హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 1.4 వుజూ

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, 4వ అధ్యాయం: వుజూ. ఈ అధ్యాయంలో 24 హదీసులు (హదీసు 29 – 52) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

باب الوضوء

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

29

హదీసు 29

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنْ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنَّهُ قَالَ: { لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لَأَمَرْتُهُمْ بِالسِّوَاكِ مَعَ كُلِّ وُضُوءٍ } أَخْرَجَهُ مَالِكٌ, وأَحْمَدُ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَذَكَرَهُ الْبُخَارِيُّ تَعْلِيقًا.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “నా అనుచర సమాజం గనక కష్టాల్లో పడిపోతుందన్న సంశయం నాకు లేకుండినట్లయితే ప్రతి వుజూ సమయంలో ‘మిస్వాక్’ చేయాలని ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి” (మాలిక్, అహ్మద్, నసాయి దీనిని ఉల్లేఖించగా, ఇబ్నె ఖుజైమ దీని ప్రామాణికతను ధృవీకరించారు. బుఖారీ దీనిని నకలు చేశారు).

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said “Had I not feared burdening my Ummah, I would have commanded them to use Siwak with every ablution.” [Reported by Malik, Ahmad and An-Nasai. Ibn Khuzaima graded it Sahih (sound) and Al-Bukhari mentioned as a Mu’allaq (suspended – without its chain of narrators).

సారాంశం

ఎప్పుడు వుజూ చేసినా మిస్వాక్ చేయటం (పళ్ళు తోముకోవటం) అభిలషణీయమనీ, ప్రవక్త సంప్రదాయమనీ పై హదీసు చెప్పకనే చెబుతోంది. మిస్వాక్ చేయటం అంటే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం మరియు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనటమేనని ‘ముస్లిం’ లోనూ, ‘అబూ దావూద్’లోనూ లిఖించబడింది. మరో గమనార్హమయిన విషయం ఏమిటంటే మిస్వాక్ చేయటం దైవప్రవక్తలందరి సంప్రదాయం. ముస్నదె ఇమామ్ అహ్మద్, ఇబ్నె ఖుజైమ, హాకిమ్, దారె ఖుత్నీలలో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ద్వారా ఈ విధంగా ఉల్లేఖించబడినట్లు ఉంది – “ఏ నమాజ్ అయితే మిస్వాక్ చేసి మరీ చేయబడిందో దాని పుణ్యం మిస్వాక్ చేయబడని నమాజ్ కన్నా డెబ్బయి రెట్లు అధికం.” కాని ఈ ఉల్లేఖనం బలహీనమైనది. ఒకవేళ ముందునుంచీ ‘వుజూ’ ఉంటే, నమాజ్‌కు ముందు మిస్వాక్ చేసుకోవటం మంచిది. తద్వారా ప్రవక్త విధానాన్ని అనుసరించినట్లవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 29

30

హదీసు 30

وَعَنْ حُمْرَانَ مَوْلَى عُثْمَانَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ: { أَنَّ عُثْمَانَ دَعَا بِوَضُوءٍ, فَغَسَلَ كَفَّيْهِ ثَلَاثَ مَرَّاتٍ, ثُمَّ مَضْمَضَ, وَاسْتَنْشَقَ, وَاسْتَنْثَرَ, ثُمَّ غَسَلَ وَجْهَهُ ثَلَاثَ مَرَّاتٍ, ثُمَّ غَسَلَ يَدَهُ اَلْيُمْنَى إِلَى اَلْمِرْفَقِِ ثَلَاثَ مَرَّاتٍ, ثُمَّ اَلْيُسْرَى مِثْلَ ذَلِكَ, ثُمَّ مَسَحَ بِرَأْسِهِ, ثُمَّ غَسَلَ رِجْلَهُ اَلْيُمْنَى إِلَى اَلْكَعْبَيْنِ ثَلَاثَ مَرَّاتٍ, ثُمَّ اَلْيُسْرَى مِثْلَ ذَلِكَ, ثُمَّ قَالَ: رَأَيْتُ رَسُولَ اَللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا.‏ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ హుమ్రాన్ మౌలా (రదియల్లాహు అన్హు) కథనం : “హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) వుజూ చేయడానికి నీరు తెప్పించారు. మొదట ఆయన తన అరచేతులను మూడుసార్లు కడిగారు. తరువాత మూడు సార్లు నీరు పుక్కిలించారు. ఆ తరువాత ముక్కులోనికి నీరు పోనిచ్చి, ముక్కు చీది మరీ శుభ్రం చేశారు. పిదప మూడుసార్లు ముఖం కడుక్కున్నారు. అనంతరం తన కుడిచేతిని మోచేతుల వరకు మూడు సార్లు కడిగారు. అలాగే మూడుసార్లు ఎడమ చేతినీ కడిగారు. తరువాత నీళ్ళతో తన తలను తుడుచుకున్నారు. (మసహ్ చేశారు). ఆ తరువాత తన కుడి కాలును, ఎడమ కాలును మడమల వరకూ మూడేసి సార్లు కడిగారు. ఆపైన ఆయన ఇలా అన్నారు – ‘నేనిప్పుడు ఏ విధంగా వుజూ చేశానో సరిగ్గా అదే విధంగా దైవప్రవక్త ﷺ వుజూ చేస్తుండగా చూసివున్నాను.”

(బుఖారీ, ముస్లిం)

English

Narrated Humran, the manumitted slave of Uthman: Uthman (rad) called for water to perform ablution. He washed palms of his hands three times, then rinsed his mouth and sniffed water in his nose and then blew it out. He then washed his face three times. Thereafter he washed his right hand up to his elbow three times, then the left one likewise, then he passed wet hands on his head. Then he washed his right foot up to the ankle three times, then the left one likewise. He then said, “I saw Allah’s Messenger (ﷺ) performing ablution like this ablution of mine”. [Agreed upon]

సారాంశం

సంబంధిత శరీరావయవాలను మూడేసిసార్లు కడగాలని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. మరో ఉల్లేఖనంలో రెండుసార్లు అని ఉంది. మరికొన్ని ఉల్లేఖనాలలో ఒక్కోసారి కడగాలని ఉంది. ఈ ఉల్లేఖనాలన్నింటినీ క్రోడీకరించిన మీదట హదీసువేత్తలు, ధర్మశాస్త్రవేత్తలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. దీనిప్రకారం ప్రతి అవయవాన్ని ఒకసారి కడగటం తప్పనిసరి (వాజిబ్). మూడేసి సార్లు కడగటం సంప్రదాయం (మస్నూన్). రెండేసిసార్లు కడిగినా సరిపోతుంది. ఈ అంశంపై ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అత్యధికుల అభిప్రాయాలను ఉటంకిస్తూ ‘ఒకసారి కడగటం వాజిబ్ (తప్పనిసరి)’అని వ్రాశారు.

హదీసు ఉల్లేఖకుల గురించి

1. ఈ హదీసును ఉల్లేఖించిన హుమ్రాన్ (రదియల్లాహు అన్హు) పూర్తి పేరు హుమ్రాన్ బిన్ అబాన్. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) ఈయన్ని ఒక యుద్ధఖైదీగా పట్టుకున్నారు. ఆ తరువాత ఈయన ముసైబ్ బిన్ నజబా వాటాలోకి వచ్చారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఈయన్ని ముసైబ్ నుండి కొని స్వేచ్ఛనొసగారు. హిజ్రీ 75లో మరణించారు. మరి కొంతమంది హి.శ. 76 అనీ, ఇంకొంతమంది హి.శ. 71 అని కూడా అభిప్రాయపడ్డారు.

