హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.16 బంజరు భూములను సాగుచేయటం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 16వ అధ్యాయం: బంజరు భూములను సాగు చేయటం. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 776 – 784) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.16 బంజరు భూములను సాగు చేయటం

↑ విషయ సూచిక

باب إحياء الموات

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

776

హదీసు 776

عَنْ عُرْوَةَ, عَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏-; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ عَمَّرَ أَرْضاً لَيْسَتْ لِأَحَدٍ, فَهُوَ أَحَقُّ بِهَا } قَالَ عُرْوَةُ: وَقَضَى بِهِ عُمَرُ فِي خِلَافَتِهِ.‏ رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించినట్లు హజ్రత్ ఉర్వ (రదియల్లాహు అన్హా) తెలిపారు – “ఎవరికీ చెందని – బంజరుగా పడివున్న – భూమిని సాగుచేసినవాడే ఆ భూమికి ఎక్కువ హక్కుదారుడు” (బుఖారీ). హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన పరిపాలనా కాలంలో ఈ ప్రవచనం ప్రకారమే నిర్ణయం గైకొనేవారని ఉర్వ (రదియల్లాహు అన్హు) తెలిపారు.

English

Narrated 'Urwa from 'Aishah (RA): The Prophet (ﷺ) said: "He who develops land that does not belong to anyone, has the most right to it." 'Urwa said that 'Umar ruled according to that during his caliphate. [Reported by al-Bukhari]

సారాంశం

ఎవరి ఉపయోగంలోకీ రాకుండా బంజరుగా పడివున్న భూమిని ఎవరయినా మరమ్మత్తు చేసి దానిని సేద్యానికనువుగా చేస్తే ఆ భూమి వారి స్వంతమవుతుందని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. అయితే ఆ భూమి సాటి ముస్లిం సోదరునికి చెందిన ఆస్తిగానీ, ‘జిమ్మీ’ సోదరుని పొలంగానీ అయివుండరాదన్నది షరతు. అంటే పోరంబోకు నేల అన్నమాట! అటువంటి భూమిని సాగుచేయటానికి రాజు అనుమతి పొందవలసిన అవసరం కూడా లేదు. అత్యధికమంది పండితుల దృక్పథం ఇదే. అయితే నేల సేద్యానికనువుగా మారినపుడు రాజ్యాధికారికి తెలియజేసి అతని ఆమోదాన్ని పొందాలని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలోనయితే ఎట్టి పరిస్థితిలోనూ రాజు అనుమతి లేకుండా సాగుచేయరాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 776

777

హదీసు 777

وَعَنْ سَعِيدِ بْنِ زَيْدٍ ‏- رضى الله عنه ‏- عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ أَحْيَا أَرْضاً مَيْتَةً فَهِيَ لَهُ } رَوَاهُ اَلثَّلَاثَةُ, وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ.‏ وَقَالَ: رُوِيَ مُرْسَلاً.‏ وَهُوَ كَمَا قَالَ, وَاخْتُلِفَ فِي صَحَابِيِّهِ, فَقِيلَ: جَابِرٌ, وَقِيلَ: عَائِشَةُ, وَقِيلَ: عَبْدُ اَللَّهِ بْنُ عُمَرَ, وَالرَّاجِحُ اَلْأَوَّلُ.

హజ్రత్ సయీద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “ఎవరయితే బంజరుగా పడివున్న భూమిలో చెమటోడ్చి ప్రాణం పోస్తాడో ఆ భూమి అతని సొంతమవుతుంది.” (దీనిని ముగ్గురు ఉల్లేఖించారు – తిర్మిజీ దీనిని హసన్‌గా పేర్కొన్నారు. ఇది ముర్సల్‌గా ఉల్లేఖించబడిందని కూడా అన్నారు. ఇది ఆయన అన్నట్లుగానే ఉంది. ఈ హదీసును దైవప్రవక్త ﷺ నుండి తొలిసారిగా విన్న సహాబీ ఎవరు? అన్న విషయమై అభిప్రాయభేదం ఉంది. ఆ సహాబీ హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) అనీ, హజ్రత్ ఆయిషా(రదియల్లాహు అన్హా) అనీ, హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) అనీ మూడు వాదనలున్నాయి. మొదటి పేరే ప్రాధాన్యత నివ్వదగినది)

English

Narrated Sa'id bin Zaid (RA): The Prophet (ﷺ) said: "If anyone makes a barren land productive, then it belongs to him." [Reported by ath-Thalatha. at-Tirmidhi graded it Hasan (good)].

