హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 15. బానిస విమోచన పుస్తకం, 1వ అధ్యాయం: ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 1229 – 1235) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్
باب المدبر والمكاتب وأم الولد
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1229
عَنْ جَابِرٍ - رضى الله عنه - { أَنَّ رَجُلًا مِنْ اَلْأَنْصَارِ أَعْتَقَ غُلَامًا لَهُ عَنْ دُبُرٍ, وَلَمْ يَكُنْ لَهُ مَالٌ غَيْرُهُ, فَبَلَغَ ذَلِكَ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -. فَقَالَ: "مَنْ يَشْتَرِيهِ مِنِّي?" فَاشْتَرَاهُ نُعَيْمُ ابْنُ عَبْدِ اَللَّهِ بِثَمَانِمَائَةِ دِرْهَمٍ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَفِي لَفْظٍ لِلْبُخَارِيِّ: فَاحْتَاج َ وَفِي رِوَايَةٍ لِلنَّسَائِيِّ: { وَكَانَ عَلَيْهِ دَيْنٌ, فَبَاعَهُ بِثَمَانِمَائَةِ دِرْهَمٍ, فَأَعْطَاهُ وَقَالَ: " اِقْضِ دَيْنَكَ" }.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక అన్సార్ సహచరుడు మరణ సమయంలో ఒక బానిసకు విముక్తి కలిగించాడు. మరి చూడబోతే అతని ఆస్తి అదొక్కటే. ఈ విషయం దైవప్రవక్త ﷺకు తెలిసింది. దానికాయన ﷺ, “ఆ బానిసను నా దగ్గరి నుంచి కొనే వారెవరు?” అని ప్రశ్నించారు. అప్పుడు నయీమ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఎనిమిది వందల దిర్హములకు ఆయన ﷺ నుండి కొనుగోలు చేశారు. (బుఖారీ, ముస్లిం). బుఖారీలో “అతడు అవసరం పడ్డాడు” అన్న వాక్యం ఉంది.
నసాయిలోని ఉల్లేఖనంలో ఇలా వుంది: అతను బాకీ పడి ఉన్నాడు. ఆయన ﷺ అతన్ని ఎనిమిది వందల దిర్హములకు అమ్మి, ఆ సొమ్మును అతనికిస్తూ, “నీ బాకీ చెల్లించు” అని అన్నారు.
English
Jabir bin ·Abdullah (RAA) narrated that A man from the Ansar declared that his slave lad would be free after his death (would be Mudabbar), yet he had no other property. When the Prophet heard of that he said, “Who will buy him from me?” And Nu'aim bin 'Abdullah bought him for eight hundred Dirhams. Agreed upon. In a narration by Al-Bukhari: “The man became needy,’ (so the Prophet took the slave and said…).’ A version by An-Nasa’i says, “The man had a debt, so the Prophet sold the slave for eight hundred Dirhams and gave him the money and said, “Pay off your debt.”
సారాంశం
ఈ అధ్యాయంలో బానిస విమోచనానికి సంబంధించిన మూడు పద్ధతులు సూచించబడ్డాయి: 1. ముదబ్బర్ 2. ముకాతబ్ 3. ఉమ్ముల్ వలద్.
ఒక యజమాని తన బానిసను ఉద్దేశించి; నా మరణానంతరం నువ్వు స్వేచ్ఛపొందుతావు అని అంటే అట్టి బానిసను ‘ముదబ్బర్’ గా వ్యవహరిస్తారు.
ఒక నిర్దీత మొత్తం యజమానికి చెల్లించి స్వేచ్ఛపొందే ఒప్పందం (ముకాతబత్) చేసుకున్న బానిసను ‘ముకాతబ్’అని అంటారు.
తన యజమాని అజమాయిషీలో ఉంటూ అతనిచే సంతానాన్ని కన్న బానిసరాలిని ‘ఉమ్ముల్ వలద్’ అని పిలుస్తారు.
