హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, 5వ అధ్యాయం: మేజోళ్ళపై మసహ్ చేయటం. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 53 – 61) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం

↑ విషయ సూచిక

باب المسح على الخفين

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

53

హదీసు 53

عَنْ اَلْمُغِيرَةِ بْنِ شُعْبَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { كُنْتُ مَعَ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَتَوَضَّأَ, فَأَهْوَيْتُ لِأَنْزِعَ خُفَّيْهِ, فَقَالَ: "دَعْهُمَا, فَإِنِّي أَدْخَلْتُهُمَا طَاهِرَتَيْنِ" فَمَسَحَ عَلَيْهِمَا } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) తెలిపారు : నేను దైవప్రవక్త ﷺ వెంట ఉన్నాను. ఆయన ﷺ వుజూ కోసం ఉపక్రమించగానే నేను ఆయన మేజోళ్ళను తీయడానికి ముందుకొచ్చాను. అప్పుడాయన ﷺ ఇలా పలికారు : “వదులు. నేను మేజోళ్ళు తొడిగినప్పుడు వుజూతో ఉన్నాను.” ఆ తరువాత ఆయన ﷺ వాటిపై మసహ్ చేశారు.

(బుఖారీ, ముస్లిం)

English

Narrated Mughira bin Shu’ba (rad): Once I was in the company of the Prophet (ﷺ), he then performed ablution and I dashed to take off his socks. He said, “Leave them for I had put them on after performing ablution”. So he wiped over them [Agreed Upon].

సారాంశం

ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే వుజూ చేసివున్న స్థితిలో మేజోళ్ళు తొడిగి ఉంటేనే వాటిపై మసహ్ చేయటం ధర్మసమ్మతం అవుతుంది. ఈ సంఘటన తబూక్ యుద్ధ సందర్భంగా ఫజ్ర్ నమాజ్ సమయంలో ఎదురయిందని అబూ దావూద్ మరియు మువత్తా ఇమామ్ మాలిక్‌లలో వివరించబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 53

54

హదీసు 54

وَلِلْأَرْبَعَةِ عَنْهُ إِلَّا النَّسَائِيَّ: { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-مَسَحَ أَعْلَى اَلْخُفِّ وَأَسْفَلَهُ } وَفِي إِسْنَادِهِ ضَعْف ٌ.

‘నసాయి’ లోనే గాకుండా మిగిలిన సునన్ యొక్క నాలుగు గ్రంథాలలో కూడా ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) గారి చేతనే ఈ విధంగా ఉల్లేఖించబడింది : “దైవప్రవక్త ﷺ మేజోళ్ళపైనా, క్రింద – రెండు వైపులా మసహ్ చేశారు.” (ఈ ఉల్లేఖనం అంతగా ప్రామాణికమైనది కాదు).

English

Narrated by Al-Arba’a except An-Nasa’i: The Prophet (ﷺ) wiped over the upper part of the leather socks and the under part of it. [In its chain of narrators there is weakness].

సారాంశం

మేజోళ్ళ పైనా, క్రింద – రెండు వైపులా మసహ్ చేయటం అవసరమని ఈ హదీసు ద్వారా తెలియవస్తోంది. అయితే ఈ ఉల్లేఖనం బలహీనమైనది. రాబోయే ప్రామాణికమైన హదీసుకు ఇది విరుద్ధంగా ఉన్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 54

55

హదీసు 55

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { لَوْ كَانَ اَلدِّينُ بِالرَّأْيِ لَكَانَ أَسْفَلُ اَلْخُفِّ أَوْلَى بِالْمَسْحِ مِنْ أَعْلَاهُ, وَقَدْ رَأَيْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَمْسَحُ عَلَى ظَاهِرِ خُفَّيْهِ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ بِإِسْنَادٍ حَسَن ٍ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “ఒకవేళ ధర్మం పునాదే గనక అభిప్రాయాలపై, హేతువుపై ఆధారపడి ఉంటే మేజోళ్ళ పైభాగానికి బదులు క్రింది భాగానికి మసహ్ చేయటం ఎక్కువ సమంజసంగా భావించబడేది. అయితే దైవప్రవక్త ﷺ తన మేజోళ్ళ పైభాగాన మసహ్ చేయటం నేను ఖుద్దుగా చూశాను.” (అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన రీతిలో ఉల్లేఖించారు).