And he (at-Tirmidhi) said that it was reported in a Mursal (missing link after the Tabi'i) form, which is the case. However, there is disagreement regarding the Companion who heard it from the Prophet (ﷺ), and it has been said that it was Jabir, 'Aishah or 'Abdullah bin 'Umar, and the strongest opinion is that it was the first one (i.e. Jabir).

సారాంశం

బంజరుగా, నిరుపయోగంగా ఉన్న భూమిని మృత భూమిగానూ, సేద్యం చేయబడే నేలను ప్రాణం పోసుకున్న నేలగానూ హదీసులో అభివర్ణించటం జరిగింది. బంజరుగా పడివున్న భూమిని సేద్యానికి అనువుగా మలచటానికి, విత్తనాలు వేయడానికి, తోటలు పెంచటానికి, బావులు త్రవ్వడానికి ఎవరయినా ముందుకు వస్తే అటువంటి వారిని పై రెండు హదీసులలో ప్రోత్సహించటం జరిగింది. భూములు వృధాగా, నిరుపయోగంగా పడి ఉండటాన్ని ఇస్లాం ఇష్టపడదు. ఏదో ఒక విధంగా అవి ఉపయోగంలోకి రావాలి. ఉత్పత్తులు పెరగాలి. తద్వారా ప్రజల ఇక్కట్లు తొలగిపోవాలి. మానవ నైజం వాంఛించేది కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 777

778

హదీసు 778

وَعَنِ اِبْنِ عَبَّاسٍ; أَنَّ اَلصَّعْبَ بْنَ جَثَّامَةَ اَللَّيْثِيَّ ‏- رضى الله عنه ‏- أَخْبَرَهُ أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا حِمَى إِلَّا لِلَّهِ وَلِرَسُولِهِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

సాబ్ బిన్ జస్సామ లైసీ (రదియల్లాహు అన్హు) తనకు చెప్పిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు తప్ప మేత మేసే నిర్దీత భూభాగాలను తమ కొరకు ప్రత్యేకించుకోవటం ఎవరికీ ధర్మ సమ్మతం కాదు.” (బుఖారీ)

English

Narrated Ibn 'Abbas (RA) that as-Sa'b bin Jaththamah al-Laithi (RA) informed him that the Prophet (ﷺ) had said, "There is no preserve except what belongs to Allah and His Messenger." [Reported by al-Bukhari].

సారాంశం

అజ్ఞాన కాలంలో అరేబియాలోని శ్రీమంతులు, పెత్తందార్లు బహిరంగ స్థలాలలో గడ్డి బాగా మొలిచే భూభాగాలను తమ పశువుల కోసం ప్రత్యేకించుకునేవారు. వారు తమ కోసం కేటాయించుకున్న భూభాగాలలోకి ఇతరులు వెళ్ళి తమ పశువులను మేపలేరు. వాస్తవానికి ఇలాంటి భూములను ఎలా ఉపయోగించుకోవాలనేది రాజ్యాధికారి ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. దైవమార్గంలో అంకితం చేయబడిన గుఱ్ఱాలను, ఒంటెలను మేపడానికి అలాంటి పచ్చని భూములను కేటాయించాలేగానీ ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ కోసం కేటాయించుకోరాదని హదీసులో చెప్పబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 778

779

హదీసు 779

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا ضَرَرَ وَلَا ضِرَارَ } رَوَاهُ أَحْمَدُ, وَابْنُ مَاجَهْ. وَلَهُ مِنْ حَدِيثِ أَبِي سَعِيدٍ مِثْلُهُ, وَهُوَ فِي اَلْمُوَطَّإِ مُرْسَلٌ.

