హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 8.0 నికాహ్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 8.0: నికాహ్. ఈ అధ్యాయంలో 31 హదీసులు (హదీసు 824 – 854) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

8.0 నికాహ్

↑ విషయ సూచిక

كتاب النكاح

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

824

హదీసు 824

عَنْ عَبْدِ اَللَّهِ بْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ لَنَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ يَا مَعْشَرَ اَلشَّبَابِ ! مَنِ اسْتَطَاعَ مِنْكُمُ اَلْبَاءَةَ فَلْيَتَزَوَّجْ , فَإِنَّهُ أَغَضُّ لِلْبَصَرِ , وَأَحْصَنُ لِلْفَرْجِ , وَمَنْ لَمْ يَسْتَطِعْ فَعَلَيْهِ بِالصَّوْمِ ; فَإِنَّهُ لَهُ وِجَاءٌ".‏ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మాకు ఇలా ఉపదేశించారు -“ఓ నవయువకుల్లారా! మీలో నికాహ్ (వివాహం) చేసుకునే స్తోమత వున్నవారు నికాహ్ చేసుకోవాలి. ఎందుకంటే నికాహ్ చూపుల్ని కాపాడుతుంది, మర్మస్థానాన్ని పరిరక్షిస్తుంది. నికాహ్ చేసుకునే స్తోమతలేనివారు (నఫిల్) ఉపవాసాలు పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే ఉపవాసం అతని పాలిట ‘డాలు’ వంటిది. (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Abdullah bin Mas'ud (RA): Allah's Messenger (ﷺ) said to us, "O young men, those of you who can support a wife should marry, for it (marriage) controls the gaze and preserves one from immorality. And whoever cannot (marry) should fast, for it is a means of reducing the sexual desire." [Agreed upon].

సారాంశం

నికాహ్ అంటే కలపటం, ఏకం చేయటం అని అర్థం. బంధించటం, ఒక నియమానికి కట్టుబడి ఉండేలా షరతు పెట్టడం అన్న అర్థాలు కూడా వస్తాయి. షరీయత్ పరిభాషలో నికాహ్ అంటే ఒక పురుషుడు – ఒక స్త్రీ కలిసి జీవించడానికి, మమేకమవడానికి ధర్మసమ్మతిని ఇవ్వటం అని భావం.

సమాజాన్ని భావ కాలుష్యం నుండి కాపాడటానికి, నీతి బాహ్యత నుండి రక్షించడానికి దేవుడు సమ్మతించి ఆమోదించిన నికాహ్ (వైవాహిక) వ్యవస్థకు స్త్రీ పురుషులు కట్టుబడి ఉండటం అవసరం. ఎందుకంటే నికాహ్ మనిషిలో సౌశీల్యాన్ని, పారిశుద్ధ్యాన్ని పరిరక్షిస్తుంది. చెడు ఆలోచనల నుండి, లైంగిక విశృంఖలత్వం నుండి యువతను కాపాడుతుంది.

ఒకవేళ ఎవరయినా వివాహం చేసుకుని భార్యను పోషించగల స్తోమతను కలిగి ఉండకపోతే, దైవం వారికి కలిమిని ప్రసాదించేవరకూ ఆత్మ నిగ్రహాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మ నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి అత్యుత్తమ సాధనం ఉపవాసం. అందుకే ఉపవాసాన్ని ‘డాలు’గా అభివర్ణించటం జరిగింది. ఏ విధంగానయితే యుద్ధభూమిలో ‘డాలు’ శత్రువు దాడుల నుండి కాపాడుతుందో అదేవిధంగా ‘ఉపవాసం’ మనిషిలో బుసకొట్టే లైంగిక ఉద్రేకాల, పరిసరాల కవ్వింపుల వాతన పడకుండా కాపాడుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 824

825

హదీసు 825

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-حَمِدَ اَللَّهَ , وَأَثْنَى عَلَيْهِ , وَقَالَ : " لَكِنِّي أَنَا أُصَلِّي وَأَنَامُ , وَأَصُومُ وَأُفْطِرُ , وَأَتَزَوَّجُ اَلنِّسَاءَ , فَمَنْ رَغِبَ عَنْ سُنَّتِي فَلَيْسَ مِنِّي } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ దైవస్తోత్రానంతరం ఇలా ఉద్బోధించారు – “…… అయితే నేను నమాజూ చేస్తాను, రాత్రిపూట నిద్ర కూడా పోతాను. ఉపవాసాలూ పాటిస్తాను, ఉపవాసాల విరమణ కూడా చేస్తాను. ఇంకా నేను స్త్రీలను కూడా వివాహమాడతాను. కాబట్టి నా సంప్రదాయం పట్ల విముఖత చూపిన వానితో నాకెలాంటి సంబంధం లేదు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Anas bin Malik (RA): The Prophet (ﷺ) praised Allah, extolled Him and said, "Yet I pray and sleep; I fast and break my fast; and I marry women. He who is displeased with my Sunnah (practices) is not my followed." [Agreed upon].

సారాంశం

దైవప్రవక్త ﷺ సహచరులలోని ముగ్గురు వ్యక్తులు అవలంబించిన అతివాదాన్ని అరికట్టే ఉద్దేశ్యంతో ఈ ఉపదేశం చేయబడింది. విషయాన్ని ముక్తసరిగా చెప్పడానికి రచయిత పూర్తి హదీసును ఇక్కడ పొందుపరచలేదేమో! ఆ ముగ్గురు సహచరులలో ఒకరు, తాను ఎల్లకాలం ఉపవాసం పాటిస్తానని నిశ్చయించుకోగా, తానసలు రాత్రిపూట నిద్రే పోననీ, రాత్రంతా జాగారం చేసి దైవధ్యానం చేస్తానని మరొకరు ప్రతినబూనారు. తనైతే అసలు వివాహమే చేసుకోనని మూడో వ్యక్తి తన దృఢ సంకల్పాన్ని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన దైవప్రవక్త ﷺ వాళ్ళను పిలిపించి “ఈ రకంగా చెప్పిన ఆ ముగ్గురు మీరేనా? బాగా వినండి. దైవసాక్షి! నేను మీ అందరికన్నా అధికంగా దైవానికి భయపడేవాణ్ణి. మీకన్నా ఎక్కువగా ధర్మపరాయణత గలవాణ్ణి. అయితే మాత్రం?! నేను ఉపవాసాలూ పాటిస్తాను, ఉపవాసాల విరమణ కూడా చేస్తాను. రాత్రిపూట జాగారమూ చేస్తాను, నిద్రిస్తాను కూడా. స్త్రీలను నికాహ్ కూడా చేసుకుంటాను. ఇది నా ఆచరణా విధానం. కనుక ఇప్పుడెవరయినా తనంతట తానుగా తన స్వయంపై ఆంక్షలు విధించుకుని, నా విధానం పట్ల వైముఖ్య ధోరణిని కనబరిస్తే అతనితో నాకెట్టి సంబంధమూ లేదు సుమా!” అని తాకీదు చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 825

826

హదీసు 826

وَعَنْهُ قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَأْمُرُ بِالْبَاءَةِ , وَيَنْهَى عَنِ التَّبَتُّلِ نَهْيًا شَدِيدًا , وَيَقُولُ :" تَزَوَّجُوا اَلْوَدُودَ اَلْوَلُودَ. إِنِّي مُكَاثِرٌ بِكُمُ اَلْأَنْبِيَاءَ يَوْمَ اَلْقِيَامَةِ } رَوَاهُ أَحْمَدُ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ. وَلَهُ شَاهِدٌ : عِنْدَ أَبِي دَاوُدَ , وَالنَّسَائِيِّ , وَابْنِ حِبَّانَ أَيْضًا مِنْ حَدِيثِ مَعْقِلِ بْنِ يَسَارٍ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ నిత్యం నికాహ్ చేసుకోమని ఆదేశిస్తుండేవారు. బ్రహ్మచారిగా జీవితం గడపడాన్ని గట్టిగా వారించేవారు. ఆయన ﷺ ఇంకా ఇలా ఉపదేశించేవారు – “ఎక్కువగా ప్రేమించే, ఎక్కువ మంది పిల్లల్ని కనే స్త్రీలను వివాహమాడండి. ఎందుకంటే నేను మీ అధిక జనాభా మూలంగా ప్రళయదినాన ఇతర దైవప్రవక్తల (అలైహిముస్సలాం)పై గర్వపడతాను.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ‘ప్రామాణికం’ గా పేర్కొన్నారు. ఇంకా ఈ హదీసుకు సంబంధించిన ఒక సాక్ష్యంగా అబూదావూద్, నసాయి, ఇబ్నె హిబ్బాన్ లలో మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం కూడా ఉంది)

English

Narrated [Anas bin Malik (RA)]: Allah's Messenger (ﷺ) used to command us to marry and sternly forbid celibacy and say, "Marry women who are beloved (due to their good characteristics), prolific in bearing children, for I shall outnumber the Prophets by you on the Day of Resurrection." [Reported by Ahmad and Ibn Hibban graded it Sahih (authentic)].

The aforesaid Hadith has a supporting narration reported by Abu Dawud. an-Nasa'i and Ibn Hibban from Ma'qal bin Yasar's Hadith.

సారాంశం

హదీసులో ‘తబత్తుల్’ అనే పదం వచ్చింది. తబత్తుల్ అంటే స్త్రీలకు, వైవాహిక జీవితానికి దూరంగా ఉండటం, దాంపత్య సంబంధాలను త్రెంచుకుని సన్యాసిగా, సాత్వికునిగా జీవితం గడిపే వాడని భావం.

‘అల్ వదూద్’ అనే పదం కూడా ప్రయోగించబడింది. అంటే భర్తను అమితంగా ప్రేమించే భార్య. తన సద్గుణాల ద్వారా, సర్దుబాటు వైఖరిద్వారా, వినయ విధేయతల ద్వారా, ప్రేమానురాగాల ద్వారా భర్త మనసును జయించే ఉత్తమ ఇల్లాలు అని భావం.

