్రం తొడిగించాము. ఆ తరువాత అతన్ని (శవపేటికను) దైవప్రవక్త ﷺ సన్నిధికి తీసుకువచ్చి, “తమరు ఇతని అంత్యక్రియల ప్రార్థన చేయించాలి” అని అభ్యర్థించాము. ఆయన ﷺ కొన్ని అడుగులు ముందుకు రావటానికి లేచారు. మరి అంతలోనే, “ఇతను ఎవరికయినా ఏమైనా బాకీ పడి ఉన్నాడా?” అని దర్యాప్తు చేశారు. “రెండు దీనార్లు బాకీ పడి ఉన్నాడ”ని మేము విన్నవించుకున్నాము. ఇది వినగానే ఆయన ﷺ వెనక్కి వచ్చేశారు. అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఆ రెండు దీనార్ల బాకీని చెల్లించే బాధ్యతను స్వీకరించారు. తరువాత మేమంతా ఆయన ﷺ వద్దకు వచ్చాము. “ఆ రెండు దీనార్ల బాధ్యత నాది” అని అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) చెప్పారు. “రుణగ్రస్తుని మాదిరిగా ఇది నీపై తప్పనిసరి అయిపోయింది. ఇక దీన్ని చెల్లించవలసిన బాధ్యత కేవలం నీదే. మృతుడు ఈ బాధ్యత నుండి విముక్తి పొందాడు. అవునా?” అని ఆయన ﷺ రెట్టించగా ‘అవును’ అని ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన ﷺ అతని నమాజె జనాజా చేయించారు.” (అహ్మద్, అబూదావూద్, నసాయి దీనిని ఉల్లేఖించగా, ఇబ్నె హిబ్బాన్ మరియు హకీమ్ లిరువురూ దీని ప్రామాణికతను ధృవీకరించారు)
English
Narrated Jabir (RA): A man from among us died, so we washed, embalmed and shrouded him. We then brought him to Allah's Messenger (ﷺ) and asked him to pray over him. He went forward some steps and then asked, "Does he have any debt against him?" We replied, "Two Dinars." He turned away, but Abu Qatada (RA) took upon himself the bearing of them. We then came to him (again) (ﷺ) and Abu Qatada (RA) said: "I shall discharge the two Dinars." Allah's Messenger (ﷺ) thereupon said, "[Will you be responsible for paying them as] a right to the creditor; and the dead man will then be free from them?" He replied, "Yes." So, he prayed over him. [Reported by Ahmad, Abu Dawud, and an-Nasa'i. Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
ఈ హదీసు ద్వారా అనేక అంశాలు మన ముందుకు వస్తున్నాయి. (1) మృతుని తరపున రుణం చెల్లించే బాధ్యతను ఎవరయినా స్వీకరిస్తే అది సమంజసమే. (2) రుణం చెల్లిస్తానని పూచీగా ఉన్న వ్యక్తి ఆ పైకాన్ని మృతుని ఆస్తి నుండి తీసుకోజాలడు – అతడు తన కష్టార్జితం నుండి దాన్ని చెల్లించవలసి ఉంటుంది. (3) అప్పులైనా లేదా ఇతర దాసుల హక్కులైనా వాటిని తీర్చనంతవరకూ, హక్కుదారులు లేదా రుణదాతలు వాటిని క్షమించి వదలిపెట్టనంత వరకూ అవి సమసిపోవు. (4) అప్పు తీసుకోవటం ఎంతో సున్నితమైన, జటిలమైన వ్యవహారం. సాధ్యమైనంతవరకు అప్పుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ అప్పు తీసుకోవటం వినా మరో గత్యంతరం లేదనుకుంటే ఆ అప్పును వీలైనంత తొందరగా తీర్చివేసేందుకు ప్రయత్నించాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.8 రుణ మార్పిడి, భరోసా|హదీసు 739
హదీసు 740
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -كَانَ يُؤْتَى بِالرَّجُلِ اَلْمُتَوَفَّى عَلَيْهِ اَلدَّيْنُ, فَيَسْأَلُ: " هَلْ تَرَكَ لِدَيْنِهِ مِنْ قَضَاءٍ? " فَإِنْ حُدِّثَ أَنَّهُ تَرَكَ وَفَاءً صَلَّى عَلَيْهِ, وَإِلَّا قَالَ: " صَلُّوا عَلَى صَاحِبِكُمْ " فَلَمَّا فَتَحَ اَللَّهُ عَلَيْهِ اَلْفُتُوحَ قَالَ: " أَنَا أَوْلَى بِالْمُؤْمِنِينَ مِنْ أَنْفُسِهِمْ, فَمَنْ تُوُفِّيَ, وَعَلَيْهِ دَيْنٌ فَعَلَيَّ قَضَاؤُهُ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ لِلْبُخَارِيِّ: { فَمَنْ مَاتَ وَلَمْ يَتْرُكْ وَفَاءً }.
