హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 16.6 ధ్యానం మరియు దుఆ

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 16. వివిధ విషయాల పుస్తకం, 6వ అధ్యాయం: ధ్యానం మరియు దుఆ. ఈ అధ్యాయంలో 27 హదీసులు (హదీసు 1332 – 1358) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

16.6 ధ్యానం మరియు దుఆ

↑ విషయ సూచిక

باب الذكر والدعاء

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1332

హదీసు 1332

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ يَقُولُ اَللَّهُ ‏-تَعَالَى‏-: أَنَا مَعَ عَبْدِي مَا ذَكَرَنِي, وَتَحَرَّكَتْ بِي شَفَتَاهُ } أَخْرَجَهُ ابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ, وَذَكَرَهُ اَلْبُخَارِيُّ تَعْلِيقًا..

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు – “నా దాసుడు నన్ను స్మరించినంతసేపూ, నా కోసం అతని అధరాలు కదలాడుతూ ఉన్నంతసేపూ నేనతనికి తోడుగా ఉంటాను.” (ఈ హదీసును ఇబ్నెమాజా వెలికి తీశారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. బుఖారీ దీని పూర్తి పరంపరను ప్రస్తావించకుండానే పొందుపరచారు)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Allah, the Most High says: ‘l am with my slave when he remembers me and his lips move with my mention.” Related by Ibn Majah and Ibn Hibban graded it as Sahih.

సారాంశం

దైవధ్యానం, దైవనామ స్మరణల ప్రాశస్త్యం, మహాత్మ్యం ఈ హదీసులో వివరించబడింది. దైవనామ స్మరణ వల్ల భక్తునికి కలిగే గొప్ప లాభం ఏమిటంటే, అతనికి దేవుని సామీప్యం లభిస్తుంది. ఇక దైవధ్యానం (జిక్ర్) అంటే ఏమిటి? దేవుని ఏకత్వాన్ని, ఆయన గొప్పదనాన్ని స్తుతించటం! ఆయన పవిత్రతను కొనియాడటం!! దేవుని పట్ల అంతరంగంలో ఏర్పడివున్న ఆ పవిత్ర భావాలను నోటితో పలకటం!!! వేడుకోలు (దుఆ) లోనూ – ధ్యానం (జిక్ర్)లోనూ కొంచెం తేడా ఉంది. వేడుకోలులో కోరిక కలగలసి ఉంటుంది. కాని ధ్యానంలో కోరిక ఉండదు. కేవలం దేవుని ఘనతను, పవిత్రతను స్తుతించటమే ధ్యానం యొక్క ఉద్దేశ్యం అయి ఉంటుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1332

1333

హదీసు 1333

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا عَمِلَ ابْنُ آدَمَ عَمَلاً أَنْجَى لَهُ مِنْ عَذَابِ اَللَّهِ مِنْ ذِكْرِ اَللَّهِ } أَخْرَجَهُ ابْنُ أَبِي شَيْبَةَ, وَالطَّبَرَانِيُّ بِإِسْنَادٍ حَسَنٍ..

హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఆదం పుత్రుని ఏ ఆచరణ కూడా దైవనామ స్మరణను మించి దేవుని శిక్ష నుండి విముక్తం కలిగించదు.” (ఈ హదీసును ఇబ్నె అబీ షైబా మరియు తబ్రానీ హసన్ పరంపర ఆధారంగా సేకరించారు)

English

Mu’adh Ibn Jabal (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A man does nothing to rescue himself from Allah’s punishment better than remembering Allah.” Related by Ibn Abi Shaibah and At-Tabarani with a good chain of narrators.

సారాంశం

దైవనామ స్మరణ దేవుని శిక్షనుండి ముక్తిని కలిగిస్తుందని పై హదీసులో సెలవీయబడింది. పరలోక శిక్షనుండి మనిషిని కాపాడినట్లే ఈ దైవ నామస్మరణ ఇహలోకంలోనూ మనిషిని అశాంతి అలజడులనుంచి, మానసిక వ్యాకులత నుండి రక్షిస్తుంది. ఇహలోకంలో మనిషికి ప్రతికూల పవనాలు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మిథ్యావాదుల, దైవధిక్కారుల తరపునుంచి వేధింపులు మొదలైనప్పుడు అతడు ఓర్పుతో దైవ సహాయం అర్థించాలి, దైవాన్ని ధ్యానించాలని ఆదేశించబడింది. ఎందుకంటే అతడు దైవనామాన్ని స్మరిస్తున్నంతసేపూ దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. ధర్మయుద్ధ సందర్భంగా కూడా యోధుడు తన నిజ ప్రభువును స్మరించినప్పుడు ఆయన అతనికి అండగా ఉంటాడు. తద్వారా విశ్వాసి రణరంగంలో అవలీలగా తన శత్రువును ఓడిస్తాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1333

1334

హదీసు 1334

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا, يَذْكُرُونَ اَللَّهَ فِيهِ إِلَّا حَفَّتْ بِهِمُ الْمَلَائِكَةُ, وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ, وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ } أَخْرَجَهُ مُسْلِم ٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఏ ప్రజా సమూహమైనా దైవ నామాన్ని స్మరిస్తూ ఒక సమావేశంలో కూర్చుని ఉండగా దైవదూతలు వారిని చుట్టుముట్టక పోవటం, దైవ కారుణ్యం వారిపై ఆవరించకపోవటం అన్నది అసంభవం. అంతేకాదు, అల్లాహ్ తన దూతల సమక్షంలో వాళ్ళను గురించి ప్రస్తావిస్తాడు.” (ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “People will not sit in an assembly in which they remember Allah without the angels surrounding them, mercy covering them, and Allah mentioning them among those who are with Him.” Related by Muslim.

సారాంశం

దైవధ్యానం చేస్తూ కూర్చునే వారి సమావేశాలు, సదస్సులు ఎంతో శుభప్రదమైనవని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దైవధ్యానం ఇతర ఆచరణలన్నింటికన్నా మేలైనదని ఒక హదీసు ద్వారా తెలుస్తోంది. కొందరు సజ్జనులు దీని గురించి ఇలా వ్యాఖ్యానించారు : “దైవస్తోత్రం చేసి, దేవుని పవిత్రతను కొనియాడితే, దైవగ్రంథ పారాయణం చేస్తే అది నోటి ధ్యానం అవుతుంది. దైవభీతితో కళ్ళు చెమ్మగిల్లితే అది కంటి ధ్యానం అవుతుంది. దైవ వచనాలను, ధర్మోపదేశాలను జాగ్రత్తగా వింటే అవి చెవుల ధ్యానం అనిపించుకుంటుంది. దైవమార్గంలో ఖర్చుపెడితే అది చేతుల ధ్యానం అవుతుంది. అనునిత్యం అతని కార్యకలాపాలు దైవమార్గంలో కొనసాగినట్లయితే అది శరీరావయవాల ధ్యానం అవుతుంది. అనుక్షణం దైవానికి భయపడుతూ, దేవుని కారుణ్యం పట్ల ఆశాభావం కల్గి ఉంటే అది మనసు ధ్యానం అవుతుంది. సర్వస్వాన్ని దేవుని పేర అర్పించి, దైవేచ్ఛపై రాజీపడిపోతే అది ఆత్మ ధ్యానం అవుతుంది. ఆ విధంగా మానవుడు మూర్తీభవించిన ధ్యానంగా మారిపోతాడు. దైవధ్యానం యొక్క అసలు ఉద్దేశ్యం ఇదే.”

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1334

1335

హదీసు 1335

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا قَعَدَ قَوْمٌ مَقْعَدًا لَمْ يَذْكُرُوا اَللَّهَ فِيهِ, وَلَمْ يُصَلُّوا عَلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-إِلَّا كَانَ عَلَيْهِمْ حَسْرَةً يَوْمَ اَلْقِيَامَةِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَقَالَ: "حَسَنٌ"..

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారి చేతనే ఉల్లేఖించబడిన మరో కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ ప్రజా సమూహమైనా తాను కూర్చున్న సదనంలో దైవనామ స్మరణ చేయటంగానీ, దైవప్రవక్త ﷺపై శాంతిని కురిపించమని వేడుకోవటంగానీ చేయకపోతే, ఆ సదనం ప్రళయదినాన వాళ్ళపాలిట తలవంపుగా పరిణమిస్తుంది.” (దీనిని తిర్మిజీ సేకరించి, హసన్‌గా ఖరారు చేశారు)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If people sit in an assembly in which they do not remember Allah or invoke blessings on the Prophet it will be a cause of grief to them on the Day of Resurrection.” Related by At-Tirmidhi who graded it as Hasan.

