హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.21 వీలునామా నియమాలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 21వ అధ్యాయం: వీలునామా నియమాలు. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 818 – 822) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.21 వీలునామా నియమాలు

↑ విషయ సూచిక

باب الوصايا

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

818

హదీసు 818

عَنْ اِبْنِ عُمَرَ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- ; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { مَا حَقُّ اِمْرِئٍ مُسْلِمٍ لَهُ شَيْءٌ يُرِيدُ أَنْ يُوصِيَ فِيهِ يَبِيتُ لَيْلَتَيْنِ إِلَّا وَوَصِيَّتُهُ مَكْتُوبَةٌ عِنْدَهُ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు – “ఒక ముస్లిం ఏదైనా వస్తువు గురించి వీలునామా వ్రాయాలని సంకల్పించుకున్నప్పుడు (వెంటనే వ్రాయాలి). రెండు రాత్రులు గడచిపోయినా వీలునామా వ్రాయకుండా దాన్ని అలాగే ఉంచటం అతనికి ఏమాత్రం శోభించదు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "It is not permissible for a Muslim person, who has something he wants to give as a bequest, to have it for two nights without having his will regarding it written and kept ready with him." [Agreed upon].

సారాంశం

‘వీలునామా’ అనేది ఎల్లప్పుడూ లిఖిత రూపంలో ఉండాలని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. వారసత్వ పంపకాలకు సంబంధించిన ఆయత్ అవతరించక పూర్వం వీలునామా వ్రాయటం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యేది. అయితే వారసత్వ పద్ధతిని తెలిపే దైవవాక్యం అవతరించిన మీదట ఈ వీలునామా రద్దయింది. అంటే దివ్య ఖుర్ఆన్ నిర్ధారించిన వాటాల ప్రకారం మృతుని ఆస్తిని పంచుకోవలసి ఉంటుంది. అయితే ఆస్తిపరుడైన ప్రతి ఒక్కడూ ఒక నిర్దీత భాగాన్ని తాను తలచుకున్న వారి పేరున ‘వీలు’ వ్రాయగలడు. ఉదాహరణకు : – కొడుకు జీవించి ఉండగా మనవడికి ఇవ్వవలసిన అవసరం లేకపోయినప్పటికీ అతని చదువు సంస్కారాల నిమిత్తం, పర్యవేక్షణ నిమిత్తం మూడో వంతు ఆస్తిని ఇవ్వమని ‘వసీయతు’ చేయవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.21 వీలునామా నియమాలు|హదీసు 818

819

హదీసు 819

وَعَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قُلْتُ : { يَا رَسُولَ اَللَّهِ ! أَنَا ذُو مَالٍ , وَلَا يَرِثُنِي إِلَّا اِبْنَةٌ لِي وَاحِدَةٌ , أَفَأَتَصَدَّقُ بِثُلُثَيْ مَالِي? قَالَ : " لَا " قُلْتُ : أَفَأَتَصَدَّقُ بِشَطْرِهِ ? قَالَ : " لَا " قُلْتُ : أَفَأَتَصَدَّقُ بِثُلُثِهِ ? قَالَ : " اَلثُّلُثُ , وَالثُّلُثُ كَثِيرٌ , إِنَّكَ أَنْ تَذَرَ وَرَثَتَكَ أَغْنِيَاءَ خَيْرٌ مِنْ أَنْ تَذَرَهُمْ عَالَةً يَتَكَفَّفُونَ اَلنَّاسَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ సాద్ బిన్ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఓ దైవప్రవక్తా ﷺ! నేను ధనవంతుణ్ణి. వారసుల్లో నాకు ఒక్కగానొక్క కూతురు మాత్రమే ఉంది. అందుచేత నేను మూడింట రెండొంతుల ఆస్తిని దానంగా ఇవ్వవచ్చా?” అని అడిగాను. “ఇవ్వకూడదు” అని ఆయన ﷺ అన్నారు. “మరి నా ఆస్తిలో అర్ధభాగం దానం చేయనా?” అని నేను మళ్ళీ అడిగాను. “చేయకూడదు” అని ఆయన ﷺ బదులిచ్చారు. “పోనీ (మూడింట) ఒక వంతు దానంగా ఇవ్వవచ్చునా?” అని నేను సందేహం వెలిబుచ్చగా, “ఇవ్వవచ్చు. అయితే ఆ ఒక వంతు కూడా ఎక్కువే. నీ వారసులు ప్రజల ముందు చేతులు చాపి ముష్టెత్తుకునేలా వారిని నిరుపేదలుగా, నిరాధారులుగా చేసి వెళ్ళటంకన్నా వారిని స్థితిమంతులుగా వదలి వెళ్ళడం ఎంతో మంచిది” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Sa'd bin Abi Waqqas (RA): I said, "O Allah's Messenger, I have wealth and no one to inherit from me except my one daughter. Shall I give two-thirds of my property as Sadaqah?" He replied, "No." I said, "Shall I give half of it as Sadaqah?" He replied, "No." I said, "Shall I give a third of it as Sadaqah?" He replied, "You may give a third as Sadaqah, which is still a lot. To leave your heirs rich is better than to leave them poor and begging from people." [Agreed upon].

