హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 1.6 వుజూను భంగపరిచే విషయాలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, 6వ అధ్యాయం: వుజూను భంగపరిచే విషయాలు. ఈ అధ్యాయంలో 15 హదీసులు (హదీసు 62 – 76) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

1.6 వుజూను భంగపరిచే విషయాలు

↑ విషయ సూచిక

باب نواقض الوضوء

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

62

హదీసు 62

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ أَصْحَابُ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-‏-عَلَى عَهْدِهِ‏- يَنْتَظِرُونَ اَلْعِشَاءَ حَتَّى تَخْفِقَ رُؤُوسُهُمْ, ثُمَّ يُصَلُّونَ وَلَا يَتَوَضَّئُونَ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اَلدَّارَقُطْنِيّ ُ. وَأَصْلُهُ فِي مُسْلِم ٍ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: దైవప్రవక్త ﷺ రాక కోసం సహచరులు ఇషా నమాజ్‌లో తీవ్రంగా నిరీక్షించేవారు. నిద్రమత్తుతో ఒక్కోసారి వారి తలలు వాలిపోయేవి (కునుకు వచ్చేది). కాని వారు సరికొత్తగా వుజూ చేయకుండానే నమాజ్ చేసేవారు. (దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు. దారె ఖుత్నీ దీనిని ప్రామాణికమైనదిగా ధృవీకరించారు. దీని మూలం మాత్రం ‘ముస్లిం’లో ఉంది).

English

Narrated Anas (rad): The Companions of Allah’s Messenger (ﷺ) in his lifetime used to wait for the ‘Isha (night) prayer, so much so that their heads were lowered down (by dozing). They would then pray without performing ablution. [Reported by Abu Da’ud and Ad-Daraqutni graded it Sahih (sound). Its origin is in Muslim].

Its origin is in Muslim.

సారాంశం

మనిషి గాఢ నిద్రకు లోనయ్యే వరకూ అతని వుజూ భంగం కాజాలదని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. అదీగాక ఏ నిద్రవల్ల వుజూకు భంగం కలుగుతుందో, మరే నిద్రవల్ల వుజూ భంగం కాదో ప్రవక్త ప్రియ సహచరులకు తెలుసు. దీని గురించి వివరాల్లోకి పోనవసరం లేదు. ఒక విషయం మాత్రం గమనార్హం. దేనికయినా ఆనుకుని లేదా తలగడను ఆశ్రయించి నిద్రించటం వల్ల వుజూ ప్రమాదంలో పడవచ్చు. వేరితర పరిస్థితుల్లో వచ్చే నిద్రవల్ల, కునుకు వల్ల వుజూకు వాటిల్లే నష్టం ఏమీలేదు. ఆనుకుని నిద్రించటం వల్లనూ, తలగడ ఆసరా పొందటంవల్లనూ మానవ శరీరం అతని అదుపులో ఉండదు. పైగా ఆ స్థితిలో కడుపులో నుంచి వాయువులు విసర్జితమయ్యే అవకాశాలు హెచ్చు. ఈ కారణంగా జాగ్రత్త కోసం సరికొత్తగా వుజూ చేసుకోవాలని ఆజ్ఞాపించబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 62

63

హదీసు 63

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { جَاءَتْ فَاطِمَةُ بِنْتُ أَبِي حُبَيْشٍ إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَتْ: يَا رَسُولَ اَللَّهِ! إِنِّي اِمْرَأَةٌ أُسْتَحَاضُ فَلَا أَطْهُرُ, أَفَأَدَعُ اَلصَّلَاةَ? قَالَ: "لَا.‏ إِنَّمَا ذَلِكَ عِرْقٌ, وَلَيْسَ بِحَيْضٍ, فَإِذَا أَقْبَلَتْ حَيْضَتُكِ فَدَعِي اَلصَّلَاةَ, وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِي عَنْكِ اَلدَّمَ, ثُمَّ صَلِّي } مُتَّفَقٌ عَلَيْه ِ. وَلِلْبُخَارِيِّ: { ثُمَّ تَوَضَّئِي لِكُلِّ صَلَاةٍ }. وَأَشَارَ مُسْلِمٌ إِلَى أَنَّهُ حَذَفَهَا عَمْدً ا.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: ఫాతిమా బిన్తె అబూ హుబైష్ (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు- “దైవప్రవక్తా ﷺ! నేను ఎల్లకాలం ‘ఇస్తెహాజా’ (సుదీర్ఘ కాలంపాటు జరిగే) రక్త స్రావానికి లోనై ఉంటాను. పరిశుద్ధతను పొందే భాగ్యమే దక్కదు. మరి నేనీ స్థితిలో నమాజ్‌ను మానెయ్యాలా?” దీనికాయన ﷺ “లేదు. అదొక విధమైన నరం (అది తెగిపోవటం వల్ల రక్తం స్రవిస్తుంది). అంతేగాని అది బహిష్టు రక్తం కాదు. అయితే బహిష్టు కాలపు రక్తస్రావం జరుగుతున్నప్పుడు నమాజ్‌ను మానెయ్యి. ఈ కాలం పూర్తయిన తరువాత రక్తాన్ని కడిగేసుకుని నమాజ్ చెయ్యి” అని బోధించారు. (బుఖారీ, ముస్లిం)

“మరి ప్రతి నమాజ్‌కు ముందు వుజూ చేస్తుండాలి” అన్న వాక్యం బుఖారీలో అదనంగా ఉంది. ‘ముస్లిం’ ఉద్దేశ్యపూర్వకంగా దీనిని విడిచిపెట్టినట్లు తెలిపారు.

English

Narrated ‘Aisha (rad): Fatima bint Abu Hubaish came to the Prophet (ﷺ) and said, “O Messenger of Allah, I am a woman whose blood keeps flowing (even after the menstruation). I am never purified; should I, therefore, stop praying?” He (the Prophet) said: “No, for that is only a vein, and is not menstruation. So when the menstruation comes, abstain from prayers, and when it ends wash the blood from yourself and then pray”. [Agreed upon].

Al-Bukhari’s version adds: “Then perform ablution for every prayer”.

and Muslim admitted that he dropped this addition deliberately.