English

Narrated ‘Ali (rad): If the religion were based on opinion, it would be more important to wipe over the under parts of the leather socks than the upper, but I have seen Allah’s Messenger (rad) wiping over the upper parts of his leather socks. [Reported by Abu Da’ud with good Isnad (chain of narrators)].

సారాంశం

దీనిభావం ఏమిటంటే ధర్మాదేశాలు దైవ సంకేతంపై ఆధారపడి ఉంటాయిగాని బుద్ధీ వివేకాలపై కావు. బుద్ధిపై, హేతువుపై గనక ఇవి ఆధారపడి ఉన్నట్లయితే మేజోళ్ళ పైభాగాన మసహ్ చేయాలని ఎన్నటికీ ఆజ్ఞాపించబడేది కాదు. మేజోళ్ళ అడుగు భాగాన మాత్రమే మసహ్ చేయాలని ఆదేశించబడేది. ఎందుకంటే అడుగు భాగమే అశుద్ధతకు, మలినానికి లోనై ఉంటుంది. కాని హదీసు హేతువుకు విరుద్ధంగా ఉంది. మూలాంశం స్పష్టంగా ఉన్నప్పుడు మనిషి హేతువు కాంతిలో ఆలోచించకూడదు. అయితే గియితే అంటూ తన స్వంత అభిప్రాయాలను అన్వయింపజేసే ప్రయత్నాలు చేయకూడదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 55

56

హదీసు 56

وَعَنْ صَفْوَانَ بْنِ عَسَّالٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-يَأْمُرُنَا إِذَا كُنَّا سَفْرًا أَنْ لَا نَنْزِعَ خِفَافَنَا ثَلَاثَةَ أَيَّامٍ وَلَيَالِيَهُنَّ, إِلَّا مِنْ جَنَابَةٍ وَلَكِنْ مِنْ غَائِطٍ, وَبَوْلٍ, وَنَوْمٍ } أَخْرَجَهُ النَّسَائِيُّ, وَاَلتِّرْمِذِيُّ وَاللَّفْظُ لَهُ, وَابْنُ خُزَيْمَةَ وَصَحَّحَاه ُ.

హజ్రత్ సఫ్వాన్ బిన్ అస్సాల్ (రదియల్లాహు అన్హు) వివరించారు : మేము ప్రయాణంలో ఉండగా – అశుద్ధావస్థకు లోనైతే తప్ప- మూడు పగళ్ళూ, మూడు రాత్రుల దాకా మేజోళ్ళు విడువనవసరం లేదని దైవ ప్రవక్త ﷺ మమ్మల్ని ఆజ్ఞాపించేవారు. అయితే మలమూత్రాల విసర్జన దృష్ట్యా, నిద్ర కారణంగా వాటిని విడువవలసిన అవసరం లేదు.” (నసాయి, తిర్మిజీలు దీనిని ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు మాత్రం తిర్మిజీ నుండి తీసుకోబడ్డాయి. తిర్మిజీ, ఇబ్నె ఖుజైమాలిరువురూ దీనిని ప్రామాణికమైన ఉల్లేఖనంగా ధృవీకరించారు).

English

Narrated Safwan bin ‘Assal (rad): When we were on a journey, the Prophet (ﷺ) used to command us to wear our leather socks for three days and three nights, whether we had to answer the call of nature or slept. However, in case of ejaculation or sexual impurity, he commanded us to remove the leather socks. [Reported by An-Nasa’i and At-Tirmidhi, version is of the latter. With them Ibn Khuzaima graded it Sahih (sound)].

సారాంశం

మేజోళ్ళపై మసహ్ చేసే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేదు. ఈ అంశాన్ని గురించి ఉల్లేఖించిన సహాబీల సంఖ్య 80కు చేరింది. స్వర్గలోక శుభవార్త పొందిన సహాబీలు కూడా వీరిలో ఉన్నారు.

అయితే మేజోళ్ళ గడువు ప్రయాణీకులకు, స్థానికులకు వేర్వేరుగా నిర్ధారించబడి ఉంది. ప్రయాణీకులయితే మూడు రేయింబవళ్ళ వరకూ మేజోళ్ళు ధరించి ఉండవచ్చు. స్థానికులయితే ఒక పగలూ ఒక రేయి వరకూ తొడగవచ్చు. వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి జుహ్ర్ నమాజ్ సమయంలో వుజూ చేసి మేజోళ్ళు తొడిగాడు, అతని వుజూ సాయంత్రం భంగమైందనుకోండి, అతని గడువు సాయంత్రం నుండే మొదలవుతుంది. మనిషి అశుద్ధతకు లోనైన (తప్పనిసరిగా స్నానం చేయవలసిన అగత్యం ఏర్పడిన) కారణంగా మేజోళ్ళు తీసినట్లయితే మసహ్ భంగమైనట్లే. అలాగే గడువు ముగిసిన మరుక్షణం నుంచే మసహ్ భంగమైపోతుంది.

