హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 5.0 ఉపవాసాల నియమాలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు, 5.0: ఉపవాస నియమాలు. ఈ అధ్యాయంలో 25 హదీసులు (హదీసు 527 – 551) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

5.0 ఉపవాస నియమాలు

↑ విషయ సూచిక

كتاب الصيام

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

527

హదీసు 527

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ, إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا, فَلْيَصُمْهُ } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవ్వరూ రమజాన్‌కు ముందు ఒకటి లేక రెండు ఉపవాసాలు ఉండకండి. అయితే ఎవరన్నా అంతకు ముందు నుంచి ఉపవాసవ్రతాలు పాటిస్తూ వస్తున్నట్లయితే ఆ రోజు ఉపవాసాన్ని పూర్తిచేసుకోవచ్చు.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: "None of you should fast a day or two before the (beginning of the) mouth of Ramadan, unless it is a day on which one is in the habit of fasting (i.e. voluntary fasting that coincides with that day).” Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 527

528

హదీసు 528

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَنْ صَامَ اَلْيَوْمَ اَلَّذِي يُشَكُّ فِيهِ فَقَدْ عَصَى أَبَا اَلْقَاسِمِ ‏- صلى الله عليه وسلم ‏-} وَذَكَرَهُ اَلْبُخَارِيُّ تَعْلِيقًا, وَوَصَلَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ.

హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఎవరయితే సందేహాస్పదమయిన రోజున ఉపవాసం (రోజా) పాటించాడో అతడు అబుల్ ఖాసిం ﷺకు అవిధేయత చూపాడు.” (బుఖారీ దీనిని ‘ముఅల్లఖ్’గా పేర్కొన్నారు. ఐదుగురూ దీనిని ‘మౌసూల్’గా పరిగణించారు. కాగా; ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికంగా ఖరారు చేశారు)

English

’Ammar bin Yasir (RAA) narrated, ‘Whoever fasts the day of doubt he has then disobeyed Abu al-Qasim (the Prophet).’ Related by the five Imams, and Ibn Khuzaimah and Ibn Hibban graded it as Sahih

సారాంశం

ఇస్లామీయ షరీయత్ ప్రకారం ఉపవాసాలు మొదలెట్టినా (రమజాన్) నెలవంకను చూసి మొదలెట్టాలి. ఉపవాసాలు విరమించినా (షవ్వాల్) నెలవంకను చూసి మరీ విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనిపించకపోతే ఆ మరుసటి రోజు షరీయత్‌పరంగా సందేహాస్పదమయిన రోజుగా భావించబడుతుంది. ఆ దినాన ఉపవాసం ఉండటం భావ్యం కాదు. ఈ సందర్భంగా ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కలపై ఆధారపడటం కూడా షరీయత్ స్ఫూర్తికి విరుద్ధం. ఖగోళ శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు కూడా అనేకసార్లు నిజం కాలేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 528

529

హదీసు 529

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا [ قَالَ ]: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا, وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا, فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ: { فَإِنْ أُغْمِيَ عَلَيْكُمْ فَاقْدُرُوا [ لَهُ ]. ثَلَاثِينَ }. وَلِلْبُخَارِيِّ: { فَأَكْمِلُوا اَلْعِدَّةَ ثَلَاثِينَ }. وَلَهُ فِي حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلَاثِينَ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “నెలవంకను చూసిన మీదట మీరు ఉపవాసాలుండండి. (పండుగ కోసం) నెలవంకను చూసిన మీదట ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయివుంటే లెక్క వేసుకోండి.” (ముత్తఫఖున్ అలైహి). ‘ముస్లిం’లోని వాక్యం ఇలా వుంది: “ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే 30 రోజుల లెక్క కట్టండి.” బుఖారీలో ఈ విధంగా ఉంది – “మరి 30 రోజుల లెక్కను పూర్తిచేయండి.” బుఖారీలోనే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది: “మరి మీరు షాబాన్ నెలలోని 30 రోజులను గణించండి.”

English

Ibn 'Umar (RAA) narrated, ‘I heard the Messenger of Allah (ﷺ) say, "Start fasting after you have seen it (i.e. the new crescent) and end the fast (at the end of the month) when you see it. If it is overcast and cannot be seen, then estimate its sighting (i.e. presume that Sha‘ban lasted for thirty days)." Agreed upon. Muslim narrated, "If it is too overcast to be seen then presume that it (Sha'ban) lasted for thirty days."In another narration by al-Bukhari, "wait, until thirty days of it (Sha’ban) have passed."

Al-Bukhari reported on the authority of Abu Hurairah, “Complete the days of Sha’ban as thirty days.”

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 529

530

హదీసు 530

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { تَرَاءَى اَلنَّاسُ اَلْهِلَالَ, فَأَخْبَرْتُ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَنِّي رَأَيْتُهُ, فَصَامَ, وَأَمَرَ اَلنَّاسَ بِصِيَامِهِ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ الْحَاكِمُ وَابْنُ حِبَّانَ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “ప్రజలు నెలవంకను దర్శించసాగారు. నేను కూడా దైవప్రవక్త ﷺకు నెలవంకను చూశానని సమాచారం అందజేశాను. ఆయన ﷺ స్వయంగా ఉపవాసం ఉండటమే గాక, ఉపవాసాలుండమని జనులను ఆజ్ఞాపించారు.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – హాకిమ్, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)

English

Ibn ’Umar (RAA) narrated, ‘The people were trying to sight the new moon (of Ramadan.) and when I reported to the Messenger of Allah (ﷺ) that I had seen it, he fasted and commanded people to fast.’ Related by Abu Dawud, and Al-Hakim and Ibn Hibban graded it as Sahih.

సారాంశం

ఈ హదీసులన్నింటి ద్వారా అవగతమయ్యేదేమిటంటే నెలవంకను చూసి ఉపవాసాలు మొదలెట్టాలి. నెలవంకను చూసిన మీదట ఉపవాసాలు విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనబడకపోతే ఆ నెలను 30 రోజుల నెలగా పరిగణించాలి. అలాగే రమజాన్ నెల 29వ తేదీన నెలవంక దర్శనమివ్వకపోతే 30 రోజుల ఉపవాసాలు పూర్తిచేయాలి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉన్న కారణంగా నెలవంక కనబడక, ఆకాశం నిర్మలంగా ఉన్నచోట నెలవంక కనబడితే దీని ఆధారంగా ఆ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలన్నింటిలో ఉపవాస వ్రతాలు ప్రారంభించాలి. పండుగ జరుపుకునే విషయంలో కూడా ఈ విధానాన్నే అనుసరించాలి. ఒకవేళ చంద్రుడు దర్శనమిచ్చిన ప్రాంతం భౌగోళికంగా పూర్తిగా భిన్నమైనదైనపుడు దాన్ని లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేదు. ఉపవాసం ఉండటానికి నమ్మకస్థుడైన ఒక వ్యక్తి నెలవంకను చూసినట్లు సాక్ష్యమిస్తే సరిపోతుంది. కాని పండుగ జరుపుకోవటానికి మాత్రం ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం ఇవ్వాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 530