సారాంశం

స్త్రీ మూడు రకాల రక్త స్రావాలకు గురికావలసి వస్తుంది. 1. బహిష్టు రక్తం. స్త్రీ రజస్వల అయినప్పటినుంచి వృద్ధాప్యానికి చేరుకునే వరకూ సాధారణంగా ప్రతి నెలా ఈ రక్తస్రావం మూడు నుండి ఏడు రోజుల వరకూ జరుగుతూ ఉంటుంది. అయితే గర్భధారణ జరిగినపుడు ఈ రక్తం స్రవించదు. ఈ రక్తం చిక్కగా, కాస్త నలుపుగా ఉంటుంది.

రెండవది పురిటి రక్తస్రావం : ఇది స్త్రీ ప్రసవించిన రోజునుంచి 40 రోజుల దాకా లేక అంతకన్నా తక్కువ రోజులు స్రవిస్తుంది. 40 కన్నా ఎక్కువ రోజులు కూడా కనబడవచ్చు.

మూడవది ‘ఇస్తెహాజా’ రక్తం. ఇది ఇంతకు ముందు పేర్కొనబడిన రెండు రకాల రక్తం కంటే భిన్నమైనది. ఇది గర్భసంచితో ముడిపడివున్న ఒక నరం చిట్లటం వల్ల (ఇన్‌ఫెక్షన్ అవటం వల్ల) స్రవిస్తుంది. ఈ బ్లీడింగ్ ఎర్రగా ఉంటుంది. క్రమక్రమంగా ఇది గైనిక్ ప్రాబ్లమ్‌గా, ఫైబ్రాయిడ్ యుటరస్‌గా రూపొందుతుంది. ఏ క్షణంలో ఈ రక్తం స్రవిస్తుందో, ఎప్పుడు ఆగుతుందో చెప్పలేము. (తగు చికిత్స జరగకపోతే) మనోపాజ్ దశ వరకూ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్‌వల్ల ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసు ఉల్లేఖనానికి కారకురాలైన ఫాతిమా బిన్తె అబూ హుబైష్ (రదియల్లాహు అన్హా) సుప్రసిద్ధ సహాబీయ. కురైష్ తెగకు చెందిన ‘అసద్’ అనే ఉప తెగతో ఆమెకు సంబంధముంది. ఈమె తండ్రి పేరు ఖైస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా బిన్ ఖుసై. ఈమె అబ్దుల్లాహ్ బిన్ జహష్ (రదియల్లాహు అన్హు) సతీమణి. మర్యాదస్తురాలు, ఈమె దైవమార్గంలో హిజ్రత్ (ప్రస్థానం) కూడా చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 63

64

హదీసు 64

وَعَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كُنْتُ رَجُلاً مَذَّاءً, فَأَمَرْتُ اَلْمِقْدَادَِ أَنْ يَسْأَلَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَسَأَلَهُ ? فَقَالَ: "فِيهِ اَلْوُضُوءُ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيّ ِ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఇలా వివరించారు : నాకు తరచూ (పురుషాంగం నుంచి)జిగటు పదార్థం వెలువడేది (శుక్ర నష్టం జరిగేది). దీనికి సంబంధించిన ఆదేశాలేమిటో దైవప్రవక్త ﷺను అడిగి తెలుసుకోవలసిందిగా నేను మిఖ్దాద్ (రదియల్లాహు అన్హు)ను కోరాను. మిఖ్దాద్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺను దీని గురించి కనుక్కున్నారు (దీని కారణంగా వుజూ చేయాలా? లేక విధిగా స్నానం చేయాలా? అని అడిగారు). “ఇలాంటి స్థితిలో వుజూ చేస్తే సరిపోతుంది” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం – అయితే ఈ వాక్యాలు మాత్రం బుఖారీ లోనివి).

English

Narrated ‘Ali bin Abi Talib (rad): I was one who Madhi (urethral discharge) flowed readily and asked Miqdad (his slave) to ask the Prophet (ﷺ) about it. He (the Prophet) said:“One should perform Wudu (ablution) in this case”. [Agreed upon and this is Al-Bukhari’s version].

సారాంశం

అరబీలో ‘మజీ’ వెలువడుతోంది అని ఉంది. ఏమిటీ ‘మజీ’? ఇది తెల్లగా, చిక్కగా, జిగటుగా ఉండే నీరు. భార్యతో సరస సల్లాపాలు చేస్తున్నప్పుడు, ముద్దుపెట్టుకున్నప్పుడు, సంభోగాలోచన కలిగినప్పుడు పురుషాంగం నుంచి శీఘ్రంగా స్ఖలిస్తుంది. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ కు అల్లుడు కావటం వల్ల, తన బలహీనతను ఆయన ముందు చెప్పుకోవటానికి సిగ్గుపడి, తన స్నేహితులైన మిఖ్దాద్ (రదియల్లాహు అన్హు) సహాయం పొందారు.

హదీసు ఉల్లేఖకులు

మిఖ్దాద్ (రదియల్లాహు అన్హు) పూర్తి పేరు మిఖ్దాద్ బిన్ అమ్ర్ బిన్ సాలబ అల్‌బహ్రానీ. అబుల్ అస్వద్ అనేది మరో పేరు. మిఖ్దాద్ బిన్ అస్వద్ (రదియల్లాహు అన్హు) పేరుతో ప్రసిద్ధిచెందారు. ఇస్లాంను స్వీకరించిన వారిలో 6వ వారు. రెండుసార్లు హిజ్రత్ చేసిన ఘనత ఈయనకు దక్కింది. పండితులు, సద్గుణ సంపన్నులగు సహచరులలో ఈయన కూడా ఒకరని అనబడుతోంది. బద్ర్ యుద్ధం జరిగిన రోజున అశ్వారూఢుల్లో ఈయన ఉన్నారు. ఈజిప్టు విజయంలో భాగస్తులు, హిజ్రీ 33లో మదీనాకు మూడు మైళ్ళ దూరంలో వున్న ‘జౌఫ్’ వద్ద ఈయన మరణించారు. భౌతికకాయం మదీనాకు తరలించబడింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) జనాజా నమాజ్ చేయించారు. బఖీ ఖననవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అప్పటికి ఆయన వయస్సు 70 ఏండ్లు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 64

65

హదీసు 65

وَعَنْ عَائِشَةَ, رَضِيَ اَللَّهُ عَنْهَا; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَبَّلَ بَعْضَ نِسَائِهِ, ثُمَّ خَرَجَ إِلَى اَلصَّلَاةِ وَلَمْ يَتَوَضَّأْ } أَخْرَجَهُ أَحْمَدُ, وَضَعَّفَهُ اَلْبُخَارِيّ ُ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు : దైవప్రవక్త ﷺతన సతీమణులలో ఒకామెను ముద్దుపెట్టుకుని, నమాజ్ చేయడానికి వెళ్ళిపోయారు, వుజూ చేయలేదు. (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు. బుఖారీ దీనిని బలహీనమైనదిగా ఖరారు చేశారు).

