హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.1 క్రయ విక్రయాలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 1వ అధ్యాయం: క్రయ విక్రయాలు. ఈ అధ్యాయంలో 44 హదీసులు (హదీసు 648 – 691) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.1 క్రయ విక్రయాలు

↑ విషయ సూచిక

باب شروطه وما نهي عنه منه

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

648

హదీసు 648

عَنْ رِفَاعَةَ بْنِ رَافِعٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-سُئِلَ: أَيُّ اَلْكَسْبِ أَطْيَبُ? قَالَ: { عَمَلُ اَلرَّجُلِ بِيَدِهِ, وَكُلُّ بَيْعٍ مَبْرُورٍ } رَوَاهُ اَلْبَزَّارُ، وَصَحَّحَهُ اَلْحَاكِمُ.‏.

హజ్రత్ రిఫాఅ బిన్ రాఫె (రదియల్లాహు అన్హు) కథనం : “అతి పవిత్రమయిన సంపాదన ఏది?” అని దైవప్రవక్త ﷺను ప్రశ్నించగా, “మనిషి తన స్వహస్తాలతో ఆర్జించిన సంపాదన. దగా, మోసం లేనటువంటి అన్ని రకాల వర్తకం” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (బజ్జార్ దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Rifa'a bin Rafi' (RA): The Prophet (ﷺ) was asked, 'What type of earning is best?' He replied, "A man's work with his hand and every transaction which is free from cheating or deception." [Reported by al-Bazzar; al-Hakim graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 648

649

హదీసు 649

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-; أَنَّهُ سَمِعَ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ عَامَ اَلْفَتْحِ, وَهُوَ بِمَكَّةَ: { إِنَّ اَللَّهَ وَرَسُولَهُ حَرَّمَ بَيْعَ اَلْخَمْرِ, وَالْمَيْتَةِ, وَالْخِنْزِيرِ, وَالْأَصْنَامِ.‏ فَقِيلَ: يَا رَسُولَ اَللَّهِ ! أَرَأَيْتَ شُحُومَ اَلْمَيْتَةِ, فَإِنَّهَا تُطْلَى بِهَا اَلسُّفُنُ, وَتُدْهَنُ بِهَا اَلْجُلُودُ, وَيَسْتَصْبِحُ بِهَا اَلنَّاسُ? فَقَالَ: " لَا.‏ هُوَ حَرَامٌ ", ثُمَّ قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عِنْدَ ذَلِكَ: " قَاتَلَ اَللَّهُ اَلْيَهُودَ, إِنَّ اَللَّهَ لَمَّا حَرَّمَ عَلَيْهِمْ شُحُومَهَا جَمَلُوهُ, ثُمَّ بَاعُوهُ, فَأَكَلُوا ثَمَنَهُ } مُتَّفَقٌ عَلَيْهِ.

మక్కా విజయం వరించిన సంవత్సరం దైవప్రవక్త ﷺ మక్కాలో ఈ విధంగా ఉపదేశించగా తాను విన్నానని హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “నిశ్చయంగా దేవుడు మరియు ఆయన ప్రవక్త ﷺ మద్యం క్రయవిక్రయాలను, మృత జంతువు మరియు పంది క్రయవిక్రయాలను, విగ్రహాల వర్తకాన్ని ‘హరామ్’ (నిషిద్ధం) గావించారు.” ‘దైవ ప్రవక్తా ﷺ! మరి మృత జంతువుల క్రొవ్వు సంగతేమిటి? అది ఓడల సర్వీసు కోసం ఉపయోగపడుతుంది, చర్మాలకు పూయబడుతుంది, ప్రజలు దీంతో దీపాన్ని వెలిగించి కాంతిని పొందుతారు కదా!’ అని సందేహపడగా “అయినాసరే! అదీ నిషిద్ధమే” అని ఆయన ﷺ స్పష్టపరచారు. ఆయన ﷺ ఇంకా ఇలా అన్నారు : “అల్లాహ్ యూదులను నాశనం చేయుగాక! అల్లాహ్ క్రొవ్వును యూదులకై నిషేధించగా వాళ్ళు దాన్ని కరిగించి అమ్ముకున్నారు. తద్వారా వచ్చిన సొమ్మును ఆరగించారు.”

(బుఖారీ, ముస్లిం)

English

Narrated Jabir bin 'Abdullah (RA): I heard Allah's Messenger (ﷺ) saying in the year of the Conquest, while he was in Makkah, "Allah and His Messenger have forbidden the sale of intoxicants, dead animals, swine and idols." He was asked, "O Allah's Messenger, what about the fat of a dead animal, for it is used for greasing ships, greasing the hides (of animals), and making oils for lamps?" He replied, "No, it is unlawful." Allah's Messenger (ﷺ) then added: "May Allah curse the Jews, when Allah the Most High declared the fat of such animals unlawful they melted it, then sold it and devoured its price (profit)." [Agreed upon].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 649

650

హదీసు 650

وَعَنْ اِبْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِذَا اِخْتَلَفَ اَلْمُتَبَايِعَانِ وَلَيْسَ بَيْنَهُمَا بَيِّنَةٌ, فَالْقَوْلُ مَا يَقُولُ رَبُّ اَلسِّلْعَةِ أَوْ يَتَتَارَكَانِ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) తెలిపారు- ఆయన ﷺ ఈ విధంగా ప్రబోధించారు: “అమ్మేవాని, కొనేవాని మధ్య అభిప్రాయ భేదం ఏర్పడి వారి వాదనను బలపరచే సాక్ష్యం, తగు ఆధారం వారిరువురి వద్ద లేనపుడు వస్తువు యజమాని మాటనే లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది. లేదా వారిరువురూ ఆ లావాదేవీలను ఉపసంహరించుకోవాలి (దీనిని ఐదుగురూ ఉల్లేఖించగా, హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ధృవీకరించారు).

English

Narrated Ibn Mas'ud (RA): I heard Allah's Messenger (ﷺ) saying, "When two people who are arranging a business transaction disagree and there is no proof to arbitrate between them, the seller's word is final, or they may break the deal." [Reported by al-Khamsa and authenticated by al-Hakim].

సారాంశం

అమ్మకందారు, కొనుగోలుదారు మధ్య భేదాభిప్రాయం పొడసూపినపుడు అమ్మకందారు (వస్తువు యజమాని) మాటే ప్రాముఖ్యం సంతరించుకుంటుందని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. లేదంటే, కొనుగోలుదారుడు తాను చెల్లించిన మొత్తాన్ని వాపసు తీసుకోవాలి. అమ్మకందారుడు కూడా తాను అమ్మిన వస్తువును తీసేసుకుని లావాదేవీల ఒప్పందాన్ని రద్దుచేయాలి. అయితే వాపసు చేయబడే ఆ వస్తువు ఏమాత్రం దెబ్బతినకుండా – యథా స్థితిలో- ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా అమ్మకందారుడు, తాను చెప్పేదంతా అక్షరాలా నిజం అని ప్రమాణం చేసి మరీ చెప్పాలి. ప్రమాణం కూడా షరీయత్ నిబంధన కనుగుణంగా ఉండాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 650

651

హదీసు 651

وَعَنْ أَبِي مَسْعُودٍ اَلْأَنْصَارِيِّ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ ثَمَنِ اَلْكَلْبِ, وَمَهْرِ الْبَغِيِّ, وَحُلْوَانِ اَلْكَاهِنِ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ మస్ఊద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ కుక్కకు వెలకట్టడాన్ని, వేశ్య సంపాదనను, జ్యోతిష్కునికి ప్రతిఫలం ఇవ్వడాన్ని హరామ్ (నిషిద్ధం) గావించారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Mas'ud al-Ansari (RA): Allah's Messenger (ﷺ) prohibited the money paid for a dog, the payment of a prostitute, and the payment given to a soothsayer." [Agreed upon].

సారాంశం

ఈ హదీసులో కుక్కకు వెలకట్టడం, వేశ్య స్త్రీ వేశ్య వృత్తి ద్వారా ఆర్జించే సంపాదన, జ్యోతిష్కుడు జోస్యం చెప్పటం ద్వారా గడించే ఆదాయం నిషేధించబడ్డాయి. కుక్క స్వతహాగా అశుద్ధ జంతువు అయిన కారణంగా నిషిద్ధం. నిషిద్ధ వస్తువు నుండి మూల్యం రాబట్టడం కూడా నిషిద్ధమే. అలాగే ఇస్లాంలో వ్యభిచారం ముమ్మాటికీ నిషిద్ధం. కాబట్టి వ్యభిచారం ద్వారా ఆర్జించే డబ్బు కూడా హరామ్ అవుతుంది. జ్యోతిష్యం, సోదె చెప్పటం వంటివి నిషిద్ధం గనక వాటిని వృత్తిగా చేసుకుని డబ్బు గడించటం కూడా నిషిద్ధమే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 651

652

హదీసు 652

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-; { أَنَّهُ كَانَ [ يَسِيرُ ] عَلَى جَمَلٍ لَهُ قَدْ أَعْيَا.‏ فَأَرَادَ أَنْ يُسَيِّبَهُ.‏ قَالَ: فَلَحِقَنِي اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-فَدَعَا لِي, وَضَرَبَهُ، فَسَارَ سَيْراً لَمْ يَسِرْ مِثْلَهُ, قَالَ: " بِعْنِيهِ بِوُقِيَّةٍ " قُلْتُ: لَا.‏ ثُمَّ قَالَ: " بِعْنِيهِ " فَبِعْتُهُ بِوُقِيَّةٍ, وَاشْتَرَطْتُ حُمْلَانَهُ إِلَى أَهْلِي, فَلَمَّا بَلَغْتُ أَتَيْتُهُ بِالْجَمَلِ, فَنَقَدَنِي ثَمَنَهُ, ثُمَّ رَجَعْتُ فَأَرْسَلَ فِي أَثَرِي.‏ فَقَالَ: " أَتُرَانِي مَاكَسْتُكَ لِآخُذَ جَمَلَكَ? خُذْ جَمَلَكَ وَدَرَاهِمَكَ.‏ فَهُوَ لَكْ } مُتَّفَقٌ عَلَيْهِ , وَهَذَا اَلسِّيَاقُ لِمُسْلِمٍ.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : తాను బాగా అలసిపోయి, నీరసించిపోయిన ఒంటెపై ప్రయాణం చేస్తూ, ఆ ఒంటెను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు- “అంతలోనే దైవప్రవక్త ﷺ నన్ను కలుసుకున్నారు. ఆయన ﷺ నా కోసం ప్రార్థించారు. తరువాత ఆయన ﷺ ఒంటెను కొట్టగా, మునుపెన్నడూ పరుగెత్తనంత వేగంగా అది పోసాగింది. ఆయన ﷺ నన్నుద్దేశించి, ‘ఒక ఊఖియా వెండికి బదులుగా ఈ ఒంటెను నాకు అమ్ముతావా?’ అన్నారు. నేను ‘లేదు’ అన్నాను. ‘ఈ ఒంటెను నాకు అమ్మెయి’ అని ఆయన ﷺ మరోసారి కోరారు. నేనాయనకు ఒంటెను ఒక ఊఖియాకు బదులుగా అమ్మేశాను. అయితే నా ఇంటిదాకా దీనిపై కూర్చుని వెళతానని షరతు పెట్టాను. షరతు ప్రకారమే గమ్యం (మదీనా) చేరుకున్న పిమ్మట నేను ఒంటెను తోలుకుని దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాను. ఆయన ﷺ నాకు దాని నగదు వెలను చెల్లించారు. (వెల తీసుకుని) నేను ఇంటికి తిరిగి వచ్చాను. ఆయన ﷺ నా వెనుకే నా ఒంటెను తిప్పి పంపారు. ఆ సందర్భంగా ఆయన ﷺ ఇలా అన్నారు: “నీ ఒంటెను తీసేసుకునే ఉద్దేశ్యంతో మరీ తక్కువ ధర ఇచ్చానని నీవు భావిస్తూ ఉండవచ్చు. నీ ఒంటెను నీవు తీసుకో. దాని ధరను కూడా తీసేసుకో. ఇక మీదట ఇది నీది (నీకు కానుక లాంటిది)”. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)

English

Narrated Jabir bin 'Abdullah (RA): I was traveling on a camel of mine which had become exhausted, so I intended to let it go free. The Prophet (ﷺ) followed me and made supplication for me and struck it. Then, it went as it had never done before. He then said, "Sell it to me for on Uqiya." I replied, "No." He again said, "Sell it to me." So I sold it to him for one Uqiya. However I stipulated that I should be allowed to ride it home. Then when I reached (home), I took the camel to him and he paid me its price in cash. I then went back and he sent someone after me. (When I came), he said, "Do you think that I asked you to reduce the value of your camel's price to take it? Take your camel and your money, for it is yours." [Agreed upon; and this is Muslim's wording].

సారాంశం

నీ దగ్గరున్న ఫలానా వస్తువును అమ్ముతావా? అని అడగటంలో తప్పులేదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. వెల కట్టడం, ఆ వెలను అడగటం, అమ్మిన వస్తువును (వాహనం లాంటిదయితే) ఇంటికెళ్ళే దాకా వాడుకుంటానని షరతు పెట్టడం కూడా ధర్మసమ్మతమే. కాకపోతే విక్రయించిన వస్తువుకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలాగే ఎవరికయినా ఇల్లు అమ్మినట్లయితే, ఫలానా తేదీ వరకు దాన్ని నేను వాడుకుంటానని కొనుగోలుదారునికి షరతు పెట్టవచ్చు. ప్రవక్త సహచరులైన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారు కూడా ఒక ఇల్లును విక్రయిస్తూ, నెల రోజుల తరువాతే ఇల్లు ఖాళీ చేస్తానని షరతు విధించారు.

ఈ హదీసు ద్వారా అవగతమయ్యే మరో విషయమేమిటంటే ఒక వస్తువును బేరమాడేటప్పుడు కొనుగోలుదారు తన పలుకుబడినీ, పదవిని దుర్వినియోగం చేయరాదు. పైగా ఎదుటి వాని స్థితిని దృష్టిలో పెట్టుకుని అతనికి వీలైనంత ప్రయోజనం చేకూర్చేందుకు యత్నించాలి. అంటే త్యాగభావంతో మసలుకోవాలన్నమాట! దైవప్రవక్త ﷺ నెలకొల్పిన ఉదాహరణను మనం మరువరాదు. దైవప్రవక్త ﷺ ఒక దెబ్బకొట్టగానే ఒంటె వేగంగా పోవటం ఆయన ﷺ గారి మహిమల్లో ఒకటని భావించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 652

653

హదీసు 653

وَعَنْهُ قَالَ: { أَعْتَقَ رَجُلٌ مِنَّا عَبْداً لَهُ عَنْ دُبُرٍ لَمْ يَكُنْ لَهُ مَالٌ غَيْرُهُ.‏ فَدَعَا بِهِ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-فَبَاعَهُ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) గారి చేతనే ఉల్లేఖించబడిన మరో హదీసు : “మాలోని ఒక వ్యక్తి తన బానిసకు తన తదనంతరం స్వేచ్ఛ నొసగుతున్నట్లు ప్రకటించాడు. మరి చూడబోతే ఆ ఒక్క బానిస తప్ప అతని వద్ద మరొక ఆస్తిలేదు. (అందుచేత) దైవప్రవక్త ﷺ ఆ బానిసను పిలిచి అతణ్ణి విక్రయించారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated [Jabir bin 'Abdullah (RA)]: A man among us declared that a slave belonging to him would be free after his death. However, he had no other property. So, the Prophet (ﷺ) sent for him (the slave) and sold him. [Agreed upon].

