హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.2 వ్యాపారంలో నిర్ణయాధికారం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, రెండవ అధ్యాయం: వ్యాపారంలో నిర్ణయాధికారం. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 692 – 694) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.2 వ్యాపారంలో నిర్ణయాధికారం

↑ విషయ సూచిక

باب الخيار

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

692

హదీసు 692

وَعَنْ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-, عَنْ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا اِبْتَاعَ رَجُلَانِ, فَكُلُّ وَاحِدٍ مِنْهُمَا بِالْخِيَارِ مَا لَمْ يَتَفَرَّقَا وَكَانَا جَمِيعاً, أَوْ يُخَيِّرُ أَحَدُهُمَا اَلْآخَرَ, فَإِنْ خَيَّرَ أَحَدُهُمَا اَلْآخَرَ فَتَبَايَعَا عَلَى ذَلِكَ فَقَدَ وَجَبَ اَلْبَيْعُ, وَإِنْ تَفَرَّقَا بَعْدَ أَنْ تَبَايَعَا, وَلَمْ يَتْرُكْ وَاحِدٌ مِنْهُمَا اَلْبَيْعَ فَقَدْ وَجَبَ اَلْبَيْعُ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – ఇద్దరు వ్యాపారులు పరస్పరం వ్యాపార వ్యవహారం ఖాయం చేసుకుంటున్నప్పుడు, వారిరువురూ విడిపోకుండా కలసి ఉన్నంత వరకూ – వారిద్దరికీ ఆ వ్యవహారానికి సంబంధించి హక్కు ఉంటుంది లేదా ఒకరు ఇంకొకరికి అధికారం ఇవ్వాలి. ఒకవేళ ఒకరు ఇంకొకరికి అధికారం ఇచ్చిన మీదట వ్యాపార వ్యవహారం ఖాయమైతే, ఖాయమైన తరువాత వారిద్దరూ పరస్పరం విడిపోతూ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఒప్పందాన్ని రద్దుపరచకుండా ఉంటే ఇక ఆ వ్యాపార ఒప్పందం ఖరారైనట్లే.” (బుఖారీ, ముస్లిం – ఈ వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "Both parties in a business transaction have a right to annul the transaction, so long as they have not separated and remain together; or one of them gives the other the choice (to conclude or annul the transaction); so, if one of them gives the other the choice (to conclude or annul the transaction) and then they make the transaction accordingly, the transaction then becomes binding; or if they separate after having made the transaction and none of them has annulled it, the transaction then becomes binding." [Agreed upon, and the wording is Muslim's].

సారాంశం

ఈ హదీసులో కొనుగోలుదారు – అమ్మకందారులకు క్రయవిక్రయాల ఒప్పందాన్ని కొనసాగించే లేక రద్దుపరచే హక్కు ఇవ్వబడింది. అయితే ఆ ఒప్పందం ఎన్నాళ్ళ వరకు ఉంటుందో వాళ్ళు ముందుగానే షరతులను విధించుకోవచ్చు. ఈ ఒప్పందం రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకు : ఒక షరతు ప్రకారం కొనుగోలుదారుడు వస్తువును కొన్న తరువాత దానిలోని లోపాల దృష్ట్యా అమ్మినవాడికి వాపసు చేస్తాడు. అమ్మిన వ్యక్తి మారు మాట్లాడకుండా వాపసు తీసుకొని దాని వెలను అతనికి ఇచ్చివేయవలసి ఉంటుంది. అలాగే కొనుగోలుదారుడు ఈ విధమైన షరతు కూడా విధిస్తాడు : తమ మధ్య వ్యాపార ఒప్పందం సూత్రప్రాయంగా మాత్రమే జరిగిందనీ, వస్తువు యొక్క నాణ్యతను తనిఖీచేసిన మీదటే తాను ఆ వస్తువును కొనేదీ లేనిదీ తేల్చిచెబుతానని అంటాడు. ఈ లాంఛనాలన్నీ పూర్తయిన మీదట వ్యాపార వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది.

