హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 6వ అధ్యాయం: దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి. ఈ అధ్యాయంలో 8 హదీసులు (హదీసు 727 – 734) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి

↑ విషయ సూచిక

باب التفليس والحجر

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

727

హదీసు 727

عَنْ أَبِي بَكْرِ بْنِ عَبْدِ اَلرَّحْمَنِ, عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- [ قَالَ ]: سَمِعْنَا رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { مَنْ أَدْرَكَ مَالَهُ بِعَيْنِهِ عِنْدَ رَجُلٍ قَدْ أَفْلَسَ, فَهُوَ أَحَقُّ بِهِ مِنْ غَيْرِهِ } مُتَّفَقٌ عَلَيْهِ. وَرَوَاهُ أَبُو دَاوُدَ, وَمَالِكٌ: مِنْ رِوَايَةِ أَبِي بَكْرِ بْنِ عَبْدِ اَلرَّحْمَنِ مُرْسَلًا بِلَفْظِ: { أَيُّمَا رَجُلٌ بَاعَ مَتَاعًا فَأَفْلَسَ اَلَّذِي اِبْتَاعَهُ, وَلَمْ يَقْبِضِ اَلَّذِي بَاعَهُ مِنْ ثَمَنِهِ شَيْئًا , فَوَجَدَ مَتَاعَهُ بِعَيْنِهِ, فَهُوَ أَحَقُّ بِهِ, وَإِنْ مَاتَ اَلْمُشْتَرِي فَصَاحِبُ اَلْمَتَاعِ أُسْوَةُ اَلْغُرَمَاءِ }. وَوَصَلَهُ اَلْبَيْهَقِيُّ, وَضَعَّفَهُ تَبَعًا لِأَبِي دَاوُدَ. وَرَوَى أَبُو دَاوُدَ, وَابْنُ مَاجَهْ: مِنْ رِوَايَةِ عُمَرَ بْنِ خَلْدَةَ قَالَ: أَتَيْنَا أَبَا هُرَيْرَةَ فِي صَاحِبٍ لَنَا قَدْ أَفْلَسَ, فَقَالَ: لَأَقْضِيَنَّ فِيكُمْ بِقَضَاءِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ أَفْلَسَ أَوْ مَاتَ فَوَجَدَ رَجُلٌ مَتَاعَهُ بِعَيْنِهِ فَهُوَ أَحَقُّ بِهِ } وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَضَعَّفَهُ أَبُو دَاوُدَ, وَضَعَّفَ أَيْضًا هَذِهِ اَلزِّيَادَةَ فِي ذِكْرِ اَلْمَوْتِ.

దైవప్రవక్త ﷺ ప్రవచించగా తాము విన్నామని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) చెప్పినట్లుగా హజ్రత్ అబూబక్ర్ బిన్ అబ్దుర్రహ్మాన్ తెలియజేశారు : “ఎవరయినా దివాలా తీసిన వ్యక్తి దగ్గర తన వస్తువు యధాతథంగా ఉన్నట్టు కనుగొంటే ఆ వస్తువు పాలిట ఇతరులకన్నా అతనే ఎక్కువ హక్కుదారుడు అవుతాడు.”

(బుఖారీ, ముస్లిం)

అబూ దావూద్ మరియు మాలిక్‌లు అబూబక్ర్ బిన్ అబ్దుర్రహ్మాన్ నుండి క్రింది విధంగా ఒక ‘ముర్సల్’ ఉల్లేఖనాన్ని పేర్కొన్నారు. దాని ప్రకారం – “ఎవరయినా ఏదైనా వస్తువును గనక అమ్మితే, కొన్నవాడు దివాలా తీసేస్తే, అమ్మిన వాడికి ఆ వస్తువుకు సంబంధించిన పైకం అప్పటికింకా ఏమాత్రం ముట్టకుండా ఉంటే (అట్టి పరిస్థితిలో) అతడు గనక తన వస్తువును (కొన్న వ్యక్తి వద్ద) యధాస్థితిలో ఉన్నట్టు తెలుసుకుంటే ఆ వస్తువును తీసుకునేందుకు అతనే అందరికన్నా ఎక్కువ హక్కుదారుడు అవుతాడు. ఒకవేళ కొనుగోలుదారుడు మరణిస్తే మట్టుకు ఆ వస్తువు యజమానితో పాటు ఇతర రుణదాతలు కూడా దానిపై సమాన హక్కును పొందుతారు. (బైహఖీ దీనిని ‘మౌసూల్’గా చెప్పినప్పటికీ, అబూదావూద్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ దీనిని బలహీనం (జయీఫ్)గా ఖరారు చేశారు)

