హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 3.0 అంత్యక్రియల పుస్తకం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 3. అంత్యక్రియల పుస్తకం, 3.0: అంత్యక్రియల పుస్తకం. ఈ అధ్యాయంలో 58 హదీసులు (హదీసు 425 – 482) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

3.0 అంత్యక్రియల పుస్తకం

↑ విషయ సూచిక

425

హదీసు 425

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَكْثِرُوا ذِكْرَ هَاذِمِ اَللَّذَّاتِ: اَلْمَوْتِ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “రుచులను, రసాస్వాదనలను త్రెంచివేసే దానిని (మృత్యువును) అత్యధికంగా స్మరిస్తూ ఉండండి.” (దీనిని తిర్మిజీ, నసాయి ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ ప్రామాణిక హదీసుగా ఖరారు చేశారు)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah said: “Remember, as much as you can, the one thing (fact or reality) which (always) brings an end to all worldly joys and pleasures, (meaning death)”Related by At-Tirmidhi, An-Nasa’i and Ibn Hibban.

సారాంశం

మరణం ఒక సత్యం. మరణం తథ్యం. ఆది నుండి అంతం వరకూ ఏ ఒక్కరూ దీన్ని కాదనలేదు. కాదనలేరు కూడా. అనుదినం ఇది మానవులకు కనిపిస్తూనే ఉంటుంది. ఆత్మీయులలో, బంధు మిత్రులలో, ఇరుగుపొరుగు వారిలో, మనం నివసించే గ్రామాలలో ఎవరో ఒకరు మృత్యువాతన పడుతూనే ఉంటారు. ఇటువంటి సందర్భాలలో సహజంగానే గుండెలు కరుగుతాయి. భావాలు, భావోద్రేకాలు ఉప్పొంగుతాయి. మనిషిలో దైవభీతి, పరలోక భీతి పెంపొందుతుంది. ఆత్మావలోకనం చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రళయదృశ్యం కనుల ముందు కదలాడుతుంది. ఇహలోక జీవిత వాస్తవం అర్థమవుతుంది. పరలోక సామగ్రిని సమకూర్చుకోవాలన్న తహతహ మొదలవుతుంది. పర్యవసానంగా మానవుడు సదాచరణ వైపునకు మొగ్గుతాడు. అందుకే మరణాన్ని వీలయినంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని ఉపదేశించబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 425

426

హదీసు 426

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَتَمَنَّيَنَّ أَحَدُكُمُ اَلْمَوْتَ لِضُرٍّ نَزَلَ بِهِ, فَإِنْ كَانَ لَا بُدَّ مُتَمَنِّيًا فَلْيَقُلْ: اَللَّهُمَّ أَحْيِنِي مَا كَانَتِ اَلْحَيَاةُ خَيْرًا لِي, وَتَوَفَّنِي مَا كَانَتِ الْوَفَاةُ خَيْرًا لِي } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “మీలో ఎవరయినా సరే వారిపై వచ్చి పడిన కష్టాలు, ఆపదల కారణంగా మృత్యువును ఎన్నడూ కోరుకోరాదు. ఒకవేళ ఆ కోరిక అవశ్యమయిపోతే ఈ విధంగా అనాలి – ‘ఓ అల్లాహ్! ఎన్నాళ్ళపాటు నేను బ్రతికి ఉండటం నాకు శ్రేయస్కరమో అప్పటి వరకూ నాకు జీవితం ప్రసాదించు. మరణం నా పాలిట శ్రేయోదాయకమైనపుడు నాకు మృత్యువు నొసగు.” (బుఖారీ, ముస్లిం)

English

Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "None of you should wish for death due to any affliction, which might have affected him. But if he feels compelled to wish for it (due to extreme distress that he feels he cannot bear), he should say: “O Allah! Grant me life as long as life is better for me, and let me die when death is better for me.” Agreed upon.

సారాంశం

ఒక నిజమయిన, నికార్సయిన మోమిన్ (విశ్వాసి) కొరకు జీవితం గొప్ప వరం లాంటిది. సజ్జనుడు జీవితకాలంలో తన సదాచరణలను, సత్కార్యాలను వృద్ధి చేసుకుంటూనే పోతాడు. గతంలో తనవల్ల జరిగిన పాపాలపై సిగ్గుతో కుమిలిపోతూ పశ్చాత్తాపం చెందుతాడు అని దైవప్రవక్త ﷺ చెప్పారు. పాపాత్ముడు, దుష్టుడు, దుర్మార్గుడయినవాడికి కూడా ఈ జీవితం ఒక అవకాశం వంటిది. అతను గనక జీవిత సత్యాన్ని తెలుసుకోగలిగితే ఒక్కక్షణం తన పాపాల ప్రక్షాళనకై ప్రయత్నించగలుగుతాడు. గతాన్ని మరచి భవిష్యత్తులో తనను కాపాడుకునే ఉపాయాలు ఆలోచిస్తాడు. చేసిన తప్పులపై సిగ్గు పడుతూ తన ప్రభువు వైపునకు మరలిపోతాడు. అందుకే కష్టాలకు, కడగండ్లకు, దారిద్ర్యానికి, లేమికీ, వ్యాధికీ విసుగెత్తిపోయి మరణాన్ని కాంక్షించరాదనీ, జీవించడానికి ఇహలోకంలో దొరికిన అవకాశాన్ని శాశ్వితమైన పరలోకం కోసం సద్వినియోగం చేసుకోవాలని దైవప్రవక్త ﷺ ఉపదేశించారు. అయితే సర్వలోక ప్రభువును వీలయినంత త్వరగా కలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే అప్పుడు మరణాన్ని కాంక్షించవచ్చు. అలా కాంక్షించటం విశ్వాసపరిపూర్ణతకు ప్రబల నిదర్శనం కూడాను. ఒకవేళ ధర్మావలంబనలో కఠినపరీక్షలు ఎదురై, విశ్వాసం ప్రమాదంలో పడబోతుందని భావించినపుడు కూడా మృత్యువును కోరుకోవచ్చు. అంతేగాని ప్రాపంచిక కష్టాలతో కలతచెంది కాటికి కాళ్ళు చాపాలనుకోవటం ధీరత్వం కాదు. ఈ కష్టాల కొలిమిలో విశ్వాసి ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా మెరిసి పోతాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 426

427

హదీసు 427

وَعَنْ بُرَيْدَةَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { اَلْمُؤْمِنُ يَمُوتُ بِعَرَقِ الْجَبِينِ } رَوَاهُ اَلثَّلَاثَةُ وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ.

దైవప్రవక్త ﷺ ప్రవచించినట్లు హజ్రత్ బురైద (రదియల్లాహు అన్హు) తెలిపారు. దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “విశ్వాసికి మరణ సమయం ఆసన్నమైనపుడు అతని నుదుటిపై చెమట ప్రస్ఫుటమవుతుంది.” (ఈ ఉల్లేఖనాన్ని ముగ్గురు- తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజ – ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)

English

Buraidah (RAA) narrated that the messenger of Allah (ﷺ) said: “The believer dies while his forehead is sweating." Related by the three Imams.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 427

428

హదీసు 428

وَعَنْ أَبِي سَعِيدٍ وَأَبِي هُرَيْرَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَا: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَقِّنُوا مَوْتَاكُمْ لَا إِلَهَ إِلَّا اَللَّهُ } رَوَاهُ مُسْلِمٌ, وَالْأَرْبَعَةُ.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హుమా) మరియు హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు: “మరణ ఘడియలు సమీపించిన మనిషికి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ గురించి ప్రోత్సహించండి.” (దీనిని ముస్లింతో పాటు మరో నలుగురు – అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజ – కూడా ఉల్లేఖించారు)

English

Abu Sa’id and Abu Hurairah (RAA) narrated that the messenger of Allah (ﷺ) said: “Remind those who are on their death bed of the Shahadah “La'Ilaha illall-ah.” (for them to say it, hoping it will be their last words)”

సారాంశం

కలిమా అంటే ఇక్కడ కేవలం ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని మాత్రమే కాదు, పూర్తి కలిమాను ఉపదేశించాలి. మరణ ఘడియలు దాపురించిన మనిషికి దగ్గర్లో కూర్చున్నవారు కూడా ఈ కలిమాను పఠిస్తూ ఉండవచ్చు. మరణించే వ్యక్తికి స్పృహ ఉంటే కలిమాను అతనిచేత చదివించే ప్రయత్నం చేయాలి. దైవప్రవక్త ﷺ ఖుద్దుగా, మరణించే ఒక వ్యక్తికి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ పఠించమని చెప్పినట్లు ఆధారముంది. (ముస్నద్ అహ్మద్)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 428

429

హదీసు 429

وَعَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { اقْرَؤُوا عَلَى مَوْتَاكُمْ يس } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ.

హజ్రత్ మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మరణించే మీ ఆత్మీయుని ముందు యాసీన్ సూరా పఠించండి.” (దీనిని అబూ దావూద్, నసాయి ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు)

English

Ma'qil bin Yasar (RAA) narrated that the messenger of Allah (ﷺ) said: “Recite Yasin (Surah no. 36), over those who are dying.” Related by Abu Dawud, An-Nasa'i and Ibn Hibban graded it as Sahih

హదీసు ఉల్లేఖకులు

మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) ముజైనా తెగకు చెందిన సహాబి. హుదైబియా ఒడంబడికకు ముందు ఇస్లాం స్వీకరించారు. ‘బైతె రిజ్వాన్’లో పాల్గొన్నారు. బస్రాలో ఈయన పేరుతో ఒక కాలువ ఉంది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆజ్ఞానుసారం ఈయన ఆ కాలువను త్రవ్వారు. అరబ్బుల్లో ఒక లోకోక్తి ఉంది- ‘దేవుని కాలువ (వర్షపు నీరు) ముందు మాఖిల్ కాలువ ఏపాటిది?’ అన్నది దాని భావం. ఈయన అమీర్ ముఆవియ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ ఆఖరికాలంలో – హిజ్రీ 60లో మరణించారు. యజీద్ కాలంలో మరణించారని మరికొందరి వాదన.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 429

430

హదీసు 430

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { دَخَلَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَلَى أَبِي سَلَمَةَ ‏- رضى الله عنه ‏- وَقَدْ شُقَّ بَصَرُهُ فَأَغْمَضَهُ, ثُمَّ قَالَ: "إِنَّ اَلرُّوحَ إِذَا قُبِضَ, اتَّبَعَهُ الْبَصَرُ" فَضَجَّ نَاسٌ مِنْ أَهْلِهِ, فَقَالَ: "لَا تَدْعُوا عَلَى أَنْفُسِكُمْ إِلَّا بِخَيْرٍ.‏ فَإِنَّ اَلْمَلَائِكَةَ تُؤَمِّنُ عَلَى مَا تَقُولُونَ".‏ ثُمَّ قَالَ: "اَللَّهُمَّ اغْفِرْ لِأَبِي سَلَمَةَ, وَارْفَعْ دَرَجَتَهُ فِي اَلْمَهْدِيِّينَ, وَافْسِحْ لَهُ فِي قَبْرِهِ, وَنَوِّرْ لَهُ فِيهِ, وَاخْلُفْهُ فِي عَقِبِهِ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : అబూ సలమా (రదియల్లాహు అన్హా) మరణ సమయంలో దైవప్రవక్త ﷺ అక్కడికి ఏతెంచారు. ఆ సమయంలో ఆయన కనుగ్రుడ్లు తెరచుకుని ఉన్నాయి. ఆయన ﷺ వాటిని (కనురెప్పలను) మూసివేశారు. అనంతరం ఇలా ప్రవచించారు: “ఆత్మ శరీరాన్ని వీడిపోతున్నప్పుడు కళ్ళు దానిని వెంబడిస్తాయి.” అంతలో ఇంట్లోని వారంతా గొల్లుమన్నారు. బిగ్గరగా ఏడ్వసాగారు. ఆయన ﷺ వారందరినీ ఉద్దేశించి, “మీ కొరకు ఉత్తమమయిన వేడుకోలు చేయండి. ఎందుకంటే మీరు ఏది పలికినా దైవదూతలు ‘తథాస్తు’ అని అంటారు” తరువాత ఆయన ﷺ ఇలా ప్రార్థించారు-“దేవా! అబూ సలమా (రదియల్లాహు అన్హు)ను మన్నించు. సన్మార్గం పొందిన వారిలో ఈయన అంతస్తును ఉన్నతం గావించు. ఈయన సమాధిని విశాలవంతంగా చెయ్యి. జ్యోతిర్మయం గావించు. ఈయన వెనకనున్న వారిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చెయ్యి.” (ముస్లిం)

English

Umm Salamah (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) came to see Abu Salamah when his sight had become fixed (with his eyes open, as he had already passed away). So the Prophet (ﷺ), closed his eyes and said, “When the soul is seized and leaves the body, the sight follows it.’ Some of Abu Salamah's family wept and wailed, whereupon the Messenger of Allah said to them, ‘Do not supplicate to Allah anything except that which is good for you (i.e. do not say anything which goes against you at that moment), because the angels (who are present at the time of death), say “Amin" (asking Allah to accept your invocation) to whatever you say.” Then he said, "O Allah! Forgive Abu Salamah, raise his status among (Your) rightly guided servants, make his grave spacious, and fill it with light for him, and be his successor in taking good care of his descendants whom he has left behind, (and make them pious).” Related by Muslim.

సారాంశం

మరణించేవాని ఆత్మ ఊర్ధ్వలోకాలకు పయనమవుతున్నప్పుడు సాధారణంగా అతని కళ్ళు తెరచుకుని ఉంటాయని ఈ హదీసు చెబుతోంది. వాటిని తొందరగా మూసివేయాలి. శరీరం చల్లారిపోయిన తరువాత కనురెప్పలు మూతబడటం దుర్లభమవుతుంది. కళ్ళు గనక తెరచుకునే వుంటే భౌతిక కాయం చూసేవారికి భయంకరంగా కనిపిస్తుంది. మరణ సమీపంలో మృతుని వారసులు, బంధువులు, ఆత్మీయులు దగ్గరుండటం మంచిదని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది. మృతుని అంత్యక్రియలు జరగక ముందు కూడా అతని క్షమాపణకై దైవాన్ని ప్రార్థించవచ్చన్న సంగతి కూడా స్పష్టమవుతున్నది.

హదీసు ఉల్లేఖకులు

అబూ సలమా (రదియల్లాహు అన్హు). ఈయన అసలు పేరు అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అసద్ మఖ్జూమీ ఖురషీ. ఈయన దైవప్రవక్త ﷺకు బంధువులు. వరుసకు మేనత్త కొడుకు. మహాప్రవక్త ﷺకు, హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు)కు పాల సోదరుడు కూడా అవుతారు. అబూ లహబ్‌చే స్వేచ్ఛ నొసగబడిన ఒక బానిసరాలు ఈ ముగ్గురికీ పాలు త్రాగించింది. ఈయన తన సతీమణితో కలసి హిజ్రత్ చేశారు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఉహుద్ సంగ్రామంలో గాయపడ్డారు. గాయం మానిందిగాని తరువాత మళ్ళీ తిరగబెట్టింది. హిజ్రీ 4వ సంవత్సరం జమాది వుల్ ఊలాలో మరణించారు. ఈయన మరణానంతరం ఈయన సతీమణి ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా)ను షవ్వాల్ నెలలో దైవప్రవక్త ﷺ తన దాంపత్య జీవితంలోకి తెచ్చుకున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 430

431

హదీసు 431

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا: { أَنَّ النَّبِيَّ – صلى الله عليه وسلم ‏-حِينَ تُوُفِّيَ سُجِّيَ بِبُرْدٍ حِبَرَةٍ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “దైవప్రవక్త ﷺ మరణించినపుడు ఆయన్ని ﷺ ఒక చారలు గల దుప్పటితో కప్పటం జరిగింది.” (బుఖారీ, ముస్లిం)

English

A’ishah (RAA) narrated ‘When the Messenger of Allah (ﷺ) died, he was covered with a Yemeni mantle that had some designs on it.' Agreed upon.

సారాంశం

మృతునికి స్నానం చేయించక ముందు చారలున్న దుప్పటితో కప్పవచ్చు. దైవప్రవక్తలు కూడా మానవ మాత్రులేననీ, ఏదో ఒకనాడు వారిని సయితం మృత్యువు కబళిస్తుందని, ఈ సత్యాన్ని ఎవరూ తృణీకరించలేరని మహనీయ ముహమ్మద్ ﷺ వారి మరణం రుజువు చేస్తోంది. ఒక సాధారణ మానవునికి ఏవిధంగా అంత్యక్రియలు చేయబడతాయో అదేవిధంగా దైవప్రవక్త ﷺలకు కూడా అంత్యక్రియలు చేయబడతాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 431

432

హదీసు 432

وَعَنْهَا { أَنَّ أَبَا بَكْرٍ اَلصِّدِّيقَ ‏- رضى الله عنه ‏- قَبَّلَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعْدَ مَوْتِهِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “ఆయన ﷺ మరణించినపుడు హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని ﷺ – అంటే ఆయన నుదుటిని – ముద్దాడారు. (బుఖారీ)

English

A’ishah (RAA) reported That Abu Bakr kissed the Prophet (ﷺ) after he had died.’ Related by Al-Bukhari.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 432

433

హదీసు 433

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { نَفْسُ اَلْمُؤْمِنِ مُعَلَّقَةٌ بِدَيْنِهِ, حَتَّى يُقْضَى عَنْهُ } رَوَاهُ أَحْمَدُ, وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “విశ్వాసి ఆత్మ అతడు చేసిన అప్పును (అంటిపెట్టుకుని ఉంటుంది); దాన్ని తీర్చేవరకూ ఎటూకాని స్థితిలో ఊగిసలాడుతూ ఉంటుంది.” (అహ్మద్, తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు – తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేశారు)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah said, "A believer‘s soul remains suspended according to his debt until it is settled or paid off on his behalf". Related by Ahmad and At-Tirmidhi.

