హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 14.1 సాక్ష్యాలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి), 1వ అధ్యాయం: సాక్ష్యాలు. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 1201 – 1209) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

14.1 సాక్ష్యాలు

↑ విషయ సూచిక

باب الشهادات

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1201

హదీసు 1201

عَنْ زَيْدِ بْنِ خَالِدٍ اَلْجُهَنِيِّ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { "أَلَا أُخْبِرُكُمْ بِخَيْرِ اَلشُّهَدَاءِ? هُوَ اَلَّذِي يَأْتِي بِشَهَادَتِهِ قَبْلَ أَنْ يُسْأَلَهَا" } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ జుహనీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “అత్యుత్తమ శ్రేణికి చెందిన సాక్షి ఎవరో నేను మీకు చెప్పనా? – సాక్ష్యమివ్వమని తనను ఎవరూ కోరకుండానే తనంతట తానుగా సాక్ష్యమిచ్చేవాడు.” (ముస్లిం)

English

Narrated Zaid bin Khaled al-Juhani (RA): The Prophet (ﷺ) said: "Shall I not inform you who is the best witness? He is the one who produces his testimony before he is asked for it." [Reported by Muslim].

సారాంశం

మనిషి సాక్ష్యానికి కట్టుబడి ఉండటం, తన చర్మచక్షువులతో చూసిన దానిని, తన కర్ణపుటాలలో విన్న దానిని సంబంధిత వ్యక్తులు వచ్చి కోరినప్పుడు యథాతథంగా వివరించటం నిస్సందేహంగా నిజాయితీతో కూడుకున్న విషయమే. అయితే ఒకరు అభ్యర్థించకపోయినప్పటికీ పరిస్థితుల స్వరూపానికి మనిషి స్పందించి తన మనస్సాక్షిని అభివ్యక్తం చేయటం మరింత గొప్ప విషయం. ఒకానొక సంఘటనకు సంబంధించి తాను సాక్షిగా ఉండి కూడా, సంబంధిత వ్యక్తులు తన వద్దకు వచ్చి సాక్ష్యం కోరలేదుకదా! అని నిర్లిప్తంగా ఉండకూడదు. ఈ నిర్లిప్తత వల్ల బాధిత వ్యక్తికి న్యాయం చేకూరకపోవచ్చు. దుర్మార్గం ప్రబలిపోవచ్చు. అందుకే సాక్ష్యాల విషయంలో విశ్వాసులు చాలా ఖచ్చితంగా ఉండాలి. సాక్ష్యానికి కట్టుబడేవారిని దివ్య ఖుర్ఆన్ కొనియాడింది. సాక్ష్యాలను కప్పిపుచ్చే వారిని హెచ్చరించింది. ఉదాహరణకు : “సాక్ష్యాన్ని కప్పిపుచ్చకండి. సాక్ష్యాన్ని కప్పిపుచ్చినవాడి హృదయం పాపభూయిష్టమైనది.” (2:283) అన్న ఖుర్ఆన్ సూక్తి గమనార్హం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1201

1202

హదీసు 1202

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ "إِنَّ خَيْرَكُمْ قَرْنِي, ثُمَّ اَلَّذِينَ يَلُونَهُمْ, ثُمَّ اَلَّذِينَ يَلُونَهُمْ, ثُمَّ يَكُونُ قَوْمٌ يَشْهَدُونَ وَلَا يُسْتَشْهَدُونَ, وَيَخُونُونَ وَلَا يُؤْتَمَنُونَ, وَيَنْذُرُونَ وَلَا يُوفُونَ, وَيَظْهَرُ فِيهِمْ اَلسِّمَنُ" } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు : నా కాలం మీ కాలాలన్నింటికన్నా శ్రేష్ఠమైనది. ఆ తరువాత రాబోయే కాలం, మరి ఆ తరువాతి కాలం. ఆ తరువాత (కాలంలో) సాక్ష్యమివ్వమని కోరకపోయినా, సాక్ష్యాలిచ్చే జనులు పుట్టుకువస్తారు. వాళ్ళు అవినీతిపరులై ఉంటారు.వారిలో నిజాయితీ ఉండదు. మొక్కుకుంటారు గాని మొక్కుబడులు తీర్చరు. బాగా బలిసి ఉంటారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Imran bin Husain (RA): Allah's Messenger (ﷺ) said: "Verily! The best of you (i.e. Muslims) are my generation, then their immediate followers, then their immediate followers. After them there will be people who will give (false) testimony without being asked (to testify), who will be treacherous and are not to be trusted, who will make vows and will not fulfill them, among whom obesity will appear." [Agreed upon].