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: రుణగ్రస్తుడై ఉన్న వ్యక్తి చనిపోయి అతని జనాజా (శవ పేటిక)ను దైవప్రవక్త ﷺ వద్దకు తీసుకురావటం జరిగితే, “ఇతను (మృతుడు) తన అప్పును తీర్చడానికి ఆస్తి ఏదైనా వదలిపోయాడా?” అని దైవప్రవక్త ﷺ అడిగేవారు. అతను అప్పు తీర్చడానికి సరిపడే అంత ఆస్తి వదలిపోయాడని సమాధానం వస్తే ఆయన ﷺ అతని జనాజా నమాజు చేయించేవారు. అలాంటి సమాధానం రాకపోతే “మీరే మీ సహచరుని జనాజా నమాజ్ చేసుకోండి” అని చెప్పేసేవారు.
కొంత కాలానికి దేవుడు (తన ప్రవక్త కోసం) విజయ ద్వారాలు తెరిచాడు. (అంటే పెద్ద ఎత్తున విజయప్రాప్తి రాసాగింది) అప్పుడాయన ﷺ ఇలా అన్నారు – “నేను విశ్వాసులకు వారి ప్రాణాలకన్నా సమీపంగా ఉన్నాను. కనుక (ఇకనుంచి) ఎవరయినా ముస్లిం చనిపోతే, అతను ఎవరికయినా బాకీ పడి ఉంటే, ఆ బాకీ నేను తీరుస్తాను” (బుఖారీ, ముస్లిం). బుఖారీలోని ఒక ఉల్లేఖనంలో “చనిపోయిన వ్యక్తి తన అప్పు తీర్చడానికి సరిపడేటంత ఆస్తిని వదలిపోకపోతే” అని ఉంది.
English
Narrated Abu Hurairah (RA): A man who had died in debt would be brought to Allah's Messenger (ﷺ) and he would ask, "Has he left anything to discharge his debt?" If he was told that he left enough he would pray over him. Otherwise, he would say, "Pray over your companion." Then, when Allah brought the conquests (of other lands) at his hands he said, "I am closer to the believers than their own selves. So, whoever dies leaving a debt, the responsibility for repaying it shall be upon me." [Agreed upon].
A narration by al-Bukhari has: "Whoever dies and leavings nothing to discharge his debt…"
సారాంశం
తన రాజ్య ప్రజల అవసరాలను తీర్చవలసిన బాధ్యత ఇస్లామీయ ప్రభుత్వంపై ఉందనీ, ఆఖరికి ఎవరయినా ముస్లిం రుణగ్రస్తుడై వున్న స్థితిలో చనిపోతే, అతని వారసులుగానీ, బంధుమిత్రులుగానీ అతని రుణాన్ని తీర్చే బాధ్యతను స్వీకరించకపోతే ఇస్లామీయ ప్రభుత్వమే బైతుల్ మాల్ (ప్రభుత్వ ధనాగారం) నుండి దాన్ని తీరుస్తుందని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది.
మహానీయ ముహమ్మద్ ﷺ కు సమాజంలోని రుణగ్రస్తుల, అగత్యపరుల, నిరాధార జీవులపట్ల గల దయాదాక్షిణ్యాలు కూడా ఈ హదీసు ద్వారా వ్యక్తమవుతున్నాయి.
రాజ్యాధికారులు తన రాజ్య ప్రజల పట్ల ఎంత బాధ్యతతో, మరెంత వాత్సల్యంతో మసలుకోవాలో కూడా ఈ హదీసు సూచిస్తోంది.
అప్పు తీర్చటం ఎంత ముఖ్యమైన బాధ్యతో ఈ హదీసు నొక్కి చెబుతోంది. మనిషి తాను జీవించి ఉండగానే అప్పు తీర్చటం చాలా మంచిది. రుణగ్రస్తుడు చనిపోయినప్పుడు అతని జనాజా నమాజు చేయడానికి దైవప్రవక్త ﷺ అంగీకరించలేదంటే, అది చూచి బ్రతికి ఉన్నవారు దైవానికి భయపడి తమ అప్పులను తీర్చివేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారని ఆయన ఆశించి ఉండవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.8 రుణ మార్పిడి, భరోసా|హదీసు 740
హదీసు 741
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا كَفَالَةَ فِي حَدٍّ } رَوَاهُ اَلْبَيْهَقِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ.
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుంచి, ఆయన తన తాతగారి నుంచి విన్న దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “హద్దులు (శిక్షలు) విధించబడేటప్పుడు ఎలాంటి జామీను, పూచీ సమ్మతించబడదు.” (బైహఖీ దీనిని బలహీన ప్రమాణాలతో ఉల్లేఖించారు)
English
Narrated 'Amr bin Shu'aib on his father's authority from his grandfather (RA): Allah's Messenger (ﷺ) said: "No surety is allowed regarding a prescribed punishment." [Reported by al-Baihaqi with a Da'if (weak) chain of narrators].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.8 రుణ మార్పిడి, భరోసా|హదీసు 741
You must be logged in to post a comment.