హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, 8వ అధ్యాయం: గుసుల్ మరియు జనాబత్. ఈ అధ్యాయంలో 15 హదీసులు (హదీసు 94 – 108) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
1.8 గుసుల్ మరియు జనాబత్
باب الغسل وحكم الجنب
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
(స్నానం చేయటం, లైంగిక అశుద్ధతను పారద్రోలటం)
హదీసు 94
عَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْمَاءُ مِنْ اَلْمَاءِ } رَوَاهُ مُسْلِم ٌ. وَأَصْلُهُ فِي اَلْبُخَارِيّ ِ.
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “నీరు విసర్జించబడినపుడే నీరు ఉపయోగించాలి.” (అంటే వీర్య స్ఖలనం జరిగే వరకూ గుసుల్ చేయటం తప్పని సరి కాదు). (దీనిని ముస్లిం ఉల్లేఖించారు. అయితే మూలాంశం మాత్రం బుఖారీలో ఉంది).
English
Narrated Abu Sa’id Al-Khudri (rad): Allah’s Mesenger (ﷺ) said: “The water (of the ghusl) is due to the water (of sexual emission)”. [Reported by Muslim]
and its Asl (origin) is in Al-Bukhari.
సారాంశం
ఈ హదీసు ‘ఇహ్తిలామ్’ (వీర్య స్ఖలనం) కు సంబంధించినదని, సంభోగంతో దీనికి సంబంధం లేదని పండితులు వ్యాఖ్యానించారు. హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “ఇస్లాం ఆరంభకాలంలో భార్యాభర్తలు రతి క్రీడలో పాల్గొన్నప్పటికీ – స్ఖలనం జరిగేదాకా – స్నానం (గుసుల్) తప్పనిసరి గావించబడలేదు. అయితే ఈ ఆజ్ఞ తరువాత రద్దు పరచబడింది.”
ఖాజీ ఇబ్నె అరబీ ఏమంటున్నారో చూడండి: స్త్రీ పురుషులిద్దరి మర్మాంగాలు పరస్పరం కలుసుకుంటే చాలు – వీర్య స్ఖలనం జరిగినా, జరగకపోయినా – స్నానం చేయటం తప్పనిసరి అయి పోతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 94
హదీసు 95
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا جَلَسَ أَحَدُكُمْ بَيْنَ شُعَبِهَا اَلْأَرْبَعِ, ثُمَّ جَهَدَهَا, فَقَدْ وَجَبَ اَلْغُسْلُ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَزَادَ مُسْلِمٌ: "وَإِنْ لَمْ يُنْزِلْ ".
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరయినాసరే స్త్రీ యొక్క నాలుగు శాఖల మధ్య కూర్చుని (అంటే స్త్రీని ఆక్రమించుకుని) ఆ తరువాత సఫల యత్నం చేస్తే స్నానం తప్పనిసరిగా చేయాల్సిందే.” (బుఖారీ, ముస్లిం) ముస్లిం తన ఉల్లేఖనంలో “వీర్య స్ఖలనం జరిగినా, జరగకపోయినాసరే” అన్న వాక్యం కూడా పొందుపరచారు.
English
Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said that, “If one of you sits between her legs (of a woman) and penetrates her, Ghusl (bath) is obligatory.” [Agreed upon].
And Muslim added: “Even if he does not ejaculate”.
సారాంశం
(1) ‘స్త్రీ యొక్క నాలుగు శాఖలు’ అంటే రెండు కాళ్ళు, రెండు జబ్బలు అని కొంతమందీ, రెండు తొడలు మరియు రెండు పిక్కలని మరికొంతమందీ విశదీకరించారు. ఏ విధంగా అర్థం తీసుకున్నా అది రతి క్రీడకు సంబంధించిన అంశమేనన్న సంగతి మాత్రం మరువరాదు.
(2) పురుషాంగం స్త్రీ యోనిలోకి ప్రవేశిస్తే చాలు – కనీసం శిశ్నం వరకూ ప్రవేశించినా సరే – గుసుల్ (స్నానం) విధిగా చేయవలసిందే. నలుగురు ధర్మ ఖలీఫాల, నలుగురు ఇమాముల, ప్రవక్త శిష్యుల, ప్రశిష్యుల అభిమతం కూడా ఇదే. ఈ హదీసు ఇంతకు ముందు వచ్చిన హదీసును రద్దుపరుస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 95
హదీసు 96
وَعَنْ أُمِّ سَلَمَةَ; أَنَّ أُمَّ سُلَيْمٍ -وَهِيَ اِمْرَأَةُ أَبِي طَلْحَةَ- قَالَتْ: { يَا رَسُولَ اَللَّهِ! إِنَّ اَللَّهَ لَا يَسْتَحِي مِنْ اَلْحَقِّ, فَهَلْ عَلَى اَلْمَرْأَةِ مِنْ غُسْلٍ إِذَا اِحْتَلَمَتْ? قَالَ: "نَعَمْ. إِذَا رَأَتِ الْمَاءَ" } اَلْحَدِيثَ. مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం: అబూ తల్హా సతీమణి అయిన ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ నుద్దేశ్యించి, ‘ఓ దైవప్రవక్తా ﷺ! అల్లాహ్ సత్యం చెప్పడానికి సిగ్గుపడడు కదా! కాబట్టి స్త్రీకి స్వప్న స్ఖలనం జరిగితే ఆమె కూడా తప్పనిసరిగా స్నానం చేయాల్సిందేనా చెప్పండి?, అని అడిగారు. దానికి ఆయన ﷺ, “అవును. ద్రవ పదార్థం ఆమెకు కనిపిస్తే (స్నానం చేయాల్సిందే)” అని బదులిచ్చారు. (బుఖారీ, ముస్లిం)
English
Narrated Umm Salam (rad): Umm Sulaim, the wife Abu Talha said, “O Allah’s Messenger! Allah is not ashamed of the truth. Is a Ghusl (bath) compulsory for a woman when she has a sexual dream?” He (ﷺ) replied, “Yes! When she sees signs of liquid” [Agreed upon].