సారాంశం

మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం బానిసకు స్వేచ్ఛ నొసగిన ఆ వ్యక్తి, ఆ సమయంలో రుణగ్రస్తుడై ఉండటంవల్ల అతని రుణభారాన్ని దించే ఉద్దేశ్యంతో దైవప్రవక్త ﷺ ఆ బానిసను అమ్మించారు. నయీమ్ బిన్ నుహ్హామ్ అనే వ్యక్తి ఆ బానిసను కొన్నారు. ఈ హదీసు ద్వారా అర్థమయ్యేదేమిటంటే, గత్యంతరం లేని స్థితి ఏర్పడినపుడు యజమాని తన బానిసను వేరొకరికి అమ్మటం సమంజసమే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 653

654

హదీసు 654

وَعَنْ مَيْمُونَةَ زَوْجِ اَلنَّبِيِّ ‏-صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ, وَرَضِيَ عَنْهَا‏-; { أَنَّ فَأْرَةً وَقَعَتْ فِي سَمْنٍ, فَمَاتَتْ فِيهِ, فَسُئِلَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-عَنْهَا.‏ فَقَالَ: " أَلْقُوهَا وَمَا حَوْلَهَا, وَكُلُوهُ " } رَوَاهُ اَلْبُخَارِيُّ. وَزَادَ أَحْمَدُ.‏ وَالنَّسَائِيُّ: فِي سَمْنٍ جَامِدٍ.

దైవప్రవక్త ﷺ సతీమణి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం: ఒక చిట్టెలుక నేతిలో పడి చచ్చిపోయింది. దాని గురించి దైవప్రవక్త ﷺను దర్యాప్తు చేయగా, “దాన్ని తీసి పారెయ్యండి. దానికి చుట్టు ప్రక్కల ఉన్న నేతిని కూడా పారబోసి మిగిలిన దానిని ఉపయోగించండి” అని ఆయన ﷺ ప్రవచించారు (బుఖారీ). నసాయి మరియు అహ్మద్ లు ‘గడ్డకట్టిన నేతిలో’ అని అదనంగా పేర్కొన్నారు.

English

Narrated Maimuna (RA), the wife of the Prophet (ﷺ): A mouse fell into some ghee and died. The Prophet (ﷺ) was asked about it and he replied, "Throw it – and what is surrounding (touching) it – away and eat it (that which remained untouched)." [Reported by al-Bukhari].

Ahmad and an-Nasa'i added: "into a solid ghee."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 654

655

హదీసు 655

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا وَقَعَتْ اَلْفَأْرَةُ فِي اَلسَّمْنِ, فَإِنْ كَانَ جَامِداً فَأَلْقُوهَا وَمَا حَوْلَهَا, وَإِنْ كَانَ مَايِعًا فَلَا تَقْرَبُوهُ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَقَدْ حَكَمَ عَلَيْهِ اَلْبُخَارِيُّ وَأَبُو حَاتِمٍ بِالْوَهْمِ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎప్పుడయినా చిట్టెలుక (లేక చుంచెలుక) గనక నేతిలో పడితే, ఆ నెయ్యిగనక గడ్డకట్టినదైతే అప్పుడా ఎలుకను, దాని చుట్టుప్రక్కల వున్న నెయ్యిని తీసి పారవెయ్యండి. ఒకవేళ నెయ్యి ద్రవరూపంలో ఉంటే దాని దరిదాపులకు కూడా పోవద్దు సుమా!” (అహ్మద్, అబూ దావూద్ లు దీనిని ఉల్లేఖించారు. బుఖారీ, అబూ హాతిమ్ లు దీనిపై ‘అనుమానం’ వెలిబుచ్చారు).

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "If a mouse falls into ghee which is solid, throw the mouse and what is surrounding it away; but if it is in a liquid state do not go near it." [Ahmad and Abu Dawud reported it; al-Bukhari and Abu Hatim ruled it to be Wahm (an error) (in reporting it from Abu Hurairah)].

సారాంశం

ఎలుక పడిన నేతి పదార్థం ఒకవేళ ద్రవరూపంలో ఉంటే, అట్టి స్థితిలో ఏ మేరకు ఎలుక ప్రభావం పడిందో, మరి ఏ మేరకు ఆ నెయ్యి పరిశుద్ధంగా ఉందో నిర్ధారించటం కష్టం గనక ఆ నేతిని పారవెయ్యక తప్పదు. దాన్ని మనం స్వయంగా ఉపయోగించటం సమ్మతం కానపుడు, ఇతరులకు అమ్మటం కూడా సమ్మతం కాదు. అందుకే దాని దరిదాపులకు కూడా పోరాదని హదీసులో చెప్పబడింది.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్), అబూ హాతిమ్ (రహిమహుల్లాహ్) ఈ హదీసుపై ‘అనుమానం’ వ్యక్తపరిచారు. ఎందుకంటే; ఇది ‘ముస్నదె మైమూన’ హదీసుగాని, ‘ముస్నదె అబూ హురైర’ కాదని వారిరువురూ అంటున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 655

656

హదీసు 656

وَعَنْ أَبِي اَلزُّبَيْرِ قَالَ: سَأَلْتُ جَابِرًا عَنْ ثَمَنِ اَلسِّنَّوْرِ وَالْكَلْبِ? فَقَالَ: { زَجَرَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ ذَلِكَ } رَوَاهُ مُسْلِمٌ. وَالنَّسَائِيُّ وَزَادَ: { إِلَّا كَلْبَ صَيْدٍ }.

హజ్రత్ అబూ జుబైర్(రదియల్లాహు అన్హు) కథనం: నేను పిల్లి, కుక్కలకు వెల కట్టటం గురించి హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు)ను అడగ్గా, “దైవప్రవక్త ﷺ ఈ విషయంపై మందలించారు” అని ఆయన (రదియల్లాహు అన్హు) చెప్పారు. (ముస్లిం, నసాయి) “వేట కుక్క మినహా” అని నసాయిలో ఒక వాక్యం అదనంగా ఉంది.

English

Narrated Abu Zubair (RA): I asked Jabir (RA) about the payment for cats and dogs and he replied, "The Prophet (ﷺ) warned sternly against that." [Reported by Muslim].

And an-Nasa'i added: "except a hunting dog."

హదీసు ఉల్లేఖకులు

అబూ జుబైర్ : ఈయన అసలు పేరు ముహమ్మద్ బిన్ ముస్లిం బిన్ తద్రుస్ అసదీ మక్కీ. హకీమ్ బిన్ హిజామ్ గారి బానిస. తాబయీ. ఈయన విశ్వసనీయులు మరియు ఈయన ఉల్లేఖనాలు ఎన్నదగినవి అన్న విషయంలో హదీసువేత్తలందరి మధ్యా ఏకాభిప్రాయముంది. హిజ్రీ 128లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 656

657

హదీసు 657

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ: { جَاءَتْنِي بَرِيرَةُ, فَقَالَتْ: كَاتَبْتُ أَهْلِي عَلَى تِسْعٍ أُوَاقٍ, فِي كُلِّ عَامٍ أُوقِيَّةٌ, فَأَعِينِينِي.‏ قُلْتُ: إِنْ أَحَبَّ أَهْلُكِ أَنْ أَعُدَّهَا لَهُمْ وَيَكُونَ وَلَاؤُكِ لِي فَعَلْتُ, فَذَهَبَتْ بَرِيرَةُ إِلَى أَهْلِهَا.‏ فَقَالَتْ لَهُمْ; فَأَبَوْا عَلَيْهَا, فَجَاءَتْ مِنْ عِنْدِهِمْ, وَرَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-جَالِسٌ.‏ فَقَالَتْ: إِنِّي قَدْ عَرَضْتُ ذَلِكَ عَلَيْهِمْ فَأَبَوْا إِلَّا أَنْ يَكُونَ اَلْوَلَاءُ لَهُمْ, فَسَمِعَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-فَأَخْبَرَتْ عَائِشَةُ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-.‏ فَقَالَ: خُذِيهَا وَاشْتَرِطِي لَهُمُ اَلْوَلَاءَ, فَإِنَّمَا اَلْوَلَاءُ لِمَنْ أَعْتَقَ فَفَعَلَتْ عَائِشَةُ, ثُمَّ قَامَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فِي اَلنَّاسِ [ خَطِيباً ], فَحَمِدَ اَللَّهَ وَأَثْنَى عَلَيْهِ.‏ ثُمَّ قَالَ: " أَمَّا بَعْدُ, فَمَا بَالُ رِجَالٍ يَشْتَرِطُونَ شُرُوطاً لَيْسَتْ فِي كِتَابِ اَللَّهِ عَزَّ وَجَلَّ مَا كَانَ مِنْ شَرْطٍ لَيْسَ فِي كِتَابِ اَللَّهِ فَهُوَ بَاطِلٌ, وَإِنْ كَانَ مِائَةَ شَرْطٍ, قَضَاءُ اَللَّهِ أَحَقُّ, وَشَرْطُ اَللَّهِ أَوْثَقُ, وَإِنَّمَا اَلْوَلَاءُ لِمَنْ أَعْتَقَ " } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيِّ. وَعِنْدَ مُسْلِمٍ قَالَ: { اِشْتَرِيهَا وَأَعْتِقِيهَا وَاشْتَرِطِي لَهُمُ اَلْوَلَاءَ }

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : (బానిసరాలైన) బరీరా (రదియల్లాహు అన్హా) నా దగ్గరకు వచ్చి, తాను తొమ్మిది ఊఖియాల వెండికి బదులుగా స్వేచ్ఛ పొందేలా తన యజమానితో ఒప్పందం (ముకాతబత్) చేసుకున్నాననీ, ప్రతి ఏటా ఒక ఊఖియాను చెల్లిస్తాననీ, ఈ విషయంలో తనకు సహాయపడమని ప్రాధేయపడింది. దానికి నేను, “నీ యజమాని గనక ఒప్పుకుంటే మొత్తం సొమ్ము ఒకేసారి ఇస్తాను. అయితే నీ ‘వలా’ (వారసులు లేని పక్షంలో నీ తదనంతరం నీ ఆస్తిపాస్తులు) నాకు సంక్రమించాలి. ఈ షరతును నీ యజమాని గనక అంగీకరిస్తే నీకు నేను సాయపడతాను” అని అన్నాను. ఈ ప్రతిపాదనను బరీరా (రదియల్లాహు అన్హా) తన యజమానుల దృష్టికి తీసుకువచ్చింది. కాని వారు ఈ ప్రతిపాదనను త్రోసిపుచ్చారు. బరీరా (రదియల్లాహు అన్హా) ఆమె వద్దకు వచ్చింది. ఆ సమయంలో దైవప్రవక్త ﷺ అక్కడే కూర్చుని ఉన్నారు. “(అమ్మా!) నేను మీ ప్రతిపాదనను నా యజమానులకు వినిపించాను. కాని వాళ్ళు దీన్ని ఆమోదించలేదు. ‘వలా’ హక్కు తమకు మాత్రమే దక్కాలని వాళ్ళు అంటున్నారు” అని ఆమె (రదియల్లాహు అన్హా) చెప్పింది. దైవప్రవక్త ﷺ ఈ విషయమంతా విన్నారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కూడా ఆయనకు ఈ సంగతిని విడమరచి చెప్పారు. అప్పుడు దైవప్రవక్త ﷺ, “ఈమెను తీసేసుకో. ఈమె వారసత్వం కూడా నీకు సంక్రమించేలా షరతు పెట్టుకో. ఎందుకంటే స్వేచ్ఛనొసగిన వానికి మాత్రమే బానిస యొక్క వారసత్వం సంక్రమిస్తుంది” అని స్పష్టం చేశారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అలాగే చేశారు. తరువాత దైవప్రవక్త ﷺ ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి నిలబడ్డారు. దైవస్తోత్రం చేసి, దేవుని ఘనతను కీర్తించిన తరువాత ఇలా అన్నారు: “ప్రజలకేమైపోయిందీ, వీళ్లు దైవగ్రంథంలో లేని షరతులను కూడా విధిస్తున్నారేమిటీ? (బాగా గుర్తుంచుకోండి) దైవగ్రంథంలో లేని వందలాది షరతులు పెట్టుకున్నాసరే – అవి అధర్మమైనవి. దేవుని నిర్ణయం సత్యబద్ధమైనది. దేవుడు విధించిన షరతు మాత్రమే అత్యంత దృఢమైనది, తిరుగులేనిదీను. బానిసకు, స్వేచ్ఛను ప్రసాదించే వ్యక్తికి మాత్రమే ‘వలా’ హక్కు ప్రాప్తిస్తుంది.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీలోనివి) “ఆమెను కొని స్వాతంత్ర్యం ప్రసాదించు. ‘వలా’ షరతు విధించవచ్చు” అని ముస్లింలో ఉంది.

English

Narrated 'Aishah (RA): Barirah came to her and said, "I had arranged to buy my freedom for nine Uqiya; one Uqiyah to be paid annually, so help me." 'Aishah (RA) replied, "If your people are pleased that I should pay (the amount) to them, and I shall have the right to inherit from you, I shall do so." Barira went to her people and told them about it, but they refused the offer. When she came back Allah's Messenger (ﷺ) was sitting (in the house). She said, "I offered that to them, but they insisted that the right to inherit from me should be theirs." The Prophet (ﷺ) heard that and 'Aishah (RA) told him about it. So, he said to 'Aishah (RA), "Take her and stipulate that the right to inherit from her will be yours, for the right of inheritance from her will be yours, for the right of inheritance belongs only to the one who has set a slave free." 'Aishah (RA) did so. Allah's Messenger (ﷺ) then stood up among the people to address them. So, after praising and extolling Allah, he said, "To proceed; what is the matter with some men who make conditions which are not in the Book of Allah, the Might, the Majestic? Any condition which is not in Allah's Book is invalid. Even if there are a hundred conditions, Allah's Decision is more valid and Allah's Condition is more binding. The right of inheritance belongs only to the one who has set a slave free." [Agreed upon and the wording is al-Bukhari's]. Muslim has: "Buy her, set her free and make the stipulation that the right to inherit from her will be yours."

