హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 4.3 దానధర్మాల పంపిణీ

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 4. జకాత్ పుస్తకం, 3వ అధ్యాయం: దానధర్మాల పంపిణీ. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 520 – 526) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

4.3 దానధర్మాల పంపిణీ

↑ విషయ సూచిక

باب قسم الصدقات

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

520

హదీసు 520

عَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَحِلُّ اَلصَّدَقَةُ لِغَنِيٍّ إِلَّا لِخَمْسَةٍ: لِعَامِلٍ عَلَيْهَا, أَوْ رَجُلٍ اِشْتَرَاهَا بِمَالِهِ, أَوْ غَارِمٍ, أَوْ غَازٍ فِي سَبِيلِ اَللَّهِ, أَوْ مِسْكِينٍ تُصُدِّقَ عَلَيْهِ مِنْهَا, فَأَهْدَى مِنْهَا لِغَنِيٍّ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَأُعِلَّ بِالْإِرْسَالِ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “ఐదు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప స్థితిమంతుని కొరకు ‘సదఖా’ హలాల్ (ధర్మసమ్మతం) కాదు. (1) జకాత్ సొమ్మును సమీకరించినపుడు. (2) తన సొమ్ముతో దానధర్మాలకు సంబంధించిన ఏదయినా వస్తువును కొనుగోలు చేసినపుడు. (3) రుణగ్రస్తుడు. (4) దైవమార్గంలో పోరాడే వ్యక్తి. (5) దానంగా పొందిన దానిలో నుంచి ఒక నిరుపేద ఏదన్నా శ్రీమంతునికి కానుకగా ఇచ్చినపుడు.” (దీనిని అహ్మద్, అబూదావూద్, ఇబ్నె మాజా ఉల్లేఖించారు – హాకిమ్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు – అయితే ఇది ‘ముర్సల్’ అని కూడా అభిప్రాయపడ్డారు)

English

Abu Sa'id Al-Khudri narrated that The Messenger of Allah (ﷺ) said: “Zakah is not allowed for the well-off person except for one of the following five: an administrator of Zakah, a man who buys Zakah holdings with his money, a person who is in debt, a fighter in the cause of Allah, or a rich person who is given a present by a needy (miskin) person which the latter had been given as Zakah.” Related by Ahmad, Abu Dawud, Ibn Majah, and Al-Hakim regarded it as Sahih.

సారాంశం

శ్రీమంతుడు జకాత్ పుచ్చుకోరాదని ఈ హదీసు ద్వారా రూఢీ అయింది. అయితే జకాత్ వసూళ్ళ నిమిత్తం నియమితులైన తహసీల్దార్లు, అకౌంటెంట్లు, గుమాస్తాలు – వారు ధనవంతులైనప్పటికీ – జీతంగా జకాత్ పద్దులో నుంచి తీసుకోవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.3 దానధర్మాల పంపిణీ|హదీసు 520

521

హదీసు 521

وَعَنْ عُبَيْدِ اَللَّهِ بْنِ عَدِيِّ بْنِ اَلْخِيَارِ; { أَنَّ رَجُلَيْنِ حَدَّثَاهُ أَنَّهُمَا أَتَيَا رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَسْأَلَانِهِ مِنَ اَلصَّدَقَةِ، فَقَلَّبَ فِيهِمَا اَلْبَصَرَ, فَرَآهُمَا جَلْدَيْنِ, فَقَالَ: "إِنْ شِئْتُمَا أَعْطَيْتُكُمَا, وَلَا حَظَّ فِيهَا لِغَنِيٍّ, وَلَا لِقَوِيٍّ مُكْتَسِبٍ".‏ } رَوَاهُ أَحْمَدُ, وَقَوَّاهُ أَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ.