సారాంశం

ప్రతి సదస్సులోనూ దైవనామ స్మరణతోపాటు, దైవప్రవక్త ﷺపై ‘దరూద్’ వాక్యాలను కూడా పలకాలని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. అయితే దరూద్ లేక సలామ్ పేరిట ఈ మధ్య కాలంలో మననాట ప్రబలిన పోకడ మహాప్రవక్త ﷺ కాలంలోగానీ, ప్రియ సహాబీల (రదియల్లాహు అన్హు) కాలంలో గానీ లేదు. ఇది ప్రజలు కల్పించుకున్న కొత్త పుంత. దీన్ని వారు పుణ్యప్రదమైన అంశంగా భావించినప్పటికీ, నిజానికి అదొక బిద్‌అత్ – ధర్మంలో కల్పించబడిన ఓ కొత్త ఆచారం!

సామూహిక ధ్యానంలో ఖుర్ఆన్ హదీసుల ఉపదేశం, ధార్మిక శిక్షణ అన్నిటికన్నా ఉత్తమమైనవి. అందరూ ఒకచోట కూర్చుని తమ తమ తరపున దైవనామాన్ని స్మరించటం, దరూద్ పఠించటంలో కూడా తప్పులేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1335

1336

హదీసు 1336

وَعَنْ أَبِي أَيُّوبَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اَللَّهُ, وَحْدَهُ لَا شَرِيكَ لَهُ, لَهُ الْمُلْكُ, وَلَهُ الْحَمْدُ, بِيَدِهِ الْخَيْرُ, يُحْيِي وَيُمِيتُ, وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ, عَشْرَ مَرَّاتٍ, كَانَ كَمَنْ أَعْتَقَ أَرْبَعَةَ أَنْفُسٍ مِنْ وَلَدِ إِسْمَاعِيلَ } مُتَّفَقٌ عَلَيْهِ..

హజ్రత్ అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “ఎవడు ఈ వచనాలను పదిసార్లు పలుకుతాడో అతను ఇస్మాయీల్ సంతతికి చెందిన నలుగురు అత్యుత్తమ బానిసల్ని విడుదల చేసిన వానితో సమానం. ఆ వచనాలివి: “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు బియదిహిల్ ఖైర్ యుహ్‌యీ వ యుమీతు వహువ అలాకుల్లి షయ్‌యిన్ ఖదీర్.”

(అనువాదం: అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు. రాజ్యాధికారం ఆయనదే. సమస్త స్తోత్రములు, ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి. మేళ్ళన్నీ ఆయన హస్తగతమై ఉన్నాయి. బ్రతికించేవాడూ, చంపేవాడూ ఆయనే. ఆయన ప్రతి దాన్నీ చేయగల సమర్థుడు.) (బుఖారీ, ముస్లిం)

English

Abu Aiyub al-Ansari (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) said: “Whoever says ten times: ‘None has the right to be worshipped except Allah alone, without partner, to Him belongs all sovereignty and praise. He gives life and causes death. He is over all things, Omnipotent will have a reward equivalent to that of emancipating four of the descendants of lsma'il from slavery.” Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1336

1337

హదీసు 1337

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ قَالَ: سُبْحَانَ اَللَّهِ وَبِحَمْدِهِ مِائَةَ مَرَّةٍ حُطَّتْ عَنْهُ خَطَايَاهُ, وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ اَلْبَحْرِ } مُتَّفَقٌ عَلَيْهِ..

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సలలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “ఎవరయితే సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ (అల్లాహ్ తన స్తోత్ర సమేతంగా పవిత్రుడు) అన్న వచనాన్ని వందసార్లు పలికాడో అతని పాపాలు -అవి సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నాసరే- తొలగించబడతాయి.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Whoever says a hundred times, ‘How perfect Allah is and I praise Him,’ his sins will be forgiven though they may be as much as the foam of the sea.” Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1337

1338

హదీసు 1338

وَعَنْ جُوَيْرِيَةَ بِنْتِ اَلْحَارِثِ قَالَتْ: قَالَ لِي رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَقَدْ قُلْتُ بَعْدَكِ أَرْبَعَ كَلِمَاتٍ, لَوْ وُزِنَتْ بِمَا قُلْتِ مُنْذُ اَلْيَوْمِ لَوَزَنَتْهُنَّ: سُبْحَانَ اَللَّهِ وَبِحَمْدِهِ, عَدَدَ خَلْقِهِ, وَرِضَا نَفْسِهِ, وَزِنَةَ عَرْشِهِ, وَمِدَادَ كَلِمَاتِهِ } أَخْرَجَهُ مُسْلِمٌ..

జువైరియా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ నాకు ఇలా ఉపదేశించారు : “నేను నీ తరువాత నాలుగు వచనాలు పఠించాను. మొదటినుంచీ ఇప్పటి వరకూ నువ్వు పఠించిన నీ వచనాలతో వీటిని పోలిస్తే, ఈ వచనాలు బరువులో మించి పోతాయి. ఆ వచనాలివి : (1) సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ, అదద ఖల్ఖిహీ (2) వ రిజాఅ నఫ్‌సిహీ (3) వ జినత అర్షిహీ (4) వ మిదాద కలిమాతిహీ (అనువాదం : అల్లాహ్ పవిత్రుడు – తన స్తోత్ర సమేతంగా, తన సృష్టితాల సంఖ్యకు సమానంగా. ఆయన ప్రసన్నత – ఆయన సింహాసనపు బరువు, ఆయన వచనాల విస్తృతికి సమానంగా) (ముస్లిం)

English

Juairiyah bint al-Harith (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) said to me, “Since leaving you have said four phrases which if weighed against all you have said today, would prove to be heavier: ‘How perfect Allah is and I praise Him by the amount of His creation and His pleasure, and by the weight of His throne, and the ink of His words.” Related by Muslim.

హదీసు ఉల్లేఖకులు

జువైరియా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా) : విశ్వాసుల మాతలలో ఒకరు. మురైసిఅ యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డారు. సాబిత్ బిన్ ఖైస్ బిన్ షమ్మాస్ వాటాలోకి వచ్చారు. అయితే ఆయన ఈమెగారితో ముకాతబత్ (విడుదలకు సంబంధించిన ఒప్పందం) చేసుకున్నారు. ఆ ముకాతబత్ మొత్తాన్ని దైవప్రవక్త ﷺ ఆయనకు చెల్లించి ఈమెను తన దాంపత్య జీవితంలోకి తెచ్చుకున్నారు. ఈ శుభవార్త వినగానే ప్రవక్త సహచరులంతా ఆమె వర్గానికి చెందిన ఖైదీలందరినీ విడిచిపెట్టేశారు. ఈ విధంగా ఈమెగారు తన తెగవారి పాలిట అందరికన్నా ఎక్కువ భాగ్యవంతురాలిగా పరిణమించారు. హిజ్రీ 56వ యేట మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1338

1339

హదీసు 1339

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلْبَاقِيَاتُ اَلصَّالِحَاتُ: لَا إِلَهَ إِلَّا اَللَّهُ, وَسُبْحَانَ اَللَّهِ, وَاَللَّهُ أَكْبَرُ, وَالْحَمْدُ لِلَّهِ, وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاَللَّهِ } أَخْرَجَهُ النَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِمُ..

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ‘చివరకు మిగిలే సత్కర్మలు’ ఇవి: “లా ఇలాహ ఇల్లల్లాహు వ సుబ్‌హానల్లాహి వల్లాహు అక్బర్. అల్‌హమ్దు లిల్లాహి వలా హౌలా వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.” (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. అల్లాహ్ పవిత్రుడు. అందరి కన్నా గొప్పవాడు. స్తోత్రం ఆయన కొరకే. కీడును తొలగించడమైనా, మేలు పొందడమైనా అల్లాహ్ సహాయం లేనిదే సాధ్యం కాదు.) (అన్న వచనాలను మనసా వాచా విశ్వసించాలి).

(ఈ హదీసును నసాయి సేకరించారు. ఇబ్నె హిబ్బాన్ మరియు హాకిమ్లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Abu Sa'id al-Khudri (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The lasting good deeds are: (the saying of) ‘None has the right to be worshipped except Allah alone, How perfect Allah is and Allah is great and all praise is for Allah, There is no might nor power except with Allah.” Related by An-Nasa’i. Ibn Hibban and Al-Hakim graded it as Sahih.

