హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 5వ అధ్యాయం: అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి. ఈ అధ్యాయంలో 8 హదీసులు (హదీసు 719 – 726) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి
أبواب السلم والقرض والرهن
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 719
عَنِ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَدِمَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -اَلْمَدِينَةَ, وَهُمْ يُسْلِفُونَ فِي اَلثِّمَارِ اَلسَّنَةَ وَالسَّنَتَيْنِ, فَقَالَ: { مَنْ أَسْلَفَ فِي تَمْرٍ فَلْيُسْلِفْ فِي كَيْلٍ مَعْلُومٍ, وَوَزْنٍ مَعْلُومٍ, إِلَى أَجَلٍ مَعْلُومٍ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِلْبُخَارِيِّ: " مَنْ أَسْلَفَ فِي شَيْءٍ ".
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ మదీనాకు ఏతెంచినపుడు (చూస్తే) మదీనావాసులు పండ్లు ఫలాల విషయంలో ఒక్కో సంవత్సరం, రెండేసి సంవత్సరాల అడ్వాన్సు చెల్లింపు ప్రాతిపదికపై వ్యాపారం చేస్తుండేవారు. అప్పుడు ఆయన ﷺ వారికి ఇలా ఉపదేశించారు – “ఎవరయినా పండ్ల కొరకు అడ్వాన్సు చెల్లిస్తే ఆ పండ్ల బరువు, కొలత, పరిమాణాలతోపాటు గడువును కూడా నిర్ధారించుకోవాలి.” (బుఖారీ, ముస్లిం) బుఖారీలో, “ఏ వ్యక్తి అయినా ఏదేని సరుకు విషయంలో అడ్వాన్సుగా ఇస్తే” అన్న వాక్యం ఉంది.
English
Narrated Ibn 'Abbas (RA): When the Prophet (ﷺ) came to al-Madinah, they were paying one and two years in advance for fruits. So he (ﷺ) said: "Those who paid in advance for fruits must do so for a specified measurement and weight, and for a specified time." [Agreed upon].
al-Bukhari has: "Those who pay in advance for anything."
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 719
హదీసు 720
وَعَنْ عَبْدِ اَلرَّحْمَنِ بْنِ أَبْزَى، وَعَبْدِ اَللَّهِ بْنِ أَبِي أَوْفَى -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَا: { كُنَّا نُصِيبُ اَلْمَغَانِمَ مَعَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -وَكَانَ يَأْتِينَا أَنْبَاطٌ مِنْ أَنْبَاطِ اَلشَّامِ, فَنُسْلِفُهُمْ فِي اَلْحِنْطَةِ وَالشَّعِيرِ وَالزَّبِيبِ - وَفِي رِوَايَةٍ: وَالزَّيْتِ - إِلَى أَجَلٍ مُسَمًّى. قِيلَ: أَكَانَ لَهُمْ زَرْعٌ? قَالَا: مَا كُنَّا نَسْأَلُهُمْ عَنْ ذَلِكَ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్జా, అబ్దుల్లాహ్ బిన్ అబూ ఔఫాల కథనం: “మేము దైవప్రవక్త ﷺతో కలసి (యుద్ధాలలో పాల్గొనేవారము) విజయ ప్రాప్తిగా వచ్చిన వాటాను తీసుకునేవాళ్ళం. సిరియా రాజ్యానికి చెందిన వ్యవసాయదారులు మా వద్దకు వస్తుండేవారు. మేము వారికి గోధుమలు, బార్లీ, ఎండు ద్రాక్ష – ఒక ఉల్లేఖనంలో జైతూన్ నూనె అని ఉంది – కోసం అడ్వాన్సు ఇచ్చి ఒక నిర్దీత గడువుపై ఒప్పందం చేసుకునేవారు. ‘వాళ్ళు స్వయంగా వ్యవసాయం చేసే వాళ్ళా?’ అని ప్రశ్నించబడగా ‘మేమెప్పుడూ ఈ సంగతి వాళ్ళను అడగలేదు’ అని వారు సమాధానమిచ్చారు. (బుఖారీ)
English
Narrated 'Abdur-Rahman bin Abza and 'Abdullah bin Abu Aufa (RA): "We were getting a portion of the spoils of war along with Allah's Messenger (ﷺ), and some Nabateans (Arabs who mixed with non-Arabs and corrupted their language and lineage) from those of Syria used to come to us and we would pay in advance to them for wheat, barley and raisins – A narration has: 'and olive oil' – for a specified fixed time." It was asked, "Did they have standing crop?" They replied, "We were not asking them about that." [Reported by al-Bukhari].