హజ్రత్ ఉబైదుల్లాహ్ బిన్ అదీ బిన్ ఖియార్ (రహిమహుల్లాహ్) కథనం : ఇరువురు వ్యక్తులు నాకు తమ వృత్తాంతం వినిపించారు. వారిద్దరూ దైవప్రవక్త ﷺ సమక్షంలోకి వచ్చి, ఆయన్నుంచి ‘సదఖా’ కోరారు. ఆయన ﷺ వారిద్దరినీ నఖశిఖ పర్యంతం చూశారు. ఇరువురూ బలిష్ఠులుగానే కనిపించారు. ఆయన ﷺ ఇలా అన్నారు: “మీరు గనక కోరితే మీకు సదఖా ఇస్తాను. కాని శ్రీమంతునికీ, ఆరోగ్యవంతునికీ ఇందులో ఎలాంటి భాగం లేదు.” (ఈ హదీసును అహ్మద్ ఉల్లేఖించగా, అబూదావూద్ మరియు నసాయి దీనిని ‘దృఢమైనది’గా నిర్ధారించారు)

English

'Ubaidullah bin ’Adi bin Al-Khiyar (RAA) narrated that Two men told him that they had gone to the Messenger of Allah (ﷺ) asking him to give them something from the Zakah money (as he was distributing it at that time). The Messenger of Allah (ﷺ) then looked them up and down and found them to be sturdy and strong. He then said to them, “If you desire, I shall give it to you, but this Zakah is not for one who is rich, neither for the one who is strong and able to earn.” Related by Ahmad, Abu Dawud and An-Nasa'i.

సారాంశం

దృఢకాయులు, ధనవంతులు జకాత్‌కు, దానధర్మాలకు అర్హులు కారని ఈ హదీసును బట్టి అర్థమవుతోంది. దానం చేసేవారు కూడా యాచించేవారిని నిశితంగా చూచి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకుని ఇవ్వటం సమంజసం. హక్కుదారులు కాని వారిని అడుక్కుతినరాదని గట్టిగా చెప్పాలి కూడా.

హదీసు ఉల్లేఖకులు

ఉబైదుల్లాహ్ బిన్ అదీ బిన్ ఖియార్ (రహిమహుల్లాహ్). ఈయన ఖురైష్ వంశస్థులు. దైవప్రవక్త ﷺ కాలంలోనే జన్మించారని ఒక వాదన ఉంది. అందుచేత ఈయన తాబయీలలో ఒకరుగా పరిగణించబడ్డారు. ఈయన ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ల నుంచి హదీసులను సంగ్రహించారు. ఒక కథనం ప్రకారం ఈయన తండ్రి అవిశ్వాస స్థితిలోనే – బద్ర్‌యుద్ధంలో – తుదముట్టించబడ్డాడు. కాగా; ఈయన మక్కా విజయం నాటికి ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్నారు. ఈ రకంగా ఈయన్ని సహాబీగా కూడా పరిగణించవచ్చు. ఖురైష్‌కు చెందిన గొప్ప పండితులలో ఒకరుగా ఎంచబడతారు. హిజ్రీ 90లో – ఖలీఫా వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ హయాంలో – మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.3 దానధర్మాల పంపిణీ|హదీసు 521

522

హదీసు 522

وَعَنْ قَبِيصَةَ بْنِ مُخَارِقٍ اَلْهِلَالِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَلْمَسْأَلَةَ لَا تَحِلُّ إِلَّا لِأَحَدِ ثَلَاثَةٍ: رَجُلٌ تَحَمَّلَ حَمَالَةً, فَحَلَّتْ لَهُ اَلْمَسْأَلَةُ حَتَّى يُصِيبَهَا, ثُمَّ يُمْسِكَ، وَرَجُلٌ أَصَابَتْهُ جَائِحَةٌ, اِجْتَاحَتْ مَالَهُ, فَحَلَّتْ لَهُ اَلْمَسْأَلَةُ حَتَّى يُصِيبَ قِوَامًا مِنْ عَيْشٍ, وَرَجُلٌ أَصَابَتْهُ فَاقَةٌ حَتَّى يَقُومَ ثَلَاثَةٌ مِنْ ذَوِي الْحِجَى مِنْ قَومِهِ: لَقَدْ أَصَابَتْ فُلَانًا فَاقَةٌ; فَحَلَّتْ لَهُ اَلْمَسْأَلَةُ حَتَّى يُصِيبَ قِوَامًا مِنْ عَيْشٍ, فَمَا سِوَاهُنَّ مِنَ اَلْمَسْأَلَةِ يَا قَبِيصَةُ سُحْتٌ يَأْكُلُهُ صَاحِبُهُ سُحْتًا } رَوَاهُ مُسْلِمٌ, وَأَبُو دَاوُدَ, وَابْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ.

