హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 16. వివిధ విషయాల పుస్తకం, 5వ అధ్యాయం: ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం. ఈ అధ్యాయంలో 18 హదీసులు (హదీసు 1314 – 1331) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం
باب الترغيب في مكارم الأخلاق
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1314
عَنِ اِبْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ عَلَيْكُمْ بِالصِّدْقِ, فَإِنَّ اَلصِّدْقَ يَهْدِي إِلَى اَلْبِرِّ, وَإِنَّ اَلْبِرَّ يَهْدِي إِلَى اَلْجَنَّةِ, وَمَا يَزَالُ اَلرَّجُلُ يَصْدُقُ, وَيَتَحَرَّى اَلصِّدْقَ, حَتَّى يُكْتَبَ عِنْدَ اَللَّهِ صِدِّيقًا, وَإِيَّاكُمْ وَالْكَذِبَ, فَإِنَّ اَلْكَذِبَ يَهْدِي إِلَى اَلْفُجُورِ, وَإِنَّ اَلْفُجُورَ يَهْدِي إِلَى اَلنَّارِ, وَمَا يَزَالُ اَلرَّجُلُ يَكْذِبُ, وَيَتَحَرَّى اَلْكَذِبَ, حَتَّى يُكْتَبَ عِنْدَ اَللَّهِ كَذَّابًا } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “సత్యాన్ని విధిగా అవలంబించండి. సత్యం సత్కార్యం వైపునకు మార్గం చూపుతుంది. సత్కార్యం స్వర్గం వైపునకు గొనిపోతుంది. (సత్యావలంబనను మనిషి తన కోసం అనివార్యంగా చేసుకున్నందు వల్ల) మనిషి నిత్యం సత్యమే పలుకుతాడు, సత్యాన్వేషణలోనే ఉంటాడు – కడకు అతడు అల్లాహ్ సన్నిధిలో ‘సత్యసంధుడు’గా వ్రాసుకోబడతాడు. అసత్యానికి దూరంగా ఉండండి. అసత్యం దుష్కార్యాల వైపునకు తీసుకుపోతుంది. దుష్కార్యం నరకాగ్ని వైపునకు గొనిపోతుంది. మనిషి నిత్యం అసత్యం పలుకుతూ, అసత్య మార్గంలోనే సాధన చేస్తున్నట్లయితే ఆఖరికి అల్లాహ్ సన్నిధిలో ‘అసత్యవాది’ గానే నమోదు చేయబడతాడు.” (బుఖారీ, ముస్లిం)
English
Ibn Mas'ud (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Adhere (you people) to truth, for truth leads to good deeds and good deeds lead to Paradise, and if a man continues to speak the truth and makes truth his object he will be recorded as truthful before Allah. Avoid (you people) falsehood, for falsehood leads to wickedness and wickedness leads to Hell, and if a man continues to speak falsehood and makes falsehood his object he will be recorded as a liar before Allah.” Agreed upon.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1314
హదీసు 1315
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { إِيَّاكُمْ وَالظَّنَّ, فَإِنَّ اَلظَّنَّ أَكْذَبُ اَلْحَدِيثِ } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “దురనుమానానికి దూరంగా మసలుకోండి. దురనుమానం అన్నింటికన్నా పెద్ద అసత్యం.” (బుఖారీ, ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Beware of suspicion, for suspicion amounts to the worst form of lying.” Agreed upon.
సారాంశం
పై రెండు హదీసులలోనూ అసత్యానికి దూరంగా ఉండాలనీ, సదా సత్యాన్ని అనుసరించాలని ఉపదేశించబడింది. సత్యానికి అంతిమ పరిణామం స్వర్గమే. అసత్యం దైవాగ్రహానికి కారణభూతమై, నరకాగ్నికి ఆహుతి చేస్తుంది. కాబట్టి ఎవరయితే తన జీవితంలోని సమస్త విభాగాలలో, సమస్త విషయాలలో సత్యాన్ని అవలంబిస్తాడో, సత్యాన్నే తన జీవన ధ్యేయంగా చేసుకుంటాడో అతడు స్వర్గానికి బాటను వేసుకుంటాడన్నమాట!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1315
హదీసు 1316
وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِيَّاكُمْ وَالْجُلُوسَ بِالطُّرُقَاتِ. قَالُوا: يَا رَسُولَ اَللَّهِ! مَا لَنَا بُدٌّ مِنْ مَجَالِسِنَا; نَتَحَدَّثُ فِيهَا. قَالَ " فَأَمَّا إِذَا أَبَيْتُمْ, فَأَعْطُوا اَلطَّرِيقَ حَقَّهُ. قَالُوا: وَمَا حَقُّهُ? قَالَ:" غَضُّ اَلْبَصَرِ, وَكَفُّ اَلْأَذَى, وَرَدُّ اَلسَّلَامِ, وَالْأَمْرُ بِالْمَعْرُوفِ, وَالنَّهْيُ عَنْ اَلْمُنْكَرِ. } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “(జనులు నడిచే) దారిలో కూర్చోకండి.” ‘దారిలో కూర్చోవటం వినా మాకు కుదరదే! మేమక్కడ కూర్చుని ముఖ్య విషయాలు మాట్లాడుకుంటాము కదా!’ అని సహచరులు విన్నవించుకోగా, “దారిలో బైఠాయించటం తప్ప మరో గత్యంతరం లేదనుకుంటే మీరు దారి హక్కును ఇవ్వవలసి ఉంటుంది” అని ఆయన ﷺ చెప్పారు. ‘దారి హక్కు అంటే ఏమిటీ?’ అని ప్రియసహచరులు ప్రశ్నించగా, “చూపులను క్రిందికి ఉంచాలి. వచ్చేపోయే వారిని వేధించకూడదు. సలాంకు జవాబు ఇవ్వాలి. మంచి గురించి ప్రబోధించాలి, చెడుల నుంచి (జనులను) వారించాలి” అని ఆయన ﷺ వివరించారు.” (బుఖారీ, ముస్లిం)
English
Abu Said al-Khudri (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Avoid sitting by the road side.” The people then said, ‘O Allah‘s Messenger (ﷺ), we cannot do without those meeting places in which we converse” So he said, “Well, if you insist (on that) give the road its due rights.” They asked, ‘What are the road’s due rights?’ He replied, “Lowering your gaze, abstaining from anything offensive, returning salutations, enjoining the right (Ma'ruf) and forbidding from evil deeds (Munkar).” Agreed upon.