సారాంశం

ఈ హదీసు ద్వారా అనేక అంశాలు వెల్లడవుతున్నాయి: ఉదాహరణకు – ఒక నిర్ణీత సొమ్ముపై, ఒక నిర్ణీత గడువును పెట్టుకుని యజమాని మరియు బానిస ‘ముకాతబత్’ అనే పద్ధతి ద్వారా విమోచన ఒప్పందం కుదుర్చుకోవచ్చు. బానిస తరపున వేరొక వ్యక్తి వచ్చి నిర్ణీత సొమ్మును చెల్లించగోరితే, అదీ ధర్మసమ్మతమే. ఇట్టి పరిస్థితిలో స్వేచ్ఛపొందిన బానిస మరణిస్తే అతని ఆస్తిపాస్తులు స్వేచ్ఛ ప్రసాదించిన వ్యక్తికి సంక్రమిస్తాయి.

తన యజమానితో ఒప్పందం (ముకాతబత్) చేసుకున్న బానిస స్థితిమంతుడు కానిపక్షంలో అతడు వేరొకరి దగ్గర ఆర్థిక సహాయం అర్థించటం ధర్మసమ్మతమే. ‘ముకాతబత్’ సొమ్మును వాయిదాల పద్ధతిపై కూడా చెల్లించవచ్చు. ఒక వ్యక్తికి బానిస చెరనుండి విడిపించే ఉద్దేశ్యంతో ఆర్థిక సాయం చేయవచ్చు. షరీయత్ కు విరుద్ధమైన షరతులను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చాలి. ఇలాంటి వ్యవహారాల్లో పరస్పర సలహా సంప్రతింపులు ఎంతో అవసరం. భార్య భర్తను ఏదేని కీలక విషయమై సంప్రతించినపుడు, భర్త చిత్తశుద్ధితో సలహా ఇవ్వాలి. ఏదేని ఒక విషయంలో ప్రజలు అజ్ఞానంతో మెలగినపుడు, ఆ విషయాన్ని ప్రజా బాహుళ్యంలోనికి తీసుకుపోవచ్చు. అయితే ఒక వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా, దాన్ని సర్వసాధారణమైన సవాలుగా తీసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చే ముందు దైవస్తోత్రం చేయాలి. దైవ సహాయం అర్థించాలి.

హదీసు ఉల్లేఖకులు

బరీరా (రదియల్లాహు అన్హా) : ఈమె విశ్వాసుల మాత అయిన హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి సేవకురాలు. అబూ అహ్మద్ బిన్ జహష్ కుటుంబంలో బానిసగా ఉండే ముగీస్ ను ఈమె తొలుత వివాహమాడారు. అయితే ఈమె స్వేచ్ఛ పొందిన తరువాత దైవప్రవక్త ﷺ ఇచ్చిన నిర్ణయాధికారాన్ని పురస్కరించుకుని, ఇంకా బానిసత్వంలోనే మ్రగ్గుతున్న భర్త ముగీస్ నుండి వేర్పడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 657

658

హదీసు 658

وَعَنِ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { نَهَى عُمَرُ عَنْ بَيْعِ أُمَّهَاتِ اَلْأَوْلَادِ فَقَالَ: لَا تُبَاعُ, وَلَا تُوهَبُ, وَلَا تُورَثُ, يَسْتَمْتِعُ بِهَا مَا بَدَا لَهُ، فَإِذَا مَاتَ فَهِيَ حُرَّةٌ } رَوَاهُ اَلْبَيْهَقِيُّ, وَمَالِكٌ, وَقَالَ: رَفَعَهُ بَعْضُ اَلرُّوَاةِ, فَوَهِمَ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు సంతానవతి అయిన బానిసరాలిని అమ్మటాన్ని నిషేధించారు. ఆమెను విక్రయించడం గానీ, కానుకగా ఎవరికయినా ఇవ్వటం గానీ, వారసత్వ సొమ్ముగా పంచిపెట్టడం గానీ కుదరదని ఆయన తేల్చి చెప్పారు. అతడు (యజమాని) బ్రతికి ఉన్నంత కాలం ఆమె సేవలను పొందవచ్చు. అతడు మరణించిన పిమ్మట ఆమె స్వతంత్రురాలవుతుంది అని కూడా ఆయన అన్నారు.” (బైహఖీ, మాలిక్ లు దీనిని ఉల్లేఖించారు)

English

Narrated Ibn 'Umar (RA): 'Umar (RA) forbade the sale of the slave-women who have given birth to children (of their owners). He said, "She is not to be sold, bestowed as a gift or inherited. He (the owner) enjoys her as long as he lives and when he dies, she becomes free." [Reported by Malik an al-Baihaqi. He said: Some of the narrators have attributed it to the Prophet (ﷺ) mistakenly].

సారాంశం

అరబీలో ‘ఉమ్మహాతుల్ ఔలాద్’ అనే పదం వచ్చింది. ఇది బహువచనం. ఏకవచనంలో ‘ఉమ్మె వలద్’ అవుతుంది. ఉమ్మె వలద్ అనే పదం శిశువును కన్న బానిసరాలినుద్దేశ్యించి ఉపయోగించబడింది. యజమాని జీవించి ఉన్నంతకాలం ఆమె అతని బానిసరాలిగానే ఉంటుంది. ఆమెను అతడు అన్ని విధాలా ఉపయోగించుకోగలడు. మరి అతడు మరణించగానే ఆమెకు స్వేచ్ఛ లభిస్తుంది. యజమాని సంతానానికి ఆమెపై ఎలాంటి హక్కు, అధికారం ఉండవు. యజమానిచే పిల్లవాణ్ణి కన్న బానిసరాలిని అమ్మవచ్చా? లేదా? అన్న విషయమై విద్వాంసుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఆమె కన్న శిశువు బ్రతికి ఉన్నా లేకపోయినా ఆమె క్రయవిక్రయాలు జరపటం హరామ్ (నిషిద్ధం) అని అత్యధికమంది పండితులు అభిప్రాయపడ్డారు. అయితే ఇమామ్ దావూద్ జాహిరీ గారు ఈమె క్రయవిక్రయాన్ని ధర్మసమ్మతంగా తలపోశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 658

659

హదీసు 659

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كُنَّا نَبِيعُ سَرَارِيَنَا, أُمَّهَاتِ اَلْأَوْلَادِ, وَالنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-حَيٌّ, لَا يَرَى بِذَلِكَ بَأْسًا } رَوَاهُ النَّسَائِيُّ, وَابْنُ مَاجَهْ وَاَلدَّارَقُطْنِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “మేము సంతానవతులైన బానిసరాళ్ళను దైవప్రవక్త ﷺ సమక్షంలోనే అమ్మేవాళ్ళము. కాని ఆయన ﷺ ఈ అమ్మకంపై ఎలాంటి అభ్యంతరాన్ని వెలిబుచ్చలేదు.” (ఈ హదీసును నసాయి, ఇబ్నె మాజ, దారె ఖుత్నీలు ముగ్గురూ ఉల్లేఖించగా, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు).

English

Narrated Jabir (RA): We used to sell our slave-women who had borne (our) children while the Prophet (ﷺ) was still living, and he saw no harm in that. [Reported by an-Nasa'i, Ibn Majah and ad-Daraqutni. Ibn Hibban graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 659

660

హదీసు 660

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { نَهَى اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ بَيْعِ فَضْلِ اَلْمَاءِ } رَوَاهُ مُسْلِمٌ. وَزَادَ فِي رِوَايَةٍ: { وَعَنْ بَيْعِ ضِرَابِ اَلْجَمَلِ }.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “మిగులు జలాల విక్రయాన్ని దైవప్రవక్త ﷺ వారించారు” (ముస్లిం). మగ ఒంటెను ఆడ ఒంటెతో జత కట్టించినందుకు ప్రతిఫలం తీసుకోవటాన్ని కూడా వారించినట్లు వేరొక ఉల్లేఖనంలో ఉంది.

English

Narrated Jabir bin 'Abdullah (RA): Allah's Messenger (ﷺ) prohibited the sale of excess water. [Reported by Muslim].

In another narration, he added: "And hiring a camel to impregnate a she-camel."

సారాంశం

(1) హదీసులోని “మిగులు జలాలు”అంటే భావం; ఏ ఒక్కరి సొంత భూమి కానటువంటి చోట నీరు ఉంటే ఆ నీరును త్రాగవచ్చు. తమ పశువులకు త్రాపవచ్చు. ఇంకా ఆ జలాల ద్వారా తమ పొలాలను కూడా తడుపుకోవచ్చు. అంతవరకూ సబబే. కాని ఆ జలాలను అమ్ముకోవటం మాత్రం సబబుకాదు. అయితే ఒకవేళ అతడు తన సొంతభూమిలో బావి త్రవ్వుకుంటే అప్పుడతనికి పూర్తి అధికారం ఉంటుంది.

(2) మగ ఒంటెను ఆడ ఒంటెతో జత కట్టించటమంటే భావం – ఆడ ఒంటె యద అయినపుడు మగ ఒంటెచే పాల్పించడం. ఇందునిమిత్తం ఆడ ఒంటె యజమాని నుండి బాడుగ లేక వేతనం వసూలు చేయటం నిషిద్ధం. ఈ రకమయిన లావాదేవీలు ఇప్పటికీ మననాట- ముఖ్యంగా పల్లెప్రాంతాల్లో – జరుగుతున్నాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 660

661

హదీసు 661

وَعَنِ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ عَسْبِ اَلْفَحْلِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “పోతు వీర్యానికి గాను ప్రతిఫలం పుచ్చుకోవడాన్ని దైవప్రవక్త ﷺ నిషేధించారు.” (బుఖారీ)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) forbade the sale of a stallion's semen (to use for impregnation). [Reported by al-Bukhari].

సారాంశం

పై హదీసులో ‘ఫహ్ల్’ అనే పదం వచ్చింది. మగ జంతువును అరబీలో ‘ఫహ్ల్’గా వ్యవహరిస్తారు. ఉదాహరణకు : దున్నపోతు, అంబోతు, గొర్రెపోతు, గుఱ్ఱం, ఒంటె ఇత్యాదివి. ఇలాంటి జంతువుల ద్వారా స్ఖలించబడే వీర్యాన్ని అమ్ముకోవటం నిషేధించబడింది.

పశువుల ఆసుపత్రులు సర్వసామాన్యం కాని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కొంతమంది దున్నపోతులను కేవలం ఈ ఉద్దేశ్యంతోనే పోషిస్తున్నారన్న సంగతి తెలుగువారికి తెలియనిది కాదు. – అనువాదకుడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 661

662

హదీసు 662

وَعَنْهُ; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ بَيْعِ حَبَلِ اَلْحَبَلَةِ, وَكَانَ بَيْعاً يَتَبَايَعُهُ أَهْلُ الْجَاهِلِيَّةِ: كَانَ اَلرَّجُلُ يَبْتَاعُ اَلْجَزُورَ إِلَى أَنْ تُنْتَجَ اَلنَّاقَةُ, ثُمَّ تُنْتَجُ اَلَّتِي فِي بَطْنِهَا } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ “హబలుల్ హబలా” వర్తకాన్ని నిషేధించారు. ఇలాంటి వర్తకం అజ్ఞానకాలంలో చేయబడేది. దీని ప్రకారం ఒక వ్యక్తి ఆడ ఒంటెను కొనేటప్పుడు; ‘నేను దీని వెలను ఒంటె ఈనిన తరువాత (దూడ జన్మించిన తరువాత) చెల్లిస్తాను లేక ప్రస్తుతం ఒంటె కడుపులో ఉన్న దూడ పుట్టి పెద్దదై అది ఈనిన తర్వాత ఇస్తాను’ అంటూ షరతులు పెట్టేవాడు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)

English

Narrated [Ibn 'Umar (RA)]: Allah's Messenger (ﷺ) forbade the transaction called 'Habalal-Habalah" which was one entered into in the Jahiliya era, whereby a man bought a she-camel which was to be the offspring of a she-camel which was still in its mother's womb. [Agreed upon, and the wording is al-Bukhari's].

సారాంశం

నిషేధించబడిన ఆ వర్తకంలో బహుశా రెండు భావాలు అంతర్లీనమై ఉండవచ్చు. ఒకటి: ఈ ఒంటె కడుపులో పెరుగుతున్న పిల్లఒంటె, అది పుట్టి, పెరిగి, సూడిదై ఈనిన తరువాత, అది పెట్టే పిల్లను నేను కొనదలుస్తున్నాను. కావాలంటే దాని మూల్యం ఈ రోజే తీసుకో. రెండు: ఈ ఒంటెను నేను నీకు ఇంత మొత్తానికి గాను అమ్ముతున్నాను. అయితే ఇది ఈనిన తరువాత ఆ పిల్ల ఒంటెను మాత్రం నాకు ఇచ్చివేయాలి అని అమ్మకందారు పెట్టే షరతు. మరి కడుపులో పెరుగుతున్న పిల్ల పరిస్థితి గురించి ఎవరికీ తెలీదాయె! అస్పష్టమైన, సందిగ్ధంతో కూడుకున్న వస్తువుకు వెల కట్టడం నిషిద్ధం. ఇందులో దగా, మోసాలకు ఆస్కారముంటుంది. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్‌హాఖ్ (రహిమహుల్లాహ్)ల అభిమతం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 662

663

హదీసు 663

وَعَنْهُ; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ بَيْعِ اَلْوَلَاءِ, وَعَنْ هِبَتِهِ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) గారిచే ఉల్లేఖించబడిన ఇంకొక హదీసు : “దైవప్రవక్త ﷺ ‘వలా’ను అమ్ముకోవటాన్ని, వేరొకరికి దానిని కానుకగా ఇవ్వడాన్ని వారించారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated [Ibn 'Umar (RA)]: Allah's Messenger (ﷺ) forbade selling or giving away the right of inheritance from a freed slave. [Agreed upon].

సారాంశం

‘వలా’ అనేది ఒకవిధమైన వారసత్వ హక్కులాంటిది. ఇది స్వాతంత్ర్యం పొందిన బానిస తరపునుండి, స్వాతంత్ర్యం ప్రసాదించిన యజమానికి ఇవ్వబడుతుంది. పూర్వం అరబ్బులు స్వతంత్రుడయ్యేవాని మరణానికి ముందే బానిసను అమ్మేసేవారు లేక కానుకగా ఇచ్చేసేవారు. దైవప్రవక్త ﷺ దీనిని నిషేధించారు. ఈ హక్కు స్వాతంత్ర్యం ప్రసాదించే వ్యక్తి వారసులకు లభించాలి లేదా స్వయంగా ఆ వ్యక్తి అయినా ఆ హక్కును పొందాలన్నదే దీని ఉద్దేశ్యం. అందుకే అటువంటి బానిసను అమ్మటం లేదా కానుకగా ఇవ్వటం ధర్మసమ్మతం కాదు. అత్యధికమంది ఇస్లామీయ విద్వాంసుల అభిమతం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 663

664

హదీసు 664

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ بَيْعِ اَلْحَصَاةِ, وَعَنْ بَيْعِ اَلْغَرَرِ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ, కంకరరాళ్లు విసిరి వర్తకం చేయడాన్ని, మోసపూరితమయిన వ్యాపారం చేయడాన్ని నిషేధించారు. (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) forbade a transaction determined by throwing stones, and the transaction which involves some uncertainty (or cheating). [Reported by Muslim].

