హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 16. వివిధ విషయాల పుస్తకం, 2వ అధ్యాయం: సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల. ఈ అధ్యాయంలో 14 హదీసులు (హదీసు 1252 – 1265) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల
باب البر والصلة
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1252
عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ أََحَبَّ أَنْ يُبْسَطَ لَهُ فِي رِزْقِهِ, وَأَنْ يُنْسَأَ لَهُ فِي أَثَرِهِ, فَلْيَصِلْ رَحِمَهُ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు- “ఎవరయితే తన ఉపాధిలో సమృద్ధి, విస్తృతి నొసగబడాలనీ మరియు దీర్ఘాయుషు ప్రాప్తించాలని కోరుకుంటాడో అతను బంధుత్వ సంబంధాలను పెంపొందించాలి.” (బుఖారీ)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “He who wishes to have his earnings grow (and be blessed) and his term of life prolonged, he should keep ties with his kin” Related by Al-Bukhari.
సారాంశం
ఈ హదీసులో ‘సిలారహ్మీ’ గురించి నొక్కి వక్కాణించబడింది. సిలా రహ్మీ అంటే సమీప బంధువుల, ఆత్మీయుల పట్ల మంచిగా మెలగటం, వారికి ఉపకారం చేయటం, వారిని విడదీసే బదులు సాధ్యమైనంతవరకు వారిని కలపటానికి ప్రయత్నించటం అని అర్థం. ఈ కలుపుగోలుతనం అటు తన వంశస్థులతో పాటు, అత్తవారి తరపు బంధువులకు కూడా వర్తిస్తుంది. వారందరి యెడల ప్రేమగా మెలగాలి. వారికి ఉన్నంతలోనే చక్కగా మర్యాద చేయాలి. వారి తరపున బాధాకరమైన సంఘటనలు ఎదురైనప్పటికీ మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఈ విధంగా ‘మేలు’ చేసేవారి జీవితం సాఫీగా సాగుతుంది. వారి జీవితాన్ని అల్లాహ్ ఒడిదుడుకుల నుండి, వ్యాకులత నుండి రక్షిస్తాడు. ఆయన వారి దృష్టిలో వారు ఆదరణీయులుగా నెగ్గుకు వస్తారు. మరణించిన పిదప కూడా ఆత్మీయులు అతన్ని మనసున్న మంచి మనిషిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1252
హదీసు 1253
وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يَدْخُلُ اَلْجَنَّةَ قَاطِعٌ } يَعْنِي: قَاطِعَ رَحِمٍ. مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ జుబైర్ బిన్ ముత్యిమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “బంధుత్వ సంబంధాలను త్రెంచేవాడు స్వర్గంలో ప్రవేశించడు.” (బుఖారీ, ముస్లిం)
English
Jubair bin Mut'am (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The one who severs the ties of kinship will not enter Paradise.” Agreed upon.
సారాంశం
బంధుత్వ సంబంధాల విచ్ఛిన్నానికి పాల్పడేవారి దుష్పరిణామం గురించి ఈ హదీసు హెచ్చరిస్తోంది. ‘ఖతె రహ్మీ’ (సంబంధాల విచ్ఛిత్తి) మహాపరాధం, ఘోరపాపం. ఈ పాపానికి ఒడిగట్టిన వ్యక్తి వెంటనే స్వర్గ ప్రవేశానికి అర్హత పొందలేడు. ఏ మేరకు అతడు సంబంధాలను చెడగొట్టాడో ఆ మేరకు శిక్ష అనుభవించిన మీదటే స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1253
హదీసు 1254
وَعَنْ اَلْمُغِيرَةِ بْنِ شُعْبَةَ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { إِنَّ اَللَّهَ حَرَّمَ عَلَيْكُمْ عُقُوقَ اَلْأُمَّهَاتِ, وَوَأْدَ اَلْبَنَاتِ, وَمَنْعًا وَهَاتِ, وَكَرِهَ لَكُمْ قِيلَ وَقَالَ, وَكَثْرَةَ اَلسُّؤَالِ وَإِضَاعَةَ اَلْمَالِ } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రవచించారు : మీరు మీ తల్లులకు అవిధేయత చూపటాన్ని, ఆడపిల్లలను సజీవ దహనం చేయటాన్ని, పరోపకారం చేయకపోవటాన్ని, ఇతరుల ముందు చేయి చాచి అర్థించటాన్ని అల్లాహ్ నిషేధించాడు. ఇంకా అధిక ప్రేలాపనలను, అధికంగా ప్రశ్నించటాన్ని, ధనాన్ని దుర్వినియోగపరచడాన్ని కూడా అల్లాహ్ ఇష్టపడడు.” (బుఖారీ, ముస్లిం)
English
Al-Mughirah bin Shu'bah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Allah has made it prohibited for you to be disrespectful (showing undutiful behavior) to your mothers, to bury your daughters alive, to refuse others (their dues), and to demand things from others (which are not worth demanding), and He hates that you engage in gossip, asking many questions about people’s affairs and wasting wealth.” Agreed upon.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1254
హదీసు 1255
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرٍو -رَضِيَ اَللَّهُ عَنْهُمَا-, عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { رِضَا اَللَّهِ فِي رِضَا اَلْوَالِدَيْنِ, وَسَخَطُ اَللَّهِ فِي سَخَطِ اَلْوَالِدَيْنِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ وَالْحَاكِمُ..