సారాంశం
సాధారణంగా స్త్రీలు ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకోవటానికి సిగ్గు పడుతుంటారు. స్త్రీలలో అల్లాహ్ పొందుపరచిన లజ్జా గుణమే దీనికి ప్రధాన కారణం. ఈ లజ్జా గుణం వల్ల ధర్మ సందేహాలు వెలిబుచ్చకుండా ఉంటే మహిళావని ధర్మ సందేహాలు కూడా తీరవు. హజ్రత్ ఉమ్మె సులైమ్ ఎంతో చాకచక్యంగా దైవప్రవక్త ﷺ సమక్షంలో తన సందేహాన్ని వెలిబుచ్చి కోట్లాదిమంది మహిళలకు మేలు చేశారు.
హదీసు ఉల్లేఖకులు
ఉమ్మె సులైమ్ అసలు పేరు రుమైసా లేక ఘుమైసా బిన్తె మిల్హాన్ అని తెలుస్తోంది. ఈమె హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) తల్లి. పండితురాలు. తొలుత ఈమె మాలిక్ బిన్ నసర్‌కు సతీమణిగా ఉన్నారు. ఈమె ఇస్లాం స్వీకరించింది. భర్తను సయితం ఇస్లాం స్వీకరించమని ప్రాధేయపడింది. భర్త ఈమెపై ఆగ్రహించి సిరియా వెళ్ళిపోయాడు. అక్కడే మరణించాడు. మాలిక్ బిన్ నసర్ మరణానంతరం అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఈమెకు వివాహ సందేశం పంపారు. అప్పటికి అబూ తల్హా (రదియల్లాహు అన్హు) కూడా ముస్లిం కాలేదు. ఇస్లాం స్వీకరిస్తేనే నికాహ్ చేసుకుంటానని ఈమె షరతు విధించింది. ఈ షరతును శిరసావహిస్తూ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించారు. అనంతరం ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా) ఈయన్ని వివాహ మాడారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో ఈమె మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 96
హదీసు 97
وَعَنْ أَنَسٍ - رضى الله عنه - قَالَ: { قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم --فِي اَلْمَرْأَةِ تَرَى فِي مَنَامِهَا مَا يَرَى اَلرَّجُلُ- قَالَ: "تَغْتَسِلُ" } مُتَّفَقٌ عَلَيْه ِ. وَزَادَ مُسْلِمٌ: فَقَالَتْ أُمُّ سَلَمَةَ { وَهَلْ يَكُونُ هَذَا? قَالَ: "نَعَمْ فَمِنْ أَيْنَ يَكُونُ اَلشَّبَهُ? }.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: కలలో యువకుడైన పురుషుడు చూచినదే స్త్రీ కూడా చూస్తే ఆమె స్నానం (గుసుల్) చేయవలసి ఉంటుందని దైవప్రవక్త ﷺ చెప్పారు. (బుఖారీ, ముస్లిం)
ముస్లిం అదనంగా ఈ వాక్యాలు చేర్చారు: ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ సమాధానం విని, ‘ఏమిటి, స్త్రీకి కూడా ఇలా అవుతుందా?’ అని సందేహపడగా, “అవును, అలా అవని పక్షంలో (పిల్లవాడికి తల్లి) పోలికలు ఎలా వస్తాయనుకున్నావు?” అని పలికారు.
English
Narrated Anas (rad): Allah’s Messenger (ﷺ) said about the precept of a woman having ejaculation during sleep like a man, “She should take a Ghusl (bath)”. [Agreed upon]
Added Muslim: Umm Salama said, “Does this happen (to a woman)?” He (ﷺ) said: “Yes, otherwise where does the resemblance (of a child to its mother) come from?”
సారాంశం
పుట్టిన శిశువులకు తండ్రి పోలికలతో పాటు తల్లి పోలికలు కూడా వస్తుంటాయి. తల్లి తరపు బంధువుల పోలికలు కూడా వస్తాయి. సంభోగం జరుపుతున్నప్పుడు పురుషునితో పాటు స్త్రీలో కూడా స్పందన అధికమై ద్రవాలు ఊరుతాయి. ఇవి పుట్టే శిశువు పోలికలపై ప్రభావం చూపుతాయి.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) తీవ్రంగా సందేహం వెలిబుచ్చడాన్నిబట్టి అర్థమయ్యే మరో విషయమేమిటంటే; స్త్రీలలో స్ఖలనం చాలా అరుదుగా అవుతుంటుంది. పురుషుల మాదిరిగా తరచూ అవదు.