531

హదీసు 531

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا أَنَّ أَعْرَابِيًّا جَاءَ إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: { إِنِّي رَأَيْتُ اَلْهِلَالَ, فَقَالَ: " أَتَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اَللَّهُ? " قَالَ: نَعَمْ.‏ قَالَ: " أَتَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اَللَّهِ? " قَالَ: نَعَمْ.‏ قَالَ: " فَأَذِّنْ فِي اَلنَّاسِ يَا بِلَالُ أَنْ يَصُومُوا غَدًا" } رَوَاهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ وَرَجَّحَ النَّسَائِيُّ إِرْسَالَهُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి తాను నెలవంకను చూచినట్లు విన్నవించుకున్నాడు. “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని నీవు సాక్ష్యమిస్తున్నావా?” అని దైవప్రవక్త ﷺ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. ‘అవున’న్నాడా వ్యక్తి. “ముహమ్మద్ దేవుని ప్రవక్త అని నీవు సాక్ష్యమిస్తున్నావా?” అని నిలదీశారు ఆ వ్యక్తిని. దానికతను ‘అవును’ అన్నాడు. అప్పుడాయన ﷺ ఇలా అన్నారు : “బిలాల్! లేవండి. రేపు ప్రజల్ని ఉపవాసాలుండమని ప్రకటించండి.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు – నసాయి మాత్రం దీనిని ‘ముర్సల్’గా భావించారు)

English

Ibn ‘Abbas (RAA) narrated, ‘A Bedouin came to the Prophet and said, ‘I have sighted the crescent (of Ramadan). He then said to him, "Do you testify that there is none worthy of worship but Allah?” The Bedouin said, ‘Yes.’ He asked him again, "Do you testify that Muhammad is the Messenger of Allah (ﷺ)?" The man replied, ‘Yes.’ The Messenger of Allah (ﷺ) there upon said, "O Bilal! Announce to the people to (start) fasting tomorrow." Related by the five Imams. Ibn Khuzaimah and Ibn Hibban graded it as Sahih. An-Nasa'i said that it is most probably Mursal (a Hadith in which the link between the Successor (Tabi’i) and the Prophet (ﷺ) is missing.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 531

532

హదీసు 532

وَعَنْ حَفْصَةَ أُمِّ اَلْمُؤْمِنِينَ رَضِيَ اَللَّهُ عَنْهَا, أَنَّ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ لَمْ يُبَيِّتِ اَلصِّيَامَ قَبْلَ اَلْفَجْرِ فَلَا صِيَامَ لَهُ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَمَالَ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ إِلَى تَرْجِيحِ وَقْفِهِ, وَصَحَّحَهُ مَرْفُوعًا اِبْنُ خُزَيْمَةَ وَابْنُ حِبَّانَ. وَلِلدَّارَقُطْنِيِّ: { لَا صِيَامَ لِمَنْ لَمْ يَفْرِضْهُ مِنَ اَللَّيْلِ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) తెలిపారు : “ఎవరయితే ఉషోదయానికి ముందే ఉపవాస సంకల్పం చేసుకోలేదో వారి ఉపవాసం ఉపవాసమే కాదు.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు – ఈ హదీసు ‘మౌఖూఫ్’ అయి ఉంటుందని తిర్మిజీ, నసాయి తలపోశారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్‌లు మాత్రం ‘మర్ఫూ’గా పరిగణించారు) దారెఖుత్నీలోని ఉల్లేఖనంలో ఇలా వుంది: “ఎవరయితే రాత్రిపూట ఉపవాసాన్ని తన కొరకు తప్పనిసరిగా చేసుకోలేదో అతని ఉపవాసం నెరవేరదు.”

English

The mother of the believers, Hafsah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Whoever does not form his intention to fast before to fajr, his fasting will not be accepted.” Related by the five Imams, but At-Tirmidhi and An-Nasa’i consider it to be related by Hafsah and not connected to the Prophet (ﷺ). Imam Ad-Daraqutni transmitted, "No fasting is accepted for one who does not form the intention (to fast) the night before.”

సారాంశం

తెల్లవారకముందే ఫర్జ్ రోజుల సంకల్పం చేసుకోవటం అవసరమని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. సంకల్పం (నియ్యత్) సూర్యాస్తమయం మొదలుకుని ఫజ్ర్ నమాజ్ వేళ వరకూ ఎప్పుడయినా చేసుకోవచ్చు. ఉపవాసం ఒక ఆచరణ. ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి గనక రోజా (ఉపవాసం) అనే ఆచరణ కోసం కూడా సంకల్పం అనివార్యం. ప్రతిరోజూ ఉపవాసానికి ముందు సంకల్పం అవసరమవుతుంది. అయితే సంకల్పం కోసం ప్రత్యేకంగా నోటితో పలకవలసిన అవసరం లేదు. మనసులో దీక్ష బూనితే సరిపోతుంది. దైవప్రవక్త ﷺగానీ, ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హు)గానీ సంకల్ప వచనాలు నోటితో పలికిన దాఖలాలేమీ లేవు.

హదీసు ఉల్లేఖకులు

హఫ్సా బిన్తె ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హా). మొదట ఈమె ఖునైస్ బిన్ హుజాఫా సహ్మీ నికాహ్‌లో ఉన్నారు. బద్ర్ యుద్ధ సందర్భంగా ఈయన మరణించారు. తరువాత దైవప్రవక్త ﷺ ఆమెను నికాహ్ చేసుకుని తన దాంపత్య జీవితంలోనికి తెచ్చుకున్నారు. ఇది హిజ్రీ 3వ సంవత్సరంలో జరిగిన సంఘటన. ఈమె 60 ఏళ్ల వయస్సులో – హిజ్రీ 45వ సంవత్సరంలో- మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 532

533

హదీసు 533

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { دَخَلَ عَلَيْنَا اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-ذَاتَ يَوْمٍ.‏ فَقَالَ: " هَلْ عِنْدَكُمْ شَيْءٌ? " قُلْنَا: لَا.‏ قَالَ: " فَإِنِّي إِذًا صَائِمٌ " ثُمَّ أَتَانَا يَوْمًا آخَرَ, فَقُلْنَا: أُهْدِيَ لَنَا حَيْسٌ, فَقَالَ: " أَرِينِيهِ, فَلَقَدْ أَصْبَحْتُ صَائِمًا " فَأَكَلَ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ఒకనాడు దైవప్రవక్త ﷺ మా వద్దకు వచ్చి, “మీ దగ్గర (తినడానికి) ఏ వస్తువు అయినా ఉందా?” అని అడిగారు. ‘లేదు’ అని మేము సమాధానమిచ్చాము. “అలాగైతే నేను (ఈ రోజు) ఉపవాసం ఉంటాను” అన్నారు. అలాగే మరో రోజు ఆయన వచ్చినపుడు ‘(ఎక్కడినుంచో) పాయసం కానుకగా పంపబడింది’ అని మేము చెప్పాము. దానికి ఆయన ﷺ, “ఏదీ నాకు చూపెట్టండి, పొద్దున్నుంచి నేను ఉపవాసం ఉన్నాను” అని అన్నారు. తరువాత ఆయన ﷺ పాయసం ఆరగించారు. (ముస్లిం)

English

'A’isha (RAA) narrated, ‘One day the Messenger of Allah (ﷺ) entered my house and said, “ls there anything here (to eat)?" I said, ‘NO,’ He said, “I shall then be fasting (today)." Then he came to us another day and we said to him, 'Someone has offered us some hais as a gift.’ He then said, "Show it to me. I had been fasting since this morning, “and he ate from it ( as it was a voluntary fast and not during the obligatory fasting of Ramadan). Related by Muslim.

సారాంశం

ఇది నఫిల్ ఉపవాసాలకు సంబంధించినదేగాని, రమజాన్ మాసంలో పాటించే ఫర్జ్ ఉపవాసాల వ్యవహారం కాదు. నఫిల్ ఉపవాసాల సంకల్పం తెల్లవారకమునుపే చేసుకోవలసిన అవసరం లేదు. సూర్యోదయం తరువాత కూడా ఈ సంకల్పం చేయవచ్చు. నలుగురు ఇమాములలో ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) గారు, నఫిల్ ఉపవాసం కోసం కూడా తెల్లవారక ముందే సంకల్పం అవశ్యమని భావిస్తున్నారు. కాని హదీసులో ఈ మేరకు ఎలాంటి ఆంక్ష లేదు.

