హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.15 నీటిపారుదల, కౌలుదారి విధానం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 15వ అధ్యాయం: నీటిపారుదల – కౌలుదారీ విధానం. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 767 – 775) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం

↑ విషయ సూచిక

باب المساقاة والإجارة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

767

హదీసు 767

عَنْ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَامَلَ أَهْلَ خَيْبَرَ بِشَطْرِ مَا يَخْرُجُ مِنْهَا مِنْ ثَمَرٍ, أَوْ زَرْعٍ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ لَهُمَا: فَسَأَلُوا أَنْ يُقِرَّهُمْ بِهَا عَلَى أَنْ يَكْفُوا عَمَلَهَا وَلَهُمْ نِصْفُ اَلثَّمَرِ, فَقَالَ لَهُمْ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ نُقِرُّكُمْ بِهَا عَلَى ذَلِكَ مَا شِئْنَا ", فَقَرُّوا بِهَا, حَتَّى أَجْلَاهُمْ عُمَرُ }. وَلِمُسْلِمٍ: { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-دَفَعَ إِلَى يَهُودِ خَيْبَرَ نَخْلَ خَيْبَرَ وَأَرْضَهَا عَلَى أَنْ يَعْتَمِلُوهَا مِنْ أَمْوَالِهِمْ, وَلَهُمْ شَطْرُ ثَمَرِهَا }.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఖైబర్ వాసులతో వ్యవసాయ ఒప్పందం చేసుకున్నారు. పండ్లరూపంలో, వ్యవసాయోత్పత్తుల రూపంలో ప్రాప్తమయ్యే వాటిలో సగం వారికి ఇచ్చేటట్లు అంగీకారం కుదిరింది. (బుఖారీ, ముస్లిం)

ఉభయులూ (బుఖారీ మరియు ముస్లిం) పొందుపరచిన మరో ఉల్లేఖనంలో ఉంది- ఖైబర్ వాసులు (యూదులు) దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చి, తమను అక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా, అంటే భూములను తమ స్వాధీనంలో ఉంచుకునేందుకు అనుమతించవలసిందిగా కోరారు. తాము వ్యవసాయం చేసుకుంటామనీ, వ్యవసాయోత్పత్తుల నుండి ముస్లింలకు సగభాగం ఇస్తామని చెప్పారు. అప్పుడు దైవప్రవక్త ﷺ “మేము తలచుకున్నంత కాలమే మిమ్మల్ని ఈ మేరకు అనుమతిస్తున్నాము” అని అన్నారు. ఈ మాట ప్రకారమే వాళ్ళను (యూదులను) వ్యవసాయ భూములపై ఉండనిచ్చారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వాళ్ళను నగర బహిష్కార శిక్ష విధించే వరకూ వాళ్ళు, ఆ భూములను సాగుచేసుకుంటూనే ఉన్నారు. ముస్లింలోని ఉల్లేఖనంలో ఈ విధంగా కూడా ఉంది- యూదులు తమ సొంత సొమ్ములతోనే (పెట్టుబడితోనే) ఖైబర్ ఖర్జూర వృక్షాలను, భూములను సాగుచేసుకునే షరతుపై దైవప్రవక్త ﷺ భూములను వారికి అప్పజెప్పారు. అయితే వ్యవసాయోత్పత్తుల్లో సగభాగం వారికి ఇవ్వాలని ఒప్పందం కుదిరింది.

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) had agreed with the people of Khaibar to give (to the Muslim authority) half what it produced of fruits or crops. [Agreed upon].

A narration by al-Bukhari and Muslim has: They asked him (ﷺ) to allow them to stay on the land, on condition that they should do all the cultivation and have half the dates. Allah's Messenger (ﷺ) replied to them, "We shall allow you to stay on the land, on that condition, as long as we wish." So they remained on the land till 'Umar (RA) expelled them.

Muslim has: Allah's Messenger (ﷺ) handed over to the Jews of Khaibar, the palm-trees and the land of Khaibar, on condition that they should employ their own resources in working on it and keep half of its produce.

