హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 2.10 సాముహిక నమాజ్ మరియు ఇమామత్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 10వ అధ్యాయం: సామూహిక నమాజ్ మరియు ఇమామత్. ఈ అధ్యాయంలో 27 హదీసులు (హదీసు 314 – 340) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్

↑ విషయ సూచిక

باب صلاة الجماعة والإمامة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

314

హదీసు 314

عَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { صَلَاةُ اَلْجَمَاعَةِ أَفْضَلُ مِنْ صَلَاةِ اَلْفَذِّ بِسَبْعٍ وَعِشْرِينَ دَرَجَةً } مُتَّفَقٌ عَلَيْهِ.. وَلَهُمَا عَنْ أَبِي هُرَيْرَةَ: { بِخَمْسٍ وَعِشْرِينَ جُزْءًا }. وَكَذَا لِلْبُخَارِيِّ: عَنْ أَبِي سَعِيدٍ, وَقَالَ: "دَرَجَةً ".

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఉపదేశించారు – “సామూహికంగా చేసే నమాజ్ ఒంటరిగా చేసే నమాజ్ కన్నా ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమయినది.” (బుఖారీ, ముస్లిం)

బుఖారీ మరియు ముస్లింలోనే హజ్రత్ అబూహురైరా(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో “ఇరవై అయిదు రెట్లు పుణ్యం అధికంగా లభిస్తుంది” అని వుంది.

బుఖారీలో – హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ‘రెట్లు’ బదులు ‘అంతస్తు’ అనే పదం వుంది.

English

Narrated 'Abdullah bin 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "The prayer offered in congregation is twenty-seven degrees more rewardable than a prayer offered by a single person." [Agreed upon].

Both al-Bukhari and Muslim have also reported through Abu Hurairah (RA): "Twenty-five degrees (more)."

Likewise, al-Bukhari reported from Abu Sa'id al-Khudri: "He (ﷺ) said (the word) Daraja (degree)."

సారాంశం

నమాజ్‌ను సామూహికంగా (జమాఅత్‌తో కలిసి) చేయటం వాజిబ్ (తప్పనిసరి)కాదు అని వాదించేవారికి ఈ హదీసు ద్వారా పరోక్షంగా సమర్థన లభిస్తోంది. ఒంటరిగా చేసే నమాజ్‌లో పెక్కు కారణాల దృష్ట్యా శుభాలు క్షీణిస్తాయి అన్నది నిర్వివాదాంశమేగాని నమాజ్ నెరవేరకపోయే ప్రశ్న మాత్రం తలెత్తదు. ఒకవేళ ఫర్జ్ నమాజ్‌ను సామూహికంగా చేయాలన్నది ‘వాజిబ్’గా నిర్ధారించబడి వుంటే ఒంటరిగా నెరవేర్చేవాని నమాజ్ ధర్మసమ్మతం అయ్యేది కాదు. కాని వాస్తవానికి అలా కాలేదు. కనుక ఫర్జ్ నమాజును జమాఅత్‌తో కలిసి చేయటాన్ని “సున్నతె ముఅక్కద”గా భావించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 314

315

హదీసు 315

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { وَاَلَّذِي نَفْسِي بِيَدِهِ لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِحَطَبٍ فَيُحْتَطَبَ, ثُمَّ آمُرَ بِالصَّلَاةِ فَيُؤَذَّنَ لَهَا, ثُمَّ آمُرَ رَجُلًا فَيَؤُمَّ اَلنَّاسَ, ثُمَّ أُخَالِفُ إِلَى رِجَالٍ لَا يَشْهَدُونَ اَلصَّلَاةَ, فَأُحَرِّقَ عَلَيْهِمْ بُيُوتَهُمْ, وَاَلَّذِي نَفْسِي بِيَدِهِ لَوْ يَعْلَمُ أَحَدُهُمْ أَنَّهُ يَجِدُ عَرْقًا سَمِينًا أَوْ مِرْمَاتَيْنِ حَسَنَتَيْنِ لَشَهِدَ اَلْعِشَاءَ } مُتَّفَقٌ عَلَيْهِ وَاللَّفْظُ لِلْبُخَارِيِّ..

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రవచించారు – “ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షి! కట్టెల్ని ప్రోగుచేయమని ఆజ్ఞాపించి, తరువాత నమాజ్ కోసం (అజాన్) పిలుపు ఇవ్వమని ఆదేశించి, ఆ తరువాత ఎవరినయినా నమాజ్ చేయించమని చెప్పి, నమాజుకు రాకుండా ఇండ్లల్లో కూర్చున్న వారి వైపుకు నేను స్వయంగా వెళ్ళి – వారలా కూర్చుని ఉండగానే – వారి ఇళ్ళకు నిప్పు అంటించాలని నాకనిపిస్తోంది. ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను! (వీళ్ళు ఎలాంటి వారంటే) మాంసంతో కూడిన ఒక లావుపాటి ఎముక దొరుకుతుందని వీళ్ళకు తెలిసినా లేదా (గొఱ్ఱె) కాళ్ళు రెండు లభ్యమవుతాయని తెలిసినా ఇషా నమాజుకు ఎగబడి వచ్చేవాళ్ళు” (బుఖారీ, ముస్లిం- హదీసు వాక్యాలు మాత్రం బుఖారీ నుండి గ్రహించబడ్డాయి).

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "By Him in Whose Hand my soul is, I have thought of giving orders for fuel wood to be gathered, then giving orders for Salat (prayer) and having the Adhan called, then ordering a man to lead the people (in prayer), then going off to some people (men) who are not present at the prayer and burning down their houses upon them. By Him in Whose Hand my soul is, if one of them knew he would find a fat meaty bone or two fine sheep hooves he would attend the 'Isha' (evening prayer)." [Agreed upon, and the wording is that of al-Bukhari].

సారాంశం

ఫర్జ్ నమాజును జమాఅత్‌తో కలిసి చేయటం చాలా ముఖ్యమనీ, ఇది ‘ఫర్జె ఐన్’ అనీ ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. ఇది ఫర్జె కిఫాయగానీ, సున్నతె ముఅక్కద గానీ కాదు. ఇదే గనక ఫర్జె ఐన్ కాకపోతే దీన్ని విడనాడిన వారికి ఇంత తీవ్రమైన హెచ్చరిక చేయబడేది కాదు. జాహిరియ, అతా, ఔజాయి, ఇమామ్ అహ్మద్, అబూ సూర్, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె ముంజిర్, ఇబ్నె హిబ్బాన్ తదితరులందరూ జమాఅత్‌తో కలిసి నమాజ్ చేయటం ఫర్జ్ అని అంటున్నారు. అయితే ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) మాత్రం దీనిని ‘ఫర్జె కిఫాయ’ గా పరిగణిస్తున్నారు. అంటే కొంతమంది సామూహికంగా చేస్తే చాలు, మిగిలిన వారు జవాబుదారులు కారు అని దీని భావం. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో సామూహిక నమాజ్ ‘సున్నతె ముఅక్కద’ – ఇది ‘ఫర్జె కిఫాయ’ కానేకాదు, ఒకవేళ ఇది ‘ఫర్జె కిఫాయ’ అయి వుంటే జమాఅత్ కొరకు రానివారి ఇళ్ళకు నిప్పు అంటించాలన్న ఆగ్రహం వ్యక్తమయ్యేది కాదు. ఫర్జె కిఫాయ ప్రకారం చూస్తే కొద్దిమంది జమాఅత్‌కు వచ్చి, జమాఅత్‌ను నెలకొల్పితే సరిపోతుందాయె!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 315

316

హదీసు 316

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَثْقَلُ اَلصَّلَاةِ عَلَى اَلْمُنَافِقِينَ: صَلَاةُ اَلْعِشَاءِ, وَصَلَاةُ اَلْفَجْرِ, وَلَوْ يَعْلَمُونَ مَا فِيهِمَا لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా వ్యాఖ్యానించారు – “కపటుల (మునాఫిఖ్‌ల) పాలిట అన్నిటికన్నా ఇషా మరియు ఫజ్ర్ నమాజులు భారంగా, కష్టంగా పరిణమిస్తాయి. ఈ రెండింటికీ హాజరవటం వల్ల ఎంత (గొప్ప) పుణ్యఫలం ప్రాప్తమవుతుందో వారికి బోధపడి ఉంటే వాళ్ళు అవశ్యంగా వచ్చేవాళ్ళు-మోకాళ్ళ ఆధారంగా రావలసి వచ్చినా వెనుకాడే వారు కాదు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) said: "The most burdensome prayers for hypocrites are the 'Isha' and the Fajr prayers and if they knew what (rewards) these (prayers) contain, they would have come to them (in the mosques), even though they had to crawl on their knees." [Agreed upon].

సారాంశం

ఇషా నమాజ్ భారంగా ఎందుకనిపిస్తుందంటే పగలంతా శ్రమించిన వారు అలసిసొలసి వుంటారు. తియ్యని నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మస్జిద్ దాకా ఎందుకులే, ఇంట్లోనే నమాజ్ చేసి పడుకో అని మనసు పురికొల్పుతుంది. మనోవాంఛకు లొంగిపోయి సామూహికతకు ఉన్న ప్రాముఖ్యతను మనిషి విస్మరిస్తాడు. ఇక ఫజ్ర్ నమాజ్‌కు ఎందుకు రాలేకపోతాడంటే, నిద్రమత్తుకు లోనైవున్న వారిని షైతాన్ లాలించి, బుజ్జగించి పడుకోబెడతాడు. అయితే సజ్జనులైన దాసులు మాత్రం అజాన్ పిలుపు విన్నంతనే మనోవాంఛలకు, షైతాన్ లాలింపులకు లొంగిపోకుండా సరాసరి మస్జిద్ వైపునకు కదలివస్తారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 316

317

హదీసు 317

وَعَنْهُ قَالَ: { أَتَى اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-رَجُلٌ أَعْمَى فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ! إِنَّهُ لَيْسَ لِي قَائِدٌ يَقُودُنِي إِلَى اَلْمَسْجِدِ, فَرَخَّصَ لَهُ, فَلَمَّا وَلَّى دَعَاهُ, فَقَالَ: "هَلْ تَسْمَعُ اَلنِّدَاءَ بِالصَّلَاةِ?" قَالَ: نَعَمْ.‏ قَالَ: "فَأَجِبْ" } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: ఒక అంధుడు దైవప్రవక్త ﷺ సన్నిధిలోకి వచ్చి, ‘ఓ దైవప్రవక్తా ﷺ! నన్ను మస్జిద్ వరకూ తీసుకుని వచ్చే వారెవరూ లేరు’ అని విన్నవించుకున్నాడు. (ఆ వ్యక్తి ఇంట్లోనే నమాజ్ చేసుకునేందుకు) దైవప్రవక్త ﷺ అతన్ని అనుమతించారు. కాని అతను తిరిగి వెళుతుండగా ఆయన ﷺ అతన్ని వెనక్కి పిలిపించి “నీకు అజాన్ పిలుపు వినవస్తుందా?” అని అడిగారు. దానికి ‘అవున’న్నాడా వ్యక్తి. “అయితే నీవు అజాన్‌కు బదులు ఇవ్వాల్సిందే (అంటే మస్జిద్‌కు వచ్చి సామూహిక నమాజ్ చేయాల్సిందే)” అని సెలవిచ్చారాయన ﷺ. (ముస్లిం)

English

Narrated [Abu Hurairah (RA)]: A blind man came to the Prophet (ﷺ) and said, "O Messenger of Allah, I have no guide to take me to the mosque." He [the Prophet (ﷺ)] therefore permitted him (to pray at his house), then when the man turned away the Prophet (ﷺ) called him and asked, "Can you hear the Adhan (call) for prayer?" He answered, "Yes". He [the Prophet (ﷺ)] said, "Then respond to it." [Reported by Muslim].

