హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 4.0 జకాత్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 4. జకాత్ పుస్తకం, 4.0: జకాత్. ఈ అధ్యాయంలో 22 హదీసులు (హదీసు 483 – 504) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

كتاب الزكاة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

483

హదీసు 483

عَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعَثَ مُعَاذًا ‏- رضى الله عنه ‏- إِلَى اَلْيَمَنِ.‏.‏.‏ } فَذَكَرَ اَلْحَدِيثَ, وَفِيهِ: { أَنَّ اَللَّهَ قَدِ اِفْتَرَضَ عَلَيْهِمْ صَدَقَةً فِي أَمْوَالِهِمْ, تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ, فَتُرَدُّ عَلَى فُقَرَائِهِمْ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيّ ِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను యమన్ వైపునకు సాగనంపారు. తరువాత హదీసునంతటినీ వివరించారు. అందులో ఇలా వుంది: “అల్లాహ్ తరఫున వారి సంపదలపై ‘జకాత్’ విధించబడింది. అది వారి స్థితిమంతుల నుండి వసూలు చేయబడి వారిలోని అగత్యపరులలో, పేదలలో పంచిపెట్టబడాలి.” (బుఖారీ)

English

Ibn 'Abbas (RAA) narrated that when the Prophet (ﷺ) sent Mu'adh Ibn Jabal to Yemen (as governor), he said to him: “You are going to a people who are People of the Scripture. Invite them to testify that none has the right to be worshipped but Allah and that l am His Messenger. If they obey you in this, then teach them that Allah, the Glorious One, has enjoined five prayers upon them in every day and night (in twenty-four hours), and if they obey you in this, then tell them that Allah has made it obligatory for them to pay Zakah upon their assets and it is to be taken from the wealthy among them and given to the poor among them.” Related by Al-Bukhari

సారాంశం

దైవప్రవక్త ﷺ కాలంలో ధనవంతులనుండి జకాత్‌ను వసూలుచేసి అధికార స్థాయిలో హక్కుదారులకు (అగత్యపరులకు) పంపిణీ చేసే వ్యవస్థ ఏర్పడిందని ఈ హదీసు ద్వారా తేటతెల్ల మవుతోంది. ఏ ప్రాంతంలో జకాత్ వసూలు చేయబడుతుందో ఆ ప్రాంతంలోని పేదలకు, నిరాధార జీవులకే అది పంచిపెట్టబడటం న్యాయం అన్న విషయం కూడా దీనిద్వారా అవగతమవుతున్నది. ఒకవేళ అక్కడ జకాత్ పంపిణీ అయ్యాక కూడా మిగిలి ఉంటే అప్పుడు ఇతర ప్రాంతాలలోని హక్కు దారులకు ఇవ్వవచ్చు. ‘జకాత్’ అనేది పేదల హక్కు. దాన్ని చెల్లించటం శ్రీమంతుల బాధ్యత. జకాత్‌ను చెల్లించి వారు తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారే తప్ప ఒకరిపై ఉపకారం ఏమీ చేయటం లేదని గ్రహించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 483

484

హదీసు 484

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- أَنَّ أَبَا بَكْرٍ اَلصِّدِّيقَ ‏- رضى الله عنه ‏- كَتَبَ لَه ُ { هَذِهِ فَرِيضَةُ اَلصَّدَقَةِ اَلَّتِي فَرَضَهَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَلَى اَلْمُسْلِمِينَ, وَاَلَّتِي أَمَرَ اَللَّهُ بِهَا رَسُولَه ُ فِي أَرْبَعٍ وَعِشْرِينَ مِنَ اَلْإِبِلِ فَمَا دُونَهَا اَلْغَنَم ُ فِي كُلِّ خَمْسٍ شَاةٌ, فَإِذَا بَلَغَتْ خَمْسًا وَعِشْرِينَ إِلَى خَمْسٍ وَثَلَاثِينَ فَفِيهَا بِنْتُ مَخَاضٍ أُنْثَ ى فَإِنْ لَمْ تَكُنْ فَابْنُ لَبُونٍ ذَكَر ٍ فَإِذَا بَلَغَتْ سِتًّا وَثَلَاثِينَ إِلَى خَمْسٍ وَأَرْبَعِينَ فَفِيهَا بِنْتُ لَبُون ٍ أُنْثَى, فَإِذَا بَلَغَتْ سِتًّا وَأَرْبَعِينَ إِلَى سِتِّينَ فَفِيهَا حِقَّةٌ طَرُوقَةُ اَلْجَمَل ِ فَإِذَا بَلَغَتْ وَاحِدَةً وَسِتِّينَ إِلَى خَمْسٍ وَسَبْعِينَ فَفِيهَا جَذَعَة ٌ فَإِذَا بَلَغَتْ سِتًّا وَسَبْعِينَ إِلَى تِسْعِينَ فَفِيهَا بِنْتَا لَبُونٍ, فَإِذَا بَلَغَتْ إِحْدَى وَتِسْعِينَ إِلَى عِشْرِينَ وَمِائَةٍ فَفِيهَا حِقَّتَانِ طَرُوقَتَا اَلْجَمَلِ, فَإِذَا زَادَتْ عَلَى عِشْرِينَ وَمِائَةٍ فَفِي كُلِّ أَرْبَعِينَ بِنْتُ لَبُونٍ, وَفِي كُلِّ خَمْسِينَ حِقَّةٌ, وَمَنْ لَمْ يَكُنْ مَعَهُ إِلَّا أَرْبَعٌ مِنَ اَلْإِبِلِ فَلَيْسَ فِيهَا صَدَقَةٌ إِلَّا أَنْ يَشَاءَ رَبُّهَا. وَفِي صَدَقَةِ اَلْغَنَمِ سَائِمَتِهَا إِذَا كَانَتْ أَرْبَعِينَ إِلَى عِشْرِينَ وَمِائَةِ شَاة ٍ شَاةٌ, فَإِذَا زَادَتْ عَلَى عِشْرِينَ وَمِائَةٍ إِلَى مِائَتَيْنِ فَفِيهَا شَاتَانِ, فَإِذَا زَادَتْ عَلَى مِائَتَيْنِ إِلَى ثَلَاثمِائَةٍ فَفِيهَا ثَلَاثُ شِيَاه ٍ فَإِذَا زَادَتْ عَلَى ثَلَاثِمِائَةٍ فَفِي كُلِّ مِائَةٍ شَاةٌ، فَإِذَا كَانَتْ سَائِمَةُ اَلرَّجُلِ نَاقِصَةً عَنْ أَرْبَعِينَ شَاةً وَاحِدَةً فَلَيْسَ فِيهَا صَدَقَةٌ, إِلَّا أَنْ يَشَاءَ رَبُّهَا.‏ وَلَا يُجْمَعُ بَيْنَ مُتَفَرِّقٍ وَلَا يُفَرَّقُ بَيْنَ مُجْتَمِعٍ خَشْيَةَ اَلصَّدَقَةِ, وَمَا كَانَ مِنْ خَلِيطَيْنِ فَإِنَّهُمَا يَتَرَاجَعَانِ بَيْنَهُمَا بِالسَّوِيَّةِ, وَلَا يُخْرَجُ فِي اَلصَّدَقَةِ هَرِمَة ٌ وَلَا ذَاتُ عَوَارٍ, إِلَّا أَنْ يَشَاءَ اَلْمُصَّدِّقُ، وَفِي اَلرِّقَةِ فِي مِائَتَيْ دِرْهَمٍ رُبُعُ اَلْعُشْرِ, فَإِنْ لَمْ تَكُن ْ إِلَّا تِسْعِينَ وَمِائَةً فَلَيْسَ فِيهَا صَدَقَةٌ إِلَّا أَنْ يَشَاءَ رَبُّهَا, وَمَنْ بَلَغَتْ عِنْدَهُ مِنَ اَلْإِبِلِ صَدَقَةُ اَلْجَذَعَةِ وَلَيْسَتْ عِنْدَهُ جَذَعَةٌ وَعِنْدَهُ حِقَّةٌ, فَإِنَّهَا تُقْبَلُ مِنْهُ اَلْحِقَّةُ, وَيَجْعَلُ مَعَهَا شَاتَيْنِ إِنِ اِسْتَيْسَرَتَا لَهُ, أَوْ عِشْرِينَ دِرْهَمًا, وَمَنْ بَلَغَتْ عِنْدَهُ صَدَقَةُ اَلْحِقَّةِ وَلَيْسَتْ عِنْدَهُ اَلْحِقَّةُ, وَعِنْدَهُ اَلْجَذَعَةُ, فَإِنَّهَا تُقْبَلُ مِنْهُ اَلْجَذَعَةُ, وَيُعْطِيهِ اَلْمُصَّدِّقُ عِشْرِينَ دِرْهَمًا أَوْ شَاتَيْنِ } رَوَاهُ اَلْبُخَارِيّ ُ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)కు జకాత్ విధికి సంబంధించి (క్షుణ్ణంగా) ఒక పత్రం వ్రాసి ఇచ్చారు. వాస్తవానికి అది దైవప్రవక్త ﷺ ముస్లింలపై విధించిన పద్ధతి. ఆ మేరకు అల్లాహ్ తన ప్రవక్త ﷺకు ఆజ్ఞాపించి ఉన్నాడు. (ఆ సూచనా పత్రంలో ఇలా లిఖించబడింది) : ఒంటెలు 24 లేక అంతకన్నా తక్కువగా ఉంటే వాటిపై మేకలను (జకాత్‌గా) ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి 5 ఒంటెలకు గాను ఒక మేక. ఒంటెల సంఖ్య 25కు మించి 35 వరకు ఉంటే వాటిపై ఏడాది వయసున్న ఒక ఆడ ఒంటెను ఇవ్వాలి. అది గనక లేకుంటే రెండేళ్ళ మగ ఒంటెను ఇవ్వాలి. ఒంటెల సంఖ్య 36 నుండి 45 వరకు ఉంటే రెండేళ్ళ ఆడ ఒంటెను జకాత్‌గా ఇవ్వాలి. ఒంటెల సంఖ్య 46నుండి 60 వరకు ఉంటే మూడేళ్ళ ఒంటెతో సంపర్కం చేయగల ఆడ ఒంటెను ఇవ్వాలి. ఈ సంఖ్య 61 నుండి 75 వరకు ఉంటే అందులో నుంచి నాలుగేళ్ళ ఒంటెను సమర్పించుకోవాలి. ఒంటెల సంఖ్య 75కు మించి 90 వరకు చేరుకుంటే వాటిలో నుంచి రెండేళ్ళ వయసున్న రెండు ఆడ ఒంటెలు ఇవ్వాలి. ఒంటెల సంఖ్య 91 నుండి 120 వరకు ఉంటే అప్పుడు మూడేళ్ళ వయస్సున్న, మగ ఒంటెతో జతకట్టగల రెండు పడుచు ఆడ ఒంటెల్ని ఇవ్వాలి. ఒంటెల సంఖ్య 120 కి మించిపోతే అప్పుడు ప్రతి నలభై ఒంటెలపై రెండేళ్ళ ఒక ఆడ ఒంటెను, ప్రతి 50 ఒంటెలపై మూడేళ్ళ ఒక ఆడ ఒంటెను ఇచ్చుకోవాలి. కేవలం నాలుగు ఒంటెలు మాత్రమే కలిగి ఉన్నవారిపై ఎలాంటి జకాత్ లేదు. ఒకవేళ యజమాని ఇవ్వదలచుకుంటే అది అతని ఇష్టం.

