హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 1.9 తయమ్ముమ్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, 9వ అధ్యాయం: తయమ్ముమ్. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 109 – 117) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

1.9 తయమ్ముమ్

↑ విషయ సూచిక

باب التيمم

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

109

హదీసు 109

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ, وَجُعِلَتْ لِي اَلْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا, فَأَيُّمَا رَجُلٍ أَدْرَكَتْهُ اَلصَّلَاةُ فَلْيُصَلِّ } وَذَكَرَ اَلْحَدِيث َ. وَفِي حَدِيثِ حُذَيْفَةَ عِنْدَ مُسْلِمٍ: { وَجُعِلَتْ تُرْبَتُهَا لَنَا طَهُورًا, إِذَا لَمْ نَجِدِ اَلْمَاءَ }. وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- عِنْدَ أَحْمَدَ: { وَجُعِلَ اَلتُّرَابُ لِي طَهُورًا }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: “నాకు పూర్వం ఎవరికీ ఇవ్వబడని ఐదు వస్తువులు నాకు ప్రసాదించబడ్డాయి – నాకు ఒక మాసపు ప్రయాణ దూరంతోనే (శత్రువును) హడలించే శక్తి ఇవ్వబడింది. సమస్త భూమండలం నా కొరకు సజ్దా స్థలంగా, శుచీశుభ్రతల సాధనంగా చేయబడింది. ఇక ఎవరికి (ఎక్కడ) నమాజ్ సమయం ఆసన్నమయినా అతడు (అక్కడే) నమాజ్ చేసుకోవాలి.” ముందు మొత్తం హదీసు ప్రస్తావించబడుతుంది.

ముస్లింలో హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) ద్వారా ఇలా ఉల్లేఖించబడింది – “మనకు నీరు లభ్యం కానపుడు నేలలోని మట్టి మన కొరకు పరిశుభ్రతా ప్రాప్తికై పవిత్రం గావించబడింది.”

ముస్నద్ అహ్మద్‌లో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) చే ఇలా తెలుపబడింది-“మట్టి నా కొరకు పరిశుభ్రత నొసగే సాధనంగా చేయబడింది.”

English

Narrated Jabir bin 'Abdullah (RAA): The Prophet (ﷺ) said: "I have been given five things which were not given to anyone else before me. Allah made me victorious by awe (of frightening my enemies) for a distance of one month's journey. The earth has been made for me (and my followers) a place for praying and something with which to perform Tayammum (to purify oneself for prayer). Therefore, anyone (of my followers) can pray (anywhere) and at any time that the Salat (prayer) is due."

In another narration by Hudhaifah (RAA): "And the soil of the earth had been made for us as a means with which to purify ourselves (for prayer), when we cannot find water." Related by Muslim.

Ahmad transmitted on the authority of `Ali (RAA): "The earth (dust) has been made for me as a means for purification."

సారాంశం

ఈ హదీసులో నుంచి రచయిత దైవప్రవక్త ﷺకు ప్రసాదించబడిన రెండు విశిష్ట వరాలను మాత్రమే ప్రస్తావించారు. మిగిలిన మూడు అనుగ్రహాలలో ఒకటి విజయప్రాప్తి; అంటే యుద్ధ సమయాలలో శత్రువుల నుండి ముస్లిం సేనలకు స్వాధీనమైన ధనాన్ని సమస్త ముస్లిం సమాజం కొరకు దేవుడు ధర్మసమ్మతం చేశాడు. అలాగే ప్రళయదినాన మానవాళికి క్షమాభిక్షపెట్టమని దైవ సమక్షంలో సిఫారసు చేసే అవకాశం కూడా మహాప్రవక్తకే ఇవ్వబడుతుంది. ఇంకా దేవుడు ఆయన్ని ﷺ భూమండలంలోని సమస్త మానవుల కోసం, జిన్నుల కోసం ప్రవక్తగా నియుక్తం చేశాడు. రచయిత ఈ చివరి మూడు విశిష్ట అనుగ్రహాలను మినహాయించి తహారత్, నమాజ్‌లకు సంబంధించిన రెండు విశిష్ట వరాలనే ప్రస్తావించారు.