సారాంశం

ఉత్పత్తులను సగం సగం పంచుకునే పద్ధతిపై కౌలుకు ఇవ్వటం సరైనదేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. ఒక్క ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) మినహా మిగిలిన ముగ్గురు ఇమాములు, విద్వాంసులు ఈ సేద్య విధానానికి సుముఖంగానే ఉన్నారు.

సేద్యానికి (సాగుకు) సంబంధించిన ఖర్చులన్నీ ఖైబర్ వాసులే భరించే షరతుపై దైవప్రవక్త ﷺ భూములను కౌలుకు ఇచ్చారు. ఉదాహరణకు భూమిని దున్నటం, కాలువలు త్రవ్వటం, నీరు వదలటం, నాట్లు వేయటం, కలుపు మొక్కలు తీయటం, పంటకు కాపలా కాయటం – ఇత్యాది పనులన్నీ కౌలుదారులే చేసుకోవాలి. ఈ కౌలు పనిచేసిన ఖైబర్ వాసులు దైవప్రవక్త ﷺ బానిసలని హనఫీలు అభిప్రాయపడ్డారు. కాని ఈ అభిప్రాయం సరైనది కాదు. దైవప్రవక్త ﷺ ఖైబర్ వాసులతో వ్యవహారం చేస్తున్నప్పుడు “దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచినంత కాలమే మేము మిమ్మల్ని ఈ భూములపై ఉండనిస్తాము” అని అన్నారు. ఒకవేళ వారు ఆయన ﷺ బానిసలే గనక అయివుంటే ఈ మాట అనవలసిన అవసరమే ఉండేది కాదు. వారు ఆయన ﷺ బానిసలు కారు అని దీని ద్వారా స్పష్టమవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 767

768

హదీసు 768

وَعَنْ حَنْظَلَةَ بْنِ قَيْسٍ قَالَ: { سَأَلْتُ رَافِعَ بْنَ خَدِيجٍ ‏- رضى الله عنه ‏- عَنْ كِرَاءِ اَلْأَرْضِ بِالذَّهَبِ وَالْفِضَّةِ? فَقَالَ: لَا بَأْسَ بِهِ, إِنَّمَا كَانَ اَلنَّاسُ يُؤَاجِرُونَ عَلَى عَهْدِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَلَى الْمَاذِيَانَاتِ, وَأَقْبَالِ اَلْجَدَاوِلِ, وَأَشْيَاءَ مِنْ اَلزَّرْعِ, فَيَهْلِكُ هَذَا وَيَسْلَمُ هَذَا, وَيَسْلَمُ هَذَا وَيَهْلِكُ هَذَا, وَلَمْ يَكُنْ لِلنَّاسِ كِرَاءٌ إِلَّا هَذَا, فَلِذَلِكَ زَجَرَ عَنْهُ, أَمَّا شَيْءٌ مَعْلُومٌ مَضْمُونٌ فَلَا بَأْسَ بِهِ } رَوَاهُ مُسْلِمٌ. وَفِيهِ بَيَانٌ لِمَا أُجْمِلَ فِي اَلْمُتَّفَقَ عَلَيْهِ مِنْ إِطْلَاقِ اَلنَّهْيِ عَنْ كِرَاءِ اَلْأَرْضِ.‏

హజ్రత్ హన్జల బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) నుద్దేశ్యించి, ‘బంగారం, వెండికి బదులుగా భూములను కాంట్రాక్టుకు ఇవ్వటం సబబేనా?’ అని అడిగాను. దానికాయన ఇలా అన్నారు : అందులో తప్పేమీ లేదు. దైవప్రవక్త ﷺ కాలంలో; ‘పిల్ల కాలువలలో, నీరు పారే చోట పండే పంటతోపాటు పొలంలోని పంటలో కొంత భాగం నేను తీసుకుంటాను’ అన్న షరతుపై ప్రజలు తమ భూములను ఇచ్చేవారు. అయితే ఒక్కోసారి ఇది (పిల్లకాలువలలోనూ, లోతట్టు స్థలాలలోనూ పండవలసిన భాగం) కొట్టుకుపోయేది. ఒక్కోసారి ఇక్కడ అసలేమీ పండేది కాదు. ప్రజలకు కాంట్రాక్టు ఈ పరిస్థితిలోనే లభించేది. అందుకే దైవప్రవక్త ﷺ ఈ విధానాన్ని నిషేధించారు. అయితే ముందుగానే ఏ విషయమైనా స్పష్టంగా నిర్ధారితమైతే అందులో తప్పులేదు. (ముస్లిం)

ఇందులో “భూమిని కాంట్రాక్టుపై ఇవ్వకండి” అన్న బుఖారీ, ముస్లింల క్లుప్త వ్యాఖ్యకు విపులీకరణ కూడా ఉంది.

