హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి), 14.0: ఖాజీ (న్యాయమూర్తి) గురించి. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 1188 – 1200) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి
كتاب القضاء
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1188
عَنْ بُرَيْدَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ "اَلْقُضَاةُ ثَلَاثَةٌ: اِثْنَانِ فِي اَلنَّارِ, وَوَاحِدٌ فِي اَلْجَنَّةِ. رَجُلٌ عَرَفَ اَلْحَقَّ, فَقَضَى بِهِ, فَهُوَ فِي اَلْجَنَّةِ. وَرَجُلٌ عَرَفَ اَلْحَقَّ, فَلَمْ يَقْضِ بِهِ, وَجَارَ فِي اَلْحُكْمِ, فَهُوَ فِي اَلنَّارِ. وَرَجُلٌ لَمْ يَعْرِفِ اَلْحَقَّ, فَقَضَى لِلنَّاسِ عَلَى جَهْلٍ, فَهُوَ فِي اَلنَّارِ" } رَوَاهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.
హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “న్యాయమూర్తుల్లో మూడు రకాల వారుంటారు. వారిలో ఇద్దరు నరకవాసులు, ఒకడు స్వర్గవాసి. న్యాయం ఎటువైపు ఉందో పసిగట్టి తదనుగుణంగా తీర్పు ఇచ్చే వాడు ఒకడు. ఇతడు స్వర్గవాసి. న్యాయం ఎవరిపక్షాన ఉందో తెలుసుకుని కూడా దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివాడు, పైపెచ్చు అన్యాయానికి పాల్పడినవాడు రెండవవాడు. ఇతడు నరకవాసి.ఇక మూడవవాడు న్యాయాన్నీ గుర్తించలేడు, న్యాయానికనుగుణంగా నిర్ణయమూ గైకొనలేడు – పైగా అతను – జనుల మధ్య అజ్ఞానం అవివేకంతో కూడుకున్న తీర్పులు ఇచ్చాడు. అతడు కూడా నరకవాసియే. (ఈ హదీసును అబూదావూద్, నసాయి, తిర్మిజీ, ఇబ్నెమాజాలు ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రమాణబద్ధమైనదిగా నిర్ధారించారు)
English
Narrated Buraida (RA) Allah's Messenger (ﷺ) said: "al-Qudat (judges) are of three types, two of whom will go to Hell and one to Paradise. The one who will go to Paradise is a man who knows what is right and gives judgement accordingly. However, a man who knows what is right, and does not give judgement accordingly and acts unjustly in his judgement, will be in the Hell-fire. Likewise, a man who does not know what is right and judges people with ignorance, will be in the Hell-fire." [Reported by al-Arba'a, and al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
ఈ హదీసులో ఖాజీచేత న్యాయమూర్తి (జడ్జి)గా పిలువబడే వారి కోవలు సూచించబడ్డాయి. వీరిలో రెండు రకాల న్యాయమూర్తులు నరకానికి ఇంధనం కానున్నారు. వారిలో ఒకడు; సత్యాన్ని (న్యాయాన్ని) తెలుసుకోలేనివాడు. రెండవవాడు: సత్యాన్ని తెలుసుకుని కూడా దానికనుగుణంగా ఆచరించనివాడు. దానికి అతని అవినీతీ కారణం కావచ్చు. పరిశోధనా ప్రక్రియలో అతను చూపిన అలసత్వం, సోమరితనం కూడా కారణం కావచ్చు. సత్యాన్ని తెలుసుకుని సత్యవంతుడికి న్యాయం చేకూర్చేవాడే సిసలయిన, నిష్పాక్షికమైన న్యాయమూర్తి. ఎటువంటి దురభిమానానికీ, పక్షపాతానికి తావివ్వకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా తీర్పు ఇచ్చే న్యాయశిలి ఎవరేమనుకున్నా లెక్కచేయడు. “తప్పయినా, ఒప్పయినా నా వాళ్ళు” అనే దురభిమాన దృక్పథాన్ని దరికి రానివ్వడు. కాబట్టి బోధపడేదేమంటే ‘న్యాయమూర్తి’ హోదా కోసం బుద్ధి కౌశల్యం, విజ్ఞతా వివేచనలుగల వ్యక్తిని ఎంపిక చేయాలి. అల్పుడు, మూర్ఖుడైన వాడికి ఈ హోదా కట్టబెట్టి ప్రజల్ని ఇక్కట్లపాలు చెయ్యకూడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1188
హదీసు 1189
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -: { "مَنْ وَلِيَ اَلْقَضَاءَ فَقَدْ ذُبِحَ بِغَيْرِ سِكِّينٍ" } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ వ్యక్తికయితే న్యాయమూర్తి హోదా కట్టబెట్టడం జరిగిందో కత్తి లేకుండానే అతని కుత్తుక కోయబడింది (అని తెలుసుకోండి).’’ (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, మరియు ఇబ్నె హిబ్బాన్లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "He who has been appointed a Qadi (judge) has been slaughtered without a knife." [Reported by Ahmad and al-Arba'a. Ibn Khuzaimah and Ibn Hibban graded it Sahih (authentic)].