హదీసు ఉల్లేఖకులు

ఈయన పూర్తి పేరు సఫ్వాన్ బిన్ అస్సాల్ మురాదీ అల్ జుమలీ. ప్రముఖ సహాబీలలో ఒకరు. దైవప్రవక్త ﷺ సారథ్యంలో జరిగిన 12 యుద్ధాలలో ఈయన పాల్గొన్నారు. కూఫాలో స్థిరనివాస మేర్పరచుకున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 56

57

హదీసు 57

وَعَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { جَعَلَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-ثَلَاثَةَ أَيَّامٍ وَلَيَالِيَهُنَّ لِلْمُسَافِرِ, وَيَوْمًا وَلَيْلَةً لِلْمُقِيمِ.‏ يَعْنِي: فِي اَلْمَسْحِ عَلَى اَلْخُفَّيْنِ } أَخْرَجَهُ مُسْلِم ٌ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) గారిచే ఇలా ఉల్లేఖించబడింది : “దైవప్రవక్త ﷺ ప్రయాణీకుని కోసం మేజోళ్ళపై మసహ్‌కై మూడు రేయింబవళ్ళను, స్థిర నివాసమున్న వానికై ఒక పగలూ రేయిని గడువుగా నిర్ధారించారు.” (ముస్లిం)

English

Narrated ‘Ali (rad): The Prophet (ﷺ) fixed the period of Mash (wiping) over the leather socks (Khifaf – plural of Khuff) for three days and nights for a traveller and one day and a night for the resident person in a town [Reported by Muslim].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 57

58

హదీసు 58

وَعَنْ ثَوْبَانَ ‏- رضى الله عنه ‏- قَالَ: { بَعَثَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-سَرِيَّةً, فَأَمَرَهُمْ أَنْ يَمْسَحُوا عَلَى اَلْعَصَائِبِ ‏- يَعْنِي: اَلْعَمَائِمَ ‏-وَالتَّسَاخِينِ‏- يَعْنِي: اَلْخِفَافَ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اَلْحَاكِم ُ.

హజ్రత్ సోబాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దైవప్రవక్త ﷺ ఒక సైనిక దళాన్ని పంపిస్తూ, తల పాగాలపై, మేజోళ్ళపై ‘మసహ్’ చేయవలసిందిగా వారిని ఆదేశించారు.” (అహ్మద్, అబూదావూద్‌లు దీనిని ఉల్లేఖించారు- హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు).

English

Narrated Thawban (rad): Allah’s Messenger (ﷺ) sent out a military expedition and commanded them to wipe over the turbans and leather socks. [ Reported by Ahmad and Abu Da’ud. Al-Hakim graded it Sahih (sound)].

సారాంశం

హదీసులో ప్రయోగించబడిన అరబీ పదాలకు మేజోళ్ళు బదులు ‘కట్టు, ‘పట్టీలు’ అన్న అర్థాలు వస్తాయి. కాళ్ళను చలి తీవ్రత నుండి కాపాడటానికి ఉపయోగించే వస్తువు అన్నభావం కూడా వస్తుంది. అవి మేజోళ్ళూ కావచ్చు, లేక మరే కట్టు అయినా కావచ్చు. కాళ్ళకు తగిలిన గాయాలపై కట్టే పట్టీ (బ్యాండేజీ) కూడా కావచ్చు.

సైనిక బృందాన్ని యుద్ధానికి పంపిస్తూ దైవప్రవక్త ﷺ ఈ రకమయిన ఆజ్ఞలు జారీ చేశారంటే; క్షతగాత్రులైన యోధులు వుజూ భాగాలను మాటిమాటికీ కడిగేబదులు గాయాలపై కట్టబడి వున్న పట్టీలపై మసహ్ చేస్తే సరిపోతుంది అన్న భావం అయి ఉంటుంది.

