హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 9వ అధ్యాయం: భాగస్వామ్యం, అధికారాల అప్పగింత. ఈ అధ్యాయంలో 8 హదీసులు (హదీసు 742 – 749) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత
باب الشركة والوكالة
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 742
عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ قَالَ اَللَّهُ: أَنَا ثَالِثُ اَلشَّرِيكَيْنِ مَا لَمْ يَخُنْ أَحَدُهُمَا صَاحِبَهُ, فَإِذَا خَانَ خَرَجْتُ مِنْ بَيْنِهِمَا } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించినట్లు హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) చెప్పారు : “అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు – ఇద్దరు వ్యక్తులు భాగస్వాములుగా ఉండి, వారిరువురూ ఒండొకరికి ద్రోహం చేయకుండా ఉన్నంతవరకూ నేను వారి మధ్య మూడోవానిగా ఉంటాను. వారిలో ఏ ఒక్కరు ద్రోహానికి పాల్పడినా నేను వారి మధ్య నుండి వైదొలగుతాను.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – హాకిమ్ దీనిని ‘సహీహ్’గా పేర్కొన్నారు)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Allah, the Most High, said, 'I am the third (partner) of two partners as long as one of them does not cheat the his companion. Then, if he cheats (his partner) I depart from them.'" [Reported by Abu Dawud and al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
వ్యాపారంలోగానీ, మరేదైనా వ్యవహారంలోగానీ ఇద్దరు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నప్పుడు వారి మధ్య స్పష్టత, నిజాయితీ తత్పరత ఎంతో అవసరం. వారిరువురూ ముందుగా నిర్ధారించుకున్న నియమ నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలి. తమ విధానంలో ఏ మార్పు చేయాలనుకున్నా ఇరువురూ కలసి నిర్ణయం తీసుకోవాలి. వారి మధ్య దాపరికాలు, ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. అలా వారిరువురూ ఒకే మాట పలికి, ఒకే బాటపై నడుస్తున్నప్పుడు మూడోవానిగా దేవుడు వారికి తోడ్పడుతూ ఉంటాడు. వారిని చల్లగా చూస్తాడు. వారి కార్యకలాపాలలో శుభాన్నీ, సమృద్ధినీ ఒసగుతూ ఉంటాడు. కష్టాలు, కడగండ్లనుండి వారిని కాపాడుతూ ఉంటాడు. మరి అదే వారిద్దరిలో ఏ ఒక్కడు అడ్డదారులు తొక్కి, ద్రోహానికి పాల్పడినా అల్లాహ్ ఆగ్రహించి, వారి మధ్యనుండి నిష్క్రమిస్తాడు. అల్లాహ్ ఎవరికి అండగా ఉండడో వారి స్థితి ఎలా తయారవుతుందో తెలిసిందేగా!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 742
హదీసు 743
وَعَنْ اَلسَّائِبِ اَلْمَخْزُومِيِّ { أَنَّهُ كَانَ شَرِيكَ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَبْلَ اَلْبَعْثَةِ, فَجَاءَ يَوْمَ اَلْفَتْحِ, فَقَالَ: " مَرْحَباً بِأَخِي وَشَرِيكِي } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَابْنُ مَاجَةَ.
హజ్రత్ సాయిబ్ మఖ్జూమీ (రదియల్లాహు అన్హు) కథనం : తను ఆయన ﷺకు దైవదౌత్యం లభించకమునుపు ఆయన ﷺతో కలసి వ్యాపారం చేసేవారు. మక్కా విజయం సందర్భంగా తాను అక్కడికి వచ్చినప్పుడు “సోదరా! భాగస్వామీ! నీకు స్వాగతం” అంటూ ఆయన ﷺ తనను ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా పలకరించారు. (దీనిని అహ్మద్, అబూదావూద్, ఇబ్నె మాజా – ముగ్గురూ ఉల్లేఖించారు)
English
Narrated as-Saib al-Makhzumi (RA): That he was the partner of the Prophet (ﷺ) before the Prophethood. Then, he came (to Makkah) on the day of the Conquest (of Makkah), and he (the Prophet) said: "Welcome to my brother and partner." [Reported by Ahmad, Abu Dawud and Ibn Majah].
సారాంశం
మహాప్రవక్త ﷺకు ప్రవక్త పదవి లభించక పూర్వం నుండే అరేబియాలో, వ్యాపారంలో భాగస్వామ్యం (పార్ట్నర్షిప్) రివాజు ఉండేదని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది.