దైవప్రవక్త ﷺ తనతో చెప్పారని హజ్రత్ ఖబీస బిన్ ముఖారిఖ్ హిలాలీ తెలియజేశారు: “యాచించటం కేవలం ముగ్గురు వ్యక్తుల కొరకే ధర్మసమ్మతం.” ఒకడు: ఒకరి బరువు బాధ్యతలను తనపై వేసుకున్న వ్యక్తి. కడకు తన అప్పులు తీరిన తరువాత అతడు యాచించటం మానుకోవాలి. రెండవవాడు : ఏదైనా అనుకోని విపత్తుకు గురై ఆస్తిపాస్తులను కోల్పోయినవాడు. అతడు తన కనీసావసరాలకై మాత్రమే ప్రశ్నించగలడు. మూడవ వాడు : పస్తులకు గురవుతున్నవాడు. నిజంగానే అతడు పస్తులుండవలసి వస్తోందని తన జాతికి చెందిన ముగ్గురు విజ్ఞులు ఆ మేరకు సాక్ష్యమివ్వాలి. అట్టి పరిస్థితిలో అతడు జరుగుబాటుకు సంబంధించినంతవరకు అడగటం ధర్మసమ్మతం. వీరుగాక…. ఓ ఖబీసా! ప్రశ్నించటం (యాచించటం) హరామ్. ప్రశ్నించేవాడు (యాచించేవాడు) హరామ్‌తో తన పొట్ట నింపుకుంటున్నాడు సుమా! (ముస్లిం, అబూదావూద్, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్)

English

Qabisah bin Mukhariq Al-Hilali (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Asking for (the money of) Zakah, is justified only for the following three: first, a man who is in debt: it is then permissible for him to receive [Zakah] until his difficulty is resolved; second, a man who was struck by calamity, which destroyed his holdings, which also makes it permissible for him to receive [Zakah] until he is in a position to earn his own living; and third, a man who has been reduced to poverty and three persons of caliber from among his people testify to his desperate circumstances. Such will receive until he finds a means of support for himself. Other than these cases, O Qabisah, it is considered as taking suht (unlawful or haram earnings), and the person receiving it (this Zakah) will be consuming forbidden (unlawful) holdings.” Related by Muslim, Abu Dawud, Ibn Khuzaimah and Ibn Hibban.

సారాంశం

యాచించేవాని నిజస్థితిని ధృవీకరించే ఒక పద్ధతి (సిస్టమ్) ఈ హదీసులో ప్రతిపాదించబడింది. సమాజంలోని విజ్ఞులు, బాధ్యతాయుత వ్యక్తులు ముగ్గురు ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం గురించి, వారు నిజంగానే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని, సమయానికి తిండిలేక పస్తులుండవలసి వస్తోందని సాక్ష్యపత్రం వ్రాసి ఇస్తే అప్పుడు వారు యాచించేందుకు అర్హులవుతారు. అడుక్కునే వారి స్థితిని వాకబు చేయమని కూడా చెప్పబడింది. దీన్నిబట్టి ఇస్లాం భిక్షాటనను ఎంతగా నిరుత్సాహ పరచిందో, శ్రమ జీవనాన్ని ఎంతగా ప్రోత్సహించిందో అర్థమవుతోంది.

