హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.14 ముజారబాత్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 14వ అధ్యాయం: ముజారబత్. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 765 – 766) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.14 ముజారబత్

↑ విషయ సూచిక

باب القراض

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

(పెట్టుబడిదారుల-వర్తకుల ఒడంబడిక)

765

హదీసు 765

عَنْ صُهَيْبٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { ثَلَاثٌ فِيهِنَّ اَلْبَرَكَةُ: اَلْبَيْعُ إِلَى أَجَلٍ، وَالْمُقَارَضَةُ، وَخَلْطُ اَلْبُرِّ بِالشَّعِيرِ لِلْبَيْتِ, لَا لِلْبَيْعِ } رَوَاهُ اِبْنُ مَاجَهْ بِإِسْنَادٍ ضَعِيفٍ.

హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మూడు విషయాలు అత్యంత శుభప్రదమైనవి. ఒకటి: ఒక నిర్ణీత గడువు వరకు పైకం చెల్లించే షరతుపై వస్తువులు అమ్మటం. రెండు: పెట్టుబడిదారుడు మరియు వర్తకుడు కలసి ఒక అంగీకారానికి రావటం. మూడు: ఇంట్లో ఉపయోగించే గోధుమల్లో తప్ప అమ్మకానికి పెట్టిన గోధుమల్లో యవలు కలపకుండా ఉండటం. (ఈ హదీసును ఇబ్నె మాజ బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు)

English

Narrated Suhaib (RA): The Prophet (ﷺ) said: "There are three things which contain blessings: A business transaction in which payment is agreed on a fixed later time, al-Muqaradah (speculative partnership), and mixing wheat and barley for one's household use but not for sale." [Reported by Ibn Majah through a Da'if (weak) chain of narrators].

సారాంశం

ఈ హదీసును అందజేసిన ముగ్గురు వ్యక్తుల గురించి పూర్తిగా తెలీకపోవటం చేత దీన్ని బలహీన ఆధారాలతో అందిన హదీసుగా పేర్కొనటం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులు వీరు: (1) నసర్ బిన్ ఖాసిమ్. (2) అబ్దుర్రహీమ్ బిన్ దావూద్. (3) సాలెహ్ బిన్ సుహైబ్.

హదీసు ఉల్లేఖకులు

సుహైబ్ (రదియల్లాహు అన్హు). వంశపరంపర ప్రకారం అబూ యహ్యా సుహైబ్ బిన్ సినాన్ రూమీ అనబడతారు. వాస్తవానికి ఈయన అరబ్బే. నిమిర్ బిన్ ఖాసిత్ బిన్ వాయల్ తెగతో సంబంధమున్నవారు. రోమనులు బాల్యంలోనే ఈయన్ని పట్టుకున్నారు. రోమనుల మధ్యనే పెరిగి పెద్దవారయ్యారు. అందువల్ల రూమీగా పిలువబడ్డారు. ఒక కథనం ప్రకారం ప్రాజ్ఞవయస్సుకు చేరిన తరువాత రోము నుండి మక్కాకు పారిపోయి వచ్చారు. మక్కాలో అబ్దుల్లా బిన్ జదాన్‌తో మైత్రి కుదుర్చుకున్నారు. బనూ కల్బ్ అనే తెగ ఈయన్ని రోమనుల నుండి కొనుగోలు చేసి మక్కాకు తీసుకువచ్చిందని, మక్కాలో అబ్దుల్లా బిన్ జదాన్ అనే సుప్రసిద్ధ సహాబీ ఈయన్ని కొనుక్కున్నారనే వాదన కూడా ఉంది. దైవమార్గంలో నానా బాధలు భరించారు. తరువాత మదీనాకు వలసపోయారు. మదీనా మునవ్వరాలోనే హిజ్రీ 38లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.14 ముజారబత్|హదీసు 765

766

హదీసు 766

وَعَنْ حَكِيمِ بْنِ حِزَامٍ ‏- رضى الله عنه ‏- { أَنَّهُ كَانَ يَشْتَرِطُ عَلَى اَلرَّجُلِ إِذَا أَعْطَاهُ مَالًا مُقَارَضَةً: أَنْ لَا تَجْعَلَ مَالِي فِي كَبِدٍ رَطْبَةٍ, وَلَا تَحْمِلَهُ فِي بَحْرٍ, وَلَا تَنْزِلَ بِهِ فِي بَطْنِ مَسِيلٍ, فَإِنْ فَعَلْتَ شَيْئًا مِنْ ذَلِكَ فَقَدَ ضَمِنْتَ مَالِي } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَرِجَالُهُ ثِقَاتٌ. وَقَالَ مَالِكٌ فِي " اَلْمُوَطَّأِ " عَنْ اَلْعَلَاءِ بْنِ عَبْدِ اَلرَّحْمَنِ بْنِ يَعْقُوبَ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ: { أَنَّهُ عَمِلَ فِي مَالٍ لِعُثْمَانَ عَلَى أَنَّ اَلرِّبْحَ بَيْنَهُمَا } وَهُوَ مَوْقُوفٌ صَحِيحٌ.