వీర్య స్ఖలనం (స్వప్న స్ఖలనం) జరిగినప్పుడు పురుషులు స్నానం చేయటం ఎలా తప్పనిసరో అలాగే స్త్రీలు కూడా తమకు స్వప్న స్ఖలనం అయినప్పుడు తప్పనిసరిగా స్నానం చేయవలసి ఉంటుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 97
హదీసు 98
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يَغْتَسِلُ مِنْ أَرْبَعٍ: مِنْ اَلْجَنَابَةِ, وَيَوْمَ اَلْجُمُعَةِ, وَمِنْ اَلْحِجَامَةِ, وَمِنْ غُسْلِ اَلْمَيِّتِ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ నాలుగు కారణాలవల్ల గుసుల్ (స్నానం) చేసేవారు – 1. సంభోగించినపుడు. 2. శుక్రవారం వచ్చినపుడు. 3. శరీరం నుండి రక్తం తీసినపుడు. 4. మృతునికి స్నానం చేయించినపుడు. (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు).
English
Narrated ‘Aisha (rad): Allah’s Messenger (ﷺ) used to take a bath from four things; after sexual intercourse, on Fridays, after extracting blood from his body and after washing a dead body. [Reported by Abu Da’ud and Ibn Khuzaima graded it Sahih (sound)]
సారాంశం
నాలుగు పనుల మూలంగా స్నానం చేయవలసి ఉంటుందని ఈ హదీసులో చెప్పబడింది. (1) సంభోగించిన తరువాత స్నానం చేయటం విధి (ఫర్జ్) అన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. (2) అయితే శుక్రవారం నాడు స్నానం చేయటం చాలామంది సహాబీల, ఇమాముల దృష్టిలో సంప్రదాయం (మస్నూన్) మాత్రమేగాని విధి (ఫర్జ్) కాదు. కాని ఇమామ్ అహ్మద్, ఇమామ్ మాలిక్‌లు మాత్రం ఈ స్నానాన్ని విధిగా తలపోస్తున్నారు. (3) శరీరం నుండి (చెడు) రక్తం తీసినపుడు స్నానం చేయటం కూడా మస్నూన్ మాత్రమే. ఫర్జ్ కాదు. (4) ఇక, మృతునికి స్నానం చేయించిన మీదట స్నానం చేయటం ముస్తహబ్ (అభిలషణీయం) గా భావించబడుతుంది. అంతేగాని తప్పనిసరి కాదు. ఈ విషయంలో అత్యధికుల అభిమతం ఇదే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 98
హదీసు 99
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - { -فِي قِصَّةِ ثُمَامَةَ بْنِ أُثَالٍ, عِنْدَمَا أَسْلَم- وَأَمَرَهُ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -أَنْ يَغْتَسِلَ } رَوَاهُ عَبْدُ اَلرَّزَّاق ِ. وَأَصْلُهُ مُتَّفَقٌ عَلَيْه ِ.
సుమామ బిన్ ఉసాల్ (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకారానికి సంబంధించిన వృత్తాంతాన్ని వివరిస్తూ హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: “దైవప్రవక్త ﷺ అతనికి స్నానం చేసి రమ్మని ఆదేశించారు.” (అబ్దుర్రజ్జాఖ్ దీనిని ఉల్లేఖించారు. దీని మూలాంశం బుఖారీ, ముస్లింలలో పొందుపరచబడి ఉంది).
English
Narrated Abu Huraira (rad) regarding the story of Thumama bin Uthal when he embraced Islam: The Prophet (ﷺ) ordered him to take a bath. [Narrated by Abdur-Razzaq]
and its origin is in Al-Bukhari and Muslim.
సారాంశం
ఒక ముస్లిమేతరుడు ఇస్లాం స్వీకరణకు సిద్ధమైనప్పుడు తొలుత అతను స్నానం చేయాలి. ఈ స్నానం వాజిబా (తప్పనిసరా?) లేక ముస్తహబా (అభిలషణీయమా?) అన్న విషయమై పండితులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇమామ్ మాలిక్, ఇమామ్ అహ్మద్‌ల దృష్టిలో తప్పనిసరి. ఇమామ్ షాఫయి, ఇమామ్ అబూ హనీఫాల దృష్టిలో అభిలషణీయం.
హదీసు సూత్రధారి
ఈ హదీసుకు సూత్రధారియైన సుమామ బిన్ ఉసాల్ యమామాకు చెందినవారు. బనూ హనీఫా తెగకు సర్దారు. ఉమ్రా చేయడానికి (మక్కాకు) బయలుదేరారు. దైవప్రవక్త ﷺ నియమించిన గస్తీ దళానికి పట్టుబడ్డారు. అనంతరం మదీనా మునవ్వరాలో – దైవప్రవక్త ﷺ సమక్షంలో – హాజరుపరచ బడ్డారు. మస్జిదె నబవీలో ఒక స్తంభానికి మూడు రోజులు బంధించి ఉంచారు. మూడు రోజుల అనంతరం దైవప్రవక్త ﷺ ఈయన యెడల ఉదార వైఖరినవలంబిస్తూ వదలిపెట్టారు. ప్రవక్త వారి కనికరానికి ప్రభావితుడై ఈయన ఇస్లాం స్వీకరించారు. తుది శ్వాస దాకా ఇస్లాంపై స్థిరంగా ఉన్నారు. తన ప్రాంతంలో ప్రజలు ముసైలమా అబద్ధాలకోరు మాయమాటల్లోపడి ధర్మభ్రష్టులైపోతున్న క్లిష్ట సమయంలో సయితం కదలని కొండలా స్థయిర్యం కనబర్చారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 99
హదీసు 100
وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { غُسْلُ اَلْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ } أَخْرَجَهُ اَلسَّبْعَة ُ.
