హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – అనుబంధం: పారిభాషిక పదాల పదకోశం. హదీసుల్లో, వ్యాఖ్యానంలో వచ్చే అరబీ పదాలకు తెలుగు అర్థాలు – ప్రతి పదం పక్కన దాని అరబీ రూపం (పుస్తకంలో ఉన్నట్టే).
17. పారిభాషిక పదాలు (పదకోశం)
హదీసు మకరందం – 2 · అనుబంధం – 1 · పదకోశం · 563 పదాలు
A
ఆలిమ్ (العالم)
జ్ఞాని, ఇస్లామీయ విద్వాంసుడు, మేధావి.
అబ్ద్ (العبد)
మగ బానిస
ఆద్ (عاد)
నూహ్ (నోవహు) తరువాత నివసించిన ఒక ఆదిమ తెగ. చాలా సంపన్నమైనదే గానీ అల్లాహ్‌కు అవిధేయత చూపిన అల్లరి తెగ. అందుకే అల్లాహ్ ఈ తెగను భయంకరమైన పెను గాలితో సర్వనాశనం చేశాడు.
అద్ దబూర్ (الدبور)
పడమటి గాలి.
అజాన్ (الأذان)
సలాత్ (ప్రార్థన)కు పిలుపు. ప్రార్థనకు సమయం ఆసన్నమయ్యిందని బిగ్గరగా పిలుస్తారు. ఆ పిలుపులోని పలుకులివే: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అష్హదు అల్లా యిలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లా యిలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్, అష్హదు అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్, హయ్యా అలస్సలాహ్, హయ్యా అలస్సలాహ్, హయ్యా అలల్ ఫలాహ్, హయ్యా అలల్ ఫలాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా యిలాహ ఇల్లల్లాహ్. (సహీహ్ బుఖారీ:1వ సంపుటి, 334వ పేజీ చూడండి).
అహ్కామ్ (الأحكام)
ఆజ్ఞలు. ఇస్లామ్ ధర్మశాస్త్రం ప్రకారం అయిదు రకాల ఆజ్ఞలున్నాయి.
1. తప్పనిసరివి(వాజిబ్). 2. అభిలషణీయమైనవి (ముస్తహబ్). 3. నిషిద్ధమైనవి (ముహర్రమ్). 4. నిషిద్ధమైనవి కావుగానీ అయిష్టకరమైనవి (మక్రూహ్). 5 సమ్మతించబడినవి – చట్టబద్ధమైనవి (హలాల్).
ఈనా (العينة)
ఇందులో ఒక రకం ఏమిటంటే – ఎవరైనా కొంత మొత్తం అప్పు అడిగితే, ఆ అప్పు డబ్బుగా ఇవ్వకుండా అంతకంటే ఎక్కువ ఖరీదుకు ఏదైనా వస్తువును అంటగట్టి, తిరిగి అదే వస్తువును అప్పు అడిగిన మొత్తానికి, అంటే తక్కువ ధరకు తిరిగి తీసుకోవటం. అలా అతన్ని ఆ ధర తేడా మొత్తానికి బాకీదారుగా చేస్తున్నాడు. దీని ద్వారా ముస్లిములు పతనమై పోవటానికి రెండు కారణాలు అని తెలుస్తున్నది. ఒకటి ధర్మయుద్ధాన్ని వదిలిపెట్టడం, రెండవది మోసం చెయ్యడం, అక్రమంగా సంపాదించడం.
అయ్యిమ్ (الأيم)
లైంగికానుభవం కలిగిన స్త్రీ. ఆమె విధవరాలు కావచ్చు లేదా విడాకులు పొందిన స్త్రీ అయి ఉండొచ్చు.
అజ్వా (العجوى)
ఒత్తిన మెత్తటి ఖర్జూరాలు లేక ఖర్జూరాలలో ఒక రకం.
అల్ అహ్జాబ్ (الأحزاب)
కుట్రదారులు. ఖురైషులలో అవిశ్వాసులు, మదీనాలో ముస్లిములపై దాడిచేసిన అరబ్బులు, యూదుల గురించి ఈ పదం వాడబడింది. వాళ్ళంతా గత్యంతరం లేక తిరుగు ముఖం పట్టారు.
అల్-అమానహ్ (الأمانة)
అమానతు, నమ్మకం, నైతిక బాధ్యత, నిజాయితీ, అల్లాహ్ విధించిన విధులన్నీ.
అల్-అఖీక్ (العقيق)
మదీనాకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక లోయ.
అల్-అర్బా (الأربعة)
నలుగురు హదీసు సంకలన కర్తలు-అబూదావూద్, నసాయి, తిర్మిజీ, ఇబ్నె మాజహ్.
అల్-అవామిర్ (العوامر)
ఇళ్ళలో నివసించే పాములు.
అల్-బహీరా (البحيرة)
పాలిచ్చే ఆడ ఒంటె. దీని పాలను విగ్రహాలకు, ఇతర బూటకపు దేవతలకు వాడేవారు.
అల్-బైదా (البيداء)
మదీనా నుండి మక్కా వెళ్ళేదారిలో దక్షిణాన ఉన్న ప్రదేశం.
అల్-బైతుల్ మామూర్ (البيت المعمور)
ఏడవ ఆకాశంపైన అల్లాహ్ నివాసం.
అల్-బత్ష్ (البطش)
గట్టిపట్టు.
అల్-ఫాతిహ (الفاتحة)
ఖురాన్‌లోని మొదటి సూరా
అల్-ఫిర్దౌస్ (الفردوس)
స్వర్గంలోని మధ్య మరియు పై భాగం.
అల్-ఘాబా (الغابة)
అడివి. మదీనా దగ్గర్లో పేరున్న ఓ ప్రాంతం.
అల్-గుర్రుల్ ముహజ్జలూన్ (الغر المحجلون)
పునరుత్థాన దినాన ముస్లిములకు పెట్టే పేరు. ఎందుకంటే వుజూలో శుభ్రం చేసుకున్న వారి దేహాభాగాలు మెరుస్తుంటాయి.
అల్-హరూరియా (الحرورية)
సంప్రదాయం లేని ఒక ప్రత్యేక మత వర్గం.
అల్-హస్బా (الحصباء)
హజ్‌కు సంబంధించిన క్రియలన్నీ పూర్తి చేసుకున్నాక యాత్రికులు మక్కా బయటకు వెళ్ళే ఓ చోటు.
అల్ హిజానహ్ (الحضانة)
పిల్లల పెంపకం, సాకటం.
అల్ హిజ్ర్ (الحجر)
కాబాలో ఉత్తర దిక్కున కప్పు లేకుండా ప్రహరీతో ఉన్న ప్రదేశం.
అల్ హుదైబియా (الحديبية)
మక్కా నుండి జెద్దా వెళ్ళే దారిలో 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ ప్రాంతం. హిజ్రీ 6వ సంవత్సరంలో ఇక్కడే ఒక ఒప్పందం జరిగింది. ప్రవక్తను ఆయన అనుచరుల్నీ ఉమ్రా చేయకుండా ఖురైషులు ఆపారు.
అల్ ఇహ్దాద్ (الإحداد)
చనిపోయిన భర్తను గూర్చిన అంగలార్పు.
అల్ ఇహ్తిబా (الاحتباء)
కూర్చునే ఓ పద్ధతి. మలుగులు మీద కూర్చొని కాళ్ళు చుట్టూ చేతులు పట్టుకునే పద్ధతి.
అల్ ఇస్తిబ్రా (الاستبراء)
కొత్తగా కొన్న బానిస స్త్రీ విషయంలో ఒక ఋతుకాలం సంభోగించకుండా గడపటం
అల్ జియిర్రానా (الجعرانة)
మక్కాకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఒక ప్రదేశం. హునైన్ యుద్ధంలో లభించిన వాటిని ప్రవక్త ఇక్కడే పంచారు. ఇక్కడే ఆయన ఇహ్రామ్ స్థితిని పొంది ఉమ్రా చేశారు.
అల్ జుహ్ఫా (الجحفة)
సిరియా ప్రజల మీఖాత్ (ఇహ్రం దీక్షబూనే స్థలం).
అల్ కబాయిర్ (الكبائر)
అతిపెద్ద పాపాలు.
అల్ కౌసర్ (الكوثر)
స్వర్గంలోని సరస్సు (సూరా 108 చూడండి).
అల్ ఖమ్సా (الخمسة)
అయిదుగురు హదీసు సంకలన కర్తలు – అబూదావూద్, నసాయీ, తిర్మిజీ, ఇబ్నె మాజా, అహ్మద్.
అల్ లిజామ్ (اللزام)
వ్యవహారాల పరిష్కారం. ముస్లిములు, అన్యుల మధ్య తగాదాల పరిష్కారానికి బద్ర్-యుద్ధ సమయంలో ఈ పద్ధతి అవలంబించబడినట్లు హదీసులో ఉంది.
అల్ మదీనా (المدينة)
సౌదీ అరేబియాలో ప్రవక్త మస్జిదు ఉన్న ప్రసిద్ధ పట్టణం. పూర్వం దీన్ని యస్రిబ్ అని పిలిచేవారు.
అల్ మఘాజీ (المغازي)
పవిత్ర యుద్ధాలు లేదా యుద్ధం జరిగే స్థలం లేదా అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే యోధుని గుణగణాలు, క్రియలు.
అల్ మనాసీ (المناصع)
మదీనా వెలుపల ఉన్న విశాల పీఠభూమి.
మఖామె మహ్మూద్ (المقام المحمود)
స్వర్గంలోని ఎత్తైన ప్రదేశం. ఇది కేవలం ముహమ్మద్ ప్రవక్త ﷺకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఇంకెవ్వరికీ ఇవ్వబడదు. (సహీహ్ బుఖారీ, 6వ సంపుటి, 242వ హదీసు చూడండి).
అల్ మర్వా (المروة)
మక్కాలోని ఒక పర్వతం, దాని ప్రక్కగా పవిత్రమైన మస్జిదుల్ హరామ్ ఉంది.
అల్ మష్అరుల్ హరామ్ (المشعر الحرام)
ముజ్దలిఫా వద్ద ఒక పవిత్రమైన స్థలము.
అల్ మసీహ్ అద్ దజ్జాల్ (المسيح الدجال)
నకిలీ మెస్సయ్యా లేదా క్రీస్తు విరోధి (ఖురాన్‌లోని 6:158 సంపుటినీ మరియు హదీసులు 649 మరియు 650ని సహీహ్ బుఖారీ నాల్గవ సంపుటిలో చూడండి).
మస్జిదె అఖ్సా (المسجد الأقصى)
జెరూసలేమ్‌లోని మహా పవిత్రమైన మస్జిదు.
మస్జిదె హరామ్ (المسجد الحرام)
మక్కాలోని మహా పవిత్రమైన మస్జిదు. కాబా అందులోనే నెలకొని ఉన్నది.
అల్ ముహస్సబ్ (المحصب)
మక్కా వెలుపల ఉన్న ఒక లోయ. దీనిని కొన్ని సందర్భాల్లో కైఫ్ బానీ కినానా అని కూడా పిలుస్తారు.
అల్ ముతఅవ్విలూన్ (المتأولون)
తమ ముస్లిం సహోదరుల గురించి కుఫ్ర్పై తప్పుడు అభిప్రాయాలు కలిగించేవారు.
అల్ ఖసామా (القسامة)
ఎవర్నో చంపాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి యొక్క తెగలోని ఏభై మంది చేసిన ప్రమాణము.
అల్ ఖస్వా (القصواء)
ప్రవక్త యొక్క ఆడ ఒంటె పేరు.
అల్ ఖిసాస్ (القصاص)
గాయపరచినవారిని ప్రతీకారంగా సమానంగా శిక్షించే ధర్మసూత్రాలు.
అల్ వాసిల్ (الواصل)
తన బంధుమిత్రాదులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాడు.
అల్లాహు అక్బర్ (الله أكبر)
అల్లాహ్ మహా గొప్పవాడు.
అమతు అల్ (الأمة)
ఆడ బానిస.
అంబిజానియా (الأنبجانية)
మచ్చలు లేని సాధారణ ఊలు గుడ్డ.
ఆమీన్ (آمين)
ఓ అల్లాహ్! నా ప్రార్థనను అంగీకరించు.
అమ్మాబాద్ (أما بعد)
ప్రసంగంలోని ముఖ్యమైన విషయాల నుంచి ఉపోద్ఘాతాన్ని వేరు చేసే ఒక గుర్తు. ఈ ఉపోద్ఘాతము అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, కీర్తినీ తెలియజేసేటటువంటిది. దీని ఖచ్చితమైన అర్థం ఏమిటంటే “తరువాత వచ్చేది ఏదైనా సరే” అని. “దాని తరువాత” అని మామూలుగా అనువాదం చేస్తారు.
అన్ నజాషి (النجاشي)
ఇథియోపియా రాజు యొక్క బిరుదు – నీగస్.
అన్ నజష్ (النجش)
అంత ఎక్కువ ధర పలకకపోయినా, దాన్ని ఎవర్నైనా ఆకర్షించి, దాన్ని కొనేలా చేసి మోసగించడానికి ఉపయోగించే కుయుక్తి. కావాలని ధర పెంచడం.
అన్ నజ్వా (النجوى)
పునరుత్థాన దినాన అల్లాహ్ మరియు అతని దాసుల మధ్య జరిగే ఒక సంభాషణ. దాన్ని రహస్య చర్చ, సమావేశం అని కూడా అనవచ్చు. (ఖురాన్ 58:7-13 మరియు 11:18 పాద సూచికలు, అల్ బుఖారీ 3వ సంపుటి 621వ హదీసు చూడండి).
అన్సార్ (الأنصار)
మదీనా వాసులైన ప్రవక్త ﷺ యొక్క సహచరులు. మక్కా తదితర ప్రాంతాల నుండి ముస్లిం కాందిశీకుల్ని చేర్చుకొని ఇస్లామును స్వీకరించినవారు.
అన్జా (العنزة)
కత్తివంటి తల కలిగిన ఒక కర్ర.
అఖీఖా (العقيقة)
బిడ్డ పుట్టిన సందర్భంగా అల్లాహ్‌కు కృతజ్ఞతగా ఒకటి లేదా రెండు గొర్రెలను బలి ఇవ్వడం. (సహీహ్ బుఖారీ : 7వ సంపుటిలోని అఖీఖా అనే పుస్తకంలో 272వ పేజీ చూడండి).
అఖ్రా హల్ఖా (عقرى حلقى)
ఇది కేవలం ఆశ్చర్యార్థకమైన పదము. ఇది నిరాకరించడాన్ని సూచిస్తుంది.
అరఫా (రోజు) (عرفة)
భక్తులు హజ్ క్రియలు నెరవేర్చే జుల్ హిజ్జా నెలలోని తొమ్మిదవ రోజు.
అరఫాత్ (عرفات)
మక్కా యొక్క ఆగ్నేయంలో ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత యాత్రా స్థలం.
అరాక్ (الأراك)
సివాక్ అనే పసుదోము పుల్లను తయారు చేసే ఒక చెట్టు.
అరియ్యా (العرية)
బై అల్ అరాయా అనేది ఒక రకమైన అమ్మకం. అరియా యొక్క యజమానిని తాజా కర్జూరం అమ్మడానికి అనుమతిస్తారు. కర్జూరాలు ఇంకా చెట్టుపైన గెలల్లోనే ఉన్నప్పుడు, ఎండిపోయిన వాటిని కూడా అంచనా వేసి అమ్మడానికి అనుమతిస్తారు. (సహీహ్ బుఖారీ 3వ సంపుటం 389, 394, 397వ హదీసులు చదవండి).
అర్ రిజాఅత్ (الرضاعة)
సొంత బిడ్డ, ఎవరిదైనా బిడ్డకు పాలివ్వటం.
అర్రజ్అత్ (الرجعة)
మొదటి లేదా రెండవ విడాకుల తరువాత భర్త తన భార్యని వెనక్కి తెచ్చుకోవడం.
అర్ రజం (الرجم)
వివాహితులై అక్రమ లైంగిక సంబంధాలు కలిగి ఉన్న వారిని రాళ్ళతో కొట్టి చంపే ఇస్లామిక్ ధర్మసూత్రం.
అర్ – రుకియా (الرقية)
జబ్బుల్ని నయం చేసే పవిత్రమైన ప్రసంగం. ఇది ఒక వైద్యం. అల్ ఫాతిహా సూరాగాని మరేదైనా సూరాగాని చదివి ఉమ్మితో పాటు రోగి శరీరంపైన ఊదటం.
అర్ష్ (الأرش)
గాయపరచబడిన వ్యక్తికి గాయపరిచిన వ్యక్తి చెల్లించే పరిహారం.
అసబా (العصبة)
చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రివైపు మగ బంధువులు.