నీరు లభ్యం కాని పరిస్థితిలో తయమ్ముమ్ చేసుకునే సౌలభ్యం కల్పించి ఇస్లామీయ షరీయత్ ముస్లిం సమాజంపై ఎంతగానో దయదలిచింది, నేలలోని ఏ భాగంతోనయినా తయమ్ముమ్ చేసుకోవచ్చు. నేలలో నుంచి లభించే ఖనిజాలతో కూడా తయమ్ముమ్ చేయవచ్చు. అయితే వాటిపై దుమ్ము ధూళి పేరుకుని ఉండటం అవసరం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 109

110

హదీసు 110

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { بَعَثَنِي اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-فِي حَاجَةٍ, فَأَجْنَبْتُ, فَلَمْ أَجِدِ اَلْمَاءَ, فَتَمَرَّغْتُ فِي اَلصَّعِيدِ كَمَا تَمَرَّغُ اَلدَّابَّةُ, ثُمَّ أَتَيْتُ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَذَكَرْتُ ذَلِكَ لَهُ, فَقَالَ: "إِنَّمَا كَانَ يَكْفِيكَ أَنْ تَقُولَ بِيَدَيْكَ هَكَذَا" ثُمَّ ضَرَبَ بِيَدَيْهِ اَلْأَرْضَ ضَرْبَةً وَاحِدَةً, ثُمَّ مَسَحَ اَلشِّمَالَ عَلَى اَلْيَمِينِ, وَظَاهِرَ كَفَّيْهِ وَوَجْهَهُ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِم ٍ. وَفِي رِوَايَةٍ لِلْبُخَارِيِّ: وَضَرَبَ بِكَفَّيْهِ اَلْأَرْضَ, وَنَفَخَ فِيهِمَا, ثُمَّ مَسَحَ بِهِمَا وَجْهَهُ وَكَفَّيْه ِ.

హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “దైవప్రవక్త ﷺ నన్ను ఒక అవసరార్థం పంపించారు: నేను (వీర్య స్ఖలనం వల్ల) అశుద్ధతకు లోనయ్యాను. నాకు నీరు లభించలేదు. అందుచేత నేను క్రిందపడి మట్టిలో ఒక చతుష్పాదం (జంతువు) వలే దొర్లాను. (అవసరం నెరవేరిన) తరువాత నేను దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి జరిగినదంతా వివరించాను. “నీవు చేత్తో ఈవిధంగా చేయాల్సింది” అని ఆయన ﷺ చెప్పారు. తరువాత ఆయన ﷺ తన రెండు అర చేతులనూ ఒకసారి నేలపై కొట్టారు. ఎడమ చేతిని కుడి చేతిపై రుద్దారు. ఆ తర్వాత చేతుల ఉపరితలాన్ని, ముఖాన్ని తుడుచుకున్నారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి).

బుఖారీ ఉల్లేఖనంలోని చివరి వాక్యం ఇలా ఉంది: “తన రెండు అరచేతుల్ని నేలపై కొట్టిన పిదప నోటితో ఊది దుమ్ము ధూళిని దూరం చేశారు. తరువాత వాటిని ముఖంపై, చేతులపై రుద్దుకున్నారు.”

English

Narrated `Ammar bin Yasir (RAA): The Prophet (ﷺ) sent me on some errands and I became junub (sexually impure), and could not find water. I rolled myself in the dirt just as an animal does. I then came to the Prophet (ﷺ) and mentioned that to him. He said, "This would have been enough for you," and he struck the earth with his hands once, then he wiped the right hand with the left one, and the outside of the palms of his hands and his face. [Agreed upon. The wording is that of Muslim's].

In a version by Al-Bukhari, `Ammar said: 'He (ﷺ) struck the earth with the palms of his hands, blew in them and wiped his face and hands with them.

సారాంశం

చేతుల్ని ఒకేసారి (పరిశుభ్రమైన) నేలపై కొడితే సరిపోతుందని హదీసుద్వారా స్పష్టంగా రూఢీ అవుతోంది. ‘తయమ్ముమ్’లో ఉన్న సౌలభ్యాలలో ఇదీ ఒకటన్నది గమనార్హం. ఒకసారి చేతికి అంటిన ధూళి ముఖం మరియు చేతుల్ని రుద్దుకోవటానికి సరిపోతుంది. ఈ అధ్యాయంలో వచ్చిన హదీసులలో అత్యంత ప్రామాణికమైనది ఇదే. అత్యధికమంది హదీసువేత్తల, ధర్మవేత్తల విధానం కూడా ఇదే. కాగా, చేతుల్ని రెండుసార్లు నేలకు కొట్టాలన్న ఉల్లేఖనం బలహీనమైనది. హనఫీ మరియు షాఫయా విధానాన్ని అనుసరించేవారు చేతుల్ని రెండుసార్లు నేలకు (ఒకసారి ముఖం కోసం, మరోసారి చేతుల్ని రుద్దడం కోసం) కొట్టాలని భావిస్తున్నారు. పై హదీసులోని (బుఖారీలో పొందుపరచబడిన) చివరి వాక్యం దీనికి బలం చేకూరుస్తుంది.

