హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 22వ అధ్యాయం: అమానతు (అప్పగింత). ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 823) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
7.22 అమానతు (అప్పగింత)
باب الوديعة
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 823
عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ , عَنْ أَبِيهِ , عَنْ جَدِّهِ , عَنِ النَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ : { مَنْ أُودِعَ وَدِيعَةً , فَلَيْسَ عَلَيْهِ ضَمَانٌ } أَخْرَجَهُ اِبْنُ مَاجَهْ , وَإِسْنَادُهُ ضَعِيفٌ. وَبَابُ قَسْمِ اَلصَّدَقَاتِ تَقَدَّمَ فِي آخِرِ اَلزَّكَاةِ. وَبَابُ قَسْمِ اَلْفَيْءِ وَالْغَنِيمَةِ يَأْتِي عَقِبَ اَلْجِهَادِ إِنْ شَاءَ اَللَّهُ تَعَالَى.
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ (రహిమహుల్లాహ్) తన తండ్రి నుండి, ఆయన తన తాత గారి నుండి సంగ్రహించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: ఎవరైనా ఒకరి వద్ద ఏదైనా వస్తువును అమానతు (అప్పగింత)గా భద్రపరిస్తే ఆ వస్తువును భద్రపరచిన వ్యక్తిపై ఎలాంటి పూచీ లేదు. (ఇబ్నె మాజా దీనిని ఉల్లేఖించారు – దీని పరంపర బలహీనమైనది)
దానధర్మాల (సదఖాల) పంపిణీకి సంబంధించిన అధ్యాయం ఇంతకుముందే ‘జకాత్ పుస్తకం’ చివరిలో వచ్చేసింది. ‘ఫై’ మరియు ‘యుద్ధప్రాప్తి’ పంపకాలను వివరించే అధ్యాయం జిహాద్ పుస్తకం ఆఖరిలో రానున్నది -ఇన్షా అల్లాహ్!
English
Narrated 'Amr bin Shu'aib on his father's authority from his grandfather: The Prophet (ﷺ) said: "There is no liability on him who is entrusted with something." [Ibn Majah reported it, but its chain narrators is Da'if (weak)].
The Chapter on the division of Sadaqah has preceded at the end of the Book of Zakat.
The Chapter on the division of tributes from territories the Muslims have conquered, and spoils of war, will follow the Book of Jihad, if Allah the Most High wills.
సారాంశం
ఈ హదీసు ‘జయీఫ్’గా పేర్కొనబడింది. ఎందుకంటే హదీసును అందజేసిన వారిలో ఒకరైన ముసన్నా బిన్ సబాహ్ ను ఇమామ్ అహ్మద్ – నసాయి వంటివారు పరిగణనలోకి తీసుకోవటం లేదు. అయితే ముసన్నా మంచివారనీ, అందుచేత ఆయన అందజేసిన హదీసును పొందుపరచవలసిందేనని, దానిని త్యజించరాదని ఇబ్నె మొయిన్ వక్కాణించారు.
అమానతు (అప్పగింత)గా వస్తువును భద్రపరచిన వ్యక్తిపై ఎలాంటి పూచి (బాధ్యత) లేదన్న విషయంలో అత్యధిక మంది పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాని వస్తువును అప్పగింతగా పెట్టే సమయంలో వస్తువు యజమాని గనక పూచి షరతు పెట్టినట్లయితే అట్టి పరిస్థితిలో భద్రపరచిన వ్యక్తిపై పూచి బాధ్యత ఉంటుందని హసన్ బస్రీ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.22 అమానతు (అప్పగింత)|హదీసు 823
You must be logged in to post a comment.