హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 16. వివిధ విషయాల పుస్తకం, 4వ అధ్యాయం: దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం. ఈ అధ్యాయంలో 37 హదీసులు (హదీసు 1277 – 1313) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం

↑ విషయ సూచిక

باب التَّرْهِيبِ مِنْ مَسَاوِئِ الأَخْلاَقِ

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1277

హదీసు 1277

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِيَّاكُمْ وَالْحَسَدَ, فَإِنَّ اَلْحَسَدَ يَأْكُلُ اَلْحَسَنَاتِ, كَمَا تَأْكُلُ اَلنَّارُ اَلْحَطَبَ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ. وَلِابْنِ مَاجَهْ: مِنْ حَدِيثِ أَنَسٍ نَحْوُهُ.‏.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “అసూయకు దూరంగా ఉండండి. ఎందుకంటే అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే అసూయ సత్కార్యాలను హరించివేస్తుంది.” (దీనిని అబూదావూద్ సేకరించారు-ఇబ్నెమాజాలోనూ హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)చే ఈ విధంగానే ఉల్లేఖించబడింది)

English

Abu Hurairah (RAA) narrated that Allah’s Messenger (ﷺ) said: “Avoid envy, for envy devours good deeds just as fire devours firewood.” Related by Abu Dawud.

Ibn Majah related a similar hadith on the authority of Anas.

సారాంశం

అసూయ లేక ఈర్ష్య పెద్ద పాపాల కోవకు చెందినది. ఈర్ష్య మూలంగానే షైతాన్ తొలిసారిగా దైవాన్ని ధిక్కరించాడు. ఖాబీల్ తన సోదరుడైన హాబీల్‌ని అసూయతోనే హత్య చేశాడు. దైవప్రవక్త హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఆయన యెడల చేసిన దుర్వ్యవహారానికి అసలు కారణం ఈ అసూయే. యూద పండితులు, అబ్దుల్లా బిన్ ఉబై వంటి కపటులు మహాప్రవక్త ﷺ పట్ల చేసిన కపట చేష్టలన్నింటికీ మూలం ఈర్ష్యే. దీనికి సంబంధించిన ఉల్లేఖనాలనేకం ఉన్నాయి. ఇది విశ్వాసానికి విరుద్ధాంశం. అందుకే దీనికి దూరంగా ఉండమని మహనీయ ముహమ్మద్ ﷺ చాలా గట్టిగా తాకీదు చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1277

1278

హదీసు 1278

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَيْسَ اَلشَّدِيدُ بِالصُّرَعَةِ, إِنَّمَا اَلشَّدِيدُ اَلَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ اَلْغَضَبِ } مُتَّفَقٌ عَلَيْهِ.‏.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “కుస్తీలో ఒకరిని చిత్తుచేసిన వాడు పహిల్వాను కాదు. వాస్తవానికి కోపం వచ్చినప్పుడు తన్ను తాను నిగ్రహించుకున్నవాడే సిసలైన పహిల్వాను.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that Allah's Messenger (ﷺ) said: “The strong man is not the good wrestler; but the strong man is he who controls himself when he is angry.” Agreed upon.

సారాంశం

ప్రత్యర్థినీ, శిక్షార్హుడైన శత్రువును క్షమించటం, ఉపేక్షించటం ఎంత గొప్పతనమో ఈ హదీసులో చెప్పబడింది. ఎదుటివానిపై చర్య తీసుకోదగ్గ శక్తి, అధికారం ఉండి కూడా సంయమనం పాటించాలనీ, ప్రతీకారం తీర్చుకునే బదులు వీలయినంత వరకు ఏదన్నా మేలు చేసి వదలిపెట్టాలని ప్రబోధించబడింది. మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతూ, వాటికి కళ్లెం బిగించిన గొప్పవారు మాత్రమే ఈ రకమైన ఉదాత్త వైఖరిని అవలంబించగలుగుతారు. ఎందుకంటే మనసు సతతం కసి తీర్చుకోమనే అంటుంది. మనసుకు వ్యతిరేకంగా జరిపే పోరాటం శత్రువుకు వ్యతిరేకంగా సాగించే పోరాటంకన్నా తీవ్రమయినది. అందుకే కోపావేశంలో ఓర్చుకోవటం, కోపాన్ని దిగమ్రింగటం సాహసానికి, శౌర్యానికి ప్రతిరూపమని మహనీయ ముహమ్మద్ ﷺ వారు సెలవిచ్చారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1278

1279

హదీసు 1279

وَعَنْ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلظُّلْمُ ظُلُمَاتٌ يَوْمَ اَلْقِيَامَةِ } مُتَّفَقٌ عَلَيْهِ.‏.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ప్రళయదినాన ‘అన్యాయం’ అనేక అంధకారాలకు, కారుచీకట్లకు హేతువు అవుతుంది.” (బుఖారీ, ముస్లిం)

English

Ibn 'Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Oppression will turn into darkness on the Day of Resurrection.” Agreed upon.

సారాంశం

హదీసులో ‘జులుం’ అనే పదం వాడబడింది. జులుం అంటే అన్యాయం అనీ, వేరొకరి హక్కును కొల్లగొట్టడమనీ అర్థం. ఈ దౌర్జన్యానికి పాల్పడినవాడు ప్రళయదినాన గాఢాంధకారాల్లో తచ్చాడుతూ, అలుముకున్న చీకట్లలో అలమటిస్తూ ఉంటాడని హదీసు హెచ్చరిస్తోంది. జులుం అనేక రకాలు. ఈ జులుం ఒకరి ప్రాణం పట్ల జరిగినా, ధనం పట్ల జరిగినా, దేవుని హక్కుల విషయంలో జులుం జరిగినా, దాసుల హక్కుల విషయంలో జులుం జరిగినా మొత్తానికి జులుం జులుమే. అది ముమ్మాటికీ నిషిద్ధమే (హరామే).

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1279

1280

హదీసు 1280

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ : { اِتَّقُوا اَلظُّلْمَ, فَإِنَّ اَلظُّلْمَ ظُلُمَاتٌ يَوْمَ اَلْقِيَامَةِ, وَاتَّقُوا اَلشُّحَّ , فَإِنَّهُ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: అన్యాయానికి దూరంగా ఉండండి. ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టుతనం) మూలంగానే నాశనమయ్యారు.” (ముస్లిం)

English

Jabir bin 'Abdullah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Beware of oppression, for oppression will turn into excessive darkness on the Day of Resurrection and beware of niggardliness, for niggardliness destroyed your predecessors.” Related by Muslim.

సారాంశం

ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయస్తుడైన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెల్తురు, కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి.

పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైనవాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్ధలకు, కారిన్యానికి కారణభూతమవుతుంది. దుష్పరిణామాలకు దారితీస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1280

1281

హదీసు 1281

وَعَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمْ اَلشِّرْكُ اَلْأَصْغَرُ: اَلرِّيَاءُ } أَخْرَجَهُ أَحْمَدُ بِإِسْنَادٍ حَسَنٍ.‏.

హజ్రత్ మహ్మూద్ బిన్ లబీద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “మీ గురించి అన్నింటి కన్నా ఎక్కువగా నేను చిన్న షిర్కు (షిర్కె అస్గర్) – అంటే ప్రదర్శనాబుద్ధి విషయంలో భయపడుతున్నాను.” (ఇమామ్ అహ్మద్ దీనిని ‘హసన్’ పరంపర నుండి సేకరించారు)

English

Mahmud bin Labid (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The thing I fear most for you is the lesser shirk (polytheism), showing-off (of good deeds).” Related by Ahmad with a good chain of narrators,

సారాంశం

ప్రదర్శనాబుద్ధి అనేది మనిషి మాటల్లోనూ, చేతల్లోనూ కూడా ఉంటుంది. మనిషి ఏదైనా మంచి పనిచేసి దాని ద్వారా దైవేతరుల మెప్పు పొందగోరటమే ప్రదర్శనాబుద్ధి. ఈ ప్రదర్శనాబుద్ధి రెండు రకాలుగా ఉంటుంది. మనిషి తాను చేసిన గొప్ప పనిని ఎవరూ చూడకపోతే దాని గురించి నలుగురికీ చెప్పుకుంటూ లేక చూపించుకుంటూ తిరగటం ఒక రకం. ప్రతి పనినీ నలుగురికీ చూపిస్తూ చేయటం రెండవ రకం. ఇవి రెండూ సమ్మతం కావు. అల్లాహ్ మరియు ప్రవక్త ఈ ప్రదర్శనా భావాన్ని ఈసడించుకున్నారు. దీన్ని కపటత్వానికి నిదర్శనంగా కూడా ఖరారు చేశారు. ప్రదర్శనాబుద్ధితో కూడిన ఏ పుణ్యకార్యమూ దైవ సమక్షంలో స్వీకరించబడదు. కాబట్టి అన్ని విధాలా – శాయశక్తులా – దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1281

1282

హదీసు 1282

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ آيَةُ اَلْمُنَافِقِ ثَلَاثٌ: إِذَا حَدَّثَ كَذَبَ, وَإِذَا وَعَدَ أَخْلَفَ, وَإِذَا ائْتُمِنَ خَانَ } مُتَّفَقٌ عَلَيْهِ.‏. وَلَهُمَا: مِنْ حَدِيثِ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرِوٍ: { وَإِذَا خَاصَمَ فَجَرَ }.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఒక వ్యక్తి కపటి అవడానికి మూడు ఆనవాళ్ళు ఉంటాయి – మాట్లాడినపుడు అతడు అబద్ధం చెబుతాడు. వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. అతని దగ్గర ఏదన్నా అప్పగింత(అమానతు)గా పెడితే అందులో ద్రోహానికి పాల్పడతాడు (బుఖారీ, ముస్లిం). బుఖారీ, ముస్లింలలోనే అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనంలో ఇలా వుంది: “పోట్లాటకు దిగినపుడు తిట్ల పురాణం మొదలెడతాడు.”

