హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 11వ అధ్యాయం: ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 341 – 353) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్
باب صلاة المسافر والمريض
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 341
عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { أَوَّلُ مَا فُرِضَتْ اَلصَّلَاةُ رَكْعَتَانِ , فَأُقِرَّتْ صَلَاةُ اَلسَّفَرِ وَأُتِمَّتْ صَلَاةُ اَلْحَضَرِ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَلِلْبُخَارِيِّ: { ثُمَّ هَاجَرَ, فَفُرِضَتْ أَرْبَعًا, وَأُقِرَّتْ صَلَاةُ اَلسَّفَرِ عَلَى اَلْأَوَّلِ }. زَادَ أَحْمَدُ: { إِلَّا اَلْمَغْرِبَ فَإِنَّهَا وِتْرُ اَلنَّهَارِ, وَإِلَّا اَلصُّبْحَ, فَإِنَّهَا تَطُولُ فِيهَا اَلْقِرَاءَةُ }.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “ప్రారంభకాలంలో రెండు రకతులు ఫర్జ్ (విధి) గావించబడ్డాయి. అంటే ఫర్జ్ గావించబడినవి రెండు రకతులే. అవి (ప్రయాణీకుల నమాజ్గా) మిగిల్చి ఉంచబడ్డాయి. సాధారణ (స్థితిలోని) నమాజ్ పరిపూర్ణం గావించబడింది. (అంటే నాలుగు రకతులు చేయబడింది) (బుఖారీ, ముస్లిం)
బుఖారీలోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది – “ఆయన ﷺ హిజ్రత్ చేసిన తరువాత నాలుగు రకతులు విధించబడ్డాయి. ప్రయాణ నమాజ్ మాత్రం యధాతథంగా (మొదటి స్థితిలో) ఉంచబడింది.”
అహ్మద్ ఈ వాక్యాన్ని అదనంగా చేర్చారు: “మగ్రిబ్ నమాజ్ తప్ప. ఎందుకంటే అవి పగటి వితర్. ఉదయం నమాజ్ కూడా యధాతథంగానే ఉంచబడింది. ఎందుకంటే ఈ నమాజ్‌లో ఖుర్ఆన్ పారాయణం సుదీర్ఘంగా ఉంటుంది.”
English
Narrated 'Aishah (RA) that when the Salat (prayer) was first prescribed, it consisted of two Rak'at. Afterwards, the prayer during travelling was confirmed (as two Rak'at), while the prayer at the place of residence was completed (as four Rak'at). [Agreed upon].
al-Bukhari has: 'Then [(Allah's Messenger (ﷺ)] emigrated and it was prescribed as four, but prayer while travelling was left according to the original prescription (of two Rak'at).'
Ahmad added, 'Except the Maghrib (prayer) for it is the Witr (prayer) of the day; and except the Fajr (prayer), since the recitation (of the Qur'an) is prolonged in it.'
సారాంశం
ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే తొలి కాలంలో సాధారణ సమయాలలోనూ, ప్రయాణావస్థలోనూ రెండేసి రకతుల నమాజ్ మాత్రమే ఫర్జ్గా ఉండేది. తరువాత ప్రయాణావస్థ నమాజును యధాతథంగా వుంచి, సాధారణ స్థితిలో నమాజ్‌ను రెండింతలు చేయటం జరిగింది. అంటే రెండు రకతుల ఫర్జ్ నమాజ్ కాస్తా నాలుగు రకతులుగా చేయబడింది.
దివ్య ఖుర్ఆన్లో ఖసర్ నమాజ్ గురించిన ప్రస్తావన వచ్చింది. ప్రయాణావస్థలో నమాజ్‌ను ఖసర్ చేయటం (తగ్గించటం) ధర్మసమ్మతమేనని అందులో చెప్పబడిందేగాని, ఖసర్ చేయటం వాజిబ్ (తప్పనిసరి) అని మాత్రం అనబడలేదు.
ప్రయాణంలో ఖసర్ చేయటం వాజిబ్ (తప్పనిసరి) అన్నది ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) అభిమతం. ఇమామ్ అహ్మద్, ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) లు మాత్రం ఖసర్ను సున్నత్ (దైవప్రవక్త) సంప్రదాయంగా తలపోస్తున్నారు.
