హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 1.2 వంట పాత్రలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, రెండవ అధ్యాయం: వంటపాత్రలు. ఈ అధ్యాయంలో 8 హదీసులు (హదీసు 14 – 21) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

1.2 వంటపాత్రలు

↑ విషయ సూచిక

باب الآنية

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

14

హదీసు 14

عَنْ حُذَيْفَةَ بْنِ الْيَمَانِ رَضِيَ الْلَّهُ عَنْهُمَا، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَشْرَبُوا فِي آنِيَةِ الذَّهَبِ والْفِضَّةِ، وَلَا تَأْكُلُوا فِي صِحَافِهَا، فَإِنَّهَا لَهُمْ فِي الدُّنْيَا، وَلَكُمْ فِي الْآخِرَةِ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “బంగారు, వెండి పాత్రలలో తినడం గానీ, త్రాగటంగానీ చేయకండి. ప్రాపంచిక జీవితంలో ఇవి అవిశ్వాసుల కొరకు ఉద్దేశించినవి. పరలోకంలో మాత్రం కేవలం మీకే ప్రత్యేకం.”

(బుఖారీ, ముస్లిం)

English

Narrated Hudhaifa bin Al-Yaman: Narrated Hudhaifa bin Al-Yaman (rad): Allah’s Messenger (ﷺ) said: “Do not drink in silver or gold utensils, and do not eat in plates of such metals, for such things are for them (the disbelievers) in this worldly life and for you in the Hereafter.” [Agreed upon]

సారాంశం

బంగారు, వెండి పాత్రలలో తినటం, త్రాగటం నిషిద్ధమనీ, అటువంటి పాత్రలను వుజూ కొరకు ఉపయోగించటం కూడా వాంఛనీయం కాదనీ ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. అయితే వజ్ర వైఢూర్యాలు, పగడాలు పొదగబడిన పాత్రలలో తినటం, త్రాగటం, వాటిని వుజూ కొరకు ఉపయోగించటం ధర్మసమ్మతమే. కాని బంగారు, వెండి నీరు (పూత) పట్టించిన పాత్రల్ని ఉపయోగించే విషయంపై అభిప్రాయ భేదం ఉంది. ఇలాంటి అనుమానాస్పద అంశాలలో సయితం జాగ్రత్తపడటం మంచిది.

హదీసు ఉల్లేఖకులు

హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) గారి మరో పేరు అబూ అబ్దుల్లాహ్. సుప్రసిద్ధ సహాబీ. దైవప్రవక్త ﷺకు ఎంతో సన్నిహితులు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన నలభై రోజులకు ఈయన గారు మదయన్లో – హిజ్రీ 36వ సంవత్సరంలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 14

15

హదీసు 15

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ الْلَّهُ عَنْهَا، قَالَتْ: قَالَ رَسُولُ الْلَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ الَّذِي يَشْرَبُ فِي إِنَاءِ الْفِضَّةِ إِنَّمَا يُجَرْجِرُ فِي بَطْنِهِ نَارَ جَهَنَّمَ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రబోధించారు: “వెండి పాత్రలలో (తినే) త్రాగేవాడు తన పొట్టను నరకాగ్నితో నింపుకుంటాడు.”

(బుఖారీ, ముస్లిం)

English

Narrated Umm Salama: Narrated Umm Salama (rad): Allah’s Messenger (ﷺ) said: “He who drinks in a silver utensil is only swallowing Hell-fire in his stomach”. [Agreed Upon]

సారాంశం

ఈ హదీసులో కూడా బంగారు, వెండి పాత్రలను ఉపయోగించడంపై వారింపు ఉంది. ఈ వారింపును ఖాతరు చేయని వారికి పట్టే గతి ఏమిటో కూడా స్పష్టపరచబడింది.