సారాంశం

ఇంతకు ముందు వచ్చిన హదీసులో సాక్ష్యం కోరకపోయినా సాక్ష్యమివ్వటం మేలైన విషయంగా చెప్పబడగా, ఈ హదీసులో హానికరమైన విషయంగా పేర్కొనబడిందేమిటి? అన్న సందేహం కలగవచ్చు. ఇది నకారాత్మక నేపథ్యంలో చెప్పబడింది. అంటే దురుద్దేశ్యంతో, విషయాన్ని వక్రీకరించే సంకల్పంతో వ్యవహారంలో జోక్యం చేసుకుని తప్పుడు సాక్ష్యం ఇచ్చే వారిపై ఈ హదీసులో ఆక్షేపణ ఉంది.

మంచి కాలం, చెడు కాలాలకు సంబంధించిన భవిష్యవాణి కూడా ఇందులో ఉంది. దైవప్రవక్త ﷺ గారి కాలం అన్నింటికన్నా శ్రేష్ఠమైనది. ఆ తరువాత సహాబీల కాలం, ఆపైన తాబయీల కాలం మంచివి. అయితే ప్రవక్త ﷺ ప్రియ సహచరులలో కూడా బద్ర్, ఉహుద్ సంగ్రామాలలో పాల్గొన్నవారు మరింత గొప్పవారు.

రాను రాను దేశ, సమాజాల్లో నైతికపు విలువలు అడుగంటి పోతాయనీ, ప్రజల హక్కులను కొల్లగొట్టే స్వార్థపరులు పుట్టుకువస్తారనీ, వారు అప్పగింతల్లో స్వామి ద్రోహానికి పాల్పడతారనీ, పిసినారితనం ప్రబలిపోయి మనసులో అనుకున్న వాటిని నెరవేర్చటానికి ఊగిసలాడతారనీ, ‘తన’, ‘మన’ల కన్నా ‘నా’ అన్నదానికే ప్రాధాన్యతనిచ్చి పరుల సొమ్మును కబళించే ప్రయత్నాలు చేస్తారనీ, ఈ స్వార్థ ప్రియత్వం మూలంగానే వారి దేహాలపై కొవ్వు పెరిగిపోతుందని హదీసులో సంకేతం ఇవ్వబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1202

1203

హదీసు 1203

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ "لَا تَجُوزُ شَهَادَةُ خَائِنٍ, وَلَا خَائِنَةٍ, وَلَا ذِي غِمْرٍ عَلَى أَخِيهِ, وَلَا تَجُوزُ شَهَادَةُ اَلْقَانِعِ لِأَهْلِ اَلْبَيْتِ" } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ..

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “అవినీతిపరుడైన పురుషుడు మరియు అవినీతిపరురాలైన స్త్రీ ఇచ్చే సాక్ష్యం ధర్మసమ్మతం కాదు. శత్రువు, కపటి అయిన వ్యక్తి తన సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినా అది సమ్మతం కాదు. ఒకరి సంరక్షణలో ఉన్న వ్యక్తి తన సంరక్షకుని కుటుంబీకులకు అనుకూలంగా ఇచ్చే సాక్ష్యం కూడా స్వీకారయోగ్యం కాదు.” (ముస్నద్ అహ్మద్, అబూదావూద్)

English

Narrated 'Abdullah bin 'Amr (RA): Allah's Messenger (ﷺ) said: "It is not permissible to accept the testimony of a man or a woman who does not fulfill their trusts, or of one who harbors a grudge against his brother, or the testimony of one who is dependent on a family (to testify) for members of the family." [Reported by Ahmad and Abu Dawud].