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “There are three signs of a hypocrite: when he speaks, he tells lies; when he makes a promise, he breaks it; and when he is entrusted, he betrays his trust.” Agreed upon.

Al·Bukhari and Muslim reported another hadith on the authority of ’Abdullah bin ’Umar (RAA) with the addition, “and when he quarrels, he is abusive (behaves in a very impudent and insulting manner).”

సారాంశం

ఈ హదీసులో ‘కపటి’ యొక్క నాలుగు గుర్తులు సూచించబడ్డాయి. “వాడు నమాజ్ చేసినప్పటికీ, ఉపవాసాలు పాటించినప్పటికీ తాను ముస్లింనని అతను ప్రకటించుకున్నప్పటికీ” (ఈ లోపాలు మాత్రం అతనిలో ఉంటాయి) అని ‘ముస్లిం’లో అదనంగా ఉంది. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ సందర్భంగా ఇలా అంటున్నారు – “చాలామంది పరిశోధకులైన విద్వాంసుల అభిప్రాయం ప్రకారం ఈ అవలక్షణాలు కపటులలో ఉండేది నిజమే. కాని ఒక నికార్సయిన విశ్వాసిలో కూడా ఈ అవలక్షణాలు జనిస్తే అతను కూడా ‘కపటిలాంటివాడు’ గానే భావించబడతాడు. అంటే అతని స్వభావాన్నిబట్టి ఆ పదం అతని కోసం ప్రయోగించబడుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1282

1283

హదీసు 1283

وَعَنْ اِبْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ سِبَابُ اَلْمُسْلِمِ فُسُوقٌ, وَقِتَالُهُ كُفْرٌ } مُتَّفَقٌ عَلَيْهِ.‏.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు- ముస్లింను దూషించటం మహా పాపం. ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి, దైవధిక్కరణకు ప్రతీకే.” (బుఖారీ, ముస్లిం)

English

Ibn Mas'ud (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: insulting a Muslim is disobedience to Allah, and fighting with him is Kufr (disbelief).” Agreed upon.

సారాంశం

హదీసులో ‘ఫిస్ఖ్’ అనే పదం ప్రయోగించబడింది. సాటి ముస్లింను దూషించినవాడు ‘ఫాసిఖ్’ అవుతాడు. అంటే దైవవిధేయతా పరిమితిని దాటిపోయినవాడు, హద్దులను అతిక్రమించినవాడన్న మాట! హద్దులను అతిక్రమించినవాడు పాపాత్ముడు, అపరాధి అవుతాడు.

ఇక ‘ముస్లిం’ను చంపటం అంటే విశ్వాసాన్ని (ఈమాన్‌ను) త్రోసిరాజనటమే. అకారణంగా ఎవరయినా సాటి ముస్లింను చంపడాన్ని తన కొరకు ధర్మసమ్మతం గావించుకుంటే అతడు ఇస్లాంతో తాను ఏకీభవించటం లేదని క్రియాత్మకంగా రుజువు చేస్తున్నాడు. కనుక అతని ఈ చేష్ట ‘కుఫ్ర్’ క్రిందికి వస్తుంది.

సహీహ్ ముస్లింలో దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “నా అనుచర సమాజ సభ్యులందరూ క్షేమంగా, నిక్షేపంగా ఉండదగినవారే. అయితే బహిరంగంగా, నిస్సంకోచంగా పాపాలకు ఒడిగట్టేవారు మాత్రం దీనికి అర్హులు కారు.” పాపాత్మునికి పాపకార్యాలను గురించి జాగరూకపరచటం గురించి పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. తబ్రానీలో ‘హసన్’ పరంపర ద్వారా సేకరించబడిన ఒక హదీసులో దైవప్రవక్త ﷺ ఈ విధంగా సెలవిచ్చారు: “మీరు ఎప్పటి వరకు పాపాత్ముని ఘోరకృత్యాలను చెప్పకుండా ఉంటారు? అతని బండారం బయటపెట్టి తగిన శాస్తి జరిగేలా చూడండి.” ఈ హదీసు వెలుగులో దుర్మార్గుని దౌష్ట్యం నుండి ప్రజలు సురక్షితంగా ఉండగలిగేందుకు అతని దుర్మార్గాలను ఎండగడితే అది ముమ్మాటికీ ధర్మసమ్మతమే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1283

1284

హదీసు 1284

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِيَّاكُمْ وَالظَّنَّ, فَإِنَّ اَلظَّنَّ أَكْذَبُ اَلْحَدِيثِ } مُتَّفَقٌ عَلَيْهِ..

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తాకీదు చేశారు: “దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Avoid suspicion, for suspicion is the most false form of talk.” Agreed upon.

సారాంశం

దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా!

దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందినదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభసూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానపు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1284

1285

హదీసు 1285

وَعَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ ‏- رضى الله عنه ‏- [قَالَ] سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { مَا مِنْ عَبْدِ يَسْتَرْعِيهِ اَللَّهُ رَعِيَّةً, يَمُوتُ يَوْمَ يَمُوتُ, وَهُوَ غَاشٌّ لِرَعِيَّتِهِ, إِلَّا حَرَّمَ اَللَّهُ عَلَيْهِ اَلْجَنَّةَ } مُتَّفَقٌ عَلَيْهِ.‏.

దైవప్రవక్త ﷺ ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: ఏ దాసుణ్ణి అయితే పరిపాలకునిగా చేసి ప్రజలను అతనికి అప్పగించటం జరుగుతుందో, అతను గనక ప్రజల మధ్య న్యాయం చేయని స్థితిలో, బాధ్యతను మరచిన స్థితిలో మరణిస్తే అటువంటి పరిపాలకుని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం గావిస్తాడు.” (బుఖారీ, ముస్లిం)

English

Ma'qil bin Yasar (RAA) narrated, ‘I heard the Messenger of Allah (ﷺ) saying, “Any governor in charge of Muslim subjects who dies while acting dishonestly towards them will be excluded by Allah from Paradise.” Agreed upon.

సారాంశం

పరిపాలకుడైనవాడు ప్రజల కష్టసుఖాలను పట్టించుకుంటూ సకాలంలో వారి సమస్యలను పరిష్కరించాలి. ప్రజల యెడల దయాభావం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి. ఒకరికి న్యాయం చేసి, వేరొకరి పట్ల పక్షపాత వైఖరి కనబరచకూడదు. మృదుత్వం, మన్నింపుల ధోరణిని అవలంబించాలి. ప్రజలపై చీటికీ మాటికీ పన్నుల భారం మోపి వారిని కష్టాలపాలు చెయ్యకూడదు. సాధ్యమైనంత వరకు వారికి వెసులుబాటు కల్పించాలి. వారి మానమర్యాదలను మంట గలిపే చర్యలు తీసుకోరాదు. దొంగతనాలు, దోపిడీల నుండి, ఉగ్రవాదుల నుండి, కల్లోల జనకుల బారినుండి జన సామాన్యానికి రక్షణ కల్పించాలి.

దీనికి బదులు ఎంతసేపటికీ ప్రజలపై సుంకాలను వడ్డించి, ప్రజల రక్తాన్ని జలగలా పీల్చే ప్రయత్నం చేసే పరిపాలకులకు హదీసులో తీవ్రమయిన హెచ్చరిక చేయబడింది. ఇలాంటి బాధ్యతా రహితమైన, కఠిన హృదయులైన పరిపాలకులకు దేవుడు స్వర్గంలో చోటు కల్పించడు. ప్రజలను మోసం చేయటం చాలా పెద్ద పాపమని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. కాబట్టి స్వర్గంలో తమకు చోటు లభించాలని కోరుకునే పరిపాలకులు, నాయకులు ఇటువంటి చేష్టలకు దూరంగా ఉండాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1285

1286

హదీసు 1286

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَللَّهُمَّ مَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِي شَيْئًا, فَشَقَّ عَلَيْهِ, فَاشْقُقْ عَلَيْهِ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు – “ఓ దేవా! నా అనుచర సమాజంలో ఎవరయినా, ఏదైనా కార్య నిర్వాహకునిగా నియుక్తుడై, అతడు జనులను కష్టాల పాల్జేస్తే నువ్వు అతన్ని ఇక్కట్లకు లోను చెయ్యి.” (ముస్లిం)

English

‘A’ishah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “O Allah, cause distress to him who has any charge over my people and causes them distress.” Related by Muslim.