సారాంశం

పూర్వం అరబ్బులు చిత్రవిచిత్రమయిన పందాలు వేసుకునేవారు. వాటిలో కంకరరాళ్ళు రువ్వే పందెం కూడా ఒకటి. “నువ్వు ఈ రాయి విసిరి ఫలానా లక్ష్యాన్ని ఛేదిస్తే డబ్బు తీసుకోకుండానే ఈ వస్తువు నీకిచ్చేస్తాను” అని అమ్మకందారు కొనుగోలుదారునితో అనేవాడు. అలాగే గొఱ్ఱెల మంద వద్ద ఇద్దరు వ్యక్తులు నిలబడేవారు. వారిలో ఒకడు గుప్పెట్లో గులకరాళ్ళు పట్టుకుని, ఈ రాయి ఏ గొఱ్ఱెకు తగులుతుందో దాన్ని నాకు ఇంత ధరకు ఇచ్చివేయాలి అని షరతు పెట్టేవాడు. ఈ పందాలు పలు రకాలుగా ఉండేవి. వాణిజ్య రంగంలోని ప్రమాణాలను, పరపతిని పాడు చేసే ఇలాంటి చేష్టలను దైవప్రవక్త ﷺ నిషేధించారు.

అలాగే వస్తువులోని లోపాలను దాచిపెట్టి దాన్ని అమ్మటం; కొలతలు, తూనికలలో తగ్గించి ఇవ్వటం, చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండకపోవటం లాంటివన్నీ వర్తకంలో దగా, మోసం క్రిందికి వస్తాయి. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) గారు దగా, మోసం, వంచన లాంటి చెడుగుల క్రిందికివచ్చే కొన్ని విషయాలను ఉదాహరిస్తూ ఇలా అన్నారు: నిషిద్ధమయిన ఈ వ్యవహారంలో అనేక అంశాలు వస్తాయి. ఉదాహరణకు : – పారిపోయిన బానిసను ఇంకొకరికి అమ్మటం, తమ అధీనంలో లేని వస్తువులను విక్రయించటం, ఎక్కువ నీటిలో ఉన్న చేపల క్రయవిక్రయాలు జరపటం, పశువుల పొదుగుల్లో ఉన్న పాలను పితకకుండానే పాలకోసం బేరమాడటం, కడుపులో పెరుగుతున్న నలుసుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవటం, తూకం వేయని ధాన్యపు రాసులలో నుంచి కొంత భాగాన్ని అమ్మటం ఇత్యాదివి. ఇవన్నీ అధర్మమయిన వాణిజ్యం క్రిందికి వస్తాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 664

665

హదీసు 665

وَعَنْهُ: أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنِ اِشْتَرَى طَعَاماً فَلَا يَبِعْهُ حَتَّى يَكْتَالَهُ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరైనా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఆ ధాన్యాన్ని కొలిచే (లేక తూకం వేసే) వరకూ వేరొకరికి అమ్మరాదు.” (ముస్లిం)

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) said: "If anyone buys a grain he must not sell it till he weighs it." [Reported by Muslim].

సారాంశం

ఒక వ్యక్తి ఎక్కడినుంచైనా ఒక ఆహార ధాన్యాన్ని కొన్నప్పుడు దాన్ని కొలవటమో, తూకం వేయటమో చేసిన మీదటే తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. మరి అదే వస్తువును కొంత కాలానికి ఇతరులకు అమ్మేటప్పుడు దాని బరువును సరిచూసుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకంటే ధాన్యంలో తరుగు రావచ్చు. మరేమైనా జరగవచ్చు. అందుకే మరోసారి దాన్ని కొలిచే లేక తూకం వేసేదాకా అమ్మటం ధర్మసమ్మతం కాదని అత్యధికమంది విద్వాంసులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయటం వల్ల తాము చేసే వర్తకంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న ఆత్మ తృప్తి కూడా వ్యాపారులకు ఉంటుంది. (సుబులుస్సలామ్)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 665

666

హదీసు 666

وَعَنْهُ قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ بَيْعَتَيْنِ فِي بَيْعَةٍ } رَوَاهُ أَحْمَدُ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ حِبَّانَ. وَلِأَبِي دَاوُدَ: { مَنْ بَاعَ بَيْعَتَيْنِ فِي بَيْعَةٍ فَلَهُ أَوَكَسُهُمَا, أَوْ اَلرِّبَا }.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: “వ్యాపారం చేసేటప్పుడు రెండు బేరాలను ఒకదానిలో కలగాపులగం చేయటాన్ని దైవప్రవక్త ﷺ నిషేధించారు” (అహ్మద్, నసాయి). తిర్మిజీ మరియు ఇబ్నె హిబ్బాన్ లు దీనిని ప్రామాణికమైన హదీసుగా ధృవీకరించారు.

“ఎవరయినా ఒకే వస్తువుకు రెండు ధరలు నిర్ధారిస్తే అతడు తక్కువ ధరతోనే సరిపెట్టు కోవాలి. అన్యథా అది వడ్డీ అవుతుంది” అని అబూ దావూద్ లోని ఉల్లేఖనంలో ఉంది.

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) forbade two transactions combined in one. [Reported by Ahmad and an-Nasa'i. at-Tirmidhi and Ibn Hibban graded it Sahih (authentic)].

Abu Dawud has: "If anyone makes to transactions combined in one he is entitled to take the lower price, or (it is considered) usury."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 666

667

హదీసు 667

وَعَنْ عَمْرِوِ بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَحِلُّ سَلَفٌ وَبَيْعٌ وَلَا شَرْطَانِ فِي بَيْعٍ, وَلَا رِبْحُ مَا لَا يُضْمَنُ, وَلَا بَيْعُ مَا لَيْسَ عِنْدَكَ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ خُزَيْمَةَ, وَالْحَاكِمُ. وَأَخْرَجَهُ فِي " عُلُومِ اَلْحَدِيثِ " مِنْ رِوَايَةِ أَبِي حَنِيفَةَ, عَنْ عَمْرٍو اَلْمَذْكُورِ بِلَفْظِ: " نَهَى عَنْ بَيْعٍ وَشَرْطٍ " وَمِنْ هَذَا اَلْوَجْهِ أَخْرَجَهُ اَلطَّبَرَانِيُّ فِي " اَلْأَوْسَطِ " وَهُوَ غَرِيبٌ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి, ఆయన తన తాతగారి నుండి సంగ్రహించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు: అమ్మకాన్ని మరియు అప్పును సమ్మిళితం చేయటం సమ్మతం కాదు. ఒకే బేరంలో రెండు రకాల షరతులు పెట్టడం కూడా సమ్మతం కాదు. వస్తువు తమ అధీనంలోకి రాకమునుపే దానిపై లాభం గడించటం కూడా ధర్మసమ్మతం కాదు. అదే విధంగా నీ దగ్గరలేని దాన్ని ఇతరులకు అమ్మటం కూడా ధర్మసమ్మతం కాదు.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు – తిర్మిజీ, ఇబ్నె ఖుజైమ, హాకిమ్ లు ముగ్గురూ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

ఇదే హదీసును పైన ప్రస్తావితులైన అమ్ర్ (రదియల్లాహు అన్హు) గారి మధ్యవర్తిత్వంతో అబూ హనీఫా గారు- ప్రవక్త ﷺ షరతుతో కూడిన వర్తకం చేయడాన్ని వారించారు- అన్న పదాలతో ఉల్లేఖించినట్లు ఇమాం హాకిమ్ గారు “ఉలూముల్ హదీస్” గ్రంథంలో పేర్కొన్నారు.

(దారె ఖుత్ని ‘అవ్ సత్’ అను గ్రంథంలో ఇదేవిధంగా ఉల్లేఖించారు. అయితే అది అరుదైనది)

English

Narrated 'Amr bin Shu'aib on his father's authority from his grandfather (RA): "Allah's Messenger (ﷺ) said: "The condition of a loan combined with a sale is not lawful, now two conditions relating to one transaction, nor the profit arising from something which is not in one's charge, nor selling what is not in your possession." [Reported by al-Khamsa. at-Tirmidhi, Ibn Khuzaimah and al-Hakim graded it Sahih (authentic)].

al-Hakim reported it in 'Uloom al-Hadith, from the narration of Abu Hanifah, from 'Amr bin Shu'aib, with the wording: He [the Prophet (ﷺ)] forbade a transaction (combined with) a condition. at-Tabarani reported it through this chain of narrators in al-Awsat, and it is Gharib (reported by a single narrator).

హదీసు ఉల్లేఖకులు

సుప్రసిద్ధ నలుగురు ఇమాముల్లో ఇమామ్ అబూ హనీఫాగారు ఒకరు. ఈయన అసలు పేరు నోమాన్ బిన్ సాబిత్ కూఫీ. బనూ తైముల్లాహ్ బిన్ సాలబ నుండి స్వేచ్ఛనొసగబడిన బానిస. పర్షియన్ అని కూడా ఒక వినికిడి ఉంది. పట్టు వస్త్రాలను అమ్మేవారు. హదీసు ఉల్లేఖనాలకు సంబంధించి హదీసువేత్తల ఒక వర్గం ఈయన్ని విశ్వసనీయునిగా ఖరారు చేయగా మరికొంతమంది జయీఫ్ ఉల్లేఖకులని పేర్కొన్నారు. ఫికహ్ (ధర్మావగాహన)లో ఈయనంతటి వాడిని తాను చూడలేదని ఇబ్నె ముబారక్ (రహిమహుల్లాహ్) గారు అన్నారు. దేవుడు ఆయనకు ప్రసాదించిన పేరు ప్రఖ్యాతులు అసాధారణమైనవి, ఆయన మాత్రం ఎన్నడూ ఇతరుల పొగడ్తలను ఆశించలేదు. ఫికహ్, దైవభక్తి, దైవపరాయణత మరియు దాన ధర్మాలలో పేరుమోసిన వ్యక్తి. హి.శ. 80వ పడిలో జన్మించారు. 150లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 667

668

హదీసు 668

وَعَنْهُ قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ بَيْعِ اَلْعُرْبَانِ } رَوَاهُ مَالِكٌ, قَالَ: بَلَغَنِي عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, بِهِ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ గారే తన తండ్రి నుంచి, ఆయన తన తాతగారి నుండి సంగ్రహించిన ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ వ్యాపార లావాదేవీలలో ‘బయానా’ సొమ్మును నిషేధించారు. (దీనిని మాలిక్ – రహిమహుల్లాహ్ – ఉల్లేఖించారు. ఈ హదీసు తనకు అమ్ర్ బిన్ షుఐబ్ ద్వారా అందిందని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) చెప్పారు)

English

Narrated ['Amr bin Shu'aib on his father's authority from his grandfather (RA)]: Allah's Messenger (ﷺ) forbade the type of transaction in which a security deposit was paid. [Reported by Malik, who said, "It reached me (with mentioning its chain of narrators) on the authority of 'Amr bin Shu'aib that…" i.e., the aforesaid Hadith].

సారాంశం

అరబీలో ‘ఉర్బాన్’ అనే పదం వచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి మరోవ్యక్తి దగ్గర ఒక ఇల్లునో, ప్లాటునో, పశువునో కొంటాడు. బేరం కుదుర్చుకున్న దానికి తార్కాణంగా ఒక వెయ్యి రూపాయలు ‘బయానా’గా అమ్మకందారునికి ఇస్తాడు. ఫలానా గడువులోగా తాను కొన్న వస్తువుకు పూర్తి సొమ్మును చెల్లిస్తానని ఒప్పందం చేసుకుంటాడు. ఆ గడువులోగా అతడు పూర్తి సొమ్మును చెల్లిస్తే ఆ వస్తువు అతని సొంతమవుతుంది. లేనిపక్షంలో అతడు అమ్మకందారునికి ‘బయానా’గా ఇచ్చిన వెయ్యి రూపాయలు తిరిగి రావు. ఇటువంటి లావాదేవీలను దైవప్రవక్త ﷺ నిషేధించారు.

ఈ ఉల్లేఖనం ఆధారంగా ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) బయానా సొమ్మును అధర్మంగా భావిస్తున్నారు. అయితే ఈ హదీసు అందిన పరంపర బలహీనంగా ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 668

669

హదీసు 669

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { اِبْتَعْتُ زَيْتاً فِي اَلسُّوقِ, فَلَمَّا اِسْتَوْجَبْتُهُ لَقِيَنِي رَجُلٌ فَأَعْطَانِي بِهِ رِبْحاً حَسَناً، فَأَرَدْتُ أَنْ أَضْرِبَ عَلَى يَدِ اَلرَّجُلِ، فَأَخَذَ رَجُلٌ مِنْ خَلْفِي بِذِرَاعِي، فَالْتَفَتُّ, فَإِذَا هُوَ زَيْدُ بْنُ ثَابِتٍ, فَقَالَ: لَا تَبِعْهُ حَيْثُ اِبْتَعْتَهُ حَتَّى تَحُوزَهُ إِلَى رَحْلِكَ; فَإِنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى أَنْ تُبَاعَ اَلسِّلَعُ حَيْثُ تُبْتَاعُ, حَتَّى يَحُوزَهَا اَلتُّجَّارُ إِلَى رِحَالِهِمْ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ وَاللَّفْظُ لَهُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ وَالْحَاكِمُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నేను బజారు నుండి (జైతూన్) నూనె కొన్నాను. నేను కొన్న కొద్ది క్షణాల్లోనే ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి, ఆ నూనెను తనకు అమ్మితే మంచి గిట్టుబాటు ధర ఇస్తానని బేరమాడసాగాడు. నేను కూడా ఆ వ్యక్తికి అమ్మాలనే అనుకున్నాను. అంతలోనే వెనుక నుంచి ఎవరో నా భుజంపై చేయివేశారు. నేను తిరిగి చూస్తే జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) నిలబడి ఉన్నారు. ఆయన ఇలా అన్నారు: “మీరు సరుకును కొన్న చోటే అమ్మకూడదు. దాన్ని మీ ఇంటికి మోసుకువెళ్ళిన మీదట అమ్మవచ్చు. ఎందుకంటే, దైవప్రవక్త ﷺ వస్తువులను కొన్నచోటే అమ్మడాన్ని వారించారు. అయితే వ్యాపారులు తాము కొనుగోలు చేసిన సరుకును, కారకాలను తమ స్థావరాలకు తరలించిన పిదప అమ్ముకుంటే అప్పుడది సమ్మతమేనని సెలవిచ్చారు.” (అహ్మద్, అబూ దావూద్ లు ఈ హదీసును ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు మాత్రం అబూ దావూద్ లోనివి. ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Ibn 'Umar (RA): I bought some oil in the market and when I had taken it (from the seller), a man met me and offered to give me a good profit for it. Then, when I was about to finalize the deal with him, a man caught hold of my forearm from behind. So I turned and found that he was Zaib bin Thabit (RA). He said, "Do not sell it in the place where you have bought it, till you take it to your dwelling. This is because Allah's Messenger (ﷺ) forbade that commodities to be sold in the place where they were bought, till the traders take them to their dwellings." [Reported by Ahmad and Abu Dawud; this wording is from Abu Dawud. Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 669