సారాంశం
అడ్వాన్సు చెల్లించే నాటికి ఆయా వస్తువులు అందుబాటులో లేకపోయినప్పటికీ అందులో తప్పులేదని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. అయితే గడువు ముగిసేనాటికి ఆ సరుకు సరఫరా కావాలి అన్నది షరతు. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం ఇదే. అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారి అభిప్రాయంలో ఒప్పందం జరిగే నాటినుంచీ గడువు ముగిసే వరకూ ఆ వస్తువులు అందుబాటులో ఉండితీరాలి. ఎందుకంటే ఆ వస్తువుల కొరత గనక ఏర్పడి ఉంటే గడువు ముగిసే సమయానికి లభ్యం కాకపోవచ్చు.
హదీసు ఉల్లేఖకులు
అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్జా (రదియల్లాహు అన్హు). ఈయన ఖుజాఅ తెగకు చెందిన వారు. పిన్న వయస్సులైన సహాబీలలో ఒకరు. ఖుజాఅ తెగ తరపున స్వాతంత్ర్య మొసగబడిన బానిస. ఈయన దైవప్రవక్త ﷺను చూచారు. ఆయన ﷺ సారధ్యంలో నమాజ్ కూడా చేశారు. కూఫాలో స్థిరపడ్డారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తన పరిపాలనా కాలంలో ఈయన్ని ‘ఖురాసాన్’కు అధికారిగా నియమించారు. ఈయన కూఫాలోనే కన్నుమూశారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 720
హదీసు 721
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { مَنْ أَخَذَ أَمْوَالَ اَلنَّاسِ يُرِيدُ أَدَاءَهَا, أَدَّى اَللَّهُ عَنْهُ, وَمَنْ أَخَذَهَا يُرِيدُ إِتْلَافَهَا, أَتْلَفَهُ اَللَّهُ تَعَالَى } رَوَاهُ اَلْبُخَارِيُّ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “ఎవరైతే జనుల సొమ్మును (అప్పుగా) తీసుకుని దాన్ని తిరిగి చెల్లించాలని ఆరాటపడుతుంటాడో అతని అప్పును తీర్చడంలో అల్లాహ్ తోడ్పడతాడు. మరెవరయితే వారి (జనుల) సొమ్మును కాజేయాలని సంకల్పించుకుంటాడో అతన్ని అల్లాహ్ వృధా పరుస్తాడు.” (బుఖారీ)
English
Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "Whoever accepts other people's wealth intending to pay it back, Allah will pay it back for him. And whoever accepts it intending to waste it, Allah, the Most High, will waste (destroy) him." [Reported by al-Bukhari].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 721
హదీసు 722
وَعَنْ عَائِشَةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- قَالَتْ: { قُلْتُ: يَا رَسُولَ اَللَّهِ ! إِنَّ فُلَاناً قَدِمَ لَهُ بَزٌّ مِنَ اَلشَّامِ, فَلَوْ بَعَثْتَ إِلَيْهِ, فَأَخَذْتَ مِنْهُ ثَوْبَيْنِ بِنَسِيئَةٍ إِلَى مَيْسَرَةٍ? فَأَرْسَلَ إِلَيْهِ, فَامْتَنَعَ } أَخْرَجَهُ اَلْحَاكِمُ، وَالْبَيْهَقِيُّ, وَرِجَالُهُ ثِقَاتٌ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “దైవప్రవక్తా ﷺ! సిరియా నుండి ఫలానా వ్యక్తి బట్టలు తెచ్చాడు. తమరు ఎవరినయినా పంపి, ఆర్థిక ఇబ్బందులు తొలగిన తరువాత డబ్బు చెల్లించే షరతుపై (అప్పుగా) రెండు వస్త్రాలు తెప్పించండి” అని ఆమె కోరారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఒక మనిషిని అందుకోసం పంపించారు. కాని ఆ వ్యక్తి (అప్పుగా ఇవ్వడానికి) నిరాకరించాడు. (దీనిని హాకిమ్ మరియు బైహఖీలు ఉల్లేఖించారు. ఈ హదీసును అందజేసినవారు విశ్వసనీయులు)
English
Narrated 'Aishah (RA): I said, "O Messenger of Allah, so-and-so has brought you clothes from Syria. What if you sent someone to him, and you get from him two garments on credit till it is easy for you to repay?" So he sent someone to him, but he refused. [al-Hakim and al-Baihaqi reported it, and its narrators are reliable].