అస్బ్ (العصب)
యమన్ అనే దేశంలో తయారైనటువంటి ఒక రకం ముతక గుడ్డ.
అస్హాబ్ అస్ సుఫ్ఫా (أصحاب الصفة)
మదీనాలోని ప్రవక్త మస్జిదులోనే ఉండి అక్కడ జరిగే మతపరమైన బోధనా సమావేశాల్లో పాల్గొనే యసభై మందికి పైగా పేదవారు.
అస్హాబ్ అస్ సునన్ (أصحاب السنن)
ఇస్లామీయ ధర్మశాస్త్రంలో హదీసు ప్రవచనాల సంకలన కర్తలు.
అస్హాబ్ అష్ షజరా (اصحاب الشجرة)
ప్రవక్త యొక్క అనుచరులు. హుదైబియా వద్ద ఖురైషులకు వ్యతిరేకమై ఇస్లాం మతాన్ని రక్షించడానికి ప్రతిజ్ఞ చేసినవారు.
అష్ షహాదా (الشهادة)
1). విశ్వాస ప్రకటన. 2). అల్లాహ్‌ని తప్ప ఇంకా ఎవరీని పూజించే హక్కు లేదు మరియు ముహమ్మద్ ﷺ అల్లాహ్ యొక్క ప్రవక్త.
అష్ షిఖాఖ్ (الشقاق)
భార్యభర్తల మధ్య లేక ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వేర్పాటు.
ఆషూరా (العاشوراء)
ముహర్రమ్ నెలలోని పదవ రోజు. (ఇస్లామిక్ కాలెండర్లోని మొదటి నెల).
అస్ర్ (العصر)
మధ్యాహ్నం, అస్ర్ ప్రార్థనా సమయం.
అస్ సబా (الصبا)
తూర్పు గాలి.
అస్ సబ్అ (السبعة)
హదీసు యొక్క ఏడుగురు సంకలన కర్తలు – బుఖారీ, ముస్లిం, అబూదావూద్, నసాయి, తిర్మిజీ, ఇబ్నె మాజహ్, అహ్మద్.
అస్ సాయిబా (السائبة)
దేవుళ్ళ పేరుమీద, బూటకపు దేవతల పేరుమీద పొలాల్లో, బీళ్ళలో వదిలివేయబడిన ఒక ఆడ ఒంటె (ఖురాన్ 5:103 చూడండి).
అస్ సలాత్ (الصلاة)
ఇఖామత్ – అస్ సలాత్ని చూడండి.
అస్ సౌమ్ (الصوم)
ఉపవాసం-ఫజ్ర్ (ఉదయం) ప్రార్థనకు ముందు అజాన్నుంచి సూర్యాస్తమయం దాకా ఏమీ తినకుండా, త్రాగకుండా, ఏ విధమైన లైంగిక సంబంధాలు లేకుండా ఉండటం.
అస్ సిహాహ్ అస్-సిత్తహ్ (الصحاح الستة)
హదీసు యొక్క ఆరు పుస్తకాలు: బుఖారీ, ముస్లిం, అబూ దావూద్, నసాయి, తిర్మిజి మరియు ఇబ్నె మాజహ్.
అస్ సిరాత్ (الصراط)
నిజానికి సిరాత్ అంటే ‘ఒక దారి’. అంతే కాకుండా తీర్పు దినమున ప్రజలు నరకాగ్ని మంటల మీద నడవటానికి వేయబడిన ఒక వంతెన అనే అర్థం కూడా వస్తుంది. అది కత్తి కంటే పదునైనది, వెంట్రుక కంటే సన్ననిదీ అని, మనుషుల్ని పట్టుకోవటానికి దానిపై కొక్కెములు ఉంటాయనీ వర్ణించబడింది.
అస్ సిత్తా (الستة)
బుఖారీ, ముస్లిం, అబూదావూద్, నసాయి, తిర్మిజి, ఇబ్నె మాజహ్ అనే ఆరుగురు హదీసు సంకలనకర్తలు మరియు హదీసుల సంకలనాలను సిహసిత్తా అంటారు.
అత్ తన్యీమ్ (التنعيم)
మక్కాలో ఇహ్రామ్ స్థితిలోకి వెళ్ళి ఉమ్రా చేయడానికి మక్కాకి ఉత్తరాన ఉన్న ఒక ప్రదేశం.
అస్ సలాసహ్ (الثلاثة)
హదీసు యొక్క ముగ్గురు సంకలనకర్తలు – అబూదావూద్, నసాయి, తిర్మిజీ.
అల్ ఔరత్ (العورة)
ఇతరుల ముందు నగ్నంగా కనపడకూడని శరీర భాగం.
అవాలీ అల్ మదీనా (عوالى المدينة)
ఆరు లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనా బయటి ప్రదేశం.
అవాఖిన్ (أواق)
ఏకవచనం “ఉఖియా”. 5 అవాఖిన్లు అంటే ఎమన్ యొక్క 22 వెండి రియాళ్ళు లేదా 200 వెండి దిర్హమ్లు (640 గ్రాములు). (సహీహ్ అల్ బుఖారీ, రెండవ సంపుటి, హదీసు నెం. 526ని చూడండి).
అవ్సఖ్ (أوسق)
వసఖ్ యొక్క బహువచనం. 60 ‘సా’లు 135 కి.గ్రా. సమానమైన ఒక ప్రమాణము. కొంచెం ఎక్కువైనా తక్కువైనా కావచ్చు.
అయ్యాం అత్ తష్రీఖ్ (أيام التشريق)
జుల్ హిజ్జా యొక్క పదకొండు, పన్నెండు మరియు పదమూడు తేదీలకు ఉపయోగించే ఒక పదం.
ఆయాత్ (الآيات)
సాక్ష్యాలు, ఋజువులు, నిదర్శనాలు, వాక్యాలు, గుర్తులు మొదలైనవి.
ఆయతుల్ కుర్సీ (آية الكرسي)
ఖురాన్లో సూరా అల్ బఖరాలోని 255వ వాక్యం.
అజల్ (العزل)
బాహ్య స్ఖలనం. పిల్లలు పుట్టకూడదనే ఆలోచనతో శిశ్నాన్ని యోని నుండి బయటకు తీసి వీర్యాన్ని స్ఖలించటం.
అజ్లామ్ (الأزلام)
యదార్థంగా దీని అర్థం ‘బాణాలు’ అని. ఇక్కడ దీని అర్థం బాణాలు మంచి అదృష్టాన్ని లేక నిర్ణయాన్నీ కొనితేవాలని అజ్ఞానకాలపు అరబ్బుల చేత పాటించబడినవి.
అజ్ జిహార్ (الظهار)
నీతో కలిసి ఉండటం నా తల్లితో కాపురం చేసినంత అన్యాయం అని, భర్త భార్యతో అనడం.
B
బదనా (بدنة)
మక్కా యాత్రికులచేత బలివ్వటానికి తీసుకువెళ్ళబడిన ఒంటె, ఆవు లేదా ఎద్దు.
బాజఖ్ (الباذق)
ద్రాక్షతో చేసిన ఒక రకమైన మత్తు పదార్థం.
బద్ర్ (البدر)
మదీనాకి 150 కి.మీ. దూరంలో ఉన్న ఒక ప్రదేశము ఇస్లాం చరిత్రలో ముస్లింలు, ఖురైషీ మతద్రోహుల మధ్య జరిగిన మొదటి గొప్ప యుద్ధం.
బైఅత్ (البيعة)
ఇస్లాం మతానుసారంగా, ఇమామ్‌కు వినయంగా ఉండే పౌరుల చేత చేయబడిన ప్రతిజ్ఞ.
బైవుస్ సలఫ్ (بيع السلف)
సలఫ్ని చూడండి.
బైవుస్ సలమ్ (بيع السلم)
సలమ్ని చూడండి.
బైవుల్ హసాత్ (بيع الحصاة)
రాళ్ళు విసిరి కొట్టే మోసపూరిత వ్యాపారం. ఈ వ్యాపారంలో అమ్మేవాడు కొనేవాడిని ఒక రాయి వెయ్యమని అడిగి, ఆ రాయి ఎక్కడ పడుతుందో ఆ వస్తువుని ముందే నిర్ణయించబడిన ధరకి విక్రయిస్తాడు. ఈ వ్యాపారం నిజానికి నిషేధించబడింది. ఎందుకంటే ఇందులో మోసం ఉంది. రాయి పడ్డ వస్తువు ధర నిజానికి అంతకంటే ఎక్కువ ధర అయ్యుండొచ్చు లేదా తక్కువ అయ్యుండొచ్చు. ఇలాంటి మోసపు వ్యాపారాలన్నీ నిషేధించబడ్డాయి. తప్పిపోయిన బానిసను, జంతువును అమ్మటం, ఎగిరే పక్షుల్ని, నీళ్ళలోని చేపల్ని అమ్మటం మొదలైనవి.
బైత్ ఉల్ మఖ్దిస్ (بيت المقدس)
బైత్ అంటే ఇల్లు; ఇది జెరూసలెంలోని ఒక ప్రఖ్యాత మస్జిదు. బైతుల్లాహ్ అంటే దేవుని ఇల్లు. ఇస్లాం ప్రపంచంలో దీనికి మూడవ పవిత్రమైన మస్జిదుగా పేరుంది. మక్కాలోని మస్జిదుల్ హరాం మొదటిదైతే, మదీనాలోని ప్రవక్త యొక్క మస్జిదు రెండవది.
బైత్ ఉల్ మిద్రాస్ (بيت المدراس)
మదీనాలోని ఒక స్థలం (ఇది యూదుల కేంద్రం).
బైఅతుర్రిజ్వాన్ (بيعة الرضوان)
హిజ్రీ 6వ సంవత్సరంలో ఖురైషులతో సంప్రదింపులకోసం వెళ్ళిన ఉస్మాన్(రదియల్లాహు అన్హు)ను పట్టి బంధించారు. ఆయనకేమైనా అపాయం జరిగితే యుద్ధం చేస్తామని హుదైబియా వద్ద సహాబా చేసిన శపథం.
బాలామ్ (بالام)
ఎద్దు.
బనూ అల్ అస్ఫర్ (بنو الأصفر)
బైజాన్టైన్ వాసులు.
బఖీ (البقيع)
ప్రవక్త యొక్క అనేకమంది అనుచరులను పూడ్చి పెట్టిన మదీనాలోని ప్రజల శ్మశానం.
బిర్ర్ (البر)
భక్తి.
బిద్అత్ (البدعة)
వదంతి (లేదా మతంలో ప్రవేశపెట్టబడిన ఏదైనా కొత్త పోకడ).
బిన్తె లబూన్ (بنت لبون)
రెండు సంవత్సరాల వయస్సు గల ఆడ ఒంటె.
బిన్తె మఖాజ్ (بنت مخاض)
ఒక సంవత్సరం వయస్సు గల ఆడ ఒంటె.
బుఆస్ (بعاث)
మదీనా నుంచి మూడు కి.మీ. కంటే ఎక్కువ దూరంలో నున్న ఒక స్థలం. ఇస్లాంకు ముందు ఔస్ మరియు ఖజ్రజ్ తెగల మధ్య యుద్ధం జరిగిన చోటు.
బురాఖ్ (براق)
గాడిదకంటే పెద్దగా గుర్రంకంటే చిన్నగా ఉండే ఒక జంతువు, దీనిమీదే ప్రవక్త ﷺ మేరాజ్ (స్వర్గారోహణం)కు వెళ్ళారు.
బుర్ద్, బుర్దా (البرد، البردة)
నల్ల గడులున్న బిగువైన బట్ట.
బుర్నుస్ (البرنس)
పడగ గల తొడుగు.
బురుద్ (البُرُد)
బరీద్కు బహువచనం. ఒక బరీద్ = 4 ఫర్సాక్ = 12 మైళ్ళు = 19.31 కి.మీ.
బుత్హాన్ (بطحان)
మదీనాలోని ఒక లోయ.
D
జగాబీస్ (الضغابيس)
నక్క దోసకాయలు (జగ్బూస్కు బహువచనం).
దయ్యాన్ (الديان)
అల్లాహ్; ప్రజలకు వారి కార్యాలను బట్టి తీర్పు చెప్పేవాడు అని అర్థం.
దజ్జాల్ (الدجال)
క్రీస్తు విరోధి లేదా నకిలీ మెష్షయా. (అల్ మసీహ్ అద్ దజ్జాల్). అబద్ధీకుడు, మోసగాడు, మాయగాడు అని అర్థం (ఖురాన్ 6 : 158 పాదసూచిక, సహీహ్ బుఖారీ 4వ సంపుటి 649, 650 హదీసులు చూడండి).
దానిఖ్ (دانق)
ఆరోవంతు దిర్హంకు సమానమైన ఒక నాణెము.
దారుల్ ఖజా (دارالقضاء)
న్యాయస్థానము.
జాతె ఇర్ఖ్ (ذات عرق)
ఇరాక్ నుంచి వచ్చే యాత్రికుల కోసం ఉన్న మీఖాత్.
జాత్ ఉన్నితాఖైన్ (ذات النطاقين)
అబూబకర్ కూతురు అస్మా. దీని అర్థం రెండు నడికట్లు వేసుకున్న స్త్రీ. ఆమెకాపేరు ప్రవక్త ﷺ చేత పెట్టబడినది.
జాత్ ఉర్ రిఖా (ذات الرقاع)
ఇది ప్రవక్త ﷺ పాల్గొన్న ఒక యుద్ధం పేరు. “చారలున్నది” అని అర్థం. ముస్లిములు చెప్పులు కూడా లేకుండా కటిక దరిద్రులై ఉన్నప్పుడు, కాళ్ళకు రక్షణగా చింపి గుడ్డలు కట్టుకుని యుద్ధం చేశారు. అలా ఆ యుద్ధానికీ పేరొచ్చింది.
జవిల్ అర్హాం (ذوو الأرحام)
అమ్మ తరపు బంధువులు.
జిమ్మీ (الذمى)
ఇస్లామ్ ప్రభుత్వ రక్షణలో ఉన్న ఒక ముస్లిమేతరుడు.
జీతువా (ذى طوى)
మక్కా లోయల్లో ఒకటి, అందులో ఆ పేరున్న ఒక బావి ఉంది. ప్రవక్త ﷺ జీవితకాలంలో మక్కా ఒక చిన్న నగరం. అప్పుడు ఈ బావి సరిహద్దుకు వెలుపల ఉండేది. ఈ రోజుల్లో మక్కా పెద్ద నగరం. అయితే ఈ బావి నగర సరిహద్దుల లోపలే ఉంది.
జూ మహ్రమ్ (ذو محرم)
ఒక స్త్రీ తనకు దగ్గరి సంబంధం కారణంగా పెళ్ళి చేసుకోకూడని మగాడు. (ఉదాహరణకు సోదరుడు, తండ్రి, బాబాయి వగైరా).
జవిల్ ఫురూజ్ (ذوالفرائض)
వారసత్వ భాగం ఖురాన్లో నిర్ధారించబడినవాళ్ళు. మిగతా వాళ్ళను ‘అసబా’ అంటారు.
జుల్ హిజ్జా (ذوالحجة)
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పన్నెండవ నెల.
జుల్ హులైఫా (ذو الحليفة)
మదీనా ప్రజల యొక్క మీఖాత్. ఇప్పుడు దానిని అబ్యార్ అలీ అని పిలుస్తారు.
జుల్ ఖలసా (ذو الخلصة)
విగ్రహాలను ఆరాధించే యమన్లోని ఒక ఇల్లు. ఇది ఖతాం మరియు బజీలా తెగలకు చెందినది.
జుల్ ఖఅద (ذو القعدة)
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదకొండవ నెల.
జుల ఖర్నైన్ (ذو القرنين)
ప్రపంచాన్ని పాలించిన, నమ్మకస్తుడైన ఒక గొప్ప పాలకుడు. ఆయన కథ ఖుర్ఆన్ 18:83లో ఉంది.
జున్ నూరైన్ (ذو النورين)
ప్రవక్త ﷺ గారి ఇద్దరు కుమార్తెలు రుఖియా (రదియల్లాహు అన్హా) మరియు ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా)లను పెళ్ళి చేసుకున్న ఖలీఫా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్(రదియల్లాహు అన్హు)కు మారు పేరు. మొదటి ఆవిడ చనిపోయిన తరువాత రెండవ ఆవిడను ఆయన పెళ్ళి చేసుకున్నారు.
దీబాజ్ (الديباج)
స్వచ్ఛమైన పట్టు వస్త్రం.
దీనార్ (الدينار)
పురాతనమైన బంగారు నాణెం.
దిర్హమ్ (الدرهم)
50 బార్లీ గింజల బరువు తూగే వెండి నాణెం. అంచులు కత్తిరించబడి ఉంటుంది. ఊఖియా అనే బంగారు నాణెంలో 1/12వ వంతు విలువ కలిగి ఉంటుంది.