సారాంశం
జనులు సంచరించే మార్గాల్లో, వీధుల్లో, వాడల్లో బైఠాయించి కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవటం, వచ్చేపోయే వారికి ఇబ్బందికరంగా మారటం ఎంతమాత్రం అభిలషణీయం కాదని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. పైగా ఇలా కూర్చోవటం మర్యాద అనిపించుకోదు. వచ్చే పోయే వారిలో మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి గ్రూపు మీటింగుల వల్ల వారు తీవ్రమయిన అసౌకర్యానికి లోనవుతారు. అదీగాక ఎక్కడంటే అక్కడ కూర్చోవటం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.
‘దారిహక్కు’ అనే పదంలో ఎన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి. వచ్చే పోయే వారిని వేధించకుండా ఉండటంతోపాటు దారి తప్పిన వారికి మార్గ దర్శకత్వం కూడా చేయవలసి ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న బాటసారులకు సహాయ సహకారాలు కూడా అందించాలి. వచ్చే పోయే వారు తుమ్మిన తరువాత ‘అల్‌హమ్‌దులిల్లాహ్’ అనంటే సమాధానంగా ‘యర్‌హముకల్లాహ్’ అని కూడా పలకాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1316
హదీసు 1317
وَعَنْ مُعَاوِيَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ يُرِدِ اَللَّهُ بِهِ خَيْرًا, يُفَقِّهْهُ فِي اَلدِّينِ } مُتَّفَقٌ عَلَيْهِ..
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) తెలిపారు – “అల్లాహ్ ఏ వ్యక్తి ద్వారా మేలును, శ్రేయాన్ని అభిలషిస్తాడో అతనికి ధర్మావగాహనా శక్తిని (పుష్కలంగా) అనుగ్రహిస్తాడు.” (బుఖారీ, ముస్లిం)
English
Mu’awiyah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When Allah wishes good for anyone, He bestows upon him the Fiqh (comprehension) of the religion.” Agreed upon.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1317
హదీసు 1318
وَعَنْ أَبِي اَلدَّرْدَاءِ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَا مِنْ شَيْءٍ فِي اَلْمِيزَانِ أَثْقَلُ مِنْ حُسْنِ اَلْخُلُقِ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ..
హజ్రత్ అబూ అద్దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “దేవుని త్రాసులో మంచి నడవడిక కన్నా బరువైన వస్తువు మరొకటేదీ ఉండదు.” (ఈ హదీసును అబూదావూద్ మరియు తిర్మిజీ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Abu ad-Darda’ (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The heaviest thing which will be put on the believer’s scale (on the Day of Resurrection) will be good morals.” Related by Abu Dawud and At-Tirmidhi who graded it as Sahih.
సారాంశం
తీర్పు దినాన త్రాసులు కూడా ప్రత్యక్షమవుతాయనీ, మనుషుల కర్మలు వాటిలో తూయబడతాయనీ ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. అయితే త్రాసులో అన్నింటికన్నా ఎక్కువ బరువైన వస్తువు మనిషి సత్ప్రవర్తన అయి ఉంటుంది. దీన్నిబట్టి సత్ప్రవర్తన, సద్గుణం ఎంత ప్రాముఖ్యంతో కూడుకున్నవో ఊహించవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1318
హదీసు 1319
وَعَنِ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْحَيَاءُ مِنْ اَلْإِيمَانِ } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “వ్రీడ (లజ్జ) విశ్వాసంలో అంతర్భాగం.” (బుఖారీ, ముస్లిం)
English
Ibn 'Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Haya (modesty, bashfulness etc.) is a part of Faith.” Agreed upon.
సారాంశం
అరబీలో ‘హయా’ అనే పదం వచ్చింది. ‘హయా’ అంటే అసలు లజ్జ, వ్రీడ, సిగ్గు, బిడియం అన్న అర్థాలు వస్తాయి. లజ్జ అనేది స్వాభావికమైనది. ఈ లజ్జా భావమే గనక మనిషిలో లేకపోతే అతను తన మర్మస్థానాలను కూడా రక్షించుకోడు. లజ్జ లేని వానిలో ఆత్మాభిమానం కూడా ఉండదు. లజ్జ లేనివాడు సమాజం విధించే కట్టుబాట్లను కూడా ఖాతరు చేయడు. లజ్జ మానవత్వానికి ప్రతిరూపం. అందుకే ‘లజ్జ’ ఈమాన్ (విశ్వాసం)లో అంతర్భాగంగా ఖరారు చేయబడింది ఈ హదీసులో.
