హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 17వ అధ్యాయం: వస్త్రధారణ. ఈ అధ్యాయంలో 10 హదీసులు (హదీసు 415 – 424) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
2.17 వస్త్రధారణ
باب اللباس
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 415
عَنْ أَبِي عَامِرٍ اَلْأَشْعَرِيِّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَيَكُونَنَّ مِنْ أُمَّتِي أَقْوَامٌ يَسْتَحِلُّونَ اَلْحِرَ وَالْحَرِيرَ } رَوَاهُ أَبُو دَاوُدَ، وَأَصْلُهُ فِي اَلْبُخَارِيِّ.
హజ్రత్ అబూ ఆమిర్ అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “నా అనుచర సమాజంలో కొన్ని జాతుల వారుంటారు – వారు తప్పక వ్యభిచారాన్నీ, సిల్కు (పట్టు)ను తమ కొరకు ధర్మసమ్మతంగా తలపోస్తారు.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు – దీని మూలం బుఖారీలో వుంది)
English
Narrated Abu 'Aamir al-Ash'ari: Allah's Messenger (ﷺ) said: "There will be among my followers some people who will consider dultery (al-Hir) and the use of silk (al-Harir) lawful." [Reported by Abu Dawud, and its basic meaning is in al-Bukhari].
సారాంశం
ఈ హదీసులో రెండు విషయాలు నిషిద్ధం (హరామ్)గా ఖరారు చేయబడ్డాయి. అవేమంటే; (1) వ్యభిచారం (2) సిల్కు (పట్టు) వస్త్రాలు ధరించటం. సిల్కు వస్త్రాలు మనిషిలో – ముఖ్యంగా మగవారిలో – గర్వాన్నీ, అహంకారాన్నీ పెంపొందిస్తాయి. అందుకే ఇది ఉమ్మత్ కొరకు నిషిద్ధంగా పరిగణించబడింది. పైగా ఈ సిల్కు అత్యంత సున్నితమయింది. లావణ్యంతో కూడుకున్నది. లావణ్యం, సౌకుమార్యం పురుషులకు తగదు. లావణ్యంతో కూడుకున్న దుస్తులు ఆడవారికైతే శోభిస్తాయి. వస్త్ర ధారణలో మగవారు ఆడవారి తరహాలో తయారవటం హరామ్ (నిషిద్ధం).
హదీసు ఉల్లేఖకులు
అబూ ఆమిర్ అష్అరీ (రదియల్లాహు అన్హు) గారి అసలు పేరు అబ్దుల్లా బిన్ హాని లేదా ఉబైద్ బిన్ వహాబ్. ప్రవక్త సహచరునిగా పేర్కొనబడ్డారు. సిరియాలో స్థిరనివాసమేర్పరచుకున్నారు. ఉమవీ ఖలీఫా అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ పరిపాలనా కాలంలో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 415
హదీసు 416
وَعَنْ حُذَيْفَةَ - رضى الله عنه - قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -أَنْ نَشْرَبَ فِي آنِيَةِ اَلذَّهَبِ وَالْفِضَّةِ, وَأَنْ نَأْكُلَ فِيهَا, وَعَنْ لُبْسِ اَلْحَرِيرِ وَالدِّيبَاجِ, وَأَنْ نَجْلِسَ عَلَيْهِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ మేము బంగారు వెండి పాత్రలలో తినటాన్నీ, త్రాగటాన్నీ, పలుచటి మరియు చిక్కటి సిల్కు (పట్టు) వస్త్రాలను ధరించటాన్నీ, వాటిపై కూర్చోవటాన్నీ వారించారు.” (బుఖారీ)
English
Narrated Hudhaifah (RA): Allah's Messenger (ﷺ) forbade us from eating and drinking from gold and silver vessels, and from wearing or siting upon silk or brocade. [Reported by al-Bukhari].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 416
హదీసు 417
وَعَنْ عُمَرَ - رضى الله عنه - قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -عَنْ لُبْسِ اَلْحَرِيرِ إِلَّا مَوْضِعَ إِصْبَعَيْنِ, أَوْ ثَلَاثٍ, أَوْ أَرْبَعٍ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ.
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ పట్టు (సిల్కు) వస్త్రాలు ధరించటాన్ని వారించారు. రెండు లేక మూడు లేక నాలుగు అంగుళాలకు సమానంగా ఉంటే ఫరవాలేదు అని అన్నారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)
English
Narrated 'Umar (RA): Allah's Messenger (ﷺ) forbade the wearing of silk except the space of two or three or four fingers. [Agreed upon, and the wording is from Muslim].