2. హదీసు ఉల్లేఖకులలో రెండవ వారు హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు). తృతీయ ధర్మ ఖలీఫా. ఇస్లాంను స్వీకరించిన తొల్దొలి సహాబీలలో ఒకరు. దైవప్రవక్త ﷺ గారి ఇద్దరు ముద్దుల కూతుళ్ళు (రుఖియ్య, ఉమ్మె కుల్సూమ్)-ఒకరి తరువాత మరొకరు – ఈయన వైవాహిక జీవితంలోకి వచ్చారు. అందుకే ‘జున్నూరైన్’ అనే బిరుదుతో కూడా పిలువబడేవారు. శుక్రవారం నాడు వీర మరణం పొందారు. అది హిజ్రీ 35వ సంవత్సరం జిల్ హజ్జ్ 18వ తేదీన జరిగిన సంఘటన! ఇస్లామీయ చరిత్రలో అత్యంత విషాదకరమయిన సంఘటన!!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 30

31

హదీసు 31

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- ‏-فِي صِفَةِ وُضُوءِ اَلنَّبِيِّ صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ‏- قَالَ: { وَمَسَحَ بِرَأْسِهِ وَاحِدَةً.‏ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ، وَأَخْرَجَهُ النَّسَائِيُّ وَالتِّرْمِذِيُّ بِإِسْنَادٍ صَحِيحٍ، بَلْ قَالَ التِّرْمِذِيُّ: إِنَّهُ أَصَحُّ شَيْءٍ فِي الْبَابِ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ గారి వుజూ చేసే విధానాన్ని వివరిస్తూ ఇలా అన్నారు: “ఆయన ﷺ తన తలను ఒకేసారి మసహ్ చేశారు (తడి చేతులతో తలను తుడుచుకున్నారు).” (అబూ దావూద్, నసాయి, తిర్మిజీలు దీని ప్రామాణికతను ధృవీకరిస్తూ మరీ ఉల్లేఖించారు. ఈ అధ్యాయం క్రింద పేర్కొనబడిన హదీసులలో ఇది అన్నిటికన్నా ఎక్కువ ప్రామాణికమైనదని తిర్మిజీ వ్యాఖ్యానించారు).

English

Narrated ‘Ali (rad) regarding the description of the ablution of the Prophet (ﷺ): He (the Prophet) wiped his head (with water) only once. [Reported by Abu Da’ud, An-Nasa’i, AtTirmidhi with a Sahih Sanad (authentic chain of narrators). At-Tirmidhi said, “It’s the most Hadith on this subject”].

సారాంశం

ఒక్కసారి తలను మసహ్ చేయటమే ఫర్జ్ (విధి) అని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. ముస్లిం సమాజానికి చెందిన పండితులందరి అభిమతం కూడా ఇదే. ఒక్క ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తపరిచారు. ఇతర అవయవాల మాదిరిగా తలను కూడా మూడుసార్లు మసహ్ చేయాలంటారీయన. అబూ దావూద్‌లోని ఒక ఉల్లేఖనాన్ని ఆసరాగా తీసుకుని ఈయన ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే సహీహైన్ మరియు సునన్‌లో పేర్కొనబడిన అనేక హదీసుల వెలుగులో ఒకసారి తలను మసహ్ చేయడమే సరైనది.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) నాల్గవ ధర్మ ఖలీఫాగా పరిపాలన చేశారు. హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు), హుసైన్ (రదియల్లాహు అన్హు)ల పితామహులు. దైవప్రవక్త ﷺ అల్లుడు. బంధుత్వం రీత్యా దైవప్రవక్త గారి పెత్తండ్రి కుమారుడు కూడా అవుతారు. ఒక్క తబూక్ యుద్ధంలో తప్ప దైవప్రవక్త ﷺ పాల్గొన్న యుద్ధాలన్నింటిలో ఈయన కూడా పాల్గొన్నారు. హి.శ. 35వ సంవత్సరం జిల్ హజ్జ్ 18వ తేదీన ఖిలాఫత్ బాధ్యతలను స్వీకరించారు. హిజ్రీ 40వ యేట రమజాన్ నెల 17వ తేదీన శుక్రవారం ఉదయం కూఫాలో కర్కశుడైన అబ్దుర్రహ్మాన్ బిన్ ముల్జమ్ ఈయనపై దాడిచేసి దారుణంగా హత్య చేశాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 31

32

హదీసు 32

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ زَيْدِ بْنِ عَاصِمٍ ‏- رضى الله عنه ‏- ‏-فِي صِفَةِ اَلْوُضُوءِ‏- قَالَ: { وَمَسَحَ رَسُولُ اللَّهِ – صلى الله عليه وسلم -بِرَأْسِهِ, فَأَقْبَلَ بِيَدَيْهِ وَأَدْبَرَ.‏ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَفِي لَفْظٍ لَهُمَا: { بَدَأَ بِمُقَدَّمِ رَأْسِهِ, حَتَّى ذَهَبَ بِهِمَا إِلَى قَفَاهُ, ثُمَّ رَدَّهُمَا إِلَى اَلْمَكَانِ اَلَّذِي بَدَأَ مِنْهُ }.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) ‘వుజూ’కు సంబంధించి ఇలా వివరించారు: “దైవప్రవక్త ﷺ తలకు మసహ్ చేస్తూ తన రెండు చేతులనూ తల ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు తీసుకుపోయారు. తిరిగి వెనుక వైపు నుంచి ముందు వైపునకు తీసుకువచ్చారు. (బుఖారీ, ముస్లిం)

బుఖారీ, ముస్లింలు పొందుపరచిన మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : “ఆయన తల ముందు భాగం నుంచి (మసహ్‌ను) ప్రారంభించి చేతులను తల వెనుక భాగం చివరి వరకు – అంటే మెడ వరకూ తీసుకువెళ్ళారు. అలాగే రెండు చేతులనూ తల వెంట్రుకలకు స్పృశిస్తూ మసహ్ ప్రారంభించిన చోటికి వాపసు తీసుకువచ్చారు.”

English

Narrated ‘Abdullah bin Zaid bin ‘Aasim (rad) describing the nature of ablution performance: Allah’s Messenger (ﷺ) wiped his head from the forehead to the back of his head and then back to the forehead with his (wet) hands. [ Agreed upon ].

In another narration by al-Bukhari and Muslim: "He started with the front of his head, moved them (his hands) to the nape of his neck, and then returned them to the place where he started."

సారాంశం

ఈ హదీసు ద్వారా రూఢీ అయ్యేదేమిటంటే, తలకు చేసే మసహ్ తల ముందు భాగం నుంచి మొదలెట్టాలి. నలుగురు ఇమాముల (ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్, ఇమామ్ షాఫయి) తో పాటు ఇస్‌హాఖ్ బిన్ రాహ్వే అభిమతం కూడా ఇదే. అయితే తిర్మిజీలో పొందుపరచబడిన ఒక ఉల్లేఖనం ప్రకారం, తలకు చేసే మసహ్‌ను తల వెనుక భాగం నుంచి ప్రారంభించటం కూడా ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. దీని ఆధారంగా కూఫా వాసులు చాలా మంది ఈ పద్ధతినే అవలంబిస్తున్నారు. వకీ బిన్ జరాహ్ కూడా వారిలో ఒకరు. అయితే అత్యధికమంది ఇమాములు మరియు హదీసువేత్తలు ఈ ఉల్లేఖనాన్ని ప్రమాణబద్ధమైనదిగా పరిగణించటం లేదు.

హదీసు ఉల్లేఖకులు

అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) అన్సార్ వర్గానికి చెందినవారు. అన్సార్‌కు చెందిన తెగ బనీ మాజిన్ బిన్ నజార్ సభ్యులు. ఉహుద్ యుద్ధంలో పాల్గొన్నారు. యమామ పోరాటంలో వహ్‌షీతో కలసి బూటకపు ప్రవక్తగా అవతరించిన ముసైలమాను సంహరించారు. హిజ్రీ 63లో ఒక యుద్ధంలో అమరగతినొందారు. అబ్దుల్లాహ్ బిన్ జైద్, అంటే స్వప్నంలో అజాన్ పలుకులు విన్న సహాబీ అన్న సందేహం కలుగవచ్చు. కాని ఈయన ఆయన కాదు. ఈయన పేరు అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ ఆసిమ్. ఆయన పేరు అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ అబ్దె రబ్బిహీ. అంటే వీరిద్దరి తాతలు వేర్వేరు వ్యక్తులు అని మరువరాదు. ఇబ్నె అబ్దె రబ్బిహీ ప్రస్తావన అజాన్ సందర్భంగా వస్తుంది (ఇన్‌షాఅల్లాహ్).