సారాంశం

అజాన్ పిలుపు చెవిన పడిన తరువాత వికలాంగుడైన వ్యక్తి సయితం మస్జిద్‌కు రావలసిందేనని ఈ హదీసు చెబుతోంది. వికలాంగుడు ఇంట్లో నమాజ్ చేసుకుంటే అతని నమాజ్ స్వీకారయోగ్యమయితే అవుతుంది గాని సామూహిక నమాజ్‌లోని శుభాలు మాత్రం ప్రాప్తమవవు. ఎవరయినా అజాన్ పిలుపు వినకపోతే వారి సంజాయిషీ స్వీకారయోగ్యమే. అయితే అజాన్ పిలుపు విన్న మీదట వంకలు పెట్టడానికి వీలుండదు. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం షరియత్ మినహాయింపునిస్తుంది. ఉదాహరణకు – వర్షం, తుఫాను, తీవ్రమయిన ఆకలిబాధ, మలమూత్ర విసర్జన, వ్యాధిగ్రస్తత, శత్రు భయం లాంటి కారణాలుంటే అప్పుడు జమాఅత్‌లో వచ్చి కలవకపోయినా క్షమార్హమే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 317

318

హదీసు 318

وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ سَمِعَ اَلنِّدَاءَ فَلَمْ يَأْتِ فَلَا صَلَاةَ لَهُ إِلَّا مِنْ عُذْرٍ } رَوَاهُ اِبْنُ مَاجَهْ, وَاَلدَّارَقُطْنِيُّ, وَابْنُ حِبَّانَ, وَالْحَاكِمُ, وَإِسْنَادُهُ عَلَى شَرْطِ مُسْلِمٍ, لَكِنْ رَجَّحَ بَعْضُهُمْ وَقْفَه ُ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ప్రవచించారు : “అజాన్ పిలుపు విన్న మీదట సామూహిక నమాజ్‌లో పాల్గొనని వ్యక్తి కోసం మరే నమాజూ లేదు – ఏదయినా బలమైన (షరియత్ పరమైన) కారణముంటే తప్ప!” (ఇబ్నెమాజ, దారెఖుత్నీ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ దీనిని ఉల్లేఖించారు. దీని ఆధారం ‘ముస్లిం’ నిబంధనకు అనుగుణంగా ఉంది. అయితే కొంతమంది దీన్ని ‘మౌఖూఫ్’ అనడానికే ప్రాధాన్యత ఇచ్చారు).

English

Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) said: "Whoever hears the call for prayer and and does not come (to the mosque for prayer), his prayer will not be accepted from him, unless he has a (legitimate) excuse." [Reported by Ibn Majah, ad-Daraqutni, Ibn Hibban and al-Hakim. Its chain of narration meets Muslim's conditions, but some Hadith scholars held that the stronger view is that it is Mawquf (saying of a Companion)].

సారాంశం

ఈ హదీసు ద్వారా కూడా మనిషి సామూహిక నమాజ్‌లో పాల్గొనవలసిన అవశ్యకత తెలియవస్తోంది. అబూదావూద్‌లో – ఈ హదీసు చివర్లో ప్రియ సహచరులు దైవప్రవక్త ﷺ నుద్దేశ్యించి, “ఆ బలమైన కారణమేమిటి?” అని విన్నవించుకోగా, “(శత్రు) భయం మరియు వ్యాధి” అని దైవప్రవక్త ﷺ జవాబిచ్చారు. పెనుగాలులు, భారీ వర్షంతో పాటు క్రింది కారణాల వల్ల కూడా మనిషికి సామూహిక నమాజ్ నుండి మినహాయింపు లభిస్తుందని వేరొక హదీసు ద్వారా రూఢీ అవుతోంది. అవేమంటే, పచ్చి ఉల్లిగడ్డ, వెల్లుల్లి లాంటివి అప్పుడే తిని వుంటే వారు మస్జిద్‌లోకి రాకూడదు. ఎందుకంటే వాటి వల్ల నోటినుండి అదో రకమయిన – ఇతరుల్ని ఇబ్బందుల్లోపెట్టే – వాసన వస్తుంది. ఈ కారణంగా సాటి నమాజీలకు బాధ కలుగుతుంది. అలాగే ధూమపానం, పొగాకు నమలటం, జర్దా కిళ్ళీలు నమలటం వంటివి తీరా సామూహిక నమాజ్‌కు ముందు చేయరాదు. దీనివల్ల సాటి దైవదాసులను నమాజ్‌లో మానసిక క్షోభకు గురిచేసి, వారి ఏకాగ్రతను భంగపరచినట్లవుతుంది. ముస్లిం అనేవాడు తన ఇరుగు పొరుగువారిని వేధించకూడదు కదా!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 318

319

హదీసు 319

وَعَنْ يَزِيدَ بْنِ اَلْأَسْوَدِ ‏- رضى الله عنه ‏- { أَنَّهُ صَلَّى مَعَ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-صَلَاةَ اَلصُّبْحِ, فَلَمَّا صَلَّى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا هُوَ بِرَجُلَيْنِ لَمْ يُصَلِّيَا, فَدَعَا بِهِمَا, فَجِيءَ بِهِمَا تَرْعَدُ فَرَائِصُهُمَا, فَقَالَ لَهُمَا: "مَا مَنَعَكُمَا أَنْ تُصَلِّيَا مَعَنَا?" قَالَا: قَدْ صَلَّيْنَا فِي رِحَالِنَا.‏ قَالَ: "فَلَا تَفْعَلَا, إِذَا صَلَّيْتُمَا فِي رِحَالِكُمَا, ثُمَّ أَدْرَكْتُمَا اَلْإِمَامَ وَلَمْ يُصَلِّ, فَصَلِّيَا مَعَهُ, فَإِنَّهَا لَكُمَا نَافِلَةٌ" } رَوَاهُ أَحْمَدُ, وَاللَّفْظُ لَهُ, وَالثَّلَاثَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ حِبَّان َ.

హజ్రత్ యజీద్ బిన్ అస్వద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఆయన దైవప్రవక్త ﷺతో కలిసి ఫజ్ర్ నమాజ్ చేశారు. దైవప్రవక్త ﷺ దృష్టి నమాజ్‌ను ముగించిన పిదప ఇద్దరు వ్యక్తులపై పడింది. వాళ్ళిద్దరూ (ఆయన -స-తో కలిసి) నమాజ్ చేయలేదు. ఆయన ﷺ వారిద్దరినీ తన దగ్గరకు పిలిచారు. వారిరువురూ ఆయన ﷺ సమక్షంలో హాజరు పరచబడ్డారు. (భయంతో) వాళ్ళ శరీరాలు ఒణుకుతున్నాయి. “మీరు మా వెంట నమాజ్ చేయకుండా ఏ వస్తువు అడ్డుకుందో చెప్పండి” అని ఆయన ﷺ దర్యాప్తుచేయగా ‘మేము మా ఇండ్లలోనే నమాజ్ చేశాము’ అని ఇద్దరూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. “అలా చేయకండి. ఒకవేళ మీరు మీ ఇండ్లలో నమాజ్ చేసినప్పటికీ, ఇమామ్‌ను గనక మీరు పొందితే, ఇమామ్ కూడా అప్పటి వరకూ నమాజ్ చేయకుండా ఉంటే అతనితో కలిసి (సామూహిక) నమాజ్ చేయండి. ఇది మీ కొరకు నఫిల్ (అదనం) అవుతుంది” అని ఆయన ﷺ ఉపదేశించారు. (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు కూడా ఇందులోనివే. మరో ముగ్గురు (తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ) కూడా దీనిని పొందుపర్చారు. తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్‌లు దీనిని ప్రామాణికమైన హదీసుగా నిర్ధారించారు).

English

Narrated Yazid bin al-Aswad (RA): He offered the morning prayer with Allah's Messenger (ﷺ) and when Allah's Messenger (ﷺ) finished his prayer, he saw two men who had not prayed with him. He ordered them to be brought and they were brought trembling with fear. He asked them what had prevented you from praying with us?" They said, "We had already prayed at our homes." He said, "Don't do so! If you pray at your homes and then you come while the Imam has not yet performed the prayer, you must pray with him, and it will be a voluntary prayer for you." [Reported by Ahmad – with his wording – and ath-Thalathah. at-Tirmidhi and Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

ఈ హదీసు ద్వారా బోధపడిందేమిటంటే ఎవరయినా అంతకుముందే నమాజ్ చేసి వుండగా జమాఅత్ లభిస్తే అది ఏ నమాజు అయినాసరే అతను జమాఅత్‌లో కలిసిపోవాలి – ఇమామ్ షాఫయి గారి అభిప్రాయం కూడా ఇదే. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) మాత్రం, జుహ్ర్ మరియు ఇషా నమాజులయితేనే అలా చేయవచ్చునని అన్నారు. ఫజ్ర్ నమాజ్‌ను మాత్రం తిరిగి ఎందుకు చేయకూడదు? హదీసులో అసలు చెప్పబడింది ఫజ్ర్ సమయంలోనే కదా! అన్న సందేహం రావచ్చు, అందుచేత ఈ విషయంలో ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృక్పథం స్పష్టమైనది, అనుసరణీయమైనది.

హదీసు ఉల్లేఖకులు

అసలు పేరు యజీద్ బిన్ అస్వద్ (రదియల్లాహు అన్హు). మారుపేరు అబూ జాబిర్ సవాయి ఆమిరీ. ఖురైషులతో ఈయన తెగకు మైత్రీ సంబంధాలుండేవి. సుప్రసిద్ధ సహాబీ ఈయన. తాయఫ్‌లో స్థిరపడ్డారు. ఈయనచేత ఈ ఒక్క హదీసు మాత్రమే ఉల్లేఖించబడింది. ఈయన కుమారుడు జాబిర్ (రహిమహుల్లాహ్) ఈయన నుండి హదీసును విని అందజేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 319

320

హదీసు 320

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّمَا جُعِلَ اَلْإِمَامُ لِيُؤْتَمَّ بِهِ, فَإِذَا كَبَّرَ فَكَبِّرُوا, وَلَا تُكَبِّرُوا حَتَّى يُكَبِّرَ, وَإِذَا رَكَعَ فَارْكَعُوا, وَلَا تَرْكَعُوا حَتَّى يَرْكَعَ, وَإِذَا قَالَ سَمِعَ اَللَّهُ لِمَنْ حَمِدَهُ, فَقُولُوا: اَللَّهُمَّ رَبَّنَا لَكَ اَلْحَمْدُ, وَإِذَا سَجَدَ فَاسْجُدُوا, وَلَا تَسْجُدُوا حَتَّى يَسْجُدَ, وَإِذَا صَلَّى قَائِمًا فَصَلُّوا قِيَامًا, وَإِذَا صَلَّى قَاعِدًا فَصَلُّوا قُعُودًا أَجْمَعِينَ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَهَذَا لَفْظُه ُ. وَأَصْلُهُ فِي اَلصَّحِيحَيْن ِ.

