హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు, 1వ అధ్యాయం: నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు. ఈ అధ్యాయంలో 16 హదీసులు (హదీసు 552 – 567) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు

↑ విషయ సూచిక

باب صوم التطوع، وما نهي عن صومه

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

552

హదీసు 552

عَنْ أَبِي قَتَادَةَ اَلْأَنْصَارِيِّ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-سُئِلَ عَنْ صَوْمِ يَوْمِ عَرَفَةَ.‏ قَالَ: " يُكَفِّرُ اَلسَّنَةَ اَلْمَاضِيَةَ وَالْبَاقِيَةَ ", وَسُئِلَ عَنْ صَوْمِ يَوْمِ عَاشُورَاءَ فَقَالَ: " يُكَفِّرُ اَلسَّنَةَ اَلْمَاضِيَةَ " وَسُئِلَ عَنْ صَوْمِ يَوْمِ اَلِاثْنَيْنِ, قَالَ: " ذَلِكَ يَوْمٌ وُلِدْتُ فِيهِ, وَبُعِثْتُ فِيهِ, وَأُنْزِلَ عَلَيَّ فِيهِ " } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) అన్సారీ కథనం : అరఫా దినాన (జిల్ హజ్) ఉపవాసం ఉండటం గురించి దైవప్రవక్త ﷺను ప్రశ్నించగా, “ఇది గడచిన సంవత్సరం పాపాలనూ, వచ్చే సంవత్సరపు పాపాలనూ ప్రక్షాళనం చేస్తుంది” అని ఆయన ﷺ అన్నారు. ఆషూరా దినపు (ముహర్రం) ఉపవాసం గురించి ఆయన్ని ﷺ అడగ్గా, “ఇది గడచిన సంవత్సరపు పాపాలను దూరం చేసివేస్తుంది” అని సెలవిచ్చారు. సోమవారంనాటి ఉపవాసం గురించి ఆయన్ని ప్రశ్నించగా, “ఆ రోజునే నేను పుట్టాను. ఆ రోజునే నాకు దైవదౌత్యం లభించింది. ఆ రోజునే నాపై ఖుర్ఆన్ అవతరింపజేయబడింది”అని తెలిపారు. (ముస్లిం)

English

Abu Qatadah Al-Ansari (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) was asked about fasting on the day of Arafah (the 9th of the month of Dhul Hijjah). He replied, "Fasting on the day of Arafah is an expiation for the preceding year and the following year.” He was also asked about fasting on the day of Ashura (the 10th of the month of Muharram). He replied, “Fasting on the day of Ashura is an expiation for the preceding year.” The Messenger of Allah (ﷺ) was also asked about fasting on Monday, and he replied, "This is the day on which I was born and the day on which I was sent (with the Message of Islam) and the day on which I received revelation." Related by Muslim.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 552

553

హదీసు 553

وَعَنْ أَبِي أَيُّوبَ اَلْأَنْصَارِيِّ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ صَامَ رَمَضَانَ, ثُمَّ أَتْبَعَهُ سِتًّا مِنْ شَوَّالٍ كَانَ كَصِيَامِ اَلدَّهْرِ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) తెలిపారు – “ఎవరయినా రమజాన్ ఉపవాసాలు పాటించి, ఆ తరువాత షవ్వాల్ (నెల)లో కూడా 6 ఉపవాసాలు పాటిస్తే, ఈ ఆచరణ ఒక సంవత్సరకాలం (రోజావ్రతం బూనటం)లాంటిది.” (ముస్లిం)

English

Abu Aiyub Al-Ansari (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: "Whoever fasts during the month of Ramadan and then follows it with six days of Shawwal will be (rewarded) as if he had fasted the entire year." Related by Muslim.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 553

554

హదీసు 554

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا مِنْ عَبْدٍ يَصُومُ يَوْمًا فِي سَبِيلِ اَللَّهِ إِلَّا بَاعَدَ اَللَّهُ بِذَلِكَ اَلْيَوْمِ عَنْ وَجْهِهِ اَلنَّارَ سَبْعِينَ خَرِيفًا } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) వివరించారు – “ఏ వ్యక్తయినా అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం పాటిస్తే, అల్లాహ్ అతని ముఖాన్ని డెబ్బయి సంవత్సరాలపాటు నరకాగ్నికి దూరంగా ఉంచకపోవటం అన్నది అసంభవం.” (బుఖారీ, ముస్లిం- ఈ వాక్యాలు ముస్లింలోనివి)