“అల్ వలూద్” అని కూడా వచ్చింది. అంటే అధిక సంతానానికి జన్మనిచ్చే మహిళ. అమ్మాయి కుటుంబాన్ని, వంశపరంపరను చూచి ఈ విషయాన్ని పసిగట్టవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 826

827

హదీసు 827

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنِ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { تُنْكَحُ اَلْمَرْأَةُ لِأَرْبَعٍ : لِمَالِهَا , وَلِحَسَبِهَا , وَلِجَمَالِهَا , وَلِدِينِهَا , فَاظْفَرْ بِذَاتِ اَلدِّينِ تَرِبَتْ يَدَاكَ } مُتَّفَقٌ عَلَيْهِ مَعَ بَقِيَّةِ اَلسَّبْعَةِ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారు : “నాలుగు ప్రాతిపదికలపై స్త్రీని వివాహమాడటం జరుగుతుంది. ఆమె ఐశ్వర్యం ఆధారంగా, ఆమె వంశం ఆధారంగా, ఆమె అందచందాల ఆధారంగా, ఆమె ధార్మికత ఆధారంగా. అయితే ధార్మికురాలిని వివాహమాడండి. మేలు కలుగుతుంది.” (బుఖారీ, ముస్లిం. మిగిలిన ఏడుగురు కూడా దీనిని ఉల్లేఖించారు)

English

Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "A woman is married for four qualities, for her wealth, her family status, her beauty and her religion: so get the religious one and prosper." [Agreed upon, with the rest of the as-Sab'a].

సారాంశం

పెళ్ళి సంబంధాలు చూసేటప్పుడు ధార్మికురాలైన స్త్రీకి ప్రాధాన్యత నివ్వాలని ఈ హదీసు చెబుతోంది. అందాన్ని, ఐశ్వర్యాన్ని, అంతస్తును చూసి ముగ్ధులవటం సహజం. అయితే ఇవన్నీ శాశ్వతమైనవి కావు. పైగా ఈ మూడు ప్రాతిపదికలు ఒక్కోసారి అనర్థాలకు కూడా మూలం అవుతుంటాయి. కాని ధార్మికత శాశ్వతమైనది. ధార్మికురాలైన ఇల్లాలు ఇంటిల్లిపాదినీ ధర్మపథంలో నడిపిస్తుంది. స్త్రీ కేవలం ఒక భార్య మాత్రమే కాదు, ఆమె తన పిల్లలకు తల్లి కూడాను. కనుక ఆమె సద్గుణవతి, ధర్మవతి అయివున్నప్పుడే తన సంతానానికి మంచి శిక్షణను ఇచ్చి, ఉత్తమ సంస్కారాన్ని నూరిపోస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 827

828

హదీసు 828

وَعَنْهُ ; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ إِذَا رَفَّأَ إِنْسَانًا إِذَا تَزَوَّجَ قَالَ : { بَارَكَ اَللَّهُ لَكَ , وَبَارَكَ عَلَيْكَ , وَجَمَعَ بَيْنَكُمَا فِي خَيْرٍ } رَوَاهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ , وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ , وَابْنُ خُزَيْمَةَ , وَابْنُ حِبَّانَ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ పెళ్ళి చేసుకున్నవారిని చూసినప్పుడల్లా “దేవుడు శుభాన్ని వొసగుగాక! నీపై శుభాన్ని కురిపించుగాక!! మీరిరువురి కలయికలో శ్రేయోవికాసాలను పొందుపరచుగాక!!!” అని దీవించేవారు.

English

Narrated [Abu Hurairah (RA)]: When the Prophet (ﷺ) congratulated a man on his marriage he would say, "Allah bless for you (your spouse), grant you blessing, and join you together in goodness." [Reported by Ahmad and al-Arba'a. at-Tirmidhi, Ibn Khuzaimah and Ibn Hibban graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 828

829

హదీసు 829

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ : { عَلَّمَنَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-اَلتَّشَهُّدَ فِي اَلْحَاجَةِ : " إِنَّ اَلْحَمْدَ لِلَّهِ , نَحْمَدُهُ , وَنَسْتَعِينُهُ , وَنَسْتَغْفِرُهُ , وَنَعُوذُ بِاَللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا , مَنْ يَهْدِهِ اَللَّهُ فَلَا مُضِلَّ لَهُ , وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ , وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اَللَّهُ , وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ وَيَقْرَأُ ثَلَاثَ آيَاتٍ".‏ } رَوَاهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ , وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ , وَالْحَاكِمُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మాకు అవసరాలు, అక్కరల సందర్భాలలో ఈ “తషహ్హుద్”ను నేర్పారు – ఇన్నల్ హమ్దు లిల్లాహి, నహ్మదుహు, వ నస్తయీనుహు, వ నస్తగ్ఫిరుహు, వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా, మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహు, వ మన్ యుజ్ లిల్ ఫలా హాదియలహు- వ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.”

(అర్థం : ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కొరకే. మేము ఆయన్నే స్తుతిస్తున్నాము. సహాయం కోసం ఆయన్నే అర్థిస్తున్నాము. మన్నింపుకై ఆయన్నే వేడుకుంటున్నాము. అంతర్యాల్లో జనించే చెడుగు నుండి అల్లాహ్ శరణువేడుతున్నాము. అల్లాహ్ సన్మార్గం చూపిన వారిని ఎవరూ అపమార్గం పట్టించలేరు. అల్లాహ్ అపమార్గాన వదలివేసిన వారికి ఎవరూ సన్మార్గం ప్రసాదించలేరు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేదని నేను సాక్ష్యమిస్తున్నాను – ముహమ్మద్ ﷺ దైవదాసుడనీ, దైవసందేశహరుడని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను). అనంతరం ఆయన మూడు ఆయతులను పారాయణం చేశారు. (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ, హాకిమ్ లిరువురూ దీనిని ‘హసన్’గా పేర్కొన్నారు)

English

Narrared 'Abdullah bin Mas'ud (RA): Allah's Messenger (ﷺ) taught us Tashahhud in case of some need, which is: "Praise is due to Allah, Whom we praise and from Whom we ask help and forgiveness. We seek refuge in Allah from the evils of ourselves. He whom Allah guides has no one who can lead him astray, and he whom He leads astray has no one to guide him. I testify that there is nothing deserving of worship except Allah, and I testify that Muhammad is His slave and Messenger." He (then) recites three Verses. [Reported by Ahmad and al-Arba'a. at-Tirmidhi and al-Hakim graded it Hasan (good)].

సారాంశం

ఈ ప్రసంగం కేవలం ఒక్క నికాహ్ సందర్భంగానే గాకుండా ఏ అక్కర ఏర్పడినా ఆ సమయంలో దైవప్రవక్త ﷺ ఈ ప్రసంగం చేసేవారు. నికాహ్ (వివాహం) చేసుకునేవాడు సయితం స్వయంగా ఈ ‘ఖుత్బా’ చదువుకోవాలని అల్లామా అల్ యమానీ చెప్పారు. అయితే ఈ సంప్రదాయం త్యజించబడింది. ప్రసంగం చివరిలో పఠించే మూడు ఆయతుల వివరాలివి: 1) నిసా సూరాలోని మొదటి ఆయత్ (‘రఖీబా’ వరకు) 2) ఆలి ఇమ్రాన్ సూరా 11వ రుకూలోని మొదటి ఆయత్ (‘ముస్లిమూన్’ వరకు) 3) అహ్జాబ్ సూరాలోని చివరి రుకూలోగల ఆయత్ (‘అజీమా’వరకు). బాహ్యర్థగ్రాహులు ఈ ప్రసంగాన్ని వాజిబ్ (తప్పనిసరి)గా ఖరారు చేశారు. షాఫయీలలో అబూ అవానా కూడా దీనిని తప్పనిసరిగానే భావించారు. అయితే మిగిలిన విద్వాంసులందరి దృష్టిలో ఇది ‘మస్నూన్’ (సంప్రదాయం) మాత్రమే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 829

830

హదీసు 830

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا خَطَبَ أَحَدُكُمُ الْمَرْأَةَ , فَإِنْ اِسْتَطَاعَ أَنْ يَنْظُرَ مِنْهَا إِلَى مَا يَدْعُوهُ إِلَى نِكَاحِهَا , فَلْيَفْعَلْ } رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَرِجَالُهُ ثِقَاتٌ , وَصَحَّحَهُ اَلْحَاكِمُ. وَلَهُ شَاهِدٌ : عِنْدَ اَلتِّرْمِذِيِّ , وَالنَّسَائِيِّ ; عَنِ الْمُغِيرَةِ.‏. وَعِنْدَ اِبْنِ مَاجَهْ , وَابْنِ حِبَّانَ : مِنْ حَدِيثِ مُحَمَّدِ بْنِ مَسْلَمَةَ.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “మీలో ఎవరైనా ఏ మహిళకైనా వివాహ సందేశం పంపినట్లయితే వీలయినంత వరకు ఆమెను ఒకసారి చూసుకుని, ఆమె మీ దాంపత్య జీవితానికి తగునో లేదో నిర్ధారించుకోండి.” (దీనిని అహ్మద్, అబూదావూద్ ఉల్లేఖించారు – దీని ఉల్లేఖకులు ఎన్నదగినవారు. హాకిమ్ దీనిని ‘ప్రామాణికం’గా ఖరారు చేశారు. తిర్మిజీ, నసాయిలలో ముగీరా ఉల్లేఖనం దీనికి సాక్ష్యంగా ఉంది. ఇబ్నె మాజా, ఇబ్నె హిబ్బాన్ లలో ముహమ్మద్ బిన్ మస్లమ ఉల్లేఖనం సాక్ష్యంగా ఉంది)

English

Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said: "When one of you proposes (marriage) to a woman, if he is able to look at what will induce him to marry her, he should do so." [Reported by Ahmad and Abu Dawud. Its narrators are Thiqa (reliable) and al-Hakim declared it to be Sahih (authentic)].

The aforesaid Hadith has a Shahid (supporting narration) reported by at-Tirmidhi and an-Nasa'i from al-Mughirah.

It also has a Shahid (supporting narration) reported by Ibn Majah and Ibn Hibban from the Hadith of Muhammad bin Maslamah.