దైవ ప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు: “ఇమామ్‌ను అనుసరించాలన్న ఉద్దేశ్యంతోనే అతన్ని నియమించటం జరిగింది. కనుక అతను అల్లాహు అక్బర్ అని అంటే మీరు కూడా అల్లాహు అక్బర్ అనండి. ఇమామ్ అల్లాహు అక్బర్ అని పలికే వరకూ మీరు అల్లాహు అక్బర్ అని పలకకండి. అతను రుకూ చేస్తే మీరు కూడా రుకూ చేయండి. ఇమామ్ రుకూ చేసే వరకూ మీరు రుకూ చేయకండి. ఇమామ్ ‘సమి అల్లాహు లిమన్ హమిదహ్’ అని అంటే, మీరు ‘అల్లాహుమ్మ రబ్బనాలకల్ హమ్ద్’ అని అనండి. అతను సజ్దా చేస్తే మీరు కూడా సజ్దా చేయండి. అతను సజ్దా చేసే వరకూ మీరు సజ్దా చేయకూడదు. మరి ఇమామ్ నిలబడి నమాజ్ చేయసాగితే మీరు కూడా నిలబడి నమాజ్ చేయండి. అతను కూర్చుని నమాజ్ చేస్తే మీరు కూడా కూర్చుని నమాజ్ చేయండి.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు అబూదావూద్‌లోనివే. దీని మూలం మాత్రం సహీహైన్ (బుఖారీ, ముస్లిం)లో ఉంది)

English

Narrated Abu Hurairah (RA) : Allah's Messenger (ﷺ) said: "The Imam has been appointed to be followed (in the congregational prayers). So, when he utters the Takbir, utter the Takbir too, and do not utter the Takbir until he utters it. When he bows, you should bow, and do not bow until he bows. When he says, "Allah listens to him who praises him," say, "O Allah, our Rabb, to you is the praise." When he prostrates, you prostrate; and do not prostrate until he prostrates. If he prays standing, pray standing, and if he prays sitting, all of you pray sitting." [Reported by Abu Dawud and the wording is his].

And its basic meaning is in the Sahihain (of al-Bukhari and Muslim)].

సారాంశం

ముఖ్తదీలు (వెనుకనున్నవారు) తమ ఇమామ్‌ను అనుసరించటం అవశ్యమని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. వారు ఏ విషయంలోనూ ఇమామ్ కన్నా ముందంజ వేయరాదు. తక్బీరె తహ్రీమా మొదలుకుని సలాం చేసేవరకూ ఇమామ్ కన్నా కొంచెం వెనుక ఉండాలి. ఇమామ్ చేసినట్లే చేయాలి. అనుసరణ అంటే ఇదే. దైవప్రవక్త ﷺ సజ్దాలో తలను నేలకు ఆన్చినపుడు, తాము సజ్దాకై వంగేవారమని సహాబీలు తెలిపారు. ఇమామ్ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అని అన్నప్పుడు ముఖ్తదీలు ‘రబ్బనా లకల్ హమ్ద్’ అనాలి. ఇమామ్ అబూహనీఫా అభిప్రాయం ఇదే. అయితే ఇమామ్ అబూహనీఫా గారి ప్రియశిష్యులిరువురూ, అహ్లె హదీసు వారు, ఇమామ్ షాఫయిగారేమంటారంటే; ముఖ్తదీలు కూడా ‘సమిఅల్లాహ్’ పలికి, ఆపైన రబ్బనా లకల్ హమ్ద్ అని చెప్పాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 320

321

హదీసు 321

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-رَأَى فِي أَصْحَابِهِ تَأَخُّرًا.‏ فَقَالَ: "تَقَدَّمُوا فَائْتَمُّوا بِي, وَلْيَأْتَمَّ بِكُمْ مَنْ بَعْدَكُمْ" } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ తన సహచరులను వెనుక జరిగి ఉండటం గమనించి “ముందుకు జరగండి. నన్ను అనుసరించండి. మీకు వెనుకనున్న వారు మిమ్ముల్ని అనుసరించాలి” అని ఉద్బోధించారు. (ముస్లిం)

English

Narrated Abu Sa'id al-Khudri (RA): When Allah's Messenger (ﷺ) saw a tendency among his Companions of going to the back he said, "Come forward and follow my lead and let those behind you follow you." [Reported by Muslim].

సారాంశం

సామూహిక నమాజ్‌లో తొలి వరుస (పంక్తి) కు ఎంత ప్రాముఖ్యం ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. మొదటి వరుసలో నిలబడివున్నవారు ఇమామ్‌ను ఖచ్చితంగా అనుసరించాలి. ఇందుకోసం వారు ఇమామ్‌ను క్రీగంట చూసినా తప్పులేదు. వెనుక పంక్తుల్లోనున్నవారు తమ ముందు పంక్తుల్లో నిలబడినవారిని అనుసరించాలి. దీన్నిబట్టి స్పష్టమయ్యేదేమిటంటే ఇమామ్‌ను నేరుగా చూడలేనివారు, ఇమామ్ పలుకులను వినలేనివారు తమ ముందు వరుసల్లోని నమాజీల కదలికలను అనుసరించవచ్చు. ఈ హదీసు ద్వారా లభించే ఇంకొక సూచన ఏమిటంటే; తమ వద్ద ధర్మజ్ఞానం లేనివారు విద్వాంసులను అడిగి తెలుసుకోవాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 321

322

హదీసు 322

وَعَنْ زَيْدِ بْنِ ثَابِتٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { اِحْتَجَرَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-حُجْرَةً مُخَصَّفَةً, فَصَلَّى فِيهَا, فَتَتَبَّعَ إِلَيْهِ رِجَالٌ, وَجَاءُوا يُصَلُّونَ بِصَلَاتِهِ.‏.‏.‏ } اَلْحَدِيثَ, وَفِيهِ: { أَفْضَلُ صَلَاةِ اَلْمَرْءِ فِي بَيْتِهِ إِلَّا اَلْمَكْتُوبَةَ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ గడ్డిపోచతో తయారు చేయబడిన చాపతో ఒక చిన్న (పందిరిలాంటి) కుటీరాన్ని వేసి అందులో నమాజ్ చేయసాగారు. ఈ సంగతి తెలుసుకుని ప్రజలు కూడా వచ్చి ఆయనతో కలిసి నమాజ్ చేయసాగారు. ‘(ఫర్జ్ నమాజ్ తప్ప ఇతర నమాజులను) పురుషుడు తన ఇంట్లో చేయటం ఉత్తమం’ అని కూడా ఈ హదీసులో ఉంది. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Zaid bin Thabit (RA): Allah's (ﷺ) made a small room of a mat (i.e. he used it to designate a space for prayer) and prayed inside it. The people followed him, and they came to pray behind him. The narrator mentioned the rest of the Hadith, and it contains the words: "The most excellent prayer of a person is (that which he prays) in his house except that which is prescribed (the five congregational prayers)." [Agreed upon].

సారాంశం

రమజాన్ నెలలో జరిగిన సంఘటన ఇది. మస్జిద్‌లో ఒక మూల ఆయన ﷺ ప్రత్యేకంగా ఈ పందిరి వేసుకున్నారు. మస్జిద్‌లో ఇతర నమాజీలకు అసౌకర్యం కలగని పక్షంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చునని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రత్యేక స్థానాన్ని కేటాయించుకుని నమాజ్ చేస్తున్నారని తెలుసుకున్న ప్రజలు – ఒక్కొక్కరుగా వచ్చి ఆయన వెంట నమాజ్ చేయటం మొదలెట్టారు. దైవప్రవక్త ﷺ ఒక రోజు రాత్రి ఆలస్యంగా ఆ పందిరి నుండి బయటికి వచ్చి, “నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. మీ ఇండ్లలో నమాజ్ చేయండి. ఎందుకంటే ఫర్జ్ నమాజ్ తప్ప మిగిలిన నమాజులను పురుషులు ఇంట్లో చేయటం ఉత్తమం” అని ఉద్బోధించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 322

323

హదీసు 323

وَعَنْ جَابِرٍ قَالَ: { صَلَّى مُعَاذٌ بِأَصْحَابِهِ اَلْعِشَاءَ, فَطَوَّلَ عَلَيْهِمْ, فَقَالَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏- "أَتُرِيدُ أَنْ تَكُونَ يَا مُعَاذُ فَتَّانًا? إِذَا أَمَمْتَ اَلنَّاسَ فَاقْرَأْ: بِالشَّمْسِ وَضُحَاهَا, وَ: سَبِّحْ اِسْمَ رَبِّكَ اَلْأَعْلَى, وَ: اِقْرَأْ بِاسْمِ رَبِّكَ, وَاللَّيْلِ إِذَا يَغْشَى".‏ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ..

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) తన ముఖ్తదీలకు ఇషా నమాజ్ చేయించారు. ఆ సందర్భంగా ఆయన సుదీర్ఘ పారాయణం చేశారు. దీనిపై దైవప్రవక్త ﷺ, “ఓ ముఆజ్! నమాజీలకు పరీక్ష పెడుతున్నావా? నీవు ప్రజలకు ఇమామత్ చేస్తే వష్షమ్సి వజుహాహా, సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా సూరాలు, ఇంకా ఇఖ్రా బిస్మి, వల్లైలి ఇజా యఘ్‌షా వంటి సూరాలు చదవాలి” అని ఉద్బోధించారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)

English

Narrated Jabir (RA): Mu'adh bin Jabal (RA) led his companions in the al-'Isha (night prayer) and prolonged it for them. Upon this the Prophet (ﷺ) said to him, "O Mu'adh, do you want to become a Fattan? When you lead people in prayers, recite ash-Shamsi wa duhaha (Surat 91), Sabbihisma Rabbikal-A'la (Surat 87), Iqra' Bismi Rabbika (Surat 96) and Wal-Laili idha yaghsha (Surat 92)." [Agreed upon. And the wording is from Muslim].

