హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, 7వ అధ్యాయం: కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి. ఈ అధ్యాయంలో 17 హదీసులు (హదీసు 77 – 93) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి
باب آداب قضاء الحاجة
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 77
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ - رضى الله عنه - قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا دَخَلَ اَلْخَلَاءَ وَضَعَ خَاتَمَهُ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, وَهُوَ مَعْلُول ٌ.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త ﷺకాలకృత్యాలు తీర్చుకోవడానికి-బహిర్ ప్రదేశానికి – వెళ్ళినపుడు (తన వేలికున్న) ఉంగరాన్ని తీసేసేవారు” (దీనిని అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజ ఉల్లేఖించారు. ఈ ఉల్లేఖనం లోపభూయిష్టమైనది).
English
Narrated Anas bin Malik (rad): Allah’s Messenger (ﷺ) used to remove his ring when entering the lavatory. [Reported by Al-Arba’a and it is defective].
సారాంశం
ఈ ఉల్లేఖనాన్ని అబూదావూద్ మాలూల్ (లోపభూయిష్టమైనది)గా ఖరారు చేశారు. బహిర్ ప్రదేశం, తదితర అపవిత్ర స్థలాలలోకి వెళ్ళేటప్పుడు దైవనామాలు లేదా దివ్య ఖుర్ఆన్ వచనాలు లిఖించి వున్న వస్తువులు తీసుకెళ్ళరాదని హదీసు ద్వారా స్పష్టమవుతోంది. కాగా; హదీసులో దైవప్రవక్త ﷺ తీసి వేరుగా ఉంచిన ఉంగరంపై ‘ముహమ్మదుర్రసూలుల్లాహ్’ అని చెక్కబడి ఉంది. అందుకే దైవప్రవక్త ﷺ ఆ ఉంగరాన్ని బహిర్ ప్రదేశంలోకి తీసుకెళ్ళలేదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 77
హదీసు 78
وَعَنْهُ قَالَ: { كَانَ النَّبِيُّ - صلى الله عليه وسلم -إِذَا دَخَلَ اَلْخَلَاءَ قَالَ: "اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ اَلْخُبُثِ وَالْخَبَائِثِ" } أَخْرَجَهُ اَلسَّبْعَة ُ.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారే ఉల్లేఖించారు: “దైవప్రవక్త ﷺ మల విసర్జన నిమిత్తం మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ఈ దుఆ పఠించేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్” (ఓ అల్లాహ్! దుష్ట జిన్నుల, దుష్ట జిన్నాతురాళ్ళ కీడునుండి నీ శరణు వేడుతున్నాను). (దీనిని ఏడుగురూ – అంటే బుఖారీ, ముస్లిం, అహ్మద్, అబూ దావూద్, నసాయి, ఇబ్నె మాజ మరియు తిర్మిజీ ఉల్లేఖించారు).
English
Narrated Anas (rad): The Prophet (ﷺ) on entering the lavatory used to say: [Allahumma inni a’udhu bika minal khubthi wal khaba’ithi] “O Allah, I seek refuge with You from devils – males and females (or all offensive and wicked things, evil deeds and evil spirits, etc.)” [Reported by As-Sab’a]
సారాంశం
అశుద్ధత, మాలిన్యం ఉన్నచోట్ల మాలిన్యాన్ని ఇష్టపడే పైశాచిక శక్తులు, దుష్ట జిన్నులు సంచరిస్తుంటాయి. అందుకే దైవప్రవక్త ﷺ మల విసర్జన నిమిత్తం బహిర్ ప్రదేశానికి వెళ్ళేముందు పఠించవలసిన దుఆను నేర్పారు. మానవుని మర్మస్థానాలు కూడా మలమూత్ర విసర్జన సమయంలో మలినభరితమయి ఉంటాయి. అందుచేత మనిషిని వేధించడానికి, ఆవహించి బాధ పెట్టడానికి ఇదే తగిన అవకాశమని పైశాచిక శక్తులు తలపోస్తాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 78
హదీసు 79
وَعَنْهُ قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يَدْخُلُ اَلْخَلَاءَ, فَأَحْمِلُ أَنَا وَغُلَامٌ نَحْوِي إِدَاوَةً مِنْ مَاءٍ وَعَنَزَةً, فَيَسْتَنْجِي بِالْمَاءِ } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారే ఇలా వివరించారు: “దైవప్రవక్త ﷺ మల విసర్జన నిమిత్తం బహిర్ ప్రదేశానికి వెడలినప్పుడు నేను, నా సమ వయస్కుడైన మరో అబ్బాయి నీళ్ళ చెంబును, ఒక చిన్న ఈటెను పుచ్చుకుని తోడుగా వెళ్ళేవారం. ఆ నీళ్ళతో ఆయన ﷺ ‘ఇస్తింజా’ చేసేవారు. (శుభ్రత పొందేవారు).”
English
Narrated Anas (rad): Whenever Allah’s Messenger (ﷺ) went to the privy, a servant and I used to carry a skin water container and a spear, and he would cleanse himself with the water. [Agreed upon].