అబూదావూద్ మరియు ఇబ్నె మాజా దీనిని ఉమర్ బిన్ ఖల్దా ఉల్లేఖనం ఆధారంగా ఇలా వివరించారు – “మేము దివాలా తీసిన మా సహచరుని విషయమై సంప్రతించడానికి అబూహురైర (రదియల్లాహు అన్హు) దగ్గరికి వచ్చాము. ఆయన (రదియల్లాహు అన్హు) మమ్మల్ని ఉద్దేశ్యించి; ‘నేను మీ వ్యవహారంలో దైవప్రవక్త ﷺ గారిచ్చిన తీర్పునే ఇస్తాను – (అదేమంటే) ఎవరైనా దివాలా తీస్తే లేదా మరణిస్తే (అట్టి స్థితిలో) ఏ మనిషి అయినా అతని వద్ద తన వస్తువు యధారూపంలో ఉన్నట్టు కనుగొంటే అతడే ఆ వస్తువుకు అందరికన్నా ఎక్కువ హక్కుదారుడు అవుతాడు’ అని తెలిపారు.” (దీనిని హాకిమ్ ప్రామాణికమైనదిగా ఖరారు చేయగా, ఇది బలహీనమైనది అని అబూదావూద్ పేర్కొన్నారు. అలాగే ఈ హదీసులో అదనంగా వచ్చిన మరణ ప్రస్తావనను కూడా ఆయన ‘బలహీనమైనది’గా పేర్కొన్నారు)

English

Narrated Abu Bakr bin 'Abdur-Rahman on the authority of Abu Hurairah (RA): We heard Allah's Messenger (ﷺ) say: "If a creditor finds his very property with a debtor who becomes bankrupt, he is more entitled to it than anyone else." [Agreed upon].

Abu Dawud and Malik reported the aforesaid Hadith from the narration of Abu Bakr bin 'Abdur-Rahman, as Mursal (broken chain after the Tabi'i), with this wording: "If anyone sells some goods (on credit) and the one who buys them becomes bankrupt, and the seller does not recover any of the price of his goods, and he then finds his very goods (with him), he is more entitled to them (than anyone else). However, if the buyer dies, the owner of the goods finds his actual goods he has most right to them."

al-Baihaqi reported it with a full chain of narrators but graded it weak, following Abu Dawud.

Abu Dawud and Ibn Majah reported the aforesaid Hadith from the narration of 'Umar bin Khalda which has: "We went to Abu Hurairah (RA) regarding a friend of ours who was bankrupt. He said, "I shall certainly pronounce judgment about him in accordance with the judgement of Allah's Messenger (ﷺ). Whoever becomes bankrupt or dies, and a person finds his actual goods (remaining with that man), he has most right to them.'" [al-Hakim graded it Sahih (authentic); Abu Dawud graded it Da'if (weak). He also considered this addition of the mention of 'death' to be weak].

సారాంశం

ఈ హదీసులో తెలియజేయబడిన విషయాన్ని విడమరచి చెప్పాలంటే; ఎవరయినా ఒక వ్యక్తి ఒక మనిషి వద్ద అరువుగా సరుకు కొంటాడు. సరుకు కొన్న కొన్నాళ్ళకే ఏవో కారణాలవల్ల అతడు దివాలా తీస్తాడు. అప్పు చెల్లించడానికి తన వద్ద డబ్బు ఏమీ లేదని చేతులెత్తేశాడు. అలాంటి పరిస్థితిలో అతనికి సరుకును అమ్మిన వ్యక్తి వచ్చి తనిఖీ చేయగా, తాను అరువుగా అమ్మిన వస్తువు అతని దగ్గర యధాతథంగా ఉన్నట్టు కనిపించింది. అటువంటి వస్తువును అమ్మకందారుడు నిస్సంకోచంగా తీసేసుకుని అతనితో చేసుకున్న వ్యాపార ఒప్పందాన్ని రద్దుపరచుకోవచ్చు. అత్యధికమంది విద్వాంసుల అభిప్రాయం కూడా ఇదే.

అయితే హనఫీల అభిమతం దీనికి కొంత భిన్నంగా ఉంది. హనఫీ పండితుల ప్రకారం ఆ అమ్మకందారుడు ఒక్కడే ఆ వస్తువుకు హక్కుదారుడు కాడు. దివాలా తీసిన వ్యక్తి ఎంత మందికి బాకీ పడ్డాడో వారందరికీ ఆ వస్తువు (నిష్పత్తిని బట్టి) చెందాలి. కాని ఈ అభిమతం హదీసు మూలంతో సమరసం చెందటం లేదన్నది గమనార్హం.