సారాంశం

ప్రజలకు నమాజ్ పట్ల విసుగుపుట్టేలా, సామూహిక నమాజ్ అంటే వారికి భయం కలిగేలా సుదీర్ఘమయిన సూరాలు ఇమామ్ పఠించరాదని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. అయితే ఖుర్ఆన్ పారాయణంలోని ముఖ్యోద్దేశమే మరుగున పడిపోయేవిధంగా మరీ అంత సంక్షిప్తంగా కూడా చేయరాదు. రెండు అతివాదాలకు మధ్య మధ్యేమార్గాన్ని అవలంబించటం శ్రేయస్కరం. దైవప్రవక్త ﷺ విధానం కూడా ఇదే. వెనుకనున్న నమాజీల ఓపికనుబట్టి సుదీర్ఘ పారాయణం కూడా చేయవచ్చు. ఇక హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)గారి ఇమామత్ సంఘటన బుఖారీలో ఈ విధంగా ఉంది –

ఒకరోజు రాత్రి హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) గారు ఇషా నమాజ్ చేయిస్తూ, మామూలు కంటే సుదీర్ఘమయిన పారాయణం చేశారు. ఒక ప్రయాణీకుడు అదే రోజు తన రెండు ఒంటెలను బయట వదలి వచ్చి, సామూహిక నమాజులో పాల్గొన్నాడు. నమాజు మరీ సుదీర్ఘంగా ఉండటంతో అతను జమాఅత్‌ను పరిత్యజించి, ప్రక్కకు వెళ్ళి ఒంటరిగా నమాజ్‌చేసి, తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ సంగతి ముఆజ్ (రదియల్లాహు అన్హు)కు తెలియగా, ‘అతడు మునాఫిఖ్ (కపటి)’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తి దైవప్రవక్త ﷺ సమక్షానికి వచ్చి, హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) గురించి ఫిర్యాదు చేశాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ ముఆజ్ (రదియల్లాహు అన్హు)ను పిలిపించి పై హదీసులోని విధంగా హితబోధ చేశారు. ‘పరీక్ష పెడుతున్నావా?’ అంటే భావం – నమాజులో వృద్ధులు, బలహీనులు, అగత్యపరులు, అలసిపోయినవారు రకరకాల జనులుంటారు. ఇమామ్ అయినవాడు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. అందరి పరిస్థితినీ అర్థం చేసుకుని మసలుకోవాలి. లేకుంటే ప్రజలకు సామూహిక నమాజ్ పట్ల వెగటు కలిగి వారు ఏకాంతంలో నమాజ్ చేసుకోవటం మొదలెడతారు. తత్ఫలితంగా ముస్లింల సామూహిక వ్యవస్థ కుంటుపడుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 323

324

హదీసు 324

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا فِي قِصَّةِ صَلَاةِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-بِالنَّاسِ, وَهُوَ مَرِيضٌ ‏- قَالَتْ: { فَجَاءَ حَتَّى جَلَسَ عَنْ يَسَارِ أَبِي بَكْرٍ, فَكَانَ يُصَلِّي بِالنَّاسِ جَالِسًا وَأَبُو بَكْرٍ قَائِمًا, يَقْتَدِي أَبُو بَكْرٍ بِصَلَاةِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-وَيَقْتَدِي اَلنَّاسُ بِصَلَاةِ أَبِي بَكْرٍ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ వ్యాధిగ్రస్తులై వుండి నమాజ్ చేయించిన వైనాన్ని ఇలా తెలిపారు – ఆయన ﷺ వచ్చి హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) కు ఎడమ ప్రక్కన కూర్చున్నారు. ఆయన ﷺ కూర్చునే నమాజ్ చేయిస్తుండగా హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) నిలబడి వున్నారు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺను అనుసరిస్తుండగా, ప్రజలు అబూబకర్ (రదియల్లాహు అన్హు)ను అనుసరించసాగారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Aishah (RA) regarding Allah's Messenger (ﷺ) leading the people in Salat (prayer) during his illness. She said, "He came and sat on the left side of Abu Bakr (RA). So he (ﷺ) was leading the people in prayer while sitting and Abu Bakr standing. Abu Bakr was following the prayer of the Prophet (ﷺ), and the people were following the prayer of Abu Bakr." [Agreed upon].

సారాంశం

దైవప్రవక్త ﷺ మరణ వ్యాధికి గురైవున్నప్పటి సంఘటన ఇది. ఆయన ﷺ రోగగ్రస్తులయ్యారు. జ్వరం తీవ్రతరమయింది. ఈ సందర్భంగా ఆయన ﷺ ఆదేశానుసారమే హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) సామూహిక నమాజ్‌కు సారథ్యం వహించేవారు. ఒకరోజు ఆరోగ్యం కాసింత కుదుటపడగా ఆయన ﷺ ఇద్దరు మనుషుల సహాయంతో మస్జిద్‌కు వచ్చారు. ఆ సమయంలో అబూబకర్ (రదియల్లాహు అన్హు) నమాజ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ﷺ అబూబకర్‌కు ఎడమ ప్రక్కన కూర్చుని నమాజ్ చేయించటం మొదలెట్టారు. ఆయన ﷺ ఇమామత్ చేయసాగారు. అందుకే ఎడమప్రక్కన కూర్చున్నారు. ఆ క్షణం నుంచీ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ‘ముఖ్తదీ’గా మారిపోయారు. ఎందుకంటే ఆయన (రదియల్లాహు అన్హు) కుడిప్రక్కన నిలుచుని వున్నారు. వ్యాధి మూలంగా దైవప్రవక్త ﷺ బాగా నీరసించిపోయారు. ఆయన ﷺ నోట వెలువడే తక్బీర్ అందరికీ వినబడలేదు. అందుచేత హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ‘ముకబ్బిర్’గా మారి హెచ్చు స్వరంతో తక్బీర్లు పలకసాగారు. ప్రజలు అబూబక్ర్‌ను అనుసరించి నమాజ్‌ను నెరవేర్చారు. ఈ హదీసు ఆధారంగా షాఫయీలు ఒక గమనార్హమైన విషయాన్ని ప్రతిపాదించారు. అదేమంటే తమకన్నా శ్రేష్ఠుడైన వ్యక్తి మస్జిదుకు వచ్చినపుడు ఇమామ్ తన స్థానాన్ని ఖాళీచేసి, ఆ వ్యక్తికి ఇమామత్ చేసే అవకాశం కల్పించాలి. అయితే ఈ వ్యవహారం ఒక్క దైవప్రవక్త ﷺ కే ప్రత్యేకం అని ఇబ్నె అబ్దుల్ బిర్ వ్యాఖ్యానించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 324

325

హదీసు 325

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا أَمَّ أَحَدُكُمْ اَلنَّاسَ فَلْيُخَفِّفْ, فَإِنَّ فِيهِمْ اَلصَّغِيرَ وَالْكَبِيرَ وَالضَّعِيفَ وَذَا اَلْحَاجَةِ, فَإِذَا صَلَّى وَحْدَهُ فَلْيُصَلِّ كَيْفَ شَاءَ } مُتَّفَقٌ عَلَيْه ِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరయినా ప్రజలకు ఇమామత్ చేసినపుడు వారు ఖిరాత్‌ను తగ్గించాలి. ఎందుకంటే ముఖ్తదీలలో (వెనుకనున్న వారిలో)పిల్లలు, వృద్ధులు, బలహీనులు, అగత్యపరులు ఉంటారు. అయితే మీరు ఒంటరిగా నమాజ్ చేస్తున్నప్పుడు మీరు కోరినవిధంగా చేసుకోవచ్చు.” (ముత్తఫకున్ అలైహి)

English

Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "When one of you leads the people in prayer he should be brief, for among them are the young and the old, the weak and those who have needs to attend to. But if he prays by himself he may pray as he wishes." [Agreed upon].

సారాంశం

దీన్నిబట్టి తెలిసేదేమంటే ఒక వ్యక్తి సారథ్య బాధ్యతల్ని నెరవేరుస్తున్నప్పుడు పెద్దపెద్ద సూరాలు పఠించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదు. ఎందుకంటే వెనుక నమాజ్ చేసే వారిలో రకరకాల వారుంటారు. అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇమామ్ తదనుగుణంగా వ్యవహరించాలి. అయితే ఒకవ్యక్తి ఒంటరిగా నమాజ్ చేస్తున్నప్పుడు అతని పరిస్థితి అతనికి బాగా తెలుసు గనక, అతనెంత సుదీర్ఘ పారాయణం చేసుకున్నా ఫరవాలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మరువరాదు. తాను ఒంటరిగా నమాజ్ చేస్తున్నాను కదా అని చెప్పి, తన ఆరోగ్య స్థితిని, దైనందిన జీవితావసరాలను కూడా లెక్క చేయకుండా పొద్దస్తమానం దైవధ్యానంలో గడపటం కూడా విపరీతమే. ఎందుకంటే అతని శరీరావయవాలకు కూడా అతనిపై హక్కుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 325

326

హదీసు 326

وَعَنْ عَمْرِو بْنِ سَلَمَةَ قَالَ: قَالَ أَبِي: { جِئْتُكُمْ مِنْ عِنْدِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-حَقًّا.‏ قَالَ: "فَإِذَا حَضَرَتْ اَلصَّلَاةُ فَلْيُؤَذِّنْ أَحَدُكُمْ, وَلْيَؤُمَّكُمْ أَكْثَرُكُمْ قُرْآنًا", قَالَ: فَنَظَرُوا فَلَمْ يَكُنْ أَحَدٌ أَكْثَرَ قُرْآنًا مِنِّي, فَقَدَّمُونِي, وَأَنَا اِبْنُ سِتٍّ أَوْ سَبْعِ سِنِينَ } رَوَاهُ اَلْبُخَارِيُّ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيّ ُ.

హజ్రత్ అమ్ర్ బిన్ సలమ (రదియల్లాహు అన్హు) కథనం : మా నాన్నగారు తన జాతి వారినుద్దేశ్యించి, నేను మీ వద్దకు దైవప్రవక్త ﷺ తరఫున సత్యం తీసుకువచ్చాను. ఆయన ﷺ ఏమని ఉపదేశించారంటే, “నమాజ్ వేళ అవగానే మీలో ఒకరు అజాన్ పిలుపు ఇవ్వాలి మరియు మీలో దివ్య ఖుర్ఆన్ అవగాహన అత్యధికంగా ఉన్నవారు నమాజ్‌కు నాయకత్వం వహించాలి.” (నేను తప్ప ఖుర్ఆన్ పారంగతుడు వారిలో ఎవరూ లేకపోవటం గమనించి నా జాతి వారు నన్నే ఇమామత్ కొరకు ముందుకు పంపారు. అప్పుడు నా వయస్సు ఆరు లేక ఏడేళ్ళు అంతే) అని అమ్ర్ అన్నారు. (బుఖారీ, అబూదావూద్, నసాయి)

English

Narrated 'Amr bin Salimah (RA): My father said, "I have come from the true Prophet (ﷺ), so when the time of Salat (prayer) comes one of you should announce the Adhan and the one of you who knows the Qur'an most should be your Imam." He ('Amr) said: "They looked around and there was no one who knew the Qur'an more than I. So they put me forward in front of them and I was only six or seven years old." [Reported by al-Bukhari, Abu Dawud and an-Nasa'i].