దియత్ (الدية)
(దియాత్ బహువచనం) హత్య, గాయాలకు పరిహారంగా చెల్లించే రక్త ధనం. (అనుకోకుండా చేసినవి) బాధితుని బంధువులకు హంతకుడు చెల్లిస్తాడు.
జుహా (الضحى)
ఉదయం పూట.
E
ఈదుల్ అజ్హా (عيد الأضحى)
జుల్ హిజ్జా నెలలో పదవ రోజున మొదలయ్యే ముస్లిముల నాలుగు రోజుల పండుగ.
ఈదుల్ ఫిత్ర్ (عيد الفطر)
రమజాన్ నెల తరువాత వచ్చే షవ్వాల్ నెలలో మొదటి రోజుతో మొదలయ్యే ముస్లిముల పండుగ. ఫితర్ అనగా ఉపవాసాన్ని వీడటం. ముస్లిములు రమజాన్ నెల మొత్తం (ఇస్లామిక్ క్యాలెండర్‌లోని తొమ్మిదవ నెల) ఉపవాసం ఉంటారు. షవ్వాల్ నెల వస్తే, వారు ఉపవాసాన్ని ఆపేస్తారు.
F
ఫిదక్ (فدك)
మదీనా దగ్గరి ఒక ఊరు.
ఫాహిష్ (الفاحش)
నీతిమాలిన మాటలు మాట్లాడేవాడు.
ఫై (الفيء)
పోరాడకుండానే దొరికిన యుద్ధ ప్రాప్తి.
ఫజ్ర్ (الفجر)
సూర్యోదయానికి ముందు ఉదయ ప్రార్థన.
ఫకీహ్ (الفقيه)
ధార్మిక తీర్పులు చెప్పగల జ్ఞాని.
ఫరాయిజ్ (الفرائض)
మృతుని బంధువులకొచ్చే భాగం. 1/2, 1/4, 1/3, 1/6, 1/8, 2/3 లాంటి భాగాలు ఖురాన్లో చెప్పబడ్డాయి (4:11, 12, 176).
ఫరక్ (الفرق)
కొలిచే గిన్నె.
ఫర్జె ఐన్ (فرض العين)
ఇది ఒక వ్యక్తిగత విధి. ప్రతి ఒక్కడూ తన పనికి బాధ్యుడై ఉండడం.
ఫర్జె కిఫాయా (فرض الكفاية)
ఇది ఉమ్మడి బాధ్యత. అందరి పాత్ర లేకపోయినా ఒక వ్యక్తి అందరి తరఫునా పనికి బద్ధుడై ఉండటం.
ఫరీజా (الفريضة)
ఆజ్ఞాపించబడిన బాధ్యత (ఫరాయిజ్ బహువచనం).
ఫర్రుజ్ (الفروج)
వెనుక వైపు తెరిచిన ఖబా.
ఫర్సఖ్ (الفرسخ)
మూడు మైళ్ళ దూరం. 1 మైలు = 6000 దోరా = 1760 గజాలు = 1.6 కి.మీ. (పరసంగ్ – పర్షియన్ దూరమానపు కొలత).
ఫతాత్ (الفتاة)
ఒక ఆడ బానిస లేదా యవ్వన స్త్రీ.
ఫిదియా (الفدية)
మతాచారాలు తప్పినందుకు చెల్లించే పరిహారం. మామూలుగా దీన్ని డబ్బు, ఆహార పదార్థాలు లేదా జంతు బలి ద్వారా పరిహారంగా చెల్లిస్తారు.
ఫికహ్ (الفقه)
ఇస్లామిక్ ధర్మశాస్త్రం.
ఫిత్నా (الفتنة)
పరీక్షలు, బాధ, మత విషయమై నెలకొనే అయోమయ స్థితి, ముస్లిముల మధ్య గొడవలు. (బహువచనం ఫితన్).
G
గరర్ (الغرر)
లేని వస్తువును అమ్మటం, ఉదా – ఇంకా పట్టని చేప.
గాజి (الغازى)
జిహాద్ (ధర్మ యుద్ధం)లో పాల్గొని తిరిగి వస్తున్న ఒక ముస్లిం యోధుడు.
గజ్వా (الغزوة)
ప్రవక్త ﷺ నాయకత్వంలో పెద్ద సైన్యంతో జరిగిన పవిత్ర యుద్ధం. ఇది అల్లాహ్ కార్యం నిమిత్తం జరిగింది.
గజ్వత్ ఉల్ ఖందఖ్ (غزوة الخندق)
శత్రువులను అడ్డగించడం కోసం మదీనాలో ముస్లిములు తవ్విన కందకం. తొలి ముస్లిములకు – అవిశ్వాసులకు మధ్య జరిగిన ఒక యుద్ధానికి పేరు.
ఘీలా (الغيلة)
శిశువు పాలు మానే ముందు భార్యతో జరిగే సంభోగం.
ఘైరత్ (الغيرة)
స్త్రీలలో సహజంగా ఉండే అసూయ మరియు పౌరుషం. ఆత్మ గౌరవం దెబ్బతిన్నప్పుడు వచ్చే కోపం, పరువు ప్రతిష్ఠలు భంగపడినప్పుడు కలిగే ఆగ్రహం.
ఘులూల్ (الغلول)
పంపిణీకి ముందు యుద్ధ లాభాన్ని దొంగిలించడం.
ఘురఫ్ (الغرف)
ప్రత్యేకమైన నివాసాలు.
గుసుల్ (الغسل)
ఆచారం ప్రకారం స్నానం చేయటం. ‘జునుబ్’ అయిన వాడికి (అశుద్ధతకు లోనైనవారికి)ది అవసరం.
H
హబలుల్ హబలా (حبل الحبلة)
హబలుల్ హబలా అనేది రెండు రకాల వ్యాపారం. ఒక జంతువుకు పుట్టబోయే పిల్లల్ని ముందుగానే డబ్బిచ్చి కొనటం – మొదటి పద్ధతైతే, జంతువును మాత్రమే అమ్మి దాని పిల్లల్ని ఉంచుకోవటం రెండో పద్ధతి. రెండూ నిషిద్ధాలే.
హదస్ అల్ అస్గర్ (الحدث الأصغر)
కాలకృత్యములు తీర్చుకోవటం, అపాన వాయువు వదలడం, మూత్ర విసర్జన.
హదస్ అల్ అక్బర్ (الحدث الأكبر)
రతిక్రీడ, వీర్య స్ఖలనం వల్ల ఏర్పడే అశుద్ధావస్థ.
హదీసు (الحديث)
ఈ క్రిందివి హదీసు యొక్క వర్గీకరణలు : ప్రవక్త ప్రవచించిన వాక్యాలు, చేతలు మరియు ఆయన స్వయంగా ఆమోదించిన విషయాలు. (బహువచనం అహాదీసు).
జయీఫ్ (బలహీనమైనవి) (الضعيف)
ఖచ్చితత్వం లేని వివరణలు. ఇవి సహీహ్ (ప్రామాణికమైనవి) కావు, హసన్ (సుస్పష్టమైనవి) కావు. అందువలన ఇస్లామ్ దృష్టిలో వాడకూడనివి.
గరీబ్ (అరుదైనది) (الغريب)
నమ్మకస్తులు చెప్పిన వివరణల సందర్భానికి భిన్నంగా మరొకరు చెప్పింది. ఇవి బలమైనవీ (సహీహ్) కావచ్చు, బలహీనమైనవీ (జయీఫ్) కావచ్చు.
హసన్ (ఫరవాలేనివి) (الحسن)
నమ్మకస్తులు చెప్పిన ముస్నద్ హదీసులు. సహీహ్ స్థాయికి చేరువలోనివి.
మజ్హూల్ (తెలియనివి) (المجهول)
హదీసులు చెప్పిన వారి పరంపరలో ఎవరైనా అనామక వ్యక్తి ఉన్నవి.
మఖ్తూ (తెగిపోయినవి) (المقطوع)
1. మాటలు, చేతలు తాబయి వద్ద ఆగిపోయినవి. 2. అసంపూర్ణ ఉల్లేఖకుల పరంపర కలిగినవి. 3. “ఇలా చేసేవాళ్ళం”- అని సహాబీలు వర్ణించినవి.
మర్ఫూ (జాడ తెలిసేవి) (المرفوع)
ప్రవక్తను ఉద్దేశించిన హదీసు. అది మాటగానీ, చేతగానీ, ముత్తసిల్ (అంతరాయం లేని పరంపర గలది) మున్ఖతా (అంతరాయం కలిగినది) లేదా ముర్సల్ (ప్రవక్త సహచరుని పేరు సూచించబడనిది) ఏదైనా కావచ్చు.
మౌఖూఫ్ (الموقوف)
(సహచరుల వద్ద పరంపర ఆగిపోయినది) – ప్రవక్త సహచరులైన సహాబీల గురించిన హదీసు. సహాబీలు ఇచ్చిన వివరణ, వర్ణన, సమాచారం. వీటిని అసర్ అని కూడా అంటారు. ముజ్తరిబ్ (అయోమయంగా ఉండేవి) – హదీసు మూలం గురించి ఉల్లేఖకులు విభేదించినవి. ఒకరి అభిప్రాయానికి మరొకరి అభిప్రాయం బలం చేకూర్చనివి. ఈ విభేదం హదీసు వాక్యాలను గురించి కావచ్చు, ఉల్లేఖకుల గురించి కావచ్చు.
మున్ఖతి (తెగిపోయినవి) (المنقطع)
ఉల్లేఖకుల పరంపర అసంపూర్తిగా ఉన్నవి. లేక అపరిచిత ఉల్లేఖకులను కలిగినవి.
ముర్సల్ (సూచించబడనివి): ప్రవక్త నుండి మొదలుపెట్టి సహచరుడిని సూచించకుండా తాబయా వద్ద ఉల్లేఖకుల పరంపర ఆగిపోయినవి.
ముస్నద్ (విషయపూర్వకమైనవి) (المسند)
1. వ్యాఖ్యాతల పరంపరతో ప్రవక్తను చేరే పరిపూర్ణమైన హదీసులు. 2. ఒక వ్యాఖ్యాతకు చెందిన హదీసులన్నీ కూర్చబడిన సంకలనం.
ముత్తసిల్ (సంబంధించినవి): లేదా మౌసూల్ – వ్యాఖ్యాతల పరంపరలో మూలస్థానాన్ని పూర్తిగా చేరేవి. అవి ప్రవక్తకు చెందిన మర్ఫూ (జాడ తెలిసినవి) కావచ్చు లేదా సహాబీలతో ముగిసే మౌఖూఫ్ (జాడ తెలియనివి) కావచ్చు.
సహీహ్ (బలమైనవి) (الصحيح)
ఉల్లేఖకుల పరంపర తెగిపోని ముస్నద్ హదీసు. వ్యాఖ్యానం అందరు వ్యాఖ్యాతల నుండి పరిపూర్ణంగా నమ్మకమైనదిగా మూలస్థానం వరకు అంగీకరిం చబడినవి. ఇందులో షాజ్ (విరుద్ధమైనవి)గానీ ముఅల్లల్ (తప్పుడువి)గానీ ఉండవు.
హదీ (الهدي)
ఒక జంతువు (ఒంటె, ఆవు, గొఱ్ఱె లేదా మేక) ను యాత్రికులు బలిగా ఇవ్వడం.
హైస్ (الحيس)
వెన్న, ఖర్జూరం మరియు జున్నుతో తయారు చేయబడిన వంటకం.
హజ్ (الحج)
మక్కా యాత్ర.
హజ్జుల్ అక్బర్ (الحج الأكبر)
(జుల్ హిజ్జా యొక్క పదవ రోజు) నహర్ రోజు.
హజ్జుల్ అస్గర్ (الحج الأصغر)
ఉమ్రాహ్.
హజ్జుల్ ఇఫ్రాద్ (حج الإفراد)
దీనిలో యాత్రికుడు హజ్ యాత్ర చేసే ఉద్దేశంతో మాత్రమే ఇహ్రామ్ స్థితిలోకి వెళతాడు.
హజ్జుల్ ఖిరాన్ (حج القران)
దీనిలో యాత్రికుడు ఉమ్రా మరియు హజ్ రెండూ చేసే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇహ్రామ్ స్థితిలోకి వెళతాడు.
హజ్జుత్ తమత్తు (حج التمتع)
దీనిలో యాత్రికుడు ఉమ్రా చేసే ఉద్దేశంతో ఇహ్రామ్ స్థితిలోకి వెళ్తాడు. తరువాత తవాఫ్ మరియు సయీ చేసి ఇహ్రామ్‌లో నుంచి బైటికి వస్తాడు. హజ్ రోజుల్లో అతడు ఇహ్రం స్థితిలోకి మళ్ళీ వెళ్ళి హజ్‌ను పూర్తి చేస్తాడు.
హజ్జతుల్ విదా (حجة الوداع)
ప్రవక్త ﷺ చనిపోయే ముందు సంవత్సరం రోజుల్లో చేసిన హజ్ యాత్ర.
హజ్జె మబ్రూర్ (حج المبرور)
చట్టబద్ధంగా సంపాదించిన డబ్బుతో, ప్రవక్త “సున్నత్” ప్రకారం నెరవేర్చిన, అల్లాహ్ చేత ఒప్పుకోబడిన, సంపూర్ణమైన హజ్ యాత్ర.
హజ్జామ్ (الحجام)
సూది ద్వారా శరీరం నుంచి చెడురక్తాన్ని తీసేవాడు
హలాల్ (الحلال)
ధర్మబద్ధం.
హలాలా (الحلالة)
మూడు విడాకులు పొందిన స్త్రీ తిరిగి తన మాజీ భర్తను పెండ్లి చేసుకునేందుకు వీలుగా మరొకడు తాత్కాలికంగా ఆమెను చేసుకోవటం. ఇది ధర్మ విరుద్ధం. కాల పరిమితి నిర్ణయించబడినా నిర్ణయించబడకపోయినా విడాకుల కోసం చేసుకునే పెళ్ళి అనైతికం.
హుమజ్ (الهمز)
పిచ్చితనం లేదా చెడు సలహాలు.
హనీఫ్ (الحنيف)
స్వచ్ఛమైన ఏక దైవారాధన (అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకపోవటం).
హన్తా (هنتاه)
ఓ వ్యక్తిని పేరుతో పిలవడం ఇష్టం లేనప్పుడు పిలిచే పదం (స్త్రీలను పిలవడానికి వాడుతారు).
హనూత్ (الحنوط)
శవాలకు పూసే ఓ సుగంధ ద్రవ్యం.
హరామ్ (الحرام)
అధర్మం, నిషిద్ధం లేదా మతపరంగా శిక్షార్హమైన నిషిద్ధ అంశం.
హరమ్ (الحرم)
మక్కా మరియు మదీనాలలోని పవిత్ర ప్రదేశాలు.
హరూరా (الحروراء)
ఇరాక్‌లోని ఒక పట్టణం.
హర్బా (الحربة)
ఒక చిన్న బల్లెము.
హర్జ్ (الهرج)
చంపడం.
హర్రా (الحرة)
మదీనాలో నల్లరాళ్లతో కప్పబడిన ఒక చోటు.
హసీర్ (الحصير)
ఖర్జూరపు చెట్టు ఆకులతో తయారు చేయబడి, మనిషంత పొడవుగా ఉండే చాప.
హవాలా (الحوالة)
ఋణాన్ని ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి బదలాయించడం. ఋణం ఇచ్చినవాడి నుండి తీసుకున్న వాడిని విడిపిస్తూ మరొకడు ఆ అప్పుకు పూచీపడే ఒప్పందం.
హవాజిన్ (الهوازن)
ఖురైషులలో ఒక తెగ.
హయా (الحياء)
దీనికి చాలా అర్థాలు ఉన్నాయి – సిగ్గు, బిడియం, వ్రీడ, అణకువ, ఆత్మ గౌరవం, లజ్జ మొదలైనవి. హయా అనేది రెండు రకాలు – మంచి మరియు చెడు. మంచి ‘హయా’ అంటే అల్లాహ్ మరియు అతని ప్రవక్త ﷺ చేయవద్దన్న పనులు చేయడానికి సిగ్గుపడటం, అలాగే ‘చెడు హయా’ అనగా అల్లాహ్ మరియు అతని ప్రవక్త ﷺ చేయమన్న పనులను చేయడానికి సిగ్గుపడటం.
హిబా (الهبة)
అల్లాహ్ పేరుతో ఇంకెవ్వరికైనా బహుమతి ఇవ్వటం.
హిజాబ్ (الحجاب)
ముస్లిం మహిళలు తల నుంచి పాదాల దాకా కప్పుకోవడానికి వీలుగా ఉండే పొడవైన దుస్తులు.
