హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 15. బానిస విమోచన పుస్తకం, 15.0: బానిస విమోచన. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 1220 – 1228) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
15.0 బానిస విమోచన
كتاب العتق
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1220
عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ "أَيُّمَا امْرِئٍ مُسْلِمٍ أَعْتَقَ اِمْرَأً مُسْلِماً, اِسْتَنْقَذ َ اَللَّهُ بِكُلِّ عُضْوٍ مِنْهُ عُضْوًا مِنْهُ مِنَ النَّارِ" } مُتَّفَقٌ عَلَيْهِ.. وَلِلتِّرْمِذِيِّ وَصَحَّحَهُ; عَنْ أَبِي أُمَامَةَ: { "أَيُّمَا امْرِئٍ مُسْلِمٍ أَعْتَقَ اِمْرَأَتَيْنِ مُسْلِمَتَيْنِ, كَانَتَا فِكَاكَهُ مِنَ النَّارِ" }. وَلِأَبِي دَاوُدَ: مِنْ حَدِيثِ كَعْبِ بْنِ مُرَّةَ: { "أَيُّمَا اِمْرَأَةٍ مُسْلِمَةٍ أَعْتَقَتْ اِمْرَأَةً مُسْلِمَةً, كَانَتْ فِكَاكَهَا مِنْ اَلنَّارِ }.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : “ఏ ముస్లిమైనా ఒక ముస్లిం బానిసకు బానిసత్వం నుండి విముక్తి కలిగిస్తే, ఆ బానిసకున్న ప్రతి అవయవానికి బదులుగా అల్లాహ్ ఆ స్వేచ్ఛా ప్రదాతను నరకాగ్ని నుంచి విముక్తి నొసగుతాడు.” (బుఖారీ, ముస్లిం)
తిర్మిజీలో తిర్మిజీ ప్రమాణబద్ధమైనదిగా ఖరారు చేసిన అబూ ఉమామ ఉల్లేఖనం ఒకటుంది: “ఏ ముస్లిం పురుషుడైనా ఇద్దరు ముస్లిం బానిస స్త్రీలకు దాస్య విముక్తిని కలిగిస్తే వారిద్దరూ ఆ పురుషుడు నరకం నుంచి విముక్తి నొందడానికి కారకులవుతారు.”
అబూదావూద్లో కాబ్ బిన్ ముర్ర కథనం ఇలా వుంది: “ఏ ముస్లిం మహిళ అయినా ఒక ముస్లిం బానిస స్త్రీకి స్వేచ్ఛ నొసగినట్లయితే ఆ బానిస స్త్రీ ఆమెకు నరకం నుంచి విముక్తి పొందటంలో దోహదపడుతుంది.”
English
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Any Muslim, who emancipates another Muslim man, Allah will set free from Hell Fire an organ of his body, for every organ of the other’s (i.e. from the body of the emancipated person ).” Agreed upon.
At-Tirmidhi transmitted on the authority of Abu Umamah (RAA), “The Messenger of Allah (ﷺ) said: “Any Muslim man, who emancipates two Muslim women, they will be his release from Hell Fire.” At-Tirmidhi graded it as Sahih.
Abu Dawud transmitted on the authority of Ka’b bin Murrah (RAA), “The Messenger of Allah (ﷺ) said: “Any Muslim woman, who emancipates another Muslim woman, she will be her release from Hell Fire.”
సారాంశం
ఒక ముస్లిం స్త్రీకిగానీ, పురుషునికిగానీ స్వేచ్ఛా భాగ్యాన్ని ప్రసాదించటం మనిషి తన పరలోక జీవితాన్ని బాగుచేసుకోవటమేననీ, ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అతని పాలిట మన్నింపుకు, కారుణ్యానికి దోహదకారిగా పరిణమిస్తాయనీ ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దైవప్రవక్త ﷺ పలు విధాలుగా ఈ సత్కార్యం కోసం తన సహచరుల్ని ప్రోత్సహించారు. ఈ దాస్య శృంఖలాల నుంచి మానవతకు విముక్తి నొసగటం అంటే మనిషి తన ఆత్మకు మేలు చేకూర్చుకోవటమేనని ఉపమానాల ద్వారా విడమరచి చెప్పారు. బానిసల హక్కులను స్పష్టపరిచారు. లేకపోతే ఆనాడు బానిసలు పశువుల కన్నా హీనంగా పరిగణించబడేవారు.
