హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 16. వివిధ విషయాల పుస్తకం, 16.1: వినయ వినమ్రతలు. ఈ అధ్యాయంలో 16 హదీసులు (హదీసు 1236 – 1251) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
16.1 వినయ వినమ్రతలు
باب الأدب
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1236
عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ حَقُّ اَلْمُسْلِمِ عَلَى اَلْمُسْلِمِ سِتٌّ: إِذَا لَقِيتَهُ فَسَلِّمْ عَلَيْهِ, وَإِذَا دَعَاكَ فَأَجِبْهُ, وَإِذَا اِسْتَنْصَحَكَ فَانْصَحْهُ, وَإِذَا عَطَسَ فَحَمِدَ اَللَّهَ فَسَمِّتْهُ وَإِذَا مَرِضَ فَعُدْهُ, وَإِذَا مَاتَ فَاتْبَعْهُ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి. అవేమంటే; – (1) అతన్ని కలుసుకున్నప్పుడు నువ్వతనికి సలాం చెయ్యి. (2) అతనెప్పుడయినా నిన్ను ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. (3) అతనెప్పుడయినా సలహా కోరితే -శ్రేయోభిలాషిగా- మంచి సలహా ఇవ్వు. (4) అతనెప్పుడయినా తుమ్మిన మీదట ‘అల్హమ్దులిల్లాహ్’ అని అంటే, సమాధానంగా నువ్వు ‘యర్హముకల్లాహ్’ అని పలుకు. (5) అతను రోగగ్రస్తుడైతే నువ్వతన్ని పరామర్శించు. (6) అతను మరణిస్తే నువ్వతని అంత్యక్రియలలో పాల్గొను. (ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A Muslim has six duties towards other Muslims: When you meet him, you should salute him; when he invites you, accept his invitation; when he asks for your advice, give it to him; when he sneezes and praises Allah, say May Allah have mercy on you; when he is ill, visit him; and when he dies follow his funeral.” Related by Muslim.
సారాంశం
ఈ హదీసులో ఒక ముస్లిం యొక్క ఆరు హక్కులు సూచించబడ్డాయి. ‘ముస్లిం’లోని వేరొక ఉల్లేఖనంలో ఐదింటి ప్రస్తావనే వచ్చింది. అందులో ‘శ్రేయోభిలాష’ గురించి లేదు. ఏదైనా వ్యవహారంలో ప్రమాణం చేయుమని నిన్ను అతను కోరితే – అది నిజమయిన పక్షంలో- ప్రమాణం కూడా చెయ్యుమని ఇంకొక హదీసులో ఉంది.
మొత్తమ్మీద ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే సాటి ముస్లిం యెడల తనపై ఉన్న ఈ ఆరు బాధ్యతలను ప్రతి ముస్లిం నెరవేర్చాలి. వీటిని నెరవేర్చటం తప్పనిసరి (వాజిబ్) అని కొంతమంది పండితులు అభిప్రాయపడగా, నెరవేర్చటం వాంఛనీయం (ముస్తహబ్)అని మరి కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే హదీసులోని పదజాలాన్నిబట్టి వాటిని నెరవేర్చటం తప్పనిసరి అని అనటమే సమంజసం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1236
హదీసు 1237
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ, وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ, فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اَللَّهِ عَلَيْكُمْ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) దేవుని ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారీ, ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Look at those who are lower than you (financially) but do not look at those who are higher than you, lest you belittle the favors Allah conferred upon you.” Agreed upon.
సారాంశం
దైవాన్ని విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు దేవునిపట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి, ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ళ మంచిచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1237
హదీసు 1238
وَعَنْ اَلنَوَّاسِ بْنِ سَمْعَانَ - رضى الله عنه - قَالَ: سَأَلْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -عَنْ اَلْبِرِّ وَالْإِثْمِ? فَقَالَ: { اَلْبِرُّ: حُسْنُ اَلْخُلُقِِ, وَالْإِثْمُ: مَا حَاكَ فِي صَدْرِكَ, وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ اَلنَّاسُ } أَخْرَجَهُ مُسْلِمٌ.