హిజ్రత్ (الهجرة)
దీని అర్థం ‘వలస పోవటం’. 4 సందర్భాల్లో ఈ పదం వాడుతారు: 1. మతపరమైన రక్షణ దొరక్క శత్రువు నుండి సురక్షిత ప్రాంతానికి ముస్లిములు వలసపోవటం. 2. మొదటి ముస్లింలు మక్కానుండి అబిసీనియా (ఇథియోపియా)కు తరువాత మదీనాకు వలసపోవటం. 3. మక్కా నుండి మదీనాకు ప్రవక్త ﷺ వలసపోవటం. 4. మక్కా నుంచి మదీనాకు ప్రవక్త ﷺ వలసపోయినప్పటి నుండి ఇస్లామిక్ క్యాలండర్ (కాలమానం) మొదలయ్యింది.
హిలాబ్ (حلاب)
ఒక రకమైన అత్తరు.
హిమా (الحمى)
ఒకరికి సొంతమైన పొలము, పచ్చికబయలు.
హిమ్యాన్ (حميان)
డబ్బు పెట్టుకోడానికి ఉపయోగించే పర్సులాంటి ఒక రకమైన బెల్టు.
హిన్నా (الحناء)
జుట్టుకు రంగువేసుకోడానికి ఉపయోగించే ఒక చెట్టు (హెన్నా) ఆకు. ఇది గోరింటాకు.
హిఖ్ఖా (الحقة)
మూడు సంవత్సరాల వయసుగల ఒక ఆడ ఒంటె.
హిరా (الحراء)
మక్కా దగ్గర ఒక పర్వతంలోని పేరుపొందిన ఒక గుహ.
హూర్ (الحور)
వరదగూడును పోలిన నల్లని కళ్లతో, తెల్లని మేని ఛాయతో అల్లాహ్ సృజించిన సుందరాంగులు. వీరు ఆదం సంతానం కాదు. (ఇబ్నె ఖయ్యూమ్ వ్రాసిన హదీ అల్ అర్వా 54వ అధ్యాయం 147వ పేజీ చూడండి).
హుబల్ (هبل)
ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో కాబాలో ఉన్న ఒక విగ్రహం.
హుబ్లా (الحبلى)
ఒక రకమైన ఎడారి చెట్టు.
హుదా (الحداء)
ఒంటెలు తోలే వాళ్ళు, వాటికి హుషారు కలిగించడానికి పలికేమాటలు.
హుదూద్ (الحدود)
‘హలాల్’ మరియు ‘హరామ్’ కోసం అంటే అనుమతించబడిన, అనుమతించబడని వాటి మధ్య అల్లాహ్ నియమించిన పరిమితులు. (హద్‌కు బహువచనం).
హుజ్రా (الحجرة)
గది, సభాస్థలి.
హుకుమ్ (الحكم)
అల్లాహ్ తీర్పు లేదా న్యాయ నిర్ణయం.
హుమ్స్ (حمس)
ఖురైష్ తెగ, వారి సంతానం మరియు హుమ్సు అని పిలువబడే వారి సహాయులు. దీనికి మరో అర్థం ఆసక్తి మరియు ఖచ్చితత్వం. హుమ్స్ ఈ విధంగా అనేవారు, “మేము అల్లాహ్ యొక్క ప్రజలం మరియు మక్కా దాటి బైటికి వెళ్ళం.” వీరు మిగతా ప్రజలకంటే గొప్పవారు అనుకునేవారు.
హునైన్ (الحنين)
మక్కా మరియు తాయిఫ్‌ల మధ్య ఉన్న ఒక లోయ. అక్కడ ప్రవక్త ﷺకు ఖురైషీలకు మధ్య యుద్ధం జరిగింది.
I
ఇద్దత్ (العدة)
విడాకుల అనంతరం లేదా భర్త చనిపోయాక స్త్రీ వేచి ఉండాల్సిన సమయం. తరువాత ఆమె పెళ్ళి చేసుకోవచ్చు.
ఇజ్ఖిర్ (الإذخر)
లోహాల్ని కరిగించడానికి ఉపయోగపడే ఒక రకమైన గడ్డి. ఇంటి పైకప్పులకు, నేలమీదకు, సమాధుల మీద కూడా దీన్ని పరుస్తారు.
ఇఫ్తార్ (الإفطار)
ఉపవాసాన్ని విరమించడం. ‘సౌమ్’కు వ్యతిరేక పదం.
ఇహ్రామ్ (الإحرام)
ఇతర సమయాల్లో అనుమతించబడినవాటినే చేయగూడని స్థితి. ఈ స్థితిలో ఉమ్రా, హజ్ విధులు నెరవేరుస్తారు. ఈ విధులు నెరవేరుస్తానని మానసికంగా, వాచకంగా కూడా పలకాలి. తరువాత తల్బియా పలకాలి. నడుము చుట్టూ ఇజారు, శరీర పైభాగంలో రిదా అనే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టుకోవాలి.
ఇహ్తికార్ (الاحتكار)
భవిష్యత్తులో లాభం కోసం వస్తువుల్ని దాచిపెట్టడం. ఇది నిషిద్ధం. ఎందుకంటే దీనివల్ల వస్తువుల కృత్రిమ కొరత ఏర్పడుతుంది.
ఇజారా (الإجارة)
ఎవరో ఒకరిని తన లాభంలో భాగస్వామిని చేయడం లేదా దేన్నైనా ఇతరులకు అద్దెకు ఇవ్వడం.
ఈలియా (ايلياء)
జెరూసలెం (ఎరూషలేము).
ఇమామ్ (الإمام)
ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు, ముస్లిం పరిపాలకుడు, ఖలీఫా.
ఈమాన్ (الإيمان)
నమ్మకం, విశ్వాసం.
ఇమ్లాస్ (الإملاص)
గర్భవతిని కడుపుపై కొట్టడం వల్ల జరిగే గర్భస్రావం.
ఇఖామత్ (الإقامة)
అజాన్‌లో రెండుసార్లు పలికే వాక్యాలను (చివర్లో పలికే అల్లాహు అక్బర్‌ను తప్ప) కుదించడం. ఇఖామత్ కాగానే ప్రార్థన మొదలవుతుంది.
ఇఖామతె సలాత్ (إقامة الصلاة)
సలాత్ (నమాజు) చేయడం. ఇది చాలా మంది ముస్లిములకు అర్థం కాలేదు. దీని అర్థం :
(అ) ప్రతీ ఒక ముస్లిం, స్త్రీగానీ, పురుషుడు గానీ, ‘సలాత్’ (ప్రార్థనలు) విషయంలో కొన్ని నియమాలకు బద్ధుడై ఉండాలి. రోజుకి ఐదుసార్లు నిర్ణీత వేళల్లో ప్రార్థనలు చేయాలి. పురుషులైతే మస్జిదులో, స్త్రీలు ఇంట్లో ప్రార్థనలు చేయాలి. ప్రవక్త ﷺ చెప్పినట్లు “పిల్లల్ని ఏడు సంవత్సరాల వయస్సు నుంచి ప్రార్థన చేయమని ఆదేశించాలి. పదేళ్ళ వయస్సు నుంచి చేయని పక్షంలో దండించవచ్చు కూడా. ముస్లిములు ఈ ప్రార్థనా నియమాలు పాటించే విషయంలో, వీటిని సక్రమంగా నిర్వర్తించే విషయంలో కుటుంబ పెద్దగానీ, ఆ ఊరి పెద్దగానీ లేదా ఆ దేశ ముస్లిం పాలకుడు అల్లాహ్ ముందు బాధ్యులై ఉంటారు.
(ఆ) ముహమ్మదు ప్రవక్త ﷺ నమాజు ఎలా చేశారో – అంటే నిలబడటం, ఒంగోటం, మోకరించటం, కూర్చోవటం వంటి నియమ నిబంధనలన్నీ అలాగే చేయడం. “నేనెలా నమాజు చేస్తానో అలాగే చేయండి” అన్నారాయన. (సహీహుల్ బుఖారీ 1వ సంపుటి ప్రవక్త నమాజు పద్ధతి గురించిన హదీసులు 702, 703, 704, 723, 786, 787లను చూడండి.) నమాజు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలకటంతో ప్రారంభమవుతుంది. అల్ ఫాతిహా సూరా మొదట చదవాలి. నిలబడటం, వంగటం, మోకరించటం, కూర్చోవటం లాంటి వివిధ భంగిమలతో కొనసాగి తస్లీమ్ అంటే సలాం చేయటంతో ముగుస్తుంది.
ఇషా (العشاء)
రాత్రి నమాజు సూర్యాస్తమయం తరువాత గంటన్నర సమయం నుండి మొదలవుతుంది. అర్ధరాత్రి వరకు దీని కాలపరిమితి.
ఇష్తిమాల్ అస్సమ్మహ్ (اشتمال الصماء)
ఈ రెండు పద్ధతుల్లో దుస్తులు ధరించడం – 1. ఒక భుజాన్ని వస్త్రంతో కప్పి రెండవ దాన్ని ఆచ్ఛాదన లేకుండా వదిలి వేయడం. 2. కూర్చొని నిండా వస్త్రాన్ని కప్పుకున్నా మర్మాంగాలు మాత్రం కనబడుతూనే ఉండటం.
అస్నాద్ (الإسناد)
(సనద్ యొక్క బహువచనం). ప్రవక్త హదీసులను వివరించిన వారి పరంపర.
ఇస్టబ్రక్ (استبرق)
మంచి పట్టు వస్త్రం, చిక్కటి దీబాజ్.
ఇస్తిహాజా (الاستحاضة)
స్త్రీకి మామూలు సమయాలలో (పరిశుద్ధావస్థలో) కలిగే రక్తస్రావం. (సహీహ్ బుఖారీ 1వ సంపుటి 303వ హదీసు, 10వ అధ్యాయం 183వ పేజీ చూడండి).
ఇస్తిహ్సాన్ (الاستحسان)
మనస్సాక్షి మేరకే తీర్పు ఇవ్వటం. దాన్ని బయటికి వ్యక్తీకరించలేరు. అబూ హనీఫా వర్గీయులు మాత్రమే ఇలా చెబుతారు. మిగతా సున్నీ పండితులు ఈ పద్ధతిని ఒప్పుకోరు.
ఇస్తిఖారా (الاستخارة)
రెండు రకాతులతో వ్యక్తి చేసే ప్రార్థన – ప్రార్థనలో ఆ వ్యక్తి తనను సరియైన మార్గంలో నడిపించమని అల్లాహ్‌ని వేడుకుంటాడు – చేయబోయే పనిలో మార్గదర్శకత్వం కోసం. (సహీహుల్ బుఖారీలోని హదీసులు – హదీసు నెం. 263, రెండవ సంపుటి; హదీసు నెం. 391, ఎనిమిదవ సంపుటి; హదీసు నెం. 487, తొమ్మిదవ సంపుటి).
ఇస్తిస్ఖా (الاستسقاء)
కరువు కాలంలో వర్షాలు కురిపించమని అల్లాహ్‌ను మొరపెట్టుకుంటూ రెండు రకాత్లతో చేసే ప్రార్థన.
ఏతెకాఫ్ (الاعتكاف)
ఏకాంతవాసం. మస్జిదులో అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించడం కోసం ఆ స్థితిలో ఉన్నంతకాలం వ్యక్తి తన భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. అలాగే అత్యవసర పరిస్థితిలో తప్ప మస్జిదు నుండి బైటికి వెళ్ళకూడదు. శవయాత్రలో పాల్గొనటానికి, కాలకృత్యాలు తీర్చుకోవటం లాంటి వాటికి వెళ్ళొచ్చు.
ఈలా (الإيلاء)
ఒక భర్త తన భార్య దగ్గరకు కొంతకాలం వరకు వెళ్ళనని చేసే ప్రమాణం.
ఇజార్ (الإزار)
దేహంలో క్రింది సగ భాగాన్ని కప్పుతూ నడుంకి కింద కట్టే ఒక వస్త్రం.
J
జజ్ఆహ్ (الجذعة)
నాల్గు సంవత్సరాల వయస్సుగల ఆడ ఒంటె.
జహన్నమ్ (جهنم)
నరకం, అగ్ని.
జాహిలియ్యత్ (الجاهلية)
1. ప్రవక్త ﷺ రాక ముందున్న అజ్ఞాన కాలం. 2. ప్రవక్త ﷺ కు ముందున్న ఇస్లామేతర సంప్రదాయాలు, దురాచారాలు.
జలీల్ (الجليل)
మక్కాలో పెరిగే మంచి వాసనగల ఒక రకమైన గడ్డి.
జల్సత్ ఉల్ ఇస్తిరాహత్ (جلسة الاستراحة)
ప్రార్థనలో మోకరించిన స్థితినుండి లేచి నిలబడే స్థితికి మధ్యలో కొద్దిసేపు కూర్చుని ఉండటం.
జమ్వు (الجمع)
మక్కా దగ్గర ‘ముజ్దలిఫా’ అనబడే ఒక పేరున్న చోటు.
జమ్రా (الجمرة)
ప్రాకార ప్రదేశంలో చిన్న రాతి స్థంభం. మినాలో 3 జమ్రా లున్నాయి. మినాలో ఈదుల్ అజ్హా నాలుగు రోజుల్లో ఈ జమ్రాల మీద రాళ్ళు రువ్వటం హజ్ విధుల్లో ఒకటి.
జమ్రత్ అల్ అఖబా (جمرة العقبة)
‘మినా’లో రాళ్ళతో కట్టబడిన మూడు స్తంభాల్లో ఒకటి. ఇది మక్కా ఉన్న దిశలో మినా ముఖద్వారం వద్ద నెలకొని ఉన్నది.
జనాబత్ (الجنابة)
భార్యతో సంభోగానంతర స్థితి లేదా స్వప్న స్ఖలనానంతర పరిస్థితి. అతను ఈ స్థితిలో విధిగా స్నానం (గుసుల్) చేయాలి. అది వీలు కాకపోతే తయమ్ముమ్ చేయాలి.
జనాజా (الجنازة)
అంత్యక్రియలు. జనాయిజ్ బహువచనం.
జన్నత్ (الجنة)
స్వర్గం.
జనీబ్ (الجنيب)
మేలురకపు ఖర్జూరం.
జిహాద్ (الجهاد)
అల్లాహ్ మార్గంలో జరిగే పవిత్రయుద్ధం. అల్లాహ్ వాక్కు (ఇస్లాం)ను సమున్నత స్థానంలో నిలిపే ప్రయత్నం. ఇస్లాం మౌలికాంశాల్లో ఇదొకటి.
జిమార్ (الجمار)
జమ్రాకు బహువచనం.
జిన్ (الجن)
ఒక సృష్టితము. అగ్ని నుండి అల్లాహ్ సృష్టించిన జీవులు. మనుషుల్ని మట్టినుండి, దైవదూతల్ని కాంతి నుండి సృష్టించాడు.
జిజ్యా (الجزية)
ఇస్లామిక్ ప్రభుత్వ రక్షణలో నివసిస్తున్న ముస్లిమేతర ప్రజలపై విధించబడే పన్ను. (సహీహ్ బుఖారీ : 4వ సంపుటి 251వ పేజీ మరియు హదీసు సంఖ్య 384, 385, 386 చూడండి).
జుబ్బా (الجبة)
ఒక పొడవాటి చొక్కా.
జుమాదస్ సానియా (جمادى الثانية)
ఇస్లామిక్ క్యాలెండర్లో ఆరవ నెల.
జుమా (الجمعة)
శుక్రవారం.
జునుబ్ (الجنب)
‘జనాబత్’ (అశుద్ధ) స్థితిలో ఉన్న ఒక వ్యక్తి.
జుర్రమ్ (جرهم)
ఒక అరబ్ తెగ పేరు.
K
కాబా (الكعبة)
చతురస్రాకారంలో మస్జిదుల్ హరాం (మక్కాలోని ఒక పవిత్ర మస్జిదు)లో ముస్లింలు ముఖం తిప్పి ప్రార్థన చేసే వైపున కట్టబడిన ఒక కట్టడం.
కఫాలా (الكفالة)
ఋణగ్రహీత ఫలానా ప్రదేశానికి వచ్చి బాకీ చెల్లిస్తాడనీ, లేదా శిక్ష పొందుతాడని ఋణదాతకు ఇచ్చే హామీ.
కఫ్ఫారా (الكفارة)
తప్పు మాట్లాడినందుకు, తప్పుడు పని చేసినందుకు ఇస్లాంలో చేసుకునే ప్రాయశ్చిత్తం లేదా చెల్లించే పరిహారం.
కాఫిర్ (الكافر)
అల్లాహ్‌ని, ఆయన సందేశహరులని, ఆయన దూతలని, పవిత్రమైన పుస్తకాలనీ, తీర్పుదినాన్నీ, అల్ ఖదర్ అనే విధి వ్రాతను ధిక్కరించినవాడు. కుఫ్ఫార్ బహువచనం.
కంజ్ (الكنز)
జకాత్ చెల్లించకుండా దాచిన వెండి బంగారాలు (ఖురాన్ 9 : 34 చూడండి).