నఫిల్ ఉపవాసాలు అకారణంగా కూడా – మధ్యాంతరంలో – విరమించవచ్చని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ముగ్గురు ఇమాముల (ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్)తో పాటు పెక్కుమంది ధర్మవేత్తలు దీంతో ఏకీభవించారు. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో అకారణంగా రోజాను మధ్యలో విరమించటం ధర్మసమ్మతం కాదు. ఎవరయినా విందుకు ఆహ్వానిస్తేనే నఫిల్ ఉపవాసాన్ని విరమించవచ్చనీ, వేరితర కారణాలపై విరమించరాదని ఆయన అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 533

534

హదీసు 534

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا يَزَالُ اَلنَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا اَلْفِطْرَ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِلتِّرْمِذِيِّ: مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { قَالَ اَللَّهُ عَزَّ وَجَلَّ أَحَبُّ عِبَادِي إِلَيَّ أَعْجَلُهُمْ فِطْرًا }.

హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “ప్రజలు ఉపవాసాన్ని విరమించటం (ఇఫ్తార్ చేయటం)లో శీఘ్రత కనబరచినంత కాలం క్షేమంగా ఉంటారు.” (ముస్లిం)

తిర్మిజీలో హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రవచనం ఈ విధంగా ఉంది : ఆయన ﷺ ఇలా అన్నారు – “నా దాసులలో ఇఫ్తార్ కొరకు త్వరపడేవారే నాకు అత్యంత ప్రియతములు” అని అల్లాహ్ సెలవిచ్చాడు.

English

Sahl bin Sa'd (RAA) narrated That the Messenger of Allah (ﷺ) said: "People will always be fine (on the right path, or following the Sunnah) as long as they hasten to break their fast (in Ramadan)." Agreed upon.

Abu Hurairah (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) said: "Allah, the Most Exalted said: “Those among My servants, who hasten to break their fast, are the most beloved (or dearest)to Me.” Related by At-Tirmidhi.

సారాంశం

సూర్యాస్తమయం అయిందని ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయిన తరువాత అనవసరంగా కాలయాపన చేయకుండా – తొందరగా-ఇఫ్తార్ చేసుకోవాలి. ఆలస్యంగా ఇఫ్తార్ చేయటం యూదుల, క్రైస్తవుల పద్ధతి. కనుక మనం దైవప్రవక్త ﷺ ప్రబోధానుసారం ఇఫ్తార్ కొరకు వేగిరపడాలి. కాస్త ఆలస్యంగా ఇఫ్తార్ చేస్తే ఎక్కువ పుణ్యం దక్కుతుందనుకొని-ఉద్దేశ్యపూర్వకంగా – ఆలస్యం చేయటం బిద్‌అత్ క్రిందికి వస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 534

535

హదీసు 535

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ تَسَحَّرُوا فَإِنَّ فِي اَلسَّحُورِ بَرَكَةً } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు- “సహరీని భుజించండి. ఎందుకంటే అందులో ఎంతో శుభం ఉంది.” (బుఖారీ, ముస్లిం)

English

Anas (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Eat the suhur (pre-dawn meal), for there are blessings in this meal.” Agreed upon.

సారాంశం

సహరీ తినవలసిన ఆవశ్యకతను ఈ హదీసు సూచిస్తోంది. ఎందుకంటే యూదులు, క్రైస్తవులు సహరీ ఏర్పాట్లు చేసుకోరు. వారికి – మనకూ మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. సహరీ భుజించటం వల్ల ఉపవాసి నిస్సత్తువకు, నీరసానికి గురికాకుండా ఉంటాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 535

536

హదీసు 536

وَعَنْ سَلْمَانَ بْنِ عَامِرٍ اَلضَّبِّيِّ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا أَفْطَرَ أَحَدُكُمْ فَلْيُفْطِرْ عَلَى تَمْرٍ, فَإِنْ لَمْ يَجِدْ فَلْيُفْطِرْ عَلَى مَاءٍ, فَإِنَّهُ طَهُورٌ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ وَابْنُ حِبَّانَ وَالْحَاكِمُ.

హజ్రత్ సల్మాన్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీలో ఎవరయినా ఉపవాసాన్ని విరమించేటప్పుడు ఖర్జూరంతో ఇఫ్తార్ చేయాలి. ఖర్జూరం గనక లభ్యం కాకపోతే మంచి నీరుతో ఇఫ్తార్ చేయండి. ఎందుకంటే అది పరిశుద్ధమైనది.” (దీనిని ఐదుగురూ ఉల్లేఖించారు – ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)

English

Sulaiman bin ’Amir Ad-Dabbi (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “When one of you is breaking his fast, he should eat some dates. If dates are not available, then break it with some water, for water is purifying.’’ Related by the five lmams. Ibn Khuzaimah, Ibn Hibban and al-Hakim graded it as Sahih.

సారాంశం

వీలయినంతవరకు ఖర్జూర పండ్లతో ఇఫ్తార్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఖర్జూరం జీర్ణకోశానికి శక్తినీ, పుష్టినీ సమకూరుస్తుంది. పగలల్లా ఉపవాసం ఉండటం వలన కలిగిన బలహీనతను అది చాలా వరకు దూరం చేస్తుంది. ఒకవేళ ఖర్జూరం గనక దొరక్కపోతే మంచినీళ్ళతోనే ఉపవాసాన్ని విరమించాలి. పండ్లు దొరక్కపోతే ఎండు ఖర్జూరంతోనే ఇఫ్తార్ చేయాలి. అదీ లభ్యం కాని పరిస్థితిలో మంచినీరు త్రాగాలి.

హదీసు ఉల్లేఖకులు

సల్మాన్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు). పూర్తి వంశపరంపర ఇలా ఉంది: సల్మాన్ బిన్ ఆమిర్ బిన్ ఔస్ బిన్ హుజ్ర్ బిన్ అమ్ర్ బిన్ హారిస్ జబ్బి. ప్రఖ్యాత సహచరులు. బస్రాలో స్థిరపడ్డారు. దైవప్రవక్త ﷺ కాలంలోనే వృద్ధ సహాబీలలో ఒకరుగా పేరుపడ్డారు. ముఆవియ పరిపాలనా కాలం వరకూ బ్రతికి ఉన్నారని ప్రతీతి. మరో కథనం ప్రకారం జమల్ యుద్ధంలో అమరగతి నొందారు. అప్పటికి ఆయనకు నూరేళ్ళు నిండాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 536