హదీసు ఉల్లేఖకులు

ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) గారి అసలు పేరు ‘హింద్ బిన్తె అబూ ఉమయ్య.’ అబూ సలమా అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అస్వద్ మఖ్జూమీ గారి సతీమణి. అబిసీనియా (నేటి ఇథియోపియా)కు మొదట హిజ్రత్ చేసిన అనుయాయులలో ఈమె కూడా ఉన్నారు. ఉహుద్ సంగ్రామంలో కలిగిన గాయం వల్ల అబూ సలమా మరణించారు. ఆయన మరణానంతరం హిజ్రీ 4వ సంవత్సరం షవ్వాల్ నెలలో మహాప్రవక్త ﷺ ఉమ్మె సలమాను తన దాంపత్యంలోకి తెచ్చుకున్నారు. హిజ్రీ 59 లేక 62లో ఈమె మరణించారు. అప్పటికి ఆమెకు 84 ఏళ్ళు. జన్నతుల్ బఖీలో అంత్యక్రియలు జరిగాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 15

16

హదీసు 16

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ الْلَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ الْلَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا دُبِغَ الْإِهَابُ فَقَدْ طَهُرَ } أَخْرَجَهُ مُسْلِمٌ. وَعِنْدَ الْأَرْبَعَةِ: { أَيُّمَا إِهَابٍ دُبِغَ }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వివరించారు: “ముడి చర్మాన్ని లవణాలతో రంగరిస్తే (రసాయనిక ప్రక్రియలో పెడితే) అది పరిశుభ్రమైపోతుంది” (ముస్లిం). సుననె అరబాలో ఈ పదాలు కూడా ఉన్నాయి – “ఏ చర్మమైనా సరే దాన్ని రంగరించవచ్చు).”

English

Narrated Ibn ‘Abbas: Narrated (rad): Allah’s Messenger (ﷺ) said: "When the skin is tanned it becomes purified.” [Reported by Muslim]. Al-Arba’a have the words: "Any skin that is tanned … "

సారాంశం

అన్ని రకాల చర్మాలు, అన్ని కోవలకు చెందిన జంతువుల చర్మాలు ఇందులోకి వస్తాయని హదీసు ద్వారా అర్థం వస్తోంది. అయితే పంది చర్మం మాత్రం దీనికి వర్తించదు. చాలామంది ధర్మవేత్తల దృష్టిలో కుక్క చర్మం కూడా ఈ వినాయింపులోనికి వస్తుంది. ఏ ఏ జంతువుల, మృగాల మాంసం తినకూడదో ఆ చర్మాలు సయితం ఉపయోగంలోనికి తేవచ్చునని పరిశోధన జరిపిన పండితులు నిర్ధారించారు.

హలాల్ జంతువు అయినా, హరామ్ జంతువు అయినా, జిబహ్ చేయబడిన జంతువు అయినా, సహజ మరణం పొందిన జంతువు అయినా రసాయనిక ప్రక్రియ అనంతరం అది పరిశుభ్రమైపోతుందని పై హదీసు ద్వారా స్పష్టంగా అవగతమవుతున్నది. ఈ సాధారణ సూత్రాన్ని అన్వయించిన మీదట కూడా కొన్ని రకాల జంతు చర్మాలు ఉప్పు పట్టించిన తరువాత పరిశుభ్రం మరియు ధర్మ సమ్మతం కాజాలవు. ఉదాహరణకు : పంది. అది ‘నజసె ఐన్’ (పరమ అశుద్ధం) కావటం మూలంగా దాని చర్మం సయితం అశుద్ధంగానే భావించబడుతోంది. అలాగే మానవ చర్మం కూడా దానికున్న వైశిష్ట్యం, ఔన్నత్యం కారణంగా ఉపయోగంలోకి తేవటం నిషేధించబడింది. తక్బీర్ పలికి కోయబడిన పక్షంలో కుక్క, పంది చర్మాలను కూడా ఉపయోగించవచ్చునని కొంతమంది అభిప్రాయపడ్డారు. కాని ఈ అభిప్రాయం సరైనది కాదు. అలాగే రసాయనిక ప్రక్రియ అనంతరం కుక్క చర్మాన్ని కూడా పరిశుభ్రమైనది (సమ్మతమైనది)గా కొంతమంది ధర్మవేత్తలు భావించటం కూడా సముచితం అనిపించదు.