సారాంశం
వస్తువులను అప్పుగా కొనటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దైవప్రవక్త ﷺకు అప్పుగా బట్టలు అమ్మడానికి నిరాకరించిన వ్యక్తి, బహుశా వ్యక్తిగతంగా ఆయన ﷺ పట్ల గల అక్కసు వల్ల అలా చేసి ఉంటాడు. ఆ వ్యక్తి యూదుడనీ, మహాప్రవక్త ﷺ పట్ల అతను వైర స్వభావం కలవాడనీ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 722
హదీసు 723
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلظَّهْرُ يُرْكَبُ بِنَفَقَتِهِ إِذَا كَانَ مَرْهُونًا, وَلَبَنُ اَلدَّرِّ يُشْرَبُ بِنَفَقَتِهِ إِذَا كَانَ مَرْهُونًا, وَعَلَى اَلَّذِي يَرْكَبُ وَيَشْرَبُ اَلنَّفَقَةُ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా సెలవిచ్చారు – “కుదువ (తాకట్టు) పెట్టబడిన పశువుపై అయ్యే వ్యయప్రయాసలకు బదులుగా (తాకట్టుగా ఉంచుకున్న వ్యక్తి) దాన్ని వాహనంగా వాడుకోవచ్చు. అది పాలు ఇచ్చే పశువు అయివుంటే దానికి మేత పెట్టినందుకు బదులుగా దాని పాలు కూడా త్రాగవచ్చు. అయితే దానికయ్యే ఖర్చులన్నీ అతడే భరించవలసి ఉంటుంది.” (బుఖారీ)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "An animal may be ridden, due to what is spent on it, when it is in pledge; and the milk of a camel may be drunk, due to what is spent on it, when it is in pledge. And the responsibility of spending on it is upon the one who rides (it) and drinks (its milk)." [Reported by al-Bukhari].
సారాంశం
తన వద్ద తాకట్టుగా ఉంచబడిన పశువును మేపటమే గాకుండా, దాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా అతనిపై ఉన్నందున దాన్ని అవసరానికి వాహనంగా ఉపయోగించుకునే హక్కు కూడా అతనికి ఉండవలసిందే. అలాగే పాలు ఇచ్చే పశువు అతని వద్ద ఉన్నప్పుడు దాని పాలు కూడా అతనే పితికి తీసుకోవచ్చు. ఇక్కడ ఆ పశువు యజమాని ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇస్హాఖ్ (రహిమహుల్లాహ్) తదితరుల అభిమతం కూడా ఇదే.