English

Narrated Hanzala bin Qais (RA): I asked Rafi' bin Khadij (RA) about renting land for gold and silver and he replied, "There is no harm in that, as the people used to rent land in the time of Allah's Messenger (ﷺ) for what grew by the river-beds, and the edges of the brooks/streams, or for a portion of the crop. However, sometimes this portion of the crop would be destroyed while the other is saved, or vice-versa. Thus, there would be no wages to pay the people (the owners of the land) except for the portion which produced a crop." For this reason, he warned against this (practice). However, if it is (rented) for something known and guaranteed, then there is no harm in it. [Muslim reported it]. This narration contains a clarification of what was mentioned in general terms in the previous narration of al-Bukhari and Muslim, regarding the general prohibition of renting out land.

హదీసు ఉల్లేఖకులు

హన్జల (రదియల్లాహు అన్హు) : హన్జల బిన్ ఖైస్ బిన్ అమ్ర్ జురఖీ. అన్సారీ. మదీనాకు చెందిన విశ్వసనీయ తాబయి. ఒక కథనం ప్రకారం ఈయనకు దైవప్రవక్త ﷺను చూసే భాగ్యం కలిగింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 768

769

హదీసు 769

وَعَنْ ثَابِتِ بْنِ اَلضَّحَّاكِ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ اَلْمُزَارَعَةِ [ وَأَمَرَ ] بِالْمُؤَاجَرَةِ } رَوَاهُ مُسْلِمٌ أَيْضًا.

హజ్రత్ సాబిత్ బిన్ జహ్హాక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ భూములను పాలికివ్వటాన్ని వారించారు. (ఒక నిర్ణీత గడువు వరకు) కాంట్రాక్టుపై ఇవ్వటానికి అనుమతించారు. (ముస్లిం)

English

Narrated Thabit bin Dahhak (RA): Allah's Messenger (ﷺ) forbade al-Muzara'ah (employing people on land for a share of the produce), and ordered al-Mu'ajara (renting it out for cash). [Reported by Muslim].

సారాంశం

ఈ హదీసులో వచ్చిన వారింపును పండితులు “నహీయె తన్జీహ్”గా తీసుకున్నారు. దీన్ని హరామ్ (నిషిద్ధం) అన్న భావంలో తీసుకోలేదు. అసలు విషయం ఏమిటంటే ఇస్లాం తొలికాలంలో ముస్లింలు, ముఖ్యంగా ముహాజిర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారివద్ద భూములు లేవు. అన్సార్ల దగ్గర మాత్రం మిగులు భూములు ఉండేవి. దైవప్రవక్త ﷺ అన్సార్లకు- ముహాజిర్లకు మధ్య సోదర బంధాన్ని ఏర్పరచినట్లే, అన్సార్ల నుండి ముహాజిర్లకు భూములను ఉదార దృక్పథంతో ఇప్పించే ఉద్దేశ్యంతో ఈ ‘పాలికిచ్చే పద్ధతి’ని వారించారు. ఈ వారింపు తాత్కాలికమైనదే కాని శాశ్వతమైనది కాదు.

