హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 6. హజ్జ్ పుస్తకం, 6వ అధ్యాయం: హజ్‌ను కోల్పోయినవారు, ఆపబడినవారు. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 645 – 647) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
6.6 హజ్‌ను కోల్పోయినవారు, ఆపబడినవారు
باب الفوات والإحصار
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 645
عَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { قَدْ أُحْصِرَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -فَحَلَقَ وَجَامَعَ نِسَاءَهُ, وَنَحَرَ هَدْيَهُ, حَتَّى اِعْتَمَرَ عَامًا قَابِلًا } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ను కాబాగృహం వరకూ చేరకుండా ఆపటం జరిగింది. ఆయన ﷺ శిరోముండనం చేయించుకున్నారు. తన సతీమణులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఖుర్బానీ (జంతువును బలి)ఇచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఆయన ﷺ ఉమ్రా చేశారు.
(బుఖారీ)
English
Ibn ‘Abbas (RAA) narrated, ‘When the Prophet (ﷺ) was prevented from performing ‘Umrah (by Quraish) he shaved his head, had intercourse with his wives and slaughtered his animal. The next year he performed ‘Umrah to make up for the year that he had missed.’ Related by Al-Bukhari.
సారాంశం
ఈ హదీసు హుదైబియా ఒప్పందాన్ని సూచిస్తోంది. హిజ్రీ 6వ సంవత్సరంలో దైవప్రవక్త ﷺ ఇహ్రామ్ కట్టుకుని తన సహచరుల వెంట హజ్ కోసం బయలుదేరారు. హుదైబియా వద్ద ముష్రిక్కులు అడ్డుకుని, ముందుకు వెళ్ళనివ్వలేదు. ఆయన ﷺ అక్కడే ‘ఇహ్రామ్’ ను విడువవలసివచ్చింది. హుదైబియాలోనే ఖుర్బానీ ఇచ్చి క్షవరం చేయించుకున్నారు. ప్రవక్త సహచరులు కాస్సేపు తటపటాయించి, ఆ తరువాత ఇహ్రామ్ దీక్షను విరమించారు. తమ వద్ద వున్న జంతువులను ఖుర్బానీ ఇచ్చారు.
దీనినే ‘ఇహ్సార్’ అంటారు. ఇహ్సార్ అంటే అడ్డురావటం, నిలువరించటం, ముట్టడించటం, ఆటంకం సృష్టించటం అన్న అర్థాలు వస్తాయి. హజ్ యాత్రకు బయలుదేరిన వారిని దారిలో శత్రువులు అటకాయించి, హజ్ చేయకుండా అవరోధాలు సృష్టిస్తే అప్పుడేం చేయాలి? నిలువరించబడిన చోటే వారు తమ ‘ఇహ్రామ్’ను విడువాలి. అయితే ‘ఖుర్బానీ’ ఎక్కడ ఇవ్వాలన్న విషయంపై ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇహ్రామ్‌ను విడిచిన చోటే ఖుర్బానీ ఇవ్వాలని అధికసంఖ్యాక పండితులు అభిప్రాయపడ్డారు. కాని హనఫీ ధర్మవేత్తల దృష్టిలో హరమ్ పరిధిలోనే ఖుర్బానీ ఇవ్వాలి. ఎవరిద్వారానయినా ఖుర్బానీ జంతువును హరమ్కు పంపించాలి. అలా వీలుపడకపోతే మాత్రం ఆపబడిన చోటే ఖుర్బానీ ఇవ్వవచ్చు.