హదీసు ఉల్లేఖకులు

సోబాన్ (రదియల్లాహు అన్హు) గారి పూర్తి పేరు సోబాన్ బిన్ బుజ్దుద్ బిన్ జహ్‌దర్. మారుపేరు అబూ అబ్దుల్లాహ్. ఈయన ‘సురాత్’ కు చెందిన వారు. అది మక్కా-మదీనాల మధ్య ఉన్న ఒక స్థలం. హుమైర్ తెగకు చెందినవారన్న వాదన కూడా ఉంది. ప్రయాణావస్థలోనూ, సాధారణ సమయాలలోనూ ఈయన – జీవితాంతం – దైవప్రవక్త ﷺకు వెన్నంటి ఉండేవారు. అన్ని రకాల సేవలు అందించేవారు. దైవప్రవక్త ﷺ ఈయన్ని కొని బానిసత్వం నుండి విముక్తి కలిగించారు. దైవప్రవక్త ﷺ మరణించిన పిదప ఈయన సిరియాలో స్థిరనివాసమేర్పరచుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత హిమ్స్ వైపునకు పయన మయ్యారు. హిజ్రీ 54లో కన్నుమూశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 58

59

హదీసు 59

وَعَنْ عُمَرَ ‏-مَوْقُوفًا‏- وأَنَسٍ ‏-مَرْفُوعًا‏-: { إِذَا تَوَضَّأَ أَحَدُكُمْ وَلَبِسَ خُفَّيْهِ فَلْيَمْسَحْ عَلَيْهِمَا, وَلْيُصَلِّ فِيهِمَا, وَلَا يَخْلَعْهُمَا إِنْ شَاءَ إِلَّا مِنْ جَنَابَةٍ" } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ, وَالْحَاكِمُ وَصَحَّحَه ُ.

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చే గుర్తింపు పొందనది (మౌఖూఫ్) గానూ, హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)చే గుర్తింపు పొందినది (మర్ఫూ)గానూ ఉల్లేఖించబడిన హదీసులో ఇలా అనబడింది:

“మీలో ఎవరయినా మేజోళ్ళు ధరించి ‘వుజూ’ చేస్తే వాటిపై మసహ్ చేసుకోవచ్చు. వాటిని ధరించి వున్న స్థితిలోనే నమాజ్ చేయవచ్చు. విధిగా స్నానం చేయవలసిన స్థితికి లోనైతే తప్ప వాటిని తీయవలసిన అవసరం లేదు.” దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ దీని ప్రామాణికతను ధృవీకరించారు).

English

Narrated ‘Umar (rad), in a Mawquf (untraceable) and Anas in a Marfu (traceable) Hadith: “If one of you performs ablution and puts on his two leather socks, let him perform Mash (wipe) over them and pray in them and he may not take them off he so wishes except after ejaculation or sexual impurity. [Reported by Ad-Daraqutni and Al-Hakim and graded Sahih (sound) by him].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 59

60

హదీసు 60

وَعَنْ أَبِي بَكْرَةَ ‏- رضى الله عنه ‏- عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-{ أَنَّهُ رَخَّصَ لِلْمُسَافِرِ ثَلَاثَةَ أَيَّامٍ وَلَيَالِيَهُنَّ, وَلِلْمُقِيمِ يَوْمًا وَلَيْلَةً, إِذَا تَطَهَّرَ فَلَبِسَ خُفَّيْهِ: أَنْ يَمْسَحَ عَلَيْهِمَا } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ.

దైవప్రవక్త ﷺ ప్రవచించినట్లు హజ్రత్ అబూ బక్ర (రదియల్లాహు అన్హు) వివరించారు – ఆయన ﷺ బాటసారి కోసం (మసహ్ నిమిత్తం) మూడు రేయింబవళ్ళ సౌకర్యం ఇచ్చారు. బాటసారి కాని వారికి ఒక పగలూ, ఒక రాత్రి సౌలభ్యం ఇచ్చారు. అయితే వుజూ చేసి వున్న స్థితిలో మేజోళ్ళు తొడిగితేనే ఇలా మసహ్ చేయవచ్చు.” (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించగా, ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైన ఉల్లేఖనంగా ఖరారు చేశారు).

English

Narrated Abu Bakra (rad): The Prophet (ﷺ) gave permission for the traveller to perform Mash (wiping) over his leather socks for three days and nights and for a non-traveller for a day and night, if he had put them on in a state of purity. [Reported by Ad-Daraqutni and graded Sahih (sound) by Ibnn Khuzaima].

