హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 85వ అధ్యాయం: రహస్యాలను దాచటం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 685 – 688) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
85. రహస్యాలను దాచటం
بابُ حفظ السِّر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{وَأَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كَانَ مَسْؤُولاً} [الإسراء: ٣٤]
"చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందే హంగా వాగ్దానం విషయంలో మీరు నమా ధానం చెప్పవలసి ఉంటుంది." (అల్ ఇస్రా : 34)
వివరణ :
ఒక వ్యక్తి మరొక వ్యక్తితో తనకు సంబంధిం చిన రహస్య విషయమేదయినా చెప్పినప్పుడు ఆ రహస్యాన్ని మూడోవ్యక్తికి తెలియకుండా దాచాలని కోరుకుంటాడు. ఆ విధంగా రహస్యం కూడా ఒక వాగ్దానమే. అలాంటి వాగ్దానాలను కూడా తప్పనిసరిగా నెరవేర్చాలి. పై సూక్తిలో వాగ్దానాన్ని నెరవేర్చటమంటే రహస్యాన్ని దాచటమని అర్థం.
English
“And fulfill (every) covenant. Verily! The covenant, will be questioned about.” [Al-Isrā’ 17:34]
హదీసు 685
وعن أبي سعيد الخُدْرِيِّ رضي اللَّه عنه قَالَ: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ مِنْ أَشَرِّ النَّاسِ عِنْدَ اللَّهِ مَنْزِلَة يَوْم الْقِيامَةِ الرَّجُل يُفضِي إِلَى المَرْأَةِ وَتُفضِي إلَيهِ ثُمَّ يَنْشُرُ سِرَّهَا" رواه مسلم.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ప్రళయదినాన దేవుని దృష్టిలో స్థాయి రీత్యా అత్యంత నీచమయినవాడు ఎవడూ అంటే – ఆలుమగలు పరస్పరం సంభోగించుకున్న తరువాత ఆ రహస్యాలను ఇతరులతో చెప్పుకునేవాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నికాహ్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The most evil of the people to Allah on the Day of Resurrection will be the man who consorts with his wife and then publicizes her secret.”[Muslim].
ముఖ్యాంశాలు
హదీసులో 'యుఫ్జీ' అనే పదం వాడబడింది. యుఫ్జీ అంటే కలవటమని అర్థం. ఇక్కడ దాని భావం సంభోగించటం. సాధారణంగా నూతన వధూవరులకు శోభనం జరిగినప్పుడు తెల్లారిన తరువాత భర్త తన స్నేహితులతో, భార్య తన స్నేహితురాండ్రతో శోభన గదిలో జరిగిన రహస్య విషయాలను గురించి చెప్పుకుంటారు. పై హదీసు ద్వారా అలా చెప్పుకోవటం ఘోర పాపమని తెలుస్తోంది. అలాంటి విషయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. సంభోగమనేది ఒక రహస్య విషయం. అది ఆలుమగలవరకే పరిమితమై ఉండాలి. దాని గురించి ఇతరులతో చెప్పుకోవటం అవివేకం అనిపించుకుంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|85. రహస్యాలను దాచటం|హదీసు 685
హదీసు 686
وعن عبدِ اللَّه بن عمر رضي اللَّه عنهما أنَّ عمرَ رضي اللَّه عنه حِيْنَ تَأَيَّمتْ بِنْتُهُ حفْصةُ قَالَ: لقيتُ عُثْمَانَ بْنَ عَفَّان رضي اللَّه عنه، فَعَرَضْتُ علَيْهِ حفصةَ فَقلتُ: إنْ شِئتَ أنكَحْتُكَ حَفْصَةَ بِنْتَ عُمرَ؟ قَالَ: سَأَنْظُرُ فِي أمْرِي فَلبِثْتُ ليَالِيَ، ثُمَّ لَقِيني، فَقَالَ: قَدْ بَدَا لِي أنْ لاَ أَتَزَوَّجَ يوْمي هَذَا، فَلَقِيتُ أَبَا بَكْرِ الصِّديقَ رضي اللَّه عنه. فقلتُ: إنْ شِئْتَ أَنكَحْتُكَ حَفْصةَ بنْتَ عُمَر، فصمتَ أَبُو بكْر رضي اللَّه عنه، فَلَمْ يرْجِعْ إليَّ شَيْئاً، فَكُنْتُ عَلَيْهِ أَوجَد مِنِّي على عُثْمانَ، فَلَبثْتُ ليَالي، ثُمَّ خطَبهَا النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَأَنْكَحْتُهَا إيَّاهُ، فلَقِينَي أبُو بكْرٍ فَقَالَ: لَعَلَّكَ وجَدْتَ علَيَّ حِينَ عَرضْتَ علَيَّ حفْصة فَلَمْ أَرْجعْ إِلْيَكَ شَيْئاً؟ فقلتُ: نَعمْ. قَالَ: فإنهْ لمْ يَمْنعْني أنْ أرْجِعَ إِلَيْكَ فِيمَا عرضْتَ عليَّ الاَّ أَنِّي كُنْتُ عَلِمْتُ أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ذَكرَها، فَلَمْ أَكُنْ لأَفْشِي سِرَّ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ولوْ تَركَهَا النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لقَبِلْتُهَا، رواه البخاري. قوله:"تَأَيَّمَتْ"أيْ: صَارَتْ بِلاَ زَوْجٍ, وَكَانَ زَوْجُهَا توفي رضي الله عنه."وجدت": غضبت.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన కూతురు హజ్రత్ హఫ్సా విధవరాలయినప్పటి సంగతిని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు :
"నేను ముందుగా ఉస్మాన్ బిన్ అప్ఫాన్ను కలిసి హఫ్సా గురించి ఆయనతో మాట్లాడాను. తను కోరుకుంటే నా కూతురు హఫ్సాను తనకిచ్చి వివాహం చేస్తానని చెప్పాను. దానికాయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నేను చాలా రోజుల వరకు ఆయన నిర్ణయం కోసం వేచి చూశాను. ఓ రోజు ఆయన నన్ను కలుసుకొని ప్రస్తుతం తనకు వివాహం చేసుకొనే ఉద్దేశ్యం లేదని చెప్పారు.
ఆ తర్వాత నేను అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) ని కలుసుకొని తను కోరుకుంటే నా కూతురు హఫ్సాను తనకిచ్చి వివాహం చేస్తానని చెప్పాను. దానికి అబూబక్ర్ మౌనం వహించారు. ఏ సమాధానం చెప్పలేదు. ఆయన వల్ల నాకు ఉస్మాన్ వల్ల కన్నా ఎక్కువ బాధ కలిగింది. నేను మళ్ళీ చాలా రోజుల వరకు (సంబంధం కోసం) ఎదురుచూస్తూ ఉన్నాను. ఒకరోజు దైవప్రవక్త ﷺ తను హఫ్సాను వివాహమాడతానని సందేశం పంపారు. అప్పుడు నేను హఫ్సాను దైవప్రవక్తకిచ్చి వివాహం చేశాను.
ఆ తర్వాత ఒకరోజు అబూబక్ర్ కలిసి, "ఉమర్! నా మూలంగా మీరు చాలా బాధపడి ఉంటారు. మీరు హఫ్సాను నాకిచ్చి వివాహం చేస్తానని ముందుకొచ్చినా నేను మీకు ఏ సమాధానం చెప్పలేదు. (అందుకు నన్ను క్షమించండి)" అన్నారు. దానికి నేను "ఔనండీ!" అని ముక్తసరిగా సమాధానం చెప్పాను.
అప్పుడు హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) నాతో ఇలా అన్నారు : దైవప్రవక్త ﷺ ఒకానొక సందర్భంగా తాను హఫ్సాను వివాహం చేసుకుంటానని అన్నారు. అందుకే మీరడిగినప్పుడు నేను ఏ సమాధానం చెప్పలేకపోయాను. దైవప్రవక్త ﷺ గారికి సంబంధించిన రహస్యాన్ని నేను బయటపెట్ట దలచుకోలేదు. ఒకవేళ తన నిర్ణయాన్ని మార్చుకొని ఉన్నట్లయితే నేను హఫ్సా వివాహ సందేశాన్ని అంగీకరించేవాణ్ణి. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం)
English
`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: My father `Umar (radiyallahu anhu) said: When (his daughter) Hafsah (radiyallahu anha) became a widow, I met `Uthman bin `Affan (radiyallahu anhu) and offered Hafsah for marriage to him. `Uthman said: “I shall think over the matter.” I waited for a few days and then `Uthman met me and said: “It occurred to me that I should not marry at present.” Then I met Abu Bakr (radiyallahu anhu) and said to him: “If you are willing, I shall marry my daughter Hafsah to you.” Abu Bakr (radiyallahu anhu) remained silent and did not utter any word to me in reply. I grew more angry with him than with `Uthman. I had waited for only a few days when Messenger of Allah ﷺ asked for her hand in marriage and I married her to him. Thereafter, I met Abu Bakr (radiyallahu anhu) who said, “Perhaps you were angry with me when you offered Hafsah to me and I said nothing in reply.” I said, “Yes, that is so.” He said, “Nothing stopped me to respond to your offer except that I knew that Messenger of Allah ﷺ had mentioned her and I could not disclose the secret of Messenger of Allah ﷺ. Had Messenger of Allah ﷺ left her, I would have accepted her.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- ఈ హదీసు ఇక్కడ బోధించే ప్రధాన విషయం – ఇతరుల రహస్యాలను దాచాలి. వాటిని ఇంకొకరి ముందు బయటపెట్టరాదు. ఇది గాకుండా ఈ హదీసులో ఇంకా ఎన్నో ముఖ్య విషయాలు బోధించబడ్డాయి. ఉదా॥ ఉత్తములను, సంస్కారవంతులను తమ కూతురిని పెళ్లిచేసుకోమని కోరవచ్చు. మగపెళ్ళివారు తమంతట తాము పెళ్ళి ఉద్దేశ్యం బయటపెట్టనంతవరకూ ఆడపిల్లను ఇంట్లో కూర్చోబెట్టి ఉంచాలన్న ఆచారం సరైనది కాదు. మనదేశంలో ఇలాగే జరుగుతోంది. ఈ ఆచారం దైవప్రవక్త ప్రబోధనలకు విరుద్ధం. దీనిని మార్చాలి.
