హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 16. వివిధ విషయాల పుస్తకం, 3వ అధ్యాయం: సాత్వికత, ధర్మనిష్ఠ. ఈ అధ్యాయంలో 11 హదీసులు (హదీసు 1266 – 1276) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
16.3 సాత్వికత, ధర్మనిష్ఠ
باب الزهد والورع
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1266
عَنْ اَلنُّعْمَانِ بْنِ بَشِيرٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ- وَأَهْوَى اَلنُّعْمَانُ بِإِصْبَعَيْهِ إِلَى أُذُنَيْهِ: { إِنَّ اَلْحَلَالَ بَيِّنٌ, وَإِنَّ اَلْحَرَامَ بَيِّنٌ, وَبَيْنَهُمَا مُشْتَبِهَاتٌ, لَا يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنْ اَلنَّاسِ, فَمَنِ اتَّقَى اَلشُّبُهَاتِ, فَقَدِ اِسْتَبْرَأَ لِدِينِهِ وَعِرْضِهِ, وَمَنْ وَقَعَ فِي اَلشُّبُهَاتِ وَقَعَ فِي اَلْحَرَامِِ, كَالرَّاعِي يَرْعَى حَوْلَ اَلْحِمَى, يُوشِكُ أَنْ يَقَعَ فِيهِ, أَلَا وَإِنَّ لِكُلِّ مَلِكٍ حِمًى, أَلَا وَإِنَّ حِمَى اَللَّهِ مَحَارِمُهُ, أَلَا وَإِنَّ فِي اَلْجَسَدِ مُضْغَةً, إِذَا صَلَحَتْ, صَلَحَ اَلْجَسَدُ كُلُّهُ, وَإِذَا فَسَدَتْ فَسَدَ اَلْجَسَدُ كُلُّهُ, أَلَا وَهِيَ اَلْقَلْبُ } مُتَّفَقٌ عَلَيْهِ..
దైవప్రవక్త ﷺ చెప్పగా తాను విన్నానని హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) చెప్పారు. ఆ సమయంలో నూమాన్ తన రెండు వ్రేళ్లను తన చెవుల వైపునకు తీసుకెళ్ళారు- “హలాల్ (ధర్మం) కూడా సుస్పష్టమే హరామ్ (అధర్మం) కూడా సుస్పష్టమే. ఈ రెండింటి మధ్య కొన్ని అస్పష్టమైన విషయాలున్నాయి. జనుల్లోని అధికులకు వీటి గురించి తెలీదు. కనుక ఎవరయితే ఈ అస్పష్ట విషయాలకు కూడా దూరంగా ఉన్నాడో అతడు తన ధర్మాన్ని, తన మానమర్యాదలను కాపాడుకున్నాడు. మరెవరయితే అస్పష్ట అంశాలలో పడిపోయాడో అతడు అధర్మంలో చిక్కుకుపోయాడు. కావలివాడు చేనుకు దగ్గరలో పశువులకు కాపలాగా ఉంటాడు. పశువులు చేనుకు అవతల మేస్తూనే ఏదో ఒక దశలో గట్టు దాటి చేలో పడతాయి. జాగ్రత్త! ప్రతి చక్రవర్తికీ సరిహద్దు ఉంటుంది. జాగ్రత్త! అధర్మ విషయాలు దేవుని సరిహద్దుల్లాంటివి. జాగ్రత్త! శరీరంలో మాంసపు ముద్ద ఒకటుంది. ఆ ముద్ద గనక బావుంటే శరీరమంతా బావుంటుంది. అది గనక చెడిపోతే శరీరమంతా చెడిపోతుంది. తస్మాత్! ఆ మాంసపు ముద్దే హృదయం.” (బుఖారీ, ముస్లిం)
English
An-Nu’man bin Bashir (RAA) narrated, I heard Allah‘s Messenger (ﷺ) saying, (Nu'man pointed with his two fingers to his ears) ‘Both lawful (Halal) and unlawful things (Haram) are evident but in between them there are doubtful things·and most people have no knowledge about them. So he, who saves himself from these doubtful things, saves his religion and his honor (i.e. keeps them blameless). And he who indulges in these doubtful things is like a shepherd who pastures (his animals) near the Hima (private pasture) of someone else and at any moment he is liable to get in it. (O people!) Beware! Every king has a Hima and the Hima of Allah on the earth is what He declared unlawful (Haram). Beware In the body there is a piece of flesh if it becomes sound and healthy, the whole body becomes sound and healthy but if it gets spoilt, the whole body gets spoilt and that is the heart.” Agreed upon.