హదీసు ఉల్లేఖకులు

సాబిత్ బిన్ జహ్హాక్ (రదియల్లాహు అన్హు). మారు పేరు అబూ యజీద్. వంశపరంపర ప్రకారం సాబిత్ బిన్ జహ్హాక్ బిన్ ఖలీఫా అనబడతారు. అన్సార్ సహాబీ. ఖజ్రజ్ కు చెందిన అస్హల్ తెగ వారవటంచేత అస్హలీగా కూడా పిలువబడేవారు. సుప్రసిద్ధ సహాబీ. ‘బైతె రిజ్వాన్’లో ప్రతిజ్ఞ చేసిన సహాబీలలో ఈయన కూడా ఒకరు. అప్పట్లో ఆయన పిన్న వయస్కులే. హిజ్రీ 45వ సంవత్సరంలో మరణించారని ఒక వాదన ఉంది. కాని వాస్తవానికి ఇబ్నె జుబైర్ కాలంలో కల్లోలం రేకెత్తినప్పుడు – హిజ్రీ 64లో – మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 769

770

హదీసు 770

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-; أَنَّهُ قَالَ: { اِحْتَجَمَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-وَأَعْطَى اَلَّذِي حَجَمَهُ أَجْرَهُ } وَلَوْ كَانَ حَرَاماً لَمْ يُعْطِهِ.‏ رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “దైవప్రవక్త ﷺ శస్త్ర చికిత్స ద్వారా తన శరీరం నుంచి చెడు రక్తం తీయించుకున్నారు. రక్తం తీసిన వానికి వేతనం కూడా ఇచ్చారు. ఈ వేతనమే గనక అధర్మం (హరామ్) అయివుంటే ఆయన ﷺ దీనిని ఇచ్చి ఉండేవారు కారు.” (బుఖారీ)

English

Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) had himself cupped and gave the one who cupped him his pay; and if it were prohibited he would not have given him (his pay). [Reported by al-Bukhari].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 770

771

హదీసు 771

وَعَنْ رَافِعِ بْنِ خَدِيجٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ كَسْبُ اَلْحَجَّامِ خَبِيثٌ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు – శరీరంలోని కురుపును తొలగించినందుకు, చెడు రక్తం తీసినందుకుగాను పుచ్చుకునే వేతనం అధమమైన వేతనం.” (ముస్లిం)

English

Narrated Rafi' bin Khadij (RA): Allah's Messenger (ﷺ) said: "The earnings of a cupper (Hajjam) are impure." [Reported by Muslim].

సారాంశం

హదీసులో ‘ఖబీస్’ అనే పదం వచ్చింది. అరబీలో ఖబీస్ అనే పదం ప్రయోగించబడటం వల్ల ఈ సంపాదనను నిషిద్ధ సంపాదనగా తలపోయవలసిన అవసరం లేదు. ఈ సంపాదన ‘అత్యుత్తమమైనది కాదు’ అన్న భావంలో మాత్రమే ఈ పదం ఉపయోగించబడింది. ధర్మవేత్తలు కూడా ఈ విధంగానే అభిప్రాయపడ్డారు. శరీరంలోని చెడు రక్తం తీయువాని సంపాదనను వారు ధర్మసమ్మతంగానే భావిస్తున్నారు. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ద్వారా కూడా ఈ సంగతి రుజువవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 771

772

హదీసు 772

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ قَالَ اَللَّهُ عَزَّ وَجَلَّ ثَلَاثَةٌ أَنَا خَصْمُهُمْ يَوْمَ اَلْقِيَامَةِ: رَجُلٌ أَعْطَى بِي ثُمَّ غَدَرَ, وَرَجُلٌ بَاعَ حُرًّا , فَأَكَلَ ثَمَنَهُ، وَرَجُلٌ اِسْتَأْجَرَ أَجِيرًا , فَاسْتَوْفَى مِنْهُ, وَلَمْ يُعْطِهِ أَجْرَهُ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : గౌరవోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు – “ప్రళయదినాన నేను ముగ్గురు వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంటాను. ఒకడు : నా పేరు మీద ప్రమాణం చేసి, జామీను ఇచ్చి వాగ్దాన భంగం చేసినవాడు. మరొకడు : స్వతంత్రుడైన మనిషిని అమ్మి, తద్వారా వచ్చిన సొమ్మును తినేవాడు. ఇంకొకడు : కూలివానితో పనిమాత్రం చేయించుకుని అతని కూలి పూర్తిగా ఇవ్వనివాడు.” (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Allah, the Great and Glorious, has said, "There are three whose adversary I shall be on the Day of Resurrection: A man who gave a promise in My Name and then betrayed; a man who sold a free man and consumed his price; and a man who hired a worker and, after receiving full service from him, did not give him his wages.'" [Reported by Muslim].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 772