- ఎవడైనా వ్యక్తి లేక ఏదయినా కుటుంబంవారు ఒక అమ్మాయిని వివాహమాడాలన్న కోరికను వ్యక్తం చేసి దానికోసం ప్రయత్నాలు జరుపుతున్నప్పుడు ఆ ఇరు కుటుంబాల మధ్య పెళ్లిమాటలు సాగుతున్నంతకాలం మధ్యలో ఇంకొకరు ఆ అమ్మాయికి లేక ఆమె కుటుంబంవారికి వివాహ సందేశం పంపటం ధర్మసమ్మతం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|85. రహస్యాలను దాచటం|హదీసు 686
హదీసు 687
وعن عائشة رضي اللَّه عنها قالتْ: كُنَّ أَزْواجُ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عنْدهُ، فَأْقْبلتْ فَاطِمةُ رضي اللَّه عنها تَمْشِي. مَا تَخْطيءُ مِشْيتُهَا مِنْ مِشْيَةِ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم شَيْئاً، فَلَمَّا رَآهَا رَحَّبَ بِهَا وقال: "مرْحباً بابنَتي" ثُمَّ أَجْلَسهَا عنْ يمِيِنِهِ أَوْ عنْ شِمالِهِ. ثُمَّ سارَّها فَبَكتْ بُكَاءً شَديداً، فلَمَّا رَأى جَزَعَها سَارَّها الثَّانِيةَ فَضَحِكَت، فقلتُ لهَا: خصَّك رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِن بيْنِ نِسائِهِ بالسَّرارِ، ثُمَّ أَنْتِ تَبْكِين؟ فَلَمَّا قَام رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سأَلْتُهَا: مَا قَالَ لكِ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ قالت: مَا كُنْتُ لأفْشِي عَلى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سِرَّهُ. فَلَمَّا تُوُفِّيَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قلتُ: عَزَمْتُ عَلَيْكِ بِمَا لِي عَلَيْكِ مِنَ الحَقِّ، لَمَا حدَّثْتنِي مَا قَالَ لكِ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ فقالتْ: أَمَّا الآنَ فَنعم، أَما حِين سَارَّني في المَرَّةِ الأُولَى فَأخْبرني "أَنَّ جِبْرِيل كَان يُعارِضُهُ القُرْآن في كُلِّ سَنَةٍ مرَّة أَوْ مَرَّتَيْن، وأَنَّهُ عَارَضهُ الآنَ مَرَّتَيْنِ، وَإنِّي لا أُرَى الأجَل إلاَّ قدِ اقْتَرَب، فاتَّقِي اللَّه واصْبِرِي، فَإنَّهُ نِعْم السَّلَف أَنَا لكِ" فَبَكَيْتُ بُكَائيَ الَّذِي رأيْتِ، فَلَمَّا رَأَى جَزعِي سَارَّني الثَانيةَ، فَقَالَ:"يَا فَاطمةُ أَما تَرْضِينَ أَنْ تَكُوني سيِّدَةَ نِسَاء المُؤْمِنِينَ، أوْ سَيِّدةَ نِساءِ هذهِ الأمَّةِ؟ " فَضَحِكتُ ضَحِكي الذي رأَيْتِ، متفقٌ عَلَيْهِ. وهذا لفظ مسلم.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ సతీమణులందరూ ఆయన దగ్గర కూర్చొని ఉండగా హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) అక్కడికి వచ్చారు. ఆమె నడక అచ్చం (ఆమె తండ్రి) నడకలాగే ఉంది. ఆమెను చూడగానే దైవప్రవక్త ﷺ "నా కూతురికి స్వాగతం" అంటూ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమెను తన కుడి ప్రక్కన లేక ఎడమ ప్రక్కన కూర్చోబెట్టుకొని రహస్యంగా (ఆమె చెవిలో) ఏదో మాట చెప్పారు. దాంతో ఆమె విపరీతంగా విలపించటం మొదలుపెట్టారు. దైవప్రవక్త ﷺ ఆమె కళవళపాటుని చూసి మళ్లీ ఏదో ఆమె చెవిలో రహస్యంగా చెప్పారు. ఆ మాట వినగానే ఆమె సంతోషంగా నవ్వారు. అప్పుడు నేనామెను "దైవప్రవక్త ﷺ తన సతీమణులందర్నీ వదలి ప్రత్యేకంగా నీకొక్కదానికే రహస్య విషయం వినే అదృష్టాన్ని కల్పించారు. (దానికి నువ్వు సంతోషించటానికి బదులు) ఎందుకో కంటతడిపెట్టావు!" అని అన్నాను.