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రవచించారు: “శుక్రవారం నాడు స్నానం చేయటం ప్రతి యుక్తవయస్సునికీ తప్పనిసరి.” (దీనిని ఏడుగురూ -అంటే-బుఖారీ, ముస్లిం, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ, అహ్మద్ ఉల్లేఖించారు).
English
Narrated Abu Sa’id Al-Khudri (rad): Allah’s Messenger (ﷺ) said: “Taking a bath on Friday is a must for every adult”. [Reported by As-Sab’a].
సారాంశం
శుక్రవారం నాడు స్నానం చేయటం తప్పనిసరి (వాజిబ్) అని వాదించేవారికి ఈ హదీసు ప్రబల ఆధారంగా ఉంది. ఎందుకంటే ఇందులో ‘వాజిబ్’ అన్న పదం స్పష్టంగా ఉంది. అయితే అధికసంఖ్యాక పండితవర్గం మాత్రం శుక్రవారం నాటి స్నానాన్ని ‘మస్నూన్’గా భావిస్తోంది. ఈ హదీసులోని ‘వాజిబ్’ పదం గట్టిగా నొక్కి చెప్పే ఉద్దేశ్యంతో ఉపయోగించబడిందని వీరంటున్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 100
హదీసు 101
وَعَنْ سَمُرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ تَوَضَّأَ يَوْمَ اَلْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ, وَمَنْ اِغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَحَسَّنَهُ اَلتِّرْمِذِيّ ُ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ సముర (రదియల్లాహు అన్హు) తెలిపారు: “శుక్రవారం ఎవరయితే ‘వుజూ’ చేశాడో అతడు మంచిపని చేశాడు. మరెవరయితే ‘గుసుల్’ (స్నానం) చేశాడో (అతని) గుసుల్ ఎట్టి పరిస్థితిలోనూ శ్రేష్ఠమయినది, ఉత్తమమైనది.” (దీనిని ఐదుగురు -అంటే- అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేశారు)
English
Narrated Sumara (rad): Allah’s Messenger (ﷺ) said: “Whoever performs ablution on Friday has done a good thing and he who takes bath, taking bath is better (for him).” [Reported by Al-Khamsa and At-Tirmidhi graded it Hasan (fair).]
సారాంశం
శుక్రవారం నాటి స్నానం తప్పనిసరి (వాజిబ్) కాదని దీనిద్వారా రూఢీ అవుతోంది. ఎందుకంటే ‘వాజిబ్’ అయిన దానిని ‘అఫ్జల్’ (శ్రేష్ఠమైనది)గా అభివర్ణించరు. బహుశా ఈ కారణంగానే అత్యధికమంది పండితులు దీనిని ‘తప్పనిసరి’ అన్న అర్థంలో తీసుకోలేదు. అయితే అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న విషయం ఏమిటంటే ముస్లింలు శుక్రవారం నాడు స్నానం చేయటం మరువరాదు. ఈ స్నానం గురించి గట్టిగా చెప్పబడిందని ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) అన్నారు. వితర్ నమాజు ‘వాజిబ్’ అన్న అభిప్రాయాన్ని పరిగణణలోకి తీసుకుంటున్నప్పుడు శుక్రవారం నాటి స్నానం అంతకన్నా ఎక్కువగానే పరిగణణలోకి తీసుకోదగ్గదవుతుంది.
హదీసు ఉల్లేఖకులు
పూర్తిపేరు సముర బిన్ జున్దుబ్. సుప్రసిద్ధ సహాబీ. ఈయన మారు పేరు అబూ అబ్దుల్లాహ్.
ఫజార్ తెగ వారవటంచేత ఫజారీ అని కూడా పిలువబడేవారు. అన్సారులతో మైత్రీ సంబంధాలుండేవి. ఖుర్ఆన్ హదీసులలో చాలా భాగం కంఠస్థం చేసుకున్నవారిలో ఈయన ఒకరు. బస్రాలో స్థిరనివాసమేర్పరచుకున్నారు. ‘హరూరియ’ వర్గంపట్ల చాలా కఠిన మనస్సులై ఉండేవారు. హిజ్రీ 59లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 101
హదీసు 102
وَعَنْ عَلِيٍّ - رضى الله عنه - قَالَ: { كَانَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -يُقْرِئُنَا اَلْقُرْآنَ مَا لَمْ يَكُنْ جُنُبًا } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ, وَهَذَا لَفْظُ اَلتِّرْمِذِيِّ وَحَسَّنَةُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “దైవప్రవక్త ﷺ లైంగిక అశుద్ధతకు లోనై వున్నప్పుడు తప్ప మిగిలిన ఏ స్థితిలోనయినా మాకు ఖుర్ఆన్ చదివించేవారు.” (దీనిని ఐదుగురు – అంటే – అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు మాత్రం తిర్మిజీ లోనివి. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు).
English
Narrated ‘Ali (rad): The Prophet (ﷺ) used to teach us the Qur’an except when he was in a state of sexual impurity. [Reported by Ahmad and Al-Arba’a. This is the version of At-Tirmidhi who graded it Hasan (fair). And Ibn Hibban graded it Sahih (sound)].