హదీసు ఉల్లేఖకులు

(1) అబూబక్ర్ బిన్ అబ్దుర్రహ్మాన్ : ఈయన పూర్తి వంశపరంపర ఈ విధంగా ఉంది. అబూబక్ర్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ హారిస్ బిన్ హిషామ్ బిన్ ముగీరా మఖ్జూమ్ మదనీ. మదీనా మునవ్వరాకు ఖాజీగా నియమితులయ్యారు. ఈయన అసలు పేరు ముహమ్మద్ అనీ, ముగీరా అనీ, అబూబక్ర్ అనీ విభిన్న వాదనలున్నాయి. ఈయన మారుపేరు అబూ అబ్దుర్రహ్మాన్ అని కొందరన్నారు. ఈయన మారుపేరే అసలు పేరని మరికొందరు పేర్కొన్నారు. గొప్ప ధర్మవేత్త. ధర్మపరాయణులు. నమ్మకస్థులు. మహాప్రవక్త ﷺ అనుయాయులలో మూడో తరానికి చెందినవారు. వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ ఖిలాఫత్ కాలంలో మరణించారు. హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) నుండి ఈయన హదీసులు విన్నట్టు రుజువయింది.

(2) ఉమర్ బిన్ ఖల్దా : ఈయన మారుపేరు అబూ హఫ్స్. మదీనాకు చెందిన అన్సార్ వర్గీయులు. ఖాజీ పదవిని పొందారు. దైవభీతి గలవారు. సదాచార సంపన్నులు. సౌశీల్యం, పారిశుద్ధ్యం విషయంలో సాటిలేని మేటి. పరాక్రమశాలి. శత్రువులను గడగడలాడించే గాంభీర్యం ఆయన సొత్తు అనాలి. ఈయన హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) నుండి హదీసులను ఉటంకించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 727

728

హదీసు 728

وَعَنْ عَمْرِو بْنِ اَلشَّرِيدِ, عَنْ أَبِيهِ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَيُّ اَلْوَاجِدِ يُحِلُّ عِرْضَهُ وَعُقُوبَتَهُ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَعَلَّقَهُ اَلْبُخَارِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ అమ్ర్ బిన్ షరీద్ తన తండ్రిగారైన షరీద్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఉల్లేఖించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “ధనవంతుడు రుణం తీర్చటంలో తాత్సారం చేయటం అంటే తనను తాను అవమానపరచుకోవటం మరియు శిక్షార్హునిగా నిలబెట్టుకోవటమే.” (దీనిని అబూదావూద్ మరియు నసాయి ఉల్లేఖించారు. బుఖారీ దీని పరంపరను ప్రస్తావించకుండానే నకలు చేశారు. అయితే ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైందిగా ఖరారు చేశారు)

English

Narrated 'Amr bin ash-Sharid on the authority of his father: Allah's Messenger (ﷺ) said: "Delay in payment on the part of one who possesses the means, makes it lawful to dishonor and punish him." [Abu Dawud and an-Nasa'i reported it. al-Bukhari reported it as Mu'allaq (broken chain from the side of the Hadith collector), and Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

శ్రీమంతుడు, ఆర్ధికస్థోమత గల వ్యక్తి తాను రుణం చెల్లించగల తాహతు ఉండి కూడా పేరాశ, ధనవ్యామోహంవల్ల రుణం చెల్లించడానికి తాత్సారం చేయటం, కుంటిసాకులు చెప్పటం, వాయిదాలు వేయటం అనర్ధదాయకం. ఇలాంటి వ్యక్తి తన అవాంఛనీయ ధోరణి ద్వారా రుణదాత సహనాన్ని పరీక్షించి, పరీక్షించి చివరకు అతని చేత నానా చీవాట్లు పెట్టించుకుంటాడు. అప్పటి వరకూ సొసైటీలో అతనికున్న పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయి. అప్పటికీ అతని నైజంలో మార్పు రాకపోతే కోర్టుకీడ్వబడతాడు. కోర్టులో శిక్ష పడినా పడవచ్చు. ఈ కష్టాలన్నీ చేతులారా అతను కొనితెచ్చుకున్నవే గాని మరొకరి వల్ల వచ్చినవి కావు. కాబట్టి రుణం తీసుకున్న వారు అకారణంగా చెల్లింపును దాటవేయకుండా వీలైనంత త్వరగా ఆ బాధ్యతనుండి విముక్తి పొందేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.

హదీసు ఉల్లేఖకులు

(1) అమ్ర్-ఈయన మారు పేరు అబుల్ వలీద్. తాయఫ్ వాసులు. సఖీఫ్ తెగకు చెందిన వారు. అందుకే తాయఫీగా, సఖఫీగా కూడా పిలువబడ్డారు. విశ్వసనీయులైన తాబయి. ప్రవక్త ﷺ సహచరులలో మూడో కోవకు చెందినవారు.