సారాంశం
ఈ హదీసు చాలా ముఖ్యమైనది. ఇస్లాం మూల సూత్రాలకు సంబంధించినది. ధర్మమేదో, అధర్మమేదో నిర్దిష్టంగా వేరు చేసి చెప్పటం జరిగింది. అయినప్పటికీ కొన్ని అస్పష్టంగా ఉంటాయి. వాటికి సంబంధించి ఊగిసలాట, సందిగ్ధావస్థ నెలకొంటూ ఉంటుంది. అలాంటి అస్పష్ట, అనుమానాస్పద విషయాలు ‘హరాం’ అని కూడా ఖచ్చితంగా చెప్పబడి ఉండదు. అలా అని ‘హలాల్’ అనడానికి కూడా తగు ఆధారం కనబడదు. రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి అస్పష్టమయిన విషయాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
పోతే; శరీరం యొక్క స్వస్థత లేదా అస్వస్థత అనేది హృదయస్థితిపై ఆధారపడి ఉంటుందనీ, ఒక రాజ్యంలో రాజ్యాధిపతికి ఉన్న కీలక స్థానమే శరీరంలో హృదయానికి ఉంటుందనీ, శరీరంలోని మిగతా అవయవాలన్నీ దాని నైర్మల్యంపై, నిష్కల్మషత్వంపై ఆధారభూతమై ఉంటాయనీ హదీసు చెబుతోంది. ‘యధారాజా తథా ప్రజ’ అన్నట్లు చక్రవర్తి సజ్జనుడై ఉంటే ప్రజలు కూడా సద్వర్తననే అలవరచుకుంటారు. చక్రవర్తే దుర్మార్గుడు, దుష్టుడు అయినపుడు ప్రజల నుండి మంచిని ఎలా ఆశించగలం?!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1266
హదీసు 1267
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ تَعِسَ عَبْدُ اَلدِّينَارِ, وَالدِّرْهَمِ, وَالْقَطِيفَةِ, إِنْ أُعْطِيَ رَضِيَ, وَإِنْ لَمْ يُعْطَ لَمْ يَرْضَ } أَخْرَجَهُ الْبُخَارِيُّ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺప్రబోధనం: “దీనారు, దిర్హము, పట్టు వస్త్రాల దాసుడు నాశనమై పోవుగాక!- అవి లభించినంతకాలం సంతృప్తి చెందుతాడు. లభించకపోతే అసంతృప్తికి గురవుతాడు.” (బుఖారీ)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Cursed is he, who is the slave of the Dinar, the slave of the Dirham, and the slave of the cloak bordered with silk. If he is given anything he would be satisfied, but if he is not given anything he is displeased.” Related by Al-Bukhari.
సారాంశం
బంగారు, వెండి పట్టు వస్త్రాలు కలిగి ఉండటం, డబ్బును సంపాదించటం తప్పుకాదుగాని మనిషి ధనపూజలో లీనమవటం, వెండీ బంగారాలను, వజ్రవైధూర్యాలను, పట్టు పీతాంబరాలను ప్రోగుచేసుకోవటమే అసలు జీవిత ధ్యేయంగా ఎంచుకోవటమే విపరీతం. ఈ ధన దాహం కూడా ఒక రకమయిన రుగ్మతే. దానికి లోనైనవాడు పరమ పీనాసిగానయినా మారిపోతాడు. లేదా అడ్డదారులైనా తొక్కుతాడు. తాను లక్ష్యంగా పెట్టుకున్నంత ధనాన్ని ప్రోగుచేసుకోగానే తలబిరుసుతనం వచ్చేస్తుంది. నేలపై నిక్కుతూ నడవసాగుతాడు. తన ఆస్తినీ, అంతస్తును లోకానికి చాటిచెప్పే ఉద్దేశ్యంతో లేనిపోని పోకడలు పోతాడు. ఎందుకంటే అతనికి ‘ఖారూనీ తత్వం’ ఆవహిస్తుంది. ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకున్న ఖారూన్ కుబేరునికి పట్టిన గతేమిటో తెలిసిందే కదా!