మేకల జకాత్ ఈ విధంగా ఉంది: బయట మేతమేసే మేకలు 40 నుండి 120 వరకు ఉంటే కేవలం ఒక మేక మాత్రమే జకాత్‌గా వసూలు చేయబడుతుంది. ఈ సంఖ్య 121 నుండి 200 వరకు ఉంటే రెండు మేకలు జకాత్‌గా వసూలు చేయబడతాయి. మేకల సంఖ్య 201 నుండి 300 వరకు పెరిగితే అప్పుడు మూడు మేకలు జకాత్ రూపేణా తీసుకోవటం జరుగుతుంది. ఈ సంఖ్య 300 దాటితే ప్రతి నూరు మేకలపై ఒక మేక జకాత్‌గా వసూలు చేయబడుతుంది. బహిరంగ స్థలాలలో మేతమేసే మేకల సంఖ్య 40 కన్నా కేవలం ఒకటి తక్కువవున్నా వాటి యజమానిపై జకాత్ బాధ్యతలేదు. ఒకవేళ యజమాని తన ఇష్టపూర్వకంగా ఏదన్నా ఇచ్చుకుంటే అది వేరేవిషయం. జకాత్ భయంతో వేర్వేరుగా మేత మేసే పశువులను ఒక చోట సమీకరించటం గానీ, ఒకే మందను అనేక మందలుగా విభజించటంగానీ చేయరాదు. ఇద్దరు వ్యక్తులు కలిసి – ఉమ్మడిగా – మేకల్ని పోషిస్తున్నప్పుడు జకాత్ వారిరువురి నుండి చెరి సమానంగా వసూలు చేయాలి. జకాత్ పద్దులో ముసలి మేకలను గానీ, ఒంటికన్నుగల పశువులను గానీ, కేవలం పోతును గానీ తీసుకోరాదు. జకాత్ ఇచ్చే వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకుని వసూలు చేసే వ్యక్తి సడలింపుల వైఖరిని అవలంబిస్తే అది వేరే విషయం.

వెండి జకాత్ ఈ విధంగా ఉంది: 200 వెండి దిర్హమ్‌లుంటే వాటిపై 40వ వంతును జకాత్‌గా ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరి వద్దయినా రెండు వందల దిర్హములకన్నా ఒక్క దిర్హమ్ తక్కువ వున్నా అతనిపై జకాత్ తప్పనిసరి (వాజిబ్) కాదు. ఒకవేళ ఇవ్వదలచుకుంటే అది అతని ఇష్టం.

ఎవరి వద్దనుంచి నాలుగేళ్ళ వయస్సుగల ఒంటె జకాత్ రూపేణా వసూలు కావలసి ఉన్నదో, అతనివద్ద గనక నాలుగేళ్ళ ఒంటె లేకపోయినట్లయితే అప్పుడతని నుండి మూడేళ్ళ వయస్సున్న పడుచు ఆడ ఒంటె మరియు రెండు మేకలు తీసుకోబడతాయి. అయితే ఆ ఆడ ఒంటె మగ ఒంటెతో సంపర్కానికి యోగ్యంగా ఉండాలి. రెండు మేకలు కూడా సులభంగా లభ్యమైతేసరి, లేకుంటే 20 దిర్హములు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మూడేళ్ళ ఆడ ఒంటెను జకాత్‌గా ఇవ్వవలసిన వానివద్ద ఆ వయస్సున్న ఆడ ఒంటె లేకపోయినట్లయితే – అతని దగ్గర నాలుగేళ్ళ మగ ఒంటె ఉంటే – ఆ మగ ఒంటెనే తీసుకోవటం జరుగుతుంది. అట్టి పరిస్థితిలో జకాత్‌ను వసూలుచేసిన వ్యక్తి అతనికి 20 దిర్హములుగానీ, రెండు మేకలను గానీ వాపసు చేయవలసి ఉంటుంది. (బుఖారీ)

English

Anas (RAA) narrated that Abu Bakr As-Siddiq (RAA) wrote him this letter, “This is the obligatory Zakah, which the Messenger of Allah (ﷺ) made obligatory for every Muslim, and which Allah, the Almighty had commanded him to observe. ‘For each twenty-four camels, or less, their Zakah is to be paid as sheep; for every live camels, their Zakah is one sheep. When the amount of camels is between twenty -five to thirty- five, the due Zakah is one she-camel ‘bint makhad’ (a camel which is one year old and just starting the second year) or a male camel ‘ibn labun’(a young male camel which is two years old and already starting the third year). However, when the amount of camels reaches thirty-six, the due Zakah is a young she-camel 'bint labun’ (a young female camel, which is two years old and already starting the third year). When they reach forty six to sixty camels, their due Zakah is a she camel ‘hiqqah’ (which is three years old and starting the fourth). When they reach sixty-one to seventy-five, one ‘Jaz'ah’ (a four year old camel already starting its fifth year). When their number is between seventy-six to ninety camels, their due Zakah is two young she camels ‘bint labun’. When they are in the range between ninety-one to one hundred and twenty camels, the Zakah is two young she camels 'hiqqah’. If they are over a hundred and twenty camels, on every forty camels, one 'bint labun’ is due. And for every fifty camels (over one hundred and twenty) a young she-camel ‘hiqqah’ is due, And anyone, who has got only four camels, does not have to pay Zakah unless he (the owner of the camels) wants to give something voluntarily. Regarding the Zakah of grazing sheep, if they are between forty and one hundred and twenty, one sheep is due as Zakah. lf they are between 120 and 200, two sheep are due. If they are between 200 and 300, three sheep are due. If they exceed three hundred sheep, then one sheep is due for every extra hundred grazing heads. If the grazing sheep are less than forty, (even if they are 39) then no Zakah is due on them, unless he (the owner of the camels) wants to give something voluntarily. One should not combine (i.e. gather young animals together) or separate them for fear of paying Zakah. When there is a mixture of cattle shared between two partners, and Zakah is paid jointly between them, then they have to calculate it equally among them (depending on the share of each). Neither an old or a defective animal nor a male goat (a ram used for breeding) may be taken as Zakah, unless the Zakah collector wishes to do so. Concerning silver, the Zakah paid is a quarter of a tenth for each 200 Dirhams. If the amount of silver is less than two hundred Dirhams (even if it is 190) then no Zakah is to be paid for it, unless the owner wishes to do so. If the number of camels reaches the number on which a jaz'ah (a four year old camel already starting its fifth year) is due as Zakah, but he only has a ‘hiqqah’ (a she camel which is three years old and starting the fourth), it should be accepted from him along with two sheep if they were available (to compensate for the difference) or twenty Dirhams. If on the other hand he has to offer a ‘hiqqah’ as Zakah, but he only has a jaz'ah, it is accepted from him, and the Zakah collector will then pay him the difference, which is twenty Dirhams or two female sheep.’ Related by AI-Bukhari.