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 32

33

హదీసు 33

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اَللَّهُ عَنْهُمَا ‏-فِي صِفَةِ اَلْوُضُوءِ‏- قَالَ: { ثُمَّ مَسَحَ ‏- صلى الله عليه وسلم ‏-بِرَأْسِهِ, وَأَدْخَلَ إِصْبَعَيْهِ اَلسَّبَّاحَتَيْنِ فِي أُذُنَيْهِ, وَمَسَحَ بِإِبْهَامَيْهِ عَلَى ظَاهِرِ أُذُنَيْهِ.‏ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ.

వుజూ గురించి హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) వివరిస్తూ ఇలా అన్నారు: “ఆయన ﷺ తన తలను మసహ్ చేశారు. అనంతరం తన రెండు చేతుల చూపుడు వ్రేళ్లను చెవులలోనికి జొప్పించారు, ఆపైన బొటన వ్రేళ్లతో చెవుల పై భాగాలను స్పృశించారు.” (దీనిని అబూ దావూద్ మరియు నసాయి ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ దీన్ని ప్రామాణికమైనదిగా ధృవీకరించారు).

English

Narrated Abdullah bin ‘Amr (rad) regarding the description of the ablution: “Then he (Allah’s Messenger (ﷺ)) wiped his head, inserted his index finger in his ears and wiped the exterior of his ears with thumbs”. [Reported by Abu Da’ud and An-Nasa’i and Ibn Khuzaima graded it Sahih (sound)].

సారాంశం

మహాప్రవక్త ముహమ్మద్ ﷺ చెవుల లోపలి భాగాలను, ఉపరి భాగాలను కూడా తడి చేతులతో స్పృశించారని ఈ హదీసు ద్వారా రుజువు లభిస్తోంది.

హదీసు ఉల్లేఖకులు

హదీసును ఉల్లేఖించిన సహాబీ పూర్తి పేరు అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ బిన్ వాయల్ సహ్మీ ఖురైషీ (రదియల్లాహు అన్హు). ఆయన తన తండ్రికన్నా ముందే ఇస్లాం స్వీకరించారు. తన తండ్రికన్నా కేవలం 13 ఏండ్ల చిన్నవారు. అగ్రశ్రేణి విద్వాంసులలో ఒకరు. హదీసు సంస్కర్త. నికార్సయిన దైవదాసుడు. పెద్ద సంఖ్యలో ప్రవక్త ప్రవచనాలను ఉల్లేఖించారు. మహాప్రవక్త ﷺ ఉపదేశాలను ఈయన ఎప్పటికప్పుడు లిఖించేవారు. హిజ్రీ 63 లేదా 70లో పరమపదించారు. అంత్యక్రియలు జరిగిన స్థలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. మక్కా అని కొందరు, తాయఫ్ అని కొందరు, ఈజిప్ట్ అని కొందరు అభిప్రాయపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 33

34

హదీసు 34

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا اِسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ مَنَامِهِ فَلْيَسْتَنْثِرْ ثَلَاثًا, فَإِنَّ اَلشَّيْطَانَ يَبِيتُ عَلَى خَيْشُومِهِ } مُتَّفَقٌ عَلَيْه ِ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరు నిద్ర మేల్కొన్నా మూడుసార్లు ముక్కు చీది శుభ్రం చేయాలి. ఎందుకంటే షైతాన్ ముక్కు పుటాలపై రాత్రిపూట సైరు చేస్తాడు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “When one of you wakes up from his sleep, he must blow of his nose three times, for the Satan spends the night inside one’s nostrils” [Agreed upon].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 34

35

హదీసు 35

وَعَنْهُ: { إِذَا اِسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ نَوْمِهِ فَلَا يَغْمِسُ يَدَهُ فِي اَلْإِنَاءِ حَتَّى يَغْسِلَهَا ثَلَاثًا فَإِنَّهُ لَا يَدْرِي أَيْنَ بَاتَتْ يَدَهُ } مُتَّفَقٌ عَلَيْهِ.‏ وَهَذَا لَفْظُ مُسْلِم ٍ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ద్వారానే ఈ విధంగా కూడా ఉల్లేఖించబడింది: “మీలో ఎవరు నిద్రనుండి మేల్కొన్నా మూడుసార్లు కడిగేదాకా తమ చేతులను నీళ్ల పాత్రలో ముంచరాదు. ఎందుకంటే రాత్రిపూట చేయి ఎక్కడెక్కడ సంచరించిందో (ఏ ఏ శరీర భాగాలను స్పృశించిందో, ముట్టు కుందో) అతనికి తెలియదు.” (బుఖారీ, ముస్లిం- పై హదీసులోని వాక్యాలు మాత్రం ‘ముస్లిం’లోనివి).

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “When one of you wakes up from his sleep, he must not put his hand in a utensil till he washed it three times, for he does not know where his hand was (while he slept)”. [Agreed upon. This is Muslim’s version].

సారాంశం

ఎవరు రేయింబవళ్ళలో గాఢనిద్ర నుంచి లేచినా వారు నీళ్ల పాత్రలో చేతులను ముంచే ముందు మూడుసార్లు శుభ్రంగా కడుక్కోవటం అభిలషణీయమని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. ఏ సైజు నీళ్ల పాత్ర అయినా సరే ఈ సూత్రమే వర్తిస్తుంది. అయితే కాలువ లేక సరస్సు లాంటి వాటి విషయంలో ఈ సూత్రం వర్తించదు. వాటిలో చేయి ముంచటం ధర్మసమ్మతమే. అల్లామా ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) కూడా ‘ఫత్‌హుల్ బారీ’లో ఈ అభిప్రాయాన్నే వెల్లడించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 35

36

హదీసు 36

وَعَنْ لَقِيطِ بْنُ صَبْرَةَ, ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَسْبِغْ اَلْوُضُوءَ, وَخَلِّلْ بَيْنَ اَلْأَصَابِعِ, وَبَالِغْ فِي اَلِاسْتِنْشَاقِ, إِلَّا أَنْ تَكُونَ صَائِمًا } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ. وَلِأَبِي دَاوُدَ فِي رِوَايَةٍ: { إِذَا تَوَضَّأْتَ فَمَضْمِضْ }.

హజ్రత్ లఖీత్ బిన్ సబ్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺప్రబోధించారు : “వుజూ సవ్యంగా పూర్తి చేయండి. వ్రేళ్ల మధ్య భాగాలను తడపండి. ముక్కులోనికి సరిగా నీరు ఎక్కించండి. అయితే ఉపవాస స్థితిలో మాత్రం ఇలా చేయకండి.” (అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ దీని ప్రామాణికతను ధృవీకరించారు). అబూదావూద్‌లోని ఉల్లేఖనంలో ఒక వాక్యం ఈ విధంగా ఉంది: “నీవు వుజూ చేసినపుడు పుక్కిలించు.”

English

Narrated Laqit bin Sabra (rad): Allah’s Mesenger (ﷺ) said: “Perform a perfect Wudu run (your fingers) through the fingers of the hands and the toes, and if not fasting, sniff water up well inside the nose”. [Reported by Al-Arba’a and Ibn Khuzaima graded it Sahih].

In another verson of Abu Da’ud is: “If you perform ablution rinse your mouth”.

సారాంశం

పై హదీసులో ‘ఖిలాల్’ అనే పదం వచ్చింది. ఖిలాల్ చేయటం అంటే వుజూ చేస్తున్న సమయంలో చేతుల మరియు కాలి వ్రేళ్ల మధ్య గల భాగాలు తడిసేలా వ్రేళ్లను జొప్పించి మరీ కడగటం అని అర్ధం. ఉపవాసమున్నపుడు ముక్కులోనికి చాలా జాగ్రత్తగా నీరు పోనివ్వాలి. అజాగ్రత్తగా వ్యవహరిస్తే ముక్కుద్వారా నీరు శరీరంలోనికి పోయి ఉపవాసం భంగమయ్యే ప్రమాదముంది.