సారాంశం

ఇది ‘హుఖూఖుల్ ఇబాద్’ (దాసుల హక్కులు)కు సంబంధించిన విషయం. దాసుల హక్కులకు ఇస్లాంలో ఎంత ప్రాధాన్యం ఉందో, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించటం ఎంత అవసరమో ఆలోచించాలి. దాసుల హక్కుల వ్యవహారంలో దేవుడు కూడా తలదూర్చడు. తనకు రావలసిన హక్కును రుణదాత క్షమించనంత వరకూ లేక ఆ రుణాన్ని మృతుని వారసులు చెల్లించనంతవరకూ ఆ మృతుని ఆత్మ మధ్యలో ఊగిసలాడుతూనే ఉంటుంది. ఎందుకంటే రుణం తీసుకునేటప్పుడు, దాన్ని తిరిగి ఇచ్చే సంకల్పంతో తీసుకోబడింది. ఈ బాధ్యత మృతునిపై ఉంది. మృతుని వారసులు ఒకవేళ ఈ రుణభారాన్ని భరించలేని స్థితిలో ఉంటే సమాజంలోని శ్రేయోభిలాషులు దాన్ని తీర్చేందుకు కృషిచేయాలి. లేదా ఇస్లాం శ్రేయోరాజ్యం తన పౌరుని బాధ్యతను తనపై వేసుకుని అతన్ని రుణభారం నుంచి విముక్తి నొసగాలి.

దైవప్రవక్త ﷺ ఇలా ఉద్ఘోషించారు – “మృతుడు తన వెనుక ఏదన్నా ఆస్తి వదలివెళితే అది అతని వారసుల హక్కు అవుతుంది. ఒకవేళ అతడు అప్పులు చేసి వెళితే దాన్ని తీర్చవలసిన బాధ్యత నాపై, నా రాజ్యప్రతినిధులపై ఉంది. మేము దాన్ని చెల్లిస్తాము.”

కేవలం ఒక రుణభారం విషయంలోనే ఇంత తీవ్రమయిన హెచ్చరిక చేయబడినపుడు మోసం, దగా, వంచనలతో సాటి మానవుల హక్కులను కాలరాచేవారి పరిణామం ఇంకెంత వికృతంగా ఉంటుందో కాస్త ఆలోచించండి!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 433

434

హదీసు 434

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ فِي اَلَّذِي سَقَطَ عَنْ رَاحِلَتِهِ فَمَاتَ: { اغْسِلُوهُ بِمَاءٍ وَسِدْرٍ, وَكَفِّنُوهُ فِي ثَوْبَيْنِ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : వాహనంపై నుంచి క్రిందపడి ప్రాణం విడిచిన వ్యక్తి గురించి దైవప్రవక్త ﷺ “ఇతన్ని రేగు ఆకులతో, నీళ్ళతో స్నానం చేయించి, అతనికే చెందిన రెండు దుప్పట్లతో కఫన్ ఏర్పాటు చేయండి” అని అన్నారు. (బుఖారీ)

English

Ibn ‘Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said concerning the man who fell off his mount and died during Hajj, “Wash him with water and Sidr (lotus leaves) and shroud him in his two garments (that he was wearing for Ihram).” Agreed upon.

సారాంశం

ఇది హజ్ సందర్భంగా జరిగిన సంఘటన. చనిపోయిన వ్యక్తి దైవప్రవక్త ﷺ సహచరులలో ఒకరు. ఇహ్రామ్ కట్టుకుని అరఫాత్ మైదానానికి వచ్చి ఉన్నారు. అకస్మాత్తుగా ఒంటె మీదినుంచి క్రిందపడి, మెడకు గాయమై చనిపోయారు.

ఈ హదీసు ద్వారా అనేక ముఖ్యాంశాలు వెలుగులోకి వస్తున్నాయి –

(1) అరఫాత్ మైదానానికి వాహనంపై వెళ్ళటం ధర్మసమ్మతమే.

(2) వాహనంగా ఒంటెను కూడా ఉపయోగించుకోవచ్చు.

(3) ఇహ్రామ్ స్థితిలో మరణించిన వ్యక్తికి కూడా రేగు ఆకులతో, నీళ్ళతో స్నానం చేయించాలి.

(4) అతని కోసం కొత్తగా కఫన్ వస్త్రాన్ని తేవలసిన అవసరం లేదు, ఇహ్రామ్ వస్త్రంలోనే చుట్టి, దానినే కఫన్గా తలపోయాలి. ఈ మృతుని తలను కప్పటంగాని, సువాసన పూయటం గానీ చేయరాదు. తల కప్పబడకుండా, సుగంధ ద్రవ్యం చల్లకుండా ఉండటంలోని పరమార్థం ఏమిటంటే, ఆ వ్యక్తి ప్రళయదినాన ఇహ్రామ్ స్థితిలోనే లేచి ‘తల్బియా’ (లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్….) పఠిస్తూ దైవసమక్షంలోకి హాజరవుతాడు (ఇన్షా అల్లాహ్).

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 434

435

హదీసు 435

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { لَمَّا أَرَادُوا غَسْلَ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالُوا: وَاَللَّهُ مَا نَدْرِي, نُجَرِّدُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-كَمَا نُجَرِّدُ مَوْتَانَا, أَمْ لَا?….‏.‏ } اَلْحَدِيثَ، رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ప్రవక్త ప్రియసహచరులు (రదియల్లాహు అన్హుమ్) దైవప్రవక్త ﷺ భౌతిక కాయానికి స్నానం చేయించ సంకల్పించినపుడు వాళ్ళు ఇలా అన్నారు: దైవసాక్షి! మేము మా మృతుల దుస్తులను తొలగించే విధంగా దైవప్రవక్త ﷺ దుస్తులను తొలగించాలో లేదో మాకు తెలీటం లేదు.” తరువాత హదీసునంతటినీ వివరించారు. (అహ్మద్, అబూదావూద్)

English

A’ishah (RAA) narrated, ‘When the Messenger of Allah (ﷺ) died and they wanted to make Ghusl (full ritual washing of the body), they said, ‘By Allah we do not know whether we should take off the clothes of Allah’s Messenger as we do for our dead or not?’ Related by Ahmad and Abu Dawud.

సారాంశం

పూర్తి హదీసు సారాంశం ఏమిటంటే, ఈ డోలాయమాన స్థితిలోనే ప్రియసహచరులపై ఒక విధమైన మైకం ఆవరించింది. ఆ స్థితిలోనే వారు ఎవరో చెప్పగా విన్నారు – దైవప్రవక్త ﷺకు దుస్తుల సమేతంగా స్నానం చేయించమని! అందుచేత సహచరులు ఆయన ﷺ ఒంటిపైనున్న దుస్తులను తీయకుండానే స్నానం చేయించారు. దైవప్రవక్త ﷺ ఇతర మనుషులకన్నా ఉత్తములు – మానవశ్రేష్ఠులవటం చేత ప్రియ సహచరులు ఆ సమయంలో సందిగ్ధావస్థకు లోను అయ్యారు. అంతేగాని మృతునికి స్నానం చేయించే సమయంలో శరీరంపైన దుస్తులను తొలగించటానికి సంకోచించ వలసిన పనిలేదు. అయితే శవస్నానం చేయించేటప్పుడు కూడా ‘సతర్’పై ఆచ్ఛాదన కోసం ఒక గుడ్డను కప్పటం అవసరం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 435

436

హదీసు 436

وَعَنْ أُمِّ عَطِيَّةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { دَخَلَ عَلَيْنَا اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-وَنَحْنُ نُغَسِّلُ ابْنَتَهُ، فَقَالَ: "اغْسِلْنَهَا ثَلَاثًا, أَوْ خَمْسًا, أَوْ أَكْثَرَ مِنْ ذَلِكَ، إِنْ رَأَيْتُنَّ ذَلِكَ, بِمَاءٍ وَسِدْرٍ, وَاجْعَلْنَ فِي الْأَخِيرَةِ كَافُورًا, أَوْ شَيْئًا مِنْ كَافُورٍ"، فَلَمَّا فَرَغْنَا آذَنَّاهُ, فَأَلْقَى إِلَيْنَا حِقْوَهُ.‏فَقَالَ: "أَشْعِرْنَهَا إِيَّاهُ" } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ: { ابْدَأْنَ بِمَيَامِنِهَا وَمَوَاضِعِ اَلْوُضُوءِ مِنْهَا }. وَفِي لَفْظٍ ِللْبُخَارِيِّ: { فَضَفَّرْنَا شَعْرَهَا ثَلَاثَةَ قُرُونٍ, فَأَلْقَيْنَاهَا خَلْفَهَا }.‏‏

హజ్రత్ ఉమ్మె అతియ (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ మా వద్దకు వచ్చినపుడు మేము ఆయన ﷺ కుమార్తె భౌతిక కాయానికి స్నానం చేయిస్తున్నాము. “మీరు అవసరమనుకుంటే ఈమెకు మూడుసార్లు, లేక ఐదుసార్లు, లేక అంతకన్నా ఎక్కువ సార్లు నీళ్ళు పోయండి. నీళ్ళతో, రేగు ఆకులతో స్నానం చేయించండి. ఆఖర్లో కర్పూరం ఉపయోగించండి” అని అన్నారు. స్నానం చేయించటం పూర్తయ్యాక మేము ఆయన ﷺ కు కబురంపాము. ఆయన ﷺ తన లుంగిని మా వైపునకు విసిరి “దీన్ని మృతదేహంపై కప్పండి” అని అన్నారు. (బుఖారీ, ముస్లిం)

గుసుల్ (స్నానం) కుడి వైపు నుంచి, వుజూ భాగాల నుంచి మొదలెట్టాలని ఒక ఉల్లేఖనంలో వుంది. బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా వుంది – “మేము ఆమె శిరోజాలను మూడు పాయలుగా విభజించి వాటిని వీపు వైపునకు ఉంచాము.”

English

Umm ‘Atiyah (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) came to us when we were washing his daughter (Zainab) after she had died and said, “Wash her three times, five times or more if necessary, with water and lotus leaves (Sidr) and apply some camphor to the last washing.” When we finished making Ghusl for her, we informed the Messenger of Allah (ﷺ) and he threw his Izar (a cloth, which he wore round his waist) to us and told us to wrap her in it as the first sheet of the shroud (next to her body).’ Agreed upon. In another narration, “Start by washing the organs on the right and those parts that are washed in ablution.” In the narration of Al-Bukhari, “We braided her hair in three braids and made them fall at her back.”

సారాంశం

ఒక ప్రముఖ ఉల్లేఖనం ప్రకారం ఇది ఆయన ﷺ కుమార్తె, అబుల్ ఆస్ సతీమణి అయిన హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా)కు సంబంధించిన వృత్తాంతం. ఈమె హిజ్రీ 8వ సంవత్సరంలో మరణించారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం మృతురాలు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సతీమణి అయిన ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) అని కూడా తెలుస్తున్నది. ఆ కాలంలో ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) మరణించిన మహిళలకు గుసుల్ (స్నానం) చేయించేవారు.

భౌతికకాయానికి కనీసం మూడు లేక ఐదుసార్లు లేక ఏడుసార్లు నీళ్ళుపోయాలని ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది. అంటే బేసి సంఖ్యను దృష్టిలో పెట్టుకోవాలన్నమాట! స్నానం కుడివైపు నుంచి, అందునా వుజూలో ఏ శరీర భాగాల నుంచి కడగటం మొదలెడతారో ఆ శరీర భాగాల నుంచే ఆరంభించాలి. స్నానం చేయించిన తరువాత శుభసూచకంగా ఎవరయినా మహనీయుని అంగవస్త్రాన్ని మృతునికి తొడిగించటం ఆక్షేపణీయం కాదు. స్త్రీ తలవెంట్రుకలను మూడు పాయలుగా విభజించి వీపు వైపునకు ఉంచాలి. శిరోజాలను రెండు పాయలుగా చేసి రొమ్ముపై ఉంచటం సరైంది కాదు. రేగు ఆకులతో, నీళ్ళతో మృతునికి స్నానం చేయించాలని కూడా ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. చివర్లో కర్పూరం కలిసిన నీరు పోయాలి. లేదా కర్పూరాన్ని శరీరంపై పులమాలి. కర్పూరమేగాక ఇతర సుగంధ ద్రవ్యాలను కూడా ఉపయోగించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 436

437

హదీసు 437

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كُفِّنَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فِي ثَلَاثَةِ أَثْوَابٍ بِيضٍ سَحُولِيَّةٍ مِنْ كُرْسُفٍ, لَيْسَ فِيهَا قَمِيصٌ وَلَا عِمَامَةٌ.‏ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ భౌతిక కాయాన్ని, యమన్‌కు చెందిన ‘సహూల్’లో నేయబడిన మూడు తెల్లని వస్త్రాలలో (కఫన్ రూపంలో) చుట్టడం జరిగింది – అందులో చొక్కాగానీ, తలపాగా గానీ లేదు.” (బుఖారీ, ముస్లిం)

English

A’ishah (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) was shrouded in three pieces of white Yemenite cotton sheets. They did not include either a shirt or a turban.’ Agreed upon.

సారాంశం

భౌతిక కాయం పురుషునిదైతే మూడు వస్త్రాలను కఫన్ కొరకు ఉపయోగించాలని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. ఈ వస్త్రాలలో చొక్కాగానీ, తలపాగా గానీ ఉండదు. అత్యధిక మంది పండితుల దృష్టిలో మూడు వస్త్రాలంటే మూడు పెద్ద దుప్పట్లని భావం. కొంతమంది విద్వాంసులు- దీనిని కఫన్గా, లుంగీతరహ వస్త్రంగా, పెద్ద దుప్పటిగా భావించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 437

438

హదీసు 438

وَعَنِ ابْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { لَمَّا تُوُفِّيَ عَبْدُ اَللَّهِ بْنِ أُبَيٍّ جَاءٍ اِبْنُهُ إِلَى رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-.‏ فَقَالَ: أَعْطِنِي قَمِيصَكَ أُكَفِّنْهُ فِيهِ, فَأَعْطَاهُ إِيَّاهُُ] } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: అబ్దుల్లా బిన్ ఉబై చనిపోయినప్పుడు అతని కుమారుడు దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చి, తమరు తమ చొక్కాను ప్రదానం చేస్తే నేను దీన్ని అతని కొరకు ‘కఫన్’గా ఉపయోగిస్తానని ప్రాధేయపడ్డాడు. ఆయన ﷺ తన చొక్కాను తీసి అతనికిచ్చేశారు. (బుఖారీ, ముస్లిం)

English

‘Abdullah bin ’Umar (RAA) narrated, ‘When ‘Abdullah bin Ubay (the head of the hypocrites) died, his son came to the Prophet (ﷺ) and said, ‘O Messenger of Allah! Please give me your shirt to shroud him (his father) in it.’ So, Allah’s Messenger gave it to him, Agreed upon.

సారాంశం

దైవప్రవక్త ﷺకు తన ప్రియసహచరుల పట్ల గల ప్రేమానురాగాలకు, వాత్సల్యానికి ఈ సంఘటన ఒక మచ్చుతునక. వారి భావాలు, భావోద్రేకాలను ఆయన ﷺ పూర్తిగా పరిగణనలోకి తీసుకునేవారు. ఏ వ్యక్తి కొరకు ఆయన చొక్కా ప్రదానం చేశారో, అతడు కపటాగ్రేసరుడని తెలిసి కూడా ఎంతో ఉదారంగా వ్యవహరించటం గమనార్హం. ఇలాంటి సంఘటన నుంచి నేటి నాయకులు, సంస్కర్తలు, లీడర్లు స్ఫూర్తిని పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.

హదీసులో ప్రముఖులు

1. అబ్దుల్లాహ్ బిన్ ఉబై : అజ్ఞానకాలంలో ‘ఖజ్రజ్’ తెగకు నాయకుడు. పైకి ఇస్లాం స్వీకరించినప్పటికీ, అతని మనసులో ఇస్లాం చోటు చేసుకోలేదు. కపట చేష్టలతో ఇస్లాంకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించసాగాడు. కపటులకు (మునాఫిక్లకు) నేతృత్వం వహించి ‘రయీసుల్ మునాఫిఖీన్’గా పేరుమోశాడు. ఉహుద్ యుద్ధ సమయంలో మూడోవంతు సైన్యాన్ని వెంటబెట్టుకుని మధ్యలో నుంచే తిరిగి వచ్చేశాడు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) పై అపనింద మోపి, దైవప్రవక్త ﷺను మానసికంగా వేధించటంలో కీలక పాత్ర పోషించాడు. దివ్య ఖుర్ఆన్లో సయితం అతని కపట చేష్టలు ప్రస్తావించబడ్డాయి. “మేము మదీనాకు తిరిగి వెళ్ళిన మీదట గౌరవనీయులు అల్పులను వెళ్ళగొడతార”ని అన్యాపదేశంగా మహనీయ ముహమ్మద్ ﷺను అవమానపర్చిన కపటాగ్రేసరుడు ఇతడు. హిజ్రీ 9వ సంవత్సరం జీఖిఅద నెలలో చనిపోయాడు.

2. అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఉబై ఇబ్నె సలూల్ : ఈయన ఎవరో కాదు, అబ్దుల్లాహ్ బిన్ ఉబై కన్నకొడుకే. కపటి కడుపులో పుట్టి కీర్తి శిఖరాల అంబరాలను చుంబించిన ఇస్లాం ముద్దుబిడ్డ. తండ్రి దైవప్రవక్తను వేధిస్తూ ఉంటే, కుమారుడు మాత్రం దైవప్రవక్త ﷺకు రక్షాకవచంగా నిలిచేవారు. గొప్ప సహచరులలో ఒకరు. యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. ‘యమామ’ యుద్ధంలో అమరగతి నొందారు. తండ్రి కపట ప్రవర్తనకు ఎంతగానో బాధపడేవారు. ‘మర్యాదస్తులు దైవప్రవక్త ﷺను మదీనా నుంచి వెళ్ళగొడతార’ని అతని తండ్రి కూసాడని తెలిసి, తండ్రి తలను నరికి వేసేందుకు తనను అనుమతించమని ఆయన భావోద్వేగంతో అన్నారు. అజ్ఞాన కాలంలో ఈయన పేరు హుబాబ్. దైవప్రవక్త ﷺ ఈ పేరు మార్చి అబ్దుల్లాహ్ అని నామకరణం చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 438

439

హదీసు 439

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { الْبَسُوا مِنْ ثِيَابِكُمُ الْبَيَاضَ, فَإِنَّهَا مِنْ خَيْرِ ثِيَابِكُمْ, وَكَفِّنُوا فِيهَا مَوْتَاكُمْ } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا النَّسَائِيَّ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “తెల్లని దుస్తులు ధరించండి. మీ దుస్తులలో కెల్లా అత్యుత్తమమైనవి ఇవే. మీ మృతులకు కూడా ఈ (తెల్లని) వస్త్రాలతోనే కఫన్ ఏర్పాటు చేయండి” (‘ఐదుగురి’లో నసాయి తప్ప మిగిలిన వారంతా దీనిని ఉల్లేఖించారు – తిర్మిజి దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Ibn ‘Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Wear white clothes, for they are (considered as) your best clothes, and enshroud your dead in them.” Related by the five Imams, except for An-Nasa’i, and At-Tirmidhi reported it to be sound.

సారాంశం

అప్పుడప్పుడూ రంగుల దుస్తులు తొడిగినప్పటికీ సాధారణంగా దైవప్రవక్త ﷺ తెల్లనిదుస్తులను అమితంగా ఇష్టపడేవారని ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. మృతులను కూడా తెల్లటి వస్త్రాలలోనే చుట్టాలి. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రం ఇతర రంగుల వస్త్రాన్ని కూడా ఉపయోగించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 439

440

హదీసు 440

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا كَفَّنَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيُحْسِنْ كَفَنَهُ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు – “మీలో ఎవరయినా మీ సోదరునికి కఫన్ (వస్త్రం) ఇస్తే మంచి కఫన్ను ఇవ్వాలి.” (ముస్లిం)

English

Jabir (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When one of you is in charge of shrouding his brother, he should give him the best shroud he can (i.e. clean, covering the whole body, but not necessarily expensive as this is disliked.)” Related by Muslim.

సారాంశం

ఒక ముస్లిం మరో ముస్లింకు సోదరుడని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది. మంచి కఫన్ను ఇవ్వటమంటే అర్థం పరిశుభ్రమయిన వస్త్రం ఇవ్వాలి. ఇంకా అది మృతుని శరీరాన్ని పూర్తిగా కప్పగలిగే విధంగా ఉండాలి. మంచి కఫన్ అంటే భావం ఖరీదైనదని కాదు. ఖరీదైన వస్త్రాన్ని కఫన్ కొరకు ఉపయోగించటం వాంఛనీయం కూడా కాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 440

441

హదీసు 441

وَعَنْهُ قَالَ: { كَانَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-يَجْمَعُ بَيْنَ اَلرَّجُلَيْنِ مِنْ قَتْلَى أُحَدٍ فِي ثَوْبٍ وَاحِدٍ, ثُمَّ يَقُولُ: "أَيُّهُمْ أَكْثَرُ أَخْذًا لِلْقُرْآنِ?", فَيُقَدِّمُهُ فِي اَللَّحْدِ, وَلَمْ يُغَسَّلُوا, وَلَمْ يُصَلِّ عَلَيْهِمْ } رَوَاهُ اَلْبُخَارِيُّ.

ఈయనగారి (హజ్రత్ జాబిర్ – రజి) చేతనే ఉల్లేఖించబడిన మరో హదీసు : “దైవప్రవక్త ﷺ ఉహుద్ సంగ్రామంలో అమరగతి నొందిన ఇద్దరేసి అమరవీరులను ఒక్కో వస్త్రంలో చుట్టేవారు. ఆయన ﷺ, ‘వీరిలో ఎవరికి ఖుర్ఆన్ ఎక్కువగా జ్ఞాపకముంది?’ అని అడిగేవారు. ఎవరికి ఎక్కువ భాగం ఖుర్ఆన్ జ్ఞాపకముంటుందో వారిని మొదట గోరీలో దింపేవారు. ఆ అమరవీరులకు జనాజా నమాజ్ చేయటంగానీ, గుసుల్ (స్నానం) చేయించటం గానీ జరగలేదు. (బుఖారీ)

English

Jabir (RAA) narrated that the Messenger of Allah (ﷺ) had each two martyrs of the battle of Uhud wrapped in one shroud, and then would ask, “Which one of them knew more of the Qur’An?” He would put that one (that was pointed out) first in the grave. They were not washed and the Messenger of Allah (ﷺ) did not offer a funeral prayer for them.’ Related by Al-Bukhari.

సారాంశం

ఈ హదీసు ద్వారా మన జ్ఞానపరిధిలోకి వచ్చే ముఖ్యాంశాలు ఇవి:

(1) అత్యవసరస్థితిలో ఒక్కో కఫన్ను ఇద్దరు వ్యక్తులకు కూడా ఉపయోగించవచ్చు.

(2) ఇద్దరేసి వ్యక్తులను (మృతులను) ఒక్కో సమాధిలో ఖననం చేయటం కూడా ధర్మసమ్మతమే. అయితే ఆ ఇరువురిలో ఖుర్ఆన్ అధికంగా కంఠస్థం అయివున్న వారిని మొదట సమాధిలో చేర్చాలి.

(3) దైవమార్గంలో అసువులు బాసిన వారికి గుసుల్ (స్నానం) చేయించవలసిన అవసరం లేదు. ఉహుద్ యుద్ధసందర్భంగా దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : “వీరికి స్నానం చేయించకండి. వీరి శరీరాలకైన ఒక్కో గాయం ప్రళయదినాన ‘ముష్క్’ (కస్తూరి) లాంటి సువాసనను గుబాళిస్తుంటుంది.

(4) అమరగతి నొందిన వారి జనాజా నమాజ్ కూడా చేయనవసరం లేదు. ఉహుద్ సంగ్రామంలో అమరగతి నొందిన వారి జనాజా నమాజ్ గురించి, హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) జనాజా నమాజ్లో 70 తక్బీర్ల గురించి వచ్చిన ఉల్లేఖనం ప్రామాణికమైనది కాదని, ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. సహీహ్ బుఖారీలో ఉఖబా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఆయన ﷺ ఎనిమిది సంవత్సరాల తరువాత ఉహుద్ వీరుల అంత్యక్రియల నమాజ్ చేశారని తెలుస్తున్నది. ఇది నిజంగా నమాజే కాదనీ, ఇది కేవలం క్షమాపణకై చేసిన వేడుకోలు అనీ ఇమామ్ షాఫయి వ్యాఖ్యానించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 441

442

హదీసు 442

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { سَمِعْتُ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: "لَا تُغَالُوا فِي اَلْكَفَنِ, فَإِنَّهُ يُسْلُبُ سَرِيعًا" } رَوَاهُ أَبُو دَاوُدَ.

“(చాలా) ఖరీదైన కఫన్ను ఇవ్వకండి. ఎందుకంటే అది బహు తొందరగా పాడైపోయేదే” అని దైవప్రవక్త ﷺ చెప్పగా తాను విన్నానని హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తెలిపారు. (అబూదావూద్)

English

‘AIi (RAA) narrated, ‘l heard the Messenger of Allah (ﷺ) say, “Do not be extravagant in shrouding (i.e. do not spend too much money on them) for it will decay quickly.” Related by Abu Dawud.

సారాంశం

విలువైన వస్త్రాన్ని కఫన్ కొరకు ఉపయోగించినంత మాత్రాన మృతునికి ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. మృతునికి అసలు ఉపయోగపడేవి అతను చేసుకున్న కర్మలే. కఫన్ కోసం సమకూర్చే వస్త్రం ఎంత విలువైనదయినా అది మట్టిలో కలిసిపోయేదే. ఈ ప్రబోధనం యొక్క ప్రభావం ప్రవక్త సహచరులపై ఎంతగా పడిందంటే, హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) తాను మరణించినపుడు ప్రత్యేకంగా కొత్త వస్త్రం ఉపయోగించవలసిన అవసరం లేదనీ, తన దుప్పట్లనే ఉతికి వాటినే తన కఫన్గా ఉపయోగించాలని తాకీదు చేశారు. కొత్త బట్టలు ధరించే హక్కు మృతులకన్నా బ్రతికి ఉన్న వారికి ఎక్కువగా ఉందని ఆయన (రదియల్లాహు అన్హు) అభిప్రాయపడ్డారు. (బుఖారీ)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 442

443

హదీసు 443

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا ; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ لَهَا: { لَوْ مُتِّ قَبْلِي لَغَسَّلْتُكِ } اَلْحَدِيثَ.‏ رَوَاهُ أَحْمَدُ, وَابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ.

దైవప్రవక్త ﷺతనతో చెప్పారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు : “(ఆయిషా!) ఒకవేళ నీవు గనక నాకంటే ముందు చనిపోతే నేను నీకు స్నానం చేయిస్తాను.” (దీనిని అహ్మద్, ఇబ్నె మాజ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

A’ishah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said to her, “If you die before me, I will wash you myself.” Related by Ahmad, Ibn Majah and Ibn Hibban graded it as Sahih.

సారాంశం

చనిపోయిన తన భార్యకు భర్త గుసుల్ ఇవ్వవచ్చునని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. అత్యధిక మంది ధర్మవేత్తలు ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దీంతో విభేదించారు. అయితే ప్రవక్త సహచరుల ఆచరణ ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారి అభిప్రాయాన్ని త్రోసిపుచ్చుతోంది. ఉదాహరణకు : హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తన సతీమణి (దైవప్రవక్త పుత్రిక) అయిన ఫాతిమా (రదియల్లాహు అన్హా) చనిపోయినపుడు ఆమెకు అంత్యక్రియల స్నానం చేయించారు. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే భర్త భార్యకు, భార్య భర్తకు కడసారి స్నానం (గుసుల్) చేయించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 443

444

హదీసు 444

وَعَنْ أَسْمَاءَ بِنْتِ عُمَيْسٍ رَضِيَ اَللَّهُ عَنْهَا: { أَنَّ فَاطِمَةَ عَلَيْهَا اَلسَّلَامُ أَوْصَتْ أَنْ يُغَسِّلَهَا عَلِيٌّ رَضِيَ اَللَّهُ تَعَالَى عَنْهُ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ.

హజ్రత్ అస్మా బిన్తె ఉమైస్ (రదియల్లాహు అన్హా) కథనం : “హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హా) స్వయంగా తనకు (కడసారి) స్నానం చేయించాలని హజ్రత్ ఫాతిమా – రజియల్లాహు అన్హా – వసీయతు చేశారు. (సునన్ దారె ఖుత్నీ)

English

Asma’ bint ’Umais (RAA) narrated that Fatimah (RAA) (the daughter of the prophet (ﷺ) made a will that ‘Ali (RAA) was to wash her when she dies.’ Related by Ad-Daraqutni.

సారాంశం

వసీయతు (వీలునామా)ను నెరవేర్చటం ఎంతో అవసరం. అందుకే ఆమె భర్త అయిన హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఖుద్దుగా ఫాతిమా (రదియల్లాహు అన్హా)కు కడసారి స్నానం చేయించారు. వసీయతు కూడా నెరవేరింది. భర్త తన భార్యకు స్నానం చేయించవచ్చునన్న ఒక విషయం కూడా ఉమ్మత్కు ఆధారంగా నిలిచింది.

హదీసు ఉల్లేఖకులు

ఫాతిమా బిన్తె నబీ (రదియల్లాహు అన్హా), దైవప్రవక్త ﷺగారి కనిష్ఠ పుత్రిక, గారాలపట్టీ. ముస్లిం అనుచర సమాజ మహిళలందరికీ నాయకురాలు. హిజ్రీ 2వ సంవత్సరం, రమజాన్ నెలలో హజ్రత్ అలీ బిన్ అబూతాలిబ్ (రదియల్లాహు అన్హు) ఈమెను వివాహమాడారు. కాపురానికి పంపబడేనాటికి ఈమె వయస్సు 15 సంవత్సరాల, 5 నెలలు. హిజ్రీ 11వ సంవత్సరం – రమజాన్ నెలలో – దైవప్రవక్త ﷺ మరణించిన 6 నెలలకు ఈమె కూడా మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 444

445

హదీసు 445

وَعَنْ بُرَيْدَةَ ‏- رضى الله عنه ‏- ‏-فِي الْغَامِدِيَّةِ اَلَّتِي أَمَرَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِرَجْمِهَا فِي اَلزِّنَا‏- قَالَ: { ثُمَّ أَمَرَ بِهَا فَصُلِّيَ عَلَيْهَا وَدُفِنَتْ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ బురైద (రదియల్లాహు అన్హు) గారు, వ్యభిచార నేరానికి పాల్పడి దైవప్రవక్త ﷺచే రాళ్ళు రువ్వబడే శిక్షను అనుభవించిన ఘామిదియ వృత్తాంతం వివరిస్తూ ఇలా అన్నారు : “ఆయన ﷺ ఆమె అంత్యక్రియల నమాజును స్థాపించమని ఆదేశించారు. మరి ఆయన ﷺ స్వయంగా ఆమె నమాజె జనాజాను చేశారు. తరువాత ఆమెను ఖననం చేశారు.” (ముస్లిం)

English

Buraidah (RAA) reported Concerning the story of the Ghamidi woman, who was to be stoned by the order of the Prophet (ﷺ) (due to committing adultery), ‘Then the Messenger of Allah (ﷺ) gave his command concerning her (after her death), so he offered the funeral prayer for her, and she was then buried.’ Related by Muslim.

సారాంశం

మహాప్రవక్త ﷺ స్వయంగా ఘామిదియ అంత్యక్రియల నమాజులో పాల్గొన్నారని సహీహ్ హదీసుల ద్వారా తెలుస్తోంది. ఘోర పాపాలకు పాల్పడే వారి – ఉదాహరణకు ఆత్మహత్యకు పాల్పడేవారి, వ్యభిచారానికి ఒడిగట్టేవారి – జనాజా నమాజ్లో పాల్గొనటం గురించి ఖాజీ అయాజ్ చెబుతూ, ఇస్లామీయ ధర్మవేత్తలు ఇందుకు అనుమతించారని పేర్కొన్నారు. అయితే ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) మాత్రం దీంతో ఏకీభవించలేదు. దుర్మార్గుడు, దుష్టుడు అయిన వ్యక్తి అంత్యక్రియలను బహిష్కరించాలని, తద్వారా సమాజంలో దుష్టశక్తులకు గుణపాఠం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 445

446

హదీసు 446

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { أُتِيَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِرَجُلٍ قَتَلَ نَفْسَهُ بِمَشَاقِصَ, فَلَمْ يُصَلِّ عَلَيْهِ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హుమా) కథనం : “బాణంతో ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి శవం దైవప్రవక్త ﷺ వద్దకు తేబడింది. ఆయన ﷺ అతని నమాజ్ చేయలేదు.” (ముస్లిం)

English

Jabir bin Samurah (RAA) narrated, ‘A man who killed himself with a broad-headed arrow, was brought to the Prophet (ﷺ) but he did not offer the funeral prayer for him.’ Related by Muslim.

సారాంశం

ఆత్మహత్య చేసుకున్నవాని ‘నమాజె జనాజా’ చేయటం గురించి ద్వంద్వాభిప్రాయాలున్నాయి. చేయవచ్చని కొందరూ, చేయకూడదని మరికొందరూ చెబుతున్నారు. సమాజంలోని మేధావులు, విజ్ఞులు ఈ వ్యక్తి నమాజులో పాల్గొనకపోయినా కనీసం సామాన్య జనులైనా పాల్గొని అతని అంతిమ యాత్రకు వీడ్కోలు పలకాలని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే నసాయిలోని ఉల్లేఖనం ప్రకారం “నేను ఇతని జనాజా నమాజు చేయను” అని మాత్రమే దైవప్రవక్త ﷺ అన్నారు. అంటే ప్రవక్త సహచరులు బహుశా ఆ వ్యక్తి జనాజా నమాజ్ చేసి ఉంటారన్న ఆలోచనకు తావు కలుగుతోంది. మొదట్లో రుణగ్రస్తుడైన వ్యక్తి చనిపోయినపుడు కూడా ఆయన ﷺ అతని జనాజా నమాజులో పాల్గొనేవారు కాదు, అయితే మీరు ఇతని నమాజ్ చేయండి అని సహచరులకు సలహా ఇచ్చేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 446

447

హదీసు 447

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- ‏-فِي قِصَّةِ اَلْمَرْأَةِ اَلَّتِي كَانَتْ تَقُمُّ اَلْمَسْجِدَ‏- قَالَ: { فَسَأَلَ عَنْهَا اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏- ] فَقَالُوا: مَاتَتْ, فَقَالَ: "أَفَلَا كُنْتُمْ آذَنْتُمُونِي"? فَكَأَنَّهُمْ صَغَّرُوا أَمْرَهَا] فَقَالَ: "دُلُّونِي عَلَى قَبْرِهَا", فَدَلُّوهُ, فَصَلَّى عَلَيْهَا } مُتَّفَقٌ عَلَيْهِ. وَزَادَ مُسْلِمٌ, ثُمَّ قَالَ: { إِنَّ هَذِهِ اَلْقُبُورَ مَمْلُوءَةٌ ظُلْمَةً عَلَى أَهْلِهَا, وَإِنَّ اَللَّهَ يُنَوِّرُهَا لَهُمْ بِصَلَاتِي عَلَيْهِمْ }

మస్జిద్లో చీపురుకట్టతో ఊడ్చే ఒక మహిళ గురించి హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు : దైవప్రవక్త ﷺ ఆ మహిళ గురించి (ఆమె కనిపించటం లేదేమిటీ? అని) ఆరా తీయగా, ‘ఆమె చనిపోయింది’ అని సహచరులు (రదియల్లాహు అన్హుమ్) సమాధానమిచ్చారు. “మరి మీరు నాకు ఎందుకు చెప్పలేదు?” అని ఆయన ﷺ నొచ్చుకున్నారు. అంటే ఆమె మరణాన్ని అందరూ సర్వసామాన్యమయిన విషయంగా తలపోశారు. “ఆమె సమాధి ఎక్కడుందో చూపెట్టండి” అని ఆయన ﷺ సహచరులను కోరారు. అక్కడికి వెళ్ళి ఆమె ‘నమాజె జనాజా’ చేశారు. (బుఖారీ, ముస్లిం)

ముస్లింలో ఈ వాక్యం అదనంగా ఉంది: “ఈ సమాధులు సమాధివాసుల కోసం చీకట్లతో నిండి ఉన్నాయి. నా నమాజు వల్ల వీరి సమాధులలో వెలుగు వస్తుంది.”