ఈ హదీసు ఇంతకు ముందు ‘వాణిజ్య పుస్తకం’లోనూ వచ్చింది. ఈ హదీసు ప్రకారం బానిసను ‘ముదబ్బర్’గా ప్రకటించటం సమంజసమే. అయితే యజమాని తన ఆస్తిలోని మూడోవంతు (వీలు) భాగంలో నుంచి ఈ మేరకు ప్రకటించాలని అత్యధికమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఒక వస్తువును మార్కెట్టులో అమ్మడానికి ‘వేలం’ వేయటంలో తప్పులేదని కూడా ఈ హదీసు చెబుతోంది. అంటే వస్తువు యజమాని మార్కెట్టులో ప్రజల ముందు దాన్ని ప్రవేశపెట్టి, తనకు రావలసిన గిట్టుబాటు ధర కోసం వేలం వేస్తాడు. వస్తువును కొనదలచినవారు దాని ధరను పెంచుతూ పోతారు. గిట్టుబాటు ధర పలకగానే యజమాని దాన్ని అమ్మేస్తాడు. ప్రస్తుత మండీలలో కూడా సరుకులు ఈ వేలం పద్ధతిపై అమ్ముడు పోతున్నాయి. ఈ పద్ధతి ధర్మసమ్మతమేనని హదీసు ద్వారా తెలియవస్తోంది.
హదీసు ఉల్లేఖకులు
నయీమ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) : ‘నఖ్ఖామ్’ అనేది ఈయన బిరుదు. ఖురైష్కు చెందిన ‘అదీ’ తెగవారు. తొలి రోజుల్లోనే ఇస్లాం స్వీకరించారు. మొదట్లో తాను ఇస్లాంను విశ్వసించిన సంగతిని గోప్యంగా ఉంచారు. ఈయన మక్కానుండి హిజ్రత్ చేయదలచినప్పుడు అదీ తెగవారు అభ్యంతరం చెప్పారు. ఏ మతాన్ని అవలంబించినా తమకు ఆక్షేపణ లేదనీ, మక్కా నగరాన్ని మాత్రం విడిచిపోవద్దని తెగేసి చెప్పారు. ఎందుకంటే ఈయన వితంతువుల, అనాధల పోషణ కోసం భారీ స్థాయిలో ఖర్చుపెట్టేవారు. కడకు ఈయన హుదైబియా ఒప్పందం జరిగిన సంవత్సరం వలసపోయారు. ఖలీఫా హజ్రత్ అబూబక్ర్ లేదా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ల హయాంలో సిరియా విజయం సందర్భంగా వీరమరణం పొందారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్|హదీసు 1229
హదీసు 1230
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ, عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -{ قَالَ: " اَلْمُكَاتَبُ عَبْدٌ مَا بَقِيَ عَلَيْهِ مِنْ مُكَاتَبَتِهِ دِرْهَمٌ" } أَخْرَجَهُ أَبُو دَاوُدَ بِإِسْنَادٍ حَسَن ٍ وَأَصْلُهُ عِنْدَ أَحْمَدَ, وَالثَّلَاثَةِ, وَصَحَّحَهُ اَلْحَاكِم ُ.
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి, ఆయన తన తాతగారి నుంచి సంగ్రహించిన దాని ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “ముకాతబ్ (అయిన బానిస) తన యజమానితో చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి ఒక్క దిర్హము బాకీ ఉన్నాసరే అతడు బానిసగానే ఉంటాడు.” (దీనిని అబూ దావూద్ ‘హసన్’ కోవకు చెందిన పరంపర ఆధారంగా వెలికి తీశారు. దీని మూలం అహ్మద్ మరియు ‘ముగ్గరి’ వద్ద ఉంది. హాకిమ్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)
English
'Amro bin Shu’aib narrated on the authority of his father, on the authority of his grandfather (RAA), That the Messenger of Allah (ﷺ) said: “A slave who entered into an agreement to buy his freedom is still a slave as long as a Dirham of the agreed price remains to be paid.” Related by Abu Dawud with a good chain of narrators. The full hadith is related by Ahmad and the three Imams. Al-Hakim graded it to be Sahih.