సారాంశం

ఈ హదీసు ఇమామ్ నియామకం గురించి ఒక సూత్రాన్ని నిర్ధారించింది. ఎవరికి ఖుర్ఆన్ జ్ఞానం అధికంగా వుందో వారే ఇమామ్‌గా ఎంపిక కావాలి. అమ్ర్ (రదియల్లాహు అన్హు)ను ఆయన జాతి ప్రజలు దీని ఆధారంగానే ఇమామత్ బాధ్యతను అప్పగించారు. ఇమామత్ హోదా ముఅజ్జిన్ హోదా కన్నా ఉన్నత మైనది. ముఅజ్జిన్ కొరకు కనీసమయిన షరతులు విధించబడలేదు. మంచి కంఠం గలవాడు, హెచ్చు స్వరంతో అజాన్ ఇవ్వగలవాడై ఉంటే చాలు – ముఅజ్జిన్‌గా నియమించవచ్చు. కాని ఇమామ్ కావటానికి ధర్మజ్ఞానం, ధర్మావగాహన అవసరం.

హజ్రత్ అమ్ర్ బిన్ సలమ (రదియల్లాహు అన్హు) ఏడేళ్ళ పిన్న వయస్కులైనప్పటికీ ఆయన జాతి వారు ఆయనకు ఇమామత్‌ను కట్టబెట్టడానికి కారణం – ఆయనకు ఇతరులకన్నా ఎక్కువగా ఖుర్ఆన్ కంఠస్థం అయి ఉండటమే. హసన్ బస్రీ, ఇమామ్ షాఫయి, ఇమామ్ రాహ్వే, అహ్లె హదీసు వారు – వీరంతా యుక్త వయస్కులు కాని అబ్బాయి వెనుక పెద్దవారు కూడా నమాజ్ చేయవచ్చుని భావిస్తున్నారు. అయితే ఇమామ్ మాలిక్, ఇమామ్ సౌరి తదితరులు దీన్ని మక్రూహ్ (అయిష్టకరం)గా భావిస్తున్నారు. ఇమామత్ చేసేవ్యక్తి పిన్న వయస్కుడై (నా బాలిగ్) ఉంటే అతని వెనుక నఫిల్ నమాజులు చేయ వచ్చుగాని ఫర్జ్ నమాజు చేయటం ధర్మసమ్మతం కాదని ఇమామ్ అబూహనీఫా, ఇమామ్ అహ్మద్‌లు చెబుతున్నారు. అమ్ర్ బిన్ సలమ (రదియల్లాహు అన్హు)ను ఇమామ్‌గా నియమించిన వారు దైవప్రవక్త ﷺ ఆదేశాన్ని పురస్కరించుకుని నియమించటంగానీ లేదా దైవప్రవక్త ﷺను సంప్రతించి నియమించటం గానీ చేయలేదన్నది వీరి వాదన. ఈ వాదనలో అంతగా బలంలేదు. ఎందుకంటే ఒకవేళ ఆ నియామకం ధర్మవిరుద్ధమై వుంటే ఆ సంగతి వహీ ద్వారా దైవప్రవక్త ﷺ కు తెలిసి వుండేది. దైవప్రవక్త ﷺ భవిష్యత్తులో అలా జరక్కుండా ఆదేశాలు జారీ చేసేవారు. కాని అలా జరగలేదు. ఇది ఇస్లాం ధర్మం యొక్క అత్యంత ముఖ్యమైన ఆరాధన – నమాజ్ – తో ముడిపడి ఉండటం వల్ల అది గనక అధర్మమై ఉంటే దైవప్రవక్త ﷺ తన జీవితకాలంలోనే దానిని నిషేధించేవారు. కాని అలాంటి ఉత్తర్వులు ఏమీ ఆయన తరఫున జారీ కాలేదు. కనుక తేలిందేమంటే ధర్మజ్ఞానం ఆధారంగా పిన్న వయస్కులను కూడా – అవసరం మేరకు – ఇమామ్‌గా ఎన్నుకోవచ్చు.

హదీసు ఉల్లేఖకులు

అసలు పేరు అమ్ర్ బిన్ సలమ (రదియల్లాహు అన్హు). ‘జురుమ్’ తెగకు చెందిన వారవటం చేత జురుమీగా వ్యవహరించబడ్డారు. అబూ యజీద్ లేక అబూ బరీద్ ఈయన మారుపేరు. తన తండ్రి గారితో కలిసి దైవప్రవక్త ﷺ సన్నిధిలో హాజరయ్యారు. అప్పటికి ఆయన వయస్సు ఆరేడు సంవత్సరాలు. వేరొక ఉల్లేఖనం ప్రకారం ఈయన దైవప్రవక్త ﷺ దగ్గరకు రాలేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 326

327

హదీసు 327

وَعَنْ أَبِي مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ يَؤُمُّ اَلْقَوْمَ أَقْرَؤُهُمْ لِكِتَابِ اَللَّهِ, فَإِنْ كَانُوا فِي اَلْقِرَاءَةِ سَوَاءً فَأَعْلَمُهُمْ بِالسُّنَّةِ, فَإِنْ كَانُوا فِي اَلسُّنَّةِ سَوَاءً فَأَقْدَمُهُمْ هِجْرَةً, فَإِنْ كَانُوا فِي اَلْهِجْرَةِ سَوَاءً فَأَقْدَمُهُمْ سِلْمًا ‏-وَفِي رِوَايَةٍ: سِنًّا‏- وَلَا يَؤُمَّنَّ اَلرَّجُلُ اَلرَّجُلَ فِي سُلْطَانِهِ, وَلَا يَقْعُدْ فِي بَيْتِهِ عَلَى تَكْرِمَتِهِ إِلَّا بِإِذْنِهِ".‏ } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ ఇబ్నె మస్‌ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – దైవ గ్రంథ జ్ఞానం ఎక్కువగా వున్నవాడు ప్రజలకు ఇమామ్ కావాలి. ఈ అర్హతలో జనులంతా సమానులైవుంటే, దైవప్రవక్త ﷺ ఆచరణా విధానం గురించిన అవగాహన అధికంగా గలవారు ఇమామ్ కావాలి. ఈ విషయంలో కూడా ప్రజలు సమానులుగా ఉంటే, దైవమార్గంలో మొదట హిజ్రత్ చేసినవారు ఇమామ్ కావాలి. ఇక్కడా సమానత్వం కనిపిస్తే అప్పుడు అందరికన్నా ముందు ఇస్లాం స్వీకరించినవారు ఇమామ్ కావాలి. వేరొక ఉల్లేఖనంలో ‘ఇస్లాం’ బదులు ‘వయస్సు’ అన్న పదం ఉంది. అంటే పైన పేర్కొనబడిన గుణగణాలలో, ప్రతిభలో అందరూ సమానులుగా ఉన్నప్పుడు వయస్సులో పెద్దవారైన వారికి ఇమామత్ బాధ్యత అప్పజెప్పాలి. ఎవరూ ఒకరి అధికార ప్రతిపత్తికి లోబడి ఇమామత్ చేయించటంగానీ, ఒకరి ఇంట్లోని ప్రత్యేక స్థలంలో (ఆసనం లేక పడకపై) వారి అనుమతి లేకుండా కూర్చోవటంగానీ చేయరాదు. (ముస్లిం)

English

Narrated Ibn Mas'ud (RA): Allah's Messenger (ﷺ) said: "The one who knows [by recitation and memorization] the Book of Allah most should be the Imam of the people. If they are equal in the recitation, then the one who knows the Sunnah most and if they are equal in the Sunnah then the earliest of them to emigrate (to al-Madinah) and if they are equal in the emigration then the oldest among them in Islam. In another narration it has "agewise". And no man should lead another in prayer in his domain or sit in his place of honor without his permission." [Reported by Muslim].

సారాంశం

దివ్య ఖుర్ఆన్ జ్ఞానం ఎక్కువగా వున్నవారు, దైవప్రవక్త ﷺ సున్నత్‌ను గురించి అధికంగా తెలిసివున్నవారు, దైవధర్మం కోసం వలసవెళ్ళినవారు, త్యాగాలు చేసినవారు, సత్యామృతాన్ని ఆస్వాదించటంలో ముందంజ వేసినవారు, వయస్సులో పెద్దవారు ఇమామత్‌కు అర్హులని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 327

328

హదీసు 328

وَلِابْنِ مَاجَهْ: مِنْ حَدِيثِ جَابِرٍ: { وَلَا تَؤُمَّنَّ اِمْرَأَةٌ رَجُلًا, وَلَا أَعْرَابِيٌّ مُهَاجِرًا, وَلَا فَاجِرٌ مُؤْمِنًا.‏ } وَإِسْنَادُهُ وَاه ٍ.

ఇబ్నె మాజాలో హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు)చే ఇలా ఉల్లేఖించబడింది: “ఏ స్త్రీ ఏ పురుషునికీ ఇమామ్ కారాదు. ఏ పల్లెటూరి బైతు కూడా ఏ ముహాజిర్ వ్యక్తికీ ఇమామత్ చేయరాదు. అలాగే ఏ పాపాత్ముడూ ఒక విశ్వాసికి ఇమామ్ కారాదు.” (ఈ ఉల్లేఖనం అందిన తీరు జయీఫ్ – బలహీనమైనది)

English

Ibn Majah reported the following from Jabir's narration, "A woman is never to lead a man in prayer, neither a bedouin (desert Arab) to lead an emigrant, nor a sinner to lead a believer." [Its chain of narrators is Wahin (extremely weak)].

సారాంశం

ఈ హదీసు అత్యంత బలహీనమైనది. ఇది అందిన పరంపర విశ్వసనీయమైనది కాదు. అందువల్ల దీని ఆధారంగా ధార్మిక అంశాలను పరిశోధించటం సమంజసం కాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 328

329

హదీసు 329

وَعَنْ أَنَسٍ, أَنَّ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { رُصُّوا صُفُوفَكُمْ, وَقَارِبُوا بَيْنَهَا, وَحَاذُوا بِالْأَعْنَاقِ.‏ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ..