హదీసు ఉల్లేఖకులు

హదీసు ఉల్లేఖకులైన లఖీత్ బిన్ సబ్ర (రదియల్లాహు అన్హు) పూర్తి పేరు లఖీత్ బిన్ సబ్ర బిన్ అబ్దుల్లాహ్ బిన్ మున్తఫిఖ్ బిన్ ఆమిర్ అల్ ఆమిరీ (రదియల్లాహు అన్హు). బనీ మున్తఫిఖ్ బృందానికి సారథిగా ఉన్నారని అనబడుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 36

37

హదీసు 37

وَعَنْ عُثْمَانَ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يُخَلِّلُ لِحْيَتَهُ فِي اَلْوُضُوءِ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ.

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఇలా వివరించారు : “దైవప్రవక్త ﷺ ‘వుజూ’ చేసే సమయంలో తన గడ్డం (లోపలికి చేతి వ్రేళ్లను జొప్పించి) ఖిలాల్ చేసేవారు.” (తిర్మిజీ- ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు).

English

Narrated ‘Uthman (rad): While performing Wudu, the Prophet (ﷺ) would run (his fingers) through his beard. [Reported by At-Tirmidhi and Ibn Khuzaima graded it Sahih].

సారాంశం

మహాప్రవక్త ﷺ స్వయంగా గడ్డాన్ని ఖిలాల్ చేసినట్లు ఆధారముంది గనక దీనిని పాటించటం సంప్రదాయం (మస్నూన్). అయితే ఇలా చేయటం తప్పనిసరి (వాజిబ్) మాత్రం కాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 37

38

హదీసు 38

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ زَيْدٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَتَى بِثُلُثَيْ مُدٍّ, فَجَعَلَ يَدْلُكُ ذِرَاعَيْهِ } أَخْرَجَهُ أَحْمَدُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “దైవప్రవక్త ﷺ సమక్షంలో రెండొంతుల ‘ముద్’ నీరు సమర్పించబడగా, ఆయన ﷺ చేతులను నలుపుతూ వుజూ కోసం ఉపక్రమించారు” (అహ్మద్ దీనిని ఉల్లేఖించగా, ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణిక హదీసుగా ధృవీకరించారు).

English

Narrated ‘Abdullah bin Zaid (rad): Two thirds of a Mudd (of water) was brought to he Prophet (ﷺ) (for ablution) so he began rubbing his arms. [Reported by Ahmed, and Ibn Khuzaima graded it Sahih].

సారాంశం

‘ముద్’ అనెది ఆనాటి ఒక కొలమానం. నేటి ఆధునిక పరిభాషలో అది ఆరువందల గ్రాముల బరువుకు సమానం. రెండు వంతుల ముద్ నీటితో మహాప్రవక్త ﷺ వుజూ చేసినట్లు బుఖారీ, ముస్లింల లోని హదీసులో కూడా ఉంది. వేరొక ఉల్లేఖనంలో ఒక ముద్ నీరు ఉపయోగించినట్లు ఉంది. వుజూ కోసం అనవసరంగా ఎక్కువ నీరు ఉపయోగించరాదనీ, వీలైనంత పొదుపరితనాన్ని పాటించాలని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 38

39

హదీసు 39

وَعَنْهُ, { أَنَّهُ رَأَى اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-يَأْخُذُ لِأُذُنَيْهِ مَاءً خِلَافَ اَلْمَاءِ اَلَّذِي أَخَذَهُ لِرَأْسِهِ.‏ } أَخْرَجَهُ الْبَيْهَقِيُّ، وَقَالَ: إِسْنَادُهُ صَحِيحٌ، وَصَحَّحَهُ التِّرْمِذِيُّ أَيْضًا. وَهُوَ عِنْدَ "مُسْلِمٍ" مِنْ هَذَا اَلْوَجْهِ بِلَفْظٍ: وَمَسَحَ بِرَأْسِهِ بِمَاءٍ غَيْرَ فَضْلِ يَدَيْهِ, وَهُوَ اَلْمَحْفُوظ ُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ వుజూ చేస్తుండగా ఈయన గమనించారు – ఆయన ﷺతలను మసహ్ చేయడానికి తీసుకున్న నీరునుగాక, చెవుల మసహ్ కోసం వేరుగా తీసుకునే వారు. (బైహఖీ దీనిని ఉల్లేఖించడమే గాక, దీని ప్రామాణికతను ధృవీకరించారు. తిర్మిజీ కూడా దీనిని ప్రమాణబద్ధమైనదిగా నిర్ధారించారు).

ముస్లింలోని ఉల్లేఖనంలో వాక్యం ఇలా ఉంది: “ఆయన ﷺ తలను మసహ్ చేశారు. కాని ఆ చేతుల్లో నీరు మిగిలి లేదు -” అంటే కొత్తగా నీరు తీసుకుని ఉపయోగించారు. ముస్లింలోని ఈ ఉల్లేఖనమే సురక్షితమైనది.”

English

Narrated ‘Abdullah bin Zaid (rad): He saw the Prophet (ﷺ) taking some water to wipe his ears other than the water he had taken to wipe his head. [Reported by Al-Baihaqi, who said that its Isnad (chain of narrators) is authentic and At-Tirmidhi also graded it Sahih].

And the words of the Muslim version are: “he wiped his head taking extra water from that he had taken for the washing of the hands”, and this Hadith is Al-Mahfuz.

సారాంశం

ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) కూడా చెవుల మసహ్ కోసం వేరుగా నీళ్లు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), సుఫియాన్ సౌరీ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం తద్భిన్నంగా ఉంది – “చెవులు కూడా తలకు అనుకునే ఉన్నాయి గనక వాటి ‘మసహ్’ కోసం మలి సారి నీరు తీసుకోవలసిన అవసరం లేదనీ, మొదటిసారి తీసుకున్న నీరే సరిపోతుంద”నీ వీరిరువురూ భావించారు. అత్యధిక సహీహ్ హదీసులు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 39

40

హదీసు 40

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: سَمِعْتَ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { "إِنَّ أُمَّتِي يَأْتُونَ يَوْمَ اَلْقِيَامَةِ غُرًّا مُحَجَّلِينَ, مِنْ أَثَرِ اَلْوُضُوءِ, فَمَنْ اِسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيلَ غُرَّتَهُ فَلْيَفْعَلْ.‏ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِم ٍ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) వివరించారు: “ప్రళయ దినాన నా ఉమ్మత్ (అనుచర సమాజం) ప్రజలు వుజూ కారణంగా తమ కాళ్లు చేతులు మెరిసిపోతున్న స్థితిలో హాజరవుతారు. (కనుక) మీలో ఎవరు ఎంతగా ఈ మెరుపును, వెలుగును పెంచగలుగుతారో అంతగా తప్పక పెంచుకోవాలి సుమా! (బుఖారీ, ముస్లిం – పదాలు మాత్రం ముస్లింలోనివి).

English

Abu Huraira (rad): I heard Allah’s Messenger (ﷺ) saying, “My people will come on the Day of Resurrection with bright faces, hands and feet from the traces of Wudu. If any of you can lengthen his brightness, let him do so”. [Agreed upon and this is Muslim’s version].

సారాంశం

ఈ హదీసు మతలబులు అనేకం కావచ్చు. వాటిలో ఒకటేమంటే, వుజూలోని శరీర భాగాలను నిర్ధారిత హద్దులకు మించి కడగటం. ఉదాహరణకు : చేతులను భుజాల వరకూ, కాళ్లను మోకాళ్ల వరకూ కడగటం. హదీసును ఉల్లేఖించిన అబూ హురైర (రదియల్లాహు అన్హు) గారు కూడా ఈ మతలబునే గ్రహించి, తదనుగుణంగా ఆచరించేవారు. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్)లు కూడా దీనినే ముస్తహబ్ (అభిలషణీయం)గా భావిస్తున్నారు. కాని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) దీనిని అభిలషణీయంగా భావించటం లేదు. వుజూలో ఏ శరీర భాగాలు ఎక్కడి వరకు కడగాలో నిర్ధారితమై ఉండటంచేత అంతకు మించిపోవలసిన అవసరం లేదంటారాయన.

