హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి), రెండవ అధ్యాయం: ఆరోపణలు, ఆధారాలు. ఈ అధ్యాయంలో 10 హదీసులు (హదీసు 1210 – 1219) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
14.2 ఆరోపణలు, ఆధారాలు
باب الدعوى والبينات
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1210
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { "لَوْ يُعْطَى اَلنَّاسُ بِدَعْوَاهُمْ, لَادَّعَى نَاسٌ دِمَاءَ رِجَالٍ, وَأَمْوَالَهُمْ, وَلَكِنِ اَلْيَمِينُ عَلَى اَلْمُدَّعَى عَلَيْهِ" } مُتَّفَقٌ عَلَيْه ِ وَلِلْبَيْهَقِيِّ بِإِسْنَادٍ صَحِيحٍ: { "اَلْبَيِّنَةُ عَلَى اَلْمُدَّعِي, وَالْيَمِينُ عَلَى مَنْ أَنْكَرَ }.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఒకవేళ ప్రజలకు వారు చేసిన ఆరోపణల (వేసిన దావాల) ఆధారంగానే వారి హక్కు వారికిచ్చేస్తే, ప్రజలు ఇతరుల రక్తం మరియు సంపదల కోసం కూడా దావా చేస్తారు. అయితే ముద్దాయి విధిగా ప్రమాణం చేయవలసి ఉంటుంది. (బుఖారీ, ముస్లిం)
బైహఖీ ప్రామాణికమైన పరంపర ద్వారా చేసిన ఉల్లేఖనంలో ఇలా ఉంది : “సాక్ష్యంలోని నిజానిజాల బాధ్యత ఆరోపించిన వ్యక్తిపై ఉంటుంది. కాగా; ప్రమాణం యొక్క బాధ్యతను ఆరోపణను నిరాకరించిన వ్యక్తి స్వీకరించవలసి ఉంటుంది.”
English
Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) said: "If people were given whatever they claimed (in disputes), some people would claim the lives and wealth of others; but the oath (of denial) must be taken by the defendant." [Agreed upon]. al-Baihaqi has reported with a Sahih (authentic) chain of narrators: "But the proof (Bayyinah) lies on the one who is making the claim, and the other (Yamin) must be taken by the one who rejects the claim."
సారాంశం
ఈ హదీసులో తీర్పుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సూత్రం వివరించబడింది. అదేమంటే ఆరోపించేవాడు (దావాచేసేవాడు) తన ఆరోపణలకు సంబంధించిన స్పష్టమయిన ఆధారాలను సమర్పించాలి. సాక్ష్యాలను తీసుకురావాలి. లేదా నిందితుడు తనపై మోపబడిన నిందను ఖుద్దుగా అంగీకరించాలి. ఒకవేళ అలా కానప్పుడు నిందితుడు తనపై మోపబడిన ఆరోపణలను బూటకమని రుజువు చేసే ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించాలి. అదీ చేయలేనప్పుడు అతడు దైవంపై ప్రమాణం చేయాలి. అత్యధికమంది విద్వాంసుల అభిమతం కూడా ఇదే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1210
హదీసు 1211
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -عَرَضَ عَلَى قَوْمٍ اَلْيَمِينَ, فَأَسْرَعُوا, فَأَمَرَ أَنْ يُسْهَمَ بَيْنَهُمْ فِي اَلْيَمِينِ, أَيُّهُمْ يَحْلِفُ } رَوَاهُ اَلْبُخَارِيّ ُ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒకానొక విషయంలో గొడవపడి తన దగ్గరకు వచ్చిన ఇరుపక్షాల వారిని ప్రమాణం చేయమని ఆదేశించగా, వాళ్ళు దాని కోసం తక్షణం సిద్ధమయ్యారు. అప్పుడు ఆయన ﷺ, “వీళ్ళల్లో ప్రమాణం చేయవలసిందెవరో చీటీ వేసి నిర్ధారించండి” అని అన్నారు. (బుఖారీ)
English
Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) suggested to some people that they should take an oath (Yamin) and when they hastened to do so he ordered that lots should be cast among them concerning the oath, as to which of them should take it. [Reported by al-Bukhari].