అందుకే ఆస్తిపరుడైనవాడు అణకువతో ఉండాలి. డబ్బును, బంగారాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. తన అభిరుచి అన్యుల్ని ఇరకాటంలో పెట్టకుండా సంయమనాన్ని సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. దేవుడు తనకు అనుగ్రహించిన దాంతో దైవదాసుల్లో లేమికి గురైన వారిని ఆదుకుంటూ ఉండాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1267
హదీసు 1268
وَعَنِ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: أَخَذَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -بِمَنْكِبِي, فَقَالَ: { كُنْ فِي اَلدُّنْيَا كَأَنَّكَ غَرِيبٌ, أَوْ عَابِرُ سَبِيلٍ } وَكَانَ اِبْنُ عُمَرَ يَقُولُ: إِذَا أَمْسَيْتَ فَلَا تَنْتَظِرِ اَلصَّبَاحَ, وَإِذَا أَصْبَحْتَ فَلَا تَنْتَظِرِ اَلْمَسَاءَ, وَخُذْ مِنْ صِحَّتِكَ لِسَقَمِك, وَمِنْ حَيَاتِكَ لِمَوْتِكَ. أَخْرَجَهُ اَلْبُخَارِيُّ..
దైవప్రవక్త ﷺ తన భుజాలు పట్టుకుని ఈ విధంగా ఉపదేశించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “(ఓ ఇబ్నె ఉమర్!) ప్రపంచంలో ఒక అపరిచితునిలా లేదా బాటసారి మాదిరిగా జీవించు.” ఇంకా ఈ విధంగా చెప్పేవారని ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు – నువ్వు సాయంత్రాన్ని చూస్తే తెల్లవార్చేందుకు నిరీక్షించకు. తెల్లవారిస్తే సాయం సమయం కోసం ఎదురు చూడకు. ఆరోగ్యవంతునిగా ఉన్నప్పుడు అనారోగ్య స్థితిలో ఉపయోగపడే కొంత సామగ్రిని సమకూర్చుకో. జీవితంలోనే మరణ సన్నాహాలు మొదలెట్టు.”
(బుఖారీ)
English
Ibn 'Umar (RAA) narrated, ‘Allah’s Messenger (ﷺ) took hold of my shoulders and said, “Be in this world as though you were a stranger or a passerby.” Ibn ’Umar used to say, “If you are alive in the evening, do not expect to be alive till the morning and if you are alive in the morning do not expect to be alive till the evening, and take from your health for your sickness, and from your life for your death.” Related by Al-Bukhari.
సారాంశం
ఈ ప్రపంచం శాశ్వతం కాదనీ, ఇదొక క్షణభంగురమనీ ఈ హదీసులో చెప్పబడింది. అందుకే ఈ లోకంలో వున్న వారంతా ఒక ప్రయాణీకుని తరహాలో జీవించాలనీ, ప్రపంచం అతని శాశ్వత నివాస స్థలం కాదనీ, ఒక బాటసారి దారి మధ్య మజిలీలో ఉన్నట్లే తలపోయాలనీ, అందుకే ప్రాపంచిక వస్తువుల పట్ల అమితమైన మక్కువను పెంచుకోరాదనీ ఇందులో బోధించబడింది.
ఆరోగ్యవంతునిగా ఉన్నప్పుడు సామగ్రిని సమకూర్చుకోవటమంటే అర్థం – మనిషి వ్యాధిగ్రస్తుడైనపుడు తగు విధంగా ఆరాధనలు చేయలేడు. సత్కార్యాలలో చురుకుగా పాల్గొనలేడు. అందుకే ఆరోగ్య స్థితిని మహాభాగ్యంగా భావించి ముందుగానే చేయగలిగినన్ని మంచి పనులు చేసుకోవాలి.
జీవితంలోనే మరణ సన్నాహాలు మొదలెట్టడమంటే భావం; మృత్యువు కబళించిన తరువాత ఇక అతనికి సత్కార్యాలు చేసే, దానధర్మాలు చేసే అవకాశం లభించదు. ప్రపంచంలో జీవించి ఉండగా చేసుకున్న మంచిపనులే మరణానంతర జీవిత బ్యాంకులో జమ అయి ఉంటాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1268
హదీసు 1269
وَعَنِ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ تَشَبَّهَ بِقَوْمٍ, فَهُوَ مِنْهُمْ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ..