773

హదీసు 773

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ أَحَقَّ مَا أَخَذْتُمْ عَلَيْهِ أَجْراً كِتَابُ اَللَّهِ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “దైవగ్రంథానికి గాను తీసుకునే వేతనం నిస్సందేహంగా అన్నింటికన్నా శ్రేష్ఠమైనది.” (బుఖారీ)

English

Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) said: "The most worthy thing for which you receive payment is Allah's Book." [Reported by al-Bukhari].

సారాంశం

దివ్య ఖుర్ఆన్ ను బోధించినందుకు, దానిని లిఖించినందుకు, ముద్రించినందుకుగాను పుచ్చుకునే వేతనం ధర్మసమ్మతమైనదేగాక, శ్రేష్ఠమైనది కూడాను అని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇస్‌హాఖ్ (రహిమహుల్లాహ్)ల అభిమతం కూడా ఇదే. అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో ఖుర్ఆన్ బోధనకుగాను జీతం పుచ్చుకోవటం ధర్మసమ్మతం కాదు. కాని ఎవరయినా ఒక అధ్యాపకునివద్ద వేతనం నిర్ధారించకుండానే ఖుర్ఆన్ బోధన గరపి సంతోషంగా (మనస్ఫూర్తిగా) ఏదైనా దక్షిణ ఇచ్చుకుంటే అందులో తప్పు లేదంటారీయన.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 773

774

హదీసు 774

وَعَنْ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَعْطُوا اَلْأَجِيرَ أَجْرَهُ قَبْلَ أَنْ يَجِفَّ عَرَقُهُ } رَوَاهُ اِبْنُ مَاجَهْ. وَفِي الْبَابِ عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ عِنْدَ أَبِي يَعْلَى وَالْبَيْهَقِيِّ، وَجَابِرٍ عِنْدَ الطَّبَرَانِيِّ، وَكُلُّهَا ضِعَافٌ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “కూలివాని చెమట ఆరకముందే అతని కూలి ఇచ్చేయండి.” (దీనిని ఇబ్నె మాజా ఉల్లేఖించారు – ఈ అధ్యాయం క్రింద అబూహురైర (రదియల్లాహు అన్హు)చే ఉల్లేఖించబడిన ఉల్లేఖనాన్ని అబూ యాల, బైహఖీలు వివరించారు. తబ్రానీలో హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు)చే ఉల్లేఖించబడింది. అయితే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవే)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "Give the hired worker his wage before his sweat dries." [Reported by Ibn Majah].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 774

775

హదీసు 775

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏-صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: { مَنِ اِسْتَأْجَرَ أَجِيراً, فَلْيُسَلِّمْ لَهُ أُجْرَتَهُ } رَوَاهُ عَبْدُ اَلرَّزَّاقِ وَفِيهِ اِنْقِطَاعٌ, وَوَصَلَهُ اَلْبَيْهَقِيُّ مِنْ طَرِيقِ أَبِي حَنِيفَةَ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) తెలిపారు – “ఎవరయినా సరే ఒక వ్యక్తిని వేతనంపై పనికి నియమిస్తే అతనికి అతని శ్రమకు గాను పూర్తి ప్రతిఫలం ఇవ్వాలి.” (దీనిని అబ్దుర్రజ్జాఖ్ ఉల్లేఖించారు – దీని పరంపరలో లింకు తెగింది. బైహఖీ ఈ హదీసును అబూ హనీఫా (రహిమహుల్లాహ్) ద్వారా ‘మౌసూల్’గా ఉల్లేఖించారు)

English

Narrated Abu Sa'id al-Khudri (RA): The Prophet (ﷺ) said: "Whoever hires a worker should pay him his wages in full." [Reported by 'Abdur-Razzaq, and it has Inqita' (a break) in it's chain of narrators. al-Baihaqi reported it Mawsul (unbroken chain) through the narration of Abu Hanifah].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.15 నీటిపారుదల – కౌలుదారీ విధానం|హదీసు 775