English

Narrated ‘Aisha (rad): The Prophet (ﷺ) kissed one of his wives and went to pray without performing (fresh) ablution. [Reported by Ahmad and Al-Bukhari graded it Da’if (weak)].

సారాంశం

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) నుండి ఇబ్రాహీం తైమీ దీనిని ఉటంకించారు. కాని ఇబ్రాహీం హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) నుండి ఏమీ వినలేదు. కనుక ఇది బలహీనమైనది. అయితే బుఖారీలోని ఒక హదీసు దీనిని సమర్థిస్తోంది. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) స్వయంగా ఈ విధంగా తెలిపారు: “దైవప్రవక్త ﷺ రాత్రి చీకటిలో తహజ్జుద్ నమాజ్ చేసేవారు. నా కాళ్ళు ఆయన సజ్దా చేసేచోట అడ్డుతగిలేవి. సజ్దాలోకి వెళ్ళే ముందు ఆయన ﷺ తన చేత్తో నా పాదాలను స్పృశించేవారు. వెంటనే నేను నా కాళ్ళను దూరంగా జరుపుకునే దానిని. దీని ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే స్త్రీ శరీరావయవాల్లోని ఏ భాగాన్నయినా ముట్టుకున్నంత మాత్రాన వుజూ భంగం కాదు. అలాగే ముద్దుపెట్టుకున్నంత మాత్రాన కూడా వుజూ భంగం కాదు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. ఇమాములలో ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) విధానం కూడా ఇదే. అయితే ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృష్టిలో స్త్రీని ముట్టుకోవటం వల్ల వుజూ భంగమైపోతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 65

66

హదీసు 66

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا وَجَدَ أَحَدُكُمْ فِي بَطْنِهِ شَيْئًا, فَأَشْكَلَ عَلَيْهِ: أَخَرَجَ مِنْهُ شَيْءٌ, أَمْ لَا? فَلَا يَخْرُجَنَّ مِنْ اَلْمَسْجِدِ حَتَّى يَسْمَعَ صَوْتًا, أَوْ يَجِدَ رِيحًا } أَخْرَجَهُ مُسْلِم ٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవరయినా మీ కడుపుల్లోంచి వాయువు విసర్జిత మైనట్లు అనిపిస్తే – అలాంటి పరిస్థితిలో నిజంగానే వాయువు విసర్జితమైందా? లేదా? అన్న సంశయం కలిగి ఒక నిర్ణయానికి రావటం కష్టమయినట్లయితే – మీరు (వుజూ చేయడానికి) మస్జిద్‌నుండి బయటికి పోవలసిన అవసరంలేదు. (నిజంగానే) అపానవాయువు వెడలినట్లుగా శబ్దం వస్తే లేక దుర్వాసన వస్తే అప్పుడు (తాజాగా వుజూ కోసం) బయటికి పోవచ్చు.” (ముస్లిం)

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “If one of you feels disturbance in his stomach and doubts whether he has released some wind or not, then he should not leave the mosque unless he hears its sound or smells (its) odour”. [Reported by Muslim].

సారాంశం

కేవలం అనుమానం వచ్చినంతమాత్రాన వుజూ భంగం కాదని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. ఈ భావాన్ని మరి కాస్త విస్తృతార్థంలో తీసుకుంటే ఒక సూత్రం మన ముందుకు వస్తుంది. అదేమంటే ప్రతి వస్తువూ తనదైన ఒక ఆదేశంపై నెలకొని ఉంది. ఏ పనైనా దానికి విరుద్ధంగా జరిగినట్లు ఖచ్చితంగా స్పష్టం కానంతవరకూ సంశయాలు, అనుమానాలు లెక్కలోకి రావు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 66

67

హదీసు 67

وَعَنْ طَلْقِ بْنِ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { قَالَ رَجُلٌ: مَسَسْتُ ذَكَرِي أَوْ قَالَ اَلرَّجُلُ يَمَسُّ ذَكَرَهُ فِي اَلصَّلَاةِ, أَعَلَيْهِ وُضُوءٍ ? فَقَالَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-"لَا, إِنَّمَا هُوَ بَضْعَةٌ مِنْكَ } أَخْرَجَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ. وَقَالَ اِبْنُ اَلْمَدِينِيِّ: هُوَ أَحْسَنُ مِنْ حَدِيثِ بُسْرَةَ.‏

హజ్రత్ తల్ఖ్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు) వివరించారు : ‘నేను నా మర్మాంగాన్ని చేత్తో తాకాను’ అని ఒక వ్యక్తి అన్నాడు. లేదా ఇలా అన్నాడు : ‘ఒకతను నమాజ్‌లో తన మర్మాంగాన్ని చేత్తో ముట్టుకుంటున్నాడు. మరి అతను సరికొత్తగా వుజూ చేయవలసిందేనా?’ దానికి దైవప్రవక్త ﷺ “లేదు. అది నీ శరీరంలోని ఒక భాగం” అని బదులిచ్చారు. (దీనిని ఐదుగురూ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీని ప్రామాణికతను ధృవీకరించారు. బుస్రా హదీసు కన్నా ఈ హదీసు మెరుగైనదని ఇబ్నె మదీని అభిప్రాయపడ్డారు).

English

Narrated Talq bin ‘Ali (rad): A man said: “I touched my penis” or he said, “Does a man who touch his penis during the prayer should perform Wudu (ablution)?” The Prophet (ﷺ) replied, “No, it is only a part of your body”. [Reported by Al-Khamsa. Ibn Hibban graded it Sahih (sound).

and Ibn Al-Madini said, “It is better than the Hadith of Busra".

సారాంశం

ఇబ్నె మదీనీగా ప్రసిద్ధిచెందిన అలీ బిన్ అబ్దుల్లాహ్ హిజ్రీ 121 లో జన్మించారు. హి.శ. 224లో మరణించారు. ఈయన ఇమామ్ బుఖారీ, అబూ దావూద్‌ల అధ్యాపకులలో ఒకరు. పురుషాంగాన్ని ముట్టుకున్నంత మాత్రాన వుజూ భగ్నం కాదని చాలామంది ప్రవక్త సహచరులు భావించేవారని తిర్మిజీ పేర్కొన్నారు. ఇబ్నె మదీనీ, ఇబ్నె ముబారక్, కూఫా వాసులు కూడా ఈ అభిప్రాయమే కలిగి ఉండేవారు.