సారాంశం
కుత్తుక కోయబడుతుందంటే అర్థం శారీరకంగా అతడు బాధించబడతాడని కాదు. న్యాయ నిర్ణయాలు చేయటంలో అతడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, లేక పక్షపాతంతో ఏ పక్షాన మొగ్గిపోయినా అతని నిర్ణయం వల్ల సమాజానికి తీరని హాని కలుగుతుంది. అతని ఈ తప్పుడు నిర్ణయం వల్ల అతని పారలౌకిక జీవితం నాశనమవుతుందని భావం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1189
హదీసు 1190
وَعَنْهُ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ "إِنَّكُمْ سَتَحْرِصُونَ عَلَى اَلْإِمَارَةِ, وَسَتَكُونُ نَدَامَةً يَوْمَ اَلْقِيَامَةِ, فَنِعْمَتِ اَلْمُرْضِعَةُ, وَبِئْسَتِ اَلْفَاطِمَةُ" } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : “నిశ్చయంగా మీరు ప్రభుత్వాధికారం కోసం తప్పకుండా పరితపిస్తారు. కాని ప్రళయదినాన అది మీ పాలిట తలవంపుగా పరిణమించటం అవశ్యం. పాలిచ్చే తల్లి పుణ్యవతి. పాలు విడిపించే తల్లి పాపిష్టురాలు.” (బుఖారీ)
English
Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) said: "You will eagerly seek out the office of governorship, but it will become a cause of regret on the Day of Resurrection. How excellent it is as a Murdi'ah (wet nurse)! And how evil it is as a Fatimah (one who weans)! [Reported by al-Bukhari].
సారాంశం
రాజ్యాధికారం, జాతికి నేతృత్వం ఎంత బాధ్యతాయుత, మరెంత సున్నిత విషయమో ఈ హదీసులో చెప్పబడింది. అందుకే నేతృత్వానికి, అధికారానికి వీలయినంత వరకూ దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయాలనీ, దాని కోసం అర్రులు చాచరాదనీ, పదవీ వ్యామోహం అసలే మంచిది కాదని కూడా సూచించబడింది. వేరొక హదీసులో ఏమనబడిందంటే, ప్రభుత్వం, రాజ్యాధికారం నిందార్హంగా ఉంటాయి. అధికారం చేజారిన వెంటనే పరాభవం మిగులుతుంది. పరలోకంలో అది మనిషిని శిక్షార్హుణ్ణి కూడా చేస్తుంది.