సారాంశం
ఈ హదీసు ద్వారా అనేక అంశాలు స్పష్టమవుతున్నాయి. ఉదాహరణకు : పిన్న వయస్కులైన వారిచే పనులు చేయించు కోవటం, తనకన్నా చిన్న స్థాయి కలవారిచేత సేవ చేయించుకోవటం అసమంజసం కాదు. నీటితో ఇస్తింజా చేయటం – అంటే మర్మ స్థానాన్ని మలమూత్ర విసర్జనానంతరం కడగటం శ్రేష్ఠం. మట్టి పెడ్డను, నీటిని కూడా ‘ఇస్తింజా’ నిమిత్తం ఉపయోగించటం మరింత మంచిదని పండితులు అభిప్రాయపడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 79
హదీసు 80
وَعَنْ اَلْمُغِيرَةِ بْنِ شُعْبَةَ - رضى الله عنه - قَالَ: { قَالَ لِي رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم - "خُذِ اَلْإِدَاوَةَ". فَانْطَلَقَ حَتَّى تَوَارَى عَنِّي, فَقَضَى حَاجَتَهُ } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) కథనం : “నీళ్ళ చెంబు తీసుకుని (వెంట) రా” అని దైవప్రవక్త ﷺ నన్ను ఆదేశించారు. ఆయన ﷺ మల విసర్జన నిమిత్తం నా కంటికి కానరానంత దూరం వెళ్ళి, అక్కడ కాలకృత్యం తీర్చుకున్నారు.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Al-Mughira bin Shu’ba (rad): Allah’s Messenger (ﷺ) told me, “Take the skin water”, he then went forward till he disappeared from me and relieved himself [Agreed upon]
సారాంశం
దైవప్రవక్త ﷺ గారి ఈ ఆచరణ ద్వారా మనకు స్పష్టమయ్యే దేమిటంటే బహిర్ ప్రదేశానికి పోయేవారు తెరమరుగు అవ్వాలి లేదా ఎవరికీ కానరాని చోట కూర్చోవాలి. మల విసర్జనకు బహిరంగ స్థలం తప్ప మరో చోటు లభ్యంకాని పరిస్థితుల్లో ఇసుక లేక మట్టి గుట్టల ఆసరాలోనయినా కూర్చోవాలనీ, ఆ మాత్రం జాగ్రత్త వహించకపోయినట్లయితే షైతాన్ ఆవహించటానికి అదను దొరుకుతుందని మహనీయ ముహమ్మద్ ﷺ వారి మరో ప్రవచనం ద్వారా తెలుస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 80
హదీసు 81
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اِتَّقُوا اَللَّاعِنِينَ: اَلَّذِي يَتَخَلَّى فِي طَرِيقِ اَلنَّاسِ, أَوْ فِي ظِلِّهِمْ } رَوَاهُ مُسْلِم ٌ. زَادَ أَبُو دَاوُدَ, عَنْ مُعَاذٍ: { وَالْمَوَارِدَ }. وَلَفْظُهُ: { اِتَّقُوا اَلْمَلَاعِنَ اَلثَّلَاثَةَ, اَلْبَرَازَ فِي اَلْمَوَارِدِ, وَقَارِعَةِ اَلطَّرِيقِ, وَالظِّلَّ }. وَلِأَحْمَدَ; عَنِ ابْنِ عَبَّاسٍ: { أَوْ نَقْعِ مَاءٍ } وَفِيهِمَا ضَعْف ٌ. وَأَخْرَجَ اَلطَّبَرَانِيُّ اَلنَّهْيَ عَن ْ تَحْتِ اَلْأَشْجَارِ اَلْمُثْمِرَةِ, وَضَفَّةِ اَلنَّهْرِ الْجَارِي. مِنْ حَدِيثِ اِبْنِ عُمَرَ بِسَنَدٍ ضَعِيف ٍ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు : “శాపానికి కారణభూతమయ్యే రెండు స్థలాలపై మల విసర్జన చేసే చేష్టకు దూరంగా ఉండండి. ఒకటి : జనులు నడిచే దారిలో. రెండు : (జనులు విశ్రాంతి తీసుకునే) నీడనిచ్చే స్థలంలో.” (ముస్లిం)
అబూ దావూద్ హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా గ్రహించిన ఉల్లేఖనంలో ఇలా ఉంది – “శాపానికి కారణభూతమయ్యే మూడు అంశాలకు దూరంగా ఉండండి: నీరు ప్రవహించే స్థలాలలో, జనులు వచ్చేపోయే దారిలో, నీడ (నిచ్చే వృక్షం) క్రింద మల విసర్జన చేయటం నుండి” (దూరంగా ఉండండి).
ఇమామ్ అహ్మద్ గారు ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఆధారంగా గ్రహించిన ఉల్లేఖనంలో ఇలా ఉంది : “నీరు నిలిచిఉండే చోట కూడా మల విసర్జన చేయరాదు.” (ఈ రెండు ఉల్లేఖనాలు కూడా బలహీనమైనవే).
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఆధారంగా తబ్రానీ తీసుకున్న ఉల్లేఖనంలోని వాక్యం ఇలా ఉంది: “కాయలు కాసే, నీడనిచ్చే చెట్టు క్రింద; ప్రవహించే కాలువ ప్రక్కన మల విసర్జన చేయరాదు” (దీని వివరణా తీరులో కూడా కొంత అస్పష్టత ఉంది).