కాసేపటికి దైవప్రవక్త ﷺ అక్కణ్ణుంచి లేచి వెళ్ళిపోయిన తరువాత నేను ఫాతిమాతో మాట్లాడుతూ, "దైవప్రవక్త ﷺ నీతో రహస్యంగా చెప్పిందేమిటి?" అని అడిగాను. ఫాతిమా ఆ విషయం చెప్పటానికి నిరాకరిస్తూ, "దైవప్రవక్త ﷺ చెప్పిన రహస్యాన్ని నేను బయటపెట్టలేను" అని అన్నారు. చివరికి దైవప్రవక్త ﷺ చనిపోయిన తరువాత నేను తిరిగి ఫాతిమాను కదిలించి, "నీ మీద నాకున్న (మాతృత్వపు) హక్కు సాక్షిగా అడుగుతున్నాను. దైవప్రవక్త ﷺ అప్పుడు నీతో చెప్పిన రహస్యం ఏమిటి?" అని అన్నాను. దానికి ఫాతిమా "ఇప్పుడయితే చెప్పగలను" అంటూ ఈ విధంగా తెలియజేశారు :
"మొదటిసారి దైవప్రవక్త ﷺ నాతో రహస్యంగా ఈ సంగతి చెప్పారు : 'ప్రతియేట జిబ్రయీల్ (అలైహి) నా దగ్గర ఒకసారి మాత్రమే ఖుర్ఆన్ (మొత్తం) పారాయణం చేసేవారు. కాని ఈ ఏడు ఆయన ఖుర్ఆన్ (మొత్తం) రెండుసార్లు పారాయణం చేశారు. దాన్నిబట్టి నా (మరణ) కాలం ఎంతో దూరంలో లేదని నాకనిపిస్తోంది. కనుక నువ్వు దైవానికి భయపడుతూ సహనంతో వ్యవహరించాలి. గతించేవారిలో నీకు అత్యంత మేలైనవాణ్ణి నేనే.' ఈ మాట విని నేనెంత ఏడ్చానో మీరూ చూశారు. ఆ తర్వాత దైవప్రవక్త ﷺ నా కళవళపాటుని చూసి మళ్ళీ రహస్యంగా, 'ఫాతిమా! నువ్వు ముస్లిం మహిళలందరికీ నాయకురాలివి అవుతావు. లేక ముస్లిం అనుచర సమాజంలోని మహిళలందరికీ నాయకురాలివి అవుతావు. ఈ విషయం నీకు సంతోషం కలిగించదా?' అని అన్నారు. అప్పుడు నేను నవ్వాను. అది కూడా చూశారు మీరు."
(బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం ముస్లింవి)
English
`Aishah (radiyallahu anha) reported: On one occasion all the wives of the Prophet ﷺ were with him when his daughter, Fatimah (radiyallahu anha) who walked after the style of his father, came there. He ﷺ welcomed her saying, “Welcome, O my daughter”, and made her sit on his right side, or on his left side and then whispered something to her at which she wept bitterly. When he perceived her grief, he talked secretly to her again and she smiled (with happiness). I said to her: “Messenger of Allah (PBUH chose you from amongst all his wives to speak secretly to you and yet you cried.” When he left, I asked her, “What did Messenger of Allah ﷺ say to you?” She said, “I will not divulge the secret of Messenger of Allah ﷺ.” When Messenger of Allah ﷺ passed away, I said to her: “I adjure you by the right I have in respect of you to tell me what Messenger of Allah ﷺ had told you.” She said: “Now (when Messenger of Allah ﷺ has died), I will tell you. When he whispered to me the first time, he told me, `Jibril (Gabriel) used to listen to my recitation of the Qur’an and then recite it back to me once or twice a year, and this time he has done it twice; and so I perceive that my death is approaching. Then be mindful of your duty to Allah and be patient and steadfast, for I shall be an excellent predecessor for you.‘ On this I wept as you saw. When he perceived my distress he talked to me secretly the second time and said, `O Fatimah, are you not pleased that you will be the chief among the believing women or of this Ummah?’ This made me smile as you saw.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|85. రహస్యాలను దాచటం|హదీసు 687
హదీసు 688
وعن ثابتٍ عن أنس، رضي اللَّه عنه قَالَ: أَتى عليَّ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وأَنا ألْعبُ مع الْغِلْمانِ، فسلَّمَ عَلَيْنَا، فَبَعَثني في حاجَةٍ، فَأبْطأْتُ عَلَى أُمِّي، فَلَمَّا جِئتُ قالت: مَا حَبَسَكَ؟ فقلتُ: بَعَثَني رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لحَاجَةٍ، قالت: مَا حَاجتهُ؟ قُلْتُ: إِنَّهَا سرٌّ. قالتْ: لا تُخِبرَنَّ بسِر رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أحَداً. قَالَ أَنَسٌ: واللَّهِ لوْ حدَّثْتُ بِهِ أحَداً لحدَّثْتُكَ بِهِ يَا ثابِت. رواه مسلم. وروى البخاري بَعْضَهُ مُخْتصراً.
హజ్రత్ సాబిత్, అనస్ (రదియల్లాహు అన్హు) నుండి చేసిన కథనం : ఒకరోజు నేను (నా స్నేహితులయిన) పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా దైవప్రవక్త ﷺ నా దగ్గరికి వచ్చారు. ముందుగా ఆయన మాకు సలాం చేసిన తర్వాత నన్ను ఒక పనిమీద పంపించారు. దాంతో నేను ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యమయింది. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ ఆలస్యం ఎందుకయిందని అడిగింది. "దైవప్రవక్త ﷺ నన్ను ఒక పనిమీద పంపించారమ్మా!" అన్నాను నేను. "ఏమిటా పని?" అని అడిగింది మా అమ్మ. నేను అదొక రహస్య విషయమని చెప్పాను. అప్పుడు మా అమ్మ "దైవప్రవక్త ﷺ రహస్యాన్ని ఎవరితోనూ చెప్పకు సుమా!" అంటూ నాకు హితోపదేశం చేసింది. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) (ఈ హదీసు వివరించిన తరువాత) "ఓ సాబిత్! నేనా రహస్యం ఎవరితోనయినా చెప్పాలనుకుంటే నీకే చెప్పేవాణ్ణి" అని అన్నారు.
(ముస్లిం-బుఖారీ ఈ హదీసులోని కొంత భాగాన్ని సంక్షిప్తంగా వివరించారు)
(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని మహిమోన్నతుల ప్రకరణం)
English
Thabit (radiyallahu anhu) reported: Anas (radiyallahu anhu) said: Messenger of Allah ﷺ came to me while I was playing with the boys. He greeted us and sent me on an errand. This delayed my return to my mother. When I came to her, she asked, “What detained you?” I said; “Messenger of Allah ﷺ sent me on an errand.” She asked, “What was it?” I said, “It is a secret.” My mother said; “Do not disclose to anyone the secret of Messenger of Allah ﷺ.” Anas (radiyallahu anhu) said to Thabit (radiyallahu anhu): By Allah, were I to tell it to anyone I would have told you.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు కూడా తోటి వ్యక్తుల రహస్య విషయాలను బయటపెట్టకూడదని తాకీదు చేస్తోంది. హజ్రత్ అనస్ దైవప్రవక్త ﷺ తనకు చెప్పిన పని రహస్యమైనదని అనగానే ఆయన తల్లి ఇక దాని గురించి అడగటం మానుకుంది. అంతేకాదు, దైవప్రవక్త రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలని కొడుక్కి హితోపదేశం చేసింది. కనుక మిత్రులు, స్నేహితుల రహస్య విషయాలను ఎవరిముందూ బయటపెట్టకూడదు. ఒకవేళ వారి అనుమతి లభిస్తే అప్పుడు ఆ విషయాలు ఇతరులతో చెప్పటంలో తప్పు లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|85. రహస్యాలను దాచటం|హదీసు 688
You must be logged in to post a comment.