సారాంశం

ఈ హదీసు ప్రకారం నమ్మకద్రోహి, అవినీతిపరుడు, శత్రువు, కపటి ఇచ్చే సాక్ష్యం స్వీకారయోగ్యం కాజాలదు. అలాగే ఒకరి ఆలనా పాలనలో ఉన్న వ్యక్తి తన యజమాని కుటుంబీకులకు అనుకూలంగా ఇచ్చే సాక్ష్యం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అతడు పక్షపాత వైఖరి నవలంబించే అవకాశం ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1203

1204

హదీసు 1204

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّهُ سَمِعَ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { "لَا تَجُوزُ شَهَادَةُ بَدَوِيٍّ عَلَى صَاحِبِ قَرْيَةٍ" } رَوَاهُ أَبُو دَاوُدَ, وَابْنُ مَاجَه ْ.

దైవప్రవక్త ﷺ చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : “ఒక బదవీ (పల్లెటూరి బైతు) ఒక పట్టణవాసి పక్షాన ఇచ్చే సాక్ష్యం స్వీకారయోగ్యం కాదు.” (అబూదావూద్, ఇబ్నెమాజా)

English

Narrated Abu Hurairah (RA): He heard Allah's Messenger (ﷺ) say. "The testimony of a bedouin against a city dweller is not permissible." [Reported by Abu Dawud and Ibn Majah].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1204

1205

హదీసు 1205

وَعَنْ عُمَرَ بْنِ اَلْخَطَّابِ ‏- رضى الله عنه ‏- { أَنَّهُ خَطَبَ فَقَالَ: إِنَّ أُنَاسً ا كَانُوا يُؤْخَذُونَ بِالْوَحْيِ فِي عَهْدِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-وَإِنَّ اَلْوَحْيَ قَدْ اِنْقَطَعَ, وَإِنَّمَا نَأْخُذُكُم ْ اَلْآنَ بِمَا ظَهَرَ لَنَا مِنْ أَعْمَالِكُمْ } رَوَاهُ اَلْبُخَارِيّ ُ.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం : తను ప్రజలనుద్దేశ్యించి ఉపన్యసిస్తూ ఇలా అన్నారు : దైవప్రవక్త ﷺ కాలంలో ప్రజా వ్యవహారాలు ‘వహీ’ (దైవవాణి) ఆధారంగా నిర్ణయించబడేవి. ఇప్పుడు వహీ (దైవవాణి) అవతరణ ఆగిపోయింది. ఇప్పుడు మేము మీ వ్యవహారాలపై తీర్పు – మా సమక్షంలో బహిర్గతమయ్యే మీ ఆచరణలను బట్టి ఇస్తాము.” (బుఖారీ)

English

Narrated 'Umar bin al-Khattab (RA): He addressed the people and said, "People were sometimes judged by the revealing of a Divine Revelation during the lifetime of Allah's Messenger (ﷺ), but now the Divine Revelation has been discontinued [i.e. there is no longer any new revelation coming]. Now we judge you by the deeds you practice publicly." [Reported by al-Bukhari].