(2) షరీద్ (రదియల్లాహు అన్హు) : షరీద్ బిన్ సువైద్ సఖఫీ. మొదట ఈయన పేరు మాలిక్. దైవప్రవక్త ﷺ ఈయన పేరును మార్చి షరీద్ అని నామకరణం చేశారు. ఎందుకంటే ఈయన తన జాతికి చెందిన ఒక వ్యక్తిని హతమార్చి మక్కాకు వచ్చారు. అనంతరం ఇస్లాం స్వీకరించారు. ఈయన హజర్ మోత్‌కు చెందినవారన్న వాదన కూడా ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 728

729

హదీసు 729

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: { أُصِيبَ رَجُلٌ فِي عَهْدِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فِي ثِمَارٍ اِبْتَاعَهَا, فَكَثُرَ دَيْنُهُ, فَأَفْلَسَ, فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-" تَصَدَّقُوا عَلَيْهِ " فَتَصَدَّقَ اَلنَّاسُ عَلَيْهِ, وَلَمْ يَبْلُغْ ذَلِكَ وَفَاءَ دَيْنِهِ, فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-لِغُرَمَائِهِ: " خُذُوا مَا وَجَدْتُمْ, وَلَيْسَ لَكُمْ إِلَّا ذَلِكَ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ కాలంలో ఒక వ్యక్తి పండ్ల వ్యాపారంలో (బాగా) నష్టపోయాడు. తత్కారణంగా అతడు అప్పులపాలవటమే గాక ఆఖరికి బికారిగా తయారయ్యాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ, “ఇతనికి దానధర్మాలు ఇవ్వండి” అని ప్రజలకు సూచించారు. ప్రజలతనికి దానాలు (సదకాలు) ఇచ్చారు గాని ఆ దానాలతో కూడా అప్పులు తీరేటట్టు కనిపించలేదు. అప్పుడు దైవప్రవక్త ﷺ అతని రుణదాతలనుద్దేశించి, “(ఇతన్నుండి) వచ్చినమటుకే తీసుకోండి. ఇంతకు మించి మీ కోసం ఏమీలేదు” అని చెప్పారు. (ముస్లిం)

English

Narrated Abu Sa'id al-Khudri (RA): In the time of Allah's Messenger (ﷺ) a man suffered a loss affecting fruits he had bought, owed a large debt and became bankrupt. So, Allah's Messenger (ﷺ) said to the people, "Give him Sadaqah (charity)." Hence, the people gave him charity. However, that was not enough to repay his debt in full. Therefore, Allah's Messenger (ﷺ) said to the creditors, "Take whatever you find, and you will have nothing other than that." [Reported by Muslim].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 729

730

హదీసు 730

وَعَنِ اِبْنِ كَعْبِ بْنِ مَالِكٍ, عَنْ أَبِيهِ; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-حَجَرَ عَلَى مُعَاذٍ مَالَهُ, وَبَاعَهُ فِي دَيْنٍ كَانَ عَلَيْهِ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَأَخْرَجَهُ أَبُو دَاوُدَ مُرْسَلًا, وَرَجَّحَ إِرْسَالَهُ.

హజ్రత్ ఇబ్నె కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) తన తండ్రి ఆధారంగా చేసిన ఉల్లేఖనం: దైవప్రవక్త ﷺ హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)కు ఆయన ఆస్తిపాస్తులను ఖర్చు చేయకుండా స్థంభింపజేశారు (సీజ్ చేశారు). తరువాత ఆయన ఇతరులకు ఇవ్వవలసివున్న బకాయి లకు బదులుగా ఆ ఆస్తిని అమ్మివేయించారు. (ఈ హదీసును దారె ఖుత్నీ ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. అయితే అబూదావూద్ దీనిని ‘ముర్సల్’గా పేర్కొనటమేగాక, ముర్సల్‌గా పరిగణించటానికే ప్రాధాన్యత నివ్వాలని అన్నారు)

English

Narrated Ibn Ka'b bin Malik (RA) on the authority of his father: Allah's Messenger (ﷺ) seized the wealth of Mu'adh and sold it in return for a debt he was indebted for. [ad-Daraqutni reported it, and al-Hakim graded it Sahih (authentic). Abu Dawud reported it as Mursal (missing link after the Tabi'i) and considered that the strongest opinion is that it is Mursal].