ఇక అమ్మార్ బిన్ యాసిర్ గారి ఇజ్తెహాద్ (అన్వయింపు)ను చూద్దాం. నీరు లభ్యం కాకపోవటం వల్ల ఆయన (రదియల్లాహు అన్హు) తన బుద్ధీ వివేకాలకు పదునుపెట్టి నేలపై దొర్లటం మొదలుపెట్టారు. స్నానం చేసేటప్పుడు నీళ్లతో శరీరమంతా తడుపుతారు గనక, తయమ్ముమ్ దీనికి ప్రత్యామ్నాయం గనక, శరీరమంతటికీ మట్టి తగలటం తప్పనిసరి కాబోలు! అని ఆయన బుద్ధి ఆయనకు మార్గం చూపింది. తదనుగుణంగా ఆయన అలా ఆచరించారు. విషయ పరిజ్ఞానం లేకపోవటం మూలంగా ఆయన అంచనాలపై ఆధారపడ్డారు. అసలు విషయం ముందుకు వచ్చిన మీదట అంచనాలకు ఏపాటి ప్రాముఖ్యమూ ఉండబోదు. కనుక అంచనాలకు, అన్వయింపులకు స్వస్తి పలికి ‘అసలు’ను గట్టిగా పట్టుకోవాలి.

దైవప్రవక్త ﷺ గారి ఆచరణ వల్ల విదితమయ్యే మరో ముఖ్యాంశం ఏమిటంటే; చేతుల్ని నేలపై కొట్టిన పిదప నోటితో ఊదటం ‘మస్నూన్’. నీరు లభ్యం కాని పక్షంలో అశుద్ధతకు లోనైన వ్యక్తికి ఈ మాత్రం ప్రయాసపడితే చాలు – అతడు పరిశుద్ధుడైపోతాడు.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును అందజేసిన అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) తొల్దాలి ప్రవక్త ప్రియ సహచరులలో ఒకరు. ఇస్లాం స్వీకరించిన కారణంగా మక్కాలో ముష్రిక్కులు ఈయన్ని చిత్రహింసలు పెట్టారు. అయినా ఈయనగారి నిలకడ చెక్కుచెదరలేదు. దైవమార్గంలో రెండు హిజ్రత్‌లు (ఒక హిజ్రత్ అబిసీనియా వైపునకు, మరో హిజ్రత్ మదీనా వైపునకు) చేశారు. బద్ర్ యుద్ధంతో సహా ముఖ్య సంగ్రామాలన్నింటిలోనూ పాల్గొన్నారు. దైవప్రవక్త ﷺ ఈయన గురించి ఇలా చెప్పారు: “అమ్మార్! విచారకరమయిన విషయం ఏమిటంటే తిరుగుబాటు వర్గం ఒకటి నిన్ను హతమారుస్తుంది.” హిజ్రీ 36లో సిఫ్ఫీన్ యుద్ధ సందర్భంగా హజ్రత్ ముఆవియ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ల సైనిక దళాలలోని ఒక తిరుగుబాటు వర్గం ఈయన్ని దారుణంగా హత్య చేసింది. అప్పటికి ఆయన వయస్సు 73 సంవత్సరాలు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 110

111

హదీసు 111

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ التَّيَمُّمُ ضَرْبَتَانِ ضَرْبَةٌ لِلْوَجْهِ, وَضَرْبَةٌ لِلْيَدَيْنِ إِلَى اَلْمِرْفَقَيْنِ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَصَحَّحَ اَلْأَئِمَّةُ وَقْفَه ُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “తయమ్ముమ్ రెండు సార్లు (నేలకు) కొట్టడం వల్ల పూర్తవుతుంది. ఒక దెబ్బ ముఖం (రుద్దడం) కోసం, మరో దెబ్బ మోచేతుల సమేతంగా రెండు చేతుల (ను రుద్దడం) కోసం.” (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు. ఇతర ఇమాములు ఇది ‘మౌఖూఫ్’ కావడాన్ని ప్రామాణికంగా ఖరారు చేశారు).