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “ఎవరయితే ఇతర జాతులను అనుకరించాడో అతడూ వారిలోని వాడే.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Ibn ’Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “He who imitates any people (in their actions) is considered to be one of them.” Related by Abu Dawud and Ibn Hibban graded it as Sahih.
సారాంశం
భావ దారిద్ర్యాన్ని ఈ హదీసు ఖండిస్తోంది. ఎంతసేపటికీ, అరువు వెల్తురుపై ఆధారపడి ఉండటం, ఇస్లామేతర ఆచార వ్యవహారాలను అనుకరించటం అత్యంత అయిష్టకరమైన విషయమని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. “అనుకరణ”కు సంబంధించిన ఈ అధ్యాయం చాలా విస్తృతమయింది. ఇందులో ఆరాధనలు, ఆచార వ్యవహారాలు, అన్నపానీయాలు, వస్త్రధారణ, అలంకరణ, సంప్రదాయాలు, అలవాట్లు, పోకడలు – మొదలగు విషయాలు చేరి ఉన్నాయి. ఈ విషయాలన్నింటిలోనూ అన్యులను అనుకరించరాదని హదీసు చెబుతోంది. స్థలాభావం వల్ల వాటిని సవివరంగా విశ్లేషించలేకపోతున్నాము. అల్లామా నాసిరుద్దీన్ అల్ బానీ తన గ్రంథమైన “హిజాబుల్ మర్అతిల్ ముస్లిమ”లో ఈ అంశంపై కూలంకషంగా చర్చించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1269
హదీసు 1270
وَعَنِ اِبْنِ عَبَّاسٍ قَالَ: كُنْتُ خَلْفَ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -يَوْمًا, فَقَالَ: { يَا غُلَامُ! اِحْفَظِ اَللَّهَ يَحْفَظْكَ, اِحْفَظِ اَللَّهَ تَجِدْهُ تُجَاهَكَ, وَإِذَا سَأَلْتَ فَاسْأَلْ اَللَّهَ, وَإِذَا اِسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاَللَّهِ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَقَالَ: حَسَنٌ صَحِيحٌ..
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక రోజు నేను దైవప్రవక్త ﷺ వెనుక నిలబడి ఉన్నాను. ఆయన ﷺ నన్నుద్దేశించి, “అబ్బాయి! నువ్వు దైవాదేశాలను కాపాడు. దేవుడు నిన్ను కనిపెట్టుకుని ఉంటాడు. నువ్వు అల్లాహ్ను మాత్రమే ధ్యానించు. ఆయన నీ ముందరే ఉన్నట్లు నీవు గ్రహిస్తావు. నువ్వు ఎప్పుడు ఏది అడిగినా (కేవలం) అల్లాహ్నే అడుగు. ఎప్పుడు సహాయమర్థించవలసి వచ్చినా అల్లాహ్ సహాయమే అర్థించు.” (తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. హసన్ మరియు సహీహ్గా పేర్కొన్నారు)
English
Ibn 'Abbas (RAA) narrated, ‘One day I was riding behind the Prophet when he said, “O lad, be mindful of Allah and He will protect you. Be mindful of Allah and you shall find Him with you. When you ask (for anything), ask it from Allah, and if you seek help, seek help from Allah.” Related by At-Tirmidhi who verified it as Hasan and Sahih.
సారాంశం
ఈ హదీసులో ‘ఏకేశ్వరోపాసన’ పాఠం సులభగ్రాహ్యమైన పద్ధతిలో చెప్పబడింది. దైవాదేశాలను కాపాడటమంటే భావం దేవుడు వేటిని సమ్మతించాడో వాటిని ఆచరించాలి. ఆయన నిషేధించినవాటి జోలికి పోకుండా జాగ్రత్తపడాలి. ఇతరులను కూడా అధర్మమయిన విషయాల నుండి ఆపాలి. ఈ విషయాల పట్ల శ్రద్ధ కనబరచిన వారిని దేవుడు సతతం దుష్టశక్తుల బారినుండి కాపాడుతూ ఉంటాడు. తీర్పుదినాన వారిని కనికరించి, నరకాగ్ని బారినుండి రక్షిస్తాడు.