English

Abu Sa'id Al-Khudri (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “No servant (of Allah) fasts on a day (merely) for the sake of Allah except that Allah pushes the Hellfire seventy years further away from his face, due to fasting on this day.” Agreed upon and the wording is from Muslim.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 554

555

హదీసు 555

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَصُومُ حَتَّى نَقُولَ لَا يُفْطِرُ, وَيُفْطِرُ حَتَّى نَقُولَ لَا يَصُومُ, وَمَا رَأَيْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-اِسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ قَطُّ إِلَّا رَمَضَانَ, وَمَا رَأَيْتُهُ فِي شَهْرٍ أَكْثَرَ مِنْهُ صِيَامًا فِي شَعْبَانَ } مُتَّفَقٌ عَلَيْهِ، وَاللَّفْظُ لِمُسْلِمٍ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) వివరించారు : దైవప్రవక్త ﷺ ఉపవాసాలు పాటిస్తూనే ఉండేవారు. ఆయన ﷺ తీరును గమనించి, “ఇక తమరు ﷺ ఉపవాసాలను బహుశా విరమించరు!” అని మేము అనేవాళ్ళం. అలాగే ఆయన ﷺ ఉపవాసాలను అనేక రోజులపాటు విడనాడేవారు. “బహుశా ఇంక మీరు ఉపవాసాలు ఉండరు” అని మేము అభిప్రాయపడేవారము. ఒక్క రమజాన్ మాసంలో తప్ప మరే మాసంలో కూడా ఆయన ﷺ పూర్తిగా ఉపవాసాలుండటం నేను చూడలేదు. షాబాన్ నెలకన్నా ఎక్కువగా మరే నెలలో కూడా ఆయన ﷺ ఉపవాసాలు (నఫిల్ ఉపవాసాలు) ఉండటం కూడా నేను గమనించలేదు.” (బుఖారీ, ముస్లిం – ఈ వాక్యాలు మాత్రం ‘ముస్లిం’లోనివి)

English

'A’isha (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) used to fast until one would say, he never breaks his fast (i.e. he never stops fasting), and he would abandon fasting (at other times) until one would say that he never fasts. And I never saw the Messenger of Allah (ﷺ) fast for a complete month except for the month of Ramadan, and I never saw him fast in a month more than he did in the month of Sha’ban.” Agreed upon and the wording is from Muslim.

సారాంశం

దైవప్రవక్త ﷺ ఇంచుమించు ప్రతి నెలలో నఫిల్ ఉపవాసాలు ఉండేవారని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతుంది. ఒక్కోసారి అనేక ఉపవాసాలు నిరంతరం పాటించారు. ఒక్కోసారి అనివార్య కారణాల దృష్ట్యా అనేక రోజుల పాటు ఉపవాస దీక్షకు పూనుకునేవారు కాదు. ఇక రమజాన్ నెల రమజాన్ నెలే. అందులో ఉపవాసాలను విడనాడే ప్రసక్తే ఉండదు. ఇతర మాసాల విషయానికివస్తే షాబాన్ నెలలో మాత్రం ఆయన చాలా రోజులు ఉపవాసం ఉండేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 555

556

హదీసు 556

وَعَنْ أَبِي ذَرٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { أَمَرَنَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ نَصُومَ مِنْ اَلشَّهْرِ ثَلَاثَةَ أَيَّامٍ: ثَلَاثَ عَشْرَةَ, وَأَرْبَعَ عَشْرَةَ وَخَمْسَ عَشْرَةَ } رَوَاهُ النَّسَائِيُّ, وَاَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ మాకు ప్రతి నెలా మూడు రోజులు – అంటే పదమూడు, పద్నాలుగు, పదిహేనవ తేదీలలో – ఉపవాసాలుండమని ఆదేశించారు.” (నసాయి, తిర్మిజి దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ‘సహీహ్’గా ధృవీకరించారు)