దారే ఖుత్నీలో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ఈ విధంగా ఉంది – “ప్రయాణ సమయంలో నేను పూర్తి నమాజ్ చేశాను. దీనిగురించి ఆయన ﷺ కు తెలియజేయగా, ఆయన ﷺ మెచ్చుకున్నారు.”
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 341
హదీసు 342
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَانَ يَقْصُرُ فِي اَلسَّفَرِ وَيُتِمُّ, وَيَصُومُ وَيُفْطِرُ. } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَرُوَاتُهُ ثِقَاتٌ. إِلَّا أَنَّهُ مَعْلُول ٌ. وَالْمَحْفُوظُ عَنْ عَائِشَةَ مِنْ فِعْلِهَا, وَقَالَتْ: { إِنَّهُ لَا يَشُقُّ عَلَيَّ } أَخْرَجَهُ اَلْبَيْهَقِيّ ُ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ప్రయాణ దినాలలో ఒక్కోసారి ఖసర్ చేసేవారు. ఒక్కోసారి పూర్తి నమాజ్ చేసేవారు. (అంటే రెండింటినీ అనుసరించేవారు). అలాగే ఉపవాసాలూ ఉండేవారు, ఇఫ్తార్ కూడా చేసేవారు ‘(దారె ఖుత్నీ). ఈ హదీసును అందజేసిన వారు విశ్వసనీయులు. కాని హదీసు అందిన పరంపరలో మాత్రం ఎక్కడో లింకు తెగింది. అయితే హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి ఆచరణ రూపంలో ఇది సురక్షితంగా ఉంది. “ఉపవాసవ్రతం నాకు భారమేమీ కాదు” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) వక్కాణించారు. (బైహఖీ)
English
Narrated 'Aishah (RA): While on a journey, the Prophet (ﷺ) used to shorten the prayer (sometimes) and offer it completely (sometimes). Similarly, he used to observe fast (sometimes) and break it (sometimes). [ad-Daraqutni reported it, and its narrators are reliable, but it is a defective Hadith].
The Mahfudh (correct) narration from 'Aishah (RA) (concerning this matter) is that it was her practice (that she (RA) offered prayers in the complete form during travelling) [and not the practice of the Prophet (ﷺ)]. She said: 'It is not hard for me.' [al-Baihaqi reported it].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 342
హదీసు 343
وَعَنْ اِبْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِنَّ اَللَّهَ يُحِبُّ أَنْ تُؤْتَى رُخَصُهُ كَمَا يَكْرَهُ أَنْ تُؤْتَى مَعْصِيَتُهُ } رَوَاهُ أَحْمَدُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ.. وَفِي رِوَايَةٍ: { كَمَا يُحِبُّ أَنْ تُؤْتَى عَزَائِمُهُ }.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఉపదేశించారు – “అల్లాహ్ రాయితీ నిచ్చిన విషయాలలో ఈ రాయితీలపై అమలు చేయటం ఆయనకెంతో ఇష్టం. ఆయన తన అవిధేయతను ఎంతగా ఇష్టపడడో అంతగానే (తన ప్రసాదిత సౌలభ్యాలను సద్వినియోగ పరచుకోవటాన్ని ఇష్టపడతాడు).
(దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్లు ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు). వేరొక ఉల్లేఖనంలో ఈ వాక్యం ఉంది – “తాను తాకీదు చేసిన ఆదేశాలను – ఫర్జ్లను – నెరవేర్చటాన్ని అల్లాహ్ ఇష్టపడినట్లే.”
English
Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "Allah the Most High loves that His permissions be practiced, just as he dislikes that disobedience to Him be committed." [Ahmad reported it. Ibn Khuzaimah and Ibn Hibban graded it Sahih (authentic)].
A narration has, "As He loves that His… duties be observed."