సారాంశం

అరబీలో “బాఖియాతుస్సాలిహాత్” అనే పదం వచ్చింది. అంటే మనిషి చనిపోయినప్పటికీ మిగిలి ఉండే అతని మంచి కర్మలు అని అర్థం. దైవ విధేయతతో కూడిన, లోక కళ్యాణానికి ఉద్దేశ్యించిన ప్రతి పని మిగిలి ఉంటుంది. పై హదీసులో ప్రస్తావించబడిన వచనాలు కూడా దేవుని పట్ల గల నిష్కల్మషమైన విశ్వాసానికి ప్రతిబింబం వంటివి. అద్వితీయుడైన దేవుని యెడల గల ఈ విశ్వాసం సకల సదాచరణలకు, మేళ్ళకు సరోవరం వంటిది. ఈ ‘విశ్వాసం’ లేకుండా చేసే ఏ సత్కార్యం కూడా స్వీకృతి పొందదు. కాబట్టి హదీసులోని ఈ వచనాలు ‘బాఖియాతుస్సాలిహాత్’కి వ్రేళ్ళ వంటివి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1339

1340

హదీసు 1340

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَحَبُّ اَلْكَلَامِ إِلَى اَللَّهِ أَرْبَعٌ, لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ: سُبْحَانَ اَللَّهِ, وَالْحَمْدُ لِلَّهِ, وَلَا إِلَهَ إِلَّا اَللَّهُ, وَاَللَّهُ أَكْبَرُ } أَخْرَجَهُ مُسْلِمٌ..

హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “దైవ సన్నిధిలో అన్నిటికన్నా ప్రియమైనవి, ఇష్టకరమైనవి ఈ నాలుగు పదాలు- వీటిలో ఏ ఒక్క దానితో మొదలెట్టినా నీకు హాని కలగదు- (అవేమంటే) సుబ్‌హానల్లాహి వల్‌హమ్దు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ ((1) అల్లాహ్ పవిత్రుడు. (2) ఘనతకు, గొప్పదనానికి అధిపతి అయిన ఆయనకే సమస్త స్తోత్రాలు. (3) అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేనేలేడు. (4) అల్లాహ్ అందరి కన్నా గొప్పవాడు.)” (ముస్లిం)

English

Samurah bin Jundub (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The words dearer to Allah are four: ‘How perfect Allah is and all praise is for Allah. None has the right to be worshipped except Allah alone and Allah is great It does not matter which you say first.” Related by Muslim.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1340

1341

హదీసు 1341

وَعَنْ أَبِي مُوسَى اَلْأَشْعَرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ لِي رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ يَا عَبْدَ اَللَّهِ بْنَ قَيْسٍ! أَلَّا أَدُلُّكَ عَلَى كَنْزٍ مِنْ كُنُوزِ اَلْجَنَّةِ? لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاَللَّهِ } مُتَّفَقٌ عَلَيْه ِ زَادَ النَّسَائِيُّ: { وَلَا مَلْجَأَ مِنَ اللَّهِ إِلَّا إِلَيْهِ }

తనను ఉద్దేశ్యించి దైవప్రవక్త ﷺ ఈ విధంగా సెలవిచ్చారని హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) చెప్పారు: “ఓ అబ్దుల్లా బిన్ ఖైస్! స్వర్గంలోని నిధులలో ఒక నిధి ఏదో నేను నీకు తెలుపనా?- చెడునుంచి ముఖం త్రిప్పుకోవటం మరియు దైవసహాయం లేకుండా సత్కార్యం గురించి నొక్కి వక్కాణించటం సంభవం కాదు (అన్న యదార్థాన్ని గ్రహించటం.)” (బుఖారీ, ముస్లిం). “అల్లాహ్ వద్ద తప్ప వేరొక చోట ఆశ్రయం లేదు” అన్న వాక్యం నసాయిలో అదనంగా ఉంది.

English

Abu Musa al-Ash'ari (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said to me, “O 'Abdullah bin Qais, would you like to be guided to one of the treasures of Paradise.” l here is no might nor power except with Allah.’ Agreed upon.

An-Nasa’i added in his version, “there is no refuge from Allah except by turning to Him.’

సారాంశం

ఈ హదీసులో కూడా “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి” యొక్క మహిమ గురించి చెప్పబడింది. ఒక వస్తువు ఎంత స్వచ్ఛమైంది, ఖరీదైనదై ఉంటుందో దాని అజమాయిషీ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. దాని భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడతాయి. కాగా; ఈ వచనాలు స్వర్గ నిధి వంటివి. కనుక వీటిని జాగ్రత్తగా కాపాడుకోవటం అవసరం. అంటే వీలయినంత అధికంగా వాటిని స్మరించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1341

1342

హదీసు 1342

وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- عَنِ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِنَّ اَلدُّعَاءَ هُوَ اَلْعِبَادَةُ } رَوَاهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ. وَلَهُ مِنْ حَدِيثِ أَنَسٍ مَرْفُوعًا, بِلَفْظِ: { اَلدُّعَاءُ مُخُّ اَلْعِبَادَةِ }. وَلَهُ مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ رَفَعَهُ: { لَيْسَ شَيْءٌ أَكْرَمَ عَلَى اَللَّهِ مِنَ الدُّعَاءِ } وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِمُ..

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు – “నిస్సందేహంగా దుఆయే (వేడుకోలే) దైవారాధన. (దీనిని ‘నలుగురు’ ఉల్లేఖించగా, తిర్మిజీ ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు). తిర్మిజీలోని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనంలో ‘అద్దుఆవు ముఖ్ఖుల్ ఇబాద’ (దుఆ దైవారాధనా సారం వంటిది) అన్న వాక్యం ఉంది.

తిర్మిజీలోనే హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)చే ఈ విధంగా ఉల్లేఖించబడింది: “దైవసన్నిధిలో దుఆ కన్నా ఎక్కువ గౌరవప్రదమైన వస్తువు మరొకటి లేదు.” (ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ లిరువురూ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

An-Nu’man bin al-Bashir (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Verily supplication is worship.” Related by the four Imams and At-Tirmidhi graded it as Sahih,

Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Supplication is the pith of worship.” Related by At-Tirmidhi with a full chain of narrators.

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Nothing is more honorable before Allah than supplication.” Related by At-Tirmidhi with a full chain of narrators. Ibn Hibban and Al-Hakim graded it as Sahih;.

సారాంశం

ఈ హదీసులో దుఆ ఆరాధనగా ఖరారు చేయబడింది. దుఆలో మనిషి ఎవరిని అర్థిస్తాడు? నిజదైవాన్నే కదా! నిజదైవాన్ని అర్థించటం ఆరాధన అయినప్పుడు, మనిషి తన అవసరాల కోసం, కష్టాల నుంచి విముక్తి కోసం దైవేతరుల్ని అర్థించటం షిర్క్ (బహుదైవారాధన) అవుతుంది.

దుఆ ఎంత ప్రభావవంతమైందో అంచనా వేయదలచుకుంటే తబ్రానీలోగల హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనాన్ని పరిశీలించండి : కొన్ని సందర్భాలలో నింగినుంచి నేల మీదకు ఏదన్నా ఆపద అవతరిస్తున్న క్షణంలోనే కాకతాళీయంగా మనిషి భూమ్యాకాశాల ప్రభువును చేతులెత్తి అర్థిస్తూ ఉంటాడు. ఒకవైపున పై నుంచి క్రిందికి దిగివచ్చే ఆపద! మరో వైపున క్రింది నుంచి పైకి వెళుతున్న దాసుని అభ్యర్థన! ఇవి రెండూ శూన్యంలో ఢీ కొంటాయి. చిత్తశుద్ధితో కూడిన దాసుని అభ్యర్థన ఎంత ప్రభావం గలదో చూడండి! అది ఆ ఆపదను భువి పైకి రాకుండా ఆపేస్తుంది!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1342

1343

హదీసు 1343

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلدُّعَاءُ بَيْنَ اَلْأَذَانِ وَالْإِقَامَةِ لَا يُرَدُّ } أَخْرَجَهُ النَّسَائِيُّ, وَغَيْرُهُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَغَيْرُهُ..

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “అజాన్ మరియు ఇఖామత్‌ల మధ్య (సమయంలో) చేసే దుఆ (వేడుకోలు) రద్దు చేయబడదు.” (దీనిని నసాయి తదితరులు ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ తదితరులు దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A supplication made between the Adhan and Iqamah is never rejected.” Related by An-Nasa’i and others, Ibn Hibban and others graded it as Sahih.