సారాంశం
యజమానితో ఒప్పందం చేసుకున్న బానిస ఆ నిర్దీత మొత్తాన్ని పూర్తిగా చెల్లించెంతవరకూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందజాలడని ఈ హదీసు తెలుపుతోంది. మెజారిటీ ఉలమా దృక్పథం కూడా ఇదే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్|హదీసు 1230
హదీసు 1231
وَعَنْ أَُمِّ سَلَمَةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا كَانَ لِإِحْدَاكُنَّ مُكَاتَبٌ, وَكَانَ عِنْدَهُ مَا يُؤَدِّي, فَلْتَحْتَجِبْ مِنْهُ } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ وَصَحَّحَهُ اَلتِّرْمِذِيّ ُ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు : “మీలో ఎవరివద్దయినా ‘ముకాతబ్’ (ఒప్పందం చేసుకున్న బానిస) ఉన్నప్పుడు, అతని దగ్గర సొమ్మును చెల్లించి స్వేచ్ఛ పొందగలిగేంత స్తోమత కూడా ఉన్నపుడు (యజమానురాలు) అతని యెడల ‘పరదా’ పాటించాలి.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ ఈ హదీసును ప్రమాణబద్ధమైనదిగా నిర్ధారించారు)
English
Umm Salamah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “When a slave of one of your women has made an agreement to pay for his freedom (i.e. he is a Mukatib) and can pay the full price, she must veil herself from him.” Related by Ahmad and the four Imams. At-Tirmidhi graded it as Sahih.
సారాంశం
నిర్దీత డబ్బు చెల్లించి స్వేచ్ఛ పొందేందుకు యజమానురాలితో లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్న బానిస, ఆ డబ్బును సమకూర్చుకోగానే యజమానురాలు అతనిపట్ల పరదా పాటించాలి. నిజానికి యజమానురాలు బానిస ముందు పరదా పాటించవలసిన అవసరం లేదు. పూర్తి సొమ్ము చెల్లించే వరకూ బానిస బానిసగానే ఉంటాడు. కాని మంచిని దృష్టిలో పెట్టుకుని ‘జాగ్రత్త’ పాటించబడుతుంది.
ఈ హదీసు ద్వారా అవగతమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే మహిళ తన బానిసను చూడగలదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్|హదీసు 1231
హదీసు 1232
وَعَنْ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { يُودَى اَلْمُكَاتَبُ بِقَدْرِ مَا عَتَقَ مِنْهُ دِيَةَ اَلْحُرِّ, وَبِقَدْرِ مَا رَقَّ مِنْهُ دِيَةَ اَلْعَبْدِ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيّ ُ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : యజమానితో ‘ముకాతబత్’ చేసుకున్న బానిస ఏ మేరకు స్వేచ్ఛ పొంది ఉంటాడో ఆ మేరకు రక్త శుల్కం పొందగలడు. ఇంకా ఏ మేరకు బానిసత్వానికి కట్టుబడి ఉంటాడో ఆ మేరకే పరిహారానికి అర్హుడు.” (దీనిని అహ్మద్, నసాయి, అబూదావూద్ ఉల్లేఖించారు)
English
Ibn ’Abbas (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “The Diyah (Blood money) of a slave who had made an agreement to buy his freedom (Mukatib) and had been killed, is paid at the rate paid for a free man (as a Diyah) as much as he has paid of the amount agreed upon, and at the rate paid for a slave as the remainder is concerned.” Related by Ahmad, Abu Dawud and Au-Nasa’i.
సారాంశం
యజమానితో లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్న బానిస (ముకాతబ్) గనక హత్యకు గురవుతే అట్టి పరిస్థితిలో రక్తపరిహారం ఏ నిష్పత్తిలో అతని వారసులకు ఇవ్వబడుతుందో ఈ హదీసులో సూచించబడింది. ఉదాహరణకు : – ‘ముకాతబ్’ అనబడే బానిస హత్యకు గురయ్యేనాటికి, అతడు తన యజమానికి సగం సొమ్ము చెల్లించి ఉన్నాడనుకోండి – అప్పుడు హంతకుడు సగం రక్తపరిహారం స్వతంత్ర వ్యక్తిది చెల్లించి, మిగతాది బానిసకు చెల్లించే నిష్పత్తిలో చెల్లిస్తాడు. అల్లామా ఖత్తాబీ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం ముకాతబ్ అనబడే బానిస పూర్తి సొమ్మును యజమానికి చెల్లించనంతవరకూ ఆ భారం అతనిపైనే ఉంటుంది. సాధారణంగా ధర్మవేత్తలందరూ ఇలాగే తలపోస్తున్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్|హదీసు 1232
హదీసు 1233
وَعَنْ عَمْرِو بْنِ اَلْحَارِثِ- أَخِي جُوَيْرِيَةَ أُمِّ اَلْمُؤْمِنِينَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: { مَا تَرَكَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -عِنْدَ مَوْتِهِ دِرْهَمًا, وَلَا دِينَارًا, وَلَا عَبْدًا, وَلَا أَمَةً, وَلَا شَيْئًا, إِلَّا بَغْلَتَهُ اَلْبَيْضَاءَ, وَسِلَاحَهُ, وَأَرْضًا جَعَلَهَا صَدَقَةً } رَوَاهُ اَلْبُخَارِيّ ُ.