సారాంశం
ప్రయాణంలో నమాజ్‌ను ఖసర్ చేసి (తగ్గించి) చేయటం ఉత్తమమని ఈ హదీసు తాత్పర్యం. క్రియాత్మకంగా 4 రకతుల బదులు 2 రకతులే చేసినప్పటికీ ఇదే శ్రేష్ఠమయినది – ఎందుకంటే దేవుడు సమకూర్చిన సౌలభ్యాన్ని సద్వినియోగపరచుకోవటం దాసుల విజ్ఞతకు తార్కాణం. ఇది దైవానికి అత్యంత ప్రీతికరం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 343
హదీసు 344
وَعَنْ أَنَسٍ رَضِيَ اَللَّهُ عَنْهُ قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا خَرَجَ مَسِيرَةَ ثَلَاثَةِ أَمْيَال ٍ أَوْ ثَلَاثَةِ فَرَاسِخَ, صَلَّى رَكْعَتَيْنِ } رَوَاهُ مُسْلِمٌ..
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ మూడు మైళ్ళు, లేక మూడు ‘ఫర్సఖ్’ల దూరం ప్రయాణం చేసినపుడు రెండు రకతుల (ఖసర్) నమాజ్ చేసేవారు.” (ముస్లిం)
English
Narrated Anas (RA): When Allah's Messenger (ﷺ) went out on a journey of three miles or three Farasikh, he (ﷺ) used to pray two Rak'at. [Reported by Muslim]. Farasikh (plural of Farsakh) is Persian unit of distance. Farsakh is equal to about three miles.
సారాంశం
ఒక మైలుకు 8 ఫర్లాంగులు. ఒక ‘ఫర్సఖ్’ మూడు మైళ్ళకు సమానం. మూడు ‘ఫర్సఖ్’లు అంటే 9 మైళ్ళు అన్నమాట! అయితే ఈ ‘దూరం’ విషయంలో హదీసువేత్తల, ఇమాముల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్), ఆయన ప్రియ అనుయాయి హాఫిజ్ ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్) ల అభిప్రాయం ప్రకారం ఖసర్ నమాజు కోసం ఇంతదూరం ప్రయాణించాలి అని ఖచ్చితంగా ఏమీ నిర్ధారితం కాలేదు. ఇమామ్ షూబ (రహిమహుల్లాహ్) గారు మూడు మైళ్ళు లేక మూడు ఫర్సఖ్లు ప్రయాణిస్తే చాలు, ఖసర్ చేయవచ్చునని వ్యాఖ్యానించారు. హదీసులో కూడా ఈ మాటే అనబడింది. కొంతమంది ఈ దూరాన్ని 36 మైళ్ళుగా, మరి కొందరు 48 మైళ్ళుగా, ఇంకా కొందరు 56 మైళ్ళుగా నిర్ధారించారు. వాస్తవానికి ఇవన్నీ అంచనాల ఆధారంగా నిర్ధారించుకున్నవే గాని వారి ఈ నిర్ధారణను సమర్థించే సహీహ్ హదీసు ఏదీ లేదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 344
హదీసు 345
وَعَنْهُ قَالَ: { خَرَجْنَا مَعَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -مِنْ اَلْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى اَلْمَدِينَةِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيِّ..
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : “మేము దైవప్రవక్త ﷺతో కలిసి మదీనా నుండి మక్కా వరకు పయనించాము. ఆయన ﷺ తిరిగి వచ్చేదాకా రెండేసి రకతులే చేశారు.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)
English
Narrated [Anas (RA)]: We went from al-Madinah to Makkah with Allah's Messenger (ﷺ) and he prayed two Rak'at at each time of prayer till we returned to al-Madinah. [Agreed upon, and the wording is al-Bukhari's].