సారాంశం
లైంగిక అశుద్ధతకు గురైవున్న పురుషుడు దివ్య ఖుర్ఆన్ను పఠించరాదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. గుసుల్ చేసే వరకూ ఖుర్ఆన్ను ముట్టుకోవటంగానీ, పారాయణం చేయటంగానీ చేయరాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 102
హదీసు 103
وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا أَتَى أَحَدُكُمْ أَهْلَهُ, ثُمَّ أَرَادَ أَنْ يَعُودَ فَلْيَتَوَضَّأْ بَيْنَهُمَا وُضُوءًا } رَوَاهُ مُسْلِم ٌ. زَادَ اَلْحَاكِمُ: { فَإِنَّهُ أَنْشَطُ لِلْعَوْدِ }. وَلِلْأَرْبَعَةِ عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يَنَامُ وَهُوَ جُنُبٌ, مِنْ غَيْرِ أَنْ يَمَسَّ مَاءً } وَهُوَ مَعْلُول ٌ.
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “మీలో ఎవరయినా మీ భార్య వద్దకు పోతే (సంభోగిస్తే), మరోసారి కూడా ఆనందానుభూతి పొందాలన్న కోర్కె కలిగితే – మధ్యలో ‘వుజూ’ చేసుకోండి.” (ముస్లిం)
హాకిమ్ అదనంగా ఈ వాక్యం చేర్చారు: (ఈ వుజూ) మలిసారి సంభోగానికి ఎక్కువ హాయినీ, తాజాదనాన్నిస్తుంది.
సుననె అర్బా (అంటే అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజ)లో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారిచే ఇలా ఉల్లేఖించబడింది: “దైవప్రవక్త – ﷺ -లైంగిక అశుద్ధతకు లోనై వున్న తరుణంలో నీళ్ళను తాకకుండానే నిద్రించేవారు.” (ఈ ఉల్లేఖనం లోపభూయిష్టమైనది).
English
Narrated Abu Sa’id Al-Khudri (rad): Allah’s Messenger (ﷺ) said: “If one of you has sexual intercourse with his wife and wishes to repeat he should perform ablution between them” [Reported by Muslim].
A-Hakim added: “Ablution makes one active for repeating (the sexual act).”
Narrated ‘Aisha (rad): Allah’s Messenger (ﷺ) used to sleep in the state of sexual impurity without touching water. [Reported by Al-Arba’a. This Hadith is defective].
సారాంశం
పై హదీసు వెలుగులో స్పష్టమయ్యేదేమిటంటే అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులోని ‘వుజూ చేయాలన్న ఆదేశం’ ‘ముస్తహబ్’ మాత్రమే గాని ‘వాజిబ్’ కాదు.
‘ముస్లిం’ ఉల్లేఖనం ప్రకారం రూఢీ అయ్యేదేమిటంటే, ఆయన ﷺ అన్న పానీయాల నిమిత్తం, సంభోగం నిమిత్తం మర్మాంగాన్ని కడుక్కొని, వుజూ చేసేవారు. విద్వాంసులలో అధిక సంఖ్యాకులు ఈ వుజూను తప్పనిసరిగా భావించలేదు. అభిలషణీయంగా మాత్రమే తలపోశారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 103
హదీసు 104
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا اِغْتَسَلَ مِنْ اَلْجَنَابَةِ يَبْدَأُ فَيَغْسِلُ يَدَهُ, ثُمَّ يُفْرِغُ بِيَمِينِهِ عَلَى شِمَالِهِ, فَيَغْسِلُ فَرْجَهُ, ثُمَّ يَتَوَضَّأُ, ثُمَّ يَأْخُذُ اَلْمَاءَ, فَيُدْخِلُ أَصَابِعَهُ فِي أُصُولِ اَلشَّعْرِ, ثُمَّ حَفَنَ عَلَى رَأْسِهِ ثَلَاثَ حَفَنَاتٍ, ثُمَّ أَفَاضَ عَلَى سَائِرِ جَسَدِهِ, ثُمَّ غَسَلَ رِجْلَيْهِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِم ٍ. وَلَهُمَا فِي حَدِيثِ مَيْمُونَةَ: { ثُمَّ أَفْرَغَ عَلَى فَرْجِهِ وَغَسَلَهُ بِشِمَالِهِ, ثُمَّ ضَرَبَ بِهَا اَلْأَرْضَ } وَفِي رِوَايَةٍ: { فَمَسَحَهَا بِالتُّرَابِ } وَفِي آخِرِهِ: { ثُمَّ أَتَيْتُهُ بِالْمِنْدِيلِ } فَرَدَّهُ, وَفِيهِ: { وَجَعَلَ يَنْفُضُ الْمَاءَ بِيَدِهِ }.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా వివరించారు: దైవప్రవక్త ﷺ లైంగిక అశుద్ధత నుండి పరిశుద్ధత పొందే నిమిత్తం స్నానానికి ఉపక్రమించినపుడు మొదట చేతులు కడుక్కునేవారు. తరువాత కుడిచేత్తో ఎడమచేతిపై నీరు పోసి తన మర్మస్థానాన్ని కడిగేవారు. ఆ తరువాత వుజూ చేసేవారు. ఆపైన నీళ్ళు తీసుకుని తన చేతి వ్రేళ్ళతో తలవెంట్రుకల వ్రేళ్ళ భాగం సయితం తడిసేలా నీరు పోసేవారు. ఆపైన దోసిట్లో నీళ్ళు తీసుకుని మూడుసార్లు తలపై నీరు పోసేవారు. ఆపైన శరీరమంతటిపై నీళ్ళు పోసుకునేవారు. ఆఖరిలో కాళ్ళు కడిగేవారు. (బుఖారీ, ముస్లిం. హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి).