English

Narrated Ibn `Umar (RAA): Allah’s Messenger (ﷺ) said: "Tayammum is two strikes: one for the face and one for the hands up to the elbows." Reported by Ad-Daraqutni

సారాంశం

ఈ హదీసును అందజేసిన పరంపరలో లోపం ఏర్పడిన కారణంగా హదీసువేత్తలు దీనిని బలహీనమైన హదీసుగా నిర్ధారించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 111

112

హదీసు 112

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلصَّعِيدُ وُضُوءُ اَلْمُؤْمِنِ اَلْمُسْلِمِ, وَإِنْ لَمْ يَجِدِ اَلْمَاءَ عَشْرَ سِنِينَ, فَإِذَا وَجَدَ اَلْمَاءَ فَلْيَتَّقِ اَللَّهَ, وَلْيُمِسَّهُ بَشَرَتَهُ } رَوَاهُ اَلْبَزَّارُ, وَصَحَّحَهُ اِبْنُ اَلْقَطَّانِ, ]و] لَكِنْ صَوَّبَ اَلدَّارَقُطْنِيُّ إِرْسَالَه ُ. وَلِلتِّرْمِذِيِّ: عَنْ أَبِي ذَرٍّ نَحْوُهُ, وَصَحَّحَهُ وَالْحَاكِمُ أَيْضًا.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మన్ను విశ్వాసి అయిన ముస్లిం పాలిట ‘వుజూ’ లాంటిది – పదేళ్ళ వరకూ నీరు లభ్యం కాకపోయినాసరే! అయితే నీరు లభ్యమవగానే దైవానికి భయపడాలి. అప్పుడు అతను తన శరీరంపై నీరు పోసుకోవాలి.” (దీనిని బజ్జార్ ఉల్లేఖించారు. ఇబ్నుల్ ఖత్తాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. అయితే దారె ఖుత్నీ దీనిని ‘ముర్సల్’ గా నిర్ధారించారు. తిర్మిజీలో హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) చేత కూడా ఇలాగే ఉల్లేఖించబడింది – దీనిని తిర్మిజీ ప్రామాణికమైనదని ధృవీకరించారు. హాకిమ్ సయితం దీనిని ‘ప్రామాణికం’ అని అన్నారు.

English

Narrated Abu Hurairah (RAA): Allah’s Messenger (ﷺ) said: "The soil is a purifier for a Muslim, even if he does not find water for ten years; but if he finds water, he must fear Allah and let it touch his skin."

Narrated Abu Dharr (RAA): a similar Hadith transmitted by at-Tirmidhi

సారాంశం

ఈ హదీసులో ‘తయమ్ముమ్’ వుజూగా ఖరారు చేయబడింది. అంటే ‘తయమ్ముమ్’ ‘వుజూ’కు ప్రత్యామ్నాయం అన్నమాట! ఇది నీరుకు ప్రత్యామ్నాయం అయినపుడు ఆ రెంటికి సంబంధించిన ఆజ్ఞలు కూడా ఒకేవిధంగా ఉంటాయి, ఉండాలి కూడా. అంటే ఒక వుజూతో మనిషి ఎన్ని నమాజులు చేయగలుగుతాడో అన్ని నమాజులు తయమ్ముమ్‌తో కూడా చేయగలడు. అయితే కొంతమంది – ఈ హదీసు ఆధారంగా – తయమ్ముమ్ ద్వారా అశుద్ధత దూరం కాజాలదని అభిప్రాయపడ్డారు. తయమ్ముమ్ ద్వారా తాత్కాలికంగా నమాజ్ చేసేందుకు మార్గం మాత్రం సుగమమవుతుందని వీరంటారు. నమాజ్ ముగియగానే తయమ్ముమ్‌కు పూర్వం వున్న స్థితికే అతను లోనవుతాడని ఈ వర్గం వాదిస్తోంది.

హనఫీ మస్లక్‌ను పాటించేవారు మాత్రం మొదటి పద్ధతికే కట్టుబడి ఉన్నారు – అంటే ఒకసారి చేసిన తయమ్ముమ్‌తో (అది భంగం కాకుండా ఉన్నంతవరకూ) ఎన్ని విధులైనా నిర్వర్తించవచ్చునని హనఫీలు భావిస్తున్నారు. సయీద్ బిన్ ముసైబ్, హసన్ బస్రీ, జహ్‌రీ, సుఫియాన్ సౌరీల అభిప్రాయం కూడా ఇదే.