సారాంశం
ప్రయాణ సంకల్పంతో మనిషి తన ఇంటి నుండి బయలుదేరినప్పటినుండి అతడు బాటసారిగానే పరిగణించబడతాడు. పట్టణ పరిధిని దాటితే, అంటే నేటి ఆధునిక పరిభాషలో మునిసిపల్ పరిసరాలను లేక పంచాయితీ పొలిమేరలను దాటినప్పటినుండి తిరిగివచ్చే వరకూ అతడు ప్రయాణీకుడే. ఈ మధ్య కాలంలో అతడు ‘ఖసర్’ చేయవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 345
హదీసు 346
وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { أَقَامَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -تِسْعَةَ عَشَرَ يَوْمًا يَقْصُرُ } وَفِي لَفْظٍ: { بِمَكَّةَ تِسْعَةَ عَشَرَ يَوْمًا } رَوَاهُ اَلْبُخَارِيّ ُ. وَفِي رِوَايَةٍ لِأَبِي دَاوُدَ: { سَبْعَ عَشْرَةَ }. وَفِي أُخْرَى: { خَمْسَ عَشْرَةَ }.. وَلَهُ عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ: { ثَمَانِيَ عَشْرَةَ }. وَلَهُ عَنْ جَابِرٍ: { أَقَامَ بِتَبُوكَ عِشْرِينَ يَوْمًا يَقْصُرُ اَلصَّلَاةَ } وَرُوَاتُهُ ثِقَاتٌ, إِلَّا أَنَّهُ اُخْتُلِفَ فِي وَصْلِه ِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవప్రవక్త ﷺ 19 రోజులపాటు ప్రయాణంలో (ఒకచోట ఆగి) వున్నారు. కాని ఆయన ﷺ ‘ఖసర్’ చేస్తూ వున్నారు. ‘మక్కాలో 19 రోజులు ఉన్నార’ని వేరొక ఉల్లేఖనంలో ఉంది (బుఖారీ). అబూదావూద్ ఉల్లేఖనంలో 17 రోజులు అని ఉంది. ఇంకొక ఉల్లేఖనంలో 15 రోజులని ఉంది.
అబూదావూద్లోనే ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు)చే ఇలా ఉల్లేఖించబడింది – “ఆయన ﷺ ఆగిన కాలం 18 రోజులు.” “ఆయన ﷺ తబూక్లో 20 రోజులు ఆగారు. ఆగినన్ని రోజులూ ఖసర్ చేశారు” అని జాబిర్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. ఈ ఉల్లేఖనాన్ని అందజేసిన వారు విశ్వసనీయులేగాని, అసలిది ఎక్కడినుండి మొదలైంది అన్న విషయం వివాదాస్పదం అయింది. (అబూదావూద్)
English
Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) (made a journey during which) he had a stop of nineteen days, during which he shortened his prayers. [Al-Bukhari] And in a narration: "(he (ﷺ) stayed) nineteen days in Makkah."
In a narration of Abu Dawud: "seventeen days."
And in another: "fifteen days."
The narration of Abu Dawud from 'Imran bin Husain (RA) has: "eighteen days."
His narration from Jabir (RA) has: Allah's Messenger (RA) stayed at Tabuk for twenty days, and he shortened the prayers (during his stay). [Its narrators are reliable, except that there is difference about whether or not it is Mawsul (unbroken chain of narrators)].
సారాంశం
మక్కాలో దైవప్రవక్త ﷺ ఆగిన రోజుల గురించి పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 19 రోజులని కొందరూ, 17 రోజులని మరికొందరు, 18 రోజులని ఇంకొందరూ వాదించారు. ప్రతి ఒక్కరూ తమ తమ వాదనల కనుగుణంగా ఏదో ఒక ఆధారాన్ని ఉదాహరించారు. వాస్తవానికి ఇది దైవప్రవక్త ﷺ మక్కాను జయించినప్పటి సంఘటన. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ఆగిన గడువు కాదిది. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ఆయన ﷺ విచ్చేసినపుడు మొత్తం పది రోజులకన్నా ఎక్కువ ఉండలేదు. ఈ వివిధ ఉల్లేఖనాలను జోడించిన పిదప 19 రోజుల ఉల్లేఖనం ఇతర ఉల్లేఖనాలకన్నా దృఢంగా కనిపిస్తుంది. ఎందుకంటే దైవప్రవక్త ﷺ మక్కా విజయం సందర్భంగా – రమజాన్ నెల 17వ తేదీ మంగళవారం నాడు మక్కాలో ప్రవేశించారు. అక్కడి నుండి హునైన్ వైపునకు షవ్వాల్ మాసం 6వ తేదీన బయలుదేరారు. దాఖలైన రోజును, వెడలిపోయిన రోజును కలుపుకుంటే మొత్తం 19 రోజులవుతాయి.