సారాంశం

ఏ పౌరుడైనా పీకలలోతు అప్పుల్లో మునిగిపోతే రాజ్యాధికారిగానీ, ప్రభుత్వాధికారిగానీ జోక్యం చేసుకుని అతని ఆస్తిపాస్తులను, బ్యాంక్ బ్యాలెన్సులను స్థంభింపజేయవచ్చుననీ, ఆస్తుల లెక్క కట్టి అప్పుల వాళ్ళకు తలోకాస్త పంచిపెట్టడం కూడా చేయవచ్చుననీ ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ప్రభుత్వం గనక ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే, ఎగ్గొట్టే ఉద్దేశ్యం ఉన్న వారు తమ పలుకుబడిని ఉపయోగించి ఆస్తులను ఇతరుల పేర్ల మీద బదిలీ చేయటమో, తప్పుడు లెక్కలు చూపటమో చేసి పరుల సొమ్మును స్వాహా చేస్తారు. ఇలాంటి దగుల్బాజీల మూలంగా సమాజంలో సౌమనస్యం, సుహృద్భావం అంతరించి వైమనస్యం, వైరభావం చోటుచేసుకుంటాయి. అవి క్రమక్రమంగా కక్షలు, కార్పణ్యాలకు దారితీసి ప్రజా జీవితాన్ని దుర్భరం చేస్తాయి.

హదీసు ఉల్లేఖకులు

(1) ఇబ్నె కాబ్ : మారు పేరు అబుల్ ఖత్తాబ్. పూర్తిపేరు అబ్దుర్రహ్మాన్ బిన్ కాబ్ బిన్ మాలిక్ అన్సారీ. మదీనా వాస్తవ్యులు. అగ్రశ్రేణి తాబయీన్లలో ఒకరు. విశ్వసనీయులు. దైవప్రవక్త ﷺ కాలంలో జన్మించారనీ, సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఖిలాఫత్ కాలంలో మరణించారనీ అనబడుతుంది.

(2) కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) – కాబ్ బిన్ మాలిక్ బిన్ అబూ కాబ్ అన్సారీ. సులైమ్ తెగకు చెందినవారు. మదీనా వాస్తవ్యులు. ‘రెండవ అఖబా ప్రమాణం’లో పాల్గొన్నారు. బద్ర్, తబూక్ యుద్ధాలు మినహా మిగిలిన పోరాటాలన్నింటిలో పాల్గొన్నారు. తబూక్ యుద్ధ సందర్భంగా వెనుక ఉండిపోయిన ముగ్గురు ప్రముఖ సహాబీలలో ఈయన ఒకరు. ఈయన చెందిన పశ్చాత్తాపం ఎంత గొప్పదంటే అది దేవుని దర్బారులో సమ్మతించి ఆమోదించబడినట్లు శుభవార్త ఇవ్వబడింది. ఒక ఉల్లేఖనం ప్రకారం హిజ్రీ 50లో, వేరొక ఉల్లేఖనం ప్రకారం హిజ్రీ 51లో – 77 సంవత్సరాల వయస్సులో ఈయన మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 730

731

హదీసు 731

وَعَنِ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { عُرِضْتُ عَلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-يَوْمَ أُحُدٍ, وَأَنَا اِبْنُ أَرْبَعَ عَشْرَةَ سَنَةً, فَلَمْ يُجِزْنِي, وَعُرِضْتُ عَلَيْهِ يَوْمَ اَلْخَنْدَقِ, وَأَنَا اِبْنُ خَمْسَ عَشْرَةَ سَنَةً, فَأَجَازَنِي } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ لِلْبَيْهَقِيِّ: " فَلَمْ يُجِزْنِي, وَلَمْ يَرَنِي بَلَغْتُ ".‏ وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఉహుద్ యుద్ధం జరిగిన రోజున నేను దైవప్రవక్త ﷺ సమక్షంలో హాజరుపరచబడ్డాను. అప్పటికి నాకు 14 ఏండ్లే. నేను యుద్ధంలో పాల్గొనేందుకు ఆయన ﷺ నిరాకరించారు. కందక (అగడ్త) యుద్ధం మొదలైన రోజున కూడా నేను ఆయన ﷺ సమక్షంలో హాజరుపరచబడ్డాను. అప్పటికి నాకు 15 ఏండ్లు నిండాయి. అప్పుడాయన ﷺ యుద్ధం చేయడానికి నాకు అనుమతి ఇచ్చారు. (బుఖారీ, ముస్లిం)

బైహఖీ ఉల్లేఖనంలో ఇలా వుంది : “ఆయన ﷺ నాకు అనుమతి ఇవ్వలేదు. నాకింకా యుక్త వయసు రాలేదనుకున్నారు.” (ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికంగా పేర్కొన్నారు)

English

Narrated Ibn 'Umar (RA): I was brought before the Prophet (ﷺ) on the Day of Uhud when I Was fourteen years old, but he did not give me permission (to fight). I was afterwards brought to him on the Day of al-Khandaq (the Battle of Trench) when I was fifteen years of age, and he gave me permission (to fight). [Agreed upon].

al-Baihaqi's narration has: "He did not give me permission (to fight), and did not consider me has having attained puberty." [Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