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: తల్లిదండ్రుల ప్రసన్నతలో దైవప్రసన్నత ఇమిడి ఉంది. తల్లిదండ్రుల అప్రసన్నత దేవుని అప్రసన్నతకు మూలమవుతుంది.” (దీనిని తిర్మిజీ సేకరించారు. ఇబ్నె హిబ్బాన్, హాకీములు ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
'Abdullah bin 'Amro bin al-As (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Allah’s pleasure results from the parent’s pleasure, and Allah’s displeasure results from the parent’s displeasure.” Related by At-Tirmidhi. Ibn Hibban and al-Hakim graded it as Sahih.
సారాంశం
తల్లిదండ్రులను ప్రసన్నుల్ని చేయాలనీ, వాళ్ళు అప్రసన్నతకు, ఆగ్రహానికి కారకులు కారాదని ఈ హదీసు చెబుతోంది. అయితే ఒకవేళ దేవుని ధిక్కారానికి, షిర్క్కి సంబంధించిన పనుల వైపునకు తల్లిదండ్రులు పురికొల్పితే మాత్రం వారి మాట విననవసరం లేదు. అధర్మ విషయాలలో తల్లిదండ్రుల పురమాయింపులను లెక్క చేయకూడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1255
హదీసు 1256
وَعَنْ أَنَسٍ - رضى الله عنه - عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { وَاَلَّذِي نَفْسِي بِيَدِهِ لَا يُؤْمِنُ عَبْدٌ حَتَّى يُحِبَّ لِجَارِهِ - أَوْ لِأَخِيهِ- مَا يُحِبُّ لِنَفْسِهِ } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : “ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ పవిత్రమూర్తి సాక్షిగా చెబుతున్నాను – తన స్వయం కొరకు ఇష్టపడేదే తన ఇరుగు పొరుగు లేక తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ ఏ దాసుడూ విశ్వాసి (మోమిన్) కాలేడు.” (బుఖారీ, ముస్లిం)
English
Anas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “By Him in Whose Hand my soul is, a slave of Allah does not truly believe till he wishes for his neighbor what he wishes for himself.” Agreed upon.