కత్మ్ (الكتم)
జుట్టుకి రంగు వేయడానికి ఉపయోగపడే ఒక మొక్క.
కౌసర్ (الكوثر)
అల్ కౌసర్ చూడండి.
ఖజిరా (خضرة)
ఒక రకం పంట.
ఖైబర్ (خيبر)
మదీనాకి 100 కీ.మీ. దూరంలో ఉన్న ఖర్జూరం పండే ఒక గ్రామం మరియు అక్కడి ఒయాసిస్సు. ప్రవక్త ﷺ కాలంలో అక్కడ బనూ నజీర్ అని పిలువబడే ఒక యూదు తెగ ఉండేది. హిజ్రీ 5వ సంవత్సరంలో ముస్లిములు ఆ ప్రదేశాన్ని జయించారు.
ఖలీఫా (الخليفة)
ప్రతినిధి, వారసుడు. ప్రవక్త ﷺ మరణించిన తరువాత పరిపాలించిన మొదటి నలుగురు పాలకులకు ఈ పదం ఉపయోగించబడింది. ‘ఖులఫా’ బహువచనం.
ఖలీల్ (الخليل)
హృదయపూర్వకంగా ప్రేమించేవాడు. ఆ ప్రేమ స్నేహితుని కంటే, ప్రియునికంటే ఉన్నతమైనది. ప్రవక్త ﷺ కు ఒక్కడే ఖలీల్ ఉన్నాడు. ఆయన అల్లాహ్. కానీ అల్లాహ్‌కు ఎందరో ఖలీల్‌లు ఉన్నారు.
ఖలూఖ్ (الخلوق)
ఒక రకమైన అత్తరు.
ఖమ్ర్ (الخمر)
మత్తుమందు, ఆల్కహాల్ వగైరా.
ఖమీసా (الخميصة)
చతురస్రాకారంలో గుర్తులు ఉన్న నల్లటి ఊలు దుప్పటి.
ఖందఖ్ (الخندق)
గజ్వత్ ఉల్ ఖందఖ్ను చూడండి.
ఖిరాజ్ (الخراج)
పంటపై పదవ భాగం లేదా ఇరవయ్యవ భాగంగా విధించబడిన జకాత్.
ఖుసూఫ్ (الخسوف)
చంద్రగ్రహణం.
ఖవారిజ్ (الخوارج)
మతాన్ని నమ్మకుండా, మిగతా ముస్లిములతో ఏకీభవించకుండా ఉండే జనం.
ఖజీర్ (లేదా) ఖజీరా (الخزير، الخزيرة)
బార్లీపిండి, మాంసం చారు, కొవ్వుతో చేయబడిన ప్రత్యేక వంటకం.
ఖిలాఫత్ (الخلافة)
1. వారసత్వం. 2. ఇస్లామీయ నాయకత్వం.
ఖిమార్ (الخمار)
ఒక స్త్రీ తన తలను, మెడనూ కప్పుకోవడానికి ఉపయోగించే ఒక గుడ్డ ముక్క.
ఖుఫ్ఫు (الخف)
తోలు సాక్సులు.
ఖులా (الخلع)
భార్య భర్తకు కొంత మొత్తాన్ని ఇచ్చి లేదా అతను ఇచ్చిన మహర్ తిరిగి ఇచ్చేసి, అతని నుండి విడాకులు తీసుకోవడం.
ఖుమ్రా (الخمرة)
తల, చేతులకు సరిపోయేంతటి ఒక చిన్న చాప (సలాత్లో మోకరించేటప్పుడు).
ఖుముస్ (الخمس)
యుద్ధలాభంలో అల్లాహ్ పనికోసం ఐదవ భాగం ఇవ్వటం. (ఖురాన్ 8 : 41).
ఖుషూ (الخشوع)
అల్లాహ్ ముందు దీనత్వం.
ఖుత్బా (الخطبة)
మతపరమైన ప్రసంగం.
ఖుత్బత్ ఉన్ నికాహ్ (خطبة النكاح)
పెళ్ళి సమయంలో ఇచ్చే ప్రసంగం.
ఖుజాఅ (الخزاعة)
బనూ ఖుజాఅ, ఒక అరేబియన్ తెగ.
కుహుల్ (الكحل)
కంటికి పెట్టుకునే సుర్మా.
కూఫా (الكوفة)
ఇరాక్‌లో ఒక పట్టణం.
కుఫ్ర్ (الكفر)
ఇస్లామ్ విశ్వాసాల్లో దేన్నయినా నమ్మకపోవటం. అంటే అల్లాహ్, ఆయన ప్రవక్తలు, ఆయన గ్రంథాలు, పునరుత్థానదినం, అల్ ఖదర్ (దైవనిర్ణయాలు, ఆయన విధించినవి తప్పక అమలు జరుగుతాయి) అనే అంశాలను త్రోసి రాజనటం.
కుఫ్వ్ (الكفوء)
పోలిక. నాలుగు విషయాల్లో సమానత్వం, పోలిక, సరితూగటం- మతం, వంశం, వృత్తి, స్వాతంత్ర్యం. వీటిలో మతం అంగీకరించబడింది. వంశాన్నిమాత్రం నిజమైన హదీసులు అంగీకరించలేదు. ఇక మిగతా వృత్తి, స్వేచ్ఛలను అన్నీ అంగీకరించాయి. కుఫూ కాకుండా ఇతరత్రా వివాహాలను నిషేధించారు. కుఫూలో చేసుకోవటం ఎన్నో విధాల మేలు.
కున్నియ్యత్ (الكنية)
ఒక మగాణ్ణి “ఫలానా వాడి తండ్రీ” అనిగానీ, ఒక స్త్రీని “ఫలానావారి తల్లీ” అని గానీ పిలవడం. ఇది అరబ్బుల ఆచారం.
కుసూఫ్ (الكسوف)
సూర్యగ్రహణం.
L
లబ్బైక వ సాదైక (لبيك وسعديك)
నీ పిలుపుకి నేను స్పందించాను. నేను నీ ఆజ్ఞలకి అనుగుణంగా ఉంటాను.
లా యిలాహ ఇల్లల్లాహ్ (لا إله إلا الله)
అల్లాహ్ తప్ప వేరే నిజమైన దేవుడు ఎవ్వరూ లేరు.
లైలత్ ఉల్ ఖద్ర్ (ليلة القدر)
రమజాన్ నెలలోని చివరి పది రాత్రులలో ఒక రాత్రి. అల్లాహ్ ఆ రాత్రిని వెయ్యి నెలల కంటే మేలైనదిగా వర్ణించాడు. ఆ రేయి అల్లాహ్‌ని ప్రార్థించి ఖురాన్ చదివిన వాడికి, వెయ్యి నెలలు ప్రార్థించిన దానికంటే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. (అంటే 83 సంవత్సరాల 4 నెలల పుణ్యం). (ఖురాన్ 97 : 1-5, సహీ బుఖారీ 3వ సంపుటి 2వ అధ్యాయం 231వ హదీసు).
లాత్, ఉజ్జా (اللات والعزى)
ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో హిజాజ్‌లో ఆరాధించబడిన ప్రఖ్యాత విగ్రహాలు.
లియాన్ (اللعان)
ఒక భర్త తన భార్యమీద ఎవరితోనో అక్రమ సంబంధం ఉందనే నింద మోపినప్పుడు వారిద్దరూ చేసుకునే ప్రమాణం. (నూర్ 24 : 6 – 9)
లుఖతా (اللقطة)
ఏదైనా వస్తువు పోగొట్టుకున్న సొంతదారునికి కాకుండా వేరేవాడికి దొరకడం.
M
మఆఫిరి (معافري)
యమెన్ తరహా దుస్తులు.
మగాఫీర్ (المغافير)
చెడువాసన కలిగినటువంటి జిగురు.
మగ్రిబ్ (المغرب)
సూర్యాస్తమయం, సాయంత్ర ప్రార్థన.
మహ్రమ్ (المحرم)
జూమహ్రంని చూడండి.
మహ్ర్ (المهر)
పెళ్ళి సమయంలో భర్త భార్యకిచ్చే సొమ్ము.
మక్రూహ్ (المكروه)
అవాంఛనీయమైనది. శిక్షార్హం కాకపోయినా మతం దృష్ట్యా అయిష్టకరమైనది.
మమ్లూక్ (المملوك)
ఒక మగ బానిస.
మనాసికుల్ హజ్ వల్ ఉమ్రాహ్ (مناسك الحج والعمرة)
కాబా యొక్క తవాఫ్, సఫా మర్వాల సయీ. అర్ఫాత్, ముజ్దలిఫాలలో ఆగటం, జమ్రాత్లో రాళ్ళు రువ్వటం (రమీ), జంతువుల్ని బలి ఇవ్వటం (హజ్ పుస్తకంలో బుఖారీ 2,3 సంపుటాల్లో ఉమ్రా చూడండి).
మనీహా (المنيحة)
ఎవరికైనా ఒక ఆడ ఒంటెనుగానీ, గొఱ్ఱెనుగాని బహుమతి రూపంలో ఇవ్వడం. దానివల్ల వాటి పాలను అతడు ఉపయోగించుకుని తిరిగి ఆ జంతువును దాని యజమానికి ఇచ్చి వేయడం.
మఖామె ఇబ్రాహీం (مقام إبراهيم)
ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ కాబా గృహాన్ని కడుతున్నప్పుడు ఇబ్రాహీం నుంచున్న రాయి (చోటు).
మాషా అల్లాహ్ (ما شاء الله)
‘దేవుడు తలచినదే’ అని అర్థం. ఇది శుభ సంకేతం.
మష్రూబా (المشربة)
పటిష్టమైన గది.
మస్జిద్ (المسجد)
మస్జిదు (ముస్లింల ప్రార్థనాలయం)
మసానీ (المثاني)
పదే పదే వల్లించబడే ఖురాన్ వాక్యాలు. ప్రార్థనలో అల్ ఫాతిహా సూరాలోని వాక్యాలు.
మౌలా (المولى)
దీనికి చాలా అర్థాలున్నాయి. కొన్ని : విడుదల పొందిన బానిస, లేదా యజమాని లేదా అల్లాహ్.
మౌలాయా (مولايا)
కట్టుబానిసగానీ, విడుదల పొందిన బానిసగానీ తన యజమానిని వేడుకునేటప్పుడు, నా ప్రభువా, నా స్వామీ అనటం.
మౌకూజా (الموقوذة)
ఒక జంతువును కర్రతోగానీ రాళ్ళతోగానీ కొట్టి చంపటం (అదీ పూర్తిగా చంపకుండా).
మవాలీ (الموالي)
అరబ్బేతరులు లేదా పూర్వపు బానిసలు.
మయాసిర్ (المياثر)
పట్టు పరుపులు.
మిహ్జన్ (المحجن)
పట్టుకోటానికి వంపు కలిగిన ఒక చేతి కర్ర.
మిజన్నా (المجنة)
మక్కాలోని ఒక ప్రదేశం.
మినా (منى)
అరఫాత్ రోడ్డులో మక్కా వెలుపల ఉన్న ఒక యాత్రాస్థలం. ఇది మక్కా నుంచి ఎనిమిది కి.మీ. అరఫాత్ నుంచి పదహారు కి.మీ. దూరంలో ఉంది.
మీఖాత్ (الميقات)
హజ్ లేదా ఉమ్రా చేసేవాళ్ళు ‘ఇహ్రామ్’ దీక్షబూనటం కోసం మక్కా వెళ్ళే దారిలో ప్రవక్త ﷺ సూచించిన వివిధ ప్రదేశాలు.
మీరాజ్ (المعراض)
ఈకలు లేని బాణం.
మేరాజ్ (المعراج)
ప్రవక్త (సశరీరుడై) స్వర్గారోహణ చేయటం. (సహీహ్ బుఖారీ 1వ సంపుటి 345వ హదీసు, 4వ సంపుటి 429వ హదీసు, 5వ సంపుటి 227వ హదీసు. ఇంకా, ఖురాన్ 53:12 చూడండి).
మిర్బద్ (المربد)
ఖర్జూరాలు ఎండబెట్టే చోటు.
మిస్ర్ (مصر)
ఈజిప్టు.
మిస్వాక్ (المسواك)
అరాక్ చెట్టు వేర్లనుండి తయారుచేసిన పసుదోము పుల్ల.
మిస్ఖాల్ (المثقال)
తూకపురాయి. 4 2/7 గ్రాములు. బంగారాన్ని తూయటానికి వాడుతారు. 20 మిస్ఖాల్ = సుమారు 94 గ్రాములు.
ముఅజ్జిన్ (المؤذن)
నమాజ్ చెయ్యడానికి రండి అంటూ బిగ్గరగా అజాన్ ఇచ్చేవాడు.
ముఆహిద్ (المعاهد)
1. శాంతి ఒడంబడిక కుదుర్చుకున్న ఒక ముస్లిమేతరుడు. 2. వీసాతో ఒక ఇస్లామీయ రాజ్యానికి వచ్చి ఉద్యోగం చేస్తున్న ఒక ముస్లిమేతరుడు.
ముఅల్లఫత్ ఉల్ ఖులూబ్ (مؤلفة القلوب)
ఇస్లాంలో కుదురుగా ఉండేందుకుగాను కొత్తగా చేరిన ముస్లిములకు ప్రవక్త ﷺ చేసిన దానధర్మాలు.
ముఅర్రస్ (المعرس)
అష్ షజరా కన్నా మినాకు దగ్గరగా ఉన్న ప్రదేశం.
ముఅవ్వజాత్ (المعوذات)
సూరయె ఫలఖ్ (113) మరియు సూరయె నాస్ (114).
ముబష్షిరాత్ (المبشرات)
శుభ సందేశాలు. (10:64 పాదసూచికలు, సహీహ్ బుఖారీ 9వ సంపుటి 119వ హదీసు చూడండి).
మూబిఖాత్ (الموبقات)
గొప్ప వినాశకర పాపాలు.
ముదబ్బర్ (المدبر)
మరణానంతరం దాస్య విమోచన పొందుతానని యజమాని వాగ్దానాన్ని పొందినవాడు.
ముజారబత్ (المضاربة)
ఒక రకం ఒప్పందం. ఇందులో ప్రజావసరాల నిమిత్తం వేతనం ఇవ్వకపోవటాన్ని మన్నించారు. కార్మికుని నిర్లక్ష్యం వల్లగాని, కావాలని చేసిన తప్పువల్లగానీ నష్టం జరిగితే అతనిదే బాధ్యత. లేకపోతే లేదు. అలాగే పెట్టుబడిదారు విధించిన షరతులకు, సూచనలకు భిన్నంగా సహభాగస్తుడు ప్రవర్తిస్తే నష్టానికి అతనిదే బాధ్యత.
ముద్ (المد)
ఒక కిలో గ్రాములో మూడింట రెండు వంతుల కొలత (సుమారు). ఇది కొంచెం తక్కువ లేదా ఎక్కువైనా కావచ్చు.
ముఫస్సల్ (లేదా) ముఫస్సలాత్ (المفصل، المفصلات)
‘ఖాఫ్’ నుండి మొదలై దివ్య ఖురాన్ చివరి దాకా ఉండే సూరాలు. (అంటే 50 నుండి 114 సూరాలు).
ముహాజిర్ (المهاجر)
మక్కాను జయించిన దానికి ముందు, ప్రవక్త ﷺ జీవితకాలంలో ఎక్కడెక్కడి నుంచో మదీనాకు వలస వచ్చిన ముస్లిములలో ఎవరైనా ఒకరు, ఇంకా అల్లాహ్ మరియు ఇస్లాం నిమిత్తము వలసపోయే వ్యక్తి. అంతేకాకుండా అల్లాహ్ నిషేధించిన వాటన్నింటినీ వదిలేసే వ్యక్తి.
ముహాఖలా (المحاقلة)
నూర్చిన ధాన్యంతో పాటు, పంటలోని కోయని ధాన్యాన్ని కూడా కలిపి అమ్మటం.
ముహఱం (المحرم)
ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల.
ముహ్కమ్ (المحكم)
రద్దుకాని ఆదేశాలకు సంబంధించిన ఖురాన్ వాక్యాలు.
ముహ్రిమ్ (المحرم)
ఏ వ్యక్తైనా ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ చేయడం కోసం ‘ఇహ్రామ్’ స్థితిని వహించుట.
ముహ్రిమా (المحرمة)
‘ఇహ్రామ్’ స్థితిలో ఉన్న స్త్రీ.
ముహ్సార్ (المحصر)
‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి వల్ల చేయలేకపోయిన ఒక ముహ్రిమ్.
ముజాహిద్ (المجاهد)
‘జిహాద్’లో వున్న ముస్లిం యోధుడు.
ముజజ్జిజ్ (المجزز)
చేతి గుర్తులను, పాదాలను పరిశీలించి వంశ నిర్ధారణ చేసే పండితులు.