బుఖారీ, ముస్లింలలోనే హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ఇలా ఉంది: మరి తన మర్మస్థానంపై నీరు పోసేవారు. తన ఎడమ చేత్తో దాన్ని కడిగేవారు. చేతులను నేలపై కొట్టి మట్టితో బాగా తోముకునేవారు (శుభ్రపరచుకునేవారు).
వేరొక ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది: “మరి రెండు చేతులనూ మట్టితో తోమి, బాగా శుభ్రపరచుకునేవారు.” ఈ ఉల్లేఖనం ఆఖరిలో ఇలా ఉంది: “నేను ఆయన ﷺసేవలో తువాలు సమర్పించాను. కాని ఆయన ﷺ దానిని వాపసు చేశారు (శరీరంపై వున్న నీటి బిందువులను) చేత్తోనే తుడిచేశారు.”
English
Narrated ‘Aisha (rad): Whenever Allah’s Messenger (ﷺ) took Ghusl (bath) after sexual intercourse, he would begin by washing his hands, then pour water with his right hand on his left hand and wash his sexual organ. He would then perform ablution, then take some water and run his fingers through the roots of the hair. Then he would pour three handfuls on his head, then pour water over the rest of his body and subsequently wash his feet. [Agreed upon and this version is of Muslim]
Narrated Maimuma (rad): Allah’s Messenger (ﷺ) poured water over his private parts and washed them with his left hand. He then struck his hand against the earth.
Narrated Maimuna (Radhi Allahu Anhu): "And he wiped it with earth".
Narrated Maimuna (Radhi Allahu Anhu): And in the last of this version: “I handed him a piece of cloth, but he did not take it… He started shaking the water off his hand.”
సారాంశం
పై హదీసు వెలుగులో కొన్ని విషయాలను ఇక్కడ వివరించటం అవసరం. వివిధ హదీసులను కలిపిన తర్వాత బోధపడేదేమిటంటే గుసుల్కు (స్నానానికి) ముందు ఆయన ﷺ చేతులను కడిగేవారు. ఎన్నిసార్లు కడిగేవారో ప్రస్తావించబడలేదు. ఉమ్ముల్ మోమినీన్ మైమూన (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ద్వారా రెండు లేక మూడుసార్లు కడిగేవారని తెలుస్తోంది. తరువాత ఆయన ﷺ తన మర్మస్థానం కడుక్కునేవారు. అటు తరువాత అరచేతులను నేలపై అదిమి, మట్టితో తోమి శుభ్రపరచుకునేవారు. ఆపైన నమాజ్ నిమిత్తం ఎలా గుసుల్ చేసేవారో సరిగ్గా అలాగే గుసుల్ (స్నానం) చేసేవారు. తలపై నీరు పోసుకునేటప్పుడు చేతి వ్రేళ్ళను జుత్తులోనికి జొప్పించి వెంట్రుకలు పూర్తిగా తడిసేలా జాగ్రత్త వహించేవారు. ఆ తర్వాత శరీరమంతటిపై నీరు ప్రవహింపజేసేవారు. ఆఖరిలో కాళ్ళు కడుక్కునేవారు. మొదట ఒక ప్రక్కకు జరిగి, పిదప రెండు కాళ్ళపై నీరు పోసుకునేవారని హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనంలో ఉంది. ఈ గుసుల్లో భాగంగా చేసుకున్న వుజూతోనే ఆయన ﷺ ఉదయం పూట సున్నత్ – రెండు రకతులు, ఫర్జ్ రెండు రకతుల నమాజ్ చేసేవారు. అంటే గుసుల్ తరువాత, వేరుగా వుజూ చేసేవారు కాదు.
ఈ హదీసు ద్వారా విదితమయ్యే ఇంకొక విషయమేమిటంటే గుసుల్ మరియు వుజూ తరువాత ముఖానికి, శరీరానికి, చేతులకు అంటుకున్న నీరును తుడవడానికి రుమాలును ఉపయోగించటం తప్పనిసరి కాదు. అలాగే చేతులతో వుజూ నీటి బిందువులను తుడుచుకోవటం కూడా ఆక్షేపణీయం కాదు. చేత్తో నీటి బిందువులను తొలగించరాదన్న హదీసు బలహీనమైనది. ప్రామాణికమైన హదీసు ముందు బలహీనమైన హదీసుకు ఎలాంటి స్థానం లేదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 104
హదీసు 105
وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { قُلْتُ: يَا رَسُولَ اَللَّهِ إِنِّي اِمْرَأَةٌ أَشُدُّ شَعْرَ رَأْسِي, أَفَأَنْقُضُهُ لِغُسْلِ اَلْجَنَابَةِ? وَفِي رِوَايَةٍ: وَلِلْحَيْضَةِ? فَقَالَ: "لَا, إِنَّمَا يَكْفِيكِ أَنْ تَحْثِي عَلَى رَأْسِكِ ثَلَاثَ حَثَيَاتٍ" } رَوَاهُ مُسْلِم ٌ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) తెలిపారు: “ఓ దైవప్రవక్తా ﷺ! నేను నా శిరోజాలను గట్టిగా ముడివేస్తాను. సంభోగానంతరం స్నానం చేసేటప్పుడు ముడి విప్పటం అవసరమా?” వేరొక ఉల్లేఖనంలో “రుతుస్రావం తరువాత స్నానం చేసేటప్పుడు” అని ఉంది. దీనికి ఆయన ﷺ “లేదు. (ముడి విప్పవలసిన అవసరం లేదు). నువ్వు నీ తలపై మూడు దోసిట్ల నీరు పోస్తే అదే చాలు” అని సమాధానమిచ్చారు. (ముస్లిం)
English
Narrated Umm Salamah (RAA): I said, "O Messenger of Allah, I am a woman who keeps her hair closely plaited. Do I have to undo them for Ghusl after sexual intercourse?" In another narration, "and after the end of menses?" He replied (ﷺ), "No, is it enough for you to throw three handfuls of water over your head." Related by Muslim.