సారాంశం

ఈ హదీసులో ధనరూపంలో, పశువుల రూపంలో వసూలు చేయవలసిన జకాత్ తఫ్సీళ్ళు వచ్చాయి. పశువుల వయస్సును, వాటి తరహాను క్షుణ్ణంగా పేర్కొనటంతోపాటు జకాత్ వ్యవస్థ యొక్క రూపురేఖలు స్థూలంగా తెలుపబడ్డాయి. ఈ సందర్భంగా యజమానికి అన్యాయం చేయటంగానీ, ప్రభుత్వాన్ని మోసగించటంగానీ జరగకూడదని చెప్పబడింది. అన్ని రకాల పశువులపై జకాత్ లేదు, కేవలం పొలాలలో, మైదానాలలో గడ్డిమేసే పశువులపై మాత్రమే జకాత్ విధించబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 484

485

హదీసు 485

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعَثَهُ إِلَى اَلْيَمَنِ, فَأَمَرَهُ أَنْ يَأْخُذَ مِنْ كُلِّ ثَلَاثِينَ بَقَرَةً تَبِيعًا أَوْ تَبِيعَةً, وَمِنْ كُلِّ أَرْبَعِينَ مُسِنَّةً, وَمِنْ كُلِّ حَالِمٍ دِينَارًا أَوْ عَدْلَهُ مَعَافِرِيّاً } رَوَاهُ اَلْخَمْسَةُ, وَاللَّفْظُ لِأَحْمَدَ, وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ وَأَشَارَ إِلَى اَلِاخْتِلَافِ فِي وَصْلِهِ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِم ُ.

హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺతనను యమన్ ప్రాంతానికి (పర్యవేక్షకునిగా) పంపిస్తూ ఇలా ఆదేశించారు – “30 ఆవులపై ఒక ఏడాది వయసున్న ఆడ ఆవుదూడను లేదా మగ ఆవుదూడను (జకాత్‌గా) వసూలు చేయాలి. ప్రతి నలభై ఆవులపై రెండేళ్ళ వయసున్న గిత్తను తీసుకోవాలి. ప్రతి యుక్త వయస్సుడైన వ్యక్తి నుంచి (అవిశ్వాసి నుంచి జిజ్‌యాగా) ఒక దీనార్‌గానీ, మాఫిరీ (యమన్‌లో తయారైన) దుప్పటిగానీ పుచ్చుకోవాలి.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు మాత్రం అహ్మద్‌లోనివి. తిర్మిజీ దీనిని హసన్‌గా ఖరారు చేశారు. ఇది ‘మౌసూల్’ అన్న విషయంలో అభిప్రాయభేదం ఉంది – ఇబ్నె హిబ్బాన్ మరియు హాకిమ్ లిరువురూ దీనిని ప్రామాణికమైన హదీసుగా పేర్కొన్నారు)

English

Mu’adh bin Jabal (RAA) narrated, ‘When the Messenger of Allah (ﷺ) sent him to Yemen, he commanded him to take a ‘tabi’(young bull) or ‘tabi'ah’ (young cow, which is one year old), as Zakah for every 30 cows. And for every forty cows, a musinnah (two year old cow) is due. Every non-Muslim who attained the age of puberty should pay one Dinar or the equivalent from the Mu'afiri clothes (made in a town in Yemen called Ma'afir).’ Related by the Five Imams and the wording is from Ahmad.

సారాంశం

ఈ హదీసులో ఆవులకు సంబంధించిన జకాత్‌తోపాటు, ఇస్లామీయ రాజ్యంలోని ముస్లిమేతరుల ‘జిజ్‌యా’కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. గేదెల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని ధర్మవేత్తలు నిర్ణయించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 485

486

హదీసు 486

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ تُؤْخَذُ صَدَقَاتُ اَلْمُسْلِمِينَ عَلَى مِيَاهِهِمْ } رَوَاهُ أَحْمَد ُ. وَلِأَبِي دَاوُدَ: { وَلَا تُؤْخَذُ صَدَقَاتُهُمْ إِلَّا فِي دُورِهِمْ }.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి, మరి ఆయనేమో తన తాతగారి నుండి సంగ్రహించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు: “ముస్లింల నుంచి జకాత్ సొమ్ము వారు (పశువులను) నీరు త్రాగించే చోట వసూలు చేయబడుతుంది” (అహ్మద్). ‘ముస్లింల సదఖాలు వారి ఇళ్ళవద్దనే వసూలు చేయబడతాయ’ని అబూదావూద్‌లోని ఉల్లేఖనంలో ఉంది.

English

'Amro bin Shu'aib narrated on the authority of his father, who reported on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) said: “The Zakah of the Muslims should be collected by their water trough.” Related by Ahmad.

Abu Dawud also has the narration, “Their Zakah should only be collected by their dwellings.”

సారాంశం

జకాత్ వసూళ్ళకై నియమించబడిన అధికారులు స్వయంగా ప్రజల వద్దకు, వారి పశువుల కొట్టం వద్దకు వెళ్ళవలసి ఉంటుందని ఈ హదీసు చెబుతోంది. ఒకవైపు రైతులు ప్రభుత్వాన్ని ఏమార్చకుండా ఉండటానికి, మరోవైపు ప్రభుత్వోద్యోగులు కార్యాలయాలలో కూర్చుని పెత్తనం చెలాయించకుండా ఉండటానికని ఈ విధంగా నిర్ణయించటం జరిగింది. ఉద్యోగులు ఈ వసూళ్ళను తమ విధ్యుక్త ధర్మంగా భావించి ఇంటింటికీ తిరిగి మరీ వసూలు చేయాలి. జాబిర్ బిన్ అతీక్ కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు-“మీ వద్దకు జకాత్‌ను వసూలు చేసే ప్రభుత్వ ప్రతినిధులు వస్తారు. వారు మీ దగ్గరకు వచ్చినపుడు వారికి స్వాగతం పలకండి. వారు అడిగిన దాన్ని ఇవ్వండి. వారుగనక న్యాయంగా వ్యవహరిస్తే వారికి పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ వారు అన్యాయానికి పాల్పడితే దాని ఖర్మను కూడా వారే అనుభవిస్తారు.” ఒకవేళ ప్రభుత్వాధికారులు జకాత్ పరిమాణానికి మించిగనక డిమాండు చేస్తే ఎట్టి పరిస్థితిలోనూ వారికి అదనంగా ఇవ్వరాదని సహీహ్ బుఖారీలో ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 486

487

హదీసు 487

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَيْسَ عَلَى اَلْمُسْلِمِ فِي عَبْدِهِ وَلَا فِي فَرَسِهِ صَدَقَةٌ } رَوَاهُ اَلْبُخَارِيّ ُ. وَلِمُسْلِمٍ: { لَيْسَ فِي اَلْعَبْدِ صَدَقَةٌ إِلَّا صَدَقَةُ اَلْفِطْرِ }.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “ముస్లింలపై వారి బానిసల విషయంలోగానీ, వారి గుర్రాల విషయంలోగానీ జకాత్ లేదు” (బుఖారీ). ముస్లింలోని ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది – “బానిసలపై జకాత్ లేదు. అయితే వారు ఫిత్రా దానాన్ని మాత్రం చెల్లించవలసి ఉంటుంది.”

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “No Zakah is to be paid on one’s horse (that he rides) or one’s slave.” Related by Al-Bukhari. Muslim also has the narration, “There is no Zakah to be paid on one’s slave, except for Zakat-ul-Fitr (which is paid at the end of Ramadan, and a Muslim must pay it on behalf of all of those he is responsible for).”

సారాంశం

తమ సేవకోసం ఉన్న బానిసలపై, గుర్రాలపై జకాత్ చెల్లించవలసిన అవసరం లేదని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. అయితే గుర్రాల వ్యాపారం చేస్తే మాత్రం వాటిపై జకాత్ తప్పనిసరవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 487

488

హదీసు 488

وَعَنْ بَهْزِ بْنِ حَكِيمٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ فِي كُلِّ سَائِمَةِ إِبِلٍ: فِي أَرْبَعِينَ بِنْتُ لَبُونٍ, لَا تُفَرَّقُ إِبِلٌ عَنْ حِسَابِهَا, مَنْ أَعْطَاهَا مُؤْتَجِرًا بِهَا فَلَهُ أَجْرُهُ, وَمَنْ مَنَعَهَا فَإِنَّا آخِذُوهَا وَشَطْرَ مَالِهِ, عَزْمَةً مِنْ عَزَمَاتِ رَبِّنَا, لَا يَحِلُّ لِآلِ مُحَمَّدٍ مِنْهَا شَيْءٌ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَعَلَّقَ اَلشَّافِعِيُّ اَلْقَوْلَ بِهِ عَلَى ثُبُوتِه ِ.

