హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 86వ అధ్యాయం: వాగ్దాన పాలన. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 689 – 691) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
86. వాగ్దాన పాలన
باب الوفاء بالعهد وَإنجاز الوَعد
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు:
{وَأَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كَانَ مَسْؤُولاً} [الإسراء: ٣٤]
"చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది." (అల్ ఇస్రా : 34)
{وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدْتُمْ} [النحل: ٩١]
"మీరు అల్లాహ్తో ఏదయినా వాగ్దానం చేసివుంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి." (అన్ నహ్ల్ : 91)
{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لا تَفْعَلُونَ،كَبُرَ مَقْتاً عِنْدَ اللَّهِ أَنْ تَقُولُوا مَا لا تَفْعَلُونَ} [الصف:٢-٣]
"విశ్వాసులారా! మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారెందుకు? మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లాహ్ దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం." (అస్ సఫ్ : 2, 3)
వివరణ :
ప్రమాణాలు లేక వాగ్దానాల్లో రెండు రకా లున్నాయి. అందులో ఒకటి, మనుషులు పరస్పరం చేసుకునే వాగ్దానాలు, ప్రమాణాలు. దైనందిన జీవితంలో మానవుల మధ్య జరిగే లావాదేవీలు, వ్యవహారాలన్నీ కూడా దాని క్రిందికే వస్తాయి. ఇకపోతే రెండవ రకమైన వాగ్దానం, మనిషి తాను పుట్టకముందు తను ఒక్క దేవుణ్ణి మాత్రమే పూజిస్తానని అల్లాహ్తో చేసిన వాగ్దానం. దాన్నే "అలస్తు వాగ్దానం" అని అంటారు. అదేవిధంగా మనిషి విశ్వసించి నప్పుడు కూడా తను దైవాదేశాలకు అను గుణంగా నడుచుకుంటానని వాగ్దానం చేస్తాడు. మనిషి ఈ రెండు రకాల ప్రమాణాల్ని, వాగ్దానాలను నెరవేర్చాలని షరీఅత్ ఆదేశి స్తోంది.
English
“And fulfill (every) covenant. Verily! The covenant will be questioned about. [Al-Isrā’ 17:34]
“And fulfill the Covenant of Allah (Bai`ah: pledge for Islam) when you have covenanted.” [An-Naḥl 16:91]
“O you who believe! Fulfill (your) obligations.” [Al-Mā’idah 5:1]
హదీసు 689
عن أبي هريرة رضي اللَّه عنه، أن رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "آيَةُ المُنَافِقِ ثَلاثٌ: إِذَا حَدَّث كَذب، وَإِذَا وَعدَ أخلَف، وَإِذَا اؤْتُمِنِ خَانَ" متفقٌ عَلَيهِ. زَادَ في روايةٍ لمسلم: "وإنْ صَامَ وصَلَّى وَزَعَمَ أَنَّهُ مسلِمٌ".
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : కపట విశ్వాసికి మూడు లక్షణాలుంటాయి.
– అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు.
– ఏదయినా వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు.
– అతని దగ్గర ఏదయినా వస్తువు అప్పగింత (అమానతు)గా పెడితే అందులో నమ్మకద్రోహానికి పాల్పడతాడు. (బుఖారీ – ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో, "అతను ఉపవాసాలు పాటిస్తూ, నమాజులు చేస్తూ తాను ముస్లింనని ప్రకటించుకున్నా సరే!" అన్న వాక్యం అదనంగా ఉంది.
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Three are the signs of a hypocrite: When he speaks, he lies; when he makes a promise, he breaks it; and when he is trusted, he betrays his trust.”[Al-Bukhari and Muslim].
Another narration adds the words: “Even if he observes Saum (fasts), performs Salat (prayer) and claims to be a Muslim.”
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|86. వాగ్దాన పాలన|హదీసు 689
హదీసు 690
وعن عبدِ اللَّهِ بن عمرو بن العاص رضي اللَّه عنهما، أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أرْبع مِنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقاً خَالِصاً. ومنْ كَانَتْ فِيه خَصلَةٌ مِنْهُنَّ كانَتْ فِيهِ خَصْلَة مِن النِّفاقِ حَتَّى يَدَعَهَا: إِذَا اؤُتُمِنَ خَان، وإذَا حدَّثَ كذَبَ، وَإذا عَاهَدَ غَدَر، وَإذا خَاصَم فَجَرَ" متفقُ عَلَيْهِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: ఈ (క్రింద పేర్కొనబడే) నాలుగు లక్షణాలు ఎవరిలోనయినా ఉంటే అతను పచ్చి కపటి అని అనుకోవాలి. (అన్నీ లేక పోయినా) వాటిలో ఏ ఒక్క లక్షణమున్నా దాన్ని విడనాడనంతవరకూ అతనిలో ఒక కపట లక్షణమున్నట్లు భావించాలి.