సారాంశం
లైంగిక అశుద్ధతకు లోనైన స్త్రీ లేక రుతుస్రావం అయిన స్త్రీ పరిశుద్ధతను పొందే సంకల్పంతో స్నానం చేసేటప్పుడు ముడి విప్పి శిరోజాలన్నింటినీ తడపవలసిన అవసరం లేదని ఈ హదీసు ద్వారా అవగతమవుతుంది. అయితే ఆయన ﷺ; శిరోజాలను విప్పవలసిందిగా ఆజ్ఞాపించినట్లు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనంలో ఉంది. అయితే ఈ రెండు ఉల్లేఖనాలూ పరస్పర విరుద్ధమైనవి కూడా కావు. ఎందుకంటే శిరోజాలను విప్పాలన్న ఆజ్ఞ కేవలం ‘అభిలషణీయం’ అన్న ఉద్దేశ్యంతోనే ఇవ్వబడింది. అంతేగాని సంభోగానంతరం మరియు రుతుస్రావం ఆగిన తరువాత స్నానం చేసే సమయంలో స్త్రీలు ముడిని తప్పనిసరిగా విప్పాల్సిందేనన్న నిబంధన ఏదీ లేదు. తల వెంట్రుకలు మొలిచే మొదళ్ళలోకి నీరు ప్రవేశించి, తల చర్మం పూర్తిగా తడిస్తే చాలు.
స్త్రీలు సంభోగం తరువాత, రుతుస్రావం తరువాత స్నానం చేసేటప్పుడు శిరోజాలన్నింటినీ విప్పి మరీ తడపవలసిందిగా హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆజ్ఞాపిస్తున్నారని ఎవరో చెప్పగా విని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆశ్చర్య చకితులయ్యారు. ఆ సందర్భంగా ఆమె ఇలా స్పందించారు: “శిరోజాలు విప్పమని అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) స్త్రీలకు ఎలా ఆదేశిస్తున్నారో అర్థం కావటం లేదు. ఇంకా నయం, గుండు చేయించుకోమని చెప్పారు కాదు. నేను మరియు దైవప్రవక్త ﷺ ఒకే గంగాళం నుంచి నీరు తీసుకుని స్నానం చేసేవాళ్ళము. నేను కేవలం మూడుసార్లు తలపై నీరు పోసుకునే దానిని. ముడివిప్పవలసిన అగత్యమే ఏర్పడేది కాదు.” (ముస్లిం, ముస్నద్ అహ్మద్)
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 105
హదీసు 106
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِنِّي لَا أُحِلُّ اَلْمَسْجِدَ لِحَائِضٍ وَلَا جُنُبٌ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “నేను రుతుస్రావానికి గురైవున్న స్త్రీని, లైంగిక అశుద్ధతకు లోనై వున్న పురుషుడినీ మస్జిద్లోకి ప్రవేశించడానికి సమ్మతించను.” (అంటే అశుద్ధావస్థలో వారిరువురూ మస్జిద్లోకి వెళ్ళ లేరు). (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు).
English
Narrated `A'ishah (RAA): Allah's messenger (ﷺ) said: "It is not permitted for a menstruating woman or one who is junub (sexually impure) to stay in the mosque." Related by Abu Dawud and Ibn Khuzaimah graded it as Sahih
సారాంశం
రుతుస్రావానికి గురై వున్న స్త్రీగానీ, లైంగిక అశుద్ధతకు లోనైవున్న పురుషుడు గానీ మస్జిద్లో ఆగటంగానీ, మస్జిద్లోకి ప్రవేశించటంగానీ ధర్మసమ్మతం కాదని ఈ హదీసు స్పష్టపరుస్తోంది. అయితే వారిరువురూ సాగిపోవటానికి మస్జిద్ మినహా మరొక మార్గాంతరం లేనపుడు – ఇమామ్ అహ్మద్, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయీల దృష్టిలో – సాగిపోవటం సమ్మతమే. కాని ఇమామ్ అబూ హనీఫా దృష్టిలో ఎట్టి పరిస్థితిలోనూ మస్జిద్ గుండా పోవటం సమ్మతం కాదు. ఈ హదీసు కూడా ఇమామ్ అబూ హనీఫా గారి అభిప్రాయాన్నే బలపరుస్తోంది.