హజ్రత్ బహ్జ్ బిన్ హాకీమ్ తన తండ్రినుండి, మరి ఆయన తన తాతగారి నుండి ఉటంకించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: మేతమేసే మొత్తం 40 ఒంటెలపై రెండేళ్ళ వయసున్న ఒక ఆడ ఒంటెను (జకాత్)గా ఇవ్వాలి. ఒంటెలను ఈ లెక్కన వేరు చేయకూడదు. ఎవరయితే పుణ్యార్జనా సంకల్పంతో జకాత్‌ను ఇస్తాడో అతనికి దాని పుణ్యఫలం కూడా లభిస్తుంది. మరెవరయినా జకాత్‌ను (ఇవ్వకుండా) ఆపుకుంటే మేము బలవంతంగా జకాత్ వసూలు చేస్తాము; అతన్నుండి కొంత సొమ్ము కూడా (రాబడతాము). మన ప్రభువు విధించిన వాటిలో ఇది అనివార్యమైనది. వీటిలోని ఏ వస్తువు కూడా ముహమ్మద్ ﷺ కుటుంబీకుల కోసం ధర్మసమ్మతం (హలాల్) కాదు. (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు. హాకీమ్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు. షాఫయి మాత్రం దీని నిర్ధారణకు సంబంధించి తుది నిర్ణయానికి రాలేకపోయారు)

English

Bahz bin Hakam narrated on the authority of his father, who reported on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) said: “For every forty camels, one ‘bint labun’ (a young female camel which is two years old and already starting the third year), is due as Zakah. No camel is to be separated from the rest of the camels (i.e. the jointly owned live stock as mentioned above). Whoever gives it willingly, seeking his reward from Allah, will be rewarded. (However) if someone refrains from paying it, it will be taken from him (by force) along with part of his property (as punishment), for it is a right of Allah. None of it is lawful for the family of Muhammad (ﷺ)." Related by Ahmad, An-Nasa’i, Abu Dawud and Al-Hakim rendered it Sahih. And Ash-Shafi'ee conditioned ruling by it depending on its authenticity.

సారాంశం

బనూ హాషిమ్, బనూ అబ్దుల్ ముత్తలిబ్ వంశస్థులు – అంటే మహనీయ ముహమ్మద్ ﷺ కుటుంబీకులు – జకాత్ విధి దానాలు స్వీకరించరాదన్న సంగతి ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. బనూ హాషిమ్‌లో హజ్రత్ అలీ సంతానం, హజ్రత్ అబ్బాస్ సంతతివారు, అఖీల్ సంతానం, హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ సంతతివారు కూడా చేరి ఉన్నారు. వీరంతా జకాత్‌కు అర్హులు కారు. అయితే ఇమామ్ యూసుఫ్ ప్రకారం ఒక సయ్యదు మరో సయ్యదుకు జకాత్ ఇవ్వగలడు.

హదీసు ఉల్లేఖకులు

(1) అసలు పేరు బహ్జ్ బిన్ హాకీమ్. మారుపేరు అబూ అబ్దుల్ మలిక్. పూర్తి వంశపరంపరను చూస్తే ఆయన పేరు ఇలా ఉంటుంది-బహ్జ్ బిన్ హాకీమ్ బిన్ ముఆవియ బిన్ హైద. బస్రా వాస్తవ్యులు. ఆరవ కోవకు చెందిన తాబయి. ఈయన అందజేసిన హదీసు ప్రామాణికతపై భేదాభిప్రాయం వ్యక్తమయింది. ఈయన హదీసులు ప్రామాణికమైనవని అబూదావూద్ భావించారు. ఇబ్నె ముయీన్, ఇబ్నె మదీనీ, నసాయి కూడా వీటి ప్రామాణికతను ధృవీకరించారు. కాని ఈయనకు హదీసులపై పట్టులేదని అబూ హాతిమ్ వ్యాఖ్యానించారు. హదీసులను వివరించటంలో ఈయన వల్ల తప్పులు దొర్లాయని ఇబ్నె హిబ్బాన్ అభిప్రాయపడ్డారు. ఈయన హిజ్రీ 140 తరువాత మరణించారు.

(2) హాకీమ్ బిన్ ముఆవియ. అంటే బహ్జ్ తండ్రి. ఈయన తాబయి. ఇబ్నె హిబ్బాన్ ఈయన్ని నమ్మకస్తులైన హదీసు ఉల్లేఖకులలో ఒకరుగా పరిగణించారు.

(3) ముఆవియ బిన్ హైద. ఈయన బస్రాలో స్థిరపడ్డారు. ఈయన గారి ద్వారా కూడా ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 488

489

హదీసు 489

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا كَانَتْ لَكَ مِائَتَا دِرْهَمٍ ‏-وَحَالَ عَلَيْهَا اَلْحَوْلُ‏- فَفِيهَا خَمْسَةُ دَرَاهِمَ, وَلَيْسَ عَلَيْكَ شَيْءٌ حَتَّى يَكُونَ لَكَ عِشْرُونَ دِينَارًا, وَحَالَ عَلَيْهَا اَلْحَوْلُ, فَفِيهَا نِصْفُ دِينَارٍ, فَمَا زَادَ فَبِحِسَابِ ذَلِكَ, وَلَيْسَ فِي مَالٍ زَكَاةٌ حَتَّى يَحُولَ عَلَيْهِ اَلْحَوْلُ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَهُوَ حَسَنٌ, وَقَدِ اِخْتُلِفَ فِي رَفْعِه ِ. وَلِلتِّرْمِذِيِّ; عَنِ اِبْنِ عُمَرَ: { مَنِ اِسْتَفَادَ مَالًا, فَلَا زَكَاةَ عَلَيْهِ حَتَّى يَحُولَ اَلْحَوْلُ } وَالرَّاجِحُ وَقْفُه ُ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉద్బోధించారు – “నీవద్ద రెండు వందల దిర్హములు ఉండి వాటిపై ఒక ఏడాది కాలం గడచిపోతే దానిపై ఐదు దిర్హమ్‌ల జకాత్ చెల్లించవలసి ఉంటుంది. నీవద్ద 20 దీనార్లు ఉండి వాటిపై ఒక సంవత్సరం పూర్తి కానంతవరకూ నీవు ఏమి చెల్లించనవసరం లేదు. 20 దీనార్లపై సంవత్సర కాలం పూర్తయితే మాత్రం దీనిపై సగం దీనారు జకాత్‌గా ఇవ్వాలి. అంతకు మించి (డబ్బు) ఉంటే ఈ లెక్కన జకాత్ చెల్లించవలసి ఉంటుంది. ఏ సంపదపై కూడా – ఏడాది కాలం పూర్తికానిదే జకాత్ ఉండదు.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – ఈ హదీసు ‘హసన్’ కోవకు చెందినది. ఇది ‘మర్ఫూ’ అన్న విషయంపై భేదాభిప్రాయం ఉంది) తిర్మిజీలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనంలో ఉంది – “ఆర్థిక సంవత్సరం మధ్యలో ప్రాప్తమయిన సంపదపై కూడా ఏడాది కాలం గడిచే వరకూ ఎలాంటి జకాత్ లేదు.” ఈ హదీసు ‘మౌఖూఫ్’గా పరిగణించబడింది.

English

Ali (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When you possess two hundred Dirhams at the end of the year (if you still have all of them), five Dirhams are levied on them as Zakah. There is nothing upon you (to be paid) in gold, until it reaches (the value of) twenty Dinars. When you possess twenty Dinars, at the end of the year, then there is half a Dinar levied on it (as Zakah). Any additional amount will be calculated in the same manner. No Zakah is to be paid on monetary holdings, until they have been owned for one year.” Related by Abu Dawud, who rendered it Hasan.

Ibn Umar (RAA) narrated, ‘Whoever earns any money, he is not liable to pay Zakah, until the period of a year has passed (while still possessing the same amount of money).’ Related by At-Tirmidhi.

సారాంశం

ఈ హదీసులో వెండి బంగారాల జకాత్ ప్రస్తావన వచ్చింది. వెండి రెండు వందల దిర్హముల కన్నా తక్కువ ఉంటే దానిపై జకాత్ లేదు. నేటి ఆధునిక పరిభాషలో ధర్మవేత్తలు 52 1/2 తులాల బరువుకు సమానంగా ఉంటే దానిపై రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే బంగారం విషయానికి వస్తే; ఏడున్నర తులాల బంగారం ఉంటే, మార్కెట్టులో దాని వెలనుబట్టి మొత్తం వెలకట్టి, దానిపై రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 489

490

హదీసు 490

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { لَيْسَ فِي اَلْبَقَرِ اَلْعَوَامِلِ صَدَقَةٌ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَاَلدَّارَقُطْنِيُّ, وَالرَّاجِحُ وَقْفُهُ أَيْضً ا.