హజ్రత్ నవ్వాస్ బిన్ సమాన్ (రదియల్లాహు అన్హు) కథనం : సదాచరణ – దురాచరణల గురించి నేను దైవప్రవక్త ﷺ వారిని దర్యాఫ్తు చేయగా ఆయన ﷺ ఇలా వివరించారు: “సద్గుణాలకు, సత్ప్రవర్తనకు మరో పేరే సదాచరణ. మరి ఏ పనిపట్ల నీ మనసులో శంక కలుగుతుందో, మరి దేని గురించి ప్రజలు తెలుసుకోవటం నీకిష్టం లేదో అది దురాచరణ.” (ముస్లిం)
English
An-Nawwas bin Sam'an (RAA) narrated, ‘I asked the Messenger of Allah (ﷺ) about virtue and sin and he replied, “The essence of virtue is (manifested in) good morals (Akhlaq) whereas sinful conduct is that which turns in your heart (making you feel uncomfortable) and you dislike that it would be disclosed to other people.” Related by Muslim.
సారాంశం
ఈ హదీసులో మంచీ చెడుల నిర్వచనం ఇవ్వబడింది. సదాచరణ – దురాచరణల వాస్తవికత వివరించబడింది.
సదాచరణ అంటే సాటి మనుషుల యెడల మృదువుగా మసలుకోవాలి. మమతానురాగాలను పంచి పెట్టాలి. వారితో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి. తోటి వారిని ఇక్కట్ల పాలు చెయ్యకూడదు. వారు మోయలేనంత భారం వారిపై మోపకూడదు. పైగా వీలయినంతవరకు వారిని ఆదుకోవాలి. వాళ్ళ భారాన్ని తనూ మోయాలి. మనో వాక్కాయ కర్మల చేత ఎదుటివారి మనసు నొప్పించకుండా జాగ్రత్తపడాలి. అకారణంగా ఆగ్రహాన్ని, అసహనాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించరాదు. సాధ్యమైనంతవరకు సడలింపుల ధోరణిని అలవరచుకోవాలి. మన్నింపుల వైఖరిని అవలంబించాలి. అంతేగాని ప్రతి చిన్న విషయానికీ తోటివారిని నిలదీయరాదు. తెగనాడకూడదు – ఇదే సదాచరణ!
ఏదేని పని పట్ల మనసు నుండి ‘పచ్చని సంకేతం’ లభించకపోగా, దాని పర్యవసానం దైవసన్నిధిలో ఎలా ఉంటుందో ఏమోనని మనసు ఊగిసలాటకు, సందిగ్ధానికి లోనయినట్లయితే ఆ పని మంచి పని కాదని తెలుసుకోండి. ఈ లోకం ఉన్నంతకాలం సత్యాసత్యాల, ఉచితానుచితాల, మంచీచెడుల మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఏది ఉచితమో – మరేది అనుచితమో, ఏది మంచో – ఏది చెడో పరికించే సూదంటురాయని ఈ హదీసు మన ముందుంచింది.
హదీసు ఉల్లేఖకులు
నవ్వాస్ బిన్ సమాన్ (రదియల్లాహు అన్హు) : నవ్వాస్ బిన్ సమాన్ బిన్ ఖాలిద్ కిలాబీ, ఆమిరీ. సిరియాకు చెందిన సహచరుల్లో ఒకరుగా పరిగణించబడతారు. ఈయన తండ్రి దైవప్రవక్త ﷺ దగ్గరకు ఒక బృందాన్ని పంపారనీ, దైవప్రవక్త ﷺ కోసం పాదరక్షలను కానుకగా పంపగా ప్రవక్త ﷺ వాటిని స్వీకరించారనీ అనబడుతోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1238
హదీసు 1239
وَعَنْ اِبْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا كُنْتُمْ ثَلَاثَةً, فَلَا يَتَنَاجَ اِثْنَانِ دُونَ اَلْآخَرِ, حَتَّى تَخْتَلِطُوا بِالنَّاسِ; مِنْ أَجْلِ أَنَّ ذَلِكَ يُحْزِنُهُ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ..