సారాంశం

ఈ హదీసును బట్టి స్పష్టమయ్యేదేమిటంటే పురుషుడు తాను వివాహమాడ దలచుకున్న స్త్రీని ఓ సారి స్వయంగా చూచుకోవటం మంచిది. ఇలా చూడటం అధిక సంఖ్యాక పండితుల దృష్టిలో అభిలషణీయం మాత్రమేగాని అనివార్యం కాదు. తమ బంధువుల్లోని విశ్వసనీయురాలైన ఒక మహిళను పంపి కాబోయే భార్యను చూడటం, ఆమె గుణగణాలను, వ్యవహార సరళిని గురించి తెలుసుకోవటం కూడా సమంజసమే. దైవప్రవక్త ﷺ వారు సయితం ఉమ్మె సులైమ్ ను పంపించి ఆమె ద్వారా ఒక మహిళ గురించి వాకబు చేశారు.

హదీసు ఉల్లేఖకులు

ముహమ్మద్ బిన్ మస్లమ : ఈయన జ్ఞానులైన సహాబీలలో ఒకరుగా పరిగణించబడేవారు. అన్సార్లలోని హారిస్ తెగకు చెందిన వారవటం చేత అన్సారీగా, హారిసీగా వ్యవహరించబడేవారు. ఒక్క తబూక్ మినహా మిగిలిన యుద్ధాలలో హాజరయ్యారు. మదీనాలో హజ్రత్ ముసాబ్ బిన్ ఉమైర్ (రదియల్లాహు అన్హు) చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించారు. హిజ్రీ 43వ సంవత్సరంలో 77 యేండ్ల వయసులో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 830

831

హదీసు 831

وَلِمُسْلِمٍ : عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ لِرَجُلٍ تَزَوَّجَ اِمْرَأَةً : أَنَظَرْتَ إِلَيْهَا ? " قَالَ : لَا. قَالَ : " اِذْهَبْ فَانْظُرْ إِلَيْهَا }.

‘ముస్లిం’లో హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ఇలా వుంది : దైవప్రవక్త ﷺ పెళ్ళి చేసుకోబోతున్న ఒక వ్యక్తినుద్దేశ్యించి, “నువ్వామెను చూచావా?” అని అడిగారు. ‘లేద’ని అతడు చెప్పాడు. “అయితే వెళ్ళి (ఒకసారి) ఆమెను చూసుకో” అని ఆయన ﷺ సలహా ఇచ్చారు.

English

Muslim reported from Abu Hurairah (RA): The Prophet (ﷺ) asked a man who had intended to marry a woman, "Have you looked at her" He replied, "No." He said, "Go and look at her."

సారాంశం

కాబోయే శ్రీమతిని చూడటం ‘తప్పనిసరి’ అన్నది దీని భావం కాదు. ‘ఉత్తమం’ అన్నదే ఈ హదీసు ఉద్దేశ్యం. ఈ ‘చూపు’ కూడా సంబంధం నిశ్చయం కాకముందే జరగాలి. అన్నీ అయిన తరువాత ఆఖరిక్షణంలో అమ్మాయి నచ్చలేదు పొమ్మంటే అమ్మాయి తరపువారికి మనస్తాపం కలుగుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 831

832

హదీసు 832

وَعَنِ ابْنِ عُمَرَ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَخْطُبْ أَحَدُكُمْ عَلَى خِطْبَةِ أَخِيهِ , حَتَّى يَتْرُكَ اَلْخَاطِبُ قَبْلَهُ , أَوْ يَأْذَنَ لَهُ اَلْخَاطِبُ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “మీలో ఎవరైనా ఒకరు ఒకచోట వివాహ సందేశం పంపినపుడు మరొకరు – తమ సోదరునికి పోటీగా – అక్కడికి తమ వైపునా వివాహ సందేశం పంపకండి. అయితే మొదటి వ్యక్తి తన ప్రయత్నాన్ని విరమించుకుంటే లేదా రెండవ వ్యక్తికి ఆ మేరకు అనుమతిస్తే అప్పుడు ముందడుగు వేయవచ్చు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "No one of you should ask a woman in marriage when his brother has done so already, until the one who has proposed (to her) before him gives her up, or gives him permission." [Agreed upon. The wording is al-Bukhari's].

సారాంశం

ఒకరు ఒకచోట పెళ్ళి సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఇంకొకరు మధ్యలో తల దూర్చరాదని ఈ హదీసునుబట్టి విదితమవుతోంది. అయితే ఫాతిమా బిన్తె ఖైస్ (రదియల్లాహు అన్హా) సంఘటన దృష్ట్యా చూస్తే, ఒకే సమయంలో ఒక మహిళకు రెండు మూడు వివాహ సందేశాలు వచ్చినా తప్పులేదని తెలుస్తోంది. ఎందుకంటే ఫాతిమా బిన్తె ఖైస్ (రదియల్లాహు అన్హా)కు రెండు పెళ్ళి సంబంధాలు రాగా, ఆమె దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి సలహా తీసుకున్నారు. అయితే ఈ సంఘటన ఈ హదీసుకు విరుద్ధమని భావించనవసరం లేదు. బహుశా రెండవ సందేశం పంపిన వారికి మొదటి సందేశం గురించి తెలీదేమో! పెండ్లి సంబంధం ఖాయమైన తరువాత, మరొకరు సందేశం పంపకూడదని, ఖాయం కాక మునుపైతే సందేశం పంపవచ్చునని మరికొంతమంది అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 832

833

హదీసు 833

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ اَلسَّاعِدِيِّ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ : { جَاءَتِ امْرَأَةٌ إِلَى رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَتْ : يَا رَسُولَ اَللَّهِ ! جِئْتُ أَهَبُ لَكَ نَفْسِي , فَنَظَرَ إِلَيْهَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَصَعَّدَ اَلنَّظَرَ فِيهَا , وَصَوَّبَهُ , ثُمَّ طَأْطَأَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-رَأْسَهُ , فَلَمَّا رَأَتْ اَلْمَرْأَةُ أَنَّهُ لَمْ يَقْضِ فِيهَا شَيْئًا جَلَسَتْ , فَقَامَ رَجُلٌ مِنْ أَصْحَابِهِ. فَقَالَ : يَا رَسُولَ اَللَّهِ ! إِنْ لَمْ يَكُنْ لَكَ بِهَا حَاجَةٌ فَزَوِّجْنِيهَا. قَالَ : " فَهَلْ عِنْدكَ مِنْ شَيْءٍ ? ". فَقَالَ : لَا , وَاَللَّهِ يَا رَسُولَ اَللَّهِ. فَقَالَ : " اِذْهَبْ إِلَى أَهْلِكَ , فَانْظُرْ هَلْ تَجِدُ شَيْئًا ? " فَذَهَبَ , ثُمَّ رَجَعَ ? فَقَالَ : لَا وَاللَّهِ، مَا وَجَدْتُ شَيْئًا.‏ فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-" انْظُرْ وَلَوْ خَاتَمًا مِنْ حَدِيدٍ "، فَذَهَبَ، ثُمَّ رَجَعَ.‏ فَقَالَ : لَا وَاَللَّهِ , يَا رَسُولَ اَللَّهِ , وَلَا خَاتَمًا مِنْ حَدِيدٍ , وَلَكِنْ هَذَا إِزَارِي ‏- قَالَ سَهْلٌ : مَالُهُ رِدَاءٌ ‏- فَلَهَا نِصْفُهُ. فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-" مَا تَصْنَعُ بِإِزَارِكَ ? إِنْ لَبِسْتَهُ لَمْ يَكُنْ عَلَيْهَا مِنْهُ شَيْءٌ، وَإِنْ لَبِسَتْهُ لَمْ يَكُنْ عَلَيْكَ مِنْهُ شَيْءٌ " فَجَلَسَ اَلرَّجُلُ , وَحَتَّى إِذَا طَالَ مَجْلِسُهُ قَامَ ; فَرَآهُ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-مُوَلِّيًا , فَأَمَرَ بِهِ , فَدُعِيَ بِهِ , فَلَمَّا جَاءَ. قَالَ : " مَاذَا مَعَكَ مِنَ الْقُرْآنِ ? ". قَالَ : مَعِي سُورَةُ كَذَا , وَسُورَةُ كَذَا , عَدَّدَهَا. فَقَالَ : " تَقْرَؤُهُنَّ عَنْ ظَهْرِ قَلْبِكَ ? ". قَالَ : نَعَمْ , قَالَ : "اِذْهَبْ , فَقَدَ مَلَّكْتُكَهَا بِمَا مَعَكَ مِنَ الْقُرْآنِ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِمُسْلِمٍ. وَفِي رِوَايَةٍ لَهُ : { اِنْطَلِقْ , فَقَدْ زَوَّجْتُكَهَا , فَعَلِّمْهَا مِنَ الْقُرْآنِ }. وَفِي رِوَايَةٍ لِلْبُخَارِيِّ : { أَمْكَنَّاكَهَا بِمَا مَعَكَ مِنَ الْقُرْآنِ }. وَلِأَبِي دَاوُدَ : عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ : { مَا تَحْفَظُ ? ". قَالَ : سُورَةَ اَلْبَقَرَةِ , وَاَلَّتِي تَلِيهَا. قَالَ : فَقُمْ، فَعَلِّمْهَا عِشْرِينَ آيَةً }.