ఇక హజ్ నుండి ఆపబడిన వ్యక్తిపై ఖుర్బానీ వాజిబ్ (తప్పనిసరి) అవుతుందా? లేదా? అన్నది మరో ప్రశ్న. చాలామంది ధర్మవేత్తలు ‘అవున’ంటారు. ఇమామ్ మాలిక్ మాత్రం తప్పనిసరి (వాజిబ్) కాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, హుదైబియాలో నిలువరించబడినపుడు ప్రవక్త సహచరులందరివద్దా ఖుర్బానీ జంతువులు లేవనీ, ఒకవేళ ఖుర్బానీ వాజిబ్ అయివుంటే అందరికోసం వాజిబ్ అయివుండేదికదా! అని ఆయన వాదించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.6 హజ్‌ను కోల్పోయినవారు, ఆపబడినవారు|హదీసు 645
హదీసు 646
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { دَخَلَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -عَلَى ضُبَاعَةَ بِنْتِ اَلزُّبَيْرِ بْنِ عَبْدِ اَلْمُطَّلِبِ رَضِيَ اَللَّهُ عَنْهَا, فَقَالَتْ: يَا رَسُولَ اَللَّهِ! إِنِّي أُرِيدُ اَلْحَجَّ, وَأَنَا شَاكِيَةٌ، فَقَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم - " حُجِّي وَاشْتَرِطِي: أَنَّ مَحَلِّي حَيْثُ حَبَسْتَنِي " } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ జుబాఅ బిన్తె జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హా) ఇంటికి వెళ్ళగా, ‘దైవప్రవక్తా ﷺ! నాకు హజ్ చేయాలని వుంది. కాని నేను వ్యాధిగ్రస్తురాలిని’ అని ఆమె విన్నవించుకున్నది. దానికి ఆయన ﷺ ఇలా సలహా ఇచ్చారు – “హజ్ చెయ్యి. అయితే దేవా! నీవు నన్ను ఆపిన చోటే నేను ‘ఇహ్రామ్’ దీక్షను విరమిస్తాను అని షరతుపెట్టుకో.”
(ముస్లిం)
English
A’ishah (RAA) narrated, 'The Messenger of Allah (ﷺ) went to visit. Duba’ah bint Az-Zubair bin 'Abdul Muttalib. She said to him, ‘O Messenger of Allah I have made the intention to perform Hajj but I am suffering from an illness.’ He said to her, “Perform Hajj but set a condition that you shall be relieved of the Ihram whenever you are prevented (due to illness, etc.).” Agreed upon.
హదీసు ఉల్లేఖకులు
జుబాఅ బిన్తె జుబైర్ (రదియల్లాహు అన్హా). మారుపేరు ఉమ్మె హకీమ్! వంశపరంపర ఈ విధంగా ఉంది: జుబాఅ బిన్తె జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్ బిన్ అబ్దె మునాఫ్. ఈమె దైవప్రవక్త ﷺ బాబాయి కూతురు. మిఖ్దాద్ బిన్ అస్వద్ భార్య. ఈమెకు అబ్దుల్లాహ్, కరీమా అనే ఇద్దరు పిల్లలున్నారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో ఈమె మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.6 హజ్‌ను కోల్పోయినవారు, ఆపబడినవారు|హదీసు 646
హదీసు 647
وَعَنْ عِكْرِمَةَ, عَنْ اَلْحَجَّاجِ بْنِ عَمْرٍو اَلْأَنْصَارِيِّ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ كُسِرَ, أَوْ عُرِجَ, فَقَدَ حَلَّ وَعَلَيْهِ اَلْحَجُّ مِنْ قَابِلٍ قَالَ عِكْرِمَةُ. فَسَأَلْتُ اِبْنَ عَبَّاسٍ وَأَبَا هُرَيْرَةَ عَنْ ذَلِكَ? فَقَالَا: صَدَقَ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ.
హజ్రత్ ఇక్రిమ (రహిమహుల్లాహ్) హజ్జాజ్ బిన్ అమ్ర్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఆధారంగా చేసిన ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “కాలు విరగ్గొట్టబడినవాడు లేదా కుంటివాడైపోయినవాడు ‘ఇహ్రామ్’ స్థితినుండి బయటపడిపోయాడు. వచ్చే సంవత్సరం అతడు హజ్ చేయటం అనివార్యం.” – ఇక్రిమ ఇలా తెలిపారు: దీనిగురించి నేను హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)ను, అబూ హురైర (రదియల్లాహు అన్హు)ను దర్యాప్తు చేయగా, “హజ్జాజ్ బిన్ అమ్ర్ నిజం చెప్పాడు” అని వారన్నారు. (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు- తిర్మిజీ దీనిని ప్రమాణబద్ధమైనదిగా ఖరారు చేశారు)
English
'Ikrimah narrated on the authority of Al-Hajjaj bin ’Amro al-Ansari (RAA), that the Messenger of Allah (ﷺ) said: "If anyone breaks (a leg) or becomes lame (while he was performing Hajj or 'Umrah) he is released from him Ihram and must perform Hajj the next year.’ ’lkrimah said, ‘l asked Ibn 'Abbas and Abu Hurairah about this statement of Al-Hajjaj and they said that he had spoken the truth. Related by the five Imams. At-Tirmidhi graded it as Hasan.