సారాంశం
తగాదాపడిన ఇరు పక్షాలవారు పరస్పరం నిందారోపణలు చేసుకుని – నిందించేవారెవరో, నిందితులెవరో ఖచ్చితంగా తేలనప్పుడు – వారినుండి ప్రమాణ స్వీకారం చేయించవలసి ఉంటుంది. వారిలో ఏ ఒక్కరైనా ప్రమాణం చేయడానికి నిరాకరిస్తే, అవతలి వ్యక్తి ప్రమాణం చేసి తన సొమ్మును తీసేసుకుంటాడు. ఒకవేళ ఇరువర్గాల వారు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధపడితే అప్పుడు చీటీ (టాస్) వేయబడుతుంది. అందులో ఎవరి పేరు వస్తే వారు ప్రమాణం చేసి సొమ్ము తీసుకునేందుకు అర్హులవుతారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1211
హదీసు 1212
وَعَنْ أَبِي أُمَامَةَ اَلْحَارِثِيُّ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { " مَنْ اِقْتَطَعَ حَقَّ امْرِئٍ مُسْلِمٍ بِيَمِينِهِ, فَقَدْ أَوْجَبَ اَللَّهُ لَهُ اَلنَّارَ, وَحَرَّمَ عَلَيْهِ اَلْجَنَّةَ". فَقَالَ لَهُ رَجُلٌ: وَإِنْ كَانَ شَيْئًا يَسِيرًا يَا رَسُولَ اَللَّهِ? قَالَ: "وَإِنْ كَانَ قَضِيبًا مِنْ أَرَاكٍ" } رَوَاهُ مُسْلِم ٌ.
హజ్రత్ అబూ ఉమామ హారిసీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “ఎవరయినా తన ముస్లిం సోదరుని హక్కును తన ప్రమాణం చేత కాజేస్తే అల్లాహ్ అతని కోసం నరకాన్ని తప్పనిసరిగా సిద్ధం చేస్తాడు. అతని కోసం స్వర్గాన్ని నిషిద్ధం (హరామ్) గావిస్తాడు.” ‘ఓ దైవప్రవక్తా ﷺ! ఏదన్నా అతి స్వల్పమయిన వస్తువును కాజేస్తే…?!’ అని ఒక వ్యక్తి సందేహపడగా, “….. వృక్షం యొక్క కొమ్మ అయినాసరే” అని ఆయన ﷺ చెప్పారు.
English
Narrated Abu Umamah al-Harithi (RA): Allah's Messenger (ﷺ) said. "If anyone seized – by his oath – what rightly belongs to a Muslim, Allah has made the Hell-fire compulsory for him and forbidden for him the Paradise." A man asked, "O Allah's Messenger, even if it were something insignificant?" He replied, "Even if it were a stick from an Arak tree." [Reported by Muslim].
హదీసు ఉల్లేఖకులు
అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) : అబూ ఉమామ బిన్ సాలబ అన్సారీ హారిసీ. ఈయన పేరుపై తీవ్రమయిన భేదాభిప్రాయం ఉంది. అయాస్ బిన్ సాలబ అనేది సరైన పేరని తెలుస్తోంది. ఖజ్రజ్ తెగకు చెందినవారు. వేరొక కథనం ప్రకారం బలవీగా కూడా పిలువబడ్డారు. సనాతన సహచరులలో ఒకరు. తన తల్లి సేవల్లో నిమగ్నులై ఉన్నందున బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1212
హదీసు 1213
وَعَنِ الْأَشْعَثِ بْنِ قَيْسٍ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { "مَنْ حَلَفَ عَلَى يَمِينٍ, يَقْتَطِعُ بِهَا مَالَ امْرِئٍ مُسْلِمٍ, هُوَ فِيهَا فَاجِرٌ, لَقِيَ اَللَّهَ وَهُوَ عَلَيْهِ غَضْبَانُ } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ అష్అత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఏ వ్యక్తియితే అబద్ధ ప్రమాణం చేసి ఇతరుల సొమ్మును కాజేస్తాడో అతనికి అల్లాహ్ అత్యంత అప్రసన్నుడైన స్థితిలో దర్శనమిస్తాడు.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated al-Ash'ath bin Qais (RA): Allah's Messenger (ﷺ) said: "If anyone swears a firm oath – knowingly, intentionally, taking by it property belonging to a Muslim, Allah will be angry with him when he meets Him (on the Day of Resurrection)." [Agreed upon].