కాగా; మరోవైపు అనేకమంది సహాబీలు, తాబయీలు పురుషాంగాన్ని తాకటంవల్ల వుజూ భంగమైపోతుందని అభిప్రాయపడుతున్నారు. దీనికి ఆధారంగా వారు బుస్రా ఉల్లేఖనాన్ని ఉదాహరిస్తున్నారు. ఈ ఉల్లేఖనం దీని తరువాత రాబోతుంది. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) కూడా ఈ అభిప్రాయానికే కట్టుబడి ఉన్నారు.

హదీసు ఉల్లేఖకులు

తల్ఖ్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు) గారి మరో పేరు అబూ అలీ. వంశపరంపర ప్రకారం ఆయన పేరు – తల్ఖ్ బిన్ అలీ బిన్ తల్ఖ్ బిన్ అమ్ర్ హనఫీ యమామీ. దైవప్రవక్త ﷺ మదీనా ఏతెంచినపుడు ఈయన అప్పటికప్పుడే ఆయన ﷺ సమక్షంలోకి హాజరయ్యారు. మస్జిదె నబవీ నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నారు. ఈయన చేత 14 హదీసులు ఉల్లేఖించబడ్డాయని అనబడుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 67

68

హదీసు 68

وَعَنْ بُسْرَةَ بِنْتِ صَفْوَانَ رَضِيَ اَللَّهُ عَنْهَا; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: "مَنْ مَسَّ ذَكَرَهُ فَلْيَتَوَضَّأْ" } أَخْرَجَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ حِبَّان َ. وَقَالَ اَلْبُخَارِيُّ: هُوَ أَصَحُّ شَيْءٍ فِي هَذَا اَلْبَابِ.‏

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని బుస్రా బిన్తె సఫ్వాన్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు : “ఎవరు తన మర్మాంగాన్ని చేత్తో తాకాడో అతను వుజూ చేసుకోవాలి.” (దీనిని ఐదుగురూ ఉల్లేఖించారు. తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ధృవీకరించారు. ఈ అధ్యాయం క్రింద వచ్చిన వాటిలోకెల్లా ఇది అత్యంత ప్రామాణికమైన హదీసు అని ఇమామ్ బుఖారీ వ్యాఖ్యానించారు).

English

Narrated Busra bint Safwan (rad): Allah’s Messenger (ﷺ) said: “He who touches his penis should perform ablution”. [Reported by Al-Khamsa, and At-Tirmidhi and Ibn Hibban graded it Sahih (sound).

and Al-Bukhari said, “It is the most authentic in this chapter”.

సారాంశం

పురుషాంగాన్ని ముట్టుకోవటం వల్ల వుజూ భంగమైపోతుందని ఈ హదీసు స్పష్టంగా చెబుతోంది. ప్రాధాన్యత నివ్వదగిన ప్రవచనం ఇదే. ఎందుకంటే ఈ ప్రవచనంలో నిర్దిష్టమైన ఒక ఆజ్ఞ ఉంది. ఊహాగానాలకు ఇందులో ఎలాంటి ఆస్కారం లేదు. ఇంతకు ముందు వచ్చిన తల్ఖ్ బిన్ అలీ ఉల్లేఖనం కన్నా బుస్రా బిన్తె సఫ్వాన్ ఉల్లేఖనం సూటిగానూ, నిర్దిష్టంగానూ ఉందని దైవభక్తిపరాయణులైన ఇమాములు అనేకమంది అభిప్రాయపడ్డారు. అటువంటి వారిలో కొందరు ప్రముఖులు : ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), అబూ జర్ఆ (రహిమహుల్లాహ్), అబూ హాతిమ్ (రహిమహుల్లాహ్), దారె ఖుత్నీ (రహిమహుల్లాహ్), బైహఖీ (రహిమహుల్లాహ్), ఇబ్నె జౌజీ (రహిమహుల్లాహ్) మొదలగువారు.

బుస్రా ఉల్లేఖనం కన్నా తల్ఖ్ బిన్ అలీ ఉల్లేఖనం మెరుగైనదన్న ఇబ్నె మదీనీ అభిప్రాయాన్ని ఇమాములు ఆమోదించలేదు. అదీగాక బుస్రా బిన్తె సఫ్వాన్ హదీసుకు సమర్థింపుగా దాదాపు 18 మంది ప్రవక్త సహచరుల ఉల్లేఖనాలు ఉన్నాయి. కనుక ఈ హదీసు మొదటి హదీసుకన్నా ప్రాధాన్యత నివ్వదగినది, అనుసరణీయమైనదీనూ.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన బుస్రా (రదియల్లాహు అన్హా) పూర్తి పేరు ఇది: బుస్రా బిన్తె సఫ్వాన్ బిన్ నౌఫిల్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా ఖురైషియ అసదియ. ప్రథమశ్రేణి సహచరులలో ఈమె కూడా ఒకరుగా పరిగణించబడతారు. తొలికాలంలో హిజ్రత్ చేసినవారిలో ఈమె కూడా ఉన్నారు. ఈమె అమీర్ ముఆవియ పరిపాలనా కాలం వరకూ జీవించి ఉన్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 68

69

హదీసు 69

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; أَنَّ رَسُولَ اَللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمََ قَالَ: { مَنْ أَصَابَهُ قَيْءٌ أَوْ رُعَافٌ, أَوْ قَلَسٌ, أَوْ مَذْيٌ فَلْيَنْصَرِفْ فَلْيَتَوَضَّأْ, ثُمَّ لِيَبْنِ عَلَى صَلَاتِهِ, وَهُوَ فِي ذَلِكَ لَا يَتَكَلَّمُ } أَخْرَجَهُ اِبْنُ مَاجَ ه. وَضَعَّفَهُ أَحْمَدُ وَغَيْرُهُ.‏

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు : “ఎవరికయినా నమాజ్‌లో వాంతి అయితే, లేదా ముక్కునుండి రక్తం స్రవిస్తే లేదా కడుపులోని పదార్థమేదైనా నోటిగుండా బయటికి వస్తే లేదా అంగం నుండి జిగటు పదార్థం స్ఖలిస్తే అతను నమాజ్‌ను వదలివెళ్ళి వుజూ చేయాలి. ఎక్కడయితే నమాజ్‌ని వదలిపెట్టాడో అక్కడి నుంచీ మొదలెట్టాలి. అయితే ఈ లోగా అతను సంభాషించకుండా ఉండాలన్నది షరతు.” (ఇబ్నె మాజ దీనిని ఉల్లేఖించారు. అహ్మద్ దీనిని బలహీనమైనదిగా ఖరారు చేశారు).