హదీసు ఉల్లేఖకులు
కాబ్ బిన్ ముర్ర (రదియల్లాహు అన్హు) : ముర్ర బిన్ కాబ్ అని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు. మొదట బస్రాకు వచ్చారు. తరువాత జోర్డాన్కు ప్రస్థానం చేశారు. జోర్డాన్లోనే హిజ్రీ 57 లేదా 59లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1220
హదీసు 1221
وَعَنْ أَبِي ذَرٍّ - رضى الله عنه - { قَالَ: سَأَلْتُ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -أَيُّ اَلْعَمَلِ أَفْضَلُ? قَالَ: "إِيمَانٌ بِاَللَّهِ, وَجِهَادٌ فِي سَبِيلِهِ". قُلْتُ: فَأَيُّ اَلرِّقَابِ أَفْضَلُ? قَالَ: " أَعْلَاهَ ا ثَمَنًا, وَأَنْفَسُهَا عِنْدَ أَهْلِهَا" } مُتَّفَقٌ عَلَيْهِ"..
హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం: “అన్నింటికన్నా మేలైన ఆచరణ ఏది?” అని నేను దైవప్రవక్త ﷺను ప్రశ్నించగా, “దైవాన్ని విశ్వసించటం మరియు దైవమార్గంలో పోరాడటం” అని ఆయన ﷺ బదులిచ్చారు. “ఎలాంటి బానిసను విడుదల చేయటం శ్రేష్ఠమైనది?” అని నేను ప్రశ్నించగా, “చాలా ఎక్కువ ధర పలికే బానిస, యజమానుల దృష్టిలో ఉత్తమునిగా, ప్రియతమునిగా ఉండే బానిస” అని ఆయన ﷺ వివరించారు. (బుఖారీ, ముస్లిం)
English
Abu Dharr (RAA) narrated, I asked the Messenger of Allah (ﷺ) ‘Which action is the most excellent?’ He replied, “Faith in Allah and Jihad in His Cause.” I then asked, ‘Which slaves are the most excellent (for the purpose of emancipating them)’ and he replied, “Those whose prices are the highest and are the most valuable to their owners.” Agreed upon.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1221
హదీసు 1222
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ "مَنْ أَعْتَقَ شِرْكًا لَهُ فِي عَبْدٍ, فَكَانَ لَهُ مَالٌ يَبْلُغُ ثَمَنَ اَلْعَبْدِ, قُوِّمَ عَلَيْهِ قِيمَةَ عَدْلٍ, فَأَعْطَى شُرَكَاءَهُ حِصَصَهُمْ, وَعَتَقَ عَلَيْهِ اَلْعَبْدُ, وَإِلَّا فَقَدْ عَتَقَ مِنْهُ مَا عَتَقَ" } مُتَّفَقٌ عَلَيْه ِ. وَلَهُمَا: عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - { "وَإِلَّا قُوِّمَ عَلَيْهِ, وَاسْتُسْعِيَ غَيْرَ مَشْقُوقٍ عَلَيْهِ" }. وَقِيلَ: إِنَّ اَلسِّعَايَةَ مُدْرَجَةٌ فِي اَلْخَبَر ِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: ‘ఎవరయినా ఉమ్మడి యాజమాన్యం క్రింద ఉన్న బానిసకు తన భాగం మేరకు స్వేచ్ఛ నివ్వదలచినప్పుడు ఇవ్వవచ్చు. ఇంకా అతని దగ్గర బానిస విముక్తికి కావలసిన మిగతా సొమ్ముకూడా ఉంటే, న్యాయసమ్మతంగా బానిస ధరను నిర్ణయించి ఇతర భాగస్వాములకు ఇవ్వవలసిన మొత్తాన్ని అతనే తన పైకం నుండి చెల్లించి, ఆ బానిసకు పూర్తిగా స్వేచ్ఛ నొసగాలి. అలా చేయలేకపోతే అతను ఆ బానిసకు ఏ మేరకు స్వేచ్ఛ నిస్తాడో ఆ మేరకు ఆ బానిస స్వేచ్ఛా పరుడవుతాడు.” (బుఖారీ, ముస్లిం)
ఉభయులూ (బుఖారీ, ముస్లింలు) అబూహురైరా (రదియల్లాహు అన్హు) నుండి సంగ్రహించిన కథనంలో ఇలా వుంది : లేకపోతే అతని ధర నిర్ణయించబడుతుంది. అతనిపై భారం వేయకుండానే స్వేచ్ఛ పొందే అవకాశం అతనికి ఇవ్వబడుతుంది.”