సారాంశం
ఈ హదీసులో విశ్వాస పరిపూర్ణత కొరకు ఒక షరతు విధించబడింది. అదేమంటే విశ్వాసి అయినవాడు తన కోసం ఇష్టపడే వస్తువునే తన పొరుగువారి కోసం లేదా తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి. సమాజంలో తన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించాలని అతను కాంక్షిస్తున్నపుడు ఇతరులు కూడా అలాగే కోరుకుంటారని అతడు తలపోయాలి. కనుక ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు తన తరపున విఘాతం కలగకుండా చూసుకోవాలి. తనకు శాంతి సౌఖ్యాలు ప్రాప్తించాలని కోరుకున్నప్పుడు సాటి వ్యక్తుల కోసం కూడా అదేవిధంగా ఆలోచించాలి. వ్యక్తుల్లో ఇలాంటి సకారాత్మక ఆలోచనలున్నప్పుడు సమాజమంతా సుఖశాంతులకు నిలయమవుతుంది. ప్రగతి పథంలో సాఫీగా సాగిపోతుంది. అశాంతి అలజడులుండవు. ఒకరింకొకరి శ్రేయస్సును అభిలషించే వారుగా, ఒండొకరి యెడల సానుభూతిపరులుగా ఉంటారు. ఒక సత్సమాజానికి ఉండవలసిన ప్రధాన లక్షణమిదే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1256
హదీసు 1257
وَعَنْ اِبْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ سَأَلْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -أَيُّ اَلذَّنْبِ أَعْظَمُ? قَالَ: { أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا, وَهُوَ خَلَقَكَ. قُلْتُ ثُمَّ أَيُّ? قَالَ: ثُمَّ أَنْ تَقْتُلَ وَلَدَكَ خَشْيَةَ أَنْ يَأْكُلَ مَعَكَ. قُلْتُ: ثُمَّ أَيُّ? قَالَ: ثُمَّ أَنْ تُزَانِيَ بِحَلِيلَةِ جَارِكَ } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: “అన్నింటికన్నా పెద్దపాపం ఏది?” అని నేను దైవప్రవక్త ﷺను అడిగాను. దానికి ఆయన ﷺ, “అల్లాహ్ నిన్ను సృష్టించిన వాడైనప్పటికీ, నువ్వు ఆయనకు సహవర్తునిగా ఇతరులను నిలబెట్టడం (మహాపరాధం)” అని సెలవిచ్చారు. “ఆ తరువాత (పెద్ద పాపం) ఏది?” అని మళ్ళీ ప్రశ్నించగా, “మీతో కలిసి తినేస్తారేమోనన్న భయం కొద్దీ నువ్వు నీ సంతానాన్ని హతమార్చటం” అని ఆయన ﷺ బదులిచ్చారు. “ఆ తరువాత (పెద్దపాపం) ఏది?” అని నేను తిరిగి ప్రశ్నించగా, “నువ్వు నీ పొరుగు నున్నవాని భార్యతో వ్యభిచరించటం” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం)
English
Ibn Mas'ud (RAA) narrated, ‘l asked the Messenger of Allah (ﷺ) “Which sin is the most serious?” He replied, attribute a partner to Allah, though He Alone has created you. “I asked, “What next?” He said, kill your child, fearing that he will share your food with you.” I asked again, “What next?” He said, “To commit adultery with your neighbor’s wife.” Agreed upon.
సారాంశం
ఈ హదీసులో మూడు ముఖ్య విషయాలున్నాయి. (1) నిజ ప్రభువుకు ఇతరుల్ని భాగస్వాములుగా కల్పించటం. (2) దారిద్ర్య భయంతో సంతానాన్ని హత్యచేయటం. (3) పొరుగింటాయన ఇల్లాలితో కులకటం – ఇవి మూడూ ఘోర పాపాలుగా సూచించబడ్డాయి. వీటిలో మొదటిది దేవుని హక్కు అయితే మిగిలిన రెండూ దాసుల హక్కులు.