ఏ ఏ జంతువుల చర్మాలు రసాయనిక ప్రక్రియ అనంతరం పరిశుద్ధమవుతాయో వాటి కొమ్ములు, వెంట్రుకలు, దంతాలు, ఎముకలను కూడా ఉపయోగంలోకి తీసుకురావచ్చు. వాటి క్రయ విక్రయాలు జరపవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 16

17

హదీసు 17

وَعَنْ سَلَمَةَ بْنِ الْمُحَبِّقِ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ الْلَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ دِبَاغُ جُلُودِ الْمَيْتَةِ طُهُورُهاَ } صَحَّحَهُ ابْنُ حِبَّانَ.

హజ్రత్ సలమ బిన్ ముహబ్బిఖ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త ﷺ ప్రవచించారు – “మృత జంతువుల చర్మాలను (ఉప్పు తదితర పదార్థాలతో) రంగరించటమే వాటి శుచీ శుభ్రత.” (ఇబ్నె మాజ దీని ప్రామాణికతను ధృవీకరించారు).

English

Narrated Salama bin Al-Muhabbiq: Narrated (rad): Allah’s Messenger (ﷺ) said: “The tanning of a dead animal’s skin purifies it”. [Ibn Hibban graded it Sahih (sound)].

హదీసు ఉల్లేఖకులు

సలమగారి వేరొక పేరు అబూ సుఫ్యాన్. బస్రీ సహాబీలలో ఒకరుగా పరిగణించబడతారు. ఆయన హునైన్ యుద్ధంలో నిమగ్నులై ఉండగా, ఆయనకు ఆయన పుత్రుడు ‘సినాన్’ పుట్టాడన్న శుభవార్త ఇవ్వబడింది. ఆ సమయంలో ఆయన ఇలా పలికారు : “ఈ శుభవార్త వల్ల కలిగిన ఆనందం దైవప్రవక్త ﷺ కు రక్షాకవచంగా నిలిచి నేను బాణం ప్రయోగించినపుడు కలిగిన ఆనందం కన్నా ఎక్కువేమీ కాదు.”

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 17

18

హదీసు 18

وَعَنْ مَيْمُونَةَ رَضِيَ الْلَّهُ عَنْهَا، قَالَتْ: { مَرَّ النَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِشَاةٍ يَجُرُّونَهَا، فَقَالَ: "لَوْ أَخَذْتُمْ إِهَابَهَا؟" فَقَالُوا: إِنَّهَا مَيْتَةٌ، فَقَالَ: "يُطَهِّرُهَا الْمَاءُ وَالْقَرَظُ" } أَخْرَجَهُ أَبُو دَاوُدَ، وَالنَّسَائِيُّ.

హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం: “దైవప్రవక్త ﷺ సాగిపోతున్న దారిలో కొంత మంది చనిపోయిన మేకను ఈడ్చుకుంటూ వెళ్ళడం గమనించారు. ఆయన ﷺ వాళ్ళ నుద్దేశ్యించి, “మీరు దీని చర్మాన్ని వలచుకున్నా బావుండేదే!” అని అన్నారు. ‘ఇది చచ్చి పోయింది కదా!’ అని వాళ్ళు సందేహ పడ్డారు. “(చచ్చిపోతే మాత్రం ఏమయింది?) దీనిని నీరు మరియు తుమ్మ బెరడు పరిశుభ్రపరుస్తాయి కదా!” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు.” (అబూ దావూద్, నసాయి)

English

Narrated Maimuma: Narrated (rad): Some people dragging a (dead) goat passed by the Prophet (ﷺ). He told them, “Had you better taken its skin”. They said, “It is dead”. He said, “Water and the leaves of the Acacia tree will purify it”. [Reported by Abu Da’ud and An’Nasa’i].

సారాంశం

మృత జంతువుల చర్మాలు రసాయనిక ప్రక్రియ ద్వారా శుభ్రమవుతాయనీ, అటువంటి చర్మాలతో తయారుచేయబడిన వస్తువులు, పాత్రలతో ‘వుజూ’ సయితం చేయవచ్చుననీ ఈ హదీసు ద్వారానూ, ఇంతకు ముందు వచ్చిన రెండు హదీసుల ద్వారానూ బోధపడుతోంది.