English

Abu Hurairah (RAA) narrated regarding the story of the black woman who used to clean the mosque. The Messenger of Allah asked about her, and he was told that she had died. He said to them, “Why didn’t you inform me of her death?" It seems that they regarded her as an insignificant person. The Messenger of Allah (ﷺ) said: “Show me her grave." They showed him her grave and he offered the funeral prayer for her.’ Agreed upon. Muslim added in his narration, ‘Verily, those graves are full of darkness for those buried in them. Allah, the Almighty, will illuminate them for their dwellers by my prayer over them"

సారాంశం

ఈ హదీసు ద్వారా అనేక విషయాలు మన ముందుకు వస్తున్నాయి –

(1) ఖననం చేసిన తరువాత మృతుని సమాధి వద్ద కూడా నమాజె జనాజా చేయటం సమ్మతమే. ఖననానికి ముందు జనాజా నమాజ్ చేసివున్నప్పటికీ మలిసారి నమాజ్ చేయటంలో తప్పులేదు. హజ్రత్ బరా బిన్ మారూర్ (రదియల్లాహు అన్హు) అంత్యక్రియల నమాజ్ కూడా దైవప్రవక్త ﷺ ఒక నెల రోజుల తరువాత – సమాధి దగ్గర – చేశారు. ఎందుకంటే ఈయన మరణించినప్పుడు దైవప్రవక్త ﷺ మక్కాలో వున్నారు.

(2) సమాధివాసులంటే సమాధుల్లో నిద్రిస్తున్నవారు. ఈ సమాధులలో చీకటి తప్ప వెలుగు లేదని ఆయన ﷺ ఆవేదన వ్యక్తం చేశారు.

(3) మస్జిద్ను వూడ్చే, పరిశుభ్రంగా ఉంచే వారి స్థానం ఎంతో గొప్పదని ఈ సంఘటన రుజువు చేస్తోంది.

(4) ముస్లిం మహిళ సయితం మస్జిద్ను పరిశుభ్రపరచగలదు.

(5) మస్జిదును పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచటం అవసరం. పరిశుభ్రతకై పని చీపురుతోనూ చేయవచ్చు, గుడ్డతో తుడవటం ద్వారా కూడా చేయవచ్చు.

(6) కార్మికవర్గం పట్ల, పేదలపట్ల దైవప్రవక్త ﷺ కు గల ఆప్యాయతకు, ప్రేమానురాగాలకు, శ్రద్ధాసక్తికీ ఈ సంఘటన అద్దం పడుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 447

448

హదీసు 448

وَعَنْ حُذَيْفَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يَنْهَى عَنِ اَلنَّعْيِ } رَوَاهُ أَحْمَدُ, وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ.

హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ మరణం గురించి బహిరంగంగా (దండోరా వేయడాన్ని) ప్రకటనలు చేయదాన్ని వారించారు.” (అహ్మద్ మరియు తిర్మిజీలు దీనిని ఉల్లేఖించారు – తిర్మిజీ ఈ హదీసును ‘హసన్’గా ఖరారు చేశారు)

English

Hudhaifah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) used to prohibit the announcement of anyone’s death. Related by Ahmad and At-Tirmidhi, who rendered it Hasan.

సారాంశం

మరణవార్త గురించి నలుగురికీ తెలియజేయరాదని దీని ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. అసలు విషయమేమిటంటే అజ్ఞానకాలంలో అరబ్బులు మరణ సమాచారాన్ని ఒక తమాషాగా చేసుకున్నారు. హాహాకారాలు చేస్తూ, పెడబొబ్బలు పెడుతూ కబురు పంపేవారు. ఎంత ఎక్కువగా ఏడ్పులు, పెడబొబ్బలు పెడితే చనిపోయినవాడు అంత గొప్పవాడుగా పరిగణించబడేవాడు. దైవప్రవక్త ﷺ ఈ దురాచారాలను అరికట్టారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 448

449

హదీసు 449

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-نَعَى اَلنَّجَاشِيَّ فِي اَلْيَوْمِ اَلَّذِي مَاتَ فِيهِ, وَخَرَجَ بِهِمْ إِلَى الْمُصَلَّى، فَصَفَّ بِهِمْ, وَكَبَّرَ عَلَيْهِ أَرْبَعًا } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నజ్జాషీ చక్రవర్తి మరణ సమాచారం అందిన వెంటనే అందరికీ తెలియ పర్చారు. ఆయన ﷺ సహచరులను వెంటబెట్టుకుని అంత్యక్రియల నమాజ్ చేసే స్థలం వద్దకు వెళ్ళారు. అందరూ వరుసలు తీరి నిలబడ్డారు. 4 తక్బీర్లు పలికారు (జనాజా నమాజ్ చేశారు). (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) informed the people about the death of Negus the day he died. He took them out to the place of prayer, to offer the funeral prayer for him. He arranged them in rows, and made Takbir four times.’ Agreed upon.

సారాంశం

తమకు అందిన మరణ సమాచారాన్ని పలువురికి అందించాలనీ, దూరప్రదేశాలలో వున్నవారు అంత్యక్రియలకు హాజరు కాలేక పోయినప్పటికీ, “నమాజె గాయిబానా” చేయవచ్చుననీ ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్ దీనికి సుముఖంగానే ఉన్నారు. అయితే హనఫీ ఫికహ్ ననుసరించేవారు, మాలికీ ధర్మవేత్తలు ఇందుకు సుముఖంగా లేరు. ఈ వ్యవహారం ఒక్క ప్రవక్తకే ప్రత్యేకం (పరిమితం) అని వీళ్ళు వ్యాఖ్యానించారు.

హదీసులోని ప్రముఖ వ్యక్తి

నజ్జాషీ (రదియల్లాహు అన్హు) – ఈయన ఆనాటి అబీసీనియా (నేటి ఇథియోపియా) చక్రవర్తి. సత్యప్రియుడు. నజ్జాషీ అసలు పేరు కాదు. ఆ రాజ్యంలోని చక్రవర్తులకు గల బిరుదు అది. ఏ విధంగా రోము సామ్రాజ్యాధినేతను ‘ఖైసర్’గా, ఈరాన్ చక్రవర్తిని ‘కిస్రా’గా పిలిచేవారో అదేవిధంగా అబీసీనియా రాజును ‘నజ్జాషీ’ (నీగస్)గా వ్యవహరించేవారు. ఈయన అసలు పేరు అషమ బిన్ అజ్జర్ (రదియల్లాహు అన్హు). మక్కాలోని అవిశ్వాసుల ఆగడాలనుండి తమ ‘విశ్వాసాన్ని’ కాపాడుకోవటానికి అలనాటి ముస్లింలు కొంతమంది అబీసీనియా వైపునకు వలస వెళ్ళారు. దైవప్రవక్త ﷺ హిజ్రీ 6వ సంవత్సరంలో అమ్ర్ బిన్ ఉమయ్య జమరీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించమని నజ్జాషీకి ఆహ్వానం పంపారు. ఆయన ఈ ఆహ్వాన లేఖను ముద్దుపెట్టుకున్నాడు. కళ్ళకద్దుకున్నాడు. సింహాసనం నుండి దిగివచ్చి హజ్రత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించాడు. ఆయన ఈ వృత్తాంతమంతా లిఖించి దైవప్రవక్త ﷺ కు పంపారు. నజ్జాషీ చక్రవర్తి హిజ్రీ 9లో – తబూక్ యుద్ధానంతరం – మరణించారు. ఆ తరువాత దైవప్రవక్త ﷺ అతని వారసునికి కూడా ఇస్లాం స్వీకరించమని ఆహ్వానం పంపారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 449

450

హదీసు 450

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: سَمِعْتُ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { مَا مِنْ رَجُلٍ مُسْلِمٍ يَمُوتُ, فَيَقُومُ عَلَى جَنَازَتِهِ أَرْبَعُونَ رَجُلًا, لَا يُشْرِكُونَ بِاَللَّهِ شَيْئًا, إِلَّا شَفَّعَهُمْ اَللَّهُ فِيهِ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “ఏ ముస్లిమైనా మరణించగా, దైవానికి సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టని నలభై మంది గనక అతని (జనాజా) నమాజ్లో పాల్గొంటే, అల్లాహ్ ఆ మృతుని పాలిట వాళ్ళ వేడుకోలును ఆమోదిస్తాడు.” (ముస్లిం)

English

Ibn ‘Abbas (RAA) narrated, ‘I heard the Messenger of Allah (ﷺ) say, "If a Muslim man dies and a group of forty people, who do not associate any one with Allah, pray for him, Allah will accept their intercession for him (by way of their Du’A for him.” Related by Muslim.

సారాంశం

అంత్యక్రియల నమాజ్లో అత్యధికమంది పాల్గొని మృతుని క్షమాభిక్షకై వేడుకోవలసిన ఆవశ్యకతను ఈ హదీసు సూచిస్తోంది. అయితే ఆ నమాజులో పాల్గొనే వారు షిర్క్ చేయనివారు, నికార్సయిన ఏకేశ్వరోపాసకులై ఉండాలన్న విషయం కూడా హదీసు ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఏక దైవారాధకులను అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడన్న దానికి ఈ హదీసు ఒక ప్రబల నిదర్శనం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 450

451

హదీసు 451

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { صَلَّيْتُ وَرَاءَ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-عَلَى امْرَأَةٍ مَاتَتْ فِي نِفَاسِهَا, فَقَامَ وَسْطَهَا } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺ వెనుక ఒక స్త్రీ నమాజె జనాజా చేశాను. ఆ స్త్రీ పురిటి రక్త స్రావంతో మరణించింది. ఆయన ﷺ ఆ స్త్రీ భౌతికకాయానికి ఎదురుగా – మధ్య భాగంలో – నిలబడ్డారు. (బుఖారీ, ముస్లిం)

English

Samurah bin Jundub (RAA) narrated, ‘I offered the funeral prayer behind the Prophet (ﷺ) for a woman who had died during child-birth and he (prayed) standing opposite the middle of her body.' Agreed upon.

సారాంశం

చనిపోయిన ఆ మహిళ పేరు ఉమ్మె కాబ్ అన్సారియా (రదియల్లాహు అన్హా). ప్రసవ సమయంలో ఆమె మరణించింది.

చనిపోయిన వారు స్త్రీ అయినప్పుడు ఇమామ్ శవపేటికకు ఎదురుగా, మధ్య భాగంలో నిలబడి నమాజ్ చేయించాలని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. మృతుడు పురుషుడైనప్పుడు ఇమామ్ అతని తల భాగానికి ఎదురుగా నిలబడి నమాజ్ చేయించాలని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ద్వారా విదితమవుతోంది. (ముస్నద్ అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ). ఇమామ్ షాఫయి, ఇమామ్ అబూ హనీఫాల అభిమతం కూడా ఇదే. కాని దీనికి భిన్నంగా హనఫీ పండితులు సాధారణంగా మృతులైన స్త్రీ పురుషుల హృదయానికి ఎదురుగా నిలబడి నమాజ్ చేయిస్తున్నారు. దీనికి షరీఅత్ పరమయిన నిదర్శనమేదీ లేదు. వీళ్ళు మూలాంశాన్ని ఉపేక్షించి అంచనాలపై అమలు జరుపుతున్నారు. విశ్వాసానికి మూలస్థానం హృదయం గనక హృదయానికి ఎదురుగా నిలబడాలన్నది వీళ్ళ భావన. కాని ఇది హదీసుకు విరుద్ధాంశం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 451

452

హదీసు 452

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { وَاَللَّهِ لَقَدْ صَلَّى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَلَى اِبْنَيْ بَيْضَاءَ فِي اَلْمَسْجِدِ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలిపారు : “దైవసాక్షి! దైవప్రవక్త ﷺ బైజా యొక్క ఇద్దరు కుమారుల నమాజె జనాజాను మస్జిదులోనే చేశారు.” (ముస్లిం)

English

A’ishah (RAA) narrated, ‘By Allah the Messenger of Allah (ﷺ) offered funeral prayer in the mosque for the sons of Baida (Sahl and Suhail).’ Related by Muslim

సారాంశం

మస్జిదులో ‘నమాజె జనాజా’ చేయటం దైవప్రవక్త ﷺ వారి (ఆచరణ) ద్వారా నిరూపితమయింది. అయితే ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్లు ఇద్దరూ మస్జిద్లో నమాజె జనాజా చేయడాన్ని అయిష్టకరమైన విషయం (మక్రూహ్)గా భావిస్తున్నారు. మరి చూడబోతే దీనికి సంబంధించిన షరీఅత్ పరమైన ఆధారం ఏదీ లేదు. పైగా ప్రథమ ఖలీఫా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) నమాజె జనాజాను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మస్జిదులోనే చేయించారు. (ఇబ్నె అబీ షైబ). ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నమాజె జనాజాను కూడా మస్జిదులోనే హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) చేయించారు. (ముస్నద్ సయీద్ మన్సూర్). ఒకవేళ ఇలా చేయటం అధర్మం, లేక అవాంఛనీయ విషయం అయివుంటే ధర్మ ఖలీఫాలు సయితం ఆ మేరకు ఆచరించి ఉండేవారు కాదు. కాబట్టి దైవప్రవక్త ﷺ ఆచరణ ద్వారా, ఆయన ప్రియ సహచరుల (రదియల్లాహు అన్హు) అనుసరణ ద్వారా మనకు బోధ పడేదేమంటే మస్జిదులో జనాజా నమాజ్ను నిస్సంకోచంగా చేయవచ్చు.

హదీసు ఉల్లేఖకులు

బైజా (రదియల్లాహు అన్హా). ఈమె సహ్ల్ మరియు సుహైల్ల తల్లిగారు. ‘బైజా’ అనేది ఆమెకు లభించిన బిరుదు. అసలు పేరు దాద్ బిన్తె జహ్దుమ్ ఫిహ్రీ. ఈమె భర్తపేరు వహబ్ బిన్ రబీయ ఖురషి. బనూహాషిమ్ను, ముస్లిములను సంఘం నుంచి బహిష్కరించాలంటూ ఖురైషులు ఆమోదించిన తీర్మాన పత్రాన్ని సహ్ల్ చించి ముక్కలు ముక్కలు చేసేశాడు. ఒక కథనం ప్రకారం ఈయన మక్కాలోనే ఇస్లాం స్వీకార ప్రకటన చేశాడు. మరో కథనం ప్రకారం తన ఈమానును (విశ్వాసాన్ని) హృదయంలో దాచిపెట్టుకున్నాడు. ఆ స్థితిలోనే అతడు బద్ర్ యుద్ధరంగానికి వచ్చాడు. ముస్లింలు ఇతన్ని కూడా యుద్ధ ఖైదీగా పట్టుకున్నారు. అయితే ఈయన మక్కాలో నమాజ్ చేయటం తాను కళ్ళారా చూశానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) చెప్పటంతో, ఆయన సాక్ష్యంపై సహ్ల్ విడుదల చేయబడ్డాడు. ఈయన మదీనాలో మరణించారు.

ఇక సుహైల్ గురించి, ఈయన తొలి కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. అబీసీనియా వైపుకు, మదీనా వైపుకు రెండు హిజ్రత్లు చేశారు. బద్ర్ యుద్ధంలోనూ, ఇతర యుద్ధాలలోనూ పాల్గొన్నారు. తబూక్ యుద్ధం తరువాత – హిజ్రీ 9లో మదీనాలో మరణించారు. బైజా (రదియల్లాహు అన్హా) గారి ప్రఖ్యాత కుమారులిద్దరూ వీరు. మూడవ కుమారుడు సఫ్వాన్. బద్ర్ యుద్ధంలో అమరగతి నొందారు. దైవప్రవక్త ﷺ మరణించిన చాలా కాలం తరువాత ఈయన మరణించారని మరో వినికిడి ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 452

453

హదీసు 453

وَعَنْ عَبْدِ اَلرَّحْمَنِ بْنِ أَبِي لَيْلَى قَالَ: { كَانَ زَيْدُ بْنُ أَرْقَمَ يُكَبِّرُ عَلَى جَنَائِزِنَا أَرْبَعًا, وَإِنَّهُ كَبَّرَ عَلَى جَنَازَةٍ خَمْسًا, فَسَأَلْتُهُ فَقَالَ: كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُكَبِّرُهَا } رَوَاهُ مُسْلِمٌ وَالْأَرْبَعَةُ.

హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ లైలా కథనం: జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) మా వాళ్ళ జనాజా నమాజులో 4 తక్బీర్లు పలికేవారు. ఒకసారి ఆయన (ఆనవాయితీకి విరుద్ధంగా) 5 తక్బీర్లు పలికారు. ఈ సంగతి గురించి నేనాయన్ని దర్యాప్తు చేయగా, ‘దైవప్రవక్త ﷺ 5 తక్బీర్లు కూడా పలికేవార’ని ఆయన సమాధానమిచ్చారు. (దీనిని ముస్లింతో పాటు మరో నలుగురు (అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ) ఉల్లేఖించారు)

English

‘Abdur Rahman bin Abi Laila (RAA) and ‘Zaid bin Arqam (RAA) used to recite four Takbirat when praying over the dead, but once he said it five times, so I asked him about it. He said to me, ‘The Messenger of Allah (ﷺ) used to do so.’ Related by Muslim and the four Imams.