670

హదీసు 670

وَعَنْهُ قَالَ: { قُلْتُ: يَا رَسُولَ اَللَّهِ! إِنِّي أَبِيعُ الْإِبِلَ بِالْبَقِيعِ, فَأَبِيعُ بِالدَّنَانِيرِ وَآخُذُ اَلدَّرَاهِمَ, وَأَبِيعُ بِالدَّرَاهِمِ وَآخُذُ اَلدَّنَانِيرَ, آخُذُ هَذَا مِنْ هَذِهِ وَأُعْطِي هَذَهِ مِنْ هَذِا? فَقَالَ رَسُولُ اَللَّهِ‏-صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ‏-: لَا بَأْسَ أَنْ تَأْخُذَهَا بِسِعْرِ يَوْمِهَا مَا لَمْ تَتَفَرَّقَا وَبَيْنَكُمَا شَيْءٌ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ‘ఓ దైవప్రవక్తా ﷺ! నేను ‘బఖీ’లో ఒంటెలను అమ్ముతాను. దీనార్లలో అమ్మి దిర్‌హమ్ లు వసూలు చేస్తాను. (ఒక్కోసారి)దిర్‌హమ్ లలో అమ్మి దీనార్లు కూడా వసూలు చేస్తాను. అంటే దిర్‌హమ్ లకు బదులు దీనార్లు, దీనార్లకు బదులు దిర్హమ్ లు తీసుకుంటూ ఉంటాను. దీనికి బదులు అది తీసుకుంటాను. దానికి బదులు ఇది ఇస్తూ ఉంటాను (ఇది సమ్మతమేనా?!)’ అని నేను సందేహపడగా దైవప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారు – “ఆ రోజు తీసుకున్న ద్రవ్యాన్ని ఆ రోజే, ఆనాటి రేటు ప్రకారం మారకం చేస్తే అది ధర్మసమ్మతమే. అయితే క్రయవిక్రయాలు జరిపిన వారు పరస్పరం విడిపోకముందే వారు ఒండొకరికి బాకీపడకుండా ఉండాలి. (అట్టి పరిస్థితిలోనే ఇది ధర్మసమ్మతమవుతుంది).” (ఈ హదీసును ఐదుగురు ఉల్లేఖించగా, హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Narrated [Ibn 'Umar (RA)]: I said, "O Allah's Messenger, I sell camels at al-Baqi'. I sell for Dinars and take Dirhams (for them), and sell for Dirhams, and take Dinars (for them), I take this for that and give that for this (i.e. Dinars and Dirhams)." Allah's Messenger (ﷺ) replied, "There is no harm in taking them at the current rate so long as you do not separate leaving something still to be settled (from the exchange)." [Reported by al-Khamsah and al-Hakim graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 670

671

హదీసు 671

وَعَنْهُ قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنِ النَّجْشِ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) గారిచే ఉల్లేఖించబడిన ఇంకొక హదీసు ప్రకారం దైవప్రవక్త ﷺ మోసపూరితమయిన వేలంపాట ద్వారా వస్తువులను అమ్మటాన్ని నిషేధించారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated [Ibn 'Umar (RA)]: Allah's Messenger (ﷺ) forbade bidding against one another (to raise the price). [Agreed upon].

సారాంశం

పై హదీసులో ‘నజష్’ అనే పదం ప్రయోగించబడింది. దీని ప్రకారం మార్కెట్టులో వస్తువులు అమ్మకానికై ప్రదర్శించబడుతుంటాయి. కొనుగోలుదారులు వచ్చి వస్తువులను పరికిస్తూ, వాటి ధర గురించి ఆరా తీస్తూ ఉంటారు. అంతలో ఒక వ్యక్తి హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమై ఆ వస్తువుల నాణ్యత గురించి కోతలు కోయటం మొదలెడతాడు. ఇంత నాణ్యమైన ఈ వస్తువుకు ఇంత ధర ఇచ్చినా తక్కువేనంటూ వస్తువుల ధరను పెంచేస్తాడు. వాస్తవానికి ఆ వ్యక్తి వస్తువులను కొనడానికి రాలేదు. అమ్మకం దారునితో లోపాయికారిగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అతగాడు అక్కడకు వచ్చి మార్కెట్టులో ‘వైపరీత్యం’ సృష్టించాడు. అతని మాయ మాటలకు మోసపోయిన జనం వాస్తవంగా కొనవలసిన ధరకంటే ఎక్కువ ధరకు వస్తువులను కొంటారు. తరువాత ఆ వ్యక్తి అమ్మకందారుని వద్దకు గప్ చిప్ గా వెళ్ళి తనకు రావలసిన కమీషన్ ను జేబులో వేసుకుంటాడు. ఇలాంటి వైపరీత్యాల వల్ల పరిపూర్ణమైన పోటీ విధానంలో సమతౌల్యం దెబ్బతింటుంది. కొనుగోలుదార్లకు చాలా అన్యాయం జరుగుతుంది. అందుకే షరీయత్ ఇటువంటి క్రయవిక్రయాలను నిషిద్ధంగా ఖరారు చేసింది. ఈ రకమయిన వేలంపాట నిస్సందేహంగా అధర్మమన్న విషయంలో పండితులందరి మధ్యా ఏకాభిప్రాయముందని ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అంటున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 671

672

హదీసు 672

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ اَلْمُحَاقَلَةِ, وَالْمُزَابَنَةِ, وَالْمُخَابَرَةِ, وَعَنْ اَلثُّنْيَا, إِلَّا أَنْ تُعْلَمَ } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا اِبْنَ مَاجَهْ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ‘ముహాఖలా’, ‘ముజాబనా’, ‘ముఖాబరా’ పద్ధతులను నిషేధించారు. వీటితో పాటు ‘సున్ యా’ విధానాన్ని కూడా ఆయన ﷺ వారించారు. అయితే అమ్మకం జరిగే వస్తువుల్లో ఫలానా వస్తువును మినహాయించి మిగిలిన వాటిని అమ్ముతున్నాను అని స్పష్టంగా చెబితే అప్పుడది ధర్మసమ్మతమవుతుంది. (ఈ హదీసును ఇబ్నె మాజ గాకుండా మరో ఐదుగురు ఉల్లేఖించారు. తిర్మిజి దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Narrated Jabir bin 'Abdullah (RA): The Prophet (ﷺ) forbade Muhaqalah, Muzabanah, and Mukhabarah. He also forbade Thunya unless it was explicit (a known amount). [Reported by al-Khamsah excluding Ibn Majah; at-Tirmidhi graded it Sahih (authentic)].

సారాంశం

1). ముహాఖలా : ముహాఖలా అంటే పొలంలో పంట కోతకు రాకముందే ధాన్యానికి బదులుగా పంటను అమ్మటం.

2). ముజాబనా: చెట్టుకు కాచివున్న కాయలను అదే కోవకు చెందిన ఎండు ఫలాల (డ్రై ఫ్రూట్స్)కు బదులుగా అమ్మివేయటం. ఉదాహరణకు ఎండు ఖర్జూరాలకు బదులుగా చెట్లకు పండుతూ ఉన్న ఖర్జూరాలను అమ్మటం. అలాగే ద్రాక్ష తోటలో కాపుకు రాబోతున్న ద్రాక్షపండ్లను ఎండు ద్రాక్ష (కిస్మిస్)కు మారుగా అమ్మివేయటం.

ఇలాంటి అమ్మకాలను దైవప్రవక్త ﷺ వారించారు. ఎందుకంటే ఇలాంటి స్థితిలో పంట దిగుబడి ఖచ్చితంగా ఎంత ఉంటుందో అంచనా వేయటం దుర్లభం. పంట కోసిన మీదట, అది ఎండి ఎంత బరువు వస్తుందో ఏమో! అది అంచనాలకు మించనూవచ్చు, తగ్గనూవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ ఉభయుల్లో ఎవరో ఒకరికి నష్టం వాటిల్లుతుంది. ధాన్యం ఒకే కోవకు చెందినదైనప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాల్లో హెచ్చు తగ్గులుండకూడదు – హెచ్చు ధాన్యం ఎవరికయినా వస్తే అది వడ్డీ క్రిందికి వస్తుంది. (ఇస్లాంలో వడ్డీ నిషేధం కదా!)

3). ముఖాబరా : పొలం యజమానికి – కౌలుదారునికి మధ్య జరిగే ఒప్పందం ఇది. ఈ ఒప్పందం ప్రకారం పొలంలో ఫలానా భాగపు పంట తనకు ఇచ్చి, మిగిలిన భాగంలో పండే పంటను నువ్వు తీసుకోవచ్చు అని యజమాని కౌలుదారునికి షరతు పెడతాడు. ఇది వాంఛనీయం కాదు. ఎందుకంటే ఒక్కోసారి కౌలుదారునికి చెందవలసిన భాగంలో పంట దెబ్బతినవచ్చు, యజమానికి రావలసిన భాగం సురక్షితంగా ఉండవచ్చు. అలాగే ఒక్కోసారి యజమానికి చెందవలసిన పంట భాగానికి తెగులు పట్టి, కౌలుదారునికి చెందవలసిన భూభాగంలో పంట బాగా పండవచ్చు. రెండు పరిస్థితుల్లోనూ ఉభయుల్లో ఎవరో ఒకరికి నష్టం వాటిల్లవచ్చు. అందుకే ఈ పద్ధతిని దైవప్రవక్త ﷺ వారించారు.

దీనికి బదులుగా పండిన పంటలో ఇంత భాగం యజమానికీ, ఇంతభాగం కౌలుదారునికి చెందాలి అని వారిరువురూ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటే; అది ఆక్షేపణీయం కాజాలదు. దైవప్రవక్త ﷺ కూడా ఖైబర్ వాసులతో ఈ విధమైన ఒప్పందమే చేసుకున్నారు.

4). సున్ యా : అంటే నిర్ధారితంకాని, అస్పష్టమైన ఒకానొక వస్తు భాగాన్ని అమ్మకం నుండి మినహాయించటం. అంటే నేనీ ధాన్యపు కుప్పను అమ్ముతున్నాను గాని ఇందులోని ఒక భాగాన్ని మాత్రం అమ్మను అని చెప్పి కొనుగోలుదార్లను తికమక పెట్టడమన్నమాట! ఉదాహరణకు: వస్త్రాల థానులు, గొఱ్ఱెల మందలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయనుకోండి- తాను వాటిని అమ్ముతున్నాను. అయితే వాటిలో కొంత భాగం అమ్మబోను అని అమ్మకందారుడు అంటాడు. ఆ ‘కొంతభాగం’ ఏదీ అనేది స్పష్టంగా వేరుచేసి చూపడు. వాణిజ్యరంగంలో అవలంబించబడే ఇలాంటి అస్పష్టవైఖరి అయోమయంలో పడవేస్తుంది. అయితే గొఱ్ఱెల మందలో ఫలానా గొఱ్ఱెను మినహాయించి మిగతా వాటిని అమ్ముతాననో, ఫలానా వస్త్రపు థాను తప్ప మిగిలిన వాటిని ఇస్తాననో స్పష్టంగా ప్రకటిస్తే అప్పుడది ధర్మసమ్మతమవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 672

673

హదీసు 673

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنِ اَلْمُحَاقَلَةِ, وَالْمُخَاضَرَةِ, وَالْمُلَامَسَةِ, وَالْمُنَابَذَةِ, وَالْمُزَابَنَةِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ వర్తకంలో ముహాఖలా, ముఖాజరా, ములామసా, మునాబజా, ముజాబనా పద్ధతులను నిషేధించారు. (బుఖారీ)

English

Narrated Anas (RA): Allah's Messenger (ﷺ) forbade Muhaqalah, Mukhadarah, Mulamasah, Munabadhah and Muzabamah. [Reported by al-Bukhari].

సారాంశం

ముఖాజరా : అంటే పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు పండకముందే అమ్మకానికి పెట్టడం.

ములామసా, మునాబజా : ‘ముస్లిం’లో హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఈ రెండిటి తాత్పర్యం ఈ విధంగా ఉంది – ‘ములామసా’ ప్రకారం ఇరువురు వ్యక్తులు ఒండొకరి దుస్తులను చెప్పకుండానే ముట్టుకుంటారు. ఇలా ముట్టుకుంటే వారు క్రయవిక్రయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్లే లెక్క. ‘మునాబజా’ అంటే ఇరువురు వ్యక్తులు వస్త్రాన్ని చూడకుండా, పరికించకుండానే ఒండొకరి వైపు వస్త్రాన్ని విసరివేస్తారు. ఇలా విసరివేయటమే బేరం కుదిరిందన్న దానికి తార్కాణంగా పరిగణించబడుతుంది.

బుఖారీ మరియు ముస్లింలలో హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఈ రెంటి వ్యాఖ్యానం ఇలా వుంది: కొనుగోలుదారు పగటిపూటైనా, రాత్రిపూటైనా ఇతరుల వస్త్రాన్ని చూడకుండానే, తనిఖీ చేయకుండానే కేవలం (వస్త్రాన్ని) ముట్టుకుంటే చాలు, దాన్ని కొన్నట్లే లెక్క. ఇక ‘మునాబజా’ అంటే ఏమిటో చూడండి – అమ్మకందారుడు, కొనుగోలుదారుడు- ఇద్దరూ ఒండొకరి వైపు తమ తమ వస్త్రాన్ని విసురుతారు. ఇలా విసరటమే వారివురి మధ్య జరిగిన వర్తకానికి ప్రతీక. ఆ సరుకును వారు చూడకపోయినా, పరస్పరం సంప్రతింపులు జరగకపోయినా సరే. కేవలం ముట్టుకోవటం, విసిరివేయటమే వాణిజ్య ఒడంబడికకు, లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా భావించబడుతుందన్నమాట! వాణిజ్యరంగంలో అనర్థాలకు, అపసవ్యతలకు దారితీసే ఇటువంటి పోకడలను దైవప్రవక్త ﷺ గట్టిగా వారించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 673

674

హదీసు 674

وَعَنْ طَاوُسٍ, عَنِ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَلَقَّوْا اَلرُّكْبَانَ, وَلَا يَبِيعُ حَاضِرٌ لِبَادٍ ".‏ قُلْتُ لِابْنِ عَبَّاسٍ: مَا قَوْلُهُ: " وَلَا يَبِيعُ حَاضِرٌ لِبَادٍ? " قَالَ: لَا يَكُونُ لَهُ سِمْسَارًا } مُتَّفَقٌ عَلَيْهِ وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.