సారాంశం

ఈ హదీసులో దుర్మార్గులైన పరిపాలకులను మహాప్రవక్త ﷺ శపించారు. దైవప్రవక్త ఎవరినయినా శపిస్తే అది వృథాపోదన్న సంగతి గమనార్హం. అందుకే అధికార పగ్గాలు చేపట్టిన వారు నిత్యం ప్రజల యెడల మృదుత్వంతో మెలగాలి. పట్టువిడుపుల వైఖరిని అవలంబించాలి. దేవుడు తనను ప్రేమించాలనీ, తన యెడల దయాభావంతో మెలగాలనే గనక అతడు కోరుకుంటున్నట్లయితే అతడు తన పాలిత ప్రజల పట్ల కూడా దయాదాక్షిణ్యాల వైఖరినే అనుసరించాలి. కాఠిన్యానికి, అణచివేత విధానానికి స్వస్తి చెప్పాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1286

1287

హదీసు 1287

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا قَاتَلَ أَحَدُكُمْ, فَلْيَتَجَنَّبِ اَلْوَجْهَ } مُتَّفَقٌ عَلَيْهِ.‏.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : “మీలో ఎవరయినా కొట్లాటకు దిగితే మొహంపై కొట్టకుండా జాగ్రత్తపడాలి సుమా!” (బుఖారీ, ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When any of you fights, he must avoid (striking) the face.” Agreed upon.

సారాంశం

అసలు ఒకరిని కొట్టడం, దెబ్బలాడటమే తగని పని. ఒకవేళ మాటామాటా పెరిగి ఎప్పుడయినా పరస్పరం తలపడే అవాంఛనీయ స్థితి ఏర్పడినా అట్టి పరిస్థితిలో మొహంపై కొట్టకుండా జాగ్రత్తపడాలని హదీసులో చెప్పబడటం ఆలోచించదగ్గ విషయం. ఎదుటివాడు మనల్ని రెచ్చగొట్టే మాట ఏదన్నా అన్నప్పుడు మనం మొట్టమొదట చేసేది కూడా అదే – ఎదుటివాని చెంప ఛెళ్ళుమనిపించటం! కాని ముఖారవిందం ఎంతో గౌరవప్రదమైనదనీ, ఆగ్రహావేశంలో సయితం దాని జోలికి పోరాదని ఈ హదీసు నొక్కి చెబుతోంది. దీనిప్రకారం ముఖంపై కొట్టడం హరామ్ (నిషిద్ధం). ఆఖరికి జంతువుల మొహంపై సయితం కొట్టకూడదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1287

1288

హదీసు 1288

وَعَنْهُ أَنَّ رَجُلاً قَالَ: { يَا رَسُولَ اَللَّهِ! أَوْصِنِي.‏ قَالَ: لَا تَغْضَبْ. فَرَدَّدَ مِرَارًا.‏ وَقَالَ: لَا تَغْضَبْ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.‏.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారిదే మరో కథనం : ‘నాకేదన్నా ఉపదేశించండి’ అని ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺకు విన్నవించుకున్నాడు. “కోపగించుకోకు!” అని ఆయన ﷺ ఉపదేశించారు. (అతడు అడిగిన) ప్రతిసారీ ఆయన ﷺ “కోపగించుకోకు” అనే బదులిచ్చారు.” (బుఖారీ)

English

Abu Hurairah (RAA) narrated, ‘A man said, “O Messenger of Allah, advise me.” The Messenger of Allah (ﷺ) said: “Do not get angry.” The man repeated that several times and he replied, “Do not get angry.” Related by Al-Bukhari.

సారాంశం

ఈ హదీసులో కోపానికి, ఆగ్రహావేశాలకు దూరంగా ఉండమని తాకీదు చేయబడింది. మానవుడు కోపంలోనే ఎన్నో అన్యాయాలకు, అక్రమాలకు ఒడిగడతాడు. ఆ తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుమిలిపోతుంటాడు. ఈ నేపథ్యంలో అల్లామా ఇబ్నె తీన్ ఇలా అంటున్నారు: ఈ హదీసులో ఇహపరాల మేళ్ళు పొందుపరచబడ్డాయి. ఎందుకంటే కోపావస్థలో మనిషిలో వాత్సల్యం, ప్రేమానురాగాలు, దయాదాక్షిణ్యాలు మటుమాయమైపోతాయి. కోపం ఎప్పటికీ మనిషిని తెగత్రెంపుల వైపునకే తీసుకుపోతుంది. కోపంలో అతడు ఎదుటి వ్యక్తిపై కక్షసాధింపుకే ప్రయత్నిస్తాడు. ఇది ఇహపరాలలో మనిషి వైఫల్యానికి, వినాశానికి హేతువు అవుతుంది. ఈ కోపాన్నే గనక విడనాడితే మనిషి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ సాఫల్యం పొందే సకారాత్మక పనుల వైపునకు మరలుతాడు.

అల్లామా ఖత్తాబీ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు – కోపానికి దూరంగా ఉండటమంటే అర్థం కోపానికి కారణభూతమయ్యే అంశాలకు దూరమవటమే. ఎందుకంటే కోపమన్నది స్వాభావికమైనది. దానికి కారణభూతమైన వాటిలో అహంకారం కూడా ఒకటి. పై హదీసులో దైవప్రవక్త ﷺ, తన వద్దకు వచ్చిన వ్యక్తి స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి ‘కోపగించుకోకు’ అన్న ఉపదేశం చేశారు. ఎందుకంటే ఆ వ్యక్తి ముక్కోపి. చీటికీ మాటికీ రుసరుసలాడేవాడు. ఆ వ్యక్తి పేరు సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖఫీ అని ఒక హదీసు ద్వారా తెలుస్తోంది. దైవప్రవక్త ﷺను ఉపదేశించమని కోరిన వ్యక్తి స్త్రీ అనీ, ఆమె పేరు జారియ బిన్తె ఖుదామా అని ముస్నదె ఇమామ్ అహ్మద్‌లో ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1288

1289

హదీసు 1289

وَعَنْ خَوْلَةَ اَلْأَنْصَارِيَّةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ رِجَالاً يتخوَّضون فِي مَالِ اَللَّهِ بِغَيْرِ حَقٍّ, فَلَهُمْ اَلنَّارُ يَوْمَ اَلْقِيَامَةِ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.‏.

హజ్రత్ ఖౌల అన్సారియా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : “కొంతమంది దేవుని సొత్తులో అన్యాయంగా జోక్యం చేసుకుంటూ ఉంటారు. ప్రళయదినాన ఇలాంటి వారి కోసం నరకాగ్ని ఉంది.” (బుఖారీ)

English

Khawlah al-Ansariyah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Some men acquire Allah’s Property (such as the funds of the Muslim state treasury, Zakah etc.) and they will go to Hell on the Day of Resurrection.” Related Al-Bukhari.

సారాంశం

అన్యాయంగా అల్లాహ్ సొమ్మును కబళించేవారు నరకాగ్నికి ఆహుతి అవుతారని ఈ హదీసులో హెచ్చరించబడింది. అల్లాహ్ సొమ్ము అంటే ఏమిటి? అల్లాహ్ సొమ్ములో ‘బైతుల్‌మాల్’తో పాటు ‘సదకాలు’ కూడా వస్తాయి. ఉద్యోగిగా పనిచేసే వ్యక్తి బైతుల్‌మాల్ సొమ్మునుండి తన జరుగుబాటుకు కావలసినంత తీసుకోవటంలో తప్పులేదు. అంతకుమించి ఆ సొమ్మును తీసుకోవటం, ఆ సొమ్ముకు యజమాని అయి కూర్చోవటం, ఆ సొమ్మును ఇతర పద్దులకు కేటాయించటం మాత్రం ధర్మసమ్మతం కాదు. ఆ బైతుల్‌మాల్ వ్యవస్థకు అధిపతిగా ఉండే వ్యక్తిపై దాని సంరక్షణా బాధ్యత కూడా ఉండటం చేత అతడు సముచితమైన రీతిలోనే అందులో నుంచి కొంత వినియోగించుకోవాలి. దుబారా ఖర్చు చెయ్యటంగానీ, పరిమితిని మించిన సొమ్మును అందులోనుంచి తీసుకోవటంగానీ చేస్తే అది అధర్మం అవుతుంది. దీని పర్యవసానం నరకాగ్నియే.