హదీసు ఉల్లేఖకులు
అష్అత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) మాదీ కరిబ్ అల్కింది. అబూ ముహమ్మద్ ఈయన మారుపేరు. కూఫాలో స్థిరపడ్డారు. ‘యర్మూక్’ యుద్ధ సందర్భంగా ఈయన కన్ను ఒకటి పగిలిపోయింది. గొప్ప దాత. పరోపకార గుణం ఈయనలో మెండుగా ఉండేది. ఒకానొక సందర్భంగా ఒట్టేసుకుని పరిహారంగా పదిహేను వేలు ఇచ్చారు. అజర్ బాయ్‌జాన్ ప్రాంతానికి గవర్నర్‌గా నియమితులయ్యారు. సిఫ్ఫీన్ యుద్ధంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) పక్షాన నిలిచారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరణించిన నలభై రోజులకు ఈయన కన్నుమూశారు. అప్పటికి ఈయన వయస్సు 63 సంవత్సరాలు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1213
హదీసు 1214
وَعَنْ أَبَى مُوسَى [ اَلْأَشْعَرِيِّ ] - رضى الله عنه - { أَنَّ رَجُلَيْنِ اِخْتَصَمَا فِي دَابَّةٍ, وَلَيْسَ لِوَاحِدٍ مِنْهُمَا بَيِّنَةٌ, فَقَضَى بِهَا رَسُولُ اَللَّهِ ﷺ. بَيْنَهُمَا نِصْفَيْنِ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ وَهَذَا لَفْظُهُ, وَقَالَ: إِسْنَادُهُ جَيِّد ٌ.
హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం : ఇద్దరు వ్యక్తులు ఒక జంతువు విషయంలో తగాదాపడ్డారు. వారిద్దరిలో ఏ ఒక్కరు కూడా ఆ జంతువు తనదేనన్న దాని గురించి తగు ఆధారం చూపలేకపోయారు. అందుచేత ఆయన ﷺ ఆ జంతువును వారిద్దరికీ చెరి సగం చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు. ఈ వాక్యాలు నసాయివి. దీని పరంపర చాలా బావుంది)
English
Narrated Abu Musa (RA): Two men had a disputer over an animal, and neither of them had a proof. So Allah's Messenger (ﷺ) gave a ruling that it be divided in halves between them. [Reported by Ahmad, Abu Dawud and an-Nasa'i, and the wording is his (an-Nasa'i) who said that it's chain of narrators is Jayyid (good)].