సారాంశం

జనాజా నమాజులో 4 అదనపు తక్బీర్లు పలకటం కూడా ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా తెలియవస్తోంది. దైవ ప్రవక్త ﷺ 4 నుండి 8 తక్బీర్ల దాకా పలికినట్లు ఆధారాలున్నాయి. ప్రవక్త ﷺ సహచరులు కూడా ఈ విధానాన్ని అనుసరించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన పరిపాలనా కాలంలో సహాబీలందరినీ సంప్రదించిన మీదట 4 తక్బీర్ల రివాజును ప్రవేశపెట్టారని బైహఖీలో తెలుపబడింది. ఈ అంశంపై అందరూ ఏకీభవించారని కొంతమంది పేర్కొన్నారు. కాని ఇది సరైంది కాదు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తదితరులు 4 కన్నా ఎక్కువ తక్బీర్లతో నమాజె జనాజా చేయించే వారని ఆధారాలున్నాయి. 4 తక్బీర్ల తరువాత మృతుని కోసం దుఆ చేసేవారు. జనాజా నమాజ్లో ప్రవక్త సహచరులు రఫెయదైన్ చేసేవారు. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ఇందుకు సుముఖంగా ఉన్నారు. హనఫీ ఫికహ్ననుసరించే వారిలో కూడా కొంతమంది ఈ పద్ధతిని అవలంబిస్తారు.

హదీసు ఉల్లేఖకులు

అబ్దుర్రహ్మాన్ బిన్ అబూలైలా (రహిమహుల్లాహ్) ప్రముఖ తాబయీలలో ఒకరు. అన్సార్ వర్గానికి చెందిన వారు. మదీనా వాసులు. తరువాత కూఫాకు మకాం మార్చారు. అంచేత కూఫీగా కూడా వ్యవహరించబడ్డారు. ఈయన నామాంతరం అబూ ఈసా. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో ఈయన జన్మించారు. హిజ్రీ 86లో జమాజిమ్ యుద్ధంలో మరణించారని ప్రతీతి. మరో కథనం ప్రకారం బస్రా కాలువలో మునిగి చనిపోయారని కూడా తెలుస్తోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 453

454

హదీసు 454

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- { أَنَّهُ كَبَّرَ عَلَى سَهْلِ بْنِ حُنَيْفٍ سِتًّا, وَقَالَ: إِنَّهُ بَدْرِيٌّ } رَوَاهُ سَعِيدُ بْنُ مَنْصُورٍ. وَأَصْلُهُ فِي "اَلْبُخَارِيِّ".

సహ్ల్ బిన్ హునైఫ్ (రదియల్లాహు అన్హు) నమాజె జనాజాలో తాను 6 తక్బీర్లు పలికాననీ, ఆయన ఒక బద్రీ సహాబీ అనీ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు. (సయీద్ బిన్ మన్సూర్ దీనిని ఉల్లేఖించారు. దీని మూలం బుఖారీలో ఉంది)

English

‘Ali bin Abi Talib (RAA) narrated that he said six Takbirat when he prayed over Sahl bin Hunaif, and he said (explaining his action), ‘He is one of the Companions, who fought in the Battle of Badr.’ Related by Sa’id bin Mansur.

సారాంశం

బద్రీ సహాబీ అంటే బద్ర్ యుద్ధంలో ముస్లిం సేనల తరఫున పోరాడిన యోధుడు అని అర్థం. ఒక పెద్ద మనిషి యొక్క పెద్దరికాన్ని, అతని ఘన కార్యాలను దృష్టిలో పెట్టుకుని నమాజె జనాజా సందర్భంగా 4 కన్నా ఎక్కువ తక్బీర్లు పలకటంలో ఎలాంటి అతిశయోక్తి, అనౌచిత్యం లేదని ఈ హదీసు ద్వారా వ్యక్తమవుతోంది.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసులో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిన సహ్ల్ బిన్ హునైఫ్ (రదియల్లాహు అన్హు) బద్ర్ యుద్ధంలో పాల్గొని, దైవప్రవక్త ﷺను వెన్నంటి నిలిచిన సహాబీలలో ఒకరు. అన్సార్ సహాబీ. ఔస్ తెగకు చెందిన వారు. మదీనా వాస్తవ్యులు. బద్ర్తోపాటు ఇతర యుద్ధాలలో కూడా పాల్గొన్నారు. హిజ్రత్ చేసి మదీనాకు వచ్చిన హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)తో దైవప్రవక్త ﷺ ఈయనకు సోదర బాంధవ్యం కల్పించారు. ఈ సోదర బంధాన్ని ఆయన ఎంతో చక్కగా కొనసాగించారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఈయన్ని బస్రా పర్యవేక్షకునిగా నియమించారు. సిఫ్ఫీన్ యుద్ధ సందర్భంగా కూడా ఈయన హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి మద్దతు తెలిపారు. హిజ్రీ 38లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 454

455

హదీసు 455

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُكَبِّرُ عَلَى جَنَائِزِنَا أَرْبَعًا وَيَقْرَأُ بِفَاتِحَةِ اَلْكِتَابِ فِي اَلتَّكْبِيرَةِ اَلْأُولَى } رَوَاهُ اَلشَّافِعِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ మా జనాజా నమాజులలో 4 తక్బీర్లు పలికేవారు. మొదటి తక్బీర్లో ఫాతిహా సూరా పఠించేవారు.” (షాఫయి దీనిని బలహీన – జయీఫ్ – ఆధారాలతో ఉల్లేఖించారు)

English

Jabir (RAA) narrated that the Messenger of Allah (ﷺ) used to say four Takbirat over the dead, and would recite al-Fatihah in (after saying) the first (opening) Takbirat.’ Related by Ash-Shafi’i with a weak chain of narrators.

సారాంశం

జనాజా నమాజ్లో మొదటి తక్బీర్ పలికిన తరువాత ఫాతిహా సూరా పఠించ వచ్చునని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది. నసాయిలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం సూరతుల్ అస్ర్ కూడా పఠించవచ్చునని తెలుస్తోంది. ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్ల దృష్టిలో నమాజె జనాజాలో ఫాతిహా సూరా పఠించటం వాజిబ్ (అనివార్యం). అయితే మరి కొంతమంది దీంతో ఏకీభవించలేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 455

456

హదీసు 456

وَعَنْ طَلْحَةَ بْنِ عَبْدِ اَللَّهِ بْنِ عَوْفٍ قَالَ: { صَلَّيْتُ خَلَفَ ابْنِ عَبَّاسٍ عَلَى جَنَازَةٍ, فَقَرَأَ فَاتِحَةَ الكْتِابِ فَقَالَ: "لِتَعْلَمُوا أَنَّهَا سُنَّةٌ" } رَوَاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ తల్హా బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఔఫ్ (రహిమహుల్లాహ్) కథనం : నేను ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వెనుక నమాజె జనాజా చేశాను. ఆయన సూరె ఫాతిహా పఠించారు. ఆయనిలా అన్నారు : ఇలా పఠించటం సున్నత్ అన్న సంగతి మీకు తెలియాలి (అన్న ఉద్దేశ్యంతోనే నేనీ సూరా పఠించాను). (బుఖారీ)

English

Talhah bin ‘AbduIlah bin ‘Auf (RAA) narrated, ‘I offered a funeral prayer led by Ibn ‘Abbas. He recited al-Fatihah and said, ‘You should know that it (reciting al-Fatihah) is a Sunnah of the Prophet (ﷺ).’ Related by Al-Bukhari.

సారాంశం

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారు ఫాతిహా సూరాను బిగ్గరగా పారాయణం చేశారు. ఇలా పారాయణం చేయటం దైవప్రవక్త ﷺ సంప్రదాయం అన్న విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావటానికే తానిలా చేశానని ఆయన (రదియల్లాహు అన్హు) వివరించారు కూడా. కాబట్టి నమాజె జనాజాలో ఫాతిహా సూరాను బిగ్గరగా పఠించటం ధర్మసమ్మతమే.

హదీసు ఉల్లేఖకులు

తల్హా బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఔఫ్ (రహిమహుల్లాహ్). ప్రఖ్యాత సహాబీ అయిన అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గారి అన్న కుమారుడు. ‘తల్హా నదా’ అనే బిరుదు పొందారు. అత్యుత్తమ శ్రేణికి చెందిన ధర్మవేత్త. తాబయీలలో మధ్యతరానికి చెందినవారుగా పరిగణించబడ్డారు. హిజ్రీ 97లో – 72 సంవత్సరాల వయస్సులో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 456

457

హదీసు 457

وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { صَلَّى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَلَى جَنَازَةٍ، فَحَفِظْتُ مِنْ دُعَائِهِ: "اَللَّهُمَّ اغْفِرْ لَهُ, وَارْحَمْهُ وَعَافِهِ, وَاعْفُ عَنْهُ, وَأَكْرِمْ نُزُلَهُ, وَوَسِّعْ مُدْخَلَهُ, وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ, وَنَقِّهِ مِنْ اَلْخَطَايَا كَمَا نَقَّيْتَ اَلثَّوْبَ اَلْأَبْيَضَ مِنَ الدَّنَسِ, وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ, وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ, وَأَدْخِلْهُ اَلْجَنَّةَ, وَقِهِ فِتْنَةَ اَلْقَبْرِ وَعَذَابَ اَلنَّارِ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒక జనాజా నమాజ్ చేయించారు. నేను ఆయన ﷺ చేసిన దుఆలో జ్ఞాపకం చేసుకున్న భాగం ఇది: “ఓ అల్లాహ్! ఇతన్ని మన్నించు. ఇతనిపై కరుణించు. ఇతన్ని సుఖసౌఖ్యాలతో ఉంచు. ఇతని తప్పులను ఉపేక్షించు. ఇతనికి చక్కని అతిథి మర్యాద చెయ్యి. ఇతని సమాధిని విశాలవంతంగా చెయ్యి. ఇతన్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగివెయ్యి. తెల్లని వస్త్రం మలినం నుండి ఎలా పరిశుభ్రపరచబడుతుందో అలాగే ఇతన్ని పరిశుభ్ర పరచు. ఇతనికి ప్రాపంచిక ఇల్లుకన్నా మంచి ఇల్లును, ప్రస్తుత ఆలుబిడ్డల కన్నా మంచి ఆలుబిడ్డలను ప్రసాదించు. ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజెయ్యి. ఇతన్ని సమాధి పరీక్ష నుండి, నరక యాతన నుండి సురక్షితంగా ఉంచు.” (ముస్లిం)

English

‘Auf bin Malik (RAA) narrated that the Messenger of Allah (ﷺ) offered the funeral prayer, and I memorized this supplication (that he said for the deceased), “'O Allah! Forgive him and have mercy on him (on her). Grant him ease and respite. Make his resting place a noble one, and facilitate his entry. Wash him with the most pure and clean water, snow and hail. Purify him from sins as a white garment is cleansed of dirt. Give him in exchange a home better than his home (on earth) and a family better than his family. Grant him entrance to Paradise and protect him from the trials of the grave and the torture of Hell Fire." Related by Muslim.

సారాంశం

ఈ ‘దుఆ’ను సయితం దైవప్రవక్త ﷺ బిగ్గరగా పఠించారని హదీసు తీరును బట్టి అర్థమవుతున్నది. బిగ్గరగా చదవబట్టే హజ్రత్ ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఈ దుఆను జ్ఞాపకం చేసుకోగలిగారు. లేదా ఈయన దైవప్రవక్త ﷺను అడిగి తెలుసుకుని, జ్ఞాపకం చేసుకుని ఉంటారన్న భావనకు కూడా ఆస్కారం లేకపోలేదు. ఇంతకీ ఈ దుఆను బిగ్గరగా చేయాలా లేక నెమ్మదిగా చేయాలా? అన్న విషయమై ద్వంద్వాభిప్రాయాలున్నాయి. చాలామంది ధర్మవేత్తలు దుఆను నెమ్మదిగా చేయాలని భావించారు. కొద్దిమంది మాత్రం బిగ్గరగా పఠించాలని అభిప్రాయపడ్డారు. రాత్రిపూట అయితే బిగ్గరగానూ పగటివేళ అయితే నెమ్మదిగానూ దుఆ చేయాలని మరికొంత మంది తలపోశారు. ‘దుఆ’ నెమ్మదిగా చేయటం ఉత్తమం కాబట్టి ఈ దుఆను నెమ్మదిగా చేయటమే మంచిదని అత్యధిక మంది ధర్మవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఎక్కువ హదీసులు దీనిని సమర్థిస్తున్నాయి. అయితే హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) మాదిరిగా బిగ్గరగా చదివినా అందులో ఆక్షేపణీయం ఏమీలేదు.

హదీసు ఉల్లేఖకులు

ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త సహచరులలో ఒకరు. అష్జా తెగకు చెందిన వారు. ఖైబర్ యుద్ధంలో తొలిసారిగా పాల్గొన్నారు. మక్కా విజయం నాడు అష్జా తెగ వారి ధ్వజం ఈయన చేతిలో ఉంది. సిరియాలో స్థిరపడ్డారు. హిజ్రీ 73లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 457

458

హదీసు 458

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا صَلَّى عَلَى جَنَازَةٍ يَقُولُ: "اَللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا, وَمَيِّتِنَا, وَشَاهِدِنَا, وَغَائِبِنَا, وَصَغِيرِنَا, وَكَبِيرِنَا, وَذَكَرِنَا, وَأُنْثَانَا, اَللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى اَلْإِسْلَامِ, وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى اَلْإِيمَانِ, اَللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ, وَلَا تُضِلَّنَا بَعْدَهُ } رَوَاهُ مُسْلِمٌ, وَالْأَرْبَعَةُ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఎవరి జనాజా నమాజ్ చేయించినా ఈ దుఆ పఠించేవారు: “ఓ దేవా! మాలోని సజీవులను – మృతులను, ఇక్కడ ఉన్నవారినీ – లేనివారినీ, మాలోని చిన్నలనూ – పెద్దలనూ, మాలోని పురుషులనూ – స్త్రీలనూ క్షమించు. దేవా! మాలో నీవు ఎవరిని సజీవంగా ఉంచినా ఇస్లాంపై సజీవంగా ఉంచు. మరెవరికి మరణాన్ని ఇచ్చినా విశ్వాసస్థితిలో మరణాన్ని ఇవ్వు. ఓ దేవా! మమ్ము ఇతనితో ముడిపడి ఉన్న పుణ్యఫలాన్నుండి దూరం చేయకు. ఇంకా మమ్ము ఇతని తరువాత అపమార్గం పట్టించకు.” (దీనిని ముస్లిం మరియు నలుగురు – అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ – ఉల్లేఖించారు)

English

Abu Hurairah (RAA) narrated, ‘When the Messenger of Allah (ﷺ) prayed a funeral prayer, he would say, "O Allah! Forgive those of us who are alive, and those who are dead, those present and those absent, those who are young and those who are male and those who are female. O Allah! Let those of us to whom You have given life, live in Islam, and let those of us You take back die in a state of faith. O Allah! Do not deprive us of our reward for (supplicating for) him, and cause us not to go astray after him." Related by Muslim and the four Imams.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 458

459

హదీసు 459

وَعَنْهُ أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا صَلَّيْتُمْ عَلَى اَلْمَيِّتِ فَأَخْلِصُوا لَهُ اَلدُّعَاءَ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు – “మీరు ఎప్పుడు ఎవరి జనాజా నమాజ్ చేసినా మనస్ఫూర్తిగా అతని కోసం (మృతుని కొరకు) దుఆ చేయండి.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If you offer the funeral prayer for a deceased person, supplicate Allah sincerely for him." Related by Abu Dawud.

సారాంశం

నమాజె జనాజాలో పాల్గొనే ప్రతి ఒక్కరూ చనిపోయిన వారి మన్నింపు కోసం ప్రార్థించే ఉద్దేశ్యంతోనే వస్తారు. తాను చేసే దుఆ వల్ల మృతునికి ప్రయోజనం చేకూరాలన్న తలంపు ఉన్నప్పుడు, ఆ దుఆలో ఎలాంటి లోటు కనబరచకూడదు. ఎంతో వినమ్రతతో, ఆర్ద్రతతో మృతుని క్షమాభిక్షకై అల్లాహ్ను వేడుకోవాలి. చాలామంది అంత్యక్రియలలో పాల్గొంటారు కాని వారిలో ఈ వినమ్రత కానరాదు. ఏదో లాంఛనప్రాయంగా, తాము కూడా పాల్గొన్నామన్న విషయాన్ని సాటి సమాజానికి తెలియజేసేందుకు వస్తారు. చిత్తశుద్ధి లోపించిన వేడుకోళ్ళు దైవ సన్నిధిలో ఆమోదయోగ్యమవుతాయన్నది సందేహాస్పదమే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 459

460

హదీసు 460

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { أَسْرِعُوا بِالْجَنَازَةِ, فَإِنْ تَكُ صَالِحَةً فَخَيْرٌ تُقَدِّمُونَهَا إِلَيْهِ, وَإِنْ تَكُ سِوَى ذَلِكَ فَشَرٌّ تَضَعُونَهُ عَنْ رِقَابِكُمْ } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – “జనాజా (శవపేటిక) మోసుకు వెళ్ళటంలో శీఘ్రతను కనబరచండి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒకవేళ సద్వర్తనుడై ఉంటే అది అతని పాలిట శుభకరం అవుతుంది. కనుక అతన్ని మంచి స్థానం వైపునకు త్వరగా తీసుకెళ్ళండి. ఒకవేళ మృతుడు వేరేవాడై ఉంటే (దుర్వర్తనుడై ఉంటే) మీరు మీ భుజాల నుండి బరువు తగ్గించుకున్న వారవుతారు.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah said, "Hurry up when you carry the dead body (the janazah), for if the deceased is righteous, you would be taking it to something better, and if he or she is an evil person, then you will be getting him or her off your necks.’ Agreed upon.