ముస్నదె ఇమామ్ అహ్మద్లో పాందుపరచబడిన ఒక హదీసు ప్రకారం మహనీయ ముహమ్మద్ ﷺ ఇలా ఉద్బోధించారు – లోకవాసులంతా కలసి నిన్ను పాడుచేయాలన్నా, నీకు నష్టం కలిగించాలనుకున్నా వారు నీకెలాంటి కీడు, నష్టం కలిగించలేరు. వారు నీ స్థితిని చక్కబరచనూ లేరు. వారంతా కలసినా దేవుడు నీ కోసం రాసిపెట్టినంత మాత్రమే నీకు లాభం చేకూర్చగలుగుతారు. ఒకవేళ వారు నష్టం చేకూర్చదలచినా దేవుడు రాసి పెట్టినంత నష్టమే చేకూర్చగలుగుతారు. అందులో వారెలాంటి హెచ్చుతగ్గులు చేయలేరు. ఎందుకంటే విధి వ్రాత వ్రాసే వారి కలములు ఇంకిపోయాయి. రికార్డులు చుట్టి ఉంచి వేయబడ్డాయి. ఇప్పుడు వాటిని పెంచటంగానీ, తగ్గించటంగానీ సంభవం కాదు.”
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1270
హదీసు 1271
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: { جَاءَ رَجُلٌ إِلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ! دُلَّنِي عَلَى عَمَلٍ إِذَا عَمِلْتُهُ أَحَبَّنِي اَللَّهُ, وَأَحَبَّنِي اَلنَّاسُ. فَقَالَ: اِزْهَدْ فِي اَلدُّنْيَا يُحِبُّكَ اَللَّهُ, وَازْهَدْ فِيمَا عِنْدَ اَلنَّاسِ يُحِبُّكَ اَلنَّاسُ } رَوَاهُ اِبْنُ مَاجَه, وَسَنَدُهُ حَسَنٌ.
హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి ఇలా విన్నవించుకున్నాడు – “ఓ దైవప్రవక్తా ﷺ! దేనిని నేను ఆచరించటం వల్ల అల్లాహ్ నన్ను ఇష్టపడతాడో మరియు ప్రజలు నన్ను ప్రేమిస్తారో అలాంటి ఆచరణ గురించి నాకు ఉపదేశించండి.” దీనికి సమాధానంగా ఆయన ﷺ ఇలా ఉపదేశించారు: “ప్రపంచం పట్ల నిరపేక్షాభావం ఏర్పరచుకో. అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. జనుల దగ్గర ఉన్న దానిపై కూడా మక్కువ చూపకు. అప్పుడు జనులు కూడా నిన్ను ప్రేమించటం మొదలెడతారు.” (ఈ హదీసును ఇబ్నె మాజా తదితరులు ఉల్లేఖించారు. దీని పరంపర స్పష్టమైనది)
English
Sahl bin Sa'd (RAA) narrated, A man came to the Prophet and said, “O Allah`s Messenger (ﷺ), direct me to a deed which if I do it, I shall be loved by Allah and by people.” He replied, “If you practice abstinence in this world, Allah will love you, and if you abstain from (desiring) what people have, they will love you.” Related by Ibn Majah and others with a good chain of narrators.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1271
హదీసు 1272
وَعَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ - رضى الله عنه - قَالَ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: { إِنَّ اَللَّهَ يُحِبُّ اَلْعَبْدَ اَلتَّقِيَّ, اَلْغَنِيَّ, اَلْخَفِيَّ } أَخْرَجَهُ مُسْلِمٌ..
దైవప్రవక్త ﷺ ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) తెలిపారు – భయభక్తులు కలిగి, ప్రపంచం పట్ల మక్కువ చూపకుండా, పేరు ప్రతిష్ఠల కోసం ప్రాకులాడకుండా ఉండే దాసులను అల్లాహ్ తన నేస్తంగా చేసుకుంటాడు.” (ముస్లిం)
English
Sa'd bin Abi Waqqas (RAA) narrated, ‘l heard Allah's Messenger (ﷺ) saying, “Allah loves the pious rich maxim who is inconspicuous (free from showing off or hypocrisy).” Related by Muslim.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1272
హదీసు 1273
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مِنْ حُسْنِ إِسْلَامِ اَلْمَرْءِ, تَرْكُهُ مَا لَا يَعْنِيهِ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَقَالَ حَسَنٌ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “వ్యర్థమయిన, నిష్ప్రయోజనకరమైన విషయాలను మనిషి విడనాడటమే అతని ఇస్లాం ఉత్తమమైనదనడానికి ప్రబల నిదర్శనం.” (ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి, దీనిని హసన్గా ఖరారు చేశారు)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A sign of man's good observance of Islam (his piety) is to keep away from that which does not concern him.” Related by At-Tirmidhi who graded it as Hadith Hasan.