పశువును తాకట్టుగా పెట్టుకున్న వ్యక్తి ఆ పశువుపై అయ్యే ఖర్చుల మేరకే దాన్ని ఉపయోగించుకోవాలనీ, అంతకు మించి ప్రయోజనం పొందరాదని మరి కొంతమంది ధర్మవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
తాకట్టుగా ఉన్న పశువు ద్వారా అసలు ఏమాత్రం లబ్ది పొందకూడదనీ, లబ్ది పొందే హక్కు వాస్తవానికి ఆ పశువు యజమానికి మాత్రమే ఉందని ఇంకొంతమంది పండితులు వాదిస్తున్నారు. కాని హదీసు వాక్యాలు ఈ వాదనతో ఏమాత్రం పొసగటం లేదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 723
హదీసు 724
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ -صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: { لَا يَغْلَقُ اَلرَّهْنُ مِنْ صَاحِبِهِ اَلَّذِي رَهَنَهُ, لَهُ غُنْمُهُ, وَعَلَيْهِ غُرْمُهُ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَالْحَاكِمُ, وَرِجَالهُ ثِقَاتٌ. إِلَّا أَنَّ اَلْمَحْفُوظَ عِنْدَ أَبِي دَاوُدَ وَغَيْرِهِ إِرْسَالُهُ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు : “తాకట్టు పెట్టబడిన వస్తువు దాని యజమానికి చెందకుండా నిలిపి ఉంచకూడదు. దాని ప్రయోజనం కూడా అతనికే (యజమానికే) చెందాలి. దానిపై వచ్చే నష్టం కూడా అతనే భరించవలసి ఉంటుంది.” (దీనిని దారె ఖుత్నీ, హాకిమ్ ఉల్లేఖించారు. దీన్ని అందజేసిన వారు విశ్వసనీయులే. అయితే అబూదావూద్ తదితరుల దృష్టిలో ఇది ‘ముర్సల్’గా పరిగణించబడింది)
English
Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) said: "A pledge does not become lost to its owner when he does not redeem it in time. Any increase in its value goes to him and any lost must be borne by him." [Reported by ad-Daraqutni and al-Hakim. Its narrators are reliable. However, the strongest opinion is that it is Mursal (missing link in the chain after the Tabi'i) as reported by Abu Dawud and others].
సారాంశం
వస్తువును కుదువ (తాకట్టు) పెట్టి రుణం తీసుకున్న వ్యక్తి నిర్దీత గడువులోగా అప్పు తీర్చకపోతే తన వద్ద కుదువపెట్టుకున్న వ్యక్తి ఆ వస్తువును స్వాధీనం చేసుకునేవాడు. ఈ విధానాన్ని దైవప్రవక్త ﷺ వారించారని పై హదీసు చెబుతోంది. తన దగ్గర వస్తువును తాకట్టు పెట్టుకున్న వ్యక్తి ఆ వస్తువు ద్వారా ఎలాంటి లబ్ది పొందరాదని వాదించే పండితులు ఈ హదీసునే ఆధారంగా తీసుకున్నారు. అయితే ఈ హదీసు ప్రామాణికత రీత్యా ‘తిరుగులేనిది’గా ఖరారు కాజాలదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 724
హదీసు 725
وَعَنْ أَبِي رَافِعٍ { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -اسْتَسْلَفَ مِنْ رَجُلٍ بَكْرًا فَقَدِمَتْ عَلَيْهِ إِبِلٌ مِنْ إِبِلِ اَلصَّدَقَةِ, فَأَمَرَ أَبَا رَافِعٍ أَنْ يَقْضِيَ اَلرَّجُلَ بَكْرَهُ, فَقَالَ: لَا أَجِدُ إِلَّا خِيَارًا رَبَاعِيًّا, قَالَ: " أَعْطِهِ إِيَّاهُ, فَإِنَّ خِيَارَ اَلنَّاسِ أَحْسَنُهُمْ قَضَاءً } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ అబూ రాఫె (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఒక వ్యక్తి నుండి పడుచు వయసులో వున్న ఒంటెను అప్పుగా తీసుకున్నారు. తరువాత ఆయన ﷺ వద్దకు సదఖా రూపేణా ఒంటెలు వచ్చాయి. ఆ వ్యక్తికి ఒక పడుచు ఒంటెను ఇచ్చి అప్పు తీర్చవలసిందిగా ఆయన ﷺ అబూ రాఫేను ఆజ్ఞాపించారు. ‘ఇంతకన్నా పడుచు ఏడేళ్ళ ఒంటె కూడా ఉంది’ అని నేను విన్నవించుకోగా “సరే, దాన్నే అతనికి ఇవ్వు. ఎందుకంటే రుణం తీర్చటంలో అత్యుత్తమంగా వ్యవహరించేవాడే ఉత్తముడు” అని ఆయన ﷺ సెలవిచ్చారు. (ముస్లిం)
English
Narrated Abu Rafi' (RA): The Prophet (ﷺ) borrowed a young camel from a man. So, when some Sadaqa camels came to him he ordered Abu Rafi (RA) to re-pay the man his young camel. He told him (ﷺ), "I can only find an excellent camel in its seventh year." He said, "Give it to him, for the best of people is he who discharges his debt in the best manner." [Reported by Muslim].
