హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.7 ఒడంబడిక

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 7వ అధ్యాయం: ఒడంబడిక. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 735 – 737) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.7 ఒడంబడిక

↑ విషయ సూచిక

باب الصلح

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

735

హదీసు 735

عَنْ عَمْرِو بْنِ عَوْفٍ اَلْمُزَنِيِّ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { اَلصُّلْحُ جَائِزٌ بَيْنَ اَلْمُسْلِمِينَ, إِلَّا صُلْحاً حَرَّمَ حَلَالاً أَوْ أَحَلَّ حَرَاماً، وَالْمُسْلِمُونَ عَلَى شُرُوطِهِمْ, إِلَّا شَرْطاً حَرَّمَ حَلَالاً أَوْ أَحَلَّ حَرَاماً } رَوَاهُ اَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ. وَأَنْكَرُوا عَلَيْهِ;. لِأَنَّ رَاوِيَهُ كَثِيرَ بْنَ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرِوِ بْنِ عَوْفٍ ضَعِيفٌ. وَكَأَنَّهُ اِعْتَبَرَهُ بِكَثْرَةِ طُرُقِهِ. وَقَدْ صَحَّحَهُ اِبْنُ حِبَّانَ مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ.

హజ్రత్ అమ్ర్ బిన్ ఔఫ్ ముజనీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “ముస్లిం సోదరులు తమ మధ్య రాజీ కుదుర్చుకోవటం ధర్మ సమ్మతమే. అయితే ధర్మాన్ని (హలాల్‌ను) అధర్మం (హరామ్)గా, అధర్మాన్ని ధర్మంగా మార్చివేసే రాజీ ఒప్పందాలు చేసుకోవటం మాత్రం సమ్మతం కాదు. ధర్మ సమ్మతమైన వాటిని నిషిద్ధంగా ఖరారుచేసే, నిషిద్ధ విషయాన్ని సమ్మతమైనదిగా ప్రకటించే షరతులను మినహాయించి (మిగిలిన షరతులన్నింటిపై) ముస్లింలు స్థిరంగా ఉండాలి.” (ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి, దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. కాని ఇతర హదీసువేత్తలు ఈయన అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఎందుకంటే దీనిని అందజేసిన వారిలో ఒకతను – కసీర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఔఫ్ – బలహీనుడు. అనేక వైపుల నుండి అందినందువల్ల తిర్మిజీ దీనిని ‘సహీహ్’ గా ఖరారు చేశారేమోననిపిస్తోంది. ఇబ్నె హిబ్బాన్ గారు హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) హదీసు ఆధారంగా దీనిని ప్రామాణికమైందిగా పేర్కొన్నారు)

English

Narrated 'Amr bin 'Auf al-Muzani (RA): Allah's Messenger (ﷺ) said: "Reconciliation is permissible between Muslims, except one which makes unlawful something which is lawful, or makes lawful something which is unlawful; and Muslims must abide by their conditions (which they have made), except for a condition which makes unlawful something which is lawful, or makes lawful something which is unlawful." [at-Tirmidhi reported it and graded it Sahih (authentic)]. However, the Hadith scholars criticized him (for grading this Hadith as Sahih) because the narration of Kathir bin 'Abdullah bin 'Amr bin 'Auf is weak. It is as though at-Tirmidhi considered it (reliable) due to its many chains of narration. Ibn Hibban declared the aforesaid Hadith to be Sahih (authentic) from the narration of Abu Hurairah (RA).

సారాంశం

ఈ హదీసులో కేవలం ముస్లిం సోదరుల మధ్య జరిగే ఒప్పందాల ప్రస్తావన వచ్చింది. కారణం; షరీయత్ ఆజ్ఞలు కేవలం ముస్లింలకే వర్తిస్తాయి. మిగిలిన విషయాల్లో అన్యమతస్తులతో సయితం ఒడంబడికలు చేసుకోవటం సమంజసమే. గ్రంథవహులైన యూదులు, క్రైస్తవులతో కూడా ఒప్పందాలు, సంధులు చేసుకోవచ్చు. బహుదైవారాధకులతో, నాస్తికులతో కూడా ఒప్పందం కుదుర్చుకోవటం సబబే. దైవప్రవక్త ﷺ సయితం స్వయంగా ఇటువంటి ఒప్పందాలు చేసుకున్నారు – ఆయన ﷺ మదీనాలోని యూదులతో, నజరాన్‌కు చెందిన క్రైస్తవులతో ఒప్పందం చేసుకున్నారు. మక్కాకు చెందిన ముష్రిక్కులతో సయితం హుదైబియా ఒడంబడిక చేసుకున్నారు.