హదీసు ఉల్లేఖకులు

హదీసు ఉల్లేఖకులైన అబూ బక్ర (రదియల్లాహు అన్హు) అసలు పేరు నుఫై బిన్ హారిస్. ఈయన తాయఫ్ కోట నుంచి కొంతమంది యువకులతో బయటకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. దైవప్రవక్త ﷺ ఈయనకు స్వేచ్ఛనొసగారు. బుద్ధిజీవులలో ఒకరుగా పరిగణించబడ్డారు. హిజ్రీ 51 లేదా హిజ్రీ 52లో బస్రాలో కన్నుమూశారు. అధిక సంతానం కలవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 60

61

హదీసు 61

وَعَنْ أُبَيِّ بْنِ عِمَارَةَ ‏- رضى الله عنه ‏- أَنَّهُ قَالَ: { يَا رَسُولَ اَللَّهِ أَمْسَحُ عَلَى اَلْخُفَّيْنِ? قَالَ: "نَعَمْ" قَالَ: يَوْمًا? قَالَ: "نَعَمْ", قَالَ: وَيَوْمَيْنِ? قَالَ: "نَعَمْ", قَالَ: وَثَلَاثَةَ أَيَّامٍ? قَالَ: "نَعَمْ, وَمَا شِئْتَ" أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَقَالَ: لَيْسَ بِالْقَوِيِّ }.

హజ్రత్ ఉబై బిన్ ఇమార (రదియల్లాహు అన్హు) వివరించారు : ‘ఓ దైవ ప్రవక్తా! నేను మేజోళ్ళపై మసహ్ చేయగలనా?’ అని ప్రశ్నించాను. “అవును, చేసుకోవచ్చు” అని ఆయన ﷺ జవాబిచ్చారు. ‘ఒక రోజా?’ అని నేను అడగ్గా “అవును, ఒక రోజు” అని ఆయన ﷺ బదులిచ్చారు. ‘రెండు రోజులు?’అని విన్నవించుకోగా, “అవును, రెండు రోజులు” అని సెలవిచ్చారు. ‘మూడు రోజులు కూడానా?’ అని నేను ప్రశ్నించగా “అవును, మూడు రోజులు. నీ కిష్టమొచ్చినంత కాలం” అని ఆయన ﷺ పలికారు. (అబూ దావూద్ ఈ హదీసును ఉల్లేఖించారు. అయితే ఇది దృఢమైనది కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు).

English

Narrated Ubai bin ‘Imara (rad): I asked, “O Messenger of Allah, may I wipe over the Khuffain (leather socks)?” The Prophet (ﷺ) replied, “Yes”. I asked, “For one day?” He replied, “For one day”, I again asked, “And for two days?” He replied “For two day s too”. I again asked “And for three days” He replied, “Yes, as long as you wish”. [Reported by Abu Da’ud, who said, “It is not strong”]

సారాంశం

ఈ హదీసు బలహీనమైనది. పైగా ఇది ఇంతకు ముందు గడువును సూచించిన రెండు ప్రామాణికమైన హదీసులకు విరుద్ధంగా ఉంది. బాటసారి కోసం మూడు రేయింబవళ్ళు, బాటసారి కాని వ్యక్తికి ఒక పగలు రేయి మసహ్ చేసే గడువుగా లోగడ వచ్చిన ప్రామాణిక హదీసులలో నిర్ధారించబడింది. దృఢమైన, ప్రామాణికమైన హదీసుల ముందు బలహీనమైన హదీసు ఉపేక్షించబడుతుంది. ఈ హదీసు చాలా బలహీనమైందన్న విషయంపై హదీసువేత్తలంతా ఏకీభవించినట్లు ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ‘షర్‌హుల్ ముహజ్జబ్’ లో పేర్కొన్నారు.

హదీసు ఉల్లేఖకులు

ఉబై బిన్ ఇమార (రదియల్లాహు అన్హు) మదీనాకు చెందిన అన్సార్లలో సుప్రసిద్ధులు. ఈజిప్టులో స్థిరపడ్డారు. రెండు ఖిబ్లాల (బైతుల్ మఖ్దిస్, బైతుల్లాహ్)కు అభిముఖమై నమాజ్ చేసిన భాగ్యం పొందిన వారిలో ఈయన కూడా ఉన్నారని ఇబ్నె హిబ్బాన్ పలికారు. అయితే ఈ హదీసుపై, దీని ప్రామాణికతపై తనకు నమ్మకం లేదని కూడా ఆయన నొక్కి పలికారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.5 మేజోళ్ళపై మసహ్ చేయటం|హదీసు 61