537

హదీసు 537

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنِ اَلْوِصَالِ, فَقَالَ رَجُلٌ مِنَ اَلْمُسْلِمِينَ: فَإِنَّكَ تُوَاصِلُ يَا رَسُولَ اَللَّهِ? قَالَ: " وَأَيُّكُمْ مِثْلِي? إِنِّي أَبِيتُ يُطْعِمُنِي رَبِّي وَيَسْقِينِي ".‏ فَلَمَّا أَبَوْا أَنْ يَنْتَهُوا عَنِ اَلْوِصَالِ وَاصَلَ بِهِمْ يَوْمًا, ثُمَّ يَوْمًا, ثُمَّ رَأَوُا اَلْهِلَالَ, فَقَالَ: " لَوْ تَأَخَّرَ اَلْهِلَالُ لَزِدْتُكُمْ " كَالْمُنَكِّلِ لَهُمْ حِينَ أَبَوْا أَنْ يَنْتَهُوا } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ‘విసాల్’ను (నిరంతరం – ఎడతెగకుండా – ఉపవాసముండటాన్ని) వారించారు. ‘దైవప్రవక్తా! మరి తమరు ఎడతెగకుండా ఉపవాసాలుంటున్నారు కదా!’ అని ముస్లింలలోని ఒక వ్యక్తి ప్రశ్నించగా; “మీలో నా లాంటి వారెవరున్నారు? నేను రాత్రి నా ప్రభువు సమక్షంలో గడుపుతాను. ఆయన నాకు తినిపిస్తాడు, త్రాగిస్తాడు” అని ఆయన ﷺ సెలవిచ్చారు. ఎంతకీ ప్రజలు వినకపోవటంతో ఆయన ﷺ వారితో కలసి ఒక రోజు, రెండవ రోజు కూడా ఎడతెగని ఉపవాసం (విసాల్) మొదలెట్టారు. ఆనాడు నెలవంక కనిపించటంతో ఆయన ﷺ తన సహచరుల నుద్దేశ్యించి, “ఈ రోజు నెలవంక దర్శనమివ్వబట్టి సరిపోయింది. లేకుంటే మీ కోసం మరిన్ని రోజులు ‘విసాల్’ చేసేవాణ్ణి” అని అన్నారు. అంటే ఆయన ﷺ తన ప్రియసహచరులు తన మాటను లెక్క చేయనందుకు వారిని శిక్షించదలిచారన్నమాట! (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated, The Messenger of Allah (ﷺ) forbade us from practicing wisal in fasting (i.e. fasting continuously without breaking one’s fast in the evening or eating before the following dawn). So a man said to him, ‘But you practice wisal O Messenger of Allah!’ The Prophet Allah (ﷺ) replied, “Which one of you is like me? I am given food and drink during my sleep by Allah." So when people refused to stop wisal, the Prophet fasted day and night continuously along with them for a day and then another day and then they saw the crescent (of the new month of Shawwal). The Prophet said to them, "If the crescent had not appeared, I would have made you fast for a longer period." That was a punishment for them because they refused to stop (practicing Wisal). Agreed upon.

సారాంశం

‘విసాల్’ అవాంఛనీయం అని హదీసులో చెప్పబడింది. విసాల్ అంటే ఏమీ తినకుండా, త్రాగకుండా నిరంతరం ఉపవాసాలుండటం అని అర్థం. ఇలాంటి అతివాదాన్ని ఇస్లాం ఇష్టపడదు. దేవుడు తన దాసులను కష్టాల్లో పడవేయదలచుకోడు. అయితే దైవప్రవక్త ﷺ వ్యవహారం ప్రత్యేకమైనది. దైవసన్నిధిలో ఆయన ﷺ చేసే ధ్యానం వల్ల ఇతోధిక శక్తి ఆయనకు లభించేది. ప్రవక్త ﷺ వారి ఉపవాసాలను గమనించిన సహచరులు, తాము కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న తపనతో నిరంతర ఉపవాసాలు ఆరంభించారు. కాని దైవప్రవక్త ﷺ తన సహచరులను గట్టిగా వారించారు. అప్పటికీ వారు వెనుకాడకపోవటంతో, వారిని దండించే ఉద్దేశ్యంతో దైవప్రవక్త ﷺ కూడా వారితో పాటే ఉపవాస దీక్ష మొదలెట్టారు. అంతలోనే నెలవంక దర్శనమిచ్చింది. “చంద్రుడు కనిపించకుండా ఉంటే ఈ దీక్షను మరింత సుదీర్ఘం చేసి ఉండేవాడిని. అప్పటికిగాని మీకు బోధపడేది కాదు” అని చురక అంటించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 537

538

హదీసు 538

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ لَمْ يَدَعْ قَوْلَ اَلزُّورِ وَالْعَمَلَ بِهِ, وَالْجَهْلَ, فَلَيْسَ لِلَّهِ حَاجَةٌ فِي أَنْ يَدَعَ طَعَامَهُ وَشَرَابَهُ } رَوَاهُ اَلْبُخَارِيُّ, وَأَبُو دَاوُدَ وَاللَّفْظُ لَهُ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: “ఎవరయితే అబద్ధం చెప్పటం, అబద్ధంపై ఆచరించటం విడనాడలేదో, మూర్ఖత్వపు ధోరణిని వదలలేదో అతడు అన్నపానీయాలను పరిత్యజించటంపట్ల అల్లాహ్‌కు ఏ మాత్రం ఆసక్తి లేదు.” (బుఖారీ, అబూదావూద్ – హదీసు వాక్యాలు మాత్రం అబూదావూద్‌లోనివి)

English

Abu Hurairah (BAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Whoever does not give up forged speech and evil actions and does not abandon foolishness, Allah is not in need of his leaving food and drink (i.e. Allah will not accept his FASTING).” Related by Al-Bukhari and Abu Dawud, and the wording is from the latter.

సారాంశం

ఉపవాసి అనేవాడు అబద్ధాన్ని, బూటకపు ప్రేలాపనలను, మూర్ఖత్వపు చేష్టలను పూర్తిగా విడనాడాలని ఈ హదీసు చెబుతోంది. అసత్య ప్రకటనలవల్ల, వ్యర్థ ప్రేలాపనలవల్ల ఉపవాసంలోని ఆధ్యాత్మికత హరించుకుపోతుంది. అందుకే ఉపవాస దీక్షకు పూనుకున్న వ్యక్తి నీతిబాహ్యమైన విధానాలకు, అనర్థదాయకమైన పోకడలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉపవాసం ద్వారా దేవుడు తన దాసులలో దైవభీతిని, సాత్వికతను, ఆత్మ నిగ్రహాన్ని పెంపొందించగోరుతున్నాడు. అబద్ధం, దగా, మోసం, అవినీతి, అరాచకం వంటి చెడుల నుంచి కాపాడదలుస్తున్నాడు. ఈ లక్ష్యాలే గనక ఉపవాస వ్రతం ద్వారా అతనికి ప్రాప్తించకపోతే పొద్దస్తమానం అతడు ఆకలి దప్పులతో బాధపడి ప్రయోజనం ఏమీలేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 538

539

హదీసు 539

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُقَبِّلُ وَهُوَ صَائِمٌ, وَيُبَاشِرُ وَهُوَ صَائِمٌ, وَلَكِنَّهُ كَانَ أَمْلَكَكُمْ لِإِرْبِهِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ. وَزَادَ فِي رِوَايَةٍ: { فِي رَمَضَانَ }.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు : దైవప్రవక్త ﷺ ఉపవాస స్థితిలో తన భార్యను ముద్దుపెట్టుకునేవారు, కౌగిలించుకునేవారు. అయితే ఆయన ﷺకు మీకన్నా అధికంగా తనపై పూర్తి అదుపు, నిగ్రహం ఉండేవి. (బుఖారీ, ముస్లిం – ఈ వాక్యాలు మాత్రం ముస్లింలోనివి) ‘ఆయన ﷺ ఈ రెండు పనులనూ రమజాన్ నెలలో చేసేవార’ని వేరొక ఉల్లేఖనంలో ఉంది.

English

'A’isha (RAA) narrated that The Messenger of Allah (ﷺ) would kiss and embrace (his wives) while fasting, for he had the most control of all of you over his desires.’ Agreed upon and the wording is from Muslim, who added in a narration, ‘In Ramadan.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 539

540

హదీసు 540

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-اِحْتَجَمَ وَهُوَ مُحْرِمٌ, وَاحْتَجَمَ وَهُوَ صَائِمٌ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ‘ఇహ్రామ్’ కట్టుకుని ఉన్నప్పుడు, ఉపవాసస్థితిలో ఉన్నప్పుడు (కూడా) శరీరానికి సూది గుచ్చుకున్నారు (అంటే చెడు రక్తాన్ని తీశారు). (బుఖారీ)

English

Ibn 'Abbas (RAA) narrated that The Messenger of Allah (ﷺ) had himself cupped while he was in a state of Ihram, and had himself cupped while he was fasting.’’ Related by Al-Bukhari.