సారాంశం

దుఆ స్వీకారయోగ్యం అవడానికి కొన్ని ప్రత్యేక ఘడియలున్నాయి. వాటిలో ఒకటి అజాన్ మరియు ఇఖామత్‌ల మధ్య గల ఘడియ. ఎందుకంటే ఆ సమయంలో మనిషి నమాజ్ కోసం సమాయత్తమై మస్జిదుకు వస్తాడు. అంటే, అతడు తన దైనందిన కార్యక్రమాలను ప్రక్కనబెట్టి దేవుని వైపునకు మరలివస్తాడు. సామూహిక నమాజు కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. ఆ ఘడియలో ఆరాధనా గృహంలో ఒక లాంటి అనిర్వచనీయమైన వాతావరణం ఏర్పడుతుంది. తన వైపునకు తరలివస్తున్న దాసులను సర్వోన్నత ప్రభువు ఆసక్తికరంగా గమనిస్తూ ఉండే ప్రత్యేక ఘడియ అది! అందుకే ఆ కీలక ఘడియలో మనిషి తన కాలాన్ని వ్యర్థ ప్రేలాపనలతో వృధా చేయకూడదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1343

1344

హదీసు 1344

وَعَنْ سَلْمَانَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ رَبَّكُمْ كَرِيمٌ, يَسْتَحِي مِنْ عَبْدِهِ إِذَا رَفَعَ إِلَيْهِ يَدَيْهِ أَنْ يَرُدَّهُمَا صِفَرًا } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيَّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ..

హజ్రత్ సల్మాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “మీ ప్రభువు ఎంతో ఉదాత్తుడు, బిడియం కలవాడు. తన దాసుడు తన సన్నిధిలో చేతులు చాచి అర్థించినప్పుడు వట్టి చేతులతో మరలించడానికి ఆయన సిగ్గుపడతాడు.”

(‘నలుగురి’లో నసాయి మినహా మిగిలిన వారు దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Salman (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Your Rabb (Lord of the Universe) is Modest and Generous, and would never turn the hands of a slave without gain when he raises them to Him (in supplication).” Related by the four lmams except An-Nasa’i. Al-Hakim graded it as Sahih.

సారాంశం

చేతులెత్తి దుఆ చేయటం సమంజసమేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. పైగా దుఆ మర్యాదలలో ఇది కూడా ఒకటి. అల్లాహ్ సన్నిధిలో ఎత్తబడిన అశక్తుడైన దాసుని చేతులు వట్టిగా వాపసు చేయబడవు. దుఆయె ఇస్తిస్ఖా సమయంలో దైవప్రవక్త ﷺ మామూలు దుఆ సమయాల కన్నా మరింత పైకి తన చేతుల్ని ఎత్తేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1344

1345

హదీసు 1345

وَعَنْ عُمَرَ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا مَدَّ يَدَيْهِ فِي اَلدُّعَاءِ, لَمْ يَرُدَّهُمَا, حَتَّى يَمْسَحَ بِهِمَا وَجْهَهُ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ.. وَلَهُ شَوَاهِدُ مِنْهَا: حَدِيثُ اِبْنِ عَبَّاسٍ, عِنْدَ أَبِي دَاوُدَ وَغَيْرِهِ, وَمَجْمُوعُهَا يَقْتَضِي أَنَّهُ حَدِيثٌ حَسَنٌ..

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ ‘దుఆ’ కోసం చేతులెత్తిన తరువాత అరచేతులను తన ముఖారవిందంపై స్పర్శించేదాకా చేతులు దించేవారు కారు.” (దీనిని తిర్మిజీ వెలికి తీశారు. దీనిని సమర్థించే హదీసులనేకం ఉన్నాయి. అబూదావూద్ ప్రభృతుల వద్ద గల ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) హదీసు కూడా వాటిలో ఒకటి. మొత్తానికి ఈ హదీసు హసన్ కోవకు చెందినదని తెలుస్తోంది.)

English

'Umar (RAA) narrated, ‘When the Messenger of Allah (ﷺ) raised his hands in supplication, he did not lower them till he wiped his face with them.’ Related by At-Tirmidhi.

There are other traditions, which support this narration, of which is: The Hadith narrated by Ibn ’Abbas (RAA) related by Abu Dawud and others. Put together, they confirm that it is Hasan.

సారాంశం

దుఆ (వేడుకోలు, ప్రార్థన)ను ముగించిన తరువాత రెండు అరచేతులను ముఖంపై తుడుచుకోవటమో లేక త్రిప్పుకోవటమో చేయాలని ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. ఎందుకంటే దుఆ కొరకు ఎత్తబడిన చేతులు దైవకారుణ్యంతో నిండి ఉంటాయి. అందుకే ఆ చేతులను కృతజ్ఞతా భావంతో మొహానికి అద్దుకోవాలి. మొహం శరీరావయవాలలోకెల్లా అత్యంత గౌరవప్రదమైన అవయవం. అదీగాక ముఖారవిందం సమస్త శరీరావయవాల స్థితిని వ్యక్తపరిచే ప్రతినిధి లాంటిది. ఈ ప్రతినిధికి గనక ఆ గౌరవం లభిస్తే శరీరావయవాలన్నింటికీ ప్రాతినిధ్యం లభించినట్లే.

ఈ హదీసు పరంపరలో ఒకరైన హమ్మాద్ బిన్ ఈసా జుహనీ బలహీన ఉల్లేఖకులు. అయితే హదీసుకు సంబంధించిన ఇతర సాక్షులు కూడా ఉండటం వల్ల హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ హదీసును హసన్‌గా ఖరారు చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1345

1346

హదీసు 1346

وَعَنِ ابْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ أَوْلَى اَلنَّاسِ بِي يَوْمَ اَلْقِيَامَةِ, أَكْثَرُهُمْ عَلَيَّ صَلَاةً } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ..

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “నాపై శాంతిని కురిపించమని అత్యధికంగా దైవాన్ని వేడుకునే వారు ప్రళయ దినాన నాకు అత్యంత సమీపంలో ఉంటారు.” (తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా పేర్కొన్నారు)

English

Ibn Mas'ud (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Those who are nearest to me on the Day of Resurrection are those who invoke many blessings on me.” Related by At-Tirmidhi and Ibn Hibban graded it as Sahih.

సారాంశం

తీర్పుదినాన అంతిమ దైవ సందేశహరులైన ముహమ్మద్ ﷺ సామీప్యాన్ని, సహచర్యాన్ని పొందగోరేవారు అత్యధికంగా ఆయన ﷺ పై దరూద్ వాక్యాలను పఠిస్తూ ఉండాలని ఇందులో చెప్పబడింది. ఇమామ్ ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసు నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించారు: “ఈ హదీసు ద్వారా హదీసు వేత్తల ప్రాశస్త్యం స్పష్టమవుతున్నది. వాళ్ళు అహోరాత్రులు మాట్లాడుతూ, లిఖిస్తూ దైవప్రవక్త ﷺపై దరూదె షరీఫ్ పంపిస్తూ ఉంటారు. దరూద్‌కు సంబంధించిన అనేక వాక్యాలు హదీసులో ఉన్నాయి. వాటన్నిటిలోకీ శ్రేష్ఠమైనది ‘దరూదె ఇబ్రాహీమ్’. ఇది ప్రతి నమాజులో పఠించబడుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1346

1347

హదీసు 1347

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ سَيِّدُ اَلِاسْتِغْفَارِ, أَنْ يَقُولَ اَلْعَبْدُ: اَللَّهُمَّ أَنْتَ رَبِّي, لَا إِلَهَ إِلَّا أَنْتَ, خَلَقْتَنِي, وَأَنَا عَبْدُكَ, وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اِسْتَطَعْتُ, أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ, أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ, وَأَبُوءُ لَكَ بِذَنْبِي, فَاغْفِرْ لِي; فَإِنَّهُ لَا يَغْفِرُ اَلذُّنُوبَ إِلَّا أَنْتَ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ..

హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: అత్యుత్తమ శ్రేణికి చెందిన మన్నింపు వాక్యాలు (సయ్యదుల్ ఇస్తిగ్ఫార్) ఏమిటంటే దాసుడు ఈ విధంగా వేడుకోవాలి : “ఓ దేవా! నీవు మా ప్రభువు మరియు సంరక్షకుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. నన్ను సృష్టించిన వాడవు నువ్వే. నేను నీ దాసుడను. నా శక్తి వంచన లేకుండా నీ మాటకు, నీకిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నేను ఒడిగట్టిన అపరాధపు బారినుండి నీ శరణు వేడుతున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకుంటున్నాను. నీ సమక్షంలో నా పాపాలను అంగీకరిస్తున్నాను. కనుక (స్వామీ!) నన్ను మన్నించు. నీవు తప్పు పాపాలను మన్నించే వాడెవడూ లేడు.” (బుఖారీ)

English

Shaddad bin Aus (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The best manner of asking for forgiveness is to say: “O Allah! You are my Lord. None has the right to be worshipped except You. You created me and I am your servant and I abide by your covenant and promise as best I can. I seek refuge in you from the evil, which I have committed. I acknowledge your favor upon me and I acknowledge my sins, so forgive me, for verily none can forgive sin except you.” Related by Al-Bukhari.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1347

1348

హదీసు 1348

وَعَنِ ابْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { لَمْ يَكُنْ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَدَعُ هَؤُلَاءِ اَلْكَلِمَاتِ حِينَ يُمْسِي وَحِينَ يُصْبِحُ: اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ اَلْعَافِيَةَ فِي دِينِي, وَدُنْيَايَ, وَأَهْلِي, وَمَالِي, اَللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِي, وَآمِنْ رَوْعَاتِي, وَاحْفَظْنِي مِنْ بَيْنِ يَدَيَّ, وَمِنْ خَلْفِي, وَعَنْ يَمِينِي, وَعَنْ شِمَالِي, وَمِنْ فَوْقِي, وَأَعُوذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِي } أَخْرَجَهُ النَّسَائِيُّ, وَابْنُ مَاجَهْ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ..

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఈ వచనాలను రేయింబవళ్ళలో ఎన్నడూ విడనాడేవారు కారు. (అవేమంటే) “ఓ దేవా! నా ధర్మం (పరలోకం), నా ఇహలోకం, నా ఆలుబిడ్డలు, నా సిరిసంపదల విషయంలో నేను నీ రక్షణ కోరుతున్నాను. స్వామీ! నా లోపాలను తెరమరుగుగావించు, భీతావహ స్థితినుంచి, ఖేదం నుంచి నన్ను కాపాడు. దేవా! ముందు నుంచి, వెనుక నుంచి, కుడి ఎడమల నుంచి నన్ను రక్షించు. అకస్మాత్తుగా క్రింది నుంచి వినాశనం గావించబడటం నుంచి నేను నీ ఔన్నత్యపు శరణు కోరుతున్నాను.” (నసాయి, ఇబ్నెమాజా దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Ibn ’Umar (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) never failed to say these words in the morning and the evening: “O Allah! I ask you for pardon and well-being in my religious and worldly affairs, and my family and my wealth. O Allah! Cover my weaknesses and set at ease my dismay. O Allah! Preserve me from the front and from behind and on my right and on my left and from above, and I seek refuge with you lest I be swallowed up by the earth.” Related by An-Nasa’i and Ibn Majah. Al-Hakim graded it as Sahih.

సారాంశం

ఈ హదీసులో ఆరు వైపుల నుంచి దేవుని రక్షణ కోరటం జరిగింది. ఎందుకంటే మానవుడు పై నుంచి, క్రింది నుంచి, కుడి వైపు నుంచి, ఎడమ వైపునుంచి – నలు వైపుల నుంచి శత్రువుల వ్యూహంలో చిక్కుకుని ఉన్నాడు. ఈ శత్రువులు మనుషుల్లో, జిన్నుల్లో, షైతానుల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా భూమిలో కూరుకుపోవటం, ముంపునకు గురవటం వంటి ప్రమాదాల నుంచి శరణు కోరబడింది. దాంతోపాటు ధర్మావలంబనలో చిత్తశుద్ధి, పాపాలకు దూరంగా ఉండటం, ఇహలోకంలో శాంతి, ఆలుబిడ్డల క్షేమం, సిరిసంపదల్లో శుభశ్రేయాలు ఒనగూరటం, గోచర అగోచర ఆపదల నుండి సురక్షితంగా ఉండటం, రోగాల బారినుండి కుశలంగా ఉండటం వంటి వివిధ విషయాలలో కూడా దేవుని శరణు కోరటం జరిగింది. నిజానికి ఈ కడగండ్ల బారినుండి మానవులను కాపాడేవాడు ఆ ఒక్క దేవుడే. ఆయన కటాక్ష వీక్షణాలు లేకుండా ఏ మనిషి తన పాపాలనుండి, తన శత్రువుల నుండి సురక్షితంగా ఉండలేడు సుమా!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1348

1349

హదీసు 1349

وَعَنِ ابْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ, وَتَحَوُّلِ عَافِيَتِكَ, وَفَجْأَةِ نِقْمَتِكَ, وَجَمِيعِ سَخَطِكَ } أَخْرَجَهُ مُسْلِمٌ..

దైవప్రవక్త ﷺ తరచూ ఈ విధంగా ప్రవచించేవారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “ఓ అల్లాహ్! నేను నీ అనుగ్రహాల క్రమ క్షీణత నుంచి నీ శరణు కోరుతున్నాను. నీవు ప్రసాదించిన కలిమి కరిగిపోవటం, అకస్మాత్తుగా ఆపద విరుచుకు పడటం, అన్ని రకాల అసమ్మతి ఆవరించటం, ఆగ్రహోదగ్ర స్థితి నెలకొనటం నుంచి (నీ శరణు వేడుతున్నాను).” (ముస్లిం)

English

Ibn 'Umar (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) used to supplicate saying, “O Allah! I seek refuge in you from the withholding of your favor, the decline of the good health you have given, the suddenness of your vengeance and from all forms of your wrath.” Related by Muslim.

సారాంశం

దైవానుగ్రహాలు క్షీణ దశలో ఉన్నాయంటే అది మనిషి స్వయంకృతమేనని గ్రహించాలి. మనిషి సంకల్పంలో చెడుగు వచ్చి, అతని కర్మలు పెడత్రోవపడితే అతనిపై నుంచి దేవుని కటాక్ష వీక్షణాలు తొలగిపోతాయి. తత్ఫలితంగా అతడు కష్టాలకు, కడగండ్లకు ఎదురీదవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకే అతడు ఎప్పుడయినా దైవానుగ్రహాలు క్షీణించటం నుంచి శరణు వేడుకున్నాడంటే, తన దుష్కర్మల బారినుండి దేవుని శరణు కోరాడని భావించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1349

1350

హదీసు 1350

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرٍو ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ غَلَبَةِ اَلدَّيْنِ, وَغَلَبَةِ اَلْعَدُوِّ, وَشَمَاتَةِ اَلْأَعْدَاءِ } رَوَاهُ النَّسَائِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ..

హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా వేడుకుంటూ ఉండేవారు: “దేవా! రుణభారం నుంచి, శత్రువు నాపై ఆధిపత్యం వహించటం నుంచి, విరోధులు నన్ను చూసి ఇకిలించే దుస్థితి నుంచి నేను నీ శరణు వేడుతున్నాను.” (నసాయి దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Ibn Umar (RAA) narrated, “The Messenger of Allah (ﷺ) used to say, “O Allah! I seek refuge in you from the burden of debts and from being over-powered by men and from the gloating of enemies (at an evil I am afflicted with).” Related by

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1350

1351

హదీసు 1351

وَعَنْ بُرَيْدَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { سَمِعَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-رَجُلاً يَقُولُ: اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنِّي أَشْهَدُ أَنَّكَ أَنْتَ اَللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ, اَلْأَحَدُ اَلصَّمَدُ, اَلَّذِي لَمْ يَلِدْ, وَلَمْ يُولَدْ, وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ.‏ فَقَالَ" لَقَدْ سَأَلَ اَللَّهُ بِاسْمِهِ اَلَّذِي إِذَا سُئِلَ بِهِ أَعْطَى, وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ..

ఒక వ్యక్తి ఈ వేడుకోలు వచనాలు పలుకుతుండగా దైవప్రవక్త ﷺ విన్నారని హజ్రత్ బురైద (రదియల్లాహు అన్హు) చెప్పారు. (ఆ వ్యక్తి ఇలా వేడుకున్నాడు) : “దేవా! నేను నిన్ను అర్థిస్తున్నాను. ఎందుకంటే నీవు తప్ప మరో దేవుడు లేడనీ, నీవు తప్ప ఆరాధించదగినవాడు వేరెవ్వడూ లేడనీ, నీవు ఏకేశ్వరుడవనీ, అక్కర లేనివాడవనీ, ఎవరినీ కనని వాడవనీ, ఎవరికీ సంతానం కాని వాడవనీ, సహవర్తులెవరూ లేనివాడవనీ నేను సాక్ష్యమిస్తున్నాను.” దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : “ఈ వ్యక్తి అల్లాహ్ యొక్క ఏ గుణగణాల ఆధారంగా అర్థించాడంటే, ఎప్పుడు వీటి ఆధారంగా అర్థించినా ఆయన అనుగ్రహిస్తాడు. దుఆ చేసినప్పుడల్లా ఆయన దానికి ఆమోద ముద్ర వేస్తాడు.” (దీనిని అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజా ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైందిగా ఖరారు చేశారు)

English

Buraidah (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) heard a man saying: ‘O Allah! I ask you by virtue that I testify that you are Allah; there is no God but You, the one —· the Self Sufficient Master, Who did not beget, and was not begotten, and to whom no one is equal.’ Allah’s Messenger (ﷺ) then said, “He has asked Allah by His Name by which when asked, He gives, and by which when supplicated, He answers.” Related by the four Imams and Ibn Hibban graded it as Sahih.