ముజ్తహిదూన్ (المجتهدون)
ఖురాన్‌లోను, ప్రవక్త ﷺ సున్నత్లోను ఆధారాలు దొరకనిదే మత అభిప్రాయాలను అంగీకరించని స్వతంత్ర మత పండితులు.
ముకాతబత్ (المكاتب)
తన విడుదల కోసం కొంత మొత్తాన్ని యజమానికి పరిహారంగా చెల్లించటానికి బానిస (స్త్రీ లేదా పురుషుడు) చేసుకునే ఒప్పందం.
ముఖాబరా (المخابرة)
పండే పంటలో సగానికో, మూడో వంతుకో కౌలుకివ్వటం. ఈ పద్ధతి అనుమతించబడింది. ఖైబర్‌లోని యూదులతో ప్రవక్త ﷺ ఈ పద్ధతే పాటించారు. నిషేధించబడిన పద్ధతి ఏంటంటే, మొత్తం భూమిలో ఈ భాగంలో పండిన పంట యజమానిదనీ, ఆ భాగంలో పండింది కౌలుదారుదనీ చెప్పటం. దీనివల్ల యజమానులకు కౌలుదారులకు గొడవలు వచ్చేవి. నిర్ణీత శాతం ప్రకారం మొత్తం పంటను ఇద్దరూ పంచుకోటానికి అంగీకరిస్తే తప్పులేదు.
ముఖాజరా (المخاضرة)
కోతకు రాకముందే పచ్చి పంటను కొనటం.
ముఖజ్రమ్ (المخضرم)
ప్రవక్త ﷺ జీవితకాలంలో ముస్లింగా మారినా, ప్రవక్త ﷺను చూడలేకపోయిన వ్యక్తి.
ములాఅనా (الملاعنة)
‘లియాన్’ చేయటం.
ములామసా(లమస్) (الملامسة)
కళ్ళు మూసుకొనిగానీ, చీకట్లోగానీ, కేవలం వస్తువును చేత్తో తాకి నిర్ణీత ధరకు కొనటం. ఉదాహరణకు ఒకడు బట్టల వ్యాపారి దగ్గరకెళ్ళి, నేను కళ్ళు మూసుకొని నీ బట్టల తాను తాకుతాను. ఏ తాను నా చేతికి తగిలితే ఆ తాను ఇంత ధరకు నాకు అమ్మాలి అంటాడు. ఈ తరహా వ్యాపారం నిషేధించబడింది. దీన్ని ‘లమస్’ అని కూడా అంటారు.
ముల్హిదూన్ (الملحدون)
మత విరోధులు.
మునాబజా (المنابذة)
మునాబజా ద్వారా జరిగే అమ్మకం జూదం లాంటిది. వస్తువుల్ని చూడకుండానే వాటిని పరస్పరం మార్చుకోటానికి ఇద్దరు వ్యక్తులు అంగీకరించటం.“నీ బట్టలకు బదులు నా బట్టలు ఇస్తాను” అంటాడొకడు. ఇద్దరిలో ఎవరూ ఎవరి బట్టలూ చూసుకోరు. అలాగే “నాకున్నది నీకిస్తాను. నీ కున్నది నాకివ్వు” అని అనొచ్చు. ఎవడికెంతుందో తెలుసుకోకుండానే ఒకరిదొకరు కొనుక్కుంటారు.
ముఖైయ్యర్ (المقير)
మత్తు పానీయాలు తయారు చేయడానికి ఉపయోగపడే కుండ యొక్క పేరు.
ముఖారజా (المقارضة)
అల్ ముఖారజా లేదా అల్ ఖిరాజ్. తన ఆస్తితో వ్యాపారం చేయటానికి ఒక భాగస్వామిని అనుమతిస్తూ యజమాని చేసిన ఒప్పందం. అందులో వచ్చే లాభాన్ని వ్యాపారంలోని భాగస్వాములు సమానంగా పంచుకోవాలి. నష్టాన్ని మాత్రం యజమానే భరించాలి.
ముసల్లా (المصلى)
ఒక ప్రార్థనా స్థలం.
ముసాఖాత్ (المساقاة)
తోట మాలి పని. పొలానికి నీళ్ళు పెట్టడం, సేద్యం చేయడం, యజమానితో కలిసి పంటను పంచుకోవటం. దీన్ని అల్ ముజారా అని కూడా అంటారు. ముసాఖాత్కు ముజారాకు తేడా ఏంటంటే మొదటిది ధాన్యం కోసం అయితే రెండవది పండ్ల చెట్ల కోసం.
ముష్రికూన్ (المشركون)
బహుదైవారాధకులు, విగ్రహారాధకులు. అల్లాహ్ ఏకదైవారాధనపై, ప్రవక్త ముహమ్మద్ ﷺపై నమ్మకం లేనివారు.
ముస్తహాజా (المستحاضة)
సాధారణ రుతు కాలాల్లో కాకుండా మధ్యలో రక్తస్రావం జరిగే స్త్రీ.
ముత్అ (المتعة)
తాత్కాలిక వివాహం. ఇస్లాం తొలి రోజుల్లో, ఎవడైనా ఇంటికి దూర ప్రాంతంలో ఉంటే అనుమతించబడ్డాడు. తరువాత ఇది రద్దు చేయబడింది.
ముతఫహ్హాష్ (المتفحش)
చెడు మాటలు వ్యాప్తి చేసే వ్యక్తి.
మూతకిఫ్ (المعتكف)
‘ఏతికాఫ్’ స్థితిలో ఉన్న వ్యక్తి.
ముతషాబిహాత్ (المتشابهات)
స్పష్టంగా లేకుండా అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉన్న ఖురాన్ వాక్యాలు.
ముత్రస్ (مترس)
ఒక పర్షియన్ పదం. “భయపడవద్దు” అని దీని అర్థం.
ముత్తఫఖ్ అలైహ్ (متفق عليه)
దీని అర్థం “అంగీకరించబడినవి”, ‘ “ఉభయోకీభవిత.” ఈ పదాన్ని బుఖారీ మరియు ముస్లిం హదీసుల గురించి వాడతారు.
ముత్తఖూన్ (المتقون)
నమ్మకం గల మరియు అల్లాహ్‌కి భయపడే మంచి వ్యక్తులు మరియు అల్లాహ్‌ని అమితంగా ప్రేమించేవారు (అల్లాహ్ నిషేధించిన పనుల జోలికి పోకుండా, పాపాల నుంచి చెడు పనుల నుంచీ దూరంగా ఉంటూ, చేయమన్న పనులను చేసేవారు).
మువత్తా (الموطا)
నాలుగు ‘ఫిఖ్ ఇమాము’లలో ఒకరైన, ఇమామ్ మాలిక్చే సంకలనం చేయబడిన హదీసు పుస్తకం.
ముజాబనా (المزابنة)
పచ్చి ఖర్జూరాలకు బదులు ఎండు ఖర్జూరాలు, పచ్చి ద్రాక్షకు బదులు ఎండుద్రాక్ష కొలిచి అమ్మటం. ఎండు పండ్లను కొలిస్తే పచ్చి పండ్లను గెలలపైనే అంచనా వేస్తారు.
ముజఫ్ఫత్ (المزفت)
మత్తు పానీయాలు తయారుచేయడానికి ఉపయోగపడే కుండ పేరు.
ముజారా (المزارعة)
అల్ ముజారా అంటే సేద్యం కోసం భూమిని వేరే ఎవరికైనా ఇచ్చి ఉత్పత్తిని పంచుకోవడం. ప్రవక్త ﷺ ఈ పద్ధతిని ఆపలేదు. భూమి తక్కువగా ఉండి అన్సారులు, ముహాజిర్లు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎవరు ఎంత ఎక్కువగా సేద్యం చేయగలిగితే అంత త్వరగా చేసేలా ఆదేశించారు. అయితే మిగిలిన భూమిని ‘ముజారా’ పద్ధతిలో ఉత్పత్తిని పంచుకోకుండా ‘ఇజారా’ పద్ధతిలో కౌలుకు ఇమ్మన్నారు. ఎందుకంటే ఇజారా కౌలుదారుకు సౌకర్యంగా ఉంటుంది. తరువాత అందరికీ తగినంత భూమి దొరికినందువల్ల ఈ ఆంక్షను ఎత్తివేశారు.
ముజ్దలిఫా (المزدلفة)
అరఫాత్ మరియు మినాల మధ్య ఉన్న ప్రాంతం. యాత్రికులు అరఫాత్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఆగి, ఆ రాత్రి పూర్తిగాగానీ లేదా అంతకంటే ఎక్కువ సేపుగానీ ఉండాలి. జుల్ హిజ్జా తొమ్మిది లేదా పదవ రోజున, వీరంతా కలిసి మగ్రిబ్ మరియు ఇషా ప్రార్థనలు చేయాలి.
N
నబీజ్ (النبيذ)
ఖర్జూరాలు లేదా ద్రాక్ష పండ్లను నానబెట్టే నీరు. అయితే పులియనివ్వరు.
నాజిహా (الناضحة)
వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఒంటె.
నజి (النضى)
బాణంలో ఒక భాగం.
నఫస్ (النفث)
చేతబడి, మంత్ర విద్య.
నఫఖ్ (النفخ)
సాతాను బుసకొట్టడం.
నహద్ (النهد)
ప్రయాణంలోని ఖర్చులను పంచుకోవడం లేదా ప్రయాణీకుల ఆహారాన్నంతటినీ ప్రయాణీకులందరూ సమానంగా పంచుకోవడం.
నహ్ర్ (النحر)
గొంతు మొదట్లోని కరోటిడ్ ధమనిని కోయటం ద్వారా ఒంటెను జిబహ్ చేయటం. జుల్ హిజ్జా 10వ రోజున యాత్రికులు జంతువుల్ని బలి ఇస్తారు.
నజ్ద్ (نجد)
ఎత్తైన భూమి అని అర్థం. లిహామా – ఇరాక్‌ల మధ్య విశాల భూమి.
నమీమా (النميمة)
ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచటానికి తప్పుడు సమాచారం చేరవేస్తూ ఉండటం.
నఖీబ్ (النقيب)
ఒక ప్రయాణంలో ఆరుగురు వ్యక్తుల మీద నాయకత్వం వహించిన వ్యక్తి. ఒక తెగలోని ముఖ్యుడు.
నఖీర్ (النقير)
మత్తుపానీయాలు తయారు చేయడానికి ఉపయోగపడే ఒక కుండ పేరు.
నస్ల్ (النصل)
బాణంలోని ఒక భాగం.
నవాఫిల్ (النوافل)
(నఫిల్ ఏక వచనం) తప్పనిసరి ప్రార్థనలు ‘ఫరాయెజ్’ అయితే స్వచ్ఛంద ప్రార్థనలు ‘నవాఫిల్’ అనబడతాయి.
నికాహ్ (النكاح)
ఇస్లాం ధర్మం ప్రకారం జరిగే పెళ్ళి.
నిసాబ్ (النصاب)
జకాత్ చెల్లించటానికి ఉండాల్సిన కనీస ఆస్తి. 20 మిస్ఖాల బంగారం అంటే 94 గ్రాములు. 200 దిర్హముల వెండి అంటే 640 గ్రాములు, 5 అవ్సక్ల ధాన్యం లేదా పండ్లు అంటే 673 1/2 కిలోలు, 5 ఒంటెలు, 5 ఆవులు, 40 గొఱ్ఱెలు.
నష్ (النش)
1/2 ఉఖియా (సుమారు 64 గ్రాములు)తో సమానమైన బరువు.
నూన్ (نون)
చేప.
నుస్క్ (النسك)
మతానుసారం చేసే ప్రార్థన.
నుసుబ్ (النصب)
కొన్ని సమాధులు, ప్రాంతాల్లో రాతి పీఠాలు. విగ్రహాలకు,జిన్నులకు, సన్యాసులకు కొన్ని సందర్భాల్లో వారిని గౌరవించటానికి, లేదా వారినుండి లాభం పొందటానికి ఈ రాతి పీఠాల మీద బలిస్తారు.
నుసుక్ (النسك)
ఒక త్యాగం.
Q
ఖబా (القباء)
పూర్తి నిడివి చేతులు గల బయటి వస్త్రం.
ఖదర్ (القدر)
దైవనిర్ణయం. విధివ్రాత.
ఖాజి (القاضي)
ముస్లిం న్యాయమూర్తి.
ఖలీబ్ (القليب)
ఒక బావి.
ఖారీ (القارئ)
పూర్వం ముస్లిం మత పండితుల్ని ‘ఖురా’ (‘ఖారీ’కి బహువచనం) అని పిలిచేవారు. ‘ఖారీ’ అనే పదాన్ని ఖురాన్ పూర్తిగా కంఠస్థం చేసిన వ్యక్తికి కూడా ఉపయోగిస్తారు. దీని బహువచనం ‘ఖురా’. ఈ ‘ఖురా’ అనే వారు తొలి ముస్లింలకి గురువులు.
ఖారిన్ (القارن)
హజ్జుల్ ఖిరాన్ చేసే వ్యక్తి.
ఖర్న్ అల్ మనాజిల్ (قرن المنازل)
నజ్ద్ ప్రజల యొక్క ‘మీఖాత్’. ఇది మక్కాకు వెళ్ళే దారిలో నెలకొని ఉంది. (దీన్ని ఇప్పుడు అస్ సెయిల్ అల్ కబీర్ అంటున్నారు).
ఖసబ్ (القصب)
బంగారంతో, ముత్యాలతో మరియు ఇతర విలువైన రాళ్ళతో తయారు చేయబడిన పైపులు.
ఖతీఫా (القطيفة)
చిక్కటి మృదువైన బట్ట.
ఖత్తాత్ (القتات)
హాని చేద్దామనే ఉద్దేశ్యంతోగానీ, ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచే ఉద్దేశ్యంతో గానీ ఒకరి సమాచారాన్ని మరొకరికి చేరవేసే వ్యక్తి. (సహీహ్ బుఖారీ 8వ సంపుటి, 82వ హదీసు).
ఖిబ్లా (القبلة)
ముస్లిములందరూ నమాజులో మక్కాలోని కాబా వైపునకు తిరిగి నిలబడే దిశ.
ఖీల్ వ ఖాల్ (قيل وقال)
పాపభూయిష్టమైన, పనికిమాలిన మాటలు (ఉదాహరణకు చాడీలు చెప్పడం, అబద్ధాలాడటం మొదలైనవి). పిచ్చాపాటీ, కాలక్షేపానికి కబుర్లు, ఉబుసుపోక అన్న భావంలో కూడా ఈ పదాన్ని వాడతారు.
ఖిన్తార్ (القنطار)
ఆహార ధాన్యాలను కొలిచే సాధనం. ఉదా॥ గోధుమలు, జొన్న, బార్లీ.
ఖిరాం (القرام)
పల్చటి ఊలు పరదా.
ఖీరాత్ (القيراط)
ఒక ప్రత్యేకమైన బరువు. కొన్నిసార్లు ఈ బరువు ఉహుద్ కొండంత ఉంటుంది. ఖీరాత్ = 1/2 దానిక్ మరియు 1 దానిక్ = 1/6 దిర్హమ్.
ఖిస్సీ (القسي)
పట్టుతో చేయబడిన ఒక రకమైన బట్ట. ఇది ఈజిప్టులోని ఖిస్సీ అనే ప్రదేశంలో తయారుచేయబడింది. కాబట్టి దాన్ని ఆ పేరుతో పిలుస్తారని కొందరంటారు.
ఖిసామ్ (القسام)
ఇది మొక్కలకొచ్చే జబ్బు. దీనివల్ల వాటి కాయలు పండక ముందే రాలిపోతాయి.
ఖియామ్ (القيام)
ప్రార్థనలో నిలబడే స్థితి.
ఖియాస్ (القياس)
ఇస్లామిక్ మత పండితుల చేత ఇవ్వబడిన నిర్ణయాలు మరియు తీర్పులు. ఇవి 4 ఆధారాలతో ఇవ్వబడుతుంటాయి: 1. ఖురాన్ నుండి. 2. ప్రవక్త ﷺ ఆచరణల నుండి. 3. ముజ్తహిదూన్ లందరి ఏకాభిప్రాయం నుండి. 4. ఖియాస్ – అంటే ప్రవక్త ﷺ తీర్పు ఇచ్చిన లాంటి తగాదాలకే ముజ్తహిద్లు ఇచ్చిన తీర్పుల నుండి. మొదటి మూడింటిలో నిర్ణయాలు దొరకనప్పుడే ఖియాస్ను అనుసరించాలి.
ఖుబా (قباء)
మదీనా పొలిమేరల్లో ఉన్న ప్రాంతం. ప్రవక్త ﷺ అదే పేరుతో అక్కడ ఒక మస్జిదును నిర్మించారు. ఈ మస్జిదును శనివారం ఉదయం సందర్శించి రెండు రకాతుల నమాజు చేస్తే ఉమ్రాహ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త ﷺ చెప్పారు.