వుజూలోని ప్రతి శరీర భాగాన్ని మూడేసిసార్లు కడగటం మంచిదన్నది మరో మతలబు కావచ్చు. మనిషి వుజూతో ఉండి కూడా పుణ్యార్జన ఉద్దేశ్యంతో తాజాగా వుజూ చేసుకుని ప్రార్ధన చేయటం వాంఛనీయం అన్నది ఇంకొక మతలబు అయి ఉండవచ్చు. ఎల్లవేళలా వుజూతో ఉండటం మంచిదన్నది కూడా వేరొక మతలబు కావచ్చు. అయితే ఇవన్నీ అంచనాపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని గమనించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 40

41

హదీసు 41

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُعْجِبُهُ اَلتَّيَمُّنُ فِي تَنَعُّلِهِ, وَتَرَجُّلِهِ, وَطُهُورِهُ, وَفِي شَأْنِهِ كُلِّهِ.‏ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు : “దైవప్రవక్త ﷺ చెప్పులు తొడిగినా, తల దువ్వుకున్నా, వుజూ చేసినా – ఏ పని చేసినాసరే (కుడి వైపునుంచి మొదలెట్టడాన్ని) ఇష్టపడేవారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated ‘Aisha (rad): Allah’s Messenger (rad) loved to begin with the right while putting on his shoes, combing his hair, in his purification and in all his affairs [Agreed upon].

సారాంశం

దైవప్రవక్త ﷺ ప్రతి మంచి పనినీ కుడివైపు నుంచి ప్రారంభించడాన్ని ఇష్టపడేవారు. ఉదాహరణకు : మస్జిద్‌లో అడుగుపెట్టాలన్నా, నమాజ్ ముగించిన తరువాత సలాం చేయాలన్నా, వుజూ చేసే సమయంలో వివిధ శరీరావయవాలను కడగటమైనా, కరచాలనం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, పాలు పితకాలన్నా, చొక్కా ధరించాలన్నా, కళ్ళల్లో సుర్మా పూసుకునేటప్పుడైనా, మిస్వాక్ చేసేటప్పుడయినా – కుడి చేత్తో చేయటం, కుడివైపు నుంచి మొదలెట్టడం ఆయన ﷺ సంప్రదాయం అయి ఉండేది. కాని నేటి ఆధునిక యుగపు ముస్లిం ఎంతో విలువైన ఈ విషయాలను విస్మరించి అన్యులను అనుకరిస్తున్నాడు. పాశ్చాత్యుల ప్రభావానికి లోనై కుడి బదులు ఎడమ వైపునకు మొగ్గు చూపుతున్నాడు. ఇదెంతో శోచనీయం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 41

42

హదీసు 42

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا تَوَضَّأْتُمْ فابدأوا بِمَيَامِنِكُمْ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీరు వుజూ చేయడానికి ఉపక్రమించినపుడు కుడి వైపు నుంచి మొదలెట్టండి.” (దీనిని అబూ దావూద్, నసాయి, తిర్మిజీ మరియు ఇబ్నె మాజాలు నలుగురూ ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ దీనిని ప్రమాణబద్ధమైనదని ఖరారు చేశారు).

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (rad) said: “When you perform ablution, begin with your right limbs”. [Reported by Al-Arba’a and garded Sahih by Ibn Khuzaima].

సారాంశం

ఈ హదీసు ద్వారా వెల్లడయ్యే దేమిటంటే, ఆయన ﷺకు కుడివైపే అత్యంత ఇష్టకరమయినది, ప్రియమైనది. ఆయన ﷺ స్వయంగా దీనిని ఆచరించటమేగాక, తన అనుచర సమాజాన్ని కూడా కుడి వైపునుంచి ఆరంభించండని ఆదేశించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 42

43

హదీసు 43

وَعَنْ اَلْمُغِيرَةِ بْنِ شُعْبَةٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-تَوَضَّأَ, فَمَسَحَ بِنَاصِيَتِهِ, وَعَلَى اَلْعِمَامَةِ وَالْخُفَّيْنِ.‏ } أَخْرَجَهُ مُسْلِم ٌ.

దైవప్రవక్త ﷺ వుజూ చేసినపుడు తన నుదుటి జుత్తుపై, తల పాగాపై, మేజోళ్ళపై మసహ్ చేశారని హజ్రత్ ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) తెలిపారు. (ముస్లిం)

English

Narrated Al-Mughira bin Shu’ba (rad): The Prophet (ﷺ) performed ablution and passed wet hands on his forelock, over the turban and over the two leather socks. [ Reported by Muslim].

సారాంశం

కేవలం నుదుటిపై మసహ్ చేయటం వల్ల తల భాగపు మసహ్ సంపూర్ణం కాజాలదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. కేవలం తల పాగాపై మసహ్ చేసినా సరిపోదని చాలామంది ఇమాములు అభిప్రాయపడ్డారు. అయితే అల్లామా ఇబ్నె ఖయ్యమ్ “జుల్మిఆద్” లో ఇలా విశదీకరించారు: “ఆయన ﷺ ఒక్కొక్కప్పుడు కేవలం నగ్న తలపై మసహ్ చేసేవారు. ఒక్కోసారి తలపాగాపై మసహ్ చేసేవారు. ఒక్కోసారి తలపాగా మరియు నుదురు – రెంటిపై మసహ్ చేసేవారు. ఆయన ﷺ కేవలం నుదుటిపై మసహ్ చేసినట్లు ఏ ఆధారమూ లేదు.

మేజోళ్ళపై మసహ్ చేయటం ధర్మసమ్మతమని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. తలపాగాపై మసహ్ చేయటం కూడా సరైనదేనని తెలియవస్తోంది. ఇది రెండు విధాలుగా సరైనది కావచ్చు. ఒకటి: కొంత మసహ్ తలపై చేసి మరికొంత తలపాగాపై చేయాలి. ఇందులో భేదాభిప్రాయం లేదు. రెండు: కేవలం తలపాగాపై మసహ్ చేయటం. తిర్మిజీలోని ఒక సహీహ్ హదీసు ద్వారా కూడా ఇది రూఢీ అవుతోంది. ప్రవక్త సహచరులలోని కొందరు ప్రముఖులు, ఇమాములు కూడా ఈ విధానాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది. అలాంటివారిలో కొందరు ప్రముఖులు : హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), అనస్ (రదియల్లాహు అన్హు), ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్), హసన్ బస్రీ (రహిమహుల్లాహ్), మక్‌హూల్ (రహిమహుల్లాహ్), అబూసూర్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఔజాయి (రహిమహుల్లాహ్), ఇస్‌హాఖ్ బిన్ రాహ్వే (రహిమహుల్లాహ్), వకీ (రహిమహుల్లాహ్) మొదలగువారు. మిగిలిన ప్రముఖ ఇమాములు, కేవలం తలపాగాపై మసహ్ చేస్తే సరిపోదని భావిస్తున్నారు.