English

Abu Dharr (RAA) narrated that The Messenger of Allah (ﷺ) commanded us to fast for three days of every month; that is on the days of the full moon; the 13th , 14th , and 15th (of the lunar month).’ Related by An-Nasa’i and At-Tirmidhi and rendered authentic by Ibn Hibban.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 556

557

హదీసు 557

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا يَحِلُّ لِلْمَرْأَةِ أَنْ تَصُومَ وَزَوْجُهَا شَاهِدٌ إِلَّا بِإِذْنِهِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيِّ. وَزَادَ أَبُو دَاوُدَ: { غَيْرَ رَمَضَانَ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) చెప్పారు – “తన భర్త ఇంట్లో ఉండగా అతని అనుమతి లేకుండా ఉపవాస వ్రతం పాటించటం ఏ ఇల్లాలికీ ధర్మసమ్మతం కాదు. ఆ మేరకు భర్త ఆమెకు అనుమతి ఇస్తే ఫరవాలేదు.” (బుఖారీ, ముస్లిం- ఈ వాక్యాలు మాత్రం బుఖారీలోనివి). “ఒక్క రమజాన్ తప్ప” అనే వాక్యం అబూదావూద్లో అదనంగా ఉంది.

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah said, "A woman is not to fast (even) for one day while her husband is present except with his permission" Agreed upon and the wording is from Al-Bukhari. Abu Dawud’s version states, “unless it is during Ramadan (then she does not need his permission as it is obligatory fasting).’’

సారాంశం

భర్త హక్కులు భార్యపాలిట నఫిల్ ఉపవాసాల కన్నా ముఖ్యమైనవన్న దానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. భర్త అనుమతి పొందకుండా భార్య నఫిల్ ఉపవాసాలుండటం హరామ్ (నిషిద్ధం). అయితే ఫర్జ్ రోజులు దీని పరిధిలోకి రావు. ఫర్జ్ రోజాలు ఎట్టి పరిస్థితిలోనూ పాటించవలసిందే. వాటికోసం భర్తను అడగవలసిన అవసరం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 557

558

హదీసు 558

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-نَهَى عَنْ صِيَامِ يَوْمَيْنِ: يَوْمِ اَلْفِطْرِ وَيَوْمِ اَلنَّحْرِ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ రెండు ప్రత్యేక దినాలలో ఉపవాసముండటాన్ని నిషేధించారు. ఒకటి: ఈదుల్ ఫిత్ర్, రెండు : ఈదుల్ అజ్హా.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Sa'id Al-Khudri (RAA) narrated. ‘The Messenger of Allah (ﷺ) has prohibited fasting on two days; the day of Fitr (breaking the fast of Ramadan) and on the day of sacrifice ('Idul Adha).’ Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 558

559

హదీసు 559

وَعَنْ نُبَيْشَةَ اَلْهُذَلِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَيَّامُ اَلتَّشْرِيقِ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ, وَذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ నుబైష హుజలీ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “తష్రీఖ్ దినాలు తినే, త్రాగే, దైవనామస్మరణ చేసే దినాలు.” (ముస్లిం)

English

Nubaishah Al-Hudhali (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “The days of Tashriq (the three days following 'Idul Ad-ha, i.e. 11th , 12th and 13th of Dhul Hijjah) are days of eating, drinking and remembering (dhikr) of Allah, the Most Great and Glorious." Related by Muslim.

సారాంశం

‘తష్రీఖ్ దినాలు’ అంటే బక్రీద్ పండుగ తరువాత నిరంతరం మూడు రోజులు అని భావం. ఈ దినాలలో ఉపవాసం ఉండటం నిషిద్ధం.

హదీసు ఉల్లేఖకులు

నుబైష (రదియల్లాహు అన్హు). ప్రముఖ సహాబీ. ఈయన చేత 11 హదీసులు ఉల్లేఖించబడ్డాయి. బస్రాలో స్థిరపడ్డారు. మనసున్న మనిషిగా పేరు పొందారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 559

560

హదీసు 560

وَعَنْ عَائِشَةَ وَابْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمْ قَالَا: { لَمْ يُرَخَّصْ فِي أَيَّامِ اَلتَّشْرِيقِ أَنْ يُصَمْنَ إِلَّا لِمَنْ لَمْ يَجِدِ اَلْهَدْيَ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “ఖుర్బానీ పశువు లభించని వ్యక్తికి తప్ప-తష్రీఖ్ దినాలలో ఉపవాసం ఉండే అనుమతి ఇవ్వబడలేదు.” (బుఖారీ)

English

'A’isha and lbn 'Umar (RAA) narrated, ‘Nobody was allowed to fast on the days of Tashriq except for those, who could not afford the Hadi (sacrifice).' Related by Al-Bukhari.