మనిషికి పదవి లభించినపుడు అంతా ఆకర్షణీయంగా కానవస్తుంది. అతని గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మందీ మార్బలం ఉంటాయి. రాజ్యసంపద హస్తగతమవుతుంది. ప్రజలపై పెత్తనం చెలాయించే అవకాశం లభిస్తుంది. అంగరంగ వైభవం ఉట్టిపడుతుంది – ఒక దశ వరకూ అంతా సజావుగానే ఉంటుంది. కాని అవినీతి అక్రమాల చిట్టా బయట పడినప్పుడు,విచారణ కమీషన్లు నిలదీసినపుడు, ఇహలోకంలోనే ‘లెక్కల పత్రం’ రచ్చకెక్కుతుంది. అవమానాల పర్వం మొదలయిపోతుంది. ఇక పరలోకంలో తీసుకోబడే లెక్క సరేసరి. దాని కాఠిన్యం గురించి ప్రపంచ జీవితంలో ఊహించనయినా లేము. ఈ భయం చేతనే ముస్లిం సమాజంలోని సజ్జనులు అధికారానికి, పదవులకు అల్లంత దూరాన ఉండటానికే ఇష్టపడేవారు. కొంతమంది మహనీయులైతే రాజు విధించే శిక్షల్ని భరించటానికి కూడా అంగీకరించారు గాని, కీలకమైన ధర్మాసన పదవుల్ని పుచ్చుకోవడానికి ముందుకు రాలేదు. రాజ్యాధికార ఆరంభం అత్యంత రమణీయంగానే ఉంటుంది గాని దాని అంతిమ పరిణామం మాత్రం అత్యంత దుర్భరంగా ఉంటుంది. బహుశా ఈ కారణంగానే సజ్జనులు సదా పదవీ పటాటోపాలకు దూరంగా ఉన్నారు. తల్లి చనుబాలు త్రాగే బిడ్డనే చూడండి – పాలు త్రాగుతున్నంత కాలం అతను తల్లి ఒడిలో ఆనందంగా కేరింతలు కొడతాడు. కాని పాలు విడిపించే ప్రయత్నం తల్లి చేసినపుడు అసహనంతో చిందులేస్తాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1190
హదీసు 1191
وَعَنْ عَمْرِو بْنِ الْعَاصِ - رضى الله عنه - أَنَّهُ سَمِعَ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: { "إِذَا حَكَمَ اَلْحَاكِمُ, فَاجْتَهَدَ, ثُمَّ أَصَابَ, فَلَهُ أَجْرَانِ. وَإِذَا حَكَمَ, فَاجْتَهَدَ, ثُمَّ أَخْطَأَ, فَلَهُ أَجْرٌ" } مُتَّفَقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) చెప్పారు: “న్యాయాధికారి ఏదైనా వ్యవహారంలో శక్తివంచన లేకుండా న్యాయంగా తీర్పివ్వడానికి కృషిచేసినప్పుడు, ఆ తీర్పు సరైనదై ఉంటే అతనికి రెట్టింపు పుణ్య ఫలం లభిస్తుంది. ఒకవేళ ఎంత కృషి చేసినా తప్పుడు తీర్పు జరిగిపోతే అప్పుడు కూడా అతనికి ఒకింత పుణ్య ఫలం లభిస్తుంది. (బుఖారీ, ముస్లిం)
English
Narrated 'Amr bin al-'Aas (RA): He heard Allah's Messenger (ﷺ) say, "When a judge gives a ruling, having tried his best to decide correctly, and is right (in his decision), he will have a double reward; and when he gives a ruling having tried his best to decide correctly, and is wrong (in his decision), he will have a single reward." [Agreed upon].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1191
హదీసు 1192
وَعَنْ أَبِي بَكْرَةَ - رضى الله عنه - قَالَ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: { " لَا يَحْكُمُ أَحَدٌ بَيْنَ اِثْنَيْنِ, وَهُوَ غَضْبَانُ" } مُتَّفَقٌ عَلَيْهِ.