English

Narrated ‘Aisha (rad): Allah’s Messenger (ﷺ) said: “Whoever vomits, bleeds through the nose, or released Madhi (urethral discharge) should go, perform ablution and then complete his Salat (prayer) (by continuing from where he had stopped at) on condition that he does not speak in the process”. Reported by Ibn Majah

and Ahmad and others graded it Da’if

సారాంశం

స్ఖలనం జరిగినపక్షంలో తక్షణం వుజూ భంగమైపోతుందని ధర్మశాస్త్రవేత్తలంతా ముక్త కంఠంతో నొక్కిపలికారు. అయితే వాంతి అవటం వల్ల, ముక్కు నుండి రక్తం స్రవించటంవల్ల, కడుపులోని పదార్థమేదైనా నోటి ద్వారా బయటకు రావటం వల్ల వుజూ భంగం అవుతుందని కొందరు, కాదని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే నమాజ్‌ను ఎక్కడ వదలిపెట్టడం జరిగిందో అక్కడి నుంచి మొదలెట్టాలన్న విషయంలో కూడా అభిప్రాయభేదం ఏర్పడింది. ఈ హదీసు బలహీన మైనదేగాక, ప్రామాణిక హదీసులలో చెప్పబడిన కొన్ని విషయాలకు వ్యాఘాతంగా పరిణమించింది. అందుచేత ఈ హదీసు ఆధారంగా తుది నిర్ణయానికి రావటం దుర్లభమే.

వుజూ భంగమైన కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన నమాజును, అక్కడినుంచే మొదలెట్టే విషయంలో కూడా ఇమాముల మధ్య అభిప్రాయభేదం ఉంది. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ఈ అంశానికి అనుకూలంగా ఉండగా, ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ప్రతికూలంగా ఉన్నారు. నమాజ్ చేసే వ్యక్తి ‘వుజూ’ ను కోల్పోయినపుడు, అతని నమాజ్ ఇంకెక్కడ మిగిలివుంటుంది? అంటారు ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్).

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 69

70

హదీసు 70

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ رَجُلاً سَأَلَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَتَوَضَّأُ مِنْ لُحُومِ اَلْغَنَمِ? قَالَ: إِنْ شِئْتَ قَالَ: أَتَوَضَّأُ مِنْ لُحُومِ اَلْإِبِلِ ? قَالَ: نَعَمْ } أَخْرَجَهُ مُسْلِم ٌ.

హజ్రత్ జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు : ‘నేను మేక మాంసం తిన్న తరువాత వుజూ చేసుకోవాలా?’ అని ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺను ప్రశ్నించాడు. “నీ మనసు కోరితే చేసుకో” అని ఆయన ﷺ బదులిచ్చారు. ‘ఒంటె మాంసం తింటే?’ అని ఆ వ్యక్తి మళ్ళీ సందేహ పడగా, “ఒంటె మాంసం తిన్న తరువాతైతే వుజూ చేయాల్సిందే” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (ముస్లిం)

English

Narrated Jabir bin Samura (rad): A man asked the Prophet (ﷺ), “Should I perform ablution after eating mutton?” He replied, “If you wish so”, he then asked, “Should I perform ablution after eating camel meat?” He (ﷺ) said: “Yes”. [Reported by Muslim].

సారాంశం

ఒంటె మాంసం తిన్న తరువాత వుజూ చేయటం అవసరమని ఈ హదీసు ద్వారా ద్యోతకమవుతోంది. ఈ మాంసం తిన్నంతనే వుజూ ఎందుకు ప్రమాదంలో పడుతుంది? అందలి పరమార్థం ఏమిటి? అన్న ప్రశ్నలు ఇక్కడ అనవసరం.

ఒంటె మాంసం తినటం వల్ల వుజూ భంగమవుతుందా? అవదా? ఈ విషయంలో ఇమాములలో, ప్రవక్త అనుయాయులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇమామ్ అహ్మద్, ఇస్‌హాఖ్ బిన్ రాహ్వే, ఇబ్నె ముంజిర్, ఇబ్నె ఖుజైమ తదితర హదీసువేత్తలంతా – ఒంటె మాంసం తిన్న తరువాత వుజూ మిగిలి ఉండదనే అంటున్నారు. బైహఖీ మరియు అహ్లె హదీసు వారు కూడా ఈ అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. అయితే ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), అనేకమంది సహాబీలు మరియు తాబయీలు మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. హలాల్ (ధర్మసమ్మతం చేయబడిన) జంతువు మాంసం తిన్నప్పుడు ‘వుజూ’ భంగం కాజాలదని వీరంతా వాదిస్తున్నారు. దీనికి ఆధారంగా వీరు అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజాల వ్యాఖ్యను ఉదాహరిస్తున్నారు. ఇక్కడ ‘వుజూ’ చేయటంలోని అంతరార్థం భోజనానంతరం ముఖం చేతులు కడుక్కోవటం లాంటిదని వీరంతా అభిప్రాయపడుతున్నారు.

హదీసు ఉల్లేఖకులు

జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హు) ప్రవక్త సహచరులలో ప్రముఖులు. కూఫాలో స్థిరపడ్డారు. సుమారు 186 హదీసులు ఈయనగారి చేత ఉల్లేఖించబడ్డాయి. హిజ్రీ 73లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 70

71

హదీసు 71

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ غَسَّلَ مَيْتًا فَلْيَغْتَسِلْ, وَمَنْ حَمَلَهُ فَلْيَتَوَضَّأْ } أَخْرَجَهُ أَحْمَدُ, وَالنَّسَائِيُّ, وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَه ُ. وَقَالَ أَحْمَدُ: لَا يَصِحُّ فِي هَذَا اَلْبَابِ شَيْءٌ.‏

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మృతునికి స్నానంచేయించిన వాడు స్వయంగా స్నానం చేయాలి. మృతుని లేపినవాడు (మోసినవాడు) వుజూ చేయాలి.” (ఈ హదీసును అహ్మద్, నసాయి, తిర్మిజీలు ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘అహ్సన్’గా ఖరారు చేశారు. ఈ అధ్యాయం క్రింద ఏ హదీసూ ప్రామాణికమైనదిగా రుజువు కాలేదని అహ్మద్ వ్యాఖ్యానించారు).