– అప్పగింతలో ద్రోహానికి పాల్పడటం.
– మాట్లాడితే అబద్ధం చెప్పటం.
– వాగ్దానం చేసి మోసానికి పాల్పడటం.
– కొట్లాడినప్పుడు తిట్లపురాణం మొదలెట్టడం. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని ప్రమాణాలు, మొక్కుబడుల ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Four are the qualities which, when found in a person, make him a sheer hypocrite, and one who possesses one of them, possesses one characteristic of hypocrisy until he abandons it. These are: When he is entrusted with something, he betrays trust; when he speaks, he lies; when he promises, he acts treacherously; and when he argues, he behaves in a very imprudent, insulting manner.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మనసులో ఇస్లాం పట్ల వైరాన్ని, అక్కసును దాచిపెట్టుకొని పైకి మాత్రం తాము ముస్లింలమని చెప్పుకునే కుటిల స్వభావాన్ని 'కపట విశ్వాసం' అని అంటారు. దైవప్రవక్త ﷺ హయాంలో ఇలాంటి కపటులు చాలామంది ఉండేవారు. వారిలో పై హదీసులో సూచించబడిన లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి. కాని వారి మనసుల్లో ఉన్న కుళ్ళును ముస్లింలెవరూ తెలుసుకోలేకపోయేవారు. ఆఖరికి దైవప్రవక్త ﷺకు కూడా తన సాహచర్యంలో ఉంటున్నవారిలో కపట విశ్వాసుల్ని కనిపెట్టడం కష్టంగా ఉండేది. అయితే దేవుడు తన ప్రవక్తకు 'వహీ' వాణి ద్వారా నికార్సయిన ముస్లింలెవరో, కపట ముస్లింలెవరో తెలియజేశాడు. కాని ఈ రోజుల్లో కపట విశ్వాసుల్ని కనిపెట్టే విశ్వసనీయమైన మార్గాలేవీ లేవు. అయినప్పటికీ వారి నడవడికలో కాపట్య లక్షణాలు ప్రస్ఫుటమవుతుంటాయని, దానిద్వారా కపటుల్ని గుర్తించవచ్చని హదీసులు ఉద్ఘాటిస్తున్నాయి.
పండితుల అభిప్రాయం ప్రకారం కాపట్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, విశ్వాసంలో కాపట్యం. రెండోది, ఆచరణాత్మకమైన కాపట్యం. విశ్వాసంలో కాపట్యమంటే, మనసులో దైవతిరస్కార భావాన్ని దాచిపెట్టుకొని పైకి దైవంపై విశ్వాసాన్ని ప్రకటించటం. నేడు ముఖ్యంగా కమ్యూనిస్ట్, సెక్యులర్ భావాలుగల ముస్లిం ఇళ్ళల్లో పుట్టేవారు ఇలాంటి విశ్వాసులే అయి ఉంటారు. ఇకపోతే రెండవ రకమైన కాపట్యం ఏమిటంటే, మనసులో స్వచ్ఛమైన విశ్వాసమున్నప్పటికీ ఆచరణలో కపటచేష్టలు జరిగిపోతుంటాయి. దురదృష్టవశాత్తూ నేడు ముస్లింలలో చాలా మంది ఈ ఆచరణాత్మకమైన కపటరోగానికే గురై ఉన్నారు. అల్లాహ్ అన్ని రకాల కాపట్య స్వభావాల నుండి మన మనసుల్ని ప్రక్షాళనం చేయుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|86. వాగ్దాన పాలన|హదీసు 690
హదీసు 691
وعن جابرٍ رضي اللَّه عنه قَالَ: قَالَ لِي النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَوْ قدْ جاءَ مالُ الْبَحْرَيْن قد أعْطَيْتُكَ هكَذا وهكذا وَهَكَذا" فَلَمْ يَجيءْ مالُ الْبحْرَيْنِ حَتَّى قُبِضَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَلَمَّا جَاءَ مَالُ الْبَحْرَيْن أَمَرَ أبُو بَكْرٍ رضي اللَّه عنه فَنَادى: مَنْ كَانَ لَهُ عنْدَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عِدَةٌ أوْ دَيْنٌ فَلْيَأْتِنَا. فَأتَيتُهُ وقُلْتُ لَهُ: إنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ لي كَذَا وكَذَا، فَحثَى لي حَثْيَةً، فَعدَدْتُها، فَإذا هِي خَمْسُمِائَةٍ، فَقَالَ لِي: خُذْ مثْلَيْهَا. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ నాతో, "బహ్రైన్ నుండి ధనం గనక వస్తే నేను నీకు ఇంతింత ఇస్తాను" అని అన్నారు. కాని ఆయన జీవించి ఉన్నంతవరకూ బహ్రైన్ నుండి ధనం రాలేదు. ఆఖరికి ఆయన ఇహలోకం వీడిపోయారు. ఆ తర్వాత బహ్రైన్ నుండి ధనం వచ్చింది. అప్పుడు (ఖలీఫాగా ఉన్న) హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), "దైవప్రవక్త ﷺ ఎవరికయినా ఏదయినా ఇస్తానని వాగ్దానం చేసి ఉంటే లేదా ఆయన ఎవరికైనా ఋణపడి ఉంటే వాళ్లంతా నా దగ్గరికి వచ్చి (తమ హక్కుల్ని) వసూలు చేసుకోవచ్చు" అంటూ అధికారికంగా ఒక ప్రకటన గావించారు. ఆ ప్రకటన విని నేను అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) దగ్గరికెళ్ళి, "దైవప్రవక్త ﷺ నాతో ఈ ఈ మాటలు చెప్పార"ని అన్నాను. అప్పుడాయన దోసిలి నిండా నాణాలు తీసి నాకిచ్చారు. నేను వాటిని లెక్కపెట్టి చూస్తే అవి అయిదొందలు తేలాయి. ఆ తర్వాత ఆయన నాతో, "ఇంకా కావాలంటే వాటికి రెట్టింపు తీసుకో" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సాక్ష్యాధారాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) reported: The Prophet ﷺ said to me, “When the revenues of Bahrain will arrive, I shall give you such and such and such.” He passed away before the revenues were received. When they arrive during the caliphate of Abu Bakr (radiyallahu anhu), he ordered to be announced: “Anyone whom Messenger of Allah ﷺ promised or owed anything, should come to him.” I went to him and said: “Messenger of Allah ﷺ had said to me such and such.” He took a double handful out of the money and gave it to me. I counted it and found that it was five hundred dirham. Then Abu Bakr (radiyallahu anhu) said to me: “Take twice as much more of that amount.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో దైవప్రవక్త ﷺ 'హాకజా, హాకజా, హాకజా' (ఇంతింత) అని మూడుసార్లు అన్నారు. ఆ సమయంలో ఆయన మూడుసార్లు దోసిళ్ళు ఎత్తి చూపారని బుఖారీలోని వేరొక ఉల్లేఖనం చెబుతోంది. అంటే మూడు దోసిళ్ళ నిండా ధనం ఇస్తానన్నారన్నమాట. దాని ప్రకారం హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ వాగ్దానాన్ని నెరవేరుస్తూ జాబిర్ (రదియల్లాహు అన్హు)కు మూడు దోసిళ్ళనిండా నాణాలు ఇచ్చారు.
మనిషి తన మరణం తర్వాత అయినా తన వాగ్దానాల్ని, ప్రమాణాల్ని పూర్తిచేయించాలని ఈ హదీసు తాకీదు చేస్తోంది. చావుతో వాగ్దాన బాధ్యత తీరినట్లు కాదు. మనిషి చనిపోయేముందే తన వాగ్దానాలను నెరవేర్చమని తన వారసుల్ని ఆదేశించి వెళ్ళాలి లేదా కనీసం వారసులయినా నైతికవిధిగా భావించి తమ పెద్దల వాగ్దానాలను, ప్రమాణాలను నెరవేర్చాలి. రాజ్యస్థాయిలో చేయబడే వాగ్దానాలను ఆ తరువాత వచ్చే రాజ్యాధికారులు నెరవేర్చవలసి ఉంటుంది. అందుకు హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) చేసిన పనిని ఆదర్శంగా తీసుకోవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|86. వాగ్దాన పాలన|హదీసు 691
You must be logged in to post a comment.