(వ్యవసాయ) పనులకు ఉపయోగపడే ఎద్దులపై జకాత్ చెల్లించటం తప్పనిసరి కాదని హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వివరించారు. (దీనిని దారె ఖుత్నీ, అబూదావూద్ ఉల్లేఖించారు – ఈ హదీసు కూడా ‘మౌఖూఫ్’గానే భావించబడుతున్నది)

English

Ali (RAA) narrated that, ‘There is no Zakah to be paid on working cattle.’ Related by Abu Dawud and Ad-Daraqutni.

సారాంశం

వ్యవసాయోత్పత్తులకై ఉపయోగపడే పశువులపై జకాత్ చెల్లించనవసరం లేదని ఈ హదీసు చెబుతున్నది. అలాగే కర్మాగారాలలో వస్తువుల ఉత్పాదనకై ఉద్దేశించిన యంత్రాలపై కూడా జకాత్ లేదు. ఎందుకంటే అవి కూడా వ్యవసాయ పనిముట్ల, సాధనాల మాదిరిగానే ఉత్పత్తుల కొరకు పెట్టుకున్న పరికరాల క్రిందికి వస్తాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 490

491

హదీసు 491

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ; عَبْدِ اَللَّهِ بْنِ عَمْرِوٍ; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مِنْ وَلِيَ يَتِيمًا لَهُ مَالٌ, فَلْيَتَّجِرْ لَهُ, وَلَا يَتْرُكْهُ حَتَّى تَأْكُلَهُ اَلصَّدَقَةُ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَاَلدَّارَقُطْنِيُّ, وَإِسْنَادُهُ ضَعِيف ٌ. وَلَهُ شَاهِدٌ مُرْسَلٌ عِنْدَ اَلشَّافِعِيّ ِ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి, మరి ఆయన తన తాతగారైన అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) నుండి సంగ్రహించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “ఎవరయితే ఒక అనాధకు సంరక్షకునిగా ఉంటాడో అతను ఆ అనాధ సొమ్మును వాణిజ్యంలో పెట్టుబడిగా పెట్టాలి. దాన్ని అలాగే- యధాతథంగా – వదిలివేస్తే (క్రమక్రమంగా) జకాత్ సొమ్ము దాన్ని హరించి వేయవచ్చు.” (దీనిని తిర్మిజీ, దారె ఖుత్నీ ఉల్లేఖించారు – హదీసు అందిన పరంపర బలహీనంగా ఉంది – అయితే ఇమామ్ షాఫయి వద్దగల ఒక ‘ముర్సల్’ ఉల్లేఖనం దీనికి సాక్షిగా ఉంది)

English

Amro bin Shu’aib narrated on the authority of his father who reported on the authority of his grandfather, on the authority of Abdullah bin 'Amro(RAA) that the Messenger of Allah (ﷺ) said: “One who becomes the guardian of an orphan, who owns property, must trade on his behalf and not leave it (saved and unused) until it is all eaten up by Zakah (which is paid yearly).” Related by At-Tirmidhi and Ad-Daraqutni with a weak chain of narrators.

And it has a Shahid (supporting narration) that is Mursal narrated by Ash-Shafi'ee.

సారాంశం

అనాధలకు సంరక్షకుడైన వాడు, అనాధల ఆస్తిపాస్తుల్ని కాపాడటమే గాకుండా వాటిని పెట్టుబడిగా పెట్టి, తద్వారా వచ్చిన లాభాలతో అనాధల సంపదను సమృద్ధిచేయడానికి కృషి చేయాలని పై హదీసు సూచిస్తోంది. అనాధ సొమ్ముపై కూడా జకాత్ ఉంటుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 491

492

హదీసు 492

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ أَبِي أَوْفَى ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا أَتَاهُ قَوْمٌ بِصَدَقَتِهِمْ قَالَ: "اَللَّهُمَّ صَلِّ عَلَيْهِمْ" } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబూ ఔఫా(రదియల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త ﷺ సమక్షంలో ప్రజలు జకాత్ సొమ్మును తీసుకుని వచ్చినప్పుడు, ‘దేవా! వీళ్ళని కరుణించు. వీళ్ళను చల్లగా చూడు’ అని ఆయన ﷺ వారికోసం ప్రార్థించేవారు. (బుఖారీ, ముస్లిం)

English

Abdullah bin Abi Aufa (RAA) narrated, ‘Whenever a person came to the Messenger of Allah (ﷺ) with their Zakah, he would say, “O Allah! Send your blessings upon them” Agreed upon.

సారాంశం

నసాయిలోని ఒక ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సమక్షంలో జకాత్‌ను తీసుకుని రాగా, ఆయన ﷺ అతని కొరకు ఇలా ప్రార్థించారు : “అల్లాహుమ్మ బారిక్ ఫీహి వ అహ్లిహీ” (ఓ అల్లాహ్! ఈ వ్యక్తిలో, ఇతని ఇంటివారిలో శుభాన్ని, సమృద్ధిని వొసగు). సహచరులు స్వయంగా వచ్చి జకాత్ సొమ్మును చెల్లించే వారని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 492

493

హదీసు 493

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلْعَبَّاسَ ‏- رضى الله عنه ‏- { سَأَلَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فِي تَعْجِيلِ صَدَقَتِهِ قَبْلَ أَنْ تَحِلَّ, فَرَخَّصَ لَهُ فِي ذَلِكَ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَالْحَاكِم ُ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం : “జకాత్ నిర్ణీత సమయంకన్నా ముందుగానే చెల్లించవచ్చునా?” అని హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺను దర్యాప్తు చేయగా, ఆయన ﷺ అందుకు అనుమతి ఇచ్చారు. (తిర్మిజీ, ముస్తద్రక్ హాకిమ్)

English

Ali (RAA) narrated that al-Abbas (RAA) asked the Messenger of Allah (ﷺ) to allow him to pay his Zakah before its due date, and he gave him permission to do so.’ Related by At-Tirmidhi and Al-Hakim.

సారాంశం

ఒక సంవత్సర కాలం నిండిన తరువాతే జకాత్ ఫర్జ్ (విధి) అవుతుంది. అయితే అడ్వాన్సుగా చెల్లించడానికి కూడా దైవప్రవక్త ﷺ అనుమతి ఇచ్చారు. ఈ అంశంపై ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఏ విధంగానయితే నమాజ్, రోజా, హజ్ వంటి ఆరాధనలు నిర్ణీత సమయానికి ముందు నెరవేర్చబడవో అదేవిధంగా జకాత్ కూడా నిర్ణీతసమయం పూర్తికానిదే చెల్లించరాదనీ, ఎందుకంటే జకాత్ కూడా ఒక ఆరాధనేనని ఒక వర్గం వాదిస్తున్నది. సుఫియాన్ సౌరి అభిప్రాయం కూడా ఇదే. ఈ వాదనలో అంతగా బలం లేదు. ఎందుకంటే ‘జకాత్’ అనే విధిగా చెల్లించవలసిన దానానికి ఇతర ఆరాధనల మాదిరిగా ఒక నిర్ణీత సమయం అంటూ ఏమీ లేదు. ఏడాది గడువు నిండిన తరువాత కొన్ని రోజులు అటూ ఇటూగా జకాత్ చెల్లించినా ఫరవాలేదు. అత్యధిక ధర్మవేత్తల దృక్పథం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 493

494

హదీసు 494

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ ‏- رضى الله عنه ‏- عَنْ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَيْسَ فِيمَا دُونَ خَمْسِ أَوَاقٍ مِنَ اَلْوَرِقِ صَدَقَةٌ, وَلَيْسَ فِيمَا دُونَ خَمْسٍ ذَوْدٍ مِنَ اَلْإِبِلِ صَدَقَةٌ, وَلَيْسَ فِيمَا دُونَ خَمْسَةِ أَوْسُقٍ مِنَ اَلتَّمْرِ صَدَقَةٌ } رَوَاهُ مُسْلِم ٌ. وَلَهُ مِنْ حَدِيثِ أَبِي سَعِيدٍ: { لَيْسَ فِيمَا دُونَ خَمْسَةِ أَوْسَاقٍ مِنْ تَمْرٍ وَلَا حَبٍّ صَدَقَةٌ }. وَأَصْلُ حَدِيثِ أَبِي سَعِيدٍ مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు- “ఐదు ‘ఊఖియా’లకన్నా తక్కువ వెండి ఉంటే దానిపై జకాత్ లేదు. అలాగే ఐదు కన్నా తక్కువ సంఖ్యలో ఒంటెలుంటే వాటిపై కూడా జకాత్ లేదు. ఐదు ‘వసఖ్’లకన్నా తక్కువ ఖర్జూరం పై కూడా జకాత్ లేదు.” (ముస్లిం)

‘ముస్లిం’లో అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఉంది: “ఐదు వసఖ్‌లకన్నా తక్కువ ఖర్జూరం పైగానీ, ధాన్యంపైగానీ జకాత్ లేదు.” (అబూ సయీద్ ఖుదరీ(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం యొక్క మూలం బుఖారీ, ముస్లింలలో ఉంది)

English

Jabir (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “There is no Zakah to be paid on less than five ounces of silver, less than five camels or less than five Awsuq of dates.” Related by Muslim.