English

Narrated Abu Huraira (rad): The Prophet (ﷺ) said: “Whoever washes a dead person should take a bath (thereafter); and whoever carries it should perform ablution”. Reported by Ahmad, An-Nasa’i and At-Tirmidhi who graded it Hasan (fair).

And Ahmad said that there is no authentic Hadith in this chapter.

సారాంశం

మృతునికి స్నానం చేయించిన వ్యక్తి తాను కూడా స్నానం చేయటం ‘మంచి’దన్న భావంలోనే ఇది చెప్పబడిందిగాని ‘తప్పనిసరి’ అన్న భావంలో మాత్రం కాదు. సుననె దారె ఖుత్నీ, ముస్నద్ అహ్మద్‌లో అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి వివరణ ఇందుకు ప్రబల నిదర్శనం. ఆయన ఇలా అన్నారు : మేము మృతునికి స్నానం చేయించేవాళ్ళం. తదుపరి (స్నానం చేయించిన వారిలో) కొంతమంది స్నానం చేసేవారు. మరికొంతమంది స్నానం చేసేవారు కాదు. హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ వివరణా తీరును సరైనదిగా ఖరారు చేశారు. బైహఖీ మరియు హాకిమ్‌లో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం కూడా దీనిని సమర్థిస్తోంది. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా), ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా), ఆయిషా (రదియల్లాహు అన్హా), హసన్ బస్రీ (రహిమహుల్లాహ్), ఇబ్రాహీం నఖ్‌యీ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇస్‌హాఖ్ (రహిమహుల్లాహ్) తదితర విద్వాంసులు కూడా ఈ అభిప్రాయానికే కట్టుబడి ఉన్నారు. అయితే కొంతమంది ‘స్నానం తప్పనిసరి’ అని కూడా అభిప్రాయపడ్డారు. ఇక; జనాజాను మోసేవారు వుజూను తప్పనిసరిగా చేయాలని మాత్రం ఎవరూ భావించటం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 71

72

హదీసు 72

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ أَبِي بَكْرٍ رَحِمَهُ اَللَّهُ; { أَنَّ فِي اَلْكِتَابِ اَلَّذِي كَتَبَهُ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-لِعَمْرِو بْنِ حَزْمٍ: أَنْ لَا يَمَسَّ اَلْقُرْآنَ إِلَّا طَاهِرٌ } رَوَاهُ مَالِكٌ مُرْسَلاً, وَوَصَلَهُ النَّسَائِيُّ, وَابْنُ حِبَّانَ, وَهُوَ مَعْلُولٌ.‏

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు – దైవప్రవక్త ﷺ అమ్ర్ బిన్ హజమ్ (రదియల్లాహు అన్హు)కు రాసిచ్చిన ఆజ్ఞాపత్రంలో ఇలా పేర్కొన్నారు : “దివ్య ఖుర్‌ఆన్‌ను పరిశుద్ధుడైన మనిషి (వుజూ చేసినవాడు) మాత్రమే ముట్టుకోవాలి.” (ఇమామ్ మాలిక్ దీనిని ‘ముర్సల్’ ఉల్లేఖనంగా తీసుకున్నారు. నసాయి, ఇబ్నెమాజాలు దీనిని ‘మౌసూల్’గా పరిగణించారు. వాస్తవానికి ఈ హదీసు “మాలూల్”. అంటే లోపభూయిష్టమైనది).

English

Narrated ‘Abdullah bin Abu Bakr (rad): The book written by Allah’s Messenger (ﷺ) for ‘Amr bin Hazm also contained: “ None except a pure person should touch the Quran”. [Reported by Malik as a Mursal and by An-Nasa’i and Ibn Hibban as Mawsul. And it is graded as Ma’lul (defective)].

సారాంశం

ఈ హదీసులో పరిశుద్ధత అనేది ‘తహారత్’ అనే అరబీ పదానికి అర్థంగా తీసుకోబడింది. తహారత్ రెండు రకాలు. ఒకటి: హదసె అక్బర్ (పెద్ద తరహా అశుద్ధత). రెండు : హదసె అస్గర్ (చిన్న తరహా అశుద్ధత).

మనిషి హదసె అక్బర్‌కు లోనై ఉంటే – అంటే సంభోగించి ఉంటే, లేదా వీర్య స్ఖలనం జరిగి ఉంటే, లేదా విధిగా స్నానం చేసి పరిశుద్ధత పొందవలసిన అగత్యం ఏర్పడివుంటే – అట్టి స్థితిలో అతను దివ్య ఖుర్‌ఆన్‌ను ముట్టుకోవటం అధర్మం (నిషిద్ధం). కేవలం వుజూ లేని స్థితిలో ముట్టుకోవచ్చా? ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వుజూ చేసి ముట్టుకోవటం అభిలషణీయం.

హదీసు ఉల్లేఖకులు

1. అబ్దుల్లాహ్ బిన్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) పూర్తి పేరు: అబ్దుల్లాహ్ బిన్ అబూ బకర్ బిన్ ముహమ్మద్ బిన్ అమ్ర్ హజమ్ అన్సారీ. ప్రముఖ ప్రశిష్యులు (తాబయీ). హిజ్రీ 135లో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 70 సంవత్సరాలు.

2. అమ్ర్ బిన్ హజమ్ (రదియల్లాహు అన్హు) : ఈయన పరంపర ఇలా ఉంది – అమ్ర్ బిన్ హజమ్ బిన్ యజీద్ ఖజ్‌రజీ నజ్జారీ. అబూ జహ్హాక్ మారు పేరు. కందక పోరాటంలో పాల్గొన్నారు. దైవప్రవక్త ﷺ ఈయన్ని నజరాన్ ప్రాంతం వైపునకు ధర్మబోధకునిగా నియమించి పంపారు. ప్రజలకు ధర్మాదేశాలను తెలిపి, ఖుర్ఆన్ చదివించి శిక్షణ నివ్వమని చెప్పారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో ఈయన పరమపదించారు. మహాప్రవక్త ﷺ ఈయనకు అందజేసిన సూచనా పత్రంలో ధర్మవిధులు, సున్నత్‌లు, దానధర్మాలు, హద్దులు తదితర అంశాలు లిఖించబడ్డాయి. పై హదీసులో పేర్కొనబడిన ‘ఆజ్ఞాపత్రం’ ఇదే. హిజ్రీ 50 తరువాత ఈయన మదీనాలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 72

73

హదీసు 73

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُذْكُرُ اَللَّهَ عَلَى كُلِّ أَحْيَانِهِ } رَوَاهُ مُسْلِمٌ, وَعَلَّقَهُ اَلْبُخَارِيّ ُ.