అయితే ఇమామ్ షాఫయి, ఇమామ్ మాలిక్, ఇమామ్ అహ్మద్‌ల అభిప్రాయం మరో విధంగా ఉంది. వారి దృష్టిలో తయమ్ముమ్ ద్వారా పూర్తిస్థాయి శుచీ, శుభ్రత ప్రాప్తం కాదు. అది గత్యంతరం లేని స్థితిలో – అవసరం తీరడానికి – అనుసరించే ఒక తాత్కాలిక పద్ధతి మాత్రమేననీ, ఏ విధిని నెరవేర్చే సంకల్పంతో తయమ్ముమ్ చేసుకోవటం జరిగిందో అదొక్కటే దానివల్ల నెరవేరుతుందని ఈ ప్రముఖులు తలపోస్తున్నారు.

హదీసు ఉల్లేఖకులు

హదీసు ఉల్లేఖకులలో ఒకరైన అబూజర్ (రదియల్లాహు అన్హు) అసలు పేరు జున్దుబ్ బిన్ జునాదా. దైవభక్తి పరాయణులు, సాత్వికులు. భవబంధాల పట్ల ఆసక్తి లేనివారు. మక్కాలోనే ఇస్లాం స్వీకరించారు. తరువాత తన జాతి వారి వైపునకు వెళ్ళిపోయారు. మదీనాలో తిరిగి దైవప్రవక్త ﷺ సమక్షంలో హాజరయ్యారు. ‘రబ్జా’ అనే చోట స్థిర నివాసమేర్పరచుకున్నారు. హిజ్రీ 32లో కన్నుమూశారు. సదాచార సంపన్నులు. దేవునిపై అచంచలమైన భక్తీ విశ్వాసం కలవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 112

113

హదీసు 113

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: { خَرَجَ رَجُلَانِ فِي سَفَرٍ, فَحَضَرَتْ اَلصَّلَاةَ ‏-وَلَيْسَ مَعَهُمَا مَاءٌ‏- فَتَيَمَّمَا صَعِيدًا طَيِّبًا, فَصَلَّيَا, ثُمَّ وَجَدَا اَلْمَاءَ فِي اَلْوَقْتِ.‏ فَأَعَادَ أَحَدُهُمَا اَلصَّلَاةَ وَالْوُضُوءَ, وَلَمْ يُعِدِ اَلْآخَرُ, ثُمَّ أَتَيَا رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَذَكَرَا ذَلِكَ لَهُ, فَقَالَ لِلَّذِي لَمْ يُعِدْ: "أَصَبْتَ اَلسُّنَّةَ وَأَجْزَأَتْكَ صَلَاتُكَ" وَقَالَ لِلْآخَرِ: "لَكَ اَلْأَجْرُ مَرَّتَيْنِ" } رَوَاهُ أَبُو دَاوُدَ, ]و] النَّسَائِيّ ُ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) తెలిపారు: ఇద్దరు వ్యక్తులు ప్రయాణానికి బయలుదేరారు. నమాజ్ వేళ అయింది. కాని వారి వద్ద నీరు లేదు. ఇద్దరూ పరిశుభ్రమయిన మట్టితో ‘తయమ్ముమ్’ చేసి నమాజ్ చేశారు. నమాజ్ వేళ ముగియక ముందే నీరు కూడా వారికి లభ్యమయింది. వారిలో ఒక వ్యక్తి వుజూచేసి నమాజ్ చేయగా రెండవ వ్యక్తి తిరిగి వుజూ చేయటంగానీ, నమాజ్ చేయటం గానీ చేయలేదు. ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన మీదట ఇరువురూ దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి జరిగిన సంఘటనను వివరించారు. ఆయన రెండవసారి నమాజ్ చేయని వ్యక్తి నుద్దేశ్యించి, “నీవు సున్నత్‌ను అనుసరించావు. నీవు చేసిన (మొదటి) నమాజ్ నీకు సరిపోతుంది”అని అన్నారు. రెండవసారి నమాజ్‌చేసిన వ్యక్తిని ఉద్దేశ్యించి, “నీకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది” అని అన్నారు. (అబూదావూద్, నసాయి)