హజ్రత్ సహ్లా బిన్ సాద్ సాయిదీ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక మహిళ దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! నా అంతట నేను మీకు సమర్పించుకునే (‘హిబా’ చేసుకునే) ఉద్దేశ్యంతో మీ దగ్గరకు వచ్చాను” అని విన్నవించుకుంది. దైవప్రవక్త ﷺ ఆమెను ఓసారి ఎగాదిగా చూసి తల దించుకున్నారు. దైవప్రవక్త ﷺ తన గురించి ఏ నిర్ణయమూ తీసుకోలేదని తలపోసిన ఆ స్త్రీ అక్కడే క్రింద కూర్చుంది. అప్పుడు ప్రవక్త సహచరులలోని ఒకతను లేచి, “దైవ ప్రవక్తా ﷺ! ఆమె మీకక్కరలేకపోతే నాకిచ్చి పెళ్ళి జరిపించండి” అని విన్నవించుకున్నాడు. దైవప్రవక్త ﷺ అతని ఈ మాట విని, “నీ దగ్గర (మహర్ గా ఇవ్వడానికి) ఏదైనా వస్తువు ఉందా?” అని అడిగారు. దానికా వ్యక్తి “దైవ సాక్షిగా చెబుతున్నాను దైవప్రవక్తా ﷺ! నా దగ్గర ఏమీలేదు” అని చెప్పాడు. “నీ ఇంటికెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో వెతుకు” అని ఆయన ﷺ సలహా ఇచ్చారు. అతను ఇంటికి వెళ్ళి వచ్చి, “దైవసాక్షి! నా ఇంట్లో కూడా ఏ వస్తువూ లభించలేదు” అని అన్నాడు. “కాస్త జాగ్రత్తగా అన్వేషించు. ఒక ఇనుప ఉంగరం దొరికినా సరిపోతుంది” అని దైవప్రవక్త ﷺ అతన్ని పురమాయించారు. ఆ వ్యక్తి ఇంకొకసారి ఇంటికి వెళ్ళి, తిరిగొచ్చి ఇలా విన్నవించుకున్నాడు : “దైవప్రవక్తా ﷺ! దైవసాక్షిగా చెబుతున్నాను. ఇనుప ఉంగరం కూడా లేదు. అయితే నేను కట్టుకున్న ఈ లుంగీ మాత్రం ఉంది. ఇందులో నుంచే సగం చించి ఈమెకు (మహర్ గా) ఇస్తాను.” దైవప్రవక్త ﷺ అతని ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, “దాన్ని ఆమె ఏం చేసుకుంటుంది? ఆ లుంగీని నువ్వు కట్టుకుంటే ఆమె (వంటి) పై ఏమీ మిగలదు. ఒకవేళ ఆమె కట్టుకుంటే, నువ్వు కట్టుకోవడానికి ఏమీ మిగలదు” అని అన్నారు.

ఇది విని ఆ వ్యక్తి (నోరు మెదపకుండా) అక్కడే కూర్చున్నాడు. చాలాసేపు అలాగే కూర్చున్నాడు. కడకు లేచి నిలబడ్డాడు. అతను వెన్నుచూపి తిరిగి వెళ్ళడం గమనించిన దైవప్రవక్త ﷺ అతణ్ణి పిలిపించమని ఆదేశించారు. అతను తిరిగి వచ్చిన తర్వాత, “నీకు ఖుర్ఆన్ లో ఎంతభాగం జ్ఞాపకముంది?” అని ఆయన ﷺ అడిగారు. “ఫలానా ఫలానా సూరాలు జ్ఞాపకమున్నాయి” అని చెప్పాడా వ్యక్తి సూరాలను లెక్కపెట్టుకుంటూ. “మరి ఆ సూరాలను చూడకుండా అప్పజెప్పగలవా?” అని ఆయన ప్రశ్నించగా, “అప్పజెప్పగలను” అని అతను సమాధానమిచ్చాడు. అప్పుడు ఆయన ﷺ, “వెళ్ళు. ఈ ఖుర్ఆన్ (సూరాల)కు బదులుగా ఈమెను నీ యాజమాన్యంలోకి ఇస్తున్నాను” అని తీర్పు ఇచ్చారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ‘ముస్లిం’ లోనివి) “వెళ్ళు. నేనీమెను నీ దాంపత్యంలోకి ఇచ్చేశాను. కాబట్టి నువ్వు కొంత ఖుర్ఆన్ ను నేర్పు” అని వేరొక ఉల్లేఖనంలో ఉంది. “నీకు జ్ఞాపకమున్న ఈ ఖుర్ఆన్ కు బదులుగా మేము నిన్ను ఈమెకు యజమానిగా చేశాము” అని బుఖారీలో ఉంది.

అబూదావూద్ లో హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం “నీవు ఎంత వరకు ఖుర్ఆన్ కంఠస్థం చేశావు?” అని ఆయన ﷺ ప్రశ్నించగా, “బఖరా సూరాతో పాటు, ఆ తర్వాతి సూరా (ఆలి ఇమ్రాన్)” అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. దానికాయన ﷺ “సరే. ఆమెకు ఇరవై ఆయతులు నేర్పించు” అని సలహా ఇచ్చారు.

English

Narrated Sahl bin Sa'd as-Sa'idi (RA): A woman came to Allah's Messenger (ﷺ) and said, "O Allah's Messenger, I came to offer myself to you (in marriage)." Allah's Messenger (ﷺ) looked her up and down (carefully), and then Allah's Messenger (ﷺ) lowed his head. When the woman saw that he had not made any decision regarding her she sat down. A man of his companions then stood up and said, "O Allah's Messenger, if you have no need for her, marry her to me." He asked, "Do you have anything (to give her as dowry)?" He replied, "No, I swear by Allah, O Allah's Messenger." He thereupon said, "Go to your family and see if you can find something." He went and then returned and said, "No, I swear by Allah I found nothing." Allah's Messenger (ﷺ) then said, "Look for something, even if it should be an iron ring." He went and then returned and said, "No, I swear by Allah, O Allah's Messenger, not even an iron ring; but I have onl this lower garment of mine – [Sahl said, 'He had no upper garment'] – and I shall give her half of it." Allah's Messenger (ﷺ) then said, "What will she do with your lower garment? For if you wear it, there would be nothing of it on her, and if she wears it, there would be nothing of it on you." The man then sat down and when he had sit for a long time he stood up and Allah's Messenger (ﷺ) saw him departing, so he commanded him and he was called back. When he came back, he said, "What do you have (i.e. memorized) from the Qur'an?" He replied, "I have Surat such and such and Surat such and such," he counted them. He then asked "Can you recited them by heart?" He replied, "Yes." He said, "Go, for I have given her to you in marriage for the part of the Qur'an which you know." [Agreed upon; the wording is Muslim's]. Another narration has: "Go for I have given her to you in marriage, so teach her some of Qur'an." A narration by al-Bukhari has: "I have married her to you for the part of the Qur'an which you know."

Abu Dawud has a narration from Abu Hurairah (RA): He asked, "What have you memorized?" He replied, "Surat al-Baqarah and the one that follows it." He then said. "Get up and teach her twenty Verses."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 833

834

హదీసు 834

وَعَنْ عَامِرِ بْنِ عَبْدِ اَللَّهِ بْنِ اَلزُّبَيْرِ , عَنْ أَبِيهِ ; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { أَعْلِنُوا اَلنِّكَاحَ } رَوَاهُ أَحْمَدُ , وَصَحَّحَهُ اَلْحَاكِمُ.

హజ్రత్ ఆమిర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఈయన తన తండ్రి ఆధారంగా చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు : “నికాహ్ గురించి ప్రకటన గావించండి.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించగా, హాకిమ్ ప్రామాణికమైందిగా నిర్ధారించారు)

English

Narrated 'Aamir bin 'Abdullah bin az-Zubair on the authority of his father: Allah's Messenger (ﷺ) said: "Make marriage publicly known." [Reported by Ahmad and al-Hakim graded it Sahih (authentic)].

సారాంశం

వివాహం రహస్యంగా, గుట్టుచప్పుడు కాని విధంగా చేసుకోరాదనీ, పైగా ఇది బహిరంగంగా – నలుగురికీ తెలిసేలా – చేసుకోవాలని ఈ హదీసు చెబుతోంది. వివాహం ఒక సామాజిక అంశం; సమాజంలోని కట్టుబాట్లతో, ధర్మాధర్మాలతో ముడిపడి ఉన్న విషయం. ఇరువురు అపరిచిత వ్యక్తుల సంబంధాలను సమ్మతించి ఆమోదించే పవిత్ర ఒప్పందమే వివాహం (నికాహ్). కాబట్టి ఈ సంగతి పరిసరాల వారికి తెలియాలి. లేకుంటే ఆ నూతన దంపతుల గురించి లోకంలో గుసగుసలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

హదీసు ఉల్లేఖకులు

ఆమిర్ బిన్ అబ్దుల్లాహ్ : పూర్తి వంశపరంపర ప్రకారం ఆమిర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ బిన్ అవ్వామ్ అసదీ ఖురషి. మదీనా వాసులు. తన తండ్రినోట, ఇతరుల నోట హదీసులు విన్నారు. దైవభక్తి పరాయణులు. ఎన్నదగిన తాబయీన్లలో ఒకరు. హిజ్రీ 124లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 834

835

హదీసు 835

وَعَنْ أَبِي بُرْدَةَ بْنِ أَبِي مُوسَى , عَنْ أَبِيهِ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا نِكَاحَ إِلَّا بِوَلِيٍّ } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ وَصَحَّحَهُ اِبْنُ اَلْمَدِينِيِّ , وَاَلتِّرْمِذِيُّ , وَابْنُ حِبَّانَ , وَأُعِلَّ بِالْإِرْسَالِ. وَرَوَى الْإِمَامُ أَحْمَدُ، عَنِ الْحَسَنِ، عَنْ عِمْرَانَ بْنِ الْحُصَيْنِ مَرْفُوعاً: لاَ نِكَاحَ إِلاَّ بِوَلِيٍّ وَشَاهِدَيْنِ.

హజ్రత్ అబూ బుర్దా బిన్ అబూ మూసా తన తండ్రి ఆధారంగా చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “సంరక్షకుడు (వలీ) లేకుండా నికాహ్ కానేకాదు.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. ఇమామ్ ఇబ్నె మదీనీ, తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్ లు దీనిని సహీహ్ గా ఖరారు చేశారు. కాని ఈ హదీసు ‘ముర్సల్’ అవటంచేత లోప భూయిష్టమైనదిగా తేల్చటం జరిగింది)

ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) గారు హసన్ ద్వారా, ఆయన ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ద్వారా చేసిన ‘మర్ఫూ’ ఉల్లేఖనం ప్రకారం “సంరక్షకుడు మరియు ఇద్దరు సాక్షులు లేనిదే పెండ్లి జరిపించబడదు.”