Abu Said Al-Khudri (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “There is no Zakah to be paid on any amount of dates or grain less than five Awsuq.” Agreed upon.

సారాంశం

ఈ హదీసులో వెండి పరిమాణం ఐదు ఊఖియాలని చెప్పబడింది. ఇంతకు ముందు వచ్చిన హదీసులో రెండు వందల దిర్హములు అని ఉంది. ఈ రెండు హదీసులలో పైకి వైరుధ్యం కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అలాంటి వైరుధ్యం ఏమీలేదు. ఎందుకంటే ఒక ఊఖియాలో నలభై దిర్హములు ఉంటాయి. 5 ఊఖియాలు 200 దిర్హములకు సమానం. కనుక ఈ వైరుధ్యం, వ్యాఘాతం సమసిపోయినట్లే.

అలాగే 300 హిజాజీ ‘సా’ మనదేశంలో అమలులో వున్న ఇంగ్లీషు తూకం ప్రకారం 20 మణుగులకు సమానం. ఒక ‘వసఖ్’లో 60 ‘సా’లు ఉంటాయి. అంటే నాలుగు మణుగులకు సమానం. ఐదు వసఖ్‌లంటే 20 మణుగులన్నమాట. ఈ లెక్కన మనదేశంలో 20 మణుగులకన్నా (ఇంచు మించు 10 క్వింటాళ్ళకన్నా) తక్కువ ధాన్యం పండితే అందులోంచి జకాత్ ఇవ్వనక్కరలేదు. కాని హనఫీ ఫిఖహ్ ననుసరించే పండితులు దైవగ్రంథాన్ని, హదీసుల సర్వసాధారణ ఉపదేశాలను దృష్టియందుంచుకొని; ధాన్యం లేక ఖర్జూరం ఒక మణుగుకన్నా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ దానిపై జకాత్ ఉందని ‘ఫత్వా’ (తీర్పు) ఇచ్చారు.

అయితే దీనికన్నా మొదటి దృక్పథమే సరైనది. ఎందుకంటే మహాప్రవక్త ﷺ స్వయంగా ‘బరువు’ను నిర్ణయించినప్పుడు మనం దాన్ని అవలంబించి తీరాలి. మన తరఫున మనం అందులో హెచ్చుతగ్గులు చేయటం భావ్యం అనిపించుకోదు. ఒక ఏడాది కాలంపాటు నిలువ ఉంచగలిగే ఆహారధాన్యాలన్నింటికీ ఈ జకాత్ వర్తిస్తుంది. ఉదాహరణకు: వరి, గోధుమ, జొన్న, రాగి, మొక్కజొన్న, పప్పు దినుసులు మొదలగునవి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 494

495

హదీసు 495

وَعَنْ سَالِمِ بْنِ عَبْدِ اَللَّهِ, عَنْ أَبِيهِ, عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { فِيمَا سَقَتِ اَلسَّمَاءُ وَالْعُيُونُ, أَوْ كَانَ عَثَرِيًّا: اَلْعُشْرُ, وَفِيمَا سُقِيَ بِالنَّضْحِ: نِصْفُ اَلْعُشْرِ.‏ } رَوَاهُ اَلْبُخَارِيّ ُ. وَلِأَبِي دَاوُدَ: { أَوْ كَانَ بَعْلًا: اَلْعُشْرُ, وَفِيمَا سُقِيَ بِالسَّوَانِ ي أَوِ اَلنَّضْحِ: نِصْفُ اَلْعُشْرِ }.

హజ్రత్ సాలిమ్ బిన్ అబ్దుల్లాహ్ (రహిమహుల్లాహ్) తన తండ్రి చెప్పినట్లుగా తెలియజేశారు. ఈయన తండ్రిగారి కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “ఏ భూమి అయితే వర్షపు నీటితో, సెలయేళ్ళతో (కాలువల ద్వారా), లేక నేలలోని తేమతో పండుతుందో అందులో 10వ భాగాన్ని జకాత్ (ఉష్ర్)గా ఇవ్వాలి. మరే భూమి అయితే నీళ్ళు తోడటం ద్వారా (లేక పంపుసెట్ల ద్వారా) పండుతుందో ఆ పంటలో 20వ వంతును (ఉష్ర్‌గా) ఇవ్వాలి” (బుఖారీ). అబూ దావూద్ ఉల్లేఖనంలో – “ఒకవేళ పశువుల ద్వారా లేదా నీరు చేదటం ద్వారా నీటి సరఫరా చేసినట్లయితే 20వ వంతు (సగం ఉష్ర్) ఇవ్వాలి” అని ఉంది.

English

Salim bin ’Abdullah narrated on the authority of his father (RAA) that the Messenger of Allah (ﷺ) said: “A tithe is due as Zakah, on every plant watered by heaven (rain water), springs, or underground water (i.e. watered without effort).While half a tithe is paid on what is watered by irrigation (i.e. machines are used).” Related by Al-Bukhari. Abu Dawud added in his narration, “When it is watered by underground water (close to the surface and keeping the land wet), a tithe is paid, but half a tithe is paid when the land is watered by wheels or animals.”

సారాంశం

నేల స్వభావాన్ని, పండించే తీరునుబట్టి జకాత్ (ఉష్ర్) నిష్పత్తిలో వ్యత్యాసముంటుందని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. ఉదాహరణకు, ఏ భూమి అయితే అతి కష్టమ్మీద సాగు అవుతుందో, ఏ ఏ ప్రాంతాలలో నీటి సరఫరా కనాకష్టంగా ఉంటుందో అక్కడి రైతుల సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకుని వారిపట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించటం జరిగింది. అంటే వాళ్ళు 20వ వంతు పంటను జకాత్ (ఉష్ర్)గా ఇస్తే సరిపోతుందని చెప్పబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 495

496

హదీసు 496

وَعَنْ أَبِي مُوسَى اَلْأَشْعَرِيِّ; وَمُعَاذٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ لَهُمَا: { لَا تَأْخُذَا فِي اَلصَّدَقَةِ إِلَّا مِنْ هَذِهِ اَلْأَصْنَافِ اَلْأَرْبَعَةِ: اَلشَّعِيرِ, وَالْحِنْطَةِ, وَالزَّبِيبِ, وَالتَّمْرِ } رَوَاهُ اَلطَّبَرَانِيُّ, وَالْحَاكِم ُ. وَلِلدَّارَقُطْنِيِّ, عَنْ مُعَاذٍ: { فَأَمَّا اَلْقِثَّاءُ, وَالْبِطِّيخُ, وَالرُّمَّانُ, وَالْقَصَبُ, فَقَدْ عَفَا عَنْهُ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-} وَإِسْنَادُهُ ضَعِيف ٌ.

దైవప్రవక్త ﷺ తమతో చెప్పారని హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హుమా), హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) లిరువురూ వివరించారు: “బార్లీ, గోధుమలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం – ఈ నాలుగు రకాల ఆహారోత్పత్తులపై తప్ప మరే ఆహారధాన్యాలపైనా జకాత్‌ను వసూలు చేయరాదు” (తబ్రానీ, హాకిమ్ దీనిని ఉల్లేఖించారు – దారె ఖుత్నీ ముఆజ్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా పొందుపరచిన ఉల్లేఖనంలో ఇలా ఉంది – “దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మపండ్లు, చెరకు వంటి పంటలను దైవప్రవక్త ﷺ జకాత్ నుండి మినహాయించారు. అయితే ఈ ఉల్లేఖనం అందిన తీరు బలహీనం (జయీఫ్) గా ఉంది)

English

Abu Musa Al-Ash’ari and Mu'adh (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said to them, “Do not take any Zakah except on these four crops: barley, wheat, raisins and dates.”Related by At-Tabarani and Al-Hakim.

Imam Ad-Daraqutni related on the authority of Mu’adh (RAA), ‘As for cucumbers, watermelons, pomegranates, and sugar-cane, the Messenger of Allah (ﷺ) has exempted them from Zakah.’ It is transmitted with a weak chain of narrators.