సారాంశం
గత మూడు హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే హజ్ కొరకు ఇహ్రామ్ దీక్షబూనిన వ్యక్తి మూడు కారణాల దృష్ట్యా ఇహ్రామ్‌ను విరమించగలడు. (1) ముట్టడించబడినందువల్ల లేదా నిలువరించబడినందువల్ల – ఈ ముట్టడి ఏ కారణంతో జరిగినాసరే. (2) ఫలానా పరిస్థితి ఎదురైతే నేను ఇహ్రామ్‌ను పరిత్యజిస్తానని ముందునుంచే సంకల్పం చేసుకుని (షరతు పెట్టుకుని) ఉండటం వల్ల. (3) ఏదైనా ప్రమాదానికి గురై కాలికి గాయమవటం వల్ల.
హదీసు ఉల్లేఖకులు
(1) ఇక్రిమ (రహిమహుల్లాహ్). మారుపేరు అబూ అబ్దుల్లాహ్. ఈయన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారి బానిస. బర్బర్ తెగకు చెందినవారు. పెద్ద పండితుల కోవకు చెందినవారు. మక్కాకు చెందిన ‘ఫుకహా’ (ధర్మవేత్తల)లో ఒకరుగా పరిగణించబడేవారు. తాబయీల మధ్యతరానికి చెందిన వారు. హిజ్రీ 107లో సరిగ్గా 80 సంవత్సరాల వయస్సులో మరణించారు.
(2) హజ్జాజ్ బిన్ అమ్ర్ అన్సారీ (రదియల్లాహు అన్హు) : పూర్తి పరంపర ఇలా వుంది – హజ్జాజ్ బిన్ అమ్ర్ బిన్ గజియ అన్సారీ మాజినీ మదనీ. ప్రవక్త సహచరులలో ఒకరు. సిఫ్ఫీన్ యుద్ధంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వెంట ఉన్నారు. ఈయన రెండు హదీసులను ఉల్లేఖించారు. వాటిలో ఈ హదీసు ఒకటి.
తుది పలుకులు
“బులూగుల్ మరామ్” మొదటి భాగం దీంతో సమాప్తమయిందని రచయిత హాఫిజుల్ అస్ర్, ఖాజియుల్ ఖుజాత్ (ఛీఫ్ జస్టిస్) అబుల్ ఫజల్ అహ్మద్ బిన్ అలీ బిన్ హజర్ అల్ కినానీ అల్ అస్ఖలానీ మిస్రీ తెలిపారు. కారుణ్యప్రభువైన అల్లాహ్ ఆయన మేళ్లను కలకాలం సజీవంగా ఉంచుగాక! హిజ్రీ 827 రబీవుల్ అవ్వల్ 12వ తేదీన ఈ పనిని ముగించాననీ, రెండవ భాగం ‘వాణిజ్య పుస్తకం’ నుండి మొదలవుతుందనీ ఆయన తెలియజేశారు. అల్లాహ్ ఈ రచయితను, ఆయన తల్లిదండ్రులనూ, సమస్త ముస్లిములనూ తన కారుణ్య ఛాయలోకి తీసుకోవాలని ప్రార్థన. మనకు అల్లాహ్‌యే చాలు. ఆయనే అత్యుత్తమ కార్యసాధకుడు!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.6 హజ్‌ను కోల్పోయినవారు, ఆపబడినవారు|హదీసు 647
You must be logged in to post a comment.