లజ్జా గుణం మనిషిలో భీతినీ, బాధ్యతాభావాన్ని పెంపొందిస్తుంది. లజ్జ సౌశీల్యానికి, పారిశుద్ధ్యానికి సోపానం. లజ్జను మరచినవాడు చంచలుడైపోతాడు. లజ్జా విహీనుడైనవాడు నిర్భయంగా సిగ్గుమాలిన పనులకు పూనుకుంటాడు. అందుకే సంస్కృతంలో అనబడింది – “కామా తురాణాం న భయం న లజ్జ” అని!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1319
హదీసు 1320
وَعَنْ أَبِي مَسْعُودٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِنَّ مِمَّا أَدْرَكَ اَلنَّاسُ مِنْ كَلَامِ اَلنُّبُوَّةِ اَلْأُولَى: إِذَا لَمْ تَسْتَحِ, فَاصْنَعْ مَا شِئْتَ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ..
హజ్రత్ అబూ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధనం – “తొలి దైవదౌత్య పరంపరంలో నుంచి జనులకు ప్రాప్తించిన వాటిలో, ‘సిగ్గు, షరము విడిచేసినపుడు నువ్వు ఏం చేసుకున్నా అడ్డుండదు’ అన్న ప్రబోధన కూడా ఉంది.” (బుఖారీ)
English
Ibn Mas’ud (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “One of the things people have learned from the words of the earliest prophecies is, “If you don’t feel any shame, do whatever you like.” Related by Al-Bukhari.
సారాంశం
‘తొలి దైవదౌత్య పరంపర’ అంటే భావం మహాప్రవక్త ముహమ్మద్ ﷺకు పూర్వం వచ్చిన దైవప్రవక్త (అలైహిముస్సలాం)లపై అవతరించిన దైవవాణి మరియు షరీయతు. అప్పటి షరీయతుల్లోని కొన్ని అంశాలు రద్దు కాలేదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. వాటిలో ఒకటి పై హదీసులోని ప్రబోధనం. సిగ్గు, బిడియం ఉన్నవాడు పాపానికి ఒడిగట్టేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తాడు. ఒకవేళ క్షణికావేశంలో తప్పుచేసినా, తరువాత దాన్ని తలచుకుని సిగ్గుతో కుమిలిపోతాడు.
కాని మనసులో సిగ్గు, షరము అసలేమీ లేనివాడు ఎవరినీ లెక్క చేయడు. సమాజం తనను గురించి ఏమనుకున్నా, తోటివారు తనను ఎంతగా ఈసడించుకున్నా నిక్షేపంగా ఉంటాడు. అందుకే ఈ నేపథ్యంలో కొంతమంది తత్వవేత్తలు ఇలా అన్నారు – ఏదైనా పనికి ఉపక్రమించినపుడు దాని కీడును ఎంచండి, దాని ఉచితానుచితాలను బాగా బేరీజు వేయండి. దానికి మీ మనస్సాక్షి నుండి ‘పచ్చని సంకేతం’ లభిస్తే సరి! లేనట్లయితే ఆ పనిని మాని వేయండి!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1320
హదీసు 1321
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْمُؤْمِنُ اَلْقَوِيُّ خَيْرٌ وَأَحَبُّ إِلَى اَللَّهِ مِنْ اَلْمُؤْمِنِ اَلضَّعِيفِ, وَفِي كُلٍّ خَيْرٌ, اِحْرِصْ عَلَى مَا يَنْفَعُكَ, وَاسْتَعِنْ بِاَللَّهِ, وَلَا تَعْجَزْ, وَإِنْ أَصَابَكَ شَيْءٌ فَلَا تَقُلْ: لَوْ أَنِّي فَعَلْتُ كَانَ كَذَا وَكَذَا, وَلَكِنْ قُلْ: قَدَّرَ اَللَّهُ وَمَا شَاءَ فَعَلَ; فَإِنَّ لَوْ تَفْتَحُ عَمَلَ اَلشَّيْطَانِ } أَخْرَجَهُ مُسْلِمٌ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: దైవ సన్నిధిలో బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికన్నా ఎక్కువ ప్రియతముడు, ప్రయోజనకుడూను. ఆ మాటకువస్తే ప్రతి విశ్వాసిలోనూ మేలు, మంచితనం ఉంటాయి. నీకు ప్రయోజనకరమైన దాన్ని నీవు ఆశించటంలో తప్పు లేదు. (అయితే) కేవలం దైవ సహాయాన్ని అర్థించు! అశక్తుడవై, నిస్సహాయుడవై కూర్చోకు. నీకు వస్తువు ప్రాప్తించినపుడు, ‘నేను ఫలానా పనిని ఇలా చేసేబదులు ఇలా చేసివుంటే నాకు మరిన్ని లాభాలు చేకూరి ఉండేవి’ అని అనకండి. దీనికిబదులు ‘అల్లాహ్ నా కొరకు తలచినదే అయింది’ అని అనండి. ఎందుకంటే ‘అయితే… గీతే…’ అనే ఊహాగానాలతో షైతాన్ ఆగడాలకు ద్వారం తెరచుకుంటుంది.” (ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A believer who is strong (and healthy) is better and dearer to Allah than the weak believer, but there is goodness in both of them. Be keen on what benefits you and seek help from Allah, and do not give up. If anything afflicts you do not say, ‘If I had done such and such things, such and such would have happened.’ But say, ‘Allah decrees and what He wills He does,’ for (the utterance) ‘If I had’ provides an opening for the deeds of the devil.” Related by Muslim.