హజ్రత్ తావుస్ హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) నుండి సంగ్రహించిన విషయాన్ని ఇలా తెలియజేశారు : “వర్తక సామగ్రిని (పట్టణాల్లోకి) తీసుకుని వచ్చే వర్తక బృందాలను ముందుగా వెళ్ళి కలుసుకోవటంగానీ, పల్లెవాసి సరుకును పట్టణవాసి అమ్మటంగానీ చేయకండి” అని దైవప్రవక్త ﷺ ఉపదేశించారు. ‘పట్టణవాసి పల్లెవాసి సరుకును అమ్మవద్దు’ అన్న మాటలోని అంతరార్థం ఏమిటీ? అని నేను ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)ను ప్రశ్నించగా ‘పట్టణవాసి పల్లెటూరి వాళ్ళకు దళారిగా వ్యవహరించరాదు’ అన్నది దీని మతలబు అని ఆయన వివరించారు. (బుఖారీ, ముస్లిం. ఈ వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)

English

Narrated Tawus from Ibn 'Abbas (RA), Allah's Messenger (ﷺ) said: "Do not go out to meet riders (to conduct business with them), and a city-dweller must not sell for a man from the desert." I asked Ibn 'Abbas (RA), "What did he mean by 'A city-dweller must not sell for a man from the desert.'" He replied, "He should not act as a broker for him." [Agreed upon and the wording is al-Bukhari's].

సారాంశం

మధ్య దళారుల చేతికి చిక్కిన అమాయక పల్లెవాసులకు జరిగే అన్యాయం గురించి 1400 ఏళ్ల క్రితమే దైవప్రవక్త ﷺ అప్రమత్తం చేశారు. ఆధునిక యుగంలో సయితం ఈ అన్యాయం జరుగుతోంది. పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదు సరికదా నశ్వర వస్తువులను పట్నానికి తరలించే గ్రామీణ రైతులను బ్రోకర్లు నిలువునా దోచుకుంటున్నారు. ఈ దోపిడీ నుండి కొంతవరకైనా రైతులను కాపాడే ఉద్దేశ్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు బజార్’ లాంటి వ్యవస్థను నెలకొల్పింది. కాగా; పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ నిలువుదోపిడీని పసిగట్టి, దానికి ముకుతాడు బిగించిన ఇస్లాం ఓ నిత్య నూతన వ్యవస్థ అనడంలో సందేహమేముంది? – అనువాదకుడు

హదీసు ఉల్లేఖకులు

హజ్రత్ తావుస్ గారి మరోపేరు అబూ అబ్దుర్రహ్మాన్. వంశపరంపర దృష్ట్యా తావుస్ బిన్ కీసాన్ హిమ్ యరీ అనబడతారు. హిమ్ యార్ తెగచే స్వేచ్ఛ నొసగబడిన బానిస. పారసీక జాతికి చెందిన వారు. ఆయన అసలు పేరు జక్వాన్ అనీ, తావుస్ అనేది ఆయన బిరుదు అని కూడా అనబడుతోంది. విశ్వసనీయులు. గొప్ప విద్వాంసులు. ధర్మావగాహనలో సాటిలేని మేటి. మూడో తరానికి చెందిన తాబయి. తాను 50 మంది సహాబీలను చూశానని ఆయన అనేవారు. ఈయన గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వ్యాఖ్యానిస్తూ, ‘తావుస్ జన్నతీ (స్వర్గంలో ప్రవేశం పొందగలవారు) అని అనేవారు. తావుస్ లాంటి వారిని తాను చూడలేదని అమ్ర్ బిన్ దీనార్ అంటూ ఉండేవారు. హిజ్రీ 106వ ఏట ఈయన మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 674

675

హదీసు 675

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَلَقَّوا اَلْجَلَبَ، فَمَنْ تُلُقِّيَ فَاشْتُرِيَ مِنْهُ, فَإِذَا أَتَى سَيِّدُهُ اَلسُّوقَ فَهُوَ بِالْخِيَارِ }. رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “బయటినుంచి నగరంలోనికి ఆహార ధాన్యం తెచ్చేవారిని ముందుగా (ఎదురుగా) వెళ్ళి కలుసుకోకండి. ఎవరయినా ముందుగానే వెళ్ళి మార్గమధ్యంలోనే సరుకును కొంటే మార్కెట్టులో అమ్మిన తరువాత (ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండే లేదా ఒప్పందాన్ని రద్దుపరచే) అధికారం సరుకు యజమానికి ఉంటుంది.” (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Do not go out to meet what is being brought (to market for sale). Whoever has done so and bought some of it, when its owner comes to the market he has the choice (of canceling the deal)." [Reported by Muslim].

సారాంశం

మార్కెట్టులో ఆ రోజు వస్తువుల ధర గురించి ఏమాత్రం తెలియని పల్లెవాసులకు ఎదురుగా వెళ్ళి బేరమాడటం వాంఛనీయం కాదు. ఎందుకంటే సరుకును కొనదలచిన వ్యక్తి ఎంతసేపటికీ చౌకధరకే కొనగోరుతాడు. మార్కెట్టులో వస్తువుల ధర ఒకటుంటే వాళ్ళకు ఇంకొక ధర చెబుతాడు. ఇందులో మోసం జరగడానికి ఆస్కారముంటుంది. ఒక సోదరుడు మరో సోదరుని శ్రేయోభిలాషి అయి ఉండాలనీ, సాటి సోదరునికి దగా చేయరాదని ఇస్లాం అంటోంది. వర్తకంలో పరస్పర నమ్మకం, నిజాయితీ తత్పరత నెలకొని ఉండాలి. అందుకే తమ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం ఎదుటివారిని ఏమార్చే పద్ధతులను ఇస్లాం గర్హిస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 675

676

హదీసు 676

وَعَنْهُ قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ يَبِيعَ حَاضِرٌ لِبَادٍ, وَلَا تَنَاجَشُوا, وَلَا يَبِيعُ اَلرَّجُلُ عَلَى بَيْعِ أَخِيهِ, وَلَا يَخْطُبُ عَلَى خِطْبَةِ أَخِيهِ, وَلَا تُسْأَلُ اَلْمَرْأَةُ طَلَاقَ أُخْتِهَا لِتَكْفَأَ مَا فِي إِنَائِهَا } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ: { لَا يَسُمِ اَلْمُسْلِمُ عَلَى سَوْمِ أَخِيهِ }.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ క్రింది విషయాలను వారించారు: “పట్టణవాసి పల్లెటూరి వ్యక్తుల సరుకు అమ్మరాదు. వస్తువును కొనే ఉద్దేశం లేనపుడు ధర పెంచకండి. ఒక సోదరుడు వాణిజ్య ఒప్పందం చేసుకున్న తరువాత మరో సోదరుడు ప్రమేయం చేసుకుని బేరసారాలు జరపరాదు. ఇంకా మీలోని ఒక సోదరుడు ఒక స్త్రీకి వివాహ సందేశం పంపినమీదట, మరొకరు ఆమెకు వివాహ సందేశం పంపకూడదు. ఏ స్త్రీ కూడా మరొక స్త్రీ హక్కును కాజేసే ఉద్దేశ్యంతో ఆమెకు విడాకులు ఇప్పించే ప్రయత్నం చెయ్యకూడదు. (బుఖారీ, ముస్లిం)

“ఏ వ్యక్తీ తన సోదరుడు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మీదట దానిపై మరో ఒప్పందం చేయరాదు” అని సహీహ్ ముస్లింలో ఉంది.

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) forbade, a city-dweller to sell for a man from the desert; one to bid against another (to raise the price); that someone sell (his product) by canceling the sale of his brother; to propose (marriage) to a woman after his brother has done so; or a woman to ask to have her sister divorced in order to deprive her of what belongs to her. [Agreed upon].

Muslim has: "A Muslim must not offer a price above that offered by another Muslim."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 676

677

హదీసు 677

وَعَنْ أَبِي أَيُّوبَ اَلْأَنْصَارِيِّ ‏- رضى الله عنه ‏- [ قَالَ ]: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { مَنْ فَرَّقَ بَيْنَ وَالِدَةٍ وَوَلَدِهَا, فَرَّقَ اَللَّهُ بَيْنَهُ وَبَيْنَ أَحِبَّتِهِ يَوْمَ اَلْقِيَامَةِ } رَوَاهُ أَحْمَدُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَالْحَاكِمُ, لَكِنْ فِي إِسْنَادِهِ مَقَالٌ.‏. وَلَهُ شَاهِدٌ.

హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త ﷺ ప్రబోధించగా విన్నాను – “ఎవరయితే తల్లీ-బిడ్డల మధ్య ఎడబాటును కల్పించాడో అతనికి – అతని ఆత్మీయులకు మధ్య అల్లాహ్ ప్రళయదినాన ఎడబాటు కల్పిస్తాడు.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. తిర్మిజీ, హాకిమ్ దీనిని ప్రామాణికమైందిగా పేర్కొన్నారు)

English

Narrated Abu Ayub al-Ansari (RA): I heard Allah's Messenger (ﷺ) saying, "Whoever separates a mother from her child, May Allah separate him from his beloved ones on the Day of Resurrection." [Reported by Ahmad. at-Tirmidhi and al-Hakim graded it Sahih (authentic). However, it's chain of narrators has some weakness. But, it has a supporting narration].

సారాంశం

ఈ హదీసులో రక్త సంబంధాల ప్రాముఖ్యత నొక్కి వక్కాణించబడింది. పూర్వం అరేబియాలో బానిసలు, బానిసరాళ్ళను విక్రయించేటప్పుడు కొంతమంది ఎంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలోనే ఈ హదీసు వచ్చింది. బానిసరాళ్ళను అమ్మేటప్పుడు – యుక్త వయస్సుకు రాని పిల్లలను వారి తల్లుల నుండి వేరు చేయరాదని, అలా చేయటం వల్ల మాతృ మమతకు తీవ్రమయిన గాయం కలుగుతుందని పై హదీసులో చెప్పబడింది. ఎవరయితే ప్రాపంచిక జీవితంలో దయ, జాలి, కరుణ, వాత్సల్యం, మమతానురాగాలను మంట గలిపి బంధుత్వ సంబంధాల, రక్త సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడతాడో అతడు పరలోక జీవితంలో తన ఆత్మీయులకు, అయినవాళ్ళకి దూరమైపోతాడని హదీసులో హెచ్చరించటం జరిగింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 677

678

హదీసు 678

وَعَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { أَمَرَنِي رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ أَبِيعَ غُلَامَيْنِ أَخَوَيْنِ, فَبِعْتُهُمَا, فَفَرَّقْتُ بَيْنَهُمَا، فَذَكَرْتُ ذَلِكَ لِلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: أَدْرِكْهُمَا, فَارْتَجِعْهُمَا, وَلَا تَبِعْهُمَا إِلَّا جَمِيعًا } رَوَاهُ أَحْمَدُ, وَرِجَالُهُ ثِقَاتٌ, وَقَدْ صَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُودِ, وَابْنُ حِبَّانَ, وَالْحَاكِمُ, وَالطَّبَرَانِيُّ, وَابْنُ اَلْقَطَّانِ.

హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఇద్దరు బానిస అన్నదమ్ములను అమ్ముమని దైవప్రవక్త ﷺ నన్ను ఆజ్ఞాపించగా నేను ఆ ఇరువురినీ వేర్వేరు వ్యక్తులకు అమ్మిన మీదట దైవప్రవక్త ﷺకు సంగతి తెలియజేశాను. ఇది వినగానే ఆయన ﷺ ఇలా ఆదేశించారు: “ఆ ఇరువురినీ వాపసు తీసుకురా. ఇద్దరినీ కలిపి ఒకేచోట అమ్ము.” (ఈ హదీసును అహ్మద్ ఉల్లేఖించారు. దీన్ని అందజేసిన వారు విశ్వసనీయులు. దీనిని ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్, తబ్రానీ, ఇబ్నె ఖత్తాన్ ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.)

English

Narrated 'Ali bin Abu Talib (RA): Allah's Messenger (ﷺ) commanded me to sell two youths who were brothers. I sold them and separated them (by selling them to different people). When I made mention of that to the Prophet (ﷺ), he said, "Find them and get them back, and do not sell them except that they are together." [Reported by Ahmad, and the narrators of his chain are reliable. Indeed Ibn Khuzaimah, Ibn al-Jarud, Ibn Hibban, al-Hakim, at-Tabarani and Ibn Qattan graded it Sahih (authentic)].

సారాంశం

ఇంతకు ముందు వచ్చిన హదీసులో తల్లీ బిడ్డల మధ్య ఎడబాటు సృష్టించటం సమ్మతం కాదని చెప్పబడింది. ఈ హదీసులో అన్నదమ్ముల మధ్య సయితం ఎడబాటు సృష్టించరాదని వక్కాణించబడింది. అయితే అన్నదమ్ముల మధ్య ఏర్పడే ఎడబాటు తల్లీ బిడ్డల మధ్య ఏర్పడే ఎడబాటంత తీవ్రమైనది కాదని ప్రఖ్యాత విద్వాంసులు షౌకానీ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు.