చనిపోయిన చతుష్పాదాల చర్మం వలచి రంగరించినట్లయితే అవి పరిశుభ్రంగా తయారవుతాయి. అటువంటి చర్మాలతో నీళ్ళు తోడవచ్చు. నీళ్ళ తిత్తి కూడా తయారుచేయవచ్చు. ఇతరత్రా కూడా వాటిని ఉపయోగించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 18

19

హదీసు 19

وَعَنْ أَبِي ثَعْلَبَةَ الْخُشَنِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: { قُلْتُ: يَا رَسُولَ الْلَّهِ، إِنَّا بِأَرْضِ قَوْمٍ أَهْلِ كِتَابٍ، أَفَنَأْكُلُ فِي آنِيَتِهِمْ؟ قَالَ: "لَا تَأْكُلُوا فِيهَا، إِلَّا أَنْ لَا تَجِدُوا غَيْرَهَا، فَاغْسِلُوهَا، وَكُلُوا فِيهَا" } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ సాలబ ఖుష్నీ (రదియల్లాహు అన్హు) కథనం: ‘ఓ దైవ ప్రవక్తా ﷺ! మేము గ్రంథవహుల ప్రాంతంలో ఉంటాము. వారు ఉపయోగించే పాత్రలలో మేము భోజనం చేయవచ్చా?’ అని నేను ప్రశ్నించాను. దీనికి సమాధానంగా ఆయన ﷺ ఇలా ప్రబోధించారు: “వారి పాత్రలలో తినకండి. అయితే ఒకవేళ వారి పాత్రలు తప్ప అసలు పాత్రలే లేనపుడు వాటిని శుభ్రంగా కడిగి వాటిలో తినవచ్చు.”

(బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Tha’laba Al-Khushni: Narrated (rad): I said “O Allah’s Messenger! We are living in a land inhabited by the people of the Scriptures; can we take our meals in their utensils?” He said, “If you can get utensils other than theirs, do not eat in theirs, but if you cannot get other than theirs, wash them and eat in them” [Agreed upon].

సారాంశం

గ్రంథవహులు – అంటే యూదులు, క్రైస్తవులు – ఉపయోగించే పాత్రలలో తినటం, త్రాగటం, వుజూ చేయడం ధర్మసమ్మతం కాదని ఈ హదీసు సూచిస్తోంది. కారణం సుస్పష్టమే. వాళ్ళు ధర్మ సమ్మతం కాని మాంసాహారాలు అందులో వండుతారు. తింటారు. గ్రంథవహుల పాత్రలలో తినటం, త్రాగటమే ధర్మ సమ్మతం కానపుడు ఇతర మతాల వారు, నాస్తికులు ఉపయోగించే పాత్రలలో తినటం, త్రాగటం కూడా ధర్మసమ్మతం కాజాలదు.

హదీసు ఉల్లేఖకులు

అబూ సాలబ ఖుష్నీ ‘బైతె రిజ్వాన్’ సహచర బృందంలో ఒకరు. ఆయన తన తెగవారి వైపునకు పంపబడగా వారంతా ఇస్లాం స్వీకరించారు. సిరియాలో స్థిరపడ్డారు. హి.శ. 75వ యేట పరమపదించారు. ఆయన నమాజ్ చేస్తూ ఉండగా – సజ్దాలో ఉండగా – ఆత్మ ఊర్ధ్వలోకాలకు ప్రస్థానం చేసింది. ఈయనగారి అసలు పేరు గురించి తీవ్రమయిన భేదాభిప్రాయం ఉంది. మారు పేరుతోనే వినుతికెక్కారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 19

20

హదీసు 20

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ الْلَّهُ عَنْهُمَا؛ { أَنَّ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-وَأَصْحَابَهُ تَوَضَّئُوا مِنْ مَزَادَةِ اِمْرَأَةٍ مُشْرِكَةٍ.‏ } مُتَّفَقٌ عَلَيْهِ، فِي حَدِيثٍ طَوِيلٍ.