సారాంశం
‘అయితే…గీతే….’ లాంటి ఊహాగానాలకు తెరదించమని ఈ హదీసులో అనబడింది. కాని మరికొన్ని హదీసుల ద్వారా ఇలాంటి ఆత్మావలోకనానికి అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఇలాంటి ఊహాగానాలను ‘నిషిద్ధం’ అని అనే బదులు ‘అయిష్టకరం’ అనటం సబబుగా ఉంటుంది. కాని ఇలాంటి అంచనాలు వేసుకునే సమయంలో సంకల్పం నిష్కల్మషంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
బలహీనుడైన విశ్వాసికన్నా బలశాలి అయిన విశ్వాసి దేవుని దృష్టిలో ప్రియతముడు అని అనబడటం గమనార్హమైన విషయం. బలవంతుడైన వ్యక్తి ధర్మరక్షణ కోసం ఎక్కువ సేవలు అందిస్తాడు. అనారోగ్యంతో సతమతమయ్యే వ్యక్తికన్నా ఆరోగ్యవంతుడైన వాడు తన్ను తాను రక్షించుకోవటంతో పాటు, ఇతరులను కూడా రక్షిస్తాడు. అయితే మానవుడు ఎంత బలశాలి అయినప్పటికీ దైవ సహాయం లేనిదే అతడేమీ చేయజాలడన్న సత్యాన్ని ఈ సందర్భంగా విస్మరించరాదు. అందుకే సర్వకాల సర్వావస్థల్లో సహాయం కోసం సర్వోన్నతుడైన దైవాన్ని మాత్రమే వేడుకుంటూ, ఆయనపైనే భారం మోపి మరీ సాధన చేయాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1321
హదీసు 1322
وَعَنْ عِيَاضِ بْنِ حِمَارٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِنَّ اَللَّهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا, حَتَّى لَا يَبْغِيَ أَحَدٌ عَلَى أَحَدٍ, وَلَا يَفْخَرَ أَحَدٌ عَلَى أَحَدٍ } أَخْرَجَهُ مُسْلِمٌ..
హజ్రత్ ఇయాజ్ బిన్ హిమార్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “వినయ వినమ్రతలను కలిగి ఉండమని దేవుడు నాపై ‘వహీ’ (దైవవాణి)ని అవతరింపజేశాడు. ఆఖరికి ఒకరు ఇంకొకరిపై దురుసుగా ప్రవర్తించడంగానీ, ఒకరింకొకరిపై అహంకారాన్ని ప్రదర్శించటంగానీ చేయకూడదు.” (ముస్లిం)
English
’Iyad bin Himar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Allah, the Most High has revealed to me that you (people) should be humble, so that no one transgresses another, or boasts to the other.” Related by Muslim.
సారాంశం
నిత్యం వినయశీలురుగా ఉండాలనీ, ప్రజల యెడల వినమ్రులుగా మసలుకోవాలనీ ఈ హదీసులో తాకీదు చేయబడింది. మనిషి తన తెలివితేటలతో ఎంత ఎత్తుకు ఎదిగినా, తన ప్రతిభతో ఎన్ని కీర్తి శిఖరాల అంబరాలను చుంబించినాసరే ఇతరుల ముందు తనను చిన్నవానిగానే లెక్కించుకోవాలి. ఇతరులను అధములుగా, అసమర్థులుగా జమకట్టరాదు – ఇదే అణకువ మరియు వినమ్రత. ఈ వినమ్రత ఉన్న మనిషి తోటి వారి దృష్టిలో చాలా ఎత్తుకు ఎదిగిపోతాడు. అందరి హృదయాలనూ జయిస్తాడు. తన చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటాడు. దీనికి భిన్నంగా బీరాలు పోయేవాడు, బడాయిని చాటుకునేవాడు, ఇతరులను అల్పులుగా జమకట్టేవాడు ప్రజాదరణను కోల్పోతాడు. తన శత్రువుల సంఖ్యను పెంచుకుంటూ పోతాడు. పరిసరాల వారికీ -తనకూ మధ్య అంతరాల అగాధాలను సృష్టించుకుంటాడు. పర్యవసానంగా దైవాగ్రహం కూడా అతనిపై విరుచుకు పడుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1322
హదీసు 1323
وَعَنْ أَبِي اَلدَّرْدَاءِ - رضى الله عنه - عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { مَنْ رَدَّ عَنْ عِرْضِ أَخِيهِ بِالْغَيْبِ, رَدَّ اَللَّهُ عَنْ وَجْهِهِ اَلنَّارَ يَوْمَ اَلْقِيَامَةِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَحَسَّنَهُ.. وَلِأَحْمَدَ, مِنْ حَدِيثِ أَسْمَاءَ بِنْتِ يَزِيدَ نَحْوُهُ..