“మీలో ఎవరయినాసరే కోపంలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తగాదాపై తీర్పు ఇవ్వటం తగదు” అని దైవప్రవక్త ﷺ ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూబక్రా (రదియల్లాహు అన్హు) తెలిపారు. (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Bakrah (RA): I heard Allah's Messenger (ﷺ) say, "No judge should give judgement between two people while he is angry." [Agreed upon].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1192
హదీసు 1193
وَعَنْ عَلِيٍّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ " إِذَا تَقَاضَى إِلَيْكَ رَجُلَانِ, فَلَا تَقْضِ لِلْأَوَّلِ, حَتَّى تَسْمَعَ كَلَامَ اَلْآخَرِ, فَسَوْفَ تَدْرِي كَيْفَ تَقْضِي". قَالَ. عَلِيٌّ: فَمَا زِلْتُ قَاضِيًا بَعْدُ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ, وَقَوَّاهُ اِبْنُ اَلْمَدِينِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ. وَلَهُ شَاهِدٌ عِنْدَ اَلْحَاكِمِ: مِنْ حَدِيثِ اِبْنِ عَبَّاسٍ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “ఇద్దరు మనుషులు మీ దగ్గరకు న్యాయం కోసం వస్తే, ఆ ఇరువురి ఫిర్యాదును (పూర్తిగా) వినకముందే, ఎవరో ఒకరికి అనువుగా తీర్పు ఇవ్వకండి – (ఇరువురి వాదనను) విన్న మీదటే మీరు చేయాల్సిందేమిటో మీకు అర్థమవుతుంది.” “ఆ రోజు నుండే నేను ఆ విధంగా చేస్తున్నాను” అని హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తెలిపారు. (దీనిని అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని హసన్గా ఖరారు చేశారు. ఇబ్నె మదీనీ ఈ హదీసును ‘దృఢమైనది’గా పేర్కొన్నారు. ఇబ్నె హిబ్బాన్ మాత్రం దీన్ని ‘ప్రామాణికం’ అన్నారు. హాకిమ్ వద్ద దీని సాక్ష్యం ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) హదీసు రూపంలో లభిస్తుంది.
English
Narrated 'Ali (RA): Allah's Messenger (ﷺ) said: "When two men bring a case before you, do not decide in favor of the first till you hear what the other has to say, then you will know how to judge." 'Ali (RA) said: "Since then, I have continued to judge (in accordance with that)." [Reported by Ahmad, Abu Dawud and at-Tirmidhi. The latter graded it Hasan (good), while Ibn al-Madini graded it Qawi (strong), and Ibn Hibban graded it Sahih (authentic).]
It has a Shahid (supporting narration) reported by al-Hakim from the Hadith of Ibn 'Abbas.
సారాంశం
ఇరుపక్షాల వారి వాదోపవాదాలను పూర్తిగా, సావధానంగా విన్న మీదటే న్యాయమూర్తి ఆ తగాదాపై తీర్పు ఇవ్వాలనీ, ఎవరో ఒకరి ఫిర్యాదును విని తొందరపడి తీర్పు ఇవ్వటం ధర్మ సమ్మతం కాదని ఈ హదీసు సారాంశం. కక్షిదారుల గోడును విని బాగా పరికించాలి. వారు సమర్పించే ఆధారాలను నిశిత దృష్టితో గమనించాలి. తన అనుభవాన్నంతా ఉపయోగించి వారి హావభావాలను కూడా చూడాలి. ఆ తరువాతే తీర్పు ఇవ్వాలి. అలా కాకుండా ఏకపక్షంగా న్యాయ నిర్ణయం చేయటం మిథ్య అవుతుంది. ఒకవేళ ఆరోపితుడైన వ్యక్తి మౌనం వహిస్తే, లేక న్యాయస్థానంలో నోరు విప్పకపోతే, అవుననిగానీ, కాదని గానీ అనకపోతే, న్యాయస్థానం ఉత్తర్వు ఇచ్చినా హాజరు కాకపోతే అప్పుడేం చేయాలన్న సందేహం ఏర్పడవచ్చు. అట్టి పరిస్థితిలో న్యాయస్థానం, ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసు ఆధారంగా తీర్పు ఇచ్చే అధికారం కలిగి ఉంటుంది. (సుబులుస్సలాం)