హదీసు ఉల్లేఖకులు

ఖబీస బిన్ ముఖారిఖ్ హిలాలీ (రదియల్లాహు అన్హు). ఈయన నామాంతరం అబూ బిష్ర్. దైవప్రవక్త ప్రియ సహచరులలో ఒకరు. బస్రాలో స్థిరపడ్డారు. ఒక ప్రతినిధి వర్గంతో కలసి దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చారు. ఆయన ﷺ వద్ద హదీసులు విన్నారు. ఆరు హదీసులను ఉల్లేఖించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.3 దానధర్మాల పంపిణీ|హదీసు 522

523

హదీసు 523

وَعَنْ عَبْدِ اَلْمُطَّلِبِ بْنِ رَبِيعَةَ بْنِ اَلْحَارِثِ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَلصَّدَقَةَ لَا تَنْبَغِي لِآلِ مُحَمَّدٍ, إِنَّمَا هِيَ أَوْسَاخُ اَلنَّاسِ }. وَفِي رِوَايَةٍ: { وَإِنَّهَا لَا تَحِلُّ لِمُحَمَّدٍ وَلَا آلِ مُحَمَّدٍ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ రబీయ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “ముహమ్మద్ ﷺ కుటుంబీకులకు సదఖా పుచ్చుకోవటం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది ప్రజల ధన సంపదల కాలుష్యం.” వేరొక ఉల్లేఖనంలో ఇలా వుంది : “సదఖా ముహమ్మద్ ﷺ కొరకూ, ముహమ్మద్ ﷺ కుటుంబీకుల కొరకూ ధర్మసమ్మతం కాదు.” (ముస్లిం)

English

’Abdul Muttalib bin Rabi’ah bin Al-Harith narrated that The Messenger of Allah (ﷺ) said: “Indeed, Zakah ought not to be given to the family of Muhammad, it will be like giving them from the impurities of people.” In another narration, “It is not lawful for Muhammad or the family of Muhammad(ﷺ). Related by Muslim.

హదీసు ఉల్లేఖకులు

అబ్దుల్ ముత్తలిబ్ బిన్ రబీయ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు). ఈయన వంశపరంపర ఈ విధంగా ఉంది: అబ్దుల్ ముత్తలిబ్ బిన్ రబీయ బిన్ హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్ ఖురషీ. ఈయన మదీనాలో స్థిరపడ్డారు. తరువాత డెమాస్కస్‌కు వెళ్ళారు. హిజ్రీ 62లో అక్కడే మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.3 దానధర్మాల పంపిణీ|హదీసు 523

524

హదీసు 524

وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَشَيْتُ أَنَا وَعُثْمَانُ بْنُ عَفَّانَ ‏- رضى الله عنه ‏- إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقُلْنَا: يَا رَسُولَ اَللَّهِ, أَعْطَيْتَ بَنِي اَلْمُطَّلِبِ مِنْ خُمُسِ خَيْبَرَ وَتَرَكْتَنَا, وَنَحْنُ وَهُمْ بِمَنْزِلَةٍ وَاحِدَةٍ, فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏- "إِنَّمَا بَنُو اَلْمُطَّلِبِ وَبَنُو هَاشِمٍ شَيْءٌ وَاحِدٌ".‏ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ జుబైర్ బిన్ ముత్‌యిమ్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను మరియు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఇద్దరం కలసి దైవప్రవక్త ﷺ దగ్గరకెళ్ళి ఇలా విన్నవించుకున్నాము – “తమరు బనూ అబ్దుల్ ముత్తలిబ్ (అబ్దుల్ ముత్తలిబ్ సంతతి)కి ఖైబర్ నుంచి (విజయ ప్రాప్తిగా)లభించిన ఐదు ఆస్తులలో వాటా ఇచ్చారు. కాని మమ్మల్ని మాత్రం ఉపేక్షించటం జరిగింది. తమరితో గల సంబంధాల రీత్యా, సామీప్యం దృష్ట్యా ఇరువురూ సమానులే కదా!” ఇది విని దైవప్రవక్త ﷺ, “బనూ అబ్దుల్ ముత్తలిబ్, బనూ హాషిమ్ రెండూ ఒక్కటే” అని వ్యాఖ్యానించారు. (బుఖారీ)

English

Jubair bin Mut’am (RAA) narrated, “Uthman Ibn 'Affan and I went to the Messenger of Allah (ﷺ) &, and said to him, ‘O Messenger of Allah (ﷺ)! You have given the family of Banu Al-Muttalib from the fifth of the war booty of Khaibar and left us out, while we and they are of the same status.’ The Messenger of Allah (ﷺ) replied, “Banu Al-Muttalib and Banu Hashim are one.” Related by al-Bukhari.