హదీసు ఉల్లేఖకులు

ఖౌలా (రదియల్లాహు అన్హా) : ఖౌలా బిన్తె సామిర్. అన్సారియా. ఈమె అసలు ఖైస్ బిన్ ఫహద్ కుమార్తెయనీ, ఆయన బిరుదు సామిర్ అనీ ఇబ్నె అబ్దుల్ బర్ర్ ఉవాచ. ఈమె తొలుత హమ్జా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) సహధర్మచారిణిగా ఉన్నారు. ఉహాద్ యుద్ధంలో హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) వీరమరణం పొందిన సంగతి విదితమే. అనంతరం ఈమె నూమాన్ బిన్ అజ్లాన్ అన్సారీ జురఖీ (రదియల్లాహు అన్హు)ని వివాహమాడారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1289

1290

హదీసు 1290

وَعَنْ أَبِي ذَرٍّ ‏- رضى الله عنه ‏- عَنْ اَلنَّبِيِّ ‏-صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ‏-‏- فِيمَا يَرْوِيهِ عَنْ رَبِّهِ‏- قَالَ: { يَا عِبَادِي! إِنِّي حَرَّمْتُ اَلظُّلْمَ عَلَى نَفْسِي, وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّمًا, فَلَا تَظَّالَمُوا } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

దేవుడు తనకు తెలియజేసిన విషయాలను దైవప్రవక్త ﷺ వివరించినట్లు హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) చెప్పారు – దేవుడు ఇలా సెలవిచ్చాడు: “ఓ నా దాసులారా! నేను అన్యాయాన్ని నా తరఫునుండి నిషేధించుకున్నాను. మీ మధ్య కూడా నిషేధించాను. కనుక మీరు ఒండొకరిపై అన్యాయానికి ఒడిగట్టకండి.” (ముస్లిం)

English

Abu Dharr (RAA) quoted the Prophet (ﷺ) saying among what he narrated from Allah, the Most High that He has said, “O MY slaves, I have made oppression unlawful for myself and I have made it unlawful among you, so do not oppress one another.” Related by Muslim.

సారాంశం

ఈ హదీసు ‘హదీసె ఖుదసీ’ అనబడుతుంది. ఏ హదీసులోనయితే ప్రత్యక్షంగా సర్వోన్నతుడైన దేవుని పలుకులుంటాయో దాన్ని హదీసె ఖుదసీ అంటారు. ఈ హదీసు ప్రకారం అన్యాయస్తుడైన (దుర్మార్గుడైన) వాని కోసం ఎటువంటి రాయితీ లేక మినహాయింపు లేదు. నేను మీకు అన్యాయం చేయనప్పుడు మీరు కూడా పరస్పరం అన్యాయం చేయకండి అని దేవుడు చెప్పటాన్నిబట్టి అవగతమయ్యేదేమిటంటే ‘అన్యాయం’ అనేది మాచెడ్డ చేష్ట. అన్యాయస్తుడికి ఇహలోకమూ పరలోకమూ లభించదు. అతడు ఎప్పటికీ నష్టంలోనే ఉంటాడు అని చెప్పబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1290

1291

హదీసు 1291

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { أَتَدْرُونَ مَا اَلْغِيبَةُ? قَالُوا: اَللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ.‏ قَالَ: ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ.‏ قَالَ: أَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ? قَالَ: إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدْ اِغْتَبْتَهُ, وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: “పరోక్షనింద అంటే ఏమిటో మీకు తెలుసా?” అని దైవప్రవక్త ﷺ ప్రశ్నించగా, ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని అక్కడున్న సహచరులు జవాబు ఇచ్చారు. అప్పుడు ఆయన ﷺ ఇలా వివరించారు- “నీవు ఎప్పుడయినా నీ సోదరుని గురించి చెడు ప్రస్తావన తీసుకువస్తే అది పరోక్ష నింద అవుతుంది.” ‘నేను ప్రస్తావించే విషయమే ఒకవేళ నా సోదరునిలో ఉంటేనూ?!’ అని అక్కడున్నవారిలో ఒకరు సందేహపడగా, దానికి ఆయన ﷺ ఇలా సమాధానమిచ్చారు: “నీవు నీ సోదరుని గురించి చెప్పేవన్నీ నిజంగానే అతనిలో ఉంటే నువ్వు అతని గురించి పరోక్షంగా నిందించినట్లు లెక్క. ఒకవేళ అతనిలో లేని విషయాన్ని గనక నువ్వు పరోక్షంలో చెబితే అది అపనింద అవుతుంది.” (ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) asked, “Do you know what backbiting is?” They replied, `Allah and His Messenger (ﷺ) know best.’ He said, “It is saying something about your brother which he dislikes.” Someone asked, ‘Supposing that what I said about my brother was true?’ and the Messenger of Allah (ﷺ) said: “If what you say about him is true you have backbitten him and if it is not true you have slandered him.” Related by Muslim.

సారాంశం

పరోక్ష నింద వేయటం లేక చాడీలు చెప్పటం అనేది ఎంతో హేయమైన పని. ఇది హరామ్ (నిషిద్ధం) అన్న విషయంలో ఏకాభిప్రాయముంది. పైగా ఇది పెద్ద పాపాల కోవకు చెందినది. పరోక్ష నిందకు పాల్పడటమంటే మృత సోదరుని మాంసం తినటమేనని ఖుర్ఆన్ వర్ణించింది. ఎందుకంటే పరోక్షంగా నిందించేవాడు తన (ముస్లిం) సోదరుడు అక్కడ లేకపోవటం చూసి అతని మానమర్యాదలపై, పరువు ప్రతిష్ఠలపై దాడి చేస్తాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1291

1292

హదీసు 1292

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَحَاسَدُوا وَلَا تَنَاجَشُوا, وَلَا تَبَاغَضُوا, وَلَا تَدَابَرُوا, وَلَا يَبِعْ بَعْضُكُمْ عَلَى بَيْعِ بَعْضٍ, وَكُونُوا عِبَادَ اَللَّهِ إِخْوَانًا, اَلْمُسْلِمُ أَخُو اَلْمُسْلِمِ, لَا يَظْلِمُهُ, وَلَا يَخْذُلُهُ, وَلَا يَحْقِرُهُ, اَلتَّقْوَى هَا هُنَا, وَيُشِيرُ إِلَى صَدْرِهِ ثَلَاثَ مَرَّاتٍ, بِحَسْبِ اِمْرِئٍ مِنْ اَلشَّرِّ أَنْ يَحْقِرَ أَخَاهُ اَلْمُسْلِمَ, كُلُّ اَلْمُسْلِمِ عَلَى اَلْمُسْلِمِ حَرَامٌ, دَمُهُ, وَمَالُهُ, وَعِرْضُهُ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “ఒండొకరిపై అసూయ చెందకండి. ధరలను పెంచకండి. ఒకరు ఇంకొకరి యెడల విముఖులై ఉండకండి. పరస్పరం వీపు వెనుక చాడీలు చెప్పకండి. ఒకరు ఒక వ్యవహారం చేసిన తరువాత మరొకరు దానిపై వ్యవహారం చేయకండి. దైవదాసులారా! పరస్పరం అన్నదమ్ములుగా మెలగండి. ముస్లిం ముస్లింకు సోదరుడు. అతడు సాటి సోదరునికి అన్యాయం చేయటంగానీ, అతన్ని నిస్సహాయస్థితిలో వదలివేయటంగానీ చేయడు. అతన్ని అల్పునిగా కూడా భావించడు.” తన ఎద వైపునకు ఆయన ﷺ మూడుసార్లు సంజ్ఞ చేస్తూ ఇలా పలికారు: “తఖ్వా (దైవభీతి, దైవభక్తి) ఇక్కడుంది. ఒక మనిషి పాపం చేశాడనటానికి అతడు తన ముస్లిం సోదరుణ్ణి అల్పునిగా భావించటం ఒక్కటి చాలు. ప్రతి ముస్లింపై సాటి ముస్లిం యొక్క రక్తం, ధనం, మర్యాద హరామ్ గావించబడింది (నిషేధించబడింది).” (ముస్లిం)

English

Abu Hurairah [RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Avoid jealousy between yourselves, do not outbid one another (with a view to raising the price), do not harbor hatred against one another, do not bear enmity against one another, one of you should not enter into a transaction when the other has already entered into it; and be fellow brothers and slaves of Allah. A Muslim is a Muslim’s brother. He does not wrong, desert or despise him. Piety is found here (pointing three times to his chest), despising his Muslim brother is enough evil for any man to do. Every Muslim’s blood, property and honor are unlawful to be violated by another Muslim.” Related by Muslim.

సారాంశం

ఒక సత్సమాజంలోని సభ్యులు పరస్పరం ఎలా మెలగాలో, ఏ ఏ చెడుగులకు దూరంగా మసలుకోవాలో ఈ హదీసులో సమగ్రంగా చెప్పబడింది. సత్కర్మలను కాల్చి భస్మీపటలం చేసివేసే అసూయకు, ఈర్ష్యకు దూరంగా ఉండాలని ప్రత్యేకంగా తాకీదు చేయటం జరిగింది. ఆర్థికంగా కూడా న్యాయసమ్మతమైన రీతిలో మసలుకోవాలనీ, కేవలం ఒక ఆసామీని బాగుచేసే లక్ష్యంతో ధరలను విపరీతంగా పెంచరాదనీ, ఎందుకంటే కొనుగోలుదారు కూడా అతని సోదరుడేనన్న సంగతిని దృష్టిలో ఉంచుకుని సముచితమైన పద్ధతిని అవలంబించాలని నొక్కి వక్కాణించబడింది.