సారాంశం
ఈ హదీసు ద్వారా రూఢీ అయ్యేదేమిటంటే రుణగ్రస్తుడు రుణం తీర్చే సమయంలో తాను తీసుకున్న వస్తువుకన్నా – పరిమాణంలోనూ, నాణ్యతలోనూ – మంచి వస్తువును ఇష్టపూర్వకంగా ఇస్తే అది సమ్మతమే. పైగా ఇది అతని కృతజ్ఞతా భావాన్ని, సంస్కారాన్ని వ్యక్తపరుస్తుంది. అయితే రుణం ఇచ్చే సమయంలో రుణదాత గనక; “నీవు నాకు ఇంతకన్నా మంచి వస్తువును తిరిగి ఇవ్వాలి సుమా!” అని షరతు విధిస్తేమటుకు అది అధర్మం అవుతుంది. ఇచ్చినదానికన్నా అధికంగా పుచ్చుకోజూస్తే అది కూడా వడ్డీ క్రిందికి వస్తుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 725
హదీసు 726
وَعَنْ عَلِيٍّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ -صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ { كُلُّ قَرْضٍ جَرَّ مَنْفَعَةً, فَهُوَ رِبًا } رَوَاهُ اَلْحَارِثُ بْنُ أَبِي أُسَامَةَ, وَإِسْنَادُهُ سَاقِطٌ. وَلَهُ شَاهِدٌ ضَعِيفٌ عَنْ فَضَالَةَ بْنِ عُبَيْدٍ عِنْدَ اَلْبَيْهَقِيِّ. وَآخَرُ مَوْقُوفٌ عَنْ عَبْدِ اَللَّهِ بْنِ سَلَامٍ عِنْدَ اَلْبُخَارِيِّ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “లాభాన్ని ఆర్జించిపెట్టే ఏ రుణమైనా అది వడ్డీ క్రిందికే వస్తుంది.” (దీనిని హారిస్ బిన్ అబూ ఉసామా ఉల్లేఖించారు. దీని పరంపర పరిగణనలోకి వచ్చేది కాదు. బైహఖీ దృష్టిలో ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) గారి హదీసు ఈ సందర్భంగా ఒక బలహీన సాక్షిగా ఉంది. బుఖారీలో అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) గారిచే ఉల్లేఖించబడిన ‘మౌఖూఫ్’ హదీసు కూడా ఈ సందర్భంగా పేర్కొనదగినది)
English
Narrated 'Ali (RA): Allah's Messenger (ﷺ) said: "Every loan, which leads to a benefit, is usury." [al-Harith bin Abu Usamah reported it, but its chain of narrators is Saaqit (containing an extremely weak narrator)].
The aforesaid Hadith has a weak supporting narration, on the authority of Fadalah bin 'Ubaid (RA) reported by al-Baihaqi.
It also has another Mawquf (saying of a Companion) narration from 'Abdullah bin Salam (RA) reported by al-Bukhari.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టడం గురించి|హదీసు 726
You must be logged in to post a comment.