సారాంశం

‘మేము మరియు బనూ ముత్తలిబ్ సమానులమే కదా!’ అని ఫిర్యాదు చేయటంలో గల ఆంతర్యం ఏమిటీ? రెండు ఉద్దేశ్యాలు కావచ్చు. ఒకటి : విశ్వసనీయతలో, వినయ విధేయతలలో అబ్దుల్ ముత్తలిబ్ సంతతి ఎంతగా రాణించిందో అంతగానే మేమూ రాణించాము. మీ మాటను ఎన్నడూ జవదాటలేదు. ఇక బంధుత్వ రీత్యా అంటారా? అందులోనూ మాకూ – ముత్తలిబ్ సంతతికి మధ్య పెద్దగా అంతరం లేదు. వాళ్ళకి ఎంతగా మీతో దగ్గరి బంధుత్వముందో అంతగానే మాకూ మీతో బంధుత్వముంది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) బనూ ఉమయ్య వంశస్థులు. పైగా దైవప్రవక్త ﷺకు అల్లుడు కూడాను. బనూ ఉమయ్య, బనూ హాషిమ్ వంశస్థులు ఖురైష్ వర్గంతో సరిసమానులుగా పరిగణించబడేవారు. మరోవిధంగా చెప్పాలంటే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) బనూ అబ్దుష్షమ్స్‌లోని వారు. హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) గారు నౌఫిల్ సంతానంలోని వారు. దైవప్రవక్త ﷺ, అబ్బాస్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) హాషిమ్ సంతతికి చెందినవారు. ఈ విధంగా వీరంతా ముత్తలిబ్ వంశస్థులే. హాషిమ్, ముత్తలిబ్, నౌఫిల్, అబ్దుష్షమ్స్ – ఈ నలుగురూ అబ్దె మునాఫ్ కుమారులే. ఈ విధంగా దైవప్రవక్త ﷺతో ఉస్మాన్, జుబైర్, అలీకి సంబంధం ఒకే స్థాయికి చెందినది. ఉస్మాన్, జుబైర్లు దైవప్రవక్త ﷺను ప్రశ్నించటంలోని ఆంతర్యం కూడా ఇదే.

ఇక దైవప్రవక్త ﷺ సమాధానంలోని పరమార్థం ఏమై ఉంటుంది? అన్నది ప్రశ్న. ప్రాచీన కాలం నుంచీ బనూ హాషిమ్, బనూ ఉమయ్య సమాన స్థాయిలో చెలామణీ అవుతూ వస్తున్న సంగతి నిజమే. ఈ రకంగా ఆయన ﷺ ఎలాంటి తేడా చూపలేదు. కాకపోతే బనూ ఉమయ్యా కన్నా, బనూ హాషిమ్ దైవప్రవక్త ﷺకు మరింత దగ్గరగా ఉంది. అందుకే ఆయన ﷺ బనూ హాషిమ్‌కి జకాత్ సొమ్మును నిషిద్ధం (హరామ్)గా ఖరారు చేశారు. బనూ ఉమయ్య కొరకు జకాత్ సొమ్ము నిషిద్ధం కాదు. అందుకే బనూ హాషిమ్‌కి ఖైబర్‌కి చెందిన ‘ఐదు ఆస్తులలో’ వాటా ఇవ్వబడింది. బనూ ఉమయ్యాకు మాత్రం షేర్ లభించలేదు. ఈ కారణంగానే హజ్రత్ ఉస్మాన్ మరియు జుబైర్‌లకు ఖైబర్ విజయప్రాప్తిలో భాగం దక్కలేదు. జకాత్ సొమ్ము ధర్మసమ్మతం గావించబడిన సంతతికి ‘ఐదు ఆస్తులలో’ వాటా లభించలేదు. ‘ఐదు ఆస్తులలో’ వాటా పొందిన సంతతికి జకాత్ సొమ్ము శాశ్వతంగా నిషేధించబడింది. ఒక కోణం నుంచి ఒకరు లబ్దిపొందగా, మరో కోణం నుంచి మరొకరికి న్యాయం జరిగిందన్నమాట!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.3 దానధర్మాల పంపిణీ|హదీసు 524