హజ్రత్ అబూ అద్దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఎవరయితే తన సోదరుడు అక్కడ లేని సమయంలో అతని మానమర్యాదలను పరిరక్షిస్తాడో అతని ముఖాన్ని అల్లాహ్ ప్రళయదినాన నరకాగ్ని బారినుండి రక్షిస్తాడు.” (ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి, ‘హసన్’గా ఖరారు చేశారు. ముస్నదె అహ్మద్‌లో అస్మా బిన్తె యజీద్ (రదియల్లాహు అన్హా) హదీసు కూడా ఇదే విధంగా ఉంది).
English
Abu ad-Darda’ (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If a Muslim defends his brother’s honor in his absence, Allah will protect his face from the fire of Hell on the Day of Resurrection.” Related by At-Tirmidhi who graded it to be Hasan.
Ahmad related a similar hadith on the authority of Asma the daughter of Yazid.
సారాంశం
తమ సోదరుడు ఎవరయినా తమ దగ్గర లేని సమయంలో అతని గురించిన చెడు ప్రస్తావన తీసుకురాకుండా ఉండటం, ఒకవేళ అతని పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విషయం ఏదైనా ప్రస్తావనకు వచ్చినా దాన్ని ప్రతిఘటించటం ఉదాత్త స్వభావానికి తార్కాణమని హదీసులో చెప్పబడింది. పరోపకార గుణం, మానవత్వ స్వభావం ఉన్న ఉత్తములే ఇటువంటి ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పగల్గుతారు. సాటి సోదరుని పరోక్షంలో అతని మానమర్యాదలపై ‘దాడి’ జరిగినప్పుడు అడ్డుకోకపోవటం కూడా నిందార్హమే. ఒకరి పరోక్షంలో ‘దాడి’ చేసినవారిని అప్పటికప్పుడు గట్టిగా నిలువరిస్తే, అతని కుటిల పన్నాగాన్ని నీరుగార్చినట్లవుతుంది. మరోసారి, మరొకరి విషయంలో అతడు అలా చేయకుండా జాగ్రత్తపడతాడు.
హదీసు ఉల్లేఖకులు
అస్మా బిన్తె యజీద్ (రదియల్లాహు అన్హా) : ఈమె యజీద్ బిన్ సకన్ కుమార్తె. అష్‌హల్ తెగతో సంబంధమున్నందున అష్‌హలియాగా కూడా పిలువబడేవారు. మంచి వక్త. మహిళా సమావేశాలలో ప్రసంగాలు చేసేవారు. యర్మూక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ రోజు ఆమె తన శిబిరానికి ఊతగా ఉన్న దొడ్డు కర్రతో తొమ్మండుగురు శత్రువులను సంహరించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1323
హదీసు 1324
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ, وَمَا زَادَ اَللَّهُ عَبْدًا بِعَفْوٍ إِلَّا عِزًّا, وَمَا تَوَاضَعَ أَحَدٌ لِلَّهِ إِلَّا رَفَعَهُ اَللَّهُ تَعَالَى } أَخْرَجَهُ مُسْلِمٌ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు : “దానధర్మాలు ఏ సంపదలోనూ ఎలాంటి లోటునూ కలిగించవు. మన్నింపుల వైఖరిని అవలంబించే దాసుని యొక్క గౌరవ ప్రతిష్ఠలను పెంచటమే అల్లాహ్ అభిమతం. కేవలం దైవప్రసన్నతను బడయటం తప్ప మరో ఉద్దేశ్యం లేకుండా వెనక్కి తగ్గే వ్యక్తికి అల్లాహ్ ఉన్నతిని ప్రసాదిస్తాడు.” (ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Sadaqah does not decrease property and Allah increases the honor of him who forgives and no one will humble himself for Allah’s sake except that Allah raises his status.” Related by Muslim.
సారాంశం
మనిషిని నైతికంగా ఉన్నత శిఖరాలకు చేర్చే మూడు విషయాలు ఈ హదీసులో ప్రస్తావించబడ్డాయి. ఇవి మూడూ కూడా సద్గుణాలకు సరోవరం వంటివి. (1) దానధర్మాలు (2) మన్నింపు (3) అణకువ. ఈ మూడు గుణాలు కలిగివున్న వ్యక్తి త్వరితగతిన దైవప్రసన్నతను చూరగొంటాడు. దైవదాసులు కూడా అతన్ని అమితంగా ప్రేమించసాగుతారు. గౌరవ ప్రతిష్ఠలు పెరగటమంటే భావం ఇదే. తనను అతి సామాన్యునిగా ఊహించుకుంటూ, తోటివారిని తనకన్నా ఉత్తములని తలపోస్తూ, ఒకరి కోసం ఓ మెట్టు దిగివచ్చే, ఒకరి కోసం తన కుర్చీని ఖాళీ చేసే, ఒకరి కోసం తాను వెనుక సీట్లో కూర్చోవటానికే ఇష్టపడే వ్యక్తి పట్ల అందరిలోనూ ‘స్వీకృత’ భావం పెంపొందుతుంది. అటువంటి త్యాగధనునికి శత్రువులు కూడా ఉండరు. దైవప్రసన్నతను బడయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నందువల్ల దేవుడు అతని గౌరవోన్నతుల్ని పెంచుతాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1324
హదీసు 1325
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ سَلَّامٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ يَا أَيُّهَا اَلنَّاسُ! أَفْشُوا اَلسَّلَام, وَصِلُوا اَلْأَرْحَامَ, وَأَطْعِمُوا اَلطَّعَامَ, وَصَلُّوا بِاللَّيْلِ وَالنَّاسُ نِيَامٌ, تَدْخُلُوا اَلْجَنَّةَ بِسَلَامٍ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ..