English

Narrated Abu Sa'id al-Khudri (RAA): Two men set out on a journey and when the time of Salat (prayer) came they had no water. They performed Tayammum with clean earth and prayed. Later on they found water within the time of the prayer. One of them repeated his prayer with ablution but the other did not repeat. Then they came to Allah's Messenger (ﷺ), and related the matter to him. Addressing himself to the one who did not repeat, he said, "You followed the Sunnah and your (first) prayer was enough for you."[9] He said to the one who performed ablution and repeated: "For you there is a double reward". [Reported by Abu Dawud and An-Nasa'i]

సారాంశం

ఒకసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసిన మీదట నీరు లభ్యమయితే వుజూ చేసి తిరిగి నమాజ్ చేయవలసిన అవసరం లేదని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. నలుగురు ధర్మవేత్తల అభిమతం కూడా ఇదే.

మలిసారి నమాజ్ చేసిన వ్యక్తికి రెట్టింపు పుణ్యఫలం లభించడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే అతనికి ఒక పుణ్యం నమాజ్ చేసినందుకు లభించగా, మరో పుణ్యం ఇజ్తెహాద్ చేసినందుకు (ధర్మావలంబనలో విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించినందుకు) లభించింది. అతని ఇజ్తెహాద్ సరైంది కాకపోయినప్పటికీ, అతను చేసిన కృషికిగాను రెట్టింపు పుణ్యం ఇవ్వబడిందన్నమాట!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 113

114

హదీసు 114

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا فِي قَوْلِهِ عَزَّ وَجَلَّ ﴿ وَإِنْ كُنْتُمْ مَرْضَى أَوْ عَلَى سَفَرٍ ﴾ قَالَ: "إِذَا كَانَتْ بِالرَّجُلِ اَلْجِرَاحَةُ فِي سَبِيلِ اَللَّهِ وَالْقُرُوحُ, فَيُجْنِبُ, فَيَخَافُ أَنْ يَمُوتَ إِنْ اِغْتَسَلَ: تَيَمَّمَ". رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ مَوْقُوفًا, وَرَفَعَهُ اَلْبَزَّارُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَالْحَاكِم ُ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “వ ఇన్ కున్తుమ్ మరజన్ అవ్ అలా సఫరిన్” అనే దైవసూక్తి గురించి ఈయన్ని దర్యాప్తుచేయగా ఈయన ఇలా సమాధానమిచ్చారు – ఎవడికయినా దైవ మార్గంలో గాయమైతే, దెబ్బతగిలితే, అదే స్థితిలో అతను లైంగిక అశుద్ధతకు కూడా లోనవుతే, అట్టి స్థితిలో స్నానం చేయటంవల్ల చనిపోయే ప్రమాదం ఉందనిపిస్తే అతడు ‘తయమ్ముమ్’ చేసుకోవాలి. (ఈ ఉల్లేఖనాన్ని దారె ఖుత్నీ ‘మౌఖూఫ్’గా, బజ్జార్ ‘మర్‌ఫూ’ గాను, హాకిమ్ ‘సహీహ్’గానూ ఖరారు చేశారు).

English

Narrated Ibn `Abbas (RAA): concerning the verse, “And if you are ill or on a journey…” (an-Nisa': 43). He said, "If a man sustains a wound, which he suffered during Jihad (in the cause of Allah) or ulcers, then he became junub (sexually impure) and is afraid that if he bathes he would die; he may perform ablution with clean earth (Tayammum). [Reported by Ad- Daraqutni in a Mawquf (untraceable) Hadith and Al-Bazzar in a Marfu' (traceable) one. Ibn Khuzaima and Al-Hakim graded it Sahih (sound)].

సారాంశం

“ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే, మరి మీకు నీరు లభ్యం కాకపోతే తయమ్ముమ్ చేసుకోండి.”

దీని భావం ఏమిటంటే మీరు నమాజ్ చేయదలచినపుడు నీటితో వుజూ చేయటం వల్లనూ, స్నానం చేయటం వల్లనూ ఏదైనా హాని కలుగుతుందని భయముంటే తయమ్ముమ్ చేసి నమాజ్ చేయాలి. ఈ ఆయత్‌లో ప్రస్తావనకు వచ్చిన వ్యాధి తేలికపాటి వ్యాధికాదు. తేలికపాటి గాయం, కురుపు, చెమటకాయలు, దురద, ఎలర్జీ వంటివి ఈ కోవలోకి రావు.