English
Ibn 'Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Anyone who emancipates his share in a slave and has enough money to pay the full price for him, a fair price for the slave should be fixed. His partners should be given their shares, and the slave should thus be emancipated. Otherwise he is emancipated only to the extent of the first man’s share.” Agreed upon,
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Otherwise his value will be estimated and he will be required to work to pay for his freedom, but he must not be overburdened.” Agreed upon. And it has been said that the requirement to work was Mudraj (words of the narrator lumped into the narration).
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1222
హదీసు 1223
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ " لَا يَجْزِي وَلَدٌ وَالِدَهُ, إِلَّا أَنْ يَجِدَهُ مَمْلُوكًا فَيَشْتَرِيَهُ, ثُمَّ يُعْتِقَهُ" } رَوَاهُ مُسْلِم ٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ కొడుకూ తన తండ్రికి ప్రత్యామ్నాయం కాజాలడు – బానిసగా ఉన్న తండ్రిని కొని, అతనికి స్వేచ్ఛను ప్రసాదిస్తే తప్ప!” (ముస్లిం)
English
Abu Hurairah (RAA), narrated that The Messenger of Allah said, “A son cannot ever repay his parents what he owes them, unless he finds them in slavery, then buys them and emancipates them.” Related by Muslim.
సారాంశం
ఒక కొడుకు అసాధారణమైన రీతిలో తండ్రి సేవలు చేసినప్పటికీ తన తండ్రి మహోపకారానికి ‘బదులు’ చెల్లించలేడని హదీసు భావం. అయితే బానిసత్వం నుండి విమోచన నొసగటమన్నది ఎంత గొప్ప పనంటే; తండ్రి మహోపకారానికి బదులుగా దరిదాపుల్లోకి రాగల సత్కార్యం ఏదన్నా ఉండగలదంటే అది బానిస విమోచనమే. అందునా బానిసత్వంలో మగ్గుతున్న తండ్రిని గనక కొని, అతన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తిని కలిగిస్తే ఇక ఆ కొడుకు తండ్రి రుణాన్ని చాలా వరకు తీర్చుకున్నాడని భావించవచ్చు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1223
హదీసు 1224
وَعَنْ سَمُرَةَ - رضى الله عنه - أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { "مَنْ مَلَكَ ذَا رَحِمٍ مَحْرَمٍ, فَهُوَ حُرٌّ" } رَوَاهُ أَحْمَدُ, وَالْأَرْبَعَة ُ. وَرَجَّحَ جَمْعٌ مِنَ الْحُفَّاظِ أَنَّهُ مَوْقُوف ٌ.
హజ్రత్ సముర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ వ్యక్తయినా ‘జూరహం, మహ్రమ్’ బానిస బంధువుకు యజమాని అయినట్లయితే, ఇక ఆ బానిసకు బానిసత్వం నుండి విముక్తి లభించినట్లే.” (దీనిని అహ్మద్ మరియు నలుగురు ఉల్లేఖించారు. హదీసువేత్తలలోని ఒక వర్గం దీన్ని ‘మౌఖూఫ్’గా ఖరారు చేసింది.)
English
Samurah bin Jundub (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Whoever obtains possession of a relative, who is next of kin, that person becomes free.” Related by Ahmad and the four Imams. Some scholars are of the opinion that it is Mawquf (not connected to the Prophet.)