‘షిర్క్’ చాలా పెద్ద పాపం అన్న సంగతి తెలిసిందే. దానితోపాటు మనిషి తన సంతానం ఉనికిని సయితం భరించలేకపోవటం, అకారణంగా తన సంతానం ఈ లోకంలోకి రాకుండా అడ్డుకోవటం కూడా మహాపరాధమే. అక్రమ లైంగిక సంబంధం కూడా అటువంటిదే. అసలు వ్యభిచారమే నీతి బాహ్యమైన చేష్ట. అందునా ఒక పొరుగింటి వనితతో అక్రమ సంబంధం పెట్టుకోవటమంటే అది మరింత ఘోరం అవుతుంది. ఇందులో నమ్మకద్రోహం కూడా ఉంది. మనిషి ఎంత దుర్మార్గుడైనప్పటికీ అతడు తన ఉనికి ద్వారా ఇరుగు పొరుగువారికి అభయం, రక్షణ కల్పించటం అతని కనీస బాధ్యత. దానికి బదులు అతడు పొరుగింటావిడపైనే కన్నేసి కాటేస్తే అది పరమ దుర్మార్గం క్రిందికి వస్తుంది. కంచే చేను మేస్తే ఇంక దాన్నెవరు కాపాడతారు? – దేవుడు తప్ప!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1257
హదీసు 1258
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { مِنْ اَلْكَبَائِرِ شَتْمُ اَلرَّجُلِ وَالِدَيْهِ. قِيلَ: وَهَلْ يَسُبُّ اَلرَّجُلُ وَالِدَيْهِ? قَالَ: نَعَمْ. يَسُبُّ أَبَا اَلرَّجُلِ, فَيَسُبُّ أَبَاهُ, وَيَسُبُّ أُمَّهُ, فَيَسُبُّ أُمَّهُ } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ప్రవచనం : “తమ తల్లిదండ్రులను దూషించటం (కూడా) పెద్ద పాపాలలోనిదే.” “ఏమిటీ, తమ తల్లిదండ్రులను దూషించే వారు కూడా ఉంటారా?” అని ఎవరో ప్రశ్నించగా, “అవును! ఇతను వేరొకరి తండ్రిని తిడతాడు. దానికి బదులుగా అతడు ఇతగాని తండ్రిని తిట్టిపోస్తాడు. ఇతను వేరొకరి తల్లిని దుర్భాషలాడగా జవాబుగా అతనేమో ఇతని తల్లిని దూషిస్తాడు.” (బుఖారీ, ముస్లిం)
English
'Abdullah bin 'Amro bin al-As (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “For a man to insult his parents, is one of the major sins.” It was asked, ‘Does a man insult his parents?’ He replied “Yes, he insults the father of a man who in return insults his father, and he insults a man’s mother who in return insult his.” Agreed upon.
సారాంశం
ఏదైనా ఒక పనికి లేదా సంఘటనకు ఎవరయినా కారకులైనట్లయితే అతడు స్వయంగా దానికి పాల్పడినట్లేనని ఈ హదీసునుబట్టి అర్థమవుతున్నది. వేరే మాటల్లో చెప్పాలంటే అధర్మమైన విషయానికి దోహదపడే విషయాలన్నీ అధర్మమైనవే. అధర్మమైన విషయంలో సహకరించే వ్యక్తి సంకల్పం ఎంత మంచిదైనప్పటికీ అతడు ఆ పాపం నుంచి తప్పించుకోలేడు. దాని పరిణామం హరామ్ (అధర్మం) అయిన కారణంగా దానితో ముడిపడి ఉన్న ప్రతిదీ హరామే అవుతుంది. కాబట్టి మన తల్లిదండ్రులను దూషణల, దుర్భాషల నుండి మనం కాపాడదలచుకుంటే ఇతరుల తల్లిదండ్రుల్ని దూషించకుండా ముందుగా జాగ్రత్తపడాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1258
హదీసు 1259
وَعَنْ أَبِي أَيُّوبَ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { لَا يَحِلُّ لِمُسْلِمٍ أَنْ يَهْجُرَ أَخَاهُ فَوْقَ ثَلَاثِ لَيَالٍ يَلْتَقِيَانِ, فَيُعْرِضُ هَذَا, وَيُعْرِضُ هَذَا, وَخَيْرُهُمَا اَلَّذِي يَبْدَأُ بِالسَّلَامِ } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ అబూ అయ్యాబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “తన సోదరునితో మూడు రోజులకన్నా ఎక్కువగా సంబంధాన్ని త్రెంచుకోవటం, ఇద్దరూ ముఖాముఖీ అయినపుడు ఎడమొహం పెడమొహం పెట్టుకోవటం ఏ ముస్లిం కొరకూ ధర్మసమ్మతం కాదు. వారిద్దరిలో ఎవరు ‘సలాం’లో ముందంజ వేస్తాడో అతడే ఉత్తముడు.” (బుఖారీ, ముస్లిం)
English
Abu Aiyub (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “It is not permissible for a Muslim to shun his brother for more than three nights. When they meet, this one turns away (from that one) and that one turns away (from this one) and the best of them is the one who greets his brother first.” Agreed upon
సారాంశం
ఇద్దరు ముస్లింలు వ్యక్తిగత వ్యవహారాలలో తగాదాపడితే మూడు రోజుల్లోపు వారు తమ అంతరాలను తొలగించుకుని మామూలు స్థితిని ఏర్పరచుకోవాలి. ఒకవేళ వారి తగాదాకు కారణం ధర్మాధర్మాల వ్యవహారం అయివుంటే దానికి బహుశా ఒక హద్దు లేదు. జీవితాంతం సంబంధాలను తెగత్రెంపులు చేసుకున్నట్లు ప్రవక్త ప్రియ సహచరుల ఉపమానాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ధర్మాధర్మాల వ్యవహారం విశ్వాసం (ఈమాన్)తో ముడిపడివున్న వ్యవహారం. ఆ కారణం నెలకొని ఉన్నంత కాలం తెగత్రెంపులకు ఆస్కారముంటుంది. తెగత్రెంపులకు ఆధారభూతమైన సదరు కారణం సమసి పోయినపుడు – సంస్కరణ జరిగినపుడు – సంబంధాలను వెంటనే పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే నిజమయిన విశ్వాసి దృష్టిలో పరస్పర సంబంధాలకు ప్రమాణ నికషం దైవప్రసన్నతేగాని ప్రాపంచిక స్వార్థ ప్రయోజనాలు కావు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1259
హదీసు 1260
عَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ..