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1193
హదీసు 1194
وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -: { " إِنَّكُمْ تَخْتَصِمُونَ إِلَيَّ, وَلَعَلَّ بَعْضَكُمْ أَنْ يَكُونَ أَلْحَنَ بِحُجَّتِهِ مِنْ بَعْضٍ, فَأَقْضِيَ لَهُ عَلَى نَحْوِ مَا أَسْمَعُ, مِنْهُ فَمَنْ قَطَعْتُ لَهُ مِنْ حَقِّ أَخِيهِ شَيْئًا, فَإِنَّمَا أَقْطَعُ لَهُ قِطْعَةً مِنَ اَلنَّارِ" } مُتَّفَقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) తెలిపారు : నిశ్చయంగా, మీరు మీ తగాదాలను నా దగ్గరకు తీసుకువస్తూ ఉంటారు. మీలో ఒక వర్గానికి చెందినవాడు తన వాదనకనుగుణమైన ఆధారాలను ఎంతో వాక్చాతుర్యంతో విశదీకరిస్తాడు. అతని మాటలు విని నేను అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరికయినా అతని సోదరుని హక్కులో నుంచి ఏదన్నా వస్తువు నేను ఇచ్చినట్లయితే అతనికి (నరకంలోని) అగ్ని కణాన్ని ఇస్తున్నానని భావించండి.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Umm Salamah (RA): Allah's Messenger (ﷺ) said: "Indeed, you bring your disputers to me, and perhaps some of you are more eloquent in their plea than others, so that I give judgement on their behalf according to what I hear from them. Therefore, whatever I rule for anyone which by right belongs to his brother, I am only granting him a portion of Hell-fire." [Agreed upon].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1194
హదీసు 1195
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - [ قَالَ ]: سَمِعْتُ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم - يَقُولُ: { " كَيْفَ تُقَدَّسُ أُمَّةٌ, لَا يُؤْخَذُ مِنْ شَدِيدِهِمْ لِضَعِيفِهِمْ ?" } رَوَاهُ اِبْنُ حِبَّانَ. وَلَهُ شَاهِدٌ: مِنْ حَدِيثِ بُرَيْدَةَ, عِنْدَ اَلْبَزَّارِ. وَآخَرُ: مِنْ حَدِيثِ أَبِي سَعِيدٍ عِنْدَ اِبْنِ مَاجَه.
దైవప్రవక్త ﷺ చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “బలవంతుని నుంచి బలహీనుని హక్కు ఇప్పించలేని సమాజం పవిత్ర సమాజం ఎలా అవుతుంది?” (ఇబ్నె హిబ్బాన్ దీనిని ఉల్లేఖించారు. బజ్జార్ దృష్టిలో బురైదా (రదియల్లాహు అన్హు) హదీసు దీనికి సాక్ష్యం. ఇబ్నెమాజాలో హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు)చే ఉల్లేఖించబడిన మరో హదీసు కూడా దీనికి ప్రబల సాక్షిగా ఉంది)
English
Narrated Jabir (RA): I heard Allah's Messenger (SAW0 saying, "How could an Ummah (people) be purified (of its sins) where the right of its weak is not taken from its strong." [Reported by Ibn Hibban].
It has a Shahid (supporting narration) from the Hadith of Buraida, reported by al-Bazzar.
And another [Shahid (supporting chain)] from the Hadith of Abu Sa'id, reported by Ibn Majah.