సారాంశం

తష్రీఖ్ దినాలలో ఉపవాసం ఉండరాదని చెప్పే హదీసులు అసంఖ్యాకంగా ఉన్నాయి. దీని గురించి పండితులలో భిన్నాభిప్రాయం వ్యక్తమయింది. కొంతమంది విద్వాంసులు ఈ దినాలలో ఉపవాసం ఉండటాన్ని అవాంఛనీయం(మక్రూహ్)గా ఖరారు చేశారు. ఇమామ్ షాఫయి, ఇమామ్ అబూ హనీఫాల దృక్పథం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 560

561

హదీసు 561

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا تَخْتَصُّوا لَيْلَةَ اَلْجُمُعَةِ بِقِيَامٍ مِنْ بَيْنِ اَللَّيَالِي, وَلَا تَخْتَصُّوا يَوْمَ اَلْجُمُعَةِ بِصِيَامٍ مِنْ بَيْنِ اَلْأَيَّامِ, إِلَّا أَنْ يَكُونَ فِي صَوْمٍ يَصُومُهُ أَحَدُكُمْ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు: ‘కేవలం శుక్రవారం రాత్రిని జాగారం కొరకు ప్రత్యేకించుకోకండి. అలాగే కేవలం శుక్రవారం పగలును ఉపవాసం కోసం ప్రత్యేకించుకోకండి. ఉపవాసం ఉండవలసిన రోజు – కాకతాళీయంగా-శుక్రవారంనాడై ఉంటే అది వేరే విషయం.” (ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: "Do not single out Friday night (i.e. the night preceding Friday) among all the other nights for performing the night prayer. Also, do not single out Friday among other days for fasting, unless it coincides with the days one regularly fasts." Related by Muslim.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 561

562

హదీసు 562

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَصُومَنَّ أَحَدُكُمْ يَوْمَ اَلْجُمُعَةِ, إِلَّا أَنْ يَصُومَ يَوْمًا قَبْلَهُ, أَوْ يَوْمًا بَعْدَهُ } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరూ శుక్రవారం నాడు ఉపవాసం ఉండకండి – దానికి ఒక రోజు ముందు లేక ఒకరోజు తరువాత ఉపవాస వ్రతానికి పూనుకుంటే తప్ప.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah, narrated that The Messenger of Allah (ﷺ) said: “None of you should fast on Friday, unless he fasts together with the day before or the day after.” Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 562

563

హదీసు 563

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا اِنْتَصَفَ شَعْبَانَ فَلَا تَصُومُوا } رَوَاهُ اَلْخَمْسَةُ, وَاسْتَنْكَرَهُ أَحْمَدُ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “సగం షాబాన్ తరువాత ఉపవాసాలుండకండి.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు – ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) దీనిని ‘మున్కర్’గా భావించారు)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: "When it is the middle of Sha'ban do not fast (until it is Ramadan).” Related by the five Imams, but Imam Ahmad declared it to be a weak narration.

సారాంశం

రమజాన్లోని ఉపవాసాలు విధిగా నిర్ణయించబడిన సంగతి అందరికీ విదితమే. రమజాన్ నెలలో పాటించబోయే నిరంతర ఉపవాసాల కోసం మనిషి శారీరకంగా, మానసికంగా సంసిద్ధం కావాలి. దానికోసం శక్తిని కూడగట్టుకోవాలి. షాబాన్ నెలలో ఎక్కువగా నఫిల్ ఉపవాసాలు పాటిస్తే మనిషి బలహీనుడైపోవచ్చు. ఈ బలహీనత రమజాన్ నెలలో పాటించబోయే ఫర్జ్ ఉపవాసాలకు అవరోధంగా పరిణమించవచ్చు. అందుకే దైవప్రవక్త ﷺ తన సహచరులకు ఈ విధంగా తాకీదు చేశారు. ఇది ఒక తాకీదు మాత్రమే. ఒకవేళ షాబాన్ నెల చివర్లో ఎవరయినా నఫిల్ ఉపవాసం పాటిస్తే అది నిషిద్ధం మాత్రం కాబోదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 563