సారాంశం

దారె ఖుత్నీలోని హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ‘బలహీనం’గా ఉందని ఎందుకు అనబడిందంటే అందులోని ఒక ఉల్లేఖకుడు ఎన్నదగినవాడు కాదు. హదీసు పరంపరలో కూడా లింకు తెగింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 496

497

హదీసు 497

وَعَنْ سَهْلِ بْنِ أَبِي حَثْمَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: أَمَرَنَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا خَرَصْتُمْ, فَخُذُوا, وَدَعُوا اَلثُّلُثَ, فَإِنْ لَمْ تَدَعُوا اَلثُّلُثَ, فَدَعُوا اَلرُّبُعَ } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا اِبْنَ مَاجَهْ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِم ُ.

హజ్రత్ సహ్ల్ బిన్ అబూ హస్మ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు: – “మీరు ధాన్యాన్ని (లేక పండ్లను) అంచనావేసి అందులో మూడో వంతును వదిలేయండి. ఒకవేళ మూడో వంతును వదలలేకపోతే నాల్గవ వంతును వదలండి.” (‘ఐదుగురి’లో ఇబ్నెమాజా తప్ప మిగతావారు దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ లిరువురూ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)

English

Sahl bin Abi Hathmah (RAA) narrated, “We were commanded by the Messenger of Allah (ﷺ), ‘Whenever you assess the amount of something, estimate the [Zakah] and ignore one-third. If you do not, then leave (at least) one fourth.” Related by the five Imams, except for Ibn Majah.

సారాంశం

ఈ హదీసు ఇస్లామీయ షరీయత్‌లోని విలువలను, సుగుణాలను వ్యక్తపరుస్తోంది. జకాత్ అనేది విధిగా ఇవ్వవలసిన దానం. అయితే ఇదిగాక ‘సదఖా’ అనే సర్వసాధారణమయిన దానం కూడా ఉంది. అంతేగాక, ఒక కొత్త పంట పండినప్పుడు ఆ రైతు కుటుంబీకులు ఎలాగూ దాన్ని తింటారు. అయితే ఆ ఊరిలోని పేదసాదలకు, బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికి కూడా ఎంతో కొంత ఇవ్వటం అభిలషణీయం. రైతులు పండించే పంటలలో కొన్ని ఎక్కువ కాలం నిల్వ ఉండజాలవు. ఉదాహరణకు చెట్టుకు కాసే కాయలు, కాయగూరలు, ఆకుకూరలు నశ్వర వస్తువుల కోవకు చెందుతాయి. ఇలాంటి పంటలు చేతికి వచ్చినప్పుడు తామూ తినాలి, ఎల్లరికీ తినిపించాలి. ఇందులో ఎన్నో మేళ్లు ఇమిడి ఉన్నాయి.

హదీసు ఉల్లేఖకులు

సహ్ల్ బిన్ అబూ హస్మ (రదియల్లాహు అన్హు). ఈయన అసలు పేరు అబ్దుల్లాహ్ లేక ఆమిర్ బిన్ సైద బిన్ ఆమిర్ అన్సారీ ఖజ్రజీ, మదనీ. పిన్న వయస్కులైన సహాబీలలో ఒకరు. హిజ్రీ 3వ సంవత్సరంలో జన్మించారు. కూఫాలో స్థిరపడ్డారు. అయితే ఈయన మదీనా సహచరులలో ఒకరుగానే పరిగణించబడ్డారు. ముసైబ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో మదీనాలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 497

498

హదీసు 498

وَعَنْ عَتَّابِ بنِ أُسَيْدٍ ‏- رضى الله عنه ‏- قَالَ: أَمَرَنَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَنْ يُخْرَصَ اَلْعِنَبُ كَمَا يُخْرَصُ اَلنَّخْلُ, وَتُؤْخَذَ زَكَاتُهُ زَبِيبًا } رَوَاهُ اَلْخَمْسَةُ, وَفِيهِ اِنْقِطَاع ٌ.

హజ్రత్ అత్తాబ్ బిన్ అసీద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మమ్ము ఈ విధంగా ఆదేశించారు- “ఖర్జూరపు పండ్లను ఎలా అంచనావేస్తారో ద్రాక్షపండ్లను కూడా మీరు అలాగే అంచనా వేయండి. వాటి ‘జకాత్’గా ఎండుద్రాక్షను (కిస్మిస్‌ను) వసూలు చేయాలి.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు – అయితే హదీసును వివరించిన వారి మధ్య లింకు తెగింది)

English

Attab bin Usaid (RAA) narrated that The Messenger of Allah (ﷺ) commanded us, “Grapevines are to be estimated exactly as palm trees, and its Zakah is taken in raisins.” Related by the five lmams and it has a break in the chain.

హదీసు ఉల్లేఖకులు

అత్తాబ్ బిన్ అసీద్ (రదియల్లాహు అన్హు). ప్రముఖ సహాబీలలో ఒకరు. మక్కా విజయం తరువాత దైవప్రవక్త ﷺ హునైన్ వైపునకు సాగిపోతూ ఈయన్ని మక్కా పర్యవేక్షకునిగా నియమించారు. ఈయన ఈ పదవిపై హజ్రత్ అబూబక్ర్ పరిపాలనా కాలం వరకూ ఉన్నారు. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) మరణించిననాడే ఈయన కూడా మరణించారని ప్రతీతి. మరొక కథనం ప్రకారం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ ఆఖరి దశ వరకూ జీవించి ఉన్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 498

499

హదీసు 499

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ; { أَنَّ اِمْرَأَةً أَتَتِ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-وَمَعَهَا اِبْنَةٌ لَهَا, وَفِي يَدِ اِبْنَتِهَا مِسْكَتَانِ مِنْ ذَهَبٍ, فَقَالَ لَهَا: "أَتُعْطِينَ زَكَاةَ هَذَا?" قَالَتْ: لَا.‏ قَالَ: "أَيَسُرُّكِ أَنْ يُسَوِّرَكِ اَللَّهُ بِهِمَا يَوْمَ اَلْقِيَامَةِ سِوَارَيْنِ مِنْ نَارٍ?".‏ فَأَلْقَتْهُمَا.‏ } رَوَاهُ اَلثَّلَاثَةُ, وَإِسْنَادُهُ قَوِيّ ٌ. وَصَحَّحَهُ اَلْحَاكِمُ: مِنْ حَدِيثِ عَائِشَة َ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ (రహిమహుల్లాహ్) తన తండ్రి నుంచి, ఆయన తన తాతగారి నుండి ఉటంకించారు: ఒక మహిళ దైవప్రవక్త ﷺ సమక్షంలోకి వచ్చింది. ఆమె వెంట ఆమె కూతురు కూడా ఉంది. ఆమె చేతికి రెండు బంగారు గాజులున్నాయి. ఆయన ﷺ ఆమెనుద్దేశించి, “నీవు వీటి జకాత్‌ను చెల్లిస్తున్నావా?” అని అడిగారు. ‘లేదు’ అని ఆమె బదులిచ్చింది. “మరయితే ప్రళయ దినాన అల్లాహ్ నీకు రెండు అగ్ని గాజులు తొడిగించటం నీకు ఇష్టమేనా?” అని ఆయన ﷺ అన్నారు. ఇది విని ఆ మహిళ రెండు గాజులను తీసి పారవేసింది. (దీనిని ముగ్గురు ఉల్లేఖించారు – దీని ఆధారం దృఢమైనది. హాకిమ్ గారు దీనిని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆధారంగా ఉల్లేఖించి, ప్రామాణికమైన హదీసుగా నిర్ధారించారు)

English

Amro bin Shu’aib narrated on the authority of his father, who reported on the authority of his grandfather (RAA) that a woman came to the Messenger of Allah (ﷺ) accompanied by her daughter, who wore two heavy gold bangles. He said to her, “Do you pay Zakah on them?” She said, ‘No.’ He then said, “Are you pleased that Allah may put two bangles of fire on your wrist on the Day of Judgment?” She then threw them away. Related by the three Imams with a strong chain of narrators.

And Al-Hakim graded it Sahih based on the narration of Aisha.

సారాంశం

బంగారు నగలపై కూడా జకాత్ ఉందని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. అయితే ఈ విషయంపై కూడా ఫుకహా (ధర్మవేత్తల) మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. నగలపై జకాత్ వాజిబ్ (తప్పనిసరి) అని మొదటి వర్గం భావించింది. నగలపై జకాత్ ఫర్జ్ (విధి) కాదని రెండవ వర్గం అభిప్రాయపడింది. ఇమామ్ మాలిక్, ఇమామ్ అహ్మద్, ఇమామ్ షాఫయి ఈ రెండో వాదనకే అనుకూలంగా ఉన్నారు. నగలపై జకాత్ ఒకసారి ఇస్తే సరిపోతుందన్నది మరో వాదన. వీటన్నింటినీ జోడించిన మీదట తుది నిర్ణయానికి రావలసినదేమిటంటే, నగలపై జకాత్ ఫర్జ్ (విధి) గావించబడింది. సహీహ్ హదీసు దీనికి బహిరంగ నిదర్శనం. కేవలం అంచనాల, ఊహల ఆధారంగా నగలపై జకాత్ లేదని అనటం సమంజసం కాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 499

500

హదీసు 500

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; { أَنَّهَا كَانَتْ تَلْبَسُ أَوْضَاحً ا مِنْ ذَهَبٍ فَقَالَتْ: يَا رَسُولَ اَللَّهِ! أَكَنْزٌ هُوَ? فَقَالَ: "إِذَا أَدَّيْتِ زَكَاتَهُ, فَلَيْسَ بِكَنْزٍ".‏ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَاَلدَّارَقُطْنِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ..