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలిపారు – మీ పంక్తులను కట్టుదిట్టం చేసుకోండి : వాటి మధ్య దూరం తగ్గించండి. మీ మెడలను ఒకే తీరులో ఉంచండి.” (దీనిని అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Anas (RA): Allah's Messenger (ﷺ) said: "Stand close together in your rows, bring them (the rows) near one another, and stand neck to neck (in straight lines)." [Reported by Abu Dawud and an-Nasa'i. And Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

ఇస్లాంలో పంక్తుల్ని తీర్చిదిద్దడం గురించి, క్రమశిక్షణ గురించి గట్టిగా తాకీదు చేయబడింది. ఇస్లాం అనుయాయులు చేసే సామూహిక ఆరాధనలో సయితం వరుసలు తీరి నిలబడటానికి, క్రమశిక్షణకు అత్యధిక ప్రాముఖ్యత నివ్వబడింది. యుద్ధరంగంలో క్రమశిక్షణతో వరుసలు తీరి నిలవటానికి గల ప్రాముఖ్యతను గురించి వేరుగా చెప్పనవసరం లేదు. వరుసల్లో లోపం ఏర్పడితే, పరస్పర వ్యవహారాల్లో కూడా సమన్వయం దెబ్బతింటుంది. సంఘీభావం సన్నగిల్లుతుంది. నమాజ్ ద్వారా ఇస్లాం తన అనుయాయుల మధ్య ప్రేమానురాగాలను సృజించగోర్తుంది. వారిమధ్య గల అరమరికలను, అంతరాలను అంతమొందించి హృదయాలు హత్తుకునే ప్రేమైక వాతావరణాన్ని పెంపొందించగోర్తుంది. నిమ్నోన్నతా భేదభావాలను రూపుమాపి సమాజంలోని అన్ని వర్గాల వారిని సమానులుగా – ఒకే పంక్తిలో – నిలబెట్టాలని ఆశిస్తుంది. ఐకమత్యానికీ, సంగఠిత భావానికి ప్రతీకగా వుండవలసిన పంక్తులమధ్య షైతాన్ జొరబడితే జరిగే అనర్థం ఏమిటో తెలియనిది కాదు.

అందుకే దైవప్రవక్త ﷺ వారు సామూహిక నమాజ్ కోసం అందరూ నిలబడినపుడు ఆయన నమాజీల వైపునకు తిరిగి “మీ పంక్తులను సరిదిద్దుకోండి. లేకుంటే అల్లాహ్ మీ మనసుల్లో వక్రతను, వైరుధ్య భావాన్ని నింపుతాడు” (సహీహైన్) అని తాకీదు చేసేవారు. ప్రజలు నమాజ్‌లో తమ భుజాన్ని ఇతరుల భుజంతో కలిపేవారని, తమ అడుగులను ప్రక్కనున్నవారి అడుగులతో కలిపేవారని ఉల్లేఖకులు తెలిపారు. దైవప్రవక్త ﷺ ఒకసారి ఇలా అన్నారు : “నా ప్రాణం ఎవరి అధీనంలో వుందో ఆయన సాక్షిగా చెబుతున్నాను – షైతాన్ పంక్తుల మధ్య తోడేలు పిల్ల రూపంలో జొరబడటాన్ని నేను చూస్తున్నాను” అంటే వాడు నమాజీల మధ్య దుష్ప్రేరణలను రేకెత్తిస్తాడు. దాసుల ఏకాగ్రతను దెబ్బతీస్తాడు. వారి ధ్యాసను దేవుని తరఫునుండి వేరే మార్గాల్లో మళ్ళించజూస్తాడు. అందుకే అందరూ వరుసలు తీరి, తిన్నగా, భుజానికి భుజం ఆనించి మరీ నిలబడాలి. మధ్యలో దూరం వదలకూడదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 329

330

హదీసు 330

?عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ خَيْرُ صُفُوفِ اَلرِّجَالِ أَوَّلُهَا, وَشَرُّهَا آخِرُهَا, وَخَيْرُ صُفُوفِ اَلنِّسَاءِ آخِرُهَا, وَشَرُّهَا أَوَّلُهَا } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “పురుషుల అత్యంత ఉత్తమ వరుస మొదటి వరుస. అత్యంత అధమ వరుస వారి ఆఖరి వరుస. స్త్రీల అత్యంత ఉత్తమ వరుస ఆఖరి వరుస. వారి అత్యంత అధమమైన వరుస మొదటి వరుస.” (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "The best of the men's rows is the first and the worst is the last; and the best of the women's rows is the last and the worst is the first." [Reported by Muslim].

సారాంశం

జమాఅత్‌లో స్త్రీలు, పురుషులు కూడా పాల్గొన్నప్పుడు వారి మధ్య దూరం ఎంత అధికంగా వుంటే అంతే మంచిదని ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. మొదటి వరుసలో నిలబడే పురుషులు సాధారణంగా మస్జిద్‌కు అందరికన్నా ముందువస్తారు. మస్జిద్‌కు త్వరగా రావటం కూడా పుణ్యప్రదమైన విషయం. అదీగాక మొదటి వరుసలో వున్నవారు సాధారణంగా పెద్దవారు, జ్ఞానసంపన్నులు అయివుంటారు. ఇతర నమాజీలకన్నా వారు ఇమామ్‌కు అతి సమీపంలో వుంటారు. అందువల్ల వారు ఇమామ్ గారి తక్బీర్లను, ఖుర్ఆన్ పఠనాన్ని స్పష్టంగా వింటారు. స్త్రీలకు బహుదూరంగా ఉండటంవల్ల షైతాన్ రేకెత్తించే దుష్ప్రేరణల నుండి సురక్షితంగా ఉంటారు.

కాగా; పురుషుల చివరి పంక్తిలో నిలబడివున్న వారు వీటన్నింటికీ దూరంగా వుంటారు. అందుచేత వీరికి పుణ్యం మొదటి పంక్తి వారికన్నా తక్కువ లభిస్తుంది. స్త్రీల ఆఖరి వరుస అన్నింటికన్నా మేలైన వరుస అని అనబడటంలోని అంతర్యం ఏమిటంటే ఆఖరి వరుసలో నిలబడివున్న స్త్రీలు మస్జిద్‌కు ఆలస్యంగా వస్తారు. అందుచేత వారి సంచారం పురుషులు వున్న చోట ఉండదు. మస్జిద్‌లో ఒకే హాలు వుండి స్త్రీ పురుషులు ముందు – వెనుక నిలబడవలసివచ్చినప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్న మవుతుంది. ఒకవేళ స్త్రీలు కూడా ప్రత్యేక హాలులో – వేరుగా కూర్చోవలసి వచ్చినప్పుడు – వారి పంక్తుల్లో కూడా మొదటి పంక్తే ఉత్తమపంక్తిగా పరిగణించబడుతుంది సుమా!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 330

331

హదీసు 331

وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { صَلَّيْتُ مَعَ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-ذَاتَ لَيْلَةٍ, فَقُمْتُ عَنْ يَسَارِهِ, فَأَخَذَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-بِرَأْسِي مِنْ وَرَائِي, فَجَعَلَنِي عَنْ يَمِينِهِ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నేను ఒక రోజు రాత్రి దైవప్రవక్త ﷺ తో కలిసి నమాజ్ చేశాను. నమాజ్‌లో ఆయన ﷺ ఎడమ ప్రక్కన నిలబడ్డాను. దైవప్రవక్త ﷺ వెనుక నుండి నా తల పట్టుకుని తన కుడి ప్రక్కకు నిలబెట్టుకున్నారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Ibn 'Abbas (RA): "I prayed (the night Tahajjud prayer) with Allah's Messenger (ﷺ) one night and I stood on his left side, whereupon he took me by the back of my head and made me go round to his right side. [Agreed upon].

సారాంశం

నమాజ్ చేసేవారు ఇద్దరే వున్నప్పుడు ముఖ్తదీ ఇమామ్‌కు కుడిప్రక్కన నిలబడాలి. ఒకవేళ తెలీక, అవివేకం వల్ల ముఖ్తదీ ఎడమప్రక్కన నిలబడితే ఇమామ్ అతన్ని తన కుడిప్రక్కకు లాక్కోవాలి. ఈ మాత్రం చేష్ట (కదలిక) వల్ల నమాజ్ చెడిపోదు. ఎందుకంటే ఈ చలనం కూడా నమాజ్ కోసమే జరిగింది. ఆ సమయంలో ముఖ్తదీ కూడా ఇమామ్ అంతరంగాన్ని పసిగట్టి శీఘ్రంగా స్పందించాలి. స్థానం మారినంత మాత్రాన నమాజ్‌కు కలిగే అనర్థం ఏమీ ఉండదు – ఎందుకంటే నమాజ్‌ను సంస్కరించే ఉద్దేశ్యంతోనే ఈ బదిలీ జరిగింది. ఈ హదీసు వల్ల తెలిసేదేమంటే ఇద్దరు వ్యక్తులు కూడా సామూహికంగా నమాజ్ చేయవచ్చు. నఫిల్ నమాజు కోసం కూడా జమాఅత్‌గా ఏర్పడవచ్చని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 331

332

హదీసు 332

وَعَنْ أَنَسٍ قَالَ: { صَلَّى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَقُمْتُ أَنَا وَيَتِيمٌ خَلْفَهُ, وَأُمُّ سُلَيْمٍ خَلْفَنَا.‏ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيّ ِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ నమాజ్ చేయించగా నేను మరియు ఒక అనాధ వ్యక్తి – ఇద్దరం ఆయన ﷺ వెనుక నిలబడి నమాజ్ చేశాము. ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా) (ఒక్కతే) మా వెనుక నిలబడి నమాజ్ చేశారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)

English

Narrated Anas (RA): Allah's Messenger (ﷺ) prayed and an orphan and I prayed behind him and Umm Sulaim (RA) was behind us. [Agreed upon and the wording is al-Bukhari's].

సారాంశం

నఫిల్ నమాజు సామూహికంగా చేయవచ్చన్న దానికి ఈ హదీసు ఇంకొక తార్కాణం. సామూహిక నమాజ్‌లో స్త్రీ ఒక్కామే ఉంటే ఆమె ఒక్కతే వేరుగా – వెనుక – పంక్తిలో నిలబడాలనీ, పురుషుల పంక్తిలోకి వచ్చి చేరకూడదని కూడా ఈ హదీసు చెబుతోంది. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నప్పటికీ ఆమె వారి వెనకే నిలబడాలి. అంటే మొదట పురుషులు, వారి వెనుక పిల్లలు, వారి వెనుక స్త్రీల పంక్తి ఉండాలన్నమాట! ఒకవేళ పురుషుడు (పెద్దవాడు) ఒక్కడే ఉంటే చిన్నపిల్లలను తన ప్రక్కన నిలబెట్టుకోవచ్చు.

శుభాలను, మేళ్ళను ఆశించి ఇంట్లో దైవభక్తి పరాయణుల సారథ్యంలో నఫిల్ నమాజులను చేయవచ్చు. ఉమ్మె సులైమ్ ఎవరో కాదు, స్వయంగా హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తల్లిగారే. ఈమెగారే అనస్ (రదియల్లాహు అన్హు)ను దైవప్రవక్త ﷺ సేవకై అంకితం చేశారు. ఈ హదీసు ద్వారా తేటతెల్లమయ్యే మరో విషయం ఏమిటంటే ఒక స్త్రీ తన కన్న కొడుకు ప్రక్కన సయితం నిలబడి – ఒకే పంక్తిలో – నమాజ్ చేయజాలదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 332

333

హదీసు 333

وَعَنْ أَبِي بَكْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّهُ اِنْتَهَى إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-وَهُوَ رَاكِعٌ, فَرَكَعَ قَبْلَ أَنْ يَصِلَ إِلَى اَلصَّفِّ, ثُمَّ مَشَى إِلَى اَلصَّفِّ, وَذَكَرَ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم, فَقَالَ لَهُ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-{ زَادَكَ اَللَّهُ حِرْصًا وَلَا تَعُدْ } رَوَاهُ اَلْبُخَارِيُّ.. وَزَادَ أَبُو دَاوُدَ فِيهِ: { فَرَكَعَ دُونَ اَلصَّفِّ, ثُمَّ مَشَى إِلَى اَلصَّفِّ }.