English

Narrated Abu Burda bin Abu Musa on the authority of his father; Allah's Messenger (ﷺ) said: "There is no marriage without a guardian." [Ahmad and al-Arba'a reported it. Ibn al-Madini, at-Tirmidhi and Ibn Hibban graded it Sahih (authentic), but it was regarded defective for being Mursal (missing link after the Tabi'i)].

సారాంశం

వలీ లేక సంరక్షకుడు అనుమతి ఇచ్చేవరకూ నికాహ్ జరగదని ఈ హదీసు ఆధారంగా తెలుస్తోంది. ఈ హదీసును 30 మంది ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) చెప్పారు. అయితే చెప్పే తీరులో కొంత వైవిధ్యం ఉండటం మూలంగా కొందరి ఉల్లేఖనాలు ‘జయీఫ్’గా పేర్కొనబడ్డాయి. ఒక సంరక్షకుడు, ఇద్దరు సాక్షులు లేకుండా నికాహ్ కాజాలదని అత్యధిక మంది ఉలమా కూడా తేల్చి చెప్పారు. ‘వలీ’ అంటే తండ్రి అన్నమాట! తండ్రి లేనిపక్షంలో తాత, పినతండ్రికి ఈ పెద్దరికం వర్తిస్తుంది. ఒకవేళ ఇద్దరు సంరక్షకులుండి వారిరువురి మధ్య అభిప్రాయభేదం ఏర్పడితే, అట్టి పరిస్థితిలో సమీప బంధువుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఒకవేళ అసలు సంరక్షకుడే లేకుంటే రాజ్యాధికారి సంరక్షకుడవుతాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 835

836

హదీసు 836

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَيُّمَا اِمْرَأَةٍ نَكَحَتْ بِغَيْرِ إِذْنِ وَلِيِّهَا, فَنِكَاحُهَا بَاطِلٌ, فَإِنْ دَخَلَ بِهَا فَلَهَا اَلْمَهْرُ بِمَا اِسْتَحَلَّ مِنْ فَرْجِهَا, فَإِنِ اشْتَجَرُوا فَالسُّلْطَانُ وَلِيُّ مَنْ لَا وَلِيَّ لَهُ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيَّ, وَصَحَّحَهُ أَبُو عَوَانَةَ , وَابْنُ حِبَّانَ وَالْحَاكِمُ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చెప్పారు : ఏ స్త్రీ అయినా తన సంరక్షకుని (వలీ) అనుమతి లేకుండా వివాహం చేసుకుంటే, ఆమె వివాహం అధర్మం అవుతుంది. మరి, ఆమె భర్త గనక ఆమెతో సంభోగిస్తే, ఆమె మానాన్ని తన కొరకు ధర్మబద్ధంగా చేసుకున్నందుకు గాను ఆమెకు మహర్ హక్కు ఉంటుంది. మరి వారి మధ్య (అంటే సంరక్షకుని విషయమై) కలతలు రేగి, వారికెవరూ సంరక్షకులు లేకుండా ఉంటే రాజ్యాధికారి సంరక్షకుడుగా ఉంటాడు. (‘నలుగురి’లో నసాయి తప్ప మిగిలిన వారు దీనిని ఉల్లేఖించారు. అబూ అవానా, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ లు ముగ్గురూ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)

English

Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) said: "If anyone married without the consent of her guardian, her marriage is invalid. If there is cohabitation, she is entitled to the dowry, due to the sexual intercourse made lawful with her. If there is a dispute (between her guardian), the ruler is the guardian of one who has no guardian." [Reported by al-Arba'a except an-Nasa'i. Abu 'Awanah, Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 836

837

హదీసు 837

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { لَا تُنْكَحُ اَلْأَيِّمُ حَتَّى تُسْتَأْمَرَ, وَلَا تُنْكَحُ اَلْبِكْرُ حَتَّى تُسْـتَأْذَنَ " قَالُوا : يَا رَسُولَ اَللَّهِ , وَكَيْفَ إِذْنُهَا ? قَالَ : " أَنْ تَسْكُتَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “వితంతువు వివాహం ఆమెను సంప్రతించనంత వరకూ చేయరాదు. అలాగే కన్య వివాహం ఆమె అంగీకారం పొందనంత వరకూ జరిపించరాదు.” – “ఓ దైవప్రవక్తా ﷺ! ఎలాంటి అంగీకారం?” అని అక్కడున్నవారు సందేహపడగా, “మౌనమే ఆమె అంగీకారం” అని దైవప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "A previously married woman must not be married till she is consulted, and a virgin must not be married till her consent is asked." They asked, "O Allah's Messenger, how is her consent indicated?" He replied, "It is by her silence." [Agreed upon].

సారాంశం

ఈ హదీసు ద్వారా సామాజిక వ్యవస్థలో స్త్రీకి గల ప్రాముఖ్యతను ఇస్లాం నొక్కి చెబుతోంది. స్త్రీ ఇష్టాయిష్టాలతో ఏమాత్రం నిమిత్తం లేకుండా ఆమెను ఒక ఆట వస్తువుగా లెక్కకట్టే సమాజంలో ఇస్లాం ఆమెకొక సమున్నత స్థానాన్ని ప్రసాదించింది. వివాహాది విషయాలలో పూర్వం ఆమెను సంప్రతించటం అటుంచి కనీసం ఆమెకు తన మనసులోని మాటను చెప్పే అనుమతి కూడా ఉండేది కాదు. ఆమె సంరక్షకుడు ఆమెను, తాను కోరిన వారికిచ్చి కట్టబెట్టేవాడు. కాదనే హక్కు స్త్రీకి లేదు. అయితే మహాప్రవక్త ﷺ స్త్రీ సమ్మతి లేకుండా ఆమె నికాహ్ జరిపించరాదని చెప్పి సమాజంలో ఆమె మనోరథానికి, ఎంపికకు తగిన గుర్తింపును ఇచ్చారు. భర్తను పోగొట్టుకున్న స్త్రీకి పునర్వివాహం జరిపించేటప్పుడు ఆమెను తప్పక సంప్రతించాలని, కన్యకు పెళ్ళి నిశ్చయం చేసేటప్పుడు ఆమె అంగీకారం పొందాలని ఆయన ﷺ బోధించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 837

838

హదీసు 838

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ { اَلثَّيِّبُ أَحَقُّ بِنَفْسِهَا مِنْ وَلِيِّهَا , وَالْبِكْرُ تُسْتَأْمَرُ , وَإِذْنُهَا سُكُوتُهَا } رَوَاهُ مُسْلِمٌ. وَفِي لَفْظٍ : { لَيْسَ لِلْوَلِيِّ مَعَ اَلثَّيِّبِ أَمْرٌ, وَالْيَتِيمَةُ تُسْتَأْمَرُ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَالنَّسَائِيُّ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం చేశారు : భర్త చనిపోయిన స్త్రీ తన పునర్వివాహం విషయంలో తన సంరక్షకుని కన్నా ఎక్కువగా నిర్ణయాధికారం కలిగి ఉంటుంది. అయితే కన్య అయినప్పుడు ఆమె అనుమతి తీసుకోవాలి. ఆమె మౌనమే ఆమె అంగీకారానికి ఆనవాలు.” (ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా వుంది : భర్తను పోగొట్టుకున్న స్త్రీ వ్యవహారంలో సంరక్షకునికి ఎలాంటి నిర్ణయాధికారం లేదు. (వితంతువు అభీష్టం ప్రకారమే పునర్వివాహం జరగాలి). అనాధల్ని కూడా వారి వివాహ విషయమై వారి సలహా తీసుకోవాలి. (దీనిని అబూ దావూద్, నసాయి ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ‘ప్రామాణికం’గా ఖరారు చేశారు)

English

Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) said: "A woman who has been previously married has more right over her person than her guardian, and a virgin must be consulted, and her consent is silence." [Reported by Muslim].

Another narration has: "A guardian has no authority over a woman who has been previously married,; and an orphan girl must be consulted." [Reported by Abu Dawud and an-Nasa'i; Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

అత్యధికమంది విద్వాంసులు ఈ హదీసుకు చెప్పిన భావార్థం ప్రకారం; ఒకవేళ సంరక్షకుడు (వలీ, గార్డియన్) స్వయంగా భర్త చనిపోయిన స్త్రీని నికాహ్ చేసుకోవడానికి సిద్ధపడితే, మరో వైపు అతనితో నికాహ్ కు ఆ వితంతువు సుముఖంగా లేకపోతే అప్పుడామెపై ఎలాంటి బలవంతానికి, ఒత్తిడికి ఆస్కారముండరాదు. ఒకవేళ ఆ వితంతువు తాను కోరిన వ్యక్తిని పెళ్ళి చేసుకోదలచినపుడు సంరక్షకుడు అభ్యంతరం తెలిపితే అట్టి పరిస్థితిలో కూడా వితంతువు అభీష్టానికే ప్రాధాన్యత నివ్వబడుతుంది. అసలామె పునర్వివాహమే చేసుకోరాదని సంరక్షకులు మొండికేసినట్లయితే అట్టి పరిస్థితిలో వారు సంరక్షకులుగా ఉండే హక్కును కోల్పోతారు. ఆమె నికాహ్ బాధ్యతను ఖాజీ స్వయంగా వహిస్తాడు. స్త్రీ పునర్వివాహ హక్కు తిరుగులేనిది అనడానికి ఇదొక ప్రబల తార్కాణం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 838

839

హదీసు 839

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تُزَوِّجُ اَلْمَرْأَةُ اَلْمَرْأَةَ, وَلَا تُزَوِّجُ اَلْمَرْأَةُ نَفْسَهَا } رَوَاهُ اِبْنُ مَاجَهْ , وَاَلدَّارَقُطْنِيُّ , وَرِجَالُهُ ثِقَاتٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ స్త్రీ కూడా మరో స్త్రీకి సంరక్షకురాలిగా నిలిచి నికాహ్ చేయించటంగానీ, స్వయంగా తన నికాహ్ చేసుకోవటంగానీ చేయజాలదు.” (ఇబ్నె మాజా, దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు – దీని ఉల్లేఖకులంతా విశ్వసనీయులే)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "A woman may not give a woman in marriage, nor may she give herself in marriage." [Reported by Ibn Majah and ad-Daraqutni. Its narrators are reliable (thiqah)].