హజ్రత్ అబ్దుల్లా బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “ప్రజలారా! సలాంను సర్వసామాన్యం చేయండి. ఆప్తులను ఆదుకుంటూ ఉండండి. ప్రజలకు అన్నం పెట్టండి. రాత్రిపూట అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో దైవ సమక్షంలో ఆరాధన చేయండి- శాంతంగా స్వర్గంలో ప్రవేశిస్తారు.” (ఈ హదీసును తిర్మిజీ సేకరించారు. దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
'Abdullah bin Salam (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “O people, extend greetings (saying Salam to each other), keep relations with your kin, provide food (to people) and pray at night when people are asleep and you will enter Paradise in peace.” Related by At-Tirmidhi who graded it as Sahih.
సారాంశం
ఈ హదీసులో స్వర్గానికి సోపానాలుగా అభివర్ణించబడిన నాల్గు అంశాలలో మూడింటి సంబంధం దైవదాసుల (మానవుల)తో ఉంది. ఒకటి మాత్రం దైవంతో సంబంధం కలిగినది. అంటే ఈ నాల్గింటిలో దేవుని హక్కు ఒకటైతే మిగిలిన మూడూ దాసుల హక్కులన్నమాట! ఎవరయితే ఏకకాలంలో ఈ నాల్గు విధులను సక్రమంగా నిర్వర్తిస్తాడో అతని కొరకు స్వర్గబాట సరళమైపోతుంది. ఇలాంటి ధన్యజీవులు నిశ్చింతంగా స్వర్గానికి చేరుకుంటారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1325
హదీసు 1326
وَعَنْ تَمِيمٍ الدَّارِيِّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلدِّينُ اَلنَّصِيحَةُ " ثَلَاثًا. قُلْنَا: لِمَنْ هِيَ يَا رَسُولَ اَللَّهِ? قَالَ:" لِلَّهِ وَلِكِتَابِهِ وَلِرَسُولِهِ وَلِأَئِمَّةِ اَلْمُسْلِمِينَ وَعَامَّتِهِمْ } أَخْرَجَهُ مُسْلِمٌ..
హజ్రత్ తమీమ్ దారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “శ్రేయోభిలాషకు మరో పేరే (ఇస్లాం) ధర్మం.” ఇలా మూడుసార్లు చెప్పారు. ‘దైవప్రవక్తా ﷺ! ఈ శ్రేయోభిలాష హక్కు ఎవరికోసం?’ అని మేము ప్రశ్నించగా, “అల్లాహ్ కోసం, ఆయన గ్రంథం కోసం, ఆయన సందేశహరుని కోసం, ముస్లిము నాయకుల కోసం, వారి జన సామాన్యం కోసం!” అని ఆయన ﷺ విడమరచి చెప్పారు. (ముస్లిం)
English
Tamim ad-Dari (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The religion is Nasihah.” the people said, ‘To whom should it be directed?’ He replied, “To Allah, His Book, His Messenger (ﷺ), to the leaders of the Muslims and to the common folk of the Muslims.” Related by Muslim.
హదీసు ఉల్లేఖకులు
తమీమ్ దారీ (రదియల్లాహు అన్హు) : అబూ రుఖైయ ఈయన మారుపేరు. పరంపర ప్రకారం తమీమ్ బిన్ ఔస్ బిన్ ఖారిజ దారీ అనబడతారు. హిజ్రీ 9వ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు. బైతుల్ మఖ్దిస్‌లో స్థిరపడ్డారు. ఇబ్నె సీరీన్ కథనం ప్రకారం ఈయన దివ్యఖుర్ఆన్‌ను పూర్తిగా కంఠస్థం చేశారు. ఒక రాత్రిలో ఖుర్ఆన్ అంతటినీ పారాయణం చేసేవారు. హిజ్రీ 40లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1326
హదీసు 1327
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَكْثَرُ مَا يُدْخِلُ اَلْجَنَّةَ تَقْوى اَللَّهِ وَحُسْنُ اَلْخُلُقِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “దైవభీతి మరియు సద్గుణం స్వర్గ ప్రవేశానికి ఎక్కువగా దోహదకారి అవుతాయి.” (దీనిని తిర్మిజీ వెలికి తీశారు. హాకిమ్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The fear of Allah and good morals (Akhlaq) are the two major characteristics which lead to Paradise.” Related by At-Tirmidhi and Al-Hakim graded it as Sahih.
సారాంశం
‘దైవభీతి’ అన్నదానికి హదీసు మూలంలో ‘తఖ్వా’ అనే పదం ప్రయోగించబడింది. ‘తఖ్వా’ అంటే అసలు అర్థం దైవ సమ్మతమైన వాటిని అనుసరించటం, దేవుడు నిషేధించిన వాటి జోలికి పోకుండా ఉండటం. సాధారణంగా దైవభీతి, పరలోకభీతి ఉన్న వ్యక్తి మాత్రమే ఈ హద్దులను గౌరవిస్తాడు కదా!