525

హదీసు 525

وَعَنْ أَبِي رَافِعٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعَثَ رَجُلًا عَلَى اَلصَّدَقَةِ مِنْ بَنِي مَخْزُومٍ, فَقَالَ لِأَبِي رَافِعٍ: اِصْحَبْنِي, فَإِنَّكَ تُصِيبُ مِنْهَا, فَقَالَ: لَا, حَتَّى آتِيَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَأَسْأَلَهُ.‏ فَأَتَاهُ فَسَأَلَهُ, فَقَالَ: " مَوْلَى اَلْقَوْمِ مِنْ أَنْفُسِهِمْ, وَإِنَّهَا لَا تَحِلُّ لَنَا اَلصَّدَقَةُ ".‏ } رَوَاهُ أَحْمَدُ, وَالثَّلَاثَةُ, وَابْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ.

హజ్రత్ అబూ రాఫె (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మఖ్జూమ్ తెగకు చెందిన ఒక వ్యక్తిని జకాత్ వసూళ్ళకై నియమించారు. ఆ వ్యక్తి అబూ రాఫెనుద్దేశించి, ‘నువ్వు కూడా నాతో రా. నీకూ ఇందులో ఎంతో కొంత భాగం లభిస్తుంది’ అని అన్నాడు. ‘దైవప్రవక్త ﷺ ను సంప్రతించి అందలి ఉచితానుచితాల గురించి తెలుసుకునే వరకూ నేను రాలేను’ అని ఆయన బదులిచ్చారు. కనుక ఆయన ﷺ వద్దకు వెళ్ళి ఈ సంగతి గురించి ఆరా తీయగా, ఆయన ﷺ ఇలా అన్నారు : “ఒక జాతి దగ్గర వున్న బానిస కూడా ఆ జాతికి చెందిన వాడే అవుతాడు. మన కోసం సదఖా (జకాత్) ధర్మసమ్మతం కాదు.” (దీనిని అహ్మద్, మరి ముగ్గురు ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్ కూడా)

English

Abu Rafi (RAA) narrated that The Messenger of Allah (ﷺ) appointed a man from Bani Makhzum to collect the Zakah. The man said to Abu Rafi', ‘Accompany me so that you may get a share of it.' Abu Rafi, replied, ‘No! Not until I go to the Prophet and ask him’ He went to the Messenger of Allah (ﷺ) and asked him, and the Prophet replied, “The client (slave) of a certain tribe are like (the members of the tribe) themselves and Zakah is not lawful for us.” Related by Ahmad, the three Imams, Ibn Khuzaimah and Ibn Hibban.

సారాంశం

ఏ వ్యక్తికై జకాత్ సొమ్ము నిషిద్ధం గావించబడిందో అతని వద్ద ఉన్న బానిసకై కూడా అది హరామ్ (నిషిద్ధం) అయిపోతుంది. అబూ రాఫె (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ బానిస అవటం వల్ల ఆయన కోసం కూడా జకాత్ నిషేధించబడింది.