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని పుణ్యకార్యమే (సదఖాయే).” (బుఖారీ)
English
Jabir bin ’Abdullah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Every act of goodness is (considered as) Sadaqah.” Related by Al-Bukhari.
సారాంశం
‘సదఖా’ అంటే కేవలం ధనపరమైన దానమే కాదనీ, పరోపకారంతో కూడుకున్న ప్రతి మంచి పని సదఖాయేననీ ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది.
తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్లలో అబూదావూద్చే ఉల్లేఖించబడిన హదీసు ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “నీ సోదరుని సమక్షంలో చిరునవ్వును చిందించటం కూడా పుణ్యకార్యమే. ఒక మంచి పని వైపునకు అతనికి మార్గదర్శకత్వం చేయటం, అధర్మమైన ఒక పని నుండి అతణ్ణి ఆపటం కూడా పుణ్యకార్యమే. దారితప్పిన వాడికి దారి చూపించటం కూడా పుణ్యకార్యమే. ఆఖరికి; బాటసారుల బాధను తొలగించే సంకల్పంతో మార్గంలోని ఎముకలను, ముళ్ళను తొలగించటం కూడా పుణ్యకార్యమే. తన బొక్కెనతో తన సోదరుని బొక్కెనలో కొద్ది నీరు పోసినా, అదీ పుణ్యకార్యమే అవుతుంది.”
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1260
హదీసు 1261
وَعَنْ أَبِي ذَرٍّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا تَحْقِرَنَّ مِنْ اَلْمَعْرُوفِ شَيْئًا, وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ }
హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఏ సత్కార్యాన్నీ అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి – ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించటాన్నయినా సరే.”
English
Abu Dharr (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Do not consider any act of goodness as being insignificant even if it is meeting your brother with a cheerful face.” Related by Muslim.
సారాంశం
ఏమీ చేయలేకపోయినా – కనీసం ఒక మంచి మాట మాట్లాడటం, ఎదుటివారిని ఆకట్టుకునే రీతిలో నవ్వుతూ పలకరించటం కూడా సత్కార్యం క్రిందికే వస్తుందని ఈ హదీసు చెబుతోంది. ఏ విషయాలనయితే మనం అతి స్వల్పమైనవిగా ఊహించుకుని ఉపేక్షిస్తామో అవే ఒక్కోసారి మనల్ని ప్రజల నుండి దూరం చేసేస్తాయి. పిసినారిగా, గర్విష్ఠిగా మనల్ని నిలబెడతాయి. అందుకే మనం తోటి సోదరుల్ని పలకరించినా, తోటివారు మనల్ని పలకరించినా పరధ్యానంతో మాట్లాడరాదు. మాట్లాడేటప్పుడు ముఖంపై అసహనం, ఆగ్రహం వ్యక్తమవకూడదు. భృకుటి ముడివడకూడదు. నుదురు చిట్లించరాదు. కసురుకోవటం, చీకాకు పడటం వంటివి చేయకూడదు. విముఖత అసలే పనికిరాదు. మన ముఖ కవళికల ద్వారా, హావభావాల ద్వారా వీలయినంత వరకు సంతోషాన్ని, తృప్తినీ అభివ్యక్తం చేయాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1261
హదీసు 1262
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا طَبَخْتَ مَرَقَةً, فَأَكْثِرْ مَاءَهَا, وَتَعَاهَدْ جِيرَانَكَ } أَخْرَجَهُمَا مُسْلِمٌ..
ఈయనగారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “మీరు చారులాంటిది వండినపుడు అందులో కాస్త నీరు ఎక్కువగా పోయండి. కాని మీ పొరుగువారిని కనిపెడుతూ ఉండండి.” (ఈ రెండు హదీసులనూ ‘ముస్లిం’ పొందుపరచారు)
English
Abu Dharr (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When you make some soup, make a good amount by adding plenty of liquid, and give some to your neighbors.” Related by Muslim.
సారాంశం
ఈ హదీసులో ఇరుగు పొరుగు వారి హక్కును నొక్కి చెప్పటం జరిగింది. కూర వండేటప్పుడు, మాంసాహారం తయారు చేసేటప్పుడు రోస్ట్, ఇగురు వంటివి చేసేబదులు షేర్వా, సూప్లాంటివి తయారు చేసుకోవాలనీ, అయితే పొరుగింటివారిని మాత్రం విస్మరించరాదని దీని భావం. అందునా ఇరుగు పొరుగువారు పేదవారైనపుడు వారికి కానుకగా పంపటం తప్పనిసరి. ఒకవేళ పొరుగింటివారు ధనవంతులై ఉంటే అప్పుడప్పుడూ సత్సంబంధాల కోసమైనా సరే పంపుతూ ఉండాలి.
వేరొక హదీసులో దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : దైవదూత జిబ్రయీల్ (అలైహిస్సలాం) నా వద్దకు వచ్చినప్పుడల్లా పొరుగువారి హక్కును గురించి గట్టిగా నొక్కి చెబుతుండేవారు. ఆయన నొక్కి వక్కాణిస్తున్న తీరునుబట్టి బహుశా పొరుగువారిని (ఆస్తిలో) వారసులుగా ప్రకటించటం జరుగుతుందా! అని నాకు ఒకింత సందేహం కలిగేది.”
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1262
హదీసు 1263
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ نَفَّسَ عَنْ مُسْلِمٍ كُرْبَةً مِنْ كُرَبِ اَلدُّنْيَا, نَفَّسَ اَللَّهُ عَنْهُ كُرْبَةً مِنْ كُرَبِ يَوْمِ اَلْقِيَامَةِ , وَمَنْ يَسَّرَ عَلَى مُعْسِرٍ, يَسَّرَ اَللَّهُ عَلَيْهِ فِي اَلدُّنْيَا وَالْآخِرَةِ, وَمَنْ سَتَرَ مُسْلِمًا, سَتَرَهُ اَللَّهُ فِي اَلدُّنْيَا وَالْآخِرَةِ, وَاَللَّهُ فِي عَوْنِ اَلْعَبْدِ مَا كَانَ اَلْعَبْدُ فِي عَوْنِ أَخِيهِ } أَخْرَجَهُ مُسْلِمٌ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఎవరయినా సరే ప్రపంచంలోని ఆపదల్లో నుంచి, ఏదేని ఒక ఆపదనుంచి ఏ ముస్లింనయినా గట్టెక్కిస్తే అల్లాహ్ ప్రళయ దినాన ప్రళయదినపు గండాలలోని ఏదేని ఒక గండం నుంచి అతన్ని గట్టెక్కిస్తాడు. ఎవరయినా ప్రాపంచికంగా లేమికి గురైన ఒక వ్యక్తికి వెసులుబాటు కల్పిస్తే అల్లాహ్ ఇహపరాలలో అతని కోసం వెసులుబాటును కల్పిస్తాడు. ఎవరయినా ఒక ముస్లిం బలహీనతను కప్పిపుచ్చితే అల్లాహ్ ఇహపరాలలో అతని లోగుట్టుపై ఆచ్ఛాదన వేసి ఉంచుతాడు. ఒక దాసుడు తోటి సోదరునికి సాయపడుతూ ఉన్నంత కాలం దేవుడు అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు.” (ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If anyone relieves a Muslim believer from one of the hardships of this worldly life, Allah will relieve him of one of the hardships of the Day of Resurrection. If anyone makes it easy for the one who is indebted to him (while finding it difficult to repay), Allah will make it easy for him in this worldly life and in the Hereafter, and if anyone conceals the faults of a Muslim, Allah will conceal his faults in this world and in the Hereafter. Allah helps His slave as long as he helps his brother.” Related by Muslim.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1263
హదీసు 1264
وَعَنْ اِبْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ دَلَّ عَلَى خَيْرٍ, فَلَهُ مِثْلُ أَجْرِ فَاعِلِهِ } أَخْرَجَهُ مُسْلِمٌ..