విశ్వాసుల మాతయగు హజ్రత్ జువైరియా (రదియల్లాహు అన్హా) సోదరులైన హజ్రత్ అమ్ర్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హుమా) గారు చేసిన కథనం ప్రకారం; దైవప్రవక్త ﷺ తన మరణ సమయంలో వారసత్వ ఆస్తిగా దిర్హములుగానీ, దీనార్లు గానీ, బానిసలుగానీ, బానిసరాండ్రు గానీ, మరే వస్తువుగానీ వదలి వెళ్ళలేదు. కేవలం ఒక తెల్లని కంచెర గాడిద, తనదైన యుద్ధ సామగ్రితో పాటు ‘సదఖా’గా నిర్ధారించిన కొంతభూమి మాత్రం వదలి వెళ్ళారు. (బుఖారీ)
English
’Amro bin al-Harith, the brother of Juwairiyah the mother of Believers (the wife of the Prophet (ﷺ)) narrated, ‘When Allah’s Messenger (ﷺ) died, he did not leave a Dinar or a Dirham, a slave or a slave-woman, or anything but his white she-mule, his weapons and a piece of land which he appointed as Sadaqah.’ Related by Al-Bukhari.
సారాంశం
ప్రాపంచిక పటాటోపాలు, ఆస్తి ఐశ్వర్యాల పట్ల దైవప్రవక్త ﷺకు గల అనాసక్తతను, నిరపేక్షను ఈ హదీసు ఎత్తిచూపుతోంది. ఎందుకంటే ఆయన ﷺ అధీనంలో 63 మంది బానిసలుండేవారు. అందరినీ ఆయన ﷺ విడుదల చేసేశారు. తన వెనుక ఎలాంటి ‘ఆస్తి’నీ విడిచిపెట్టలేదు. పైగా ఆయన ﷺ ఈ విధంగా సెలవిచ్చారు: దైవప్రవక్తలు దిర్హములను, దీనార్లను వారసుల కోసం వదలివెళ్ళరు. వారు వదలిన సొమ్ము ఏదన్నా ఉంటే అది ‘సదఖా’గా మాత్రమే ఉంటుంది.”
హదీసు ఉల్లేఖకులు
అమ్ర్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) : ఈయన ఇబ్నె హారిస్ బిన్ అబూజిరార్ బిన్ హబీబ్ ఖుజాయి, ముస్తలిఖీ. అంటే ఖుజాఅ తెగలోని ఒక భాగమైన ముస్తలిఖ్ శాఖకు చెందినవారు. ప్రవక్త సాహచర్య భాగ్యం పొందారు. ఈయనచే ఈ ఒక్క హదీసు మాత్రమే ఉల్లేఖించబడింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్|హదీసు 1233
హదీసు 1234
وَعَنْ اِبْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَيُّمَا أَمَةٍ وَلَدَتْ مِنْ سَيِّدِهَا, فَهِيَ حُرَّةٌ بَعْدَ مَوْتِهِ } أَخْرَجَهُ اِبْنُ مَاجَهْ, وَالْحَاكِمُ بِإِسْنَادٍ ضَعِيف ٍ. وَرَجَّحَ جَمَاعَةٌ وَقْفَهُ عَلَى عُمَرَ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “తన యజమాని వీర్యకణంతో శిశువును కన్న బానిసరాలు, యజమాని మరణించిన తరువాత స్వతంత్రురాలవుతుంది.” (ఇబ్నె మాజా, హాకిమ్లు బలహీన పరంపర ద్వారా దీనిని ఉల్లేఖించారు. ఈ హదీసు పరంపర హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వరకే పరిమితమని హదీసువేత్తల్లోని ఒక వర్గం నొక్కి వక్కాణించింది.