ఓర్వలేనితనం, వైముఖ్య ధోరణి ఏ సమాజానికీ మంచివి కాదనీ, దీనిమూలంగా పరస్పర ప్రేమైక భావాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని హెచ్చరించబడింది. ఒండొకరికి కీడు తలపెట్టకుండా జాగ్రత్త వహించాలనీ, పరస్పరం అన్నదమ్ముల్లా మెలగవలెననీ ఉపదేశించబడింది. వీపు వెనుక తమ సోదరుల చాడీలు చెప్పుకుంటూ తిరగటం, కూపీలు లాగటం మంచి లక్షణాలు కావనీ, తోటి సోదరుణ్ణి ఎట్టి పరిస్థితిలోనూ చిన్నచూపు చూడరాదనీ, ఒకరిని అల్పునిగా భావించటమనేది అహంకారానికి ఆనవాలనీ, ఇదొక భయంకరమైన రుగ్మత అని స్పష్టం చేయబడింది. ఒక ముస్లిం మరో ముస్లింకు సోదరుడు. అతడు ధనికుడైనా – బీదవాడైనా, చిన్నవాడైనా – పెద్దవాడైనా, అతని ధన మాన ప్రాణాలు ఎంతో గౌరవప్రదమైనవి. అకారణంగా ఎవరూ వాటి జోలికి పోకూడదు. ఇంకొకరి మానమర్యాదలతో, ధన ప్రాణాలతో చెలగాటమాడే అధికారం ఎవరికీ లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1292

1293

హదీసు 1293

وَعَنْ قُطْبَةَ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { اَللَّهُمَّ جَنِّبْنِي مُنْكَرَاتِ اَلْأَخْلَاقِ, وَالْأَعْمَالِ, وَالْأَهْوَاءِ, وَالْأَدْوَاءِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ , وَصَحَّحَهُ اَلْحَاكِمُ وَاللَّفْظِ لَهُ.‏.

హజ్రత్ ఖుత్‌బా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తరచూ ఈ విధంగా వేడుకుంటూ ఉండేవారు – “ఓ దేవా! నన్ను దుర్గుణాల నుంచీ, దుష్ట కోర్కెల నుంచీ, దుష్ట రోగాల నుంచీ కాపాడు.” (దీనిని తిర్మిజీ ఉల్లేఖించగా, హాకిమ్ ప్రామాణికమైనదని పేర్కొన్నారు. వాక్యాలు కూడా ఆయనవే).

English

Qutbah bin Malik (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) used to say, “O Allah, I seek refuge in you from evil morals, deeds, passions and diseases.” Related by At-Tirmidhi. Al-Hakim graded it as Sahih and it is his version.

సారాంశం

దైవప్రవక్త ﷺ నిత్యం ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ చెడుగుల బారినుండి కాపాడేవాడు సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే. దేవుడు మనిషికి సద్బుద్ధి నొసగనంతవరకూ అతడు ఈ అవగుణాల నుంచి తన్ను రక్షించుకోజాలడు.

హదీసు ఉల్లేఖకులు

ఖుత్‌బా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) : బనూ సాలబాకు చెందినవారు. బనూ సాలబా బిన్ సాద్ బిన్ జుబ్‌యాన్. కూఫా వాసి. ఈయన భ్రాతృజుడైన జియాద్ బిన్ అలాఖా ఈయన నుండి హదీసులను ఉటంకించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1293

1294

హదీసు 1294

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تُمَارِ أَخَاكَ, وَلَا تُمَازِحْهُ, وَلَا تَعِدْهُ مَوْعِدًا فَتُخْلِفَهُ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ بِسَنَدٍ ضَعِيفٍ.‏.

దైవప్రవక్త ﷺ ఉపదేశించినట్లు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “మీ ముస్లిం సోదరునితో గొడవ పడకండి, అతన్ని ఎగతాళి చేయకండి, నెరవేర్చలేనటువంటి వాగ్దానాన్ని కూడా అతనికి చేయకండి.” (ఈ హదీసును తిర్మిజీ బలహీన పరంపర ద్వారా ఉల్లేఖించారు)

English

Ibn ’Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Don’t dispute with your brother; don’t make jokes with him; and don’t make him a promise which you would break.” Related by At-Tirmidhi with a weak chain of narrators.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1294

1295

హదీసు 1295

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ خَصْلَتَانِ لَا يَجْتَمِعَانِ فِي مُؤْمِنٍ: اَلْبُخْلُ, وَسُوءُ اَلْخُلُقِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَفِي سَنَدِهِ ضَعْفٌ.‏.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “రెండు గుణాలు ఒక విశ్వాసి (మోమిన్)లో ఇమిడి ఉండలేవు – ఒకటి: పిసినారితనం. రెండు: చెడు నడత.” (దీనిని తిర్మిజీ సేకరించారు – దీని పరంపరలో బలహీనత ఉంది)

English

Abu Sa'id al-Khudri (RAA), narrated that the Messenger of Allah (ﷺ) said: “There are two characteristics which are not combined in a believer; miserliness and bad morals.” Related by At-Tirmidhi with a weakness in its chain of narrators.

సారాంశం

ఒక విశ్వాసి ఏకకాలంలో పూర్తిగా చెడునడత గలవాడై, మరీ పిసినిగొట్టు అయి ఉండడని ఈ హదీసు చెబుతోంది. ఈమాన్ (విశ్వాసం) అనేది మనిషిలో సద్గుణాన్ని సృజిస్తుంది. ఒండొకరి శ్రేయాన్ని అభిలషించేలా మనుషులను మలుస్తుంది. మరలాంటప్పుడు ఒక వ్యక్తిలో ఒకే సమయంలో ఈ రెండు లోపాలు పొడసూపితే అతడు పరిపూర్ణ విశ్వాసి ఎలా అవుతాడు?

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1295

1296

హదీసు 1296

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ : { اَلْمُسْتَبَّانِ مَا قَالَا, فَعَلَى اَلْبَادِئِ, مَا لَمْ يَعْتَدِ اَلْمَظْلُومُ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఇద్దరు వ్యక్తులు పరస్పరం దూషణలకు దిగితే, వారిలో బాధితుడైనవాడు నిగ్రహం వహించినంతసేపూ దూషణను ప్రారంభించిన వానిపైనే ఆ పాపభారం పడుతుంది.” (ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When two men insult one another, what they say is mainly the fault of the one who began it, so long as the one who is oppressed does not transgress.” Related by Muslim.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1296

1297

హదీసు 1297

وَعَنْ أَبِي صِرْمَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ ضَارَّ مُسْلِمًا ضَارَّهُ اَللَّهُ, وَمَنْ شَاقَّ مُسْلِمًا شَاقَّ اَللَّهُ عَلَيْهِ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ.‏.

హజ్రత్ అబూ సిర్మా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “ఎవరయినా ఏ ముస్లింనయినా పీడిస్తే అల్లాహ్ అతన్ని పీడనకు గురిచేస్తాడు. మరెవరయినా ఏ ముస్లింనయినా ఇక్కట్ల పాల్జేస్తే అల్లాహ్ అతన్ని కష్టాల్లో పడవేస్తాడు.” (ఈ హదీసును అబూదావూద్, తిర్మిజీలు ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని స్పష్టమయిన కోవకు చెందిన హదీసుగా ఖరారు చేశారు)

English

Abu Sirmah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “He who causes harm to a Muslim will be harmed by Allah, and he who acts in a hostile manner against a Muslim, will be punished in the same way by Allah.” Related by Abu Dawud and At-Tirmidhi who graded it to be Hasan (good).

సారాంశం

ఈ హదీసులో తోటి ముస్లింను వేధించరాదని, అతన్ని కష్టాలకు లోను చేయరాదని హెచ్చరించటం జరిగింది. ఎవరయినా సాటి ముస్లింపై దౌర్జన్యానికి దిగితే, అకారణంగా అతనితో దెబ్బలాటకు దిగితే దేవుని దృష్టిలో అది చాలా తీవ్రమయిన విషయంగా పరిగణించబడుతుంది. అలాంటి వారి సంగతి చూసుకోవడానికి అల్లాహ్ ఒక్కడే చాలు.

హదీసు ఉల్లేఖకులు

అబూ సిర్మా (రదియల్లాహు అన్హు): అసలు పేరు మాలిక్ బిన్ ఖైస్ లేదా ఖైస్ బిన్ మాలిక్. మాజిన్ తెగకు చెందినవారు. బద్ర్ తదితర యుద్ధాలలో పాల్గొన్నారు. ఈయన ద్వారా కొన్ని హదీసులు ఉల్లేఖించబడ్డాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1297

1298

హదీసు 1298

وَعَنْ أَبِي اَلدَّرْدَاءِ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَللَّهَ يُبْغِضُ اَلْفَاحِشَ اَلْبَذِيءَ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ.‏.

హజ్రత్ అబూ అదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “అల్లాహ్ దురలవాట్లు గలవాణ్ణి, నీతి బాహ్యమైన మాటలు పలికేవాణ్ణి అసహ్యించుకుంటాడు.” (ఈ హదీసును తిర్మిజీ ప్రామాణికమైన పరంపర ద్వారా ఉల్లేఖించారు)

English

Abu ad-Darda (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Allah hates the profligate and the obscene.” Related by At-Tirmidhi who graded it to be Sahih.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1298

1299

హదీసు 1299

وَلَهُ مِنْ حَدِيثِ اِبْنِ مَسْعُودٍ ‏-رَفَعَهُ‏-: { لَيْسَ اَلْمُؤْمِنُ بِالطَّعَّانِ, وَلَا اَللَّعَّانُ, وَلَا اَلْفَاحِشَ, وَلَا اَلْبَذِيءَ } وَحَسَّنَهُ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَرَجَّحَ اَلدَّارَقُطْنِيُّ وَقْفَهُ.‏.