సారాంశం
ఈ హదీసు ప్రకారం బలవంతుని నుండి బలహీనుని హక్కు ఇప్పించటం విద్యుక్త ధర్మం. ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజ్యాధికారి అయినా బలహీనుని, పీడితుని, బాధితుని న్యాయ సమ్మతమైన హక్కును అతనికి ఇప్పించటంలో ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం లేక అశ్రద్ధ కనబరిస్తే, జాతి జనులు కూడా ఆ విషయమై నిలదీయకపోతే, పాలకుల నుండి సంజాయిషీ కోరకపోతే అట్టి పరిస్థితిలో యావత్తు జాతి అసమర్థమైన జాతిగా భావించబడుతుంది. ఎందుకంటే నేటి ఆధునిక యుగం ప్రజాస్వామిక యుగం. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారానే తమ ప్రతినిధులకు అధికారాన్ని అప్పగిస్తున్నారు. కాబట్టి పరిపాలకులు ఎప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినా, సమాజంలోని బలహీనుల హక్కులు ఎక్కడ కాలరాయబడినా దాని గురించి పరిపాలకులను ప్రజలు పబ్లిగ్గా నిలదీయాలి. పాలకుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి రాజ్యాంగబద్ధంగా చేయవలసినదంతా చేయాలి. ఈ బాధ్యతా భావనను విస్మరించి నిరుపేదల, బలహీనుల స్థితిపై జాలి చూపనివారు పరలోకంలో – దైవసమక్షంలో – జవాబు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1195
హదీసు 1196
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: { " يُدْعَى بِالْقَاضِي اَلْعَادِلِ يَوْمَ اَلْقِيَامَةِ, فَيَلْقَى مِنْ شِدَّةِ اَلْحِسَابِ مَا يَتَمَنَّى أَنَّهُ لَمْ يَقْضِ بَيْنَ اِثْنَيْنِ فِي عُمْرِهِ" } رَوَاهُ اِبْنُ حِبَّانَ وَأَخْرَجَهُ اَلْبَيْهَقِيُّ, وَلَفْظُهُ: { فِي تَمْرَةٍ }.
దైవప్రవక్త ﷺ చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు: ప్రళయదినాన (తీర్పు దినాన) న్యాయశీలుడైన ‘ఖాజీ’ లెక్కల నిమిత్తం పిలువ బడినపుడు, అతడు తన లెక్క తీవ్రతను అంచనా వేసుకుంటాడు. తాను ప్రపంచంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నడూ (తన జీవితంలో) ఒక్క తీర్పు కూడా చెయ్యకుండాఉంటే బావుండునే! అని తలచుకుంటాడు. (ఈ హదీసు ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖించారు. బైహఖీ దీనిని నకలు చేశారు). అందులో ఈ ఒక్క వాక్యం అదనంగా ఉంది – “ఎన్నడూ ఒక్క ఖర్జూరపండు గురించి కూడా తీర్పు ఇవ్వకుండా ఉంటే బావుండు.”
English
Narrated 'Aishah (RA): I heard Allah's Messenger (ﷺ) saying, "the just Qadi (judge) will be called (forth) on the Day of Resurrection and he will wish he had never given judgement even between two men throughout his life, due to the severity of the account he will face." [Reported by Ibn Hibban. al-Baihaqi reported it with the wording: "…concerning a single tamrah (date fruit).
సారాంశం
తీర్పు దినాన దేవుని దర్బారులో న్యాయమూర్తి చాలా గట్టిగా ప్రశ్నించబడతాడని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. కాబట్టి తీర్పరిగా ఉండే వ్యక్తి నిత్యం న్యాయదృష్టితో మసలుకోవాలనీ, అన్యాయానికి, పక్షపాత వైఖరికి కడు దూరంగా ఉండాలని దీనిద్వారా బోధ వడుతున్నది. న్యాయం చేయునివాడు తీర్పు దినవు యజమాని విధించే వ్యధాభరితమయిన శిక్షకు సిద్ధంగా ఉండాలి మరి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1196
హదీసు 1197
وَعَنْ أَبِي بَكْرَةَ - رضى الله عنه - عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { "لَنْ يُفْلِحَ قَوْمٌ وَلَّوْا أَمْرَهُمْ اِمْرَأَةً" } رَوَاهُ اَلْبُخَارِيُّ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూబక్రా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : “మహిళను పరిపాలకురాలిగా చేసుకున్న జాతి ఎన్నడూ సాఫల్యం పొందదు.” (బుఖారీ)
English
Narrated Abu Bakrah (RA): The Prophet (ﷺ) said: "A people who make a woman their ruler will never be successful." [Reported by al-Bukhari].