సారాంశం

ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే మృతుని అంత్యక్రియలు జరపటంలో అనవసరంగా ఆలస్యం చేయకూడదు. ఇది సున్నత్కు విరుద్ధం. మరణించిన వారిని తొందరగా ఖననం చేయాలని దైవప్రవక్త ﷺ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి తాకీదు చేశారు. తబ్రానీలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ఇలా వుంది: “మీలో ఎవరయినా మరణిస్తే అతన్ని (అనవసరంగా) ఆపి ఉంచకండి. వీలయినంత తొందరగా అతన్ని సమాధి వైపునకు తీసుకువెళ్ళండి” అని దైవప్రవక్త ﷺ ఉపదేశించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 460

461

హదీసు 461

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ "مَنْ شَهِدَ اَلْجِنَازَةَ حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ, وَمَنْ شَهِدَهَا حَتَّى تُدْفَنَ فَلَهُ قِيرَاطَانِ".‏ قِيلَ: وَمَا اَلْقِيرَاطَانِ? قَالَ: "مِثْلُ اَلْجَبَلَيْنِ اَلْعَظِيمَيْنِ" } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ: { حَتَّى تُوضَعَ فِي اَللَّحْدِ }. وَلِلْبُخَارِيِّ: { مَنْ تَبِعَ جَنَازَةَ مُسْلِمٍ إِيمَانًا وَاحْتِسَابًا, وَكَانَ مَعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْ دَفْنِهَا فَإِنَّهُ يَرْجِعُ بِقِيرَاطَيْنِ, كُلُّ قِيرَاطٍ مِثْلُ جَبَلِ أُحُدٍ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు: “ఎవరయితే జనాజా వెంట వెళతాడో, జనాజా నమాజ్ చేయించే వరకూ ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ హాజరై ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది.” ‘రెండు ఖీరాత్లంటే ఎంత?’ అని ప్రశ్నించగా “రెండు ఖీరాత్లంటే అవి రెండు పెద్ద పర్వతాలకు సమానం” అని దైవప్రవక్త ﷺ సమాధానమిచ్చారు.

“మృతుణ్ణి సమాధిలో దించేవరకూ హాజరై ఉంటాడో…” అన్న వాక్యం ముస్లిం ఉల్లేఖనంలో ఉంది.

బుఖారీలోని ఉల్లేఖనం ఈ విధంగా ఉంది-“ఎవరయితే ఒక ముస్లిం అంత్యక్రియల నమాజులో విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో పాల్గొంటాడో మరియు నమాజె జనాజా ముగిసే వరకూ తోడుగా ఉండి, ఖననం జరిగిన తరువాత వెనుతిరిగి వస్తాడో అతడు రెండు ఖీరాత్లు పుచ్చుకుని వచ్చాడన్నమాట! ప్రతి ఖీరాత్ ఉహుద్ పర్వతానికి సమానమైనది.”

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Whoever accompanies the funeral (the dead body) until he performs the funeral prayer will have a reward equal to (one Qirat), and whoever accompanies the burial procession, will be doubly awarded (two Qirat).” They then asked, ‘What is meant by the two Qirat?’ He replied (ﷺ) “Like two huge mountains.” Agreed upon. Muslim added the statement, ‘until it is buried.’

Al-Bukhari related on the authority of Abu Hurairah, “Whoever accompanies the funeral of a Muslim, seeking the reward only from Allah, the Almighty, and he stays with it until he offers the funeral prayer and the burial is completed, will return back with two Qirat, each Qirat is equal to the mount of Uhud.”

సారాంశం

అంత్యక్రియలలో పాల్గొన్న వారికి లభించే పుణ్యఫలాన్ని ఈ హదీసులో ఉపమానాల రూపంలో వివరించటం జరిగింది. మృతి చెందిన సాటి సోదరసోదరీమణుల అంతిమ వీడ్కోలుకై తప్పకుండా వెళ్ళండని ప్రోత్సహించటం ఈ హదీసు ప్రధాన ఉద్దేశ్యం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 461

462

హదీసు 462

وَعَنْ سَالِمٍ, عَنْ أَبِيهِ ‏- رضى الله عنه ‏- { أَنَّهُ رَأَى اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-وَأَبَا بَكْرٍ وَعُمَرَ, يَمْشُونَ أَمَامَ الْجَنَازَةِ } رَوَاهُ اَلْخَمْسَةُ، وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ, وَأَعَلَّهُ النَّسَائِيُّ وَطَائِفَةٌ بِالْإِرْسَالِ.

దైవప్రవక్త ﷺను, హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు)ను, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను, జనాజాకు ముందు నడుస్తుండగా తాను చూశానని తన తండ్రిగారు తనకు చెప్పినట్లు హజ్రత్ సాలిమ్ వివరించారు. (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా నిర్ధారించారు – నసాయి తదితరులు, దీనిని ‘ముర్సల్’గా భావించారు)

English

Salim narrated on the authority of his father (RAA) that he saw the Messenger of Allah (ﷺ), Abu Bakr and ’Umar walking in front of a Funeral.’ Related by the five Imams, and Ibn Hibban rendered it Sahih.

సారాంశం

శవపేటిక వెంట నడచి వెళుతున్నప్పుడు ముందు ఉండాలా? వెనుక ఉండాలా? వివిధ ఉల్లేఖనాలను జోడించగా ఆయన ﷺ ముందు, వెనుక, కుడిప్రక్క, ఎడమ ప్రక్క – అన్ని విధాలుగా నడచినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. అయితే ఈ నాలుగు పాజిషన్లలో మెరుగైనదేది? అంటే ఇమాములు దీనిపై పలు రకాలుగా స్పందించారు. ఇమామ్ షాఫయి, ఇమామ్ మాలిక్, ఇమామ్ అహ్మద్లు ముందు నడవటాన్ని ఉత్తమంగా భావిస్తున్నారు. కాగా, ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ ఔజాయిలు వెనుక నడవటాన్ని ఉత్తమంగా తలపోస్తున్నారు. ‘ఎలా నడచినా ఫరవాలేదు, ముందైనా వెనకైనా దేనికీ దేనిపైనా ఆధిక్యత, ప్రత్యేకత లేదు’ అని ఇమామ్ షౌకానీ అభిప్రాయపడ్డారు. నడచి వచ్చే వారు మునుముందు ఉండాలనీ, వాహనంపై ఉన్నవారు వెనుక ఉండాలనీ సుఫియాన్ సౌరీ ప్రభృతులు భావిస్తున్నారు. ఏ స్థితిలో నడచినా పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవచ్చు. ఇదేమంత తీవ్రమయిన విషయం కాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 462

463

హదీసు 463

وَعَنْ أُمِّ عَطِيَّةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ: { نُهِينَا عَنِ اتِّبَاعِ الْجَنَائِزِ, وَلَمْ يُعْزَمْ عَلَيْنَا } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ ఉమ్మె అతియ (రదియల్లాహు అన్హా) కథనం : “మేము జనాజా (అంతిమ వీడ్కోలు) యాత్రలో పాల్గొనరాదని చెప్పబడింది. అయితే ఈ వారింపు మాపై అనివార్యంగా ఖరారు చేయబడలేదు.” (బుఖారీ, ముస్లిం)

English

Umm ‘Atiyah (RAA) narrated, ‘We were forbidden to accompany funeral processions, but this prohibition was not mandatory for us.’ Agreed upon.

సారాంశం

మహిళలు జనాజా నమాజులో, జనాజా యాత్రలలో పాల్గొనరాదని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. ఈ వారింపు బహుశా తొలి కాలానికి సంబంధించినదై ఉండవచ్చు. తదుపరి మహిళలలో ధర్మావగాహన పెంపొంది, ఇస్లామీయ చైతన్యం మేల్కొన్న తరువాత బహుశా జనాజా నమాజులో పాల్గొనే అనుమతి లభించి ఉండవచ్చు. నసాయి, ఇబ్నె మాజ, ఇబ్నె అబీ షైబాలలో వచ్చిన అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ఒక జనాజాలో మహిళలు కూడా పాల్గొన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వాళ్ళను ఆపబోయారు. కాని “వారిని వెళ్ళనివ్వండి” అని దైవప్రవక్త ﷺ సెలవిచ్చారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 463

464

హదీసు 464

وَعَنْ أَبِي سَعِيدٍ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا رَأَيْتُمُ الْجَنَازَةَ فَقُومُوا, فَمَنْ تَبِعَهَا فَلَا يَجْلِسْ حَتَّى تُوضَعَ } مُتَّفَقٌ عَلَيْه ِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “ఎవరిదయినా జనాజా (శవపేటిక) రావటం మీరు గమనిస్తే లేచి నిలబడండి. ఇంకా జనాజా వెంటనున్నవారు జనాజాను (శవపేటికను) నేలపై ఉంచే వరకూ కూర్చోకూడదు.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Sa’id (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Stand up when you see a funeral procession, and he who accompanies it should not sit down until the coffin is placed on the ground." Agreed upon.

సారాంశం

మరణం తిరుగులేనిది. అది ఎక్కడ సంభవించినా, ఎవరిని కబళించినా పరిసరాల వారిని కలచివేస్తుంది. కించిత్ సమయానికి మనిషిలో గుండె దడ పెరుగుతుంది. మృతుణ్ణి సమాధి వైపునకు తీసుకు వెళుతున్నప్పుడు అతని పట్ల గౌరవభావంతో, మానవతా దృక్పథంతో లేచి నిలబడటం కనీస మర్యాద అనిపించుకుంటుంది. అదీగాక ఆ సమయంలో దైవదూతలు మృతునికి తోడుగా ఉంటారు. ఇక జనాజా యాత్రలో పాల్గొన్న వారు నిర్ణీత మజిలీకి చేరేదాకా వెంట వెళ్ళి శవ పేటికను క్రిందికి దించిన మీదటే కూర్చోవాలి. శవపేటికను ఎత్తుకుని ఉండగా కూర్చోకూడదు. నసాయిలో అబూహురైర (రదియల్లాహు అన్హు), అబూసయీద్ (రదియల్లాహు అన్హుమా)లు ఇలా అంటున్నారు : “దైవప్రవక్త ﷺ వారు ఏ జనాజాలో పాల్గొన్నా దాన్ని క్రింద నేలపై ఉంచే వరకూ ఆయన ﷺ కూర్చోవటం మేమెన్నడూ చూడలేదు.”

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 464

465

హదీసు 465

وَعَنْ أَبِي إِسْحَاقَ, أَنَّ عَبْدَ اللَّهِ بْنَ يَزِيدَ ‏- رضى الله عنه ‏- { أَدْخَلَ الْمَيِّتَ مِنْ قِبَلِ رِجْلَيِ الْقَبْرَ، وَقَالَ: هَذَا مِنَ السُّنَّةِ } أَخْرَجَهُ أَبُو دَاوُد َ.

హజ్రత్ అబూ ఇస్హాఖ్ (రహిమహుల్లాహ్) కథనం : “అబ్దుల్లాహ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) మృతదేహాన్ని దాని కాళ్ళవైపు నుంచి సమాధిలో దించారు. ఇదే సాంప్రదాయిక పద్ధతి (సున్నత్) అని కూడా ఆయన అన్నారు.” (అబూదావూద్)

English

Abu Ishaq narrated that ‘Abdullah bin Yazid placed a dead body in the grave from the side near the foot of the grave (i.e. the end which will accommodate the feet when the body is placed in it). He then said, ‘This is the Sunnah of the Prophet (ﷺ).’ Related by Abu Dawud.

సారాంశం

కాళ్ళ వైపు నుంచి మృత దేహాన్ని గోరీలోకి దించాలని ఈ హదీసు చెబుతోంది. హిజాజ్ ప్రాంతం వారు ఈ విధానాన్నే అనుసరించేవారు. ఇమామ్ షాఫయి, అహ్మద్లు కూడా దీనినే అనుసరించారు. ఇదే ఉత్తమమయిన పద్ధతి. దీనికి భిన్నంగా ప్రామాణికమైన ఉల్లేఖనం ఏదీ ఇంత వరకు లభ్యం కాలేదు.

హదీసు ఉల్లేఖకులు

1. అబూ ఇస్హాఖ్ గారి అసలు పేరు అమ్ర్ బిన్ అబ్దుల్లాహ్ సబ్యీ హమ్దానీ. కూఫా వాసులు. ప్రఖ్యాత తాబయీలలో ఒకరు. అనేక హదీసులు అందజేశారు. కాని వార్ధక్యంలో మతి భ్రమించింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో జన్మించారు. హిజ్రీ 129లో కన్నుమూశారు.

2. అబ్దుల్లాహ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) అన్సార్ వర్గీయులు. ఔస్ తెగకు చెందిన వారు. హుదైబియా ఒప్పందంలో పాల్గొన్నప్పుడు ఈయన వయస్సు 17. జమల్ యుద్ధంలోనూ, సిఫ్ఫీన్ యుద్ధంలోనూ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) పక్షాన ఉన్నారు. కూఫాకు మకాం మార్చారు. ఇబ్నె జుబైర్ (రదియల్లాహు అన్హుమా) హయాంలో ‘కూఫా’ గవర్నర్గా కూడా నియమితులయ్యారు. ఆ కాలంలోనే కూఫాలో కన్ను మూశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 465

466

హదీసు 466

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا, عَنِ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا وَضَعْتُمْ مَوْتَاكُمْ فِي الْقُبُورِ, فَقُولُوا: بِسْمِ اللَّهِ, وَعَلَى مِلَّةِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-.‏ } أَخْرَجَهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ, وَأَعَلَّهُ الدَّارَقُطْنِيُّ بِالْوَقْف ِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ప్రబోధనం – “మీ మృతులను సమాధులలోకి దించేటప్పుడు ‘బిస్మిల్లాహి వ అలా మిల్లతి రసూలిల్లాహ్’ అని పలకండి.” (దీనిని అహ్మద్, అబూ దావూద్, నసాయి వెలికితీశారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా నిర్ధారించారు – దారె ఖుత్నీ మాత్రం దీనిని ‘మౌఖూఫ్’గా భావించారు)

English

Ibn 'Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When you place your deceased in the grave, say, ‘In the Name of Allah, and in accordance with the tradition of Allah’s Messenger (ﷺ).” Related by Ahmad, Abu Dawud and An-Nasa’i.

సారాంశం

హదీసులో పేర్కొనబడిన దుఆ మస్నూన్ అనీ, దీనిని మృతులను సమాధిలో దించే సమయంలో పఠించాలనీ ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. ఇమామ్ దారె ఖుత్నీ (రహిమహుల్లాహ్) ఈ హదీసును నసాయి మాదిరిగా ‘మౌఖూఫ్’గా ఖరారు చేశారు గానీ ఇది సరయినది కాదు. ఎందుకంటే ‘ముస్తద్రక్’లోని ఒక ఉల్లేఖనం కూడా ఈ హదీసు ప్రామాణికతను బలపరుస్తున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 466

467

హదీసు 467

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { كَسْرُ عَظْمِ الْمَيِّتِ كَكَسْرِهِ حَيًّا } رَوَاهُ أَبُو دَاوُدَ بِإِسْنَادٍ عَلَى شَرْطِ مُسْلِم ٍ. وَزَادَ ابْنُ مَاجَهْ مِنْ حَدِيثِ أُمِّ سَلَمَةَ: { فِي الْإِثْمِ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చెప్పారు – “ఒక బ్రతికి వున్న మనిషి ఎముకను విరగ్గొట్టడం ఎంతో (ఎంత పాపమో) ఒక మృతుని ఎముకను విరగ్గొట్టడం కూడా అంతే” (దీనిని అబూ దావూద్, ‘ముస్లిం’ పెట్టిన షరతు ఆధారంగా ఉల్లేఖించారు – ఇబ్నె మాజా ఈ సందర్భంగా ఉమ్మె సలమా-ర. అన్హా-చే ఉల్లేఖించబడిన దానిలో ‘పాప కార్యంలో’ అన్న పదాన్ని అదనంగా పేర్కొన్నారు)

English

A’ishah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Breaking a deceased body’s bones is exactly like breaking them when he is alive.” Related by Abu Dawud in accordance with the conditions of Muslim.

Ibn Majah added, on the authority of Umm Salamah (RAA), “with regards to it being a sin.”

సారాంశం

ఒక ముస్లిం వ్యక్తి – అతడు చనిపోయినప్పటికీ – ఎంతో మర్యాదకరంగా అతని పట్ల మసలుకోవాలని ఈ హదీసు చెబుతోంది. గౌరవాదరణల విషయానికి వస్తే సజీవునికీ – మృతునికీ మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. అయితే ఆధునిక యుగంలో ఏర్పడిన కొన్ని అత్యవసర, అనివార్య పరిస్థితుల దృష్ట్యా, చట్టపరమైన అవసరాల మూలంగా ధర్మవేత్తలు సర్జరీకి, పోస్టుమార్టంకి అనుమతించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 467

468

హదీసు 468

وَعَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { أَلْحَدُو ا لِي لَحْدًا, وَانْصِبُوا عَلَيَّ اللَّبِنَ نَصْبًا, كَمَا صُنِعَ بِرَسُولِ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-.‏ } رَوَاهُ مُسْلِم ٌ. وَلِلْبَيْهَقِيِّ عَنْ جَابِرٍ نَحْوُهُ, وَزَادَ: { وَرُفِعَ قَبْرُهُ عَنِ الْأَرْضِ قَدْرَ شِبْرٍ } وَصَحَّحَهُ ابْنُ حِبَّان َ. وَلِمُسْلِمٍ عَنْهُ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ يُجَصَّصَ الْقَبْرُ, وَأَنْ يُقْعَدَ عَلَيْهِ, وَأَنْ يُبْنَى عَلَيْهِ }.

హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఆయన ఇలా అన్నారు- నా కోసం సమాధిలో చంక మాదిరిగా ప్రక్కనుంచి జాగా తీయండి. దైవ ప్రవక్త ﷺ సమాధి వలె నా పైన పచ్చి ఇటుకలు, సున్నం పేర్చండి (ముస్లిం)

బైహఖీ గారు కూడా హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) సౌజన్యంతో ఈ విధంగానే ఉల్లేఖించారు. అయితే అదనంగా ఈ వాక్యాలను నకలు చేశారు – ‘ఆయన ﷺ సమాధి నేలకు కేవలం ఒక జానెడు ఎత్తు మాత్రమే ఉంచబడింది.’ (ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారుచేశారు)

‘ముస్లిం’లో జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది – “సమాధిని పటిష్ఠవంతం చేయడాన్ని, దానిపై కూర్చోవటాన్ని, దానిపై కట్టడం నిర్మించడాన్ని దైవప్రవక్త ﷺ వారించారు.”