హదీసు ఉల్లేఖకులు

ఈయన (ముగీరా బిన్ షూబ – రజి) కు గల మరో పేరు అబూ అబ్దుల్లాహ్ లేక అబూ ఈసా. వంశవృక్షం ప్రకారం ముగీరా బిన్ షూబ బిన్ మస్‌వూద్ సఖఫీ అనబడతారు. సుప్రసిద్ధ సహాబీలలో ఒకరు. కందక యుద్ధం జరిగే రోజుల్లో ఇస్లాం స్వీకరించారు. హిజ్రత్ చేసి మదీనా వచ్చారు. హుదైబియా ఒప్పందంలో పాల్గొన్నారు. ఆయన పాల్గొన్న మొదటి యుద్ధం అదే. అమీర్ ముఆవియ (రదియల్లాహు అన్హు) తరఫున కూఫా గవర్నర్‌గా నియమితులయ్యారు. హిజ్రీ 50వ సంవత్సరంలో కూఫాలోనే కన్నుమూశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 43

44

హదీసు 44

وَعَنْ جَابِرٍ بْنِ عَبْدِ اَللَّهِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا ‏-فِي صِفَةِ حَجِّ اَلنَّبِيِّ صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ‏- قَالَ ‏- صلى الله عليه وسلم ‏-{ اِبْدَؤُوا بِمَا بَدَأَ اَللَّهُ بِهِ } أَخْرَجَهُ النَّسَائِيُّ, هَكَذَا بِلَفْظِ اَلْأَمْر ِ وَهُوَ عِنْدَ مُسْلِمٍ بِلَفْظِ اَلْخَبَر ِ.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) గారు దైవప్రవక్త ﷺ వారి హజ్ విధానాన్ని వివరిస్తూ చెప్పారు – దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “అల్లాహ్ ఆరంభించినట్లుగానే ఆరంభించండి.” (నసాయి ‘ఆరంభించండి’ అని ఉల్లేఖించారు. కాగా, ఇమామ్ ముస్లిం ‘మేము ఆరంభిస్తున్నాం’ అని పేర్కొన్నారు).

English

Narrated Jabir bin ‘Abdullah (rad): Regarding the Hajj of the Prophet (ﷺ): He said, “Begin with what Allah had begun with” [ Reported by An-Nasa’i in this commanding version while Muslim has reported it in the reporting one].

సారాంశం

రచయిత ఈ హదీసును ‘వుజూ’ అధ్యాయంలో తీసుకొని వుజూ పరిధిలోనికి వచ్చే శరీరావయవాలను కడిగేటప్పుడు కూడా క్రమపద్ధతిని అవలంబించాలని చెప్పదలిచారు. ఏ శరీర భాగాన్ని మొదట కడగాలని ఖుర్‌ఆన్‌లో ఆదేశించబడిందో ఆ శరీర భాగాన్నే మొదట కడగాలి. దివ్యఖుర్‌ఆన్ హజ్ ఆచారాలను గురించి చెబుతూ ‘ఇన్నస్సఫా వల్ మర్వత’ అని అన్నది. అంటే హజ్‌లో ఒక ముఖ్య అంశమైన ‘సయీ’ సఫా పర్వతం వద్ద నుంచి మొదలెట్టాలని భావం.

అలాగే వుజూకు సంబంధించిన ఖుర్‌ఆన్ వాక్యంలో తొలుత ముఖం కడగాలని ఉంది. ఆ తరువాత ఇతర శరీర భాగాల ప్రస్తావన వస్తుంది. కాబట్టి ‘వుజూ’ కూడా దైవాదేశానికనుగుణంగా – సూచించబడిన క్రమ పద్ధతి ప్రకారం – చేయాలని హదీసు చెబుతోంది.

(మొదట ముఖం కడగటంతో వుజూ ప్రారంభించాలన్న వాక్యం చదివి సందేహానికి లోను కావలసిన అవసరం లేదు. వుజూలోని ‘ఫరాయజ్‌ల’ ప్రస్తావన మాత్రమే ఇక్కడ వచ్చిందిసుమా!)

– అనువాదకుడు

హదీసు ఉల్లేఖకులు

హదీసు ఉల్లేఖకులైన జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) గారి మరో పేరు అబూ అబ్దుల్లాహ్. అన్సార్‌కు చెందిన ‘సులమ్’ అనే తెగకు చెందిన వారవటంచేత ‘అన్సారీ సులమీ’ గా వ్యవహరించబడ్డారు. ప్రముఖ సహచరులలో ఒకరుగా పేరు మోసారు. వార్ధక్యంలో కంటిచూపు పోయింది. హిజ్రీ 75లో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 94. ఈయన మదీనా మునవ్వరాలో పరమపదించిన ఆఖరి సహాబి అని అనబడుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 44

45

హదీసు 45

وَعَنْهُ قَالَ: { كَانَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا تَوَضَّأَ أَدَارَ اَلْمَاءَ عَلَى مُرْفَقَيْهِ.‏ } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادِ ضَعِيف ٍ.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ వుజూ చేస్తున్నపుడు తమ మోచేతులపై బాగా నీరు పోసేవారు. (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు. ఈ హదీసు ప్రామాణికత రీత్యా బలహీనమైనది).

English

Narrated Jabir bin ‘Abdullah (rad): The Prophet (ﷺ) used to run the water down his elbows while performing ablution [Reported by Ad-Daraqutni with aweak chain of narrators].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 45

46

హదీసు 46

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا وُضُوءَ لِمَنْ لَمْ يَذْكُرِ اِسْمَ اَللَّهِ عَلَيْهِ } أَخْرَجَهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَابْنُ مَاجَهْ, بِإِسْنَادٍ ضَعِيف ٍ. وَالتِّرْمِذِيُّ عَنْ سَعِيدِ بْنِ زَيْد ٍ. وَأَبِي سَعِيدٍ نَحْوُه ُ. قَالَ أَحْمَدُ: لَا يَثْبُتُ فِيهِ شَيْء ٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు : “వుజూ ఆరంభిస్తున్న సమయంలో ‘బిస్మిల్లాహ్’ పఠించని వాని వుజూ కాదు.” (ఈ హదీసును అహ్మద్, అబూ దావూద్, ఇబ్నె మాజ ఉల్లేఖించారు. కాని దీన్ని వివరించిన తీరు మాత్రం బలహీనమైనది. తిర్మిజీ గారు ఈ హదీసును సయీద్ బిన్ జైద్ నుండి సంగ్రహించారు. అబూ సయీద్ నుండి కూడా ఇదేవిధంగా సేకరించారు. దీని గురించి ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) ఇలా పలికారు: “ఈ విషయమై ఏదీ రుజువు కాలేదు”).

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “There is no Wudu for one who does not mention Allah’s Name upon it. [Reported by Ahmad, Abu Da’ud and Ibn Majah with a weak chain of narrators].

At-Tirmidhi reported something similar to the above from Sa’id bin Zaid.

and Abu Sa’id like this.

and Ahmad said that nothing is authenticated in it.

సారాంశం

ముగ్గురు ఇమాముల దృష్టిలో వుజూ చేసేముందు “బిస్మిల్లాహ్” పఠించటం మస్నూన్ (సంప్రదాయం). ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్), దావూద్ జాహిరీల అభిప్రాయంలో వుజూకు ముందు ‘బిస్మిల్లాహ్’ చదవటం వాజిబ్ (తప్పనిసరి). ఉద్దేశ్యపూర్వకంగా బిస్మిల్లాహ్‌ను విడనాడిన వ్యక్తి వుజూ చేసినా అది వుజూ కాదు అని ఇస్హాఖ్ బిన్ రాహ్వే నొక్కి వక్కాణించారు.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును అందించిన సయీద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) పూర్తి పేరు – సయీద్ బిన్ జైద్ బిన్ అమ్ర్ బిన్ నఫీల్ అల్ అద్వి అల్ ఖురైషీ. అబుల్ ఆవర్ మరో పేరు. దైవప్రవక్త ﷺ నోట ప్రపంచంలోనే స్వర్గలోకపు శుభ వార్తను విన్న పదిమంది ప్రియసహచరులలో ఈయన ఒకరు. ఇస్లాంను స్వీకరించిన ప్రథమశ్రేణి సహచరులలో ఈయన కూడా ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి తోబుట్టువు ఫాతిమ బిన్తె ఖత్తాబ్ (రదియల్లాహు అన్హా) ఈయన సతీమణి. ఈ దంపతులు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను ఇస్లాం వైపునకు మరల్చటంలో కీలక పాత్ర పోషించారు. బద్ర్ సంగ్రామంతోపాటు, దైవప్రవక్త ﷺ పాల్గొన్న మిగిలిన యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. హిజ్రీ 51లో మరణించారు. జన్నతుల్ బఖీలో ఖననం చేయబడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 46

47

హదీసు 47

وَعَنْ طَلْحَةَ بْنِ مُصَرِّفٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ قَالَ: { رَأَيْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَفْصِلُ بَيْنَ اَلْمَضْمَضَةِ وَالِاسْتِنْشَاقِ.‏ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ بِإِسْنَادِ ضَعِيف ٍ.