నడచిపోవటం ధర్మసమ్మతమే అని భావించేవారు దివ్య ఖుర్ఆన్లోని వచనాన్ని ఉదాహరిస్తున్నారు. ఆ వచనంలో ఇలా ఉంది: “లైంగిక అశుద్ధతకు లోనైవున్న వాడు మస్జిద్లోకి వెళ్ళరాదు. ఒకవేళ మస్జిద్లోనుంచి వెళ్ళటం అనివార్యమైతే – గత్యంతరం లేని స్థితిలో వెళ్ళవచ్చు.”
సదరు హదీసు కూడా మస్జిదులో ఆగరాదనే అంటున్నదిగానీ నడచివెళ్ళరాదని అనటంలేదు. ఏ మనిషైనా మస్జిద్లో నిద్రపోయిన తరువాత అతను (స్వప్న స్ఖలనంవల్ల) లైంగిక అశుద్ధతకు లోనైతే తక్షణం మస్జిద్ నుంచి వెడలిపోవాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 106
హదీసు 107
وَعَنْهَا قَالَتْ: { كُنْتُ أَغْتَسِلُ أَنَا وَرَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -مِنْ إِنَاءٍ وَاحِدٍ, تَخْتَلِفُ أَيْدِينَا فِيهِ مِنَ اَلْجَنَابَةِ } مُتَّفَقٌ عَلَيْه ِ. زَادَ اِبْنُ حِبَّانَ: وَتَلْتَقِي.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి చేతనే ఇలా ఉల్లేఖించబడింది: “నేను మరియు దైవప్రవక్త ﷺ ఇద్దరం ఒకే బానలోనుంచి (నీరు తీసుకుని) లైంగిక అశుద్ధతను దూరంచేసే స్నానం చేసేవాళ్ళం. ఆ బానలో మా చేతులు ఒకరి తరువాత ఒకరివి పడేవి. ఒక్కోసారి ఒకరి చేయి మరొకరి చేతికి తగిలేది.”
English
Narrated `A'ishah (RAA): I and Allah's Messenger (Peace be upon him) took a Ghusl (bath) due to sexual impurity from the same vessel and our hands alternated into it. [Agreed upon.] Ibn Hibban added "and (our hands) met."
సారాంశం
భార్యాభర్తలిరువురూ ఏక కాలంలో ఒకే పాత్ర నుంచి నీళ్ళు ముంచుకుని స్నానం చేయటంలో తప్పులేదని పై హదీసు ద్వారా విదితమవుతున్నది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 107
హదీసు 108
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِنَّ تَحْتَ كُلِّ شَعْرَةٍ جَنَابَةً, فَاغْسِلُوا اَلشَّعْرَ, وَأَنْقُوا اَلْبَشَرَ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ وَضَعَّفَاه ُ. وَلِأَحْمَدَ عَنْ عَائِشَةَ نَحْوُهُ, وَفِيهِ رَاوٍ مَجْهُول ٌ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రవచనం – “ప్రతి వెంట్రుక అడుగున (మొదలులో) లైంగిక అశుద్ధతా ప్రభావం ఉంటుంది. కనుక వెంట్రుకలను (బాగా) తడిపి కడగండి. శరీరాన్ని బాగా (తోమి) శుభ్రపరచండి.” (అబూ దావూద్, తిర్మిజీ లిరువురూ దీనిని ఉల్లేఖించారు. దాంతోపాటు దీనిని ‘బలహీనమైనది’గా కూడా నిర్ధారించారు. ముస్నద్ అహ్మద్‌లో కూడా హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ద్వారా ఇదే విధంగా ఉల్లేఖించబడింది. ఈ పరంపరలో ఒక ఉల్లేఖకుడు అపరిచితుడు).
English
Narrated Abu Hurairah (RAA): Allah's Messenger (Peace be upon him) said: "There is Janabah (trace of sexual impurity) under every hair, so wash your hair and cleanse the skin." Abu Dawud and at-Tirmidhi transmitted it but they declared it to be weak.
Ahmad transmitted a similar narration to the above, on the authority of `A'ishah (RAA), but this version has an unknown transmitter.
సారాంశం
సంభోగించిన మీదట స్నానం చేసినపుడు శరీరంలో వెంట్రుకవాసి భాగం కూడా పొడిగా ఉండకుండా – పూర్తిగా తడపాలని, శరీరాన్ని బాగా తోమి శుభ్రం చేయాలని పై హదీసు వెల్లడిస్తోంది. అయితే పుక్కిలించే, ముక్కులోనికి నీరు ఎక్కించే విషయమై ఫుకహాల (ధర్మవేత్తల) మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. హనఫీ ఫికహ్ ననుసరించి ఇది కూడా ఫర్జ్ (విధి)గా పరిగణించబడుతుంది. ఇమామ్ అహ్మద్ అభిమతం కూడా ఇదే. ఇమామ్ షాఫయి దృష్టిలో మాత్రం ఇది మస్నూన్ (సంప్రదాయం).
మొత్తానికి హదీసు వెలుగులో బోధపడే మౌలికాంశం ఏమిటంటే లైంగిక అశుద్ధతను తొలగించే స్నానం చేసినపుడు శరీరమంతటినీ పూర్తిగా తడిపిమరీ శుభ్రపరచాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.8 గుసుల్ మరియు జనాబత్|హదీసు 108
You must be logged in to post a comment.