English
Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “Safeguard yourselves from the two matters which cause accursing that befalls the one who relieves himself on people’s path-ways and under the shades.” [Reported by Muslim].
Narrated Mu’adh (rad): He said: “Guard against the three things which cause curse (i.e.) defecating at the watering places, on the roadbeds and in the shades.” [Reported by Abu Dawud]
Ahmad reported from Ibn Abbas (rad) that defecation is prohibited also at the place where water collects. [And both the two (i.e. the previous and this Hadiths) have weakness].
At-Tabarani also narrated on the authority of Ibn ‘Umar (with a weak chain of narrators), the prohibition of relieving oneself under fruit trees and beside the bank of a flowing river.
సారాంశం
ఈ హదీసులలో మల విసర్జనకు సంబంధించిన శిక్షణ ఇవ్వబడింది. దానికి సంబంధించిన కొన్ని నియమాలు, మర్యాదలు సూచించబడ్డాయి. ఐదు స్థలాలు, లేక ప్రదేశాలలో మల విసర్జన చేయటం నిషిద్ధం అని స్పష్టం చేయబడింది. అవేమంటే; (1) రహదారిపై (2) నీడనిచ్చే వృక్షాల క్రింద (3) ప్రవహించే నీటిలో (4) పండ్లు ఫలాలనిచ్చే చెట్టు క్రింద (5) ప్రవహించే కాలువల ప్రక్కన. జనులు సంచరించే మార్గంలో మల విసర్జన చేయటం నిషిద్ధం. అయితే జన సంచారం లేని మార్గాలయితే ఫరవాలేదు.
హదీసు ఉల్లేఖకులు (హజ్రత్ ముఆజ్ -రజి)
ఈయన అన్సార్ వర్గానికి చెందినవారు. ఖజ్రజ్ తెగతో ఈయనకు సంబంధముంది. గొప్ప జ్ఞాని. మర్యాదస్తులు. బైతె అఖబాలోనూ, బద్ర్ సంగ్రామంలోనూ పాల్గొన్నారు. మహాప్రవక్త ﷺ ఈయన్ని యమన్కు గవర్నర్గా నియమించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈయన్ని హజ్రత్ అబూ ఉబైద బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు) అనంతరం సిరియా గవర్నర్గా నియమించారు. హిజ్రీ 17లో ప్లేగువ్యాధికి గురై మరణించారని అనబడుతోంది. హిజ్రీ 18లో మరణించారని మరొక వాదన. అప్పటికి ఆయన వయస్సు 38.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 81
హదీసు 82
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا تَغَوَّطَ اَلرَّجُلَانِ فَلْيَتَوَارَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا عَنْ صَاحِبِهِ, وَلَا يَتَحَدَّثَا. فَإِنَّ اَللَّهَ يَمْقُتُ عَلَى ذَلِكَ } رَوَاهُ أَحْمَدُ وَصَحَّحَهُ اِبْنُ اَلسَّكَنِ, وَابْنُ اَلْقَطَّانِ, وَهُوَ مَعْلُول ٌ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “ఇద్దరు వ్యక్తులు మల విసర్జనకై బహిర్ ప్రదేశానికి వెళితే వారు ఒకరికొకరు కనబడని విధంగా – చాటుగా – ఉండాలి. ఆ స్థితిలో వారు పరస్పరం సంభాషించుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి చేష్టను అల్లాహ్ (సుతరామూ ఇష్టపడడు) కోపగించుకుంటాడు.” (అహ్మద్ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె సకన్, ఇబ్నె ఖత్తాన్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు. కాని ఈ హదీసులో కొంత లోపం ఉంది).
English
Narrated Jabir (rad): Allah’s Messenger (ﷺ) said: “When two people go together to relieve themselves they should disappear from each other and do not talk, for Allah detests that”. [Reported by Ahmad; Ibn As-Sakan and Ibn Al-Qattan graded it Sahih (sound) but it is defective].
సారాంశం
అల్లామా ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) గారు ఈ హదీసును ఇక్రమ బిన్ అమ్మార్ బిన్ యహ్యా బిన్ కసీర్ కారణంగా మాలూల్ (లోపభూయిష్టం) గా ఖరారు చేశారు. ఈ ఉల్లేఖకుడు ఈయన దృష్టిలో నమ్మకస్తుడు కారు. మరి చూడబోతే ఇక్రమ ఉల్లేఖనాన్ని ఇమామ్ ముస్లిమ్ స్వీకరించారు. ఇమామ్ బుఖారీ సయితం దీనిని ఉల్లేఖించారు.
సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాలను మరుగుపరచాలని, మల మూత్ర విసర్జన సమయంలో పరస్పరం మాట్లాడుకోవటం నిషిద్ధమనీ ఈ హదీసు రుజువు చేస్తోంది. ఎవరయినా ఈ చేష్టకు ఒడిగడితే అది దేవుని ఆగ్రహానికి, అయిష్టతకు కారణభూతమవుతుందని చెప్పబడింది. కొందరు ప్రముఖులు అభిప్రాయపడినట్లు ఈ చేష్ట కేవలం మక్రూహ్ (అవాంఛనీయం) అయి ఉంటే దేవుని తరఫున ఇంత తీక్షణమైన హెచ్చరిక చేయబడేది కాదు. ఇలాంటి సమయంలో సలాంకు బదులు పలకటం సయితం సమ్మతం కాదని దైవప్రవక్త ﷺ గారు క్రియాత్మకంగా నిరూపించి ఉన్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 82
హదీసు 83
وَعَنْ أَبِي قَتَادَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يُمْسِكَنَّ أَحَدُكُمْ ذَكَرَهُ بِيَمِينِهِ, وَهُوَ يَبُولُ, وَلَا يَتَمَسَّحْ مِنْ اَلْخَلَاءِ بِيَمِينِهِ, وَلَا يَتَنَفَّسْ فِي اَلْإِنَاءِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِم ٍ.
హజ్రత్ అబూ ఖతాదా(రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఈ విధంగా సెలవిచ్చారు – “మీలో ఎవరూ మూత్ర విసర్జన చేసే సమయంలో కుడిచేత్తో పురుషాంగాన్ని పట్టుకోరాదు. మల విసర్జన తరువాత కుడి చేత్తో శుభ్రపరచుకోవడంగానీ, నీరు త్రాగే సమయంలో శ్వాస పీల్చడంగానీ చేయరాదు.” (బుఖారీ, ముస్లిం – వాక్యాలు మాత్రం ముస్లింలోనివి).
English
Narrated Abu Qatada (rad): Allah’s Messenger (ﷺ) said: “Nobody should touch his pennies with his right hand when urinating, and should not clean himself (from defecation or urine) using his right hand and should not breathe in the utensil (he is drinking from).” [Agreed upon. This version is of Muslim].
సారాంశం
ఈ హదీసులో రెండు ముఖ్యాంశాలు వివరించబడ్డాయి –
(1) మూత్ర విసర్జన సమయంలో కుడిచేత్తో పురుషాంగాన్ని పట్టుకోవటంగానీ, తాకటంగానీ చేయరాదు. ఇలా చేయటం హరామ్ (నిషిద్ధం). ఈ చేష్ట వికృతమైనది, అనాగరికమైనది.
(2) పానీయం త్రాగేటప్పుడు శ్వాస పీల్చటం (మరియు వదలటం) నిషిద్ధం. ఎందుకంటే దీనిద్వారా వెలువడే సూక్ష్మక్రిములు త్రాగే పానీయంలో కలసిపోయి, తిరిగి జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి. ఈ సూక్ష్మక్రిములు వైద్యశాస్త్రపరంగా ఆరోగ్యానికి హానికరమైనవి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 83
హదీసు 84
وَعَنْ سَلْمَانَ - رضى الله عنه - قَالَ: { لَقَدْ نَهَانَا رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم - "أَنْ نَسْتَقْبِلَ اَلْقِبْلَةَ بِغَائِطٍ أَوْ بَوْلٍ, أَوْ أَنْ نَسْتَنْجِيَ بِالْيَمِينِ, أَوْ أَنْ نَسْتَنْجِيَ بِأَقَلَّ مِنْ ثَلَاثَةِ أَحْجَارٍ, أَوْ أَنْ نَسْتَنْجِيَ بِرَجِيعٍ أَوْ عَظْمٍ" } رَوَاهُ مُسْلِم ٌ.
హజ్రత్ సల్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: మేము మలమూత్ర విసర్జన సమయాల్లో ఖిబ్లా వైపునకు అభిముఖమై ఉండటాన్ని లేదా కుడిచేత్తో కడుక్కోవటాన్ని లేదా మూడుకన్నా తక్కువ పెడ్డలతో ఇస్తింజా చేయటాన్ని లేదా (ఎండిన) పేడతో, లద్దెతో, ఎముకతో ఇస్తింజా చేయటాన్ని దైవప్రవక్త ﷺ వారించారు.” (ముస్లిం)
English
Narrated Salman (rad): Allah’s Messenger (ﷺ) forbade us to face the Qiblah when defecating or urinating, or to clean ourselves using the right hand, or to clean ourselves with less than three stones, or to clean ourselves with dung or a bone [Reported by Muslim].