సారాంశం

దీని ద్వారా తెలిసేదేమిటంటే దైవప్రవక్త ﷺ కాలంలో ఆయన ﷺపై దైవవాణి అవతరించేది. ఆయన ﷺ మరణానంతరం ఈ ‘వహీ’ పరంపర ఆగిపోయింది – అంటే దైవదౌత్యం పరిసమాప్తమైంది. దైవధర్మం పరిపూర్ణమయింది. ఇకమీదట మరొక దైవప్రవక్త రావటంగానీ, ఆకాశం నుండి దైవవాణి అవతరించటం గానీ జరగవు. ఇప్పుడు ఎవరయినా తన్ను తాను దైవప్రవక్తనని ప్రకటించుకున్నా, తన వద్దకు దైవవాణి వస్తుందని చెప్పినా అతడు అసత్య ప్రకటన చేస్తున్నాడనీ, మానవ జగతిని మోసపుచ్చుతున్నాడనీ భావించాలి. ఇలా ప్రకటించేవాడు ఎంత గొప్ప విద్వాంసుడైనా సరే అతడు ఇస్లాం నుండి బహిష్కరించబడినట్లే.

ఇక హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) పలుకుల్లోని ఆంతర్యం ఏమిటంటే దైవప్రవక్త ﷺ కాలంలోనయితే ప్రజల వివాదాలు దైవసూచనానుసారం పరిష్కరించబడేవి. ఏదేని వ్యవహారంలో నిర్దిష్టమైన శాసనం లేనట్లయితే దేవుడు ‘వహీ’ ద్వారా తన ప్రవక్త ﷺకు మార్గదర్శకత్వం వహించేవాడు. ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయిన మీదట మనముందున్న ఇస్లామీయ షరీయత్‌ననుసరించి ప్రజల వ్యవహారాలపై తీర్పులు ఇవ్వటం జరుగుతుంది. ఈ తీర్పులు ఇచ్చేటప్పుడు మనిషి బాహ్య ఆచరణల్ని, అతని గుణగణాలను, స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1205

1206

హదీసు 1206

وَعَنْ أَبِي بَكْرَةَ ‏- رضى الله عنه ‏- { عَنِ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-أَنَّهُ عَدَّ شَهَادَةَ اَلزُّورِ فِ ي أَكْبَرِ اَلْكَبَائِرِ } مُتَّفَقٌ عَلَيْهِ فِي حَدِيثٍ طَوِيلٍ.

దైవప్రవక్త ﷺ అబద్ధపు సాక్ష్యాన్ని మహాపరాధాలలో చేర్చారని హజ్రత్ అబూబక్రా (రదియల్లాహు అన్హు) వివరించారు.(బుఖారీ మరియు ముస్లింలోని సుదీర్ఘ హదీసులో భాగం ఇది)

English

Narrated Abu Bakra (RA): The Prophet (ﷺ) considered Shahadah az-Zur (giving false testimony) among the most serious of major sins. [al-Bukhari and Muslim reported it in a long Hadith].

సారాంశం

మహాపరాధాలు (ఘోర పాపాలు) అనేకం ఉంటాయని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అబద్ధపు సాక్ష్యం కూడా వాటిలో ఒకటి. ఇతర మహాపరాధాలలో ముఖ్యమైనవి – అల్లాహ్‌తోపాటు వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టుకోవటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం, అకారణంగా కదనరంగం నుండి పలాయనం చిత్తగించటం, సుశీలయగు వనితపై నీలాపనిందలు మోపటం మొదలగునవి. ఏ అపరాధాలకయితే షరీయత్ శిక్షల్ని నిర్ధారించిందో లేక పరలోకంలో వ్యధాభరితమయిన శిక్ష విధించబడుతుందని చెప్పబడిందో అవి మహాపరాధాలుగా ఎంచబడతాయి. అబద్ధపు సాక్ష్యాన్ని కూడా ఈ జాబితాలో చేర్చడాన్నిబట్టి చూస్తుంటే, ఈ అపరాధం వల్ల సమాజంలో ఎంత అరాచకం ప్రబలుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అబద్ధపు సాక్ష్యాల నివారణే గనక జరిగితే కోర్టుల్లో కేసులు త్వరితగతిన తెమలుతాయి. ప్రజలకు త్వరగా న్యాయం లభిస్తుంది. వ్యయప్రయాసలు తగ్గుతాయి. అసలు న్యాయస్థానాల్లోని చెడుగు కంతటికీ ప్రధాన కారణం తప్పుడు సాక్ష్యాలే. అవినీతి కూడా వాటికి తోడై మొత్తం వ్యవస్థనే అతలాకుతలం చేసేస్తుంది. ఈ వ్యవస్థ నుండి వ్రేళ్ళూనుకున్న ఈ రెండు చెడుగులను గనక సమూలంగా పెకలిస్తే సమాజంలో శాంతి శ్రేయోభిలాషల వాతావరణం వెల్లివిరుస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1206