ఈయన (అబూ అదర్దా) గారే హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) నుండి చేసిన ఒక ‘మర్ఫూ’ ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది : “విశ్వాసి అయిన వాడు ఎక్కువగా ఎత్తిపొడుపు మాటలనడు. ఎక్కువగా శాపనార్థాలు పెట్టడు. నీతిమాలిన మాటలనడు. లజ్జా విహీనుడు అయి ఉండడు.” (తిర్మిజీ ఈ హదీసును ‘హసన్’గా ఖరారు చేశారు. హాకిమ్ మాత్రం దీనిని దృఢమైనదిగా పేర్కొన్నారు)

English

At-Tirmidhi also related on the authority of Ibn Mas'ud (RAA) that the Messenger of Allah (ﷺ) said: “The believer is not a slanderer, nor does he curse others, and nor is he immoral or shameless.” Related by At-Tirmidhi who graded it to be Hasan. Al-Hakim graded it as Sahih and Ad-Daraqutni said that it is most probably Mawquf (traced only to a Companion).

సారాంశం

చెడు అనటం, చెడును అనుసరించటం, తిట్ల పురాణం మొదలెట్టడం ఒక పరిపూర్ణ విశ్వాసికి ఏ విధంగానూ శోభించదు.

హదీసు ఉల్లేఖకులు

అబూ అదర్దా (రదియల్లాహు అన్హు) : గొప్ప సహాబీలలో ఒకరు. ధర్మపరాయణులు. సాధుస్వభావులు. ఈయన అసలు పేరు ఉవైమిర్ బిన్ జైద్ లేదా ఇబ్నె ఆమిర్ లేదా ఇబ్నె మాలిక్ బిన్ అబ్దుల్లా బిన్ ఖైస్. ఖజ్రజ్ తెగవారు. బద్ర్ యుద్ధం జరిగిననాడు ఇస్లాం స్వీకరించారు. ఉహుద్ యుద్ధంలో పాల్గొన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాత్రం ఈయన్ని బద్రీ సహచరులలో ఒకరుగా పరిగణించారు. దివ్య ఖుర్ఆన్ క్రోడీకరణలో సేవలందించారు. డెమాస్కస్‌కు ఖాజీగా నియమితులయ్యారు. ఈయన సుగుణాలను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయనగారి సువర్ణ సూక్తుల్లో ఒకటి ఇది : “తృటిలో సిద్ధించే కీర్తి సుదీర్ఘకాలంపాటు ఉదాసీనతకు లోనుచేస్తుంది.” ఈయన హిజ్రీ 32వ సంవత్సరంలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1299

1300

హదీసు 1300

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَسُبُّوا اَلْأَمْوَاتَ ; فَإِنَّهُمْ قَدْ أَفْضَوْا إِلَى مَا قَدَّمُوا } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.‏.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “చనిపోయిన వారిని దూషించకండి. ఎందుకంటే (బ్రతికి ఉండగా)వారు చేసుకున్న కర్మలకు చేరుకున్నారు.” (బుఖారీ)

English

A’ishah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Avoid reviling the dead, they have already seen the result of (the deeds) that they forwarded before them.” Related by Al-Bukhari.

సారాంశం

చనిపోయిన వారెవరయినాసరే -వారిని నిందించటం, దూషించటం, విమర్శించటం తగదని ఈ హదీసులో తాకీదు చేయబడింది. ఎందుకంటే మృతుని దూషించటం వల్ల అతని అనుయాయుల మనసు నొచ్చుకోవచ్చు. అది పరస్పర వైరానికి, పగకు కారణభూతం కావచ్చు. అదీగాక చనిపోయినవారిని ఆడిపోసుకోవటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. అతడెలాగూ తన ప్రభువు వద్దకు చేరుకున్నాడు. అతని వ్యవహారం ఇక మీదట ప్రభువు చేతుల్లో ఉంది. శిక్షించినా, క్షమించినా అది ఆయన ఇష్టం. మృతుణ్ణి ఒకరు దూషించినా దూషించకపోయినా అతనికి కలిగే నష్టం ఏమీ లేదు. మరి అటువంటి వారిని ఆడిపోసుకోవటం వల్ల ఒరిగేదేముంది – ఆవేశాన్ని ఆ విధంగా చల్లార్చుకోవటం తప్ప!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1300

1301

హదీసు 1301

وَعَنْ حُذَيْفَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَدْخُلُ اَلْجَنَّةَ قَتَّاتٌ } مُتَّفَقٌ عَلَيْهِ.‏.

హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు : “చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు.” (బుఖారీ, ముస్లిం)

English

Hudhaifah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A backbiter will not enter Paradise.” Agreed upon.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1301

1302

హదీసు 1302

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ كَفَّ غَضَبَهُ, كَفَّ اَللَّهُ عَنْهُ عَذَابَهُ } أَخْرَجَهُ اَلطَّبَرَانِيُّ فِي " اَلْأَوْسَطِ".‏. وَلَهُ شَاهِدٌ: مِنْ حَدِيثِ اِبْنِ عُمَرَ عِنْدَ اِبْنِ أَبِي اَلدُّنْيَا.‏.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు : “ఎవరయితే తన కోపాన్ని ఆపుకున్నాడో అల్లాహ్ అతన్నుండి తన శిక్షను ఆపుకుంటాడు.” (దీనిని తబ్రానీ ‘అల్ ఔసత్’ నుండి సేకరించారు. ఇబ్నె అబూ అద్‌దున్‌యా ఉటంకించిన ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) గారి హదీసు దీనికి సాక్ష్యంగా ఉంది)

English

Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If one restrained his anger, Allah will keep His punishment from him (on the Day of Resurrection).” Related by At-Tabarani in al-Awsat.

The aforementioned hadith is supported by a narration on the authority of Ibn ’Umar related by Ibn Abi Ad-Dunia.

సారాంశం

కోపాన్ని దిగమ్రింగటం ఎంత గొప్ప విషయమో ఈ హదీసులో వివరించబడింది. తమ అధీనంలో వున్న, తమ చేతి క్రింద పనిచేసే వారి తప్పులను మన్నించటం, వారి తప్పిదాల వల్ల కలిగిన క్రోధాన్ని అణచుకోవటం ఔదార్యానికి ప్రతిరూపమని, ఈ ఔదార్యానికి ప్రతిగా దేవుడు కూడా కనికరిస్తాడని విదితమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1302

1303

హదీసు 1303

وَعَنْ أَبِي بَكْرٍ اَلصِّدِّيقِ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَدْخُلُ اَلْجَنَّةَ خِبٌّ, وَلَا بَخِيلٌ, وَلَا سَيِّئُ اَلْمَلَكَةِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَفَرَّقَهُ حَدِيثَيْنِ, وَفِي إِسْنَادِهِ ضَعْفٌ.‏.

హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “దగాకోరు, పిసినారి, దుర్వర్తనుడు స్వర్గంలో ప్రవేశించడు.” (తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. ఆయన దీన్ని రెండు హదీసులుగా-వేర్వేరుగా-వివరించారు. దీని పరంపరలో బలహీనత ఉంది)

English

Abu Bakr as-Siddiq (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A crafty person, a miser and one who badly treats those under his authority will not enter Paradise.” Related by At-Tirmidhi in two separate traditions and there is a weakness in its chain of narrators.

సారాంశం

పై హదీసులో పేర్కొనబడిన మూడు అవగుణాలు ఉన్నవారు స్వర్గంలో ప్రవేశించలేరని అనబడిందంటే దీని భావం తమ చెడు చేష్టలకు ఫలితం అనుభవించిన మీదటే వారు స్వర్గంలోకి వెళతారన్నమాట!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1303

1304

హదీసు 1304

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ تَسَمَّعَ حَدِيثَ قَوْمٍ, وَهُمْ لَهُ كَارِهُونَ, صُبَّ فِي أُذُنَيْهِ اَلْآنُكُ يَوْمَ اَلْقِيَامَةِ } يَعْنِي: اَلرَّصَاصَ.‏ أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.‏.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏదేని ఒక వర్గం వారు తనను ఇష్టపడటం లేదని తెలిసి కూడా ఎవరయినా వారు చెప్పుకునే విషయాన్ని వినే యత్నం చేస్తే, ప్రళయదినాన అతని రెండు చెవుల్లో సీసం వేయబడుతుంది.” (బుఖారీ)

English

Ibn ’Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If anyone listened to the talk of some people, when they do not like him to do that, then molten led will be poured into his ears on the Day of Resurrection.” Related by Al-Bukhari.