హదీసు ఉల్లేఖకులు
హదీసు ఉల్లేఖకులైన సల్మాన్ (రదియల్లాహు అన్హు) నామాంతరం అబూ అబ్దుల్లాహ్. వాస్తవానికి ఈయన పారసీక దేశస్థులు. సత్యాన్వేషణలో బయలుదేరారు. మధ్యలో క్రైస్తవమతం కూడా స్వీకరించారు. అనంతరం మదీనా వచ్చారు. మదీనాకు రాగానే దైవప్రవక్త ﷺ సమక్షంలో ఇస్లాం స్వీకరించారు. సల్మానుల్ ఖైరాన్ అనే బిరుదు పొందారు. ఇస్లాంలోకి ప్రవేశించిన నాటినుంచీ తు.చ. తప్పకుండా దీనిని పాటించారు. ధర్మావలంబనలో ఆయన చిత్తశుద్ధినీ, సంకల్ప నిరతిని చూసి దైవప్రవక్త ﷺ “సల్మాన్ మా ఆప్తులు” అని కొనియాడేవారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈయన్ని ‘మదాయన్’కు గవర్నర్గా నియమించారు. కూలీ నాలీ చేసి సంపాదించిన వేతనాన్ని దైవమార్గంలో దానం చేసేవారు. హిజ్రీ 32లో కన్నుమూశారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 84
హదీసు 85
وَلِلسَّبْعَةِ مِنْ حَدِيثِ أَبِي أَيُّوبَ - رضى الله عنه - { لَا تَسْتَقْبِلُوا اَلْقِبْلَةَ بِغَائِطٍ أَوْ بَوْلٍ, وَلَا تَسْتَدْبِرُوهَا, وَلَكِنْ شَرِّقُوا أَوْ غَرِّبُوا }.
హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) చే ఉల్లేఖించబడింది: “మల, మూత్ర విసర్జన సమయంలో ఖిబ్లా వైపునకు తిరిగి కూర్చోవటంగానీ, దాని వైపునకు వీపు నివ్వటంగానీ చేయకండి. తూర్పు లేక పడమర వైపునకు అభిముఖులవండి.” (దీనిని ఏడుగురూ – అంటే ఇమామ్ బుఖారీ, ముస్లిం, అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజాలు ఉల్లేఖించారు).
English
Narrated Abu Ayub (rad): Allah’s Messenger (ﷺ) “Neither face nor turn your back to the Qiblah while defecating or urinating, but turn towards the east or the west”. [Reported by the As-Sab’a]
సారాంశం
ఇక్కడొక ముఖ్య విషయాన్ని విస్మరించరాదు. అలనాడు ఈ హితవు మదీనా వాసుల నుద్దేశ్యించి చేయబడింది గనక, ‘తూర్పు పడమరల వైపునకు తిరిగి కూర్చోండి’ అని ఉంది. మదీనావాసులకు ‘ఖిబ్లా’ దక్షిణ దిక్కున ఉంటుంది. ఎవరికయితే ఖిబ్లా దక్షిణ లేక ఉత్తర దిక్కున పడుతుందో వారు తూర్పు – పడమరల వైపు తిరిగి కూర్చోవటం సరైనదే. అయితే తూర్పు లేక పడమర దిశల్లో ‘ఖిబ్లా’ ఉన్న వారు ఉత్తర – దక్షిణ దిశల్లో తిరిగి కూర్చోవలసి ఉంటుంది.
గోడగానీ, లేక మరేదైనా ఆసరాగానీ లేనిపక్షంలో-బహిరంగ మైదానాలలో ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇళ్ళ దగ్గర, కార్యాలయాల దగ్గర – మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించబడి ఉంటే – అంటే మనిషికి ఎదురుగా గోడ ఉంటే అప్పుడు ఈ నిబంధన వర్తించదు.
హదీసు ఉల్లేఖకులు
అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) సుప్రసిద్ధ సహాబీ. అబూ అయ్యూబ్ మారు పేరు. అసలు పేరు ఖాలిద్ బిన్ జైద్ బిన్ కులైబ్. మదీనా ఏతెంచినప్పుడు దైవప్రవక్త ﷺ గారి ఒంటె ఈయన ఇంటి ముంగిటే కూర్చుంది. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు. రోము గడ్డపై ధర్మయుద్ధం చేస్తూ (హిజ్రీ 50లో) వీరమరణం పొందారు. ఈయన సమాధి ఇస్తాంబుల్ గోడ ఛాయలో ఉంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 85
హదీసు 86
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { مَنْ أَتَى اَلْغَائِطَ فَلْيَسْتَتِرْ } رَوَاهُ أَبُو دَاوُد َ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు : “మల విసర్జన కోసం వెళ్ళిన వారు చాటు ప్రదేశంలో కూర్చోవాలి.” (అబూదావూద్)
English
Narrated ‘Aisha (rad): The Prophet (ﷺ) said: “If anyone goes to relive himself, he should conceal himself”. [Reported by Abu Da’ud].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 86
హదీసు 87
وَعَنْهَا; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَانَ إِذَا خَرَجَ مِنْ اَلْغَائِطِ قَالَ: "غُفْرَانَكَ" } أَخْرَجَهُ اَلْخَمْسَةُ. وَصَحَّحَهُ أَبُو حَاتِمٍ, وَالْحَاكِم ُ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి చేతనే మరో ఉల్లేఖనం : “దైవప్రవక్త ﷺ మల విసర్జన చేసి మరుగుదొడ్డి నుండి బయటికి వస్తున్నప్పుడు ‘గుఫ్రానక’ (దేవా! నీ మన్నింపుకై, ఆచ్ఛదనకై అర్థిస్తున్నాను) అని పలికేవారు.” (దీనిని అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజాలు ఐదుగురు ఉల్లేఖించారు. అబూ హాతిమ్ మరియు హాకిమ్ లిరువురూ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు).