సారాంశం
పురుషులు పట్టు వస్త్రాలు ధరించటం షరీయత్ పరంగా నిషిద్ధం (హరామ్). అయితే దురద, ఎలర్జీ తదితర కారణాల దృష్ట్యా – తాత్కాలికంగా – అలాంటి సుతిమెత్తని దుస్తులు తొడుక్కుంటే తప్పులేదు. అదీగాక సాధారణంగా మనం ధరించే దుస్తులకు ఒకటి నుండి నాలుగు అంగుళాల వెడల్పు సిల్కును జోడించినా, డిజైనుగా అతికించినా అందులో తప్పులేదు. కాని పూర్తిగా పట్టుబట్టలు వేసుకోరాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 417
హదీసు 418
وَعَنْ أَنَسٍ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -رَخَّصَ لِعَبْدِ اَلرَّحْمَنِ بْنِ عَوْفٍ, وَالزُّبَيْرِ فِي قَمِيصِ اَلْحَرِيرِ, فِي سَفَرٍ, مِنْ حَكَّةٍ كَانَتْ بِهِمَا } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) మరియు జుబైర్ బిన్ అవ్వామ్ (రదియల్లాహు అన్హు) లకు పట్టు (సిల్కు) చొక్కా ధరించటానికి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే వారిద్దరికీ దురద (ఎలర్జీ) లాంటిది ఉండేది.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Anas (RA): The Prophet (ﷺ) gave permission to 'Abdur-Rahman bin 'Auf and az-Zubair to wear silk during the journey because of an itching which they suffered from. [Agreed upon].
హదీసు ఉల్లేఖకులు
జుబైర్ బిన్ అవ్వామ్ (రదియల్లాహు అన్హు) బిన్ ఖువైలిద్ బిన్ అసద్ ఖురైషీ అసదీ. ఈయన దైవప్రవక్త ﷺకు చాలా సన్నిహితులు. దైవప్రవక్త ﷺ అత్తగారైన సఫియా కుమారులు. ఇహలోకంలోనే స్వర్గలోక శుభవార్త పొందిన పదిమందిలో ఒకరు. యుద్ధాలలో గొప్ప పరాక్రమశాలిగా ఖ్యాతి గడించారు. జమల్ యుద్ధం నుండి తిరిగి వచ్చాక హిజ్రీ 36లో శాశ్వతంగా కన్నుమూశారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 418
హదీసు 419
وَعَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ - رضى الله عنه - قَالَ: { كَسَانِي اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -حُلَّةً سِيَرَاءَ, فَخَرَجْتُ فِيهَا, فَرَأَيْتُ اَلْغَضَبَ فِي وَجْهِهِ, فَشَقَقْتُهَا بَيْنَ نِسَائِي } مُتَّفَقٌ عَلَيْهِ, وَهَذَا لَفْظُ مُسْلِمٍ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ నాకు బంగారు జరీతో నేయబడిన ఒక పట్టుబట్టల జతను బహూకరించారు. నేను దాన్ని తొడిగి బయటికి రాగా దైవప్రవక్త ﷺ ముఖం ఆగ్రహంతో కందిపోయినట్టుగా కనిపించింది. అంతే, ఆ జతను విడిచి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుటుంబ మహిళల్లో పంచి పెట్టేశాను.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)
English
Narrated 'Ali bin Abi Talib (RA): The Prophet (ﷺ) presented me a silk suit of clothing. I went out wearing it, but on noticing anger on his face, I cut it up (and divided it) among the women of my household. [Agreed upon, and this is the wording of Muslim].
సారాంశం
ఈ దుస్తులు దైవప్రవక్త ﷺకు ‘ఐలా’ ప్రాంతపు రాజు నుండి కానుకగా అందాయి. వాటిని ఆయన ﷺ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి ఇవ్వగా ఆయన ధరించి బయటికి వచ్చారు. ఇది చూడగానే దైవప్రవక్త ﷺ కు కోపం వచ్చింది. “ఇవి నీవు తొడగటానికి కాదు ఇచ్చింది, ఇంటి మహిళల కోసం ఇచ్చాను”అని ఆయన ﷺ వ్యాఖ్యానించినట్లు సహీహ్ ముస్లింలో ఉంది. హజ్రత్ అలీ ఆ వస్త్రాన్ని చించి తలో ముక్క పంపిణీ చేశారు. దీన్నిబట్టి తెలిసిందేమంటే కానుక మన ఉపయోగంలోకి వచ్చినా, రాకపోయినాసరే – కానుకను మనస్ఫూర్తిగా స్వీకరించవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 419
హదీసు 420
وَعَنْ أَبِي مُوسَى - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { أُحِلَّ اَلذَّهَبُ وَالْحَرِيرُ لِإِنَاثِ أُمَّتِي, وَحُرِّمَ عَلَى ذُكُورِهِمْ. }. رَوَاهُ أَحْمَدُ, وَالنَّسَائِيُّ, وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ.
హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధనం – “బంగారం, పట్టు (సిల్కు) నా అనుచర సమాజంలోని స్త్రీలకు ధర్మసమ్మతం గావించబడ్డాయి. అయితే ఇవి పురుషుల కోసం నిషేధించబడ్డాయి.” (దీనిని అహ్మద్, నసాయి, తిర్మిజీ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Narrated Abu Musa (RA): Allah's Messenger (ﷺ) said: "Gold and silk are lawful for the females among my followers, but prohibited to the males". [Reported by Ahmad, an-Nasa'i and at-Tirmidhi, who graded it Sahih (authentic)].
సారాంశం
స్త్రీలు నగానట్రా రూపంలో బంగారం ధరించవచ్చు. అయితే వాటిని ప్రదర్శించే ఉద్దేశ్యంతో ధరించరాదు. అలాగే స్త్రీలు పట్టు వస్త్రాలు, సుతిమెత్తని దుస్తులు ఉపయోగించవచ్చు. కాని మగవారు వీటిని ధరించకూడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 420
హదీసు 421
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { إِنَّ اَللَّهَ يُحِبُّ إِذَا أَنْعَمَ عَلَى عَبْدِهِ نِعْمَةً, أَنْ يَرَى أَثَرَ نِعْمَتِهِ عَلَيْهِ } رَوَاهُ اَلْبَيْهَقِيُّ.
హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు – “అల్లాహ్ తన దాసుని కెవరికయినా ఏదన్నా అనుగ్రహిస్తే దాని ప్రభావం అతనిపై కనిపించటాన్ని అల్లాహ్ ఎంతో ఇష్టపడతాడు.” (బైహఖీ)
English
Narrated 'Imran bin Husain (RA): The Prophet (ﷺ) said: "When Allah grants His blessings to His servant, He loves to see the traces of His favour upon him." [Reported by al-Baihaqi].
సారాంశం
దైవప్రసాదిత వస్తువులను మనిషి క్రియాత్మకంగా అభివ్యక్తం చేయాలని ఈ హదీసు చెబుతోంది. అందుకే అతడు తన శక్తి స్థోమతలకు తగ్గట్టుగా తినాలి, త్రాగాలి, ఉన్నంతలో మంచి దుస్తులను ధరించాలి. ఇలా వ్యక్తపరచటం భయభక్తులకు విరుద్ధాంశం ఏమీకాదు. కాకపోతే దైవానుగ్రహాలను దుర్వినియోగం చేయకూడదు, దుబారా ఖర్చులకు పాల్పడి షైతాన్ బాటలో నడవకూడదు. అలా అని మరీ పిసినిగొట్టులా కూడా మసలుకోరాదు. రెండు అతి వాదాలకు నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 421
హదీసు 422
وَعَنْ عَلِيٍّ - رضى الله عنه - { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -نَهَى عَنْ لُبْسِ الْقَسِيِّ وَالْمُعَصْفَرِ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ ఖస్ (ప్రాంతపు) సిల్కు వస్త్రాలు, కాషాయ రంగు బట్టలు ధరించటాన్ని వారించారు.” (ముస్లిం)
English
Narrated 'Ali (RA): Allah's Messenger (ﷺ) forbade wearing of silk and clothes dyed with safflower (a red dye). [Reported by Muslim].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 422
హదీసు 423
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرِوٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, قَالَ: { رَأَى عَلَيَّ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -ثَوْبَيْنِ مُعَصْفَرَيْنِ, فَقَالَ: "أُمُّكَ أَمَرَتْكَ بِهَذَا?" } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ నా ఒంటిపై కాషాయ రంగుతో కూడిన రెండు బట్టలుండటం గమనించి, “నీ తల్లి వీటిని తొడుక్కోమని చెప్పిందా?” అని సెలవిచ్చారు. (ముస్లిం)
English
Narrated 'Abdullah bin 'Amr (RA): The Prophet (ﷺ) saw me in two clothes dyed in safflower (a red dye), whereupon he said: "Did your mother order you to do this?" [Reported by Muslim].