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీరు ముగ్గురు వ్యక్తులున్నప్పుడు – ఇద్దరు వ్యక్తులు ఏకమై, మూడో వానిని వేరుచేసి, రహస్య సమాలోచన చేయరాదు. అతను (మూడో వ్యక్తి) జనవాహినిలో కలసిపోయిన తరువాత సమాలోచన జరుపుకుంటే అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ (వేర్పాటు) ధోరణి అతణ్ణి దుఃఖానికి, మనస్తాపానికి లోను చేస్తుంది.” (బుఖారీ, ముస్లిం-వాక్యాలు ముస్లింలోనివి)
English
Ibn Mas’ud (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When three of you get together in company, two of you must not talk privately while isolating the third, so as not to make him feel sad (that he is left out) till you mingle with other people (i.e. you are joined by others).” Agreed upon and the wording is from Muslim.
సారాంశం
తోడుగా ఉన్న వ్యక్తిని ఉపేక్షించి ఇతరులతో గుసగుసలాడటాన్ని, రహస్య సమాలోచన జరపటాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది. సాటి మనుషుల భావాలు, భావోద్రేకాలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని వాటిని గౌరవించాలనీ, ఏ దశలోనూ మనోభావాలను గాయపరచరాదని కూడా ఈ హదీసు మనకు ఉపదేశిస్తున్నది. ఈ ఉపదేశాన్ని లెక్క చేయకుండా తోటి మనిషిని వేరుపరిస్తే అతని మనసు చివుక్కుమంటుంది. వీళ్ళిద్దరూ కలసి నన్ను పరాయి వ్యక్తిగా చూస్తున్నారేనన్న ఆలోచన అతనిలో వస్తుంది. బహుశా తనకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర పన్నుతున్నారేమోనన్న అనుమానం కూడా వస్తుంది. ఈ అనుమానాలే వ్యక్తుల మధ్య అంతరాల అగాధాలను సృష్టిస్తాయి. పరస్పర సహకార భావం బదులు సహాయ నిరాకరణ ధోరణి ప్రబలుతుంది. కాబట్టి సామూహిక జీవనంలో కొందరు మరికొందరిని వేరుచేసి, ఇంకొందరితో కలసి రహస్య మంతనాలు సాగించటం, చెవులు కొరుక్కోవటం వారించబడింది. అయితే మూడో వ్యక్తి అక్కడ లేనపుడు ఇద్దరు కలసి సమాలోచన సాగించటం మాత్రం తప్పుకాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1239
హదీసు 1240
وَعَنْ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يُقِيمُ اَلرَّجُلُ اَلرَّجُلَ مِنْ مَجْلِسِهِ, ثُمَّ يَجْلِسُ فِيهِ, وَلَكِنْ تَفَسَّحُوا, وَتَوَسَّعُوا } مُتَّفَقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : ఏ మనిషీ ఇంకొకరిని అతను కూర్చున్న చోటు నుంచి లేపి తను స్వయంగా కూర్చోవటం తగదు. ఒకవేళ స్థలాభావం ఉంటే సమావేశ స్థలంలో సర్దుకోవాలి. సదనంలో విశాలముండేలా చూసుకోవాలి.” (బుఖారీ, ముస్లిం)
English
Ibn Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A man should not ask another man to get up from his place in order to take his seat. But you should make room for each other and spread out.” Agreed upon.