సారాంశం
స్త్రీ సారథ్యం సమాజానికి మేలు చేకూర్చకపోగా హాని కలిగిస్తుందని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. మహాప్రవక్త ﷺ మరణించిన పిదప ఆయన ﷺ సతీమణుల్లో ఎవరికీ ఈ సారధ్య బాధ్యతలు అప్పగించబడలేదన్నది గమనార్హం. కుటుంబ యాజమాన్య బాధ్యతే ఆమెపై మోపబడనప్పుడు ఒక రాజ్య బాధ్యతలు ఎట్లా మోపబడతాయి?
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1197
హదీసు 1198
وَعَنْ أَبِي مَرْيَمَ اَلْأَزْدِيِّ - رضى الله عنه - عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -[ أَنَّهُ ] { قَالَ: "مَنْ وَلَّاهُ اَللَّهُ شَيْئًا مِنْ أَمْرِ اَلْمُسْلِمِينَ, فَاحْتَجَبَ عَنْ حَاجَتِهِمْ وَفَقِيرِهِم, اِحْتَجَبَ اَللَّهُ دُونَ حَاجَتِهِ" } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ.
దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అబూ మర్యమ్ అజ్దీ (రదియల్లాహు అన్హు) వివరించారు: “ఏ వ్యక్తికయితే అల్లాహ్ ముస్లింల కార్య నిర్వహణకు సంబంధించిన అధికారిగా నియమించగా, వారి అవసరాలు, అక్కరలు తీర్చకుండా అతడు తెర మరుగున ఉండిపోయాడో, అతన్ని ఆదుకునే విషయంలో అల్లాహ్ కూడా తెరమరుగున ఉండిపోతాడు.” (అబూదావూద్, తిర్మిజీ)
English
Narrated Abu Maryam al-Azdi (RA): The Prophet (ﷺ) said: "Whoever is placed by Allah over any matter of the affairs of the Muslims, and then conceals himself (i.e. holds back) from dealing with their needs and their poor (people), Allah will conceal Himself (i.e. hold back) from fulfilling his needs." [Abu Dawud and at-Tirmidhi reported it].
సారాంశం
ప్రజా పనుల విషయంలో ప్రభుత్వాధికారులు ఎంతో బాధ్యతాయుతంగా, మరెంతో చురుకుగా మసలుకోవాలనీ, బద్దకం, బాధ్యతా రాహిత్యం ఎంతమాత్రం క్షంతవ్యం కాబోవని ఈ హదీసు నొక్కి చెబుతోంది. బాధ్యతాయుతమయిన ఏ హోదా లభించినా అది దేవుని తరపున జరిగిన నిర్ణయం అని వారు తలపోయాలి. వారు ఆ హోదాలో నియుక్తం చేయబడింది ఎయిర్ కండీషన్డ్ బంగ్లాల్లో హాయిగా నిద్రపోవడానికి, విషయలాలసలో మునిగి ఉండటానికి కాదని గ్రహించాలి. భద్రతా సిబ్బంది గేటువద్ద పహరాగా నిలబడి ఉండగా వాళ్లు అద్దాల మేడల్లో సేద తీరుతూ ఉండటం, తమను కలుసుకోవడానికి వచ్చిన ప్రజా బాహుళ్యాన్ని గేటు వద్దనే వారి సిబ్బంది నిలువరించటం – బాధ్యతాయుత పరిపాలనా యంత్రాంగం అనిపించుకోదు. ప్రజా వ్యవహారాల్లో ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని కనబరచిన అధికారిని అల్లాహ్ కూడా ప్రళయదినాన పట్టించుకోడు. అతడు ఇహలోక జీవితంలో సామాన్య జనులను ఎంతగా బాధించాడో అంతగానే అల్లాహ్ పరలోకంలో అతన్ని పరాభవం పాల్జేస్తాడు.