సారాంశం
‘ఈ బట్టలు తొడుక్కోమని మీ అమ్మచెప్పిందా?’ అన్న దైవప్రవక్త ﷺ ప్రశ్నలో ఒకింత అయిష్టత, ఆగ్రహం కలగలసి ఉన్నాయి. ఈ ఆడవాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అన్న విసుగు కూడా ఆ మాటల్లో వ్యక్తమవుతున్నది. సహీహ్ ముస్లింలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం, హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ‘మరయితే ఓ దైవప్రవక్తా! వీటిని కడిగివేయనా?’ అని విన్నవించుకోగా, “లేదు. కాల్చి బూడిద చేసేయి” అని ఆయన ﷺ చెప్పారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 423
హదీసు 424
وَعَنْ أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا { أَنَّهَا أَخْرَجَتْ جُبَّةَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -مَكْفُوفَةَ اَلْجَيْبِ وَالْكُمَّيْنِ وَالْفَرْجَيْنِ, بِالدِّيبَاجِ } رَوَاهُ أَبُو دَاوُدَ. وَأَصْلُهُ فِي "مُسْلِمٍ", وَزَادَ: { كَانَتْ عِنْدَ عَائِشَةَ حَتَّى قُبِضَتْ, فَقَبَضْتُهَا, وَكَانَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -يَلْبَسُهَا, فَنَحْنُ نَغْسِلُهَا لِلْمَرْضَى نَسْتَشْفِي بِهَا }. وَزَادَ اَلْبُخَارِيُّ فِي "اَلْأَدَبِ اَلْمُفْرَدِ". { وَكَانَ يَلْبَسُهَا لِلْوَفْدِ وَالْجُمُعَةِ }.
హజ్రత్ అస్మా బిన్తె అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ గారి ఒక జుబ్బాను బయటికి తీశారు. దాని చేతులపై, ముందు వెనుక భాగాలపై (అంచులపై) పట్టువస్త్రం వుంది. (దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు. మూలం మాత్రం ముస్లింలో వుంది). ఆ జుబ్బా హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అధీనంలో ఉండేదనీ, ఆమె మరణించిన తరువాత నేను దానిని నా స్వాధీనంలో తీసుకున్నానని ఆమె అన్నారు. దైవప్రవక్త ﷺ దీనిని తొడిగేవారు, దీనిని కడిగి రోగగ్రస్తులకు ఆ నీరు త్రాపేవారు. స్వస్థత చేకూర్చమని ప్రార్థించేవారు (ముస్లిం). బుఖారీ ‘అదబుల్ ముఫ్రద్’లో ఇలా అన్నారు – ‘దైవప్రవక్త ﷺ దీనిని ప్రతినిధి బృందాలు వచ్చిన సమయాలలో, జుమా నమాజులలో ధరించేవారు.’
English
Narrated Asma' bint Abu Bakr (RA): She brought out the mantle (over-garment) of Allah's Messenger (ﷺ)) with it's collar, sleeves, front and back hemmed with brocade (silk). [Abu Dawud reported it].
Its basic meaning is in Muslim's Sahih with the addition: "It was with 'Aishah (RA) till she died, then I took possession of it. The Prophet (ﷺ) used to wear it, and we wash it for the sick, seeking cure by means of it."
al-Bukhari added in Adab al-Mufrad: "He [the Prophet (ﷺ)] used to wear it on the visit of a delegation and on Fridays."
సారాంశం
విదేశాల నుండి రాయబారులు, దౌత్యవేత్తలు వచ్చినప్పుడు, చక్రవర్తులు, అధికారులు విచ్చేసినప్పుడు, లేదా పండుగ దినాలలో, జుమా నమాజులలో పాల్గొనవలసి వచ్చినప్పుడు, సమావేశాలకు హాజరు కావలసి వచ్చినప్పుడు సాధారణ దుస్తులకన్నా కొంచెం మంచి దుస్తులు, ఖరీదైన దుస్తులు ధరించటంలో తప్పులేదు. అయితే ఈ ప్రత్యేక సమయాలలో సయితం షరీయత్ విధించిన హద్దులను అతిక్రమించకూడదు. దుస్తులు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంపొందించేవిగా గాకుండా సంస్కారానికీ, వినమ్రతకు, హుందాతనానికి ప్రతీకగా ఉండాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.17 వస్త్రధారణ|హదీసు 424
You must be logged in to post a comment.