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “ఎవరయినా ఒకరికి శ్రేయస్కరమైన, మేలుతో కూడుకున్న మార్గాన్ని చూపిస్తే అతనికి సయితం సన్మార్గాన్ని అవలంబించిన వానికి సమానంగా పుణ్యం లభిస్తుంది.” (ముస్లిం)
English
Ibn Mas'ud (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “He who guides (others) to an act of goodness, will have a reward similar to that of its doer.” Related by Muslim.
సారాంశం
ఒక వ్యక్తికి మంచి మార్గం చూపిస్తే ఆ వ్యక్తికి జీవితం ఎలాగూ బాగుపడుతుంది. అయితే మంచి మార్గం చూపిన వ్యక్తికి సయితం మంచి మార్గంపై నడిచేవానికి సమానంగా పుణ్యం సంపాదిస్తాడని అనటం గమనార్హ విషయం. ఆ మంచి మార్గం వైపునకు ప్రత్యక్షంగా దర్శకత్వం వహించినా, పరోక్షంగా వహించినా పుణ్యం ప్రాప్తించటమనేది మాత్రం తథ్యం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1264
హదీసు 1265
وَعَنْ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- عَنِ النَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { مِنْ اسْتَعَاذَكُمْ بِاَللَّهِ فَأَعِيذُوهُ, وَمَنْ سَأَلَكُمْ بِاَللَّهِ فَأَعْطُوهُ, وَمَنْ أَتَى إِلَيْكُمْ مَعْرُوفًا فَكَافِئُوهُ, فَإِنْ لَمْ تَجِدُوا, فَادْعُوا لَهُ } أَخْرَجَهُ اَلْبَيْهَقِيُّ..
దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: “మీలో ఎవరైనా సరే అల్లాహ్ పేరుతో శరణు కోరితే అతనికి రక్షణ కల్పించండి. అల్లాహ్ పేరుతో ఎవరు అర్థించినా వారికి సాయపడండి. మీ యెడల ఎవరు ఉత్తమంగా వ్యవహరించినా దానికి బదులుగా మీరు కూడా వారి యెడల ఉత్తమంగా మసలుకోండి. ఒకవేళ మీలో అంతటి స్తోమత లేకపోతే వారి మేలు కోరుతూ ప్రార్థించండి.” (సుననె బైహఖీ)
English
Ibn Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “If anyone seeks refuge in Allah’s name, grant him protection; if anyone asks you for something in Allah’s name give him something; and if anyone does you a favor recompense him, but if you do not have the means to do so, make Dua (supplication) for him.” Related by Al-Baihaqi.
సారాంశం
ఈ హదీసులో దేవుని పేరుతో సాయం కోరిన వారిని ఆదుకోవాలనీ, ఉపకారానికి ‘బదులు’ను ఉత్తమ రీతిలో తిరిగి ఇవ్వాలనీ తాకీదు చేయబడింది. అయితే దేవుని పేరుతో వేరొకరి సాయం కోరేవారు ఆచితూచి మరీ సాయం కోరాలి. ఎదుటివాడు అతని అవసరాన్ని తీర్చలేనంత క్లిష్టమయిన సాయం కోరి అతన్ని ఇరకాటంలో పెట్టకూడదు. దేవుని ప్రస్తావన తీసుకువచ్చి ఇబ్బందికరమైన రీతిలో సాయం కోరేవారిని అల్లాహ్ సుతరామూ ఇష్టపడడని వేరొక హదీసు ద్వారా తెలుస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.2 సత్కార్యం, బంధుత్వ సంబంధాల పెంపుదల|హదీసు 1265
You must be logged in to post a comment.