హజ్రత్ తల్హా బిన్ ముసర్రిఫ్ (రహిమహుల్లాహ్) తన తండ్రి గారి నుండి, ఆయన తన తాత గారినుండి ఉటంకించారు : “నేను దైవప్రవక్త ﷺ గారిని నా కళ్ళారా చూశాను. ఆయన ﷺ పుక్కిలించడం కోసం, ముక్కులోనికి నీరు ప్రవేశింపజేయటం కోసం వేర్వేరుగా నీరు తీసుకునేవారు.” (ఈ ఉల్లేఖనాన్ని అబూదావూద్ బలహీనమైన ఆధారాలతో పొందుపరిచారు).

English

Narrated Talha bin Musarrif, quoting his father on the authority of his grandfather: “I saw Allah’s Messenger (ﷺ) rinsing his mouth and sniffing up and blowing his nose with separate scops of water.” [Reported by Abu Da’ud with a weak chain of narrators].

సారాంశం

ఈ హదీసు ద్వారా పుక్కిలించటం కోసం, ముక్కు కోసం వేర్వేరుగా నీరు తీసుకోవచ్చని వెల్లడవుతోంది. ప్రామాణికత రీత్యా రచయిత ఈ హదీసును బలహీనమైనదిగా ఖరారు చేశారు. దీనికి భిన్నంగా బుఖారీ, ముస్లింలలో వచ్చిన హదీసులలో దైవప్రవక్త ﷺ ఒకేసారి చేతిలో నీళ్ళు తీసుకుని పుక్కిలించటం, ముక్కులోనికి నీరు ఎక్కించటం చేసేవారు. రాబోయే హదీసులలో ఈ ప్రస్తావనను గమనించగలరు.

హదీసు ఉల్లేఖకులు

తల్హా బిన్ ముసర్రిఫ్ (రహిమహుల్లాహ్) గారి మరోపేరు అబూ ముహమ్మద్. ప్రవక్తగారి ప్రశిష్యుల (తాబయీల)లోనివారు. మేధావి వర్గానికి చెందినవారు. మధురాతి మధురంగా ఖుర్ఆన్‌ను పఠించేవారు. జ్ఞాని. హిజ్రీ 112లో కన్నుమూశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 47

48

హదీసు 48

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- ‏-فِي صِفَةِ اَلْوُضُوءِ‏- { ثُمَّ تَمَضْمَضَ ‏- صلى الله عليه وسلم ‏-وَاسْتَنْثَرَ ثَلَاثًا, يُمَضْمِضُ وَيَنْثِرُ مِنْ اَلْكَفِّ اَلَّذِي يَأْخُذُ مِنْهُ اَلْمَاءَ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ وَالنَّسَائِيّ ُ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) గారిచే వుజూ గురించి వివరించబడిన హదీసు : “దైవ ప్రవక్త ﷺ మూడుసార్లు పుక్కిలించారు. ముక్కులోనికి నీరు ఎక్కించారు. ఆయన ﷺ ఏ చేత్తో నీరు తీసుకున్నారో ఆ చేత్తోటే పుక్కిలించటం, ముక్కులోనికి నీరు పోయటం చేశారు.” (అబూదావూద్, నసాయి).

English

Narrated ‘Ali (rad) regarding performance of Wudu: The Prophet (ﷺ) rinsed his mouth and sniffed and blew (his nose) with water three times. He sniffed up and blew his nose with the same hand from which he took the water. [Reported by Abu Da’ud and An-Nasa’i]

సారాంశం

ఒకేసారి చేత్తో తీసుకున్న నీరును పుక్కిలించడానికి, ముక్కులోనికి పోయడానికీ ఉపయోగించవచ్చునని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. ఈ పనిని దైవప్రవక్త ﷺ మూడుసార్లు చేసేవారని కూడా తెలుస్తోంది. కుడిచేత్తో నోటిలో, ముక్కులో నీరు పోసేవారనీ, ఎడమచేత్తో ముక్కును పట్టి చీదేవారని నసాయిలో క్షుణ్ణంగా వివరించబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 48

49

హదీసు 49

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ زَيْدٍ ‏- رضى الله عنه ‏- ‏-فِي صِفَةِ اَلْوُضُوءِ‏- { ثُمَّ أَدْخَلَ ‏- صلى الله عليه وسلم ‏-يَدَهُ, فَمَضْمَضَ وَاسْتَنْشَقَ مِنْ كَفٍّ وَاحِدَةٍ, يَفْعَلُ ذَلِكَ ثَلَاثًا } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) వుజూ గురించి ఇలా వివరించారు : “దైవ ప్రవక్త ﷺ తన చేతిలో నీరు తీసుకున్నారు. తరువాత పుక్కిలించారు, ఆ తరువాత ముక్కు లోనికి నీరు ఎక్కించారు. ఒకే చేతిలో ఉన్న నీటితో ఆయన మూడుసార్లు ఈ విధంగా ఆచరించారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated ‘Abdullah bin Zaid (rad) regarding Wudu: The Prophet (ﷺ) put his hand (in the utensil) rinsed (his mouth) and sniffed up and blew (his nose) from one scoop (of water). He did that three times. [Agreed upon].

సారాంశం

పై రెండు హదీసులు కూడా పుక్కిలించడానికీ, ముక్కులోకి నీరు పోయడానికి ఒకేసారి చేత్తో తీసుకున్న నీరు సరిపోతుందని వెల్లడిస్తున్నాయి. పైగా ఇది అత్యంత పొదుపుతో కూడుకున్న విధానం కూడా. అయితే తల్హా బిన్ ముసర్రిఫ్ పేర్కొన్న హదీసు వేర్వేరుగా నీరు తీసుకోవాలని కోరుతున్నది. కాని అది వివరించబడిన తీరునుబట్టి బలహీనమైన హదీసుగా ఖరారు చేయబడింది. ఈ నేపథ్యంలో విజ్ఞులైన పండితులు వెల్లడించిన అభిప్రాయం ప్రకారం రెండింటిలో ఏ విధానాన్ని అనుసరించినా అది మస్నూన్ (ప్రవక్త విధానం) గానే పరిగణించబడుతుంది. అయితే “ఒకేసారి తీసుకున్న నీటితో పుక్కిలించటం, ముక్కులోనికి నీరు ఎక్కించటం” అన్న హదీసు ఎక్కువ ప్రామాణికమైనది. ప్రామాణిక మైన హదీసుకు ప్రాధాన్యత నివ్వటం సమంజసం కూడా.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 49

50

హదీసు 50

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { رَأَى اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-رَجُلًا, وَفِي قَدَمِهِ مِثْلُ اَلظُّفْرِ لَمْ يُصِبْهُ اَلْمَاءُ.‏ فَقَالَ: "اِرْجِعْ فَأَحْسِنْ وُضُوءَكَ" } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيّ ُ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ గారి దృష్టి ఒక వ్యక్తిపై పడింది. అతని కాలిపై గోరంత భాగం నీటితో తడవలేదు. ఆయన ﷺ ఆ వ్యక్తినుద్దేశ్యించి, “వెళ్ళి ఉత్తమ రీతిలో వుజూ చేసి రా” అని ఆదేశించారు. (అబూ దావూద్, నసాయి దీనిని ఉల్లేఖించారు).

English

Narrated Anas (rad): The Prophet (ﷺ) saw a man on whose foot appeared a portion like the size of a nail which was not touched by water. He then said, “Go back and perform your Wudu properly.” [Reported by Abu Da’ud and An-Nasa’i].