అయితే ఈ ‘అన్వయింపు’ విషయంలో ధర్మవేత్తలమధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపాయి. ఒక్కొక్కరు ఒక్కో కోణం నుంచి ప్రయాణీకుని నిరీక్షణా గడువును నిర్ధారించారు. ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్)ల దృష్టిలో ఈ గడువు 3 రోజులు. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో 15 రోజులు. కాని ప్రయాణీకుని తిరుగు ప్రయాణ సమయం నిర్ధారితం కాక అతడు సందిగ్ధావస్థకు లోనైవుంటే అట్టి పరిస్థితిపై కూడా ఇమాముల మధ్య అభిప్రాయభేదం ఏర్పడింది. ఇలాంటి సందిగ్ధావస్థకు లోనై వున్న ప్రయాణీకుడు, అతడు తన స్థిరనివాసానికి చేరుకునేవరకూ ఖసర్ చేయవచ్చని ఇమామ్ అబూ హనీఫా అభిప్రాయపడ్డారు. ఒకానొక కథనం ప్రకారం ఇమామ్ షాఫయి కూడా దీనికి మద్దతు తెలిపారు. ఈ అభిప్రాయాన్ని సమర్థించే సంఘటనలు కూడా ఉన్నాయి. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆజర్ బాయిజాన్లో 6 నెలల దాకా ‘ఖసర్’ చేశారు. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఒక ప్రయాణంలో ఏడాది కాలం లేక రెండేళ్ళపాటు డోలాయమాన స్థితిలో ఉండవలసి వచ్చింది. అప్పటివరకూ ఆయన ఖసర్ చేస్తూనే వున్నారు. కొంతమంది ప్రవక్త సహచరులు ఒక ప్రయాణంలో 9 మాసాల దాకా అనిశ్చిత స్థితికి లోనుకావలసి వచ్చింది. ఈ స్థితి తొలగిపోయేదాకా వారు ఖసర్ చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ సంఘటనల ద్వారా అవగతమయ్యే దేమిటంటే ప్రయాణంలో మనిషి అనిశ్చిత స్థితికి, సందిగ్ధావస్థకు గురైవున్నంత కాలం ‘ఖసర్’ గడువు ఇదమిత్థంగా ‘ఇంత’ అని చెప్పజాలము. పరిస్థితుల స్వరూపం దృష్ట్యా అతను ఎన్నాళ్ళయినా ‘ఖసర్’ చేయటం ధర్మసమ్మతమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 346
హదీసు 347
وَعَنْ أَنَسٍ: { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا اِرْتَحَلَ قَبْلَ أَنْ تَزِيغَ اَلشَّمْسُ أَخَّرَ اَلظُّهْرَ إِلَى وَقْتِ اَلْعَصْرِ, ثُمَّ نَزَلَ فَجَمَعَ بَيْنَهُمَا, فَإِنْ زَاغَتْ اَلشَّمْسُ قَبْلَ أَنْ يَرْتَحِلَ صَلَّى اَلظُّهْرَ, ثُمَّ رَكِبَ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةِ اَلْحَاكِمِ فِي "اَلْأَرْبَعِينَ" بِالْإِسْنَادِ الصَّحِيحِ: { صَلَّى اَلظُّهْرَ وَالْعَصْرَ, ثُمَّ رَكِبَ }. وَلِأَبِي نُعَيْمٍ فِي "مُسْتَخْرَجِ مُسْلِمٍ": { كَانَ إِذَا كَانَ فِي سَفَرٍ, فَزَالَتْ اَلشَّمْسُ صَلَّى اَلظُّهْرَ وَالْعَصْرَ جَمِيعًا, ثُمَّ اِرْتَحَلَ }
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ సూర్యుడు (పడమటి దిక్కున) వాలక ముందే ప్రయాణానికి బయలుదేరి వుంటే జుహ్ర్ నమాజును అస్ర్ నమాజ్ వేళ వరకూ చేయకుండా వాయిదా వేసేవారు. ఆ తర్వాత వాహనం దిగి జుహ్ర్ అస్ర్ నమాజులను ఒకేసారి నెరవేర్చేవారు. ఒకవేళ ప్రయాణానికి బయలుదేరక ముందే సూర్యుడు (పడమటి దిశన) వాలిపోయి వుంటే, అప్పుడు జుహ్ర్ నమాజ్ చేసి ప్రయాణం కట్టేవారు. (బుఖారీ, ముస్లిం)
హాకిమ్ గారి ‘అర్బయీన్’లో ఒక ప్రామాణిక ఆధారం ఇలా ఉంది: “ఆయన ﷺ జుహ్ర్, అస్ర్ నమాజులను (ఒకేసారి) చేసి ప్రయాణానికి బయలుదేరారు.”