యుద్ధానికి సంబంధించిన ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఔచిత్యం ఏమిటీ? అన్న ప్రశ్న ఇక్కడ జనించవచ్చు. 15 ఏండ్ల ప్రాయంలో మనిషి లావాదేవీలు జరపటానికి, వ్యవహారం చేయడానికి అర్హుడవుతాడని తెలియజెప్పటమే దీని ఉద్దేశం కావచ్చు. మగవారు 15 ఏండ్లకు ముందు పిన్నలుగా, 15 ఏండ్లు నిండగానే యువకులుగా పరిగణించబడతారని ఈ హదీసు చెబుతోంది. 15 ఏండ్లకన్నా తక్కువ వయసు వున్న వారిని సిపాయిల రిక్రూట్‌మెంట్ జరపరాదని కూడా ఈ హదీసు ద్వారా అర్థమవుతోంది. సిపాయిలను భర్తీ చేసే సమయంలో వయస్సుతోపాటు వారి ఆరోగ్యాన్ని, శరీర సౌష్ఠవాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న సంగతి కూడా దీనిద్వారా బోధపడుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 731

732

హదీసు 732

وَعَنْ عَطِيَّةَ اَلْقُرَظِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: { عُرِضْنَا عَلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-يَوْمَ قُرَيْظَةَ، فَكَانَ مَنْ أَنْبَتَ قُتِلَ, وَمَنْ لَمْ يُنْبِتْ خُلِّيَ سَبِيلُهُ, فَكُنْتُ مِمَّنْ لَمْ يُنْبِتْ فَخُلِّيَ سَبِيلِي } رَوَاهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ، وَالْحَاكِمُ.

హజ్రత్ అతియ్య ఖురజీ (రదియల్లాహు అన్హు) కథనం : “బనూ ఖురైజాతో జరిగిన యుద్ధ సందర్భంగా మేము దైవప్రవక్త ﷺ సమక్షంలో హాజరుపరచబడ్డాము. ఎవరి నాభి క్రింద రోమాలు మొలచి ఉన్నాయో వారు వధించబడ్డారు. మరెవరికి (రోమాలు) మొలవలేదో వారు వదలివేయబడ్డారు. రోమాలు మొలవని వారిలో నేనూ ఉన్నాను. అందుచేత నేను కూడా వదలివేయబడ్డాను.” (దీనిని నలుగురు ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ మరియు హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated 'Atiyyah al-Qurazi (RA): We were brought before the Prophet (ﷺ) on the day of Quraizah. Those who had began to grow hair (on their private parts) were killed, while who had not, were set free. I was among those who had not begun to grow hair, so I was set free. [Reported by al-Arba'a. Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic)].

సారాంశం

పూర్వాపరాలను తెలుసుకోకుండా ఈ హదీసును చదివిన వారిలో అపార్థాలు జనించే అవకాశం ఉంది. అసలేం జరిగిందంటే అహ్జబ్ యుద్ధం ముగిసిన వెంటనే ముస్లిం సేనలు బనూ ఖురైజ అనే తెగతో తలపడవలసి వచ్చింది. దీనికి కారణం; అహ్జబ్ యుద్ధ సందర్భంగా బనూ ఖురైజ ముస్లింలతో చేసుకున్న మైత్రీ ఒప్పందాన్ని భగ్నం చేసి, శత్రు సైన్యంతో కుమ్మక్కు అవటమే. బనూ ఖురైజ చేసిన ఈ ద్రోహానికి, వంచనకుగాను వారిని శిక్షించాలని నిర్ణయం గైకొనబడింది. అయితే తమ వ్యవహారంలో హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) చేసే తీర్పును మాత్రమే తాము శిరసావహిస్తామని బనూ ఖురైజ సర్దారులు షరతు పెట్టారు. హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) తమపట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారని బనూ ఖురైజ ఆశించింది. ఎందుకంటే బనూ ఖురైజాకు – హజ్రత్ సాద్‌కు చెందిన ఔస్ తెగకు మధ్య ప్రాచీన కాలం నుండే మైత్రీ సంబంధాలున్నాయి.

ఎట్టకేలకు హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) తీర్పరిగా వచ్చి, బనూ ఖురైజాలో యుద్ధం చేయగల యువకులను హతమార్చాలనీ, వారి మహిళలను, పిల్లలను బానిసరాళ్లుగా, సేవకులుగా చేసుకోవాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ననుసరించి యుక్త వయస్సులను హతమార్చి, పిన్న వయస్సులను వదలివేయటం జరిగింది. కొంతమంది విషయంలో వారు యుక్త వయస్సులా? కాదా? అన్న సంశయం ఏర్పడింది. అలాంటి వారికి బట్టలు విప్పి తనిఖీ చేశారు- నాభి క్రింద, మర్మాంగం వద్ద, చంకలలో రోమాలు మొలచిఉన్న వారికి మరణ దండన విధించి మిగిలినవారిని వదలివేశారు.