ఇస్లాం కూడా ఈ భాగస్వామ్య పద్ధతిని కొనసాగించింది. అయితే అజ్ఞానకాలంలో భాగస్వామ్య వ్యవస్థలోనున్న లొసుగులను, చెడుగులను దూరం చేసి వ్యాపార రంగాన్ని ప్రక్షాళనం చేసింది ఇస్లాం. తన పాత బిజినెస్ పార్ట్నర్కు దైవప్రవక్త ﷺ స్వాగతం పలికిన తీరు అనుసరణీయమైనది. అందుకే పాత మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, వ్యాపార భాగస్వాములు – చాలా కాలం తరువాత – కలుసుకున్నప్పుడు వారి యెడల నిర్లక్ష్యం కనబరచటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు. పైగా వాళ్ళను ఎంతో ఆప్యాయంగా పలకరించాలి. నగు మోముతో స్వాగతం పలికి, విశాల హృదయంతో మర్యాదచేసి పంపాలి.
హదీసు ఉల్లేఖకులు
సాయిబ్ మఖ్జూమీ (రదియల్లాహు అన్హు) – ఈయన పేరు సైఫీ బిన్ ఆయజ్ మఖ్జూమీ అని అల్లామా ఇబ్నె జవ్జీ (రహిమహుల్లాహ్) తన ‘తల్ఖీహ్’లో పేర్కొన్నారు. ఈయన “సత్ప్రవర్తన ద్వారా మనసులు జయించబడిన వారి (ముఅల్లఫతుల్ ఖులూబ్)” లోని ఒక వ్యక్తి అని అల్లామా ఇబ్నె అబ్దుల్ బర్ర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈయన నికార్సయిన ముస్లింగా నెగ్గుకువచ్చారు. దీర్ఘాయుషును పొందిన వారిలో ఈయన కూడా ఒకరు. అమీర్ ముఆవియ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలం వరకు బ్రతికి ఉన్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 743
హదీసు 744
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ: { اِشْتَرَكْتُ أَنَا وَعَمَّارٌ وَسَعْدٌ فِيمَا نُصِيبُ يَوْمَ بَدْرٍ.. } اَلْحَدِيثَ. وَتَمَامُهُ: «فَجَاءَ سَعْدٌ بِأَسِيرَيْنِ، وَلَمْ أَجِئْ أَنَا وَعَمَّارٌ بِشَيْءٍ». رَوَاهُ النَّسَائِيُّ وَغَيْرُهُ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను, అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) మరియు సాద్ (రదియల్లాహు అన్హు) కలసి బద్ర్ యుద్ధం నాడు పొందే వస్తువులను పంచుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ హదీసు ఆఖరి వాక్యం ఇలా వుంది: “ఆ రోజు సాద్ ఇద్దరు యుద్ధ ఖైదీలను తీసుకువచ్చారు. కాని నేనూ, అమ్మార్ ఏమీ తీసుకు రాలేక పోయాము.” (దీనిని నసాయి తదితరులు ఉల్లేఖించారు)
English
Narrated 'Abdullah bin Mas'ud (RA): "Ammar, Sa'd and I agrred to be partners in whatever we would get (from the spoils of war) on the day of Badr." The narrator quoted the rest of the Hadith which concludes: "Then Sa'd brought two captives, but neither Ammar nor I brought anything." [Reported by an-Nasa'i and others].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 744
హదీసు 745
وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- { قَالَ: أَرَدْتُ اَلْخُرُوجَ إِلَى خَيْبَرَ, فَأَتَيْتُ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -فَقَالَ: " إِذَا أَتَيْتَ وَكِيلِي بِخَيْبَرَ, فَخُذْ مِنْهُ خَمْسَةَ عَشَرَ وَسْقًا } رَوَاهُ أَبُو دَاوُدَ وَصَحَّحَهُ.
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : నేను ఖైబర్‌కు వెళ్ళాలని నిశ్చయించుకుని దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చాను. ఆయన ﷺ నన్నుద్దేశ్యించి, “నీవు ఖైబర్‌లో మా ప్రతినిధిని కలుసుకున్నప్పుడు అతన్నుండి పదిహేను వసఖ్‌ల (ఖర్జూర పండ్లు) వసూలు చేసుకో” అని చెప్పారు. (దీనిని అబూదావూద్ ఉల్లేఖించటమే గాకుండా, ప్రామాణికమైనదిగా కూడా ఖరారు చేశారు)
English
Narrated Jabir bin 'Abdullah (RA): I intended to go to Khaibar, so I went to the Prophet (ﷺ) and he said, "When you meet my agent at Khaibar take fifteen Wasq (of dates) from him." [Abu Dawud reported and graded it Sahih (authentic)].