ఈ ఎడబాటుకు వయోపరిమితి ఎంత? ఇది చిన్న పిల్లలకే వర్తిస్తుందా? పెద్దవారికి కూడానా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. యుక్త వయస్సుకు చేరిన వారి మధ్య ఎడబాటు జరిగితే అది అధర్మం కాజాలదని ప్రమాణబద్ధమైన ఆధారాల ద్వారా విదితమవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 678

679

హదీసు 679

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { غَلَا اَلسِّعْرُ بِالْمَدِينَةِ عَلَى عَهْدِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ اَلنَّاسُ: يَا رَسُولَ اَللَّهِ ! غَلَا اَلسِّعْرُ, فَسَعِّرْ لَنَا, فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِنَّ اَللَّهَ هُوَ اَلْمُسَعِّرُ, اَلْقَابِضُ, اَلْبَاسِطُ, الرَّازِقُ, وَإِنِّي لَأَرْجُو أَنْ أَلْقَى اَللَّهَ ‏-تَعَالَى‏-, وَلَيْسَ أَحَدٌ مِنْكُمْ يَطْلُبُنِي بِمَظْلِمَةٍ فِي دَمٍ وَلَا مَالٍ " } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا النَّسَائِيَّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ కాలంలో మదీనాలో వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ విషయం గురించి ప్రజలు, ‘దైవప్రవక్తా ﷺ! వస్తువుల ధరలు చాలా పెరిగిపోయాయి. తమరు మా కొరకు ధరలు నిర్ధారించండి’ అని విన్నవించుకోగా, దానికి దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ధరలు నిర్ధారించేవాడు అల్లాహ్ యే. ఆయనే తగ్గిస్తాడు, చౌకగా చేస్తాడు. మరి ధరలు పెంచేవాడు, ఉపాధిని ప్రసాదించేవాడు కూడా ఆయనే. మీలో ఏ ఒక్కరూ రక్తం మరియు ఆస్తి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ నాపై నిందమోపని స్థితిలో నేను సర్వోన్నతుడైన అల్లాహ్ ను కలుసుకోగోరుతున్నాను.” (నసాయి తప్ప మిగిలిన ఐదుగురూ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Anas bin Malik (RA): When prices were high in al-Madinah in the time of Allah's Messenger (ﷺ), the people said, "O Allah's Messenger, prices have become high, so fix them for us." Allah's Messenger (ﷺ) replied, Allah is the One Who fixes prices, Who withholds, gives lavishly and provides. And I hope that when I meet Allah, the Most High, none of you will have any claim on me for an injustice regarding blood or property." [Reported by al-Khamsah excluding an-Nasa'i; Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

వస్తువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం తరపున ఆంక్షలు విధించటం సబబు కాదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దీనివల్ల ఒకవైపు వ్యాపారులు నష్టపోవటమే గాకుండా, వర్తకులు మరోవైపు వస్తువులను నిలువ చేయటం మొదలెడతారు. ఈ నిలువలు మార్కెట్టులో సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డిమాండ్ – సప్లైల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. నిత్యావసర వస్తువులను సమకూర్చుకోలేక సామాన్య జనులు ఇబ్బందుల పాలవుతారు. బ్లాక్ మార్కెటింగ్ పురివిప్పుతుంది. పర్యవసానంగా సమాజంలో అసంతృప్తి, అశాంతి, అలజడులు రేకెత్తుతాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 679

680

హదీసు 680

وَعَنْ مَعْمَرِ بْنِ عَبْدِ اَللَّهِ ‏- رضى الله عنه ‏- عَنْ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا يَحْتَكِرُ إِلَّا خَاطِئٌ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ మామర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “పాపాత్ముడు తప్ప మరెవరూ ధరలు పెంచే సంకల్పంతో వస్తువులను నిలువ చేసి ఉంచడు.” (ముస్లిమ్)

English

Narrated Ma'mar bin 'Abdullah (RA): Allah's Messenger (ﷺ) said: "None withholds goods till the price rises but a sinner." [Reported by Muslim].

సారాంశం

మార్కెట్టులో వస్తువులకు డిమాండు ఉన్నప్పటికీ ఇంకా ధరలు పెరుగుతాయనే ఆశతో కృత్రిమ నిలువలు చేసి ఉంచటం అధర్మమని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. హదీసులో ఉపయోగించబడిన పదం (నిలువ) సర్వసామాన్యమైనది. అయితే మానవులు, పశువులు తినే వస్తువులకే ఈ పదం వర్తిస్తుందని, ఇతర వస్తువులకు వర్తించదని చాలామంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు.

వినియోగదారుల తరపున డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారస్తులు వస్తువులను దాచిపెడితే, అది ముమ్మాటికీ హరామ్ (అధర్మం)గా పరిగణించబడుతుంది. కాని రైతులు తాము పండించిన వ్యవసాయోత్పత్తులను నిలువచేసి ఉంచటం ఆక్షేపణీయం కాదు. అయితే రాజ్యంలో సర్వత్రా ఆహార వస్తువుల కొరత ఏర్పడినట్లయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు సయితం తమ గిడ్డంగులను ఖాళీచేసి ఆహార వస్తువులను మార్కెట్టులో ప్రవేశ పెట్టవలసి ఉంటుంది.

హదీసు ఉల్లేఖకులు

మామర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ నాఫె బిన్ నజ్లా బిన్ హర్సాన్ అల్ అదవీ (రదియల్లాహు అన్హు). ఈయన అబూ మామర్ గారి కుమారులు. అగ్రశ్రేణి సహాబీలలో ఒకరు. తొలి కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. తొలుత అబిసీనియాకు వలస వెళ్ళారు. మదీనాకు ప్రస్థానం చేయటంలో కొంత ఆలస్యం అయింది. కడకు మదీనాలోనే స్థిరపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 680

681

హదీసు 681

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنِ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا تَصُرُّوا اَلْإِبِلَ وَالْغَنَمَ, فَمَنِ اِبْتَاعَهَا بَعْدُ فَإِنَّهُ بِخَيْرِ اَلنَّظَرَيْنِ بَعْدَ أَنْ يَحْلُبَهَا, إِنْ شَاءَ أَمْسَكَهَا, وَإِنْ شَاءَ رَدَّهَا وَصَاعًا مِنْ تَمْرٍ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ: { فَهُوَ بِالْخِيَارِ ثَلَاثَةَ أَيَّامٍ }. وَفِي رِوَايَةٍ: لَهُ عَلَّقَهَا اَلْبُخَارِيُّ: ورَدَّ مَعَهَا صَاعاً مِنْ طَعَامٍ, لَا سَمْرَاءَ } قَالَ اَلْبُخَارِيُّ: وَالتَّمْرُ أَكْثَرُ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు: “ఒంటెలను, మేకలను విక్రయించే సమయంలో వాటి పాలను వాటి పొదుగుల్లో ఆపి ఉంచకండి. ఒకవేళ ఎవరయినా ఇలాంటి పశువులను కొంటే రెండు విషయాలలో ఏదో ఒక ఉత్తమమైన దానిని అవలంబించే స్వేచ్ఛాధికారం – పాలు పితికినమీదట – అతనికి (కొనుగోలుదారునికి) ఉంటుంది. ఒకటి: ఆ పశువును తన వద్దనే ఉంచుకోవచ్చు లేదా రెండు: ఒక ‘సా’ ఖర్జూర పండ్లకు బదులుగా పశువును వాపసు చేయవచ్చు” (బుఖారీ, ముస్లిం). “మూడు రోజుల దాకా అతను ఏదైనా నిర్ణయం గైకొనవచ్చు” అని ‘ముస్లిం’లో ఉంది. ‘ముస్లిం’లోని వేరొక ఉల్లేఖనాన్ని బుఖారీ ‘ముఅల్లఖ్’గా నకలు చేశారు. అందులో ‘దాంతోపాటు ఒక ‘సా’ ఏదైనా తినే వస్తువును వాపసు చేయాలి – గోధుమలు కాదు’ అని ఉంది. (“అనేక ఉల్లేఖనాలలో ఖర్జూర పండ్ల ప్రస్తావన వచ్చింద”ని బుఖారీ పేర్కొన్నారు)

English

Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "Do not tie up the udders of camels and goats. He who buys them after that (has been done) has two choices open to him after milking them: he may keep them if he wishes, or may return them along with one Sa' of dates." [Agreed upon].

Muslim has: "He has three days in which to decide to keep them or not."

Another narration by Muslim, which al-Bukhari reported as Mu'allaq (with a broken chain), has: "He must return with it one Sa' of any grain but wheat." [al-Bukhari said, "(One Sa' of) dates is mentioned in more narrations than not].

సారాంశం

సంతలో పశువులను కొనే సమయంలో కొనుగోలుదారులు పశువుల పొదుగులను చూచి, అవి ఇచ్చే పాల పరిమాణాన్ని కూడా చూచి మరీ కొంటూ ఉంటారు. కొనుగోలుదారుల నుండి ఎక్కువ ధరను రాబట్టే ఉద్దేశ్యంతో అమ్మకందారులు రెండు రోజులముందు నుంచే ఒక వైపు పశువులను బాగా మేత మేపుతూ, మరోవైపు పాలు పితకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. బేరం కుదిరే సమయంలో పాలు పితకగా, ఆ పశువులు మామూలుగా ఇచ్చే పాలకన్నా రెండు మూడు రెట్లు అధిక పరిమాణంలో ఇస్తాయి. నిశ్చయంగా ఇది కొనుగోలుదార్లను బోల్తాకొట్టించే ఎత్తుగడే. తీరా ఆ పశువును కొని ఇంటికి తీసుకువెళ్ళిన పిదప అది ఇచ్చే తక్కువ పాలను చూచి కొనుగోలుదారుడు నిరాశచెందుతాడు. అందుకే అమ్మే పశువుల పొదుగుల్లో పాలు ఆపి ఉంచడాన్ని దైవప్రవక్త ﷺ వారించారు. అమ్మకం దారుని ఎత్తుగడలకు మోసపోయిన కొనుగోలుదారుడు ఆ పశువును ఉంచుకోవాలా లేక వాపసు చేయాలా అనేది అతని ఇష్టాయిష్టాలకే వదిలివేయబడింది. ఒకవేళ అతను ఆ పశువును వాపసు చేయడానికే నిర్ణయించుకుంటే, అప్పటి వరకూ ఆ పశువు పాలను వాడుకున్నందుకుగాను ప్రతిఫలంగా ఒక ‘సా’ ఖర్జూరపండ్లనో, ఆహార ధాన్యాలనో ఇచ్చి పంపటం మంచిదని చెప్పబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 681

682

హదీసు 682

وَعَنِ اِبْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَنِ اِشْتَرَى شَاةً مَحَفَّلَةً, فَرَدَّهَا, فَلْيَرُدَّ مَعَهَا صَاعًا } رَوَاهُ اَلْبُخَارِيُّ. وَزَادَ اَلْإِسْمَاعِيلِيُّ: مِنْ تَمْرٍ.‏

హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : “పొదుగులో పాలు నిలిపి ఉంచబడిన మేకను కొన్న వ్యక్తి, ఆ మేకను (అమ్మకందారునికి) వాపసు చేయదలిస్తే అతడు దానితోపాటు ఒక ‘సా’ను కూడా వాపసు చేయాలి (బుఖారీ).” ఒక ‘సా’ ఖర్జూరపండ్లు అని ఇస్మాయిలీ అదనంగా నకలు చేశారు.

English

Narrated Ibn Mas'ud (RA): If anyone buys a goat whose udder has been tied up and he returned it, he must return it with one Sa'. [Reported by al-Bukhari].

al-Isma'ili added: "of dates."

సారాంశం

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) గారి ఫత్వా (తీర్పు) ఇంతకుముందు వచ్చిన హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని సూచిస్తోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 682

683

హదీసు 683

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-مَرَّ عَلَى صُبْرَةِ طَعَامٍ, فَأَدْخَلَ يَدَهُ فِيهَا, فَنَالَتْ أَصَابِعُهُ بَلَلًا , فَقَالَ: " مَا هَذَا يَا صَاحِبَ اَلطَّعَامِ? " قَالَ: أَصَابَتْهُ اَلسَّمَاءُ يَا رَسُولَ اَللَّهِ.‏ قَالَ: أَفَلَا جَعَلْتَهُ فَوْقَ اَلطَّعَامِ; كَيْ يَرَاهُ اَلنَّاسُ? مَنْ غَشَّ فَلَيْسَ مِنِّي } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : ఒక ధాన్యపు రాసి ఉన్న వైపు నుంచి దైవప్రవక్త ﷺ సాగిపోతూ దానిలోపల చేయి పెట్టారు. ఆయన ﷺ వ్రేళ్ళకు తేమ తగిలింది. “ఓ ధాన్యపు యజమానీ! ఇదేమిటీ?” అని ఆయన ﷺ ప్రశ్నించారు. ‘దైవప్రవక్తా ﷺ! ఆ ధాన్యం వర్షంలో తడిసింది’ అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. “అయితే నువ్వు తడిసిన ధాన్యాన్ని పైన అందరికీ కనిపించేలా ఎందుకు వేయలేదు? ఎవరు మోసానికి పాల్పడతారో వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన ﷺ హెచ్చరించారు. (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) once came upon a heap of grain, and when he put his hand inside it, his fingers felt some dampness. So, he asked, "What is this, O owner of the grain?" He replied, "Rain had fallen on it, O Allah's Messenger." He said, "Why did you not put it (the damp part) on the top of the foodstuff so that people might see it? Whoever cheats has nothing to do with me." [Reported by Muslim].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 683

684

హదీసు 684

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ بُرَيْدَةَ, عَنْ أَبِيهِ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ حَبَسَ اَلْعِنَبَ أَيَّامَ اَلْقِطَافِ, حَتَّى يَبِيعَهُ مِمَّنْ يَتَّخِذُهُ خَمْراً, فَقَدَ تَقَحَّمَ اَلنَّارَ عَلَى بَصِيرَةٍ }. رَوَاهُ اَلطَّبَرَانِيُّ فِي " اَلْأَوْسَطِ " بِإِسْنَادٍ حَسَنٍ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) తన తండ్రి బురైద (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఉల్లేఖించారు: “ఎవరయితే ద్రాక్షపండ్లు కోతకు వచ్చినప్పటికీ, మద్యం తయారుచేసేవానికి అమ్మే ఉద్దేశ్యంతో (పంటను) ఆపి ఉంచాడో అతడు తెలిసీ నరకాగ్నిలో ప్రవేశించిన వాడవుతాడు.” (ఈ హదీసును తబ్రానీ ‘ఔసత్’ గ్రంథంలో మంచి ఆధారాలతో ఉల్లేఖించారు)

English

Narrated 'Abdullah bin Buraidah on his father's authority (RA): Allah's Messenger (ﷺ) said: "Whoever hoards grapes in the vintage (harvest) season till he sells them to those who make wine from them, has hastily thrown himself into Hell-fire with clear knowledge." [at-Tabarani reported it in al-Awsat with a Hasan (good) chain of narrators].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 684

685

హదీసు 685

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلْخَرَاجُ بِالضَّمَانِ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَضَعَّفَهُ اَلْبُخَارِيُّ, وَأَبُو دَاوُدَ وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُودِ, وَابْنُ حِبَّانَ, وَالْحَاكِمُ, وَابْنُ اَلْقَطَّانِ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చెప్పారు : “వస్తువుకు బాధ్యత వహించిన వ్యక్తికే ఆ వస్తువు యొక్క లబ్ది – ప్రతిఫలంగా – దక్కాలి.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు. బుఖారీ మరియు అబూ దావూద్ లు దీనిని ‘బలహీనమైనది’గా ఖరారు చేశారు. తిర్మిజీ, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్, ఇబ్నె ఖత్తాన్ లు దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) said: "Any profit goes to the one who bears responsibility." [Reported by al-Khamsah. al-Bukhari and Abu Dawud graded it Da'if (weak). at-Tirmidhi, Ibn Khuzaimah, Ibn Jarud, Ibn Hibban, al-Hakim and Ibn al-Qattan graded it Sahih (authentic)].