ఖజజ్ (القذذ)
బాణంలో ఒక భాగం.
ఖుంఖుం (قمقم)
ఇరుకు మూతి పాత్ర.
ఖునూత్ (القنوت)
సలాత్ (ప్రార్థన)లో వేడుకోలు.
ఖురైష్ (القريش)
ఇస్లాంకు ముందు అజ్ఞాన కాలంలో అరేబియాలో ఉన్న ఒక గొప్ప తెగ. ముహమ్మద్ ప్రవక్త ﷺ ఈ తెగకే చెందినవారు. ఇస్లాంకు ముందు వెనుకా కూడా వీరికి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కూడా గొప్ప శక్తులున్నాయి.
ఖురైషీ (القريشي)
కురైష్ తెగకు చెందిన వ్యక్తి.
R
రబ్ (الرب)
తెలుగు భాషలో ‘రబ్’ అనే పదానికి సరైన సమానార్థం వచ్చే పదం ఏదీ లేదు. దీని అర్థం ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్కడైన ఆ దేవుడు. సృష్టికర్త, యజమాని, నిర్వాహకుడు, సమకూర్చేవాడు, గురువు, వ్యూహకర్త, మేలుకోరేవాడు, భద్రత కల్పించేవాడు. అల్లాహ్ యొక్క అనేక పేర్లలో రబ్ కూడా ఒకటి. దీనికి దగ్గరి పదం ‘ప్రభువు’ అని వాడాము. ప్రభువు అని ఎక్కడ వచ్చినా రబ్ అని అర్థం చేసుకోండి.
రబ్బుక్ (ربك)
నీ ప్రభువు, నీ గురువు.
రబీ ఉల్ అవ్వల్ (ربيع الأول)
ఇస్లామిక్ క్యాలెండర్లో మూడవ నెల.
రాహిలా (الراحلة)
సవారి చేయడానికి ఉపయోగపడే ఆడ ఒంటె.
రహ్న్ (الرهن)
షరీయత్ ప్రకారం, అర్ రహ్న్ (తాకట్టు) అంటే అప్పు లేదా ఋణాన్ని తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చేవారికి హామీగా కొంత ఆస్తిని, వస్తువును ఇవ్వడం.
రయ్యాన్ (الريان)
తరచుగా ఉపవాసాలు చేసే భక్తులు ఈ స్వర్గ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు.
రజబ్ (رجب)
ఇస్లామిక్ క్యాలండర్లో ఏడవ నెల.
రకాతు (الركعة)
ముస్లిముల సలాత్ (నమాజు)లో రకాత్లుంటాయి. ఒక రకాతు అంటే. ఒకసారి నిలబడటం, ఒకసారి వంగటం, రెండుసార్లు మోకరిల్లటం ఉంటాయి.
రమజాన్ (رمضان)
సౌమ్ (ఉపవాసాలు) ఉండే నెల. ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది తొమ్మిదవ నెల. ఈ నెలలోనే ఖురాన్ అవతరణ ప్రారంభం అయింది. ఖద్ర్ రాత్రి ప్రవక్త ﷺపై అవతరించింది. బద్ర్ యుద్ధం ఈ నెలలోనే జరిగింది.
రమల్ (الرمل)
తనలోని శారీరక శక్తిని తెలియజేసే, భుజాలు ఎగురవేస్తూ కాళ్ళు కదిలిస్తూ నడిచే వేగవంతమైన నడక. కాబా చుట్టూ తిరిగేటప్పుడు ‘తవాఫ్’ యొక్క మొదటి మూడు రౌండ్లలో దీన్ని గమనించవచ్చు. దీన్ని కేవలం మగవారు మాత్రమే చేస్తారు. ఆడవారు కాదు.
రమీ (الرمي)
మినా వద్ద జిమార్ వైపు రాళ్ళు విసరడం.
రిబా (الربا)
పేరాశ, పెరుగుదల. ఇది రెండు రకాలుగా ఉంటుంది. (1). రిబా నసీయా, అప్పు ఇచ్చిన డబ్బుపై వచ్చే వడ్డీ. (2) రిబా ఫజల్, తక్కువ నాణ్యత గల సరుకులు అధికంగా ఇచ్చి ఎక్కువ నాణ్యతగల సరుకులు తీసుకోవడం. ఉదాహరణకు తక్కువ నాణ్యతగల ఖర్జూరాలను ఇచ్చి ఎక్కువ నాణ్యతగల ఖర్జూరాలను పెద్ద మొత్తంలో తీసుకోవడం. ఇస్లాం ఈ రకమైన అన్యాయపు వడ్డీలను నిషేధిస్తుంది.
రిదా (الرداء)
శరీరపు పై భాగాన్ని కప్పడానికి వేసుకునే గుడ్డ ముక్క.
రికాజ్ (الركاز)
పూడ్చిపెట్టిన సంపద.
రూహుల్లాహ్ (روح الله)
రూహ్ మరియు అల్లాహ్ అనే రెండు నామవాచకాల పదబంధం రూహుల్లాహ్. ప్రవక్త ﷺ అనుచరులలోని తొలి పండితుల వివరణల ప్రకారం రెండు నామవాచకాల లింగ నిర్మాణాల మధ్య తేడా విశదపరిచే వ్యాకరణ నియమం ఇలా ఉంది:
(1). రెండు నామవాచకాల్లో ఒకటి అల్లాహ్, రెండవది ఒక వ్యక్తి లేదా వస్తువు అయినప్పుడు. ఉదా॥ 1. బైతుల్లాహ్ – అల్లాహ్ ఇల్లు. 2. రసూలుల్లాహ్ – అల్లాహ్ సందేశహరుడు. 3. అబ్దుల్లాహ్- అల్లాహ్ దాసుడు. 4. రూహుల్లాహ్ – అల్లాహ్ ఆత్మ వగైరా.
రెండవ నామవాచకం యొక్క నియమం-సందేశకుడు, ఇల్లు, దాసుడు, ఆత్మ లాంటివన్నీ అల్లాహ్ చేత సృష్టించబడ్డాయి గనక గౌరవనీయమైనవి. అల్లాహ్ ఆత్మ అంటే అల్లాహ్ సృష్టించిన ఆత్మ. ఉదా॥ ఈసా, “అవ్వు” అంటే అయ్యింది. ఆదాము సృష్టిలాగా.
2) ఒకటి అల్లాహ్ రెండవది వ్యక్తో వస్తువో కానప్పుడు – అది సృష్టించబడింది కాదు. అల్లాహ్ గుణగణాలన్నమాట. ఉదా॥ 1. అల్లాహ్ జ్ఞానము (ఇల్ముల్లాహ్). 2. అల్లాహ్ జీవం (హయాతుల్లాహ్). 3. అల్లాహ్ వాక్కు (కలాముల్లా) 4. అల్లా స్వంతం (జాతుల్లాహ్) వగైరా.
రుఖ్బా (رقبى)
ఒక ఇంటిని ఎవరికైనా జీవితకాలం ఉండనిచ్చే వీలుగా ఇవ్వడం, కానీ ఒక ఆస్తిగా మాత్రం కాదు.
S
సా (الصاع)
4 ముద్ (3 కి.గ్రా) లతో సమానమైన కొలత.
సబా అల్మసానీ (سبع المثاني)
పదే పదే చదివే ఏడు చరణాలు. ఉదా ॥ సూరయె ఫాతిహా.
సబాహా (صباحاه)
సహాయం కోసం చేసే ఆర్తనాదం.
సాబిఊన్ (الصابئون)
యూదులు కాదు క్రైస్తవులూ కాదు. జబూర్ గ్రంథాన్ని చదువుతూ “లా యిలాహ ఇల్లల్లాహ్” అనే వాక్యాన్ని విశ్వసించేవారు. ఇరాక్‌లో ఈ జాతి గతించింది.
సాదాన్ (السعدان)
జంతువులు మేయడానికి వీలుగా ఉండే ఒక ముళ్ళ మొక్క.
సదఖా (الصدقة)
దయతో ఇచ్చినది ఏదైనా.
సఫా మరియు మర్వా (الصفا والمروة)
తూర్పు వైపున మక్కా ప్రక్కన ఉన్న అల్ మస్జిద్ అల్ హరామ్ (పవిత్రమైన మస్జిద్) వద్ద ఉన్న రెండు పర్వతాలు. ఉమ్రా లేదా హజ్ చేసేవారు ఈ పర్వతాల మధ్య ఏడుసార్లు నడవాలి. దీనినే ‘సయీ’ అంటారు.
సహ్బా (صهباء)
ఖైబర్ దగ్గరి ప్రదేశం.
సహీహైన్ (الصحيحين)
రెండు హదీసు పుస్తకాలు – బుఖారీ మరియు ముస్లిం.
సహూర్ (السحور)
సౌమ్ (ఉపవాసం) ఉంటున్న వ్యక్తి ఫజ్ర్ (ఉదయం) నమాజుకు ముందు రాత్రిపూట తీసుకునే ఆహారం.
సహ్వ్ (السهو)
మర్చిపోవడం (నమాజులో ఎన్ని రకాతులు చేశాడో మర్చిపోవడంలాంటి పొరపాట్లు జరగటం. అలాంటప్పుడు ఆ వ్యక్తి అదనంగా రెండు సజ్దాలు చేయాలి).
సకీనహ్ (السكينة)
నెమ్మదితనం, మౌనం, శాంతం మరియు స్థిమితం మొదలైనవి.
సలబ్ (السلب)
యుద్ధంలో చనిపోయిన యోధునికి చెందినవి (గుర్రం, ఆయుధాలు మొ.)
సలఫ్ (السلف)
తరువాత ఇవ్వబడే సరుకుల కోసం ముందుగానే డబ్బులు చెల్లించే అమ్మకం.
సలమ్ (السلم)
సలఫ్కి పర్యాయ పదం.
సమి అల్లాహు లిమన్ హమిదహ్: తనను స్తుతించేవాని మొర అల్లాహ్ విన్నాడు.
సముర్ (السمر)
ఒక రకమైన చెట్టు.
సనహ్ (سناه)
ఇథియోపియన్ భాషలో దీని అర్థం ‘మంచి’ అని.
సరియ్యా (السرية)
ప్రవక్త ﷺ స్వయంగా పాల్గొనకుండా జిహాద్ చేయటానికి పంపిన ఓ చిన్న సైనిక పటాలం.
సరిఫ్ (سرف)
మక్కాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం.
సవీఖ్ (السويق)
వేపిన గోధుమలు లేదా బార్లీ గింజల పొడితో చేయబడిన ఒక రకమైన అంబలి (చక్కెర మరియు ఖర్జూరాలతో కూడా).
సయీ (السعي)
హజ్ మరియు ఉమ్రాహ్ చేసేటప్పుడు మక్కాలో సఫా మరియు మర్వా పర్వతాల మధ్య ఏడుసార్లు పరుగెత్తడం.
సయ్యిద్ (السيد)
యజమాని లేదా దొర (ఈ పదాన్ని ప్రవక్త ﷺ యొక్క వారసులకు పేరుగా వాడతారు).
సయ్యిదీ (سيدي)
నా యజమాని.
షాబాన్ (شعبان)
ఇస్లామిక్ క్యాలెండర్లో ఎనిమిదవ నెల.
షామ్ (الشام)
సిరియా, పాలస్తీనా, లెబనాన్ మరియు జోర్డాన్ ప్రాంతాలు.
షవ్వాల్ (شوال)
ఇస్లామిక్ క్యాలెండర్లో పదవ నెల.
షిగార్ (الشغار)
ఇది ఒక రకమైన పెళ్ళి, ఇందులో వ్యక్తులు పెళ్ళిలో తమ కూతుళ్ళను లేదా చెల్లెళ్ళను మహ్ర్ లేకుండానే ఇచ్చిపుచ్చుకుంటారు.
షిరాక్ (الشراك)
ఒక తోలు కట్టు.
షిర్క్ (الشرك)
బహుదైవారాధన, అల్లాహ్‌తో పాటు ఇతరులను కూడా పూజించడం.
షుఫా (الشفعة)
ముందుగా జరిగే విక్రయము.
సిద్దీఖ్ మరియు సిద్దీఖూన్ (الصديق والصديقون)
ప్రవక్తను ముందుగా నమ్మి అనుసరించినవారు. (ఖురాన్ : 4 : 69)
సిద్ర్ (السدر)
రేగుచెట్టు (లేదా నిబ్క్ చెట్టు).
సిద్రత్ ఉల్ మున్తహా (سدرة المنتهى)
స్వర్గానికి దగ్గరగా ఉన్న ఏడవ ఆకాశంపై ఉన్న నబ్క్ చెట్టు (స్వర్గం పైఅంచులోఉన్న రేగు చెట్టు).
సిఫ్ఫీన్ (صفين)
ఉస్మాన్(రదియల్లాహు అన్హు)ను చంపిన తరువాత సిఫ్ఫీన్లో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) అనుచరులు హజ్రత్ ముఆవియ (రదియల్లాహు అన్హు) అనుచరుల మధ్య జరిగిన యుద్ధం.
సివాక్ (السواك)
అల్ అరాక్ చెట్టు యొక్క వేరు ముక్క. ఇది పసుదోము పుల్లగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది.
సుబ్హానల్లాహ్ (سبحان الله)
పవిత్రత అల్లాహ్‌కే!
సుహూలియా (السحولية)
ఒక కాటన్ బట్ట, దీని పేరు యమెన్‌లోని సుహూల్ అనే గ్రామం పేరు నుంచి సంగ్రహించబడింది.
సున్దుస్ (السندس)
ఒక రకమైన పట్టు బట్ట.
సున్నత్ (السنة)
ముస్లిములు అనుసరించవలసి ఉన్న ప్రవక్త ﷺ యొక్క ప్రవచనాలు, ప్రార్థనా పద్ధతులు, ఆజ్ఞలు, క్రమమైన మార్గాలు మొదలగునవి.
సుత్రా (السترة)
ఒక స్తంభం, కర్ర, గోడ. నమాజు చేసే వ్యక్తికీ – ఇతరులకు మధ్య హద్దుగా ఒక అడుగు ఎత్తున ఉండేది.
T
తాబయి (التابعي)
(బహువచనం తాబయీన్. అంటే అర్థం అనుచరులు లేదా వారసులు). ప్రవక్త యొక్క సహచరుడిని కలిసిన లేదా అనుసరించిన వ్యక్తికి పెట్టే పేరు.
తబూక్ (تبوك)
మదీనాకి ఉత్తరాన 700 కిలో మీటర్ల దూరంలో ఉన్న పేరెన్నికగన్న టౌను.
తాగూత్ (الطاغوت)
తాగూత్ అనే పదానికి చాలా అర్థాలున్నాయి. నిజ దేవుడైన అల్లాహ్‌ని తప్ప పూజించబడేది ఏదైనా అని దీని అర్థం. అనగా బూటకపు దేవుళ్ళు. అది సైతాన్ కావచ్చు, దెయ్యాలు, విగ్రహాలు, రాళ్ళు, సూర్యుడు, నక్షత్రాలు, దేవదూతలు, మనుషులూ కావచ్చు. ఉదా ॥ జీసస్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క దూతలు, తప్పుగా పూజించబడేవారు మరియు ‘తాగూత్’ గా భావించబడేవారు. ఋషులు, సమాధులు, పాలకులు, నాయకులు మొదలైన వారు తప్పుగా పూజించబడుతున్నారు, అలాగే అనుసరించబడుతున్నారు.
తహజ్జుద్ (التهجد)
ఇషా ప్రార్థన తరువాత ఫజ్ర్ ప్రార్థనకు ముందు, రాత్రి ఏ సమయంలోనైనా చేసే నఫిల్ నమాజు.
తహ్నీక్ (التحنيك)
ఇది ఇస్లామిక్ ఆచార పద్ధతి, దీనిలో ఖర్జూరాన్ని నమలడం, పిల్లవాడి నోటిలో ఖర్జూరపు రసాన్ని కొంత పోసి, వాడి చెవుల్లో ‘అజాన్’ వాక్యాలు చెప్పడం(సహీ బుఖారీ : అఖీఖా ప్రకరణం 7వ సంపుటి 272వ పేజీ చూడండి).
తయ్యిబా (الطيبة)
మదీనా నగరం యొక్క పేర్లలో ఒకటి.
తాయిఫ్ (الطائف)
మక్కా దగ్గరి పేరుగాంచిన టౌను.
తక్బీర్ (التكبير)
‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అత్యంత గొప్పవాడు) అని అనడం.
తక్బీరతుల్ (اتكبيرة)
‘అల్లాహు అక్బర్’ అని ఒకసారి అనడం.
తల్బినా (التلبينة)
పిండి మరియు తేనెతో చేయబడిన వంటకం.