సారాంశం
ఈ హదీసులో సభామర్యాదల శిక్షణ ఇవ్వబడింది. సభకు వచ్చే జనులు అధికంగా ఉన్నారనిపించినపుడు సభికులు సమయస్ఫూర్తితో సర్దుకుని, మరికొంతమంది అక్కడ ఆసీనులయ్యేలా ఖాళీ స్థలాన్ని కల్పించాలి. అయితే ఒక వ్యక్తి ముందు నుంచీ ఒకచోట కూర్చుని ఉండి, ఏదైనా ముఖ్యావసరం పడి కొన్ని నిమిషాల పాటు బయటికి వెళ్ళినంత మాత్రాన వేరొకరు వచ్చి ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవటం వాంఛనీయం కాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1240
హదీసు 1241
وَعَنْ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا أَكَلَ أَحَدُكُمْ طَعَامًا, فَلَا يَمْسَحْ يَدَهُ, حَتَّى يَلْعَقَهَا, أَوْ يُلْعِقَهَا } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీలో ఎవరయినాసరే భోజనం చేస్తే, మీ చేతిని స్వయంగా నాకి తిననంత వరకూ, లేక నాకి తినిపించనంత వరకూ (చేతిని) శుభ్రం చేయకూడదు.” (బుఖారీ, ముస్లిం)
English
Ibn Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When one of you eats, he must not wipe his hand till he licks it, or gives it to someone else to lick (such as a wife, husband, etc.).” Agreed upon.
సారాంశం
ఈ హదీసులో భోజన మర్యాదల్లోని ఒకానొక మర్యాద తెలుపబడింది. హదీసు పదజాలం కొందరికి సంస్కార విహీనం అనిపించవచ్చు. కాని ధార్మికంగా అందులో ఎన్నో పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి భుజించే ఆహారం దైవప్రసాదితం. దైవప్రసాదితం పట్ల మనిషిలో నిర్లక్ష్య వైఖరి ఏమాత్రం శోభాయమానం కాదు. అన్నం తినే సమయంలో అతనెంతో వినయంగా, సంస్కారవంతునిలా కూర్చోవాలి. మెతుకులు క్రింద పడకుండా తినాలి. కంచంలో భోజన పదార్థాలను ఎంగిలిచేసి వదలకుండా – పూర్తిగా తినాలి. చేతివ్రేళ్ళకు తగిలి వున్న పదార్థం సయితం వృధా కాకుండా శుభ్రంగా నాకి తినాలి – ఈ చేష్టలన్నీ దైవానుగ్రహం పట్ల అతనికున్న శ్రద్ధాభక్తులను, కృతజ్ఞతా భావాన్ని సూచిస్తాయి. మనిషిలోని అహంకారాన్ని, మిడిసిపాటును త్రుంచటం కూడా ఇందలి పరమార్థాల్లో ఒకటి. అదీగాక, అతను తినే భోజనంలో దేవుడు ఏ భాగంలో ‘శుభాన్ని’ పొందుపరచి ఉంటాడో దాసునికి తెలీదు. అందుకే ఈ విధంగా తాకీదు చేయటం జరిగింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1241
హదీసు 1242
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لِيُسَلِّمْ اَلصَّغِيرُ عَلَى اَلْكَبِيرِ, وَالْمَارُّ عَلَى اَلْقَاعِدِ, وَالْقَلِيلُ عَلَى اَلْكَثِيرِ } مُتَّفَقٌ عَلَيْهِ.. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: { وَالرَّاكِبُ عَلَى اَلْمَاشِي }.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు : “చిన్నవారు పెద్దవారికి, దారిలో నడిచేవారు కూర్చున్నవారికి, తక్కువ సంఖ్యలో వున్నవారు అధిక సంఖ్యలో వున్న సమూహానికి ‘సలాం’ చేయాలి” (బుఖారీ, ముస్లిం). ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో “వాహనంపై వున్నవారు కాలినడకన వచ్చేవారికి సలాం చేయాలి” అని వుంది.
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “The young should salute the old, the one who is passing by should salute the one who is sitting, and the small group of people should salute the larger one.” Agreed upon.
In a version by Muslim, “And the one who is riding should salute the one who is walking.”
సారాంశం
ఈ హదీసులో పరస్పరం ‘సలాం’ చేసుకునే పద్ధతులు వివరించబడ్డాయి. “చిన్నవారు పెద్దవారికి సలాం చేయటంలో ముందంజ వేయాలి” అని చెప్పటం గమనార్హ విషయం. పెద్దలను ఆదరించటం, వారిపట్ల అణకువగా మెలగటం చిన్నల బాధ్యత. వచ్చేవారు కూర్చున్న వారికి సలాం చేయాలి అని ఉపదేశించటంలోని మర్మం ఏమిటంటే, వచ్చేవాడు ఏ ఉద్దేశ్యంతో వస్తున్నాడో కూర్చున్న వారికి తెలీదు. కాని అతను ‘సలాం’ చేశాడంటే తన తరపున అభయమిచ్చినట్లే. ఈ ‘సలాం’ తరువాత ఇక వారిరువురి మధ్య భయాందోళనలకు తావుండదు.