“దైవప్రవక్త ﷺ ఎల్లవేళలా దైవస్మరణ చేసేవారు” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు. (దీనిని ముస్లిం ఉల్లేఖించారు. బుఖారీ దీనిని నకలు చేశారు).

English

Narrated ‘Aisha (rad): Allah’s Messenger (ﷺ) used to mention Allah’s Name (praise Him) at all times. [Reported by Muslim and Al-Bukhari recorded it as Mu’allaq (suspended)].

సారాంశం

దీని సారాంశం ఏమిటంటే సంభోగం, మలమూత్ర విసర్జన తదితర అశుద్ధావస్థలలో మినహా మిగిలిన సమయాలలో – సతతం – దైవ నామస్మరణ చేసేందుకు అనుమతి ఉంది. అశుద్ధావస్థకు లోనై ఉన్నప్పుడు తప్ప మిగిలిన వేళల్లో దైవప్రవక్త ﷺ దివ్య ఖుర్‌ఆన్ పారాయణం చేసేవారని హదీసుల ద్వారా తెలుస్తోంది. నోరు (నాలుక) పరిశుద్ధమైనది. నోటి ద్వారా ఎల్లవేళలా దైవనామస్మరణ చేయవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 73

74

హదీసు 74

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-اِحْتَجَمَ وَصَلَّى, وَلَمْ يَتَوَضَّأْ } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ, وَلَيَّنَه ُ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) వివరించారు : దైవప్రవక్త ﷺ శరీరం నుండి రక్తం తీసారు. కాని వుజూ చేయకుండానే నమాజ్ చేశారు. (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు. దీనిని బలహీనమైన హదీసుగా నిర్ధారించారు).

English

Narrated Anas bin Malik (rad): The Prophet (ﷺ) had blood extracted from his body and offered the prayer and did not perform (a new) ablution. [Reported by Ad-Daraqutni who graded it Da’if (weak)].

సారాంశం

అసలు హదీసులో “ఇహ్తిజామ్” అనే పదం వచ్చింది. దీని అర్థం శరీరాన్ని గుచ్చుటం, ఏదైనా పరికరంతో శరీరంలోని రక్తాన్ని తీయటం అని వస్తుంది. ఆధునిక పరిభాషలో టీకాలు వేయటం, చెడురక్తం, చీము పేరుకుని ఉన్నచోట శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించటం అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చు.

మలమూత్ర విసర్జనావయవాలు తప్ప శరీరంలోని మిగిలిన భాగాలనుండి రక్తం తీయటం వల్ల వుజూ భంగం కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తదితర సహాబీల, తాబయీల ఓ పెద్ద సమూహంతోపాటు ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయిల అభిమతం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 74

75

హదీసు 75

وَعَنْ مُعَاوِيَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ الْعَيْنُ وِكَاءُ السَّهِ, فَإِذَا نَامَتْ اَلْعَيْنَانِ اِسْتَطْلَقَ اَلْوِكَاءُ } رَوَاهُ أَحْمَدُ, وَالطَّبَرَانِيُّ وَزَادَ { وَمَنْ نَامَ فَلْيَتَوَضَّأْ } وَهَذِهِ اَلزِّيَادَةُ فِي هَذَا اَلْحَدِيثِ عِنْدَ أَبِي دَاوُدَ مِنْ حَدِيثِ عَلِيٍّ دُونَ قَوْلِهِ: { اِسْتَطْلَقَ اَلْوِكَاءُ } وَفِي كِلَا الْإِسْنَادَيْنِ ضَعْف ٌ. وَلِأَبِي دَاوُدَ أَيْضًا, عَنْ اِبْنِ عَبَّاسٍ مَرْفُوعًا: { إِنَّمَا اَلْوُضُوءُ عَلَى مَنْ نَامَ مُضْطَجِعًا } وَفِي إِسْنَادِهِ ضَعْفٌ أَيْضً ا.

హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “కళ్ళు తెరచుకుని ఉంటే అవి వాయువు పోకుండా కట్టడి చేస్తాయి. నిద్ర కారణంగా కళ్ళు మూసుకుపోతే ఈ కట్టు (బంధనం) సడలిపోతుంది. (ముస్నద్ అహ్మద్, తబ్రానీ). (“ఎవరికయితే నిద్రవస్తుందో వారు సరికొత్తగా వుజూ చేసుకోవాలి” అని తబ్రానీ ఒక వాక్యం పెంచారు).

ఈ అదనపు పలుకులు అబూ దావూద్ ఉల్లేఖనంలో కూడా ఉన్నాయి. అయితే ఈయన హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఆధారంగా దీనిని ఉల్లేఖించారు. ఈ ఉల్లేఖనంలో ‘బంధనం సడలిపోతుంది’ అన్న వ్రాత లేదు. (ప్రామాణికత రీత్యా ఈ రెండు హదీసులూ బలహీనమైనవే).

అబూ దావూద్‌లోనే ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారి ఇంకొక ఉల్లేఖనంలో ఇలా అనబడింది : “పండుకుని నిద్రించిన వాడే వుజూ చేయవలసి ఉంటుంది.” (ప్రామాణికతరీత్యా ఈ హదీసు కూడా బలహీనమైనదే).

English

Narrated Mu’awiyah (rad): Allah’s Messenger (saW) said: “The eye (when awake) is the string of the anus (to stop air escaping), and if the two eyes sleep the string is untied”. [Reported by Ahmad and At-Tabarani who added, “Whoever sleeps should perform ablution]”

Also reported by Abu Da’ud mentioning the above addition without the words “the string is untied”, but both versions are weak.

And Ibn ‘Abbas (rad) narrated in a Marfu’ (traceable) Hadith that: “Ablution is necessary for one who sleeps while he is lying flat. [Reported by Abu Da’ud and there is weakness in its chain of narrators].