సంధులు, ఒడంబడికలు చేసుకునే సమయంలో ఇస్లామీయ షరీయత్‌కు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలి. ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మబద్ధంగా మార్చివేసే ఏ ఒప్పందంపై కూడా వారు సంతకం చేయరాదు. ఉదాహరణకు : ఒక వ్యక్తికి లేక ఒక వర్గానికి మద్దతుగా మరో వ్యక్తిపై లేక మరో వర్గంపై అన్యాయంగా అపవాదు వేయటం, నలుగురిలో నవ్వులపాలు చేయటం అధర్మం (హరామ్)గా భావించబడుతుంది. అలాగే ఎవరయినా తన స్నేహితుణ్ణి ఉద్దేశ్యించి, ‘నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆఖరికి నా భార్యతో సయితం సంబంధం త్రెంచుకుంటాను’ అని ఒట్టేసుకుంటే అది హలాల్‌ను హరామ్‌గా చేసుకోవటమే అవుతుంది. షరీయత్ విధించిన హద్దులకు విరుద్ధంగా లేని ప్రతి ఒప్పందాన్ని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) తప్ప మిగిలిన ముగ్గురు ఇమాములు ధర్మసమ్మతంగానే భావిస్తున్నారు. అయితే ఎదుటి వర్గాన్ని బలవంతంచేసి, ఒత్తిడిద్వారా ఒడంబడిక చేసుకోవటం వాంఛనీయం కాదు. ఉభయ వర్గాలు రాజీపడి చేసుకున్న ఒప్పందమే సరైన ఒప్పందం.

హదీసు ఉల్లేఖకులు

1. అమ్ర్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) – అమ్ర్ బిన్ ఔఫ్ బిన్ జైద్ బిన్ మిల్లా ముజైనీ. ముజైనా తెగకు చెందినవారు. కసీర్ బిన్ అబ్దుల్లాహ్‌కు తాత అవుతారు. తొలి కాలంలోనే ముస్లిం అయ్యారు. బద్ర్‌లో పాల్గొన్నారు. దైవప్రవక్త ﷺ ఈయన్ని హరమె మదీనాకు అధికారిగా నియమించారు. చాలా అధికంగా విలపించేవారు. ముఆవియా (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో మరణించారు.

2. కసీర్ బిన్ అబ్దుల్లాహ్ – హదీసువేత్తలకు ఈయనపై సదభిప్రాయం లేదు. ‘ఇతను అబద్ధపు స్తంభాలలో ఒక స్తంభం’ అని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), అబూదావూద్ (రహిమహుల్లాహ్)లు వ్యాఖ్యానించారు. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)గారైతే, ‘ఈతని హదీసులు త్రోసిపుచ్చదగినవి, వాటిని పట్టించుకోనవసరం లేదు’ అని స్పష్టంగా చెప్పేశారు. ‘అతడు నమ్మకస్తుడు కాడు’ అని నసాయి అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.7 ఒడంబడిక|హదీసు 735

736

హదీసు 736

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏- " قَالَ: { لَا يَمْنَعُ جَارٌ جَارَهُ أَنْ يَغْرِزَ خَشَبَةً فِي جِدَارِهِ ".‏ ثُمَّ يَقُولُ أَبُو هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- مَا لِي أَرَاكُمْ عَنْهَا مُعْرِضِينَ? وَاَللَّهِ لَأَرْمِيَنَّ بِهَا بَيْنَ أَكْتَافِكُمْ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “ఏ ఒక్కరూ తమ గోడకు తమ పొరుగువాడు గూటం (లేక మేకు) కొడితే అభ్యంతరం పెట్టకూడదు.”