తల్బియా (التلبية)
‘లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్’ అని అనడం (ఓ అల్లాహ్! నీ ఆజ్ఞలను శిరసావహిస్తూ హాజరయ్యాను, నీ పిలుపుకు స్పందించాను).
తరావీహ్ (التراويح)
రమజాన్ యొక్క రాత్రులలో ‘ఇషా’ ప్రార్థనల తర్వాత ఇష్టప్రకారంగా చేసే అదనపు ప్రార్థనలు. వీటిని వ్యక్తిగతంగా గానీ లేక ప్రార్థనా సమూహంతో గానీ చేయవచ్చు.
తరిబత్ యమీనుక (تربت يمينك)
(నీ కుడి చెయ్యి దుమ్ములో ఉండునుగాక). ఇది హెచ్చరిక. నేను చెప్పినది నువ్వు చెయ్యకపోతే నువ్వు గొప్ప ప్రయోజనాన్ని పోగొట్టుకుంటావు. మట్టి కొట్టుకుపోతావు అని చెప్పటం.
తర్జీ (الترجيم)
ముఅజ్జిన్ చేత అజాన్ యొక్క పదాలను రెండుసార్లు మళ్ళీ చెప్పించడం.
తషహ్హుద్ (التشهد)
ప్రార్థనను చదవడం: అత్ తహియ్యాతు లిల్లాహి….(నుంచి)…. వ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలల్లాహ్” (వరకు) ఖువూద్లో కూర్చుని చెప్పటం. (బుఖారీ : 1వ సంపుటి 794వ హదీసు). అల్లాహ్ తప్ప ఆరాధనీయుడెవడూ లేడనీ, ముహమ్మదు అల్లాహ్ ప్రవక్త ﷺఅనీ ప్రకటించడం.
తస్లీమ్ (التسليم)
సలాత్ (నమాజు)ను ముగించిన తరువాత, వ్యక్తి తన ముఖాన్ని కుడి వైపునకు, ఎడమ వైపునకు తిప్పి అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (శాంతి మరియు అల్లాహ్ యొక్క దయ నీ మీద ఉండునుగాక!) అని అనటం. దీనినే తస్లీమ్ అంటారు.
తౌహీద్ (التوحيد)
తౌహీద్ అనగా అల్లాహ్ ఒక్కడే దేవుడు అని ప్రకటించడం. దీనికి మూడు రూపాలున్నాయి:
(అ) అల్లాహ్ ప్రభుత్వం యొక్క ఏకత్వం: తౌహీద్-అర్-రుబూబియ్యా. విశ్వం అంతటికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని నమ్మడం, దాని సృష్టికర్త, నిర్వాహకుడు, వ్యూహకర్త, భద్రత నిచ్చేవాడు అల్లాహ్ ఒక్కడేనని విశ్వసించటం.
(ఆ) అల్లాహ్‌ని ప్రార్థించడంలోని ఏకత్వం : తౌహీద్-అల్-ఉలూహియ్యా. పూజించబడే హక్కు అల్లాహ్‌కు తప్ప వేరే ఎవ్వరికీ లేదని నమ్మడం (ఉదాహరణకు ప్రార్థించడం, వేడుకోవడం, సహాయాన్ని అడగటం, ప్రమాణం చేయడం, ఇవ్వడం, ఉపకారం చేయడం, ఉపవాసం, యాత్ర…. మొదలగునవి).
(ఇ) అల్లాహ్ పేర్లు, గుణగణాలలోని ఏకత్వం : తౌహీద్ అల్ అస్మా వస్ సిఫాత్: ఇవి నమ్మాలి : 1. ఆయన, ఆయన సందేశహరుడు పిలిచిన పేర్లతో తప్ప అల్లాహ్‌ను మరో పేరుతో పిలవకూడదని, 2. అల్లాహ్ గుణగణాలను, పేర్లను మరొకరికి పెట్టకూడదని (ఉదా: అల్ కరీమ్). 3. ఖురాన్ లోను, ముహమ్మదు గారి ద్వారా అల్లాహ్ వెల్లడించిన తన గుణగణాలను ధృవీకరించాలని, వాటిని మార్చకూడదని, ఉపేక్షించకూడదని, సృష్టితాలలో మరేదైనా పోలిక వచ్చేలా ఈ పేర్లను వక్రీకరించడం కూడదనీ. ఉదాహరణకు: ఖురాన్లో చెప్పబడినట్లు అల్లాహ్ తన సింహాసనం మీద కూర్చున్నాడని (20:5), అనంత కరుణామయుడు (అల్లాహ్) ఏడవ ఆకాశంలోని బలమైన సింహాసనంపై నుండి లేచాడనీ, జుల్ హిజ్జా 9వ రోజు అయిన అర్ఫాత్ రోజున మాత్రమే ఆయన మొదటి ఆకాశానికి దిగివస్తాడని, ముహమ్మద్ ﷺ గారు చెప్పినట్లు ఆ రోజు రాత్రి మూడవ భాగంలో ఆయన తన జ్ఞానంతో మన మధ్య ఉంటాడుగానీ, తన దేహంతో కాదు. ఆయన్ని పోలిందేదీ లేదు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. (42 : 11)
ఆయన తరహా వినికిడి, చూపు మరెవరికీ లేవని పై వాక్యం చెబుతోంది. “నా రెండు చేతులతో నేను సృష్టించిన వానికి” (48:10) అన్నాడు. “అల్లాహ్ చేతులు వారి చేతులపై ఉన్నాయి” అని కూడా అన్నాడు (48:10). అంటే అల్లాహ్‌కు రెండు చేతులున్నట్లు తెలుస్తోంది కానీ అవి ఎలా ఉంటాయో తెలియదు.
ఇదే నిజ విశ్వాసులందరి నమ్మకం. నూహ్, ఇబ్రాహీం, మూసా, క్రీస్తు (అలైహిముస్సలాం) మొదలు చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ గారి వరకు – అల్లాహ్ ప్రవక్తలందరి విశ్వాసం ఇదే. అంతే కానీ అల్లాహ్ అన్ని చోట్ల ఉంటాడనీ, ఇక్కడ అక్కడా, మనుషుల గుండెల్లో కూడా ఉంటాడని కాదు.
“లా ఇలాహ ఇల్లల్లాహ్”అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు అనే వచనంలో ఈ మూడు తౌహీద్ అంశాలు ఇమిడి ఉన్నాయి.
అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ ﷺను అనుసరించటం అవశ్యం. ముహమ్మదు ﷺ అల్లాహ్ ప్రవక్త అని ప్రకటించడం, అల్లాహ్ గ్రంథాన్ని, అల్లాహ్ ప్రవక్త ﷺను అనుసరించక తప్పదని దీని అర్థం. (ఖురాన్ 59:7, 3:31 చూడండి).
తవాఫ్ (الطواف)
కాబా చుట్టూ ప్రదక్షిణాలు చేయటం.
తవాఫ్ అల్ ఇఫాజా (طواف الإفاضة)
యాత్రికులు జుల్ హిజ్జా యొక్క పదవ రోజున మినా నుంచి వచ్చిన తరువాత కాబా చుట్టూ ప్రదక్షిణాలు చేయటం. ఈ తవాఫ్ అనేది హజ్ యొక్క ప్రధాన ఆచారాలలో ఒకటి.
తవాఫ్ ఉల్ విదా (طواف الوداع)
హజ్ లేదా ఉమ్రాహ్ చేసిన తరువాత మక్కాను వదిలివెళ్ళే ముందు నిర్వహించే తవాఫ్.
తయమ్ముమ్ (التيمم)
శుభ్రమైన మట్టిపై చేతులుంచి, ఒక చేతిపై మరో చేయి పెట్టి పూసుకోవటం. తరువాత దుమ్ము ఎగిరిపోయేలా ఊదటం. దీనిని వుజూ, గుసుల్లకు బదులు (జనాబత్ సందర్భంలో నయితం) చేస్తారు.
సనియ్యత్ అల్ వదా (ثنية الوداع)
మదీనా దగ్గరి ప్రదేశము.
సరీద్ (الثريد)
మాంసము మరియు రొట్టెతో చేయబడిన ఒక రకమైన వంటకం.
సూర్ (الثور)
మదీనాలో పేరుగాంచిన పర్వతము.
సున్యా (الثنيا)
తోటలో పండ్లు చెట్లపై ఉండగానే పెట్టే బేరం. ఏదో ఒక ధరకు పండ్లను అమ్ముతూ “కొంత పంట” తానే ఉంచుకుంటానని షరతుపెట్టడం. ఇది అన్యాయం. “కొంత” అంటే ఎంతో తెలియదు. ఇందులో మోసం ఉంది.
తిలా (الطلاء)
ద్రాక్ష నుంచి చేసిన ఒక రకమైన మత్తు పానీయం.
తుబ్బాన్ (تبان)
కుస్తి పట్టేవాళ్ళు మోకాళ్ళను కప్పేలా ధరించే ఉడుపులు.
తులఖా (الطلقاء)
మక్కాను జయించిన రోజున ఇస్లాంను స్వీకరించిన వ్యక్తులు.
తూర్ (الطور)
ఒక పర్వతం.
U
ఉహుద్ (أحد)
మదీనాలోని పేరుగాంచిన ఒక పర్వతం. ఇస్లాం చరిత్రలో జరిగిన గొప్ప యుద్ధాలలో ఆ పర్వత ప్రాంగణంలోనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరు గజ్వయె ఉహుద్.
ఉమ్మత్ (الأمة)
జాతి; ముస్లిం ప్రజలను ఉద్దేశించబడినది.
ఉమ్ముల్ వలద్ (أم الولد)
తన యజమాని కొరకు పిల్లవాడిని కనే ఒక బానిస స్త్రీ.
ఉమ్మె ఉల్ మూమినీన్ (أم المؤمنين)
“విశ్వాసుల తల్లి.” ఇది ప్రవక్త ﷺ యొక్క భార్యలకు పెట్టబడిన పేరు. దీని యొక్క బహువచనం ఉమ్మహాత్-ఉల్-మూమినీన్.
ఉమ్రా (العمرى)
ఎవరికైనా ఒక ఇంటిని బహుమతిగా ఇవ్వడం.
ఉమ్రహ్ (العمرة)
వ్యక్తి మక్కాను దర్శించి కాబా చుట్టూ తవాఫ్ చేయటం. సఫా మరియు మర్వా మధ్య సయీ చేయటం. దీనినే ‘చిన్న హజ్’ అని కూడా అంటారు. (సహీహ్ బుఖారీ : 3వ సంపుటి 1వ పేజీ చూడండి).
ఉఖీయ (أوقية)
(బహువచనం : అవాఖిన్) 128 గ్రాములు. వివిధ దేశాలను అనుసరించి ఇది కొంచెం ఎక్కువ గానీ, తక్కువగానీ ఉండొచ్చు.
ఉర్బాన్ (العربان)
ఉర్బాన్ అంటే హామీగా ఉంచిన డబ్బు. ఒక జంతువు ధర నిర్ణయమైన తరువాత కొంత బయానా అమ్మేవారి దగ్గర పెడతారు. జంతువును కొనకపోతే అమ్మేవారు బయానా ఉంచుకోవచ్చు. కొంటే కొన్న ధరలో మినహాయించుకుంటారు. ఇది నిషిద్ధం.
ఉర్ఫుత్ (العرفط)
మగాఫిర్ను ఉత్పత్తి చేసే చెట్టు.
ఉష్ర్ (العشر)
పేద ప్రజల మేలు కోసం పంటలో పదవ వంతు శిస్తు విధించటం. (బుఖారీ : 2వ సంపుటి 560వ హదీను).
W
వహీ (الوحي)
అల్లాహ్ తన ప్రవక్తలకిచ్చే జ్ఞానము లేదా ప్రేరణ.
వైహక (ويحك)
అల్లాహ్ నీ యందు దయతో ఉండునుగాక!
వైలక (ويلك)
నీకు శ్రమ కలుగుగాక!
వలా (الولاء)
అల్ వలా అంటే స్వతంత్రుడైన బానిస యొక్క ఆస్తిని, అతనికి స్వాతంత్ర్యం ఇచ్చిన వ్యక్తి వారసత్వంగా పొందగలిగే హక్కు. వలా వారసత్వ పరంపరలో భాగం అని హదీసు స్పష్టం చేసింది. దాన్ని అమ్మటం, దానం చెయ్యటం నిషిద్ధం.
వలీ (الولي)
(బహు వచనం ఔలియా) రక్షకుడు, సంరక్షకుడు, మోసేవాడు, సహాయకుడు, స్నేహితుడు.
వలీమా (الوليمة)
పెళ్ళి విందు.
వఖ్ఫ్ (الوقف)
మతపరమైన దానము, ఆస్తి.
వర్స్ (الورس)
పసుపు రంగు వెయ్యడానికి ఉపయోగపడే ఒక రకమైన పొద మొక్క.
వసాయా (الوصايا)
వీలునామాలు లేదా నిబంధనలు (ఏకవచనం : వసియ్యత్).
వస్ఖ్ (الوسق)
(బహువచనం : అవ్సుఖ్ లేదా అవ్సుఖ్ఖ్) సుమారు 60 సా = 135 కి.గ్రాలకు సమానమైన కొలత. ఇది కొంచెం ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు.
విసాల్ (الوصال)
నిరంతరంగా ఒక రోజు కంటే ఎక్కువగా ఉపవాసం ఉండటం.
వసీలా (الوسيلة)
అల్లాహ్ దయను పొంది ఆయనకు దగ్గరయ్యే మార్గాలు.
వుజూ (الوضوء)
శుద్ధి. ముఖము, మోచేతుల వరకు చేతులు, గిలకల వరకు కాళ్ళు కడుక్కోవటం, చెవులు, తల తడి చేత్తో తుడుచుకోవటం. ఇది కాబా చుట్టూ ప్రదక్షిణ కోసం, ప్రార్థనల కోసం చేస్తారు.
Y
యలమ్లమ్ (يلملم)
యమన్ ప్రజల మీఖాత్.
యమామ (اليمامة)
సౌదీ అరేబియాలో నజ్ద్ వైపున్న ఓ ప్రాంతం. తొలినాళ్ళ ముస్లిములకు, ముసైలిమా అనే అబద్ధ ప్రవక్త అనుచరులకు మధ్య యుద్ధం ఇక్కడ జరిగింది.
యఖీన్ (اليقين)
ఖచ్చితమైన పూర్తి నమ్మకం.
యర్మూక్ (اليرموك)
సిరియాలోని ప్రదేశం.
యస్రిబ్ (يثرب)
మదీనా పేర్లలో ఇదొకటి.
యౌమున్నఫర్ (يوم النفر)
జుల్ హిజ్జా 12 లేదా 13వ దినం. అరఫాత్, ముజ్దలిఫాలలో హజ్ క్రియలన్నీ ముగించుకున్న తరువాత యాత్రికులు మినాను వదిలి వెళతారు.
యౌమున్నహర్ (يوم النحر)
జుల్ హిజ్జా 10వ రోజు. జంతువులను బలి ఇచ్చేరోజు.
యౌముత్తర్వియా (يوم التروية)
జుల్ హిజ్జా 8వ రోజు. యాత్రికులు మక్కా వదిలి మినాకు వెళ్ళే రోజు.
యౌముర్రువూస్ (يوم الرؤوس)
“తలల రోజు” అని అర్థం. ఈదుల్ అజ్హా తరువాత రోజు.
Z
జకాత్ (الزكاة)
ముస్లిం సమాజంలోని పేదల ప్రయోజనం కోసం ప్రతి ముస్లిము ఏడాదికోసారి తన సంపదలో నుంచి చెల్లించే నిర్ణీత మొత్తం. జకాత్ చెల్లించటం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఇస్లాం అయిదు స్తంభాల్లో ఒకటి. ముస్లిం సమాజం సురక్షితం, సుసంపన్నం కావటం కోసం, సామాజిక న్యాయాన్ని అందించటం కోసం జకాత్ ముఖ్యమైన ఆర్థిక విధానం.
జకాతుల్ ఫిత్ర్ (زكاة الفطر)
ఈదుల్ ఫితర్ నమాజుకు ముందు తప్పనిసరిగా చేసే సదకా. (సహీహ్ బుఖారీ : 2వ సంపుటి జకాతుల్ ఫిత్ర్ గ్రంథం 339వ పేజీ చూడండి).
జమ్ జమ్ (زمزم)
మక్కాలోని మస్జిదె హరామ్లో ఉన్న పవిత్ర బావి.
జనాదిఖా (الزنادقة)
నాస్తికులు.
జర్నబ్ (زرنب)
మంచి వాసన వచ్చే గడ్డి.
జుహ్ర్ (الظهر)
మధ్యాహ్నం, మధ్యాహ్న ప్రార్థనను జుహ్ర్ అంటారు.
You must be logged in to post a comment.