మర్మస్థానాలలో రోమాలు మొలవటం యుక్త వయస్సుకు ఒక తార్కాణమని కూడా ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. రోమాలు వచ్చిన వారికి షరీయత్ పరమైన ఆదేశాలన్నీ వర్తిస్తాయి. ఈ విషయంలో అందరిమధ్యా ఏకాభిప్రాయం ఉంది. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) మరియు ఇస్‌హాఖ్ (రహిమహుల్లాహ్)లు యుక్త వయస్సుకు చేరారనడానికి మూడు చిహ్నాలు ప్రస్తావించారని ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) తెలిపారు. అవేమంటే; (1) వయస్సు 15 ఏండ్లు నిండాలి లేదా (2) వీర్య స్ఖలనం జరగటం మొదలవ్వాలి. (3) ఈ రెంటి నిర్ధారణ కూడా జరక్కపోతే నాభిక్రింద మొలచిన రోమాలను యుక్త వయస్సుకు నిదర్శనంగా పరిగణించాలి.

హదీసు ఉల్లేఖకులు

అతియ్య ఖురజీ (రదియల్లాహు అన్హు) – బనూ ఖురైజాకు చెందిన వ్యక్తి కావటం వల్ల ఖురజీగా వ్యవహరించబడ్డారు. యువ సహాబీలలో ఒకరు. ఈయన ద్వారా ఒక్క హదీసు మాత్రమే వివరించబడింది. కూఫాలో స్థిరపడ్డారని అనబడుతోంది. ఈయన తండ్రి పేరేమిటో తాను తెలుసుకోలేకపోయానని అల్లామా ఇబ్నె అబ్దుల్ బర్ర్ తెలిపారు. ముజాహిద్ తదితరులు ఆయన కథనాన్ని ఉదాహరించేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 732

733

హదీసు 733

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا يَجُوزُ لِاِمْرَأَةٍ عَطِيَّةٌ إِلَّا بِإِذْنِ زَوْجِهَا } وَفِي لَفْظٍ: { لَا يَجُوزُ لِلْمَرْأَةِ أَمْرٌ فِي مَالِهَا, إِذَا مَلَكَ زَوْجُهَا عِصْمَتَهَا } رَوَاهُ أَحْمَدُ, وَأَصْحَابُ اَلسُّنَنِ إِلَّا اَلتِّرْمِذِيَّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుంచి, ఆయన తన తాతగారి నుండి గ్రహించిన ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “ఏ స్త్రీ కూడా తన భర్త అనుమతి లేకుండా కానుక ఇవ్వటం సమ్మతం కాదు.” వేరొక ఉల్లేఖనంలో ఉంది : “ఏ స్త్రీ కూడా, తన భర్త తన శీలానికి రక్షకుడుగా ఉండగా ఆమె తన అధీనంలోని సొమ్ము విషయంలో సర్వస్వతంత్రంగా వ్యవహరించజాలదు.”(దీనిని అహ్మద్ మరియు అస్హాబె సునన్ (తిర్మిజీ తప్ప) ఉల్లేఖించారు – హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Narrated 'Amr bin Shu'aib on his father'ss authority from his grandfather (RA): Allah's Messenger (ﷺ) said: "It is not permissible to give a gift without her husband's permission."

Another wording is: "It is not permissible for a woman to dispose anything of her wealth if her husband is responsible for her." [Reported by Ahmad and the collectors of as-Sunan except at-Tirmidhi and al-Hakim graded it Sahih (authentic)].