సారాంశం

సూది గుచ్చటం‌వల్ల (శస్త్ర చికిత్స వల్ల, శరీరంలో ఎక్కడైనా పేరుకుని ఉన్న చెడు రక్తాన్ని, చీము నెత్తురును తొలగించటం వల్ల) ఉపవాసానికిగానీ, ఇహ్రామ్ దీక్షకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లదని ఈ హదీసు వల్ల స్పష్టమవుతున్నది. అయితే ఈ సాహసానికి పూనుకునే ముందు ఉపవాసులు తమలో గల శక్తినీ, ఓపికను సరిగ్గా బేరీజు వేసుకోవాలి. నీరసంవల్ల ఉపవాసం భంగమయ్యే ప్రమాదముంటే దాని జోలికి పోకూడదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 540

541

హదీసు 541

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَتَى عَلَى رَجُلٍ بِالْبَقِيعِ وَهُوَ يَحْتَجِمُ فِي رَمَضَانَ.‏ فَقَالَ: " أَفْطَرَ اَلْحَاجِمُ [ وَالْمَحْجُومُ ] " } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا اَلتِّرْمِذِيَّ, وَصَحَّحَهُ أَحْمَدُ, وَابْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ.

హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ‘బఖీ’లో ఒక వ్యక్తిని సమీపించారు. అతడు రమజాన్ (నెల)లో శరీరం నుంచి రక్తం తీస్తున్నాడు. ఆయన ﷺ అతణ్ణి చూచి, ‘శరీరానికి సూదులు పొడిచే, పొడిపించుకునే వారిద్దరి ఉపవాసం భంగమైనట్టే’ అని అన్నారు. (‘ఐదుగురి’లో తిర్మిజీ తప్ప మిగిలినవారు దీనిని ఉల్లేఖించారు. అహ్మద్, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు)

English

Shaddad bin Aus (RAA) narrated that The Messenger of Allah (ﷺ) came across a man in Al-Baqi' (in Madinah) who was having himself cupped in Ramadan., and said to him, “The one who cups and the one who is being cupped have both broken their fast." Related by the five Imams except for At-Tirmidhi. Ahmad, Ibn Khuzaimah and Ibn Hibban regarded it as authentic.

సారాంశం

ఈ హదీసు రద్దయిపోయిందని ఒక ఉల్లేఖనం ఆధారంగా తెలుస్తోంది. రాబోయే హదీసులలో ఏమనబడిందో గమనించండి.

హదీసు ఉల్లేఖకులు

అసలు పేరు షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు). మారు పేరు అబూ యాల. అన్సార్ వర్గానికి చెందినవారు. మదీనా వాస్తవ్యులు. హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)కు భ్రాతృజులు. జ్ఞాన సంపన్నులు. మృదు స్వభావులు. హిజ్రీ 58లో సిరియాలో మరణించారు. అప్పటికి ఆయనకు 75 ఏండ్లు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 541

542

హదీసు 542

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { أَوَّلُ مَا كُرِهَتِ اَلْحِجَامَةُ لِلصَّائِمِ; أَنَّ جَعْفَرَ بْنَ أَبِي طَالِبٍ اِحْتَجَمَ وَهُوَ صَائِمٌ, فَمَرَّ بِهِ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: " أَفْطَرَ هَذَانِ ", ثُمَّ رَخَّصَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بَعْدُ فِي اَلْحِجَامَةِ لِلصَّائِمِ, وَكَانَ أَنَسٌ يَحْتَجِمُ وَهُوَ صَائِمٌ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ وَقَوَّاهُ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : అన్నిటికన్నా ముందు ఉపవాసికి – శరీరానికి సూది పొడుచుకోవటం ఎందుకు అయిష్టకరంగా భావించబడిందంటే జాఫర్ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉపవాసస్థితిలో సూది పొడిపించుకున్నారు. దైవప్రవక్త ﷺ ఆయన వైపునుంచి వెళుతూ, “వీరిరువురి ఉపవాసం భంగమైపోయింది” అని అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త ﷺ, ఉపవాసి సూది పొడిపించుకు నేందుకు అనుమతినిచ్చారు. ఉపవాస స్థితిలో అనస్(రదియల్లాహు అన్హు) కూడా సూది పొడిపించుకునేవారు. (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించడంతోపాటు దృఢమైన హదీసుగా నిర్ధారించారు)

English

Anas (RAA) narrated, ‘The first time cupping was dis-liked for the one who is fasting was when Ja’far bin Abi Talib had himself cupped while fasting and the Messenger of Allah (ﷺ) came across him and said, "Those two have broken their fast (meaning Ja'far and the man who was cupping him.)" But later on the Prophet allowed cupping for the one who is fasting. Anas used to have himself cupped while he was fasting. Related by Ad-Daraqutni, who regarded it as a strong hadith.

సారాంశం

సూది గుచ్చటంవల్ల ఉపవాసం భంగమైపోతుందన్న హదీసు రద్దయిపోయిందనటానికి ఈ హదీసు ప్రబలనిదర్శనం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 542

543

హదీసు 543

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا, { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-اِكْتَحَلَ فِي رَمَضَانَ, وَهُوَ صَائِمٌ } رَوَاهُ اِبْنُ مَاجَهْ بِإِسْنَادٍ ضَعِيفٍ. قَالَ اَلتِّرْمِذِيُّ: لَا يَصِحُّ فِيهِ شَيْءٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ రమజాన్ నెలలో – ఉపవాస స్థితిలో-‘సుర్మా’ పెట్టుకున్నారు. (దీనిని ఇబ్నెమాజ వివరించారు. ఈ విషయంలో ఏ ఒక్క హదీసు కూడా ప్రామాణికమైనది లేదని ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) అన్నారు)

English

'A’isha (RAA) narrated, The Messenger of Allah (ﷺ) applied kohl to his eyes while he was fasting.’ Related by Ibn Majah with a weak chain of narrators. According to At-Tirmidhi, nothing authentic has been related from the Prophet concerning this issue, i.e. applying kohl, eye drops etc. to the eye while fasting.

సారాంశం

కళ్ళకు సుర్మా పెట్టుకునే విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఇమామ్ అహ్మద్, ఇస్‌హాఖ్, ఇబ్నె ముబారక్, సుఫియాన్ సౌరీ ప్రభృతులు ఉపవాస స్థితిలో సుర్మా పెట్టుకోవటాన్ని అయిష్టకరం (మక్రూహ్)గా భావించారని ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రస్తావించారు. అయితే ఇమామ్ షాఫయి ఇందుకు అనుమతించారు. అత్యధికమంది ధర్మవేత్తలు కూడా దీన్ని సమర్థించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 543

544

హదీసు 544

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ نَسِيَ وَهُوَ صَائِمٌ, فَأَكَلَ أَوْ شَرِبَ, فَلْيُتِمَّ صَوْمَهُ, فَإِنَّمَا أَطْعَمَهُ اَللَّهُ وَسَقَاهُ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِلْحَاكِمِ: { مَنْ أَفْطَرَ فِي رَمَضَانَ نَاسِيًا فَلَا قَضَاءَ عَلَيْهِ وَلَا كَفَّارَةَ } وَهُوَ صَحِيحٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – “ఏ ఉపవాసి అయినా మరచిపోయి ఏదన్నా తిన్నా, త్రాగినా (ఫరవాలేదు) – అతడు తన ఉపవాసాన్ని కొనసాగించాలి. ఎందుకంటే అతనికి అల్లాహ్ తినిపించాడు, త్రాపాడు.” (బుఖారీ, ముస్లిం)

“ఒకవేళ ఎవరయినా మరచిపోయి రమజాన్‌లో ఉపవాసాన్ని విరమిస్తే అతనిపై ‘ఖజా’గాని, కఫ్ఫారా (పరిహారం)గానీ లేదు” అని ఇమామ్ హాకిమ్ ద్వారా ఉల్లేఖించబడింది. (ఈ హదీసు ప్రామాణికమైనది)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: ‘Whoever forgets that he is fasting, and eats or drinks is to complete his fast, as it was Allah who fed him and gave him something to drink." Agreed upon.