అబూ నుఐమ్ గారి “ముస్తఖ్రజ్”లో ఇలా వుంది – “ఆయన ﷺ ప్రయాణంలో నున్నప్పుడు, పొద్దు వాలిన తరువాత జుహ్ర్ మరియు అస్ర్ – రెండింటినీ కలిపి చేసేవారు. ఆ తరువాత ముందుకు సాగిపోయేవారు.
English
Narrated Anas (RA): When Allah's Messenger (ﷺ) (while on a journey) proceeded before the sun had declined from the centre of the sky, he (ﷺ) delayed the Zuhr prayer till the time of the 'Asr prayer; he (ﷺ) would then alight and combine the two prayers. If the sun declined before he (ﷺ) moved off, he (ﷺ) would offer the Zuhr prayer and ride (i.e. travel). [Agreed upon].
In the narration of al-Hakim quoted in the al-Arba'in with a Sahih Isnad, "He (ﷺ) prayed Zuhr and 'Asr then rode (his beast, to continue his journey.)"
Abu Nu'aim has in his Mustakhraj of Muslim, "While on a journey, if the sun declined he (ﷺ) used to pray Zuhr and 'Asr together and then continue his journey."
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 347
హదీసు 348
وَعَنْ مُعَاذٍ - رضى الله عنه - قَالَ: { خَرَجْنَا مَعَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -فِي غَزْوَةِ تَبُوكَ، فَكَانَ يُصَلِّي اَلظُّهْرَ وَالْعَصْرَ جَمِيعًا, وَالْمَغْرِبَ وَالْعِشَاءَ جَمِيعًا } رَوَاهُ مُسْلِمٌ..
హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం : “మేము తబూక్ యుద్ధ సందర్భంగా దైవప్రవక్త ﷺ వెంట ఉన్నాము. ఆయన ﷺ జుహ్ర్ – అస్ర్ నమాజులను కలిపి చేసేవారు. మగ్రిబ్, ఇషా నమాజులను కలిపి ఒకేసారి చేసేవారు.” (ముస్లిం)
English
Narrated Mu'adh bin Jabal (RA): We went out with Allah's Messenger (ﷺ) on the Tabuk expedition, and he would offer Zuhr and 'Asr prayers together and Magbrib and 'Isha' prayers together. [Reported by Muslim].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 348
హదీసు 349
وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -: { لَا تَقْصُرُوا اَلصَّلَاةَ فِي أَقَلَّ مِنْ أَرْبَعَةِ بُرُدٍ; مِنْ مَكَّةَ إِلَى عُسْفَانَ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادٍ ضَعِيف ٍ وَالصَّحِيحُ أَنَّهُ مَوْقُوفٌ، كَذَا أَخْرَجَهُ اِبْنُ خُزَيْمَةَ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రబోధించారు : నాలుగు ‘బురద్’ల కన్నా తక్కువ దూరం వుంటే ఖసర్ నమాజ్ చేయకండి. నాలుగు బురద్లంటే మక్కా నుండి ‘ఉస్ఫాన్’ వరకు గల దూరం. (దీనిని దారె ఖుత్నీ బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు. వాస్తవానికి ఈ హదీసు ‘మౌఖూఫ్’ కోవకు చెందినది. ఇబ్నె ఖుజైమ కూడా దీనిని ఈ విధంగానే ఉల్లేఖించారు)
English
Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) said: "Do not shorten the prayer (while travelling) for a distance of less than four Burud; from Makkah to 'Usfan." [ad-Daraqutni reported it through a weak chain of narrators, and the right opinion is that it is Mawquf (saying of a companion, i.e. Ibn 'Abbas). Ibn Khuzaima reported it as such]. Burud: Plural of Barid, which means three Farsakh, and one Farsakh is equal to three miles.