సారాంశం

‘దుఆ’ సందర్భంగా ఈ హదీసులోని వచనాలను పఠించాలనీ, అవి దుఆ స్వీకరించబడటంలో దోహదకారి అవుతాయని దీని సారాంశం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1351

1352

హదీసు 1352

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا أَصْبَحَ, يَقُولُ: اَللَّهُمَّ بِكَ أَصْبَحْنَا, وَبِكَ أَمْسَيْنَا, وَبِكَ نَحْيَا, وَبِكَ نَمُوتُ, وَإِلَيْكَ اَلنُّشُورُ } وَإِذَا أَمْسَى قَالَ مِثْلَ ذَلِكَ ; إِلَّا أَنَّهُ قَالَ: { وَإِلَيْكَ اَلْمَصِيرُ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ..

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : తెల్లవారినప్పుడు దైవప్రవక్త ﷺ “ఓ అల్లాహ్! నీ మూలంగానే మేము తెల్లవార్చాము, నీ మూలంగానే మేము సాయంత్రం చేశాము, నీ ద్వారానే మేము జీవిస్తున్నాము, నీ ద్వారానే మాకు మరణం సంభవిస్తుంది, నీ వైపునకే మేము తిరిగి లేపబడనున్నాము” అని పఠించేవారు. సాయంత్రమైనపుడు కూడా ఆయన ﷺ ఈ వేడుకోలు వచనాలను పఠించేవారు. అయితే ‘నీ వైపునకే తిరిగి లేపబడనున్నాము’ అనే బదులు ‘నీ వైపునకే మరలి రానున్నాము’ అని అనేవారు. (ఈ హదీసును నలుగురు – అబూదావూద్, తిర్మిజీ, నసాయి మరియు ఇబ్నెమాజా – ఉల్లేఖించారు).

English

Abu Hurairah (RAA) narrated, ‘Allah’s Messenger (ﷺ) would say in the morning, “O Allah! By Your leave we have reached the morning and by your leave we have reached the evening. By Your leave we live and die. Unto you is our resurrection.” In the evening, he would say the same except the last phrase: “and to you do we return.” Related by the four Imams.

సారాంశం

మనిషికి ఏ భాగ్యం ప్రాప్తించినా అది దేవుని తరపుననే ప్రాప్తిస్తుందనీ, అందులో వలీల ప్రమేయంగానీ, దైవదూతల ప్రయత్నంగానీ, ప్రవక్తల జోక్యం గానీ ఉండదనీ, వాళ్ళు సయితం దేవుని దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటారని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. నిద్రకీ-మరణానికీ ప్రగాఢమైన సంబంధం ఉందని కూడా ఈ హదీసు వల్ల తెలుస్తోంది. మనిషి నిద్రనుండి మేల్కొన్నాడంటే ఒక విధంగా చచ్చి బ్రతికినట్లే. అందుకే సాయంత్రం పూట చేసే వేడుకోలులో ‘మసీర్’ (మరలి రానున్నాము) అనే పదం ఉపయోగించబడింది. ఎందుకంటే అది నిద్రించే సమయం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1352

1353

హదీసు 1353

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ أَكْثَرُ دُعَاءِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-رَبَّنَا آتِنَا فِي اَلدُّنْيَا حَسَنَةً, وَفِي اَلْآخِرَةِ حَسَنَةً, وَقِنَا عَذَابَ اَلنَّارِ } مُتَّفَقٌ عَلَيْهِ..

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ అత్యధికంగా ఈ దుఆ చేసేవారు : “ఓ మా ప్రభువా! మాకు ప్రపంచంలోనూ మేలును ఒసగు. పరలోకంలోనూ మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని అగ్ని యాతన నుండి కాపాడు.” (బుఖారీ, ముస్లిం)

English

Anas (RAA) narrated, “The Messenger of Allah (ﷺ) used to supplicate frequently: “O our Lord, grants us the best in this life and the best in the next life, and protects us from the punishment of the Fire.” Agreed upon.

సారాంశం

ఈ హదీసులో వచ్చిన అరబీ వేడుకోలు వచనాలను దైవప్రవక్త ﷺ అత్యధికంగా పఠించేవారు. ఆ వచనాలు ఇవి: “రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్.”

ఇది ఎంతో సమగ్రమైన వేడుకోలు. ఖాజీ అయాజ్ అభిప్రాయం ప్రకారం ఇహపరాల పరమార్థాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ దుఆలోని ‘హసనతన్’ అనే పదంలో ప్రాపంచికంగా సత్కార్యాలు, సజ్జన సంతానం, విస్తృతమైన ఉపాధి, ప్రయోజనకరమయిన విద్య, యోగక్షేమాలు అన్నీ వచ్చేస్తాయి. కేవలం ఒక్క ‘హసనతన్’ అనే పదం పలికి ఈ ప్రాపంచిక శుభాలన్నీ జుర్రుకోవచ్చు.

ఇక పారలౌకికంగా చూస్తే ఈ ఒక్క పదం పలికి స్వర్గప్రవేశాన్ని కోరుకున్నట్లయింది. పరలోకంలో మనిషి ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యల, ఆందోళనలనుండి అభయాన్ని, తేలికపాటి లెక్కను, నరకాగ్నినుండి విముక్తిని ప్రభువు సమక్షంలో కోరుకున్నట్లవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1353

1354

హదీసు 1354

وَعَنْ أَبِي مُوسَى اَلْأَشْعَرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-يَدْعُو: اَللَّهُمَّ اغْفِرْ لِي خَطِيئَتِي, وَجَهْلِي, وَإِسْرَافِي فِي أَمْرِي, وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي, اَللَّهُمَّ اِغْفِرْ لِي جِدِّي, وَهَزْلِي, وَخَطَئِي, وَعَمْدِي, وَكُلُّ ذَلِكَ عِنْدِي, اَللَّهُمَّ اِغْفِرْ لِي مَا قَدَّمْتُ, وَمَا أَخَّرْتُ, وَمَا أَسْرَرْتُ, وَمَا أَعْلَنْتُ, وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي, أَنْتَ اَلْمُقَدِّمُ, وَأَنْتَ الْمُؤَخِّرُ, وَأَنْتَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ } مُتَّفَقٌ عَلَيْهِ..

హజ్రత్ అబూ మూసా అష్‌అరి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారు: “ఓ అల్లాహ్! నా తప్పును క్షమించు. అజ్ఞానంతో కూడుకున్న నా పనులను, నా కార్యకలాపాలలో దొర్లిన వైపరీత్యాలను దయతో మన్నించు. ఇంకా – నా గురించి నీకు తెలిసివున్న వాటినన్నింటినీ క్షమించు. ఓ దేవా! సంకల్పికంగా, అసంకల్పికంగా నా వల్ల జరిగిన తప్పిదాలను మన్నించు – అవి నా మరుపువల్ల జరిగినా, ఉద్దేశ్యపూర్వకంగా జరిగినా దానంతటికీ నేనే బాధ్యుడను. స్వామీ! నా వల్ల జరిగిపోయినదీ, ఇకమీదట నేను చేయబోయేదీ, నేను కనిపించకుండా ఉంచినదీ, నా వల్ల బహిర్గతం గావించబడినదీ, నా గురించి నీకు తెలిసినదీ – సర్వాన్నీ క్షమించు. నువ్వే తొలివాడవు, నువ్వే చివరివాడవు. నీవు సర్వమూ చేయగల సమర్థుడవు.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Musa al-Ash’ari (RAA) narrated, “The Messenger of Allah (ﷺ) used to supplicate, “O Allah, forgive me my faults, my ignorance, my immoderation in my concern. And you are better aware (of my affairs) than myself. O Allah, grant me forgiveness (of the faults which I committed) seriously or otherwise (and which I committed) inadvertently and deliberately. All these (failings) are in me. O Allah, grant me forgiveness from the faults, which I did in haste or deferred, which I committed in privacy or in public and you are better aware (of them) than myself. You are the First and the Last and over all things you are Omnipotent.” Agreed Upon.