Al-Hakim transmitted on the authority of Abu Hurairah, “Whoever breaks his fast during Ramadan due to forgetfulness is not to make up for the day later or perform an expiation.” It is a sound hadith.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 544

545

హదీసు 545

وَعَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ ذَرَعَهُ اَلْقَيْءُ فَلَا قَضَاءَ عَلَيْهِ, وَمَنْ اسْتَقَاءَ فَعَلَيْهِ اَلْقَضَاءُ } رَوَاهُ اَلْخَمْسَةُ. وَأَعَلَّهُ أَحْمَدُ. وَقَوَّاهُ اَلدَّارَقُطْنِيُّ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు – “అప్రయత్నంగా వాంతి అయిన వ్యక్తి ఉపవాసాన్ని తిరిగి పాటించనవసరం లేదు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా వాంతి చేసినవాడు ఉపవాసాన్ని ‘ఖజా’ చేయాలి (అంటే తిరిగి ఉపవాసం పాటించాలి).” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు – ఇమామ్ అహ్మద్ దీనిని ‘మాలూల్’గా ఖరారు చేశారు. ఇమామ్ దారె ఖుత్నీ మాత్రం ఈ హదీసును ‘దృఢమైనది’గా వ్యాఖ్యానించారు)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Whoever is overcome and vomits is not to make up for the day, but whoever vomits intentionally must make up the day.” Related by the five Imams.

సారాంశం

ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తదితరులు ఈ హదీసును ‘మాలూల్’గా అంటే, లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు. అయితే ఇమామ్ దారె ఖుత్నీ, ఇమామ్ ఇబ్నె హిబ్బాన్, ఇమామ్ హాకిమ్‌లు దీనిని ‘సహీహ్ హదీసు’గా ఖరారు చేశారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా), జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు), మరియు పలువురు ఇస్లామీయ విద్వాంసులు కూడా ఈ ఉల్లేఖనానికి అనుకూలంగా స్పందించారు. అంటే – ఉద్దేశ్యపూర్వకంగా వాంతిచేస్తేనే ఉపవాసం భంగమవుతుందని అభిప్రాయపడ్డారు. పైగా ఈ అంశంపై ధర్మవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉండేదని ఇమామ్ ఇబ్నె ముంజిర్ దావా చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 545

546

హదీసు 546

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-خَرَجَ عَامَ اَلْفَتْحِ إِلَى مَكَّةَ فِي رَمَضَانَ, فَصَامَ حَتَّى بَلَغَ كُرَاعَ الْغَمِيمِ, فَصَامَ اَلنَّاسُ, ثُمَّ دَعَا بِقَدَحٍ مِنْ مَاءٍ فَرَفَعَهُ, حَتَّى نَظَرَ اَلنَّاسُ إِلَيْهِ, ثُمَّ شَرِبَ, فَقِيلَ لَهُ بَعْدَ ذَلِكَ: إِنَّ بَعْضَ اَلنَّاسِ قَدْ صَامَ، فَقَالَ: "أُولَئِكَ اَلْعُصَاةُ, أُولَئِكَ اَلْعُصَاةُ" }. وَفِي لَفْظٍ: { فَقِيلَ لَهُ: إِنَّ اَلنَّاسَ قَدْ شَقَّ عَلَيْهِمُ اَلصِّيَامُ, وَإِنَّمَا يَنْظُرُونَ فِيمَا فَعَلْتَ، فَدَعَا بِقَدَحٍ مِنْ مَاءٍ بَعْدَ اَلْعَصْرِ، فَشَرِبَ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : మక్కాను జయించిన సంవత్సరం దైవప్రవక్త ﷺ మక్కా వైపునకు రమజాన్ మాసంలో బయలుదేరారు. ఆయన ﷺ ఉపవాసం కూడా పాటిస్తున్నారు. కడకు ఆయన ‘కురా అల్ – ఘమీమ్’ స్థలానికి చేరుకున్నారు. ఆ రోజు సహచరులు కూడా ఉపవాసం ఉన్నారు. ఆయన ﷺ మంచినీళ్ళ చెంబు తెప్పించారు. ఆ చెంబు అందరికీ కనబడేలా పైకి ఎత్తారు. తరువాత ఆయన ﷺ మంచినీరు త్రాగారు. కొంత మంది ఇప్పటికీ ఉపవాసం ఉన్నారని ఆయన ﷺకు తెలియజేయగా; “అవిధేయులు వీరే, అవిధేయులు వీరే” అని ఆయన ﷺ అన్నారు.

వేరొక హదీసు ఇలా వుంది : “నిశ్చయంగా జనులను ఉపవాసం బాధపెడుతోంది. మీరేం చేస్తారోనని ఎదురు చూస్తుండటం తప్ప వాళ్ళు చేయగలిగిందేమీ లేదు” అని ఆయన ﷺతో విన్నవించుకోగా ఆయన ﷺ అస్ర్ (నమాజ్) అనంతరం మంచినీళ్ళ చెంబు తెప్పించి త్రాగారు. (ముస్లిమ్)

English

Jabir (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) left for Makkah during the year of the conquest (of Makkah) in Ramadan and he and the people with him fasted until he reached the valley of Kura Al-Ghamim. He then called for a cup of water, which he elevated so that the people could see it, and then he drank. After-wards, he was told that some people had continued to fast, and he then said, "Those are the disobedient ones! Those are the disobedient ones!”

In another narration, ‘He was told that people are finding it difficult to fast (during the journey) and they are waiting to see what the Prophet (ﷺ) will do. So he called for a cup of water after the Asr (afternoon) prayer and drank it.’ Related by Muslim.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 546

547

హదీసు 547

وَعَنْ حَمْزَةَ بْنِ عَمْرٍو الْأَسْلَمِيِّ رِضَى اَللَّهُ عَنْهُ; أَنَّهُ قَالَ: { يَا رَسُولَ اَللَّهِ! إِنِّي أَجِدُ بِي قُوَّةً عَلَى اَلصِّيَامِ فِي اَلسَّفَرِ, فَهَلْ عَلَيَّ جُنَاحٌ? فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏- " هِيَ رُخْصَةٌ مِنَ اَللَّهِ, فَمَنْ أَخَذَ بِهَا فَحَسَنٌ, وَمَنْ أَحَبَّ أَنْ يَصُومَ فَلَا جُنَاحَ عَلَيْهِ " } رَوَاهُ مُسْلِمٌ. وَأَصْلُهُ فِي " اَلْمُتَّفَقِِ " مِنْ حَدِيثِ عَائِشَةَ; { أَنَّ حَمْزَةَ بْنَ عَمْرٍو سَأَلَ }

హజ్రత్ హమ్జా బిన్ అమ్ర్ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం : ఆయన దైవప్రవక్త ﷺతో ఇలా అన్నారు – “నాకు ప్రయాణంలో సయితం ఉపవాసం పాటించగల శక్తి ఉంది. (ఒకవేళ నేను ‘రోజా’ ఉంటే) ఇది అభ్యంతరకరమా?” దానికి దైవప్రవక్త ﷺ, “ఇది వాస్తవానికి అల్లాహ్ తరపున ఇవ్వబడిన రాయితీ. ఎవరైనా దాన్ని వినియోగించుకుంటే అది వారికే మేలు. ఒకవేళ ఎవరయినా ఉపవాసమే ఉండదలిస్తే అందులో ఆక్షేపణీయం ఏమీ లేదు.” అని అన్నారు. (ముస్లిం – హదీసు మూలం మాత్రం హజ్రత్ ఆయిషా – ర.అన్హా – గారి ముత్తఫకున్ అలైహి హదీసులో ఇలా ఉంది: ‘హమ్జా బిన్ అమ్ర్ ప్రశ్నించారు.’)