సారాంశం

నిర్ణీత కాళ్ళ భాగాన్ని పూర్తిగా తడిసేలా కడగాలని ఈ హదీసు స్పష్టం చేస్తున్నది. కాలిపై ఎంతభాగం తడవలేదో అంతవరకూ అది అగ్నికి ఆహుతి అవుతుందని ముస్లిం ఉల్లేఖించిన మరో హదీసులో హెచ్చరించబడింది. అబూ దావూద్‌లో ఖాలిద్ బిన్ మాదాన్ (రదియల్లాహు అన్హు) చేత ఉల్లేఖించబడిన ఒక హదీసులో దాదాపు ఇదే భావం వ్యక్తమవుతుంది. ఆ హదీసు ప్రకారం; ఒక వ్యక్తి నమాజ్ చేస్తుండగా అతనిపై ప్రవక్త ﷺ గారి దృష్టిపడింది. అతని అడుగు వెనుక భాగాన నీటితో తడవని కొద్ది భాగం స్పష్టంగా – ఒక మచ్చలాగా – కనిపించింది. ‘తాజాగా వుజూచేసి, ఆ తర్వాత నమాజ్ చేయి’ అని దైవప్రవక్త ఆ వ్యక్తిని ఆజ్ఞాపించారు. ఈ హదీసు ద్వారానూ, ఈ శీర్షిక క్రిందికి వచ్చే ఇతర హదీసుల ద్వారాను అవగతమయ్యేదేమిటంటే, వుజూలో కాళ్ళను కడగటం విధి (ఫర్జ్). కేవలం మసహ్ చేస్తే సరిపోదు. ఈ హదీసుల వెలుగులోనే నలుగురు ఇమాములు మరియు ధర్మశాస్త్రవేత్తలు కాళ్ళను విధిగా కడగాల్సిందేనన్న విషయంపై ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 50

51

హదీసు 51

وَعَنْهُ قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَتَوَضَّأُ بِالْمُدِّ, وَيَغْتَسِلُ بِالصَّاعِ إِلَى خَمْسَةِ أَمْدَادٍ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారి చేతనే ఉల్లేఖించబడిన మరో హదీసు ప్రకారం దైవప్రవక్త ﷺ ఒక ‘ముద్’ నీటితో వుజూ చేసేవారు. ఒక ‘సా’-అంటే నాలుగైదు ముద్‌ల నీటితో స్నానం చేసేవారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Anas (rad): Allah’s Messenger (ﷺ) used only one Mudd of water for ablution and one Sa’ to five Mudd of water for his bath [ Agreed upon].

సారాంశం

వుజూ కోసమయినా, స్నానం (గుసుల్) కోసమయినా వీలయినంత తక్కువగా నీరును ఉపయోగించాలనీ, నీటిని దుర్వినియోగం చేయరాదనీ ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అనవసరంగా నీటిని పారబోయటం షరీయత్ దృష్టిలో వాంఛనీయం కాదు.

హదీసులో ప్రస్తావించబడిన ‘సా’ అంటే నేటి ఆధునిక పరిభాషలో అది సుమారు రెండున్నర కిలో గ్రాములకు సరిసమానమవుతుంది.

ముస్లింలోని హదీసులో ఒక ‘ఫర్ఖ్’ నీళ్ళతో దైవప్రవక్త ﷺ స్నానం ముగించేవారని ఉంది. ‘ఫర్ఖ్’ ఆనాడు ఉపయోగంలో వున్న ఒక పాత్ర. అందులో సుమారు 9 సేర్ల నీరు పడుతుంది. ఒక ‘ఫర్ఖ్’ నీళ్ళను దైవప్రవక్త మరియు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) – ఇద్దరూ స్నానం కోసం సరిపెట్టుకునేవారని వేరొక ఉల్లేఖనం ద్వారా విదితమవుతుంది.

ఈ హదీసుల వెలుగులో నీటి పరిమాణాన్ని నిర్ధారించటం అసలు ఉద్దేశ్యం కాదనీ, దైవప్రవక్త ﷺ వారు ఇన్ని నీళ్ళతో స్నానం ముగించేవారని తెలియజెప్పటమే అసలు ఉద్దేశ్యమనీ ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 51

52

హదీసు 52

وَعَنْ عُمَرَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ, فَيُسْبِغُ اَلْوُضُوءَ, ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اَللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ, وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ, إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ اَلْجَنَّةِ" } أَخْرَجَهُ مُسْلِم ٌ. وَاَلتِّرْمِذِيُّ, وَزَادَ: { اَللَّهُمَّ اِجْعَلْنِي مِنْ اَلتَّوَّابِينَ, وَاجْعَلْنِي مِنْ اَلْمُتَطَهِّرِينَ }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవరు వుజూ చేస్తాడో మరియు ఉత్తమ రీతిలో వుజూ చేసి -‘అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేదనీ, ఆయన అద్వితీయుడనీ, ఆయనకు సహవర్తులెవరూ లేరనీ, నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్ ﷺ ఆయన దాసులనీ, ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను’ అని పలుకుతాడో అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలూ తెరువబడతాయి. ఇక అతను ఏ ద్వారం గుండానయినా స్వర్గంలోనికి ప్రవేశించవచ్చు.” (ముస్లిం, తిర్మిజీ). తిర్మిజీలో “ఓ దేవా! నన్ను పశ్చాత్తాపం చెందేవారిలో, పరిశుభ్రంగా ఉండేవారిలో చేర్చు” అన్న వాక్యం అదనంగా ఉంది.

English

Narrated ‘Umar (rad): Allah’s Messenger (ﷺ) said: “If one after performing ablution completely recites the following supplication: (Ash-hadu an la ilaha ill-Allahu wahdahu la sharika lahu, wa ash hadu anna Muhammadan ‘abduhu wa Rasuluhu) ‘I testify that there is no one worthy of worship but Allah, He is Alone and has no partner and Muhammad (ﷺ) is his slave and Messenger’, all the eight gates of Paradise will be opened for him and he may enter through any gate he wishes”.

Reported by Muslim and At-Tirmidhi who added the following words to the supplication: (Allahumma aj’alni minat-tawwabina waj’alni minAl-mutatahhirina) “Oh Allah! Include me among those who repent and those who keep themselves pure”.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి పూర్తి పేరు – ఉమర్ బిన్ ఖత్తాబ్ బిన్ నఫీల్ బిన్ అబ్దుల్ ఉజ్జా (రదియల్లాహు అన్హు). ‘అబూ హఫస్’ అనేది మరోపేరు. ఈయనది విశిష్టమైన వ్యక్తిత్వం. రెండవ ధర్మ ఖలీఫాగా పరిపాలన చేశారు. భూమండలాన్ని న్యాయం, ధర్మం, విజయాలతో పులకింపజేశారు. అజ్ఞానకాలంలో ఖురైష్ తెగకు ప్రతినిధిగా ఉండేవారు. దైవదౌత్యం అందిన 6వ యేట దైవప్రవక్త ﷺ చేతుల మీదుగా ప్రమాణం చేసి ఇస్లాం స్వీకరించారు. ఈయన ఇస్లాం స్వీకారంలో, ఈయన బావగారైన సయీద్ (రదియల్లాహు అన్హు), సోదరి అయిన ఫాతిమా బిన్తె ఖత్తాబ్ (రదియల్లాహు అన్హా) కీలకపాత్ర వహించారు. ఒక్క తబూక్ పోరాటం తప్ప మిగిలిన యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. ఈయన ఖిలాఫత్ కాలంలో ఇస్లాం విజయపరంపర కొనసాగింది. ఇరాక్, ఈరాన్, సిరియా, ఈజిప్టు తదితర ప్రాంతాలు ఇస్లామీయ రాజ్యపరిధిలోకి వచ్చేశాయి. ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) గారి బానిస అయిన అబూ లూలూ దాడి చేసి ఆయన్ని తీవ్రంగా గాయపరిచాడు. ఆ బాధతోనే ఆయన అమరగతినొందారు.ఈ సంఘటన హిజ్రీ 24వ సంవత్సరం ముహర్రం నెలలో జరిగింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.4 వుజూ|హదీసు 52