సారాంశం

ఆస్తిపరుడు గరిష్ఠంగా మూడింట ఒక వంతు ఆస్తిని మాత్రమే వేరితరులకు వీలు వ్రాయగలడని ఈ హదీసును బట్టి బోధపడుతున్నది. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా వీలు వ్రాయడానికి హక్కుదారులు మనస్ఫూర్తిగా అనుమతిస్తే అది వేరే విషయం. కాని హక్కుదారులను కాకుండా వేరితరులకు అధికంగా దానధర్మాలు చేయటం వాంఛనీయం కూడా కాదు. సాధ్యమైనంత వరకు వారసులను మంచి స్థితిలో వదలి వెళ్ళాలి. వారు ఇతరుల ముందు చేయి చాపవలసిన హీన స్థితి ఏర్పడకుండా జాగ్రత్తపడాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.21 వీలునామా నియమాలు|హదీసు 819

820

హదీసు 820

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- { أَنَّ رَجُلاً أَتَى اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ ! إِنَّ أُمِّي اُفْتُلِتَتْ نَفْسُهَا وَلَمْ تُوصِ , وَأَظُنُّهَا لَوْ تَكَلَّمَتْ تَصَدَّقَتْ , أَفَلَهَا أَجْرٌ إِنْ تَصَدَّقْتُ عَنْهَا ? قَالَ : " نَعَمْ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِمُسْلِمٍ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. కాని ఆమె వీలు తయారుచేయలేదు. (చనిపోయే ముందు) ఆమె గనక మాట్లాడి ఉంటే దైవమార్గంలో (తప్పక) దానం చేసి ఉండేదని నా అనుమానం. మరి నేనిప్పుడు ఆమె తరపున దానం చేస్తే ఆమెకు పుణ్యం చేరుతుందా?” అని సందేహం వెలిబుచ్చాడు. దానికి ఆయన ﷺ “చేరుతుంది” అని సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ‘ముస్లిం’ లోనివి)

English

Narrated 'Aishah (RA): A man came to the Prophet (ﷺ) and said, "O Allah's Messenger, my mother had died suddenly, and did not make a will. And I think she would have given out Sadaqah if she had been able to speak, so will she get a reward if I gave out Sadaqah on her behalf?" He replied, "Yes." [Agreed upon; the wording is Muslim's].

సారాంశం

తల్లిదండ్రులు ‘వసీయతు’ చేయకపోయినప్పటికీ, వారి తరపున వారి పిల్లలు గనక దానధర్మాలు చేస్తే అది వారి తల్లిదండ్రులకు చేరుతుందని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. వసీయతు లేకపోయినా మృతుల తరపున దానధర్మాలు చేయటం ధర్మసమ్మతమే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.21 వీలునామా నియమాలు|హదీసు 820

821

హదీసు 821

وَعَنْ أَبِي أُمَامَةَ اَلْبَاهِلِيِّ ‏- رضى الله عنه ‏- سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ : { إِنَّ اَللَّهَ قَدْ أَعْطَى كُلَّ ذِي حَقٍّ حَقَّهُ , فَلَا وَصِيَّةَ لِوَارِثٍ } رَوَاهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيَّ , وَحَسَّنَهُ أَحْمَدُ وَاَلتِّرْمِذِيُّ , وَقَوَّاهُ اِبْنُ خُزَيْمَةَ , وَابْنُ اَلْجَارُودِ. وَرَوَاهُ اَلدَّارَقُطْنِيُّ مِنْ حَدِيثِ اِبْنِ عَبَّاسٍ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- , وَزَادَ فِي آخِرِهِ : { إِلَّا أَنْ يَشَاءَ اَلْوَرَثَةُ } وَإِسْنَادُهُ حَسَنٌ.