అలాగే వాహనంపై వెళ్ళేవారు నడచి వెళ్ళేవారిని సలాం చేయమనటంలోని ముఖ్యోద్దేశం, వాహనంపై వున్నవారు కాలి నడకన వెళ్ళేవారిని అల్ప దృష్టితో చూడరాదన్నది. సాధారణంగా మంచి ఖరీదైన వాహనాలపై ప్రయాణం చేసేవారిలో ఒకింత దర్పం, గర్వం తొణికిసలాడతాయి. ఈ గర్వం మంచి లక్షణం కాదు. దీన్ని అణచాలన్నది ఇస్లాం ఉద్దేశ్యం. కాలినడకన వచ్చే పోయే వారికి వాహనంపై వున్నవాడు సలాం చేశాడంటే అతనిపట్ల వినయాన్ని, అణకువని చూపినట్లే. ఈ అణకువే ఎదుటివారి మనసును జయిస్తుంది.
అసలు ‘సలాం’ను సర్వసామాన్యం చేయటమే గొప్ప విషయం. అందులోనూ ఎవరు ముందంజ వేయాలి అన్న విషయాలు ఈ హదీసులో సూచించబడ్డాయి. ఇవి సామాజిక మర్యాదల్లో అంతర్భాగం అన్న విషయాన్ని మరువరాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1242
హదీసు 1243
وَعَنْ عَلِيٍّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ يُجْزِئُ عَنْ اَلْجَمَاعَةِ إِذَا مَرُّوا أَنْ يُسَلِّمَ أَحَدُهُمْ, وَيُجْزِئُ عَنْ اَلْجَمَاعَةِ أَنْ يَرُدَّ أَحَدُهُمْ } رَوَاهُ أَحْمَدُ, وَالْبَيْهَقِيُّ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఏదైనా ఒక ప్రజాసమూహం ఒక చోటి నుంచి సాగిపోతున్నప్పుడు అందులో నుంచి ఒక్క వ్యక్తి ‘సలాం’ చేసినా సరిపోతుంది. ఇంకా, ఆ సమూహంలోని ఒక్క వ్యక్తి సలాంకు సమాధానం ఇచ్చినా చాలు.” (ముస్నదె అహ్మద్, సుననె బైహఖీ)
English
Ali (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When a group of people passes by, it is sufficient if one of them gives a salutation, and it is sufficient for those who are sitting that one of them replies.” Related by Ahmad and Al-Baihaqi.
సారాంశం
సలాం చేయటం, సలాంకు బదులు పలకటం ‘ఫర్జె కిఫాయ’ అని ఈ హదీసును బట్టి అర్థమవుతోంది. సమూహం లేక బృందంలో నుంచి ఏ ఒక్క వ్యక్తి సలాంపై స్పందించినా అది వారందరి తరపునా సరిపోతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1243
హదీసు 1244
وَعَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا تَبْدَؤُوا اَلْيَهُودَ وَالنَّصَارَى بِالسَّلَامِ, وَإِذَا لَقَيْتُمُوهُمْ فِي طَرِيقٍ, فَاضْطَرُّوهُمْ إِلَى أَضْيَقِهِ } أَخْرَجَهُ مُسْلِمٌ..