English
Ibn ’Abbas (RAA) narrated that Allah’s Messenger (ﷺ) said: “When a man’s slave-woman bears him a child she becomes free at his death.” Related by Ibn Majah and Al-Hakim with a weak chain of narrators.
A group of Hadith scholars held that the stronger view is that it is Mawquf (a saying of a Companion) i.e. 'Umar (ra).
సారాంశం
‘ఉమ్మె వలద్’ (శిశువును కన్న బానిసరాలు) తన యజమాని మరణించిన వెంటనే స్వతంత్రురాలై పోతుందని ఈ హదీసు ద్వారానూ, ఇంతకు ముందు వచ్చిన వేరొక హదీసు ద్వారా కూడా విదితమవుతోంది. ఈ హదీసు పరంపరలో వున్న వారిలో హుసైన్ బిన్ అబ్దుల్లా హాష్మి చాలా బలహీన ఉల్లేఖకులవటం చేత ఇది బలహీన ఉల్లేఖనంగా భావించబడుతోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్|హదీసు 1234
హదీసు 1235
وَعَنْ سَهْلِ بْنِ حُنَيْفٍ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { مَنْ أَعَانَ مُجَاهِدًا فِي سَبِيلِ اَللَّهِ, أَوْ غَارِمًا فِي عُسْرَتِهِ, أَوْ مُكَاتَبًا فِي رَقَبَتِهِ, أَظَلَّهُ اَللَّهُ يَوْمَ لَا ظِلَّ إِلَّا ظِلُّهُ } رَوَاهُ أَحْمَدُ, وَصَحَّحَهُ اَلْحَاكِم ُ.
హజ్రత్ సహ్లా బిన్ హునైఫ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “ఎవరయితే దైవమార్గంలో పాటుపడే యోధునికి సాయం చేశాడో లేదా కష్టకాలంలో రుణగ్రస్తుణ్ణి ఆదుకున్నాడో లేదా ఒక యజమానితో ధన ఒప్పందం కుదుర్చుకున్న బానిసకు కట్టు బానిసత్వం నుండి బయటపడడంలో చేయూతనిచ్చాడో అటువంటి వ్యక్తికి అల్లాహ్, తన నీడ తప్ప మరొక నీడ ఉండని రోజున చల్లని నీడను ప్రసాదిస్తాడు.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. హాకిమ్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Sahl bin Hunaif (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “He who assists a Mujahid for Allah’s sake, a debtor who is in distress (being unable to pay his debt) or a slave who had made an agreement to buy his freedom, Allah will shade him, with His Shade, on the Day when there will be no shade but His.” Related by Ahmad and Al- Hakim graded it as Sahih.
సారాంశం
ఇస్లాం పరోపకారాన్ని, పరస్పర సహకార భావాన్ని, శ్రేయోభిలాషను ప్రబోధించే ధర్మం. ముఖ్యంగా కష్టకాలంలో ఒకరు ఇంకొకరికి అండగా నిలవాలని అది నొక్కి పలుకుతోంది. అందుకే ఈ హదీసులో రుణగ్రస్తుణ్ణి రుణభారం నుంచి విముక్తి కలిగించమనీ, దైవమార్గంలో జీవితాన్ని అంకితం చేసినవారి అక్కరలను తీర్చమనీ అది తన అనుయాయులను ప్రేరేపించింది. ఈ సత్కార్యాలు పరలోకంలో పనికి వస్తాయనీ, ఏ ఆశ్రయమూ లభించని పరీక్ష దినాన అవి దేవుని ఆశ్రయాన్ని కల్పిస్తాయని శుభవార్త కూడా ఇవ్వబడింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.1 ముదబ్బర్, ముకాతబ్, ఉమ్ముల్ వలద్|హదీసు 1235
You must be logged in to post a comment.