ఈయనగారి చేతనే (హజ్రత్ ఇబ్నె అబ్బాస్ – రజి గారిచే) ఉల్లేఖించబడిన మరో హదీసు ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “ఒకరికి కీడు తలపెట్టకండి. ఒకరి కీడుకు గురికాకండి.” (అహ్మద్, ఇబ్నెమాజా లిరువురూ దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె మాజాలో అబూ సయీద్ సౌజన్యంతో హదీసు ఈ విధంగానే చెప్పబడింది. ఆ హదీసే ‘మువత్తా’లో ముర్సల్‌గా పొందుపరచబడింది)

English

Narrated [Ibn 'Abbas (RA)]: Allah's Messenger (ﷺ) said: "There should neither be harming (of others without cause), nor reciprocating harm (between two parties)." [Reported by Ahmad and Ibn Majah].

Ibn Majah reported something similar to the aforesaid Hadith from Abu Sa'id's narration. It is found in al-Muwatta' in a Mursal form (missing link after the Tabi'i).

సారాంశం

ఈ హదీసులో సాటి సోదరునికి అపకారం తలపెట్టటం గురించి సూత్రప్రాయంగా ఒక విషయం చెప్పబడింది. ‘చెరపకురా చెదెదవు’ అన్న హితోక్తి అందరికీ తెలిసిందే. సాటి మనిషికి అపకారం చేసిన వ్యక్తి, అపకారం చేసిన మరుక్షణంనుంచే తన పాలిట ఒక శత్రువును చేజేతులా సృష్టించుకుంటాడు. ఇతని వేధింపులకు గురైన అవతలి వ్యక్తి ఇతన్ని అంత తేలిగ్గా వదలిపెడతాడని నమ్మకం ఏమిటి? అతను పగబట్టవచ్చు. పగ పాము వంటిది. అది అవకాశం కోసం ఎదురుచూచి తన ప్రత్యర్థిని కాటేయవచ్చు. అందుకే అకారణంగా సాటి సోదరుణ్ణి కష్టాల పాళ్ళేయటం, వేధించటం ఒక ముస్లిం స్థాయికి ఎంతమాత్రం తగదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 779

780

హదీసు 780

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ أَحَاطَ حَائِطًا عَلَى أَرْضٍ فَهِيَ لَهُ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ اَلْجَارُودِ.

హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రవచనం – “ఎవరయినా ఒకరి ఆస్తి కానటువంటి భూమి చుట్టూ గోడ కట్టుకుంటే ఆ భూమి అతనిదైపోతుంది.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె జారూద్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Samurah bin Jundub (RA): Allah's Messenger (ﷺ) said: "If anyone puts a wall around a (barren) land, it belongs to him." [Reported by Abu Dawud and Ibn al-Jarud graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 780

781

హదీసు 781

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ مُغَفَّلٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ حَفَرَ بِئْرًا فَلَهُ أَرْبَعُونَ ذِرَاعًا عَطَنًا لِمَاشِيَتِهِ } رَوَاهُ اِبْنُ مَاجَهْ بِإِسْنَادٍ ضَعِيفٍ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముగఫ్ఫల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – “ఎవరయినా ఎక్కడయినా బావిని త్రవ్వితే అక్కడ పశువులను కట్టి ఉంచే నిమిత్తం నలభై చేతుల పొడవు నేలను అతడు ఆక్రమించుకోవచ్చు.” (దీనిని ఇబ్నెమాజా బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు)

English

Narrated 'Abdullah bin Mughaffal (RA): The Prophet (ﷺ), "Whoever digs a well, shall have forty cubits (of land) as resting place for his animals near the water." [Reported by Ibn Majah through a weak chain of narrators].

సారాంశం

ఇది కూడా నిరుపయోగంగా ఉన్న బంజరు భూమికే వర్తిస్తుంది. బంజరుగా ఉన్న నేలలో బావి త్రవ్వి, సస్యశ్యామలం చేసిన వ్యక్తికి ఆ బావి చుట్టూ నలభై గజాల నేలను ఆక్రమించుకునే హక్కు ఉంటుంది. ఆ నేలలో అతడు తన పశువులను కట్టుకోవచ్చు. పశువుల కొట్టం నిర్మించుకోవచ్చు. లేదా గొఱ్ఱెల కోసం షెడ్డును వేసుకోవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 781

782

హదీసు 782

وَعَنْ عَلْقَمَةَ بْنِ وَائِلٍ, عَنْ أَبِيهِ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَقْطَعَهُ أَرْضًا بِحَضْرَمَوْتَ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَاَلتِّرْمِذِيُّ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ అల్ఖమ బిన్ వాయల్ తన తండ్రి వాయల్ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఆయనకు హజర్‌మోత్‌లో భూమిని జాగీరుగా ఇచ్చారు. (అబూదావూద్, తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated 'Alqama bin Wa'il from his father (RA): "The Prophet (ﷺ) assigned him land in Hadramout." [Reported by Abu Dawud and at-Tirmidhi. Ibn Hibban graded it Sahih (authentic)].