అయితే వ్యాధి తీవ్రతకు సంబంధించి – అంటే ఏ స్థాయికి చెందిన వ్యాధిగ్రస్తత వుంటే తయమ్ముమ్ చేయవచ్చు? అనే విషయమై ఇమాముల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. నీళ్ళతో వుజూ చేయటం వల్ల ప్రాణం పోతుందనే భయమున్నప్పుడు, వుజూ పరిధిలోకి వచ్చే శరీరావయవాలు పనికిరాకుండా పోయే ప్రమాదముందను కున్నప్పుడు మాత్రమే ‘తయమ్ముమ్’ చేయటం సమంజసమని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) అభిప్రాయంలో; వ్యాధి ముదిరి దీర్ఘకాలిక వ్యాధిగా మారే భయముంటే చాలు – తయమ్ముమ్ ధర్మ సమ్మతమైపోతుంది.

హదీసులో ప్రస్తావించబడిన ఖుర్ఆన్ వాక్యంలో ‘ప్రయాణావస్థలో వున్నప్పుడు తయమ్ముమ్ చేసుకోవచ్చ’ని ఉంది. ఇది నమాజ్‌ను ఖసర్ చేసుకునే, ఉపవాసాన్ని వాయిదా వేసుకునే ప్రయాణం కానేకాదు. నీరు లభ్యం కాని ప్రయాణం అని దీని భావం. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్)ల అభిమతం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 114

115

హదీసు 115

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { اِنْكَسَرَتْ إِحْدَى زَنْدَيَّ فَسَأَلَتْ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَأَمَرَنِي أَنْ أَمْسَحَ عَلَى اَلْجَبَائِرِ } رَوَاهُ اِبْنُ مَاجَه بِسَنَدٍ وَاهٍ جِدًّ ا.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం: నా ‘కట్టు’ తెగిపోయింది. అప్పుడు నేను దైవ ప్రవక్త ﷺ ను వుజూ గురించి ప్రశ్నించగా “పట్టీలపై మసహ్ చేసుకో” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు.” (ఇబ్నె మాజా దీనిని అత్యంత బలహీనమైన ఆధారాలతో ఉల్లేఖించారు).

English

Narrated `Ali (RAA): One of my forearms was broken. Then I consulted Allah's Messenger (Peace be upon him) and he ordered me to wipe over the bandages. [Reported by Ibn Majah with a very weak chain of narrators].

సారాంశం

‘కట్టు’ అంటే చేయి లేక కాలి ఎముక చిట్లినపుడు, ఎముకను జోడించడానికి బద్దలతో వేసే కట్టు అని భావం. ఎముక అతికే దాకా ఆ బద్దలు ఊతగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో నిర్ణీతభాగాన్ని (కట్టు కట్టిన భాగాన్ని) మసహ్ చేస్తే సరిపోతుంది – నీటితో తడపనవసరం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 115

116

హదీసు 116

{ وَعَنْ جَابِرٍ رَضِيَ اَللَّهُ تَعَالَى عَنْهُ فِي اَلرَّجُلِ اَلَّذِي شُجَّ, فَاغْتَسَلَ فَمَاتَ ‏-: "إِنَّمَا كَانَ يَكْفِيهِ أَنْ يَتَيَمَّمَ, وَيَعْصِبَ عَلَى جُرْحِهِ خِرْقَةً, ثُمَّ يَمْسَحَ عَلَيْهَا وَيَغْسِلَ سَائِرَ جَسَدِهِ" } رَوَاهُ أَبُو دَاوُدَ بِسَنَدٍ فِيهِ ضَعْفٌ, وَفِيهِ اِخْتِلَافٌ عَلَى رَاوِيهِ.

తలకు గాయమైవున్న స్థితిలోనే స్నానం చేసి మరణించిన వ్యక్తి గురించి హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా వివరించారు: (అతని గురించి దైవప్రవక్త – సల్లల్లాహు అలైహి వ సల్లం – వ్యాఖ్యానించారు) “అతడు తయమ్ముమ్ చేసుకుంటే సరిపోయేది. తన గాయంపై కట్టుకట్టి మసహ్ చేసుకుంటే, మిగిలిన శరీరాన్ని కడుక్కుంటే (ఈ స్థితి ఏర్పడేది కాదు కదా)”. (ఈ ఉల్లేఖనాన్ని బలహీన ఆధారాలతో అబూదావూద్ ఉల్లేఖించారు. హదీసును అందజేసిన పరంపర గురించి కూడా అభిప్రాయభేదం ఉంది).