English

Sa'd bin Abi Wqqas (RAA) said (during his death illness) ‘Make a lahd for me and cover it with un-burnt bricks, as you did with the grave of the Prophet (ﷺ).’ Related by Muslim.

Al-Baihaqi transmitted on the authority of Jabir (RAA) a similar narration and added, ‘And his grave was raised one span from the ground.’ Ibn Hibban graded it as Sahih.

Jabir (RAA) narrated that the Messenger of Allah (ﷺ) prohibited whitening a grave with plaster, to sit on it or to build over it (such as a dome).’ Related by Muslim.

సారాంశం

ఈ హదీసు ద్వారా అనేక అంశాలు మన దృష్టిలోకి వస్తున్నాయి. అవేమంటే 1) సమాధి ఒక జానెడు కన్నా ఎక్కువ ఎత్తుండరాదు. 2) సమాధి లోపల ‘బగ్లీ’ (డొక్క మాదిరిగా, చంక తరహాలో) చేయటం ఆయన ﷺకు ఎంతో ఇష్టం. 3) సమాధిలో పచ్చి ఇటుకలు (లేక నాపరాళ్ళు) వంకరగా పేర్చటం మంచిది. 4) సమాధిపై ఏదయినా కట్టడం నిర్మించటం, సమాధిని పటిష్ఠవంతంగా, అందంగా తీర్చిదిద్దటం నిషిద్ధం. 5) సమాధికి ఒక ప్రత్యేక రూపం ఇచ్చి, దానికొక ప్రత్యేకతను ఆపాదించటం కూడా సమంజసం కాదు. దైవప్రవక్త ﷺ గారి శాశ్విత విశ్రాంతి స్థలం కూడా ఒక జానెడు కన్నా ఎక్కువ ఎత్తు ఉండేది కాదు. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ల సమాధులు కూడా ఇలాగే ఉండేవి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 468

469

హదీసు 469

وَعَنْ عَامِرِ بْنِ رَبِيعَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-صَلَّى عَلَى عُثْمَانَ بْنِ مَظْعُونٍ, وَأَتَى الْقَبْرَ, فَحَثَى عَلَيْهِ ثَلَاثَ حَثَيَاتٍ, وَهُوَ قَائِمٌ } رَوَاهُ اَلدَّارَقُطْنِيّ ُ.

హజ్రత్ ఆమిర్ బిన్ రబీయ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఉస్మాన్ బిన్ మజ్ఊన్ (రదియల్లాహు అన్హు) నమాజె జనాజాను చేశారు. ఆయన సమాధి వద్దకు విచ్చేసి, నిలబడే మూడు దోసిట్ల మన్ను సమాధిపై వేశారు. (సునన్ దారె ఖుత్నీ)

English

‘Amir bin Rabi’Ah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) prayed over ‘Uthman bin Madh’un, then went to the grave and sprinkled three handfuls of soil while he was standing.’ Related by Ad-Darqutni.

సారాంశం

అంత్యక్రియలలో పాల్గొన్నవారు, మృతదేహాన్ని సమాధిలో చేర్చిన మీదట తలో మూడు దోసిట్ల మన్ను వేయాలని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది.

హదీసులోని ప్రముఖ వ్యక్తి

ఉస్మాన్ బిన్ మజ్ఊన్ జుమాహి ఖురషీ (రదియల్లాహు అన్హు) వృద్ధ సహాబీలలో ఒకరు. గొప్ప దైవభక్తి పరాయణులు, సాధు స్వభావి. అజ్ఞాన కాలంలోనే ఈయన మద్యపానాన్ని తనకోసం హరామ్ గావించుకున్నారు. 13 మంది తరువాత ఇస్లాం స్వీకరించారు. దైవ మార్గంలో రెండు హిజ్రత్లు చేశారు. బద్ర్ యుద్ధంలో హాజరయ్యారు. మదీనాలో హిజ్రీ 30వ మాసంలో – షాబాన్‌లో – మరణించారు. ముహాజిర్లలో మరణించిన తొలివ్యక్తి ఈయనే. ‘జన్నతుల్ బఖీ’లో ఖననం చేయబడ్డారు. ఈయన మరణించినపుడు దైవప్రవక్త ﷺ ఈయన్ని ముద్దుపెట్టుకున్నారు. అంత్యక్రియలు ముగిసిన తరువాత ఆయన గురించి వ్యాఖ్యానిస్తూ దైవప్రవక్త ﷺ, ‘ఆయన మనందరికీ పెద్ద దిక్కు’ అన్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 469

470

హదీసు 470

وَعَنْ عُثْمَانَ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا فَرَغَ مِنْ دَفْنِ الْمَيِّتِ وَقَفَ عَلَيْهِ وَقَالَ: "اِسْتَغْفِرُوا لِأَخِيكُمْ وَسَلُوا لَهُ التَّثْبِيتَ, فَإِنَّهُ الْآنَ يُسْأَلُ" } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ الْحَاكِم ُ.

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఏ మృతదేహాన్ని అయినా ఖననం చేసిన తరువాత సమాధి దగ్గర నిలబడి ఇలా అనేవారు: “మీ సోదరుని క్షమాపణకై అర్థించండి. స్థిరత్వాన్ని ప్రసాదించమని ప్రార్థించండి. ఎందుకంటే ఇప్పుడితను ప్రశ్నించబడతాడు” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – హాకిమ్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

‘Uthman Ibn ‘Affan (RAA) narrated, ‘Whenever the Messenger of Allah (ﷺ) finished the burial of the dead, he would stand by the grave and say, “Seek forgiveness for your brother and pray for him to be steadfast, because he is now being questioned.” Related by Abu Dawud. Al-Hakim graded it as Sahih.

సారాంశం

సమాధిలో మృతులు ప్రశ్నించబడతారన్న దానికి ఈ హదీసు ఒక నిదర్శనం. ఖననం చేసిన తరువాత మృతుని క్షమాపణకై అల్లాహ్ను ప్రార్థించటం సరైనదేనని కూడా ఈ హదీసు చెబుతున్నది. అయితే ఈనాటి ప్రజలు ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టేసి, లేనిపోని కొత్త ఆచారాలను మొదలెట్టారు. చూడబోతే షరీయత్లో వాటికి ఎలాంటి చోటులేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 470

471

హదీసు 471

وَعَنْ ضَمْرَةَ بْنِ حَبِيبٍ أَحَدِ التَّابِعِينَ قَالَ: { كَانُوا يَسْتَحِبُّونَ إِذَا سُوِّيَ عَلَى الْمَيِّتِ قَبْرُهُ, وَانْصَرَفَ اَلنَّاسُ عَنْهُ, أَنْ يُقَالَ عِنْدَ قَبْرِهِ: يَا فُلَانُ! قُلْ: لَا إِلَهَ إِلَّا اَللَّهُ.‏ ثَلَاثُ مَرَّاتٍ, يَا فُلَانُ! قُلْ: رَبِّيَ اللَّهُ, وَدِينِيَ الْإِسْلَامُ, وَنَبِيِّ مُحَمَّدٌ ‏- صلى الله عليه وسلم ‏-} رَوَاهُ سَعِيدُ بْنُ مَنْصُورٍ مَوْقُوفًا.. وَلِلطَّبَرَانِيِّ نَحْوُهُ مِنْ حَدِيثِ أَبِي أُمَامَةَ مَرْفُوعًا مُطَوَّلً ا.

తాబయీన్లలో ఒకరైన హజ్రత్ జమ్రా బిన్ హబీబ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు – మృతుని సమాధి చదునుగా చేసిన తరువాత, జనులు వెళ్ళిపోతున్నప్పుడు సమాధి వద్ద నిలుచుని, మృతుని సంబోధిస్తూ ఇలా అనటం వాంఛనీయం అని ప్రజలు తలపోసేవారు: “ఓ ఫలానా…. లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరో దైవం లేదు) అని అను. ఇలా మూడు సార్లు చెప్పేవారు. “ఓ ఫలానా…. రబ్బి యల్లాహు (అల్లాహ్ నా ప్రభువు) అనీ, వ దీనీ అల్ ఇస్లాం (ఇస్లాం నా ధర్మం) అనీ, వ నబియ్యా ముహమ్మద్ ﷺ (ముహమ్మద్ నా ప్రవక్త) అనీ పలుకు” అని కూడా చెప్పేవారు. (సయీద్ బిన్ మన్సూర్ దీనిని ‘మౌఖూఫ్’ గా పేర్కొన్నారు. తబ్రానీ దీనిని ఇదే విధంగా అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) నుండి ‘మర్ఫూ’ హదీసుగా వివరించారు)

English

Damrah bin Habib (one of the Tabi'in or the followers of the Companions) narrated, ‘They (the Companions that he met) recommended that after the grave is leveled and the people leave, that one should stand by the grave and say three times to the deceased, 'O so-and-so, say: "There is no god but Allah”, 'O so-and-so, say: "Allah is my Lord, Islam is my din (religion), and Muhammad is my prophet.” Related by Sa'id bin Mansur.

At-Tabarani Related A similar Hadith on the authority of Abu Umamah on the authority of the Prophet (ﷺ).

సారాంశం

ఖననం చేసిన తరువాత, మృతుని సంబోధించి ‘ఉపదేశించటం’ ఏ సహీహ్ హదీసు ద్వారా కూడా రుజువు కాలేదు. దీని గురించి ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) గారిని ప్రశ్నించగా, ఒక్క సిరియా ప్రజలు తప్ప మరొకరు ఇలా చేయటం తాను చూడలేదని అన్నారు.

హదీసు ఉల్లేఖకులు

అసలు పేరు జమ్రా బిన్ హబీబ్. మారు పేరు అబూ ఉతబా. వంశపరంపర ఈ విధంగా ఉంది :-జమ్రా బిన్ హబీబ్ బిన్ సుహైబ్ జుబైదీ. హిమ్స్కు చెందిన వారవటం చేత హిమ్సీగా పిలువబడ్డారు. విశ్వసనీయులైన తాబయి. నాల్గో తరానికి చెందిన వారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 471

472

హదీసు 472

وَعَنْ بُرَيْدَةَ بْنِ الْحَصِيبِ الْأَسْلَمِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ كُنْتُ نَهَيْتُكُمْ عَنْ زِيَارَةِ الْقُبُورِ فَزُورُوهَا } رَوَاهُ مُسْلِم ٌ. زَادَ اَلتِّرْمِذِيُّ: { فَإِنَّهَا تُذَكِّرُ الْآخِرَةَ }. زَادَ ابْنُ مَاجَهْ مِنْ حَدِيثِ ابْنِ مَسْعُودٍ: { وَتُزَهِّدُ فِي الدُّنْيَا }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ బురైద బిన్ హుసైబ్ అస్లమీ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “నేను మీకు సమాధులను సందర్శించరాదని చెప్పి ఉన్నాను. కాని ఇక నుంచి మీరు వాటిని సందర్శించండి” (ముస్లిం). తిర్మిజీలో ఈ వాక్యం అదనంగా ఉంది : “సమాధుల సందర్శనం పరలోకాన్ని జ్ఞప్తికి తెస్తుంది.” ఇబ్నె మాజ గారు ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో అదనంగా ఈ వాక్యం చేర్చారు – “ఈ సందర్శన ప్రాపంచిక వ్యామోహాన్ని తగ్గిస్తుంది.”

English

Buraidah bin Al-Husaib al-Aslami (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “I had forbidden you to visit graves, but now you may visit them.” Related by Muslim. At-Tirmidhi added the following, “It will remind you of the Here-after."

Ibn Majah added on the authority of Bin Mas’ud, “And they make you (i.e. the graves) renounce this worldly life.”

సారాంశం

సమాధుల సందర్శన ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ప్రారంభ కాలంలో ఆయన ﷺ సమాధుల సందర్శనను వారించారు. కాని తరువాత ఇందుకు అనుమతించారు. ప్రజాబాహుళ్యంలో పరలోక చింతనను కలిగించడానికి, చనిపోయిన వారి మన్నింపుకై ఇతోధికంగా వేడుకోవటానికి దైవప్రవక్త ﷺ ఈ అనుమతి ఇచ్చారు. అంతేగాని సమాధుల వద్ద ఉరుసుల పేరుతో తమాషా చేయటానికి, మొక్కుకోవటానికి కాదు. ఈ రకమయిన చేష్టలకు షరీఅత్లో ఏ మాత్రం చోటులేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 472

473

హదీసు 473

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-لَعَنَ زَائِرَاتِ الْقُبُورِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ..

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ సమాధుల సందర్శన నిమిత్తం వెళ్ళే స్త్రీలను ధూత్కరించారు.” (దీనిని తిర్మిజీ సేకరించగా ఇబ్నె హిబ్బాన్ ప్రామాణిక హదీసుగా నిర్ధారించారు)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) cursed the women who frequently visit the graves. Related At-Tirmidhi and Ibn Hibban graded it as Sahih.

సారాంశం

స్త్రీలు సమాధుల సందర్శనకై వెళ్ళరాదని ఈ హదీసు చెబుతోంది. సాధారణంగా ‘ధూత్కారం’ అనేది అధర్మమయిన కార్యం చేసినప్పుడే ప్రయోగించబడుతుంది. మరి కొన్ని హదీసుల ప్రకారం స్త్రీలు సమాధుల్ని సందర్శించవచ్చునని ఉంది. పై హదీసులోని ‘వారింపు’ సమాధుల సందర్శనకు అనుమతిలేని కాలానికి సంబంధించినదనీ, సమాధుల సందర్శనకు అనుమతి లభించిన తరువాత స్త్రీలు, పురుషులు – అందరికీ ఇది వర్తిస్తుందనీ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. స్త్రీలు సమాధుల్ని సందర్శించరాదన్న ప్రవచనం శాశ్వత ప్రాతిపదికతో కూడుకున్నదని మరికొందరు గట్టిగా వాదిస్తున్నారు. దీనికి పండితులు చెప్పే కారణాలేమిటంటే; స్త్రీలలో సాధారణంగా ఈ విషయంలో మటుకు సహనం, సంయమనం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేరు. గుండెలు బాదుకుంటారు. హాహాకారాలు చేస్తారు. ధర్మానికీ, షరీఅత్కు వ్యతిరేకమయిన ఎన్నో పనులకు శ్రీకారం చుట్టేస్తారు. అజ్ఞానానికి, మూర్ఖత్వానికి ప్రతిబింబమైన పనులను మొదలెట్టి సమాధుల సందర్శనా పరమార్థాన్ని మంటగలుపుతారు. అందుకే స్త్రీలు సమాధులను సందర్శించటాన్ని ప్రవక్త ﷺ తీవ్రంగా వారించారు. గుణపాఠం గరపే, పరలోక భీతిని పెంపొందించుకునే ఉద్దేశ్యంతో సమాధులను సందర్శిస్తే తప్పులేదు. సహీహ్ హదీసులో ‘జవ్వారాత్’ అనే పదం వచ్చిందనీ, దీని అర్థం అత్యధికంగా స్త్రీలు ఖనన వాటికకు వెళ్ళటంపై ఆయన ﷺ ధూత్కరించారనీ, గుణపాఠం కొరకు వెళితే ఫరవాలేదనీ అల్లామా షౌకానీ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానించారు. అల్లామా అల్-బానీ కూడా దాదాపు ఈ విధంగానే అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 473

474

హదీసు 474

وَعَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ : { لَعَنَ رَسُولُ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-اَلنَّائِحَةَ , وَالْمُسْتَمِعَةَ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మరణించిన వారి పేరున అరుపులు కేకలతో ఏడ్చే వారినీ, అలాంటి వాటిని ఏర్పాటుచేసి మరీ వినే వారినీ దైవప్రవక్త ﷺ ధూత్కరించారు.” (అబూదావూద్)

English

Abu Sa'id Al-Khudri (RAA) narrated that the Messenger of Allah (ﷺ) cursed the wailing women and those who listen to them. Related by Abu Dawud.

సారాంశం

అజ్ఞాన కాలంలో అరబ్బులు ప్రత్యేకంగా ప్రొఫెషనల్స్ని పిలిచి మరీ ఈ మేరకు ఏర్పాటు చేసేవారు. బుర్రకథ, సోది తరహాలో ఆడవాళ్ళు మృతుని గుణగణాలను, ఘనకార్యాలను జ్ఞాపకం చేసి గొల్లున ఏడ్చేవారు. హాహాకారాలు చేసేవారు. మృతుని పేరు మీద ఎంత ఎక్కువగా రోదిస్తే అతని ఆత్మ శాంతికి అంతగా మంచిదని నమ్మేవారు. ఇలాంటి మూఢాచారాలను దైవప్రవక్త ﷺ నివారించటమే గాక, వీటికి పాల్పడే వారిని ధూత్కరించారు.

దుఃఖంతో కళ్ళు చెమర్చటం, కళ్ళలోంచి ధారాపాతంగా నీరు ప్రవహించటంలో అభ్యంతరం ఏమీలేదు. కాని నోటి ద్వారా మాత్రం సభ్యతా సంస్కారాలకు విరుద్ధమైన మాటలు ఆ సమయంలో వ్యక్తం కారాదు. శ్రేష్ఠ సమాజం మర్యాదను మంటగలిపే చేష్టలు కూడా చేయరాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 474

475

హదీసు 475

وَعَنْ أُمِّ عَطِيَّةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ: { أَخَذَ عَلَيْنَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ لَا نَنُوحَ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ ఉమ్మె అతియ (రదియల్లాహు అన్హా) కథనం : మేము దైవప్రవక్త ﷺ సమక్షంలో బైత్ (ప్రమాణం లేక ప్రతిజ్ఞ) చేసిన సందర్భంగా – మృతుని పేర పెద్దపెట్టున అరుస్తూ ఏడవరాదని కూడా మా చేత వాగ్దానం చేయించుకున్నారు. (బుఖారీ, ముస్లిం)

English

Umm ‘Atiyah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) made us pledge that we will not wail. Agreed upon.