హజ్రత్ అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త ﷺ ప్రబోధిస్తుండగా విన్నాను – “అల్లాహ్ ప్రతి హక్కుదారుని కోసం అతని హక్కును నిర్ధారించాడు. కాబట్టి ఇకమీదట ఏ వారసుని విషయంలో కూడా వీలు వ్రాయవలసిన అవసరం లేదు.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురి’లో నసాయి తప్ప మిగిలినవారు ఉల్లేఖించారు – అహ్మద్, తిర్మిజీలు దీనిని ‘హసన్’గా పేర్కొన్నారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్‌లు ‘దృఢమైనది’గా ఖరారు చేశారు) దారె ఖుత్నీ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) నుండి ఉల్లేఖించారు. చివరిలో “అతని వారసులు కోరితే తప్ప!” అనే వాక్యాన్ని అదనంగా చెప్పారు.

English

Narrated Abu Umamah al-Bahili (RA): I heard Allah's Messeneger (ﷺ) saying, "Allah has appointed for everyone who has a right what is due to him, and no Wasiyah (will) should be made to an heir." [Reported by Ahmad and al-Arba'a except an-Nasa'i. Ahmad and at-Tirmidhi graded it Hasan (good), while Ibn Khuzaimah and Ibn al-Jarud graded it Qawiy (strong)].

ad-Daraqutni reported the aforesaid Hadith from the narration of Ibn 'Abbas (RA); and he added in its end: "unless the other heirs wish so." [Its chain of narrators is Hasan (good)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.21 వీలునామా నియమాలు|హదీసు 821

822

హదీసు 822

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ ‏- رضى الله عنه ‏- قَالَ : " قَالَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَللَّهَ تَصَدَّقَ عَلَيْكُمْ بِثُلُثِ أَمْوَالِكُمْ عِنْدَ وَفَاتِكُمْ ; زِيَادَةً فِي حَسَنَاتِكُمْ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ. وَأَخْرَجَهُ أَحْمَدُ , وَالْبَزَّارُ مِنْ حَدِيثِ أَبِي اَلدَّرْدَاءِ. وَابْنُ مَاجَهْ : مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ. وَكُلُّهَا ضَعِيفَةٌ , لَكِنْ قَدْ يَقْوَى بَعْضُهَا بِبَعْضٍ. وَاَللَّهُ أَعْلَمُ.

హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీ పుణ్యకార్యాలు ఎక్కువయ్యేందుకు, మీకు మరణ సమయంలో మూడింట ఒక వంతు ఆస్తిని దానం చేసే అనుమతిని ఇచ్చి అల్లాహ్ మీకు మేలు చేశాడు.” (దీనిని దారె ఖుత్నీ ఉల్లేఖించారు – అహ్మద్, బజ్జార్‌లు అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఈ హదీసును ఉటంకించారు. కాగా; ఇబ్నె మాజా అబూహురైర (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఉటంకించారు. అయితే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవే. అయినప్పటికినీ అవి పరస్పరం బలం చేకూర్చేవిగా ఉన్నాయి) అల్లాహ్‌యే బాగా ఎరుగు.

English

Narrated Mu'adh bin Jabal (RA): The Prophet (ﷺ) said: "Allah gave (a favor) as Sadaqah to you a third of your property, when you are about to die, as an increase in your good deeds." [Reported by ad-Daraqutni].

Ahmad and al-Bazzar reported the aforesaid narration from the Hadith of Abu ad-Darda.

While Ibn Majah reported it from the Hadith of Abu Hurairah (RA).

All of them (i.e. these three chains of narrators) are weak. However, they may strengthen one another (becoming Hasan), and Allah Knows Best.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.21 వీలునామా నియమాలు|హదీసు 822