సారాంశం

తన అనుచర సమాజానికి శిక్షణ ఇచ్చే నిమిత్తం దైవప్రవక్త ﷺ ఈ విధమైన ప్రార్థనలు చేసేవారు. దైవప్రవక్తలయితే నిర్దోషులు, సాధుస్వభావులు అయి ఉంటారు. వారి ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు జరగవు. ఎప్పుడయినా మానవ సహజమైన దౌర్బల్యం వల్ల పొరబాటు వారి ద్వారా జరగబోతే దేవుడు వారిని ఆ పొరబాటు నుండి కాపాడుతాడు.

పై హదీసులోని ‘దుఆ’ను దైవప్రవక్త ﷺ నమాజు ఆఖరి దశలో – అంటే తషహ్హుద్ చదివిన తరువాత – పఠించేవారు అని కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. నమాజు ముగించిన తరువాత పఠించేవారని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. రెండు విధాలుగా కూడా ఆయన ﷺ ఈ దుఆ చేసి ఉండవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1354

1355

హదీసు 1355

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: اَللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي اَلَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي, وَأَصْلِحْ لِي دُنْيَايَ اَلَّتِي فِيهَا مَعَاشِي, وَأَصْلِحْ لِي آخِرَتِي اَلَّتِي إِلَيْهَا مَعَادِي, وَاجْعَلْ اَلْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ, وَاجْعَلْ اَلْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ } أَخْرَجَهُ مُسْلِمٌ..

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా వేడుకునేవారు : “ఓ దేవా! నా కొరకు ధర్మాన్ని సవ్యంగా ఉంచు. ఎందుకంటే నా వ్యవహారాలు చక్కబడేది దీని మూలంగానే. నా కోసం నా ప్రపంచాన్ని సజావుగా ఉంచు. ఎందుకంటే నా జీవితం దానిపైనే ఆధారభూతమై ఉంది. నా కోసం నా పరలోకాన్ని చక్కదిద్దు. ఎందుకంటే నేను మరలి పోవలసింది దాని వైపునకే. (స్వామీ!) నా జీవితాన్ని మంచి పనుల వృద్ధికి మూలకారణంగా మలచు. ఇంకా మరణాన్ని అన్ని రకాల చెడుగుల నుండి ముక్తి దాయినిగా చెయి.” (ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) used to say, “O Allah! Set right for me my religion, which is the safeguard of my affairs. And set right for me the affairs of the world wherein is my living. Decree the Hereafter to be good for me. And make this life, for me, (a source) of abundance for every good and make my death (a source) of comfort to me and protection against every evil.” Related by Muslim.

సారాంశం

ఈ ‘వేడుకోలు’లోనూ ఇహపరాల శుభాలు అర్థించబడ్డాయి. ఇహలోకపు మేలయినా, పరలోకపు శుభమయినా సృష్టికర్త అధీనంలో మాత్రమే ఉంటాయని ఒక నిజ విశ్వాసి దృఢంగా నమ్ముతాడు. ఈ హదీసును చదివిన వారెవరయినా మృత్యువును కోరటం సమంజసం అన్న అర్థం తీసుకోరాదు. నిజానికి మరణానంతరం ఎదురయ్యే సమస్యలను సులువుగా అధిగమించే ప్రశాంత స్థితిని ప్రసాదించమని మాత్రమే హదీసులో కోరబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1355

1356

హదీసు 1356

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ:" اَللَّهُمَّ اِنْفَعْنِي بِمَا عَلَّمْتَنِي, وَعَلِّمْنِي مَا يَنْفَعُنِي, وَارْزُقْنِي عِلْمًا يَنْفَعُنِي } رَوَاهُ النَّسَائِيُّ, وَالْحَاكِمُ.. وَلِلتِّرْمِذِيِّ: مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ نَحْوُهُ, وَقَالَ فِي آخِرِهِ: { وَزِدْنِي عِلْمًا. اَلْحَمْدُ لِلَّهِ عَلَى كُلِّ حَالٍ, وَأَعُوذُ بِاَللَّهِ مِنْ حَالِ أَهْلِ اَلنَّارِ } وَإِسْنَادُهُ حَسَنٌ..

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రార్థిస్తూ ఉండేవారు : “ఓ అల్లాహ్! నీవు నాకు ప్రసాదించిన జ్ఞానాన్ని నా పాలిట ప్రయోజనకరమయినదిగా మలచు. నాకు ప్రయోజనాన్ని చేకూర్చే జ్ఞానాన్ని మాత్రమే ప్రసాదించు. ఇంకా నాకు ప్రయోజనదాయకమైన జ్ఞానాన్ని వొసగు.” (దీనిని నసాయి మరియు హాకిమ్ ఉల్లేఖించారు)

తిర్మిజీలో అబూహురైరా (రదియల్లాహు అన్హు)చే కూడా ఈ విధంగానే ఉల్లేఖించబడింది. అయితే దీని చివర్లో ఈ వాక్యం అదనంగా ఉంది – “నా జ్ఞానంలో వృద్ధినొసగు. సర్వావస్థల్లో దైవానికే కృతజ్ఞతలు. ఇంకా, నేను నరకవాసుల దురవస్థ నుండి దేవుని శరణు కోరుతున్నాను.”

English

Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) used to say, “O Allah! Grant me benefit in what you have taught me, and teach me useful knowledge and provide me with knowledge that will benefit me.” Related by An-Nasa’i and Al-Hakim.

At-Tirmidhi reported a similar tradition on the authority of `Abu Hurairah (RAA), he said at its end, “And increase my knowledge. Praise be to Allah in all circumstances. I seek refuge in Allah from the state of those who will go to Hell.” Its chain of narrators is good.

సారాంశం

ప్రపంచంలోనూ, పరలోకంలోనూ కూడా లాభదాయకమయ్యే విద్యకై ఈ హదీసులో అభ్యర్థించటం జరిగింది. పరలోకంలో వినాశకరంగా పరిణమించే విషయాన్ని అర్థించటం ఒక విశ్వాసికి సుతరామూ శోభించదు. ఎందుకంటే విశ్వాసి దృష్టిలో అసలు సిసలు సాఫల్యం పరలోక సాఫల్యమే. ఇక ప్రయోజనదాయకమైన జ్ఞానం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది? అన్న ప్రశ్న ఈ సందర్భంగా అందరి మనసులలో జనించవచ్చు. విశ్వాసానికి శక్తినీ, పుష్టినీ ప్రసాదించి మనిషిని కార్యోన్ముఖుడ్ని చేసేదే అసలు ప్రయోజనకరమైన జ్ఞానం. ప్రాపంచిక వ్యవహారాలను చక్కదిద్దుకుని, అధర్మ విషయాలకు దూరంగా మసలుకునే లక్ష్యంతో ప్రాపంచిక విద్యను అనుగ్రహించమని దైవాన్ని కోరడం కూడా తప్పు కాదు. పైగా ఇలా కోరుకోవటం వల్ల మనిషికి దైవంపై గల ఈమాన్ (విశ్వాసం) పెరుగుతుంది. ప్రాపంచిక విద్యలలో కూడా ముస్లింలు ముందంజ వేయటం, సమకాలీన సైద్ధాంతిక సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం ఎంతైనా అవసరం. లేకపోతే అవిశ్వాసులు అన్ని విధాలుగా వారిపై ఆధిపత్యం సంపాదించి వారి బ్రతుకును దుర్భరం చేసేస్తారు.

ఈనాడు మనం ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అవగతమయ్యేది కూడా ఇదే! వైజ్ఞానికంగా, సాంకేతికంగా పురోగతి సాధించిన ముస్లిమేతర దేశాలు నేడు యావత్తు ప్రపంచాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. తమ దగ్గరున్న అణ్వాయుధాల బలంతో ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు తీసుకురావాలనుకున్నా తీసుకురాగలమని వారు క్రియాత్మకంగా చాటి చెబుతున్నారు. అదే సమయంలో అపారమైన చమురు సంపదను కలిగివున్న అరబ్బు దేశాలు దిక్కుతోచక దిక్కులు చూసే నిస్సహాయస్థితికి లోనై ఉన్నాయి. ఈ స్థితి సూచించేదేమిటి? వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో ముస్లింలు వహించిన అశ్రద్ధకు, అనాసక్తతకు ఇది ప్రతీక కాదా?!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1356

1357

హదీసు 1357

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-عَلَّمَهَا هَذَا اَلدُّعَاءَ: { اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنَ الْخَيْرِ كُلِّهِ, عَاجِلِهِ وَآجِلِهِ, مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ, وَأَعُوذُ بِكَ مِنَ الشَّرِّ كُلِّهِ, عَاجِلِهِ وَآجِلِهِ, مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ, اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ عَبْدُكَ وَنَبِيُّكَ, وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عَاذَ مِنْهُ عَبْدُكَ وَنَبِيُّكَ, اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ اَلْجَنَّةَ, وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ, وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ, وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ, وَأَسْأَلُكَ أَنْ تَجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِي خَيْرًا } أَخْرَجَهُ اِبْنُ مَاجَهْ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِمُ..