సారాంశం
దైవప్రవక్త ﷺ వారి పలుకుల్లో కొన్ని పలుకులు చాలా క్లుప్తంగా ఉంటాయి గాని అవి అత్యంత సమగ్రంగా కూడా ఉంటాయి. ఈ ప్రవచనం కూడా ఆ కోవకు చెందినదే. ప్రపంచంలో మనిషి జీవన ధ్యేయం దైవారాధన. ఒక నిజమైన విశ్వాసి ఎన్నడూ నిరర్థకమైన, నిష్ప్రయోజనకరమయిన పని చెయ్యడు. అతని ‘విశ్వాసం’ ఇలాంటి వాటిని చేయమని కాంక్షించదు కూడా. అతనీ ప్రపంచంలో కాలక్షేపం కోసం రాలేదు. పైగా అతను దైవారాధన కోసం, దైవప్రసన్నతను చూరగొనే నిమిత్తం ఉనికిలోకి తేబడ్డాడు. కాబట్టి జీవిత ధ్యేయానికి, సంస్కరణాసరణికి విరుద్ధమైన ఏ పనయినాసరే అది క్రియాశూన్యంగా, బూటకంగానే పరిగణించబడుతుంది. నిజ దాసుడు ఇలాంటి వృథాపనులకై కాలాన్ని నాశనం చేయడు. ఎందుకంటే దేవుడు ఇలాంటి వ్యర్థ విషయాలను ఇష్టపడడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1273
హదీసు 1274
وَعَنْ اَلْمِقْدَامِ بْنِ مَعْدِيكَرِبَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَا مَلَأَ ابْنُ آدَمَ وِعَاءً شَرًّا مِنْ بَطْنٍ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ..
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ మిఖ్దామ్ బిన్ మాదీ కరిబ్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: మనిషి అదేపనిగా నింపుకునే అత్యంత దుర్భరమైన కంచం అతని పొట్ట మాత్రమే.” (తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. దీనిని హసన్గా ఖరారు చేశారు)
English
Al-Miqdam bin Ma’diakrib (RAA), narrated that Allah's Messenger (ﷺ) said: “A human being has never filled any vessel which is worse than his own belly.” Related by At-Tirmidhi, who graded it to be Hasan.
సారాంశం
మితిమీరిన తిండి కూడా ఒక దురలవాటేనని ఈ హదీసులో చెప్పబడింది. మనిషి జీవిక కోసం తిండి అవసరమే. పైగా అతని ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారం కూడా అవసరమే. అయితే అది కూడా లెక్క ప్రకారమే ఉండాలి. తన దగ్గర ఉందికదా అని లేదా తేరగా వచ్చిపడింది కదా అని అదేపనిగా నింపుకోరాదు. ఈ ‘అతి’ అనేక అనర్థాలకు దారితీస్తుంది. మనిషి ఉదరం అనేక రోగాలకు జన్మస్థానం. వంటిది. ఉదరం బావుంటే శరీరమంతా బావుంటుంది. మనిషి చురుకుగా ఉంటాడు. అందుకే అన్న పానీయాల విషయంలో రెండు అతివాదాలకు నడుమ మధ్యేమార్గాన్ని అనుసరించాలి. బాగా ఆకలైనపుడే భుజించాలి. కడుపు పూర్తిగా నిండకముందే భోజనాన్ని ముగించాలి.
అతిగా భుజించేవాని పొట్ట వ్యాకోచిస్తుంది. స్థూలకాయం వస్తుంది. మెదడు మొద్దుబారిపోతుంది. అదీగాక అటువంటి వ్యక్తి సమాజం దృష్టిలో తిండిపోతుగా భావించబడతాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1274
హదీసు 1275
وَعَنْ أَنَسٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ كُلُّ بَنِي آدَمَ خَطَّاءٌ, وَخَيْرُ اَلْخَطَّائِينَ اَلتَّوَّابُونَ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ مَاجَهْ, وَسَنَدُهُ قَوِيٌّ..