సారాంశం
వ్యాపారులు ఇతర ప్రదేశాలలో తమ ఏజంట్లను, ప్రతినిధులను, కార్యసాధకులను నియమించుకుని నిర్దీత అధికారాలు వారికి ఇవ్వవచ్చునని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దైవప్రవక్త ﷺ ఖుద్దుగా తమ ప్రతినిధిని ఖైబర్‌లో నియమించారు. అబూదావూద్లో పొందుపరచబడిన దాని ప్రకారం, ‘దైవప్రవక్తా ﷺ! ఆ ప్రతినిధి నాకేదన్నా ఆనవాలు అడిగితే నేనేం చేయను?’ అని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) సందేహపడగా, “అతని చేతిలో చెయ్యేసి మాట్లాడు. అదే ఆనవాలు” అని ఆయన ﷺ చెప్పారు. అంటే ఆయన ﷺ ఈ మేరకు ముందే సంకేతం ఇచ్చి ఉన్నారన్నమాట! ఈ విధంగా లావాదేవీలకు, వ్యవహారాలకు సంబంధించి తమ ఏజంట్లకు, ప్రతినిధులకు ‘కోడ్’ ఇవ్వటం ఆక్షేపణీయం కాదని దీన్నిబట్టి విదితమవుతున్నది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 745
హదీసు 746
وَعَنْ عُرْوَةَ الْبَارِقِيِّ - رضى الله عنه - { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -بَعَثَ مَعَهُ بِدِينَارٍ يَشْتَرِي لَهُ أُضْحِيَّةً.. } اَلْحَدِيثَ. رَوَاهُ اَلْبُخَارِيُّ فِي أَثْنَاءِ حَدِيثٍ, وَقَدْ تَقَدَّمَ.
దైవప్రవక్త ﷺ తనకు ఒక దీనారు ఇచ్చి, తన కోసం ఒక ఖుర్బానీ పశువును కొనుక్కు రమ్మన్నారు అని హజ్రత్ ఉర్వా బారిఖీ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు. (బుఖారీ హదీసు ఆరంభంలో దీనిని ఉల్లేఖించారు – దీని ప్రస్తావన ఇంతకు ముందే ఒక హదీసులో వచ్చింది)
English
Narrated 'Urwa al-Bariqi (RA): Allah's Messenger (ﷺ) sent him with a Dinar to buy a sacrificial animal for him. [The reporter mentioned the rest of the Hadith. al-Bukhari reported it in the context of another previously mentioned Hadith].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 746
హదీసు 747
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: { بَعَثَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -عُمَرَ عَلَى اَلصَّدَقَةِ.. } اَلْحَدِيثَ. مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ జకాత్ సొమ్మును వసూలు చేసే నిమిత్తం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ను తహసీల్దారుగా నియమించి పంపారు- (సశేషం) (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Hurairah (RA): "Allah's Messenger (ﷺ) sent 'Umar to collect the Sadaqah." The reported mentioned the rest of the Hadith. [Agreed upon].
సారాంశం
ప్రతినిధుల నియామకానికి నిరూపణగా ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద తీసుకోవటం జరిగింది. పూర్తి హదీసు సారాంశం ఈ విధంగా ఉంది : హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)గారు దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చి హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు), ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు), ఇబ్నె జమీల్ (రదియల్లాహు అన్హుమా)లు తమ జకాత్‌ను ఇవ్వలేదని చెప్పారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : “ఇబ్నె జమీల్ పేదవాడు, అతని దగ్గర ఏమీ ఉండేదికాదు. కాని అల్లాహ్ అతనికి కలిమిని ప్రసాదించి, స్థితిమంతునిగా చేశాడు. ఇప్పుడతడు దీని ఆధారంగానే అల్లాహ్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అతడు కపటిగా ఉండేవాడు. అయితే అనంతరం అతడు పశ్చాత్తాపం చెంది ముస్లింగా మారిపోయాడు. ఇక అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారి జకాత్ అంటారా, దాన్ని చెల్లించే బాధ్యత నాది. ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) సంగతి మీకు తెలిసిందే. ఆయన తన ఆస్తిపాస్తులను, సర్వస్వాన్నీ అల్లాహ్ కోసమే అర్పించాడు. మరింక అతన్నుంచి జకాత్ అడగటం భావ్యం కాదుకదా!”
ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే రాజ్యాధిపతి జకాత్ సొమ్మును వసూలుచేసే బాధ్యతను తాను సముచితమనుకున్న వ్యక్తిపై మోపగలడు. బహుశా ఈ ఉద్దేశ్యంతోనే ఈ ఉల్లేఖనం ఈ అధ్యాయం క్రింద తీసుకోబడిందేమో!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 747
హదీసు 748
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -نَحَرَ ثَلَاثًا وَسِتِّينَ, وَأَمَرَ عَلِيًّا أَنْ يَذْبَحَ اَلْبَاقِيَ } اَلْحَدِيثَ. رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ స్వయంగా అరవై మూడు ఖుర్బానీ ఒంటెలను జిబహ్ చేశారు. మిగిలిన ఒంటెలను జిబహ్ చేయవలసిందిగా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని కోరారు. -సశేషం… (ముస్లిం)
English
Narrated Jabir (RA): "The Prophet (ﷺ) slaughtered sixty-three (sacrificial) camels and ordered 'Ali to slaughter the remainder [thirty-seven]." The reported mentioned the rest of the Hadith. [Reported by Muslim].
సారాంశం
ఖుర్బానీ పశువులను ‘జిబహ్’ చేయడానికి కూడా తమ ప్రతినిధిని నియమించవచ్చునని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా దైవప్రవక్త ﷺ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని ఇందునిమిత్తం నియమించగా, ఆయన (రదియల్లాహు అన్హు) 37 ఒంటెలను ‘జిబహ్’ చేశారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 748
హదీసు 749
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - فِي قِصَّةِ اَلْعَسِيفِ. قَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -{ وَاغْدُ يَا أُنَيْسُ عَلَى اِمْرَأَةِ هَذَا, فَإِنْ اِعْتَرَفَتْ فَارْجُمْهَا.. } اَلْحَدِيثَ. مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ పాలేరు వృత్తాంతంపై తన తీర్పును వినిపిస్తూ “ఉనైస్! నీవు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళు. ఆమె (తన నేరం) ఒప్పుకుంటే రాళ్ళు రువ్వే మరణ దండన విధించు” అని అన్నారు- సశేషం…. (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Hurairah (RA) regarding the story of the hired servant: The Prophet (ﷺ) said: 'Unais, go (in the morning) to this man's wife, and if she confesses, stone her to death." The reported mentioned the rest of the previous Hadith. [Agreed upon].
సారాంశం
‘హద్దుల ప్రకరణం’లో కూడా ఈ హదీసు రానున్నది. దీని పూర్వాపరాలు ఇలా ఉన్నాయి: ఒక వ్యక్తి ఒక ఆసామీ దగ్గర పాలేరుగా ఉండేవాడు. అతను తన యజమాని భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ విషయం బయటపడింది. అప్పుడు పాలేరు తండ్రికి – ఆ స్త్రీ భర్తకి మధ్య కుదిరిన రాజీ ఒప్పందం ప్రకారం పాలేరు నూరు మేకలను, ఒక బానిసరాలినీ యజమానికి పరిహారంగా ఇచ్చి బయటపడ్డాడు. ఆ తరువాత – వ్యభిచారానికి పాల్పడిన ఆ ఇద్దరికీ షరీయత్పరమైన శిక్ష వినిపించబడింది. అప్పుడు అపరాధులిద్దరూ దైవప్రవక్త ﷺ సమక్షంలోకి వచ్చి, జరిగినదంతా కూలంకషంగా వివరించారు. ఇదంతా విన్న మీదట దైవప్రవక్త ﷺ వ్యభిచారంచేసిన మగవానికి నూరు కొరడా దెబ్బలు కొట్టి, ఒక ఏడాదికాలం పాటు నగరం నుంచి బహిష్కరించే శిక్ష విధించారు. వ్యభిచరించిన స్త్రీ గురించి చెబుతూ, ‘ఆమె గనక తన అపరాధాన్ని ఒప్పుకుంటే రాళ్ళు రువ్వే శిక్ష విధించండి’ అన్నారు. ఈ హదీసును బట్టి నేరస్థుల్ని శిక్షించే విషయమై కూడా తమ ప్రతినిధులను నియమించవచ్చునని తెలుస్తోంది. బహుశా ఈ ఉద్దేశ్యంతోనే రచయిత ఈ హదీసును ఇక్కడ ప్రస్తావించి ఉండవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత|హదీసు 749
You must be logged in to post a comment.