హజ్రత్ హకీమ్ బిన్ హిజామ్(రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: “నేను ఎవరితో ఎప్పుడు ‘ముజారబత్’ ఒడంబడిక చేసుకున్నా వారి చేతికి పెట్టుబడిని ఇచ్చేటప్పుడు – నా సొమ్ముతో పశువుల వర్తకం చేయరాదనీ, దాన్ని సముద్రంలోకి తీసుకెళ్ళరాదనీ, వరదలు వచ్చే చోట ఈ పెట్టుబడి పెట్టరాదనీ, ఈ మూడింటిలో ఏ ఒక్క చేష్టకు ఒడిగట్టినా నా సొమ్ముకు నువ్వు స్వయంగా బాధ్యత వహించవలసి ఉంటుందనీ అతనికి షరతు విధించేవాణ్ణి.” (దీనిని దారె ఖుత్నీ ఉల్లేఖించారు – దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు)

English

Narrated al-Hakim bin Hazim (RA): He used to make a condition on the man to whom he gave his property in al-Muqaradah (to trade with, and the profit being shared between them), that: "You should not trade with my property in living beings, and do not transport it by sea, and do not settle with it at the bottom of a river-bed; and if you do any of the aforesaid acts you should then guarantee my property." [ad-Daraqutni reported it and its narrators are reliable (thiqah)].

Malik said in al-Muwatta' from al-'Ala bin 'Abdur-Rahman bin Ya'qub from his father on the authority of his grandfather that he traded with some property belonging to 'Uthman (RA) so that the profit would be divided between them. [This hadith is Mawquf (saying of a Companion) Sahih (authentic)].

సారాంశం

పెట్టుబడిదారుడు వర్తకునితో వ్యవహారం చేసేటప్పుడు తన సొమ్ము విషయంలో తాను కోరిన షరతును ముందుగానే విధించుకోవచ్చని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ‘ముజారబత్’ విధానంలో ఈ మేరకు అనుమతి ఉంది. ముజారబత్ విధానం ప్రకారం పెట్టుబడిదారుడు – వర్తకుడు ముందుగానే తాము చేయబోయే వ్యవహారానికి సంబంధించి ఒక అవగాహనకు వస్తారు. దాని ప్రకారం వారు లాభాలను పంచుకుంటారు. పెట్టుబడిదారుడు కేవలం పెట్టుబడి పెడతాడు. శ్రామికుడు కష్టపడి ఉత్పాదన చేస్తాడు. దానిపై వచ్చిన లాభాలను ముందుగా నిర్ణయించుకున్న నిష్పత్తి ప్రకారం వారిరువురూ పంపిణీ చేసుకుంటారు.

ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) మువత్తాలో అలా బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ యాఖూబ్ తండ్రి మరియు ఆయన తాత ఆధారంగా తెలిపిన దాని ప్రకారం, ఆయన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సొమ్ముతో లాభాలను పరస్పరం పంచుకునే షరతుపై వర్తకం చేశారు. (ఈ హదీసు మౌఖూఫ్ మరియు సహీహ్)

హదీసు ఉల్లేఖకులు

(1) అలా : అబూ షిబ్ల్ అనేది మారుపేరు. వంశపరంపర ఈ విధంగా ఉంది : అలా బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ యాఖూబ్ జుహనీ. హురఖా తెగచే స్వేచ్ఛ నొసగబడిన బానిస. మదీనా వాసులు. యువ తాబయీన్లలో ప్రముఖులు. సత్యసంధులు. అయితే హదీసులను చెప్పేటప్పుడు తడబాటుకు లోనయ్యేవారు. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) మరియు ఇతర హదీసువేత్తలు ఈయన్ని విశ్వసనీయులుగా ఖరారు చేశారు. ఖలీఫా మన్‌సూర్ అబ్బాస్ కాలంలో ఈయన మరణించారని వాఖిదీ తెలిపారు.

(2) అబ్దుర్రహ్మాన్ బిన్ యాఖూబ్ : ఈయన జుహైనా తెగకు చెందిన వారవటంచేత జుహనీగానూ, మదీనాలో స్థిరపడటం వల్ల మదనీగానూ పిలువబడ్డారు. సగటు తాబయీన్లలో ఒకరుగా పరిగణించబడ్డారు. ఈయన తన తండ్రిగారి ద్వారానే కాకుండా హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ద్వారా కూడా హదీసులు విన్నారు.

(3) యాఖూబ్ : యాఖూబ్ జుహనీ. హురఖా తెగ తరపున స్వేచ్ఛ నొసగబడిన బానిస. వృద్ధ తాబయీన్లలో ఒకరుగా పరిగణించబడతారు. ఈయన హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలుసుకున్నారు. చాలా తక్కువ హదీసులు ఉల్లేఖించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.14 ముజారబత్|హదీసు 766