హదీసు ఉల్లేఖకులు

అల్ఖమ బిన్ వాయల్. పూర్తి పేరు అల్ఖమ బిన్ వాయల్ బిన్ హుజ్ర్ హజ్రమీ. కూఫీగా కూడా పిలువబడేవారు. విశ్వసనీయులైన ఉల్లేఖకులు. ఇబ్నె హిబ్బాన్ ఈయన ఉల్లేఖనాలను విశ్వసనీయమైనవిగా పేర్కొన్నారు. ఈయన తన తండ్రినుండి, ముగీరా నుండి హదీసులను సంగ్రహించేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 782

783

హదీసు 783

وَعَنْ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَقْطَعَ اَلزُّبَيْرَ حُضْرَ فَرَسِهِ , فَأَجْرَى اَلْفَرَسَ حَتَّى قَامَ , ثُمَّ رَمَى بِسَوْطِهِ.‏ فَقَالَ : " أَعْطُوهُ حَيْثُ بَلَغَ اَلسَّوْطُ } رَوَاهُ أَبُو دَاوُدَ وَفِيهِ ضَعْفٌ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ జుబైర్ (రదియల్లాహు అన్హు)కు ఆయన గుర్రం పరుగెత్తినంత దూరానికి సమానంగా భూమిని జాగీరుగా ఇచ్చారు. తన గుర్రం ఆగిన చోట ఆయన కొరడాను పడవేశారు. “కొరడా ఎక్కడ పడివుందో అక్కడి వరకూ గల భూమి జుబైర్ (రదియల్లాహు అన్హు)దే” అని దైవప్రవక్త ﷺ చెప్పారు. (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు – కాని ఇందులో బలహీనత ఉంది)

English

Narrated Ibn 'Umar (RA): The Prophet (ﷺ) assigned az-Zubair the land his horse could cover at a run. He made his horse run, and when it stopped he threw his whip. He then said, "Give to him up to the spot his has reached. [Reported by Abu Dawud, but it has weakness].

సారాంశం

ఈ హదీసు దృష్ట్యా రాజ్యాధిపతి ఎవరయినా ఒక వ్యక్తి ధార్మిక, సామాజిక సేవలకు గుర్తింపుగా అతనికి కానుక రూపంలో జాగీరును ఇవ్వవచ్చు. అయితే జాగీరుగా ఇచ్చే ఆ భూమి ప్రభుత్వ భూమి అయి ఉండాలి. వేరొకరికి చెందిన భూమిని జాగీరుగా ఇవ్వడం కుదరదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 783

784

హదీసు 784

وَعَنْ رَجُلٍ مِنْ اَلصَّحَابَةِ ‏- رضى الله عنه ‏- قَالَ: { غَزَوْتُ مَعَ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَسَمِعْتُهُ يَقُولُ: اَلنَّاسُ شُرَكَاءُ فِي ثَلَاثٍ : فِي اَلْكَلَأِ ، وَالْمَاءِ ، وَالنَّارِ } رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَرِجَالُهُ ثِقَاتٌ.

దైవప్రవక్త ప్రియ సహచరులలో ఒకరు ఇలా తెలియజేశారు : “నేను దైవప్రవక్త ﷺ వెంట ఒక యుద్ధంలో పాల్గొన్నాను. ఆయన ﷺ ఇలా ప్రబోధించగా నేను విన్నాను – ‘మూడు వస్తువులలో అందరూ భాగస్తులే – గడ్డి, నీరు, అగ్ని.” (అహ్మద్, అబూదావూద్- దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు)

English

Narrated A man of the Companions (RA): I went on an expedition with the Prophet (ﷺ) and heard him say, "People are partners in three things: grazing, pasture, water and fire." [Reported by Ahmad and Abu Dawud, and its narrators are reliable (thiqah)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.16 బంజరు భూములను సాగు చేయటం|హదీసు 784