సారాంశం
హదీసువేత్తలు నుడివినట్లు ఇది మౌఖూఫ్ కోవకు చెందిన హదీసు. అయితే ఈ అధ్యాయం క్రింద మరికొన్ని హదీసులు కూడా ఉన్నాయి. వాటిలో ఒక హదీసును ఇబ్నె ఖత్తాన్, ఇబ్నె హజమ్లు ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. హదీసులో జూరహం, మహ్రమ్ అన్న పదాలు వచ్చాయి. అంటే అతి సమీప, రక్త సంబంధిత బంధువులన్నమాట. ఉదాహరణకు: తండ్రి, పినతండ్రి, సోదరుడు వగైరా.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1224
హదీసు 1225
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ رَجُلاً أَعْتَقَ سِتَّةً مَمْلُوكِينَ لَهُ, عِنْدَ مَوْتِهِ, لَمْ يَكُنْ لَهُ مَالٌ غَيْرَهُمْ, فَدَعَا بِهِمْ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -فَجَزَّأَهُمْ أَثْلَاثًا, ثُمَّ أَقْرَعَ بَيْنَهُمْ, فَأَعْتَقَ اِثْنَيْنِ, وَأَرَقَّ أَرْبَعَةً, وَقَالَ لَهُ قَوْلاً شَدِيدًا } رَوَاهُ مُسْلِم ٌ.
హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక వ్యక్తి తనకు మరణ ఘడియ సమీపించినపుడు తన దగ్గరున్న ఆరుగురు బానిసలకు విముక్తిని కలిగించాడు. ఈ బానిసలు తప్ప అతనికి వేరొక ఆస్తి అంటూ ఏమీ లేదు. ఈ సంగతి తెలుసుకున్న దైవప్రవక్త ﷺ వాళ్ళను పిలిపించి వారిని మూడు భాగాలుగా విభజించారు. ఆ తరువాత చీటీలు వేసి ఇద్దరు బానిసలను (మూడో వంతును) విడుదల చేశారు. మిగిలిన నలుగురినీ అలాగే ఉండనిచ్చారు. స్వేచ్ఛ నొసగిన వ్యక్తినుద్దేశ్యించి ఆయన ﷺ పరుష మాటల్ని కూడా అన్నారు. (ముస్లిం)
English
’Imran bin Husain (RAA) narrated, ‘A man who had no other property emancipated six of his slaves at the time of his death. Allah’s Messenger (ﷺ)sent for them, and after dividing them into three groups, he cast lots among them, set two of them free and kept four in slavery, and spoke very harshly to the man (who emancipated them).’ Related by Muslim.
సారాంశం
ఈ హదీసు ద్వారా మనకు అవగతమయ్యే ముఖ్య విషయమేమిటంటే మరణ సమయంలో చేసే సదఖా (దానం) ‘వీలు’గా మాత్రమే పరిగణించబడుతుంది. షరీయత్ ప్రకారం మనిషి తాను వదలి వెళ్ళే ఆస్తి (తరకా)లో మూడో వంతును మాత్రమే ‘వీలు’ వ్రాయగలడు. అంతకన్నా ఎక్కువగా దానం చేయలేడు. ఒకవేళ ఎవరయినా మరణ వ్యాధికిలోనై వున్న సమయంలో మూడో వంతుకు మించి దానధర్మాలు చేయమని ప్రకటించినప్పటికీ అది ఆచరణయోగ్యమవదు. ఆ ‘వసీయతు’ను సంస్కరించవలసిందే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1225
హదీసు 1226
وَعَنْ سَفِينَةَ - رضى الله عنه - { قَالَ: كُنْتُ مَمْلُوكًا لِأُمِّ سَلَمَةَ فَقَالَتْ: أُعْتِقُكَ, وَأَشْتَرِطُ عَلَيْكَ أَنْ تَخْدِمَ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -مَا عِشْتَ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَالْحَاكِم ُ.