సారాంశం
ఈ హదీసుకు భావార్థంగా అల్లామా ఖత్తాబీ ఇలా అంటున్నారు. ఆ ఒంటె లేక ఆ జంతువును ఆ ఇద్దరూ బహుశా పట్టుకుని వచ్చి ఉంటారు. అందువల్లనే దైవప్రవక్త ﷺ ఆ జంతువును వారిద్దరి మధ్య పంచిపెట్టారు. అదే కాకుండా ఉంటే – అంటే ఆ ఇద్దరి వద్ద కాకుండా మరో మూడో వ్యక్తి అధీనంలో అది ఉండి ఉంటే – కేవలం డిమాండు చేసినంత మాత్రానికే అది వారికి లభించి ఉండేది కాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1214
హదీసు 1215
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { "مَنْ حَلَفَ عَلَى مِنْبَرِي هَذَا بِيَمِينٍ آثِمَةٍ, تَبَوَّأَ مَقْعَدَهُ مِنْ اَلنَّارِ" } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఎవరయినా సరే నా ఈ వేదికపై నిలబడి అబద్ధపు ప్రమాణం చేశాడంటే అతడు తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకున్నట్లే.” (దీనిని అహ్మద్, అబూ దావూద్, నసాయి ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Narrated Jabir (RA): The Prophet (ﷺ) said: "If anyone swears a false oath on this Minbar of mine, he will have prepared his seat in the Hell-Fire." [Reported by Ahmad, Abu Dawud and an-Nasa'i. Ibn Hibban graded it Sahih (authentic)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1215
హదీసు 1216
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ "ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمْ اَللَّهُ يَوْمَ اَلْقِيَامَةِ, وَلَا يَنْظُرُ إِلَيْهِمْ, وَلَا يُزَكِّيهِمْ, وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ: رَجُلٌ عَلَى فَضْلِ مَاءٍ بِالْفَلَاةِ, يَمْنَعُهُ مِنْ اِبْنِ اَلسَّبِيلِ; وَرَجُلٌ بَايَعَ رَجُلاً بِسِلْعَةٍ بَعْدَ اَلْعَصْرِ, فَحَلَفَ لَهُ بِاَللَّهِ: لَأَخَذَهَا بِكَذَا وَكَذَا, فَصَدَّقَهُ, وَهُوَ عَلَى غَيْرِ ذَلِكَ; وَرَجُلٌ بَايَعَ إِمَامًا لَا يُبَايِعُهُ إِلَّا لِلدُّنْيَا, فَإِنْ أَعْطَاهُ مِنْهَا, وَفَى, وَإِنْ لَمْ يُعْطِهِ مِنْهَا, لَمْ يَفِ" } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు: ముగ్గురు వ్యక్తులతో అల్లాహ్ తీర్పు దినాన మాట్లాడటంగానీ, వారి వైపు కన్నెత్తి (చల్లని చూపు) చూడటం గానీ చేయడు. పాపాలనుండి వారిని పరిశుద్ధుల్ని కూడా చేయడు. పైగా వారికోసం వ్యధాభరితమయిన యాతన సిద్ధంగా ఉంటుంది. వారిలో ఒకడు ఒక బాటసారిని ఎడారి ప్రాంతంలో మిగులు జలాల నుండి సయితం ఆపేవాడు. రెండవవాడు : సాయం సమయాన (లేక అస్ర్ నమాజు అనంతరం) ఒక వస్తువును విక్రయిస్తూ, దాన్ని తాను ఇంత మొత్తానికి లోగడ కొన్నానని అల్లాహ్ పేరున ప్రమాణం చేసేవాడు. నిజానికి అతను చెప్పినంత ధరకు దాన్ని కొని ఉండడు. కాని కొనుగోలుదారు అతని మాటల్ని నమ్మి మోసపోతాడు. మూడవవాడు: ప్రాపంచిక పరమార్థాల కోసం రాజుకు విధేయుడై ఉంటానని ప్రతిజ్ఞ చేసినవాడు. రాజు తనకేదైనా ఇస్తున్నంత కాలం విశ్వాసపాత్రుడుగా ఉంటాడు. ఇవ్వకపోతే అసమ్మతివాదిగా మారిపోతాడు.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "There are three to whom Allah will not speak to on the Day of Resurrection, not will He look at them, nor will He purify them, and they will have a painful punishment. (1) A man at a place with excess water in the desert and who withholds it from the travelers. (2) A man who sold a commodity to another person in the afternoon (or after the 'Asr prayer) and swore to him by Allah that he had bought it at such and such price and he (the buyer) believed him yet that was not the case. (3) And a man who pledged allegiance to an Imam only for the sake of the world (material gains). Hence, if the Imam bestowed on him something out of that (i.e. worldly riches) he stood by his pledge of allegiance, and if he did not give him, he did not fulfill the pledge of allegiance." [Agreed upon].