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “యూదులు, క్రైస్తవులకు ముందుగా సలాం చేయకండి. ఎప్పుడన్నా మార్గమధ్యంలో వారు తారసపడితే వారు ఇరుకైన దారిగుండా పోయే అనివార్య స్థితిని ఏర్పరచండి.” (ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Do not initiate the saluting of Jews and Christians (when you meet them), and if you meet any of them on the road, force him to go to the narrowest part of the road (i.e. do not give way for them to pass, but keep going). Related by Muslim.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1244
హదీసు 1245
وَعَنْهُ عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { إِذَا عَطَسَ أَحَدُكُمْ فَلْيَقُلْ: اَلْحَمْدُ لِلَّهِ, وَلْيَقُلْ لَهُ أَخُوهُ يَرْحَمُكَ اَللَّهُ, فَإِذَا قَالَ لَهُ: يَرْحَمُكَ اَللَّهُ, فَلْيَقُلْ لَهُ: يَهْدِيكُمُ اَللَّهُ, وَيُصْلِحُ بَالَكُمْ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ..
దైవప్రవక్త ﷺ ఉపదేశించినట్లు హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారు – ఆయన ﷺ ఈ విధంగా ఉపదేశించారు : మీలో ఎవరయినా తుమ్మితే అతడు అల్హమ్దులిల్లాహ్ (సమస్త స్తోత్రాలు అల్లాహ్ కొరకే) అని అనాలి. ఇది విన్న అతని సోదరుడు యర్హముకల్లాహ్ (అల్లాహ్ నీపై దయదలచుగాక!) అని బదులివ్వాలి. మరి ఇతను యర్హముకల్లాహ్ అని బదులిచ్చాడంటే దీనిపై స్పందిస్తూ తుమ్మిన వ్యక్తి ఈ విధంగా పలకాలి – “యహ్దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుమ్” (అల్లాహ్ నీకు మార్గదర్శకత్వం వహించుగాక! నీ స్థితిని చక్కదిద్దుగాక!!) (బుఖారీ)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When one of you sneezes, he should say, ‘Alhamdulillah (Praise is to Allah) and his (Muslim) brother should say to him, ‘Yarhamuka Allah (May Allah have mercy on you). When he says this to him (the last phrase), he should reply, ‘Yahdikum Allah (May Allah guide you) and grant you well being.” Related by Al-Bukhari.
సారాంశం
తుమ్మిన వానికి బదులు ఇవ్వాలని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. అయితే తుమ్మిన వ్యక్తి తొలుత ‘అల్హమ్దులిల్లాహ్’ అని పలికితేనే బదులు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. మూడుసార్లు మాత్రమే ఈ సమాధానం ఇవ్వబడుతుంది. నిరంతరం మూడు సార్లకంటే ఎక్కువగా తుమ్మితే అది జలుబుకు అనవాలని మహాప్రవక్త ﷺ సెలవిచ్చారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1245
హదీసు 1246
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يَشْرَبَنَّ أَحَدُكُمْ قَائِمًا } أَخْرَجَهُ مُسْلِمٌ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “మీలో ఎవరూ నిలబడి నీళ్ళు త్రాగరాదు.” (ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “None of you should drink while standing.” Related by Muslim.
సారాంశం
నిలబడి నీళ్ళు త్రాగటాన్ని ఈ హదీసు వారిస్తుంది. ఈ వారింపును మెజారిటీ విద్వాంసులు ‘నహీయె తన్జీహీ’గా పరిగణించారు. అయితే ఇబ్నె హజమ్ గారు నిలబడి నీరు త్రాగటం నిషిద్ధం (హరామ్) అని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది పండితులు నిలుచుని నీళ్ళు త్రాగటాన్ని ‘మక్రూహ్’ (అవాంఛనీయం, అయిష్టకర విషయం)గా తలపోశారు. దైవప్రవక్త ﷺవారు జమ్ జమ్ జలాన్ని నిలబడి త్రాగినట్లు ఆధారముంది. బహుశా ఈ కారణంగానే మెజారిటీ విద్వాంసులు ఈ వారింపును ‘నిషిద్ధాంశం’గా పేర్కొనలేదేమో!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1246
హదీసు 1247
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا اِنْتَعَلَ أَحَدُكُمْ فَلْيَبْدَأْ بِالْيَمِينِ, وَإِذَا نَزَعَ فَلْيَبْدَأْ بِالشِّمَالِ, وَلْتَكُنْ اَلْيُمْنَى أَوَّلَهُمَا تُنْعَلُ, وَآخِرَهُمَا تُنْزَعُ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: మీలో ఎవరయినాసరే చెప్పులు తొడగ దలిస్తే మొదట కుడి పాదంలో తొడగండి. (చెప్పులు) విడవబోయినపుడు మొదట ఎడమ పాదం నుంచి విడవండి. అంటే కుడి కాలికి మొదట తొడగాలి, రెండు కాళ్ళలోనుంచి ఆఖరిలో కుడి కాలినుంచి చెప్పు విడవాలి.” (బుఖారీ, ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “When one of you puts on his shoes, he should put on the right one first and when he takes them off, he should take off the left one first, so that the right one should be the first to be put on and the last to be taken off.” Agreed upon.