హజ్రత్ సఫీనా (రదియల్లాహు అన్హు) కథనం : నేను ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) గారి బానిసగా ఉండేవాణ్ణి. అయితే ఆమె నన్నుద్దేశ్యించి, “నువ్వు జీవితాంతం దైవప్రవక్త ﷺ కు సేవచేయాలన్న షరతుపై నేను నీకు స్వేచ్ఛ నొసగుతున్నాను” అని అన్నది. (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి, హాకిమ్లు ఉల్లేఖించారు)
English
Safinah (RAA) narrated, ‘I was a slave of Umm Salamah and she said, ‘I shall emancipate you, but on the condition that you serve Allah’s Messenger (ﷺ) as long as you live.’ Related by Ahmad, Abu Dawud, An-Nasa’i and Al-Hakim.
సారాంశం
బానిసను బేషరతుగా విడుదల చేయడంతోపాటు, షరతులు పెట్టి స్వేచ్ఛనొసగటం కూడా సమంజసమేనని ఈ హదీసు ద్వారా ద్యోతకమవుతోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1226
హదీసు 1227
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { "إِنَّمَا اَلْوَلَاءُ لِمَنْ أَعْتَقَ" } مُتَّفَقٌ عَلَيْهِ فِي حَدِيثٍ طَوِيلٍ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు : “స్వేచ్ఛనొసగేవానికే ‘వలా’ హక్కు చెందుతుంది.” (బుఖారీ, ముస్లిం – ఇది సుదీర్ఘమయిన హదీసులోని భాగం)
English
'A’ishah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Wala’ is (legally) for the manumitter.” Agreed upon. It is part of a long Hadith (refer to hadith no. 811).
సారాంశం
స్వేచ్ఛ నొసగబడిన బానిస మరణించినపుడు అతను ఈ ప్రపంచంలో వదలి వెళ్ళిన ఆస్తిపాస్తులు – వారసులు లేని పక్షంలో – అతనికి స్వేచ్ఛనొసగిన ఒకప్పటి యజమానికి దక్కుతాయి. ఈ ఆస్తిపాస్తులనే ‘వలా’ గా వ్యవహరిస్తారు. ఈ హదీసు ఇంతకు ముందు కూడా ‘వాణిజ్య పుస్తకం’లో వివరంగా వచ్చింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1227
హదీసు 1228
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ " اَلْوَلَاءُ لُحْمَةٌ كَلُحْمَةِ اَلنَّسَبِ, لَا يُبَاعُ وَلَا يُوهَبُ" } رَوَاهُ اَلشَّافِعِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِم ُ وَأَصْلُهُ فِي "اَلصَّحِيحَيْنِ" بِغَيْرِ هَذَا اَللَّفْظ ِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ‘వలా’ కూడా వంశం మాదిరిగా పెనవేసుకుని ఉండే ఒక భాగమే. దాన్ని అమ్మడంగానీ, కానుకగా ఇవ్వటంగానీ కుదరదు.” (దీనిని షాఫయి ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్, హాకిమ్లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ‘సహీహైన్’లో దీని మూలం ఉంది. అయితే ఈ వాక్యాలు అవి కావు).
English
Ibn 'Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “The Wala’ (of a manumitted slave) is considered as one’s lineage, not to be sold or donated (refer to hadith no. 984).” Related by Ash-Shafi’i. Ibn Hibban and Al-Hakim graded it as Sahih. It is also related by Al-Bukhari and Muslim with different wording
సారాంశం
సమీప బంధువుకు వారసత్వ హక్కుగా ఆస్తి ఎలా సంక్రమిస్తుందో అలాగే బానిసకు స్వేచ్ఛ నొసగిన వ్యక్తికి ‘వలా’ సంక్రమిస్తుందని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. తండ్రీ-కొడుకుల మధ్య గల సంబంధం, అన్నదమ్ముల మధ్యగల అనుబంధం ఎటువంటిదో ఇదీ (వలా కూడా) అటువంటిదే. అందుకే ‘వలా’ను విక్రయించడానికిగానీ, బహుమానంగా ఇవ్వడానికిగానీ వీలు లేదు. మెజారిటీ విద్వాంసుల అభిమతం కూడా ఇదే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|15. బానిస విమోచన పుస్తకం|15.0 బానిస విమోచన|హదీసు 1228
You must be logged in to post a comment.