దైవప్రవక్త ﷺ తనకు ఈ దుఆను నేర్పారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలియజేశారు. ( ఆ దుఆ ఇది) – “దేవా! నేను అన్ని రకాల మేళ్ళను నీ నుండి అర్థిస్తున్నాను – అవి తొందరగా ప్రాప్తించేవైనా, ఆలస్యంగా ప్రాప్తించేవైనా, అవి నాకు తెలిసినవైనా, తెలియనివైనా! అన్ని రకాల కీడునుంచి నేను నీ శరణు వేడుతున్నాను – అది త్వరగా వచ్చేదైనా, ఆలస్యంగా వచ్చేదైనా, దాని గురించి నాకు తెలిసివున్నా, నా జ్ఞానపరిధిలోకి రానిదైనా సరే. దేవా! నీ దాసుడు మరియు నీ ప్రవక్త ఏ శ్రేయం కొరకు నిన్ను అర్థించారో నేనూ దాని కోసమే నిన్ను వేడుకుంటున్నాను. నీ దాసుడు మరియు ప్రవక్త ఏ కీడు నుంచి నీ శరణు కోరారో నేనూ దాని బారినుంచి నీ రక్షణ కోరుతున్నాను. ఓ అల్లాహ్! నేను నిన్ను స్వర్గం కోసం అభ్యర్థించుకుంటున్నాను. ఏ కర్మ మరియు ఏ వాక్కు స్వర్గానికి సమీపంలో చేరుస్తాయో వాటి కోసం నిన్ను అర్థిస్తున్నాను. నరకం నుండి నీ రక్షణ కోరుతున్నాను. నరకానికి చేరువ చేసే వాక్కాయ కర్మల నుంచి కూడా నీ రక్షణ కోరుతున్నాను. నీవు నా కొరకు గైకొనే నిర్ణయాన్ని నా పాలిట శ్రేయోదాయకం గావించే విషయమై కూడా నీకు విన్నపం చేసుకుంటున్నాను.” (ఇబ్నెమాజా దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ మరియు హాకిమ్లు దృఢమైనదిగా ఖరారు చేశారు).

English

’A’ishah (RAA) narrated, ‘Allah’s Messenger (ﷺ) taught her this supplication, “O Allah! I ask you of all good of what I have done and what I have not done in this world and in the Hereafter. I seek refuge in you from the evil of what I have done and what I have not done in this world and in the Hereafter. O Allah! I ask of you all good that your servant and Prophet Muhammad (ﷺ) used to ask of you. I seek refuge in you from all evil that your servant and Prophet Muhammad used to seek refuge in you from. O Allah! I ask you for Paradise and what brings me nearer to it of deeds and sayings. I seek refuge in You from Hell-Fire and what brings me near to it of deeds and sayings. I ask you for the good consequences of Your Decree.” Related by Ibn Majah Ibn Hibban and Al-Hakim graded it as Sahih

సారాంశం

ఇది కూడా సమగ్రమయిన దుఆలలో ఒకటి. ఈ ‘దుఆ’లో పలు విషయాలు కోరబడటంతో పాటు, పలు విషయాల నుండి శరణు వేడుకోవటం కూడా జరిగింది. దైవప్రవక్త ﷺ ఏ విషయాల కోసం అర్థించారో ఆ విషయాలను తానూ కోరుకుంటున్నాననీ, ప్రవక్త ﷺ వారు ఏ హానికరమయిన విషయాల నుండి దేవుని శరణు వేడారో వాటి బారి నుంచి తనూ శరణు వేడుతున్నానని విశ్వాసుల మాతృమూర్తి (రదియల్లాహు అన్హా) అనటం మనమంతా గమనించదగిన విషయం. ఇహపరాలకు సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా ఇందులో ఉపేక్షించబడలేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1357

1358

హదీసు 1358

وَأَخْرَجَ اَلشَّيْخَانِ عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ كَلِمَتَانِ حَبِيبَتَانِ إِلَى اَلرَّحْمَنِ, خَفِيفَتَانِ عَلَى اَللِّسَانِ, ثَقِيلَتَانِ فِي اَلْمِيزَانِ, سُبْحَانَ اَللَّهِ وَبِحَمْدِهِ , سُبْحَانَ اَللَّهِ اَلْعَظِيمِ }

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: రెండు వచనాలు కరుణామయునికి ఎంతో ప్రియమైనవి. నాలుక (నోటి)పై ఎంతో తేలికైనవి. త్రాసులో మాత్రం బరువైనవి. (అవేమంటే) సుబ్‌హానల్లాహి వ బిహమ్ధిహీ, సుబ్‌హానల్లాహిల్ అజీమ్ (అల్లాహ్ పవిత్రుడు, స్తుతించదగిన వాడు. అల్లాహ్ పవిత్రుడు, సర్వోన్నతుడు). (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Two phrases which are dear to the Compassionate One and are light on the tongue but heavy in the scale are: “How perfect Allah is and I praise Him; and How perfect Allah is the Most Great.” Agreed upon.

సారాంశం

ఈ హదీసులోని రెండు వచనాలు నాలుకపై తేలికైనవి అంటే దీని భావం వాటిని ఉచ్చరించటం, కంఠస్థం చేసుకోవటం చాలా తేలిక. త్రాసులో బరువైనవంటే; అనేక క్లిష్టమయిన పుణ్యకార్యాలు త్రాసులో బరువుగా ఉన్నట్లే. ఈ రెండు సద్వచనాలు కూడా ఎంతో బరువును సంతరించుకుంటాయి. ప్రళయదినాన మనుషుల కర్మలు తూకం వేయబడతాయనీ, ఇందు నిమిత్తం త్రాసు నెలకొల్పబడుతుందని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. విశ్వప్రభువు అయిన అల్లాహ్ యొక్క ఔదార్యం, కారుణ్య గుణం కూడా దీనిద్వారా వెల్లడవుతోంది. తన దాసులు చిత్తశుద్ధితో చేసే తేలికపాటి పుణ్యకార్యాలను కూడా ఆయన తన దయతో బరువైనవిగా మార్చుతాడు. కొద్దిపాటి పుణ్యానికి కూడా ఎన్నోరెట్ల పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఇది కేవలం ఆయన కృప, కారుణ్యం మాత్రమే. ఆయన కారుణ్యం అన్నింటినీ పరివేష్టించి ఉంది.

“బులూగుల్ మరామ్” గ్రంథ సంకలనాన్ని హిజ్రీ 828, రబీవుల్ అవ్వల్ నెల, 11వ తేదీన సర్వోన్నతుడైన అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతిమ దైవసందేశహరుల ﷺ వారిపై శాంతి శ్రేయాలను కురిపించవలసిందిగా వేడుకుంటూ, ఆయన ﷺకు కడు వినయ వినమ్రతలతో, గౌరవంతో నివాళిని ఘటిస్తూ, సంపూర్తి గావించానని విశ్వవిఖ్యాత ఇస్లామీయ ధర్మవేత్త, ఖాజియుల్ ఖుజాత్ అల్లామా అహ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ హజర్ – రహిమహుల్లాహ్ – తెలియజేశారు. (అల్లాహ్ ఈయన జ్ఞాన ఖని నుండి ప్రాణి కోటికి విస్తృతమైన ప్రయోజనాన్ని పొందే సద్బుద్ధిని ప్రసాదించుగాక!)

కారుణ్య ప్రభువైన అల్లాహ్ గ్రంథకర్తకు, వ్యాఖ్యాతకు, ఈ బృహత్తర కార్యంలో ఆదరువుగా నిలిచిన వారందరికీ తన కారుణ్య సాగరంలో నుంచి భాగాన్ని ప్రసాదించుగాక! వీరందరికీ దైవప్రవక్తల, అమరగతుల, ప్రవక్త ప్రియసహచరుల, సజ్జనుల సాంగత్యాన్ని, సామీప్యాన్ని వొసగుగాక!!

ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.6 ధ్యానం మరియు దుఆ|హదీసు 1358