సారాంశం

ఒక స్త్రీ మరో స్త్రీకి ‘ప్యాట్రన్’గా ఉండి పెండ్లి జరిపించజాలదనీ, ఖుద్దుగా తన వివాహం సయితం ‘వలీ’ లేకుండా చేసుకోజాలదనీ ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. అత్యధిక మంది విద్వాంసుల అభిమతం కూడా ఇదే. అయితే హనఫీ ధర్మవేత్తల దృక్పథం మరోవిధంగా ఉంది. యుక్త వయస్సురాలు, వివేకవంతురాలైన ఒక మహిళ తన నికాహ్ ను చేసుకోవటంతో పాటు, యుక్త వయస్సుకు చేరని తన కుమార్తె వివాహం సయితం జరిపించగలదనీ, వేరొకరి వివాహానికి ‘వకీల్’గా కూడా ఉండగలదని హనఫీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 839

840

హదీసు 840

وَعَنْ نَافِعٍ , عَنْ اِبْنِ عُمَرَ قَالَ : { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنِ الشِّغَارِ ; وَالشِّغَارُ: أَنْ يُزَوِّجَ اَلرَّجُلُ اِبْنَتَهُ عَلَى أَنْ يُزَوِّجَهُ اَلْآخَرُ اِبْنَتَهُ , وَلَيْسَ بَيْنَهُمَا صَدَاقٌ } مُتَّفَقٌ عَلَيْهِ. وَاتَّفَقَا مِنْ وَجْهٍ آخَرَ عَلَى أَنَّ تَفْسِيرَ اَلشِّغَارِ مِنْ كَلَامِ نَافِعٍ.

హజ్రత్ నాఫె, ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఆధారంగా చేసిన కథనం : దైవప్రవక్త ﷺ షిగార్ పద్ధతిని వారించారు. ఒక వ్యక్తి మహర్ ఇచ్చి పుచ్చుకోవడాలతో నిమిత్తం లేకుండా తన కుమార్తెను మరొక వ్యక్తికిచ్చి పెళ్ళి జరిపించి, అతని కుమార్తెను తాను పెళ్ళి చేసుకోవడాన్నే ‘షిగార్’ అంటారు. (బుఖారీ, ముస్లిం – ‘షిగార్’కు సంబంధించి ఇవ్వబడిన నిర్వచనం నాఫె గారిదన్న విషయంలో బుఖారీ, ముస్లిం లిరువురి మధ్య ఏకాభిప్రాయం ఉంది)

English

Narrated Nafi' from Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) prohibited Shighar, which means that a man gives his daughter in marriage on condition that the other gives his daughter to him in marriage [in exchange] without any dowry being paid by either. [Agreed upon].

And they both agreed that the explanation of the meaning of Shighar is the saying of Nafi'.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 840

841

హదీసు 841

وَعَنِ ابْنِ عَبَّاسٍ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- { أَنَّ جَارِيَةً بِكْرًا أَتَتِ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَذَكَرَتْ: أَنَّ أَبَاهَا زَوَّجَهَا وَهِيَ كَارِهَةٌ , فَخَيَّرَهَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-} رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَابْنُ مَاجَهْ , وَأُعِلَّ بِالْإِرْسَالِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక యువతి (కన్య) దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, తన తండ్రి తనకిష్టంలేని వ్యక్తితో తన నికాహ్ (వివాహం) చేశాడని ఫిర్యాదు చేసింది. ఇది విని దైవప్రవక్త ﷺ ఆ యువతికి ‘నిర్ణయాధికారం’ ఇచ్చారు. (దీనిని అహ్మద్, అబూదావూద్, ఇబ్నె మాజా ఉల్లేఖించారు – ఈ హదీసు ‘ముర్సల్’ అయిన కారణంగా దీనిని లోపభూయిష్టంగా భావించటం జరిగింది)

English

Narrated Ibn 'Abbas (RA): A virgin girl came to the Prophet (ﷺ) and mentioned that her father had married her against her will, so Allah's Messenger (ﷺ) allowed her to exercise her choice. [Reported by Ahmad, Abu Dawud and Ibn Majah. If it is considered defective for being Mursal (missing link in the chain after the Tabi'i)].

సారాంశం

వధువు తండ్రి వధువుకు సంరక్షకుడని ఈ హదీసు ద్వారా విదితమవుతున్నది. కూతురిని సంప్రతించకుండానే అతడు తన కూతురి వివాహమైతే జరపగలడు గాని, షరీయత్పరంగా ఆ వివాహ బంధాన్ని కొనసాగించే లేక రద్దుపరచే అధికారం కూతురికి ఉంటుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 841

842

హదీసు 842

وَعَنْ اَلْحَسَنِ , عَنْ سَمُرَةَ , عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { أَيُّمَا اِمْرَأَةٍ زَوَّجَهَا وَلِيَّانِ , فَهِيَ لِلْأَوَّلِ مِنْهُمَا } رَوَاهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ , وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ.

హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ సముర (రదియల్లాహు అన్హు) ఆధారంగా చేసిన ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “ఏ స్త్రీ నికాహ్ అయినా ఇద్దరు సంరక్షకులు (ఇరువురు వేర్వేరు వ్యక్తులతో) జరిపిస్తే ఈ స్త్రీ మొదటి భర్తకే చెందుతుంది.” (దీనిని అహ్మద్ మరియు నలుగురు ఉల్లేఖించారు. తిర్మిజీ దీన్ని ‘హసన్’గా ఖరారు చేశారు)

English

Narrated al-Hasan from Samurah (RA): The Prophet (ﷺ) said: "If two guardians have given a woman in marriage, she marries the man she was first married to." [Reported by Ahmad and al-Arba'a. at-Tirmidhi graded it Hasan (good)].

సారాంశం

ఈ హదీసు ప్రకారం స్పష్టమయ్యేదేమిటంటే ఒక స్త్రీకి ఇద్దరు పెద్దలు సంరక్షకులుగా ఉండి, వారు తమకు నచ్చిన ఇరువురు వ్యక్తులతో ఆమె వివాహం జరిపిస్తే, ఆ ఇరువురిలో మొదట నికాహ్ చేసుకున్న వ్యక్తి మాత్రమే ఆమెకు భర్త అవుతాడు. తరువాతి నికాహ్ అధర్మంగా ఖరారు చేయబడుతుంది. ఎందుకంటే ఇస్లామీయ షరీయత్ ఒక నికాహ్ రద్దు కానంతవరకూ మరో నికాహ్ ను ఆమోదించదు. ఒకవేళ రెండు నికాహ్ లు కూడా ఏకకాలంలో జరిగితే ఆ రెండూ అధర్మంగానే పరిగణించబడతాయి. వాటిల్లో ఏ ఒక్కటీ చెల్లదు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు ఏమాత్రం తావులేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 842

843

హదీసు 843

وَعَنْ جَابِرٍ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَيُّمَا عَبْدٍ تَزَوَّجَ بِغَيْرِ إِذْنِ مَوَالِيهِ وَأَهْلِهِ , فَهُوَ عَاهِرٌ } رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَالنَّسَائِيُّ , وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ , وَكَذَلِكَ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రవచనం – “ఏ బానిస అయితే తన యజమానుల, దొరల అనుమతి లేకుండా నికాహ్ చేసుకుంటాడో అతడు వ్యభిచారి అవుతాడు.” (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి, తిర్మిజీ ఉల్లేఖించారు – తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. అలాగే ఇబ్నె హిబ్బాన్ కూడా దీనిని ప్రామాణికంగా పేర్కొన్నారు)

English

Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said: "Any slave who marries without the permission of his masters or owners is (like) a fornicator." [Reported by Ahmad, Abu Dawud, an-Nasa'i and at-Tirmidhi; the latter graded it Sahih (authentic), as did Ibn Hibban].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 843

844

హదీసు 844

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { لَا يُجْمَعُ بَيْنَ اَلْمَرْأَةِ وَعَمَّتِهَا , وَلَا بَيْنَ اَلْمَرْأَةِ وَخَالَتِهَا } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు- “ఒకే పురుషుని నికాహ్ (వివాహ బంధం)లో మేనత్త మరియు ఆమె సోదర కుమార్తె ఉండరాదు. (అలాగే) పిన్ని మరియు ఆమె సోదరి కుమార్తె కూడా ఒక పురుషుని వివాహ బంధంలో (ఒకే సమయంలో) ఉండరాదు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "A man must not join together (in marriage to him) a woman and her paternal aunt or a woman and her maternal aunt." [Agreed upon].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 844

845

హదీసు 845

وَعَنْ عُثْمَانَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَنْكِحُ اَلْمُحْرِمُ , وَلَا يُنْكَحُ } رَوَاهُ مُسْلِمٌ. وَفِي رِوَايَةٍ لَهُ : { وَلَا يَخْطُبُ }. وَزَادَ اِبْنُ حِبَّانَ : { وَلَا يُخْطَبُ عَلَيْهِ }.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ఇహ్రామ్ కట్టుకున్న వ్యక్తి స్వయంగా తన వివాహం చేసుకోవటం గానీ, ఇతరుల వివాహం జరిపించటం గానీ చేయరాదు.” (ముస్లిం) ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో “వివాహ సందేశం కూడా పంపరాదు” అని ఉంది. “అతని వివాహ సందేశానికి సమాధానం కూడా ఇవ్వరాద”ని ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖించారు.

English

Narrated 'Uthman (RA): Allah's Messneger (ﷺ) said: "One who is in Ihram may not marry, or be given in marriage." [Reported by Muslim]. In another narration by him it says: "He should not ask someone's hand in marriage."