సారాంశం
గౌరవప్రదమైన, ప్రాముఖ్యంతో కూడుకున్న ప్రతి పనినీ కుడివైపు నుంచి ప్రారంభించాలనీ, తక్కువ ప్రాముఖ్యం గల వాటిని ఎడమ వైపునుంచి మొదలెట్టాలని హదీసు భావం. ఉదాహరణకు : చెప్పులు ధరించటం, తల దువ్వుకోవటం, వుజూ చేయటం, చొక్కా, షరాయి తదితర బట్టలు ధరించటం – ఇవన్నీ కుడిచేత్తో మరియు కుడికాలితో ప్రారంభించాలి. ఇకపోతే; చెప్పులు విడువటం, మలమూత్ర శుద్ధి (ఇస్తింజా) చేయటం వంటివి ఎడమ వైపునుంచి ఆరంభించాలి. అలాగే మస్జిద్లో ప్రవేశించే సమయంలో మొదట కుడి కాలు పెట్టాలి, మస్జిద్ నుంచి బయటికి వెళ్ళే సమయంలో తొలుత ఎడమ కాలు బయట పెట్టాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1247
హదీసు 1248
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يَمْشِ أَحَدُكُمْ فِي نَعْلٍ وَاحِدَةٍ, وَلْيُنْعِلْهُمَا جَمِيعًا, أَوْ لِيَخْلَعْهُمَا جَمِيعًا } مُتَّفَقٌ عَلَيْهِ..
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తాకీదు చేశారు: “మీలో ఎవరు ఒక చెప్పును తొడిగి తిరగరాదు. తొడిగితే రెండూ ఒకే సమయంలో తొడగాలి లేకపోతే రెంటినీ విడిచేయాలి.” (బుఖారీ, ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “None of you should walk with one shoe, but should either wear them both or take them both off” Agreed upon.
సారాంశం
ఈ హదీసు ప్రకారం ఒక్కగానొక్క చెప్పు లేక బూటు ధరించి తిరగటం భావ్యం కాదు. అసలు ఎవరయినా చెప్పులు ఎందుకు వేసుకుంటారు? పాదాల రక్షణ కోసం, ముళ్ళబారి నుండి, హానికరమయిన వస్తువుల నుండి కాళ్లను కాపాడుకోవటం కోసమేకదా! మరలాంటప్పుడు ఒక కాలికి చెప్పు తొడిగి తిరిగితే రెండవ కాలు ఏం కావాలి? పైగా ఇలాంటి చేష్ట షైతాన్ చేష్ట అనిపించుకుంటుంది. ఒంటి కాలికి చెప్పు ధరించి తిరగటం మర్యాద కాదు, సంస్కారం ఉన్న వారెవరూ అలా చేయరు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1248
హదీసు 1249
وَعَنْ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يَنْظُرُ اَللَّهُ إِلَى مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ } مُتَّفَقٌ عَلَيْهِ..
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు : “అహంకారంతో తన అంగవస్త్రాన్ని పాదాల క్రిందికి వదలి, వెనుక ఈడ్చుకుంటూ నడిచే వ్యక్తి వైపు అల్లాహ్ దయాదృష్టితో చూడడు.” (బుఖారీ, ముస్లిం)
English
Ibn Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “Allah will not look on the Day of Judgment at him who lets his garment drag on the ground out of pride and arrogance.” Agreed upon.