English
Narrated ‘Aisha (rad): When the Prophet (ﷺ) came out of the privy, he used to say, “Ghufranaka (O Allah! Grant me Your forgiveness)”. [Reported by Al-Khamsa, Abu Hatim and Al-Hakim graded it Sahih (sound)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 87
హదీసు 88
وَعَنِ ابْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ: { أَتَى اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -اَلْغَائِطَ, فَأَمَرَنِي أَنْ آتِيَهُ بِثَلَاثَةِ أَحْجَارٍ, فَوَجَدْتُ حَجَرَيْنِ, وَلَمْ أَجِدْ ثَالِثًا. فَأَتَيْتُهُ بِرَوْثَةٍ. فَأَخَذَهُمَا وَأَلْقَى اَلرَّوْثَةَ, وَقَالَ: "هَذَا رِكْسٌ" } أَخْرَجَهُ اَلْبُخَارِيّ ُ. زَادَ أَحْمَدُ, وَاَلدَّارَقُطْنِيُّ: { ائْتِنِي بِغَيْرِهَا }.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “దైవప్రవక్త ﷺ మల విసర్జన నిమిత్తం బహిర్ ప్రదేశానికి వెడలినప్పుడు, తన కోసం మూడు మట్టిపెడ్డలు తెమ్మని నన్ను ఆదేశించారు. నాకు రెండు పెడ్డలు దొరికాయి గాని మూడవది దొరకలేదు. (గత్యంతరంలేక) ఎండిన పేడ ముక్క నొకదానిని తీసుకొచ్చాను. ఆయన ﷺ రెండు మట్టి పెడ్డలనయితే తీసుకున్నారు గాని, పేడ ముక్కను దూరంగా పారవేశారు. ‘ఇది స్వయంగా మలినం కదా!’ అని పలికారు.” (బుఖారీ)
అహ్మద్, దారె ఖుత్నీలలో మరొక వాక్యం అదనంగా ఉంది: “దీని బదులు ఇంకొక పెడ్డ తీసుకురా.”
English
Narrated Ibn Mas’ud (rad): The Prophet (ﷺ) went out to answer the call of nature and asked me to bring three stones. I found two stones and searched for the third but could not find it. So I took a dried piece of dung and brought it to him. He took the two stones and threw away the dung and said, “This is a filthy thing”. [Reported by Al-Bukhari]
And in the version of Ahmad and Ad-Daraqutni it is added: “Bring me more (something other than dung)”].
సారాంశం
స్వతహాగా మలినంతో కూడుకున్న వస్తువు – అది ఎండిపోయినప్పటికీ – దాని ద్వారా పరిశుద్ధత ఒనగూడదని ఈ హదీసు స్పష్టపరుస్తోంది. కాబట్టి అలాంటి వాటిని విడనాడాలి. మల విసర్జన తర్వాత పరిశుద్ధత కోసం కనీసం మూడు మట్టి పెడ్డలను ఉపయోగించాలి. ఒకవేళ మరిన్ని మట్టి పెడ్డలు కావలసి ఉంటే బేసి సంఖ్యలో వాటిని తీసుకోవాలి. (అంటే ఐదు, ఏడు). నేటి ఆధునిక యుగంలో (డ్రై క్లీనింగ్ నిమిత్తం) ఎన్నో వస్తువులు ఆవిష్కరించబడ్డాయి. ఉదాహరణకు టిష్యూ పేపర్లు. ఈ టిష్యూ పేపర్లు కూడా బేసి సంఖ్యలోనే ఉపయోగించాలి.
హదీసు ఉల్లేఖకులు
ఈ హదీసును ఉల్లేఖించిన ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) అసలు పేరు అబ్దుల్లాహ్. బహుముఖ ప్రజ్ఞాశాలి. బుద్ధికుశలురైన సహాబాలలో ఒకరుగా పరిగణించబడ్డారు. బద్ర్ మరియు ఇతర యుద్ధాలలో పాల్గొన్నారు. దైవప్రవక్త ﷺ గారి అంతరంగిక సహచరులలో ఒకరు. ప్రయాణాలలోనూ, ఇంటి వద్ద కూడా దైవప్రవక్త ﷺ కు సన్నిహితంగా మెలిగేవారు. ఈయనగారి గుణ విశేషాలను గురించి ఎంత చెప్పినా తక్కువే. హిజ్రీ 32లో మదీనా మునవ్వరాలో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు సుమారు 60 సంవత్సరాలు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 88
హదీసు 89
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - { قَالَ: إِنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -نَهَى "أَنْ نَسْتَنْجِيَ بِعَظْمٍ, أَوْ رَوْثٍ" وَقَالَ: "إِنَّهُمَا لَا يُطَهِّرَانِ" } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ وَصَحَّحَه ُ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మమ్మల్ని ఎముకతో, ఎండిన పేడ (వంట)తో ‘ఇస్తింజా’ చేయటాన్ని వారించారు. దాంతోపాటు ఇలా ఉపదేశించారు: “ఇవి రెండూ పరిశుద్ధతను చేకూర్చలేవు.” (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు. దీనిని ప్రామాణికమైనదిగా కూడా ఖరారు చేశారు).