హజ్రత్ అబూబక్రా (రదియల్లాహు అన్హు) తెలిపారు: దైవప్రవక్త ﷺ రుకూ చేస్తున్న సమయంలో తాను ఆయన ﷺ వద్దకు వెళ్ళారు. వరుసలోకి వెళ్ళి కలవకుండానే ఆయన అక్కడికక్కడే రుకూలోకి వెళ్ళిపోయారు. దైవప్రవక్త ﷺ ఆయననుద్దేశ్యించి “దేవుడు నీ అత్యాశను మరింత వృద్ధి చేయుగాక! కాని ఇక మీదట ఇలా చేయకు” అని ఉపదేశించారు. (బుఖారీ)

“ఆ వ్యక్తి వరుసలోకి వెళ్ళి నిలబడక ముందే రుకూ చేశాడు. రుకూ స్థితిలోనే నడచివెళ్ళి వరుసలో కలసిపోయాడు” అని అబూదావూద్ నకలు చేశారు.

English

Narrated Abu Bakrah (RA): He reached the Prophet (ﷺ) while he was bowing, so he (Abu Bakrah) bowed before reaching the row. He mentioned that to the Prophet (ﷺ) and the Prophet (ﷺ) said to him, "May Allah increase your eagerness! But do not repeat." [Reported by al-Bukhari].

And Abu Dawud added: "He bowed before reaching the row then walked and joined the row."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 333

334

హదీసు 334

وَعَنْ وَابِصَةَ بْنِ مَعْبَدٍ ]اَلْجُهَنِيِّ] ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ رَأَى رَجُلًا يُصَلِّي خَلْفَ اَلصَّفِّ وَحْدَهُ, فَأَمَرَهُ أَنْ يُعِيدَ اَلصَّلَاةَ.‏ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.. وَلَهُ عَنْ طَلْق ٍ { لَا صَلَاةَ لِمُنْفَرِدٍ خَلْفَ اَلصَّفِّ }. +- وَزَادَ اَلطَّبَرَانِيُّ مِنْ حَدِيثِ وَابِصَةَ: { أَلَا دَخَلْتَ مَعَهُمْ أَوْ اِجْتَرَرْتَ رَجُلًا? }.

హజ్రత్ వాబిస బిన్ మాబద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ దృష్టి ఒక వ్యక్తిపై పడింది. అతను వెనుక ఒంటరిగా నిలబడి నమాజ్ చేస్తున్నాడు. నమాజ్‌ను తిరిగి చేయవలసిందిగా ఆయన ﷺ అతనిని ఆజ్ఞాపించారు. (అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’ గా ఖరారు చేయగా, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికంగా నిర్ధారించారు)

అలాగే తల్ఖ్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఉంది – “పంక్తి వెనుక ఒకే వ్యక్తి నమాజ్ చేస్తే అతని నమాజ్ నెరవేరదు.” తిర్మిజీ గారు వాబిస హదీసులో అదనంగా నకలు చేసిన వాక్యాలు ఇలా వున్నాయి – “నీవు వీళ్ళతో ఎందుకు కలసిపోలేదు? లేదా నీవు ఏ నమాజీ నయినా వెనక్కి ఎందుకు లాక్కోలేకపోయావు?”

English

Narrated Wabisah bin Ma'bad: Allah's Messenger (ﷺ) saw a man praying alone behind the row so he ordered him to repeat the Salat (prayer). [Reported by Ahmad, Abu Dawud and at-Tirmidhi. The latter graded it Hasan, and Ibn Hibban graded it Sahih (authentic)].

Ibn Hibban reported this from Talq [bin 'Ali (RA)]: "The prayer of a person who prays alone behind the row is not accepted.

And at-Tabarani added to the narration of Wabisah, "Why did you not join them or pull back a man (to your position)?"

సారాంశం

పంక్తి వెనుక ఒకే వ్యక్తి నిలబడి నమాజ్ చేస్తే అతని నమాజ్ నెరవేరుతుందా? లేదా? ఈ విషయంపై ద్వంద్వాభిప్రాయాలున్నాయి. ఇమామ్ అహ్మద్ మరియు మరి కొంతమంది పండితుల దృష్టిలో ఆ వ్యక్తి నమాజ్ అవదు. ఎందుకంటే అటువంటి వ్యక్తి నుద్దేశ్యించి, మళ్ళీ నమాజ్ చేయవలసిందిగా దైవప్రవక్త ﷺ ఆజ్ఞాపించారు.

మరి కొంతమంది అభిప్రాయంలో అలాంటి వ్యక్తి నమాజ్ అయిపోతుంది. ఇక దైవప్రవక్త ﷺ ఆ వ్యక్తిని తిరిగి నమాజ్ చేయమన్నారంటే అతన్ని దండించే ఉద్దేశ్యంతో అలా చేశారని వీళ్ళంటారు.

ఈ విషయంలో సహీహ్ హదీసుల సారాంశం ఇలా వుంది –

ముందు వరుస పూర్తి కావాలి. ఇక ఆ వరుసలో ఏమాత్రం స్థలం లేనపుడు మిగిలిపోయిన ఒక వ్యక్తి వెనుక ఒంటరిగానే నిలబడవచ్చు. ఎందుకంటారేమో, ముందు వరుసలో మధ్యనుంచి ఒక నమాజీని వెనక్కి పిలుచుకుంటే ఆ వరుసలో వెలితి ఎలాగూ ఏర్పడుతుంది. ఈ వెలితి వాంఛనీయం కాదు. ఈ వెలితిని పూరించడానికి ఆ వరుసలోని నమాజీలంతా కదలవలసి ఉంటుంది. పోనీ వరుసలోని ఏదో ఒక మూల నుంచి ఒక వ్యక్తిని వెనక్కి లాక్కుంటే అట్టి పరిస్థితిలో చాలా దూరం (నమాజ్‌లో) నడవవలసి ఉంటుంది. ఇది కూడా అంతగా శ్రేయస్కరం కాదు. కనుక అతడు ఒంటరిగా వెనుక నిలబడి నమాజ్ చేసుకోవటమే భవ్యం. ఇమాములలో ఇమామ్ మాలిక్, ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ షాఫయీల దృక్పథం కూడా ఇదే. షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియ కూడా ఈ పద్ధతినే ఇష్టపడ్డారు. ముందు వరుసలో నుంచి ఒక వ్యక్తిని వెనక్కి లాక్కోవాలన్న తబ్రానీలోని ఉల్లేఖనం అప్రమాణికమైనది (జయీఫ్).

హదీసు ఉల్లేఖకులు

వాబిస బిన్ మాబద్ (రదియల్లాహు అన్హు). మారుపేరు అబూఖిర్‌సాఫ. అన్సార్‌కు చెందిన తెగ అసద్ బిన్ ఖుజైమాతో ఈయనకు సంబంధం ఉంది. హిజ్రీ 9లో దైవప్రవక్త ﷺ సమక్షంలో ప్రతినిధిగా హాజరయ్యారు. మొదట కూఫాలో స్థిరపడ్డారు. తరువాత హీరా వైపునకు తరలివెళ్ళారు. హిజ్రీ 90లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 334

335

హదీసు 335

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا سَمِعْتُمْ اَلْإِقَامَةَ فَامْشُوا إِلَى اَلصَّلَاةِ, وَعَلَيْكُمْ اَلسَّكِينَةُ وَالْوَقَارُ, وَلَا تُسْرِعُوا, فَمَا أَدْرَكْتُمْ فَصَلُّوا, وَمَا فَاتَكُمْ فَأَتِمُّوا } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيِّ..

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “మీరు నమాజ్‌కై ఇఖామత్‌ను వినగానే నమాజ్ వైపునకు నింపాదిగా, హుందాగా నడచి రండి. హడావిడి చేయకండి. జమాఅత్‌తో ఎంత నమాజ్ లభిస్తే అంత పొందండి. మిగిలిన (రకతుల) నమాజు తర్వాత పూర్తి చేసుకోండి.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)

English

Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "If you hear the Iqamah, you must walk to the prayer (place) with tranquility and dignity, and do not hasten; and whatever portion of the prayer you get (along with the Imam) offer it, and complete afterwards whatever you missed. [Agreed upon, and the wording is al-Bukhari's).

సారాంశం

హదీసు ప్రకారం మనిషి నమాజ్ కోసం ఎప్పుడు మస్జిద్‌కు వచ్చినా గంభీరంగా, ప్రశాంతంగా, సంస్కారం ఉట్టిపడే విధంగా రావాలి. అంతేగానీ ఆందోళన చెందుతున్నట్లుగా, ఆదరాబాదరాగా-హైరానా పడిపోతున్నట్లుగా – నడచి రాకూడదు. నడుస్తున్నప్పుడు చూపుల్ని క్రిందికి దించాలి. ఏదన్నా చెప్పవలసి ఉంటే నెమ్మదిగా చెప్పాలి. ఆ విధంగా నడచివచ్చిన తరువాత, ఇమామ్ ఏ స్థితిలో వుంటే ఆ స్థితిలోనే నమాజ్‌ను మొదలెట్టాలి. మిగిలివున్న నమాజును తరువాత పూర్తి చేసుకోవాలి.

ఇమామ్ రుకూలోకి వెళుతుండగా వచ్చి కలసిన వారి రకత్ నెరవేరుతుందా? (లెక్కలోకి వస్తుందా?) లేదా? అనే విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ రకత్‌ను లెక్కలోకి తీసుకోకపోవటమే సరైనది. ఎందుకంటే రుకూలోకి వెళ్ళకమునుపు ఆ వ్యక్తి ఖియామ్‌లో పాల్గొనలేదు, సూరె ఫాతిహా పఠించలేదు. నమాజ్‌లో ఈ రెండు అంశాలు పాటించటం చాలా ముఖ్యం. కనుక చివరి క్షణాల్లో వచ్చి రుకూలో చేరిపోయిన వ్యక్తికి ఆ రెండు అంశాలు లభించలేదు. మరలాంటప్పుడు అతని నమాజ్ పరిపూర్ణమెలా అవుతుంది?