సారాంశం
‘బురద్’ అనేది బహు వచనం. ఏకవచనంలో ‘బరీద్’ గా వ్యవహరిస్తారు. ఒక బరీద్ 12 మైళ్ళకు సమానం. 4 బురుదులంటే మొత్తం 48 మైళ్ళు అవుతాయి.
4 బురుదులకన్నా తక్కువ దూరం ప్రయాణిస్తే ఖసర్ ధర్మసమ్మతం కాదంటూ హదీసును అందజేసిన వ్యక్తి నమ్మదగిన వ్యక్తి కాడు. అతడు హదీసుకు అబద్ధాన్ని అంటగట్టాడు. ఇమామ్ సౌరీ (రహిమహుల్లాహ్) అతన్ని కజ్జాబ్గా అభివర్ణించారు. ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) స్వయంగా మక్కా-తాయఫ్ల మధ్య ప్రయాణం చేసినపుడు ఖసర్ చేసేవారని ఆధారాలున్నాయి. మక్కా – ఉస్ఫాన్ల మధ్య, మక్కా – జెద్దాల మధ్య కూడా ఆయన ఖసర్ చేసేవారని ఇమామ్ మాలిక్ తన ‘ముఅత్తా’లో నకలు చేశారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 349
హదీసు 350
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ خَيْرُ أُمَّتِي اَلَّذِينَ إِذَا أَسَاءُوا اِسْتَغْفَرُوا, وَإِذَا سَافَرُوا قَصَرُوا وَأَفْطَرُوا } أَخْرَجَهُ اَلطَّبَرَانِيُّ فِي "اَلْأَوْسَطِ" بِإِسْنَادٍ ضَعِيفٍ.. وَهُوَ فِي مَرَاسِيلِ سَعِيدِ بْنِ اَلْمُسَيَّبِ عِنْدَ اَلْبَيْهَقِيِّ مُخْتَصَر ٌ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు – “నా ఉమ్మత్ (అనుచర సమాజం)లో అత్యుత్తములెవరంటే, వారు తప్పులు చేసి క్షమాపణకై వేడుకుంటారు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఖసర్ నమాజ్ చేస్తారు. ఉపవాసం ఉండరు.” (దీనిని తబ్రానీ బలహీన ఆధారంతో తన ‘ఔసత్’లో ఉల్లేఖించారు. బైహఖీలో సయీద్ బిన్ ముసైబ్ ఆధారంగా సంక్షిప్తంగా దీని గురించి వివరించబడింది)
English
Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said: "The best of my followers are those who, having done evil, ask for forgiveness (from Allah); and when on a journey, shorten (the prayer) and break the fast." [at-Tabarani reported it in al-'Awsat through a weak chain of narrators].
al-Baihaqi reported it in brief as a Mursal (missing link after the Tabi'i) from Sa'id bin al-Musaiyab.
హదీసు ఉల్లేఖకులు
ఈ హదీసును అందజేసిన వారిలో ఒకరైన సయీద్ బిన్ ముసైబ్ (రహిమహుల్లాహ్) తాబయీన్ల నాయకునిగా ప్రసిద్ధిచెందారు. గొప్ప పండితులు. హదీసు, ఫికహ్, దైవధ్యానం, ఆరాధనలు, తఖ్వా (దైవభక్తి) తదితర అంశాలపై ఎంతో జ్ఞానసంపదను సమకూర్చారు. విద్యల క్రోడీకరణలో ప్రవీణులు. ఈయన హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ మొదలయిన రెండు సంవత్సరాలకు జన్మించారు. హిజ్రీ 90 లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 350
హదీసు 351
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { كَانَتْ بِي بَوَاسِيرُ, فَسَأَلْتُ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -عَنْ اَلصَّلَاةِ؟ فَقَالَ: "صَلِّ قَائِمًا, فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا, فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ" } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం : నేను మొలల వ్యాధితో బాధపడేవాణ్ణి. ఈ స్థితిలో నేను దైవప్రవక్త ﷺ ను సంప్రతించి నమాజ్ ఎలా చేయాలని అడిగాను. ఆయన ﷺ ఈ సలహా ఇచ్చారు-“నిలబడి (నమాజ్) చేయండి. ఒకవేళ నిలబడి చేయలేకపోతే కూర్చుని చేయండి. కూర్చుని చేయడానికి కూడా వీలుపడకపోతే ఒక ప్రక్కకు ఒత్తిగిలి నమాజ్ చేయండి.” (బుఖారీ)
English
Narrated 'Imran bin Husain (RA): I suffered from piles. So I asked the Prophet (ﷺ) about the prayers. He said: "Pray standing; and if you are unable, (pray) sitting; and if you are unable, (pray) lying on your side." [Reported by al-Bukhari].