ఇకపోతే; సద్గుణం లేక సత్ప్రవర్తన. దీన్ని కూడా స్వర్గానికి సోపానంగా అభివర్ణించడాన్ని బట్టి ఇస్లాంలో దీనికి గల ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు. ఈ రెండు గుణాలు వ్యక్తుల్లో, మానవ సముదాయాల్లో పెంపొందినప్పుడు ఇహలోకం సయితం భూతల స్వర్గంగా పరిణమిస్తుంది. ఇక పరలోకంలో దేవుడు శాశ్వత స్వర్గంలో నివాసం కల్పిస్తాడన్న వాగ్దానం ఉండనే ఉంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1327
హదీసు 1328
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِنَّكُمْ لَا تَسَعُونَ اَلنَّاسَ بِأَمْوَالِكُمْ, وَلَكِنْ لِيَسَعْهُمْ مِنْكُمْ بَسْطُ اَلْوَجْهِ, وَحُسْنُ اَلْخُلُقِ } أَخْرَجَهُ أَبُو يَعْلَى, وَصَحَّحَهُ اَلْحَاكِمُ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా బోధించారు : “మీరు ధన సంపత్తుల ద్వారా ప్రజలను సంతోషపెట్టలేరు. అందుకే మీరు సత్ప్రవర్తన, మృదుత్వం ద్వారా ప్రజల్లో సంతోషాన్ని, తృప్తినీ పెంపొందించే యత్నం చేయండి.” (ఈ హదీసును అబూ యాలా ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “You (people) cannot satisfy people with your wealth, but satisfy them with your cheerful faces and good morals.” Related by Abu Ya’la and Al-Hakim graded it as Sahih.
సారాంశం
మనిషి కోర్కెలు అపరిమితమైనవి. వనరులు మాత్రం పరిమితమైనవి. అందుచేత ధనసంపత్తుల ద్వారా, డబ్బు ద్వారా ప్రజల్లో తృప్తినీ, సంతోషాన్ని సృజించటం కష్టం. దీనికి బదులు ప్రేమైక భావాల ద్వారా, చిరు మందహాసం ద్వారా, మృదుత్వం, మన్నింపుల స్వభావం ద్వారా ప్రజలను సంతోషపెట్టాలి. ముఖ్యంగా ప్రజా సముదాయాలకు నాయకులుగా, సంస్కర్తలుగా, మార్గదర్శకులుగా, పీష్వాలుగా చెలామణీ అయ్యేవారు ఈ విషయాన్ని అనునిత్యం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాక్చాతుర్యంతో, అందమైన ప్రసంగాలతో జనసామాన్యాన్ని, కార్యకర్తల్ని సమీకరించటం, సంస్థల్ని సంఘాలను నెలకొల్పటం సులభమే. కాని ఆ కార్యకర్తల్ని అయస్కాంతంలా ఆకర్షించి, వారు ఎప్పటికీ దూరం కాకుండా ఉండేలా ఆపి ఉంచటం చాలా కష్టం. ఆశయం పట్ల నిబద్ధత, లక్ష్యం పట్ల అచంచలమైన విశ్వాసంతో పాటు, దానికోసం పాటుపడే వారికి ప్రేమానురాగాలను పంచిపెట్టినప్పుడే వారు ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు దూసుకు పోగలుగుతారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1328
హదీసు 1329
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْمُؤْمِنُ مِرْآةُ أَخِيهِ اَلْمُؤْمِنِ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ بِإِسْنَادٍ حَسَنٍ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఒక విశ్వాసి మరో విశ్వాస సోదరునికి అద్దం లాంటివాడు.” (దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు. దీని పరంపర హసన్ కోవకు చెందినది)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Every believer is the mirror of his brother.” Related by Abu Dawud with a good chain of narrators.
సారాంశం
అద్దం ఎంతో నిజాయితీ గలది. అది ఏ విషయంలోనూ హెచ్చుతగ్గులు చేయదు. ఉన్నదున్నట్టుగా చూపెడుతుంది. అద్దం మాట్లాడదు. అది ఉపన్యాసాలివ్వదు. అది నిశ్శబ్దంగా ఉంటూనే తనను చూచే వారికి హితబోధ చేస్తుంది. అద్దం చూసుకున్న మనిషి తన మొహంపై ఉన్న లోపాలను తిలకిస్తాడు. అద్దం వీపు వెనుక చాడీలు చెప్పటంగానీ, పరోక్షనింద చేయటంగానీ చేయదు. ఏం చెప్పాలనుకున్నా మొహం మీదే చెబుతుంది.