సారాంశం

స్త్రీ తన స్వంత సొమ్మును కూడా భర్త అనుమతి లేకుండా తన ఇష్టానుసారం ఖర్చుపెట్టజాలదని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. ప్రఖ్యాత తాబయి హజ్రత్ తావూస్ (రహిమహుల్లాహ్) ఈ హదీసు వెలుగులో ఫత్వా ఇస్తూ, “ఏ స్త్రీ కూడా తన స్వంత ఆస్తిని సయితం భర్తను సంప్రతించకుండా ఇష్టానుసారం ఖర్చుపెట్టుకోకూడదు” అని అన్నారు. స్త్రీ మూడవ వంతు భాగాన్ని భర్త అనుమతి లేకుండా ఖర్చుపెట్టుకోగలదని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. అయితే మిగిలిన ముగ్గురు ఇమాములు, మరియు అధిక సంఖ్యాక పండితులు; స్త్రీకి తన స్వంత ఆస్తిని తన అభీష్టం మేరకు ఖర్చుపెట్టుకునే అనుమతి ఉంది అని భావిస్తున్నారు. స్త్రీకి ఆమె భర్త నుండి మహర్ రూపంలో ఇవ్వబడే సొమ్ము ఆమె స్వంత సొమ్ము అవుతుంది. అలాగే తల్లిదండ్రుల తరపున, ఆమె బంధువుల తరపున ఆమెకు ముట్టే కానుకలు, ఆస్తులు కూడా ఆమె ప్రాపర్టీగానే పరిగణించబడతాయి. అదీగాక ఆమె పెట్టిన పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు కూడా ఆమెకే చెందుతాయి. వాటిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కూ లేదు. అందువల్ల ఆమె తన సొమ్మును తన ఇష్టానుసారం ఖర్చుపెట్టుకోగలదు. దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో దైవమార్గంలో ఖర్చుపెట్టమని వచ్చిన ఆదేశం వాంఛించేది కూడా ఇదే. అయినప్పటికీ ఈ ఖర్చుల విషయంలో భార్య తన భర్తను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, అతని సమ్మతిని కూడా పొందుతూ ఉంటే ఎలాంటి అరమరికలు ఉండవు. పైగా ఇలాంటి సంప్రతింపుల వల్ల ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం మరింత పటిష్ఠవంతమవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 733

734

హదీసు 734

وَعَنْ قَبِيصَةَ بْنِ مُخَارِقٍ [ اَلْهِلَالِيِّ ] ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَلْمَسْأَلَةَ لَا تَحِلُّ إِلَّا لِأَحَدِ ثَلَاثَةٍ: رَجُلٍ تَحَمَّلَ حَمَالَةً فَحَلَّتْ لَهُ اَلْمَسْأَلَةُ حَتَّى يُصِيبَهَا ثُمَّ يُمْسِكَ، وَرَجُلٍ أَصَابَتْهُ جَائِحَةٌ اِجْتَاحَتْ مَالَهُ, فَحَلَّتْ لَهُ اَلْمَسْأَلَةُ حَتَّى يُصِيبَ قِوَامًا مِنْ عَيْشٍ، وَرَجُلٍ أَصَابَتْهُ فَاقَةٌ حَتَّى يَقُولَ ثَلَاثَةٌ مِنْ ذَوِي الْحِجَى مِنْ قَوْمِهِ: لَقَدْ أَصَابَتْ فُلَانًا فَاقَةٌ, فَحَلَّتْ لَهُ اَلْمَسْأَلَةُ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఖబీస బిన్ ముఖారిఖ్ హలాలీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రవచించారు – “ముగ్గురు మనుషులకు తప్ప వేరొకరికి యాచించటం ధర్మసమ్మతం కాదు. (వారిలో) ఒకడు : పూచీకత్తుపై ఉన్నవాడు. అతడు ఆ నష్ట పరిహారం చెల్లించేవరకూ యాచించవచ్చు. ఆ తరువాత యాచించడం మానుకోవాలి. మరొకడు : ఏదైనా ఆపదకు గురై, దాని మూలంగా సర్వస్వాన్నీ కోల్పోయినవాడు. తన బ్రతుకుతెరువుకు సంబంధించి ఏదైనా ఏర్పాటు జరిగేవరకూ అతడు యాచించటం ధర్మసమ్మతమే. ఇంకొకడు : పస్తులుండవలసిన స్థితికి గురైనవాడు- అయితే అతని ఆ దురవస్థ నిజమేనని ఆ జాతికి చెందిన ముగ్గురు విశ్వసనీయులైన వ్యక్తులు సాక్ష్యం ఇవ్వాలి – ఈ వ్యక్తి కూడా యాచించటం ధర్మసమ్మతమే.” (ముస్లిం)

English

Narrated Qabisa bin Mukhariq al-Hilali (RA): Allah's Messenger (ﷺ) said: "Begging is not lawful except to one of three (people): a man who has become a guarantor for a payment, for whom begging is lawful till he gets it, after which he must stop begging; a man whose wealth has been destroyed by a calamity which has befallen him, for whom begging is lawful till he gets what will support life; and a man who has been struck by poverty, the genuineness of which is confirmed by three intelligent members of his people, so it is lawful for him to beg." [Reported by Muslim].

సారాంశం

పై హదీసులో మూడు రకాల మనుషులకు మాత్రమే చేయి చాచి అర్థించటానికి అనుమతి ఇవ్వబడింది. అదీ అనేక షరతులతో ఆమోదించటం జరిగింది. వారికోసం కూడా గడువు విధించబడింది. వారిలో మొదటి వ్యక్తి (పూచీకత్తుపై ఉన్నవాడు) దరిద్రుడు కాకపోయినప్పటికీ అతడు ప్రజల నుండి అడుక్కుని పరిహారాన్ని చెల్లించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి|హదీసు 734