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ప్రతి ఆదం పుత్రుడూ దోషం ఉన్నవాడే. అయితే అత్యధికంగా పశ్చాత్తాపం చెందే వారే దోషుల్లో ఉత్తములు. (తిర్మిజీ, ఇబ్నెమాజా ఈ హదీసును ఉల్లేఖించారు. దీని పరంపర దృఢమైనది)
English
Anas (RAA) narrated that Allah's Messenger (ﷺ) said: “All the sons of Adam are sinners, but the best of sinners are those who repent often.” Related by At·Tirmidhi and Ibn Majah with a strong chain of narrators.
సారాంశం
ఏ మనిషీ నిర్దోషి, నిరపరాధి కాజాలడనీ, ప్రతి ఒక్కరిలోనూ లోపాలు, బలహీనతలుండటం సహజమని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. దోష రహితులు కేవలం దైవ ప్రవక్తలు మాత్రమే. దేవుడు తన కృపతో వారిని మహాపరాధాల నుంచి రక్షించుకుంటాడు. సాధారణ జనులకు మాత్రం ఈ సూత్రం వర్తించదు. తప్పు జరగటం మానవ సహజం. అయితే తన వల్ల జరిగిన తప్పులపై మానవుడు సిగ్గుతో కుంచించుకుపోతూ దైవసమక్షంలో క్షమాభిక్ష వేడుకోవాలి. ఆ తప్పులు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ఇదే సిసలయిన పశ్చాత్తాపం. ఈ విధంగా పశ్చాత్తాపం చెందే దాసుల్ని అల్లాహ్ అమితంగా ప్రేమిస్తాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1275
హదీసు 1276
وَعَنْ أَنَسٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلصَّمْتُ حِكْمَةٌ, وَقَلِيلٌ فَاعِلُهُ } أَخْرَجَهُ اَلْبَيْهَقِيُّ فِي " اَلشُّعَبِ" بِسَنَدٍ ضَعِيفٍ. وَصَحَّحَ أَنَّهُ مَوْقُوفٌ مِنْ قَوْلِ لُقْمَانَ اَلْحَكِيمِ..
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలిపారు – “నిశ్శబ్దంగా ఉండటం విజ్ఞతా వివేచనలకు నిదర్శనం. అయితే ఈ విధానాన్ని అవలంబించేవారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు.” (దీనిని బైహఖీ షోబుల్ ఈమాన్లో బలహీన పరంపరతో ఉల్లేఖించారు. వాస్తవానికి ఇది హకీమ్ లుఖ్మాన్ పలుకు)
English
Anas (RAA) narrated that Allah's Messenger (ﷺ) said: “Keeping silent is considered as (an act of`) wisdom, but very few practice it.” Related by Al-Baihaqi in his book Shu'ab al-Iman with a weak chain of narrators a he deemed the sound view is that it is traced back to one of the companions who quoted it from Luqman Al-Hakim.
సారాంశం
వీలయినంతవరకు నిశ్శబ్దంగా ఉండటం, మౌనం వహించటం వివేకంతో, యుక్తితో కూటుకున్న విషయమని ఈ హదీసులో చెప్పబడింది. ఈ విధానాన్ని అవలంబించే వారు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారని కూడా చెప్పబడింది. ఇది నిజానికి హజ్రత్ లుఖ్మాన్ అలైహిస్సలాం ప్రవచనం అయినప్పటికీ ఎన్నో హదీసుల ద్వారా మౌనంగా ఉండటానికి సమర్థన లభిస్తోంది. అనవసర సంభాషణ, అధిక ప్రసంగం, వ్యర్థ ప్రలాపనలు ఖండించబడ్డాయి. “నిశ్శబ్దంగా ఉన్నవాడు మోక్షం పొందాడు” అన్న హదీసు ఈ సందర్భంగా గమనించదగినది. “ఎవరయినా మాట్లాడితే నిత్యం మంచి మాటలే మాట్లాడాలి. లేకపోతే ఊరుకోవాలి” అన్న హదీసు కూడా గమనార్హమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.3 సాత్వికత, ధర్మనిష్ఠ|హదీసు 1276
You must be logged in to post a comment.