సారాంశం
ఈ హదీసు ప్రకారం మిగులు జలాలను ఇతరులకు ఉపయోగపడకుండా ఆపుకోవటం, సాయంత్రం పూట అబద్ధపు ప్రమాణాలు చేసి వస్తువులను విక్రయించటం, ప్రాపంచిక స్వప్రయోజనాలను ఆశించి కాలపు చక్రవర్తిని సమర్థించటం – ఇవన్నీ విశ్వప్రభువు అప్రసన్నతకు కారణంగా పరిణమిస్తాయి. ఇలాంటి పనులు చేసేవారు పరమ ప్రభువు దయాదాక్షిణ్యాలకు, క్షమాభిక్షకు దూరమైపోతారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1216
హదీసు 1217
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - { أَنَّ رَجُلَيْنِ اِخْتَصَمَا فِي نَاقَةٍ, فَقَالَ كُلُّ وَاحِدٍ مِنْهُمَ ا نُتِجَتْ عِنْدِي, وَأَقَامَا بَيِّنَةً, فَقَضَى بِهَا رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -لِمَنْ هِيَ فِي يَدِهِ }.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : ఇద్దరు వ్యక్తులు దైవప్రవక్త ﷺ కొలువుకు ఒంటె వివాదం తీసుకువచ్చారు. ఒంటె తన చావిడీలోనే ఈనిందని వారిలో ప్రతి ఒక్కడూ వాదించసాగాడు. తమ వాదనకు అనుకూలంగా వాళ్ళు సాక్షుల్ని కూడా తీసుకువచ్చారు. ఇదంతా విని దైవప్రవక్త ﷺ, ఒంటె అధీనంలో వున్న వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
English
Narrated Jabir (RA): Two men disputed about a she-camel. Then, each of them said: this she-camel was born at my place, and each of them brought a proof (that it was his animal). Allah's Messenger (ﷺ) then ruled that it be taken by the one who had it in his possession.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1217
హదీసు 1218
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -رَدَّ اَلْيَمِينَ عَلَى طَالِبِ اَلْحَقِّ } رَوَاهُمَا اَلدَّارَقُطْنِيُّ, وَفِي إِسْنَادِهِمَا ضَعْف ٌ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రమాణం చేసే బాధ్యతను ఆరోపించే వ్యక్తిపై మోపారు. (ఈ రెండు హదీసులను కూడా దారె ఖుత్నీ ఉల్లేఖించారు. ఈ రెంటి పరంపరలోనూ బలహీనత ఉంది)
English
Narrated Ibn 'Umar (RA): The Prophet (ﷺ) re-directed al-Yamin (the oath to be sword by the defendant) to the one making the claim to some right. [ad-Daraqutni reported the two aforesaid Ahadith, and there is weakness in their chain of narrators].
సారాంశం
నిందితుడు తనపై మోపబడిన నిందను ఖండించే ఆధారంగానీ, సాక్షుల్నిగానీ తేలేకపోయినప్పుడు, నింద అబద్ధమని ప్రమాణం చేయడానికి కూడా నిరాకరించినపుడు ‘ప్రమాణం’ చేసే బాధ్యతను నిందించేవాడు స్వీకరించవలసి ఉంటుందని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1218
హదీసు 1219
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا { قَالَتْ: دَخَلَ عَلَيَّ النَّبِيُّ - صلى الله عليه وسلم -ذَاتَ يَوْمٍ مَسْرُورًا, تَبْرُقُ أَسَارِيرُ وَجْهِهِ. فَقَالَ: "أَلَمْ تَرَى أَنَّ مُجَزِّزًا اَلْمُدْلِجِيِّ ? نَظَرَ آنِفًا إِلَى زَيْدِ بْنِ حَارِثَةَ, وَأُسَامَةَ بْنِ زَيْدٍ, فَقَالَ: " هَذِهِ الْأَقْدَامُ بَعْضُهَا مِنْ بَعْضٍ" } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ఒకనాడు దైవప్రవక్త ﷺ సంతోషాతిశయంతో నా దగ్గరకు వచ్చారు. ఆయన ﷺ ముఖారవిందం ప్రకాశిస్తూ ఉంది. నన్నుద్దేశించి ఆయన ﷺ ఇలా అన్నారు : “నీకు తెలుసా! ముజజ్జిజ్ ముద్లిజీ ఇప్పుడిప్పుడే జైద్ బిన్ హారిస మరియు ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమా) లను చూసి ‘ఈ కాళ్ళు పరస్పర పోలికలు గలవి’ అని అన్నాడు.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated 'Aishah (RA): One day the Prophet (ﷺ) came to me overjoyed, his face shining (from happiness) and said, "Did you not see that Mujazziz al-Mudliji (a physiognomist) looked at Zaid bin Harithah and Usama bin Zaid, and then said, 'These feet (of Zaid and Usama) are related to one another.'" [Agreed upon].