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవప్రవక్త ﷺ మరియు ఆయన సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఒక ముష్రిక్కు స్త్రీ నీళ్ళ తిత్తి నుండి నీరు తీసుకుని ‘వుజూ’ చేశారు.” (బుఖారీ, ముస్లిం – ఇదొక సుదీర్ఘ హదీసులోని భాగం)

English

Narrated ‘Imran bin Hussain (rad): The Prophet (ﷺ) and his Companions performed Wudu (ablution) from a skin water container belonging to a polytheist woman [Agreed upon]. (It is an extract of a long Hadith).

సారాంశం

ఈ హదీసు ద్వారా గ్రంథవహుల పాత్రలేగాక, బహుదైవారాధకుల వినియోగంలోనున్న పాత్రలు సయితం పరిశుద్ధమైనవన్న సంగతి విదితమవుతోంది. మృత జంతువు యొక్క చర్మం రసాయనిక ప్రక్రియ అనంతరం పరిశుద్ధమైపోతుందన్న సంగతి కూడా మరోసారి ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. ఎందుకంటే ఆయన ﷺ తీసుకున్న నీళ్ళతిత్తి ఒక అవిశ్వాస స్త్రీ అధీనంలోనిది. అవిశ్వాసులు కోసిన జంతువు నుండి తీసిన చర్మంతో ఆ తోలు తిత్తి తయారుచేయబడింది. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే అవిశ్వాసులు ఉపయోగించే పాత్రలలో – నిషిద్ధ వస్తువులు లేవని నిర్ధారణ అయినపుడు – నిస్సంకోచంగా వాటిని వాడుకోవచ్చు.

హదీసు ఉల్లేఖకులు

ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) అగ్రశ్రేణి సహాబాలో ఒకరుగా పేర్కొనబడతారు. ఈయనకు గల మరో పేరు అబూ నుజీద్. ఖైబర్ యుద్ధకాలంలో ఇస్లాంలో చేరారు. బస్రాలో స్థిరపడ్డారు. బస్రాలోనే హి.శ. 52 లేక 53లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 20

21

హదీసు 21

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ قَدَحَ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-اِنْكَسَرَ، فَاتَّخَذَ مَكَانَ الشَّعْبِ سِلْسِلَةً مِنْ فِضَّةٍ.‏ } أَخْرَجَهُ الْبُخَارِيُّ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ గారి స్వంత పాత్ర ఒకటి విరిగిపోగా, విరిగిన చోట ఆయన ﷺ వెండి తారుతో కుట్టి అతుకు వేశారు.” (బుఖారీ)

English

Narrated Anas bin Malik: Narrated Anas bin Malik (rad): When the cup of the Prophet (ﷺ) got broken, he fixed it with a silver wire at the crack [Reported by Al-Bukhari].

సారాంశం

విరిగిపోయిన, తెగిపోయిన, చినిగిపోయిన వస్తువులను జోడించే నిమిత్తం కొద్దిపాటి వెండి తారును ఉపయోగించటంలో తప్పులేదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. అదే విధంగా తినే, త్రాగే పాత్రలలో అక్కడక్కడా – కొద్దిగా -వెండి బంగారు నగిషీ ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించవచ్చు. వుజూ, గుసుల్ కోసం కూడా ఆ పాత్రలను నిస్సంకోచంగా వాడుకోవచ్చు. అయితే అధిక మోతాదులో లేక పూర్తిగా బంగారు, వెండి ఉన్న పాత్రలను ఉపయోగించకూడదు. అలా ఉపయోగించటంవల్ల గర్వం, డాబు, దర్పం వ్యక్తమవుతాయి. ఇలాంటి డాబుసరిని, బడాయితనాన్ని సృష్టికర్త ఇష్టపడడు. అందుకే వాటి వాడకం అధర్మంగా ఖరారు చేయబడింది. కాకపోతే విరిగిపోయిన, తెగిపోయిన వాటిని జోడించే, కుట్లువేసే ఉద్దేశ్యంతో తారు ఉపయోగిస్తే అది అభ్యంతరకరం కాదు. అలా చేయటంలో గర్వం, బడాయి వ్యక్తం కావు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.2 వంటపాత్రలు|హదీసు 21