అబూహురైర (రదియల్లాహు అన్హు) స్వయంగా ఇలా అనేవారు – “మీరీ హదీసును ఆచరించడానికి వెనుకాడటం నేను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకనీ? దైవసాక్షి! నేను దీన్ని మీ భుజాలపై దిగబెడతాను (మీపై విధించి తీరుతాను).” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "One must not prevent his neighbor from fixing a wooden peg in his wall." Abu Hurairah (RA) then said, "Why do I see you turning away (averse to this Sunnah)? I swear by Allah that I will always narrate it to you." [Agreed upon].

సారాంశం

ఇరుగు పొరుగుకు ఒండొకరిపై ఉన్న హక్కును ఈ హదీసు నొక్కి చెబుతోంది. ఒకరివల్ల ఇంకొకరికి కలిగే కించిత్ అసౌకర్యాన్ని దిగమింగాలనీ, దైవప్రసన్నత కోసం పరస్పరం సర్దుకుపోవాలని కూడా దీన్నిబట్టి అవగతమవుతోంది. అవతల ఉన్నవారు గోడకు మేకు కొట్టినా లేక ప్రహరీ గోడపై బట్టలు ఆరేసుకున్నా, గోడపై లాంతరు పెట్టినా, బల్బు బిగించినా ఇవతల ఉన్న వారికి పెద్దగా ముంచుకుపోయిందేమీ లేదు.

ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్‌హాఖ్ (రహిమహుల్లాహ్)ల దృష్టిలో ఈ హదీసులోని ఆదేశాన్ని పాటించటం తప్పనిసరి (వాజిబ్). దీన్ని కాదన్నవారు పాపాత్ములవుతారు. పొరుగువారు గనక అతని ఈ సహాయ నిరాకరణను మన్నించకపోతే అతడు దైవసమక్షంలో శిక్షార్హుడవుతాడు.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) అంతగట్టిగా శాసించారంటే ఆ రోజుల్లో ఆయన మదీనా నగరానికి ‘అమీర్’గా ఉన్నారు. షరీయత్ ఆదేశాలను సమాజంలో ప్రవేశపెట్టి, వాటి ఆచరణకు సంబంధించి పర్యవేక్షణ జరపవలసిన బాధ్యత అమీర్‌పై ఉంటుంది. మదీనావాసులు (సహాబీలు కారు – సాధారణ జనం) ఈ హదీసును ఆచరించడానికి వెనుకాడటంతో హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కలత చెందారు. దైవప్రవక్త ﷺ ఉపదేశాన్ని గుర్తుచేసి ప్రజలను హెచ్చరించటం తన గురుతర బాధ్యతగా భావించారు – రజి అల్లాహు అన్హు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.7 ఒడంబడిక|హదీసు 736

737

హదీసు 737

وَعَنْ أَبِي حُمَيْدٍ اَلسَّاعِدِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَحِلُّ لِامْرِئٍ أَنْ يَأْخُذَ عَصَا أَخِيهِ بِغَيْرِ طِيبِ نَفْسٍ مِنْهُ } رَوَاهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِمُ فِي " صَحِيحَيْهِمَا ".

హజ్రత్ అబూ హుమైద్ సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “తన సోదరుని కర్ర (లాఠీ) కూడా అతని సమ్మతి, అనుమతితో నిమిత్తం లేకుండా తీసుకోవటం ఏ ఒక్కరికీ ధర్మసమ్మతం కాదు.” (ఇబ్నె హిబ్బాన్, హాకిమ్‌లు దీనిని తమ సహీహ్ గ్రంథాలలో ఉల్లేఖించారు)

English

Narrated Abu Humaid as-Sa'idi (RA): Allah's Messenger (ﷺ) said: "It is not lawful for a person to take his brother's stick except if he is pleased with such." [Ibn Hibban and al-Hakim reported it in their two Sahih books].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.7 ఒడంబడిక|హదీసు 737