హదీసు ఉల్లేఖకులు
అబూ మర్యమ్ అజ్దీ (రదియల్లాహు అన్హు) : అసదీగా కూడా సుప్రసిద్ధులే. హజ్రమీగా కూడా పిలువబడేవారు. ప్రవక్త ﷺ సహచర్య భాగ్యం పొందారు. సిరియాలో హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) వద్దకు వచ్చేశారు. ఆయనకు ఈ హదీసును వినిపించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1198
హదీసు 1199
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: { لَعَنَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -اَلرَّاشِيَ وَالْمُرْتَشِيَ فِي اَلْحُكْمِ } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ, وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ. وَلَهُ شَاهِدٌ: مِنْ حَدِيثِ عَبْدِ اَللَّهِ بنِ عَمْرٍو. عِنْدَ اَلْأَرْبَعَةِ إِلَّا النَّسَائِيَّ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : “తీర్పు వ్యవహారంలో లంచం ఇచ్చేవానినీ, లంచం పుచ్చుకునే వానినీ దైవప్రవక్త ﷺ ధూత్కరించారు.” (ఈ హదీసును అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని హసన్గా ఖరారు చేశారు. ఇబ్నె హిబ్బాన్ దీన్ని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. నసాయి మినహా ‘నలుగురి’ దృష్టిలో అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) హదీసు దీనికి సాక్ష్యం)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) cursed the one who bribes and the one who takes bribes to influence the judgement. [Reported by Ahmad and al-Arba'a. at-Tirmidhi graded it Hasan (good), and Ibn Hibban graded it Sahih (authentic).
It has a Shahid (supporting narration) from 'Abdullah bin 'Amr's Hadith, reported by al-Arba'a except an-Nasa'i].
సారాంశం
ఈ హదీసులో లంచం ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు – ఇద్దరూ శపించబడ్డారు. కనుక లంచం ఇవ్వటం మరియు తీసుకోవటం – రెండునూ మహాపరాధం, ఘోర పాపంగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఈ చెడుగు మూలంగా సమాజంలో పట్టపగలే దాసుల హక్కులు కొల్లగొట్టబడతాయి. నిజాయితీ స్థానే నిలువుదోపిడీ రాజ్యమేలుతుంది. ఇలాంటి అవినీతితో కూడిన సమాజంలో ప్రజలు ఒండొకరి శ్రేయోభిలాషులుగా ఎలా రూపొందుతారు? ఒండొకరి సుఖదుఃఖాలలో – మంచీ చెబ్బరలలో ఎలా పాలుపంచుకుంటారు? పరోపకారం, త్యాగం వంటి సకారాత్మక భావాలు పెంపొందే బదులు వారిలో ప్రతీకారం, ద్వేషం వంటి నకారాత్మక భావాలు పొడసూపుతాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1199
హదీసు 1200
وَعَنْ عَبْدِ اَللَّهِ بنِ اَلزُّبَيْرِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { قَضَى رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -أَنَّ اَلْخَصْمَيْنِ يَقْعُدَانِ بَيْنَ يَدَيِ اَلْحَاكِمِ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “పోట్లాడుకున్న వ్యక్తులిరువురూ న్యాయాధికారి ఎదుట కూర్చోవాల”ని దైవప్రవక్త ﷺ ఆజ్ఞాపించారు. (అబూదావూద్ ఈ హదీసును ఉల్లేఖించగా, హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Narrated 'Abdullah bin az-Zubair (RA): Allah's Messenger (ﷺ) ruled that the two opposing parties in a dispute should sit in front of the judge. [Reported by Abu Dawud. al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
ఈ హదీసులో రెండు విషయాలు ప్రధానంగా తెలుపబడ్డాయి. 1. న్యాయస్థానంలో నిందించేవాడు, నిందించబడేవాడు – ఇద్దరిపట్లా సమభావంతో ప్రవర్తించాలి. పక్షపాతం కూడదు. ఒకరి యెడల మర్యాదపూర్వకంగా వ్యవహరించి రెండో వ్యక్తిపట్ల దురుసుగా ప్రవర్తించటం ఎంతకీ తగదు.
2. తగాదా పడ్డ ఇద్దరూ న్యాయాధికారి సమక్షంలో కూర్చుని వివరణ ఇవ్వాలి. అంతేగాని నిలబడి సంజాయిషీ ఇవ్వరాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|14. వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)|14.0 ఖాజీ (న్యాయమూర్తి) గురించి|హదీసు 1200
You must be logged in to post a comment.