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 335

336

హదీసు 336

وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ صَلَاةُ اَلرَّجُلِ مَعَ اَلرَّجُلِ أَزْكَى مِنْ صَلَاتِهِ وَحْدَهُ, وَصَلَاتُهُ مَعَ اَلرَّجُلَيْنِ أَزْكَى مِنْ صَلَاتِهِ مَعَ اَلرَّجُلِ, وَمَا كَانَ أَكْثَرَ فَهُوَ أَحَبُّ إِلَى اَللَّهِ عَزَّ وَجَلَّ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : ఒక వ్యక్తి రెండో వ్యక్తితో కలిసి నమాజ్ చేయటం ఒంటరిగా నమాజ్ చేయటం కన్నా ఎంతో పవిత్రమైనది. పుణ్యంతో కూడుకున్నది. ఇద్దరు వ్యక్తులతో కలిసి నమాజ్ చేయడం (మొదటి స్థితికన్నా) మరింత ఎక్కువ పుణ్యప్రదమైనది. అదేవిధంగా ఎంతమంది అధికంగా ఉంటే అంతే అల్లాహ్ దృష్టిలో అది ప్రీతికరమవుతుంది. (దీనిని అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated 'Ubai bin Ka'b (RA): Allah's Messenger (ﷺ) said: "A man's prayer offered with another man is purer than his prayer which he offers alone, and his prayer with two men is purer than his prayer with one and if they are more (in number), it is more beloved to Allah, the Mighty the Majestic." [Reported by Abu Dawud and an-Nasa'i. And Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

సామూహిక నమాజ్ వ్యక్తిగత స్థాయి నమాజ్ కన్నా ఎన్నో రెట్లు మహత్తుతో కూడుకున్నది. అందునా సామూహిక నమాజులో ఎక్కువ మంది ఉంటే అది దేవుని దృష్టిలో మరింత మహత్తును సంతరించుకుంటుంది. అటువంటి భారీ సమూహంలో చేరి నమాజ్ చేయటం వల్ల దాసులకు చేకూరే ఇహపర శుభాలు అపారం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 336

337

హదీసు 337

وَعَنْ أُمِّ وَرَقَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا, { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَمَرَهَا أَنْ تَؤُمَّ أَهْلَ دَارِهَا } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ..

దైవప్రవక్త ﷺ తనకు, తన ఇంటివారలకు నమాజ్ చేయించమని ఆజ్ఞాపించారని హజ్రత్ ఉమ్మె వరఖా (రదియల్లాహు అన్హా) చెప్పారు. (అబూదావూద్ ఉల్లేఖించారు- ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)

English

Narrated Umm Waraqah: The Prophet (ﷺ) commanded her to lead the members of her household (in prayer). [Reported by Abu Dawud; Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

స్త్రీ ఇమామత్ బాధ్యతలను నిర్వర్తించగలదని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. కాని ఎవరికి? స్త్రీ పురుషులిద్దరికీ ఇమామత్ చేయగలదా? కొంతమంది ఇక్కడే పొరబడ్డారు. స్త్రీ స్త్రీలకు మాత్రమే ఇమామ్‌గా ఉండగలదు. పురుషుల నమాజ్‌కు ఆమె ఎట్టి పరిస్థితిలోనూ సారథ్యం వహించజాలదు.

స్త్రీ ఇమామ్‌గా నిలబడి స్త్రీలకు నమాజ్ చేయించేటప్పుడు పురుష ఇమామ్ మాదిరిగా ప్రత్యేకంగా- ఒంటరిగా – నిలబడకూడదు. ఇమామ్ షౌకానీ (రహిమహుల్లాహ్) చెప్పిన దాని ప్రకారం, స్త్రీల మొదటి పంక్తి మధ్యలో నిలబడి ఇమామత్ చేయాలి. హజ్రత్ ఆయిషా సిద్ధీఖా (రదియల్లాహు అన్హా), హజ్రత్ ఉమ్మె సలమ (రదియల్లాహు అన్హా) కూడా ఇలాగే నమాజ్ చేయించేవారు.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును అందజేసిన ఉమ్మె వరఖా (రదియల్లాహు అన్హా) నౌఫిల్ కుమార్తె లేదా అబ్దుల్లాహ్ బిన్ హారిస్ కుమార్తె అయివుంటారు. అన్సార్ వర్గానికి చెందినవారు. ఈమె హృదయంలో దాదాపు ఖుర్ఆన్ అంతా పదిలమై ఉండేది. బద్ర్ యుద్ధంలో పాల్గొనేందుకు ఈమె దైవప్రవక్త ﷺ అనుమతి కోరారు. కాని దైవప్రవక్త ﷺ అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఇంటివద్దనే ఆమెకు అమరగతి లభించనున్నది. ఆమెను పలకరించడానికి దైవప్రవక్త ﷺ స్వయంగా ఆమె ఇంటికి వచ్చేవారు. ఆయన ﷺ ఆమెను వీరవనితగా కొనియాడేవారు. ఆమె వద్ద ఇద్దరు బానిసలు (ఒక స్త్రీ, ఒక పురుషుడు) ఉండేవారు. తాను మరణించిన తక్షణమే వారు స్వతంత్రులవుతారని ఆమె ముందే ప్రకటించారు. కాని ఆ బానిసలిద్దరూ కుట్రపన్ని, ఒకనాడు రాత్రి సమయంలో ఆమెను దుప్పటితో ఉరివేసి రాత్రికి రాత్రే పలాయనం చిత్తగించారు. అయితే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారిద్దరినీ నిర్బంధించి, ఉరిశిక్ష విధించారు. మదీనా మునవ్వరాలో ఉరితీతకు గురైన తొలి దోషులు వీరే. ఉమ్మె వరఖా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ అనుమతితో తన వీధిలోని వారికి ఇమామత్ చేసేవారు. ఎందుకంటే ఈమె మనోఫలకంపై దివ్య ఖుర్ఆన్ ముద్రపడి ఉండేది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 337

338

హదీసు 338

وَعَنْ أَنَسٍ رَضِيَ اَللَّهُ عَنْهُ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-اِسْتَخْلَفَ اِبْنَ أُمِّ مَكْتُومٍ, يَؤُمُّ اَلنَّاسَ, وَهُوَ أَعْمَى } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُد َ. وَنَحْوُهُ لِابْنِ حِبَّانَ: عَنْ عَائِشَة َ رَضِيَ اَللَّهُ عَنْهَا.‏

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ అంధులైన ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌ను తన గైర్హాజరీలో ప్రజలకు ఇమామత్ చేయించే బాధ్యతను అప్పగించారు. (అహ్మద్, అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ కూడా ఇటువంటి హదీసునే హజ్రత్ ఆయిషా – ర.అన్హా – ఆధారంగా ఉటంకించారు)

English

Narrated Anas (RA): The Prophet (ﷺ) appointed Ibn Umm Maktum (RA) to lead the people in prayer in his absence and he [Ibn Umm Maktum (RA)] was blind. [Reported by Ahmad and Abu Dawud].

Ibn Hibban also reported something similar from 'Aishah (RA).

సారాంశం

ఇమామ్ తాను లేని సమయంలో ప్రజలకు నమాజ్ చేయించేందుకు గాను – తన సహాయకుడిని నియమించుకోవచ్చని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతూంది. అంధుడైన వ్యక్తి ఇమామ్‌గా నియమించబడవచ్చని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. దైవప్రవక్త ﷺ నియమించిన అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ (రదియల్లాహు అన్హు) అంధులు. దైవప్రవక్త ﷺ ఈయన్ని 13 సార్లు తన ఉప ఇమామ్‌గా నియమించారు. దైవప్రవక్త ﷺ మదీనా నగరంలో లేని సమయంలో ఈయన సామూహిక నమాజ్‌కు సారథ్యం వహించేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 338

339

హదీసు 339

وَعَنْ اِبْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ صَلُّوا عَلَى مَنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اَللَّهُ, وَصَلُّوا خَلْفَ مَنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اَللَّهُ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ..

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “ఎవరయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని నోటితో పలికాడో అతని అంత్యక్రియల నమాజ్ చేయండి. మరెవరు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అన్నాడో అతని వెనుక నమాజ్ కూడా చేయండి.” (దీనిని దారె ఖుత్నీ ‘బలహీన’ ఆధారంతో ఉల్లేఖించారు)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "Pray (funeral prayers) over him who said (believed): 'Nothing deserves to be worshiped except Allah'; and pray behind him who says: 'Nothing deserves to be worshiped except Allah'." [ad-Daraqutni reported it through a weak chain of narrators].

సారాంశం

దైవధర్మ విధులపట్ల నిర్లక్ష్య వైఖరి కనబరచిన వ్యక్తి చనిపోతే – అతను కలిమాను పఠించిన కారణంగా అతని జనాజా (అంత్యక్రియల) నమాజ్‌ను చేయవచ్చని ఈ హదీసు చెబుతున్నది. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) కూడా దీంతో ఏకీభవించారుగాని దైవధర్మంపై తిరుగుబాటు వైఖరిని ప్రదర్శించిన వ్యక్తి యొక్క జనాజా నమాజ్ మాత్రం చేయరాదని అన్నారు. మొత్తంమీద ఇస్లాం ధర్మం పట్ల పబ్లిగ్గా ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి మరియు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి జనాజా నమాజు చేయ కూడదు. దైవప్రవక్త ﷺ సయితం ఆత్మహత్యకు పాల్పడిన ఒక వ్యక్తి అంత్యక్రియల నమాజులో పాల్గొనలేదు. అయితే “మీరు వెళ్ళి అతని జనాజా నమాజ్ చేయించండి” అని ఆయన ﷺ తన సహచరులను ఆదేశించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 339

340

హదీసు 340

وَعَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا أَتَى أَحَدُكُمْ اَلصَّلَاةَ وَالْإِمَامُ عَلَى حَالٍ, فَلْيَصْنَعْ كَمَا يَصْنَعُ اَلْإِمَامُ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ..

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) వివరించారు : “మీలో ఎవరయినా నమాజ్ చేయడానికి వస్తే, ఇమామ్‌ను ఏ స్థితిలో చూస్తే ఆ స్థితిలోనే మీరు ఇమామ్‌ను అనుసరించండి.” (తిర్మిజీ దీనిని బలహీన ఆధారంతో ఉల్లేఖించారు)

English

Narrated 'Ali bin Abi Talib (RA): Allah's Messenger (ﷺ) said: "If one of you comes to Salat (prayer) and the Imam is at a certain position, he must do as the Imam is doing." [Reported by at-Tirmidhi with a weak chain of narrators].

సారాంశం

అంటే ఇమామ్ రుకూ స్థితిలో వుంటే, అప్పుడే వచ్చిన వ్యక్తి అల్లాహు అక్బర్ అంటూ రుకూలో చేరిపోవాలి. ఇమామ్ సజ్దా స్థితిలో ఉంటే అల్లాహు అక్బర్ అంటూ సజ్దాలోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇమామ్ కూర్చునివుంటే వచ్చినవ్యక్తి అల్లాహు అక్బర్ అంటూ కూర్చోవాలి. తిర్మిజీలోని ఈ హదీసు ‘జయీఫ్’ అయినప్పటికీ ఇతర హదీసుల ద్వారా దీనికి మద్దతు లభిస్తున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.10 సామూహిక నమాజ్ మరియు ఇమామత్|హదీసు 340