1207

హదీసు 1207

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ لِرَجُلٍ: "تَرَى اَلشَّمْسَ ?" قَالَ: نَعَمْ.‏ قَالَ: "عَلَى مِثْلِهَا فَاشْهَدْ, أَوْ دَعْ" } أَخْرَجَهُ اِبْنُ عَدِيٍّ بِإِسْنَادٍ ضَعِيفٍ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ فَأَخْطَأ َ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఒక వ్యక్తినుద్దేశించి, “నువ్వు సూర్యుణ్ణి చూస్తున్నావా?” అని అడిగారు. దానికావ్యక్తి ‘అవున’న్నాడు. అప్పుడు ఆయన ﷺ, “ఇటువంటి దేదీప్యమానమైన ఆధారం ఉంటేనే సాక్ష్యం ఇవ్వు లేకపోతే వదిలెయ్యి” అని తాకీదు చేశారు. (దీనిని ఇబ్నె అదీ బలహీన పరంపర ద్వారా సంగ్రహించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదని అన్నారంటే ఆయన పొరబడ్డారు).

English

Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) said to a man, "Do you see the sun?" He replied, "Yes." He said, "Give witness in a similar case [which is as clear as the sun], or leave it." [Ibn 'Adi reported it with a Da'if (weak) chain or narrators, and al-Hakim graded it Sahih (authentic), but he was mistaken].

సారాంశం

పగటి వెలుగులా విషయం తనకు స్పష్టంగా తెలిసి ఉన్నప్పుడే ఎవరయినాసరే దాని గురించి సాక్ష్యం ఇవ్వాలనీ లేకుంటే సాక్ష్యం ఇవ్వరాదని ఈ హదీసు చెబుతోంది. కేవలం ఊహ లేక అనుమానంపై అవుననో, కాదనో సాక్ష్యమివ్వటం ఘోరమయిన తప్పిదం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1207

1208

హదీసు 1208

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَضَى بِيَمِينٍ وَشَاهِدٍ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏ وَأَبُو دَاوُدَ.‏ وَالنَّسَائِيُّ وَقَالَ: إِسْنَادُ [ هُ ] جَيِّد ٌ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఒక ప్రమాణం మరియు ఒక సాక్షి ఆధారంగా తీర్పు ఇచ్చారు.(ముస్లిం, అబూదావూద్, నసాయి దీనిని సేకరించారు – దీని పరంపర ఉత్తమమైనది)

English

Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) ruled on the basis of an oath and a single witness. [Muslim, Abu Dawud and an-Nasa'i reported it, the latter said that it has a Jayyid (good) chain or narrators].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1208

1209

హదీసు 1209

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- مِثْلَهُ.‏ أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)చే చేయబడిన కథనం కూడా ఈ విధంగా (పై విధంగా)నే ఉంది. (దీనిని అబూ దావూద్, తిర్మిజీ సంకలనం చేశారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Aby Hurairah (RA): Something similar to the aforesaid Hadith. [Abu Dawud and at-Tirmidhi reported it. Ibn Hibban graded it Sahih (authentic)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.1 సాక్ష్యాలు|హదీసు 1209