English
Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) forbade us to use a bone or dung for cleaning and said, “These two things do not purify”. [Reported by Ad-Daraqutni who graded it Sahih].
సారాంశం
పేడ స్వతహాగా మలినం గనక దానివల్ల శుచి, శుభ్రత లభించే ప్రశ్నే లేదు. కాగా; ఎముక నున్నగా ఉంటుంది. అందులో పీల్చే గుణం ఉండదు. అందుచేత దాంతో పరిశుభ్రపరచటం సాధ్యం కాదు. ఇస్తింజా కోసం వీటిని ఉపయోగించకపోవటంలోని మరో మర్మాన్ని దైవప్రవక్త ﷺ తెలుపుతూ; అవి జిన్నుల ఆహారమనీ, వాటి పశువుల మేత అనీ అన్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 89
హదీసు 90
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اِسْتَنْزِهُوا مِنْ اَلْبَوْلِ, فَإِنَّ عَامَّةَ عَذَابِ اَلْقَبْرِ مِنْهُ } رَوَاهُ اَلدَّارَقُطْنِيّ ُ. وَلِلْحَاكِمِ: { أَكْثَرُ عَذَابِ اَلْقَبْرِ مِنْ اَلْبَوْلِ } وَهُوَ صَحِيحُ اَلْإِسْنَاد ِ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మూత్రపు తుంపరల నుండి మిమ్మల్ని కాపాడుకోండి. చాలా వరకు సమాధి యాతన దీనికారణంగానే ఉంటుంది.” (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు) హాకిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది: “చాలా వరకు సమాధి యాతన మూత్రపు తుంపరల కారణంగా విధించబడుతుంది.” (ఇది అందజేయబడిన తీరు ప్రామాణికమైనది).
English
Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “Beware of (smearing yourselves with) urine, because it is the main cause of punishment in the grave”. [Reported by Ad-Daraqutni]
and Al-Hakim reported that: “Urination is the main cause of punishment in the grave”. [Its chain of narrators is authentic].
సారాంశం
మూత్ర విసర్జన సమయంలో అజాగ్రత్త, నిర్లక్ష్య వైఖరి మూలంగా వాటి తుంపరలు శరీరంపై పడతాయి. పైకి ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నప్పటికీ పరిణామం రీత్యా ఎంత భయానకంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మూత్ర విసర్జన సమయంలో శరీరంపై తుంపరలు పడకుండా జాగ్రత్త వహించటం ఎంతో అవసరం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 90
హదీసు 91
وَعَنْ سُرَاقَةَ بْنِ مَالِكٍ - رضى الله عنه - قَالَ: { عَلَّمْنَا رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -فِي اَلْخَلَاءِ: " أَنَّ نَقْعُدَ عَلَى اَلْيُسْرَى, وَنَنْصِبَ اَلْيُمْنَى" } رَوَاهُ اَلْبَيْهَقِيُّ بِسَنَدٍ ضَعِيف ٍ.
హజ్రత్ సురాఖా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “దైవప్రవక్త ﷺ మాకు కాలకృత్యాల పద్ధతులను వివరిస్తూ ఇలా అన్నారు: “ఎడమకాలిపై బరువువేసి కూర్చోండి. కుడికాలిపై తక్కువ బరువుపడేలా ఆ కాలిని నిలిపి ఉంచండి.” (దీనిని బైహఖీ బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు)
English
Narrated Suraqa bin Malik (rad): Allah’s Messenger (ﷺ) educated us about lavatory (manners) that we should sit on our left foot and keep erect our right foot. [Reported by Al-Baihaqi through a chain of weak narrators].
సారాంశం
వివేకి ఆజ్ఞాపించిన ఏ ఆజ్ఞ కూడా వివేకరహితంగా ఉండదు. అది ఎవరికి అర్థమయినా కాకపోయినా – అది విజ్ఞతా వివేచనలతో, యుక్తితో నిండి ఉంటుంది. ఈ హదీసులో దైవప్రవక్త ﷺ ఎడమ కాలిపై ఎక్కువ భారం పడేలా ఒక ప్రక్కకు వాలి కూర్చోమని చెప్పారు. మనిషి జీర్ణకోశం ఎడమ వైపున ఉంటుంది. ఎడమ కాలిపై బరువు మోపి కూర్చోవటం వల్ల కడుపులోని వ్యర్థాలు సులువుగా విసర్జితమవుతాయి.
హదీసు ఉల్లేఖకులు
సురాఖా బిన్ మాలిక్ బిన్ జాషమ్ ముద్లజ్ తెగకు చెందినవారు. అందువల్ల ముద్లజీగా కూడా వ్యవహరించబడ్డారు. ఈయన నామాంతరం అబూ సుఫ్యాన్. ప్రముఖ సహాబీలలో ఒకరు. దైవప్రవక్త ﷺ మక్కానుండి మదీనాకు హిజ్రత్ చేస్తున్న సమయంలో అవిశ్వాసులు ప్రకటించిన బహుమానానికి ఆశపడి ఈయన దైవప్రవక్తను వెంటాడారు. కాని తీరా దైవప్రవక్త ﷺ ను సమీపించాక ఈయన గుర్రం మోకాళ్ళ వరకూ నేలలో కూరుకుపోయింది. అప్పుడీయన దైవప్రవక్త ﷺ శరణు కోరారు. దైవప్రవక్త ﷺ ఈయనకు అభయమిచ్చారు. ‘మక్కా విజయం’ నాడు ఈయన ఇస్లాం స్వీకరించారు. హిజ్రీ 24లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 91
హదీసు 92
وَعَنْ عِيسَى بْنِ يَزْدَادَ (يُزْدَادُ) عَنْ أَبِيهِ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا بَالَ أَحَدُكُمْ فَلْيَنْثُرْ ذَكَرَهُ ثَلَاثَ مَرَّاتٍ } رَوَاهُ اِبْنُ مَاجَه بِسَنَدٍ ضَعِيف ٍ.