సారాంశం

ఇంట్లో ఎవరయినా మరణిస్తే, ప్రళయాన్ని సృష్టించేలా గొడవచేయటం, పెడబొబ్బలు పెట్టడం, బట్టలు చించుకోవటం, రొమ్ములపై బాదుకోవటం, జడలు విప్పి తాండవమాడటం నిషిద్ధం. ఈ చేష్టలకు దూరంగా ఉండాలని మహాప్రవక్త ﷺ ఆడవారికి ప్రత్యేకంగా తాకీదు చేయటమే గాకుండా, ఆ మేరకు ప్రమాణం కూడా చేయించుకునేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 475

476

హదీసు 476

وَعَنْ ابْن عُمَرَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { اَلْمَيِّتُ يُعَذَّبُ فِي قَبْرِهِ بِمَا نِيحَ عَلَيْهِ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَلَهُمَا: نَحْوُهُ عَنِ الْمُغِيرَةِ بْنِ شُعْبَة َ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “చనిపోయిన వానికి అతనిపై రోదించే వారి కారణంగా సమాధిలో యాతనకు గురిచేయటం జరుగుతుంది.” (బుఖారీ, ముస్లిం – వీరిరువురూ ముగీరా బిన్ షూబ ఆధారంగా కూడా సరిగ్గా ఇదే విధంగా ఉల్లేఖనాన్ని విశదీకరించారు)

English

Ibn ’Umar (RAA) narrated that the Messenger of Allah said, “A dead person is tormented in his grave by the wailing for him.” Agreed upon.

Al-Bukhari and Muslim transmitted a similar narration on the authority of Al·Mughirah bin Shu'bah.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 476

477

హదీసు 477

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { شَهِدْتُ بِنْتًا لِلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-تُدْفَنُ، وَرَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-جَالِسٌ عِنْدَ اَلْقَبْرِ، فَرَأَيْتُ عَيْنَيْهِ تَدْمَعَانِ } رَوَاهُ اَلْبُخَارِيّ ُ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : “నేను దైవప్రవక్త ﷺవారి పుత్రిక ఒకామె అంత్యక్రియలకు అక్కడే (సమాధి వద్ద) ఉన్నాను. దైవప్రవక్త ﷺ సమాధి వద్ద కూర్చుని ఉన్నారు. ఆయన ﷺ రెండు కళ్ళనుంచీ కన్నీళ్ళు ప్రవహించటం నేను చూశాను.” (బుఖారీ)

English

Anas (RAA) narrated Attended the burial of one of the daughters of the Prophet (ﷺ) He was sitting by the side of the grave and his eyes were shedding tears.’ Related by Al-Bukhari.

సారాంశం

మృతుని ముందు ఏడుపు రావటం సహజం. కాని గొల్లున – బిగ్గరగా – ఏడవటం మాత్రం సమ్మతం కాదు. శోకంతో కళ్ళగుండా కన్నీరు రావటం కూడా సహజమే. దైవప్రవక్త ﷺ కుమారుడు హజ్రత్ ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు) చనిపోయిన సందర్భంగా ఆయన ﷺ కళ్ళల్లోనుంచి కన్నీరు ప్రవహించసాగింది. “దైవప్రవక్తా ﷺ! తమరు కూడా ఏడుస్తున్నారా?” అని హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) ఆశ్చర్యం వెలిబుచ్చగా, “ఇది అసహనంతో కూడిన ఏడుపు కాదు సుమా! అనురాగంతో, వాత్సల్యంతో ఉబికివస్తున్న కన్నీళ్ళు మాత్రమే” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 477

478

హదీసు 478

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا تَدْفِنُوا مَوْتَاكُمْ بِاللَّيْلِ، إِلَّا أَنْ تُضْطَرُّوا إِلَيْهِ } أَخْرَجَهُ ابْنُ مَاجَه ْ. وَأَصْلُهُ فِي "مُسْلِمٍ", لَكِنْ قَالَ: زَجَرَ أَنْ يُقْبَرَ اَلرَّجُلُ فِي اللَّيْلِ حَتَّى يُصَلَّى عَلَيْهِ.‏

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా తాకీదు చేశారు: “మీ మృతులను గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడితేతప్ప రాత్రిపూట ఖననం చేయకండి” (ఇబ్నెమాజ). దీని మూలం ‘ముస్లిం’లో ఉంది. జనాజా నమాజ్ చేయబడి ఉంటే తప్ప – రాత్రిపూట ఖననం చేయటంపై ఆయన ﷺ మందలించారని అందులో ఉంది.

English

Jabir bin ‘Abdullah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Do not bury your dead during the night unless you have to do so." Related by Ibn Majah. Muslim reported a similar narration, but Jabir said in his narration, ‘The Prophet (ﷺ) disapproved that someone is buried at night, unless the funeral prayer has been offered for him.’

సారాంశం

రాత్రిపూట అంత్యక్రియలు జరిపే పక్షంలో క్రియలు సక్రమంగా జరగవేమో, కఫన్ సరిగ్గా చుట్టలేకపోతారేమోనన్న ఉద్దేశ్యంతో బహుశా వారించి ఉంటారు. అయితే మృతుని నమాజె జనాజా పగటిపూటే చేసివుంటే లేదా ఏదయినా తప్పనిసరి కారణంపై రాత్రిపూటే ఖననం చేయవలసి వుంటే అప్పుడు ఫరవాలేదు. గమనార్హమైన విషయం ఏమిటంటే దైవప్రవక్త ﷺ పుత్రిక అయిన ఫాతిమ (రదియల్లాహు అన్హా) అంత్యక్రియలు రాత్రివేళే జరిగాయి. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) కూడా రాత్రిపూటే ఖననం చేయబడ్డారు. దైవప్రవక్త ﷺ ఖుద్దుగా ఒక సహచరుని అంత్యక్రియలు రాత్రివేళ జరిపారు – (తిర్మిజీ, ఇబ్నె మాజ). ఇలాంటివే మరికొన్ని హదీసుల వెలుగులో చూస్తే ఏదైనా ప్రత్యేక కారణం లేకపోయినప్పటికీ రాత్రివేళ ఖననం చేయవచ్చని బోధపడుతున్నది. అత్యధికమంది ధర్మవేత్తల దృక్పథం కూడా ఇదే. కాని ఇమామ్ హసన్ బస్రీ, సయీద్ బిన్ ముసయ్యబ్, ఇబ్నె హజమ్ ప్రభృతులు మాత్రం అకారణంగా రాత్రిపూట అంత్యక్రియలు జరపటం అవాంఛనీయం (మక్రూహ్) అని అంటున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 478

479

హదీసు 479

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ جَعْفَرٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { لَمَّا جَاءَ نَعْيُ جَعْفَرٍ ‏-حِينَ قُتِلَ‏- قَالَ رَسُولُ اللهِ ﷺ: "اصْنَعُوا لِآلِ جَعْفَرٍ طَعَامًا, فَقَدْ أَتَاهُمْ مَا يَشْغَلُهُمْ" } أَخْرَجَهُ الْخَمْسَةُ, إِلَّا النَّسَائِيّ َ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: జాఫర్ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన వార్త అందినపుడు దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : “జాఫర్ (రదియల్లాహు అన్హు) ఇంటివారల కోసం భోజనం తయారు చేయండి. వారికి అందిన వ్యథాభరితమయిన కబురు వాళ్ళను (ఈ రోజు) వంట చేయనివ్వదు.” (నసాయి తప్ప ‘ఐదుగురి’లో మిగిలిన వారంతా దీనిని ఉల్లేఖించారు)

English

‘Abdullah Ibn Ja’far (RAA) narrated, ‘When we received the news of Ja’far’s death; when he was killed (in the Battle of Mu’tah), the Prophet(ﷺ) said: “Prepare some food for the family of Ja’far, for what has befallen them is keeping them preoccupied.” Related by the five lmams except for An-Nasa’i.

సారాంశం

బంధువుల్లో, ఇరుగుపొరుగువారిలో ఎవరయినా మరణిస్తే, మృతుని కుటుంబీకులకు భోజనం తయారుచేసి పంపటం మస్నూన్ (సంప్రదాయం). పొరుగువారు ఈ బాధ్యతను గుర్తెరగాలి. భోజనం ఆ కుటుంబీకులకు, మృతుని చూడటానికి దూరప్రాంతాలనుంచి వచ్చిన వారికి చేయిస్తే సరిపోతుంది. ఇరుగుపొరుగు వారికోసం అక్కరలేదు. వారు స్థానికులే గనక కేవలం అంత్యక్రియల్లో పాల్గొంటారు.

మృతుని ఇంట ఆ రోజు అందరూ శోకంలో మునిగి ఉంటారు. ఆ విచారంలో వారికి అన్నపానీయాల ధ్యాస కూడా ఉండదు. అయితే వారిని వారి మానాన వదలిపెట్టడం మర్యాద అనిపించుకోదు. కష్టకాలంలో సాటి సోదరుని మంచి చెబ్బరలను అడిగి తెలుసుకోవటం, వాళ్ళ అక్కరలను తీర్చటం మానవ ధర్మం. అందునా బంధుమిత్రులపై, ఇరుగుపొరుగు వారిపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది.

హదీసు ఉల్లేఖకులు

జాఫర్ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు). ఈయన అబూ తాలిబ్ గారి కుమారులు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సోదరుడు. అలీ (రదియల్లాహు అన్హు) కన్నా పదేళ్ళు పెద్దవారు. తొలుత అబిసీనియా వైపునకు వలసవెళ్ళారు. అక్కడే స్థిరపడ్డారు. నజ్జాషీ చక్రవర్తి ఈయన చేతుల మీదుగానే ఇస్లాం స్వీకరించాడు. తరువాత ఈయన మదీనాకు వచ్చారు. ఖైబర్ విజయం వరించిన నాడు అక్కడికి (ఖైబర్కు) చేరుకున్నారు. దైవప్రవక్త ﷺ ఈయన రెండు కళ్ళ మధ్యభాగంలో ముద్దుపెట్టుకుని, “ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది, అది జాఫర్ రాక వల్లనో, ఖైబర్ విజయం వల్లనో మరి” అని వ్యాఖ్యానించారు. జాఫర్గారు గొప్ప దాతృగుణం కలవారు. హిజ్రీ 8లో ‘మౌతా’ యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ యుద్ధంలో ఈయన ముస్లిం సేనలకు సారధ్య బాధ్యతలు వహించారు. రెండు భుజాలు తెగి శరీరం నుండి వేరైపోయాయి. “అల్లాహ్ ఈయన రెండు చేతులకు బదులుగా రెండు రెక్కలను తగిలించాడు. వీటితో ఆయన స్వర్గంలో తాను కోరుకున్నచోటికి ఎగిరిపోవచ్చు” అని దైవప్రవక్త ﷺ సెలవిచ్చారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 479

480

హదీసు 480

وَعَنْ سُلَيْمَانَ بْنِ بُرَيْدَةَ عَنْ أَبِيهِ قَالَ: كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُعَلِّمُهُمْ إِذَا خَرَجُوا إِلَى اَلمَقَابِرِ أَنْ يَقُولُوا: { اَلسَّلَامُ عَلَى أَهْلِ اَلدِّيَارِ مِنَ اَلْمُؤْمِنِينَ وَالْمُسْلِمِينَ, وَإِنَّا إِنْ شَاءَ اَللَّهُ بِكُمْ لَاحِقُونَ, نَسْأَلُ اَللَّهَ لَنَا وَلَكُمُ الْعَافِيَةَ } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ సులైమాన్ బిన్ బురైద (రహిమహుల్లాహ్) తన తండ్రి ఆధారంగా ఇలా తెలిపారు – సహాబీలు ఖబరస్తాన్ (ఖనన వాటిక)కు వెళ్ళినపుడు ఈ విధంగా పలకమని దైవప్రవక్త ﷺ వారికి చెప్పేవారు – ‘ఓ ఇంటివారలారా! (సమాధివారలారా!) మీపై శాంతికలుగు గాక! మీరు విశ్వాసులు మరియు ముస్లింల లోనివారు. దైవచిత్తమయితే మేము కూడా వచ్చి మీతో చేరిపోతాము. మేము మాకోసం, మీకోసం కూడా అల్లాహ్ నుండి సౌఖ్యాన్ని అర్థిస్తున్నాము.” (ముస్లిం)

English

Sulaiman bin Buraidah narrated on the authority of his father (RAA) that the Prophet (ﷺ) taught us that when we visit graves we should say, “Peace be upon you, O believing men and women, O dwellers of this place. Certainly, Allah willing, we will join you. We supplicate to Allah to grant us and you well being.” Related by Muslim.

సారాంశం

ఖబరస్తాన్కు వెళ్ళటం, సమాధులలో ఉన్న మృతులకోసం మరియు మన క్షమాపణ కోసం కూడా దైవాన్ని వేడుకోవటం సంప్రదాయం అని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఈ వేడుకోలు కేవలం విశ్వాసుల, ముస్లింల కోసమే!

హదీసు ఉల్లేఖకులు

సులైమాన్ బిన్ బురైద (రదియల్లాహు అన్హు) ప్రఖ్యాత తాబయి. ఇబ్నె ముయీన్, అబూ హాతిమ్ ప్రభృతులు ఈయన్ని విశ్వసనీయులైన, ఎన్నదగిన వ్యక్తిగా పేర్కొన్నారు. ‘ఈయన తన తండ్రి నుంచి హదీసు విన్నట్లు ఎక్కడా ప్రస్తావించబడలేద’ని ఇమామ్ హాకిమ్, ఇమామ్ బుఖారీ అంటున్నారు. అయితే ఈయన తన తండ్రి నుంచి సంగ్రహించిన హదీసులనేకం ‘ముస్లిం’లో పొందుపరచబడి ఉన్నాయని ఖజ్రజీ చెప్పారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 480

481

హదీసు 481

وَعَنْ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { مَرَّ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-بِقُبُورِ اَلْمَدِينَةِ, فَأَقْبَلَ عَلَيْهِمْ بِوَجْهِهِ فَقَالَ: "اَلسَّلَامُ عَلَيْكُمْ يَا أَهْلَ اَلْقُبُورِ, يَغْفِرُ اَللَّهُ لَنَا وَلَكُمْ, أَنْتُمْ سَلَفُنَا وَنَحْنُ بِالْأَثَرِ" } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَقَالَ: حَسَن ٌ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ మదీనాలోని ఖబరస్తాన్ వైపు నుంచి వెళుతూ అటువైపు తిరిగి ఇలా అన్నారు – “ఓ సమాధివాసులారా! మీపై శాంతి వర్షించుగాక! అల్లాహ్ మమ్మల్నీ మరియు మిమ్మల్నీ మన్నించుగాక! మీరు మాకన్నా ముందు వెళ్ళిపోయారు. మేము మీ వెనుకే వస్తున్నాము.” (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు – ఈ హదీసును ‘హసన్’గా ఖరారు చేశారు)

English

Ibn ‘Abbas (RAA) narrated, ‘Once the Messenger of Allah (ﷺ) passed by some graves in Madinah. He turned his face toward them saying, “Peace be upon you, O dwellers of these graves. May Allah forgive you and us. You have preceded us, and we are following your trail." Related by At-Tirmidhi, who graded it as Hasan.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 481

482

హదీసు 482

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَسُبُّوا الْأَمْوَاتَ, فَإِنَّهُمْ قَدْ أَفْضَوْا إِلَى مَا قَدَّمُوا } رَوَاهُ اَلْبُخَارِيّ ُ. وَرَوَى اَلتِّرْمِذِيُّ عَنِ اَلمُغِيرَةِ نَحْوَهُ, لَكِنْ قَالَ: { فَتُؤْذُوا الْأَحْيَاءَ }.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) వివరించారు – “మృతులను దూషించకండి. ఎందుకంటే వాళ్ళు (తమ కొరకు) ఏదయితే (ముందుగానే) పంపుకున్నారో దాన్ని వాళ్ళు పొందారు.” (బుఖారీ) తిర్మిజీ కూడా ముగీరా సౌజన్యంతో ఈ విధంగానే ఉల్లేఖించారు. అయితే “దూషణల ద్వారా మీరు బ్రతికి ఉన్నవారికి బాధకలిగిస్తారు” అని అందులో ఉంది.

English

A’ishah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Do not speak badly of the dead, they have already seen the result of (the deeds) that they sent on before them.” Related by Al·Bukhari.

At-Tirmidhi Related a similar narration on the authority of Al-Mughirah bin Shu’bah, and he added, "Thus you will be offending the living (i.e. if you curse their dead)."

సారాంశం

చనిపోయిన వారిని తిట్టడం, వాళ్ళ పనులను గుర్తుచేసి అవమానకరంగా మాట్లాడటం ఎంతమాత్రం సమంజసం కాదు, ఎందుకంటే ఎవరి కర్మలు వారివెంట ఉంటాయి. దైవవిరోధి అయిన అబూలహబ్ కుమార్తె దుర్ర ఇస్లాం స్వీకరించింది. ‘దైవ తిరస్కారి కూతురు ముస్లిమా?!’ అని కొంతమందిలో గుసగుసలు మొదలయ్యాయి. ఆమె ఈ విషయాన్ని దైవప్రవక్త ﷺ కు ఫిర్యాదు చేయగా ఆయన ﷺ “చనిపోయినవారిని తిట్టకండి. దీనివల్ల ఇస్లాం స్వీకరించినవారి సంతతి మనసు నొచ్చుకుంటుంది” అని అన్నారు. (ముస్నద్ అహ్మద్)

ముస్లింల సమక్షంలో అవిశ్వాసులైన వారి పూర్వీకులను దూషించటమే ఇంత తీవ్రమయిన విషయమైనపుడు, ముస్లింలలోని ప్రముఖులను, విద్వాంసులను దూషించటం ఇంకెంత తీవ్రమయిన విషయమో ఆలోచించండి!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|3. అంత్యక్రియల పుస్తకం|3.0 అంత్యక్రియల పుస్తకం|హదీసు 482