సారాంశం
పురుషులు కాలి మడమలకు దిగువ భాగాన అంగ వస్త్రాన్నిగానీ, దుప్పటిని గానీ వదలటం హరామ్ (నిషిద్ధం) అని ఈ హదీసు ద్వారా విదితమవుతున్నది. ఈ విధంగా వస్త్రాన్ని వదలటం అహంకారానికి, బడాయికి నిదర్శనం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1249
హదీసు 1250
وَعَنْهُ أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { إِذَا أَكَلَ أَحَدُكُمْ فَلْيَأْكُلْ بِيَمِينِهِ, وَإِذَا شَرِبَ فَلْيَشْرَبْ بِيَمِينِهِ, فَإِنَّ اَلشَّيْطَانَ يَأْكُلُ بِشِمَالِهِ, وَيَشْرَبُ بِشِمَالِهِ } أَخْرَجَهُ مُسْلِمٌ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీలో ఎవరయినా సరే భోజనం చేసినపుడు తమ కుడిచేత్తో భుజించాలి. ఎవరు పానీయం త్రాగినా తమ కుడిచేత్తోనే త్రాగాలి. ఎందుకంటే షైతాన్ తన ఎడమ చేత్తోనే తింటాడు – ఎడమ చేత్తోనే త్రాగుతాడు.” (ముస్లిం)
English
Ibn Umar narrated that the Messenger of Allah (ﷺ) said: “When one of you eats he should eat with his right hand, and when he drinks he should drink with his right hand, for the devil eats and drinks with his left hand.” Related by Muslim.
సారాంశం
ఏదైనా బలమైన కారణముంటే తప్ప – అకారణంగా – ఎడమచేత్తో తినటం, త్రాగటం నిషిద్ధం. పైగా ఇది పైశాచిక పోకడను పోలినది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1250
హదీసు 1251
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ كُلْ, وَاشْرَبْ, وَالْبَسْ, وَتَصَدَّقْ فِي غَيْرِ سَرَفٍ, وَلَا مَخِيلَةٍ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَأَحْمَدُ, وَعَلَّقَهُ اَلْبُخَارِيُّ..
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ (రహిమహుల్లాహ్) తన తండ్రి ఆధారంగా, ఆయన తన తాతగారి ఆధారంగా చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “తిను, త్రాగు, తొడుగు. దానధర్మాలు చెయ్యి. కాని దుబారా ఖర్చుకు, గర్వానికి తావీయకు.” (దీన్ని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు – బుఖారీ ఈ హదీసు పరంపరను ప్రస్తావించకుండానే పొందుపరచారు)
English
Amro bin Shu’aib narrated on the authority of his father, on the authority of his grandfather (RAA), that the Messenger of Allah (ﷺ) said: “Eat, drink, wear clothes and give sadaqah but with neither extravagance nor pride.” Related by Abu Dawud and Ahmad.
సారాంశం
దుబారా ఖర్చు, అహంకారం ధర్మసమ్మతం కావు. ఇవి రెండూ అన్న పానీయాలలో చేయబడినా, వస్త్రధారణలో ప్రదర్శించబడినా, పుణ్య కార్యాలలో చూపబడినా – మొత్తమ్మీద అవి ముస్లింకు ఏమాత్రం శోభించవు. ఈ హదీసు మనిషి ప్రాపంచిక, పారలౌకిక పరమార్థాలను పరివేష్టించి వున్న హితబోధిని అని షేఖ్ అబ్దుల్ లతీఫ్ బగ్దాదీ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే దుబారా లేక అతి అనేది సర్వత్రా హానికరమే. అతిగా భుజిస్తే ఆరోగ్యం పాడవుతుంది. ఆర్థిక స్థితిపై దాని ప్రభావం పడుతుంది. అలాగే అహంకారంతో విర్రవీగేవాడు అన్యుల దృష్టిలో దుర్జనుడుగా భావించబడతాడు. పరలోకంలోనయితే అవమానం, పరాభవాలే అతనికి మిగులుతాయి. (సుబుల్)
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|16. వివిధ విషయాల పుస్తకం|16.1 వినయ వినమ్రతలు|హదీసు 1251
You must be logged in to post a comment.