English

Hamzah bin ’Amro Al-Aslami (RAA) narrated, ‘I said to the Messenger of Allah (ﷺ) ‘O Messenger of Allah (ﷺ)! I find within me the strength to fast while traveling. Would there be any blame upon me if I were to do so?’ The Messenger of Allah (ﷺ) said to him, "It is a concession from Allah. Whoever takes it has done well. Whoever likes to fast, there is no blame upon him."Related by Muslim.

And it's basic meaning is in Al-Bukhari and Muslim from the narration of Aisha (with the wording) "that Hamza bin 'Amro asked".

హదీసు ఉల్లేఖకులు

హమ్జా బిన్ అమ్ర్ అస్లమీ (రదియల్లాహు అన్హు). హిజాజ్ ప్రాంతానికి చెందిన సహాబీ. మారుపేరు అబూ సాలిహ్ లేక అబూ ముహమ్మద్. ఈయన కుమారుడు మరియు ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా) ఈయన గారినుంచి హదీసులను ఉల్లేఖించేవారు. హిజ్రీ 61లో ఈయన – 80 ఏళ్ళ వయస్సులో- కన్ను మూశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 547

548

హదీసు 548

وَعَنِ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { رُخِّصَ لِلشَّيْخِ اَلْكَبِيرِ أَنْ يُفْطِرَ, وَيُطْعِمَ عَنْ كُلِّ يَوْمٍ مِسْكِينًا, وَلَا قَضَاءَ عَلَيْهِ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَالْحَاكِمُ, وَصَحَّحَاهُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇఫ్తార్ చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. (అయితే) వారు ఒక్కో ఉపవాసానికి బదులుగా ఒక్కో పేదవానికి అన్నం పెట్టాలి. ఇంకా వారు ఉపవాసాన్ని ‘ఖజా’ చేయవలసిన అవసరం కూడా లేదు. (దారె ఖుత్నీ, హాకిమ్ ఈ హదీసును ఉల్లేఖించటమేగాక, ప్రామాణికమైనదిగా ధృవీకరించారు)

English

Ibn ’Abbas (RAA) narrated, ‘An elderly man is permitted to break his fast, but he must feed a poor person daily, and he does not have to make up for it.’ Related by Ad-Daraqutni and Al- hakim, who rendered it to be Sahih

సారాంశం

వార్ధక్యానికి చేరి, శరీరంలోని జవసత్వాలు ఉడిగిపోయినవారు, ఉపవాసం పాటించటంవల్ల కోలుకోలేమన్న భయం ఉంటే వారు ఉపవాసాలు పాటించనవసరం లేదు. అలాగే సుదీర్ఘ వ్యాధికి గురై స్వస్థత చేకూరే ఆశను వదులుకున్నవారు కూడా ‘రోజా’ పాటించనక్కరలేదు. అయితే ఇలాంటి వారు – తమకు దైవం తరపునుండి లభించిన ఈ మినహాయింపుకు బదులుగా – ఒక పేదవానికి ‘ఫిదియా’ గా భోజనం చేయించాలి. 30 మంది పేదలకు ఒకేసారి అన్నం పెట్టినా సరిపోతుంది. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ముసలివారైపోయినపుడు భోజనం తయారుచేయించి 30 మంది బీదవారికి తినిపించారు. ఒక ఉపవాసానికి బదులుగా కనీసం అర్థ ‘సా’ గోధుమలు కూడా ఇవ్వవచ్చని ఒక ఉల్లేఖనం ప్రకారం తెలుస్తున్నది.

గర్భవతి మరియు బాలింత కూడా ఉపవాసం పాటించగలిగే స్థితిలో లేకుంటే ఇలాగే ఫిదియా చెల్లించాలని హజ్రత్ ఇబ్నె అబ్బాస్, ఇబ్నె ఉమర్ పేర్కొన్నారు.

పేదవారికి అన్నం పెట్టే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజారిటీ విద్వాంసులు ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇమామ్ మాలిక్ గారు దీనిని వాంఛనీయం‌గా ఖరారు చేశారు. అన్నం పెట్టవలసిన అవసరం లేదనీ, దానం చేస్తే సరిపోతుందని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 548

549

హదీసు 549

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { جَاءَ رَجُلٌ إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: هَلَكْتُ يَا رَسُولَ اَللَّهِ.‏ قَالَ: " وَمَا أَهْلَكَكَ ? " قَالَ: وَقَعْتُ عَلَى اِمْرَأَتِي فِي رَمَضَانَ، فَقَالَ: " هَلْ تَجِدُ مَا تَعْتِقُ رَقَبَةً? " قَالَ: لَا.‏ قَالَ: " فَهَلْ تَسْتَطِيعُ أَنْ تَصُومَ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ? " قَالَ: لَا.‏ قَالَ: " فَهَلْ تَجِدُ مَا تُطْعِمُ سِتِّينَ مِسْكِينًا? " قَالَ: لَا, ثُمَّ جَلَسَ, فَأُتِي اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِعَرَقٍ فِيهِ تَمْرٌ.‏ فَقَالَ: " تَصَدَّقْ بِهَذَا ", فَقَالَ: أَعَلَى أَفْقَرَ مِنَّا? فَمَا بَيْنَ لَابَتَيْهَا أَهْلُ بَيْتٍ أَحْوَجُ إِلَيْهِ مِنَّا, فَضَحِكَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-حَتَّى بَدَتْ أَنْيَابُهُ، ثُمَّ قَالَ: "اذْهَبْ فَأَطْعِمْهُ أَهْلَكَ " } رَوَاهُ اَلسَّبْعَةُ, وَاللَّفْظُ لِمُسْلِمٍ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధిలోకి వచ్చి, ‘దైవప్రవక్తా ﷺ! ‘నేను నాశనమైపోయాను’ అని మొత్తుకున్నాడు. “ఎలా నాశనమయ్యావో చెప్పవు కాదు” అని దైవప్రవక్త ﷺ అన్నారు. ‘ఏం చెప్పమంటారు? నేను రమజాన్‌లో (ఉపవాస స్థితిలో) ఇల్లాలితో సంభోగించాను’ అన్నాడు. దానికి ఆయన ﷺ, “ఒక మెడను (బానిసను) విడిపించే తాహతు నీకుందా?” అని అడిగారు. ‘లేదు’ అన్నాడా వ్యక్తి. “పోనీ నువ్వు రెండు మాసాలు నిరంతరం ఉపవాసాలు పాటించగలవా?” అని అడిగారాయన ﷺ. ‘ఇదీ నావల్ల కాదు’ అన్నాడతను. “పోనీ 60 మంది అభాగ్యులకు అన్నం పెట్టే స్థోమత నీకుందా?’ అని ప్రశ్నించారాయన ﷺ. ‘లేదు’ అన్నాడతను. మరి అతను అలాగే కూర్చుని ఉన్నాడు. అంతలో దైవప్రవక్త ﷺ వద్దకు ఒక తట్ట తేబడింది. అందులో ఖర్జూర పండ్లు ఉన్నాయి. “సరే. వీటిని దానంగా ఇవ్వు” అని చెప్పారు ఆయన ﷺ. ‘ఏమిటి, నాకన్నా అభాగ్యునికి దానం చేయమంటారా? ఈ పురము (మదీనా)లోని రెండు పర్వత లోయల మధ్య నన్ను మించిన దరిద్రుడు ఎవడూ లేడు’ అని విన్నవించుకున్నాడా వ్యక్తి. ఇది విని దైవప్రవక్త ﷺ పెద్దగా నవ్వేశారు. ఆ సమయంలో ఆయన ﷺ దంతాలు కూడా కనిపించసాగాయి. తరువాత ఆయన ﷺ ఇలా అన్నారు : “వెళ్ళు, వెళ్లి వీటిని నీ ఇంటివారలకు తినిపించు.” (దీనిని ఏడుగురూ ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు ‘ముస్లిం’లోనివి)