Ibn Hibban added: "nor give someone in engagement (to be married)."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 845

846

హదీసు 846

وَعَنِ ابْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ : { تَزَوَّجَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-مَيْمُونَةَ وَهُوَ مُحْرِمٌ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ : عَنْ مَيْمُونَةَ نَفْسِهَا { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-تَزَوَّجَهَا وَهُوَ حَلَالٌ }.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ హజ్రత్ మైమూనా (రదియల్లాహు అన్హా)ను వివాహం చేసుకున్నప్పుడు ఆయన ﷺ ఇహ్రాం స్థితిలో ఉన్నారు (బుఖారీ, ముస్లిం). అయితే ‘ముస్లిం’లో స్వయంగా హజ్రత్ మైమూనా (రదియల్లాహు అన్హా) చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తనను నికాహ్ చేసుకున్న సమయంలో ఆయన ﷺ ‘హలాల్’ స్థితిలోనే ఉన్నారు (ఇహ్రామ్ స్థితిలో లేరు).

English

Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) married Maimunah (RA) when he was in the state of Ihram (during pilgrimage). [Agreed upon].

Muslim reported from Maimunah (RA) herself: "The Prophet (ﷺ) married her when he was not in the state of Ihram."

సారాంశం

‘ఇహ్రామ్’ స్థితిలో ఉండటమంటే హజ్ మరియు ఉమ్రా కోసం దీక్షబూని రెండు తెల్లని వస్త్రాలను కట్టుకోవటం అన్నమాట! హజ్ లేక ఉమ్రా క్రియలు ముగిసే వరకు ‘ముహ్రిమ్’పై కొన్ని ఆంక్షలు ఉంటాయి. కొన్ని పనులు అతని కొరకు నిషేధించబడతాయి. వాటిలో పెండ్లి చేసుకోవటం కూడా ఒకటి.

మహాప్రవక్త ముహమ్మద్ ﷺ ఇహ్రామ్ స్థితిలో చేసుకున్న ఈ నికాహ్ ను నిదర్శనంగా పేర్కొంటూ కొంతమంది ‘ముహ్రిమ్’ నికాహ్ చేసుకోవటాన్ని ధర్మసమ్మతంగా భావిస్తున్నారు. అయితే పై హదీసులోని చివరి వాక్యంలో హజ్రత్ మైమూనా (రదియల్లాహు అన్హా) గారు స్వయంగా స్పష్టపరిచారు – ఆ సమయంలో దైవప్రవక్త ﷺ ‘ముహ్రిమ్’గా లేరనీ, ఇహ్రామ్ ఆంక్షల నుండి విముక్తులై హలాల్ స్థితిలో ఉన్నారని! ఈ వివాహానికి మధ్యవర్తిగా ఉండి, వివాహం జరిపించటంలో కీలకపాత్ర పోషించిన అబూరాఫె (రదియల్లాహు అన్హు) గారు కూడా ఆ సమయంలో మహాప్రవక్త ﷺ హలాల్ స్థితిలోనే ఉన్నారని సాక్ష్యం ఇచ్చారు. ఒకానొక సంఘటనతో ప్రత్యక్ష సంబంధమున్న ఇరువురు విశ్వసనీయులైన వ్యక్తులు నిజానిజాలను లోకానికి చాటిచెప్పినప్పుడు అంచనాలపై ఆధారపడకూడదు. మూల విషయానికి సంబంధించిన సందేహం పటాపంచలైపోయిన తరువాత పాక్షిక, సాపేక్షిక విషయాలను పట్టుకుని ప్రాకులాడటం సమంజసం అనిపించుకోదు. అదీగాక అప్పటికి (అంటే మహాప్రవక్త ﷺ హజ్రత్ మైమూనాను వివాహమాడిన నాటికి) హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వయస్సు పదేళ్ళకు మించలేదు. ఈ విషయాన్ని చెప్పటంలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారి అంతరార్థం ఇంకొకటి అయి ఉండవచ్చు – దైవప్రవక్త ﷺ ఇహ్రామ్ స్థితిలో ఉన్నారంటే పవిత్ర మక్కా హద్దుల లోపల ఉన్నారనే భావంలో బహుశా ఆయన ఈ విధంగా అని ఉండవచ్చు! ఒకవేళ మహాప్రవక్త ﷺ నిజంగానే ఇహ్రామ్ స్థితిలో నికాహ్ చేసుకున్నారని అనుకున్నా, కొన్ని కొన్ని విషయాలలో అల్లాహ్ తన ప్రవక్త ﷺ కు ప్రత్యేకతను వొసగాడన్న సత్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ప్రముఖ హదీసువేత్త షేఖ్ అబ్దుర్రహ్మాన్ ముబారక్‌పూరి “తుహ్‌ఫతుల్ అహోజీ” (సంపుటి : 2, పేజి – 89) లో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిపారు. మొత్తమ్మీద జమ్ హూర్ (అధిక సంఖ్యాక విద్వాంసుల) అభిప్రాయం ప్రాధాన్యత నివ్వదగినది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 846

847

హదీసు 847

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ أَحَقَّ اَلشُّرُوطِ أَنْ يُوَفَّى بِهِ , مَا اِسْتَحْلَلْتُمْ بِهِ اَلْفُرُوجَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉద్బోధించారు : “మీరు ఏ షరతులపై స్త్రీల మర్మాంగాలను మీ కోసం ధర్మసమ్మతం గావించుకున్నారో అవి మీరు నెరవేర్చడానికి అన్నింటికన్నా ఎక్కువ హక్కు కలిగిన షరతులు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Uqbah bin 'Aamir (RA): Allah's Messenger (ﷺ) said: "The most worthy conditions to be fulfilled are those by which you make sexual intercourse lawful for yourselves (in marriage)." [Agreed upon].

సారాంశం

ఈ హదీసునుబట్టి బోధపడేదేమంటే ఒక పురుషుడు ఒక స్త్రీని తన కోసం ధర్మబద్ధం చేసుకోవడానికిగాను అతను నెరవేర్చవలసిన మొట్టమొదటి షరతు, అత్యంత ముఖ్యమయిన షరతు నికాహ్. ఎందుకంటే నికాహ్ ఎంతో సున్నితమయినది. నికాహ్ సందర్భంగా ఇరుపక్షాల వారు షరతులు పెట్టుకోవటం సమంజసమేనని ‘సుబులుస్సలాం’లో అనబడింది. ఆ షరతులేమిటి? వాటిలో ‘మహర్’ సొమ్మును భార్యకు చెల్లించటం ముఖ్యమైనది. ‘మహర్’ ద్వారానే ఒక స్త్రీ ఒక పురుషుని కోసం ‘హలాల్’ అవుతుందని కూడా కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ షరతుల విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దాంపత్య హక్కులలో భార్య దేనిని అన్నింటికంటే ఎక్కువగా కోరుకుంటుందో దాన్ని నెరవేర్చటం కూడా ఒక ముఖ్యమైన షరతు అని కొందరి ఉవాచ. తనతో నికాహ్ కోసం స్త్రీని ఒప్పించే ప్రయత్నంలో పురుషుడు ఏ ఏ షరతులకు తలఒగ్గాడో వాటిని అక్షరాలా నెరవేర్చాలని ఇంకొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఈ షరతులు షరీయత్ రీత్యా అధర్మమైనవై ఉండరాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 847

848

హదీసు 848

وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ ‏- رضى الله عنه ‏- قَالَ : { رَخَّصَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَامَ أَوْطَاسٍ فِي اَلْمُتْعَةِ , ثَلَاثَةَ أَيَّامٍ , ثُمَّ نَهَى عَنْهَا } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ సలమా బిన్ అక్వా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఔతాస్ యుద్ధం జరిగే రోజుల్లో మూడు రోజుల తాత్కాలిక నికాహ్ ఒప్పందం (ముతా) కొరకు అనుమతి ఇచ్చారు. అయితే తరువాత దీనిని వారించారు.” (ముస్లిం)

English

Narrated Salamah bin al-Akwa' (RA): In the year of Autas, Allah's Messenger (ﷺ) permitted Mut'a (temporary marriage) for three nights, then he prohibited (afterwards). [Reported by Muslim].

సారాంశం

హదీసులో ‘ముతా’ అనే పదం ప్రయోగించబడింది. ముతా అనేది ఒక ఒప్పందం. దీని ప్రకారం ఒక పురుషుడు – ఒక స్త్రీ ఒక నిర్ణీత కాలం వరకు కలిసి ఉండటానికి అగ్రిమెంట్ చేసుకుంటారు. గడువు పూర్తవగానే విడిపోతారు. మహాప్రవక్త ﷺ హయాంలో ఈ తాత్కాలిక నికాహ్ (ముతా) రెండుసార్లు హలాల్ (ధర్మసమ్మతం)గా, రెండుసార్లు హరామ్ (అధర్మం)గా చేయబడినట్లు వివిధ ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. ఔతాస్ (హునైన్) యుద్ధ సందర్భంగా ఆయన ﷺ మూడు రాత్రులకోసం దీనిని అనుమతించి, ఆ తరువాత శాశ్వితంగా నిషేధించారు. ఈనాడు ఎవరయినా ఈ “ముతా” విధానాన్ని అవలంబిస్తే అది ముమ్మాటికీ షరీయత్ ఉల్లంఘన క్రిందికే వస్తుందని గమనించాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే హదీసులలో ఉన్నాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 848

849

హదీసు 849

وَعَنْ عَلَيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ : { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ اَلْمُتْعَةِ عَامَ خَيْبَرَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఖైబర్ దండయాత్ర జరిగిన సంవత్సరంలో ముతా పద్ధతి (స్త్రీలను తాత్కాలికంగా నికాహ్ చేసుకునే విధానాన్ని) వారించారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Ali (RA): Allah's Messenger (ﷺ) forbade Mut'a (temporary marriage) in the year of Khaibar. [Agreed upon].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 849

850

హదీసు 850

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) గారిచే మరో కథనం : దైవప్రవక్త ﷺ స్త్రీలను తాత్కాలికంగా వివాహ మాడటాన్ని (ముతా చేసుకోవడాన్ని), పెంపుడు గాడిదల మాంసం తినడాన్ని ఖైబర్ యుద్ధదినాన వారించారు. (“ఏడుగురి’లో అబూదావూద్ తప్ప అందరూ ఉల్లేఖించారు)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 850