564

హదీసు 564

وَعَنِ اَلصَّمَّاءِ بِنْتِ بُسْرٍ رَضِيَ اَللَّهُ عَنْهَا أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا تَصُومُوا يَوْمَ اَلسَّبْتِ, إِلَّا فِيمَا اِفْتُرِضَ عَلَيْكُمْ, فَإِنْ لَمْ يَجِدْ أَحَدُكُمْ إِلَّا لِحَاءَ عِنَبٍ, أَوْ عُودَ شَجَرَةٍ فَلْيَمْضُغْهَا } رَوَاهُ اَلْخَمْسَةُ, وَرِجَالُهُ ثِقَاتٌ, إِلَّا أَنَّهُ مُضْطَرِبٌ. وَقَدْ أَنْكَرَهُ مَالِكٌ. وَقَالَ أَبُو دَاوُدَ: هُوَ مَنْسُوخٌ.

హజ్రత్ సమ్మా బిన్తె బుస్ర్ (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ప్రవచించారు- “శనివారంనాడు ఉపవాసం ఉండకండి- ఆ రోజు ఉపవాసం మీపై విధిగా (ఫర్జ్గా) చేయబడివుంటే తప్ప. కనుక మీలో ఎవరయినాసరే (ఆ రోజు) ద్రాక్ష తొక్క, ఏదైనా వృక్షపు బెరడు దొరికినా దాన్ని తినండి.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు. హదీసును అందజేసినవారు నమ్మకస్థులే గాని ఇందులో కొంత సందిగ్ధం ఉంది. ఇమామ్ మాలిక్ దీనిని తిరస్కరించారు. ఈ హదీసు రద్దుపరచబడిందని అబూదావూద్ వ్యాఖ్యానించారు)

English

As-Samma’ bint Busr (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: "Do not fast on Saturday unless it is an obligatory fast. (Do not fast) even if you do not find anything (to eat) except for some grape peelings or the branch of a tree, in that case he should chew on it." Related by the five Imams and its narrators are reliable. Imam Malik disapproved this narration, and Abu Dawud said that this narration is abrogated.

హదీసు ఉల్లేఖకులు

సమ్మా బిన్తె బుస్ర్ (రదియల్లాహు అన్హా). వేరొక ఉల్లేఖనం ప్రకారం ఈమె పేరు బుహైమా బిన్తె బుస్ర్ అని కూడా తెలుస్తోంది. సహాబియాగా పరిగణించబడ్డారు. ఈమె అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్కు తోబుట్టువు అనీ, అత్తగారని భిన్నాభిప్రాయాలున్నాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 564

565

హదీసు 565

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَكْثَرَ مَا كَانَ يَصُومُ مِنَ اَلْأَيَّامِ يَوْمُ اَلسَّبْتِ, وَيَوْمُ اَلْأَحَدِ, وَكَانَ يَقُولُ: " إِنَّهُمَا يَوْمَا عِيدٍ لِلْمُشْرِكِينَ, وَأَنَا أُرِيدُ أَنْ أُخَالِفَهُمْ " } أَخْرَجَهُ النَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَهَذَا لَفْظُهُ.

హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ శనివారం, ఆదివారం చాలా సార్లు ఉపవాసం పాటించేవారు. “ఈ రెండు రోజులూ ముష్రికుల పండుగ రోజులు. నేను వీటిని వ్యతిరేకించదలుస్తున్నాను” అని ఆయన ﷺ అంటూ ఉండేవారు. (దీనిని ఇమామ్ నసాయి (రహిమహుల్లాహ్) ఉల్లేఖించారు. ఇమామ్ ఇబ్నె ఖుజైమ (రహిమహుల్లాహ్) ఈ హదీసును ప్రామాణికంగా నిర్ధారించారు. హదీసు వాక్యాలు మాత్రం ఇబ్నె ఖుజైమావి)

English

Umm Salamah (RAA) narrated, The Messenger of Allah (ﷺ) used to fast more often on Saturdays and Sundays than on the other days. He would say, "They are the 'ids of the polytheists, and I love to act contrary to what they do." Related by An-Nasal and was rendered authentic by Ibn Khuzaimah, and the wording is his.