సారాంశం

ఉదాహరణకు ఒక వస్తువును కొనే సమయంలో ఆ వస్తువులోని లోపం కొనుగోలుదారునికి తెలీదు. అతడు ఆ వస్తువు ద్వారా కొన్ని రోజులో, లేక కొన్ని వారాలపాటో లబ్ది పొందాడు. లోపం బయటపడిన తరువాత ఆ వస్తువును అమ్మకందారునికి వాపసు చేశాడు. ఈలోగా ఆ వస్తువు ద్వారా కలిగిన ప్రయోజనం కొనుగోలుదారునికే చెందాలి. ఎందుకంటే వస్తువు అతని అధీనంలో ఉంది. ఒకవేళ అతని అధీనంలో ఆ వస్తువుకు ఏదన్నా నష్టం జరిగితే ఆ నష్టం కూడా అతని ఖాతాలోనే చేరేది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 685

686

హదీసు 686

وَعَنْ عُرْوَةَ الْبَارِقِيِّ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَعْطَاهُ دِينَارًا يَشْتَرِي بِهِ أُضْحِيَّةً, أَوْ شَاةً, فَاشْتَرَى شَاتَيْنِ, فَبَاعَ إِحْدَاهُمَا بِدِينَارٍ, فَأَتَاهُ بِشَاةٍ وَدِينَارٍ, فَدَعَا لَهُ بِالْبَرَكَةِ فِي بَيْعِهِ, فَكَانَ لَوْ اِشْتَرَى تُرَابًا لَرَبِحَ فِيهِ } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا النَّسَائِيَّ. وَقَدْ أَخْرَجَهُ اَلْبُخَارِيُّ ضِمْنَ حَدِيثٍ, وَلَمْ يَسُقْ لَفْظَهُ. وَأَوْرَدَ اَلتِّرْمِذِيُّ لَهُ شَاهِداً: مِنْ حَدِيثِ حَكِيمِ بْنِ حِزَامٍ.

హజ్రత్ ఉర్వ బారిఖీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ తనకు ఖుర్బానీ పశువు లేదా మేకను కొనేందుకు ఒక దీనార్ ఇవ్వగా ఆయన ఒక్క దీనార్ లో రెండు మేకలు కొన్నారు. తరువాత ఆ రెండు మేకలలో ఒకదానిని ఒక దీనారుకు అమ్మారు. ఒక దీనారును, ఒక మేకను తీసుకుని ఆయన ﷺ సమక్షంలో హాజరయ్యారు. ఆయన ﷺ ఆ వ్యక్తి వ్యాపార లావాదేవీలలో సమృద్ధిని వొసగమని దైవాన్ని ప్రార్థించారు. అంతే, అప్పటినుంచీ ఆ వ్యక్తి మట్టిని కొన్నాసరే అందులో తప్పకుండా లాభం వచ్చేది. (‘అయిదుగురి’లో నసాయి తప్ప మిగిలిన వారు దీనిని ఉల్లేఖించారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఒక హదీసును పేర్కొన్న సందర్భంగా దీనిని ఉల్లేఖించారు. అయితే ఈ పదాలు మాత్రం నకలు చేయలేదు)

English

Narrated 'Urwa al-Bariqi (RA): The Prophet (ﷺ) gave him a Dinar to buy a sacrificial animal or a sheep. He bought two sheep with it, sold one of them for a Dinar and came back to him with a goat and a Dinar. So he invoked blessings on him in his business dealings, and he was such that if he had bought soil (of the earth) he would have made profit from it. [Reported by al-Khamsah except an-Nasa'i].

al-Bukhari also recorded it within another Hadith but did not report its exact wording.

at-Tirmidhi reported a Shahid (supporting narration of similar meaning) for it from the Hadith of Hakim bin Hizam.

సారాంశం

ఈ హదీసు ద్వారా అత్యంత ముఖ్యమైన కొన్ని మౌలిక విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి – 1) కార్యసాధకుడైన వ్యక్తి తన సంరక్షకుని సొమ్మును వ్యయపరచగలడు. అయితే ఆ మేరకు అతడు ముందుగానే సంరక్షకుని అనుమతి పొంది ఉండటం అవసరం. లేకుంటే ముందుగా విధించుకున్న షరతుల ప్రకారమే కార్యసాధకుడు మసలుకోవలసి ఉంటుంది. 2) ఇతరుల సొమ్మును తెలియబరచకుండానే అతడు విక్రయించగలడు. అయితే తెలియజేసినపుడు యజమాని తరపున సమ్మతి వ్యక్తం కావాలి. 3) ‘ఖుర్బానీ’ కొరకు కొన్న పశువును విక్రయించవచ్చు. దాని స్థానంలో ఇంకొక జంతువును కొననూవచ్చు. 4) యజమాని మేలును కాంక్షిస్తూ సమయోచితంగా వ్యవహరించిన వ్యక్తి కోసం ప్రార్థించటం (దుఆ చేయటం) మంచిది.

హదీసు ఉల్లేఖకులు

ఉర్వ బారిఖీ (రదియల్లాహు అన్హు). ఈయన ఇబ్నె జాద్ లేదా ఇబ్నె అబూ జాద్ గా కూడా పిలువబడ్డారు. ఈయన తండ్రి పేరు అయాజ్ అని కూడా చెప్పబడుతోంది. బారిఖ్ తెగతో గల సంబంధం వల్ల బారిఖీగా వ్యవహరించబడ్డారు. బారిఖ్ అనే పేరుగల పర్వతం వద్ద స్థిరపడినందున బారిఖీగా పిలువబడ్డారన్న వాదన కూడా ఉంది. సుప్రసిద్ధ సహాబీ. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈయన్ని తన పరిపాలనా కాలంలో కూఫా నగరానికి ‘ఖాజీ’గా నియమించారు. కూఫాలోనే స్థిరపడ్డారు. కూఫావాసులు ఈయన ఆధారంగా హదీసులను చెప్పేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 686

687

హదీసు 687

وَعَنِ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ شِرَاءِ مَا فِي بُطُونِ اَلْأَنْعَامِ حَتَّى تَضَعَ, وَعَنْ بَيْعِ مَا فِي ضُرُوعِهَا, وَعَنْ شِرَاءِ اَلْعَبْدِ وَهُوَ آبِقٌ, وَعَنْ شِرَاءِ اَلْمَغَانِمِ حَتَّى تُقْسَمَ, وَعَنْ شِرَاءِ اَلصَّدَقَاتِ حَتَّى تُقْبَضَ, وَعَنْ ضَرْبَةِ اَلْغَائِصِ } رَوَاهُ اِبْنُ مَاجَهْ, وَالْبَزَّارُ, وَاَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ పశువుల కడుపులో (పెరిగే) దూడను దాని జననానికి ముందే కొనడాన్ని, పొదుగులలో (నిల్వగా ఉన్న) పాలను పితకకుండానే (పశువులను) అమ్మడాన్ని, పలాయనంలో వున్న బానిసను కొనడాన్ని, విజయప్రాప్తిని అది పంపిణీకాకముందే కొనడాన్ని, సదకాలు ఒకరి అధీనంలోకి రాకముందే కొనడాన్ని, నీటిలో మునిగి వచ్చే వాడు తన ఒక మునకకు గాను వేతనం నిర్ధారించడాన్ని నిషేధించారు.” (దీనిని ఇబ్నెమాజ, బజ్జార్, దారె ఖుత్నీ బలహీన ఆధారాల ద్వారా ఉల్లేఖించారు)

English

Narrated Abu Sa'id al-Khudri (RA): The Prophet (ﷺ) forbade buying what is in the wombs of domestic animals till they give birth; selling what is in their udders; buying a runaway slave; buying (something from) the spoils of war until they are divided; buying Sadaqat before they are received; and the unknown catch (find) of a diver. [Ibn Majah, al-Bazzar and ad-Daraqutni reported it with a weak chain of narrators].

సారాంశం

ఆరు విషయాలు ఈ హదీసులో నిషేధించబడ్డాయి. వాటిలో చిట్టచివరిది నీటిలో మునిగివచ్చేవాని గురించి. ఉదాహరణకు – ఒక వ్యక్తి; సముద్ర గర్భంలోనికి పోయి దొరికిందల్లా నీ కోసం పట్టుకు వస్తాను, అయితే ఒక మునకకు గాను నీవు ఇంత డబ్బు చెల్లించుకోవలసి వస్తుందని షరతు పెడతాడు. కాని సముద్రంలో అతనికి ఏం దొరుకుతుందో, ఎంత దొరుకుతుందో అతనికీ తెలీదు, డబ్బు చెల్లించేవానికీ తెలీదు. ఇలాంటి బేరాలు నీతి నిజాయితీలకు విరుద్ధమైనవి. మోసంతో కూడుకున్నవి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 687

688

హదీసు 688

وَعَنِ اِبْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَشْتَرُوا اَلسَّمَكَ فِي اَلْمَاءِ; فَإِنَّهُ غَرَرٌ } رَوَاهُ أَحْمَدُ, وَأَشَارَ إِلَى أَنَّ اَلصَّوَابَ وَقْفُهُ.

హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “నీటిలో వున్న చేపను కొనకండి. ఎందుకంటే ఇందులో మోసం ఉంది.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. ఇది ‘మౌఖూఫ్’ కోవకు చెందిన హదీసు అని అనటం ఎక్కువ సబబు అని ఆయన అభిప్రాయపడ్డారు)

English

Narrated Ibn Mas'ud (RA): Allah's Messenger (ﷺ) said: "Do not buy the fish that is in the water, for it involves uncertainty (risk)." [Reported by Ahmad who indicated that the correct view is that it is Mawquf (saying of a Companion, i.e. Ibn Mas'ud].

సారాంశం

నీటిలో వున్న చేపలను కొనటం భవ్యం కాదని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ఎందుకంటే నీటిలో (చెరువులో) ఎన్ని చేపలున్నాయో, ఏ సైజు చేపలున్నాయో, ఏ కోవకు చెందిన చేపలున్నాయో అమ్మేవారికి గానీ, కొనేవారికిగానీ తెలీదు. తెలియని దానికి బేరమెందుకు? దీనికి బదులు చేపలు పట్టిన తరువాత వాటి పరిమాణాన్ని, బరువును, నాణ్యతను బట్టి ధర నిర్ధారించటం, క్రయవిక్రయాలు జరపటం సమంజసం.

ఈ హదీసు ‘మౌఖూఫ్’గా ఖరారు చేయబడింది. పైగా ఇది బలహీనమైనది (జయీఫ్) కూడాను. అయితే ఈ హదీసును బలపరచే ఆధారాలు కూడా ఉన్నాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 688

689

హదీసు 689

وَعَنِ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ تُبَاعَ ثَمَرَةٌ حَتَّى تُطْعَمَ, وَلَا يُبَاعَ صُوفٌ عَلَى ظَهْرٍ, وَلَا لَبَنٌ فِي ضَرْعٍ } رَوَاهُ اَلطَّبَرَانِيُّ فِي " اَلْأَوْسَطِ " وَاَلدَّارَقُطْنِيُّ. وَأَخْرَجَهُ أَبُو دَاوُدَ فِي " اَلْمَرَاسِيلِ " لِعِكْرِمَةَ, وَهُوَ اَلرَّاجِحُ.‏ وَأَخْرَجَهُ أَيْضاً مَوْقُوفاً عَلَى اِبْنِ عَبَّاسٍ بِإِسْنَادٍ قَوِيٍّ, وَرَجَّحَهُ اَلْبَيْهَقِيُّ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ పండ్లు (పండి) తినడానికి యోగ్యం కాక ముందే అమ్మడాన్ని వారించారు. అలాగే జంతువుల వీపులపై గల బొచ్చును, పొదుగులలో వున్న (పితకని) పాలను అమ్మడాన్ని కూడా వారించారు. (ఈ హదీసును తబ్రానీ తన ‘ఔసత్’లో మరియు దారె ఖుత్నీ ఉల్లేఖించారు. అబూదావూద్ ఇక్రిమ గారి మురాసిల్ లో వివరించారు. ఇదే సరైనది. దీనినే అబూదావూద్ ఇబ్నె అబ్బాస్ నుండి ‘మౌఖూఫ్’గా బలమైన ఆధారాలతో ఉల్లేఖించారు. బైహఖీ దీనిని ధృవీకరించారు.)

English

Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) forbade the selling of a fruit till it becomes ripe, or the selling of fur which is (still) on the back (of an animal) or milk which is (still) in the udder. [Reported by at-Tabarani in al-Awsat. ad-Daraqutni also reported it].

Abu Dawud reported in al-Marasil as a saying of 'Ikrimah, and that is the strongest opinion.

He also reported it Mawquf (as a saying of a Companion, i.e.) Ibn 'Abbas with a strong chain of narrators, and al-Baihaqi held it to the most correct narration.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 689

690

హదీసు 690

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ بَيْعِ اَلْمَضَامِينِ, وَالْمَلَاقِيحِ } رَوَاهُ اَلْبَزَّارُ, وَفِي إِسْنَادِهِ ضَعْفٌ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ పశువుల గర్భంలో ఉన్న దూడ (మజామీన్) అమ్మకాన్ని, మగ జంతువుల వెన్నులలో ఉండే రేతస్సు (మలాఖీహా) అమ్మకాన్ని నిషేధించారు. (దీనిని బజ్జార్ ఉల్లేఖించారు. ఈ హదీసు అందిన పరంపరలో బలహీనత ఉంది)

English

Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) forbade the sale of what is in the womb of a she-camel, and the semen that is in the body of a male-camel. [Reported by al-Bazzar and there is weakness in its Isnad (chain of narrators)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 690

691

హదీసు 691

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ أَقَالَ مُسْلِماً بَيْعَتَهُ, أَقَالَهُ اَللَّهُ عَثْرَتَهُ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِمُ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రబోధనం: “ఏ అమ్మకందారైనా అమ్మబడిన వస్తువును ఒక ముస్లిం వాపసు చేయగా వాపసు తీసుకుంటే అల్లాహ్ అతని తప్పులను, అపరాధాలను మన్నిస్తాడు.” (దీనిని అబూదావూద్, ఇబ్నె మాజాలు ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ లు దీనిని ప్రామాణికమని పేర్కొన్నారు)

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) said: "Whoever accepts back what he sold to a Muslim, Allah will forgive his fault." [Reported by Abu Dawud and Ibn Majah. Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic)].

సారాంశం

ఒక వస్తువు అమ్మకం జరిగిన తరువాత, కొనుగోలుదారుడు ఎత్తి చూపే లోపాలను అంగీకరిస్తూ ఆ వస్తువును అమ్మకందారుడు తిరిగి తీసుకుని వస్తువు వెలను ఇచ్చివేయటం త్యాగంతో కూడుకున్నదే. ఈ త్యాగానికి సిద్ధమైన వ్యక్తి పాపాలను దేవుడు క్షమిస్తాడు. పైగా అమ్మకందారుని ఈ మృదుత్వ వైఖరివల్ల మార్కెట్ లో అతని పరపతి కూడా పెరుగుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.1 క్రయ విక్రయాలు|హదీసు 691