851

హదీసు 851

హజ్రత్ రబీ బిన్ సబ్ర తన తండ్రి ద్వారా చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : నేను ఇంతకు ముందు మీకు స్త్రీలను తాత్కాలికంగా పెళ్ళి చేసుకోవడానికి అనుమతి ఇచ్చి ఉన్నాను. కాని ఇప్పుడు అల్లాహ్ ప్రళయదినం వరకూ ఈ పద్ధతిని నిషిద్ధం గావించాడు. కనుక ఎవరి వద్దయినా ‘ముతా’ ఒప్పందానికి సంబంధించిన స్త్రీ ఉన్నట్లయితే ఆమెను వదలివేయాలి. వారికి మీరు ఏదన్నా ఇచ్చి ఉంటే దాన్ని తిరిగి తీసుకోకండి.” (దీనిని ముస్లిం, అబూదావూద్, నసాయి,ఇబ్నె మాజా, అహ్మద్ మరియు ఇబ్నె హిబ్బాన్ లు ఉల్లేఖించారు)

హదీసు ఉల్లేఖకులు

రబీ బిన్ సబ్ర. పూర్తి పరంపర ప్రకారం రబీ బిన్ సబ్ర బిన్ మాబద్ జుహనీ మదనీ అనబడతారు. నసాయి మరియు అజ్లీ లిరువురూ ఈయన్ని నమ్మదగ్గ వ్యక్తిగా పేర్కొన్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 851

852

హదీసు 852

وَعَنِ ابْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ : { لَعَنَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-اَلْمُحَلِّلَ وَالْمُحَلَّلَ لَهُ } رَوَاهُ أَحْمَدُ , وَالنَّسَائِيُّ , وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ. وَفِي اَلْبَابِ : عَنْ عَلِيٍّ أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيَّ.

హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త ﷺ ‘హలాలా’కు పాల్పడిన వారినీ, ఎవరి కొరకు ‘హలాలా’కు పాల్పడటం జరిగిందో వారిని కూడా ధూత్కరించారు. (అహ్మద్, నసాయి, తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు- తిర్మిజీ దీనిని ప్రామాణికమైదిగా పేర్కొన్నారు. ఈ అధ్యాయంలో దీనికి సంబంధించిన హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం కూడా ఉంది. దానిని ‘నలుగురి’లో నసాయి తప్ప అందరూ ఉల్లేఖించారు.

English

Narrated Ibn Mas'ud (RA): Allah's Messenger (ﷺ) cursed the man who made a woman lawful for her first husband and the one for whom she was made lawful (the men involved in Halalah). [Reported by Ahmad, an-Nasa'i and at-Tirmidhi; the latter declared it to be Sahih (authentic)].

al-Arba'a except an-Nasa'i reported something related to this matter, on the authority of 'Ali (RA).

సారాంశం

పై హదీసులో ‘హలాలా’ అనే పదం వచ్చింది. ‘హలాలా’ చేష్టకు ఒడిగట్టే వాడిని ‘ముహల్లిల్‌గా వ్యవహరిస్తారు. మూడు విడాకులు పొందిన దంపతులను ధర్మబద్ధంగా మలిసారి నికాహ్ ద్వారా వారు ఏకం కావడానికి మార్గం సుగమం చేసే ఉద్దేశ్యంతో ఒక స్త్రీని నికాహ్ చేసుకుని, ఆమెతో సంభోగం జరిపి వెంటనే ఆమెకు విడాకులు (తలాఖ్) ఇచ్చే వ్యక్తి హలాలాకు పాల్పడిన వాడవుతాడు. అంటే ఈ కృత్యం వెనుక ఇరువురు మగాళ్ళ స్వార్థం ఉంది. లేదా కనీసం ఒక మగవాడు తన స్వప్రయోజనం కోసం మరో మగాడిచేత ఈ పని చేయిస్తాడు. ఇది ఒక విధంగా షరీఅత్‌తో చెలగాటమాడటమే. అందుకే మహనీయ ముహమ్మద్ ﷺ ‘హలాలా’కు పాల్పడిన వ్యక్తినీ, ఈ చేష్ట కోసం ఇంకొకరిని ‘పావు’గా వాడుకున్న మాజీ భర్తను కూడా శపించారు. ఒక్క హనఫీలు తప్ప మెజారిటీ ఉలమాలంతా ఈ పనిని హరామ్‌గానే భావిస్తున్నారు. ఈ చేష్టను మనసున్న మంచి వారెవరూ హర్షించలేరు. ముస్లింలే గాకుండా ముస్లిమేతరులు సయితం దీన్ని దుష్ట చేష్టగా తలపోస్తున్నారు.

ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనార్హమే. సంకల్పం లేక ఉద్దేశ్యంలో చెడుగు ఉంటేనే అది ‘హలాలా’గా పరిగణించబడుతుంది. ఎలాంటి దురుద్దేశ్యం లేకుండా – కాకతాళీయంగానే – ఈ వివాహం జరిగి ఉండి, ఇతరత్రా కారణాల వల్ల ఈ వ్యక్తి ఆమెకు విడాకులిస్తే (లేదా ఆమె ఇతన్నుండి విడాకులు పుచ్చుకుంటే) అట్టి పరిస్థితిలో ఇద్దత్ (గడువు) పూర్తయిన తరువాత ఆమె తనకు మొదటిసారి విడాకులిచ్చిన మాజీ భర్తను తిరిగి వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి దోషం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 852

853

హదీసు 853

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَنْكِحُ اَلزَّانِي اَلْمَجْلُودُ إِلَّا مِثْلَهُ } رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَرِجَالُهُ ثِقَاتٌ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “వ్యభిచార నేరానికిగాను కొరడా దెబ్బల శిక్ష పడిన ఒక వ్యభిచారి, తన మాదిరిగా శిక్షను అనుభవించిన వ్యభిచారిణిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేడు” (దీనిని అహ్మద్, అబూదావూద్ ఉల్లేఖించారు. దీనిని అందజేసిన వారు విశ్వసనీయులు)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "A man guilty of fornication, who has been flogged (for it), should not marry any but a woman like him (similarly guilty)." [Reported by Ahmad and Abu Dawud, and its narrators are reliable (thiqah)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 853

854

హదీసు 854

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا , قَالَتْ : { طَلَّقَ رَجُلٌ اِمْرَأَتَهُ ثَلَاثًا , فَتَزَوَّجَهَا رَجُلٌ , ثُمَّ طَلَّقَهَا قَبْلَ أَنْ يَدْخُلَ بِهَا , فَأَرَادَ زَوْجُهَا الْأَوَّلُ أَنْ يَتَزَوَّجَهَا , فَسُئِلَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ ذَلِكَ , فَقَالَ : "لَا. حَتَّى يَذُوقَ اَلْآخَرُ مِنْ عُسَيْلَتِهَا مَا ذَاقَ اَلْأَوَّلُ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِمُسْلِمٍ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: ఒక వ్యక్తి తన భార్యకు మూడు విడాకులు ఇచ్చాడు. (విడాకులు పొందిన) ఆ స్త్రీని మరో వ్యక్తి మనువాడాడు. కాని ఆ వ్యక్తి ఆమెతో సంభోగించకుండానే ఆమెకు విడాకులిచ్చేశాడు. అప్పుడు మొదటి (మాజీ) భర్త ఆమెను తిరిగి నికాహ్ చేసుకోదలిచి, ఆ విషయమై దైవ ప్రవక్త ﷺను సంప్రతించాడు. అప్పుడాయన ﷺ “లేదు. ఆమె మొదటి భర్తలా రెండవ భర్త కూడా ఆమెతో రసాస్వాదన పొందనంతవరకూ ఆమెను తిరిగి వివాహమాడకూడదు” అని స్పష్టం చేశారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ‘ముస్లిం’లోనివి)

English

Narrated 'Aishah (RA): A man divorced his wife by three pronouncements and another man married her and divorced her before cohabiting with her. Then, her first husband intended to remarry her and asked Allah's Messenger (ﷺ) about that. He said, "No, until the other one (second husband) has enjoyed sexual intercourse with her as the first (husband) had." [Agreed upon; the wording is Muslim's].

సారాంశం

ఈ హదీసు ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే; మూడుసార్లు విడియాకులు పొందిన మహిళ, మరొక వివాహం చేసుకుని, ఆ దంపతుల మధ్య లైంగిక సంబంధాలు ఏర్పడిన మీదట, రెండవ భర్త కూడా ఆమెకు ఇష్టపూర్వకంగా విడాకులిస్తే (ఒకరి బలాత్కారానికి, ఒత్తిడికి, ప్రలోభాలకు లొంగకుండా తన మనస్ఫూర్తిగా విడాకులిస్తేనే) లేదా రెండవ భర్త మరణిస్తే, అప్పుడామె మొదటి (మాజీ) భర్తను పునర్వివాహం చేసుకోవడానికి షరీఅత్ రీత్యా అర్హురాలు అవుతుంది.

ఒకవేళ ఆమెను వివాహం చేసుకున్న రెండవ భర్తతో ఆమెకు లైంగిక సంబంధం ఏర్పడకపోయినా, లేదా ఆ రెండవ భర్త ఆమెను ఆస్వాదించలేక ఆమెకు విడాకులిచ్చేసినా, అట్టి స్థితిలో మొదటి (మాజీ) భర్తతో ఆమె నికాహ్ ధర్మసమ్మతం కాదు.

ఒకవేళ మొదటి (మాజీ) భర్త దురుద్దేశ్యంతో ఆమెకు ఇంకొకరితో నికాహ్ జరిపించి (హలాలా చేయించి) అతనితో ఆమెను రమింపజేసి, విడాకుల తతంగాన్ని కూడా పూర్తి చేయించి, ఆ స్త్రీని తిరిగి తన దాంపత్య జీవితంలోకి రప్పించుకునే మార్గం సుగమం చేసుకుంటే అసలది ‘నికాహ్’యే అనిపించుకోదు. ఎందుకంటే ఇక్కడ సంకల్పంలో కల్మషం, కుళ్ళు నిండి ఉంది. ఈ ‘పాపం’లో పాలు పంచుకున్న వారు. (ఇద్దరు పురుషులు + ఒక స్త్రీ) ముగ్గురూ ధూత్కారులే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.0 నికాహ్|హదీసు 854