సారాంశం

ఎవరైనా ఒక వర్గం వారు, లేక ఒక సమూహం ఏదేని ఒక విషయంపై మాట్లాడుకుంటున్నప్పుడు వారి అనుమతి లేకుండా వారిలో కలసిపోవటంగానీ, చెవి యొగ్గి వారి మాటల్ని వినటంగానీ చేయకూడదు. ముఖ్యంగా కొంతమంది కలసి సమాలోచన చేస్తున్నప్పుడు, రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా! అని కూపీలు లాగే ప్రయత్నం చేయటం చాలా చెడ్డ పని ఇలాంటి వ్యక్తి చెవుల్లో తీర్పుదినాన సీసం కరిగించి పోయబడుతుంది. ఇది సభా మర్యాదలకు సంబంధించిన ఒక ముఖ్యాంశం. దీన్ని గౌరవించటం అందరి బాధ్యత.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తన గ్రంథమైన “అల్ అదబుల్ ముఫ్రిద్”లో చేసిన ఒక ఉల్లేఖనం ప్రకారం; ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) గారు ఒక వ్యక్తితో సంభాషిస్తుండగా, ఇంకొకాయన వాళ్లిద్దరికీ అతి చేరువలోకి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఆ వ్యక్తి రొమ్ముపై తన అరచేతిని చరచి, ఇరువురు వ్యక్తులు ప్రత్యేకంగా చర్చించుకుంటూ ఉండగా, వాళ్ళ మాటల్ని వినకు, ఇలా వినటం నిషిద్ధం అని చెప్పారు. మొత్తంమీద ఒకరి రహస్య సమాలోచనను నక్కి వినటం, అందులో అనవసరంగా జోక్యం చేసుకోవటం ఏమాత్రం సమంజసం కాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1304

1305

హదీసు 1305

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ طُوبَى لِمَنْ شَغَلَهُ عَيْبَهُ عَنْ عُيُوبِ اَلنَّاسِ } أَخْرَجَهُ اَلْبَزَّارُ بِإِسْنَادٍ حَسَنٍ.‏.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “ఎవరికయితే తన స్వీయ లోపాలు కానవస్తాయో, ఇతరుల లోపాలు కానరావో అతడు ధన్యుడు.” (ఈ ఉల్లేఖనాన్ని బజ్జార్ ‘హసన్’ పరంపర నుండి సేకరించారు)

English

Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Blessed is he who is preoccupied with his defects rather than those of other people.” Related by Al-Bazzar with a good chain of narrators.

సారాంశం

ఇతరుల తప్పుల్ని ఎంచే ప్రయత్నంలో సమయాన్ని వృథా చేయకుండా తన స్వీయ తప్పుల్ని తెలుసుకుంటూ, వాటిని దూరం చేసుకునేందుకు కృషి చేసే వ్యక్తికి ఈ హదీసులో శుభవార్త ఇవ్వబడింది. తప్పును సరిదిద్దుకోవటం ఎంత కష్టమో గ్రహించిన వ్యక్తికి ఇతరుల తప్పుల్ని ఎంచే తీరికే దొరకదు. ఒకవేళ ఇతరుల్లో అతనికేదైనా లోపాలు కనిపించినా సాధ్యమైనంతవరకు వాటిని ఉపేక్షించేందుకు యత్నిస్తాడేగాని నలుగురిలో వారిని నవ్వులపాలు చేయడు. ఈ విధంగా ఆత్మావలోకనం చేసుకుంటూ, స్వీయ సంస్కరణపై ధ్యాస కనబరచే వారికి తీర్పు దినాన దేవుడు విస్తృతమైన నీడ గల వృక్షాన్ని ప్రసాదిస్తాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1305

1306

హదీసు 1306

وَعَنْ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ تَعَاظَمَ فِي نَفْسِهِ, وَاخْتَالَ فِي مِشْيَتِهِ, لَقِيَ اَللَّهَ وَهُوَ عَلَيْهِ غَضْبَانُ } أَخْرَجَهُ اَلْحَاكِمُ وَرِجَالُهُ ثِقَاتٌ.‏.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “ఎవరయితే తన్ను తాను గొప్పవాడినని తలంచుకుని, గర్వాతిశయంతో నడుస్తాడో అతడు అల్లాహ్‌ను ఆగ్రహోదగ్రుడై ఉన్న స్థితిలో కలుసుకుంటాడు.” (హాకిమ్ దీనిని సేకరించారు. దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు)

English

Ibn 'Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Whoever exalts himself and walks proudly; Allah will be angry with him when he meets Him (on the Day of Resurrection).” Related Al-Hakim with a reliable chain of narrators.

సారాంశం

గర్వం, అహంకారంతో విర్రవీగటం దేవుని అప్రసన్నతకు, దైవాగ్రహానికి కారణభూతమవుతుందని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. వాస్తవానికి తాను అందరికన్నా గొప్పవాడినని అనుకునేవాడే నేలపై నిక్కుతూ నడుస్తాడు. తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తాడు. అల్లామా నవవీ (రహిమహుల్లాహ్) దృష్టిలో – మనిషి తనను ఎంతో ఉన్నతునిగా ఊహించుకుని ఇతరుల్ని అధములుగా భావించటం, సత్యాన్ని తృణీకరించటమే అహంకారం. ఇబ్నె హజర్ మక్కీ (రహిమహుల్లాహ్) ఇలా అభిప్రాయపడ్డారు: పెద్దరికం మరియు అహంకారం రెండు విధాలుగా ఉంటుంది. వాటిలో ఒకటి అంతర్గతమైనది, రెండవది బాహ్యపరమైనది. హదీసులోని మొదటి వాక్యం అంతరంగాన్ని, రెండవ వాక్యం బాహ్యాన్ని వివరిస్తోంది. ఇవి రెండూ మహాపరాధాల్లోకే వస్తాయి. షరీయతు రీత్యా ఇవి నిషిద్ధం (హరామ్). ఎవరిలోనయితే అణువంత అహంకారం ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించలేడని తిర్మిజీలోని ఒక ఉల్లేఖనం ద్వారా విదితమవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1306

1307

హదీసు 1307

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلْعَجَلَةُ مِنَ اَلشَّيْطَانِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَقَالَ: حَسَنٌ.‏.

హజ్రత్ సహ్లా బిన్ సాద్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “తొందరపాటుతనం, శీఘ్రతా మనస్తత్వం షైతాన్ పని.” (ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి, దీనిని హసన్‌గా ఖరారు చేశారు)

English

Sahl bin Sa’d (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Haste comes from Satan.” Related by At-Tirmidhi who graded is as Hasan.

సారాంశం

నిర్ధారిత పనులను సకాలంలో పూర్తి చెయ్యటంలో తప్పులేదు గాని, నిర్వహించటంలో మితిమీరిన వేగిరపాటు మంచిది కాదు. మితిమీరిన హడావిడి, శీఘ్రగతి మూలంగా ఆ పనికి సంబంధించిన ఉచితానుచితాలను, మంచి చెబ్బరలను గురించి యోచన చేసే అవకాశం దొరకదు. తీరా ఆ పని అయిపోయిన మీదట అందలి లోపాలు తెలిసివస్తాయి. అందుకే ఈ దుందుడుకు స్వభావం వల్ల మనిషి ఒక్కోసారి నష్టపోతుంటాడు. పతనపు ఆఖరి అంచులదాకా వెళ్ళి పోతుంటాడు. నిజానికి ఇది షైతాన్ మాయ. ఈ మాయాజాలానికి లోనైన మనిషి నష్టాన్ని చవిచూడటం ఖాయం. కాబట్టి ‘సహసా విదధీతన క్రియాం’ అన్న సామెతను కూడా సదా దృష్టిలో పెట్టుకుని వెనుకా ముందు ఆలోచించటం మంచిది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1307

1308

హదీసు 1308

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلشُّؤْمُ: سُوءُ اَلْخُلُقِ } أَخْرَجَهُ أَحْمَدُ وَفِي إِسْنَادِهِ ضَعْفٌ.‏.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “దుర్వర్తన దౌర్భాగ్య స్థితికి తార్కాణం.” (దీన్ని అహ్మద్ ఉల్లేఖించారు. దీని పరంపర బలహీనమైనది).

English

'A'ishah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Pessimism is part of bad character.” Related by Ahmad with a weak chain of narrators.

సారాంశం

మనిషిపై వచ్చే ఆపదలకు, దారిద్ర్యానికి, దౌర్భాగ్యకరస్థితికి అసలు కారణం అతడి చెడు నడతేననీ, అతని స్వయంకృతాల మూలంగానే శుభాలు అతన్నుంచి దూరం అవుతాయనీ ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. సద్వర్తన అయినా, దుర్వర్తన అయినా మనిషి అధీనంలోనే ఉంటాయి. అతను గనక తన దుర్వర్తనను సరిదిద్దుకుని సదాచారాన్ని అవలంబిస్తే దాని శుభం వల్ల అతని దరిద్రం కాస్తా వదలిపోవచ్చు. ఎందుకంటే రుజువర్తనుడైన మనిషి వైపునకు దేవుడు కూడా మరలుతాడు. అతని స్థితిని చక్కదిద్దుతాడు. అతని తేలికపాటి తప్పుల్ని మన్నించి కనికరిస్తాడు. కనుక మనిషి నిత్యం దుర్వర్తన వైపునుంచి ‘సద్వర్తన’ వైపునకు ప్రస్థానం చేసే చింతనలో ఉండాలి. దుర్వర్తన దౌర్భాగ్యానికి, దారిద్ర్యానికి చిహ్నమైతే సద్వర్తన శుభశ్రేయాలకు, సాఫల్యానికి సంకేతం!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1308

1309

హదీసు 1309

وَعَنْ أَبِي اَلدَّرْدَاءِ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَللَّعَّانِينَ لَا يَكُونُونَ شُفَعَاءَ, وَلَا شُهَدَاءَ يَوْمَ اَلْقِيَامَةِ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

హజ్రత్ అబూ అదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “నిస్సందేహంగా ఇతరులకు శాపనార్థాలు పెట్టేవారు ప్రళయదినాన సిఫారసు చేసే, సాక్ష్యం ఇచ్చే అర్హతను కోల్పోతారు.” (ముస్లిం)

English

Abu ad-Darda’ (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Men accustomed to cursing will not be intercessors or witnesses on the Day of Resurrection.” Related by Muslim.