మొత్తమ్మీద షరీయత్ ఉభయ వర్గాల కోసం అసంఖ్యాకమైన సౌలభ్యాలను కల్పించింది. ఇరు వర్గాల మధ్య లేక ఇరువురు వ్యక్తుల మధ్య తగాదాలకు, మనస్పర్ధలకు ఆస్కారం కలగకుండా ఉండాలన్నదే దీని ఉద్దేశ్యం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.2 వ్యాపారంలో నిర్ణయాధికారం|హదీసు 692

693

హదీసు 693

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { اَلْبَائِعُ وَالْمُبْتَاعُ بِالْخِيَارِ حَتَّى يَتَفَرَّقَا, إِلَّا أَنْ تَكُونَ صَفْقَةَ خِيَارٍ, وَلَا يَحِلُّ لَهُ أَنْ يُفَارِقَهُ خَشْيَةَ أَنْ يَسْتَقِيلَهُ } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا اِبْنَ مَاجَهْ, وَرَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَابْنُ خُزَيْمَةَ, وَابْنُ اَلْجَارُودِ. وَفِي رِوَايَةٍ: { حَتَّى يَتَفَرَّقَا مِنْ مَكَانِهِمَا }.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి, ఆయన తన తాతగారి నుండి చేసిన ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “కొనుగోలుదారునికీ – అమ్మకందారునికీ – వారిరువురూ పరస్పరం విడిపోయే వరకూ – (వ్యవహారాన్ని ఖాయం చేసుకునే లేక రద్దుపరచే) హక్కు ఉంటుంది. అయితే ఒప్పందం ఆ తరహాకు చెందినదై ఉండాలన్నది షరతు. ఒప్పందాన్ని ఎక్కడ ఉపసంహరించుకుంటాడోనన్న భయంతో తొందరగా విడిపోవటం ధర్మ సమ్మతం కాదు. (ఐదుగురిలో ఇబ్నె మాజా తప్ప మిగిలిన వారంతా దీనిని ఉల్లేఖించారు. దారె ఖుత్నీ, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్‌లు కూడా ఉల్లేఖించారు. వేరొక ఉల్లేఖనంలో – “వారు తమ తమ స్థానాల నుండి నిష్క్రమించకుండా ఉన్నంత వరకు” అని ఉంది.

English

Narrated 'Amr bin Shu'aib on his father's authority from his grandfather (RA): The Prophet (ﷺ) said: "The two parties (seller and buyer) in a business transaction have a choice (to annul it) until they separated (from one another), unless it is a transaction with the right to annul it attached to it; and it is not allowed for one to separated from the other for fear that he may cancel the deal." [Reported by al-Khamsah except Ibn Majah. ad-Daraqutni, Ibn Khuzaimah and Ibn al-Jarud also reported it].

Another narration has: "till they separated from their place (of transaction)."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.2 వ్యాపారంలో నిర్ణయాధికారం|హదీసు 693

694

హదీసు 694

وَعَنِ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: ذَكَرَ رَجُلٌ لِرَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنَّهُ يُخْدَعُ فِي اَلْبُيُوعِ فَقَالَ: { إِذَا بَايَعْتَ فَقُلْ: لَا خَلَابَةَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: వ్యాపారంలో తరచూ తన పట్ల మోసం జరుగుతోందని ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సమక్షంలో వాపోయాడు. దానికి దైవప్రవక్త ﷺ “నీవు క్రయవిక్రయాలు చేసేటప్పుడు ఎలాంటి మోసం జరగకూడదని (ఎదుటి వారికి) ముందే చెప్పేయాలి” అని అన్నారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Ibn 'Umar (RA): A man told Allah's Messenger (ﷺ) that he was being deceived (cheated) in business transactions, and he replied, "When you make a purchase say, 'Deceiving (cheating) is not allowed (i.e. he has the choice to return the goods if he wills).'" [Agreed upon].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.2 వ్యాపారంలో నిర్ణయాధికారం|హదీసు 694