హదీసు ఉల్లేఖకులు

అబూ రాఫె (రదియల్లాహు అన్హు). ఈయన అసలు పేరుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అస్లం అనీ, హుర్‌ముజ్ అనీ, సాబిత్ అనీ, ఇబ్రాహీం అనీ రకరకాలుగా చెప్పబడింది. వాస్తవానికి ఈయన హజ్రత్ అబ్బాస్ బానిస. ఆయన ఈయన్ని దైవప్రవక్తకు కానుకగా సమర్పించుకున్నారు. ఈయన బద్ర్ యుద్ధానికి మునుపు ఇస్లాం స్వీకరించారు. కాని బద్ర్‌లో పాల్గొనలేదు. ఆ తరువాత జరిగిన యుద్ధాలలో పాల్గొన్నారు. హజ్రత్ అబ్బాస్ ఇస్లాం స్వీకరించిన శుభవార్తను ఈయన దైవప్రవక్త ﷺకు వినిపించగా, ఈ ఆనందంలో దైవప్రవక్త ﷺ ఈయనకు స్వేచ్ఛనొసగారు. హిజ్రీ 36లో – హజ్రత్ అలీ పరిపాలనా కాలంలో – మదీనాలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.3 దానధర్మాల పంపిణీ|హదీసు 525

526

హదీసు 526

وَعَنْ سَالِمِ بْنِ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ, عَنْ أَبِيهِ; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يُعْطِي عُمَرَ اَلْعَطَاءَ, فَيَقُولُ: أَعْطِهِ أَفْقَرَ مِنِّي, فَيَقُولُ: "خُذْهُ فَتَمَوَّلْهُ, أَوْ تَصَدَّقْ بِهِ, وَمَا جَاءَكَ مِنْ هَذَا اَلْمَالِ, وَأَنْتَ غَيْرُ مُشْرِفٍ وَلَا سَائِلٍ فَخُذْهُ, وَمَا لَا فَلَا تُتْبِعْهُ نَفْسَكَ".‏ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ సాలిమ్ బిన్ అబ్దుల్లాహ్ (రహిమహుల్లాహ్) బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన తండ్రి ఆధారంగా ఉల్లేఖించారు – దైవప్రవక్త ﷺ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కు ఏదన్నా వస్తువును ఇవ్వబోతే, ‘నాకన్నా పేదవారైన వారికి ఇవ్వండి’ అని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అనేవారు. దానికి సమాధానంగా ఆయన ﷺ, “దీన్ని తీసుకోండి. దీనిద్వారా స్థితిమంతులవండి లేదా దీన్ని ఇతరులకు దానం చేయండి. అత్యాశకు, ప్రలోభానికి పోకుండా ఏదైనా వస్తువు దానంతట అదే మీ వద్దకు వస్తే దాన్ని స్వీకరించండి. అందని దానికోసం మాత్రం ఆరాటపడకండి” అని ఉపదేశించారు. (ముస్లిం)

English

Salim bin ’Abdullah bin ’Umar narrated on the authority of his father (RAA) that the Messenger of Allah (ﷺ) used to give 'Umar bin Al-Khattab something (some money), but he would say to him, ‘Would you give it to a person, who is more needy than me'? The Messenger of Allah (ﷺ) would then say to him, 'Take it. If you are given something from this property, without your having asked for it or being eager to receive it, and if you are not given, do not go and ask for it.” Related by Muslim.

సారాంశం

ఏదేని వ్యవస్థలో పనిచేసే వ్యక్తి -తన జరుగుబాటు నిమిత్తం – వేతనం లేక ప్రతిఫలం తీసుకోవటంలో తప్పులేదని ఈ హదీసు చెబుతోంది. ఈ సంఘటన హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వసూలు చేసిన జకాత్ సొమ్ముపై ప్రతిఫలానికి సంబంధించినదని ‘ముస్లిం’లోని ఒక హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. కాకపోతే మనిషిలో అత్యాశ ఉండకూడదు. పై అధికారులు అతని సేవలను గుర్తించి, అతనికేదైనా ప్రతిఫలం ఇస్తే అది అతని పాలిట ఒక ‘పురస్కారం’ అవుతుంది. అంతేగాని అతడు ధనానికి, కమీషన్‌కు ఆశపడి జకాత్ సొమ్మును వసూలు చేయకూడదు. అలాగే తనకు లభించదనుకున్న దానికోసం అనవసరంగా ప్రాకులాడకూడదు. పేరాశ కూడా ‘హరాం’ క్రిందికే వస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.3 దానధర్మాల పంపిణీ|హదీసు 526