సారాంశం

అదేపనిగా ఇతరుల్ని శపిస్తూ, ఇతరుల చర్యలను అనవసరంగా ఖండిస్తూ ఉండేవారిని అల్లాహ్ ఇష్టపడడనీ, తీర్పుదినాన అటువంటి వారు చేసే సిఫారసుల్ని, వారు ఇచ్చే సాక్ష్యాలను అల్లాహ్ ఒప్పుకోడని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఎందుకంటే అకారణంగా అన్యుల్ని ఆడిపోసుకునేవారు, అన్యుల ఉనికిని సహించలేనివారు పాపాత్ములు (ఫాసిఖ్‌లు) అవుతారు. కాగా; పాపాత్ముల సిఫారసు స్వీకారయోగ్యమవదు. ఇలాంటి వారు దైవమార్గంలో అమరగతి నొందినప్పటికీ, ఇతరుల కోసం సిఫారసు చేసే అర్హతను పొందలేరని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1309

1310

హదీసు 1310

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ عَيَّرَ أَخَاهُ بِذَنْبٍ, لَمْ يَمُتْ حَتَّى يَعْمَلَهُ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ, وَسَنَدُهُ مُنْقَطِعٌ.‏.

హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “ఎవరైతే ఒక ముస్లిం చేత జరిగిపోయిన పాపాన్ని రట్టుచేసి రాద్ధాంతం చేస్తాడో అతను స్వయంగా ఆ పనికి పాల్పడి మరీ చస్తాడు.” (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. దీని పరంపరలో అంతరాయముంది).

English

Mu'adh bin Jabal (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If anyone disgraces his brother for a sin, he will not die before committing it himself.” Related At-Tirmidhi who graded it to be Hasan.

సారాంశం

సాటి ప్రజల తప్పులను, పాపాలను అసలు ఎత్తి చూపకూడదని దీని భావం కాదు. కాకపోతే పబ్లిగ్గా వారి పాపాలను ప్రస్తావించి, నలుగురిలో నవ్వులపాలు చేసే యత్నం మాత్రం చేయకూడదు. ఎవరయితే ఇలాంటి దుష్ట సంకల్పం పూనుకుని ఉంటారో వారికీ అదే గతి పడుతుంది. సాధ్యమైనంతవరకు జనుల లోపాలను మరుగుపరచాలన్నది దేవుని అభిమతం. ఎందుకంటే ఆయన ‘సత్తార్’ – దాసుల లోటుపాట్లను మరుగుపరచేవాడు! ఎవరిలోనయితే ఈ లోపాలను మరుగుపరచే ఉదార స్వభావం ఉంటుందో వారి లోపాలను తీర్పుదినాన దేవుడు మరుగుపరుస్తాడు. వారి పరువు ప్రతిష్ఠలను కాపాడే బాధ్యతను అల్లాహ్ స్వయంగా తీసుకుంటాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1310

1311

హదీసు 1311

وَعَنْ بَهْزِ بْنِ حَكِيمٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ: قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ وَيْلٌ لِلَّذِي يُحَدِّثُ, فَيَكْذِبُ ; لِيَضْحَكَ بِهِ اَلْقَوْمُ, وَيْلٌ لَهُ, ثُمَّ وَيْلٌ لَهُ } أَخْرَجَهُ اَلثَّلَاثَةُ, وَإِسْنَادُهُ قَوِيٌّ.‏.

హజ్రత్ బహ్జ్ బిన్ హకీమ్ తన తండ్రి ద్వారా, ఆయన తన తాతగారి ద్వారా చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “బూటకపు మాటలను, కల్లబొల్లి కబుర్లను ప్రజలకు వినిపించి హాస్యంలో ముంచెత్తే వాడికి మూడుతుంది. వాడికి మూడుతుంది. మరి వాడికి మూడుతుంది.” (ఈ హదీసును ‘ముగ్గురు’ దృఢమైన పరంపర ఆధారంగా ఉల్లేఖించారు)

English

Bahz bin Hakim narrated on the authority of his father, on the authority of his grandfather (RAA) that the Messenger of Allah (ﷺ) said: “Woe to him who lies in his talk to make the people laugh, Woe to him! Woe to him!” Related by the three Imams with a strong chain of narrators.

సారాంశం

ఆ మాటకువస్తే అబద్ధం చెప్పటం ఖుర్ఆన్ హదీసుల వెలుగులో నిషిద్ధం. ఇది కూడా పెద్ద పాపాల క్రిందికే వస్తుంది. అయితే అబద్ధాలు చెప్పి జనులకు హాస్యాన్ని పంచిపెట్టడం, అబద్ధాలతో ప్రజలకు వినోద సామగ్రిని సమకూర్చటం కూడా నిషిద్ధమేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఎందుకంటే ఆనందం అనేది ఏదైనా మంచి విషయంపై, శుభవార్తపై వెల్లడవ్వాలేగాని అబద్ధంపై కాదు. ఇలాంటి చేష్టకు పాల్పడేవాళ్ళను ఆపాలి లేదా అబద్ధాలతో కూడిన అటువంటి సమావేశాన్ని బహిష్కరించటమైనా చేయాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1311

1312

హదీసు 1312

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { كَفَّارَةٌ مَنْ اِغْتَبْتَهُ أَنْ تَسْتَغْفِرَ لَهُ } رَوَاهُ اَلْحَارِثُ بْنُ أَبِي أُسَامَةَ بِسَنَدٍ ضَعِيفٍ.‏.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరి గురించైతే నీవు చాడీలు చెప్పావో, దానికి పరిహారంగా నువ్వు అతని క్షమాపణకై అల్లాహ్‌ను ప్రార్థించాలి.” (దీన్ని హారిస్ బిన్ అబీ ఉసామా బలహీన పరంపర ఆధారంగా ఉల్లేఖించారు)

English

Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The atonement of backbiting a man is to ask Allah to forgive him.” Related by Al-Harith bin Abu Usamah with a weak chain of narrators.

సారాంశం

మనం ఎవరి వీపు వెనుక అయినా వారి గురించి చెడుగా చెప్పుకుంటే దానికి పరిహారంగా వారి మన్నింపుకోసం దైవాన్ని ప్రార్థిస్తే సరిపోతుందని ఈ హదీసు చెబుతోంది. అయితే ఆ వ్యక్తుల జాడ, చిరునామా తెలియనప్పుడైతే ఇది సరిపోతుందనీ, ఒకవేళ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసినప్పుడు మాత్రం వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకోవలసిందేనని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1312

1313

హదీసు 1313

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَبْغَضُ اَلرِّجَالِ إِلَى اَللَّهِ اَلْأَلَدُّ اَلْخَصِمُ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా సెలవిచ్చారు: “జనుల్లో అందరికన్నా ఎక్కువగా పోట్లాడేవాడే దైవసన్నిధిలో అందరికన్నా ఎక్కువగా ఛీత్కరించబడతాడు.” (ముస్లిం)

English

'A’ishah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The most despicable amongst people in the sight of Allah is the ruthless argumentative (person).” Related by Muslim.

సారాంశం

సమాజంలో అందరూ ఒకచోట నివసిస్తున్నప్పుడు ఒకరి ద్వారా ఇంకొకరికి అసౌకర్యం కలగటం, అవాంఛనీయ సంఘటనలు ఎదురవటం మామూలే. అయితే ప్రతి చిన్న అసౌకర్యానికీ జగడమాడటం, నోరు పారేసుకోవటం, గలాటా సృష్టించి శాంతియుత జీవనాన్ని అతలాకుతలం చేసివేయటం మర్యాదస్తులకు ఏమాత్రం శోభించదు. దేవుని అప్రసన్నతకు, ఆగ్రహానికి కారకులయ్యేవారే ఇలాంటి పనులు చేస్తారు. తమ హక్కుల ప్రాప్తికై ప్రజలు సముచితమైన రీతిలో పోరాడటం సమంజసమేగాని ఉగ్రరూపం దాల్చటం, ఉన్మాదిలా ప్రవర్తించటం సుతరామూ సమంజసం కాదు. పైగా ఇలాంటి తీవ్రవాదం నిషిద్ధం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.4 దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం|హదీసు 1313