హజ్రత్ ఉమ్మె సలమ (రదియల్లాహు అన్హా) కథనం : తాను బంగారు నగ తొడిగి ఉన్నప్పుడు దైవప్రవక్త ﷺను ఈ విధంగా ప్రశ్నించారు: “ఓ దైవప్రవక్తా ﷺ! ఇది నిలువచేసిన నిధిగా భావించబడుతుందా?” దానికి ఆయన ﷺ, “నీవు దీని జకాత్‌ను చెల్లిస్తే మటుకు ప్రోగుచేసిపెట్టిన నిధి క్రిందికి రాదు” అని అన్నారు. (ఈ హదీసును అబూ దావూద్, దారె ఖుత్నీ లిరువురూ ఉల్లేఖించగా, హాకిమ్ దీనిని ప్రమాణబద్ధమైనదిగా నిర్ధారించారు)

English

Umm Salamah (RAA) narrated that she was wearing golden ornaments and asked the Messenger of Allah (ﷺ), ‘Is it considered as a treasure?’ He said, “If you pay the due Zakah, then it is not considered as a treasure.” Related by Abu Dawud and Ad-Daraqutni.

సారాంశం

“ఎవరయితే బంగారం, వెండిని ప్రోగుచేసి పెట్టారో, మరియు అందులో నుంచి దైవమార్గంలో ఖర్చుపెట్టరో వారికి వ్యధాభరితమయిన యాతన యొక్క శుభవార్తను అందజెయ్యండి….” (9:34,35) అన్న దివ్య ఖుర్ఆన్ వాక్యంలో దీని వివరాలు వచ్చాయి.

వేరొక హదీసు ప్రకారం దైవప్రవక్త ﷺ తన ధర్మపత్ని అగు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చేతిలో వెండి నగలు చూశారు. ‘ఆయిషా! నీవు వీటి జకాత్‌ను చెల్లిస్తున్నావా?’ అని అడిగారు. ‘లేదు’ అని ఆమె బదులివ్వగా ‘అయితే నరకాగ్నిలో కాలడానికి నీవు వహించిన ఈ మాత్రం అశ్రద్ధ సరిపోతుంది’ అని ఆయన ﷺ హెచ్చరించారు. (హాకిమ్)

ఈ హదీసు ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే బంగారు, వెండి నగలపై (అవి నిర్దిష్ట పరిమాణానికి మించి ఉన్నప్పుడు) జకాత్ చెల్లించవలసి ఉంటుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 500

501

హదీసు 501

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَأْمُرُنَا; أَنْ نُخْرِجَ اَلصَّدَقَةَ مِنَ اَلَّذِي نَعُدُّهُ لِلْبَيْعِ.‏ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَإِسْنَادُهُ لَيِّن ٌ.

హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ మాకు వర్తక సామగ్రి నుంచి జకాత్‌ను తీయవలసిందిగా ఆదేశించారు.” (ఈ హదీసును అబూదావూద్ బలహీన ఆధారంతో ఉల్లేఖించారు).

English

Samurah bin Jundub (RAA) narrated that The Messenger of Allah (ﷺ) used to command us to pay Zakah from (the goods) we had prepared for sale. Related by Abu Dawud with a weak chain of narrators.

సారాంశం

వర్తక సామగ్రిపై కూడా జకాత్ వుందని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. దీనికి ఆధారంగా ముజాహిద్ దివ్య ఖుర్ఆన్‌లోని, అన్ఫిఖూ మిన్ తయ్యిబాతి మా కసబ్తుమ్ అనే వచనాన్ని ఉదాహరించారు. ఇది విధిగా చెల్లించాలన్న విషయంలో ఎలాంటి సంశయానికి తావు లేదని ఇబ్నె ముంజిర్ పేర్కొన్నారు. ధర్మవేత్తలు, నలుగురు ఇమాములు కూడా వర్తక సామగ్రిపై జకాత్ చెల్లించటం విధి అన్న విషయంపై ఏకీభవించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 501

502

హదీసు 502

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: "وَفِي اَلرِّكَازِ: اَلْخُمُسُ".‏ } مُتَّفَقٌ عَلَيْه ِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు : “ఖనిజ సంపదలో (లేక గుప్తనిధిలో) 5వ వంతు (జకాత్‌గా ఇవ్వవలసి) ఉంది.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “One fifth is compulsory to be paid (as Zakah) on buried Treasure.” Agreed upon.

సారాంశం

ఖనిజ సంపద (గుప్తనిధి)పై చెల్లించవలసిన ఐదవ వంతును జకాత్ అనటంకన్నా దాన్ని ప్రభుత్వ వాటాగా పరిగణించటం సముచితం. భూగర్భంలో ఎక్కడ ఈ ఖనిజాలు లభించినా అందులోనుంచి ఇరవై శాతం సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చెయ్యాలి. మిగతా సొమ్ము యజమాని స్వంతమవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 502

503

హదీసు 503

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ ‏-فِي كَنْزٍ وَجَدَهُ رَجُلٌ فِي خَرِبَةٍ‏-: "إِنْ وَجَدْتَهُ فِي قَرْيَةٍ مَسْكُونَةٍ, فَعَرِّفْهُ, وَإِنْ وَجَدْتَهُ فِي قَرْيَةٍ غَيْرِ مَسْكُونَةٍ, فَفِيهِ وَفِي اَلرِّكَازِ: اَلْخُمُسُ ".‏ } أَخْرَجَهُ اِبْنُ مَاجَهْ بِإِسْنَادٍ حَسَن ٍ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ (రహిమహుల్లాహ్) తన తండ్రి నుంచి, మరి ఆయన తన తాతగారి నుంచి గ్రహించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ, భూమి నుంచి ఖజానా లభించిన వ్యక్తి గురించి చెబుతూ; “నీవు ఈ ఖజానాను జనవాసాలున్న ప్రదేశంలో పొందివుంటే అది ఎవరిదో తెలుసుకునే ఉద్దేశ్యంతో అక్కడ ప్రకటన గావించు. ఒకవేళ ఏదయినా నిర్జన ప్రదేశంలో ఇది నీకు లభించి ఉంటే అది ఖనిజ సంపద (గుప్తనిధి) క్రిందికి వస్తుంది. దానిపై ఐదవ వంతును చెల్లించవలసి ఉంటుంది.” (ఇబ్నె మాజా దీనిని విశ్వసనీయ ఆధారాల ద్వారా వివరించారు)

English

'Amro bin Shu'aib narrated on the authority of his father, who reported on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) was asked about a treasure that was found by a man in some ruined land, and he said to him, “If you found it in an inhabited village, then you must advertise its having been found. However, if he found it in an uninhabited village, then on it and the rest of the discovered treasure one fifth is payable as Zakah.” Related by Ibn Majah with a reliable chain of narrators.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 503

504

హదీసు 504

وَعَنْ بِلَالِ بْنِ اَلْحَارِثِ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَخَذَ مِنَ اَلْمَعَادِنِ اَلْقَبَلِيَّةِ اَلصَّدَقَةَ.‏ } رَوَاهُ أَبُو دَاوُد َ.

హజ్రత్ బిలాల్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “దైవప్రవక్త ﷺ ‘ఖబాలియ’ అనే ప్రదేశంలో వున్న గనుల నుంచి జకాత్‌ను వసూలు చేశారు. (అబూదావూద్)

English

Bilal bin Al-Harith (RAA) narrated that The Messenger of Allah (ﷺ) took Zakah from the mines of Qabaliyah.

హదీసు ఉల్లేఖకులు

బిలాల్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) ‘ముజైనియా’ తెగకు చెందినవారు. అందుచేత ఈయన ముజైనీగా కూడా పిలువబడ్డారు. ఆయన హిజ్రీ 5లో దైవప్రవక్త ﷺ సమక్షంలో ప్రతినిధిగా హాజరయ్యారు. మదీనాలో స్థిరపడ్డారు. తరువాత బస్రాకు బదిలీ అయ్యారు. మక్కా విజయం సందర్భంగా ఈయన ముజైనియా తెగవారి ధ్వజం చేబూని నిలబడ్డారు. 80 సంవత్సరాల వయస్సులో – హిజ్రీ 60లో – మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.0 జకాత్|హదీసు 504