English

Abu Hurairah (RAA) narrated that A man came to the Messenger of Allah (ﷺ) and said, “l am ruined O Messenger of Allah (ﷺ)!" The Messenger of Allah (ﷺ) asked him, “What has ruined you?" The man replied, ‘I had intercourse with my wife during the day in Ramadan while fasting)’ The Prophet said to him, "Are you able to free a slave?" The man said, ‘No.’ The Prophet said, "Can you fast for two consecutive months?" He said, ‘NO.' The Prophet then asked him, "Can you provide food for sixty poor people?" He said, ‘No.’ Then the man sat down. A basket of dates was brought to the Prophet and he said to the man, “Give this as Sadaqah (voluntary charity)” The man said, ‘To someone who is poorer than us!’ There is no one in this city (Al-Madinah) who is in need of these dates more than us!’ The Prophet laughed until his molar teeth could be seen and said to the man, “Go and feed your family with these dates.” Related by the seven Imams and the wording is from Muslim.

సారాంశం

లేమికి గురై ఉన్న వ్యక్తి కఫ్ఫారా (పరిహారం) చెల్లించనవసరం లేదని ఇమామ్ ఔజాయి, ఇమామ్ అహ్మద్ ఈ హదీసు ఆధారంగా వ్యాఖ్యానించారు. కాని ఇమామ్ మాలిక్, ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ సౌరి, ఇమామ్ అబూ సౌర్ ఈ తర్కంతో ఏకీభవించలేదు. పరిహారం పరిహారమేననీ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని వీరు అభిప్రాయపడ్డారు. దైవప్రవక్త ﷺ ఆ వ్యక్తికి, పేదవాడైన కారణంగా ఖర్జూర పండ్లు దానం చేశారేతప్ప పరిహారంగా ఇవ్వలేదని వీరు వ్యాఖ్యానించారు.

అదీగాక, ఈ హదీసులో ‘ఖజా రోజా’ గురించిన ప్రస్తావన లేదు. ఇతర హదీసులలో ఖజా రోజా గురించి కూడా చెప్పబడింది. దీని ఆధారంగా నలుగురు ఇమాములు మరియు మెజారిటీ పండితులు ఏమంటారంటే; ఇలాంటి స్థితిలో స్త్రీ పురుషులిరువురూ ఖజా రోజా ఉండాలి. ఆ సమయంలో స్త్రీ ఒకవేళ ఉపవాసవ్రతం బూని ఉండకపోతే, ఆమెపై ‘ఖజా’ బాధ్యత లేదు. ఈ హదీసుపై కొందరు ధర్మవేత్తలు కొనసాగించిన చర్చ రెండు సంపుటాలలో వచ్చిందని హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ‘ఫత్‌హుల్ బారీ’లో పేర్కొన్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 549

550

హదీసు 550

وَعَنْ عَائِشَةَ وَأُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يُصْبِحُ جُنُبًا مِنْ جِمَاعٍ, ثُمَّ يَغْتَسِلُ وَيَصُومُ } مُتَّفَقٌ عَلَيْهِ. وَزَادَ مُسْلِمٌ فِي حَدِيثِ أُمِّ سَلَمَةَ: [ وَ ] لَا يَقْضِي.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) లిరువురూ ఇలా వివరించారు : “దైవప్రవక్త ﷺ లైంగిక అశుద్ధతకు లోనై ఉన్నస్థితిలో తెల్లవారిపోతే (సహరీ వేళ దాటిపోతే) అప్పుడు స్నానం చేసి ఉపవాసాన్ని మాత్రం కొనసాగించేవారు.” (బుఖారీ, ముస్లిం) ‘ఖజా మాత్రం చేసేవారు కాదు’ అని ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) పలికినట్లు ‘ముస్లిం’లో ఉంది.

English

'A’isha and Umm Salamah (RAA) narrated, The Messenger of Allah (ﷺ) would rise in the morning (when it is already Fajr time) while he was Junub (in a state of major ritual impurity due to intercourse) on a day in Ramadan. He would then perform Ghusl and fast. Agreed upon. In the narration of Muslim on the authority of Umm Salamah, ‘And he would not make up for it (that day).’

సారాంశం

‘జనాబత్’లో వున్న మనిషికి ఫజ్ర్ సమయానికి ముందే మెలకువ రాకపోతే అతడు తెల్లవారాక కూడా స్నానం చేసి-ఉపవాసాన్ని కొనసాగించవచ్చనీ, ఉపవాసాన్ని కేవలం ఈ కారణంగా విడనాడవలసిన అవసరం లేదనీ ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. ధర్మవేత్తలలో అధిక సంఖ్యాకులు దీంతో ఏకీభవించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 550

551

హదీసు 551

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ مَاتَ وَعَلَيْهِ صِيَامٌ صَامَ عَنْهُ وَلِيُّهُ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “ఏ వ్యక్తయినా చనిపోతే, అతనిపై ఉపవాసాలు విధిగా పాటించవలసిన (ఖజా చేయవలసిన) బాధ్యత ఉండివుంటే అతని తరపున అతని వారసుడు వాటిని పాటించాలి.” (బుఖారీ, ముస్లిం)

English

'A’isha (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: "Whoever dies while he still has some fasts to make up (of the days of Ramadan), then his heir (any of them) should fast on his behalf.” Agreed upon.

సారాంశం

‘హజ్’ మాదిరిగా ‘రోజా’ విషయంలో కూడా వారసులు మృతుని తరపున వసీయతును నెరవేర్చవచ్చని హదీసువేత్తలు ఈ హదీసు ఆధారంగా అభిప్రాయపడ్డారు. అయితే ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్‌ల ఆలోచనా సరళి తద్భిన్నంగా ఉంది. వారసులు మృతుని తరపున ఉపవాసాన్ని పాటించనక్కర లేదనీ, పేదవానికి అన్నం పెడితే సరిపోతుందని వీరు అన్నారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)ల తీర్పు కూడా ఇదే. అయితే మృతుని తరపున ఉపవాసం ఉండటం ధర్మసమ్మతం అని హదీసులో స్పష్టంగా ఉంది. కాబట్టి మృతునిపై ఉన్న బాధ్యతను వారసులు నెరవేరిస్తే అందులో ఆక్షేపణీయం ఏమీ లేదు. పైగా ఇదే అభిలషణీయం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.0 ఉపవాస నియమాలు|హదీసు 551