సారాంశం

ఇంతకు ముందు వచ్చిన హదీసులో దైవప్రవక్త ﷺ శనివారం నాడు ఉపవాసం పాటించడాన్ని వారించినట్లుంది. కాని ఆ ఉల్లేఖనం రద్దుపరచబడింది. హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) గారి పై హదీసు ప్రకారం ఈ హదీసు రద్దయిపోయింది. యూదులు శనివారాన్ని, క్రైస్తవులు ఆదివారాన్ని పర్వదినంగా భావించేవారు. అందుచేత ఆయన ఈ రెండు దినాలలో ఉపవాసాలు పాటించి అవి పండుగ రోజులుగానీ, పవిత్ర రోజులుగానీ కావని స్పష్టం చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 565

566

హదీసు 566

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-{ نَهَى عَنْ صَوْمِ يَوْمِ عَرَفَةَ بِعَرَفَةَ } رَوَاهُ اَلْخَمْسَةُ غَيْرَ اَلتِّرْمِذِيِّ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَالْحَاكِمُ, وَاسْتَنْكَرَهُ الْعُقَيْلِيُّ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ అరఫాత్ మైదానంలో, అరఫా దినాన ఉపవాసం ఉండటాన్ని వారించారు. (‘ఐదుగురి’లో తిర్మిజీ తప్ప మిగిలినవారు దీనిని ఉల్లేఖించారు – ఇమామ్ ఇబ్నె ఖుజైమ, ఇమామ్ హాకిమ్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు. ఇమామ్ ఉఖైలీ దీనిని ఆమోదించలేదు)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) forbade fasting on the day of Arafah for the one who is actually at Arafah (i.e. performing Hajj). Related by the five Imams except for At-Tirmidhi. Ibn Khuzaimah and al-Hakim graded it as Sahih.

సారాంశం

అరఫాత్ మైదానంలో హజ్ యాత్రీకులు అరఫా ఉపవాసం పాటించటం నిషిద్ధం (హరామ్) అన్నదానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. ఇమామ్ యహ్యా బిన్ సయీద్ అన్సారీ కూడా దీన్ని సమర్థించారు. సునన్ నసాయి, తిర్మిజీలలో “అరఫా దినం మా పండుగ దినం” అన్న హజ్రత్ ఉఖబా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) హదీసు కూడా దీన్ని సమర్థిస్తోంది. అంటే అరఫాత్లో ఉండేవారి కొరకు ఆ రోజు పండుగ రోజు. అందువల్ల వారు ఆ రోజున ఉపవాసం పాటించటం సమ్మతం కాదు. అయితే అధిక సంఖ్యాక పండితులు ఆ రోజు ఉపవాసం ఉండకపోవటం ‘ముస్తహబ్’ (అభిలషణీయం) అని మాత్రం అభిప్రాయపడ్డారు. దైవప్రవక్త ﷺ సయితం అంతిమ హజ్ యాత్ర సందర్భంగా అరఫా దినాన ఉపవాసం ఉండలేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 566

567

హదీసు 567

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا صَامَ مَنْ صَامَ اَلْأَبَدَ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ عَنْ أَبِي قَتَادَةَ بِلَفْظِ: { لَا صَامَ وَلَا أَفْطَرَ }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “ఎల్లప్పుడూ ఉపవాసం ఉండేవాడు (అసలు) ఉపవాసమే ఉండలేదు.” (బుఖారీ, ముస్లిం) ముస్లింలో అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఇలా ఉంది: “ఉపవాసమూ ఉండలేదు, ఇఫ్తార్ కూడా చేయలేదు.”

English

’Abdullah Ibn 'Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “May he, who perpetually fasts (without a break) never fast." Agreed upon.

Muslim narrated on the authority of Abu Qatadah, “May he not fast or break his fast."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|5. ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు|5.1 నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు|హదీసు 567