అలాగే ఒక విశ్వాసి మరో విశ్వాసికి అద్దం లాంటివాడు. అతన్ని చూచి అతన్నుండి నేర్చుకోవలసిన మంచి విషయాలేవయినా ఉంటే నేర్చుకుంటాడు. తనలోని లోపాలను సరిదిద్దుకుంటాడు. అలాగే తన ముందున్న సోదరునిలో ఏవైనా లోపాలుంటే, అతని పరోక్షంలో వాటిని ప్రస్తావించే బదులు అతని ఎదుటే హెచ్చుతగ్గులు లేకుండా, నిర్మొహమాటంగా చెప్పాలి. అలా చెబితే ఎదుటివాడు ఏమనుకుంటాడో ఏమో అని సందేహపడ నవసరం లేదు. కాకపోతే అందరి ముందూ అతన్ని అవమానపరచకుండా ఏకాంతంలో నచ్చచెప్పవచ్చు. ఈ ‘సంస్కరణ’ కోసం వారిద్దరి మధ్య కించిత్ ఉద్రిక్తత ఏర్పడినా ఫరవా లేదు. వీపు వెనుక చాడీలు చెప్పటం కన్నా ఇది ఎన్నో రెట్లు మెరుగు. ఎందుకంటే; అద్దాన్నే ఉపమానంగా తీసుకోండి – అది క్రిందపడి ముక్కలైనాసరే రూపురేఖలను ప్రతిబింబించే దాని నైజంలో మాత్రం మార్పుండదు. అలాగే మనం ఒకరి శ్రేయాన్ని అభిలషిస్తున్నప్పుడు, వారు మన గురించి ఏమనుకుంటున్నారో ఏమోనని మనం మీనమేషాలు లెక్కించుకుంటూ, గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఇక సంస్కరణ జరిగేదెలా?! మన పనైతే అద్దం మాదిరిగా ఉన్నదున్నట్టుగా – నిష్కర్షగా, నిర్దిష్టంగా – చెప్పేయటమే!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1329
హదీసు 1330
وَعَنِ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْمُؤْمِنُ اَلَّذِي يُخَالِطُ اَلنَّاسَ, وَيَصْبِرُ عَلَى أَذَاهُمْ خَيْرٌ مِنْ اَلَّذِي لَا يُخَالِطُ اَلنَّاسَ وَلَا يَصْبِرُ عَلَى أَذَاهُمْ } أَخْرَجَهُ اِبْنُ مَاجَهْ بِإِسْنَادٍ حَسَنٍ, وَهُوَ عِنْدَ اَلتِّرْمِذِيِّ: إِلَّا أَنَّهُ لَمْ يُسَمِّ اَلصِّحَابِيَّ..
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: జనుల మధ్య చొచ్చుకుపోతూ వారి ద్వారా కల్గే బాధాకరమైన విషయాలను సహించే విశ్వాసి, జనులకు దూరంగా మసలుకుంటూ, వాళ్ళ ద్వారా కల్గే బాధలను సహించలేని విశ్వాసికన్నా ఎంతో మంచివాడు, ఉత్తముడు.” (ఈ హదీసును ఇబ్నెమాజా ‘హసన్’ పరంపర ద్వారా ఉల్లేఖించారు. ఈ హదీసు తిర్మిజీ లోనూ ఉంది. కాని అందులో సహాబీ (రదియల్లాహు అన్హు) పేరు ప్రస్తావనకు రాలేదు)
English
Ibn ’Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A believer who mixes with people and endures their annoyance is better than the one who does not mix with them and does not endure their annoyance.” Related by Ibn Majah with a good chain of narrators. At-Tirmidhi reported the hadith without mentioning the Companion.
సారాంశం
ప్రజలతో కలసిమెలసి ఉంటూ, వాళ్ళ సుఖదుఃఖాలలో పాలు పంచుకునే, వారి సమస్యలను పరిష్కరించే, ధర్మావలంబనలో వారికి మార్గదర్శకత్వం వహించే వ్యక్తి ఉత్తముడని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. ధర్మబోధన కోసం ఉపక్రమించిన వారికి బాధలు తప్పవు. ఈ విషయంలో జనుల తరపున ఎదురయ్యే అవమానాలను, వేధింపులను ఓర్పుతో భరిస్తూ, నేర్పుతో వాటిని అధిగమించవలసి ఉంటుంది. ఎందుకంటే మంచిని ప్రబోధించిన కారణంగా, ధర్మావలంబనకై పురికొల్పినందున అతనికి ఈ కష్టాలు ఎదురయ్యాయి. అతనే గనక ఈ సత్కార్యానికి పూనుకోకుండా హాయిగా ఇంట్లో కూర్చుంటే ఈ ఇబ్బందులేమీ ఎదురయ్యేవి కావు. అందుకే ప్రజా జీవితాలకు ఆమడ దూరాన ఉండే వ్యక్తికన్నా బాధలను భరించడానికి ముందుకు వచ్చినవాడు ఎంతో గొప్పవాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1330
హదీసు 1331
وَعَنِ اِبْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي, فَحَسِّنْ خُلُقِي } رَوَاهُ أَحْمَدُ وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ.
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “ఓ దేవా! నీవు నా రూపురేఖలను అందంగా మలచినట్లే, నా నడవడికను కూడా ఉత్తమంగా మలచు.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Ibn Mas’ud (RAA) narrated that the Messenger of Allah (ﷺ) Said, “O Allah You have made my creation perfect, so make my moral characteristics also be the best.”
సారాంశం
సాధారణంగా అద్దం చూసుకున్నప్పుడు దైవప్రవక్త ﷺ ఈ విధంగా వేడుకునేవారు. సృష్టి ప్రక్రియ రీత్యాగానీ, సత్ప్రవర్తన రీత్యాగానీ ఆయన ﷺ అందరికన్నా శ్రేష్ఠులు. అయినప్పటికీ ఆయన ﷺ ఇలా ప్రార్థించారంటే తన అనుచర సమాజం మేలు కోరి ఆయన ﷺ ఇలా చేశారు. వేడుకోలు వచనాలు అరబీలో ఇలా ఉన్నాయి – “అల్లాహుమ్మ కమా హస్సన్త ఖల్ఖీ ఫహస్సిన్ ఖుల్ఖీ.”
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.5 ఉత్తమ గుణగణాలకై ప్రోత్సహించటం|హదీసు 1331
You must be logged in to post a comment.