సారాంశం
అయితే ఎలా కూర్చుని నమాజ్ చేయాలి? కాళ్ళు మడతపెట్టుకుని కూర్చోవాలా? లేక తషహ్హుద్ స్థితిలో కూర్చున్నట్లు కూర్చోవాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వ్యాధిగ్రస్తుడు ఎలా కూర్చోగలిగితే అలాగే కూర్చుని నమాజ్ చేయవచ్చు. పడుకొని నమాజ్ చేసేటప్పుడు కూడా ఎలా వీలుంటే అలా చేయవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 351
హదీసు 352
وَعَنْ جَابِرٍ قَالَ: { عَادَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -مَرِيضًا, فَرَآهُ يُصَلِّي عَلَى وِسَادَةٍ, فَرَمَى بِهَا, وَقَالَ: "صَلِّ عَلَى اَلْأَرْضِ إِنْ اِسْتَطَعْتَ, وَإِلَّا فَأَوْمِ إِيمَاءً, وَاجْعَلْ سُجُودَكَ أَخْفَضَ مِنْ رُكُوعِكَ" } رَوَاهُ اَلْبَيْهَقِيُّ. وَصَحَّحَ أَبُو حَاتِمٍ وَقْفَهُ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒక రోగిని పరామర్శించారు. అతడు దిండుపై నమాజ్ (సజ్దా) చేస్తున్నాడు. దైవప్రవక్త ﷺ ఆ దిండును తీసిపారవేశారు. “నీకు వీలుపడితే నేలపై నమాజ్ చెయ్యి. లేకుంటే తల ఊపుతూ నమాజ్ చెయ్యి. సజ్దా చేయవలసి వచ్చినప్పుడు మాత్రం రుకూ కన్నా కాస్త క్రిందికి తలను వంచు.” (బైహఖీ దీనిని ఉల్లేఖించారు. అబూ హాతిమ్ గారు ఇది ‘మౌఖూఫ్’ కావటాన్ని నిజమని ఖరారు చేశారు)
English
Narrated Jabir (RA): The Prophet (ﷺ) visited a sick man and saw him praying on a cushion, he threw it away and said, "Pray on the ground, if you can, or else pray by gestures and make your prostration lower than your bowing." [al-Baihaqi reported it and Abu Hatim graded it Sahih (authentic) in Mawquf form (as a saying of a companion, i.e. Jabir)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 352
హదీసు 353
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { رَأَيْتُ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -يُصَلِّي مُتَرَبِّعًا } رَوَاهُ النَّسَائِيُّ. وَصَحَّحَهُ اَلْحَاكِمُ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “నేను దైవప్రవక్త ﷺను కాళ్ళు మడత పెట్టుకుని నమాజ్ చేయగా చూచాను.” (దీనిని నసాయి ఉల్లేఖించారు – హాకిమ్ గారు దీనిని ప్రామాణికమైన హదీసుగా నిర్ధారించారు)
English
Narrated 'Aishah (RA): I saw the Prophet (ﷺ) praying while sitted in a cross-legged position. [Reported by an-Nasa'i; and al-Hakim graded it Sahih (authentic)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.11 ప్రయాణీకుల, వ్యాధిగ్రస్తుల నమాజ్|హదీసు 353
You must be logged in to post a comment.