సారాంశం

ఈ హదీసు ద్వారా విదితమయ్యేదేమిటంటే నిద్ర స్వతహాగా వుజూను భంగపరచేది కాకపోయినా దానివల్ల వుజూ విషయంలో సందిగ్ధావస్థ నెలకొంటుంది. అయితే ఈ రెండు ఉల్లేఖనాలు కూడా బలహీనమైనవే. ఎందుకంటే వీటిలో హదీసును అందజేసిన ‘బఖియ’ అనే ఒక ఉల్లేఖకుని విషయంలో హదీసువేత్తలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇది బలహీనమైనదైనప్పటికీ ముంజరీ, నవవీ లాంటి వారు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని పరిగణనలోకి తీసుకోదగ్గదిగా ఖరారు చేశారు.

పండుకొని నిద్రించటం వల్ల వుజూ భంగమవుతుందని హదీసులో ఉంది. గాఢనిద్రవల్ల వుజూ భంగమైపోతుందని కూడా వేరొక ఉల్లేఖనంలో ఉంది. ఈ రెంటి ద్వారా ఒక విషయం అవగతం అవుతోంది – ఒక ప్రక్కకు ఒరిగి నిద్రించటం వల్ల గాఢనిద్ర వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో శరీరావయవాలు పట్టు సడలిపోతాయి. ఆ సమయంలో అపానవాయువు వెడలే అవకాశాలు హెచ్చు. కాగా; తేలికపాటి నిద్రలో అలా జరగదు.

హదీసు ఉల్లేఖకులు

పూర్తి పేరు ముఆవియ బిన్ అబూ సుఫ్యాన్ బిన్ హరబ్ (రదియల్లాహు అన్హు). మక్కా విజయం సందర్భంగా ఇస్లాం స్వీకరించారు. ఈయన సోదరుడు యజీద్ బిన్ అబూ సుఫ్యాన్ మరణానంతరం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈయన్ని సిరియా గవర్నర్‌గా నియమించారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ వరకు ఈయన ఈ హోదాపై ఉన్నారు. హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మీదట అనుయాయులు ఆయన సమక్షంలో బైత్ చేశారు. అమీర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది హిజ్రీ 40 నాటి సంఘటన. హిజ్రీ 60లో ఈయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 78 సంవత్సరాలు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 75

76

హదీసు 76

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { يَأْتِي أَحَدَكُمُ الشَّيْطَانُ فِي صَلَاتِهِ, فَيَنْفُخُ فِي مَقْعَدَتِهِ فَيُخَيَّلُ إِلَيْهِ أَنَّهُ أَحْدَثَ, وَلَمْ يُحْدِثْ, فَإِذَا وَجَدَ ذَلِكَ فَلَا يَنْصَرِفُ حَتَّى يَسْمَعَ صَوْتًا أَوْ يَجِدَ رِيحًا } أَخْرَجَهُ اَلْبَزَّار ُ. وَأَصْلُهُ فِي اَلصَّحِيحَيْنِ مِنْ حَدِيثِ عَبْدِ اَللَّهِ بْنِ زَيْد ٍ. وَلِمُسْلِمٍ: عَنْ أَبِي هُرَيْرَةَ نَحْوُهُ.‏ وَلِلْحَاكِمِ.‏ عَنْ أَبِي سَعِيدٍ مَرْفُوعًا: { إِذَا جَاءَ أَحَدَكُمُ الشَّيْطَانُ, فَقَالَ: إِنَّكَ أَحْدَثْتَ, فَلْيَقُلْ: إِنَّكَ كَذَبْتََ } أَخْرَجَهُ اِبْنُ حِبَّانََ بِلَفْظِ: { فَلْيَقُلْ فِي نَفْسِهِ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: “నమాజ్ చేస్తున్నప్పుడు మీలో ఎవరి వద్దకయినా షైతాన్ వస్తాడు. అతని మల విసర్జనా మార్గంలో ఊదుతాడు. వాస్తవానికి అతడు వుజూను కోల్పోకపోయినా అతడు వుజూను కోల్పోతూ ఉన్న అనుమాన బీజాన్ని అతని మస్తిష్కంలో నాటి పోతాడు. కాబట్టి మీలో ఎవరికయినా ఇలా అనిపిస్తే అపానవాయువు వెడలినట్లుగా శబ్దం వినండి లేదా దుర్వాసన వచ్చేదాకా నమాజ్‌ను వదలకండి.” (దీనిని బజ్జార్ ఉల్లేఖించారు. ఈ హదీసు యొక్క మూలం బుఖారీలో అబ్దుల్లాహ్ బిన్ జైద్ ద్వారా, ముస్లింలో అబూ హురైర (రదియల్లాహు అన్హు) ద్వారా పొందుపరచబడి ఉంది).

ముస్లింలో హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) గారి ద్వారా సరిగ్గా ఇలాంటి వాక్యాలే ఉల్లేఖించబడ్డాయి.

హాకిమ్ అబూ సయీద్ ద్వారా సంగ్రహించి ఇలా వివరించారు: “మీలో ఎవరి వద్దకయినా షైతాన్ వచ్చి, నీవు వుజూను కోల్పోయావని మస్తిష్కంలో అనుమానాన్ని నాటితే, ‘నీవు చెప్పేది అబద్ధం’ అని ఆ వ్యక్తి అతనికి జవాబివ్వాలి. దీనిని ఇబ్నె హిబ్బాన్ ఈవిధంగా పేర్కొన్నారు: “నీవు అబద్ధాలకోరువి” అని ఆ వ్యక్తి తన మనసులో అనుకోవాలి.

English

Narrated Ibn ‘Abbas (rad): Allah’s Messenger (ﷺ) said: “Satan comes to one of you in Salat and blows air in his bottom, so he imagines that he has realised air yet he did not. So if he gets that feeling he should not leave his prayer unless he hears the sound (of the air) or smells its odour.” [Reported by Al-Bazzar].

It is originally from the Sahihain of Bukhari and Muslim as the Hadith narrated by ‘Abdullah bin Zaid.

And Muslim reported by Abu Huraira likewise.

And Abu Sa’id narrated in Marfu’ Hadith: “If Satan comes to one of you and says: ‘You have nullified your ablution (by releasing air)’, let him say: ‘You have lied.” [Reported by Al-Hakim].

Ibn Hibban also reported the above Hadith with the version: “Let him say in his heart…”

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.6 వుజూను భంగపరిచే విషయాలు|హదీసు 76