హజ్రత్ ఈసా బిన్ యజ్దాద్ తన తండ్రి ఆధారంగా వివరించారు: దైవ ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “మీలో ఎవరు ఎప్పుడు మూత్ర విసర్జన చేసినా అంగాన్ని మూడుసార్లు జాడించాలి.” (ఇబ్నె మాజా దీనిని అప్రమాణిక ఆధారాలతో ఉల్లేఖించారు).
English
Narrated ‘Iesa bin Yazdad from his father (ra): Allah’s Messenger (ﷺ) said: “When one of you passes urine, he should empty his penis three times”. [Reported by Ibn Majah through a weak chain of narrators].
సారాంశం
అంగాన్ని మూడుసార్లు జాడించమనటంలోని ఉద్దేశ్యమేమంటే మూత్రపు చుక్క ఏదైనా మార్గమధ్యంలో నిలిచివుంటే అది కూడా విసర్జితమవ్వాలి. మూత్ర విసర్జన పూర్తిగా జరిగిందన్న నమ్మకం మనిషికి కుదరాలి. ఈ ఉల్లేఖనం బలహీనమైనప్పటికీ మూత్రపు బిందువుల నుండి సురక్షితంగా ఉండాలన్న హదీసును సమర్థిస్తోంది. మూత్రపు తుంపరల పట్ల చూపే నిర్లక్ష్యవైఖరి మనిషిని సమాధి యాతనకు గురిచేస్తుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా!
హదీసు ఉల్లేఖకులు (ఈసా బిన్ యజ్దాద్)
ఈ హదీసును ఉల్లేఖించిన తండ్రీ కొడుకులిద్దరూ అపరిచితులని, వారిని గురించి ఎవరికీ ఏమీ తెలియదని ఇబ్నె ముయీన్ తెలిపారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 92
హదీసు 93
وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -سَأَلَ أَهْلَ قُبَاءٍ فَقَالَ: إِنَّ اَللَّهَ يُثْنِي عَلَيْكُمْ. فَقَالُوا: إِنَّا نُتْبِعُ اَلْحِجَارَةَ اَلْمَاءَ } رَوَاهُ اَلْبَزَّارُ بِسَنَدٍ ضَعِيف ٍ. وَأَصْلُهُ فِي أَبِي دَاوُدَ, وَاَلتِّرْمِذِيّ وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - بِدُونِ ذِكْرِ اَلْحِجَارَة ِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: దైవప్రవక్త ﷺ ‘ఖుబా’ వాసులనుద్దేశ్యించి, “అల్లాహ్ మీ (శుచీ, శుభ్రతల) గురించి ఎంతగానో కొనియాడాడు. దీనిక్కారణమేమిటి?” అని అడగ్గా వాళ్ళు ఇలా విన్నవించుకున్నారు – ‘మేము మట్టిపెడ్డలను ఉపయోగించిన మీదట, మరింత శుచీ, శుభ్రత కోసం నీటిని కూడా ఉపయోగిస్తాము.” (బలహీన ఆధారాలతో దీనిని బజ్జార్ ఉల్లేఖించారు. దీని మూలాంశం అబూదావూద్, తిర్మిజీలలో ఉంది. ఈ సందర్భంగా ఇబ్నె ఖుజైమగారు అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని ప్రామాణికంగా ఖరారు చేశారు. అయితే అందులో మట్టి పెడ్డల ప్రస్తావన లేదు).
English
Narrated Ibn ‘Abbas (ﷺ): The Prophet (ﷺ) asked the residents of Quba that what had earned them the Praise of Allah and they replied, “We use water after (cleaning ourselves with) stones.” [Reported by Al-Bazzar with Da’if chain of narrators]
and its Asl (original source) is in Abu Da’ud and At-Tirmidhi and Ibn Khuzaima graded it Sahih (sound) through Abu Huraira (rad) without mentioning the “stones”.]
సారాంశం
‘ఖుబా’ గ్రామం మదీనాకు దక్షిణాన మూడు మైళ్ళదూరంలో ఉంది. హిజ్రత్ సందర్భంగా మహాప్రవక్త ﷺ తొలుత ఇక్కడే ఆగారు. ఈ హదీసు ద్వారా; ఇస్తింజా కోసం మట్టి పెడ్డలతో పాటు నీటిని ఉపయోగించటం మంచిదని తెలుస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.7 కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి|హదీసు 93
You must be logged in to post a comment.