English

Narrated Jabir bin 'Abdullah (RAA): concerning the man who had a head injury, and then he made Ghusl and died: Allah's Messenger Peace be upon him said, "It would have been enough for him to perform Tayammum and wrap it with something and wipe over the wrapping and wash the rest of his body." [Reported by Abu Da'ud, but there is a weakness in its chain of narrators]

సారాంశం

అబూదావూద్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా వృత్తాంతాన్ని వివరించారు. జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ఇలా వుంది: మేము ఒక ప్రయాణానికి బయలుదేరాము. మాలో ఒక వ్యక్తి తలకు రాయి తగిలింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అదే స్థితిలో అతనికి స్వప్న స్ఖలనం కూడా అయింది. ‘నేను తయమ్ముమ్ చేసుకోగలనా?’ అని ఆ వ్యక్తి అందరినీ అడిగాడు. నీరు ఉపయోగించగల శక్తి నీలో ఉంటే తయమ్ముమ్ చేసుకోవడమెందుకు? అని అందరూ సలహా ఇచ్చారు. సహచరుల సలహా మేరకు అతడు స్నానం చేశాడు, తరువాత చనిపోయాడు.

ప్రయాణం నుండి తిరిగి వచ్చిన మీదట మేమంతా దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి ఆ వ్యక్తి మరణ వృత్తాంతం వివరించాము. దీనిపై దైవప్రవక్త ﷺ స్పందిస్తూ, “వీళ్ళంతా కలసి అతన్ని చంపేశారు. దేవుని దెబ్బ వీళ్ళపై పడుగాక! విషయం వీరికి అర్థం కానపుడు దర్యాప్తు చేయవచ్చుకదా! తెలియనపుడు, విషయ పరిజ్ఞానం లేనపుడు దాని గురించి తెలుసుకోవాలి కదా!” అన్నారు. తరువాత ఆయన ﷺ అతడు ‘ఇలా చేస్తే పోయేది’ అంటూ హదీసులోని వాక్యం పలికారు.

అంటే గాయమైనచోట కట్టుకట్టే ముందు తయమ్ముమ్ చేస్తే అశుద్ధతా ప్రభావం దూరమైపోతుంది. కాళ్ళు కడిగిన తరువాత మేజోళ్ళు తొడిగి వాటిపై ఎలా మసహ్ చేసుకోవటం జరుగుతుందో ఇదీ అంతే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 116

117

హదీసు 117

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { مِنْ اَلسُّنَّةِ أَنْ لَا يُصَلِّيَ اَلرَّجُلُ بِالتَّيَمُّمِ إِلَّا صَلَاةً وَاحِدَةً, ثُمَّ يَتَيَمَّمُ لِلصَّلَاةِ اَلْأُخْرَى } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ جِدًّ ا.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “తయమ్ముమ్ చేసే వ్యక్తి తయమ్ముమ్‌తో ఒకే నమాజ్ చేయాలి. మరో నమాజ్ కోసం సరికొత్తగా తయమ్ముమ్ చేసుకోవాలి. ప్రవక్త సంప్రదాయం (సున్నత్) ఇదే.” (దీనిని దారె ఖుత్నీ అత్యంత బలహీనమైన ఆధారాలతో ఉల్లేఖించారు).

English

Narrated Ibn `Abbas (RAA): It is from the Sunnah of the Prophet (ﷺ) for the man to pray only one prayer with each Tayammum, and then perform Tayammum for the next prayer. [Reported by Ad-Daraqutni but with a very weak chain of narrators]

సారాంశం

ఈ హదీసు బలహీనమైనది. ఎందుకంటే అందజేసిన వారిలో ఒకరైన హసన్ బిన్ అమ్మార్ బలహీనులు. అందుచేత హదీసువేత్తలు దీనిని ‘జయీఫ్’ హదీసుగా నిర్ధారించారు. తయమ్ముమ్ వుజూకు ప్రత్యామ్నాయం అని లోగడ చెప్పబడిన హదీసుకు ఇది విరుద్ధంగా ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.9 తయమ్ముమ్|హదీసు 117