సారాంశం
‘ఏమిటీ ఇందులో ఉన్న విశేషం?’ దైవప్రవక్త ﷺ ఈ మాటను విని అమితానందం చెందడానికి గల కారణం ఏమిటీ? అన్న సందేహం ఇక్కడ కలగటం సహజమే.
‘ముజజ్జిజ్ ముద్లిజీ’ ముఖ సాముద్రిక విద్యలో ప్రవేశమున్నవారు. ఈయన ముద్లిజ్ తెగ వారవటం చేత ముద్లిజీగా పిలువబడ్డారు.
జైద్ బిన్ హారిస – ఉసామ బిన్ జైద్లు ఇరువురూ ప్రక్క ప్రక్కనే పండుకుని ఉండగా ముద్లిజీ వారిద్దరినీ చూశారు. ఆ సమయంలో దుప్పటి వారి ముఖాలపై ఉంది. పాదాలు మాత్రం కనిపిస్తున్నాయి. కేవలం పాదాలను చూసి నిదురిస్తున్న వారిద్దరూ ఒకే వంశ వృక్షానికి చెందినవారని ముద్లిజీ చెప్పటం మహాప్రవక్త ﷺకు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) నలుపు రంగుపై కొంతమంది చెవులు కొరుక్కునేవారు. ఉసామా తండ్రి అయిన జైద్ బిన్ హారిస తెల్లగా ఉండటం వారి సంశయానికి అసలు కారణం. జైద్ సతీమణి అయిన ఉమ్మె ఐమన్ ఒక నీగ్రో (ఇథియోపియన్) మహిళ అన్న సంగతి ఇక్కడ గమనార్హం. బహుశా తల్లి రంగు ఉసామాకి వచ్చి ఉండవచ్చు. తండ్రి రంగు కొడుక్కి రాకపోయినంతమాత్రాన ముంచుకుపోయిందేమీ లేదు కదా! అయితే ముద్లిజీ కేవలం పాదాలను చూచి వారిద్దరూ తండ్రీకొడుకులన్న సంగతిని నిర్ధారించటం విశేషం! కులగోత్రాలు, నిమ్నోన్నతల వంటి అజ్ఞాన కాలపు అహంభావాలను రూపుమాపి దైవభక్తి, నీతి నడవడికల ప్రాతిపదికలపై సత్సమాజాన్ని రూపొందించగోరిన మహనీయ ముహమ్మద్ ﷺ వారికి సహజంగానే ఈ విషయం తృప్తినీ, ఆనందాన్నీ ఇచ్చింది. అందుకే ఆనందంతో పరవశించిపోయారు. ఆ ఆనందాన్ని తన సతీమణితో కూడా పంచుకున్నారు. ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) పట్ల దైవప్రవక్త ﷺ కు గల ప్రత్యేక వాత్సల్యాన్ని కూడా ఈ హదీసు ప్రతిబింబిస్తూ ఉంది.
హదీసు ఉల్లేఖకులు
ముజజ్జిజ్ ముద్లిజీ (రదియల్లాహు అన్హు) : ముద్లజ్ తెగకు చెందినవారు. అజ్ఞానకాలంలో ముఖ సాముద్రిక విద్యలో నిష్ణాతునిగా పేరుగాంచారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.2 ఆరోపణలు, ఆధారాలు|హదీసు 1219
You must be logged in to post a comment.